Home Blog Page 973

Vittalvadi Movie Go to Pre-Release Event Soon

ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్,సుధా రావత్,నటీనటులుగా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం “విట్ఠల్ వాడి” ఈ కొత్త మూవీ రిలీజ్ కి రెడి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సినీ ప్రముఖుల కు సినిమా ప్రివ్యూ చూయించారు. సినిమా ప్రివ్యూ చూసిన కొంతమంది ప్రముఖులు సినిమా బాగా చిత్రీకరించారని సాంగ్స్ సినిమా కి హైలెట్ అని రోషన్ కోటి మ్యూజిక్ చాలా బావుందని కొత్తవాళ్ళైన హీరో రోహిత్ ని హీరోయిన్ ని మెచ్చుకున్నారు. గొప్ప కథని ప్రేక్షకులకు అందించబోతున్న డైరెక్టర్ టి నాగేందర్,ప్రొడ్యూసర్ నరేష్ గారిని అభినందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ:-ఇందులో రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి.హీరో రోహిత్ బాగా యాక్ట్ చేసాడు,సెంటిమెంట్స్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.ఈ యాక్షన్, సెంటిమెంట్స్ సీన్స్ కు అందరూ కనెక్ట్ అయ్యారు.సినిమా చూసిన గురుదేవ్ పిక్చర్స్ అధినేత ప్రమోద్ కుమార్ సినిమా బాగుందని హిందీ లో ఒక ప్రముఖ నటుడి కొడుకుని లాంచ్ చెయ్యడానికి హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నారని ప్రొడ్యూసర్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు..సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ పై మంచి రేస్పాన్స్ రావడం తో మేమంతా చాలా సంతోశంగా ఉన్నాము.త్వరలో గ్రాండ్ గా ప్రి రేలీజ్ ఈవెంట్ జరిపి,భారీ ఎత్తున
“విట్టల్ వాడి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

నటీనటులు
రోహిత్ రెడ్డి
కైషా రావత్
అమిత్
రోల్ రిడా
అప్పాజీ అంబరీష్ దర్బా
చమ్మక్ చంద్ర

సాంకేతిక నిపుణులు
కెమెరా మెన్ – సతీష్ అడపా
మ్యూజిక్ – రోషన్ కోటి
ఎడిటింగ్ – శ్రీనివాస్ మోపర్తి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
ఫైట్స్ – శంకర్
ప్రొడ్యూసర్ – జి నరేష్ రెడ్డి
డైరెక్టర్ – నాగేందర్ టి

Darbar Movie Review

Release date :January 9th,2020
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Darbar
Banners:-Lyca productions,
Starring:-Rajinikanth,Suneel setti,nayanatara,Niveda Thamas,yogibabu
Music Director :-Anirudh Ravichandran
Editor:-Sreekar prasad
Cinematography:-Santhos Sivan
Director :-A.R.Murugadas
Producer :-A.subaskaran

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం’దర్బార్’లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్నినిర్మించారు .రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కించారు.నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.తెలుగు లో సంక్రాంతికి పెద్దహీరోల సినిమాల పోటీ బాగానే ఉన్నా,తెలుగులో రజినీకాంత్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే..ఇలాంటి సమయంలో నేడు సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఆయన తన గత సినిమాలతో అనేక బ్లాక్ బస్టర్లు కొట్టారు.మరి ఈ సినిమా రిజల్ట్ ఎలాఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.,థియేటర్లో రజిని తన మేజిక్ చూపించి ప్రేక్షకులనుమెప్పించాడా? సినిమా ఏ మేరకు రాణించింది అనేది చూద్దాం రండి.

కథ :

ముంబైలోని ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆదిత్య అరుణాచలం స్టోరీ ఇది.ముంబైలో పోలీసులకు సరైన గౌరవం లేక పోలీస్ వ్యవస్థ పూర్తిగా వీక్ అయిన పరిస్థితుల్లో.. అక్కడి యువత డ్రగ్స్ కి బానిసలుగా బతుకుతున్న స్థితిలో.. వెరీ సిన్సియర్ అండ్ పూర్తి ఆవేశపూరితమైన పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబైకి కమీషనర్ వస్తాడు. రావడంతోనే వేలమంది ఆడపిల్లలను సేవ్ చేస్తాడు.మరో పక్క తన కూతురు వల్లీ (నివేథా థామస్)తో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే లిల్లీ (నయనతార)తో పరిచయం అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం హరి చోప్రా(సునీల్ శెట్టి) ఆదిత్య అరుణాచలాన్ని టార్గెట్ చేస్తాడు. దాంతో ఆదిత్య అరుణాచలం జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి ప్రతీకారంగా హరి చోప్రా మీద ఆదిత్య అరుణాచలం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు హరి చోప్రా గతం ఏమిటి? చివరికి ఆదిత్య అరుణాచలం తానూ అనుకున్నది సాధించాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ తో పాటు కొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో అలాగే భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్ స్టార్ అభిమానులకు.. మురగదాస్ మొత్తానికి రజిని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు.తన స్టైల్ తో మేజిక్ చేస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజిని డెబ్బై ఏళ్ళు దాటినా తనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేసాడు. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్టెప్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసాడు, తన స్టైలిష్ ఎనర్జిటిక్ నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో అండ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ లో రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. సినిమాకే అతి కీలక మైన పాత్రలో నటించిన నివేథా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో నివేథా నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ గా నయనతారకు పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న ఆ కొన్ని సీన్స్ లో తన గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీతో మెప్పించింది. యోగిబాబు,రజినీకాంత్ ల మధ్య కామెడీ వర్క్ ఔట్ అయ్యింది. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. విలన్ గా సునీల్ శెట్టి పర్వాలేదు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు మురుగదాస్ తన మార్క్ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించే ప్రయత్నం బాగానే చేశాడు.భారీ విజువల్స్ తో భారీ యాక్షన్ తో చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలు మరియు కథ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సంగీతం చాల బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి ప్రధాన బలం.అనిరుథ్ ఈ సినిమా స్థాయిని చక్కగా పెంచాడు అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.మెయిన్ గా రజినిని చాల యంగ్ గా చూపించారు.ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. సూపర్ స్టార్ తో ఇలాంటి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించినందుకు సుభాష్ శరన్ ను అభినందించాలి.

Cinema rangam.com..3/5

Nenu c/o Nuvvu Trailar Launch

ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల,శేషిరెడ్డి,పోలీస్ వెంకటరెడ్డి,శరద్ మిశ్రాలు నేను c/o నువ్వు  చిత్రాన్ని నిర్మించారు.ఎన్.ఆర్.రఘునందన్ సంగీతం అందించారు.. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుటకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా లిరిక్ రైటర్ ప్రణవం మాట్లాడుతూ.…ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు సందగర్భానుసారం వస్తాయి. ఈ చిత్రంలో నాకు అగాపే అకాడమీ బ్యానర్ వారు అవకాశం ఇచ్చారుమ్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..
..
ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.
సినిమా  ట్రైలర్ చూశాను బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది ఇది. సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది అన్నారు.
డైరెక్టర్ సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ….
ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించాను. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. చిన్న సినిమాలు సక్సెస్ కావాలంటే అందరి సహకారం కావాలి. ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.
బ్యానర్: అగపే అకాడమీ
డిఓపి: జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్: ప్రణవం, కొరియోగ్రాఫర్: నరేష్
మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్
ఆర్ట్: పి.ఎస్.వర్మ, యాక్షన్: షొలిన్ మల్లేష్
సహా నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, శరద్ మిశ్రా
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ

Super Star Mahesh Babu interview about “Sarileru Neekevvaru”

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భాంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఇంటర్వ్యూ.

‘సరిలేరు నీకెవ్వరు’ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది?

– అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ‘ఎఫ్‌2’ జరిగేటప్పుడు అనిల్‌ రావిపూడి నాకు 40 మినిట్స్‌ కథ చెప్పారు. చాలా బాగుంది. ప్రస్తుతం ఒక సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. దాని తర్వాత చేస్తాను అని చెప్పాను. కానీ ‘ఎఫ్‌2’ చూడగానే ఇమ్మీడియెట్‌గా ఈ సినిమా చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఈ స్టోరిలైన్‌ నాకు ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. ‘శ్రీమంతుడు’ నుంచి సెపరేట్‌ జోనర్‌లో మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తున్నాను. ‘దూకుడు’లాంటి ఒక కమర్షియల్‌ ఫిల్మ్‌ నా నుండి రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అలాగే నేనూ అనుకుంటున్నాను. ‘ఎఫ్‌2’ చూడగానే ఈ కథకి రిలేట్‌ అయి ‘మహర్షి’ సినిమా తర్వాత ఈ కథ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా జూలైలో సినిమా స్టార్ట్‌ చేశాం. డిసెంబర్‌లో షూటింగ్‌ పూర్తయింది. నా కెరీర్‌లో తీసుకున్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ డెసిషన్‌ ఈ టైమ్‌లో ఈ సినిమా చేయడం.
సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారా?
– బొమ్మ దద్దరిల్లిపోద్ది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. సినిమా మొదలైన తొలి రోజు నుంచి ఇప్పటిదాకా అదే వైబ్‌ని ఫీల్‌ అవుతున్నాను. నిర్మాతలు ఫస్ట్‌ కాపీ చూసినప్పుడు కూడా అదే ఫీలయ్యారు. బ్లాక్‌ బస్టర్‌ రాబోతుందని ముందుగా తెలిసినప్పుడే అలా జరుగుతుంది.
ఈ సినిమాని తొందరగా పూర్తి చేశారు కదా! భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ చేస్తారా?
– ‘బిజినెస్‌మేన్‌’ తర్వాత తొందరగా పూర్తి చేసిన సినిమా ఇది. ఈ కథ అనుకున్నప్పుడే జూన్‌లో స్టార్ట్‌ చేసి సంక్రాంతికి వద్దామనుకున్నాం.ఎందుకంటే సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌.ఆర్మీమేజర్‌ రోల్‌చేస్తున్నాం కాబట్టి ఫిట్‌గా కనబడాలని కొంచెం టైమ్‌ తీసుకొని రెడీ అయ్యాను.అలా జూలైలో షూటింగ్‌ స్టార్ట్‌చేశాం. అప్పటి నుండి 125 రోజుల్లో మా యూనిట్‌ రెస్ట్‌ లేకుండా కంటిన్యూగా వర్క్‌ చేశారు.టీమ్‌ ఎఫర్ట్‌ వల్లే అనుకున్న సమయానికి సినిమా రెడీ అయ్యింది.
ఎంటర్‌టైన్‌మెంట్‌ని, దేశ భక్తిని బ్లెండ్‌ చేసి సినిమా చేయడం ఎలా అన్పించింది?
– అదే మా దర్శకుడు అనిల్‌ రావిపూడి బలం.ఆర్మీ ఆఫీసర్‌ సబ్జెక్ట్‌ తీసుకొచ్చి దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ మిక్స్‌ చేసి దానికి హీరోయిజం జత చేసి సినిమా చేయడం జోక్‌ కాదు. సేమ్‌ టైమ్‌ రెస్పాన్సిబుల్‌ క్యారెక్టర్‌ని ఇష్టంవచ్చినట్లు తెరపై చూపించలేం. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించారురావిపూడి.ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలతో పోలిస్తే ఇది డిఫరెంట్‌ మూవీ.
కథ వినేటపుడు ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు?
– సాధారణంగా నేను కథ వినేటప్పుడే డైరెక్టర్‌ని బాగా నమ్ముతాను. ఏ డైరెక్టర్‌తోనైనా ట్యూన్‌ అవ్వడం చాలా ఇంపార్టెంట్‌. ఒకసారి కథ నచ్చితే డైరెక్టర్‌ చెప్పినట్లు వింటాను. అనిల్‌కి చాలా క్లారిటీ ఉండటం వల్ల నా క్యారెక్టర్‌ని చేయడం నాకు చాలా ఈజీ అయ్యింది.’దూకుడు’తర్వాత ఒక కంఫర్టబుల్‌ జోనర్‌ నుండి బయటికి వచ్చి ఇలాంటి సినిమా చేయడం నాకు కొత్తగా అన్పించింది. అలాగని దూకుడులాగా చేయలేను. కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఫ్రెష్‌గా పెర్‌ఫార్మెన్స్‌ చూపించాలి.
కామెడీ పరంగా, డ్యాన్స్‌ పరంగా ఈ సినిమాకి ఎక్కువ శ్రమపడ్డారా?
– అనిల్‌ రావిపూడి సినిమా అనగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్‌లో ఉంటుంది. నేను కొత్త టైమింగ్‌ పట్టుకోవాలి. అనిల్‌ కూడా నా ‘దూకుడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలన్నీ చూసి,నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు వేరే మీటర్‌లో ఉండేలా ఈ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు.అలాగే ఈ సినిమాలోమాస్‌ సాంగ్‌కి స్కోప్‌ ఉంది.శేఖర్‌మాస్టర్‌కి ఆ క్రెడిట్‌ ఇవ్వాలి.
ఇప్పటివరకూ మీరు చేసిన సినిమాల్లో ఇదెలా డిఫరెంట్‌గా ఉండబోతోంది?
– నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా మరో డైమెన్షన్‌లో ఉంటుంది. ముఖ్యంగా నా ఫ్యాన్స్‌ కంప్లీట్‌గా కొత్త మహేశ్‌ని చూస్తారు. అలాగే కొత్త టైమింగ్‌, చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి.
పర్టిక్యులర్‌గా ఈ స్క్రిప్ట్‌ని సెలెక్ట్‌ చేసుకోడానికి రీజన్‌ ఏంటి?
– ఓపెన్‌గా, ఫ్రీగా ఉండే ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయాలనుకున్నాను. కథకి ప్రాముఖ్యతనిచ్చి యాక్ట్‌ చేసిన ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలకి భిన్నంగా కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఉండి పెర్‌ఫార్మెన్స్‌ చేస్తూ ‘దూకుడు’తరహాలో ఉండే స్క్రిప్ట్‌ కోసం చూసే సమయంలో ఈ స్క్రిప్ట్‌ దొరికింది. సాధారణంగా కథకి ఇంపార్టెన్స్‌ ఇస్తాను. కథ విన్నప్పుడు నాకు ఎగ్జయిటింగ్‌గా అన్పించాలి. ఈ కథ విషయంలో కూడా నాకు ఎగ్జయిటింగ్‌ అన్పించింది. అందుకే ఈ సినిమా చేశాను. కొండారెడ్డి బురుజు సెట్‌ దగ్గర చేయడం సెంటిమెంట్‌గా అన్పించిందా?
– అనిల్‌ కథ చెప్పేటప్పుడు కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది అని చెప్పారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ఫేమస్‌ ప్లేస్‌. ఈ సినిమాలో అది ఒక పాత్ర పోషించింది. ‘ఒక్కడు’ సినిమాలో నేను చేసిన కొండారెడ్డి బురుజు సీన్‌ ఒక ఐకాన్‌ అయింది. మళ్ళీ ఈ సినిమాలో భాగంగా కొండారెడ్డి బురుజు సెట్‌ వేయడం చాలా హ్యాపీగా అన్పించింది. ఆ క్రెడిట్‌ మొత్తం ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌కే దక్కుతుంది.కొండారెడ్డి బురుజు సెట్‌ని యాజిటీజ్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీలో దింపేశాడు. ఫస్ట్‌రోజు ఆ సెట్‌ చూడగానే ‘ఒక్కడు’ రోజులు గుర్తుకొచ్చాయి.
కథా పరంగా కొత్తగా ఉంటుందా? లేక ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తగా ఉంటుందా?
– కమర్షియల్‌ సినిమాల్లో ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేక్షకులు చాలా థ్రిల్‌గా, ఎగ్జయిట్‌గా ఫీలవుతారు.
ఆర్మీ మేజర్‌ పాత్ర కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారు?
– ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు ఏమీ చేయలేదు కానీ డైట్‌ విషయంలో కేర్‌ తీసుకొని 6 కిలోల బరువు తగ్గాను. ఆర్మీ మేజర్‌ అనగానే చూసే ప్రేక్షకులకి కన్విన్సింగ్‌గా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత ఫిట్‌గా తయారయ్యాను.
చాలాకాలం తర్వాత విజయశాంతితో మళ్లీ వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?
– అమేజింగ్‌ ఫీలింగ్‌. ఆమెతో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లైట్‌లో కలిశాం తప్ప టచ్‌లో లేను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌డే షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ చేస్తున్నాను అనే ఫీల్‌ ఉంది. కానీ ఒక షాట్‌ చేయగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్‌ నిన్ననే జరిగినట్లు అన్పించింది. ఆవిడ తప్ప ఈ క్యారెక్టర్‌ని అంత బాగా ఎవరూ చేయలేరు. ఆమె ఈ క్యారెక్టర్‌ చేయడం ఈ సినిమాకి, మా టీమ్‌కి పెద్ద అడ్వాంటేజ్‌ అయ్యింది. ఆమెకి ఈ సందర్భంగా థాంక్స్‌ తెలియజేస్తున్నా.
ఈ సినిమాలో కృష్ణగారు కనిపిస్తారు అని దర్శకుడు అనిల్‌ చెప్పారు?
– అది సినిమాలో ఒక సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. మా అందరికి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.
సినిమాలో మీకు బాగా నచ్చిన పాట?
– ఫస్ట్‌ వచ్చే థీమ్‌ సాంగ్‌. ఆ పాటని దేవీ అద్భుతంగా రాశారు. తర్వాత ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్‌.
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ ఉంది కదా? అది ఎవరి ఛాయిస్‌?
– అనిల్‌ రావిపూడిగారిదే. స్టోరి నేరేషన్‌ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు కావాలి అని చెప్పారు. వాళ్లు నటిస్తానంటే నాకూ ఓకే అన్నాను. ఈ సినిమాకి అలా మంచి క్యాస్టింగ్‌ కుదిరింది.
ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవిగారు మిమ్మల్ని అప్రిషియేట్‌ చేయడం ఎలా అన్పించింది?
– చిరంజీవిగారు నన్నెప్పటి నుండో సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. ‘ఒక్కడు’ సినిమా ఆయనకు విపరీతంగా నచ్చి నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ‘అర్జున్‌’ సినిమా కోసం మధురమీనాక్షి టెంపుల్‌ సెట్‌ వేశాం. ఆయన స్వయంగా ఆ సెట్‌కి వచ్చి చాలాసేపు గడిపారు. మీలాంటి వాళ్లు ఇలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అన్నారు. ఆయన నాకెప్పటికీ ఇన్‌స్పిరేషనే. అలాగే ‘పోకిరి’ సినిమా చూసి జగన్‌గారి ఆఫీస్‌ నుండి నాకు కాల్‌ చేసి రమ్మని, దాదాపు మూడు గంటల సేపు ఆ సినిమా గురించి మాట్లాడారు. అప్పటి నుండి ఏ సినిమా రిలీజై హిట్టయినా ఆయన్నుండే ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ వస్తుంది. అందుకే ఫంక్షన్‌లో జనవరి 11న ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ ఆయన నుండే రావాలని కోరుకుంటున్నానని చెప్పాను. చిరంజీవిగారిని ఆహ్వానించడం అనేది నా ఐడియానే. ఇలా ఫంక్షన్‌ అనుకుంటున్నాం. మీరు రావాలి అనగానే, వెంటనే తప్పకుండా వస్తాను అని మెసేజ్‌ పెట్టారు.
అదే వేదికపై నాన్నగారికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు కదా?
–  నాన్నగారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. నాన్న గారు.. చిరంజీవి చాలా బాగా మాట్లాడారు థాంక్స్‌ చెప్పానని చెప్పు అన్నారు. నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ.
కృష్ణగారు సినిమా చూశారా?
– లేదండి. ఆయన జనవరి 11న చూస్తారు.
1000 మంది పిల్లలకి హార్ట్‌ ఆపరేషన్‌ చేయించారు కదా?
– రెండు మూడు సంస్థలతో కలిపి ఆపరేషన్స్‌ చేయించాం. ఆంధ్రా హాస్పిటల్స్‌, హీల్‌ ఎ ఛైల్డ్‌ లాంటి సంస్థలతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేస్తాం.
ఫ్యాన్స్‌కి పాజిటివ్‌ సంకేతాలు ఇవ్వడంలో మీరెప్పుడూ ముందుంటారు?
– అది చాలా మంచి ట్రెండ్‌. అలాగే పాజిటివ్‌ సైన్‌. దాని వల్ల అందరిలోనూ గుడ్‌ వైబ్స్‌ ఏర్పడతాయి. ఆరోజు ఫంక్షన్‌లో కూడా చిరంజీవిగారు, విజయశాంతిగారు మాట్లాడేటప్పుడు మాయూనిట్‌కి చాలా హ్యాపీగా అన్పించింది.                           రష్మిక మందన్నాతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌?                       ఆ  క్యారెక్టర్ కు మంచి ఇంపారైన్స్ ఉంటుంది. ఒక ఫ్రెష్‌ ఫేస్‌ మాకు కావాలనుకొని ఆమెను సెలెక్ట్‌ చేసుకున్నాం. బ్రిలియంట్‌ ఛాయిస్‌. ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. షి ఈజ్‌ వెరీ టాలెంటెడ్‌.

పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది కదా! బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎలా ఉండబోతోంది?
– దేవి నా పర్సనల్‌ ఫేవరేట్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ దేవి చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా అన్పిస్తుంది. ఎందుకంటే అంత రెస్పాన్స్‌బుల్‌గా ఉంటారు. అందులోనూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌. ఏ సీన్‌ ఎక్కడ స్టార్ట్‌ అవ్వాలి, ఎక్కడ ఎండ్‌ అవ్వాలి అనేది పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. ఈ సినిమాకి తన బెస్ట్‌ ఇచ్చారు మీకు నచ్చిన డైరెక్టర్లని రిపీట్‌ చేస్తారు కదా!
అనిల్రావిపూడితో మళ్లీ చేస్తారా?
– డెఫినెట్‌గా చేస్తాను. ఈ సినిమా చేసిన తర్వాత అనిల్‌ రావిపూడి అంటే నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది. దర్శకుల్లో అలాంటి ఎనర్జీ నేను చూడలేదు. ఎంత టెన్షన్‌ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సెట్‌లో నవ్వుతూ ఉంటారు. నేనింతవరకూ అలా ఎవర్నీ చూడలేదు. మా టీమ్‌ అంతా టెన్షన్‌గా ఉన్నప్పుడు అనిల్‌ మాత్రం చిన్న డ్యాన్స్‌ వేస్తూ నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ అయిదు నెలల్లో పూర్తి చేశాడంటే నాకే సర్‌ప్రైజింగ్‌గా ఉంది.
రత్నవేలు ఫొటోగ్రఫీ గురించి చెప్పండి?          – 15 రోజులు కాశ్మీర్‌లో రెక్కీ చేసి షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. సినిమా ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్‌ అయ్యిందంటే రత్నవేలుగారు కూడా ఒక కారణం. సినిమా క్వాలిటీ విషయంలో కానీ, విజువల్స్‌ విషయంలో కానీ ఆయన వర్క్‌ అమేజింగ్‌.
నిర్మాత అనిల్‌ సుంకర గురించి ?
– ఈ సినిమాని అనిల్ గారితో దిల్ రాజు గారి సమర్పణలో జి.ఎం.బి నిర్మించడం హ్యాపీ.అనిల్‌ సుంకరగారు ఒక ఫ్యామిలీ మెంబర్‌లాంటివారు. ‘దూకుడు’ దగ్గర్నుంచి నేను చూస్తున్నాను. నాన్నగారంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. అలాగే మా ఫ్యామిలీ అన్నా ప్రత్యేక గౌరవం. ఒక హీరోలా కాకుండా ఫ్యామిలీ మెంబర్‌లా ట్రీట్‌ చేస్తారు.
ఆయన ఫస్ట్‌కాపీ చూసి ఎగ్జయిట్‌ అయి మెసేజ్‌ పెట్టారు. చాలా హ్యాపీగా అన్పించింది.
ఫైట్స్‌ గురించి?

– నా ఫేవరేట్‌ ఫైట్‌ మాస్టర్స్‌. ఇందులో రెండు మూడు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇరగ్గొట్టేశారు. అన్ని ఫైట్స్‌ దేనికదే కొత్తగా ఉండేలా డిజైన్‌ చేశారు. మా కాంబినేషన్‌లో ఇవి బెస్ట్‌.
మీ నెక్స్‌ట్‌ సినిమా?
– వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  దిల్ రాజు గారితో  సినిమా ఉంటుంది. వంశీ  చెప్పిన స్క్రిప్ట్‌ చాలా ఎగ్జయిటింగ్‌గా అన్పించింది. టోటల్ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఉంటుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సూపర్‌స్టార్‌ మహేశ్‌.

N.T.R Life Story Book Launch

ఓ విశ్వ విఖ్యాత
నట సార్వభౌమా !
నీ అనంత అభినయ
విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు
విస్మయ మొందగా …
నీ దివ్య మంగళ రూపము ..
నీ సహస్ర భాను తేజము..
తెలుగు జాతి ఎద ఎదలో
పదిలంగా నిలిచిపోవ
చరితార్థుడవైతివయ్యా
ఘన చరితగ నిలిచితివయ్యా …

ఇదీ “నందమూరి తారక రామారావు” అనే దివంగత దివ్య పురుషుని సమగ్ర చరిత్రను ఆమూలాగ్రం చదివిన తరువాత ఎవరి మనసులోనైనా కలిగే భావన. ఇంతకీ ఆయన చరిత్రను అంత సమూలాగ్రంగా, సమగ్రంగా ఎవరు రాశారు…? ఎప్పుడు రాశారు..? ఎలా రాశారు..? అన్న సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది 624 పేజీల” యన్. టి. ఆర్.- సమగ్ర జీవిత కథ”
అనే ఉద్గ్రంధం.

గతంలో ఎన్టీఆర్ మీద చాలా పుస్తకాలు వచ్చాయి… అయితే రకరకాల కారణాల వల్ల అవి కొన్ని పరిమితులకు లోబడి , ఆయన సుదీర్ఘ సినీ రాజకీయ ప్రస్థానంలోని కొన్ని పార్శ్వాలను మాత్రమే స్పృశించాయి. సారస్వత దృష్టితో చూస్తే అవి గొప్ప ప్రయత్నాలే అయినప్పటికీ సమగ్రత విషయంలో ఆ పుస్తకాలు ఏవీ ఈ పుస్తకానికి సాటి రావు అన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే జనన మరణాల మధ్య జరిగిన సంఘటనల బయోడేటా జీవిత చరిత్ర అనిపించుకోదు. దశాబ్దాలపాటు జన జీవితంతో మమేకమైన ఎన్టీఆర్ లాంటి మహానటుడు,మహానాయకుడి జీవితంలో చోటుచేసుకున్న అనేకానేక సంఘటనలను ,  ఎదురైన విషమ పరిస్థితులను , సాగించిన పోరాటాన్ని, సాధించిన విజయ విశేషాలను , చేరుకున్న స్థాన విశిష్టతను గురించి ఆమూలాగ్రంగా ఆవిష్కరించ గలిగినప్పుడే అది సమగ్ర చరిత్ర అవుతుంది. అలాంటి సాధికారిక సమాచారంతో , ఎన్టీఆర్ జీవిత విశేషాల పట్ల సమగ్ర అవగాహనతో, ప్రామాణికత, పారదర్శకతలే ప్రమాణాలుగా  ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి జీవిత చరిత్రకు
అక్షర రూపం ఇచ్చారు ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు.

తమ సుదీర్ఘ పదవీ కాలంలో సమర్ధులైన అధికారులుగా, కార్యదక్షులుగా ప్రశంసలు అందుకున్న ఆ ఇద్దరిలో మొదటివారు ఇన్ కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గా ఉద్యోగ విరమణ చేసిన
కాటా చంద్రహాస్  కాగా రెండవవారు  పలు ఉన్నత పదవులు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొడిదెల లక్ష్మీనారాయణ. ఈ విశ్రాంత అధికారుల అవిశ్రాంత శ్రమ కారణంగా వెలుగు చూసిన “యన్. టి.అర్.” అనే  ఈ గ్రంథం ఆ నటరత్న గురించి ఎన్నెన్నో అనావిష్కృత విశేషాలను, వివరాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. నిజానికి ఇందులో తొలిసారిగా వెలుగుచూసిన వివరాలు, విశేషాలు, వినోదాలు, వివాదాలు, నిజాలు, రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో…

మచ్చుకు కొన్ని వెలుగు చూడని వివరాలను, సంఘటనలు ఈ పుస్తక సమీక్షలో ప్రస్తావించు కుందాం.
* సినీరంగ ప్రవేశానికి ముందు ఎన్టీఆర్ చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన విజయవాడలో పాల వ్యాపారం చేస్తూ ఉదయాన్నే సైకిల్ మీద వెళ్లి హోటళ్లకు పాలు పోసేవారన్నదొక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఆయన పాల వ్యాపారమే కాకుండా చాలా చేశారు. బొంబాయి మాతుంగాలో కొన్నాళ్ళు ఆంధ్రా మెస్ నడిపారు. విజయవాడలో పొగాకు, బీడీ, సిగరెట్లు అమ్మే హోల్ సేల్ వ్యాపారం చేశారు. 64 రూపాయల జీతానికి కోర్టు అటెండర్ గా కొద్ది రోజులు పని చేశారు.. కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ నడిపారు… చివరకు బిఏ పాస్ అయ్యాక కేవలం 11 రోజులు సబ్ రిజిస్ట్రార్ గా చేశాక దానికి రిజైన్ చేసి సినీ ఫీల్డ్ కు వెళ్లారు.వీటిలో పాల వ్యాపారం,సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం గురించి తప్ప మిగిలిన వాటి గురించి జనసామాన్యానికి తెలియదు.ఆ వివరాలను సవివరంగా తెలియజేశారు ఈ పుస్తకంలో.

రాజసం ఉట్టిపడే అందాల కథానాయకుడిగా ఎందరెందరో అందాల నాయికలతో సరస శృంగార సన్నివేశాల్లో నటించిన ఎన్టీఆర్ నిజజీవితంలో కూడా మంచి రసరాజే అంటారు. వెండితెర మీదే కాకుండా నిజజీవితంలో కూడా నవరస భరితంగా సాగిన ఎన్టీఆర్ జీవితంలో” ఫస్ట్ క్రష్” గురించి ఎవరికైనా తెలుసా?విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తమ ఇంట్లో అద్దెకుండే సూర్యనారాయణ అనే వ్యాపారి పెద్ద కూతురుతో ఎన్టీఆర్ కు ఫస్ట్ క్రష్ ఏర్పడిందన్న నిజం చాలా మందికి తెలియదు. అలాగే తనతో దాదాపు 25 చిత్రాలలో హీరోయిన్ గా నటించిన  పేరులో ‘కుమారి ‘ అని ఉండే ఒక అగ్ర కథానాయికతో ఎన్టీఆర్ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్ళిన బహిరంగ రహస్యంలోని ఆంతరంగిక విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి.

* ” సార్.. ఈ “పాతాళ భైరవి” సినిమాలో తోటరాముడు పాత్ర కోసం వ్యాయామము, కర్ర సాము ప్రాక్టీస్ చేస్తూ చాలా కష్టపడుతున్నాను సార్.. చాలా ఆకలి వేస్తుంది… ప్రొడక్షన్ లో నాకు పెడుతున్న రెండు ఇడ్లీలు చాలటం లేదు… అదనంగా మరో రెండు ఇడ్లీ పెట్టమని చెప్పండి సర్… అంటూ ఎన్టీఆర్ విజయా అధినేత  నాగిరెడ్డిని  ప్రాధేయపడిన ప్రారంభ దినాల నాటి కష్టసుఖాలను, ఎన్టీఆర్ ఎదుగుదలను ఈ పుస్తకంలో చాలా వివరంగా ఆవిష్కరించారు.

* రాముడిగా, శ్రీకృష్ణుడుగా తెలుగువారి హృదయాల్లో , పూజా మందిరాల్లో తన రూపాన్ని ప్రతిష్టింప చేసుకున్న ఎన్టీఆర్ ను తొలుత శ్రీకృష్ణుడి గెటప్ లో ప్రేక్షకులు తిరస్కరించారన్న విషయం చాలా మందికి తెలియదు. కృష్ణుడి వేషంలో ఈలపాట రఘురామయ్యను మాత్రమే చూడటానికి అలవాటుపడిన ఆనాటి ప్రేక్షకులు ‘సొంత ఊరు, ఇద్దరు పెళ్ళాలు’ అనే రెండు సాంఘిక చిత్రాలలో ఎన్టీఆర్ ను కృష్ణుడి గెటప్ లో చూసి హేళనగా గొడవ చేశారన్నది ఒక నమ్మలేని నిజం. ఇలాంటి ఆవిష్కృతంకాని అనేకానేక విశేషాల సమాహారంగా రూపొందింది”ఎన్టీఆర్ ”  అనే పుస్తకం.

* లక్ష్మీపార్వతి “మీ జీవిత చరిత్ర రాస్తాను” అని అడిగిన వెంటనే ఎన్టీ రామారావు ఆనందంగా అలాగే అని ఆహ్వానం పలకలేదు. జీవిత చరిత్ర రాయించుకోగలిగినంత చరిత్ర, అర్హత నాకు ఉన్నాయా అని సంశయంలో పడ్డారు ఎన్టీఆర్. ఆ సంశయ నివృత్తి కోసం తన సాహిత్య మిత్రులైన డాక్టర్ నండూరి రామకృష్ణ చార్య, ప్రొఫెసర్ దోనప్ప వంటి కొందరు విజ్ఞుల సలహాలు తీసుకున్నారు.
” స్వయం కృషితో, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మీ చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం అవుతుంది” అని వారంతా ఏకగ్రీవంగా చెప్పిన పిమ్మటే లక్ష్మీపార్వతి అభ్యర్థనకు ఆమోదం తెలిపారట ఎన్టీఆర్.
* ఇలా ప్రచారానికి వాస్తవానికి పొంతనలేని ఎన్నెన్నో వాస్తవాలను, సంఘటనలను, సంధర్భాలను సంఘర్షణలను, సంచలనాలను
సంధర్భోచితంగా, సాధికారికంగా ఒక పరిణామక్రమంలో ఆవిష్కరించారు  గ్రంథ రచయితలైన చంద్రహాస్, లక్ష్మీనారాయణ. కేవలం సినిమా రంగానికి చెందిన విశేషాలకే పరిమితం కాకుండా  ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయాలలో ఎన్టీఆర్ ప్రవేశ, ప్రభంజన, ప్రభావ, పరిణామాల గురించి చాలా పారదర్శకంగా , పరిశీలనాత్మకంగా , తులనాత్మకంగా విశదీకరించారు ఈ విశ్రాంత ఉన్నతాధికారులు.

624 పేజీల ఈ గ్రంధాన్ని  5 భాగాలుగా 107 అధ్యాయాలుగా వర్గీకరించి ప్రతి అధ్యాయాన్ని ఆసక్తికరమైన విషయ విశేషాలతో తీర్చిదిద్దారు రచయితలు.
ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి  జీవితంలోని ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు, పోరాట పటిమ గురించి సవివరంగా,సాధికారికంగా తెలుసుకోవాలి అనుకునే ప్రతిఒక్కరూ చదవవలసిన సమగ్ర సత్ గ్రంథం యన్. టీ. ఆర్.

ఎన్టీఆర్ ముఖచిత్రంతో హస్తభూషణం గా తీర్చిదిద్దబడిన అమూల్యమైన ఈ పుస్తకం వెల రూ. 400 కాగా  విశాలాంధ్ర, నవోదయ, నవ చేతన, సాయి గణేష్, వాల్డన్ వంటి ప్రముఖ బుక్ స్టాల్స్ తో పాటు అమెజాన్ ఆన్ లైన్ లో కూడా లభిస్తుంది.

Siva 143 Movie Song Launched by J.D.Chakravarthi

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) మూవీ సాంగ్ ను జె.డి చక్రవర్తి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది…

*అనంతరం జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ*:-గతంలో ట్రైలర్ చూసాను. సాగర్ హీరో గా డైరెక్టరగా.కథ,స్క్రీన్ ప్లే,కొరియోగ్రాఫర్ ఇలా అన్నీ అతనే అని అక్షర్యపోయాను.రామసత్యనారాయణ మొదటి సినిమా కే కాకుండా రెండో సినిమా కూడా ఇవ్వడం అంటే అక్షర్యపోయాను. అంటే సాగర్ ఎంత హార్డ్ వర్క్ చేసి నమ్మకం కలిగించి ఉంటేనే.రామసత్యనారాయణ రెండో సినిమా ఇచ్చి ఉంటాడో అర్థమౌతుంది.రామసత్యనారాయణ గారు ఎంతో మంచివారు, వారికి తన మన అనే బేధం లేదు తన సినిమా అయినా పరాయి సినిమా అయినా ఒకటే.డైరెక్టర్ తో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ తను చేసిన రహస్యం సినిమా స్క్రీన్ ప్రెజెంట్ గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని అద్భుతంగా ఉన్నాయి.డి.యస్.రావు చాలాకాలంగా తెలుసు,నాకు మంచి మిత్రుడు కూడా, ఈ మధ్య మంచి పాత్రలు పోషిస్తున్నాడు,ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నానాని చెప్పాడు.ఆయన ఇలాగే మంచి చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నాను. మా సత్య కు సినిమా అంటే పిచ్చి.. సినిమాను సినిమాగా ప్రేమించే వీరు ఎంతో కష్టపడి చేసిన ఈ శివ143 సినిమా వీరందరికీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు..

*తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ*:- శివ 143 మూవీ సంక్రాంతి కి విడుదలకు సిద్ధం చేసాం.థియేటర్స్.డిస్ట్రిబ్యూటర్స్ అన్ని రెడి..కానీ సెన్సార్ అవ్వని కారణం చేత సంక్రాంతి కి విడుదల చేయకుండా సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకున్నాము..త్వరలోనే ఈ నెల లొనే సినిమా విడుదల తేదీని.ప్రకటన చేస్తాము.
ఈ శివ 143 సినిమాకు ఇన్సపిరేషన్ నలుగురు ఉన్నారు వారు కళ్యాణ్. రాంగోపాల్ వర్మ,జె.డి.చక్రవర్తి,పోసాని కృష్ణ మురళి వీరి నాలుగురికి నేనంటే ఇష్టం.వీరునన్ను ఎప్పుడు అభిమానిస్తారు.వీరెప్పుడూ నాకు అందుబాటులో ఉంటారు.నాకు ఎం సహాయం కావలసి వచ్చినా చేసే మనుషులు వీరు.ఈ రోజు జె.డి.చక్రవర్తి గారు శివ 143 సినిమా సాంగ్ ను లాంచ్ చేశారు.శివ అంటే మా గురువు గారు ఆర్. జి.వి గారు,143 అంటే పూరి జగన్నాథ్ గారిది వీరిద్దరినీ ఇష్టపడే వ్యక్తి మా డైరెక్టర్. మా డైరెక్టర్ నాకు రేమ్యూనిరేషన్ తక్కువ ఇచ్చిన పరవాలేదు కానీ కల్యాణ్. వర్మ,పూరి,జె.డి గార్లను పరిచయం చేయమని కోరాడు.దాంతో జె.డి గారిని రిక్వెస్ట్ చేసి సాంగ్ లాంచ్ చేయమని కోరితే నీకు తెలుసుగా నేను ఏ సినిమా ఫంక్షన్స్ కు రానని అన్నారు. నేను తప్పక రావాలని కోరితే మా ముఖం లో ఆనందం చూడడం కోసం రావడానికి ఒప్పుకొని వచ్చి మా శివ143 సినిమా సాంగ్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు,జె.డి చక్రవర్తి గారు మాట్లాడింది యదార్థం..సినిమాని ప్రేమించే మాకు ఎప్పుడు సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు.

*హీరో,డైరెక్టర్ సాగర్ శైలేష్ మాట్లాడుతూ*:-సత్యనారాయణ గారు వచ్చి సాంగ్ లాంచ్ కు జె.డి.చక్రవర్తి గారు రావడానికి ఒప్పుకున్నారని చెప్పగానే నేను నమ్మలేదు,జెడి గారు సాంగ్ లాంచ్ కు రాగానే అంత సీనియర్ అయ్యి ఉండి, నా దగ్గరకు వచ్చి నువ్వు తీసిన సినిమా యాక్షన్ స్సేక్వెన్స్ బాగున్నాయి అనగానే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను,ఎందుకంటే నేను తీసిన ఒక సినిమానే గుర్తు పెట్టుకివాల్సిన అవసరం లేదు,కానీ ఆ సినిమా గురుంచి మాట్లాడం తో నాకు ఈ అప్రిసెషన్ చాలు ఇక నా జన్మ ధన్యమైనట్లు అనిపించింది.నన్ను నమ్మి నాకీ 2వ అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ సార్ కు నా ధన్యవాదాలు అని అన్నారు..

*నటీనటులు:*
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ

*సాంకేతిక నిపుణులు:*
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్

Uttara Getting Best Offers

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలయి మంచి సినిమా గా గుర్తింపు తెచ్చకున్న ఈ సినిమా రిలీజ్ టైం లో థియేటర్స్ దొరకక ఇబ్బంది పడింది. అయితే సినిమా కి వచ్చిన రెస్సాన్స్ అండ్ మౌత్ టాక్ కారణంగా విడుదలైన అన్ని థియేటర్స్ లో మంచి టాక్ ని సొంత చేసుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఈ  సందర్భంగా

దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ:
సినిమా పబ్లిసిటీ, రిలీజ్ విషయంలో కొందరి వ్యక్తులను నమ్మి మోస పోయాను.అందుకే ఉత్తర అనుకున్న థియేటర్స్ లో విడుదల చేయలేకపోయాం. కానీ ఉత్తర కు వస్తున్న రెస్సాన్స్ తో థియేటర్స్ దగ్గర వినపడుతున్న టాక్ తో ఉత్తర
సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. మేము పెట్టిన డబ్బులు రాబట్టకోగలిగాం..  పూర్తి తెలంగాణా నేటివిటీ లో రూపొందిన ఈ సినిమాకు
తమిళ,కన్నడ నుండి రిమేక్  అండ్ డబ్బింగ్  ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే డిజిటల్ , శాటిలైట్ మార్కెట్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో మా టీం కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. ఉత్తర ను సరిగ్గా ప్రేక్షకులు దగ్గరకు తీసుకెళ్ళ లేకపోవడం లో కొందరి వ్యక్తుల మోసం ఉంది. ఇన్ని ఆటంకాలు వచ్చినా ఉత్తర ప్రేక్షకులు మనస్సులను గెలుచుకుంది. అది మాకు ఆనందంగా ఉంది’అన్నారు.

ఈ మూవీ కి సమర్సణ
సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.

నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్,
అభయ్ తదితరులు

Vijayendra Prasad launches “Idea to Script” writer’s workshop at Annapurna Studios, Hyd.

ACFM in association with Vijayendra Prasad, the celebrated scriptwriter of blockbusters like “Baahubali” and “Bajrangi Bhaijaan” announced a hands-on writer’s workshop -“Idea to Script” – for all aspiring writers who want to make it big in Indian cinema.
Ms. Amala Akkineni, Director ACFM announced this exclusive workshop, making it a great start for the year 2020 for scriptwriting aspirants. She commented “The maestro’s pen has won billion hearts and ensured box office successes time and again. The Baahubali franchise, has got the Indian film industry ,the much needed recognition. Vijayendra Prasad’s stories have always been larger than life, and are well known to enthrall audiences bringing in high emotions through his storyline”.
She invited writers and filmmaking aspirants to participate in this hands-on workshop to co-Script the next Blockbuster, the unique advantage being learning the art & craft of script writing for commercial success directly from the master Scriptwriter K.V. Vijayendra Prasad at Annapurna Studios
Vijayendra Prasad comments, “Any amount of theoretical knowledge will not give a practical sense! Stories should be developed; you start with an idea and then build on it. Scriptwriting is all about our ability to grasp at an idea, sense its potential, and breathe life into it. The more observant we are of our surroundings, the more sensitive we become and the better is our capability to narrate a powerful story”.

This workshop will be conducted at Annapurna Studios starting January 2020.
For enquiry call 1 800 57 24736 or mail

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ‘ఐడియా టు స్క్రిప్ట్’ అనే రైటర్స్ వర్క్‌షాప్‌ను లాంచ్ చేస్తున్న అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం)

భారతీయ సినిమాలో తమ సత్తా చాటాలనుకొనే ఔత్సాహిక రచయితలందరి కోసం ‘ఐడియా టు స్క్రిప్ట్’ అనే రైటర్స్ వర్క్‌షాప్ నిర్వహించేందుకు.. ‘బాహుబలి’, ‘బజ్‌రంగి భాయిజాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సుప్రసిద్ధ స్క్రిప్ట్ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో చేతులు కలుపుతున్నట్లు ఏసీఎఫ్ఎం ప్రకటించింది.స్క్రిప్ట్‌రైటింగ్‌లో ఆసక్తి ఉన్నవారికోసం 2020 సంవత్సరంలో మంచి ఆరంభం ఇవ్వడానికి ఈ ఎక్స్‌క్లూజివ్ వర్క్‌షాప్‌ను ఏసీఎఫ్ఎం డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని ప్రకటించారు. “విజయేంద్రప్రసాద్ గారి కలం కోట్లాది హృదయాల్ని గెలుచుకుంది. ప్రతిసారీ బాక్సాఫీస్ విజయాల్ని అందించింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ భారతీయ చిత్రసీమకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన కథలెప్పుడూ లార్జర్ దేన్ లైఫ్‌లా ఉంటాయి. తన స్టోరీలైన్ ద్వారా భావోద్వేగాల్ని కలిగించి ప్రేక్షకుల్ని అలరించడంలో ఆయన దిట్ట” అని ఆమె చెప్పారు.మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ అయిన కె.వి. విజయేంద్రప్రసాద్ నుంచి కమర్షియల్ సక్సెస్ స్క్రిప్ట్ రైటింగ్‌లోని మెళకువల్ని నేరుగా నేర్చుకొనే అరుదైన సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ, తదుపరి బ్లాక్‌బస్టర్ కోసం స్క్రిప్టు రూపకల్పనలో భాగం పంచే ఈ వర్క్‌షాప్‌లో పాలుపంచుకోవాల్సిందిగా రచయితలనూ, ఔత్సాహిక ఫిలింమేకర్స్‌నూ ఆమె ఆహ్వానించారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ఎంత థీరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అది ప్రాక్టికల్‌గా ఏమంత ఉపకరించదు. కథలనేవి ఒక ఐడియాతో మొదలై, డెవలప్ అవుతాయి. ఒక మంచి ఐడియాను ఎలా గ్రహించాలో, దాన్ని ప్రభావవంతమైన ఒక కథగా ఎలా మలచాలో, దానికి ప్రాణం ఎలా పోయాలో స్క్రిప్ట్‌రైటింగ్ నేర్పిస్తుంది. మన పరిసరాల్ని ఎంత పరిశీలనా దృష్టితో చూస్తే, ఎంత సున్నితంగా మనం మారగలిగితే, ఒక శక్తిమంతమైన స్టోరీని నెరేట్ చేయగల సామర్థ్యం అంతగా మనకు అలవడుతుంది” అని తెలిపారు.