Home Blog Page 981

Kalakarudu Movie Hero,Producer Sridhar Srimanthula interview

శ్రీస్ విజువల్స్ పతాకం పై శ్రీధర్ మరియు దుర్గ హీరో హీరోయిన్ గా పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు , రవి వర్మ, జబర్దస్త్ జీవన్ ముఖ్య తారాగణం తో కిరణ్ దుస్సా దర్శకత్వం లో శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన చిత్రం “కళాకారుడు”. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2020 లో జనవరి 3వ తారీఖున విడుదలవుతుంది . ఈ సందర్భం గా నిర్మాత మరియు హీరో శ్రీధర్ శ్రీమంతుల తో మీడియా మిత్రులు ముచ్చటించారు.

భీమవరంలో పుట్టి పెరిగి సినిమాల మీద మక్కువతో మంచి సినిమాలు నిర్మాంచాలి అని శ్రీస్ విజువల్స్ అనే బ్యానర్ పెట్టి తానే నిర్మాతగా హీరో గా మంచి కథ కథనం తో శ్రీధర్ శ్రీమంతుల “కళాకారుడు” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఒక మంచి కుటుంబ కథ చిత్రం. మంచి కామెడీ సన్నివేశాలతో అందమైన పాటలతో మాస్ ప్రేక్షకుడిని అలరించే యాక్షన్ ఫైట్స్ తో నూతన సంవత్సరం 2020 లో జనవరి 3 వ తారీఖున విడులవుతుంది అని తెలియజేసారు

సినిమా కథ గురించి మాట్లాడుతూ ” ఒక మధ్యతరగతి అబ్బాయి అతి తక్కువ సమయం కోటీశ్వరుడు అవ్వాలని మంచి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది అని కోరుకుంటాడు. తన కోరిక తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుంది అనేదే ఈ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ తో అందమైన లొకేషన్స్ లో సినిమా ని చిత్రీకరించాం. క్లీన్ ఎంటెర్టైన్మ్నెట్ సినిమా. కుటుంబం అందరు కలిసి చూడదగ్గ సినిమా.

సినిమా షూటింగ్ లొకేషన్స్ గురించి వివరిస్తూ “హైదరాబాద్, భీమవరం, పాలకొల్లు లో చిత్రరించాము. ఒక మెలోడీ పాటకోసం గోవా వెళ్ళాము. సినిమాలో నాలుగు ఫైట్స్ మరియు ఆరు పాటలు ఉన్నాయ్. పాటలకి యూట్యూబ్ లో మంచి స్పందన వచ్చింది. పాటలు చాలా బాగుంటాయి. కె విశ్వనాధ్ గారు అంటే నాకు చాలా అభిమానం, వారిలాగా సినిమా డైరెక్టర్ అవాలని నా కోరిక. చిన ప్రయత్నం గా ఈ సినిమా చేసాము. అని బాగుంటే మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. మా సినిమా లో పాటలు హైలైట్స్, రఘు రామ్ గారు మా సినిమా కి మంచి సంగీతం అందించారు. ఆరు పాటలు బాగుంటాయి.

హీరోయిన్ గురించి మాట్లాడుతూ “మా సినిమా లో ఇంతకూ ముందు చాలా సినిమాలో సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దుర్గ మా సినిమా తో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాము. చాలా మంచి గా నటించింది. సినిమా లో మంచి కామెడీ ఉంటుంది. ఫామిలీ అందరు కలిసి చూడాలి మా సినిమా అని అసభ్యసన్నివేశాలు లేకుండా చేసాము. నూతన సంవత్సరం 2020 లో జనవరి 3 వ తారీఖున విడులవుతుంది అని తెలియజేశారు.

బ్యానర్ : శ్రీస్ విజువల్స్
నిర్మాత : శ్రీధర్ శ్రీమంతుల
నటి నటులు : శ్రీధర్, దుర్గ, పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు, రవి వర్మ, బాషా, జబర్దస్త్ జీవన్ తదితరులు
సంగీతం : రఘు రామ్
కెమెరా మాన్ : రవి చేపూర్
కళ దర్శకుడు : నానాజీ
కథ, స్క్రీన్ ప్లే : శ్రీధర్
మాటలు, దర్శకత్వం : కిరణ్ దుస్సా

Palle Vasi Movie Teaser Launched

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో నటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమై, కిరాక్ పార్టీతో అలరించిన నటుడు రాకేందు మౌళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం` పల్లెవాసి`. సాయినాధ్ గోరంట్ల ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రానికి రాం ప్రసాద్ నిర్మాత‌. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా `పల్లెవాసి` సినిమా టీజర్ ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా…

ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – “ఫిల్మ్ ఛాంబర్లలోనో, స్టూడియోలలోనో కాకుండా నిజమైన పుస్తక ప్రేమికుల మధ్య హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో “పల్లెవాసి” సినిమా టీజర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే దర్శకుడు నేటి సమాజం విస్మరించిన వ్యవసాయ రంగంపై ఒక చర్చను ముందుకు తీసుకొస్తున్నట్లు, పల్లెదనాన్ని వినూత్నంగా చిత్రీకరించారనిపిస్తోంది.ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రసిద్ధ పాటల రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ – “ పల్లెసీమ నేపథ్యంలో మంచి కథని ఎంచుకొన్న చిత్రబృందానికి అభినందనలు. సినిమా విజయవంతం కావాలి“ అన్నారు.

నటుడు రాకేందు మౌళి మాట్లాడుతూ – “ అక్షరంమీద ఆధారపడిన కుటుంబం నుంచి వచ్చిన నా తొలిచిత్రం టీజర్ఆవిష్కరణ పుస్తకాల, పుస్తకాభిమానుల మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. పల్లెవాసి సినిమా పాటలు, మాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో పదికాలాల పాటు నిలుస్తాయి“అన్నారు

హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ – “పల్లె వాసి” టీజర్ చూస్తుంటే.. గోరటి వెంకన్న “పల్లె కన్నీరు పెడుతుందో” పాటకు విశ్వరూపంగా ఉంది“ అన్నారు.

దర్శకుడుసాయినాధ్ గోరంట్ల మాట్లాడుతూ – ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఔట్ ఫుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా `పల్లెవాసి` టీజర్ ను విడుదల చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. సినిమా సక్సెస్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాం” అన్నారు.

నిర్మాత రాం ప్రసాద్ మాట్లాడుతూ – భరద్వాజ గారు మా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ” పల్లె వాసి” సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది” అన్నారు

కార్యక్రమంలోకెమెరామెన్ చామంతి లక్ష్మణ్ రాజ్, ద‌ర్శ‌కులు కె. సందీప్ కుమార్‌, స‌హ నిర్మాత ఉద‌య్‌కుమార్ యాద‌వ్ తదితరులు పాల్గొన్నారు

‘Kiss’ Movie Teaser Launch on Jan 2nd

జి.ఎస్‌.కె ప్రొడక్షన్స్ బేనర్ పై శివ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నరొమాంటిక్ థ్రిల్లర్ “కిస్”. ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. కాగా జనవరి 2న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..

దర్శకనిర్మాత శివ మాట్లాడుతూ – `దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతవరకూ ఈ కాన్సెప్ట్ తో ఏ భాషలో సినిమా రాలేదు. నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయం పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. జనవరి 2టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.

ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
నిర్మాత, దర్శకత్వం: శివ,
సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్,
ఎడిటర్: క్రిష్,
సంగీతం: నవనీత్ చారి,
ఆర్ట్ డైరెక్టర్: సి హెచ్ శ్రీను,

The Party Song ‘Daang Daang’ from Sarileru Neekevvaru

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.  ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, మాస్‌ సాంగ్‌, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా చిత్రం నుండి డాంగ్ డాంగ్  ఫుల్ లిరిక‌ల్‌ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఆజ్ రాత్ మేరే గ‌ర్ మే పార్టీ హై తు ఆజానా… అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ మహేశ్‌, త‌మ‌న్నాల‌పై అమేజింగ్ స్టెప్స్‌తో అభిమానులు, ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో అదిరిపోయే స్టెప్పులేశారు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌. ఈ న్యూ ఇయ‌ర్‌కి ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి వారిలో జోష్ నింపాడు దేవి శ్రీ. ఈ సాంగ్ రేపు థియేటర్ లో అదరగొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులను కంపోజ్ చేశారు. ఈ పాట‌కు రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా న‌కాష్ అజిజ్‌, ల‌వితా లోబో ఆల‌పించారు.

జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో  మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నవిష‌యం తెలిసిందే..

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

‘Software Sudheer’ Success Meet

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్స్ గా  రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శక‌త్వంలో శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై సాఫ్ట్‌వేర్‌ శేఖర్‌ రాజు నిర్మించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌స‌. డిసెంబర్‌ 28న ఈ చిత్రం  గ్రాండ్‌గా విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 30న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ, నిర్మాత సాఫ్ట్‌వేర్‌ శేఖర్‌ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు..

హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ  – “వెండితెర మీద కంటిన్యూ గా రెండు గంటలపాటు ఉండే క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్ లో ఊహించలేదు. అది ఈరోజు నిజమైంది. మాములుగా వారానికి మూడు రోజులు ఇంట్లో టీవి ఆన్ చేస్తే కనిపిస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదలైనప్పటి నుండి అంత‌టా  పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పెద్ద పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మా డైరెక్టర్ గారు మొదటి రోజు నుండి సినిమా బాగుంది అని పాజిటివ్ టాక్ రావడంతో మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్లారు. ఆయన తరపున మీ అందరికీ హృద‌య‌పూర్వ‌క‌ దన్యవాదాలు” అన్నారు.

చిత్ర నిర్మాత సాఫ్ట్ వేర్ శేఖర్ రాజు మాట్లాడుతూ – “నా మొదటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. కథ నచ్చి డబ్బుతీసుకోకుండా నటించిన డా. శివ ప్రసాద్ గారికి ఈ సినిమా అంకిత‌మిస్తున్నాను.  మా సినిమా  మొదటి రోజు 190 థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు 300 థియేటర్స్ లో ర‌న్ అవుతోంది. మా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌` విడుద‌లైన‌ రెండు రోజుల్లోనే 4 కోట్ల 50లక్షల‌ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా థియేటర్స్ పెంచుతున్నాము అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని సాఫ్ట్ వేర్ శేఖర్ రాజు గా మార్చుకున్నాను” అన్నారు.

హీరోయిన్ ధన్యబాలకృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమా నార్మల్ ఓపెనింగ్స్ తీసుకుంటుంది అనుకున్నాం కానీ సుధీర్ ఫ్యాన్స్ దీనిని ఆడియన్స్ లోకి తీసుకెళ్లి ఒక పండుగలా ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీ తో సినిమా బాగా ఆడుతుంది. తెలుగు రాష్టాల్లోనే కాదు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి హిట్ కొట్టమని సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ కి, సుధీర్ ఫ్యాన్స్ కి నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి ధన్యవాదాలు” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – ” ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు గర్వంగా ఉంది. థియేటర్స్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చప్పట్లు విజిల్స్ తో ఒక పెద్ద భహిరంగ సభలా అనిపించింది. నేను చేసిన పాటలకి సుధీర్ అన్న,ధన్య చేసిన డాన్సులు చూస్తే ఎవ్వరికైనా గూస్బమ్స్ వస్తాయి. నా పాట ఈ రోజు గెలిచింది అంటే ప్రధాన కారణం సుధీర్ గారు. సినిమా 200లో విడుదలైంది. ఇప్పుడు 300థియేటర్స్ లో ఆడుతుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది అనడానికి ఇదే ఉదాహరణ. ఇంత మంచి సినిమాని నిర్మించిన శేఖర్ రాజు గారికి, నా స్నేహితుడు రాజశేఖర్ కి కృతజ్ఞతలు. ఈ చిత్రంలో సురేష్ ఉపాధ్యాయ మూడు పాటలు రాశారు. ఇంత అందమే పాట పెద్ద హిట్ అయింది. అతనికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ – ” ఈ సినిమాలో `ఇంత అందమే,కోయం బత్తూరు పీసు, ఐడెంటిటీ కార్డు” మూడు పాటలు రాశాను. అన్ని పెద్ద హిట్ అయ్యాయి. సుధీర్ అన్నడ్యాన్స్ లు ఇరగదీశారు. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత‌  శేఖర్ రాజు గారికి, దర్శకుడు రాజశేఖర్ గారికి, భీమ్స్ కి ధన్యవాదాలు” అన్నారు.

నైజాం డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ మాట్లాడుతూ – “ఈ చిత్రాన్ని మొదట 190 థియేటర్స్ లో విడుదల చేశాం. ఇప్పడు 300 థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇంకా థియేటర్స్ పెంచే అవకాశం ఉంది” అన్నారు.

Producer Sadhu shekar interview about Raja Narashimha Movie

‘‘కొన్నేళ్లగా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్‌ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందచేయాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్‌ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై జనవరి ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో

నిర్మాత సాధు శేఖర్‌ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. వైశాక్‌, మమ్ముట్టి కాంబినేషన్‌ మీద నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. ఓ అటవీ ప్రాంతంలో కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నది సినిమా ఇతివృత్తం. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. నమ్మితే ప్రాణమిచ్చే రాజా పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు తగ్గట్టే అత్యంత బలమైన పాత్రలో ప్రతినాయకుడిగా జగపతిబాబు చక్కని నటన కనబర్చారు. సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మన నేటివిటీకి తగ్గట్టే స్ట్రెయిట్‌ సినిమాలా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్నాం కాబట్టి సినిమా విడుదలకు అంతగా ఇబ్బంది పడలేదు. కొత్త సంవత్సరంలో మా చిత్రం గ్యారెంటీగా హిట్‌ అవుతుంది’’ అని తెలిపారు.

Sarileru Neekevvaru Song Promo Launch Vizag Event

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో ,జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కాగా డిసెంబర్ 28న జరిగిన విశాఖ ఉత్సవ్‌ లో మంత్రి అవంతి శ్రీనివాస్ చేతులమీదుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి డాన్స్ చేయడం ప్రేక్షకాభిమానుల్ని అలరించింది. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల కోరికపై డాంగ్ డాంగ్ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ” జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరి మనసులను దోచుకోబోతున్నారు మహేష్ బాబు. అనిల్ రావిపూడి నుండి నెవర్ సీన్‌ బిఫోర్ మూవీ అలాగే మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరబుల్ మూవీ. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి దాని కంటే ఎక్కువే ఉంటుంది” అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి `ఎఫ్2` సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్ కి వచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’  నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. దేవి శ్రీ ప్రసాద్  ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. జనవరి ఫస్ట్ కి మనందరికీ ఒక  కావాలి.. హ్యాపీగా మంచి  పార్టీ సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో మీరు చూసిన డాన్స్  కొంచమే, మైండ్ బ్లాక్ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు డాన్స్  ఇంకా ఇరగదీశారు.  మహేష్ బాబు గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయనతో చేసిన ఈ జర్నీ మరిచిపోలేనిది. ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టార్. ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా  జెన్యూన్ పర్సన్. ఈ సినిమా రూపంలో మంచి సక్సెస్ ఇచ్చి ఆయ‌న‌కు చిన్న‌  గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. మహేష్ చేసిన కామెడీ, ఎమోషన్స్ చూసి చాలా ఎక్సయిట్ అవుతారు. ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చారు. ఇక వెటరన్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చాలా ముఖ్యమైన పాత్ర చేశారు, మహేష్ బాబు రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా ఆరంభం నుంచి చివరిదాకా ఆద్యంతం అలరిస్తాయి. అలాగే 13 ఏళ్ల తరువాత విజయశాంతి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది.  డెఫినెట్‌గా గతేడాది సంక్రాంతికి `ఎఫ్2` సినిమాని  ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ తో అంత కన్నాఎక్కువ ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు` ప్రతి పాటను ఒక చార్ట్ బస్టర్ గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 2020 వెల్కమ్ చేస్తూ పార్టీ చేయడం కోసం డాంగ్ డాంగ్ పాట ప్రోమో ని లాంచ్ చేశాం. ఈ సినిమాలో మహేష్ గారిని కొత్త కోణంలో చూడబోతున్నారు.  ముఖ్యంగా భీభత్సమైన డాన్స్ మూమెంట్స్ తో చూడబోతున్నారు, అనిల్ రావిపూడి అదరగొట్టాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు” అన్నారు.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ – ” అనిల్ రావి పూడి ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ నాకు  జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభూతిని,అనుభవాన్ని ఇచ్చిన సినిమా” అన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Saftwere Sudheer Movie All Areas Passitive Talk

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దగ్గర దర్శకత్వ శాఖలో మరియు సహాయ రచయితగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడుగా మారి చేసిన సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని ఏరియాల నుండి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తాను రాసుకున్న పాయింట్ తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు, హిట్ కొట్టాడు.

సాఫ్ట్ వేర్ సుధీర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫ్లో మరియు లాజిక్ సన్నివేశాలు ప్రేక్షకుడిని రంజింపజేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రసవత్తరంగా ఉంది. ఒక సోసియో ఫాంటసీ చిత్రం చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత దర్శకుడు ఓ క్రైమ్ స్టోరీని పరిచయం చేశాడు. ఈ పాయింట్ సినిమాకే హైలెట్. ఐతే సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ అలాగే అతని ఎనర్జిటిక్ డాన్సులు అలరిస్తాయి. ధన్యా బాలకృష్ణ గ్లామర్ కూడా ఈ మూవీలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది. 2019 చివర్లో వచ్చిన హిట్ అలాగే 2020 లో మొదటి హిట్ సినిమాగా సాఫ్ట్ వేర్ సుధీర్ ను చెప్పుకోవచ్చు.

Mathu Vadalaraa Evollution Meet

అది 2000వ సంవత్సరం కెరీర్, డబ్బుల పరంగా నాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఉమ్మడి  కుటుంబసభ్యుల బాధ్యతలు నాపై ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో శ్రీసింహాకు నాలుగేళ్లు ఉంటాయి.  ఓ రోజు సింగపూర్ వెళ్లాలనే  ప్రతిపాదన ఇంట్లో వచ్చింది. అక్కడకు  వెళ్లేంత డబ్బులు నా దగ్గర లేవని చెప్పాను.  అయితే నేను తీసుకెళతా అని శ్రీసింహ అన్నాడు.    ఆ ప్రామిస్‌ను ఈ సినిమాతో వచ్చిన పారితోషికం ద్వారా శ్రీసింహా నెరవేర్చుతాడనే నమ్మకముంది అని అన్నారు కీరవాణి. ఆయన తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా, మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా  పరిచయమైన చిత్రం మత్తు వదలరా. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం మత్తువదలరా ఎవల్యూషన్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ
నూతన తారాగణంతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రమోషన్స్‌ను రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చేశాం. ఆ వైవిధ్యతే సినిమా పట్ల అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.  కంటెంట్ ఈజ్ కింగ్ ఈ సినిమా మరోసారి నిరూపించింది అని చెప్పారు.
హీరో శ్రీసింహా మాట్లాడుతూ:-ప్రస్తుతం ఇలాంటి వైవిధ్యమైన కథలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాలే ఎక్కువగా పేరు, గుర్తింపు తెచ్చిపెడతాయి.  కాన్సెప్ట్ ఓరియెంటెండ్  సినిమాలతో కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదిగినప్పుడే  సంతృప్తి ఉంటుంది. ఆ ఆలోచనతో ఈ సినిమాలో నటించాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మైత్రీ సంస్థలోనే హీరోగా తొలి సినిమా చేయడం ఆనందంగా ఉంది అని  చెప్పారు.
కాలభైరవ మాట్లాడుతూ అరంగేట్రానికి చిన్న సినిమాను ఎంచుకోవడానికి కారణమేమిటని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్ని సెలెక్ట్ చేసే లగ్జరీ మాకు లేదు. సినిమా  అవకాశం రావడమే గొప్ప విషయం.  కథాబలమున్న మంచి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రేక్షకులంతా నేపథ్య సంగీతంతో కనెక్ట్ కావడం సంతోషాన్ని కలిగించింది అన్నారు.
దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ కామెడీ, రొమాంటిక్ ట్రాక్‌లు లేకుండా సినిమా తీయాలంటే నిర్మాత మమ్మల్ని నమ్మాలి. చెర్రి,మైత్రీ నిర్మాతలు నన్ను, నా కథను పూర్తిగా నమ్మి ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే కాన్ఫిడెన్స్‌తోనే  చేశారు.  40, 50 ఏళ్ల వయసు వారు పాటలు లేకపోయినా సినిమా బాగుందని చెబుతున్నారు.  శ్రీసింహాను ఆడిషన్ ద్వారానే ఎంచుకున్నాం. సిట్యువేషన్ కామెడీకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమా రూపొందించాం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి) నరేష్ అగస్త్య , సురేష్ సారంగం, థామస్ తదితరులు పాల్గొన్నారు.

Amrutha Productions Movie Colour Photo Regular Shooting Started

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి  చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.

యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, అలాగే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 1995 లో ఒక ఇంజనీరింగ్ కాలేజి లో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు యూనిట్ త్వరలో తెలుపనున్నారు.

బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
పిఆర్ఒ: ఏలూరు శ్రీను