Home Blog Page 965

Producer Vishwanath Tanneru Turning as Director

 సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల  “యమ్ 6” వంటి  సస్పెన్స్  థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి  మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో  విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా  ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.

ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ….
ఈ క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు . సినిమా మీద ప్యాషన్ తో ఈరంగం లోకి వచ్చిన నేను  “యమ్ 6”  సినిమా తో నిర్మాతగా మారా . ఐతే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది . ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా . చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది . కంటెంట్ ఆధారం గా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది . అలాగే  ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి  మెసేజ్ కూడా ఇస్తున్నాం . ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది . ఈ సినిమా లో హీరోగా మా గత చిత్రం “యమ్ 6 “లో హీరో గా చేసిన ధ్రువ ను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది . ఈ  క్యారెక్టర్ కి తను బాగా మ్యాచ్ అవుతాడు . ఈ సినిమా ఫిబ్రవరి నెల మొదటి వారం హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నారు . రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం  మొదలగువారు నటిస్తున్నారని తెలిపారు.

హీరో ధ్రువ మాట్లాడుతూ...
M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ వినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.

ఆర్టిస్ట్స్:
హీరో ధ్రువ, రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం

టెక్నీషియన్స్:
కథ , మాటలు:వేమగిరి , మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల
పాటలు :మౌనశ్రి మాలిక్
ఎడిటింగ్ : సోమేశ్వర్ పోచం
పిఆర్ఓ: మధు. విఆర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ : గుర్రపు విజయ్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు

Heroine Payal Rajputh interview about Disco Raja Movie

‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది పంజాబీ భామ ‘పాయల్ రాజపుత్’. ఇటీవల విడుదలైన ‘వెంకీ మామ’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది..ప్రస్తుతం ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై మాస్ మాహారాజ రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో,రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి లు నిర్మించిన  స్కైఫై థ్రిల్లర్ చిత్రం ‘డిస్కో రాజా’సినిమాలో నభా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ మీడియా తో ముచ్చటించింది. ఆ విశేషాలు..

–ఈ సినిమాలో నేను మొదటి సారిగా హెలెన్ అనే మూగ మరియు చెవిటి అమ్మాయి క్యారెక్టర్ చేశాను. మూవీ లో నా పాత్ర నిడివి కాస్త తక్కువే..అయినప్పటికీ ఒక ముఖ్యమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నాను. ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా ఫీలై చేశాను. కథాబలమున్న మంచి సినిమాతో కొత్త ఏడాది ఆరంభమవ్వడం ఆనందంగా ఉంది. సినిమాలో నా పాత్ర నిడివి తక్కువైనా వైవిధ్యమైన నటనను కనబరిచానని అందరూ ప్రశంసిస్తున్నారు.

–మాటలతో కాకుండా సైగల ద్వారా మన భావాల్ని ఎదుటివారికి వ్యక్తం పరచడం అంత‌ ఈజీ కాదు. చాలెంజింగ్ గా భావించి సైన్ లాంగ్వేజ్ లో తగిన శిక్షణ తీసుకొని ఈ పాత్రలో నటించాను. హావభావాల విషయంలో తప్పులు దొర్లకుండా ప్రత్యేకంగా ట్యూటర్ ని పెట్టి నా పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కించారు దర్శకుడు,

— సినిమా షూటింగ్ లో ఉండగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ నన్ను కలిసి ఈ కథ వినిపించారు. కథ చెప్తున్నప్పుడే తర్వాత ఏం జరుగబోతుందోనని ప్రతిక్షణం ఎగ్జైటింగ్ గా ఫీలయ్యాను. అలాగే నా కెరీర్ లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్అవుతుందనే నమ్మకంతో నిడివి గురించి ఆలోచించకుండా అంగీకరించాను.

— ఈ సినిమాతో రవితేజ గారు నాకు టీచర్ గా మారిపోయారు. ఓకే గైడ్ గా, స్నేహితుడిగా నా కెరీర్ కి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలిచ్చారు. కథ పరంగా ఈ సినిమాలో రెట్రో లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. దాని కోసం మా అమ్మగారి సలహాలు తీసుకున్నాను. 1980 కాలంనాటి హెయిర్ స్టైల్, వస్త్రధారణ, భావవ్యక్తీకరణ ఎలా ఉంటుందో అమ్మ ద్వారా తెలుసుకొని నటించాను. ఆ లుక్ లో నన్ను చూసి మా అమ్మ చాలా అందంగా కనిపిస్తున్నావు అలాగే చక్కగా నటించావు అని మెచ్చుకుంది.

–పరదీప్ దర్శకత్వంలో ఒక విమెన్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను. ఆ సినిమాలో నేను ఐ పి ఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాను. షూటింగ్ పూర్తయింది. అలాగే ఉదయనిధి స్టాలిన్ సినిమాతో ఈ ఏడాది తమిళంలో అరంగేట్రం చేయబోతున్నాను. అలాగే ఒక కన్నడ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను ఇంకా ఫైనల్ కాలేదు ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు పాయల్ రాజపూత్.

Heroine Nabha Natesh interview about Disco Raja Movie

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నేటి యువతకు కావాల్సిన అందం, అభినయం రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకుంది నభా నటేష్.. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది.ప్రస్తుతం ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై మాస్ మాహారాజ రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో,రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి లు నిర్మించిన  స్కైఫై థ్రిల్లర్ చిత్రం ‘డిస్కో రాజా’సినిమాలో నభా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్‌ చెప్పిన విశేషాలు….

ఈ చిత్రంలో నేను నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కనిపిస్తాను. ఇంతకుముందు నేను చేసిన పాత్ర లతో పోలిస్తే ఈ క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎమోషన్స్‌కు విలువ ఇచ్చే అమ్మాయి పాత్ర‌. నా నిజ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది.

రవితేజగారి ‘విక్రమార్కుడు’ నా ఫెవరెట్‌ మూవీ. `కిక్‌` సినిమా కూడా ఇష్టమే. ఆయనకు నేను బిగ్‌ ఫ్యాన్‌ని. రవితేజగారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్ర‌జెన్స్‌ చాలా బాగుంటాయి. రవితేజగారితో వర్క్‌ చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. సెట్స్‌లో కేవలం సినిమాల గురించే కాదు..జీవనశైలి, ఆహారపు అలవాట్లు..ఇలా చాలా విషయాల గురించి ఆయన మాట్లాడుతుంటారు. షూటింగ్‌ చాలా ఫన్నీగా
గడిచిపోయింది. ఈ సినిమాలో రవితేజగారి రోల్ గురించి నేను ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు.
థియేటర్స్‌లో ఆడియన్స్‌ ఈ థ్రిల్‌ను ఫీల్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. మాస్‌ స్కైఫై థ్రిల్లర్‌కు
రవితేజగారి ఎనర్జీ, వీఐ ఆనంద్‌గారి స్టైల్‌ తోడైతే ఎలా ఉంటుందో డిస్కోరాజా అలా ఉంటుంది.
ఆడియన్స్‌కు తప్పక నచ్చుతుంది.

ఈ సినిమా కథ విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆనంద్‌గారి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి
ఉంటుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యే అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లతో నాకు కాంబినేషన్ సీన్స్‌ లేవు. మేజర్‌గా అన్నీ రవితేజ, ‘సత్యం’ రాజేష్, నరేష్‌గారితోనే ఉన్నాయి.* *కెరీర్‌ మొదట్లోనే నటనకు ఆస్కారం ఉండి, ఢిపరెంట్‌ పాత్రలు చేసే అవకాశాలు నాకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నేను థియేటర్స్‌ ఆర్టిస్టును కాబట్టి నాకు అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది.

కెరీర్‌ పరంగా 2019 నా బెస్ట్‌ ఇయర్‌. `ఇస్మార్ట్‌శంకర్‌` కిక్‌ ఇంకా ఉంది. ఎక్కడికి వెళ్లిన ఆ పాటలు, డైలాగ్స్‌ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రేక్షకులు ఆదరణ కూడా ముఖ్యమే. యంగ్‌ హీరోయిన్స్‌ మధ్య పోటీ ఉండొచ్చు. అందరు బాగా నటిస్తున్నారు. నేనూ ఇంకా కష్టపడాలనుకుంటున్నాను.

ప్రస్తుతం సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్‌ గా నటిస్తున్నాను. అలాగే కన్నడ, తమిళ చిత్రాలు చేయడానికి కథలు వింటున్నాను.

Right Right Buggy Gopal Biopic Movie Released on February 28th

ఒక సామాన్య    బస్ కండెక్టర్ నుండి ఏంఎల్ఏ గా….
బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...
అందరికి నమస్కారం. సుమన్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది, ఆయన నటిస్తోన్న ఈ బగ్గిడి గోపాల్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న. చిన్న నిర్మాత చేస్తున్న ఈ సినిమాకు మా అందరి సపోర్ట్ ఉంటుంది. బయోపిక్ లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి, అలాంటి నేపథ్యంలో వస్తోన్న ఒక బయోపిక్ సినిమా ఇది. బగ్గిడి గోపాల్ అనే బయోపిక్ లో ఒక సామాన్య బస్ కండెక్టర్ ఏంఎల్ఏ గా ఎలా ఎదిగాడు అనే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సుమన్ గారు ఈ మూవీలో ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని తెలిపారు.

సుమన్ మాట్లాడుతూ
ఒక సామ్యన్య బస్ కండెక్టర్ పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు అనే అంశం ఈ సినిమాలో బాగా చూపించారు డైరెక్టర్ అర్జున్ కుమార్. ఈ సినిమా కథ ఆదర్శంగా ఉంటుంది. నేను ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి రోల్ లో కనిపిస్తాను. కొత్త నిర్మాత అయిన  బగ్గిడి గోపాల్ ఈ సినిమాను బాగా తీశాడు, డైరెక్టర్ అర్జున్ కుమార్ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించారు. రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా ఉండబోతొంది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ...
1982 లో మార్చి లో రాజకీయాల్లో జరిగిన కొన్ని కీలక మార్పులు జరిగాయి. అదే రోజు నేను ఎన్టీఆర్ తో పాటు నడవడం జరిగింది. తాను పెట్టిన టిడిపి పార్టీలో నేను చేసిన కృషి , సేవలు ఈ బగ్గిడి గోపాల్ చిత్రంలో చూపించడం జరిగింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా విడుదల కాబోతొంది. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నాము. ఈ సినిమాను మా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా గురించి, నా జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు ఈ మూవీలో చెప్పడం జరిగిందని తెలిపారు.

ఎక్స్ ఎమ్ఎల్ఏ  సంజయ్ రావు మాట్లాడుతూ.
బగ్గిడి గోపాల్ గారు ఎమ్ఎల్ఏ అయిన తరువాత జరిగిన అన్ని సంఘటనలు నాకు తెలుసు. ఆయన చేస్తున్న బగ్గిడి గోపాల్ సినిమాలో నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి  అయిన బగ్గిడి గోపాల్ ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు.  ఇలాంటి అనేక అంశాలు ఈ బగ్గిడి బయోపిక్ లో పెట్టడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ చందన మాట్లాడుతూ...
అందరికి నమస్కారం. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు. నాకు ఈ మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ ఇష్టం, ప్రధానంగా గోపాలన్న సాంగ్ నాకు ఇష్టమని తెలిపారు.

డైరెక్టర్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ...
నేను ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యడంతో పాటు ఒక పాత్రలో నటించాను. బగ్గిడి గోపాల్ గారు నిజాయితీ కలిగిన వ్యక్తి, ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాము, ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము, మా సినిమాకు మీడియా అందరి సపోర్ట్ కావాలని కోరారు.

బ్యానర్: బగిడి ఆర్ట్ మూవీస్
సినిమా: బగిడి గోపాల్
ఆర్టిస్ట్స్: సుమన్, కవిత, ప్రభావతి, మహేష్, తేజ
హీరో: రమాకాంత్
హీరోయిన్: సిరి చందన
డైరెక్టర్: అర్జున్ కుమార్
ప్రొడ్యూసర్: బగిడి గోపాల్
కెమెరామెన్: ప్రవీణ్ కుమార్
స్టంట్స్ & కోడైరెక్టర్: అవిష్ పూరి
మ్యూజిక్: జయసూర్య బుప్పేం
పిఆర్ఓ: మధు.విఆర్

Hero Sreekanth New Movie Marana Mrudangam Launched

ఫ్యామిలీ స్టార్ హీరో శ్రీకాంత్ ని యాక్షన్ రివెంజ్ స్టార్ గా చూపిస్తూ లక్ష్మి రెడ్డి రెబ్బ సమర్పణలో మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్ పై వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలోమధు రెబ్బ, చిరంజీవి వబ్బిలిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం”మరణమృదంగం”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో 27-01-2020 సోమవారం
ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ నివ్వగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మరణమృదంగం” దర్శకులు
ఎ.కోదండ రామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటిసన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరంఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… నాకు చాలా ఇష్ట‌మైన టైటిల్‌తో నా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెంక‌టేష్ రెబ్బ మొద‌టిసారి క‌థ చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ ని బ‌ట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ప‌క్కా ప్లానింగ్‌తో అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసి విడుద‌ల చేస్తాం. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అనిల్‌రావిపూడిగారికి, కోదండ‌రామిరెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు” అన్నారు.

డైరెక్ట‌ర్ వెంక‌టేష్‌రెబ్బ మాట్లాడుతూ… శ్రీ‌కాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయ‌న సినిమాకే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అనే నా అదృష్టంగా భావిస్తున్నాను. రైట‌ర్ తుల‌సీ దాస్‌గారు మంచి క‌థ‌ని అందించారు. నాకు స‌పోర్ట్ చేస్తున్న ప్రొడ్యూస‌ర్ మ‌ధురెబ్బ‌గారికి ధ‌న్య‌వాదాలు” అన్నారు.

ప్రొడ్యూసర్ మ‌ధురెబ్బ‌ మాట్లాడుతూ – “తపన అందరి డైరెక్టర్స్ కి ఉంటుంది కానీ తపనతో పాటు క్రియేటివ్ ఆలోచనలు టెక్నాలజీ పై అవగాహన మేకింగ్ కంఫర్బులిటి కొందరికే ఉంటాయి. అలాంటి దర్శకుడు మా వెంకటేష్ రెబ్బ, అతను చెప్పిన కథ కథనం నచ్చి శ్రీకాంత్ గారితో ఈ సినిమా నిర్మిస్తున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

సాంకేతిక నిపుణులు:
కథ; స్క్రీన్ ప్లే; దర్శకత్వం : వెంకటేష్ రెబ్బ,
నిర్మాతలు : మధు రెబ్బ, వబ్బిలిశెట్టి చిరంజీవి.
సహా నిర్మాతలు : పాల వలన గౌరీ శంకర్, M. N. రాజు
కథ,మాటలు: డి. తులసి దాస్,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు,
డి ఓ పి: G.L.బాబు,
సంగీతం: మంత్ర ఆనంద్,
ఫైట్స్ P.సతీష్,
ఆర్ట్:మధురెబ్బ,

Anukunnadhi Okkati Ayyindhi Okkati Movie Releasing on February 7th

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘వీరి నాయుడుగారి అబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి ఈ సినిమా చేశాం. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.

నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, రఘురామ్‌ ఎరుకొండ, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బడిజ, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

Dhanush’s ‘Local Boy’ to release in February

Dhanush has always had a versatile style of his own. He nailed it in the role of a middle-class man in ‘Raghuvaran B.Tech’. He impressed everyone as a local don in ‘Maari’. He was awesome in a dual role in ‘Dharma Yogi’. Dhanush is always at the forefront of moulding himself as per the character he is playing. This time, the talented actor is set to entertain the Telugu audience in a new kind of role.

‘Pattas’ (Tamil), directed by RS Durai Senthilkumar, is a Tamil-language martial arts film starring Dhanush as the lead man. Produced by Senthil Thyagarajan and Arjun Thyagarajan, this one has the ‘Krishnagaadi Veera Prema Gaadha’, ‘Mahanubhavudu’, ‘Raja The Great’, ‘F2’ and ‘Entha Manchivaadavura’ actress Mehreen as the female lead. Sneha is the other heroine. Naveen Chandra, who aced with his performance in ‘Aravindha Sametha’ and ‘Evaru’, has another key role in the movie. Released for Sankranthi, the film became a big hit in Tamil.

The Telugu version, titled ‘Local Boy’, is presented by Smt Jaganmohini on Vigneswara Entertainments. Produced by Ch Satish Kumar, the film’s First Look, released recently, has received a great response. The producer has said that ‘Local Boy’ will be released in the first week of February.

Talking about the movie, the producer said, “The film has a martial arts backdrop and is doing tremendously in Tamil. Dhanush’s performance has been hailed critically. He took special training to gain grip on martial arts. The film has familiar faces in its cast and so, you will see it as a straight Telugu movie. ‘Dharma Yogi’, the director’s movie, was a hit in Telugu. We are hoping that ‘Local Boy’ will be a bigger hit”.

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri
Audio: Lahari Music
Editing: Prakash Mabbu
Music: Vivek-Mervin
Cinematography: Om Prakash
Story, screenplay, direction: RS Durai Senthilkumar
Telugu release is by Vigneswara Entertainments by Ch Satish Kumar
Producers:Senthil Thyagarajan and Arjun Thyagarajan

Stalin Movie Releasing on February 7th

వైవిధ్యభరిత చిత్రాలనే కాదు మాస్ చిత్రాలను చేస్తూ ఆల్ రౌండ్ కధానాయకుడిగా జీవా పేరుపొందారు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతో దగ్గరయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం పేరు స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం భారీగా విడుదలకానుంది. ఇదే చిత్రం తమిళంలో సీరు పేరుతో విడుదలవుతుంది. రంగం చిత్రం తర్వాత ఆ స్థాయిలో తీయబడిన మాస్ చిత్రమిది. జీవా తన పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై…దాని ఎదుర్కొంటారు కధానాయకుడు జీవా. అందరికీ ఆప్తుడిగా మెలగుతూ చెడుపై పోరాటం చేసే పాత్ర ఆయనిది. ఇక నవదీప్ ప్రతినాయకుడిగా ఎంతగానో ఒదిగిపోయారు. కధానాయికలు తమ పాత్రలలో మెప్పిస్తారు. కధానాయిక రియా సుమన్ ఇప్పటికే తెలుగులో మజ్ను, పేపర్ బాయ్ చిత్రాల్లో నటించారు. 15 కోట్ల భారీ వ్యయంతో ఎక్కడ తగ్గకుండా కథ డిమాండ్ కు అనుగుణంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో ఆడియోను విడుదల చేయనున్నాం. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: శ్రీ సాయి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, గురుచరణ్, సంగీతం: డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్, ఎడిటింగ్: దుర్గేష్, నిర్మాతలు: డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: రతిన శివ

Sharwanand New Movie Sreekaram First Look Launch

Young hero Sharwanand’s latest flick titled Sreekaram is in the last leg of shooting which is happening in & around Hyderabad.

Sharwanand is romancing Gang Leader fame Priyanka Arul Mohan in this family entertainer being directed by Kishore B.

Today, makers have unveiled first look poster and also announced to release the film in summer.

In the first look poster Sharwanand as a farmer is seen in Lungi walking through paddy fields. Sharwa looks handsome here and the beautiful poster demonstrates the story is set in rural backdrop.

Sreekaram is produced by Ram Achanta and Gopi Achanta of 14 Reels Plus Banner. This is their 2nd production after the blockbuster Gaddalakonda Ganesh.

Micky J Meyer who gave wonderful tunes for Gaddalakonda Ganesh is working for Sreekaram as well. J Yuvraj is handling cinematography while dialogues are penned by Sai Madhav Burra and Art by Avinash.Kolla.

Cast: Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Amani, Sr Naresh, Sai Kumar, Murali Sharma, Satya, Sapthagari etc.

Technical Crew:
Producers: Ram Achanta, Gopi Achanta Director: Kishore.B
Music: Mickey J Mayer
Dop: J.Yuvraj
Dialogues: Sai Madhav burra
Art: Avinash Kolla
Editor: Marthand K Venkatesh
Executive Producer: Harish Katta

Sudheerbabu New Movie V First Look Launch

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నారు. అలాగే సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ను ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నారు. నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలువ‌నున్నాయి.
 హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. సోమ‌వారం సుధీర్‌బాబు లుక్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం నేచుర‌ల్‌స్టార్ నాని లుక్‌ను  విడుద‌ల చేయ‌నుంది. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.
న‌టీన‌టులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ:  పి.జి.విందా
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి