Home Blog Page 972

Rahu Grand Release on Feb 21st

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులుకంప్లీట్ చేసుకున్న రాహు ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తన గాత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన‘‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’’ పాట ‘రాహు’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిధ్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట హాంటింగ్ సాంగ్అనిపించుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ:‘‘ ప్రేమకథా చిత్రంలా కనిపించినా.. ఇదో థ్రిల్లర్ మూవీ. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్ ని ప్రజెంట్ చేస్తూనే అనుక్షణం ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా కథనం సాగుతుంది.ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి అసెట్ గామారింది. థ్రిలర్స్  తెలుగులో కొత్త  ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్ గా మా టీం ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ,
కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు
నటిస్తున్నారు.
టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి

డిఓపి – సురేష్ రగుతు
మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్ – అమర్ రెడ్డి
పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా
నిర్మాతలు – ఏ.వి.ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల.
రచన-దర్శకత్వం – సుబ్బు వేదుల.

Battala Ramaswamy Biopic Movie Shooting Completed

సెవెన్ హిల్ల్స్ పతాకం పై నేహా శ్రీ అండ్ సుదీక్ష సమర్పణలో సతీష్ కుమార్ నిర్మాణం లో రామ్ నారాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్కు”.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో

దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ… మామూలుగా పెద్ద వాళ్ళ బయోపిక్ లనే సినిమాలుగా చేస్తారు.కానీ మేము ఒక కామన్ మ్యాన్ కథనే బయోపిక్కు గా రూపొందించాము. నిర్మాత సతీష్ గారు ఎక్కడ వెనకంజ వేయకుండా అన్నీ పనుల్లో చాలా సపోర్ట్ చేసి వర్క్ చేశారు. ఇక మిగతా టీమ్ అంతా నాకు గోల్డ్ గిఫ్ట్ లా దొరికారు. బట్టల రామస్వామి బయోపిక్కు అనే ఈ మా సినిమా టైటిల్ లో యాక్ట్ చేసిన అతన్ని మేము ఇప్పుడే రివీల్ చేయడం లేదు కానీ అతను మాత్రం ఇండస్ట్రీ కు మరో రాజేంద్రప్రసాద్ అవుతారు అని మాత్రం చెప్పగలను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించిన చిత్రం కనుక అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా అన్నారు.

నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ.నవంబర్ లో మొదలు పెట్టి డిసెంబర్ 18న గుమ్మడికాయ కొట్టాము. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశాము. కథను నమ్మి కథే హీరో అనుకొని చేసిన చిత్రం ఇది.స్యుశివేశనల్ కామెడీతో సినిమా చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. త్వరలో అది కూడా పూర్తిచేసి ఏప్రిల్ నెలాఖరులో కానీ మే నెలలో కానీ సినిమాను విడుదల చేయలనుకుంటున్నాము. ఈ 2020 మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము అన్నారు.
నటుడు భద్రం మాట్లాడుతూ.ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ బయోపిక్కు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగే కథాశం. పెళ్లైన కొత్తలో జంటకు ప్రతి రోజూ పండగలానే ఉంటుంది.. ఆ తరువాత కొన్నాళ్ళకు ముందుంది ముసళ్ళ పండగ లా అనిపిస్తుంది. అదే ఈ సినిమాలో చూపించడం జరిగింది. నా పాత్ర ఎప్పటిలానే ఆకట్టుకుంటుంది. ఈ 2020 లో సప్రైజ్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి రావు,సాత్త్వి,కెమెరామెన్ కర్ణ తదితరులు పాల్గొన్నారు…

ఈ చిత్రానికి డి.ఓ.పి కర్ణ పైరసాని,ఎడిటర్:సాగర్ దాడి,పి.ఆర్.ఒ:బి.వీరబాబు,మాటలు,పాటలు:వాసుదేవమూర్తి, ప్రొడ్యూసర్:సతీష్ కుమార్.ఐ ,కథ స్క్రీన్ ప్లే,సంగీతం,డైరెక్షన్ :రామ్ నారాయణ్.

Stylish Star Allu Arjun interview about Ala Vaikunthapurramloo

స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అల.. వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో జరిపిన సంభాషణ విశేషాలు.

ఇదివరకటి కంటే ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తున్నారు. ఆ రహస్యం ఏమిటి?
కారణం నా హెయిర్ స్టైల్. ఇంత లాంగ్ జుట్టు ఇదివరకు పెంచలేదు. ఈ సినిమా చేసిన 8 నెలలు నేను హ్యాపీగా ఉన్నాను. బయటకు కూడా అదే కనిపిస్తుందనుకుంటాను.

* ఇది బాలీవుడ్ ఫిల్మ్ ‘సోను కే టిటు కీ స్వీటీ’కి రీమేక్ అంటూ ప్రచారంలోకి వచ్చింది. నిజమేనా?
‘సోను కే టిటు కి స్వీటీ’ అనేది గీతా ఆర్ట్స్ లో రీమేక్ చేద్దామని అడిగారు. చాలామంది అది నాకోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందా అని నేను పర్సనల్ గా ఆలోచించా. ఆ టైంలో త్రివిక్రమ్ గారు, నేను కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్ అనిపించింది. అందుకే ‘సోను కే టిటు’ జోలికి వెళ్లకుండా ఈ స్టోరీతోటే ముందుకెళ్లాం.

* ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యాలని ఎందుకనుకున్నారు?
త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేసిన ‘జులాయి’లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటే, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఎమోషన్ ఎక్కువ డామినేట్ అయ్యి, ఎంటర్టైన్మెంట్ తక్కువ అయ్యింది. దాంతో మళ్లీ సినిమా చేసినప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చెయ్యాలని అప్పుడే ఇద్దరం అనుకున్నాం. అనుకోకుండా నా చివరి మూడు సినిమాలు ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ కొంచెం సీరియస్ సినిమాలు అయ్యాయి. నాక్కూడా ‘రేసుగుర్రం’ లాంటి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చెయ్యాలని ఉంది. త్రివిక్రమ్ గారు ‘అరవింద సమేత’ లాంటి సీరియస్ సినిమా తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చెయ్యాలనుకున్నారు. ఆయన దగ్గర ‘అల వైకుంఠపురములో’ స్టోరీ ఉంది. ఆ కథను ఆయన నాకెప్పుడో చెప్పారు. అది బాగుంటుందని అనుకున్నాక, దాన్ని డెవలప్ చేశారు. నేను ఇంతదాకా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడూ చెయ్యలేదు. నాకీ జోనర్ కొత్త. అందులోనే హీరోయిజం, యాక్షన్ కూడా బాగా కుదిరాయి. అలాగే పాటలు కూడా.

*ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తో మూడు సినిమాలు చేశారు. త్రివిక్రమ్ తో పనిచెయ్యడం సౌకర్యంగా ఉంటుందనా?
నా చివరి 10 సినిమాల్లో 3 త్రివిక్రమ్ గారితోనే చేశాను. ఆయనేమో నేను 10 సినిమాలు చేస్తే, వాటిలో 3 మీతోనే చేశాను అని ఆయనంటున్నారు. కొన్నిసార్లు ఒక హీరోకి, ఒక డైరెక్టర్ కి ఒక రిథం సెట్టవుతుంది. పాత రోజుల్లో చిరంజీవి గారికీ, కోదండరామిరెడ్డి గారికీ బాగా సెట్టయింది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా కలిసి చాలా సినిమాలు చెయ్యగల కెమిస్ట్రీ త్రివిక్రమ్ గారికీ, నాకూ మధ్య ఉంది. మేం ఒకళ్లనొకళ్లం బాగా అర్థం చేసుకుంటాం. ఆయనతో నాకంత సౌకర్యంగా ఉంటుంది కాబట్టే 3 సినిమాలు చెయ్యగలిగాను.

* ఆయనతో మూడు సినిమాలు చెయ్యడం ఒక యాక్టర్ గా మీకు ఉపయోగపడిందా?
మూడు సినిమాల్లో త్రివిక్రమ్ గారి తో పనిచెయ్యడం వల్ల ఒక యాక్టర్ గా ఎదగడానికి నాకు కచ్చితంగా ఉపయోగపడిందని భావిస్తాను. ప్రతి డైరెక్టర్ ఒక నటుడి నుంచి కొత్తగా ఏదో ఒకటి వెలికి తీస్తారు. ‘జులాయి’కి ముందు నేను ‘బద్రినాథ్’ చేశాను. అప్పటివరకు నేను చేసినవి ఒకెత్తు. ‘జులాయి’ నుంచి చూస్తే నా సినిమాలు మెచ్యూర్డ్గా, వేరే విధంగా ఉండటం కనిపిస్తుంది. యాక్టర్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ను రాబట్టడంలో త్రివిక్రమ్ గారు ఎక్స్పర్ట్. ‘జులాయి’లో అది మీకు కనిపిస్తుంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో మరింత బాగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోనూ పర్ఫార్మెన్స్ పరంగా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇందులో నేచురల్, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించా. ప్రతి సినిమా ఎదగడానికి మనకు లభించిన ఒక అవకాశం. కొంతమంది దర్శకులు మన బలాల్ని ఉపయోగపెడ్తారు. కొంతమంది దర్శకులు మనకు కొత్త బలాల్నిస్తారు. మనకు కొత్త బలాన్నిచ్చే కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ గారొకరు. మనల్ని మనం బెటర్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడే వ్యక్తి ఆయన.

*ఈ సినిమాకు ముందు తీసుకున్న గ్యాప్ లో ఏం నేర్చుకున్నారు?
ఒక మనిషి గ్యాప్ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు. అవి చిన్న చిన్న సింపుల్ విషయాలే కావచ్చు కానీ గొప్ప విషయాలు తెలుసుకుంటాడు. ఇంక లైఫ్ లో గ్యాప్ తీసుకోకూడదనే గొప్ప విషయం తెలుసుకున్నాను. ఒకటిన్నర సంవత్సరం సినిమా లేకపోయినా నా విషయంలో ఫ్యాన్స్ కనపర్చిన ఎంతూసియాజం మాత్రం, ప్రేమ మర్చిపోలేనివి. నా లైఫ్ లో వాళ్ల కోసం డెడికేట్ చేసినా అది వర్త్ అనిపించింది. చెప్పాలంటే ఈ మొత్తం గ్యాప్ ను నేను ఫీల్ కాకుండా చేసింది నా ఫ్యాన్సే. నన్ను ప్రేమించే వ్యక్తులు ఇంతమంది ఉన్నారనే విషయం ఈ గ్యాపే తెలియజేసింది. అంతేకాదు.. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటారనే విషయం నాకు తెలియజేసింది.

* ఇందులో మీ క్యారెక్టర్ ఏమిటి?
వైకుంఠపురం అనే ఇల్లుంది. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ల మధ్య జరిగిన సంఘటనలే ఈ సినిమా. ఈ సినిమాలో నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చేశాను. పూజా హెగ్డే బాస్ గా ఉన్న ఆఫీసులో పనిచేస్తుంటాను. నాకూ, మా నాన్నకూ పడదు. మా నాన్నగా మురళీశర్మ చేశారు. వైకుంఠపురం అనే ఒక పెద్ద ఇంటికీ, మాకూ ఉన్న కనెక్షన్ ఏమిటనేది సినిమాలో చూడాలి.

* సంక్రాంతి పోటీపై మీ అభిప్రాయమేమిటి?
సంక్రాంతి పోటీ అనేది యుగయుగాల నుంచీ ఉంది. దశాబ్దాల నుంచీ ఈ పండుగకు పెద్ద సినిమాలు వస్తూనే ఉంటున్నాయి. ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసే ఏ ప్రొడ్యూసర్ అయినా సోలో రిలీజే కోరుకుంటాడు. అలా వస్తే చాలా డబ్బులొస్తాయ్. సంక్రాంతికి రెండు మూడు సినిమాలైనా ఎందుకొస్తాయంటే, మిగతా రోజుల్లో సోలో రిలీజ్ కు వచ్చిన దానికంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. అందుకే ఎవరూ ఈ సీజన్ ను మిస్ చేసుకోవాలని అనుకోరు. అన్ని సినిమాలకూ ఈ పండుగకు చోటుంటుంది. అన్నీ ఆడాలని కోరుకుంటున్నా. మా సినిమాతో పాటు ‘దర్బార్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎంత మంచివాడవురా’ కూడా ఆడాలని ఆశిస్తున్నా.

* ‘సామజవరగమన’ సాంగ్ వెనుక ఉన్న కథేమిటి?
హైదరాబాద్ లో కుర్రాళ్లు తెలుగు పాటలు బాగా ఇష్టపడుతున్న విషయం తెలిసింది. తెలుగు రాక్ బ్యాండ్స్ కూడా తయారయ్యాయి. ఆ విషయం త్రివిక్రమ్ గారితో పంచుకున్నా. ఆ జోనర్లో ఒక పాట పెడితే క్లిక్ అవుతుందని చెప్పా. ఆ టెంపో తో తమన్ ఒక ట్యూన్ చేస్తే, దానికి త్రివిక్రమ్ గారు ‘సామజవరగమన’ అనే ఒక పదం రాశారు. ఆ తర్వాత సీతారామశాస్త్రిగారు ఆ పాట రాశారు. అది చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత 20 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లాగా షూట్ చేసి రిలీజ్ చేశాం. ఆ ఐడియా త్రివిక్రమ్ గారిది . ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.

*సినిమా విడుదలకు మూడు నెలల కంటే ముందే ఆ సాంగ్ రిలీజ్ చెయ్యాలనేది ఎవరి ఆలోచన?
అది నా ఆలోచన. అంత ముందుగా సాంగ్ రిలీజ్ చేద్దామని నేననగానే అందరూ భయపడ్డారు. హిందీ సినిమాల్లో అందరూ దాదాపు 4 నెలల ముందే సాంగ్స్ రిలీజ్ చేస్తుంటారు. మనకి కూడా ఆ కల్చర్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక పాట వ్యాప్తి చెందాలంటే టైం తీసుకుంటుంది. సినిమా అయితే ఒకటే స్టేట్ కాబట్టి పది, పదిహేను రోజుల్లో వ్యాప్తి చెందుతుంది. కానీ సాంగ్ అలా కాదు. అది జనాల్లోకి బాగా వెళ్లడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. అందుకే అంత ముందుగా ఆ సాంగ్స్ విడుదల చేశాం. అందుకే అవి అంత బాగా హిట్టయ్యాయి. ‘సామజవరగమన’కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే పేరు కూడా వచ్చింది.

మలయాళంలోనూ క్రేజ్ తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను దుబాయ్ తీసుకెళ్లి ఒక గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాలేతర వ్యక్తిని నేను. అలాగే కేరళలో బోట్ రేస్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. దానికి అక్కడి గవర్నర్తో పాటు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడ్ని నేనే. అది నాకొక్కడికి లభించిన గౌరవం కాదనీ, మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవమనీ నాకు అనిపించింది.

* మీ పిల్లల్ని షూటింగ్ కు తీసుకెళ్తుంటారా?
అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. దానికో రీజన్ ఉంది. ఇదివరకు జనరేషన్ వాళ్లు పిల్లల్ని షూటింగ్ కు తీసుకెళ్తే పాడైపోతారనే ఫీలింగ్తో ఉండేవాళ్లు. పిల్లలకు సినిమాలు కూడా చూపించేవాళ్లు కాదు. రియాలిటీకి దూరంగా పెట్టేవాళ్లు. అది నాకు డబుల్ స్టాండర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది నేను చేసే పని. నన్ను ఈ స్థాయికి తెచ్చింది సినిమాయే. నాన్న ఏం చేస్తుంటాడనే విషయం నా పిల్లలకు తెలియాలి, నా లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి. అందుకే వాళ్లను తీసుకెళ్తుంటాను.

Heroin Rashi Sing Busy With Upcoming Movies

పోస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన భామ రాశి సింగ్. తన తొలి సినిమాతోనే తెలుగు మాట్లాడటం నేర్చుకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆది సాయి కుమార్ తో ఒక సినిమా, దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు  సాయిరామ్ శంకర్ మరియు అరవింద్ కృష్ణ లు హీరోలుగా ఒక సినిమా, శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జెమ్ అనే సినిమాలో నటిస్తూ మరికొన్ని సినిమాలకు కథలు వింటున్నా అని చెప్పుకొచ్చింది ఈ ఛతీస్ ఘడ్ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు తెలుగు మాట్లాడుతుండటం తో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ కలిగి ఉండటం వలన ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా ఒకే అంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏది ఏమైనా హీరోయిన్స్ కి తెలుగు మాట్లాడటం వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పుష్కలంగా వస్తాయని హీరోయిన్ రాశి సింగ్ మరోసారి నిరూపించింది.ఈ అమ్మడు నటించిన సినిమా పోస్టర్ అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Kapil Dev’s first devil — Sunil Gavaskar!

Our favorite Sunny, the Little Master wielding his legendary bat and making his way to win India’s first ever World Cup trophy!

Heroin Kangana Ranauth,Directer Aswini Ayyar Thivari interviews for Panga Movie

సూపర్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా అశ్వినీ అయ్యర్ తివారీ డైరెక్ట్ చేసిన సినిమా ‘పంగా’. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు.  జనవరి 24న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో కంగన, అశ్విని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వాళ్లు జవాబిచ్చారు.కంగనా రనౌత్

‘పంగా’లో మీ పాతేమిటి?
ఒక మిడిల్ క్లాస్ విమన్గా, అందులోనూ బిడ్డల తల్లిగా నటించా.  తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది. మహిళ సాధికారత  కోసం చాలా సినిమాల్లో నటించాను.. కానీ ‘మణికర్ణిక’ తరువాత ఈ సినిమాలో నేను ఓ తల్లిగా జీవించాను.
డైరెక్టర్ అశ్వినితో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
అశ్విని మంచి డైరెక్టర్. నా గురించి తనకు చాలా మంది అనేక విషయాలు చెప్పినా వాటిని  అశ్విని ఎప్పుడు పట్టించుకోలేదు. వర్క్పై మంచి ఫోకస్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. నేను చాలా మందితో వరుసగా సినిమాలు చేశాను. కంగనాతో పని చేయడం కష్టం అని మాట్లాడిన వారికి అశ్విని  లాంటి వారే సమాధానం చెప్తున్నారు.
ఈ కథలో మీకు నచ్చిన విషయమేమిటి?
ఇందులో నాది నేషనల్ లెవల్ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆ ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర. అశ్విని స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్, అందులోని కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చాయి. జనరల్గా  సెట్ కి  వెళ్లే ముందే నేను సీన్ గురించి తెలుసుకుంటాను. కానీ ‘పంగా’ సమయం లో నా పరిస్థితులను అర్ధం చేసుకుని.. నాకు ప్రతి విషయాన్ని అశ్విని వివరంగా చెప్పేవారు.
ఇప్పుడు జయలలిత బయోపిక్ చేస్తున్నారు కదా.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మీ అభిప్రాయమేమిటి?
అంతకుముందు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తూ, హైదరాబాద్, చెన్నై తిరుగుతూ నేను పూర్తి సౌత్ ఇండియన్గా మారిపోయా. సౌత్ ఇండియాలో గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్ నాకు బాగా నచ్చింది.

అశ్విని అయ్యర్

సమాజంలో మహిళా సాధికారికత ఎలా ఉందని అనుకుంటున్నారు?
మన సమాజంలో మహిళ సాధికారత గురించి చర్చిస్తున్నాం కానీ  వాటి అమలు అంతగా లేదు.
ఇంట్లో భర్త రోల్ ఎలా ఉండాలంటారు?
ఈ సినిమాలో కంగన పేరు జయా నిగం. ప్రతి ఇంట్లో ఒక జయ వుంది. మగవాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లో ప్రతి విషయం నచ్చుతుంది. ఒకసారి పెళ్లై పిల్లలు పుట్టాక మాత్రం మహిళకు సంబంధించిన ప్రతి విషయం మారి పోతుంది. కానీ ఇవాళ్టి రోజున పరిస్థితి అది కాదు..  పిల్లల పెంపకం ఇద్దరి బాధ్యత. భర్తే భార్యకి సపోర్ట్ చేయకపోతే ఇంక ఎవరు చేస్తారు!
ఈ సినిమాతో ఆ సందేశం ఇద్దామనుకున్నారా?
కంగనా వంటి సూపర్ స్టార్ ద్వారా  మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పించడం బావుంటుంది. ఈ సినిమా ద్వారా కొంతమందైనా ఆలోచిస్తే, దీన్ని తీసిన ప్రయోజనం నెరవేరినట్లే. ఎందుకంటే దాదాపు 40 శాతం మహిళలు పిల్లలు పుట్టాక జాబ్ మానేస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి.
కంగననే ఈ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు?
కంగన ఎలాంటి నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంగనా లాంటి నటి మాత్రమే ఇలాంటి ఒక స్క్రిప్ట్ కి న్యాయం చేస్తారు అనిపించింది. ఆమెకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు  వెంటనే ఒప్పుకున్నారు. కబడ్డీ అనేది కామన్మ్యాన్ ఆట. అందుకే మేము కండల గురించి చెప్పలేదు. తల్లిగా, క్రీడాకారిణిగా జీవించే వాళ్లు కావాలని ఇందులో చెప్పాం.
ఆమెతో పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఈ సినిమా  కోసం దాదాపు 2 ఏళ్ళు పనిచేసాము. ఇప్పుడు మేము ఒక కుటుంబంలా మారిపోయాం. సెట్స్పై తను పూర్తి ప్రొఫెషనల్. బయట మేం స్నేహితులమై పోయాం. నేను తనతో జీవిత కాలం సరిపోయే ఎమోషనల్ అగ్రిమెంట్  చేసుకున్నాను. యాక్టర్, డైరెక్టర్ మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఒక కుటుంబంలో ఎప్పుడు, ఎవరు కోప్పడకుండా ఉంటారా! ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి

Sarileru Neekevvaru Movie Review

Release date :January 11th,2020
Cinemarangam.com.. Rating : 3.5/5
Movie name:-”Sarileru Neekevvaru
Banners:-AK Entertainments,Sri Venkateswara Creations,G.Mahesh Babu Entertainment,
Starring:- Mahesh Babu, Vijayashanthi, Rashmika, Prakash Raj, Rajendra Prasad,  Bandla Ganesh, Rao Ramesh
Music Director :-Devi Sri Prasad
Editor:- Tammiraju
Cinematography:-Ratnavelu
Director :-Anil Ravipudi
Producer :- Rama Brahmam Sunkara

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తరవాత రీఎంట్రీ ఇస్తోన్న సినిమా ఇది. దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 11న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

కథ :  అజయ్ కృష్ణ (మహేష్ బాబు) భారత ఆర్మీలో మేజర్. పాక్ చేతిలో బంధించిన పిల్లలను కాపాడటానికి తన టీమ్ తో శత్రువుల పై దాడికి వెళ్తాడు.ఈ క్రమంలో తన టీమ్ లో అజేయ్ (సత్యదేవ్) అనే సోల్జర్ గాయపడి చనిపోయే పరిస్థితులోకి వెళ్తాడు. అయితే అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి (భారతి)కి ఈ విషయం చెప్పి.. భరోసా ఇవ్వడానికి అజేయ్ కృష్ణ కర్నూల్ కు రావాల్సి వస్తుంది. ఈ మధ్యలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం.. ప్రేమ అంటూ వెంటపడటం జరుగుతుంది. ఆ తరువాత జరిగిన ఊహించని సంఘటనల రీత్యా కర్నూల్ లో విజయశాంతి (భారతి)ని ఆమె పిల్లలను చంపడానికి విలన్ (ప్రకాష్ రాజ్ గ్యాంగ్) వెంట పడుతూ ఉంటారు. వాళ్ళను మహేష్ ఎలా సేవ్ చేశాడు? అసలు విజయశాంతి (భారతి) ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? చివరికి మహేష్ ఏం చేశాడు అనేది మిగతా కథ.

నటీనటులు:

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాతో పాటు సరికొత్త వైఖరి మరియు శైలితో తిరిగి వచ్చారు. ఈసారి మిలటరీ ఆఫీసర్‌గా నటించాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నసినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ లో సమృద్ధిగా లభిస్తుంది.ప్రారంభ సన్నివేశం నుండే, ఏదో ఒక ప్రత్యేకత  ఉందనే భావన మనకు వస్తుంది. రైలు ఎపిసోడ్‌లోని ‘లుంగీ దృశ్యం’ అతని స్వేచ్ఛా-ఉత్సాహభరితమైన సరదా వైపు చూపిస్తే, కొండా రెడ్డి బురుజు విరామం బ్లాక్ మాస్ కోణాన్ని హైలైట్ చేస్తుంది. అదేవిధంగా, రెండవ భాగంలో, వైవిధ్యాలతో వచ్చే రెండు హెచ్చరిక సన్నివేశాలు అభిమానులను మరియు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ‘మైండ్ బ్లాక్’ లోని నృత్యం అందరి మనసులను కదిలించడం ఖాయం.వన్ మ్యాన్ షోగా సాధారణంగా సూచించే దానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సరైన ఉదాహరణ. మహేష్ బాబు తీవ్రమైన సరదా రీతిలో ఉన్నాడు,లేడీ అమితాబ్ విజయ శాంతి చాలా కాలం తర్వాత సినిమాల్లోకి తిరిగి రావడం వల్ల గణనీయమైన పాత్ర ఇవ్వబడింది. ఈ చిత్రం యొక్క ప్రధాన కథకు ఆమె వెన్నెముక. సీనియర్ నటి ఈ భాగానికి సరిగ్గా సరిపోతుంది మరియు దానికి ప్రత్యేక ప్రకాశాన్ని జోడిస్తుంది.హీరో పాత్ర కోసం పరిపూర్ణతకు పడిపోయే హైపర్యాక్టివ్ అమ్మాయిగా రష్మిక మండన్న నటిస్తుంది. ఈ రచన ఆమె భాగానికి అద్భుతమైనది, మరియు దానితో వెళ్ళే వ్యక్తీకరణలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపడం ఖాయం.మనం చెప్పాల్సిందల్లా “అర్ధమవుతుందా?”..

ప్రకాష్ రాజ్, కొంతకాలం తర్వాత, ప్రతికూల పాత్ర పోషిస్తున్నారు. అతను దానిని తన అనివార్యమైన శైలిలో అమలు చేస్తాడు, అది సరదా మరియు గంభీరత కలయిక. అతను మరియు మహేష్  పాల్గొన్న సన్నివేశాలు పెద్ద తెరపై చూడటానికి ఒక ట్రీట్. అదే విధంగా, రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ నమ్మదగినది మరియు సరదాగా అందించడంలో సరిపోతుంది.మిగిలిన సినిమాలో సహాయక భాగాలలో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. విసుగు చెందిన భర్తగా రావు రమేష్ రైలు ఎపిసోడ్‌లో వివాహానికి సంబంధించిన తన ఫ్లాష్‌బ్యాక్‌తో కామెడీ షో. సంగీత, హరితేజా, పిల్లలు మొదటి అర్ధభాగంలో సరదాగా అందిస్తారు. అజయ్, సుబ్బరాజు, వెన్నెలా కిషోర్, పోసాని కృష్ణ మురళి, మరియు ఇతరులు రెండవ భాగంలో వినోదాన్నిచ్చారు. .

సాంకేతిక కోణాలు:

ఇక దర్శకుడు అనీల్ మహేష్ లోని కామెడీ యాంగిల్ ను మరోసారి అద్భుతంగా చూపించారు.అంతే కాకుండా కామెడీని మించిన యాక్షన్ ను చూపించారు.అయితే అనీల్ ఎంచుకున్న కథలో పెద్దగా కొత్తదనం లేకున్నా దాన్ని ఆవిష్కరించిన తీరే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మరియు బలం. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే,  ఫస్ట్ హాఫ్ లోని కామెడీ, యాక్షన్ తో మొదలు పెట్టిన అనీల్ సెకండాఫ్ లో కూడా అలాగే మైంటైన్ చేసుకొని వచ్చారు.కథ పెద్దగా కొత్తగా అనిపించకపోయినా స్క్రీన్ ప్లే మంచి ఎంటర్టైనింగ్ గా మలచడం మూలాన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మారిపోయింది  ,అనీల్ మార్క్ కామెడీ ట్రాక్స్, మహేష్ మాస్ ఎలివేషన్ సీన్స్ వాటికి తగ్గట్టుగా దేవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి,ఎందుకంటే దేవి సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్రయోజనం ,అనిల్ రవిపుడి కొన్ని క్రేజీ వన్-లైనర్స్ మరియు మంచి మాస్ డైలాగ్స్ ఇచ్చినందున డైలాగులు అద్భుతమైనవి. కథ మరియు వినోదం చక్కగా స్థిరపడినందున మొదటి భాగంలో స్క్రీన్ ప్లే అద్భుతమైనది.రెండు పాటల కోసం శేఖర్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ అద్భుతమైనది మరియు ముఖ్యంగా మైండ్ బ్లాక్ పాట కోసం.పాటల్లోని సాహిత్యం చాలా బాగుంది మరియు మహేష్ బాబు కోసం స్టైలింగ్ కూడా చేశారు.భావోద్వేగ విషయాలను చెక్కుచెదరకుండా, అనిల్ క్రమం తప్పకుండా చక్కని కామెడీని ప్రేరేపించాడు. ఒక రకంగా చెప్పాలంటే, అతను సరైన మోతాదులో వినోదంతో ఈ చిత్రాన్ని చాలా తెలివిగా ప్యాక్ చేశాడని మరియు ప్రేక్షకుల ప్రతి విభాగానికి అందించాడని చెప్పగలను.కానీ రొటీన్ స్టోరీ మరియు ఊహించగలిగే కథనాలు మైనస్ అని చెప్పాలి. కాకపోతే అనీల్ టేకింగ్ మాత్రం వీటిని కవర్ చేసేస్తాయి.ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ చిత్రం గొప్పగా కనబడుతున్నందున అనిల్ సుంకర నిర్మించిన విలువలు అగ్రస్థానంలో ఉన్నాయి. తన అద్భుతమైన సెట్ల కోసం క్రెడిట్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కి వెళ్ళాలి. కర్నూలు యొక్క ప్రసిద్ధ కొండా రెడ్డి బురుజు అద్భుతంగా కనిపిస్తోంది మరియు ఈ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలన్నీ అద్భుతమైనవి.మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బొమ్మ దద్దరిల్లింది అని చెప్పాలి.

         Cinema rangam.com..3.5/5

Directer Trivikram interview about Ala Vaikunthapurramloo

‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఆయన దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు…

ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది, అంచనాలు పెరిగిపోతాయి. ఎప్రిసియేషన్ తగ్గిపోవడం మూలంగా, క్రియేట్ చేసేవాళ్లకు మన పనిలో ఏమైనా లోపముందా అనిపించే ఛాన్స్ ఉంది. దాంతో దారి మార్చుకొని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. లేదంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం మూలంగా ఆ బరువుకు కుంగిపోయి, చెప్పాలనుకున్నది చెప్పలేక కుంగిపోయి, ఒక నార్మల్ లేదా సేఫ్ రూట్లోకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ‘అరవింద సమేత’ నుంచి నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్ గా ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్ గా ఉండే సాగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ మైండ్లోకి కూడా రానివ్వలేదు. దాన్ని నేను బిగ్గెస్ట్ టేకెవేగా ఫీలవుతా. ‘అరవింద తర్వాత’ మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే ‘అల వైకుంఠపురములో’ సినిమా తీశా.

*సినిమాలు చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ జానర్, ‘అల వైకుంఠపురములో’ జానర్ వేర్వేరుగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతారని నేననుకుంటున్నా. ట్రైలర్ లను బట్టే అవి భిన్న తరహా కథలని తెలిసిపోతుంది.

*ఈ సినిమా ప్రధానంగా ఏ పాయింట్ మీద నడుస్తుంది? కొత్తగా ఏం చెప్పారు?
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయి ఇవ్వలేం. స్థాయి అనేది ఎవరికి వాళ్లు తెచ్చుకోవాల్సింది. ఇదే థాట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఇల్లు ఆధారం. మనం ఏ కథ చెప్పినా రామాయణ భారతాలు దాటి చెప్పలేమనేది ఈ ప్రపంచంలో అందరూ ఒప్పుకొనే మాట. వాటిని దాటైతే మనం కొత్త కథ చెప్పలేం. అందువల్ల వాటికి సంబంధించిన ఏదో ఒక ఛాయ కథలో కనిపిస్తూ ఉండవచ్చు.

*మీ బలం హ్యూమర్. ‘అరవింద సమేత’ను అందుకు భిన్నంగా తీశారేం?
కొత్త కథ ఎత్తుకోవడంలో తప్పు లేదు. అర్జునుడు బాణాలు బాగా వేస్తాడు. అవసరమనుకున్నప్పుడు, అప్పుడప్పుడు కత్తి తీయడంలో తప్పులేదు. శత్రువు మనకు బాగా సమీపానికి వచ్చినప్పుడు బాణం తీసి, ఎక్కుపెట్టి వేసే సమయం ఉండదు. అప్పుడు కత్తితీసి నెగ్గితే తప్పేమీ లేదు కదా. ఒక్కోసారి మన బలాలు లేకుండా కూడా ఫైట్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల కొత్త కథలు సమకూర్చుకోవడంలో తప్పులేదనుకుంటాను. జనంలోని ఇష్టం, అభిమానం కూడా మనల్ని బందీని చేస్తుంది. భయాన్ని గెలవడమనేది గేం ఆఫ్ లైఫ్ అంటాను.

*‘అల వైకుంఠపురములో’ పేరు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏమిటి?
పోతన గారి పద్యమే స్ఫూర్తి.

*మిమ్మల్ని ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది?

*ప్రేక్షకులు అభిమానించేది మనం ఇచ్చే వర్కుని, మనల్ని కాదు. దాన్ని డిటాచ్డ్ గా చూస్తేనే, వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం, లేకపోతే మరీ సీరియస్ అయిపోయి, స్తబ్దతకు గురవుతాం. కాబట్టి ఆ సినిమావరకు మనం ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చేసిన ఏ సినిమా కూడా నచ్చలేదని చెప్పారంటే, అప్పటిదాకా నేను చేసిన పని నేను చేసినట్లు కాదు, తర్వాత చేసేపని కూడా నేను చేసేది కాదు. ఆ క్షణానికి వాళ్లకు నచ్చదు. ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున్న సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ఎఫెక్ట్ చెయ్యదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు. ప్రేక్షక దేవుడంటే మనం తెలుసుకోవాల్సింది.. పొజిషన్ కాదు, కండిషన్. అదొక స్థితి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక అమ్మాయిమీద యాసిడ్ పోస్తే వాడు దేవుడెలా అవుతాడు!

* పాటల వెనుక మీ మ్యూజిక్ టేస్ట్ ఉందా? ముఖ్యంగా ‘సామజవరగమన’ పాటలో మీ ఇన్పుట్స్ ఉన్నాయంటారు?
నాకు సంగీతం చెయ్యడం రాదు, పాడ్డం రాదు. నాలో ఎన్నో కోరికలు.. గిటారు వాయించాలని, అమ్మాయిలు నావైపు ఆరాధనగా చూడాలని.. ఉండేవి. కానీ నాకు ఏవీ రావు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఒక్క సిద్ శ్రీరాం వాయిస్ తప్ప, లైవ్ గా ఎగ్జాక్టుగా మీరు ఏ పాటైతే ఇప్పుడు వింటున్నారో దాన్ని తమన్ నాకు వినిపించేశాడు. అప్పుడు ‘సామజవరగమన’ అనేది పెడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశానంతే. శాస్త్రి గారికి చెబితే, 45 నిమిషాల్లో పాట రాసేశారు. ఈ పాటను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని చెప్పింది బన్నీ. అప్పుడు ఆలోచించి, తమన్, సిద్ శ్రీరాం లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు షూట్ చేసి రిలీజ్ చేశాం. కాకినాడలో షూటింగ్ జరిగేటప్పుడు బన్నీ, నేను, తమన్.. ముగ్గురం కూర్చొని.. ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓమైగాడ్ డాడీ’ పాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలని మూడు పేజీలు రాసుకున్నాం. అప్పటికి ఆ మూడు పాటలూ ట్యూన్స్ పూర్తయి ఉన్నాయి.

*‘అల వైకుంఠపురములో’ సినిమా ఎలా ఉంటుందనుకోవచ్చు?
జనం థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తారు. చీర నేసినవాడికి దాని అందం తెలీదు. ఒక అనుభూతితో నేసుకుంటూ వెళ్లిపోతాడు. నేనూ అంతే. నా సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. ఒక సినిమాతో నేనింత ఎత్తుకు ఎదగాలని ఏ దర్శకుడూ అనుకొని చెయ్యడు. కథ రాసేంతవరకే రచయిత దానికి రాజు. తర్వాత ఆ కథకు అతను బానిస.

* డైలాగ్స్ అలా రాయాలని ఆలోచించి రాస్తారా? ఎక్కడ కూర్చొని రాస్తుంటారు?
డైలాగ్స్ గురించి నిజంగా నేను ఆలోచించను. స్పాంటేనియస్ రచయితగా నన్ను నేను చూసుకుంటా. నేనెక్కడికో వెళ్లి రాస్తుంటానని అనుకుంటారు. నేను మా ఇంట్లోనే రాసేసుకుంటూ ఉంటాను. నేను చాలా తేలిగ్గా, ప్రశాంతంగా పనిచేయడానికి ఇష్టపడతా.

* ఈ మధ్య మీ సినిమాల్లో స్త్రీలపై గౌరవాన్ని పెంచే పాత్రలు కనిపిస్తున్నాయి. కాన్షియస్ గానే వాటికి ప్రాముఖ్యం కల్పిస్తున్నారా?
1950ల నుంచి 1970 దాకా కూడా ఇంట్లో స్త్రీలే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్లు. అంటే పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం ఉండేది. ఇంటికి సంబంధించిన అన్ని పనులూ వాళ్ల ద్వారానే నడిచేవి. ’70ల తర్వాత ప్రయాణాలు పెరిగి, ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సి రావడం వల్ల ఇళ్లల్లో వాళ్ల భాగస్వామ్యం తగ్గింది. తెలీకుండా మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమవడం, మన మూలాల్ని మనం వదిలేయడం, దాంతో వాళ్లను అగౌరవపరిచేవిధంగా చూడటం, అలా మనం మగవాళ్లమే చూడ్డం వల్ల, లేని ఒక యాక్సెప్టెన్స్ రావడం, వాళ్లు మౌనంగా ఉండటాన్ని కూడా మనం యాక్సెప్టెన్స్ కింద చూడ్డం వంటివి 35 ఏళ్లు నడిచాయి. నాకు తెలిసి ఇప్పుడవి మారిపోయాయి. ‘అత్తారింటికి దారేది’ అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని, తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. పెళ్లిలో అల్లుడ్ని విష్ణువుగా చూస్తాం. అందుకే కాళ్లు కడుగుతాం. అంటే అల్లుడి బాధ్యతను పెంచడం కోసం అతని కాళ్లు కడుగుతాం. అలాంటివాడు అత్తతోటి ఎలా వేళాకోళమాడతాడు? అతను దేవుడిలాగే బిహేవ్ చెయ్యాలి. అందర్నీ బాగా చూసుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. కాన్షియస్గా నేను వాటిని చెప్పాననట్లేదు.

* ఇటీవల మీ సినిమాల్లో కథ ఒక ఇంటిచుట్టూ నడవడం కనిపిస్తుంది. ఎందుకలా?
మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే ‘హోం కమింగ్’ అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో ‘వైకుంఠపురం’ అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా పెట్టా.

* మీ డైలాగ్స్ వల్లే సినిమాలు హిట్టయ్యాయనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వస్తున్న రైటర్స్ కొంతమంది మిమ్మల్ని అనుకరిస్తున్నారు కూడా. వాళ్ల సినిమాలు చూసినప్పుడు మీరెలా ఫీలవుతారు?
నేను ఏ సినిమానైనా ఏ నెగటివ్ లేకుండా చూస్తా. చాలా సార్లు ఆశ్చర్యానికి గురవుతా. ఆడియెన్స్ ఎలా ఫీలవుతారో నేనూ అలాగే ‘అరె.. భలే రాశాడే’ అని ఫీలవుతా. తక్కువ బడ్జెట్తోటే వీళ్లు ఈ సినిమా భలే చేశారే, మనం చెయ్యలేకపోయామే అని కచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే, ఈ ఐడియా మనకెందుకు రాలేదననే జెలసీ కూడా వస్తుంది. వీడు నాలా రాస్తున్నాడే అని ఎప్పుడూ నాకనిపించలేదు. నిజాయితీగా చెప్తున్నా. ఇందులో హ్యూమిలిటీ ఏమీ లేదు. డైలాగ్స్ వల్ల సినిమా ఆడుతుందనే దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే.. కథ, పాత్రలు, సన్నివేశాలు.. తర్వాతే మాటలు. మాట అనేది వాటికి బలమవ్వాలే తప్ప, మాట వల్ల ఇవన్నీ రావు. నా డైలాగ్స్ కి పేరు రావడానికి కారణం నేననుకొనేదేమంటే.. ఆ సన్నివేశాన్ని మరింత సూటిగా, బలంగా చెప్పడానికి నేను మాటల్ని వాడానని..

* ‘జులాయి’ నాటికీ, ఇప్పటికీ అల్లు అర్జున్లో మీకు కనిపించిన మార్పు ఏమిటిది?
‘జులాయి’ నాటికీ, ఇప్పటికీ పోల్చుకుంటే అల్లు అర్జున్ పని మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడనే విషయం తెలిసింది. వేరే ధోరణే తనకు లేదు. ఎంతసేపూ సినిమాపైనే అతని దృష్టి.

* మీరు పాన్-ఇండియా సినిమాలు ఎందుకు తియ్యట్లేదు?
నేను పాన్-ఇండియాకు వెళ్లకపోవడానికి నాకు కరెక్ట్ కథ తగలకపోవడం, నేనింకా అలాంటి కథ రాయలేకపోవడం.

* ఈమధ్య ఎక్కువగా మీ సినిమాలకు ‘ఆతో మొదలయ్యే టైటిల్స్ పెడుతున్నారు. అది సెంటిమెంటా?
నాకు సెంటిమెంట్లున్నాయి కానీ, ‘ఆ అక్షరంతో టైటిల్ మొదలుపెట్టాలనే సెంటిమెంటైతే లేదు.

* తర్వాత ఎవరితో సినిమా చెయ్యబోతున్నారు?
తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా డిసైడ్ అవలేదు. కథ అల్లుకొని, దానికి ఎవరు సరిపోతారనుకుంటే వాళ్లతో చేస్తా.

Rock Star Devisri Prasad interview about Sarileru Neekevvaru

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి స్వరాలను అందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ..

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కదా ఇంకా ఏం చేయగలం అని ఎప్పుడైనా అనిపించిందా?
లక్కీ గా  ఎప్పుడూ అలా అనిపించింది లేదు. ఎందుకంటే 2020 లో విడుదలయ్యే నా మొదటి సినిమా `సరిలేరు నీకెవ్వరు`. నిజంగా ఇది నాకు ఫస్ట్ సినిమాలానే అనిపిస్తుంది. ప్రతి సినిమా కి ఆ భయం అయితే ఉంటుంది. ‘అది ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ భయం మనలో ఉంటే ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ లా తీసుకొని చేస్తాము. ఈ విషయం ‘మన్మధ బాణం’ సినిమా చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు చెప్పారు. అలాగే మా టీమ్ అందరి ఎఫర్ట్ కూడా ఒక కారణం. మనచుట్టూ ఉన్నవాళ్ళని భయపడకుండా వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్పే ఫ్రీడమ్ ఇవ్వడం కూడా మన సక్సెస్ లో ఒక పార్ట్ అని నా భావన.
ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాస్ సాంగ్, ల‌వ్‌, పార్టీ సాంగ్ ఇస్తానని మాట ఇచ్చారు క‌దా?
– ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా ఒక మాస్ సాంగ్ ఇస్తానని చెప్పాను. అలాగే `మైండ్ బ్లాక్`,`డాంగ్ డాంగ్‌` సాంగ్ కి సోషల్ మీడియా లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. అందరి హీరోలకి మాస్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు మహేష్ గారికి మాస్ సాంగ్ చేయాలన్నకోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు కారణమైన అనిల్ రావిపూడి గారికి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నా అలాగే డిసెంబర్ లో మాస్ `ఎస్ఎస్‌ఎంబి మండేస్` అని ప్రతి సోమవారం ఒక సాంగ్ ని విడుదల చేశాం. ఇది నాకు, మా టీమ్ అందరికీ ఒక పరీక్ష లాంటిది. అయితే విడుదల చేసిన ప్రతి సాంగ్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాటలను ఆదరించిన ప్రేక్షకులకి, మీడియా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మహేష్ బాబుతో మీ జ‌ర్నీ గురించి?
– మహేష్ గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో జర్నీ చేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను `మహేష్ గారు కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు ఒక సూపర్ స్టార్ కి కావాల్సిన మంచి మనసు ఉంది’అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నేను వర్క్ చేశాను. అందరూ కూడా ఒకే మాట అంటారు ఏంటంటే `మహేష్ తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది` అని. ఒక సారి కథ విని ఓకే అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన టెక్నీషియన్స్ కి సపోర్ట్ చేస్తారు. కంప్లీట్ గా డైరెక్టర్స్ యాక్టర్ ఆయన.  అంత పెద్ద స్టార్ మనమీద నమ్మకం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే పని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే అన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవ్వగలిగాను.
ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– అనిల్ రావిపూడి గారితో నేను `ఎఫ్ 2` మూవీ చేశాను. ఈ సినిమాను చాలా ఎక్స్ట్రార్డినరీ గా హ్యాండిల్ చేశారు. అనిల్ అనగానే మనకు ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది. కానీ మహేష్ బాబు గారి సినిమాల్లో ఉండే సందేశం మిస్ కాకుండా, మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఎంత ఎనర్జీ గా చూడాలనుకుంటున్నారో ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్ గా ఈ సినిమా వచ్చింది. మహేష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. నేను ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే రిపీటెడ్ గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్ కి బోనస్.
సరిలేరు నీకెవ్వరు ఆంథ‌మ్‌ సాంగ్ గురించి?
– నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం. ఇప్పటివరకు ఆ జోనర్ లో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. అనిల్ గారు ఫస్ట్ చెప్పడమే సరిలేరు నీకెవ్వరు అనేది ఆర్మీ వారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆంథ‌మ్‌ సాంగ్ `భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు`.. నేనే రాశాను. ఆ లిరిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యూరప్ లో మేసెడోనియన్ సింఫనీ ఆర్కస్ట్రా తో రికార్డ్ చేశాం. వారు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యారు. మహేష్ గారు కూడా ఆ పాట విని డైరెక్టర్ ఒక కథ రెండున్నర గంటల కథ చెప్తే దేవి ఒక  పాటలో వినిపించాడు. దేవి మామూలోడు కాదు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది.
మైండ్ బ్లాక్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా! దాని గురించి చెప్పండి?
– నా దృష్టిలో ఒక పెద్ద హీరో నుండి మాస్ సాంగ్ వచ్చినపుడు ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అదేవిధంగా ఆ సాంగ్ కి హీరోకి లింక్ కూడా  ఉండాలి అనేది నా కోరిక. అందులోనూ కథ చెప్పటప్పుడే మహేష్ గారిని పక్కా మాస్ గా చూపించబోతున్నాము అని చెప్పారు. నాకు చాలాఎగ్జైట్ మెంట్ వచ్చింది. అందుకే ఎపుడు ప్యాంటేసే వాడు ఇపుడు లుంగీ తొడిగాడు,.అని రాశాం. ఆ పాట‌ని మహేష్ గారు విన్నప్పుడు పడి పడి నవ్వారు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ నాతో చేయిస్తారా? అని అడిగారు. అందుకే కదా సర్ లిరిక్స్ లో రాశాం అని చెప్పాము. మీరు ముందునుండి ప్రిపేర్ అయి ఉన్నారు  అన్నట్టుగా  చూశారు. రేపు థియేటర్ లో ఆ సాంగ్ వేరే రేంజ్ లో ఉంటుంది.
తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు కదా ! రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారా?
– తప్పకుండా అండీ, నేను అవార్డ్స్ ని రెండు కోణాలలో చూస్తాను. ఒకటి మన వర్క్ నచ్చి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారో దాన్ని మించిన అవార్డ్ లేదు. ఇక అవార్డ్ అనేది వారు మనకు  ఇచ్చే గొప్ప గౌరవం. అది నాకు రెస్పాన్సిబుల్ ని పెంచుతుంది.
నిర్మాత అనిల్ సుంకర గురించి?
– మా నిర్మాత అనిల్ సుంకర గారు చాలా స్వీట్ పర్సన్. చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. ఒక సాంగ్ యూరప్ వెళ్లి కంపోజ్ చేద్దాం అన్నప్పుడు తప్పకుండా చెప్పడం అని సపోర్ట్ చేశారు. ఒక ప్యూర్ సినిమా లవర్. మాస్ సాంగ్ చేయబోతున్నాం అన‌గానే  తప్పకుండా చేద్దాం. మహేష్ గారిని అలా చూపించాలి. చాలా బాగుంటుంది. అని చాలా ఎగ్జైట్ అయ్యారు.
మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?
– సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా చేస్తాను.
మీ తదుపరి సినిమాల గురించి ?
– సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోఒక సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది. అలాగే ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాను. నితిన్, కీర్తి సురేష్ ల ప్యూర్ లవ్ స్టోరీ  ‘రంగ్ దే’ చేస్తున్నాను. అలాగే కీర్తి సురేష్  ‘గుడ్ లక్ సఖి’ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే  హిందీలో ఒక సినిమా చేయబోతున్నాను దాని వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Prema Pipasi Trailer Launch

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి` .పి.ఎస్‌.రామ‌కృష్ణ (ఆర్ .కె ) ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి ( ఎమ్ ఆర్ ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిపిఎస్‌, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ‌ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ సంక్రాంతి కానుకగా ఇటీవల దర్శకుడు మారుతి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. 

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ...‘‘పియస్‌ రామకృష్ణ నిర్మాతగా, మురళిరామ స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమపిసాసి’ చిత్రం ట్రైలర్ చాలా ట్రెండీగా, యంగేజింగ్‌గా ఉంది. కొత్త టీమ్‌ చేసిన ఈ ప్రయత్నం బాగుంది. జీపీయస్‌ కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ హీరోగా నటించాడు. ట్రైలర్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉందో సినిమా కూడా అంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందన్న నమ్మకం ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.
నిర్మాత పి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ...‘‘మారుతి గారు మా సినిమా ట్రైలర్ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రెండీగా, యంగేజింగ్‌గా ట్రైలర్ ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.
కో`ప్రొడ్యూసర్‌ రాహుల్‌ పండిట్‌ మాట్లాడుతూ…‘‘మారుతి గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్‌ చేయడం హ్యాపీ. మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. నిజంగా ఆయనకు మా ట్రైలర్ నచ్చడంతో సినిమా సక్సెస్‌ అయినంత హ్యాపీగా ఉంది’’ అన్నారు.
హీరో జిపియస్‌ మాట్లాడుతూ..‘‘మారుతి గారు ట్రైలర్ చూసి ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ హీరోలా నటించావని కాంప్లిమెంట్‌ ఇవ్వడంతో ఇన్ని రోజు పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కినంత ఆనందంగా ఉంది. దీనికి కారణం మా దర్శక నిర్మాతలు’’ అన్నారు.
హీరోయిన్‌ సోనాక్షి మాట్లాడుతూ..‘‘సినిమా రిలీజ్‌ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు.
దర్శకుడు మురళిరామస్వామి మాట్లాడుతూ…‘‘మా సినిమా ట్రైలర్ మారుతి గారి చేతుల మీదుగా రిలీజ్‌ కావడం చాలా హ్యాపీ. ట్రెండీగా, యంగేజింగ్‌గా ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. ఎంతో కష్టపడి యూనిట్‌ అందరం సినిమా చేశాం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా నిర్మాత పూర్తి సహకారం వల్లే. మా హీరో జిపియస్‌ ఈ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌, లుక్‌ పరంగా ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. నలుగురు హీరోయిన్స్‌ నటించారు. ట్రెండ్‌కి అడ్వాన్స్‌డ్‌గా సినిమా తీశాం. లవ్ ప్రస్తుతం ఎంతో కమర్షియల్‌గా తయారైంది. ఒక జెన్యూన్‌ లవ్‌ వెతికేవాళ్లు,ఎలా ప్రేమించకూడదో తెలుసుకోవడానికి మా సినిమా చూడొచ్చు’’ అన్నారు.

జిపిఎస్ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి, `ఢీ జోడి ఫేమ్` అంకిత , బిగ్ బాస్ ఫేమ్ బందగీ కర్ల , సంజన చౌదరి , సుమన్ , భార్గవ్ , షేకింగ్ శేషు, జబ్బర్దస్థ్ రాజమౌళి, ఫసక్ శశి, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్ , మ్యూజిక్: ఆర్స్ , పాటలు : సురేష్ ఉపాధ్యాయ-అల రాజు, సౌండ్ డిజైన్ :యతిరాజ్ , పీఆర్వో : వంగాల కుమారస్వామి , ఎడిటర్: ఎస్ శివ కిరణ్, ఫైట్స్: మిస్టర్ దేవ్, కో-ప్రొడ్యూసర్స్ : రాహుల్ పండిట్, జిఎస్ రావు, వై వెంకట లక్ష్మి , అస్సోసియేట్ ప్రొడ్యూసర్ :యుగంధర్ కొడవటి , ప్రొడ్యూసర్ : పియస్ రామకృష్ణ (ఆర్కే), రచన-దర్శకత్వం: మురళి రామస్వామి (ఎమ్ .ర్ ).