Home Blog Page 971

Enthamanchi vadavuraa Movie Review

Release date :January 15th,2020
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Enthamanchi vadavuraa
Banners:-Sridevi Movies Siva Lenka krishna Prasad
Starring:-kalyan ram,Mehreenpirzada,Suhasini Maniratnam,Sharath babu,Tanikella barani,Vijaykumar Rangaswamy,Vk Naresh,Pavitra Lokesh,prabhas Sreenu,Praveen,Rachha Ravi,Rajeev kanakala,rajashri Nair,,Sudarshan reddy,Sumitra Rajendra,Vennela kishor Music Director :-Gopi Sundar
Editor:-Bikkina Thammiraju
Cinematography:-RajThota
Director :- Satish Vegesna
Producer :-Umesh Guptha,Subhas Guptha

అతనొక్కడే,పటాస్ లాంటి సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించిన కళ్యాణ్ రామ్ గత ఏడాది 118 సినిమా ద్వారా డీసెంట్ హిట్ అందుకున్నాడు.అయితే ఈ సంక్రాంతి సీజన్ కి మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా,నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ కౌర్ జంటగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సంక్రాంతికి వచ్చిన ముందు రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఈ కథతో ఎంత మంచివాడవురా మూవీ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి రివ్యూ లో చూద్దాం.

కథ :  

చిన్న తనం లొనే తల్లి,తండ్రులను పోగొట్టుకొని తనకంటూ ఎవరు లేని బాలు (కళ్యాణ్ రామ్) తన చిన్ననాటి స్నేహితురాలు నందిని (మెహ్రీన్ కౌర్) తో కలిసి షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాడు. అయితే నందినితో కలిసి బాలు ఒక కొత్త బిజినెస్ మొదలుపెడతారు. రిలేటివ్స్ ఎవరు లేక బాధపడుతున్న వారికి అద్దెకు వాళ్లను సప్లై చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో బాలు కూడా ఒకరి ఇంటికి వాళ్ల మనిషిగా వెళ్తాడు. అలా వెళ్లిన అతనికి అక్కడ ఎదురైనా సమస్యలు ఏంటి..? బాలు, నందినిలు బిజినెస్ ఎలా రన్ అయ్యింది..? అన్నది సినిమా కథ.

నటీనటులు:

నందమూరి కళ్యాణ్ రామ్ తన పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.మొట్టమొదటి సారి ఫుల్ ఫామిలీ సినిమా చేసిన కల్యాణ్ రామ్ నటనతో ప్రేక్షకులను అలరించాడు. బాలు పాత్రకు కళ్యాణ్ రామ్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇక సినిమాలో మెహ్రీన్ కౌర్ కూడా బాగా చేసింది. నరేష్, శరత్ బాబు, సుహాసిని, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, ప్రవీణ్, సుదర్శన్,రచ్చ రవి, బద్రం, అందరు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత:

శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఆ సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టాడు. మళ్లీ అదే సెంటిమెంట్ తో ఎంత మంచి వాడవురా సినిమాతో వచ్చాడు సతీష్. ఇక ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సతీష్ ఈ సంక్రాంతికి కూడా ఆడియెన్స్ ను అలరించింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా అద్దెకు అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా సాగినా ప్రేక్షకుడిని ఎమోషన్ కి కనెక్ట్ అయ్యేలా చేసాడు. సినిమా ల్యాగ్ అయినట్టు అనిపించినా సినిమాను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ సినిమా సరదాగా సాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మరీ సెంటిమెంట్ ఎక్కువ అయింది. ఎవరు లేని ఒంటరి జీవితాలకు కుటుంబ విలువలు ఎలా ఉంటాయో తెలిసేలా చూపిస్తూ సినిమా అంతా డ్రామాటిక్ గా చక్కగా తెరకెక్కించాడు సతీష్ వేగేశ్న.తనికెళ్ళ భరణి – కల్యాణ్ రామ్ మధ్య సన్నివేశాలు చాలా చక్కగా రాసుకున్నారు. ఎమోషనల్ సీన్ లు కూడా బాగానే పండాయి.  . ప్రతీ పాత్రా సినిమా కి హై లైట్ గా నిలుస్తాయి. ఫామిలీ ఎమోషన్ డీల్ చెయ్యడం లో సతీష్ మళ్ళీ తన పంథా చూపించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది..

రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా కెమెరా వర్క్ బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. బీజీఎమ్ అలరించింది. కథ, కథనాలు దర్శకుడు సతీష్ వేగేశ్న తన ప్రతిభ చాటాడు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.దర్శకుడు సతీష్ సినిమా కథ  బాగానే రాసుకున్నాడు.అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా సినిమా ఉంది.

Cinema rangam.com..3/5

Heroin Puja Hegde interview for Ala Vaikunthapurramloo

“త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు. ఆఖరుకు పాటలో ప్రతి లైన్ అర్థాన్నీ చెప్తారు. ఆయన్లోని గొప్ప గుణం ఈగో లేకపోవడం” అని చెప్పారు పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆమె కథానాయికగా అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో పూజా హెగ్డే సంభాషించారు. ఆ విశేషాలు…

‘ఆలా వైకుంఠపురములో..’ ని మీ క్యారెక్టర్ కు మీరే డబ్బింగ్ చెప్పుకోవడం ఎలా అనిపిస్తోంది?
చాలా కష్టం. ఎందుకంటే తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం నా పర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా. ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు.

‘అరవింద సమేత’కు కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? అప్పటికీ ఇప్పటికీ మీ డబ్బింగ్ లో వచ్చిన మార్పేమిటి?
తెలుగు లైన్స్ ను అర్థం చేసుకొని వాటిని ఎలా చెప్పాలో తెలుసుకుంటున్నా. ఓవర్ యాక్టింగ్ చెయ్యడం నాకిష్టం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది. నేను పర్ఫార్మ్ చేసిన దానికి ఆ డబ్బింగ్ డిఫరెంట్ గా ఉన్నట్లు ఫీలవుతాను. కొంతమంది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మన పర్ఫార్మెన్స్ ను తమ డబ్బింగ్ తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను. ‘అరవింద సమేత’ రిలీజయ్యాక ఒకరు “ఈ సినిమాకు మీకెవరు డబ్బింగ్ చెప్పారు? నేను కూడా చెప్పించుకుందామని అనుకుంటున్నా” అని మెసేజ్ పెట్టారు. అది నా డబ్బింగ్ కు లభించిన పెద్ద కాంప్లిమెంటుగా భావిస్తాను. అంటే ఒక తెలుగు అమ్మాయిలా అందులో మాట్లాడగలిగానని సంతోషం వేసింది.

తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ ని ఎవరినైనా పెట్టుకున్నారా?
లేదు. నా మేనేజర్ తో, నా స్టాఫ్ తో నేను తెలుగులోనే మాట్లాడుతాను. కోచింగ్ కు ఎవర్నీ పెట్టుకోలేదు. ఇలాంటి ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంటుంది.

మూడోసారి కూడా మిమ్మల్ని రిపీట్ చెయ్యాలనిపిస్తోందని అల్లు అర్జున్ చెప్పిన దానికి మీ స్పందన?
మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా.

అమూల్య క్యారెక్టర్ చెయ్యడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి?
బేసికల్లీ ఐ లవ్ ద స్ర్కిప్ట్. త్రివిక్రమ్ గారు కథ చెప్తుంటే పడిపడి నవ్వాను. పాప్ కార్న్ తింటూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని అనిపించింది. అదివరకు త్రివిక్రమ్ గారితో చేసిన ‘అరవింద సమేత’ సీరియస్ సబ్జెక్ట్. అలాగీ దీనికి ముందు బన్నీ చేసిన ‘నా పేరు సూర్య’ కూడా సీరియస్ సబ్జెక్ట్. అందువల్ల ఫన్నీగా ఉండే ఈ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ సినిమాలో నాది స్ట్రాంగ్ క్యారెక్టర్ అనీ, అల్లు అర్జున్ కు బాస్ గా కనిపిస్తావనీ త్రివిక్రమ్ గారన్నారు. స్క్రిప్ట్ బాగా నచ్చడం, నాది బలమైన క్యారెక్టర్ అని ఆయన చెప్పడం వల్ల మరో ఆలోచన లేకుండా చెయ్యడానికి ఒప్పుకున్నా. అది స్ట్రాంగ్ క్యారెక్టర్ అని నేను నమ్ముతున్నా. బన్నీ క్యారెక్టర్ ఆలోచనాధోరణిని మార్చే క్యారెక్టర్. అలాగే ‘సామజవరగమన’ పాటను ఎంతో పొయెటిక్ గా తీశారు. హీరో పదే పదే నా కాళ్లను చూస్తుంటే, ఒకసారి పైకి చూడమని చెప్తాను. అప్పుడతను నా కాళ్ల మీద నుంచి దృష్టిని మరల్చి నా కళ్లవంక చూస్తాడు. అప్పుడు తన కొలీగ్స్ తో “ఫస్ట్ టైం మేడమ్ కళ్లు చూశాను. మేడమ్ సార్.. మేడమ్ అంతే” అని చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఐ థింక్ దట్ ఇట్ వాజ్ జస్టిఫైడ్. లంగా, చోళీలు వేసుకున్నప్పుడు నడుము చూపిస్తుంటారు కదా. అది ఓకేనా!

త్రివిక్రమ్ గారిని గురూజీగా మీరు సంబోధించారు. ఎందుకని?
నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ గారు చాలా కామ్ డైరెక్టర్. డైరెక్టర్ ఎనర్జీయే సెట్లో కనిపిస్తుంది. ఏ డైరెక్టర్ అయినా గట్టి గట్టిగా అరుస్తుంటే నేను భయపడతాను. ఎవరి వత్తిళ్లు వాళ్లకుంటాయి. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపిస్తే, మన స్ట్రెస్ తగ్గిపోతుంది. తాను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని అని తెలిసినా, దాన్ని ఆయన బయట ప్రదర్శించరు.

అల్లు అర్జున్ గారితో డాన్స్ చెయ్యడం కష్టమనిపించేదా?
ఈ మూవీలో నాకు డ్యాన్సింగ్ ఎక్కువ లేదు. అన్నీ సింపుల్ స్టెప్సే. రిహార్సల్స్ కూడా చెయ్యలేదు. కాబట్టి బన్నీతో మ్యాచ్ కావడానికి నేను కష్టపడలేదు. నేను కెరీర్ మొదట్లోనే హృతిక్ రోషన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి గ్రేట్ డాన్సర్స్ తో చేశాను. ఇప్పుడు మళ్లీ హిందీలో హృతిక్ రోషన్ తో చేస్తున్నా. వాళ్లందరితో నేను డాన్సుల్లో మ్యాచ్ అయ్యానని అనుకుంటున్నా.

సినిమాలో మీ ఫేవరేట్ సీన్ ఏమిటి?
నిజానికి సినిమాలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా ఇష్టం. ఆ రెండూ చాలా ఫన్నీగా ఉంటాయి.

చాలామంది హీరోలతో పనిచేసినా బన్నీకి ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకని?
నేను అతని వర్క్ కు అభిమానిని. అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రభాస్ తో పనిచెయ్యడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా.

ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే, కష్టమనిపించడం లేదా?
నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యగల కెపాసిటీ నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చెయ్యగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేననుకోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చెయ్యాలనుకుంటున్నా.

తెలుగులో మీరు దాదాపు టాప్ హీరోయిన్. హిందీలో సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలు చేస్తున్నారెందుకని?
‘హౌస్ ఫుల్ 4’లో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్ తోటీ, సగం రితేశ్ దేశ్ ముఖ్ తోటీ చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు. అందువల్ల ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం నాకు ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎలా మనం మన పాత్రను రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా. మీ లెక్కల ప్రకారం ఇప్పుడు నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడేంట్ గా, కార్పొరేట్ గాళ్ గా ఆదరించారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ బన్నీ బాస్ రోల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చెయ్యడం హ్యాపీ. వర్సటాలిటీ నా బలమని నమ్ముతాను.

విమెన్ సెంట్రిక్ రోల్స్ ఏమైనా వచ్చాయా?
తెలుగులో విమెన్ సెంట్రిక్ రోల్స్ తక్కువగానే ఉన్నాయి. ఒకటి అలాంటి స్క్రిప్ట్ వచ్చింది కానీ నేను సంతకం చెయ్యలేదు. ఏదైనా నాకు నచ్చి, నేను చెయ్యగలననిపిస్తే చెయ్యడానికి సిద్ధమే. ఒక నటిగా నన్ను మరో కోణంలో అది చూపిస్తుంది.

lady Amithab Vijayashanthi interview for Sarileru Neekevvaru

లేడీ అమితాబ్‌గా ప్రేక్షకుల అభిమానం పొందిన నటి విజయశాంతి. నలభై ఏళ్ల తన నట ప్రస్థానంలో అరవై మంది హీరోలతో కలిసి నటించారామె. తానే ఓ కథానాయకుడై సినిమాలను నడిపించారు. పదమూడేళ్ల విరామం తర్వాత ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లిd కెమెరా ముందుకొచ్చింది. మహేష్‌ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి రియల్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ అని చెబుతున్నారు విజయశాంతి. ఈ చిత్రంలో తను పోషించిన భారతి పాత్ర గురించి, చిత్రంలో నటించిన అనుభూతుల గురించి విజయశాంతి ఇలా వివరించారు..

చాలా ఏళ్ల నుంచి అనేక మంది సినిమా చేయమని అడిగారు. అప్పుడు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల మళ్లి నటించాలనే ఆలోచన రాలేదు. సినిమా అంటే సమయం కేటాయించాలి. అప్పటికి సినిమా చేసి ఇటు సినిమాలో, అటు రాజకీయపరంగా ఇబ్బంది పడలేను. గతంలో ఒకసారి అనిల్‌ రావిపూడి గారు సినిమా కోసం సంప్రదించారు. చేయలేను అని చెప్పాను. ఈసారి దర్శకులు అడిగినప్పుడు కొంత విరామం ఉంది. మహేష్‌ బాబు హీరో అన్నారు. సరే చేద్దామని కథ విన్నాను. నచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి మీకూ నచ్చింది.

మళ్లీ కెమెరా ముందుకు రావడం నాకేమీ కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే నటిగా నలభై ఏళ్ల అనుభవం చూశాను. మనతో నటించే ఆర్టిస్టులు మారారు కానీ సినిమా ఎప్పటికీ ఒకటే. నటనలో మాకు అదే పట్టు ఉంటుంది.

సినిమా పరిశ్రమను మిస్‌ అవుతున్నాననే భావన ఎప్పుడూ కలగలేదు. అనేక ఏళ్లు సినిమా పరిశ్రమకు సేవ చేశాను. గొప్ప చిత్రాలు చేశాను. నాకు కూడా కొంత విరామం కావాల్సి వచ్చింది. ఇన్నేళ్లు హీరోయిన్‌గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే సులువు కాదు. చాలా పెద్ద విషయమది, తెలుగుమ్మాయిగా, ఏళ్లపాటు ఒక స్థాయిని కాపాడుకుంటూ సినిమాలు చేయడం ఒక చరిత్ర సృష్టించడమే. లేకపోతే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానో, మరో పాత్రలకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడు ఎక్కడో నాకు మేలు చేశాడు, ప్రేక్షకులు ఆదరించారు అనుకుంటా.

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే. అలా సరైన సమయంలో విరామం తీసుకున్నా. సరైన సమయంలో మళ్లిd తెరపైకి వచ్చా. సరిలేరు నీకెవ్వరుతో చాలా పెద్ద హిట్‌ను ప్రేక్షకులు ఇచ్చారు. మంచి పవర్‌ఫుల్‌ పాత్ర, ఆ పాత్రకు తగినట్లు మంచి స్పందన వస్తోంది. అనేక మంది ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి ప్రశంసలు వస్తున్నాయి మీ సినిమా ఘన విజయం సాధించిందట కదా అని అడుగుతున్నారు.

మహిళలకు నచ్చే సినిమా ఇది. వాళ్లకు బాగా కనెక్ట్‌ అయ్యింది. మొదటి రోజు నుంచీ మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మహిళలు ఫోన్‌లు చేసి రాములమ్మ మళ్లిd ఏడిపించావ్‌ అంటున్నారు. మగవాళ్లూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారతి పాత్ర హుందాగా సాగే పాత్ర అది. ఎక్కువగా తక్కువగా చేయకూడదు. ఆరంభం నుంచి చివరిదాకా ఒకేలా కనిపించాలి. తన బాధను బయటపెట్టకుండా మనసులోనే దాచుకుంటుంది. విలన్‌తో మాట్లాడేప్పుడు తక్కువ డైలాగ్‌లైనా సూది పెట్టి గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఓవర్‌గా యాక్ట్‌ చేయడానికి లేదు. లెక్చరర్‌ పాత్ర కాబట్టి, ప్రకాష్‌ రాజ్‌తో కళ్లలోకి చూస్తూ ఏంటి భయమేస్తుందా అని అడగటం లాంటి డైలాగ్‌లు బాగా ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.

కొడుకు దిద్దిన కాపురం సినిమా చేస్తున్నప్పుడు మహేష్‌ చిన్న పిల్లవాడు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ అయ్యాడు కదా ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ తొలిరోజు అతను నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. మహేష్‌ చాలా నమ్రతతో ఉంటాడు. కొన్ని రోజులు అయ్యాక నాతో సరదాగా మాట్లాడటం మొదలయ్యింది. చిత్రీకరణలో మహేష్‌ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. ఆయన నా పాత్రకే కాదు, నన్నూ వెనకుండి సపోర్ట్‌ చేశారు.

ఒక్కొక్క సినిమాకు మనకు ఒక్కో తరహా పాత్ర దక్కుతుంటుంది. ప్రతిఘటన సినిమాలో నేను నేరుగా ఏదీ చేయను. చివరలో మాత్రం గొడ్డలితో నరుకుతాను. అప్పటిదాకా విలన్‌కు హెల్ప్‌ చేస్తున్నట్లు కనిపిస్తాను. ఎక్కడా సందేహం రాకుండా ఉంటాను. కోట గారి పాత్ర అంటుంది. ఈవిడ నన్ను తిడుతుందా ? పొగుడుతుందా? అని. కొంత గందరగోళంలో ప్రేక్షకులు పడతారు. చివరలో విలన్‌ను చంపేస్తాను. సరిలేరు..మహేష్‌ బాబు సినిమా. హీరోతో పాటు నా పాత్ర కథలో సమాంతరంగా సాగుతుంటాయి. త్యాగం చేసే అంతకంటే చేయలని పాత్ర నాది. బాబు వచ్చి నా సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాడు. ఓ సన్నివేశంలో భారతి పాత్రకు సెల్యూట్‌ చేస్తాడు మహేష్‌ బాబు. నటిగా నా స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్‌ చేస్తే ప్రేక్షకులకు నచ్చింది. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరు.

దర్శకుడు నాకు పూర్తి కథ చెప్పారు. చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. నా పాత్ర కోణంలోనే కథ మొదలవుతుంది. నా కథలోకి మహేష్‌ వస్తారు. మహేష్‌ కొత్త టైమింగ్‌లో సినిమా చేశాడు. డాన్సులు, ఫైట్లతో ఆకట్టుకున్నాడు. మా ఇద్దరి కాంబినేషన్‌ సీన్స్‌ సూపర్‌గా వచ్చాయి. సూర్యడివో చంద్రుడివో పాట ఎంత బాగుందో. ప్రతిఘటనలో సగం ప్రభావమున్న పాత్ర భారతి అనుకోవచ్చు.

ఈ సంక్రాంతికి రియల్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సరిలేరు నీకెవ్వరు. పండగ భోజనం విస్తరిలో అన్ని వంటకాలు వడ్డించినట్లు ఉంటుంది సినిమా.

కృష్ణ గారి కుటుంబంతో నాకు ఏదో అనుబంధం ఉందనుకుంటా. ఈ బంధాన్ని దేవుడు నిర్ణయించినట్లు అనిపిస్తుంది. ఇలా మహేష్‌తో రీఎంట్రీ సినిమా చేస్తానని అనుకోలేదు, ఆశ్చర్యమేస్తుంది.

బాధ్యతగా ఉండాలన్న ఒక మంచి విషయాన్ని ఈ చిత్రంలో దర్శకులు చెప్పారు. అది విన్నప్పుడు నిజమే కదా, కొంతమంది ఎంత ఛండాలంగా ప్రవర్తిస్తున్నారు అనిపించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి, సమాజాన్ని మనమే తీర్చిదిద్దాలి, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలి. ఇవాళ కొన్ని ఘటనలు చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందో. మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు కదా. దర్శకులు అనిల్‌ సరైన విషయం చెప్పారు.

నేను దర్శకులు అనిల్‌ గారికి కృతజ్ఞతలు చెప్పారు. నేను మొదట్లో నటించకూడదు అనుకున్నా, ఆయన పట్టుబట్టి నాతో సినిమా చేయించారు. ఆయనకేదో లెక్క ఉండి ఉంటుంది. అది సరిగ్గా రీచ్‌ అయ్యింది. దర్శకులంటే ఒక ఆలోచన ఉంటుంది. సరైన పాత్ర వస్తే, కుదిరితే సినిమాకు కలిసొస్తుంది. కొడితే బంతి బౌండరీ దాటుతుంది. ఈ సినిమాకు అన్ని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. చిత్రీకరణ సమయంలో చాలా నవ్వుకున్నాం. ఇంత నవ్వుకుని చాలా కాలమవుతోంది. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ వస్తుంటుంది. సినిమా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా, హాయిగా ఉంది.

మన దగ్గర పేరున్న దర్శకులకు అనిల్‌ తక్కువేమీ కాదు. మనస్ఫూర్తిగా చెబుతున్న, నలభై ఏళ్ల అనుభవమున్న నటిగా చెబుతున్నా. అనిల్‌ గొప్ప దర్శకుడు అవుతాడు. ఈ కథ విన్నప్పుడు ఇంత భారీ సినిమా ఎలా చేస్తాడో అనుకున్నా, కానీ ఆయన చాలా కూల్‌గా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా వేగంగా సినిమాను చిత్రీకరించారు. అనిల్‌ పటాస్‌, ఎఫ్‌2, రాజా ది గ్రేట్‌ సినిమాలు చూశాను. బాగా హ్యూమర్‌ ఉంది, సెంటిమెంట్‌ బాగా తీశారు. ఆయనకు రాములమ్మ కథ ఇచ్చినా తెరకెక్కించగలరు. నాతో కర్తవ్యం, ప్రతిఘటన లాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయమని అనిల్‌ను కోరుతున్నా.

ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి, 90 దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ఇప్పుడు అడగటం ఎందుకు. ఈ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం.

నటిగా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం అనుకుంటా. కర్తవ్యం సినిమా చూసి అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి వచ్చారు. మగవాళ్లు స్ఫూర్తిపొందారు. రౌడీ ఇన్‌స్పెక్టర్‌లో ఆటోరాణి పాత్ర, భారతరత్న చిత్రంలో సైనిక అధికారిగా నటించాను. ఇవన్నీ ప్రభావవంతమైన పాత్రలు. కొంతమంది మినీ విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నారు. చెన్నైలో ఒక పోలీస్‌ అధికారిణి నేరగాడిని పట్టుకునే క్రమంలో అతను ఆమెను కత్తితో గాయపర్చాడు. అయినా పోరాడి అతన్ని వదలకుండా పట్టుకుని, పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లింది. ఆ పోలీస్‌ అధికారిణిని చూసేందుకు వెళ్లాను.

అప్పుడామె మీ కర్తవ్యం సినిమా నాకు స్ఫూర్తి, నా పేరు ఎంటో తెలుసా విజయశాంతి అని చెప్పింది. ఒక నటిగా ఇంతకంటే ఏం కావాలి. నాకు ఇంత పేరు తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయాలైనా, సినిమాలైనా ఎక్కడున్నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా.

సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో చిరంజీవి గారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన రాజకీయాల విషయం ప్రస్థావనకు తీసుకొస్తారని ఊహించలేదు. ఆయన మనసులో ఏవో సందేహాలు ఉండేవి. ఆ వేదికపై అపార్థాలన్నీ తీరిపోయాయి. రాజకీయ రంగ ప్రవేశం జీవితంలో అనుకోకుండా జరిగింది. ఇక్కడ అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తుంటాయి. చిరంజీవి గారు మా మధ్య కొంత దూరం పెరిగింది. ఆ రోజు కార్యక్రమంలో అది సమసిపోయింది.

సినిమాల్లో సాధారణ పాత్రలు నేను చేయను. వాటికో స్థాయి ఉండాలి. ఎందుకంటే నటిగా అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల్లో నాకున్న గౌరవాన్ని తగ్గించుకోలేను. రొటీన్‌ అత్త పాత్రలు లాంటివి నేను అస్సలు అంగీకరించను. బలమైన, శక్తిమంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటా.

నేను ఎక్కువగా తినను, వ్యాయామం చేస్తుంటాను. ఈ సినిమా కోసం కొంత జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాను. మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది మొహంలో కనిపిస్తుంటుంది అంతే.

Patarupalem Premakatha Movie Song Launched by Hero Sarvanand

 జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి  దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పటారుపాళెం ప్రేమ కథ” శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో “మళ్ళీ మళ్ళీ వచ్చి పోరాదే – ముద్దిచ్చి పోరాదే”  అనే  పాటను హీరో శర్వానంద్  విడుదల చేసారు. ఈ సంధర్భంగా  శర్వానంద్ మాట్లాడుతూ నాకు మంచి మిత్రుడు, ఆయన నాతో వీధి థ స్ట్రీట్ అనే సినిమా తీసిన దర్శకులు  దొరైరాజు గారు, ఆయన దర్శకత్వం లో వస్తున్న సినిమా పాటను నేను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ పాటను నేను విన్నాను పాట చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పాట వింటుంటే ఎదో తెలియని ఒక అనుభూతి కలిగింది. మ్యూజిక్ లవర్స్ అందరూ ఈ పాటను వినండి,మీకూ నచ్చుతుంది, పెద్ద హిట్టు చేయండి, అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

దర్శకుడు దొరైరాజు మాట్లాడుతూ ఈ సాంగ్ నా హీరో శర్వానంద్ లాంచ్  చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది,  నేను దర్శకత్వం వహించిన వీధి థ స్ట్రీట్ అనే సినిమాతో శర్వా హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమా పాట విడుదల చేసినందుకు శర్వా కు స్పెషల్ థాంక్స్ చెబుతూ, ఈ పాట చాలా బాగుంటుంది, పాట వినే ప్రతి మ్యూజిక్ లవర్ తన గడిచిన లైఫ్ గురించి ఆలోచిస్తారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలను టిక్ టాక్ అండ్ హలో ఆపిలికేషన్ లో కూడా పెద్ద హిట్టు చేసిన యూత్ కి, ప్రేక్షకులకు థాంక్స్. ఆ రెండు పాటలను మించి మీకు ఈ పాట ఇంకా బాగా నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది, ఈ పాటను కూడా విని మీరు పెద్ద హిట్టు చేయాలని కోరుకుంటున్నాను.
హీరో శ్రీ మానస్ మరియ హీరోయిన్ సమ్మోహణ లు మాట్లాడుతూ మేము కొత్తవాళ్ళమైన దర్శకులు దొరైరాజు గారు కథను నమ్మి మాతో సినిమా తీశారు, కథ అంత బాగుంటుంది. మా సినిమాలో థర్డ్ సాంగ్ శర్వానంద్ సార్ చేతులు మీదుగా విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది. శర్వా సార్ కి మా ప్రత్యేక ధన్యవాదాలు, ఈ సాంగ్ అందరూ వినండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపారు. అయితే మధ్య కాలంలో ఈ సినిమా సోషల్ మీడియాలో, టిక్ టాక్ లలో సినీ అభిమానులను బాగా అలరిస్తుంది.
ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి. వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జె.ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని, పరువుహత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది, అతి త్వరలో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Ala Vaikuntapuramulo Movie Thanks Meet

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. నాకు అర్థమవుతోంది.. ఇది మా కలయికలో ఒక కామా మాత్రమే.” అని చెప్పారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో సంక్రాంతి విజేతగా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా.. హర్షవర్ధన్ మాట్లాడుతూ “ఒక ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నా. దేవుడు ఎదురుపడితే కోరుకోవడానిక్కూడా భయపడేంత గొప్ప సక్సెస్ ఈ సినిమాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో ఆయన ప్రతిభ కనిపిస్తే, ఈ సినిమాలో ఆయన దమ్ము కనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపించారని యు.ఎస్. నుంచి ఫ్రెండ్స్ ఫోన్లు చేసి చెప్పారు. బన్నీ సినిమా సినిమాకీ ఎదుగుతున్నారు. ఈ మూవీలో అతను చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతం” అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ “మాకు సంక్రాంతి నిన్నే వచ్చేసింది. బన్నీతో పదిహేనేళ్ల ఫ్రెండ్‌షిప్‌లో నేను గమనించింది, తనకున్న బ్యాగ్రౌండ్‌ని అడ్వంటేజ్‌గా కాకుండా రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యే చాలామంది తక్కువ హీరోల్లో తనొకడు. ఒకరోజు గీతా ఆర్ట్స్ ముందు నుండి వెళ్తుంటే బయట చాలామంది ఉన్నారు. ఆరోజు బన్నీ పుట్టినరోజు కాదు, శిరీష్ పెళ్లి కూడా కాదు.. ఎందుకు ఇంతమంది ఉన్నారని చూస్తే, ప్రతి శుక్రవారం బన్నీతో ఫొటోలు దిగడానికి ఫ్యాన్స్ వస్తారని తెలిసింది. ఇంకెవరన్నా చేస్తారో, లేదో నాకు తెలీదు కానీ తను ప్రతివారం ఫ్యాన్స్ కోసం ఒకట్రెండు గంటలు కేటాయిస్తాడు. తనకు వచ్చిన గ్యాప్‌ని కసిగా ఎలా మలచుకున్నాడనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బన్నీలో ఉన్న తపనలో ఒక్క శాతమన్నా అందరిలో ఉంటే బాగుంటుంది. ఈ సంవత్సరం నన్ను గీతా ఆర్ట్స్ వాళ్లు దత్తత తీసుకున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ఈ బ్యానర్‌లో చేస్తున్నా. అవేమిటన్నది అరవింద్ గారు తర్వాత చెప్తారు” అని తెలిపారు.

రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ “మనిషికి గెలిస్తే ఓడిపోతానేమోననే భయం ఉంటుందంట. ఓడితే గెలుస్తానన్న ధైర్యం ఉంటుందంట. ‘నా పేరు సూర్య’ ఓటమి ఈరోజు గెలుపుకు కారణమని అల్లు అర్జున్‌కు మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ‘అజ్ఞాతవాసి’ తర్వాత.. ఏదో నేర్పడానికోసమే ఓటమనేది వస్తుందని త్రివిక్రం గారి వద్ద మేం తెలుసుకున్నాం. ఈ సినిమాలో ఫైట్స్ ఇంత బాగా రావడానికి కారణం మా ఫైటర్స్ కూడా. ఈ పండక్కి అన్ని సినిమాలూ మీవే అని అంటుంటే చాలా ఆనందం వేసింది. ఈ క్రెడిట్ మొత్తం మమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, మాకు ఈ విద్య నేర్పిన రాజు మాస్టర్‌కి, చదువు సంధ్యలు లేని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన కళామతల్లికి, మాకు ఈ శక్తినిచ్చిన భగవంతుడికి చెందుతుంది. ఒక మంచి శిష్యుడుంటే గురువుకి అందం, ఒక మంచి బిడ్డ ఉంటే తండ్రికి అందం. గొప్ప బిడ్డ ఉండటం అరవింద్ గారికి అందం. త్రివిక్రమ్ గారు మంచి మనసున్న డైరెక్టర్” అని చెప్పారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ సరదాగా “రాములో రాములా పాట హిట్టయ్యిందంటే కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు” అని తనేనన్నట్లు సైగ చేశారు. “నాకు గుండెకు సంబంధించి అనారోగ్యం కలిగినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. ‘అంకుల్.. మీరు పర్ఫెక్టుగా ఉన్నారు.. రెస్ట్ తీసుకున్నాక మొట్టమొదట నా సినిమాలోనే మీరు చేస్తున్నారు’ అని చెప్పాడు. ఏదో ఎంకరేజ్ చెయ్యడం కోసం చెప్పాడేమో అనుకున్నా. తర్వాత త్రివిక్రమ్ గారొచ్చారు. కొంచెం సేపు మాట్లాడుకున్నాక ‘సార్.. మనం కలుస్తున్నాం.. వదిలెయ్యండి ‘ అన్నారు. వదిలెయ్యమన్నాడు కాబట్టి నేనూ వదిలేశా. సినిమా అయిపోవచ్చింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు.. ఈ సినిమాలో ఎలాగైనా బ్రహ్మానందం కనిపించాలని నాకు క్యారెక్టర్ ఇచ్చారు. మాట ఇచ్చి నిలబెట్టుకొనే వ్యక్తుల్లో ఈ ఇద్దరూ ఉంటారు. ఈ గుణం బన్నీకి మా గురువుగారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చింది. అన్నేళ్లు ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా గడిపారు. నిబద్ధతతో ఉండే అద్భుత నటుడాయన. ఆయనను అద్భుతంగా ప్రేమించి, అభిమానించి, గౌరవించిన వ్యక్తి ఆయన కుమారుడు అరవింద్ గారు. ‘మా నాన్న ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. ఇష్టమైతే నన్ను పెళ్లిచేసుకో, లేకపోతే లేదు’ అన్నాడు బన్నీ తన భార్యతో. దటీజ్ బన్నీ. నటుడిగా చెప్పాలంటే అతను ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఏ మనిషికీ ఊరికే పేరు రాదు, ఊరికే గొప్పవాడు కాడు. దాని వెనుక అతని కృషి వుంటుంది. అలాంటి సామర్థ్యమున్న నటుడు బన్నీ. రచయితగా త్రివిక్రమ్ గురించి చెప్పడం జగమెరిగిన బ్రాహడికి జంధ్యమేల.. అన్నట్లుంటుంది. మా కమెడియన్స్ అందరికీ ఆయన దగ్గరివాడు. తమన్ అద్భుతమైన ట్యూన్స్ కట్టాడు. ఈ సంక్రాంతి పండగ నుంచి ఉగాది పండగ వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. తప్పదు” అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ కు లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, మతాబులనేవి ఇష్టముండదు. వేస్తే అణుబాంబు వేస్తాడు. అందుకే న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని వచ్చాడు. గ్రేట్ థింగ్స్, సింపుల్, యాక్షన్ స్పీక్స్ మోర్ దేన్ వోర్డ్స్ అనేందుకు నిదర్శనం ‘అల వైకుంఠపురములో’. పాతికేళ్ల క్రితం నన్ను దత్తత తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పటికీ నాకు క్యారెక్టర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒక డ్యాన్స్ బిట్‌తో, డైలాగ్స్‌తో అందరిలోకీ నేను వెళ్లాను. ఈ సంక్రాంతికి మలయాళంలోనూ నేను ఆర్టిస్టుగా పరిచయమయ్యాను, ఈ సినిమాతో. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో సంక్రాంతికి మీముందుకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నవదీప్ లాగానే నేను కూడా దత్తతకు రెడీగా ఉన్నానని అరవింద్ గారికి తెలియజేసుకుంటున్నా. అల్లు రామలింగయ్యగారితో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది” అన్నారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ “ప్రస్తుతానికి ఇది అల మాత్రమే. తర్వాత ఇది ఉధృతంగా సముద్రమవుతుందని ఆ ఛాయలు మనకు తెలిసిపోతున్నాయి. ముందుగా ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టినందుకు, ఆ సారస్వతానికీ, ఆ లాలిత్యానికీ త్రివిక్రమ్ కు నమస్కారం చేస్తున్నా. వైకుంఠపురం ఆవల ఒక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఒక ఆటల తాంత్రికుడు బన్నీ, ఒక పాటల యాంత్రికుడు తమన్ ఉంటారు. ఈ సినిమాకి వెన్నెముక తమన్. ఈ సినిమా గొప్ప అనుభూతిని పంచింది. బన్నీ అలవోకగా డాన్సులు చెయ్యడం వెనుక ఉన్న కష్టం తెలిసింది” అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “నలభై రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ పండగలాగే రెండు సినిమాలతో మీ ముందుకు రావడం సంతోషం. ‘జులాయి’ నుంచి ఇదే కంపెనీ, ఇదే హీరో, ఇదే డైరెక్టర్.. ఇప్పుడు అల్లు అరవింద్ గారు జాయినయ్యారు. ఇలాంటి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఉండాలి. జీవితంలో మేం జంధ్యాల గారిని కోల్పోతే, భగవంతుడు మాకిచ్చిన మరో వరం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా సంథింగ్ స్పెషల్. ఇది మ్యూజికల్ హిట్. మా స్నేహితుడైన డ్రమ్స్ శివకుమార్ కొడుకు తమన్ ఇంత క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు నేనే చాలా గర్వపడుతున్నా. అందరం ఒక ఫ్యామిలీలా పనిచేశాం. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ సంథింగ్ స్పెషల్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇది నా జీవితంలో అతిపెద్ద పండగ” అని చెప్పారు.

సుశాంత్ మాట్లాడుతూ “నిజంగా ఈ జర్నీలో చాలా చాలా నేర్చుకున్నా. బన్నీ కెరీర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఇదొకటి. చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. ‘బుట్టబొమ్మ’ అన్న దానికి పూజ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా నాకిచ్చిన ఎనర్జీతో ఈ నెలాఖరుకి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా” అన్నారు.

తమన్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ గారి రైటింగ్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా విషయంలో నాపై చాలా బాధ్యతలు ఉన్నాయనిపించింది. త్రివిక్రమ్ ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తారు. బన్నీ గ్రేట్ డాన్సర్. అతనితో తొలిసారి ‘రేసుగుర్రం’కు పనిచేశాను. అతను చేసే హార్డ్‌వర్క్ అసాధారణం. లెజెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. లావుగా ఉన్న నన్ను పరిగెత్తించి గెలిపించింది. ఈ సినిమా నిజంగా గెలిచింది” అని తెలిపారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమాతో త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ అయ్యాను. దర్శకునిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయనకు అభిమానిగా మారాను. ఆయన గురూజీ అంతే. హారిక అండ్ హాసిని వంటి బ్యానర్‌లో రెండో సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అల్లు అరవింద్ గారు సెట్‌కి వచ్చారంటే ఒక వెలుగు వచ్చినట్లుంటుంది. ఆయన బేనర్‌లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ ఇవాళ బిగ్ స్టార్ అయిపోయాడు. మెసేజెస్‌కు కూడా రెస్పాండ్ కానంత బిజీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాకు ఆత్మనిచ్చాడు. అతనికి గోల్డెన్ పిరియడ్ నడుస్తోంది. రాం-లక్ష్మణ్ ప్రతి సినిమాకీ కొత్తగా ఫైట్లు ఇస్తుంటారు. వాళ్లు స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు. అల్ల్లు అర్జున్‌తో నన్ను రిపీట్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. ‘డీజే’ చేసినప్పట్నుంచీ బన్నీకి అభిమానినయ్యాను” అని తెలిపారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా కుటుంబం ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు కళామతల్లికి ఒక రూపమిస్తే, ఆమె కాళ్లదగ్గర సేదతీర్చుకుంటున్న కుటుంబం మేం. అల్లు రామలింగయ్య గారి నుంచి మా అబ్బాయిల దాకా.. ఇన్నేళ్ల నుంచీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. త్రివిక్రమ్ గారు మాకు కథ చెప్పినప్పుడు సింపుల్ కథే అనిపించింది. కానీ తన స్క్రీన్‌ప్లేతో గొప్పగా తీర్చిదిద్దారు త్రివిక్రమ్. రషెస్ చూసి బన్నీ అలవోకగా ఆ క్యారెక్టర్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయా. కానీ దానివెనుక ఉన్న కృషి నాకు తెలుసు. కలెక్షన్స్ పరంగా చూస్తే.. బన్నీ బెస్ట్, త్రివిక్రం బెస్ట్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ బెస్ట్స్‌లో ఒకటవుతుందని చెప్పగలను” అని చెప్పారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “సినిమాలో చున్నీ ఫైట్‌తోటే షూటింగ్ మొదలుపెట్టాం. అలా రాం-లక్ష్మణ్ మాస్టర్స్‌తో మొదలుపెట్టాను. వాళ్లతో ప్రయాణం నాకొక తాత్విక ప్రయాణం. ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. ‘సిత్తరాల సిరపడు’ అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రాం-లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు. అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఒక కొత్త ప్రయోగాన్ని నేను అనుకున్న దానికన్నా అందంగా తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం. దాన్ని విజయకుమార్ రాస్తే, తమన్ మంచి ట్యూన్స్ కట్టాడు. అలాగే ‘రాములో రాములా’ పాటలో బ్రహ్మానందం గారిని ఉపయోగించుకున్నాం. మామీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. ఆయన సినిమాలో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం చాలా కష్టమైంది. మొత్తానికి ఏనుగుకు విడుదల కలిగించాం. తనికెళ్ల భరణి నా మొదటి సినిమా నుంచీ కనిపిస్తూనే వస్తుంటారు. సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం ఒక రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా. అఫ్‌కోర్స్.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా తను నా మాటల్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్ముతాడో తెలీదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వచ్చాక ఇంకో 20 ఏళ్లకు నమ్ముతాడేమో. హర్షవర్ధన్, నేనూ రచయితలుగా జర్నీ మొదలుపెట్టాం. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లోటు ఉంది. దాన్ని ఆయన పూడుస్తారనేది నా నమ్మకం. ‘జులాయి’ నుంచి నేను రాజేంద్రప్రసాద్‌తో పడుతూనే ఉన్నాను. ఇంకా ఆయన్ని భరిస్తూనే ఉంటాను. వజ్రం కఠినంగా ఉంటుంది. అలా అని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా? రాజేంద్రప్రసాద్ కూడా అంతే. సుశాంత్ నన్ను కథ కూడా అడగలేదు. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వద్దన్నాడు. తను చేసిన పాత్రను నిలబెట్టాడు. పూజ టైంకు వస్తుంది, క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలున్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లిస్తుంది, ఈతరం అమ్మాయికి ప్రతినిధి కాబట్టే మళ్లీ రెండోసారి ఆమెను తీసుకున్నాను. ఐ రెస్పెక్ట్ హర్. ‘నేను నెగ్గేవరకు అయినట్లు కాదు’ అనేది తన వాట్సాప్ స్టేటస్. చాలా విషయాలు సినిమాటోగ్రాఫర్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌కు వదిలేశా. ఎడిటర్ నవీన్ గ్రేట్ జాబ్ చేశాడు. తమన్ ఇది బాలేదంటే, ఇంకోటి రెడీ చేసేవాడు. అందుకే సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మైగాడ్ డాడీ, అల వైకుంఠపురములో, సిత్తరాల సిరపడు వంటి ఆరు బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్టనే ఫీలింగ్‌ని క్రియేట్ చేసిన తొలి వ్యక్తి తమన్. మా అందరి పనినీ సగం తగ్గించేశాడు. మిగతావాళ్లు తనకు మ్యాచ్ చేస్తే చాలన్నట్లు చేశాడు. చినబాబు, అల్లు అరవింద్ ల కుటుంబ సభ్యుడ్ని నేను. మీరు కలగనండి.. మేము రియల్ చేస్తామన్నారు వాళ్లు. ఈ సినిమాకు మొదలు, చివర బన్నీనే. ఇద్దరం బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ తాగుతూ ‘అల వైకుంఠపురములో’ జర్నీ మొదలుపెట్టాం. అప్పట్నుంచీ మా ఇద్దరికీ ఇదే ప్రపంచం. ఎంతో తపన ఉన్న నటుడు. బన్నీ మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. చాలా అసాధరాణ స్టైల్ సెన్స్ ఉన్నవాడు. ఈ విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప నటుడు. ఇది నాకు తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. అతనిలోని నటన అక్కడక్కడ గ్లింప్సెస్ మాదిరిగా ఇదివరకు కనిపించింది. మొదట్నించీ చివరి దాకా అతనిలోని నటుడు కనిపిస్తే ఎలా ఉంటుంది.. అనే నా కోరిక ఈ సినిమాతో తీరింది. బంటు అనే క్యారెక్టర్‌ను ముందుపెట్టి, తను వెనకాల ఉండటం మామూలు ప్రయోగం కాదు. ప్రతి షాట్‌కూ అతనెంత కష్టపడ్డాడో లొకేషన్లొ ఉన్న మాకు తెలుసు. దాన్ని ఈరోజు మీరందరూ గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూడగానే ఒన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ అని అతనికి చెప్పాను. మునుముందు అతను ఇంకా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇస్తాడు. సచిన్‌కు ఫుల్ టాస్ వేస్తె ఏం జరుగుతుందో, ఈ సినిమా బన్నీకి అంతే”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ సినిమాతో ఎంటర్‌టైన్ చెయ్యగలిగే అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏడాదిన్నర క్రితం జూలై 26న నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్.. మై డియరెస్ట్ ఫ్యాన్స్.. థాంక్యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ టు లిటిల్ పేషెన్స్ అబౌట్ నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్. బికాజ్ ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ వైల్ మోర్. ఐ వాంట్ టు జెన్యూన్‌లీ డెలివర్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్ టేక్స్ టైం. థాంక్యూ ఫర్ అండర్‌స్టాండింగ్.. ఇవాళ సినిమా రిలీజైన తర్వాత ఒక వ్యక్తి నాకు పంపిన రిప్లైని భరణిగారు చదువుతారు” అని మైకు భరణికి ఇచ్చారు. భరణి “చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ” అని చదివి మైకు తిరిగి బన్నీకి ఇచ్చారు. బన్నీ కొనసాగిస్తూ “అది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రమ్ గారి డైలాగ్. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకూ, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ లవ్ నాకు అందింది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఆయనతో కలిసి చాలా సినిమాలు చెయ్యబోతున్నా. నార్త్ ఇండియాలో నేను చేసే ఫైట్లు ఇష్ట పడతారు. నాకొచ్చిన యాక్షన్ ఇమేజ్‌కు కారణం రాం-లక్ష్మణ్ మాస్టర్స్. బ్రహ్మానందం గారు మా తాతయ్య గురించి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. సునీల్, నేనూ కలిసి చేసిన బోర్డ్ రూం సీన్‌కి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మా ప్రతి కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అని ఆయన చెప్పిన మాట నిజం. వినోద్ సినిమాటోగ్రఫీ లేకపోతే సినిమాకు ఈ రేంజ్ ఉండేది కాదు. తమన్ మ్యూజిక్‌ని చాలా ఇష్టపడే ప్రేక్షకుడ్ని నేను. మా బావ (నవదీప్) బిగ్ బాస్‌లో ఉన్నా, పబ్‌లో ఉన్నా, షూట్‌లో ఉన్నా, సక్సెస్ పార్టీలో ఉన్నా, ఒక్కడే ఉన్నా, ఒకే వైబ్‌లో ఉంటాడు. హర్ష చాలా బాగా తన క్యారెక్టర్ చేశారు. రాజేంద్రప్రసాద్ గారితో వరుసగా మూడో హిట్టు కొట్టినందుకు హ్యాపీగా ఉంది. కథ వినకుండా ఓకే చేసిన సుశాంత్‌కు ఏదో ఒక స్కోర్ ఉండాలనుకున్నా.. క్లైమాక్స్‌లో ‘కొడితే ఫీలవుతారంకుల్’ అని చెప్పి నడుస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టారు. నేనేం కోరుకున్నానో అది అతనికి వచ్చింది. ‘జులాయి’తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మొదలైంది. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చేశాను. పూజతో ‘డీజే’ చేసేప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది, ఇంకో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నా. బేసిగ్గా ఒక హీరోయిన్ని రిపీట్ చెయ్యాలంటే కొంచెం భయపడతాను. నేను 20 సినిమాలు చేశాను కాబట్టి, నేను పాత. కొత్త హీరోయిన్‌తో చేస్తే కొత్తగా కనిపిస్తాననేది నా ఫీలింగ్. అందుకే ప్రతిసారీ కొత్తమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం. కానీ రిపీట్ చేసినా బాగుంటుందనిపించిన మొదటి అమ్మాయి పూజ. ఈ సినిమా చేశాక మరోసారి రిపీట్ చేసినా తప్పులేదనిపించింది. ఎప్పట్నించో ఒక పెద్ద సినిమా పడాలనేది నా కోరిక. దాన్ని క్రియేట్ చేసేదెవరు అనుకుంటూ వచ్చాను. ఒక లార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్క త్రివిక్రమ్ గారే మైండ్‌లోకి వచ్చారు. స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్ అనే విషయంలో మరో మాట లేదు. ఆయన మైండ్‌సెట్ ఎలా ఉందో తెలుసుకుందామని కలిశాను. జెన్యూన్‌గా, సరదాగా ఒక సినిమా చేద్దామనుకున్నాం. ఆ జెన్యూనిటీకి జనం కనెక్టయ్యారు. నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన ధైర్యమిస్తూ వచ్చారు.
డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మురళీశర్మ నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టుకి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడటం చాలా ఆనందంగా ఉంది. ఆయన వల్ల నా పర్ఫార్మెన్స్ ఇంకా ఎలివేట్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో నెపోటిజంపై నా అభిప్రాయం అడిగారు. దేవుడికి ఒక పూజారి కుటుంబం తరతరాలుగా తమ జీవితాన్ని ఎలా అంకితం చేస్తుందో, అలాగే మా కుటుంబం కూడా సినిమాకి మా జీవితాల్ని అంకితం చేసింది. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నా. దీన్ని నెపోటిజం అనుకుంటే అనుకోండి. మేం ప్రజలకు వినోదాన్ని పంచడానికి వాళ్లకు సరెండర్ అయ్యాం” అని చెప్పుకొచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Hero Kalyanram interview for Enthamanchi Vadavura

`అత‌నొక్క‌డే` నుండి `118` వ‌ర‌కు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ల్యాణ్‌రామ్‌. ఈయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామి అయిన  ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఇంట‌ర్వ్యూ….
టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
– `న‌మ్మిన బంటు` సినిమా పాట నుండి ఈ టైటిల్‌ను తీసుకున్నాం. క‌థ‌ను బ‌ట్టే టైటిల్‌ను పెట్టాం. పాజిటివ్‌నెస్‌ను మంచిత‌నం అంటాం. హీరో త‌ను చుట్టూ జ‌రిగే ప‌రిస్థితుల‌ను చెడుగా తీసుకోడు. హీరో జీవితంలో జ‌రిగే ఓ సందర్భంలో పాజిటివ్‌నెస్‌ను చూసుకున్న హీరో.. అలాగే పెరుగుతాడు. జీవితంలో ఇత‌రుల‌కు ఇవ్వ‌డం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాం. అలాంటి పాజిటివ్ టైటిల్ కావాల‌నుకున్న‌ప్పుడు డైరెక్ట‌ర్‌గారు `ఆల్ ఈజ్ వెల్‌` అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే స‌తీశ్‌గారి సినిమాలు టైటిల్ నుండే తెలుగుద‌నంతో ఉంటాయి. కాబ‌ట్టి మంచి తెలుగు టైటిల్‌ను మీ నుండి ఆశిస్తున్నాన‌ని చెప్పగానే.. `ఎంత మంచివాడ‌వురా` అనే టైటిల్‌ను పెట్టారు. మ‌నుషులంతా మంచోళ్లే.. ప్ర‌తి ఒక్క‌రూ వారి సైడ్ నుండి మంచివాళ్లే. కాక‌పోతే కొంద‌రు చేసే ప‌నుల వ‌ల్ల మ‌నం హ‌ర్ట్ అవుతాం. వారిని బ్యాడ్ అంటాం. మ‌నుషులంద‌రూ మంచోళ్లే.. అయితే వారు చేసే త‌ప్పును మ‌నం వాళ్ల‌కి చెప్పాలనేదే మా సినిమా కాన్సెప్ట్‌.
సినిమా క‌థాంశం ఏమో మంచిత‌నంతో ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి సినిమాలో నెగిటివ్ ట‌చ్ ఎలా చూపిస్తారు?
– శ‌త‌మానం భ‌వ‌తి అనేది ఓ ఇంట్లోని ఇద్ద‌రు పెద్ద వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థ అయితే.. శ్రీనివాస క‌ల్యాణం సినిమా పెళ్లికి సంబంధించింది. కానీ ఎంత మంచివాడ‌వురా వేర్వేరు మ‌న‌స్తత్వాలు, ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చి మార్చాడు? అనేదే సినిమా. క‌చ్చితంగా ఓ వ్య‌క్తిలో నెగిటివిటీ ఉంటుంది. దాన్ని హీరో ఎలా క‌ట్ చేశాడ‌నేదే సినిమా.
ఈ సినిమా త‌ర్వాత మీకు ఎలాంటి ఇమేజ్‌ను కోరుకుంటున్నారు?
– నేనెప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించ‌లేదు. నేను సినిమాలు అలాగే చేస్తూ వ‌చ్చాను. క‌థ న‌చ్చితే సినిమా చేశాను. అయితే రిపీట్ క‌థ, క్యారెక్ట‌ర్‌ లేకుండా ఉండేలా చూసుకున్నాను. ప్రేక్ష‌కులకు ఏదైనా కొత్త‌గా చూపించాలనుకుంటాను. ఉదాహ‌ర‌ణ‌కు `118` సినిమా త‌ర్వాత నాకు చాలా మంది థ్రిల్ల‌ర్ క‌థ‌లు చెప్పారు. అయితే అందులో నేనేదో కాస్త చిన్న‌పాటి తేడాతో చేయ‌గ‌ల‌ను కానీ.. కొత్త‌గా ఏం చేస్తాను. లుక్ ప‌రంగా మార్పు ఉంటుందేమో అనుకున్నాను. అదే క్యారెక్ట‌ర్, క‌థ కొత్త‌గా ఉంటుంద‌నుకోండి.. మ‌నం కూడా కొత్త‌గా ఆలోచిస్తాం. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం త‌ర్వాత నా భార్య వెళ్లి ఆ సినిమా చూశారు.  ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను. మీరెందుకు అలాంటి సినిమాలు చేయ‌రు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే ఎందుకు చేస్తారు? అని అడిగారు. అలాంటి క‌థ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా చేస్తాను అని త‌న‌కు అప్పుడు చెప్పాను. అది ఇప్పుడు కుదిరింది.
చాలా త‌ర్వగా చేసిన‌ట్లున్నారుగా?
– `118` త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను. రీమేక్ క‌థ‌లు కూడా చూశాను. ఓ రోజు కృష్ణ‌ప్ర‌సాద్‌గారు వ‌చ్చి `ఓ గుజ‌రాతీ సినిమా ఉంది మీరు చూడండి` అన్నారు. స‌రేన‌ని చూశాను. సినిమాలో మేజ‌ర్ పాయింట్ బాగా న‌చ్చింది. కానీ ఇత‌ర ఎలిమెంట్స్ నాకు పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. అప్పుడు ఆయ‌న `మీరు క‌థ వినండి స‌తీశ్ మార్పులు చేర్పులు చేశాడు` అన్నారు. స‌రేన‌ని విన్నాను. విన‌గానే ప్ర‌ధాన అంశాన్ని స‌తీశ్ ఎంత బాగా మార్చాడో  అనిపించింది. న‌చ్చ‌డంతో ఓకే అనిపించింది.
ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా?
– మెసేజ్‌లంటే ఏదో లెక్చ‌ర్ ఇచ్చిన‌ట్లు ఉండ‌దు. ఎంత మంచివాడ‌వురా అంటే ఓ క్యారెక్ట‌ర్ చేసే జర్నీ. త‌న‌కు కావాల్సిన రిలేష‌న్స్ తీసుకుంటూ, ఎదుటివాడికి కావాల్సిన ఎమోష‌న్స్ ఇచ్చే పాత్ర‌లో న‌టించాను.
మీ నిజ జీవితానికి  ఈ సినిమా ఎంత మేర‌కు క‌నెక్ట్ అయ్యింది?
– మేం అంద‌రం ఉమ్మ‌డి కుటుంబం నుండి వ‌చ్చాం. చిన్న‌ప్పుడు ఇంటికి పెద్ద‌మ్మ‌, పెద్ద‌నాన్న‌, ఇత‌ర రిలేటివ్స్ వ‌చ్చిన‌ప్పుడు చాలా బావుండేది. వాళ్లు వెళ్లేట‌ప్పుడు బాధ‌గా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. అంద‌రితో పొద్దునే క‌లిసి మాట్లాడ‌టం నాకు ఇష్టం. అలాంటి ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవ‌న్నీ నాకు బాగా న‌చ్చాయి.
ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
– ఇలాంటి పాత్ర చేయ‌డం చాలా సుల‌భ‌మ‌ని నేను చెప్ప‌ను. నేను మా ఇంట్లో ఎలా ఉంటాను అంతే సింపుల్‌గా ఈ క్యారెక్ట‌ర్ కూడా ఉంటుంది. కోపంతో క‌న‌ప‌డ‌కుండా, న‌వ్వుతూ క‌న‌ప‌డాల‌ని డైరెక్ట‌ర్ స‌తీశ్‌గారు అన్నారు. నా రియ‌ల్ లైఫ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్న క్యారెక్ట‌ర్‌.
మీ త‌మ్ముడు తార‌క్ ఇలాంటి సినిమా చేయ‌మ‌ని ఎప్పుడైనా స‌ల‌హా ఇచ్చారా?
– సాధార‌ణంగా మేం ఏ సినిమాలు చేస్తున్నామో వాటి గురించి చిన్న‌పాటి డిస్క‌ష‌న్ ఉంటుంది. అలాంటి డిస్క‌ష‌న్‌లో నేను ఈ క‌థ గురించి చెప్ప‌గానే త‌ను హ్యాపీగా ఫీల‌య్యాడు.
ఈ జర్నీ ఎలా అనిపించింది?
– సినిమాను దాదాపు 70 రోజుల పాటు షూట్ చేశాం. ఆ ప్ర‌యాణంలో టీమ్‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించింది. మున్నార్ ప్రాంతాల్లో సిగ్న‌ల్స్ కూడా లేక‌పోవ‌డంతో సెట్స్‌లో అంద‌రూ స‌ర‌దాగా గ‌డిపేవాళ్లం.
సంక్రాంతికి సినిమాలు ఎక్కువ‌గా విడుద‌ల‌వుతున్నాయిగా.. మీ సినిమా రిలీజ్ కావ‌డం?
– సంక్రాంతి రైతుల పండ‌గే కాదు.. మా సినిమా వాళ్ల‌కు కూడా పండ‌గే. ఫ్యామిలీ అంతా క‌లిసి సినిమా చూస్తుంది. ప్ర‌తిసారి సంక్రాంతి నాలుగు సినిమాలు వ‌స్త‌న్నాయి. మేమేదో వ‌చ్చేశామ‌ని కాదు.. పెద్ద బ‌డ్జెట్ సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు మీడియం బ‌డ్జెట్ సినిమాలు కూడా విడుద‌ల‌వుతుంటాయి. ఈ సీజ‌న్‌ను దాటితే ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ థియేట‌ర్‌కు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి. దానికి స‌మయం ప‌డుతుంది కాబ‌ట్టే సంక్రాంతికి రావాల‌ని అనుకున్నాం. మా బ‌డ్జెట్‌లో మాకు వ‌ర్కవుట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.
స‌తీశ్ వేగేశ్నతో జ‌ర్నీ ఎలా అనిపించింది?
– పూరిగారు, అనిల్ రావిపూడితో వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఎంత కంఫ‌ర్ట్ ఇచ్చారో స‌తీశ్‌గారు కూడా అంతే కంఫ‌ర్ట్ ఇచ్చి ప‌నిచేయించుకున్నారు. ఎప్పుడైనా టెన్ష‌న్ ఉన్నా.. రిలాక్స్ చేసేలా జోక్స్ చెప్పేవాడు.
మెహ‌రీన్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?
– మెహ‌రీన్ సూప‌ర్బ్ రోల్‌లో న‌టించింది. త‌న పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.
నిర్మాత‌ల గురించి?
– మ్యూజిక్ రంగంలో అగ్ర‌గామిగా ఉన్న ఆదిత్య సంస్థ నిర్మాణంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన తొలి చిత్ర‌మిది. ఏరోజూ ఖ‌ర్చు గురించి ఆలోచించ‌లేదు.
పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చాయిగా?
– నిన్ను కోరి సినిమా చూసిన త‌ర్వాత గోపీసుంద‌ర్‌గారి మ్యూజిక్‌లో సినిమా చేయాల‌నుక‌న్నాను. ఈ సినిమాతో తీరింది. అద్భుత‌మైన సంగీతం కుదిరింది. పాట‌లు వినేట‌ప్పుడు కూల్‌గా ఉన్నాయి. వాటిని తెర‌పై చూస్తున్న‌ప్పుడు ఇంకా బావుంటుంది. ఈ సినిమాలో ఏమో ఏమో ఏ గుండెల్లో .. సాంగ్ అయితే సినిమా అస‌లు క‌థేంటి అనే దాన్ని వివ‌రించేలా ఉంటుంది. ప్ర‌తి పాట క‌థ‌లో భాగంగా ర‌న్ అవుతుంది.
సొంత బ్యాన‌ర్‌లో సినిమా ఎప్పుడు ఉంటుంది?
–  ఉంటుందండి.. వివ‌రాలు చెబుతాను.

Superstar Mahesh In ‘Sarileru Neekevvaru’ Thank You Meet


Superstar Mahesh’s latest out and out commercial outing ‘Sarileru Neekevvaru’ presented by Dil Raju under his Sri Venkateswara Creations, Produced bt Ramabrahmam Sunkara under GMB Entertainment and AK Entertainments banners Directed by Young Talented Director Anil Ravipudi is released on January 11th worldwide. The film received ‘Blockbuster Kaa Baap’ talk on its first day and collected a terrific 46.77 crores share worldwide. On this occasion, the team has held a thank you meet on Sunday.

Superstar Mahesh said, ” I sincerely thank Telugu Cinema Audience, My Father’s Fans and My Fans. You all have brought us this year’s Sankranthi a bit earlier on January 11th itself. It’s really Mind Block numbers you all have given for our film. Hats-off to Telugu cinema. Thanks to each and every technician. I watch my every film on its release day with my kids. That’s my sentiment.  The role essayed by Vijkayashanthi garu can only be done by her.  I am happy that she is a part of this film. I did some very good films after ‘Dookudu’. We have to surrender to its script for content-oriented films like ‘Srimanthudu’, ‘Bharat Ane Nenu’ and ‘Maharshi’. Audience and Fans felt that my performance in ‘Sarileru Neekevvaru’ reminds them of ‘Dookudu’. I was excited when Anil garu narrated this story during the making of ‘F2’. I had a commitment then and so I told him that we will do it as my next film. But, after watching ‘F2’ I thought that this will be the right film for me at the moment. I told Anil garu that we will do it and I am glad that I made this decision. I am very happy. I am feeling a very different kind of excitement since yesterday with all the comments, the feedback I am getting from Fans of my Father and from My Fans. I will give the entire credit to Anil Ravipudi only. He expected this reception at the beginning of this project itself. Devi is one of my favorite Music Directors. The background score is very important for a film. I feel free when Devi is working on it. The track he has given for Alluri Seetharamaraju in this film has given goosebumps for me. In my 20 years of career, I have never seen such a response ‘Mind Block’ song is getting for my films. Anil Sunkara garu is like my family. He likes my father a lot. Mine and Dil Raju gari combination is hat-trick combination and we will score a double hat-trick. I want to give a hug to Anil Ravipudi on behalf of my father’s fans, my fans, and the audience for the success of ‘Sarileru Neekevvaru’.”

Viswa Nata Bharathi Vijayasanthi said, ” I am very happy that I gave my re-entry into films after 13 years with ‘Sarileru Neekevvaru’. I was adamant to do films again when Anil Ravipudi garu met me. After giving a thought about the role he narrated to me and I decided to do it. I am very happy to work with Mahesh garu. I worked with him in ‘Koduku Diddina Kapuram’ when he was a kid. Now after he became a Superstar, I acted with him again in this film. Many called me and appreciated my performance in this film. I did very powerful roles in ‘Osey Ramulamma’, ‘Pratighatana’, ‘Karthavyam’ films. The role in ‘Sarileru Neekevvaru’ also has so much weight. This character needs to be balanced from start to end. Ladies, especially are calling me and congratulating me. Thanks to Anil garu for giving me such a strong role. The audience is getting connected to the scenes between me and  Mahesh. The film has become a very big hit. Thanks to the artists and technicians of this film.”

AK Entertainments Anil Sunkara said, ” I took two words from Devi Sri garu during the beginning of the shoot. I wanted a song from this film should be played at every stage whenever Mahesh garu is getting on it. Keeping his word Devi has given the title song ‘Sarileru Neekevvaru’. Another one is I asked him to give a pakka mass number. ‘Mind Block’ song is being enjoyed by every Fan throughout the world. Anil Ravipudi has kept his promise and given us a blockbuster. I hope we reached Mahesh gari expectations with this film.  We made this film with all elements Fans and Family audience expect from Mahesh gari film. While watching the film in theatres, the reaction is 10 times what we have anticipated. It is reflecting in the form of collections. Vijayashanthi garu did a great job. Everyone is feeling very emotional about her scenes. Rashmika did well. We have enjoyed the association with Dil Raju garu. We will keep on hearing ‘Sarileru Neekevvaru’ anthem for every August 15th and January 26th. This journey with Mahesh garu is a beautiful and memorable one. For the first time in the history of Telugu Cinema, The distributors and Exhibitors have recovered 50% of their investment on the first day itself and This is the beginning only.”

Presenter Dil Raju said, “ Congrats to each and everyone from the team. Thanks to all for giving us such a big success. I scored a hat-trick with Mahesh garu as a producer. All four films I did with Anil Ravipudi have become successes. Thanks to Devi. We both worked together for 12 films. I am very happy that Vijayashanthi garu has made her re-entry with ‘Sarileru Neekevvaru’. Thanks to her. The film has become a very big hit. Our ‘Mind Block’ed seeing the day 1 collection all-over. We still have a festival ahead of us. We will see great numbers in the coming days. I can assure that this film will become the biggest in Mahesh gari films revenue-wise. We are already celebrating.”

Director Anil Ravipudi said, ” Thanks to the technicians and artists who have worked for this film. Thanks to Rathnavelu garu, Prakash garu, Thammiraju garu, Ram – Lakshman masters and especially to my direction and writing department. My producer Anil Snkara garu has provided everything needed for me. He looked after me very well. Thank you, sir. My journey with Dil Raju garu is continuing. Thanks to Devi Sri prasad garu for giving superb music. Rashmika did a good job with her unique mannerisms. Thanks to Rajendra Prasad garu and Prakash Raj garu. Vijayashanthi garu did a terrific job in this film. There is no replacement for her. Thanks to her. We tag our film with ‘Blockbuster Kaa Baap’. As the audience is owning and is connecting to each and every aspect, mannerisms in the film. They are speaking volumes about every element in the film. Seeing this kind of reception, we are calling our film as ‘Blockbuster Kaa Baap’. I got goosebumps every time I watch the Alluri Seetharamaraju gari episode. Devi gari re-recording has taken it to another level. Ram -Lakshman was behind that episode. Thanks to their judgment and experience. The main soul of the film is based on the army. The soldiers who are protecting us keeping their lives at stake want us to act responsibly. That message said by Mahesh gari’s role in this film has reached the audience. I can’t say about Mahesh garu in words. Thanks to him for giving me this opportunity. Thanks to the audience for making this film a blockbuster.”

Devi Sri Prasad said, ” We all need an opportunity for proving ourselves. Thanks to every film which comes as an opportunity to prove myself. Thanks to Anil Ravipudi who has written such a good script and Thanks to Mahesh garu for making it terrific onscreen with his act. Thanks to Dil Raju garu and Anil Sunkara garu. Anil Sunkara garu is also a passionate producer like Dil Raju garu. When I asked to do orchestra for The Anthem in Europe. Without a single thought, he agreed to do it. Thanks to the music team. They always encourage me. Thanks to media who have played a great role in taking our songs to the audience every Monday. Rashmika did a fine job in her role. Mahesh garu always keeps his faith in me. I can’t thank him enough for his support. I can’t express my gratitude in words for him. Vijayashanthi gari ‘Sathruvu’ is my favorite. She worked with my father. Thanks to the audience for making ‘Sarileru Neekevvaru’ a blockbuster.”

Cheema Prema Madyalo Bama Movie Relesing on Jan24th

‘‘సంక్రాంతి తరువాత చీమ-ప్రేమ U/A,’’ సంక్రాంతి శుభాకాంక్షలతో చీమ’’, ‘‘అతి త్వరలో చీమ – ప్రేమ మధ్యలో భామ’’, ‘‘నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు ఓ నజరానా’’
‘‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు ‘‘చెప్పకూడని రహస్యం – హీరో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మా సినిమా చూస్తే, థియేటర్లో చప్పట్లు, ఈలలు గ్యారంటీ! ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఈ జనవరిలోనే’’ అన్నారు.

సినీ నిర్మాత లక్ష్మీనారాయణ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ... ‘‘దర్శకుడు విలక్షణమైన శైలీలో తెరకెక్కించిన మా సినిమా ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’ పసందైన పాటలతో, అద్భుతమైన కథనంతో సాగుతూ పెద్ద సినిమాలకు ధీటుగా అందరినీ అలరిస్తుంది’’ అని అన్నారు. ఈ నెల 24 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.
అదే సందర్భంగా, హీరోయిన్ ఇలా అన్నారు… ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్ – ఎందుకంటే ఇది నా తొలి సినిమా! యువ ప్రేమికుల భావావేశాలతో సాగే సృజనాత్మకమైన కథ అందంగా ఉండి అందరికీ కనెక్ట్ అవుతుంది. చీమ హీరో కావడం ఇంకా స్పెషల్!’’
మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ – ప్రేమ మధ్యలో భామ !’. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు.
నటీనటులు :
అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.
సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు
నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

BHEESHMA Teaser Released

Nithiin & Rashmika Mandanna starring “BHEESHMA” film written & directed by VENKY KUDUMULA , Produced by SURYA DEVARA NAGA VAMSI under SITHARA ENTERTAINMENTS are released TEASER on 12TH JANUARY 2020 . Presently team is busy in wrap-up of final schedule. Speaking to media, producer SURYA DEVARA NAGA VAMSI said ,we are releasing our teaser which is small sample for our huge entertainer.

Speaking to media director VENKY said I am thankful to our handsome hero and cute heroine and technical team for their support in every situation.
And this teaser will entertain you to core and I hope definitely you will like it.
Movie is going to hit the screens on February 2020 .

Other Cast: NARESH, SAMPATH, ANANTH NAG , JISSHU SENGUPTA, , RAGHU BABU, BRAHMAJI, VENNELA KISHORE, SUBHALEKHA SUDHAKAR,
NARRA SRINIVAS, KALYANI NATARAJAN , RAJSHRI NAIR , SATHYAN , MIME GOPI , SATYA .
Music: MAHATI SWARA SAGAR,
D.O.P: SAI SRIRAM
Art director: SAHI SURESH,
Editor: NAVIN NOOLI
Co.director: SRI VASTAVA
Executive Producer : S.VENKATA RATHNAM (VENKAT)
stunts : VENKAT
Presents: P.D.V. PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
Story, Screenplay, Dailogues, Direction : VENKY KUDUMULA

Ala Vaikuntapuramulo Movie Review

Release date :January 12th,2020
Cinemarangam.com.. Rating : 3.5/5
Movie name:-”Ala Vaikuntapuramulo
Banners:-GeetaArts, Harika & Hasini Creations
Starring:-Allu Arjun,Pooja Hegde,Tabu,Jayaram,Murali Sharma, Sushant,Navdeep, Nivedita Pethuraju,Samudrakhani,Brahmanandam,Sunil,Rajendra Prasad,Brahmaji,Sachin Khedkar,Rohini,Rahul Ramakrishna,Vennala kishor,Thanikella Bharani,Ajay
Music Director :-S.S.Taman
Editor:-Naveen Nuli
Cinematography:-p.s.vinod
Director :-Trivikram
Producer :-Allu Aravind, S. Radhakrishna

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”అల వైకుంఠపురములో” సినిమా మీద బన్నీ ఫ్యాన్స్‌  చాలా ఆశలు పెట్టుకున్నారు. లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ తెర మీద కనిపిస్తుండటం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతమందించిన ఈ సినిమా ఆదివారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా..? లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చిన బన్నీ మెప్పించాడా..? త్రివిక్రమ్ మరోసారి మాయ చేశాడా..?

 కథ:

వాల్మీకి (మురళి శర్మ) అనే మధ్యతరగతి తండ్రి,మిలియనీర్ రామచంద్ర (జయరామ్) ఇంట్లో పనిచేసేవాడు.టబు, రోహిణిలు ఒకేసారి ఒకే హాస్పిటల్‌లో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిస్తారు,తన కొడుకు డబ్బున్న ఇంట్లో పెరగాలన్న ఆశతో బిడ్డలను ,తన మిలియనీర్ బాస్ రామచంద్ర (జయరామ్) బిడ్డతో ఆసుపత్రిలో మార్చేస్తాడు వాల్మీకి . ఏకైక సాక్ష్యం అయిన ఒక నర్సు ఆ సంఘటన తర్వాత కోమాకు వెళుతుంది. వాల్మీకి తన యజమాని కొడుకు బంటు (అల్లు అర్జున్) ను పెంచుతాడు,అదే సమయంలో అమూళ్య (పూజా హెగ్డే) నడుపుతున్న ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో బంటుకి ఉద్యోగం వస్తుంది. అలా మొదలైన అమూళ్య, బంటుల పరిచయం ప్రేమగా మారుతుంది. మరియు వాల్మీకి బంటుని వైకుంతపురంలో నివసించే అసలు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళకుండా చూస్తాడు. 20 ఏళ్ళకు  తరువాత,కోమలోనుంచి బయటకు వచ్చిన నర్స్ ద్వారా అనుకోని పరిస్థితుల్లో బంటు తన అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటాడు.ఈ కథకు దుర్మార్గుడైన అప్పల నాయుడు (సముద్రఖని) కి సంబంధం ఏంటి..? తన తల్లిదండ్రుల కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను అతను ఎలా పరిష్కరిస్తాడు?అనేది కథ .

నటీనటులు:

అల్లు అర్జున్ అద్భుతమైన నటనను అందించారు. పూజా హెగ్డే తన పాత్రకు న్యాయం చేసింది, మరియు హీరోతో ఆమె కెమిస్ట్రీ తెరపై చూడటానికి చూడముచ్చటగా ఉంది.ఈ చిత్రంలో ఆరు పాటలు స్విచ్ వేషన్ తగ్గట్టు ఉన్నాయి,లాంగ్ గ్యాప్‌ తరువాత స్క్రీన్‌ మీద  బన్నీ అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, సెంటిమెంట్‌ ఇలా అన్నింటిలో తనదైన స్టైల్‌లో చెలరేగిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అంతా వన్‌మేన్‌ షోలా సాగింది. వినోదం కూడా ఎక్కువే, కామెడీ టైమింగ్‌, స్టైలింగ్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సూపర్బ్‌ అనిపించాడు. అల్లు అర్జున్‌ను ‘స్టైలిష్ స్టార్’ అని ఎందుకు పిలుస్తారు అనేదానికి ఆ పోరాట సన్నివేశం ఒక్క నిదర్శనం.మరియు ఆ పాత్ర అతని కోసం తయారు చేసినట్లు అనిపిస్తుంది. అతను ఎమోషనల్, మరియు కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సన్నివేశాలలో రెండింటిలోనూ అద్భుతంగా చేసాడు. నౌకాశ్రయంలోని యాక్షన్ సన్నివేశం బాగుంది. త్రివిక్రమ్ చేసిన డైలాగులు కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్.. విలక్షణ నటుడు మురళీశర్మ మరోసారి తన మార్క్‌ చూపించాడు. కొడుకును నిరుత్సాహపరిచే తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. టబు, జయరామ్‌లు తమ పాత్రలో హుందాగా ఒదిగిపోయారు. ఎమోషనల్‌ సీన్స్‌ను వారి అనుభవంతో అద్భుతంగా పండించారు.నివేదాపేతురాజ్‌లు కేవలం గ్లామర్‌ షోకు మాత్రమే పరిమితమైంది. హీరోగా కొనసాగుతున్న సుశాంత్‌ను స్పెషల్ రోల్‌ కోసం తీసుకున్నా.. అనుకున్న స్థాయిలో వినియోగించుకోలేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో సునీల్‌, వెన్నెల కిశోర్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణ తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికత:

సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాకు ప్రధాన బలం తమన్ అందించిన సంగీతం. ఆడియో సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌ హిట్ అయ్యింది. సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మ పాటలు తెర మీద కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. మిగిలిన పాటలు కూడా అలరిస్తాయి. నేపథ్య సంగీతంలోనూ తమన్‌ తన మార్క్ చూపించి ది బెస్ట్ అనిపించుకున్నాడు. త్రివిక్రమ్‌ తన టేకింగ్‌తో ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు, త్రివిక్రమ్‌ మార్క్‌ కామెడీ ఆడియన్స్‌కు కితకితలు పెడుతుంది. త్రివిక్రమ్ చేసిన డైలాగులు కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్. సినిమాకు మరో ప్రధాన బలం పీఎస్ వినోద్‌ సినిమాటోగ్రఫి ప్రతీ ఫ్రేమ్‌ రిచ్‌గా కలర్‌ఫుల్‌గా చూపించేందుకు సినిమాటోగ్రాఫర్‌ పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. ముఖ్యంగా సాంగ్స్‌లో విజువల్స్‌ చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉన్నాయి. చార్ట్‌బస్టర్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్, బ్రిలియంట్ యాక్షన్ అండ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ మరియు డైలాగ్‌లు టెక్నికల్ ఫ్రంట్‌లోని ఆకర్షణలు. బన్నీ చేస్తున్న సినిమా కావటంతో నిర్మతలు అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీగా ఖర్చు చేశారు.

    Cinema rangam.com..3.5/5