Home Blog Page 75

Hero Vijay-deverakonda interview about “Kingdom” Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కింగ్‌డమ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఏమనిపిస్తుంది?
చాలా చాలా సంతోషంగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది.

ఇంతటి విజయం దక్కడంపై మీ స్పందన ఏంటి?
కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్‌డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గురించి?
గౌతమ్ కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.

రెండవ భాగం ఎలా ఉండబోతుంది?
ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.

ఈ సినిమాలో ఆయుధాలతో ఓటింగ్ వేసే సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఆ సీన్స్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
గౌతమ్ కథ చెప్పినప్పుడు ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి చెప్పాడు కానీ, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఆ తర్వాత ఇలా గన్ లు, కత్తుల వంటి ఆయుధాలతో ఓటింగ్ ఉంటుంది చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. ఆ కొత్తదనమే ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణమైంది అనిపిస్తుంది.

కింగ్‌డమ్ కోసం మీరు ఎలాంటి హోం వర్క్ చేశారు?
ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.

ఈ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి ‘మనం హిట్ కొట్టినం’ అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.

ఈ చిత్రంలో మీరు షిప్ ను లాగే సీన్ జెర్సీ మూమెంట్ లాంటిదని చెప్పవచ్చు. ఆ షూటింగ్ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి?
మే నెలలో మండుటెండలో ఆ సీన్ షూట్ చేశాము. చిత్రీకరణ సమయంలో ఓ మంచి సన్నివేశం చేస్తున్నామన్న సంతృప్తితో చేశాము తప్ప.. జెర్సీ మూమెంట్ అనే ఆలోచనతో చేయలేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ సీన్ గురించి గొప్పగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఉంది.

సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు వచ్చాయి?
సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

సుకుమార్ గారితో మీ సినిమా ఎప్పుడు?
అర్జున్ రెడ్డి సమయం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్ లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది.

కింగ్‌డమ్ విజయం మీ తదుపరి సినిమాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది?
ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతోనే చేస్తాను. తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. రాహుల్, రవి ఇద్దరూ ఎంతో ప్రతిభగల దర్శకులు. ఇద్దరూ అద్భుతమైన కథలను సిద్ధం చేశారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

‘No Truth In It” : Actress Komalee Prasad Refutes Speculations About Quitting Acting

కోమలి ప్రసాద్ నటిగా తెలుగు తెరపై తనకు వచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతోన్నారు. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియా, మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్‌ను వదిలి పెట్టారని, డాక్టర్‌ వృత్తిలోకి వెళ్లారని కోమలి ప్రసాద్ మీద రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వార్తల్ని ఖండిస్తూ కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.

‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాను.

నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని నేను భావిస్తుంటాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ అన్నారు.

Niharika Konidela’s Production No.2 New Movie Pooja Ceremony held grandly

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, యాక్షన్ కొరియోగ్రఫీగా విజయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

నటీనటులు

సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి(జబర్దస్త్), రోహన్ (#90).

సాంకేతిక బృందం

బ్యానర్ – పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, కథ – మానస శర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: మానస శర్మ & మహేష్ ఉప్పాల, ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల, దర్శకత్వం – మానస శర్మ, మ్యూజిక్ – అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్: రాజు ఎడురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ : విజయ్, ఎడిటర్ – అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్ – రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ – పుల్లా విష్ణు వర్ధన్, కాస్ట్యూమ్ డిజైనర్ – సంధ్య సబ్బావరపు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, ఈవెంట్ పార్టనర్ – యు వి మీడియా, డిజిటల్ మార్కెటింగ్ – టికెట్ ఫ్యాక్టరీ, పి.ఆర్.ఒ – సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

“Showtime” is a whole some entertainer Grand release on July 4th

అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు.

షో టైమ్ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?.

హీరో నవీన్ చంద్ర : రెక్టర్ మదన్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక ఫ్యామిలీలో తక్కువ క్యారెక్టర్ల నడుమ సాగే ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రతీ అంశం ప్రేక్షకుడిని రంజింప చేస్తుంది అన్నారు.

పోలీసు ఆఫీసర్  క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

యాక్టర్ రాజా రవింద్ర  .. ఇందులో చాలా మంచి పోలీసు క్యారెక్టర్ చేశాను అన్నారు. అయితే క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందన్నారు.

ఆఫీసర్ లుక్ కోసం ఎలాంటి  జాగ్రత్తలు తీసుకున్నారు?

రాజా రవీంద్ర .. పెద్దగా కష్టపడలేదు కానీ ఫిట్ నెస్ మేయింటైన్ చేసినట్లు చెప్పారు.

 హీరో నవీన్ చంద్ర .. రాజా రవింద్రది ఒక విచిత్రమైన పర్సనాలిటీ అని ఆయన పాత్రలో ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తారు. అందిరిలా మెథడ్ యాక్టింగ్ ఫాలో కాడు… అందరితో నవ్వుతూ.. నవ్విస్తూ.. సరదగా ఉంటాడు.. ఆయన షాట్ రెడీ అవగానే స్ట్రిక్ట్ గా మారిపోతాడు అని చెప్పారు.

ఇలాంటి జోనర్స్ మలయాళంలో ఎక్కువగా వస్తాయి.. తెలుగులో వర్కౌట్ అవుతాయా? 

డైరెక్టర్ మదన్  దక్షిణామూర్తి :మంచి కంటెంట్క ఉన్న సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా  ఆదరిస్తారు 

దృశ్యం సినిమాలా అనిపించింది.. ఇది కూడా ఫ్యామిలీని కాపాడే కథలా ఉంటుందా?..

డైరెక్టర్ .. అంత పెద్ద సినిమాతో పోల్చడం సంతోషంగా ఉంది కానీ ఇది దృశ్యం సినిమాకు భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ చూసి ఇదే సినిమా ఫిక్స్ అవకండి… సినిమా చాలా కొత్తగా, చాలా ఆసక్తిగా ఉంటుందన్నారు.

షో టైమ్ అని టైటిల్ పెట్డడానికి కారణం ఏంటి?

హీరో నవీన్ చంద్ర ::.ఈ సినిమా చూసిన తరువాత ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులే అంటారు. ఇది కచ్చితంగా షో టైమ్ అని చెప్పారు.

ఎక్కువగా థ్రిల్లర్ జోనర్లే ఎందుకు ఎంచుకుంటున్నారు?  హీరో నవీన్ చంద్ర : .. ఒకే రకమైన సినిమాలు చేయాలని ఎవరికి ఉండదు.. కానీ ఇది సీరియస్ ఇన్విస్టిగేషన్ సినిమా కాదు.. ఇందులో ప్రేక్షకులను ఆకర్షించే అనేక అంశాలు ఉన్నాయి అని చెప్పారు.

స్క్రిప్ట్స్ సెలెక్షన్స్ చాలా బాగుంటాయి కదా… ఏమైన జాగ్రత్తలు తీసుకుంటారా?

హీరో నవీన్ చంద్ర: కచ్చితంగా మంచి స్క్రీప్ట్ ను ప్రేక్షకులకు అందించాలనే తపన ఉంటుంది అని అన్నారు  .

నరేష్ లాయర్ గా చేశారు, రాజా రవింద్ర పోలీసుగా చేశారు కదా.. వీరిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయి ?..

హీరో నవీన్ చంద్ర :   వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. థియేటర్లో వీరి కాంబినేషన్ వచ్చినప్పుడు నవ్వులే నవ్వులు.. ఇంకో రెండు రోజుల్లో ఆ మ్యాజిక్ చూస్తారు కదా అంటూ హీరో సమాధానమిచ్చారు.

విడుదలైన ట్రయిలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుడిని థియేటర్లో కట్టిపడేసి, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసే అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉందని తెలుస్తుంది. షో టైం మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

నటీనటులు: నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర, రోహిణి, జెమిని సురేష్ తదితరులు
దర్శకత్వం: మదన్ దక్షిణామూర్తి
నిర్మాత: కిషోర్ గరికిపాటి
బ్యానర్: స్కై లైన్ మూవీస్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్: టీ వినోద్ రాజా ఎమ్ఎఫ్ఐ
ఎడిటర్: శరత్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్ : సుప్రియ బట్టేహపాటి
డైలాగ్స్ : శ్రీనివాస్ గవిరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్స్: చంద్రశేఖర్ మహదాస్, పుష్య మిత్ర గంట
పీఆర్ఓ: హరీష్, దినేష్

Vijay Antony Thanks Telugu Audience for Making “Maargan” a Huge Success

Actor and producer Vijay Antony’s latest film, Maargan, directed by Leo John Paul, has turned out to be a success, especially in the Telugu states. The film also marks the debut of Vijay Antony’s nephew, Ajay Dhishan, as an actor. Produced under the Vijay Antony Film Corporation banner, with proud presentation by J. Ramanjaneyaulu of Sarvanth Ram Creations, the Telugu version, was released on June 27 by Suresh Babu. Since its release last Friday, the film has received a strong response from Telugu audiences. To celebrate this, the film’s team held a Thank You Meet on Wednesday.

*Speaking at the event, Vijay Antony said:*
“Suresh Babu garu and Ram Anjaneyulu garu gave Maargan a grand Telugu release. Suresh Babu garu has even promised to release all my future films in Telugu. I’m thankful to Leo John Paul for giving me such a good film. I feel very happy to have launched Ajay with this project. Ajay has received appreciation both in Tamil and Telugu. Going forward, I hope he continues to do quality content films and keeps winning audience love. Ajay also worked as an assistant director on Bichagadu 2 and Romeo. I’m now planning to produce straight Telugu films along with Ajay. Currently, I’m working on seven films in Tamil, and I will take extra care with their Telugu dubbing. Soon, my next film, Bhadrakali, will release. It’s a political action thriller. I sincerely thank the Telugu audience for making Maargan such a big success.”

*Ajay Dhishan said:* “I honestly didn’t expect Maargan to become such a hit in Telugu. Though it’s a Tamil film, the Telugu audience has given us huge success. I thank Vijay Antony sir and Fatima Vijay Antony madam for giving me this opportunity. Also, my heartfelt thanks to Leo John Paul sir for his support. Special thanks to Suresh Babu sir, Rana sir, and Ram Anjaneyulu garu for releasing our film so well in Telugu.”

*Director Leo John Paul stated:* “Without Vijay Antony sir, this film wouldn’t have turned out the way it did. It was produced on a large scale with high technical standards. Even during the dubbing process, he paid great attention to detail. It’s my fortune to have worked with him. Ajay delivered a brilliant performance. I also thank Suresh Babu garu and Ram Anjaneyulu garu for releasing the film on such a big scale in Telugu.”

*Lyricist and dialogue writer Bhashyasree said:*
“Right from start to finish, Maargan kept the audience on the edge of their seats as a true thriller. I wrote the dialogues and songs for this film. I sincerely thank Vijay Antony sir for trusting me with this opportunity.”

‘Thammudu’ Will Offer Audiences a Unique Theatrical Experience with a New-Age Screenplay and Making: Producer Dil Raju

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

– శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి వర్క్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా మాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు మా దగ్గరనే ఉన్నాడంటే అందుకు మా మధ్య ఉన్న రిలేషన్, వేల్ వెంగ్త్ కారణం. ఇండస్ట్రీలో డబ్బుతోనే పనులు జరుగుతుంటాయి. నాది భిన్నమైన పద్ధతి. నేను వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్లతోనే జర్నీ చేస్తుంటాను. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, దశరథ్..ఇలా డైరెక్టర్స్ మా సంస్థలో వర్క్ చేసి హిట్ చిత్రాలు ఇచ్చారు. శ్రీరామ్ వేణు మా సంస్థలోనే ట్రావెల్ అవుతున్నాడంటే అతనికి భారీగా డబ్బు ఇవ్వడం వల్ల కాదు. మాతో ఆయనకు ఒక కంఫర్ట్ ఉంటుంది. అనిల్ రావిపూడితో నాకొక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ లో ఒక కంఫర్ట్ ఉంటుంది. ఈ డైరెక్టర్స్ టాలెంట్ నాకు తెలుసు. కాబట్టి కథ టైమ్ లో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాకు అనిపించినవి అడుగుతా. నేను క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తారు. అంతే గానీ వారి పనిలో ఇంటర్ ఫియర్ కాను.

– “తమ్ముడు” మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్ గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఎ ఇస్తామని చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్ కు అంగీకరించాం. ఇది సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఎంటర్ టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం. తమ్ముడు మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న మూవీ. థియేటర్స్ కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 పర్సెంట్ మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్ లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

– పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్ లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం. “తమ్ముడు” సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రీమియర్స్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలి. తమ్ముడు మూవీని నెట్ ఫ్లిక్స్ వాళ్లు చూసి నచ్చి తీసుకున్నారు.

– పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్ తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్ కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు. నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్ కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్ గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్ తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్ గా చూడొద్దు.

– “తమ్ముడు” మూవీకి అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. మనమంతా కొత్త సినిమా కావాలనుకుంటాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్నిస్తా అన్నాడు. మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేయించాం. శుక్రవారం మార్నింగ్ షో చూసిన మీ అందరికీ మా సినిమా నచ్చితే సూపర్ హిట్ దక్కినట్లే. కథగా చూస్తే ఇది సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది మూవీలో చూస్తారు. ఈ కథను స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్ తో వెళ్తూ ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు.

– నిర్మాతగా సినిమాను బాగా రెడీ చేసి ప్రాపర్ గా రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. వారికి నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు డైరెక్టర్ అనిల్ బాగా ప్లాన్ చేసి ప్రేక్షకులకు మూవీ రీచ్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా మేము అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. తమ్ముడు రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాం, అయితే ఎంత రేంజ్ హిట్ అవుతుంది అనేది మాత్రం రిలీజ్ రోజునే తెలుస్తుంది. ఫలానా ఓటీటీ సినిమాను తీసుకుంది అని ముందే ప్రకటించడం ఆపేస్తే మంచిది. ఓటీటీలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. తమ్ముడు మూవీ కంటెంట్ కు వస్తున్న వ్యూస్ విషయంలో జెన్యూన్ గా ఉంటున్నాం.

– ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే దిల్ రాజు డ్రీమ్స్ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్ గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటి అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్ లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం.

– ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. యానిమల్ తో ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ లో రెండు మూడు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఎలాంటి కంటెంట్ తో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది డిస్కస్ చేస్తున్నాం.

“Solo Boy” Pre-Release Event grandly with Sensational Director VV Vinayak as Chief Guest

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్ర రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు.

ఈ సందర్భంగా *వివి వినాయక్* మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ చిత్ర నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి సతీష్ ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించి సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

*రఘు కుంచే* మాట్లాడుతూ… “చిత్ర ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం ఉన్నారు. దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత అయ్యారు. ఆయన ఓటిటి ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ ఎంతో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా వెండిస్తల పైకి రానున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాలు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

*కె ఎల్ దామోదర్ ప్రసాద్* మాట్లాడుతూ... “నాకు ఈరోజే సతీష్ దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత వేయాలని తెలిసింది. ఇటువంటిది వినడం ఇదే మొదటిసారి. ప్యాషన్ తో వచ్చి సినిమాలు చేసే అతి తక్కువ మందిలో సతీష్ ఒకరు. అది అతని సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. డైరెక్టర్ కావాలనుకున్న అతని కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రేక్షకులు అంతా పైరసీని అరికడుతూ వెండి ధరపై ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

*ప్రసన్న కుమార్* మాట్లాడుతూ… “సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సతీష్ గతంలో కూడా సినిమా చేశారు. అప్పుడు ఆర్ పి పట్నాయక్ గారు అతనికి అండగా నిలిచారు. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా మరోసారి మన ముందుకు మరొక మంచి సినిమా తీసుకువస్తున్నారు. గౌతమ్ కృష్ణ డాక్టర్ కావలసిన వాడు యాక్టర్ అయ్యాడు. ఎంతో ప్యాషన్ తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. వారి కుటుంబంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు సోలో బాయ్ చిత్రం ద్వారా వెండితెరపై కనిపించనున్నారు. గతంలో నారా రోహిత్ సోలో చిత్రం ఎంత విజయం సాధించిందో ఇప్పుడు సోలో బాయ్ చిత్రం కూడా అంతే విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సతీష్ ఇంకా మంచి నిర్మాణ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

*లిరిసిస్ట్ పూర్ణచారి* మాట్లాడుతూ… “సోలో బాయ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ పేరుపేరునా నా నమస్కారం. బిగ్ బాస్ తర్వాత గౌతమ్ కృష్ణ వెండితెర పైకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పట్టాడు. లాక్డౌన్ సమయంలో బట్టల రామకృష్ణ బయోపిక్ ద్వారా ప్రేక్షకులు ముందుకు నిర్మాతగా వచ్చిన సతీష్ గారు ఇప్పుడు సోలో బాయ్ చిత్రాన్ని వెండి తెర పైకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలి. ముందు ముందు మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, నేను మీతో పని చేయాలని కోరుకుంటున్నాను. చిత్రానికి చూడా సంధ్య గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. హీరోయిన్లు ఇద్దరు తలపై చాలా బాగున్నారు. జులై 4వ తేదీన సోలో బాయ్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

*ఆట సందీప్* మాట్లాడుతూ... “గౌతమ్ కృష్ణ నాకు బిగ్ బాస్ ద్వారా బాగా పరిచయం. అప్పటినుండే నా సినిమాలో మీరు చేయాలి అని గౌతమ్ నాతో ఉంటూ ఉండేవారు. అలాగే సోలో బాయ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది నిర్మాత సతీష్ గారు. చిన్న సినిమా అనుకుంటున్నాము కానీ ఈ సినిమా వెనుక ఎన్నో పెద్ద సంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఎంతో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గౌతమ్ ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. జులై 4వ తేదీన ఈ చిత్రాన్ని అందరూ విజయం సాధించేలా చేయాలని కోరుకుంటున్నాను. మురళి నాయక్ కుటుంబానికఅభినందిస్తున్నానుయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు.

*అనిత చౌదరి* మాట్లాడుతూ… “మీడియా వారికి, ఈవెంట్ కు వచ్చిన వారికి అందరికీ నమస్కారం. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా చేసిన ఈ సోలో బాయ్ చిత్రం ద్వారా పరిచయమైన అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమాలో నటించిన వారికి, అలాగే టెక్నీషియల్ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమాలోని పాటలు ఇంకా సంగీతం చాలా బాగున్నాయి. నిర్మాత సతీష్ గారితో ఈ చిత్ర ప్రయాణం చాలా మంచిగా అనిపించింది. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాను మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

*హీరోయిన్ శ్వేత అవస్తి* మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నాకు చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి అలాగే చిత్ర బృందం అందరికీ నా థాంక్స్. మీ అందరితో పని చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జులై 4వ తేదీన మా సినిమాను అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

*హీరోయిన్ రమ్య పసుపులేటి* మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమాలో గౌతం కృష్ణ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నాకు మీరు ఎంతో కాలంగా తెలుసు. జూలై 4వ తేదీన ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

*దర్శకుడు నవీన్ కుమార్* మాట్లాడుతూ… “సోలో బాయ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. మా చిత్రం జూలై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని రకాల జోనర్లు కనిపిస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సినిమాలో పాటలు సంగీతం చాలా బాగా వచ్చాయి. సినిమా కోసం టెక్నికల్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా డైరెక్షన్ టీమ్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత గౌతమ్ కృష్ణకు ఎన్నో పెద్ద సినిమాలు వస్తాయి. నాకు ఈ సినిమా దర్శకత్వం చేసేందుకు అవకాశం ఇచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్యాషన్ తో వచ్చి ఎంతో కష్టపడి చిత్ర నిర్మాణానికి సహాయపడుతూ ఉండే మనిషి. ప్రతి విషయంలోనూ ఎంతో సపోర్టుగా నిలిచారు. మంచి కంటెంట్ తో విజయం సాధించిపోతున్నామని మాకు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. మా నిర్మాత ఈ చిత్రం ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశ్రమకు ఇంకెంతమందిని పరిశీలించాలని అనుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్* మాట్లాడుతూ… “ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, చిత్ర పరిశ్రమకు, మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు. నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. చాలా చిన్నగా మొదలై ఇప్పుడు పెద్ద స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా సోలో బాయ్. గౌతమ్ కృష్ణ నాకు తమ్ముడి లాంటివాడు. గౌతమ్ ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమా కోసం ప్రతి విషయంలోనూ నాకు ఎంతో సపోర్టుగా నిలిచాడు. ఈ సినిమా గౌతం సినీ కెరియర్లో ఒక మంచి మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సోలో బాయ్ చిత్రం ప్రేక్షకులందరిదీ. నేను సినిమాకు చాలా కరెక్ట్ అయ్యాను. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు సోలో బాయ్ రాబోతుంది. చిత్ర టెక్నికల్ టీమ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన ఇతర నటినటులు అంతా చాలా బాగా చేశారు. మీడియా వారు ఈ చిత్రానికి బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

*హీరో గౌతమ్ కృష్ణ* మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఇటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. దర్శకుడు నవీన్ కుమార్ గారు ఎంతో కమిట్మెంట్తో ఉండే వ్యక్తి. చాలా తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను ఎంతో మంచి అవుట్ పుట్ తో తీసుకొచ్చాము. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎంతో సీనియర్ నటినటులు మాతో నటించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. టెక్నికల్ టీం అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాకు సపోర్టుగా వచ్చిన ప్రతి అతిధికి నా ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా చూస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదేనా సమాధానం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మురళి నాయక గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్” అంటూ ముగించారు.

నటీనటులు – గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు

సాంకేతిక బృందం:
కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరి
సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు
సంగీతం – జుడా సాండీ
కో-డైరెక్టర్ – కినోర్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్
లిరిక్ రైటర్స్ – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్
బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం – పి. నవీన్ కుమార్
పి ఆర్ ఓ : మధు VR
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

‘Thammudu’ Movie Release Trailer Launched Grandly, worldwide grand releasing on July 4th.

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ కేవీ గుహన్ మాట్లాడుతూ – దిల్ రాజు గారి బ్యానర్ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. “తమ్ముడు” సినిమాకు ముగ్గురు డీవోపీలం పనిచేశాం. అయితే మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ తేడా ఎక్కడా కనిపించదు. టెక్నీషియన్స్ గా మేమే కాదు ఆర్టిస్టులు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా నేను చూశాను. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్నారు.

ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ – దిల్ రాజు గారు, నితిన్ గారు, శ్రీరామ్ వేణు గారితో నేను గతంలో పనిచేశాను. శ్రీరామ్ వేణు గారితో నాకిది మూడో మూవీ. చాలా మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని వాటి ద్వారా నావెల్టీ ఉన్న మూవీని శ్రీరామ్ వేణు గారు రూపొందించారు. వకీల్ సాబ్ మూవీ చేస్తున్నప్పటి కంటే ఎక్కువ గంటలు డైరెక్టర్ గారితో నేను డిస్కషన్స్ చేశాం. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. అన్నారు.

గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ – “తమ్ముడు” సినిమాలో పగడాలమ్మ జాతర నేపథ్యంలో జై బగళాముఖీ పాట రాసే అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఈ పాటను అజనీష్ ఎంతో ప్రతిభావంతంగా కంపోజ్ చేశాడు. అమ్మవారి పాటను ఈ సినిమాలో చిత్రీకరించాలని ఆలోచన దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి రావడం గొప్ప విషయం. ఇందుకు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ పాటకు పనిచేస్తున్నప్పుడు తమ్ముడు సినిమా కోసం టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో తెలిసింది. తమ్ముడు సినిమా మీద కనకవర్షం కురవాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి హరితేజ మాట్లాడుతూ – “తమ్ముడు” సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం వెళ్లినప్పుడు డైరెక్టర్ గారు జ్వరంతో ఉండి కూడా క్యారెక్టర్ నెరేట్ చేశారు. ఇది నేను ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లోకి డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ లో కష్టపడ్డాం అయితే ఆ కష్టం తర్వాత సక్సెస్ రూపంలో రాబోతున్న సంతోషం ఎంతో విలువైనదిగా భావిస్తాను. అన్నారు.

బేబి దిత్య మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీలో నన్ను ఆడిషన్ లో సెలెక్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నన్ను ఈ క్యారెక్టర్ లో నటింపజేసిన డైరెక్టర్, మా నాన్న గారికి థ్యాంక్స్. నన్ను బాగా చూసుకున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు థ్యాంక్స్. “తమ్ముడు” మూవీ అమేజింగ్ గా ఉంటుంది. మీరంతా బాగా ఇష్టపడతారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీకి పనిచేసిన ఎక్సిపీరియన్స్ చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో ఒక సందర్భంలో డైరెక్టర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, మన ఇంటిగ్రిటీ గురించి చెప్పారు. ఆ టైమ్ లో నాకు కన్నీళ్లు వచ్చాయి. శ్రీరామ్ వేణు గారు చెప్పిన సీన్స్ నుంచే కొత్త తరహా మ్యూజిక్ చేసే స్ఫూర్తి కలిగింది. ఈ సినిమాకు వర్క్ చేశాక నాకొక సోదరి ఉంటే బాగుండేది అనిపించింది. థియేట్రికల్ గా ఎక్సిపీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ కాకండి. అన్నారు.

హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ – ఈ సినిమాలో రత్న అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ గారికి థ్యాంక్స్. రత్న క్యారెక్టర్ లో నేను బాగా నటించేందుకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్. హీరో నితిన్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ కోసం మేమంతా 2 ఇయర్స్ కష్టపడ్డాం. మరో మూడు రోజుల్లో మా మూవీ మీ ముందుకు వస్తోంది. “తమ్ముడు” సినిమాను థియేటర్స్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీలో నేను నటించగలను అని నాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు. ఈ పొట్టిపిల్ల ఏం చేస్తుందని అనుకోకుండా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఏ మేకప్ లేకుండా ఫ్లైట్ దిగి శ్రీరామ్ గారి ఆఫీస్ కు వెళ్లాను. నన్ను చూసి ఇలా ఓకే అని క్యారెక్టర్ కు సెలెక్ట్ చేశారు. హీరో నితిన్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఎన్నో జోక్స్ చెప్పి ఆయనను విసిగించారు. లయ గారు స్వీట్ పర్సన్. ఆమె మాలాంటి ఎంతోమందికి ఇన్సిపిరేషన్. దిల్ రాజు గారు ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేశారు. లక్షలాది మందికి ఆ ప్లాట్ ఫామ్ హోప్ ఇస్తుందని ఆశిస్తున్నా. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు మా కంటే టెక్నీషియన్స్ ఎక్కువ శ్రమించారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మనం కొన్ని సినిమాలు థియేటర్స్ లో మిస్సయితే బాధపడతాం. ఆ సినిమాలను థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి. అలా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమానే “తమ్ముడు”. అన్నారు.

నటి లయ మాట్లాడుతూ – ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు డిఫరెంట్ గా ఉందని అనుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. నా పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఎక్సిపీరియన్స్ చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను సింగిల్ చైల్డ్ ను. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరూ లేరు. ఈ సినిమా కోసం 2 ఏళ్లు అయ్యింది అని అంటున్నారు. పదేళ్లు టైమ్ పట్టినా ఇలాంటి మంచి సినిమా పనిచేస్తాం. నా గత చిత్రాలు చూసి నన్ను ప్రేక్షకులు ఎంతగా అభిమానించారో, అదే ప్రేమను “తమ్ముడు” మూవీ మీద చూపిస్తారని కోరుకుంటున్నా. అన్నారు

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా జూలై 4న సాధించబోయే సక్సెస్ క్రెడిట్ మొత్తం శ్రీరామ్ వేణుకే దక్కాలి. ఈ సినిమాకు మేము పడిన కష్టం తక్కువ. ఈ సినిమా సక్సెస్ నీది. మనం ఘన విజయాన్ని అందుకోబోతున్నాం. ఇలాంటి వేదక మీదే మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం. నితిన్ కెరీర్ లో జయం, గుండెజారి గల్లంతయ్యిందే మూవీస్ సక్సెస్ కు ఎంత సంతోషపడ్డాడో, “తమ్ముడు” మూవీ విజయం అంతకు రెట్టింపు ఆనందాన్నిస్తుంది. ప్రొడ్యూసర్స్ గా మేము నితిన్ కు ఆ ప్రామిస్ ఇస్తున్నాం. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీ ఔట్ పుట్ ఇంత బాగా రావడానికి టెక్నీషియన్స్ కష్టమే కారణం. డీవోపీ గుహన్ గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్, ఆర్ట్ చేసిన శేఖర్..ఇలా టెక్నీషియన్స్ శ్రీరామ్ వేణు విజన్ ను స్క్రీన్ మీదకు అద్భుతంగా తీసుకొచ్చారు. జై బగళాముఖీ పాటతో మా సినిమాకు ఒక వైబ్ వచ్చింది. ఆ పాట రాసిన జొన్నవిత్తుల గారికి థ్యాంక్స్. అజనీష్ లోకనాథ్ తన మ్యూజిక్ తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. మాతో శ్రీరామ్ వేణు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఏంటో మాకు పూర్తిగా తెలుసు. మా దగ్గర ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్స్ చేశాడు. ఆ మూవీస్ కు మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకున్నాడేమో గానీ “తమ్ముడు” సినిమాకు మాత్రం తను సోలోగా కష్టపడ్డాడు. ఈ మూవీ సాధించబోయే సక్సెస్ క్రెడిట్ శ్రీరామ్ వేణుదే. కార్తీక్, సత్య..వీళ్లిద్దరు శ్రీరామ్ వేణుతో మొదటినుంచీ ట్రావెల్ చేస్తున్నారు. నితిన్ తో పాటు ఐదుగురు వుమెన్స్ లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక, దిత్య..స్ట్రాంగ్ రోల్స్ చేశారు. వీళ్ల క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. నితిన్ తో పాటు వీళ్లు ఐదుగురినీ హీరోలుగా అనౌన్స్ చేయొచ్చు. అంత బాగా పర్ ఫార్మ్ చేశారు. నితిన్ గత కొన్ని చిత్రాలు సక్సెస్ కాలేదని బాధలో ఉన్నాడు. కానీ “తమ్ముడు” ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మా బ్యానర్ కు మరో హిట్ “తమ్ముడు” ఇవ్వబోతోంది. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేశాం. చరణ్ తో సూపర్ హిట్ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సూపర్ హిట్ మూవీ చేయబోతున్నాం. త్వరలో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.

హీరో నితిన్ మాట్లాడుతూ – “తమ్ముడు” మూవీ జూలై 4న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా శ్రీరామ్ వేణు గారి కోసం, నా సినిమాలను ఇష్టపడే అభిమానులు, నాకు సక్సెస్ రావాలని కోరుకునేవారి కోసం ఘన విజయం సాధించాలి. నా గత చిత్రాలు మీకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ఈ సినిమా తప్పకుండా సంతోషపెడుతుంది. ఈ చిత్రం కోసం శ్రీరామ్ వేణు ఎంత కష్టపడ్డాడో జూలై 4న మాట్లాడతాను. నా గత మూవీస్ నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్ తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా. “తమ్ముడు” మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కు థ్యాంక్స్. అలాగే నా కో స్టార్స్ 80 డేస్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. అందులో సగం నైట్ షూట్స్, సగం డే షూట్స్ ఉంటాయి. అడవిలో జ్వరం వచ్చినా, ఫుడ్ పాయిజన్ అయినా, గాయాలు అయినా ఓర్చుకుని నటించారు. ఉదయం 7 గంటలకు షూట్ అంటే సెట్ లో టైమ్ కు ఉండేవారు. వీళ్లు లేకుంటే సినిమా కంప్లీట్ అయ్యేది కాదు. నేను కొంచెం దిగులుగా ఉంటే రాజు గారు శిరీష్ గారు నాకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడేవారు. ఇది థియేట్రికల్ గా మీకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమా. జూలై 4న థియేటర్స్ కు వెళ్లి మూవీ చూడండి. అన్నారు.

డైరెక్టర్ శ్రీరామ్ వేణు మాట్లాడుతూ – రాజు గారు, శిరీష్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లు. నాకంటే “తమ్ముడు” సినిమాను ఎక్కువగా నమ్మిన వ్యక్తి శిరీష్ గారు. నేను ఎప్పుడైనా దిగాలుగా ఉంటే అన్నం ఉడికిందంటే ఒక మెతుకు చూస్తే చాలు ఈ సీన్ చాలు అద్భుతంగా చేశావ్ అంటూ ఎంకరేజ్ చేసేవారు. “తమ్ముడు” సినిమాను ఇలా థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశానని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్ గా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. రాజు గారు బిజీ వల్ల మాకు టైమ్ కేటాయించకున్నా శిరీష్ గారు ప్రతిసారీ మా యోగక్షేమాలు కనుక్కునేవారు. మాకు కావాల్సింది ప్రొవైడ్ చేసేవారు. రాజుగారు, శిరీష్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. హీరో నితిన్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం ప్రతి విషయంలో అన్ కండీషనల్ గా సపోర్ట్ చేశారు. నేను అనుకున్న క్యారెక్టర్ ను ఎంతో బాగా పర్ ఫార్మ్ చేశాడు. మా పాప దిత్య మూవీలో నటించింది. ఈ సినిమా షూటింగ్ లో నా వైఫ్, పాప నాతోనే ఉన్నారు. షూటింగ్ టైమ్ లో ఫ్యామిలీ మన దగ్గరే ఉంటే ఎంత సపోర్ట్ వస్తుందో నేను ఈ సినిమాకు ఎక్సిపీరియన్స్ చేశాను. ఈ మూవీలో మీరు కొత్త లయ గారిని చూస్తారు. ఆమె ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. వర్ష నాకు కూతురు లాంటిది. ఈ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. ఈ మూవీ కోసం మెయిన్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఒక విద్య నేర్చుకున్నారు. ఈ సినిమాలో కీ రోల్స్ అన్నింటికీ యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ సినిమాలోని ఫ్యామిలీ ఫిల్లర్ లాంటిది. వాళ్లమీదే ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. డీవోపీలుగా చేసిన సేతు, సమీర్ రెడ్డి గారు, గుహన్ గారు బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సీన్స్ చూసి తను బాగా కనెక్ట్ అయ్యి బెటర్ మెంట్ కోసం రెండుసార్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. జూలై 4 తర్వాత “తమ్ముడు” మూవీ గురించి మాట్లాడుతాను. అన్నారు.

నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు

Sapthami Gowda interview about Hero Nithin’s ‘Thammudu’ Movie 

After the blockbuster hit Sankranthi ki Vasthunnam another super hit film Thammudu is all set to arrive under the prestigious banner of Sri Venkateswara Creations, produced by Dil Raju and Sirish with Nithiin in the lead. The film is directed by Sriram Venu, with Laya, Varsha Bollamma, and Sapthami Gowda playing key roles. Thammudu is gearing up for a grand worldwide theatrical release on the 4th of this month. On this occasion, actress Sapthami Gowda, who plays the character of Ratna, shared her experience along with the highlights of the movie.

“After Kantara, I got a call from director Sriram Venu for Thammudu. I came to Hyderabad and did a look test. After the look test went well, they gave me the dialogue version. By then, the complete script of Ratna’s character was ready. They also told me to learn horse riding. We shot the film in Araku. Due to an injury to Nithiin’s shoulder, the shoot was delayed a bit. Working on Thammudu has been a great experience.”

“I play the role of Ratna, a girl from a village called Ambaragodugu. She is a fan of Pawan Kalyan. There’s also a different love story for my character. Some may feel that my look in Thammudu resembles my Kantara look, but as a character, Ratna is completely different. Thammudu has a slightly serious subject, but my character brings fun to the film. Laya garu, Nithiin garu visit the village of Ambaragodugu under certain circumstances. How Ratna becomes part of their journey is interesting. Without knowing their situation, I behave jovially with them, which creates humor for the audience. Ratna is not a radio jockey; what she truly is can be seen only in the film. I had to do horse riding scenes in hilly, rocky areas. Practicing horse riding for 3-4 hours daily was tough, but I’m satisfied with how those scenes turned out.”

“I know about Pawan Kalyan’s Thammudu movie. Director Venu garu told me about it. We all know how big a success that film was for Pawan Kalyan garu. I haven’t watched the complete movie yet. I will definitely watch it before the release of our Thammudu.”

“I believe this film will definitely give me a good name as an actress. Though my role is not lengthy, it’s an impactful one. Director Venu garu always said that among all the characters, he enjoyed writing Ratna’s role the most. I was also the first artist selected for the film.”

“In Thammudu, the characters played by me, Laya, Ditya, Varsha, and Swasika will all have importance. All five women characters are different and powerful. For example, the character Gutthi drives a bus. She even learned bus driving for this movie. Laya garu plays a strict officer. Myself, Varsha, and others also have action sequences. Usually, in movies, we see female characters singing songs with the hero, but here, audiences will see heroines fighting alongside the hero. The way women characters have been portrayed so strongly in Thammudu will definitely make female audiences feel proud and happy when they watch the movie in theatres.”

“There’s also a love track between Nithiin and me in the film. Our teenage love story gradually matures over time. By the end of the movie, the audience will root for Ratna and Nithiin’s characters to unite. I’m happy that my first Telugu film under Dil Raju garu’s Sri Venkateswara Creations is Thammudu. Only reputed banners can promote and release a film in such a grand manner. Director Sriram Venu garu has worked really hard for Thammudu. He designed every character perfectly. He didn’t compromise on getting the desired output, not just from artists but also from technicians.”

“Thammudu is a film that must be experienced in theatres for its grand scale and visuals. If you’ve seen the trailer and release trailer, you’d know how big this movie is going to be. A film like this will not have the same impact if watched at home. You can enjoy Thammudu to the fullest only in theatres.”

“I love doing commercial films. Thammudu is also a commercial film. I really liked Rashmika’s character in Pushpa. If I get such offers, I’m ready to do them. After Kantara’s success, I received many such offers, but I rejected most of them because they weren’t exciting enough. That’s the reason you haven’t seen me in many films. But if different roles come my way, I’ll definitely take them up. Currently, I’m working on two more Telugu films, along with projects in Tamil and Kannada. I’ll reveal those details soon. I want to work in all languages beyond boundaries.”

Vijay Antony’s ‘Maargan’ Gaining Momentum with Positive Word of Mouth

The multi-faceted Vijay Antony returns with another gripping project, Maargan, where he dons multiple hats as the lead actor, producer, and music director. Helmed by editor-turned-director Leo John Paul, the film is produced by Vijay Antony Film Corporation and presented by J. Ramanjaneyulu under the Sarvanth Ram Creations banner. This murder mystery–crime thriller hit theatres on June 27th, with distribution in the Telugu states handled by Asian Suresh Entertainment.

The film’s unique promotional strategy stirred intrigue ahead of its release, especially with the bold move to unveil the first six minutes of the film, a decision that heightened anticipation among moviegoers. Now, Maargan is benefitting from strong word of mouth and encouraging critical reviews, contributing to its gradual rise at the box office.

Adding to its growing momentum, the film’s team’s visits to theatres have boosted audience engagement. Vijay Antony delivers a power-packed performance, captivating viewers with his intensity, while debutant Ajay Dhishan impresses with a confident and impactful screen presence.

With a compelling premise, standout performances, and high production values, Maargan is carving a niche for itself among thriller enthusiasts and continues to pick up steam.