Home Blog Page 964

Ala Vaikunthapurramuloo Thanks Meet

చిరంజీవి గారు ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు” అని చెప్పారు స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది.ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.

ఇంత పెద్ద‌ హిట్టయినందుకు ఎలా ఫీలవుతున్నారు?
అల్లు అర్జున్: ఇది నా విక్టరీ కాదు ఆడియ‌న్స్ నాకిచ్చిన ఒక అప్రిసియేషన్ టోకెన్ లాంటిది. ఒక సినిమా రికార్ఢ్ సాధించింది అంటే అది హీరో ర్యాంకు కాదు ప్ర‌జ‌లు ఆ సినిమాకి ఇచ్చిన ర్యాంకు. టాప్ టెన్ రికార్డ్స్ తీసుకుంటే ఆ సినిమాల్లో ఏ హీరో ఉంటే అది ఆ హీరో ర్యాంక్ కాదు. ప్ర‌జ‌లు ఆ సినిమాని అంతగా ఇష్టపడ్డారు అని అర్థం. అందులో సినిమా కూడా ఉండ‌టం చాలా సంతోషంగా ఉంది.అల్లు అరవింద్ కలెక్షన్ల గురించి హీరోకు, డైరెక్టరుకు తెలియకపోవచ్చు. ఎందుకంటే రోజు ఫిగర్లు చూసుకొని ఆనంద పడేది మేము. సినిమా ఎంత బాగా వచ్చింది అని చూసుకొని వాళ్లు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు అవుతుందనేది చూసుకునే దగ్గర మేము మొదలవుతాం.

చాలా రోజుల తర్వాత రికార్డ్స్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. దీని మీద మీరేమంటారు?
అల్లు అర్జున్: ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డు ఫిలిం పడుతూ ఉంటుంది. నాకు ఇదివరకు ఒక రికార్డు ఫిలిం పడింది కానీ ఓవరాల్ గా అన్నిచోట్ల పడలేదు. నాన్నకు గీతా ఆర్ట్స్ లో దాదాపు 10 ఆల్టైమ్ రికార్డు సినిమాలు పడ్డాయి. చిరంజీవిగారితో చాలా సినిమాలు, గజినీ, మగధీర వంటి సినిమాలు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త విషయం కాదు. నాన్న గారితో ఫస్ట్ టైం రికార్డు కొట్టడం ఒక కొడుకుగా సంతోషంగా ఉంది. దట్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్. మళ్ళీ మేము ఇంకోసారి రికార్డు కొట్టొచ్చు కానీ ఇంత ఆనందం రాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ వెరీ స్పెషల్. ఐ ఆల్వేస్ చెరిష్ ఇట్. మా ఫాదర్ తో రికార్డు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక. దీనికి కారణమైన అందరికీ మరోసారి థాంక్స్. ప్రత్యేకించి త్రివిక్రమ్ గారికి.

త్రివిక్రమ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు ఈ స్థాయి హిట్ అవుతుంద‌ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా?
అల్లు అర్జున్: మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో ఆయన ఒక డైలాగ్ రాశారు. అది క‌చ్చితంగా నిజం. నిజంగానే ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది. ఆ స్థాయికి తగ్గట్టు నేను ఈ ప్రయాణం నడిపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ఇంత చేస్తుందని నాకు తెలియదు. ఏ సినిమాకీ తెలియదు, ఎవరు చెప్పలేరు. ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని నేను పని మాత్రం చేశాను. జనాలు దాన్ని అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అబద్ధం. త్రివిక్రమ్ గారు చెప్పిన వెంటనే ఇది గోల్డ్ మైన్ అవుతుందని మాత్రం ఇది నేను చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేమిద్దరం సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం. మేము మా పని చేశాం. అది జనానికి వచ్చింది.

ఈ సినిమా సక్సెస్ విషయంలో మీ ఫ్యాన్స్ కి ఎంత రేషియో ఇస్తారు? జనరల్ ఆడియన్స్ కి ఎంత రేషియో ఇస్తారు?
అల్లు అర్జున్: హానెస్ట్ గా చెప్పాలంటే దాని విడదీసి చెప్పలేం. చూసిన వాళ్ళలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, జనరల్ ఆడియెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేం. మా కనెక్షన్ లో లేని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ అంటే గొడవ చేసే వాళ్ళు బ్యానర్లు కట్టే వాళ్ళు కాదు. కామ్ గా, అడ్మైరింగ్ గా ఉండే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కిందే లెక్క. ఎంతమంది ఫ్యాన్స్ కి నచ్చింది, ఎంత మంది అడ్మైరర్స్ కి నచ్చింది, ఎంతమంది కామన్ పీపుల్ కి నచ్చింది అనేది విడదీసి చెప్పలేం. ఒకటి మాత్రం ఖాయం. ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా, సినిమా నచ్చితే స్టుపెండస్ సక్సెస్ చేస్తారు. అందరికీ సినిమా నచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ఫర్ దట్‌.

ఈ సక్సెస్ క్రెడిట్ మీరు ఎక్కువగా ఎవరికి ఆపాదిస్తారు?
అల్లు అర్జున్: సినిమా అనేది ఎంటైర్ టీం వర్క్. ఒకరి పేరు చెప్పాల్సి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. నిజానికి నేను ‘నా పేరు సూర్య’ చేసిన తర్వాత వక్కంతం వంశీ గారు, నేను, బన్నివాసు కలిసి ఉన్నప్పుడు ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వక్కంతం వంశీ గారు త్రివిక్రమ్ గారి పేరు సూచించారు. ఆయనతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పారు. ఆయన మాటల్లో ఒక పల్స్ కనిపించింది. నా మైండ్ లో ఆయనే త్రివిక్రమ్ తో గారితో చేయాలని ఐడియా వేశారు.

ఈ సినిమాతో మీకు పర్ఫార్మర్ గా కూడా ఒక మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. దానికి ఎలా ఫీలవుతున్నారు?
అల్లు అర్జున్: ఈ సినిమా విడుదలైన మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారని నాకు అసలు తెలియదు. అది 100% త్రివిక్రమ్ గారు నా మీద వేసిన ట్రిక్. ఆయన ఒకటన్నారు.. ‘మీకు తెలియకుండా మీతో బాగా చేయించాలని నేను ఫిక్స్ అయ్యాను’ అని. నా పర్ఫామెన్స్ కి ఇంత అప్రిసియేషన్ వస్తుందని నా రిమోట్ ఇమేజినేషన్ లో కూడా లేదు. నేను త్రివిక్రమ్ గారి తో కూడా అన్నాను, ‘ఏం సార్ నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను షాక్ లో ఉన్నాను’ అని. నా చేత ఎలా చేయించారనేది ఆయన చెప్తారు. నాతో ఆయన చేయించారు. నేను ఏం చేశాను అని ఆలోచించే లోపే అందరూ అదిరిపోయింది అన్నారు. ఏం మాయ చేసారు సార్ మీరు?
త్రివిక్రమ్: నాకే తెలియదు సార్.
అల్లు అరవింద్: సినిమా చూశాక ‘బన్నీ నీ ఫీలింగ్ ఏంటి?’ అని నేను అడిగాను. ‘ఇది త్రివిక్రమ్ మాయ డాడీ’ అని అన్నాడు.
త్రివిక్రమ్: రుద్దినట్లు కాకుండా చాలా ఈజీగా చెప్పినట్లు ఉండాలని ట్రై చేశాను. కొన్ని సీన్లు ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో కొన్ని పాయింట్లు పెట్టుకున్నాము. తను చేసిన ఇంటర్వెల్ సీను నాకు సంబంధించినంత వరకు ఒక రిఫరెన్స్ పాయింట్. ప్రతి షాట్ ఒక ఫిలిం లాగా ట్రీట్ చేశాం. నేను ఏదైతే ఒక గ్రాఫ్ అనుకున్నానో, ఆ గ్రాఫ్ పట్టుకొని తాను చేసుకుంటూ వెళ్ళాడు.

ఈ గ్రాండ్ సక్సెస్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
త్రివిక్రమ్: నంబర్స్ అనేవి ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు కానీ, బన్నీకి కానీ అంకెల బదులు ఎంతమంది ఈ సినిమా చూశారా అనేది ఆనందాన్నిస్తుంది. ఎంతమందికి నచ్చింది అనే విషయం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆర్టిస్ట్ అయిన కోరుకునేది తన మాట ఎక్కువమందికి వినిపించాలని, ఎక్కువ దూరం చేరాలని. నేనైతే దాన్ని అలాగే చూస్తాను. ఇది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మొదలు పెట్టినప్పుడే తెలుసు. దీన్ని ఎంత కాంటెంపరరీగా తీస్తామనేది అనేది ముందు నుంచి కాన్షియస్ గానే ఉన్న విషయం.
అల్లు అర్జున్: త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ జనంలో చూశాను. మళ్లీ మేము కలిసి పనిచేస్తే ఆ ఆసక్తి అనేది ఉంటుందని అనిపించింది. నిజంగా హ్యాట్రిక్ అని అనుకోలేదు. మూడోదానికి రిథం సెట్ అయింది. బాల్ కనెక్ట్ అయి బౌండరీ దాటేసింది. ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు అనేది పెద్ద విషయం. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందన్నప్పుడు మనం మరింత ఎక్స్పరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయొచ్చు.

మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా?
అల్లు అర్జున్: బాహుబలి గురించి నేను ఇప్పటివరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళి గారికి పర్సనల్ గా మాత్రం చెప్పాను. బాహుబలి మూవీతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చినా కూడా అందుకు అతను అర్హుడు. మిర్చి లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను శాక్రిఫైజ్ చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే. మేడమ్ టుస్సాడ్స్ లో అతని స్టాచ్యూ పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. ప్రభాస్ కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు, రామ్ చరణ్ ఎక్కడ ఏమి మాట్లాడలేదు. మరి మీతో ఏం మాట్లాడారు?
అల్లు అర్జున్: చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు. ‘మీకు ఎక్కువగా నచ్చి అలా అంటున్నారేమో’ అని నేను అన్నాను. ‘లేదు లేదు నాకు తెలిసి పోతుంది, ఒక సినిమా ఏ లెవల్లో ఉంటుందనేది’ అని చెప్పారు. అలా చెప్పటం అంత ఈజీ కాదు. తను ఒక్కరే చూసినా ఎంత పీపుల్ పల్సులో ఆయన ఉన్నారో నాకు అర్థమైంది. ఒక సినిమా చూసి ఇది ఎంత చేస్తుంది అని చెప్పడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి! హి ఈజ్ రియల్లీ గ్రేట్.
త్రివిక్రమ్: మేమిద్దరం అయితే షాక్ తిన్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అన్నారేమో అనుకున్నాను. రామ్ చరణ్ నాతో మాట్లాడారు.

ఈ రికార్డ్స్ ని పక్కన పెడితే మూడు సినిమాల జర్నీలో త్రివిక్రమ్ గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి?
అల్లు అర్జున్: ప్రతి ఫిలింలో ఒక విషయం నేర్చుకున్నాను. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. మనం చేసే పనిపై ఓపెన్ గా, హానెస్ట్ గా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. డిటాచ్ అయ్యి అటాచ్ అవటం నేర్చుకున్నాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అది కూడా ఒక కీలకమని నమ్ముతున్నాను.

మీ అబ్బాయికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు?
త్రివిక్రమ్: దీనిపై అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కు ఒక వినతిపత్రం సమర్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.అల్లు అరవింద్: తండ్రి కొడుకులుగా ఫ్రెండ్స్ లా ఉంటాము. ప్రొఫెషనల్ గా వచ్చేటప్పటికి కొంచెం టైట్ గా ఉంటాను. చిరంజీవి గారి దగ్గరనుంచి ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోలందరికీ వారం రోజుల ముందే వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ వచ్చాను. అలాగే బన్నీ కూడా అది తప్పలేదు. వారం రోజుల ముందే పంపాను. అంటూ తమ యూనిట్ సంభాషణను ముగించారు.

Heroin Meharin interview about Aswathama

ఐరా క్రియేషన్స్‌ పతాకంపై యంగ్‌ హీరో నాగశౌర్య,మెహరీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ‘. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 31న విడుదలవుతుంది. చిత్ర యూనిట్‌ ప్రమోషనల్‌ కార్య క్రమాల్లో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన మెహరీన్ ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడింది. ఆ వివ‌రాలు..

— ఈ టైటిల్ కి సినిమాలో 100% జస్టిఫికేషన్ ఉంటుంది. ట్రైలర్ లో చూసిన మూమెంట్ప్‌ సినిమాలో చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. హీరో సిస్టర్ కి జరిగిన పెయిన్ ఫుల్ ఇన్సిడెంట్ తో హీరో జర్నీ బిగిన్ అవుతుంది.‘అశ్వథ్థామ` అంటే చెడుకు వ్యతిరేకంగా నిలిచేవాడు. ‘అశ్వథ్థామ` కంప్లీట్ గా సీరియస్ సినిమా కామెడీ లేదు, కమెడియన్స్ కూడా ఉండరు. ఫుల్‌ గ్రిప్పింగ్ గా ఉండే ప‌ర్‌ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి మన క్యారెక్టర్ కోసం కాకుండా మంచి సినిమాలో పార్ట్ అవ్వడం కోసం చేస్తాను. ఈ సినిమా అలాంటిదే.

–అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవ్వడం వల్ల సొల్యూషన్స్ వస్తాయని నేను అనుకోను. నా దృష్టిలో మనందరిలోనూ ‘అశ్వథ్థామ` ఉంటాడు. తనని మనందరం బయటికి తీసుకురావాలి. సినిమాలో విలన్ రోల్ ఫిక్షనల్ కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా పట్టించుకోకుండా ఉండే వాళ్ళంతా నా దృష్టిలో విలన్సేసినిమాలనేవి కేవలం మాధ్యమం మాత్రమే. మార్పు అనేది మనలో రావాలి.

–ఈ సినిమా నాగశౌర్యకి చాలా ఇంపార్టెంట్. త‌ను ఈ సినిమాలో నటించాడు అంతవరకే. ఆ తరవాత స్టోరీ నేరేట్ చేయడం దగ్గరి నుండి డైరెక్షన్ అంతా ర‌మ‌ణ‌ తేజ గారే చూసుకున్నారు.నాగశౌర్య ఫ్రెండ్ సర్కిల్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఇందులో నాగశౌర్య ఇన్వాల్వ్ మెంట్ లేదు. ఈ సినిమా నాకైనా, నాగశౌర్య కైనా కొత్తే. ఇలాంటి సినిమాలు ఇద్దరిలో ఎవరూ చేయలేదు. నాగశౌర్య కి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారబోతుంది.

–రీసెంట్ గా ఇక్కడ నేను న‌టించిన‌ ‘ఎంత మంచివాడవురా,తమిళంలో  ‘పటాస్’, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ప్ర‌స్తుతం తెలుగులో కొన్ని స్రిప్ట్స్ వింటున్నాను. ఇంకా ఏది ఫైన‌ల్ కాలేదు. ప్ర‌స్తుతం `అశ్వథ్థామ` రీలీజ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్‌చేస్తున్నాను .

Producer Raj Kandukuri interview about Choosi Choodangane

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ప్ర‌స్తుతం రాజ్ కందుకూరి నిర్మాత‌గా ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే`. శేష సింధు ద‌ర్శకురాలు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా జనవరి 31న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి ఇంట‌ర్వ్యూ..

నేను ఇప్పటివరకూ నా సినిమాల ద్వారా చాలా మంది కమెడియన్స్ తో పాటు టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం చేశాను, ఈవిషయం నేను ఈ రోజు గర్వంగా చెప్పుకోగలను. ఏ షూటింగ్ కి వెళ్ళినా అక్కడ నా సినిమాల ద్వారా పరిచయం అయిన వాళ్ళు కనీసం ఒక్కరూ ఇద్దరూ ఉంటున్నారు. వాళ్ళు నా మీద చూపించే ప్రేమ నాకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా ఆనందానికి సరితూగదు.

–మన దగ్గర లేడీ డైరెక్టర్స్‌ సంఖ్య చాలా తక్కువ. మా బేన‌ర్‌లో ఎలాగైనా ఒక‌ లేడీ డైరెక్టర్‌ని పరిచయం చేయాలనుకున్నాను. శేష సింధు చెప్పిన కథ నచ్చింది. ఆమెకు క్రిష్‌, సుకుమార్‌ల ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. కానీ నిన్ను నమ్మి సినిమా ఎలా ఇవ్వాలని అడిగాను. ఐదు నిమిషాల వీడియో షూట్‌ చేసి చూపించింది.దాంతో నమ్మకం వచ్చింది. ఈ సినిమాకు న‌టీన‌ట‌లు కూడా కొత్తవాళ్లే కావాలని అడిగింది.

–అప్పుడే మా అబ్బాయి ఇండియా వచ్చాడు. తనని సుమారు 12 రోజులు ఆడిషన్‌ చేసి హీరోగా తీసుకుంది. మా అబ్బాయి సినిమా అని స్పెషల్‌గా ఏం చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాం. సినిమా కంటెంట్ అందరికీ నచ్చుతుంది. విద్యార్థుల హృదయాల్ని తాకే మంచి సబ్జెక్ట్. ఇది ఒక కామన్ బాయ్ కథ ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ట్రైలర్ కి, పాటలకి కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ సినిమా విజయం పై నమ్మకం కలిగింది.

–మా అబ్బాయి కోసం ఓ పెద్ద దర్శకుడినే తీసుకురావొచ్చు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఓ సామాన్యుడిగానే తను తెరకు పరిచయమవ్వాలి. ఆ సినిమా చూశాక మంచి ఈజ్‌ తో చేశాడు నటుడిగా తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంటాడని ఓ తండ్రిగా నమ్మకం కలిగింది. తొలి సినిమా ఇంకా బయటకు రాకుండానే మూడు చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నాడు. తను నటించిన మరో సినిమా మార్చిలో విడుదలవుతుంది.

–మా బ్యానర్‌లో వచ్చే సినిమాల్లో అశ్లీలత, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉండవు. నా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలు బలంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమా కూడా క్రిస్పీగా ఉండేలా సురేష్ బాబు గారి స‌ల‌హా మేర‌కు 1:54 నిమిషాల నిడివి ఉండేలా ఎడిట్ చేశాం. నిర్మాతగా ఒక మంచి సినిమా తీశాన‌నే సంతృప్తి ఉంది.

–సరైన సినిమా తీయడానికి 50 కోట్లు అక్కర్లేదు. 3 కోట్లు చాలు. 50 కోట్ల సినిమా తీయడం కంటే చిన్న బడ్జెట్‌ సినిమాలు తీయడమే ఎక్కువ రిస్క్‌. ఆ రిస్క్‌ అంటే నాకు ఇష్టం. ఈ మధ్య లిప్‌లాక్స్‌ సన్నివేశాలు ఉంటేనే సినిమా హిట్‌ అవుతుంది అనుకుంటున్నారు. లిప్‌లాక్‌ సన్నివేశాలు సక్సెస్‌ ఇవ్వవు.

–ఇక నుండి మా బేన‌ర్‌లో ప్రతి సంవత్సరం ఒక సినిమా వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా బేన‌ర్‌లో తరువాత సినిమా ఏప్రిల్ నుండి మొదలవుతుంది అని అన్నారు .

Satyam Movie first schedule Completed in Talakona Forest

పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో  సంతోష్ బాలరాజ హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.సంతోష్ బాలరాజు

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.

Warner Bros Pictures to re-release “Joker” on Feb 14 in India

Earlier released on Oct 2, 2019, “Joker” starring Joaquin Phoenix, directed by Todd Phillips did tremendous business in the Indian market. Given the massive Oscar buzz around the film with a whopping 11 nominations including Best Actor, Best Film and Best Director and with Joaquin Phoenix bagging the Best Actor awards at both the Golden Globe and Star Actors Guild awards, Warner Bros. Pictures has decided to  o the film for the Indian audiences on February 14, four days after the Oscar awards.

While usually, Oscar-winning/ nominated films are re-released because they fail to do the anticipated business first time around, that’s not the case with Joker. While the film did extremely well at the box office in October, the makers believe that Joker being touted as the Oscar front runner, will not only draw newer audiences to the theater but also garner momentous repeat footfall by those who are all set to watch their favorite anti-hero one more time on the big screen.

Joker is going to re-release in cities of Mumbai, New Delhi, Bengaluru, Gurgaon, Noida, Chennai, Kolkata, Pune, Ernakulam, Hyderabad, Jaipur, Mysore, Ahmedabad, Coimbatore and more

Apart from Best Actor, Film and Director, Joker has also been nominated for Cinematography, Costume design, Sound mixing, Sound Editing, Original score, Film editing, Best adapted screenplay and Best make up and hairstyling.

Natural Star Nani New Movie ‘V’ First Look Released

అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో నేచుర‌ల్‌స్టార్ నానిని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. ఈసారి కూడా డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో కొత్త పాత్ర‌లో నానిని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం `వి` సినిమా చూడాల్సిందే. సాంపుల్‌గా నాని లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని పోషించ‌ని స‌రికొత్త పాత్ర‌, లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, చేతిలో క‌త్తెర‌, చేతికి ర‌క్తం, చూపుల్లో నిర్ల‌క్ష్యం ఇవ‌న్నీ చూస్తుంటే నాని పాత్ర‌లోని డెప్త్ అర్థం చేసుకోవ‌చ్చు. 
క్లాస్, మాస్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న నాని తొలిసారి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాక్ష‌సుడి త‌ర‌హా పాత్ర‌లో నాని క‌న‌ప‌డ‌తార‌ని హీరో సుధీర్‌బాబు ఇది వ‌ర‌కే ట్వీట్ కూడా చేశారు. రాక్ష‌సుడి బారి నుండి కాపాడే సేవియ‌ర్ పాత్రధారి ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు న‌టిస్తున్నారు. నాని, సుధీర్‌బాబు పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
నేను లోక‌ల్‌, ఎంసీఎ  వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత  దిల్‌రాజు.. నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావ‌డం విశేషం. నానితో ఒక ప‌క్క ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, మ‌రో ప‌క్క నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తోన్న హ్యాట్రిక్ చిత్రం `వి` కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.
న‌టీన‌టులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ:  పి.జి.విందా
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

What happened on April 28?

సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నానుఅన్నారు దర్శకుడు వీర గనమాల. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది.టైటిల్‌తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ప్రేక్షకుల్లోమరింత ఉత్కంఠను రేపింది.

ఈ సందర్భంగా దర్శకుడు వీర గనమాల చిత్ర విశేషాలను తెలియజేస్తూ  ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే  ఓ వినూత్నమైన కథతో, ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో అనుక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొనసాగే ఈ చిత్రంలో ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. త్వరలో బ్యాంకాంక్‌లో జరిగే పాట చిత్రీకరణతో చిత్రం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

అజయ్, రాజీవ్‌కనకాల, తనికెళ్లభరణి, చమ్మక్‌చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్ ఎన్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా, మాటలు, పాటలు: ధర్మతేజ, రామాంజనేయులు, ఎడిటర్:కె.సంతోష్, కథ-మాటలు-దర్శకత్వం: వీర గనమాల

Baalikaa Vadhu’ fame Sheethal Khandal matter

దేశవ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాలికా వధు’ సీరియల్ లో ‘గెహనా’గా నటించిన షీతల్ ఖండల్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతొ తెలుగులోనూ ప్రసారమై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకొంది. ‘బాలికా వధు’తో వచ్చిన గుర్తింపు షీతల్ ను ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమెను వరించాయి. ‘వారియర్ సావిత్రి’ అనే హిందీ సినిమాలోనూ నటించి మెప్పించిన షీతల్.. తన మాతృ భాష రాజస్తానీలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసి.. ఒక ఇండో అమెరికన్ సినిమాలోనూ నటిస్తున్న షీతల్.. త్వరలోనే తెలుగులోనూ తెరంగేట్రం చేయాలని తహతహలాడుడుతోంది. సహజసిద్ధమైన అందం, అభినయం, శభాష్ అనిపించే నాట్య కౌశలం కలిగిన ఈ రాజస్థానీ భామకు తెలుగులో ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారేమో వేచి చూడాలి!!

Comedian Ali Acting in Hollywood Strait Movie

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీల్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేశారు అలీ. సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ తన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌ప్రెస్‌తో అన్ని స్టాపుల్లో నవ్వులు పంచారు. ఇప్పుడీ స్టార్‌ కమేడీయన్‌ ప్రయాణం హాలీవుడ్‌లోనూ మొదలుకానుంది. దర్శకుడు జగదీష్‌ దానేటి దర్శకత్వంలో తన హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఒక స్ట్రయిట్‌ హాలీవుడ్‌ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్‌ దానేటి అని చిత్రబృందం తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ను కలిశారు అలీ, దర్శకుడు జగదీష్‌ దానేటి.

అనంతరం అలీ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌ సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు.

దర్శకుడు జగదీష్‌ మాట్లాడుతూ – ‘‘ఇండో హాలీవుడ్‌ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను. త్వరలోనీ మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు.

Palasa 1978 Movie characters in interesting

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సందర్భంగా  ‘పలాస 1978 ’ లోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్  రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ బుక్ ని సోషల్ మీడియా లో చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేసారు. ఈ యానిమేటడ్ బుక్ లో యూనిట్ పరిచయం చేసిన పాత్రలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అణువణువునా సహాజత్వం నింపుకున్న ఈ పాత్రల మాటలు కూడా అంతే హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా పలాస ప్రాంతం నుండి పుట్టిన మాటల లోని భావాలు లోతుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:
‘‘ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండే లా కాకుండా కంటెంట్ బేస్డ్ గా ఉన్నాయి. సినిమా కథ ఎంత సీరియస్ గా సాగుతుందో ఈ మాటలలో అర్ధం అవుతుంది. సినిమా కథ లోతుగా, సీరియస్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది.  పాత్రల పేర్లు, వేష బాషలు చాలా సహాజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది. ఇందులోని పాత్రలు ప్రత్యేక ముద్రను వేసాయి. ’’ అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ..కథ లోని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. విడుదలకు ముందే పరిశ్రమలో ‘పలాస 1978’ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకుంది. జిఎ2,  యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈమూవీ తెలుగు అసురన్ అవుతుందని  కితాబిచ్చారు.

ఉత్తరాంధ్ర ప్రాంతం లోని కథ, ఎవరూ చెప్పని కథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫ్రిబ్రవరి లో విడుదలకు సిద్దం అవుతుంది.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.