Home Blog Page 993

Tremendous Response For Superstar Rajinikanth, Darbar’ Telugu Trailer

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఆదిత్య అరుణాచలం గా  ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.  ఇప్ప‌టికే విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ కి  ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా లేటెస్ట్ గా ` దర్బార్` తెలుగు ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్ చాలా రిచ్‌గా ఉండి తలైవా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని  ఉన్నాయి..వాడు పోలీస్ ఆఫీసరా సార్.. హంతకుడు అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆదిత్య అరుణాచలం, కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై గా రజని ఎంట్రీ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ఆఫీసర్స్ పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్..వుయ్ లీవ్ టు ప్రొటెక్ట్..వుయ్ డై టు సర్వ్ అని రజిని చెప్పే డైలాగ్, సార్ వాళ్లకి చెప్పండి.. పోలీసుల‌ దగ్గరికి  లెఫ్ట్‌లో రావొచ్చు, రైట్‌లో రావచ్చు.. స్ట్రయిట్‌గా రావద్దని.. ఆ చూపేంటి ఒరిజిన‌ల్‌గానే నేను విల‌నమ్మా .. ఇక ట్రైలర్ చివర్లో ‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్’ అని పాడుకుంటూ రజనీ తన స్టైల్‌లో నడుచుకుంటూ రావడం అదిరిపోయింది. సునీల్ శెట్టి విల‌నిజం ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది.  సంతోష్ శివన్ విజువల్స్, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. న‌య‌న‌తార  గ్లామ‌ర్ లుక్‌తో మెప్పిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ‘దర్బార్’  సినిమా రజనీకాంత్ వన్ మ్యాన్ షోలా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. మొత్తానికి ఈ ట్రైలర్  సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌

Director parasuram launched “Suno na zara Song teaser” from Shiva143

గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన  ప్రముఖ దర్శకుడు పరశురాం చేతుల మీదుగా శివ 143 సాంగ్ విడుదల జరిగింది.
ఈ సందర్భంగా పరశురాం గారు మాట్లాడుతూ….
దర్శకుడు సాగర్ శైలేష్ నాకు చాలా కాలంగా తెలుసు ట్రైలర్స్..సాంగ్స్ చూసాను చాలా బాగున్నాయి. ఈ రోజు చిన్న బడ్జెట్ సినిమా కి చాలా ఇబ్బందులు ఉన్నాయి..కానీ వాటిని అధికమించి  శివ143  ఇంత బాగా రావటానికి కారణం సీనియర్ నిర్మాత రామ సత్యనారాయణ గారి కి అన్ని కష్ట సుఖాలు తెలుసు కావున ఆయన సినిమాను మంచి థియేటర్స్ లో విడుదల చేసి సక్సెస్ చేస్తాడన్న నమ్మకం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ కొత్త వాడైన బాగా చేసాడు. పాటలు బాగున్నాయి. కెమెరామెన్ సుధాకర్, డిఐ ఎడిటింగ్ శివ ప్రసాద్..ఈ చిత్రానికి ప్లస్ అవుతారు.హీరోయిన్ చాలా బాగుంది..ఈ సాంగ్ హిట్ అవుతాదీ..జనవరి 12 న విడుదల కి ప్లాన్ చేయటం అంటే నాకు ఆశ్చర్యం వేసింది
ఉన్న వనరులతో చాలా కష్టపడి శివ 143 తీసాడు..విజయానికి దగ్గరలో వున్నాడు మా సాగర్ శైలేష్ అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ….
డైరెక్టర్ పరుశురాం బిజీగా ఉన్నా మా సాంగ్ కోసం సమయం కేటాయించి విడుదల చేశారు, ఆయన సపోర్ట్ మరువలేనిది. అందుకు పరుశురాం గారికి ధన్యవాదాలు. మా శివ 143 చిత్రం జనవరి 12న సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
హీరో, డైరెక్టర్ శైలేష్ సాగర్ మాట్లాడుతూ….
మా యూనిట్ కు సపోర్ట్ చేస్తున్న పరుశురాం గారికి థాంక్స్. పరుశురాం గారు విడుదల చేసిన సాంగ్ సినిమాలో సందర్భానుసారం వస్తుంది, ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటుంది. జనవరి 12న మా సినిమాను సపోర్ట్ చెయ్యమని ఆడియన్స్ ను కోరారు.
నటీనటులు: సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: జె.కరుణ కుమార్
నిర్మాత: బి.ఓబుల్ సుబ్బారెడ్డి
కథ – మాటలు: జక్కా హరిప్రసాద్
సంగీతం: యాజమాన్య
లిరిక్స్: రాంబాబు గోషల
పీఆర్ఓ: మధు వి.ఆర్

Jurney Movie 8 years compleated

జీవిత ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ మలుపు ప్రమాదం కావచ్చు, ప్రమోదం కావచ్చు. ఒక జర్నీ ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో తెలియజేసిన సినిమా జర్నీ. ఈ సినిమా విడుదలై నేటితో 8ఏళ్లు పూర్తయ్యాయి.  నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం ఈ
ప్రమాదాలకు కారణమౌతోంది. ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ అంశానికి
అద్భుతమైన ప్రేమ కథను జోడించి తమిళంలో రూపొందించిన చిత్రం “ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌”ను తెలుగులో ‘జర్నీ’గా
నిర్మాత సురేష్ కొండేటి  తెలుగు ప్రేక్షకులకు అందించారు. శర్వానంద్‌, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయాన్ని సాధించింది. కొత్త దనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత… ఈ సినిమాను ఉన్నత శిఖరాలపై నిలబెట్టింది.

కథలోకి వెళితే…
శర్వానంద్‌ తన స్నేహితుడిని డ్రాప్‌ చేయడానికి హైదరాబాద్‌ బస్టాండ్‌కు వస్తాడు. అక్కడికే వచ్చి తను వెళ్ళాల్సిన సాఫ్ట్‌వేర్
కంపెనీ అడ్రసు తెలియక తన అక్కతో ఫోన్‌లు మాట్లాడుతుంది అనన్య. ఆమె పల్లెటూరు నుంచి హైదరాబాద్‌ వస్తుంది. తన
అక్క వేరే పనివల్ల ఆమెను రిసీవ్‌ చేసుకోలేక పోతుంది. సిటీలో చాలా జాగ్రత్తతో ఉండాలని సూచనలు కూడా చేస్తుంది.ఫోన్‌లో అడ్రస్‌ తెలీయక ఆ పక్కనే ఉన్న శర్వానంద్‌ సాయం అడుగుతుంది. ఆ సాయం తనను ఇంటర్వ్యూకు దగ్గరుండి తీసుకుళ్ళేలా చేసుకుంటుంది అనన్య. తన అమాయకత్వం చూసి శర్వానంద్‌ ముగ్దుడవుతాడు. ఇది ప్రేమకు ఒక కోణం.
మరోవైపు….జై టెక్నికల్‌ కోర్సు చేసి అప్రంటిస్‌గా పనిచేస్తుంటాడు.కొద్దిగా దూరమైనా ఎదురింటి అంజలిని జై ప్రేమిస్తాడు. తనను ప్రేమించాలంటే కొన్నింటికి తట్టుకోవాలని అంజలి జైకు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన అతన్ని అనన్య ప్రేమిస్తుంది. జై తన తల్లి దగ్గరకు అనన్యను తీసుకెళ్లడానికి బస్‌ ఎక్కుతాడు. అటువైపు నుంచి అనన్యను వెతుక్కుంటూ శర్వానంద్‌ బస్‌
ఎక్కుతాడు. ఇంటర్వ్యూ ముగించుకుని అనన్య బస్‌ ఎక్కుతుంది.రెండు బస్సులు వ్యతిరేకదిశలో ప్రయాణం సాగుతాయి. అలా ఒక్కచోట వచ్చేసరికి మితిమీరిన వేగంతో ఈ రెండు బస్సులు గుద్దుకోవడంతో ప్రయాణికులు చాలామంది చనిపోతారు. కొందరికి తీవ్ర గాయాలవుతాయి. తన కళ్ళముందే జై చనిపోవడం, తను చూస్తుండగానే అనన్యకి విపరీతగాయాలు కావడం అంజలి,
శర్వానంద్‌లు షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత ఎవరికి వారు తమవారిని తీసుకొని వెళ్ళిపోతారు. కథ విషాదంతమైనా ప్రేక్షకులు దీన్ని ఇంతగా ఆదరించడానికి కారణం మన హృదయాంతరాళాలను తట్టిలేపడమే. ఇందులో పాత్రధారుల కంటే పాత్రలే కన్పిస్తాయి. ఎవరూ నటించినట్లు ఉండదు. దర్శకుడు స్క్రీన్‌ప్లే చూపించడంలో తగిన శ్రద్ధతీసుకున్నాడు. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కోపతాపాలు, అనుమానాలు, ప్రవర్తనలు ఇరు జంటల మధ్య బాగా చూపించాడు దర్శకుడు శరవణన్. పతాక సన్నివేశాలు హృదయాన్ని పిండేస్తాయి. ప్రేమకథలు చెబుతూ… అందులోనూ జీవితాన్ని చూపించిన ప్రయత్నమే ఈ జర్నీ.
నిర్మాత ఏమన్నారు?
ఈ సినిమాలో మెయిన్ పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాను.
‘ఒక విధంగా ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. నా జర్నీ ఈ రోజు ఇలా ఉందంటే ఈ జర్నీ సినిమానే కారణం. ప్రతి మనిషి జీవితంలోనూ జర్నీ ఉండాల్సిందే. అన్ని జర్నీలూ విషదం కావు. విషాదం ఎదురవుతుందని మన ప్రయాణం ఆపుకోలేం. మన చేతుల్లో ఏదీ లేకపోయినా మన ప్రయాణం నిరంతరం సాగాల్సిందే’అన్నారు. ఈ సినిమా 8 ఏళ్ల ప్రయాణం
సందర్భంగా ఈ ప్రయాణంలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు అందజేశారు.

Suresh kondeti as Ranga in Devineni

నెహ్రూ, రంగాల జీవితంలో మనకు తెలియని కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ‘దేవినేని’ సినిమా. శివనాగేశ్వరరావు
(శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌టి‌ఆర్ ఫిలింస్ పతాకంపై జి. ఎస్.ఆర్ .చౌదరి, రాము రాథోడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటిస్తుండగా, వంగవీటి రంగా పాత్రను సురేష్ కొండేటి పోషిస్తున్నారు.
నవీనారెడ్డి, తేజారెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ పూర్తికావచ్చింది. నెహ్రూ,
రంగాల మధ్య వివాదం, గాంధీ చనిపోవడం, వారు విడిపోవడం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. గులాబీ హౌస్,
రామకృష్ణా స్టూడియో, రాక్ కాజిల్, బూత్ బంగ్లా, మొయినాబాద్ లోని వెంకటాపురం  తదితర లోకేషన్లలతో చిత్రీకరణ జరిగింది. రంగా, రత్నకుమారిల వివాహానికి నెహ్రూ సహకరించడం, ఈ నేపథ్యంలో వచ్చే పెళ్లి పాట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ‘రంగా రత్నల కళ్యాణమే రంగ రంగ వైభోగమే, కన్నుల విందు ఈ బంధమే కుదిరే కొత్త సంబంధమే ’ అనే పల్లవితో సాగే
ఈ పాటను తారకరత్న, సురేష్ కొండేటి, నవీనారెడ్డి, తేజారెడ్డి, రంగా అనుచరులపై,  నెహ్రూ అనుచరులపై చిత్రీకరించారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ దీనికి నృత్యరీతులను సమకూర్చారు. రాజ్ కిరణ్ స్వరకల్పనలో ఎస్.వి.రఘుబాబు ఈ పాటను రాశారు. మూడు రోజులపాటు ఈ పాట చిత్రీకరణ కొనసాగింది.
దర్శకుడు శివనాగేశ్వరరావు (శివనాగు) ఈ సినిమా విశేషాలను వివరిస్తూ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ నెల 22కల్లా పతాక సన్నివేశాలు మినహా
దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు.
రంగా పాత్ర పోషిస్తున్న సురేష్ కొండేటి మాట్లాడుతూ రంగాలాగానే ఉన్నాననే ఉద్దేశంతో తనను ఈ పాత్రకు ఎంపిక చేశారని, తన గెటప్ ను చూసి అందరూ ‘రంగా’ సురేష్ అంటున్నారని, రంగా జీవితంలో తను కూడా ఓ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

నిర్మాతల్లో ఒకరైన రాము రాథోడ్ మాట్లాడుతూ తమకిది మొదటి సినిమా అయినా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుందన్నారు. మరో నిర్మాత జి. ఎస్. ఆర్. చౌదరి మాట్లాడుతూ ఈ నెలాఖరుకల్లా షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

Chinni krishna Studios Banner logo launch

నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్, జీనియస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించి సెన్సషనల్ కథారచయితగా పేరుతెచ్చుకున్న చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ.. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ ని స్థాపించారు.. తొలిప్రయత్నంగా “కింగ్ ఫిషర్” వంటి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే యువ టాలెంటెడ్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగో విడుదల కార్యక్రమం డిసెంబర్ 16న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపి రంగురామకృష్ణంరాజు, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, ప్రముఖ  రచయితలు వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, యువదర్శకుడు కె.యస్.రవీంద్ర {బాబీ}, మాధవ్ పట్నాయక్ (కంజూమర్ కోర్ట్ జడ్జి), నిర్మాతలు రాధామోహన్, దాసరి కిరణ్, కత్తి మహేష్, హీరో అవీష్, బాలకృష్ణ అభిమాని జగన్ పాల్గొన్నారు..

 
చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగోని  వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్ ఆవిష్కరించారు. 

ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..
సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ లో ఒక భాగం రచయితలు. వారికీ నిర్మాతలు పడే కష్టం తెలుసు. అందుకే మేము ఎప్పుడు నిర్మాతలు కాకూడదు అనుకున్నాం. చిన్నికృష్ణ తెలివిగలవాడు. నరసింహనాయుడు కథని అద్భుతంగా నేరేట్ చేసాడు. అప్పుడే ఇతను పెద్ద రచయిత అవుతాడని చెప్పాను. ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడని ఆచ్చర్యపోయా. బ్యానర్ లోగో చూడగానే ఒళ్ళు గగుర్పొడిచింది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని ఆశిస్తున్నాను. చిన్నక్రిష్ణ కొత్తగా వచ్చేవారికి అవకాశాలు ఇస్తూ.. వారిని ఎంకరేజ్ చేస్తాడని కోరుకుంటున్నా.. అన్నారు.
ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. చిన్నికృష్ణ ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది. ఓటమి ఎరుగని వ్యక్తి. ఏపని చేసినా సిన్సియర్ గా, క్రమశిక్షణతో చేస్తాడు. సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కొత్తదనం కోరుకుంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్లుగా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. అలాగే చిన్నికృష్ణ రూపొందిస్తున్న కింగ్ ఫిషర్ న్యూ జోనర్ లో ఉంటుందని అలాగే తీస్తాడని ..  ఆశిస్తున్నా. ఈ సినిమాతో పాటు చిన్నికృష్ణ నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
దర్శకుడు కె.యస్.రవీంద్ర (బాబీ) మాట్లాడుతూ.. మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు కొంతమంది వుంటారు. నాకు అలాంటి వ్యక్తులు రవితేజ, శ్రీహరి, అమ్మా నాన్న తర్వాత ముఖ్యమైన వ్యక్తి చిన్నికృష్ణ. గుంటూరు నుండి వచ్చిన నన్ను ఆదరించి తనఇంట్లో ఒక మెంబర్ల చూసుకొని రచయితగా నాకంటూ ఒక స్తానం కల్పించారు. ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి చిన్నికృష్ణ గారే కారణం. అలాంటి వ్యక్తిని లైఫ్ లో మర్చిపోను.. జీవితాంతం ఆయనకి రుణపడి వుంటాను. కథలైనా, వ్యాపారమైనా ఏపనైనా సీరియస్ గా  తీసుకొని చేస్తారు. బ్యానర్ లోగో చూడగానే బుజ్ బమ్స్ వచ్చాయి.. అలాగే సినిమా కూడా ఉంటుందని.. ఈ బ్యానర్ లో కొత్త వారిని ఎంకరేజ్ చేస్తారనే నమ్మకంవుంది.. అన్నారు.
ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. సమరసింహా రెడ్డి తో నా లైఫ్ ఒక  టర్న్ తీసుకుంది. అలాంటి చిత్రానికి కథ ఇచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి థాంక్స్. ఆ తరువాత నరసింహనాయుడుతో నా కెరియర్ మరో మలుపు తిరిగింది. ఆ చిత్రానికి కథ ఇచ్చిన చిన్ని కృష్ణ గొప్ప టాలెంట్ వున్న రైటర్. మా చిన్ని తీస్తున్న ఈ చిత్రం లోగో ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. డెఫినెట్ గా సూపర్ హిట్ సినిమా తీస్తాడు. ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ.. ప్రోత్సహిస్తాడని నమ్మకంవుంది.. అన్నారు.
 ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. బ్యానర్ లోగో చూడగానే కొత్త
 ఎనర్జీ వచ్చింది. చిన్నికృష్ణ వెన్నతాగే కృష్ణుడిలా కాకుండా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టాలని.. నూతనంగా వచ్చేవారికి అవకాశాలు కల్పిస్తాడని ఆశిస్తున్నాను.. అన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రగురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా కింగ్ ఫిషర్ టైటిల్ వుంది. క్యాచీగా వుంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. నేటివిటీ, ఎమోషన్, సెంటిమెంట్ మిస్ అవకుండా కథ రాయడంలో చిన్నికృష్ణ దిట్ట. అలాంటి వ్యక్తి ఈ సినిమా తీస్తున్నాడంటే మంచి కథ తయారు చేసేవుంటాడని అర్ధం అవుతుంది. అవకాశలకోసం ఎదురుచూసే వారికీ ఛాన్స్ లు ఇస్తూ.. మరెన్నో మంచి చిత్రాలు రూపొందిస్తాడని నమ్మకంగా వుంది అన్నారు.
చిన్నికృష్ణ స్టూడియోస్ అధినేత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తెనాలి నుండి సినిమాల మీద ఇంట్రెస్ట్ తో  చెన్నపట్నం వెళ్లి భాగ్యరాజా దెగ్గర రచయితగా వర్క్ చేశాను. సుజాత రంగరాజన్ కి ఏక లవ్యశిష్యుడిగా రచనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత పరచూరి సోదరులు బి.గోపాల్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. మా చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లో  నటీనటులకు టెక్నీషియన్స్ కి కుల,మతాలకు అతీతంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్స హించే విదంగా సినిమాలు రూపొందించాలని పక్కాప్రణాళికతో మొదటి చిత్రంగా కింగ్ ఫిషర్ తో స్టార్ట్ చేశాం. ఈ చిత్రానికి  అత్యంత ప్రతిభ గల ఓ యువ  దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. కింగ్ ఫిషర్ అనేది మల్టిఫుల్ కలర్ వున్న ఒకరకమైన పక్షి పేరు. జనరల్ గా కింగ్ ఫిషర్ అనగానే మత్తు, గ్యాస్ ఫిల్ చేసి కలిపి బాటిల్లో  పోస్తే బీర్ అవుతుంది. అది తాగితే కిక్ ఇస్తుంది. మా కింగ్ ఫిషర్ మత్తుని వదిలిస్తుంది. 2014 నుండి ఇప్పటివరకు నేను  ఎంతో మందిని చూసాను. నన్ను మోసపుచ్చిన వారిని, ఇతరులని మోసగించిన వారిని అందర్నీ పరిశీలించాను. వారి మానత్వాన్ని, హ్యూమన్ రిలేషన్స్ ని ఒక బాటిలో పొందుపరిచాను. అదే ఈ కింగ్ ఫిషర్. మోసగించే వాళ్ళ మత్తుని వదిలించి సమాజంలో మంచి మనుషులుగా మారుస్తుంది.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను.

Rajtarun interview about iddarilokam okate

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ త‌రుణ్ ఇంట‌ర్వ్యూ…
– `ఇద్ద‌రి లోకం ఒక‌టే` స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌. నాలుగైదు జోన‌ర్స్ క‌లిపి చేసిన సినిమా కాదు. సినిమా అంతా ప్రేమే ఉంటుంది. ట‌ర్కీష్ సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా చేశాం. అందులో ఎమోష‌న్స్‌ను మ‌న‌కు త‌గిన‌ట్లు మార్చి ఈ సినిమా చేశాం. ముందు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్న త‌ర్వాత బెక్కం వేణుగోపాల్‌గారు, మా డైరెక్ట‌ర్ జీఆర్‌.కృష్ణ న‌న్ను `ల‌వ్ లైక్స్ కో ఇన్‌సిడెన్సెస్‌` చూడ‌మ‌న్నారు. స‌రేన‌ని చూశాను. నాకు బాగా న‌చ్చింది. సినిమాకు నేను చూసిన త‌ర్వాత స్క్రిప్ట్‌ను నెరేట్ చేశారు. దిల్‌రాజుగారు సినిమా నిర్మాణంలో అని చెప్ప‌గానే మ‌రింత హ్యాపీగా ఫీల‌య్యాను.
– సినిమా చివ‌రి 30 నిమిషాలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. లోకాన్ని మ‌ర‌చిపోతాం. మాతృక‌లోని ఫీల్‌ను మిస్ చేయ‌కూడ‌ద‌ని చాలా జాగ్ర‌త్త‌గా సినిమా చేశాం. ఈడోర‌కం ఆడోర‌కం త‌ర్వాత నేను చేసిన రీమేక్ మూవీ ఇది.
– నా గ‌త రెండు, మూడు సినిమాలు బాగా ఆడ‌లేదు. అందుక‌నే కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేయాల‌నుకున్నాను. అదే స‌మ‌యంలో నాకు తిరుప‌తి మొక్కు ఉంది. అందుక‌ని తిరుప‌తి వెళ్లి మొక్కు చెల్లించుకున్నాను. ఆ గ్యాప్‌లో చాలా క‌థ‌లు విన్నాను. చివ‌ర‌కు ఈ సినిమా చేయడానికి నిర్ణ‌యించుకున్నాను.
– నా అప‌జ‌యాల నుండి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నేర్చుకున్నాను. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కార‌ణం వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. మంచి స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుడు వ‌ర‌కు దాన్ని తీసుకెళ్ల‌డంలో ఎక్క‌డో చిన్న చిన్న త‌ప్పులు చేసుంటాం. అందుకే అవి ఆద‌ర‌ణ పొంది ఉండ‌క‌పోవ‌చ్చు. సాధార‌ణంగా స్క్రిప్ట్స్ ఎంపిక‌లో నేను ఎవ‌రి స‌ల‌హాలు తీసుకోను. న‌చ్చితే ఓకే అంటాను. లేకుంటే.. లేదు.
– నేను నేను స్క్రిప్ట్ ఎంపిక‌కు కాస్త గ్యాప్ తీసుకున్న‌ప్పుడు ఎక్కువ దూరాలు ప్ర‌యాణించాను. తిరుప‌తి మొక్కు తీర్చుకుని ఉండ‌టం వ‌ల్ల జుట్టు కూడా లేదు. కాబ‌ట్టి సినిమాల‌కు దూరంగా రెండు నెల‌లు పాటు ట్రావెల్ చేశాను. దీని వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాం.
– సాధార‌ణంగా సినిమా రిలీజ్ రోజు నా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తాను. సాయంత్రం రివ్యూలు చూస్తాను.
– జీఆర్ క‌న్విక్ష‌న్ నాకు న‌చ్చింది. ఆర్టిస్టుల‌కు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చి న‌టింప చేస్తారు. ఏం కావాల‌నే దానిపై క్లారిటీ ఉంది.
– షాలిని పాండే ఫెంటాస్టిక్ పెర్ఫామ‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన పాత్ర‌ల‌కు ఈ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. త‌ను చాలా ఎనర్జిటిక్‌గా, ఈజ్‌తో న‌టించింది.
– సాధార‌ణంగా నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్రేమ‌క‌థ‌ల్లో నా పాత్ర‌లో చాలా జోష్‌గా, లౌడ్‌గా ఉన్నాయి. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే నా పాత్ర చాలా సెటిల్డ్‌గా ఉంటుంది.
– డ్రీమ్‌గ‌ర్ల్ రీమేక్‌తో పాటు అన్న‌పూర్ణ స్టూడియోలో శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, ఓరేయ్ బుజ్జిగా సినిమాల‌ను చేస్తున్నాను. అలాగే జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమాకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాను.

Donga Pre Release Event

ఖైదీ’లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై `దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ పార్క్‌ హాయాత్‌ హోటల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ తరపున ఆయన సన్నిహితులు వెంకట్‌, చక్రవర్తి అతిధులకు బొకేలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ మాట్లాడుతూ – ”2014లో ‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్‌ అయ్యి పెద్ద విజయం సాధించింది. అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కూడా సినిమా చేయాలి అనుకున్నా. ఇప్పుడు ‘దొంగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక పార్ట్‌ అయినందుకు హ్యాపీగా ఉంది. ‘దొంగ’ నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. మంచి కాస్ట్‌ అండ్‌ క్రూ కుదిరింది. ముఖ్యంగా మా హీరో, నా స్నేహితుడు కార్తీ సహకారం మరువలేనిది. జ్యోతిక, సత్యరాజ్‌, నిఖిలా విమల్‌, ప్రసన్న ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. హ్యూమర్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌తో కూడిన ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ . సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
హీరోయిన్‌ నిఖిలా విమల్‌ మాట్లాడుతూ – ”తమిళ్‌లో ఇది నా ఐదవ సినిమా. అలాగే తెలుగులో మూడవ సినిమా. కార్తీ గారు, సత్యరాజ్‌ సర్‌, జ్యోతికగారితో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే జీతూసర్‌ చాలా పెద్ద డైరెక్టర్‌ ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్‌” అన్నారు.
సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ – ”దొంగ’ ఒక డిఫరెంట్‌ స్టోరీ లైన్‌. నా క్యారెక్టర్‌ ఎమోషనల్‌గా ఉంటూనే సరికొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు నాది పాజిటివ్‌ క్యారెక్టరా? లేక నెగటివ్‌ క్యారెక్టరా? అనే క్యూరియాసిటీ ఉంటుంది. కార్తీ, జ్యోతిక, నిఖిలాతో వర్క్‌ చేయడం హ్యాపీ. ఈ సినిమా ‘దృశ్యం’ కన్నా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. టీం అందరికి నా బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నా” అన్నారు.
డైలాగ్‌ రైటర్‌ హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ – ” కంటెంట్‌కి టాలెంట్‌ తోడయితే ఎలా ఉంటుందో ‘దొంగ’ సినిమా అలా ఉంటుంది. ఆర్‌.డి రాజశేఖర్‌ గారి సినిమాటోగ్రఫీ, గోవింద్‌ వసంత గారి సంగీతం, రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్‌ చాలా బాగుంటాయి. జీతూజోసెఫ్‌గారు ‘దృశ్యం’ సినిమాతో ఇండియా మొత్తం అభిమానులు ఏర్పాడ్డారు. షావుకారి జానకి గారికి ఒకే డైలాగ్‌ ఉన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కార్తీ గారికి పోటీగా నటించారు. నిఖిలా గారిది మంచి క్యారెక్టర్‌. సత్యరాజ్‌ గారి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. సినిమా విడుదలయ్యాక ఆయనను అందరు అభినందిస్తారు. ఒక ప్రిన్సిపల్‌ అక్క అయితే ఎలా ఉంటుందో జ్యోతిక గారి క్యారెక్టర్‌ అలా ఉంటుంది. కార్తీ గారు ఈసినిమాతో అందరి మనసుల్ని దోచేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థాంక్స్‌” అన్నారు.
సీనియర్‌ దర్శకులు శివనాగేశ్వర రావు మాట్లాడుతూ – ”’ఊపిరి’ సినిమాలో కార్తీ గారి పెర్ఫామెన్స్‌ అద్భుతం. జీతూ గారు మోస్ట్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌. కార్తీ గారి గురించి చెప్పలంటే వెయ్యిలో ఒక్కడు. మూడు సార్లు బెస్ట్‌ యాక్టర్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ గెలుచుకున్నారు. ఈ సినిమా ‘ఖైదీ’ కంటే పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ సన్నిహితులు చక్రవర్తి, వెంకట్‌ మాట్లాడుతూ – ” ఊపిరి తర్వాత ‘ఖైదీ’తో మంచి స్టార్‌డమ్‌ క్రియేట్‌ చేసుకొని ఊపుమీదున్నారు ‘కార్తీ’. రెండు భాషల ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. చాలా కొద్ది మంది హీరోలకే అది సాధ్యం అయింది. అందులో కార్తీగారు, సూర్యగారు ఉండడం చాలా సంతోషం. మా తమ్ముడు శ్రీనివాస్‌కి ఎడ్యుకేషన్‌ అన్నా, సినిమా అన్నా మంచి ఫ్యాషన్‌ ఉంది. అందుకే మంచి మంచి సినిమాలు తెలుగులో అందిస్తున్నారు. చిరంజీవిగారికి ‘దొంగ’ ఎంత పెద్దహిట్‌ అయిందో కార్తీ గారికి ఈసినిమాతో అంత కన్నా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ రావాలని కోరుకుంటున్నాం” అన్నారు.
యాంగ్రీ హీరో కార్తి మాట్లాడుతూ – ”ఖైదీ తర్వాత ‘దొంగ’ ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. రెండు చిరంజీవి గారికి పెద్ద హిట్‌ ఇచ్చిన టైటిల్స్‌. ఎలాగైతే స్క్రిప్ట్‌కి తగ్గట్లు ఖైదీ అని పెట్టామో.. ఈ సినిమాకి కూడా అలానే ‘దొంగ’ అని టైటిల్‌ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాగే అక్కా, తమ్ముడు రిలేషన్షిప్‌ ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్‌ సత్యరాజ్‌ గారు చేశారు. ఈమూడు క్యారెక్టర్‌ సినిమాకి పిల్లర్స్‌ లాంటివి. ‘దృశ్యం’ లాంటి సినిమాని తెరకెక్కించిన స్ట్రాంగ్‌ డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌ గారు ఈ సినిమాకి వర్క్‌ చేస్తున్నారు అనగానే మా అందరిలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. సత్యరాజ్‌ గారు డబ్బింగ్‌ చెప్పేటపుడు ఇది ‘దృశ్యం2” అనిపిస్తుంది అన్నారు. ఇదొక ఒక బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. షావుకారి జానకి, సీత గారి క్యారెక్టర్‌ కూడా కీలకంగా ఉంటాయి. ’96’ సినిమాకు చేసిన గోవింద్‌ వసంత గారు అద్భుతమైన సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది.’ నా పేరు శివ’, ‘ఊపిరి’ కలిపితే వచ్చిన డిఫరెంట్‌ ఫిలింలా ఈ సినిమా ఉంటుంది. ‘ఊపిరి’ సినిమాలో శీనూ క్యారెక్టర్‌ నాకు చాలా స్పెషల్‌. ఎక్కడికి వెళ్లిన ఎయిర్‌ పోర్ట్‌లో వీల్‌చైర్‌లో ఉన్నవారు నన్ను పిలిచి ఫోటో తీసుకుంటారు. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంటుంది. క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి ఫ్యామిలీతోఎంజాయ్‌ చేసే హాలిడే మూవీ. తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి.  మా నిర్మాత  రావూరి వి. శ్రీనివాస్ గారు  సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు.  తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ కార్యక్రమంలో కెఎఫ్ సి కమలాకర్, జనార్దన్, ఇంద్ర ఫిలిమ్స్ తరుణ్, సజ్జు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు..

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నికిలావిమల్‌, షావుకారు జానకి, సత్య, సీత, రోష‌న్న‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి. రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్య శాస్రి,  నిర్మాత: రావూరి వి. శ్రీనివాస్, ద‌ర్శకత్వం: జీతు జోసెఫ్‌.

He’s So Cute.. He’s So Sweet ..Latest Romantic Song from Sarileru Neekevvaru

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, ఫస్ట్ మాస్‌ సాంగ్‌, సెకండ్ మెలొడి సాంగ్ కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఈ చిత్రం నుండి అంద‌రూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్‌ ` హీ ఈజ్ సో క్యూట్ హీ ఈజ్ సో హాట్’ ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.

హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని దోచుకున్నాడు కధానాయకుడు అనే సందర్భంలో వచ్చే ఫన్ సాంగ్. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి అర్ద‌వంత‌మైన‌ సాహిత్యం అందిచ‌గా సింగర్ మధుప్రియ చ‌క్క‌గా ఆలపించారు  దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ని  కంపోజ్ చేశారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది రష్మిక. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ ఎల్‌.బి స్టేడియంలో  గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదలవ‌నుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌,త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Meet Raashi Khanna’s World Famous Lover

మోస్ట్‌ హ్యాపీనింగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. భిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా, రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ నలుగురు హీరోయిన్స్‌ పాత్రలకు, హీరో పాత్రకు ఉన్న రిలేషన్‌ ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డిఫరెంట్‌ లుక్‌, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈరోజు రాశీఖన్నా లుక్‌ను హీరోతో ఆ పాత్రకు ఉన్న రిలేషన్‌ను విడుదల చేశారు.
రాశీఖన్నా పాత్ర పేరు యామిని.. దేవరకొండ పాత్ర పేరు గౌతమ్‌. ఐశ్వర్యాజేష్‌, క్యాథరిన్‌కు శీనయ్య, శ్రీనుగా.. ఇజాబెల్లె లెయితె, రాశీఖన్నాలకు గౌతమ్‌గా విజయ్‌దేవరకొండ పాత్ర పరిచయం ఉంది. “అతన్ని నా ప్రపంచంగా చేసుకున్నాను. నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గౌతమ్‌ను వేలంటెన్స్‌ డే సందర్భంగా కలుసుకుందాం’ అంటూ రాశీఖన్నా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.
ఈ లుక్‌లో విజయ్‌దేవరకొండ, రాశీఖన్నా లుక్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. విజయ్‌దేవరకొండ నాలుగు గెటప్స్‌లో కనపడటానికి, వేర్వేరు పేర్లతో పిలవడానికి గల కారణాలు మాత్రం సీక్రెట్‌. జవనరి 3న సినిమా టీజర్‌ విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
వేలెంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

Ruler Pre Release function

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం  ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఘ‌నంగా జ‌రిగింది.  ఈ మూవీ ట్రైల‌ర్‌ను బోయ‌పాటి శ్రీను, నంద‌మూరి రామ‌కృష్ణ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, గంటా శ్రీనివాస‌రావు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, వాసుప‌ల్లి గ‌ణేష్‌, సి.క‌ల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్, డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, శ్రీభ‌ర‌త్‌, సోనాల్ చౌహాన్‌, వేదిక, అంబికా కృష్ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ – “బాల‌కృష్ణ‌గారితో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఆయ‌న‌తో సినిమా చేయ‌డం హ్యాపీ. నాకు అవ‌కాశం ఇచ్చిన కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి, సి.క‌ల్యాణ్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
వేదిక మాట్లాడుతూ – “తెలుగులో చాలా ఏళ్ల త‌ర్వాత చేస్తోన్న సినిమా. బాల‌కృష్ణ‌గారితో నా తొలి చిత్రం. షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న నాకు హెల్ప్ చేయ‌డమే కాదు.. న‌న్ను చాలా ఇన్‌స్పైర్ చేశారు. సి.క‌ల్యాణ్‌గారికి, కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
సౌతిండియా ఫిలించాంబ‌ర్ అధ్య‌క్షుడు ర‌వి కొటాక‌ర్ మాట్లాడుతూ – “మా నాన్న‌గారు, ఎన్టీఆర్‌గారు క‌లిసి ర‌క్త‌సంబంధం సినిమా చేశారు. అందుకే మేం బాల‌కృష్ణ‌గారిని అన్న‌య్య అని పిలుస్తుంటాం. 30 ఏళ్ల ముందు బాల‌య్య‌గారు ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ద‌క్షిణాదిన స్టార్స్ అయిన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, బాల‌కృష్ణ వంటి స్టార్స్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టిన క్రెడిట్ కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికే ద‌క్కుతుంది. క‌ల్యాణ్‌గారు డిఫ‌రెంట్ సినిమాలు చేసే ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌. జైసింహా వంటి హిట్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రూల‌ర్ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంది“ అన్నారు.
నంద‌మూరి రామ‌కృష్ణ మాట్లాడుతూ – “రూల‌ర్ త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్యవాదాలు“ అన్నారు.
బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ – “సినిమా వాళ్ల‌కి వైజాగ్, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఇచ్చే స‌హ‌కారాన్ని ఏ రోజు మ‌రువ‌లేం. ఎక్క‌డా చూడ‌లేం. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా ఇక్క‌డే షూటింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌గారు చాలా గొప్ప సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయ‌న త‌మిళంలో చేసిన సినిమాల‌న్నీ మాలాంటి ద‌ర్శ‌కుల‌కు రెఫ‌రెన్స్‌లా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ్. జైసింహా త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా సూప‌ర్ డూప‌ర్‌హిట్ట‌వుతుంది. సి.క‌ల్యాణ్‌గారికి అభినంద‌న‌లు. రూల‌ర్ అనే పేరు బాల‌య్య‌బాబుకి ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోతుంది. ఈ సినిమా టైటిల్‌ను నేను రిజిష్ట‌ర్ చేసి, సాంగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ టైటిల్ బాల‌య్య‌బాబుగారికే ద‌క్కింది. రూల‌ర్ ఆఫ్ ఆర్ట్స్.. రూల‌ర్ ఆఫ్ హార్ట్స్‌ బాల‌య్య‌. ఆయ‌న న‌ట‌న‌తోనే న‌డ‌వ‌డిక‌తోనూ అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు. ఆయ‌న న‌టించిన రూల‌ర్ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇందులో వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు థ్యాంక్స్‌“ అన్నారు.
డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – ``నేను ఇండ‌స్ట్రీలో వచ్చిన త‌ర్వాత నాకు ఎక్కువ స‌పోర్ట్ అందించిన వ్య‌క్తి బాల‌కృష్ణ‌గారే. ఆయ‌న తండ్రి ఎన్టీఆర్‌గారు రూల‌ర్‌. ఆయ‌న కొడుగ్గా పెరిగిన బాల‌కృష్ణ‌గారు రూల‌ర్ అంటే ఏంటో తెలుసుకున్న వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి రూల‌ర్ అనే ఓ సినిమా చేస్తే ఎంత బావుంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కె.ఎస్‌.ర‌వికుమార్ అంటే సూప‌ర్ డైరెక్ట‌ర్‌. చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసే డైరెక్ట‌ర్ ఆయ‌న‌. క‌ల్యాణ్‌గారితో సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పటి నుండి ప‌రిచ‌యం ఉంది. ఇంత మంది నాకు కావాల్సిన వ్య‌క్తులు చేసిన ఈసినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – `` బాల‌కృష్ణ‌గారు మ‌న‌సులో ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా ఉండే వ్య‌క్తి. చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వంతో ఓపెన్‌గా ఉంటారు. గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. మంచి టైటిల్‌, డైరెక్ట‌ర్‌, నిర్మాత అన్ని చ‌క్క‌గా కుదిరాయి. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వికుమార్ మాట్లాడుతూ – “ జైసింహా త‌ర్వాత మా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. బాల‌య్య‌గారికి, క‌ల్యాణ్‌గారికి ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ప‌రుచూరి ముర‌ళిగారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంత‌న్ భ‌ట్‌, రామ‌జోగ్య శాస్త్రి, భాస్క‌ర భ‌ట్ల‌, కెమెరామెన్ రాంప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. ఎంటైర్ టీం ప్రారంభం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. వేదిక‌, సోనాల్‌, జ‌య‌సుధ‌, ప్ర‌కాశ్‌రాజ్ స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌“  అన్నారు.
నిర్మాత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ – “బాల‌కృష్ణగారితో క‌లిసి నేను, కె.ఎస్‌.ర‌వికుమార్‌గారు  పండ‌గ‌లాంటి సినిమా జైసింహాను ఇచ్చాం. రూల‌ర్ సినిమా కూడా పండ‌గ‌లాంటి సినిమా. మీసం మెలేసి మాట్లాడేలా ఉంటుంది. అలాంటి సినిమాను బాల‌య్య‌గారి కోసం, నా కోసం ప‌రుచూరి ముర‌ళిగారు మాకు ఇచ్చారు. క్యాస్టింగ్‌, ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉండే ఈ సినిమాను 5 నెల‌ల్లోనే ర‌వికుమార్‌గారు పూర్తి చేశారు. సంక్రాంతి భోజ‌నాన్ని 25 రోజుల ముందుగానే ఇస్తున్నాం. చిరంత‌న్ భ‌ట్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్స్ ఇర‌గ‌దీసేశారు. 5 నెల‌ల్లో ఇంత టైట్ వ‌ర్క్‌ను పూర్తి చేయ‌డ‌మంటే మాట‌లు కాదు.. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను త‌మ‌దిగా భావించి సినిమా చేశారు. పండ‌గ‌లాంటి సినిమా. సినిమా చూసిన త‌ర్వాత బాల‌య్య ఈజ్ గ్రేట్ అనేలా సినిమా ఉంటుంది“ అన్నారు.
నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ – “ఎన్టీఆర్, బ‌స‌వ‌తార‌క‌మ్మ పుణ్య దంప‌తుల క‌డుపున పుట్ట‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్న‌గారి బాట‌లో న‌డుస్తూ వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌స్తున్నాను. ఆదిత్య 369, శ్రీరామ‌రాజ్యం, గౌత‌మిపుత్ర‌శాకర్ణి, మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల కృష్ణ‌య్య‌, సింహా, లెజెండ్ వంటి ఎన్నెన్నో పాత్ర‌ల‌ను చేశాను. క‌ళామ‌త‌ల్లికి సేవ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేసుకుంటున్నాను. నేను ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆయ‌న బాగా న‌మ్మారు. మ‌న‌మే ముందు అడుగు వేయాల‌ని ఆయ‌న న‌మ్మారు. అది సినిమాలైన కావ‌చ్చు.. రాజ‌కీయాలైన కావ‌చ్చు. అన్నింటినీ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. నేను, కల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ క‌లిసి చేసిన జైసింహా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఆ స్ఫూర్తితోనే రూల‌ర్ సినిమాను చేశాం. రూల‌ర్ సినిమాకు మ‌రో క‌థ‌ను అనుకున్నాం. కానీ అది కుద‌ర‌లేదు. ఆ స‌మయంలో నేను ప‌రుచూరి ముర‌ళిగారి ఫోన్ చేశాను. ఆయ‌న ద‌గ్గ‌రున్న క‌థ‌ను వినిపించారు. న‌చ్చ‌డంతో వెంట‌నే సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా, కొత్త‌ద‌నం అందించాలనే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాను. నాకు రైతు మీద సినిమాలు చేయాల‌ని చాలా కోరిక ఉండేది. ఓ సంద‌ర్భంలో చాలా మందిని క‌లిశాను కూడా. ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఈసినిమాలో అది కొంత తీరింది. కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి నాలానే సినిమా అంటే ప్రేమ‌. నాలుగు నెల‌ల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. చిరంత‌న్ భ‌ట్‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా. అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్‌ను కూడా చ‌క్క‌గా అందించి పాత్ర‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. కెమెరామెన్ స‌న్నివేశాల‌ను అద్భుతంగా వెండితెర‌పై ఆవిష్క‌రించారు. వేదిక‌, సోనాల్ చౌహాన్ చ‌క్క‌గా న‌టించారు.  పైట్ మాస్ట‌ర్స్ రామ్‌ల‌క్ష్మ‌ణ్, పాట‌లు రాసిన రామ‌జోగయ్య‌గారు, భాస్క‌ర‌భ‌ట్ల‌గారికి అభినంద‌న‌లు. న‌టీన‌టులైన భూమిక‌గారు, జ‌య‌సుధ‌గారు, ప్ర‌కాష్‌రాజ్‌గారు స‌హా అంద‌రి కష్టంతోనే సినిమాను నాలుగు నెల‌ల్లోనే పూర్తి చేశారు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది“ అన్నారు.