Home Blog Page 76

Vijay Antony’s ‘Maargan’ Gaining Momentum with Positive Word of Mouth

The multi-faceted Vijay Antony returns with another gripping project, Maargan, where he dons multiple hats as the lead actor, producer, and music director. Helmed by editor-turned-director Leo John Paul, the film is produced by Vijay Antony Film Corporation and presented by J. Ramanjaneyulu under the Sarvanth Ram Creations banner. This murder mystery–crime thriller hit theatres on June 27th, with distribution in the Telugu states handled by Asian Suresh Entertainment.

The film’s unique promotional strategy stirred intrigue ahead of its release, especially with the bold move to unveil the first six minutes of the film, a decision that heightened anticipation among moviegoers. Now, Maargan is benefitting from strong word of mouth and encouraging critical reviews, contributing to its gradual rise at the box office.

Adding to its growing momentum, the film’s team’s visits to theatres have boosted audience engagement. Vijay Antony delivers a power-packed performance, captivating viewers with his intensity, while debutant Ajay Dhishan impresses with a confident and impactful screen presence.

With a compelling premise, standout performances, and high production values, Maargan is carving a niche for itself among thriller enthusiasts and continues to pick up steam.

‘Kannappa’ is a Marvel, A Landmark Film, Says Deputy CM Mallu Bhatti Vikramarka after Special Screening

విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమాను రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. వీరితో పాటుగా మోహన్ బాబు, విష్ణు వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సందడి చేశారు.

‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉంది. అర్జునుడిగా, తిన్నడిగా, కన్నప్పగా విష్ణు అద్భుతంగా నటించారు. ఇంత గొప్ప చిత్రం నిర్మించిన మోహన్ బాబు గారికి అభినందనలు. కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని ఇలా గొప్పగా అనిపించాయి. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుంది’ అని అన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ .. ‘చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశాను. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబు గారికి, విష్ణుకి ధన్యవాదాలు. శివ భక్తులంతా పరవశించి పోయేలా మూవీని తీశారు. మేం అంతా కలిసి ఈ మూవీని చూసి ఎంతో ఆనందించాం. మన కథను అందరికీ తెలిసేలా చేయాలి. ఇలాంటి చిత్రాల్ని అప్పుడప్పుడు అయినా తీయాలని సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేను అందరినీ కోరుతున్నాను’ అని అన్నారు.

Young Hero Kiran Abbavaram’s “K-RAMP” First Look Unveiled; Set for a Grand Theatrical Release This Diwali

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం లుంగీ కట్టులో మాస్, క్లాస్ కలిసిన మేకోవర్ లో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో మందు బాటిల్స్ తో డిజైన్ చేసిన లవ్ సింబల్ కనిపిస్తోంది. “K-ర్యాంప్” కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ దీపావళికి “K-ర్యాంప్” మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని

Hero Krishna Manineni conducting “Mega Blood Donation Camp” Under the Auspices of 100 Dreams Foundation

జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణా మానినేని సేవా దృక్పథంతో 100 డ్రీమ్స్ సేవా సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహించుచున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ మానినేని చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి.100 డ్రీమ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు కృష్ణా మానినేని జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని “సింధూర సంజీవని” పేరిట నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించి, 251 donars తో రక్తదాన కార్యక్రమం దిగ్విజయం చేశారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు గారు, 100 డ్రీమ్స్ VOLUNTEERS, మెగాస్టార్ & పవర్ స్టార్ అభిమానులు మరియు పంచ్ ప్రసాద్, జబర్దస్త్ రాము తో పాటు , ఎం రవికుమార్, విజయ్ భాస్కర్, సత్యదేవ్, మహేష్ బాబు, బాలకృష్ణ, కిషోర్ కౌతారపు, గౌతమ్ , తధితరులు పాల్గొన్నారు.

Actor Sivaji Birthday Celebrations held grandly, unveiled a special birthday poster from his own production banner

దశాబ్దాల పాటు తన చలనచిత్ర ప్రయాణంతో ఎంతోమంది మనసులలో చోటు సాధించి తన నటనతో, స్ఫూర్తితో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు ప్రయాణం చేసే నటుడు శివాజీ పుట్టినరోజు వేడుకలను తెలుగులో చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా వేడుక చేసుకుంటుంది.

తన నటనతో, నటన శైలితో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ తనదైన మార్క్ సృష్టించుకుని ఎన్నో చిత్రాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో దగ్గరగా ఫీల్ అయ్యే విధంగా పాత్రలను పోషిస్తూ ముందుకు సాగే వ్యక్తి శివాజీ. నటన పట్ల ఆయనకు ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శివాజీ ఆ తరువాత మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, సందడే సందడి వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అదేవిధంగా కొన్ని చిత్రాలలో తనదైన మార్కెట్ సృష్టిస్తూ మంచి క్యారెక్టర్లు కూడా చేశారు. ఇటీవలే కోర్టు చిత్రం ద్వారా మంగపతిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆ చిత్రంలో శివాజీ క్యారెక్టర్ చూసిన వారంతా ఆయన నటనను ఎంతగానో కొనియాడారు. నేడు నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నుండి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దానిని చూసిన అభిమానులంతా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఇలాగే మరొకటి శివాజీ తన యాక్టింగ్ కెరియర్లో అలాగే నిర్మాతగా ముందుకు వెళ్తూ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలుపుతున్నారు.

దశాబ్దాల పాటు తన చలనచిత్ర ప్రయాణంతో ఎంతోమంది మనసులలో చోటు సాధించి తన నటనతో, స్ఫూర్తితో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు ప్రయాణం చేసే నటుడు శివాజీ పుట్టినరోజు వేడుకలను తెలుగులో చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా వేడుక చేసుకుంటుంది.

తన నటనతో, నటన శైలితో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ తనదైన మార్క్ సృష్టించుకుని ఎన్నో చిత్రాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో దగ్గరగా ఫీల్ అయ్యే విధంగా పాత్రలను పోషిస్తూ ముందుకు సాగే వ్యక్తి శివాజీ. నటన పట్ల ఆయనకు ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శివాజీ ఆ తరువాత మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, సందడే సందడి వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అదేవిధంగా కొన్ని చిత్రాలలో తనదైన మార్కెట్ సృష్టిస్తూ మంచి క్యారెక్టర్లు కూడా చేశారు. ఇటీవలే కోర్టు చిత్రం ద్వారా మంగపతిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆ చిత్రంలో శివాజీ క్యారెక్టర్ చూసిన వారంతా ఆయన నటనను ఎంతగానో కొనియాడారు. నేడు నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నుండి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దానిని చూసిన అభిమానులంతా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఇలాగే మరొకటి శివాజీ తన యాక్టింగ్ కెరియర్లో అలాగే నిర్మాతగా ముందుకు వెళ్తూ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలుపుతున్నారు.

‘Thank You Dear’ Movie Teaser launched by Sensational Director V.V. Vinayak

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పి ఎల్ కే రెడ్డి డిఓపిగా పనిచేశారు. కాగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్ర టీజర్ ను లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ… “రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు నిర్మాతగా, శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో ధనుష్ రఘుమూర్తి మాట్లాడుతూ... “మా థాంక్యూ డియర్ చిత్ర టీచర్ ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన టీజర్ ను లాంచ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది” అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ… “మా థాంక్యూ డియర్ సినిమా టీజర్ ను డైరెక్టర్ వి వి వినాయక గారు లాంచ్ చేయడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

నటి నటులు – హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు.

బ్యానర్ : మహా లక్ష్మి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ : పప్పు బాలాజీ రెడ్డి
రైటర్ & డైరెక్టర్ – తోట శ్రీకాంత్ కుమార్
ఎడిటర్ : రాఘవేంద్ర పెబ్బేటి
మ్యూజిక్ – సుభాష్ ఆనంద్
డి ఓ పి : పి ఎల్ కె రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ – బలిజ పునీత్ రాయల్
కో ప్రొడ్యూసర్ – పి బి వి వి సత్య నారాయణ
కస్టమ్ డిజినర్ – భావన పోలిపల్లి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
డిజిటల్ – డిజిటల్ దుకాణం

Manish Gour Hollywood films ‘ALALU LENI SAMUDRAM’ Movie Trailer Launched held grandly

వసంత్, భాగ్యలక్ష్మి, రమ్య హీరో హీరోయిన్లుగా దర్శకుడు టి.రాము రూపొందిస్తున్న మూవీ అలలు లేని సముద్రం. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

అతిథిగా వచ్చిన నిర్మాత బాలాజీ నాగలింగం మాట్లాడుతూ – దర్శకుడు రాము నాకు బాగా పరిచయం. ఆయన ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిత్రాలకు పరిస్థితులు అంత బాగా లేవని చెప్పాను. అయినా పట్టుదలగా ఆయన మూవీ రూపొందించారు. అలలు లేని సముద్రం మూవీ ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ చేస్తా. అన్నారు.

అతిథిగా వచ్చిన వేణు మాధవ్ మాట్లాడుతూ – అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రాము ఎంతో సహజంగా సినిమాను రూపొందించాడు. సముద్రం అంటే అలలు ఉండాల్సిందే. అలలు లేకుండా సముద్రం ఎలా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చూపించబోతున్నారు. అన్నారు.

నటి రోజారాణి మాట్లాడుతూ – అలలు లేని సముద్రం సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు రాము మేము నటించేలా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

అతిథిగా వచ్చిన నిర్మాత రామశర్మ మాట్లాడుతూ – ఈ రోజుల్లో చిన్న సినిమా నిర్మించడం అంటే కష్టమైన వ్యవహారం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దర్శకుడు రాము అలలు లేని సముద్రం సినిమాను రూపొందించాడు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా టీమ్ అందిరకీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

అతిథిగా వచ్చిన కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ – నేనూ ఆర్టిస్టు అవ్వాలనే కలగన్నాను. అయితే క్రమంగా పాలిటిక్స్ వైపు వచ్చాను. దర్శకుడు రాము సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయనతో నేను త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతున్నాను. మంచి కథ తయారు చేసుకోమని చెప్పాను. ఆ సినిమా అనౌన్స్ మెంట్ కూడా త్వరలో చేస్తాం. అన్నారు.

దర్శకుడు టి.రాము మాట్లాడుతూ – అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన మిత్రులు అందరికీ థ్యాంక్స్. మీరంతా నా బలం. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సినిమా కోసం మా టీమ్ బాగా సపోర్ట్ చేశారు. నా మీద మా నిర్మాత రాంరెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. ఆయన ఈ రోజు ట్రైలర్ లాంఛ్ కు రాలేకపోయారు. ప్రస్తుతం మా మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అక్టోబర్ , నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలలు లేని సముద్రం అనే టైటిల్ కు జస్టిఫికేషన్ ఇచ్చేలా మూవీ ఉంటుంది. నా దర్శకత్వంలో మరికొన్ని మూవీస్ రాబోతున్నాయి. అన్నారు.

నటీనటులు – వసంత్, భాగ్యలక్ష్మి, రమ్య, సురభి ప్రియాంక, సురభి వీణ, సురభి అరుణాదేవి, సురభి శేషుకుమారి, సురభి జ్యోతి, సుందరమ్మ, రోజారాణి, తదితరులు

టెక్నికల్ టీమ్
——————

మేకప్ – నారాయణ
ఆర్ట్ – చౌదరి
ఎడిటింగ్ – వేణు చౌదరి
కెమెరా – పి.నారాయణ
సంగీతం – అనిల్ కుమార్
నిర్మాణ నిర్వహణ – రామశర్మ, చీరాల శ్రీనివాస్
రచన, దర్శకత్వం – టి.రాము

Shloka Productions ‘Black Night’ Movie Songs & Trailer Launched held grandly

శ్లోక ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేశ్వర రావు నిర్మాతగా సతీష్ కుమార్ రచనా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్లాక్ నైట్. ఈ చిత్రానికి మధు కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా విజయ్ బొల్లా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్షయ్, మదన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ ను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ... “అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆల్ ద బెస్ట్. ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోసారి వింటేజ్ రోజుల తరహా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ తరానికి తగ్గట్లు మరోసారి అటువంటి సినిమాలను తీసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

పితాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... “ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ లాంచ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇటీవల కాలంలో ఇటువంటి దైవాత్మక సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. చిత్ర సాంగ్స్, టైలర్ ఎంతో బాగున్నాయి. చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చే వారిని మనం ప్రోత్సహించి అండగా నిలబడాలి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు విజయ్ బొల్లా మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో చేసేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో ఛాలెంజింగ్ తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. సాధారణంగా ఇటువంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ సినిమా కోసం మా దర్శకుడు నా వెంట ఉండి చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి అందించిన మా నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటుడు ఆకాష్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా గురించి ముందుగా నిర్మాతకు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి చాలా థాంక్స్. నాతోపాటు నటించడం మధన్, ఇంకా ఇతర నటీనటులు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. ఈ సినిమాకు విజయ్ బొల్లా గారి సంగీతం ఎంతో బలాన్ని చేకూర్చింది. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు మదన్ మాట్లాడుతూ… “ఈ సినిమాకు సపోర్ట్ గా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన వారంతా కొత్త వారిమే. కొత్త వారంతా ఓ చిన్న సినిమా తీసి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది ఎంతో గొప్ప విషయం. చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు డైరెక్టర్ పై ఎంత నమ్మకం ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చింది. సినిమాని పెద్ద విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ... “ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా చేసేందుకు నిర్మాత వెంకటేశ్వరరావు గారు అడిగినంత బడ్జెట్ ఇచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత సపోర్ట్ ఇచ్చారు. అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను సాధారణంగా రైటింగ్ చేస్తూ ఉంటాను. అటువంటిది తొలిసారి అనుకోకుండా నిర్మాతగా మీ ముందుకు వచ్చాను. సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకులు, నటులు ఆకాష్, మధన్ నా స్టూడెంట్స్. ఈ సినిమా అంతా రియల్ లొకేషన్ లో షూటింగ్ చేయడం జరిగింది. అలాగే యువత కోసం e ఈ సినిమాలో మంచి పబ్ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ సినిమాని అందరూ అభిమానించి మంచి విజయాన్ని అందజేస్తారని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

‘Dhun’ song Releasing Tomorrow from Yash Raj Films and Mohit Suri’s ‘Saiyaara’ Movie

సయారా’ నుంచి రానున్న ‘ధన్’ కోసం అర్జిత్ సింగ్, మిథున్, మోహిత్ సూరి సంగీత త్రయం తిరిగి వచ్చింది. ఈ ముగ్గురూ హిందీ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద చారిత్రాత్మక చార్ట్‌బస్టర్‌లను సృష్టించారు. ఆషికి 2 నుంచి ‘తుమ్ హి హో’ వంటి గీతాన్ని ఈ ముగ్గురూ కలిసి సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

‘సమయం కలిసి వచ్చినప్పుడు ఓ మాయాజాలం జరుగుతుందని చెబుతుంటారు. నా జీవితంలో మిథున్, అరిజిత్ సింగ్‌ వంటి వారు నాకు దొరకడం అదృష్టం. మన దేశంలోని ఈ ఇద్దరు కళాకారులతో నా ఉత్తమ సంగీతాన్ని సృష్టించే అదృష్టం నాకు కలిగింది. మిథున్ మరియు నా సహకారం, నేను కలిసి 2005లో ‘జెహెర్’, ‘కలియుగ్’ సినిమా చేశాం. మా ఇద్దరి జర్నీ మొదలై 20 సంవత్సరాలు అయింది. 2005 నుంచి మిథూన్‌తో కలిసి ‘మర్డర్ 2’, ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’, ‘హమారి అధూరి కహానీ’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘మలంగ్’ వంటి చిత్రాలు చేశాము. మేం ఎన్నో కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ పాటల్ని అందించాం.

“మిథున్, నేను కలిసి పనిచేసినప్పుడల్లా గొప్ప ట్రాక్ అందించాలని ప్రయత్నిస్తుండేవాళ్లం. మా మీద ఎప్పుడూ పెద్ద అంచనాలుంటాయి. ఆ ఒత్తిడిని మేం ఆస్వాధిస్తుంటాం. అర్జిత్ సింగ్ నాకు ఈ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాలను ఇచ్చిన గాయకుడు. ‘ఆషికి 2’ నుంచి ‘తుమ్ హి హో’, ‘చాహున్ మై యా నా’, ‘హమ్ మార్ జాయేంగే’, ‘ఏక్ విలన్’‌లోని ‘హమ్‌దార్ద్’, ‘హమారీ అధూరి కహానీ’ టైటిల్ ట్రాక్ వరకు, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌’లోని ‘ఫిర్ భీ తుమ్కో చాహుంగా’, ‘మలాంగ్‌’లోని ‘చల్ ఘర్ చలేన్’ వంటి పాటలెన్నో క్లాసిక్‌గా నిలిచాయి.

మిథున్, అరిజిత్, నేను కలిసి పని చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తుండిపోయే పాట ఇవ్వాలని కోరుకుంటారు. ప్రజల్లో మాపై ఉండే అంచనాల గురించి తెలుసు. మేము ముగ్గురం మళ్ళీ ‘సయారా’లో ‘ధన్’ కోసం జతకట్టాం. ఈ ట్రాక్ మాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేమలో, జీవితంలో జరిగే పోరాటాన్ని జరుపుకునే పాట. జీవితం పూల పాన్పు కాదు. ధన్ అనే పాట స్పూర్తిని నింపేలా ఉంటుంది’ అని మోహిత్ సూరి అన్నారు.

‘సయారా’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన నాలుగు పాటలు చార్ట్ బస్టర్‌లు నిలిచాయి. ఇక ఇప్పుడు ‘ధన్’ అనే పాటను రిలీజ్ చేయబోతోన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో అహాన్ పాండేను హీరోగా పరిచయం చేయనున్నారు. అనీత్ పడ్డా హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సయారా సినిమాను అక్షయ్ విధాని నిర్మించారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 “DEEKSHA” Movie Worldwide Grand Theatrical Release This July

ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్య రెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్సా ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలైలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా “ఆర్కే దీక్ష” సినిమాకు సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ పూర్తి అయ్యాయి. జూలై మొదటి వారంలో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి జూలై నెలాఖరుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. ప్రతి మనిషికి దీక్ష అనేది అవసరం. ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడిగా నాకు ఇది 8వ సినిమా. నిర్మాతగా 50 చిత్రాలకు చేరువవుతున్నాను. “దీక్ష” సినిమా నాతో పాటు మా హీరో కిరణ్, హీరోయిన్ అక్సాఖాన్ ఇతర టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. మధుప్రియ మూడు పాటలు పాడింది. మొత్తం సినిమాలో ఐదు హిట్ సాంగ్స్ ఉన్నాయి. హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇందులో హీరోయిన్ ను కాపాడే సీన్ లో భీముడి పాత్రలో ఆయన చెప్పిన లెంగ్తీ డైలాగ్ హైలైట్ అవుతుంది. అలాగే అక్సాఖాన్ తన నటనతో పాటు ఈ చిత్రంలో ఓ అదిరిపోయే పాట చేసింది. ఈ పాటలో ఆమె డ్యాన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి రోహిత్ శర్మ అనే ఒక విలన్ ను తీసుకున్నాం. అతని విలన్ గా ఫెరోషియస్ గా నటించాడు. తులసి మరో కీ రోల్ చేసింది. మా మరో ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా కంప్లీట్ చేశాక మహిళా కబడ్డీ అనే చిత్రాన్ని రూపొందించబోతున్నాం. “ఆర్కే దీక్ష” సినిమాను మీరంతా ఆదరిస్తారని, మా టీమ్ కు మంచి గుర్తింపు అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ – “ దీక్ష” చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. టైటిల్ కు తగినట్లే ఆర్కే గౌడ్ గారు ఈ చిత్రాన్ని ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన తన పట్టుదల వల్లే టీఎఫ్ సీసీ ఛైర్మన్ గా తెలంగాణ సినిమా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అక్సాఖాన్ బాగా నటించింది. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఫైట్ మాస్టర్ రవితో పాటు మా డీవోపీ..ఇలా ప్రతి టెక్నీషియన్ కష్టపడి పనిచేశారు. నాకు నటనే జీవితం. ఎప్పుడూ సినిమా ఆలోచనే ఉంటుంది. ఆర్కే గౌడ్ గారికి మూవీ మేకింగ్ లో పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఏ రోజు అనుకున్న సీన్స్ ఆ రోజు తీసేవారు. అందరం పంక్చువల్ గా పనిచేశాం. “ఆర్కే దీక్ష” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. మా టీఎఫ్ సీసీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనుకుంటున్నాం. నెక్ట్స్ మూవీ మహిళా కబడ్డీలో కూడా కీ రోల్ చేస్తున్నా అన్నారు.

హీరోయిన్ ఆక్సాఖాన్ మాట్లాడుతూ – ” దీక్ష” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఆయన సపోర్ట్ ను మర్చిపోలేను. హీరో కిరణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న కిరణ్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ చేశాను. ఆ పాటలో సాంగ్స్ మీకు బాగా నచ్చుతాయి. తులసీ చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ” దీక్ష” సినిమా కోసం ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడి పనిచేశారు. నన్ను ఢీ షో నుంచి ఎలా ఆదరించారో…ఈ సినిమాతోనూ అలాంటి సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రాన్ని ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో పి. అశోక్ కుమార్, ఆర్ కె గౌడ్ నిర్మించారు.