Home Blog Page 982

‘Ala Vaikunthapurramuloo’s Musical Concert on Jan 6th

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం 2020, జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ....’అల వైకుంఠపురంలో’ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ కెరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ గా నిలిచింది ఈ చిత్రం. అందుకు ముఖ్యంగా తమన్ కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 2020 జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ”అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను ” వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నట్లు తెలిపారు.

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Thoota Movie Producer G.Thata Reddy interview

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ హీరోగా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ గౌత‌మ్‌వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. యు ఏ స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో `తూటా` పేరుతో గొలుగూరి రామ‌కృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య‌భేరి వారి బ్యాన‌ర్‌పై జి. తాతారెడ్డి , జి స‌త్యానారాయ‌ణ‌రెడ్డి జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత తాతారెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు ఆ విశేషాలు...

మీ నేప‌థ్యం?
యూఎస్‌లో ఎమ్ఎస్ బ‌యో టెక్నాల‌జీ చేశాను. క్యాన్స‌ర్ రీసెర్చ్‌లో సెంటిస్ట్‌గా రెండు సంవ‌త్స‌రాలు ప‌ని చేశాను. త‌ర్వాత సినిమాల‌పై ఆస‌క్తితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిఅల్లు అర్జున్ గారి `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాను. తరువాత `ల‌వ‌ర్స్ డే` చిత్రాన్ని పంపిణీ చేశాను. ఇప్ప‌డు తెలుగులో గౌతమ్ మీనన్ గారి `తూటా` సినిమాతో తో నిర్మాత‌గా మీ ముందుకు వస్తున్నాం.

తూటా గురించి చెప్పండి?.
గౌత‌మ్‌మీన‌న్ గారు ఇదివ‌ర‌కు చాలా ప్రేమ‌క‌థా చిత్రాలు చేశారు. అయితే `తూటా` చిత్రం వాటికి విభిన్నంగా ఉండి ప్రేక్ష‌కుల‌ను మ‌రింత మెప్పిస్తుంది. మాతృకలో చాలా మార్పులు చేసి తెలుగు నెటివిటీ క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. సినిమా నిడివి త‌గ్గించ‌డంతో స్క్రీన్ ప్లే రేసీగా ఉండి ప్రేక్ష‌కుల‌కు క‌థ‌పై ఆస‌క్తిని క్రియేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ట్రాక్‌కు కొత్త‌గా అండ‌ర్‌వ‌ర‌ల్డ్ ట‌చ్ ఉంటుంది. జ‌న‌ర‌ల్‌గా గౌత‌మ్‌మీన‌న్‌గారి సినిమాలు అంటే రొమాంటిక్‌గా ఉంటూ క్లైమాక్స్‌లో యాక్ష‌న్ ఉంటుంది. కానీ తూటా సినిమాలో 70 ప‌ర్సెంట్ యాక్ష‌న్ ఉంటుంది. అందుకే `తూటా` అనే టైటిల్ పెట్టాం.

సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతినిస్తుంది?
`తూటా` చూస్తున్నప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అంద‌రి పాత్ర‌లు బాగా సూట్ అయ్యాయి. ఏదైనా ఆల్బ‌మ్‌లో ఒక‌టి లేదా రెండు పాట‌లు బాగుంటాయి. కానీ ఈ సినిమాలో అన్ని పాట‌లు బాగా వచ్చాయి. ప్రతిపాట‌ సంద‌ర్భానుసారంగానే వస్తుంది. సిద్ శ్రీరామ్ గారు పాడిన రెండు పాట‌లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

బిజినెస్ ఎలా జ‌రిగింది?
నైజాంలో ఎషియ‌న్ సునీల్‌గారు, సీడెడ్ ఎన్వీ ప్ర‌సాద్‌గారు ఇలా ఈస్ట్ వెస్ట్ కూడా ప్ర‌ముఖ పంపిణీదారులే మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 2015 జనవరి 1న ఇదే బ్యానర్ లో వచ్చిన `రఘు వ‌ర‌న్‌ B.Tech` తమిళ్ లో మంచి విజయం సాధించింది. మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత 2020 జనవరి1న ఇదే బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో మీముందుకు రావడం సంతోషంగా ఉంది.

డైరెక్ట్‌గా తెలుగు సినిమాలు చేస్తారా?
క‌చ్చితంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచ‌న ఉంది. మీతో వ‌ర్క్ చేయ‌డం చాలా కంఫ‌ర్ట్‌గా ఉంది. మీతో తప్పకుండా ఓ సినిమా చేస్తాను అని ఓ సందర్భంలో గౌత‌మ్‌మీన‌న్‌గారు అన్నారు. ప్రస్తుతం మంచి క‌థ‌ల కోసం చూస్తున్నాం. ఆసక్తి గల కొత్త దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో వస్తే తప్పకుండా మా బేనర్ లో సినిమాలు నిర్మిస్తాం. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.

Ammayante Alusaa Movie Trailer launch

నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతాశ్రీ అర్ట్స్ పతాకంపై నేనే శేఖర్, కార్తీక్ రెడ్డి,స్వాతి,శ్వేత, ఆర్తి హీరో,హీరోయిన్ లుగా నేనే శేఖర్ దర్సకత్వంలో యలమంచిలి బ్రహ్మ శేఖర్,నవులూరి మాధవరెడ్డి, సరిపూడి హరికృష్ణ లు సంయుక్తంగా నిర్మిస్తున్న “అమ్మాయంటే అలుసా” చిత్రానికి వినీష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్,తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సుచిరిండియా జియం యండి కాసిమ్,సురేష్ కొండేటి,జివి చౌదరి,డాక్టర్ యండి కాసిమ్ మొదలగు సినీ ప్రముఖులు చేతుల మీదుగా పాటలను,టీజర్,ట్రైలర్ ను విడుదలచేసారు*..*

అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ*:-*శేఖర్ చాలా మంది హీరోలు,డైరెక్టర్లు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.ప్రస్తుతం సమాజానికి ఎలాంటి కథ అయితే బాగుంటుందో తెలుసినవాడు శేఖర్.మంచి కథలున్న సినిమాకీ ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు.ఇలాంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే శేఖర్ లాంటి వారు మరిన్ని చిత్రాలు తీస్తారని అన్నారు.

*తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ**:-శేఖర్ కు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా సినిమా మధ్యలో ఆగిపోతే తను ఇల్లు అమ్మి సినిమా కంప్లీట్ చేసాడు అని తెలిసి చాలా బాధపడ్డాను,శేఖర్ పడిన కష్టానికైనా ఈ మూవీ పెద్ద విజయం సాధించి తను అమ్ముకున్న ఇంటిని తిరిగి దక్కించుకోవాలని అన్నారు.

*సంగీత దర్శకుడు వినీష్ మాట్లాడుతూ*:-ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయి.ఇందులో నము అవజాశమిచ్చిన శేఖర్ కు ధన్యవాదాలు.

*సెకండ్ హీరో కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ*:-*ఈ సినిమా కోసం చాలా లొకేషన్స్ తిరిగి సెలెక్ట్ చేసి సినిమా చేసాము,ఈ సినిమా టైటిల్ సెలెక్ట్ చేయడానికే నెల రోజులు పట్టింది. ఇంత కష్టపడి అమ్మాయిలపై మెసేజ్ ఉన్నా మూవీ చేసిన శేఖర్ అన్నకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.

*సహ నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ*:-సమాజం లో ఆడపిల్లలకు ఎం జరుగుతుందనేది ఈ మూవీ చూస్తే తెలుస్తుంది, శేఖర్ చాలా కష్టపడి ఈ సినిమా తీసాడు.ఈ సినిమా మా అందరికి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు..

*హీరో, నిర్మాత,దర్శకుడు నేనే శేఖర్ మాట్లాడుతూ*:-నేను అందరి పెద్ద హీరోల దగ్గర,డైరెక్టర్ల దగ్గర ప్రొడక్షన్ మేనేజరు గా పనిచేస్తూ ఎక్స్గూటివ్ ప్రొడ్యూసర్ గా చేసాను.ఇప్పుడు నిర్మాతగా మారి ఈ సినిమా తీస్తున్నాను.సగం సినిమా అయిపోగానే కొన్ని ఇబ్బందులు వలన సినిమా ఆగిపోయింది..అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాలు చూడలేక నా భార్యకు తెలియకుండా నా ఇల్లు అమ్మి ఈ సినిమాను కంప్లీట్ చేసాను.అందుకే నేను తీసిన ఈ సినిమాను దిశ కు అంకిత మిస్తున్నాను. ఇంట్లో మా అమ్మాయి టీవీ లో దిశ సంఘటన చూసి కళ్ళు తిరిగి పడిపోయింది.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అడవారిపై అరాచకాలు చేస్తూనే ఉన్నారు.తరాలు మారినా మగవారిలో మార్పు రావడం లేదు.ప్రతి ఒక్కరూ అడవారిపై సోదరభావం తో మెలగాలి అని కోరుకుంటున్నాను.ఈ సినిమాకు అన్ని నేనే అయి తీస్తున్నాను.సహనిర్మాతలు,కార్తీక్ రెడ్డి ఇలా అందరూ నాకు సపోర్ట్ చేశారు.ఈ కార్యక్రమానికి ఇంత మంది సినీ పెద్దలు వచ్చి నన్ను,మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యెక్క ధన్యవాదాలు అని అన్నారు..

Poster Movie getting ready for censor

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “పోస్టర్”. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని సెన్సార్ కి వెళ్లేందుకు సిద్దమవుతుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల అయి ప్రేక్షలను అలరిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, శంకర్ గణేష్, మల్లికార్జున్, అజయ్.., వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు.

Ullalla Ullalla Movie Heroin Noorin interview

‘లవర్స్ డే’ ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా జనవరి 1 న విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. ఈ సందర్భంగా హీరోయిన్ నూరిన్ విలేకర్లతో మాట్లాడుతూ…

“ఊల్లాల ఊల్లాల” చిత్రం కథ, అందులో మీ రోల్ ఎలాంటిది?

తెలుగులో నా మొదటి చిత్రం “ఊల్లాల ఊల్లాల”. లవర్స్ డే తెలుగులో డబ్బింగ్ అయ్యాక ఇక్కడి వాళ్ళు నాపై చాలా అభిమానం చూపించారు. “ఊల్లాల ఊల్లాల” పూర్తిగా వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులకి కావలసిన థ్రిల్లింగ్, కామెడీ, ప్రేమ, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉన్నసినిమా. పల్లెటూరు నేపథ్యమున్న అమ్మాయి నూరి గా ఈ చిత్రంలో హీరో నటరాజ్ ని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను.

మీరు ఒక చిత్రం ఒప్పుకోవడానికి ఎలాంటి అంశాలని చూస్తారు?

50 % కమిట్మెంట్ మిగితా 50 % మూవీ టీం. “ఊల్లాల ఊల్లాల” మాత్రం గురురాజ్ గారిపై నమ్మకంతో ఒప్పుకున్నాను. అలాగే విలన్ పాత్రల్లో చాలా పాపులర్ అయిన సత్యప్రకాష్ గారు మొదటి సారి దర్శత్వం చేయడం, కన్నడ, తెలుగులో ఎన్నో చిత్రాలకి పని చేసిన యూనిట్ “ఊల్లాల ఊల్లాల” కి పనిచేయడం నా పాత్రకి ప్రాధాన్యమున్న కథ దొరకటం ఇలాంటి ఎన్నో అంశాలున్నాయి.

సీనియర్ నటుడైన సత్యప్రకాష్ గారు దర్శకత్వం చేసిన మొదటి చిత్రంలో మీరు నటించడం ఎలా అనిపించింది?

ఒక నటుడిగా మరియు దర్శకుడిగా ఉండటం నిజంగా మాలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను పరిశ్రమకి కొత్త, నటించేటప్పుడు చాలా చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, వాళ్ళలా అనుభవం ఉన్నవాళ్లు ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఆయన దర్శకత్వంలో కూడా, నటులకు ఎక్కడక్కడ స్ట్రెస్ ఉంటుంది అనేది ఆయనకి తెలుసు పైగా తెలుగు భాష నాకు రాదు, అది కొంచెం, కొంచెం కూడా కాదు చాలానే కష్టం, ఒక భావాన్ని అర్ధం చేసుకోవటానికి, దానికి తగ్గట్టు నటించటానికి ఒక నటుడిగా నన్ను అర్ధం చేసుకుని ఆ పరిస్థితులలో తనే నాకు సాయం చేశారు. సీన్ కి తగ్గట్టు ఎమోషన్ రావటానికి చాలా సాయపడ్డారు. ఏం ఫీల్ అవుతున్నాను అనేది తెలుసుకొని మరి సీన్ కి తగ్గట్టు పరిస్థుతలని వివరించేవారు చాలా టిప్స్ ఇచ్చేవాళ్ళు, కెమెరాని ఫేస్ చేయటానికి, సరైన ఎమోషన్ని పండించటానికి, ఆడియన్స్ కి నచ్చేలా నటించటనికి ఆ చిన్న చిన్న విషయాలు నేర్పేవాళ్లు. ఆయన దర్శకత్వంలో నటించడం అనేది నిజంగా గొప్ప అనుభవం, ఎందుకంటే తెలుగు లో ఇది నా మొదటి సినిమా, ఈ విధంగానే నా గ్రాఫ్ అనేది తెలుసుకోగెలను, ఒక మంచి దర్శకునితో చాలా సంతోషంగా ఉంది.

సత్యప్రకాష్ గారి అబ్బాయి కూడా మొదటి సారి తెలుగులో పరిచయమవుతున్నారు, ఆయనతో నటించడం ఎలా అనిపించింది?

నటరాజ్ కన్నడలో ఇంతకుముందే సినిమాలు చేసిన తెలుగులో తనకి కూడా ఇదే మొదటి చిత్రం. తను సత్యప్రకాష్ గారి కొడుకు అని మొదట్లో తెలియదు ఎందుకంటే సెట్ లో వాళ్ళు ఒక నటుడు ఒక దర్శకుడు ఉన్నారు అన్నట్టుగా ఉంటారు. అంతకుమించి వేరే సెట్ లో తన కొడుకే నటిస్తుంది అనేలాంటి అనుబంధం వారిద్దరి మధ్య సెట్లో కనిపించదు. సెట్ లో నటించేటప్పుడు నేనెక్కడైనా పొరపాటు చేస్తే, నూరిన్ కంగారు పడకు మరో టేక్ చేద్దాం అని చెప్పేవారు అదే విధం గా నటరాజ్ తో కూడా అనేవాళ్లు. చాలా రోజులకు తెలిసింది వాళ్లిదరు నిజంగానే తండ్రీకొడుకులని, వారిద్దరూ సెట్లో అంత ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు.

ఈ చిత్ర పోస్టర్లలో గుర్రం బాగా వాడుతున్నారు, దాంతో ఏం చెప్పాలనుకుంటున్నారు?

అది సస్పెన్స్ గా ఉంచాలనుకుంటున్నారు, సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది.

లవర్స్ డే లాగే ఈ చిత్రంలో కూడా మీరు ఇంకొక హీరోయిన్ తో నటిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది?

లవర్స్ డే లో నా రోల్ అందరితో కలిపి కథలో భాగంగా ఉంటుంది, “ఊల్లాల ఊల్లాల” లో నాకు అంకితకి పూర్తిగా వేరే వేరే సన్నివేశాలు ఉంటాయి. ఏ సీన్లోనూ నేను అంకిత ఒకే చోట కనిపించము.

లవర్స్ డే ఫలితం మీకెలా అనిపించింది?

నా వరకు లవర్స్ డే షూటింగ్, రిలీజ్ కి ముందు రిలీజ్ తరువాత పరిస్థితుల నుండి మేము చాలా నేర్చుకున్నాము. రిలీజ్ టైం లో చాలా వివాదాలు జరిగినా, క్లైమాక్స్ మారిపోయినా మా వరకు ఆ చిత్రం చాలా ఆవకాశాలకి దారి చూపింది. ఫలితం అనేది ఎలా ఉన్నా ఎవరి అభిప్రాయం వారికి ఉందిగా, నా వరకు లవర్స్ డే నాకు చాలా నచ్చిన చిత్రం.

ఈ చిత్రం మీ కెరీర్ కి ఎంత హెల్ప్ అవుతుందనుకుంటున్నారు?

నాకు డాన్స్ చేయడం ఇష్టం, లవర్స్ డే లో నా ప్రతిభ చూపించడానికి అంతలా అవకాశం దొరకలేదు. “ఊల్లాల ఊల్లాల” కి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆయన ఆధ్వర్యంలో పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంలో నా డాన్స్ కి, ఫైట్స్ కి, నటనకి గుర్తింపు వచ్చి నా కోసం పాత్ర రాసిన కథలు వస్తే చాలు అనుకుంటున్నాను.

చిత్ర షూటింగ్ లో మీరు ఎన్ని రోజులు నటించారు, సెట్ లో మీ అనుభవాలేంటి?

నేను మొత్తం 15 రోజులు ఈ చిత్రంలో నటించాను, మధ్యలో ఒక రోజు మొత్తం కేవలం నా సీన్లు మాత్రమే తీశారు. చాలా బిజీ షెడ్యూల్ అవ్వడం వల్ల సెట్ లో మిగితా వాళ్లతో మాట్లాడే, సమయం గడిపే అవకాశం లభించలేదు. కానీ షూటింగ్ లో బాంగా మదనపల్లికి వెళ్ళినపుడు చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ చిత్రం మొత్తం పూర్తయ్యాక, ఆ ప్రాంతంతో నాకు తెలీకుండానే ఒక అనుబంధం ఏర్పడింది అనిపించింది.

తెలుగు మరియు మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య తేడాలు ఏం గమనించారు?

మలయాళంలో తెలుగు లో ప్రేమ ఒక్కటైనా తెలుగులో, హీరోయిన్లకిచ్చే గౌరవం చాలా నచ్చింది. నూరిన్ గారు అని పిలుస్తుంటే వారికి నాపై ఉన్న గౌరవంతో కూడిన ఆప్యాయత కనిపించింది, అది మాత్రమే రెండు పరిశ్రమలలో ఉన్న చిన్న తేడా అనిపించింది.

మీ లుక్ కొంచం నిత్యా మీనన్ లా అనిపిస్తుంది, తనపై మీ అభిప్రాయం?

నాకు నిత్యా మీనన్ అంటే చాల ఇష్టం. తను మలయాళం నటి అయినా తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేశారు.

నిర్మాత గురురాజ్ గారి రెండవ చిత్రంలో కూడా నటించడం ఎలా అనిపిస్తుంది?

ఆయన కుటుంబం టోన్ సెట్ లోకి వస్తారు, నిర్మాతని అన్న దర్పం చూపివ్వరు. నాతోనే కాదు నటరాజ్ కానీ, సత్యప్రకాష్ గారితో కానీ చాలా ఆత్మీయతతో ఉండేవారు, చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.

మీకు నచ్చిన హీరో & హీరోయిన్?

హీరో ఐతే అల్లు అర్జున్ గారే ఆయనంటే చాలా ఇష్టం నాకు, హీరోయిన్లలో నయనతార గారంటే చాలా ఇష్టం. మామూలు నటి నుండి లేడి సూపర్ స్టార్ రేంజ్ కి ఆమె ఎదిగిన తీరు మాలాంటి కొత్త వాళ్లకు చాలా స్ఫూర్తినిస్తోంది, ఇంకా ఎంతో సాధించాలన్న పట్టుదలనిస్తుంది.

తెలుగులో మీరు ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు?

నాకు అందరూ ఇష్టమే కానీ అల్లు అర్జున్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని కాబట్టి ఆయనతో నటించాలని కల ఐతే ఉంది కానీ నేనింకా అంత ఎదగలేదు అనుకుంటున్నాను.

లవర్స్ డే తరువాత కొత్త చిత్రలేవైనా అంగీకరించారా?

ఆ చిత్రం తరువాత ధమాకా అనే మలయాళం చిత్రం చేస్తున్నాను, భాగమతి హీరో ఉన్ని ముకుందన్ గారితో ఒక చిత్రం చేస్తున్నాను. అలాగే ఇక్కడి కథలని కూడా వింటున్నాను. ప్రస్తుతం చేస్తున్న తమిళ మరియు మలయాళం చిత్రాలు పూర్తయ్యాక మిగితావాటి గురించి ఆలోచిస్తాను.

తెలుగులో మీరు ఎలాంటి రోల్స్ కోసం చూస్తున్నారు?

ఇలాగే ఉండాలని ఏది లేదు, ఇంతే వ్యవధి నేను కనపడాలని కూడా కాదు, నేను చేసిన పాత్ర లో నన్ను నా నటనని గుర్తుంచుకునేలా ఉండే ఏ పాత్ర ఉన్న కథైనా చేయడానికి నేను సిద్ధం.

తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంటున్నారా?

మొదట్లో నాకు అస్సలు అర్ధమయ్యేది కాదు, ఇప్పుడు కొద్దిగా అర్ధమవుతుంది. కొన్ని కొన్ని పదాలు వచ్చు, త్వరలోనే పూర్తిగా తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంటాను.

Mathu Vadhala Movie Producer’s Ravishankar ,cherry(Chiranjeevi)interview Pressmeet

మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని  ప్రోత్సహించే  ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అంటున్నారు నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి). మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మత్తువదలరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనూహ్య ప్రేక్షకాదరణ లభిస్తోంది. పరిమిత వ్యయంతో, ఓ వినూత్నమైన ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా నిర్మాతలు రవిశంకర్, చెర్రి(చిరంజీవి)లు పాత్రికేయులతో ముచ్చటించారు ఆ విశేషాలివి.

రంగస్థలం తర్వాత
యంగ్ టాలెంటెడ్ టీమ్ ఈ సినిమా దొరికింది. రంగస్థలం తర్వాత మా సంస్థలో ప్రతి విభాగం స్ఫూర్తి పొంది పనిచేసిన సినిమా ఇది. దర్శకుడు కథ, కథనాలతో పాటు పాత్ర చిత్రణలు, లైటింగ్, ైస్టెలింగ్, సెట్స్ ప్రతి విషయంలో స్పష్టతతో ఉండటంతో అందరూ విశ్వాసంతో పనిచేశారు.  రితేష్ ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయకపోయినా అనుభవజ్ఞుడిలా సినిమాను తెరకెక్కించారు. పరిమిత బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాం. డీఐ, గ్రాఫిక్స్ వర్క్స్ , కెమెరా అన్నింటిని రితేష్ బృందం సమకూర్చుకుంటూ అనుకున్న బడ్జెట్‌లో పూర్తిచేశారు.   వాటికోసం  కేవలం రెండు కంప్యూటర్స్, గ్రాఫిక్స్ కార్డ్స్ మాత్రమే వారికి మేము ఇచ్చాం.  పరిమిత వనరులతో చక్కటి నాణ్యతతో సినిమాను రూపొందించవచ్చని నిరూపించారు. పెద్ద సినిమాల్లో మాదిరిగి విజువల్స్ క్వాలిటీతో కనిపిస్తున్నాయి.  హాలీవుడ్ సినిమా సూపర్‌మెన్ మేకింగ్ చూసి యాక్షన్ రిగ్‌లను తయారుచేసుకొని ఆశ్చర్యపరిచారు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమా చేశారు.
రాజమౌళి, కీరవాణి జోక్యం చేసుకోలేదు
దర్శకుడు రితేష్ కథ చెబుతున్నప్పడే మేము  ఎంజాయ్ చేశాను. సత్య పాత్ర సంభాషణలు చెప్పగానే మనసులో నవ్వుకున్నాం. థియేటర్‌లలో వాటికి చక్కటి స్పందన లభిస్తుందనే విశ్వాసం కలిగింది.  కథ విన్న తర్వాత సినిమా చేయమని చెప్పడానికి మాకు అవకాశం దొరకలేదు. శ్రీసింహా యమదొంగతో పాటు కొన్ని సినిమాల్లో నటించాడు. నటనలో చిన్నతనం నుంచి అతడిలో ఉన్న ఆసక్తిని చూశాం. దర్శకుడు రితేష్ ఈ సినిమాను నూతన హీరోతో చేయాలనే ఆలోచనలో ఉండటంతో కీరవాణి తనయుడు అని చెప్పకుండా శ్రీసింహా పేరును సూచించాం. ఆడిషన్స్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో అభినయం కుదరకపోతే అరుణభిక్షుదగ్గర శిక్షణ తీసుకొన్నాడు. ఇందులో అతడి అభినయానికి ప్రశంసలు లభిస్తున్నాయి  కాలభైరవ  నేపథ్య సంగీతాన్ని ప్రశంసిస్తూ తొలి రోజు చాలా మంచి ఫోన్ చేశారు.  దర్శకుడితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ వల్ల ఈ సినిమా ఆడుతుందనే  ప్రశంసలు  లభిస్తున్నాయి. కొత్త దర్శకుడు ఎలా  సినిమాను చేస్తాడో తెలియదు. సినిమా పరాజయం పాలైతే కుమారుల భవిష్యత్తుపై సందేహాలు వస్తాయి ఇలా ఎన్నో సంశయాలున్నా  కీరవాణిగారు మాపై నమ్మకంతో కథ వినకుండా శ్రీసింహా, కాలభైరవలను మాకు అప్పగించారు. సినిమా అయ్యేదాకా ఆయనతో పాటు వల్లి, రాజమౌళి ఎవరూ సినిమాలో జోక్యం  చేసుకోలేదు. ఫైనల్‌కాపీ చూసి సంతోషపడ్డారు. తనయుల అరంగేట్రానికి మంచి సినిమా దొరికిందనే సంతృప్తిగా ఫీలయ్యారు.
యంగ్‌టాలెంటెడ్‌ను ప్రోత్సాహిస్తాం
కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే సినిమాలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని  ప్రోత్సహించే  ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి. నూతన తారాగణంతో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో  ఉప్పెన సినిమాను తెరకెక్కిస్తున్నాం.  ఏప్రిల్‌లో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రెండు పాటలు బ్యాలెన్స్‌గా ఉన్నాయి. సుకుమార్ సినిమా చూసి అవుట్‌పుట్ బాగుందని మెచ్చుకున్నారు. విజయ్ సేతుపతితో పాటు  కొంతమంది నటులు మినహా మిగతా వారందరూ  కొత్తవాళ్లే సినిమాలో కనిపిస్తారు. భవిష్యత్‌లో మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఇలాంటి ప్రతిభావంతులైన యంగ్ టాలెంట్‌డ్‌ను ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నాం.

Touring Talkies Movie Regular Shooting Start in Hyderabad

ఎంటర్ టైన్మెంట్ ప్లస్ పతాకం పై  బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో  రాబోతున్న  రొమాంటిక్ ఎంటర్ టైనర్ “టూరింగ్ టాకీస్”. విజయ్ పెద్దిరెడ్డి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి  రంగనాధ్ ముత్యాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఏ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రంగనాధ్ ముత్యాల మాట్లాడుతూ”గుంటూరు టాకీస్ తరహ లొనే ఇదొక వెరైటీ రొమాంటిక్ ఎంటర్ టైనర్.యూత్ ని ఎట్రాక్ట్ చేసే అద్భుతమైన పాటలు,ప్రేక్షకులను ఆకట్టుకునే వైవిధ్యమైన కామెడీ మా చిత్రానికి ప్రధాన  ఆకర్షణ.అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా వెరైటీ గా ప్లాన్ చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మాచిత్రాన్ని వేసవికానుకగా విడుదల చేయలనుకుంటున్నాం.”అన్నారు.భానుశ్రీ,విజయ్ పెద్దిరెడ్డి,మగదీర సంపత్ రాజ్,జబర్దస్త్ చిట్టిబాబు,గుండు మురళి,అర్జునరెడ్డి.బి,గోపి యాదవ్ పవులూరి,ప్రాణాళి రెడ్డి,శ్రీకళ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఉమ మహేష్ బెరి,డి.ఓ.పి:ఎన్.డి.ఉదయ్,డైలాగ్ :శివ కాకు,ఆర్ట్:సందీప్.టి,తోట రామకృష్ణ, ప్రొడక్షన్ మేనేజర్:రామకృష్ణ,ఎడిటింగ్:కార్తిక్. కట్స్,పి.అర్. ఓ:బాసింశెట్టి వీరబాబు, ప్రొడ్యూసర్: ప్రేమ్ నాధ్ ముత్యాల, స్టోరీ, స్క్రీన్ ప్లే ,డైరెక్షన్:రంగనాధ్ ముత్యాల.

Prema Pujyam Movie completed First Schedule

కాదంబరి క్రియేషన్స్ బ్యానర్ లో డాక్టర్ రక్షిత్ నిర్మాతగా. రాఘవేంద్ర బి.ఎస్. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ0 పూజ్యం. ఒక జోర్నీలో జరిగే బ్యూటిఫుల్ లవ్ స్టొరీతో ఊటీ, చిక్ మంగళూరు, కోడై కెనాల్. డార్జిలింగ్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంది. వియత్నంలో మొదటిసారి షూటింగ్ జరుపుకున్న చిత్రం ఇదే అవ్వడం విశేషం. అలాగే మున్నార్ వంటి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ చిత్ర హీరో ప్రేమ్ కి ఇది 25.వ సినిమా కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడలో మంచి గుర్తింపు ఉన్న హీరో ..ప్రేమ్ ఈ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో హీరో ప్రేమ్ కి జోడిగా బిద్ర ఆచార్య. ఆంద్రీత రాయ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా మంచి టెక్నీషియన్లతో ఈ చిత్రం కొత్త పాయింట్ తో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిందని దర్శకుడు తెలిపారు.

మొదటి షెడ్యూల్ లో 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తా ము. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో మీడియాకు తెలియపరుస్తాము.తెలుగు కన్నడలో భాషల్లో ఫిబ్రవరిలో విడుదల రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు

బ్యానర్: కెదంబరి క్రియేషన్స్
నటీనటులు: ప్రేమ్, బ్రిద ఆచార్య, అన్ద్రిత రాయ్, సుమన్, మాళవిక, అవినాష్, ఆనంద్
నిర్మాతలు: డాక్టర్ రక్షిత్, రాజకుమార్, జనకిరమన్ దేవదాస్
డైరెక్టర్ & మ్యూజిక్: డాక్టర్ రాఘవేంద్ర బి.ఎస్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాధవ్ కిరణ్
కెమెరామెన్: నవీన్ కుమార్

‘Wifei’ Movie world Wide Grand Release on Jan 3rd

‘ఏడు చేపల కథ’ లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా ‘వైఫ్ఐ’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పావులర్ అయ్యింది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు, నూతన దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్ర విడుదల సందర్భంగా యూనిట్ మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా హీరో అభిషేక్ మాట్లాడుతూ.
జనవరి 3న విడుదల కానున్న వైఫ్ ఐ చిత్రం తప్పకుండా సక్సెస్ కానుంది. ఈ సినిమాను ప్రశాంత్ గౌడ్ గారు సార్ధక్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నారు, అందుకు వారికి థాంక్స్ తెలువుతున్నాను. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.హీరోయిన్ గుంజన్ మాట్లాడుతూ…
తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. తెలుగులో డైలాగ్స్ నేర్చుకొని ఈ సినిమాలో చెప్పాను. నా పాత్ర మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. జనవరి 3న విడుదల కానున్న వైఫ్ఐ సినిమాను అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరారు. హీరో సూర్య మాట్లాడుతూ.
శేఖర్ గారికి అభిషేక్ గారికి థాంక్స్, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. షూటింగ్ సమయంలో హీరో అభిషేక్ గారిలో మంచి నటుణ్ని చూశాను, అతని దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు

లిరిక్ రైటర్ రాంబాబు గోషాల మాట్లాడుతూ…
నేను రాసిన రెండు సాంగ్స్ బాగున్నాయి. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ గారికి థాంక్స్, మల్టీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అతను, అలాగే వినోద్ యాజమాన్య నా కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ అల్బమ్ ఇది అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ….
డైరెక్టర్ కళ్యాణ్ కు మంచి విజన్ ఉంది. అతను భవిషత్తులో మంచి డైరెక్టర్ అవుతాడు. సినిమా బాగా వచ్చింది తప్పకుండా మంచి సినిమా అవుతుంది అన్నారు.

Saftwere Sudheer Movie Review

Release date : December 28, 2019
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Saftwere Sudheer”
Banners:-Sekhara Art creations
Starring :Sudigaali Sudheer,Danya balakrishna,indraja,nazar,Posani Krishana Murali,Sayaji Shinde,Prudvi,sivaprasad,Gaddar,P rajashekar reddy pulicharla,k shekar raju.
Editor :Goutham Raju
Cinematography:C.Ram pradad
Music Director :Bheems
Director :P,Rajashekar Reddy Pulicharla
Producer :k.Shekar Raju

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమే. కానీ అలా హీరోలుగా మారి అలరించి కంటిన్యూ అయినవాళ్లు మాత్రం ఎవ్వరూ లేరు. రాజబాబు నుండి రీసెంట్‌గా సునీల్ వరకు అంతా కూడా నాలుక కరుచుకుని మళ్ళీ కమెడియన్ అంటూ కంటిన్యూ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ‘జబర్దస్త్’ కామెడీ షో లో సుడిగాలి సుధీర్ అంటూ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మరికొన్ని షోస్ చేస్తూ బుల్లితెరపై మంచి ఇమేజ్, అలానే ఫాలోయింగ్ కూడా సంపాందించుకున్న సుధీర్ ఇప్పుడు హీరోగా మారాడు. అది కూడా తనపేరు కూడా కలసి వచ్చేలా సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ టైటిల్ కూడా పెట్టుకుని హీరోగా తన తొలి ప్రయత్నంతో ప్రేక్షకులని పలరించాడు.మరి ఆ ప్రయత్నం ఫలించిందా? లేక వికటించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

చందు(సుధీర్) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అయితే అక్కడే కొలీగ్‌ (ధన్య బాలకృష్ణ) తో ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా అవుతుంది. కానీ ఆ వెంటనే చందు వాళ్ళ అమ్మకి, అలానే ధన్య వాళ్ళ అమ్మకి కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో జాతకాలు చూపించుకుందాం అని చందు,ధన్య కలిసి ఒక ఆశ్రమానికి వెళతారు. అయితే అక్కడ ఉన్న స్వామి చందుకి ఒక దోషం ఉంది అని చెబుతాడు. కానీ చందు తనని నమ్మకపోవడం వల్ల ముందు అతనికి నమ్మకం కలిగించడానికి ఒక పుస్తకం ఇచ్చి 30 రోజులు కూడా ఆ పుస్తకంలో ఉన్నట్టే అతనికి జరుగుతుంది అని చెబుతాడు. 29 రోజులు ఆ పుస్తకంలో ఉన్నట్టే జరుగుతుంది. కానీ 30 వ రోజు మాత్రం చందు చనిపోతాడు అని రాసి ఉంటుంది. అప్పుడు చందు, ధన్య ఏం చేశారు?, ఆ స్వామీజీ వాళ్ళను కాపాడాడా?, మరి ఈ కథకు రైతులకు సంబందించిన ప్రాజెక్ట్‌కి సంబంధం ఏంటి?…ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షోలో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా తెరపై తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో ఆయన మాస్ హీరో రేంజ్ లో ఇరగదీశాడు. అమాయకుడైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సుధీర్ నటన పాత్రకు తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంది.

హీరోయిన్ ధన్యా బాలకృష్ణ రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రను చక్కగా పోషించింది. పాటలలో ఆమె గ్లామర్ యూత్ కి కిక్కెక్కించేదిలా ఉంది. అలాగే పతాక సన్నివేశాలలో కూడా ఆమె చక్కగా నటించారు.

సెకండ్ హాఫ్ లో కథలో వచ్చే రెండు ట్విస్ట్స్ బాగున్నాయి. ఇక భీమ్స్ అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరో తల్లి దండ్రులుగా చేసిన సాయాజీ షిండే, ఇంద్రజ తమ పరిధిలో చక్కగా నటించారు. మంత్రి పాత్రలో శివ ప్రసాద్, హీరో మావయ్యగా పోసాని నటన ఆకట్టుకుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే సాఫ్ట్ వేర్ సుధీర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫ్లో మరియు లాజిక్ సన్నివేశాలు ప్రేక్షకుడిని రంజింపజేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రసవత్తరంగా ఉంది. ఒక సోసియో ఫాంటసీ చిత్రం చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత దర్శకుడు ఓ క్రైమ్ స్టోరీని పరిచయం చేశాడు. ఈ పాయింట్ సినిమాకే హైలెట్. ఐతే సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ అలాగే అతని ఎనర్జిటిక్ డాన్సులు అలరిస్తాయి. ధన్యా బాలకృష్ణ గ్లామర్ కూడా ఈ మూవీలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది.

Cinemarangam.com.. Rating : 3/5