Home Blog Page 68

Vijay Deverakonda’s “Kingdom” Set for Grand Theatrical Release on July 31st, Titled “Saamrajya” in Hindi

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ హిందీలో “సామ్రాజ్య” టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ ఈరోజు కింగ్డమ్ మూవీ హిందీ టైటిల్ అనౌన్స్ చేశారు.‌‌ సామ్రాజ్య టైటిల్ ఇన్ స్టంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“కింగ్డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

“‘Anna Antene’ song from ‘Kingdom’ moved me emotionally – Anand Deverakonda”

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘అన్న అంటేనే..’ అనే పాటను విడుదల చేశారు.

అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పాట వినగానే తను ఎమోషనల్ అయ్యానని తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. ‘నేను ఏదైనా సాధించగలను అని నాకన్నా ఎక్కువగా నమ్మి అండగా నిలబడే వ్యక్తి మా బ్రదర్. అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధాలను గుర్తుచేసేలా ఈ పాట ఉంది..’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు ఆనంద్ దేవరకొండ. ఈ పోస్ట్ లో సోదరుడు విజయ్ తో తీసుకున్న చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేశారు.

Grand Inauguration of ‘Seven Oaks Multi-Specialty Pet Hospital’ in Kompally by Actor Anand Deverakonda & Actress Vaishnavi Chaitanya

కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయన్ వైష్ణవి చైతన్య చేతుల మీదుగా జరిగింది. పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన వైద్య చికిత్సను సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ అందిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ డా.శ్రీ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఎండీ సంధ్య బి.రెడ్డి, వారి కూతురు అక్షత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

డా. శ్రీ రెడ్డి మాట్లాడుతూ – సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు థ్యాంక్స్. మేము విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా జుబ్లీహిల్స్ బ్రాంచ్ ప్రారంభించాం. అప్పటినుంచి వారితో మంచి రిలేషన్ ఏర్పడింది. జుబ్లీహిల్స్ బ్రాంచ్ కు ఎక్కువగా కొంపల్లి సైడ్ నుంచే పెట్స్ ను చికిత్స కోసం తీసుకొస్తున్నారు. అందుకే ఇక్కడే ఒక హాస్పిటల్ ఏర్పాటుచేశాం. సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ లో పెంపుడు జంతువులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాం. హ్యూమన్ హాస్పిటల్స్ లాగే వివిధ విభాగాలు ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ టైమ్ పెట్స్ కు ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. లండన్, యూఎస్, సింగపూర్ నుంచి వైద్యుల ఇంటరాక్షన్ సెషన్స్ పెడుతున్నాం. పెట్స్ ను ఆస్పత్రిలోకి తీసుకొచ్చేప్పుడు వాటిని కంఫర్ట్ గా తీసుకొచ్చేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. మా దగ్గర పనిచేసే వైద్యులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. నగరంలో మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి పెట్స్ కు సమగ్రమైన చికిత్స అందించాలనే లక్ష్యంతోనే మా హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. అన్నారు.

డా.సంధ్య బి. రెడ్డి మాట్లాడుతూ – మా సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. పెట్స్ కు మల్టీస్పెషాలిటీ వైద్య సేవలను మా ఆస్పత్రిలో అందిస్తున్నాం. హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా స్తోమత లేని వారి పెంపుడు జంతువులకు సరైన వైద్యం అందిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ లో ఏ ఛారిటీ ఫౌండేషన్ వారు తమ సంస్థ తరుపున పెట్స్ ను చికిత్సకు తీసుకువచ్చినా మా ఆస్పత్రిలో 50 పర్సెంట్ రాయితీ ఇస్తున్నాం. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ జుబ్లీహిల్స్ లో మేమే ప్రారంభించాం. ఇప్పుడు కొంపల్లిలో ఆస్పత్రి అందుబాటులోకి తీసుకొస్తున్నాం మీరు రావాలి అని డా.శ్రీ రెడ్డి గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. మీరు ఫ్యూచర్ లో పెట్టే బ్రాంచెస్ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మనకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటాం కానీ పెట్స్ వాటి బాధను, అనారోగ్య సమస్యను చెప్పుకోలేవు. రెండేళ్ల క్రితం మా ఇంట్లో పెట్ కు హెల్త్ బాగా లేకుంటే అమ్మా, నాన్న చాలా బాధపడ్డారు. అప్పడు డా.శ్రీ రెడ్డి గారు సెవెన్ ఓక్స్ డాక్టర్స్ చికిత్స అందించారు. మా ఇంట్లో పెట్స్ ను చాలా కేరింగ్ గా చూసుకుంటాం. అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి. విదేశాలకు వెళ్లినా, అవి ఎలా ఉన్నాయో ఎప్పుడు కనుక్కుంటాం. నాన్నకు పెట్స్ చాలా ఇష్టం. పెట్స్ కు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ లో మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించడం సంతోషంగా ఉంది. సికింద్రాబాద్ సైడ్ నుంచి తమ పెట్స్ ను జుబ్లీహిల్స్ దాకా తీసుకురావడం కష్టం. కొంపల్లిలో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ద్వారా పెట్స్ ఉన్న వారందరికీ చాలా హెల్ప్ అవుతుంది. మీ పెట్స్ కు మంచి చికిత్స కోసం సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ను సంప్రదించండి. సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – నేను పెట్ లవర్ ను. మా ఇంట్లో ఆల్ఫా అనే డాగ్ ఉంది. అది మా ఇంటికి వచ్చాక ఇంట్లో పిల్లాడిలా మారిపోయింది. దాన్ని ఎలా బాగా చూసుకోవాలి అనేది ఎప్పుడూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆలోచిస్తుంటాం. అలాంటి క్రమంలో మాకు సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ గురించి తెలిసింది. ఆల్ఫాకు బాగాలేనప్పుడు సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ జుబ్లీహిల్స్ బ్రాంచిలో చూపించాం. తను చాలా హెల్దీగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు కొంపల్లి, చుట్టుపక్కల ఉన్నవారంతా జుబ్లీహిల్స్ దాకా వెళ్లకుండా మీ టైమ్ చాలా సేవ్ అయ్యేలా ఇక్కడే బ్రాంచి ఓపెన్ చేశారు. మీరంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు.

డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – నాకు పెట్స్ అంటే భయం ఉండేది. కానీ నాకు దగ్గరైన మిత్రులంతా పెట్ లవర్స్. వాళ్ల స్నేహంతో నాకు కూడా పెట్స్ దగ్గరయ్యాయి. అలా నాకు ఆనంద్ దేవరకొండ పెట్ దగ్గరైంది. ఆ తర్వాత నేను పెట్ పేరెంట్ అయ్యాను. మన పెట్ కు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎంతో బాధపడతాం. మంచి వైద్యం అందించాలని ఎక్కడ మంచి ఆస్పత్రి ఉందో వెతుకుతుంటాం. సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ గురించి తెలిశాక పెట్ పేరెంట్ గా నా పెట్స్ గురించి ఉన్న భయం తగ్గిపోయింది. డా. శ్రీ రెడ్డి, డా. సంధ్య గారు మాకు రిలేటివ్స్. ఈ రోజు కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ఇద్దరు పెట్ లవర్స్ అయిన ఆనంద్, వైష్ణవి చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉంది. అన్నారు.

“Raju Gani Saavaal” Trailer launched by Beautiful heroines Dimple Hayati & Rashi Singh

లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “రాజు గాని సవాల్”. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం “రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం, ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు. ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు. “రాజు గాని సవాల్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను. బాపిరాజు గారు సినిమాను సినిమాను రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. “రాజు గాని సవాల్” సినిమా సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అన్నారు.

అతిథిగా వచ్చిన ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ఈ మధ్యే “రాజు గాని సవాల్” సినిమా టీజర్ చూశాం చాలా బాగుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా బాగుంటుందని మేము నమ్మకంగా ఉన్నాం ఎందుకంటే బాపిరాజు సెలక్షన్ అలా ఉంటుంది. ఆయన బాగుంటే గానీ మూవీ రిలీజ్ చేయరు. బాపిరాజు గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అలాగే ఈ సినిమాతో హీరో హీరోయిన్స్ తో పాటు మొత్తం టీమ్ అందరికీ మంచి గుర్తింపు విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

అతిథిగా వచ్చిన ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. కవాడిగూడ ఏరియాలో జరిగే కల్చరల్ ఈవెంట్స్ నేపథ్యంతో సాగే చిత్రమిది. ట్రైలర్ చూస్తే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రవీందర్ తనే దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఈ మూవీ చేశాడు. ఆయన వెనక ఎంతో అనుభవం ఉన్న బాపిరాజు గారు ఉన్నారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేసేందుకు హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ రావడం సంతోషకరం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చే ముందే “రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. “రాజు గాని సవాల్” సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటుడు డాక్టర్ భద్రం మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” సినిమాకు దర్శకత్వం, నిర్మాత, హీరోగా మూడు పాత్రలు పోషిస్తున్నారు రవీందర్ గారు. వీటిలో ఒక బాధ్యత నిర్వర్తించడమే కష్టం. ఈ సినిమాను బాపిరాజు గారు రిలీజ్ చేస్తున్నారంటే తప్పకుండా సక్సెస్ అయినట్లే. ఆయన ఈ మూవీ వెనక ఉండటమే ప్రధాన బలం. అందరితో స్నేహంగా ఉండే బాపిరాజు గారు లాంటి వ్యక్తం ఇండస్ట్రీలో ఉండటం మా అదృష్టం. ప్రేక్షకులంతా ఆగస్టు 8న థియేటర్స్ కు రావాలని, ఇలాంటి మంచి చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.

నటి సంధ్య రాథోడ్ మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇది మాకొక ప్రత్యేకమైన సందర్భం. ఆగస్టు 8వ మా మూవీ రిలీజ్ కు వస్తోంది. చాలా ఎగ్జైటింగ్ గా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ఈ చిత్రంలో నటించడం మా అందరికీ గ్రేట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ చిత్రానికి వర్క్ చేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. మాకు ఈ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” మూవీని ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఈ చిత్రం కోసం మేమంతా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాం. మా రవీందర్ గారు ఎంతో కష్టపడి ఈ మూవీ చేశారు. మేము మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకోలేదు కానీ సినిమా తప్పకుండా అందరం హ్యాపీగా ఫీలయ్యే రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాం. ఆగస్టు 8న మా మూవీని థియేటర్స్ కు వెళ్లి చూడండి. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు రవీందర్ బొమ్మకంటి మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” చిత్రంలో నేను విలన్ రోల్ చేశాను. ఈ సినిమాలో చాలా మంది కొత్తవాళ్లే నటించారు. వాళ్లకు ఈ చిత్రంతో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన హీరో రవీందర్ గారికి, బాపిరాజు గారికి థ్యాంక్స్. “రాజు గాని సవాల్” సినిమాను మీరంతా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ – మా “రాజు గాని సవాల్” మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. ఇలాంటి పెద్దల మధ్య నా మూవీ ఈవెంట్ జరుపుకోవాలని కొన్నేళ్లుగా కలగంటున్నాను. అది ఈ రోజు నెరవేరడం హ్యాపీగా ఉంది. మా జీవితాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూస్తారు. ఫ్యామిలీ బాండింగ్స్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించాం. సినిమా టెక్నికల్ గా క్వాలిటీగా ఉండాలని టాప్ టెక్నీషియన్స్ ను పెట్టుకున్నాం. యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ లో రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, గోరటి వెంకన్న వంటి సింగర్స్ మా మూవీలో సాంగ్స్ పాడారు. ఈ సినిమా చూశాక మా టీమ్ కు కెప్టెన్ వంటి బాపిరాజు గారు “రాజు గాని సవాల్” సినిమా క్లాసిక్ డ్రామాగా మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన మాట నిజం కావాలని ఆశిస్తున్నా. అన్నారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – మా “రాజు గాని సవాల్” మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రసన్న కుమార్ గారు, దామోదర ప్రసాద్ గారు, తెలుగు ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, డింపుల్ హయతి, రాశీ సింగ్, భద్రం గారు…ఇలా వీళ్లంతా నా మీద అభిమానంతో ఫోన్ లో మాట్లాడి అడగగానే వచ్చారు. ఇంతమంది అభిమానంతో మా వెనక నిలబడ్డారు. వారి బ్లెస్సింగ్స్ తో మా “రాజు గాని సవాల్” సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఘనంగా రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం. హీరో రవీందర్ గారు నా గురించి ఎంత చెప్పినా, ఆయన నాకు మూవీ ఇవ్వకుంటే ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. రవీందర్ గారికి నా కృతజ్ఞతలు చెబుతున్నా. నా కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే నా కుటుంబ సభ్యులైన మీడియా వారు కారణం. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అన్నారు.

గీత రచయిత గోరటి వెంకన్న మాట్లాడుతూ హీరో లెలిజాల రవీందర్ మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో పాటకు నేను రాసిన సాహిత్యం తగ్గట్టు పాడి సంగీతం ఇచ్చారు అద్భుతంగా వుంది. పాట పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో వున్నాయి. సినిమా సక్సెస్ కావాలి. ప్రజలు కూడా ఆశీర్వదించాలి అని అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – “రాజు గాని సవాల్” సినిమాకు నిర్మాత, దర్శకుడే కాదు హీరోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న లెలిజాల రవీందర్ ను అభినందిస్తున్నాను. ఎవరో అవకాశం ఇస్తారని ఎదురుచూడకుండా తనే ధైర్యం చేసి ఈ సినిమా రూపొందించాడు. మంచి సినిమా చేయడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు రీచ్ చేయాలి. అలా మూవీని ప్రమోట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయగల బాపిరాజు గారు రవీందర్ కు తోడవడం హ్యాపీగా ఉంది. దాదాపు 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న బాపిరాజు గారు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రిలీజ్ చేస్తున్నారు. “రాజు గాని సవాల్” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు: లెలిజాల రవీందర్, సంధ్య రాథోడ్, రితికా చక్రవర్తి,, రవీందర్ బొమ్మకంటి, తదితరులు

టెక్నీషియన్స్: డి ఓ పి: సోమ శేఖర్ కె, ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ ములే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మని జెన్న, స్క్రీన్ ప్లే: సాయి తేజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వీ తేజ్, సౌండ్ డిజైన్: సాయి మనీందర్ రెడ్డి, ఉదయ్ ఉప్పాల, లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్: పవన, లిరిసిస్ట్: గోరేటి వెంకన్న, రూపక్ రొనాల్డ్సన్, యశ్వంత్ నాగ్, గోపాలకృష్ణ శాఖాపూర్, సింగర్స్: రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, యశ్వంత్ నాగ్ , నిర్మాత, దర్శకత్వం : లెలిజాల రవీందర్

Disney’s Mega sci-fi action entertainer “Tron: Ares” trailer released held grandly

Disney released the new language trailer of TRON: Ares, the highly anticipated third installment in the groundbreaking TRON franchise. TRON: Ares is a follow-up to Disney’s 1982 seminal science fiction film, TRON and the 2010 sequel, TRON: Legacy. The film is set to release in India on 10th October 2025 in English, Hindi, Tamil and Telugu.

TRON: Ares follows a highly sophisticated Program, Ares, who is sent from the digital world into the real world on a dangerous mission, marking humankind’s first encounter with A.I. beings. The new trailer debuts the new song by Grammy award winner band Nine Inch Nails, titled ‘As Alive As You Need Me To Be’.

Directed by Joachim Rønning and stars Jared Leto, Greta Lee, Evan Peters, Hasan Minhaj, Jodie Turner-Smith, Arturo Castro, Cameron Monaghan, with Gillian Anderson, and Jeff Bridges.

Sean Bailey, Jeffrey Silver, Justin Springer, Jared Leto, Emma Ludbrook and Steven Lisberger are the producers, with Russell Allen serving as executive producer.

_Disney’s TRON: Ares releases in Indian theatres on 10th October 2025 in English, Hindi, Tamil and Telugu._

We believe that “My Baby” will be a great success like “Premisthe” and “Journey” – Producer Suresh Kondeti

నిమిషా సాజయాన్ హీరో హీరోయిన్లు గా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ “డీఎన్ఏ”ను “మై బేబి” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. ఆయన యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి తన ఎస్ కే పిక్చర్స్ పై “మై బేబి” చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ కొండేటి నిర్మాతగా, దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ – “మై బేబి” సినిమా తమిళ వెర్షన్ డీఎన్ఏ చూశాక ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనిపించింది. వాళ్లు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. నేను గతంలో చేసిన సినిమాల గురించి వాటి సక్సెస్ గురించి చెప్పాను. అప్పుడు నా మీద నమ్మకంతో వాళ్లు ఈ సినిమా రైట్స్ మా సంస్థకు ఇచ్చారు. ఈ చిత్రానికి నాతో పాటు యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి సాయిచరణ్ గారు తోడయ్యారు. నిన్న ప్రీమియర్ షో వేశాం. మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు చూసి కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది అర్థమైంది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి క్రేజీగా బిజినెస్ జరిగింది. నేను ప్రొడ్యూస్ చేసిన చిత్రాల్లో అన్నింటికన్నా ఎక్కువ థియేటర్స్ లో “మై బేబి” రిలీజ్ కాబోతోంది. దాదాపు 350 స్క్రీన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు వస్తోంది. నైజాంలో 130కి పైగా స్క్రీన్స్ పడుతున్నాయి. ఇన్ని థియేటర్స్ లో నా సినిమా రావడం హ్యాపీగా ఉంది. ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతాయి. మంచి మదర్ సెంటిమెంట్ ఉండి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఐదు అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. డీఎన్ఏ అనే టైటిల్ మనకు రీచ్ కాదని, మై బేబి అనే టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ గురించి చెబితే ఒరిజినల్ మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఈ టైటిల్ మేము పెడితే మా మూవీ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది అన్నారు. “మై బేబి” సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన భరద్వాజ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మా కోసం వచ్చారు. “మై బేబి” సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించాడు. అప్పట్లో ఓటీటీలు లేవు కాబట్టి మరో భాషలోని సినిమా మనం చూడాలంటే డబ్బింగ్ లోనే చూడాలి. అలా సురేష్ కొండేటి చేసిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. “మై బేబి” సినిమా కూడా ప్రీమియర్ షోస్ నుంచి అద్భుతమైన టాక్ తెచ్చుకుంటోంది. ట్రైలర్ చూస్తే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రమిదని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలి, సురేష్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ సాయిచరణ్ తేజ మాట్లాడుతూ – మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో సురేష్ కొండేటి గారు పరిచయమయ్యారు. ఆయన జడ్జిమెంట్ ను మేము నమ్ముతున్నాం. “మై బేబి” సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నాం. ఇకపై కూడా సురేష్ గారితో కలిసి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. “మై బేబి” మా సంస్థకు తొలి సినిమా. ఈ ప్రయత్నంలో విజయం సాధించేలా మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

“My Baby” will remain in the minds of the audience as a great film – Senior actor Murali Mohan

అధర్వ, నిమిషా సాజయాన్ హీరో హీరోయిన్లు గా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ “డీఎన్ఏ”ను “మై బేబి” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. ఆయన యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి తన ఎస్ కే పిక్చర్స్ పై “మై బేబి” చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ కొండేటి నిర్మాతగా, దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షోను హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీ మోహన్, దర్శకుడు రేలంగి నరసింహారావు, సీనియర్ నటి రోజారమణి, జర్నలిస్ట్ ప్రభు, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత గాయని శోభారాజు, ముత్యాల రాందాస్, శ్రీనివాస్, శరత్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో

సీనియర్ నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ – “మై బేబి” సినిమాను మేమంతా చూశాం. ఎంతో ఉద్వేగానికి లోనయ్యాం. ఇదొక గొప్ప చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. అలాగే నిర్మాతగా సురేష్ కొండేటికి మంచి పేరు తెస్తుంది. తన బిడ్డను తల్లి కేవలం స్పర్శతోనే గుర్తుపడుతుందనే గొప్ప అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ చూపించాడు. ఇలాంటివి సమాజంలో జరుగుతున్నాయంటే భయమేస్తుంది. ఈ చిత్రంలో మంచి కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. “మై బేబి” సినిమాలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. పాతికేళ్లుగా సంతోషం సినీ వారపత్రికను నడుపుతున్నారు. ఇటీవల ఆయనకు కొంత గ్రహణం లాంటి సమయం ఏర్పడింది. కానీ ఈ చిత్రంతో ఆయనకు పట్టిన గ్రహణం వీడిపోతుంది. “మై బేబి” సినిమాను మీరంతా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అన్నారు.

దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – ఇటీవల మంచి సినిమాలు రావడం లేదని థియేటర్స్ కు వెళ్లడం మానేశాం. ఆ కాలంలో వచ్చిన మంచి చిత్రాలు ఇప్పుడు రావడం లేదనే విమర్శలూ ఉన్నాయి. కానీ “మై బేబి” సినిమా చూశాక..ఆ కాలం కంటే ఇప్పుడే మంచి సినిమా వచ్చిందనే భావన కలిగింది. చూస్తున్నంతసేపూ ఈ సినిమా మా మనసుల్ని కదిలించింది. “మై బేబి” సినిమాను ప్రేక్షకులంతా తమ బిడ్డలా భావిస్తారు. సురేష్ కొండేటి గారికి ఈ చిత్రంతో నిర్మాతగా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

సీనియర్ నటి రోజారమణి మాట్లాడుతూ – సురేష్ కొండేటి గారు ప్రేమిస్తే, జర్నీ, నాన్న లాంటి ఎన్నో మంచి చిత్రాలు మన ముందుకు తీసుకొచ్చారు. ఆయన తెలుగు ఆడియెన్స్ కు అందిస్తున్న మరో గొప్ప మూవీ ఈ “మై బేబి” . ఈ చిత్రంలో తల్లీ బిడ్డల సెంటిమెంట్ ను అద్భుతంగా చూపించారు దర్శకుడు. సినిమా మా హృదయాల్ని హత్తుకుంది. ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చిన సురేష్ గారికి థ్యాంక్స్. “మై బేబి” ఘన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. అన్నారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత, గాయని శోభారాజు మాట్లాడూతూ – “మై బేబి” సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మరిన్ని రావాలి అనిపించింది. మాతృత్వం ఒక గొప్పవరం. ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో చూపించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. తన బిడ్డను స్పర్శ ద్వారా తల్లి గుర్తుపడుతుంది. ఆ అంశాన్ని ఈ చిత్రంలో మనసుకు హత్తుకునేలా ఒక సన్నివేశంలో చూపించారు. “మై బేబి” సినిమా సురేష్ కొండేటి గారికి సక్సెస్ అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – నా స్నేహితుడు సురేష్ కొండేటి చాలా మంచి చిత్రాలను గతంలో మనకు అందించాడు. అతను సినిమాను తీసుకొస్తున్నాడంటే అది తప్పకుండా బాగుంటుందనే నమ్మకం అందరిలో ఏర్పడుతుంటుంది. “మై బేబి” సినిమా తమిళ వెర్షన్ సాధించిన విజయం గురించి నాకు తెలుసు. సురేష్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడని తెలిసినప్పుడు చాలామంచి సినిమా చేస్తున్నావని అభినందించాను. ఈ రోజు సినిమా చూస్తుంటే ఈ సినిమా సాధించబోయే విజయం ఎలా ఉంటుందో అర్థమైంది. అన్నారు.

‘Bakasura Restaurant’ Movie Worldwide grand Releasing on August 8

ఈ ఆగస్టు 8 న తెలుగు సినీ ప్రియులకు ‘బకాసుర రెస్టారెంట్‌’ పేరుతో ఓ విందుభోజనం రెడీ అవుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్‌. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

*దర్శకుడు మాట్లాడుతూ’* ‘ ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ” హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మీ హృదయాలను హత్తుకునే ఎమోషన్‌ను ఇస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే సంతృప్తిని పొందుతారు’ అన్నారు. ఆగస్టు 8న అత్యధిక థియేటర్స్‌తో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ

I am lucky to act in the movie ‘Hari Hara Veeramallu’ : Actress Nidhi Agarwal

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన కథానాయిక నిధి అగర్వాల్.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
హరి హర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు.

పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డం ఉంది, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.

ఇద్దరు దర్శకులు క్రిష్ గారు, జ్యోతి కృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని.. ఈ తరానికి తగ్గట్టుగా పని చేస్తారు.

ఎ.ఎం. రత్నం గారి గురించి?
ఎ.ఎం. రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి హ్యాట్సాఫ్.

ట్రైలర్ కి వచ్చిన స్పందన ఎలా అనిపించింది?
ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే ట్రైలర్ కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది.

హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో, రాజాసాబ్ లో ప్రభాస్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్ గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్.

పంచమి పాత్ర గురించి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
క్రిష్ గారు కలిసి నా పాత్ర గురించి, కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం, రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. మంచి పాత్ర కూడా దక్కింది.

హరి హర వీరమల్లులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సన్నివేశం?
భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్ గా అనిపించింది.

కీరవాణి గారి సంగీతం గురించి?
పీరియడ్ సినిమాలకు కీరవాణి గారు పెట్టింది పేరు. పైగా ఆస్కార్ విజేత. వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో తార తార, కొల్లగొట్టినాదిరో గీతాలు నాకు బాగా నచ్చాయి.

హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది.

Sampangi Group Achieves Guinness World Record Milestone

రియల్ ఎస్టేట్, ప్రకృతి వ్యవసాయం, హాస్పిటాలిటీ రంగాల్లో ఆరేళ్లుగా అసాధారణ ఘనతలు సాధిస్తూ, అనేక రికార్డులను నెలకొల్పిన సంపంగి గ్రూపు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యమనుకున్న ఖర్జూర పంట సాగును సుసాధ్యం చేసిన సంపంగి గ్రూపు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ అద్భుతమైన విజయం సంపంగి గ్రూపు ఛైర్మన్ డాక్టర్ రమేశ్ సంపంగి వినూత్న ఆలోచనలు, వ్యవసాయంలో పీహెచ్‌డీ జ్ఞానం, సీఈవో సురేష్ సంపంగి ఆచరణాత్మక నాయకత్వం ఫలితంగా సాధ్యమైంది.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని, గిన్నీస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో సంపంగి గ్రూపుకు గిన్నీస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, సంపంగి గ్రూపు నిర్వాహకులైన డాక్టర్ రమేశ్ సంపంగి, సురేష్ సంపంగిని అభినందిస్తూ, వారి విజనరీ నాయకత్వం, సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు.

సంపంగి గ్రూపు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ బ్రాండ్‌గా నిలిచింది. రియల్ ఎస్టేట్‌లో స్థలాలను కేవలం అమ్మడమే కాకుండా, కొనుగోలుదారులకు ఆరోగ్యం, ఆదాయం, మరియు ఆనందాన్ని అందించే వినూత్న విధానంతో ఈ సంస్థ గుర్తింపు పొందింది. నారాయణఖేడ్‌లో ఖర్జూర పంట సాగును ప్రవేశపెట్టి, ప్లాట్ యజమానులకు స్థిరమైన ఆదాయ వనరును సృష్టించడం ద్వారా సంపంగి గ్రూపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా, సంస్థ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన వ్యవసాయం, మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహిస్తోంది.

డాక్టర్ రమేశ్ సంపంగి ‘మానపంత’ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇనిషియేటివ్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు, సమాజానికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఉత్పత్తులను అందిస్తోంది. సీఈవో సురేష్ సంపంగి వ్యాపార నైపుణ్యం, ఇంజనీరింగ్ నేపథ్యం, సంస్థ వృద్ధి, వినూత్న ప్రాజెక్టుల అమలులో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సోదరుల ఆశయం, రియల్ ఎస్టేట్ అంటే కేవలం లాభం కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం అని నిరూపించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికా, సింగపూర్, దుబాయ్, ఘనా సహా పది దేశాల్లో తమ సేవలను విస్తరించిన సంపంగి గ్రూపు, రియల్ ఎస్టేట్, ప్రకృతి వ్యవసాయం, హాస్పిటాలిటీ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. వారి ‘ట్రెజర్ వ్యాలీ’ మరియు ‘సిటీ ఆఫ్ జాయ్’ వంటి ప్రాజెక్టులు, సమతుల్య జీవనశైలిని ప్రోత్సహిస్తూ, ఆధునిక సౌకర్యాలతో కూడిన స్థిరమైన నివాసాలను అందిస్తున్నాయి.

ఈ గిన్నీస్ రికార్డు సాధన సంపంగి గ్రూపు నిబద్ధత, నాణ్యత, వినూత్నతకు నిదర్శనం. ఈ సందర్భంగా అతిథులు, సంపంగి సోదరులు తమ నాయకత్వంలో సంస్థను విశ్వవిజేతగా నిలపాలని ఆకాంక్షించారు. సంపంగి గ్రూపు తన కస్టమర్లను కుటుంబంగా భావించి, వారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందాన్ని అందించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది.