Home Blog Page 992

‘Iddari lokam okate’ Trailer launch

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

చిత్ర స‌మ‌ర్ప‌కుడు, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “నేను ట్రావెల్ చేస్తున్న స‌మ‌యంలో ఈ సినిమాలోని పాట‌ల‌నే వింటున్నాను. చాలా బాగా న‌చ్చాయి. బ్యూటీఫుల్ మెలోడీస్‌. మిక్కి జె.మేయ‌ర్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ పాట‌ల‌ను, నేప‌థ్య సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అబ్బూరి ర‌విగారు చాలా సినిమాలకు బొమ్మ‌రిల్లు నుండి ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా అద్భుత‌మైన డైలాగ్స్ ఇచ్చారు. టెక్నిక‌ల్‌గా చాలా స్ట్రాంగ్‌, మంచి క‌థ‌తో రూపొందిన చిత్రం. థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుడికి సినిమాలోని కొన్ని మాట‌లు, స‌న్నివేశాలు గుర్తుంటాయి. స‌మీర్ రెడ్డి.. ఎక్స్‌ట్రార్డిన‌రీ విజువ‌ల్స్ ఇచ్చాడు. ఇప్ప‌టికే త‌ను చాలా సినిమాల‌కు మా బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేశాడు. ఇక ఎడిట‌ర్ త‌మ్మిరాజు సినిమాను రెండు గంట‌ల పాటు ఉండేలా షార్ప్‌గా ఎడిట్ చేసి ఇచ్చాడు. డైరెక్ట‌ర్ జీఆర్‌.కృష్ణ సి.వి.రెడ్డిగారి ద‌గ్గ‌ర నుండి ప‌నిచేస్తూ వ‌చ్చాడు. త‌ను రెండున్న‌రేళ్ల ముందు ఈ ఐడియా చెప్ప‌గానే, విప‌రీతంగా న‌చ్చింది. త‌ను చాలా ఓపిక‌గా మంచి సినిమాను రెడీ చేసి ఇచ్చాడు. బెక్కం వేణుగోపాల్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ రత్నం అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఇక రాజ్‌త‌రుణ్ గురించి చెప్పాలంటే ల‌వ‌ర్ సినిమాను బాగా ఇష్ట‌ప‌డి చేశాం. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ స‌మ‌యంలో కృష్ణ‌, బెక్కం వేణుగోపాల్ వెళ్లి ఈ సినిమా గురించి చెప్ప‌గానే రాజ్ నాకు ఫోన్ చేశాడు. త‌ను నాకు ఫోన్ చేసి నేను చేస్తాన‌ని అనడంతో నేను ఓకే అన్నాను. నేను ఎప్పుడూ స‌క్సెస్, ఫెయిల్యూర్‌ను బేరీజు వేసుకుని సినిమాలు చేయ‌లేదు. అలాగే రాజ్‌తో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో రాజ్ చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. త‌ను కొత్త‌గా క‌నిపిస్తాడు. షాలిని పాండే, అద్భుతంగా చేసింది. సినిమా అంతా ఎక్కువ‌గా రాజ్‌త‌రుణ్‌, షాలిని మ‌ధ్యే జ‌రుగుతుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు గుండె బ‌రువుతో బ‌య‌ట‌కు వ‌స్తారు.ఎఫ్ 2, మ‌హ‌ర్షితో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాం. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొడ‌తాం“ అన్నారు.
రైట‌ర్ అబ్బూరి ర‌వి మాట్లాడుతూ – “ఈ సినిమా గురించి చెప్పాలంటే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ అనాలి. మంచి స‌బ్జెక్ట్‌. డైరెక్ట‌ర్ కృష్ణ ఈ సినిమా కోసం చాలా వెర్ష‌న్స్ రాసుకుని చేశాడు. చివ‌రి 30 నిమిషాలు సినిమాను ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేరు. సినిమా చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. హృద‌యాల‌తో చూసే ప్యూర్ ల‌వ్‌స్టోరీ ఇది“ అన్నారు.
డైరెక్ట‌ర్ జి.ఆర్‌.కృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమా అవ‌కాశాన్ని మాకు ఇచ్చిన దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. హీరోయిన్ విష‌యంలో మేం ఎవ‌రిని తీసుకోవాలా? ఆలోచిస్తున్న‌ప్పుడు శిరీష్‌గారు షాలిని పాండేగారి పేరు చెప్పారు. చాలా డిస్క‌ష‌న్ చేసిన త‌ర్వాత షాలిని పాండే క్యారెక్ట‌ర్‌కి యాప్ట్ అవుతుందో లేదో అని చిన్న సందేహం ఉండేది. కానీ రేపు సినిమా చూస్తే త‌ను ఎంత గొప్ప‌గా న‌టించిందో తెలుస్తుంది. పాటల‌కు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మిక్కి గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. స‌మీర్‌రెడ్డిగారు బ్యూటీఫుల్‌గా పెయింటింగ్‌లాంటి విజువ‌ల్స్ ఇచ్చారు. మా బ‌డ్జెట్ ప‌రిధిలో అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను 47 రోజుల్లోనే పూర్తి చేశాం. మంచి సినిమా తీశాం. బెక్కంగారు నా బ్ర‌ద‌ర్‌లా స‌పోర్ట్ చేశారు. రాజ్‌త‌రుణ్ హీరోగా ఈ క‌థ‌కు ఎలా సెట్ అవుతాడ‌ని కొంద‌రు అన్నారు. కానీ నేను త‌న‌పై న‌మ్మ‌కంతో ముందుకెళ్లాను. రాజ్‌కూడా నాపై న‌మ్మ‌కంతో ముందుకు వ‌చ్చాడు. షాలిని పెర్ఫామెన్స్ ప‌రంగా అద‌ర‌గొట్టింది. రాజ్‌, షాలిని మ‌న మ‌న‌సుల్లో ఉండిపోతారు. త‌మ్మిరాజుగారు క‌థ‌కు అవ‌స‌రం లేకపోతే ఎడిట్ చేసేశారు. సినిమా లెంగ్త్ 2 గంట‌ల‌6 నిమిషాలు ఉంది. ఈ జ‌ర్నీలో నాకు హెల్ప్ చేసిన అంద‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.
హీరో రాజ్‌త‌రుణ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో నాకు న‌టించే అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి, ఈ క్యారెక్ట‌ర్‌లో న‌న్ను ఊహించుకున్న డైరెక్ట‌ర్ కృష్ణ‌గారికి, బెక్కం వేణుగోపాల్‌గారికి థ్యాంక్స్‌. షాలిని పాండే ఎక్స‌లెంట్ పెర్ఫామెర్‌. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్నంగా ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. ర‌విగారు, అద్భుత‌మైన మాట‌లను అందించారు. మిక్కి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. ఆయ‌న‌తో ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. స‌మీర్‌గారికి, త‌మ్మిరాజు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. ఇదొక హార్ట్ ట‌చింగ్ ఫీల్ గుడ్ మూవీ. ప్రేక్ష‌కుడు సినిమా చూసేట‌ప్పుడు ల‌వ్‌ను ఫీల్ అవుతాడు. ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా సినిమా హాంట్ చేస్తుంది. డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది“ అన్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “సినిమా కోసం డైరెక్ట‌ర్ కృష్ణ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. చాలా వెర్ష‌న్స్‌ను రాసుకున్నాడు. చాలా ఓపిగ్గా సినిమా చేశాడు. డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా అభినంద‌న‌, నీరాజ‌నం స్టైల్లో ఉండే ప్యూర్ ల‌వ్‌స్టోరీ“ అన్నారు.

“Venky mama” Thanks meet

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య హీరోలుగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `వెంకీమామ‌`. డిసెంబ‌ర్ 13న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో కలెక్ష‌న్స్‌ను రాబ‌డుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ – “ఫైనల్లీ దేవుడా! స‌క్సెస్‌నిచ్చావు. ఎంటైర్ యూనిట్ ఈ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టంతోనే ఇంత పెద్ద స‌క్సెస్‌ను అందుకున్నాం. మంచి సినిమాను తీయాల‌నే ఉద్దేశంతోనే `వెంకీమామ‌` సినిమాను చేశాం. ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఆద‌రించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. న‌టీనటులు, టెక్నీషియ‌న్స్‌కు మ‌రోసారి హృద‌య‌పూర్వ‌క‌మైన ధ‌న్య‌వాదాలు. చిరంజీవి సినిమా చూశారు. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. అలాగే మ‌హేశ్ కూడా మా సినిమాను చూసి బావుంద‌ని అప్రిషియేట్ చేశారు. వారిద్ద‌రికీ థ్యాంక్స్‌.
అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ – “ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన రోజు మైండ్ బ్లాక్ అనిపించింది. ఏమ‌వుతుందో, ప్రేక్ష‌కులు సినిమాను ఎలా రిసీస్ చేసుకుంటారో అని టెన్ష‌న్‌గా ఉండింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంద‌రూ సినిమాను త‌మదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. బావుంద‌ని అంటున్నారు. ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్ద‌రు మామ‌లు క‌లిసి క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఎలా ఉంటుందో చూపించారు. మాకే కాదు.. ఇది తాత‌గారి డ్రీమ్‌, తాత‌గారి స‌క్సెస్‌. అందుకు చాలా హ్యాపీ. సాధారణంగా కొంత మంది ద‌ర్శ‌కులు నా కెరీర్‌లోకి వ‌చ్చి నాకొక కొత్త దారిని చూపించారు. అలాంటి ద‌ర్శ‌కుడు బాబీ ఉన్నాడు. ఆయ‌న‌కు థ్యాంక్స్‌. రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్‌గారికి థ్యాంక్స్‌. ప్ర‌సాద్ మూరెళ్ళ‌గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాలోని స్పాన్‌ను అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు. నాకు రాశీఖ‌న్నాకి, పాయ‌ల్‌కి, అలాగే వెంకీమామ‌కి, పాయ‌ల్‌కి, రాశీఖ‌న్నాకు ఉన్న ట్రాక్‌ల‌ను అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదొక ఫ్రెష్ ఇన్నింగ్స్‌. ఎఫ్ 2తో హ్యాపీ న్యూ ఇయ‌ర్‌, హ్యాపీ సంక్రాంతి చెప్పిన వెంకీమామ ఈ సినిమాతో హ్యాపీ క్రిస్మ‌స్, హ్య‌పీ సంక్రాంతి చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు రెండేళ్లు క‌లిసి ట్రావెల్ చేశాం. కాబ‌ట్టి ఎంటైర్ టీమ్‌కు మ‌రోసారి థ్యాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌“ అన్నారు.
రాశీఖ‌న్నా మాట్లాడుతూ – “వెంక‌టేశ్‌గారు ఓ యాక్టరే కాదు..ఓ ఎమోష‌న్. నా ఫ్యామిలీతో క‌లిసి ఈ సినిమా చూశాను. అంద‌రూ బాగా ఎంజాయ్ చేశారు. మామ‌, అల్లుడు నిజంగానే చింపేశారు. వెంక‌టేశ్‌గారితో క‌లిసి ట్రావెల్ చేయ‌డం వల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. వెంక‌టేశ్‌గారి డేడికేష‌న్‌కి హ్యాట్సాఫ్‌. సినిమాతో చాలా క‌నెక్ట్ అయ్యాను. అలాగే చైత‌న్య కూడా త‌న హార్డ్ వ‌ర్క్‌తో ప్ర‌తి ఏడాది త‌న సినిమాల‌తో మ‌నల్ని ఆశర్యపరుస్తున్నాడు. చైతుతో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని అనుకుంటున్నాను. పాయ‌ల్ కూడా అద్భుతంగా న‌టించింది. ఇప్పుడు డైరెక్ట‌ర్ బాబీ బ్లాక్‌బ‌స్ట‌ర్ బాబీ అయ్యాడు. భ‌యం లేని ద‌ర్శ‌కుడు. ఎందుకంటే తార‌క్‌తో హిట్ త‌ర్వాత మామ‌, అల్లుడితో ఈ సినిమా చేయ‌డం చాలా గొప్ప విష‌యం“ అన్నారు.
పాయ‌ల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ – “వెంకీమామ పెద్ద హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్‌. క‌చ్చితంగా మ‌నం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ఇదొక‌టిగా నిలుస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. సినిమా చూస్తుంటే సెల‌బ్రేష‌న్స్‌లా అనిపించింది. ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ బాబీకి థ్యాంక్స్‌. చైతు టైమింగ్ సూప‌ర్బ్‌. చాలా గొప్ప‌గా భావిస్తున్నాను“ అన్నారు.
డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ – “రెండు వారాల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. హిట్ కొట్టారు. ఎంత టెన్ష‌న్ ఉంటుందో ఓ డైరెక్ట‌ర్‌గా నాకు తెలుసు. క‌లియుగ పాండ‌వులు సినిమాను హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో షూటింగ్ చేసినప్పుడు తొలిసారి వెంక‌టేశ్‌గారిని క‌లిశాను. అలాగే బొబ్బిలిరాజాను ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదు. ఆ సినిమా 200 డేస్ ఫంక్ష‌న్ కోసం నా మ్యాథ్స్ ప‌రీక్ష బంక్ కొట్టి వ‌చ్చి ప్రేక్ష‌కుడిలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ తీసిన వెంకీమామ సినిమా థ్యాంక్స్ మీట్ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉండ‌టం గొప్ప‌గా భావిస్తున్నాను. వెంక‌టేష్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. సినిమా ఇండ‌స్ట్రీలోని జెన్యూన్ ప‌ర్స‌న్స్‌లో వెంక‌టేశ్‌గారు ఒక‌రు. ఆయ‌న‌తో సినిమా చేయ‌క‌పోయినా, ఆయ‌న నన్ను ఎంక‌రేజ్ చేసిన తీరు నేను మ‌ర‌చిపోలేను. అలాగే జోష్ టైమ్‌లో నేను చైత‌న్య‌తో క‌లిసి ట్రావెల్ చేశాను. త‌న దారిని తనే నిర్మించుకున్నాడు. నిన్న మ‌జిలీ, ఈరోజు వెంకీమామ‌, రేపు శేఖ‌ర్ క‌మ్మల సినిమా రాబోతుంది. ఇద్ద‌రూ యాక్ట్ చేయ‌లేదు. వారిద్ద‌రి బంధం సినిమాలో మ‌న‌కు క‌న‌ప‌డింది. చాలా మంది హీరోల‌కే వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ద‌క్కుతుంది. అలాంటి అదృష్టం చైత‌న్య‌గారికి ద‌క్కింది. రేపు ఆయ‌న పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్ల‌కు చూపించుకునేలా మ‌నం, వెంకీమామ సినిమాలు చూపించుకునేలా ఉన్నాయి. త‌న‌కు అభినంద‌నలు. రాశీఖ‌న్నా హార్డ్‌వ‌ర్క్‌తో ఈస్థాయికి ఎదిగింది. అలాగే పాయ‌ల్‌కి అభినంద‌న‌లు. త‌మ‌న్ స‌క్సెస్‌ను ఓ బ్ర‌ద‌ర్స్‌లా ఎంజాయ్ చేస్తున్నాను. వివేక్‌గారితో ఎప్ప‌టి నుండో ప‌రిచ‌యం ఉంది. అలాగే విశ్వ‌ప్ర‌సాద్‌గారికి, వివేక్‌గారికి అభినంద‌న‌లు. సురేష్‌బాబుగారికి థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ బాబీ, క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట‌ను అద్భుతంగామిక్స్ చేసి సినిమా చేశాడు. రైట‌ర్ నుండి ఈ స్థాయికి రావ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. సినిమాను గెలిపిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌“ అన్నారు.
డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) మాట్లాడుతూ – “ఈ స‌క్సెస్ రెండేళ్ల క‌ష్ట‌మ‌ది. ఓ డైరెక్ట‌ర్ క‌ల‌ను 24 శాఖ‌లు క‌లిపి చేస్తేనే సినిమా. అన్ని సినిమాల‌కు అంద‌రూ క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ స‌క్సెస్‌ను ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెష‌ల్‌. ఈ సినిమా చేయ‌డానికి ఎంత సంతోష‌ప‌డ్డానో అంతే టెన్ష‌న్ ప‌డ్డాను. ఎందుకంటే.. నిజ‌మైన మామ‌, అల్లుడితో చేసే సినిమా. వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌గారి పాజిటివిటీ వ‌ల్లే ఈ సినిమా తీయ‌గ‌లిగాను. నేను చేసింది మూడు సినిమాలే. వెంక‌టేష్‌గారి ముందు నేనేమీ లేదు. ఓ హీరోగా వ‌ర్కింగ్ స్టైల్లో, ఎక్స్‌పీరియెన్స్‌లో గుర్తు పెట్టుకుంటే ఆయ‌నే ముందుంటారు. చైత‌న్య‌లో నిజాయ‌తీ లేక‌పోతే, ఈ సినిమా ఇంత స‌క్సెస్ అయ్యేది కాదు. త‌ను క‌థ‌ను న‌మ్మాడు. మావ‌య్య‌ల‌ను న‌మ్మాడు. అదే ఈ రిజ‌ల్ట్‌. చిరంజీవిగారు ఓ ఆడియెన్‌లా ఎంజాయ్ చేశారు. సినిమాలోని స‌న్నివేశాల గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అలాగే మ‌హేష్‌గారు కూడా సినిమాను చూసి ట్వీట్ చేశారు. వారికి థ్యాంక్స్‌. ప్ర‌సాద్ మూరెళ్ల‌గారికి రెండేళ్లు ముందు ఈ క‌థ‌ను చెప్పాను. ఆయ‌న నేను ఊహించిన దానికంటే గొప్ప‌గా చూపించారు. వివేక్‌గారు, సురేష్‌గారు ఇచ్చిన న‌మ్మ‌కాన్ని మ‌ర‌చిపోలేను. త‌మ‌న్‌తో ప‌వ‌ర్ సినిమా చేశాను. ఇప్పుడు మ‌రో సినిమా చేశాను. ఐదుసార్లు నా కోసం రీరికార్డింగ్ చేశాడు. విశ్వ‌ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. రాశీఖ‌న్నా, పాయ‌ల్ కేవ‌లం హీరోయిన్స్‌గానే కాదు.. స‌న్నివేశాల‌ను అద్భుతంగా డ్రైవ్ చేశారు. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని గెలిపించారు“ అన్నారు.
డైరెక్ట‌ర్ చందు మొండేటి మాట్లాడుతూ – “సినిమా చేయ‌డానికి ముందు వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌గారి కాంబినేష‌న్‌కి ఎగ్జ‌యిట్ అయ్యాను. సినిమా చూస్తున్న‌ప్పుడు క‌థ‌కు ఎగ్జ‌యిట్ అయ్యాను. డైరెక్ట‌ర్ బాబీ అన్న సినిమాను బాగా డ్రైవ్ చేశారు. వెంక‌టేశ్‌గారికి, చైత‌న్య‌గారు, పాయ‌ల్‌, రాశీఖ‌న్నా స‌హా ఎంటైర్ యూనిట్‌కు, సాంకేతిక నిపుణుల‌కు థ్యాంక్స్‌“ అన్నారు.
డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ – “నేను ఓ బేబీ సినిమా చూస్తున్న‌ప్పుడు వెంకీమామ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఎట్ట‌కేల‌కు బాబీ డైరెక్ట‌ర్‌గా సిక్స్ కొట్టాడు. వెంక‌టేశ్‌గారు, చైత‌న్య కాంబినేష‌న్‌ను పోస్ట‌ర్‌పై చూడ‌గానే చాలా సంతోష‌మేసింది. నిజంగానే పండ‌ను ముందుగానే తీసుకొచ్చారు. కామెడీ రాసుకున్నా, ఎమోష‌న్ రాసుకున్నా ఎలా రాసుకున్నా.. ఆయ‌న దాన్ని హండ్రెడ్ ప‌ర్సంట్‌కి తీసుకెళ‌తారు. ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుంది. వెంకీమామ‌ను చూస్తుంటే అలా అనిపించింది. చైత‌న్య ఔట్ స్టాండింగ్‌గా నటించాడు. వెంక‌టేశ్‌గారు, చైతు మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. బాబీ ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెరకెక్కించాడు. రాశీ, పాయ‌ల్ చ‌క్క‌గా న‌టించారు. ఎంటైర్ టీమ్ అద్భుతంగా వ‌ర్క్ చేసింది“ అన్నారు.
నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – ``రెండు వారాల్లో అంద‌రి స‌పోర్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాం. అలాగే సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. వెంక‌టేష్‌గారు, చైతు, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ల‌కు థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ బాబీ, రాశీ, పాయ‌ల్‌, త‌మ‌న్‌, వివేక్ స‌హా మాకు అండ‌గా నిలిచిన అంద‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ – “నాకు బాబీ మామూలు సినిమా ఇవ్వ‌లేదు. స్క్రిప్ట్ రాసుకోవ‌డం కాదు.. సినిమా చేయ‌డం చాలా క‌ష్టం. అలాంటి సినిమాను చేసిన బాబీ.. నాపై న‌మ్మ‌కంతో నాకు ఈ సినిమానిచ్చాడు. అద్భుత‌మైన సినిమాను ఇచ్చాడు. ప్ర‌సాద్ మూరెళ్ల‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. రామ్ లక్ష్మ‌ణ్‌గారు యాక్ష‌న్‌, బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ వ‌ర్క్ అన్ని అద్భుతంగా కుదిరాయి. వెంక‌టేశ్‌గారి పుట్టిన‌రోజున సినిమా రావ‌డంతో మాకు ఇంకా టెన్ష‌న్ వ‌చ్చేసింది. దీంతో మ‌రింత కేర్ తీసుకుని ఈ సినిమా చేశాం. రీరికార్డింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ప‌వ‌ర్ త‌ర్వాత మ‌రో హిట్ ఇచ్చి డ‌బుల్ ప‌వ‌ర్ ఇచ్చాడు. వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌గారితో సినిమా అన‌గానే ఎగ్జయిట్ అయ్యి సినిమా చేశాను. వెంక‌టేశ్‌, చైత‌న్యగారికి థ్యాంక్స్‌. ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో వివేక్ కూచిబొట్ల‌, డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన‌, హైప‌ర్ ఆది, బ్ర‌హ్మ‌క‌డ‌లి, రామ్ ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Bunny vasu interview about ‘prathiroju pandage’

యు.వి. క్రియేష‌న్స్‌, జి.ఎ.2 పిక్చ‌ర్స్ ప‌తాకాలపై అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నివాస్‌ నిర్మాత‌గా రూపొందించిన‌ చిత్రం `ప్ర‌తిరోజూ పండ‌గే` సాయితేజ్‌, రాశీఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన‌ ఈ చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల‌వుతున్న‌సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బ‌న్నివాస్‌ ఇంట‌ర్వ్యూ…

ఈ సినిమా గురుంచి చెప్పండి?
– ఈ సినిమాకు ముందు మారుతి నాకు వేరే స్టోరీ లైన్ చెప్పారు. దానిమీద వర్క్ చేస్తున్నాం. అప్పుడు మారుతి డార్లింగ్ ఇంకో కథ ఉంది దాన్ని కూడా ఒక సారి విను అని నాకు యూ వి క్రియేషన్స్ వంశీ కి క‌లిపి ఈ కథ చెప్పాడు. ఇది బాగా సెన్సిటివ్ ఇష్యూ అవడంతో తరువాత చూద్దాం అనుకున్నాం. అలా డిస్క‌ష‌న్స్ టైమ్ లో మా అమ్మ ఫోన్ చేస్తే లిప్ట్ చేయ‌లేక‌పోయాను. ఆ తరువాత ఒకేసారి మారుతి చెప్పిన లైన్ స్ట్రైక్ అయ్యి నేను ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోతే అమ్మ ఎలా ఫీల‌వుతుంది అనిపించి కాల్ చేసి అడిగాను `ఏముంది నాన్న నీ పనిలో నీవు బిజీగా ఉంటావు కదా ఏదయినా అర్జంట్ ఉంటే మాత్రం మీ ఆవిడకో, మేనేజర్ కో కాల్ చేస్తాను అని చెప్పింది. నాలాగే చాలామంది త‌మ వ‌ర్క్ బిజీలో ప‌డి త‌ల్లిదండ్రుల‌కు స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. ఈ క‌థ త‌ప్ప‌కుండా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని భావించి మొద‌లు పెట్టాం. అలా ఈ సినిమా స్టార్ట్ అవ‌డ‌నానికి మా అమ్మ కూడా ఓర‌కంగా కార‌ణం.

ఈ సినిమాకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– పుట్టిన‌రోజు, పెళ్ళిరోజు త‌ర‌హాలో చావుని కూడా సెలెబ్రేట్ చేసుకోవాల‌న్న‌కాన్సెప్ట్‌ ను ఒకే కోణంలో సీరియస్ గా చూపిస్తూనే అదే సమయంలో ఎంటర్టైనింగ్ గా చెప్పడం అనేది క‌త్తిమీద సాము లాంటి స్క్రీన్‌ప్లే. దానికి మారుతి జాగ్రత్త గా ఫస్ట్ రీల్ లోనే ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది అని డిఫైన్ చేశారు. దాంతో సీరియస్ క్యారెక్టర్ అయినా ఎంటర్టైనింగ్ గానే వెళ్తుంది.

సాయితేజ్ కొరకే కథ వ్రాసుకున్నారా?
– తేజు ఫస్ట్ మూవీ ‘పిల్లా నువు లేని జీవితం’ నేనే ప్రొడ్యూస్ చేశాను. ఆ తరువాత ఇద్దరం కలిసి ఇంకో సినిమా చేద్దాం అని కొన్ని కథలు పంపాను. అయితే ఈ కథ పంపగానే తేజ్ కి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే చేద్దాం అన్నాడు.

సిక్స్ ప్యాక్ చేయించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది?
– ఆ ఐడియా అతనిదే! ‘చిత్రలహరి’ సినిమాలో కొంచెం బొద్దుగా కనపడ్డాను అన్న ఈ సినిమాలో ఫిట్ గా కనపడాలి అనుకుంటున్నా నాకు కొంచెం టైమ్ కావాలి అని రెండు మూడు నెలలు తీసుకొని సిక్స్ ప్యాక్ చేశాడు. కథలో భాగం కాదు

సాయితేజ్ నటన లో ఎలాంటి మార్పులు గమనించారు?
– ఫస్ట్ మూవీ నుండి చూస్తున్నాను కాబట్టి అతని నటనలో డిఫరెన్స్ నాకు తెలుస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా చాలా డెవ‌లప్ అయ్యాడు. యాక్టింగ్ లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. డబ్బింగ్ విషయంలో కూడా చాలా క్లారిటీ గా ఉన్నాడు.

గీతా ఆర్ట్స్2 లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించడానికి గల కారణం?
– కథ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయనతో చెప్పిస్తాను. ఆ తరువాత ఏమైనా సందేహాలు ఉంటే నేను వివరిస్తాను. ఆయన నన్ను పూర్తిగా నమ్ముతారు. మా ఇద్దరి మధ్యలో ఆ ఫ్రీడమ్ ఉండడం, జి.ఏ2 పిక్చర్స్ లో మూడు జెనరేషన్స్ అల్లు అరవింద్ గారు, నేనే, ఈ త‌రం యువ ద‌ర్శ‌కులు పనిచేస్తుండడం వ‌ల్లే మేము సక్సెస్ అవుతున్నాం.

మంచి స్నేహితులు గా ఉన్న మారుతిగారు మీరు కలుసుకున్నప్పుడు మీ మధ్య ఎలాంటి చర్చలు జరుగుతుంటాయి?
– బేసిక్ గా మేము నలుగురం. మారుతి, నేను, ఎస్ కె ఎన్, యు వి క్రియేషన్స్ వంశి. మా ఫ్రెండ్ షిప్ ‘ఆర్య’ నుండి స్టార్ట్ అయింది. అప్పటినుండి అందరం కలిసే జర్నీ చేస్తున్నాం కాబట్టి మా మధ్యలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనే భేదాలు ఉండవు. డబ్బులైన, ఐడియాస్ అయినా అందరివీ అనుకొనే పనిచేస్తాం. కాకపొతే ఏమైనా భిన్న అభిప్రాయాలు వస్తే మాత్రం ‘మారుతి’ గారి సలహాకు రెస్పెక్ట్ ఇస్తాం.

నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి?
– ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీలో రీమేక్ చేస్తున్నాం. అఖిల్, బొమ్మ‌రిల్లు భాస్కర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ లో నిఖిల్ హీరోగా సూర్య‌ప్రతాప్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాం. కార్తికేయ‌తో కౌశిక్ అనే కొత్త దర్శకుడితో `చావుక‌బురు చ‌ల్ల‌గా`.. సినిమా నిర్మించ‌నున్నాం. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కి చర్చలు జరుగుతున్నాయి.

Heroin Vedika interview about Ruler

2006 లో ‘మద్రాసి’ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకొని 2007 ‘ముని’ చిత్రంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులని ఏర్పరచుకుని తెలుగు తమిళ మలయాళం తో పాటు హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు హీరోయిన్ వేదిక. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన ‘రూలర్’చిత్రంలో నటిస్తోంది. సి. కల్యాణ్ నిర్మాణంలో కె.ఎస్‌.రవికుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవబోతున్న సందర్భంగా హీరోయిన్ వేదిక ఇంటర్వ్యూ..

చాలా రోజుల తరువాత తెలుగులో నటించడానికి కారణమేంటి?
– అవునండీ! డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పైనే అయింది. ఇన్నేళ్లు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలతో బిజీ గా ఉన్నాను. అయితే ఈ మధ్య నేను నటించిన ‘కాంచన 3’ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నా పెర్ఫామెన్స్ కి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా వల్లే.. ఈ వచ్చింది అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘రూలర్’ తో మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
– నా క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. ట్రేడిషనల్ గా కనిపిస్తాను, అలాగే గ్లామర్ గర్ల్ నటించాను. అదేవిధంగా నా క్యారెక్టర్ లో సీరియస్ యాంగిల్ కూడా ఉంటుంది. నటనకు చాల స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్ లో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే సప్తిగిరి తో కామెడీ ఎలిమెంట్స్ బాగుంటాయి. మాస్ మసాలా సినిమాలంటే నాకు ఇష్టం. నటులు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం అవసరం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది.

లెజెండరీ యాక్టర్ బాలకృష్ణతో కలిసి నటించారు కదా ! ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
– తెలుగు ఇండస్ట్రీలోనే బాలకృష్ణ గారు లెంజెండ్ అండ్ గ్రేట్ యాక్టర్, నటనలో ఆయన ఒక యూనివర్సిటీ. రియల్ లైఫ్ లో కూడా ‘రూలర్’ లాంటి వ్యక్తితో కలిసి నటించడం చాల హ్యాపీగా అనిపించింది. ఆయన నుంచి చాల నేర్చుకున్నాను. నటన పట్ల ఆయనకున్న అంకితభావం అమేజింగ్. కొన్ని సీన్స్ చేయలేనప్పుడు కో స్టార్స్ కి కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంత పెద్ద స్టార్ ఆయి ఉండి కూడా చాలా సింపుల్ గా ఉంటారు. . ప్రతి సినిమా ని తొలి సినిమాలు భావిస్తుంటారు. ఆయనకి ఎవరైనా నచ్చారంటే చాలు… వాళ్ల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నా స్టాప్ లో ఒకరికి కాలికి గాయమైంది. వెంటనే అక్కడి కి సమీపంలో ఉన్నతన స్నేహితులకి ఫోన్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ ఇప్పించి
స్వయంగా పర్యవేక్షించారు. సెట్లో అందరినీ ఒకలాగే చూసే పెద్ద మనసు ఆయనది.

ఈ సినిమాలో మీకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి?

— రెండు సాంగ్స్ ఉంటాయి. ఒకటి సంక్రాంతి సాంగ్ మేమందరం సంక్రాంతి పండుగ సెలెబ్రేట్ చేసుకునే సందర్భంలో వస్తుంది. ఇంకోటి ‘యాలయాలా’ రొమాంటిక్ మెలోడీ సాంగ్. అలాగే నా ఫేవరెట్ సాంగ్ కూడా. చిరంతన్ బట్ ఫ్యాబ్యులెస్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంది. రెండు సాంగ్స్ కూడా చాల బాగా వచ్చాయి.
కె.ఎస్.రవికుమార్ గురుంచి?
– కె.ఎస్.రవికుమార్ లాంటి సీనియ‌ర్‌ దర్శకుడితో సినిమా అంటే ఏ నటుడికైనా ఒక వరం. త‌న‌కి ఏం కావాలి అనే విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఎక్క‌డా మేకింగ్ ప‌రంగా నాణ్యత తగ్గకుండా వేగంగా ఈ సినిమాని తీశారు. ఆయ‌న వ‌ల్లే ఈ సినిమా షూటింగ్ ఇంత తొంద‌ర‌గా పూర్త‌య్యింది.
ప్రొడ్యూసర్ సి.క‌ల్యాణ్ గారి గురించి?
– ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, నాగినీడు, ఝాన్సీ తదితర అనుభవమున్న నటులున్నారు. ఇంత మంది నటులున్నా ఎలాంటి సమస్యలు, అసౌకర్యం ఎదురుకాకుండా సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించిన విధానం నాకు బాగా నచ్చింది. ఆయ‌న చాలా ఫ్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్.
మీ తదుపరి చిత్రాలు?
– తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇకపై తెలుగులో కంటిన్యూగా నటిస్తాను. మంచి కథలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ్ మళయాలంలో కూడా మూవీస్ చేస్తున్నాను.

Sonal chowhan interview about Ruler

‘లెజెండ్’, ‘పండగ చేస్కో’,’ సైజ్ జీరో’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సోనాల్ చౌహన్. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన ‘రూలర్’ చిత్రంలో నటిస్తోంది. సి. కల్యాణ్ నిర్మాణంలో కె.ఎస్‌.రవికుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవబోతున్న సందర్భంగా హీరోయిన్ సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ…

బాలయ్య మూడోసారి క‌లిసి న‌టిస్తున్నారు క‌దా! ఆయ‌న‌తో జ‌ర్నీ ఎలా ఉంది?
– బాలకృష్ణ గారిని కలవక ముందు ఆయనంటే కొంచెం భయం ఉండేది. కానీ ఆయనతో పరిచయం ఏర్పడ్డాక ఆ భయం అంతా పోయింది. ఆయన సెట్స్ లో చాలా జోవియల్ గా ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయనలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మెచ్చుకోవాల్సిందే. ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది.

ఈ మూవీ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
– ఈ మూవీలో నా పాత్ర పేరు హారిక. కొంచెం తలపొగ‌రు కలిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు నచ్చింది ఎలాగైనా దక్కించుకునే వరకూ పోరాడే మ‌న‌స్త‌త్వం. నాపాత్రలో గ్లామర్, ఎమోషన్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉంటాయి

ఈ అవకాశం ఎలా దక్కింది ?
– దర్శకులు కె ఎస్ రవి కుమార్ గారు ఫోన్ చేసి పిలిపించి మూవీ కథ చెప్పారు. ఆతర్వాత వెంటనే నేను ఒకే చెప్పడం జరిగింది. అప్ కోర్స్ కథ వినకపోయినప్పటికీ బాల‌కృష్ణ‌గారితో సినిమా అంటేనే వదులుకొనేదానిని కాదు.

కె.ఎస్.రవికుమార్ మేకింగ్‌, సి. క‌ల్యాణ్ గారి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ గురించి?
– కె.ఎస్.రవికుమార్ త‌న‌కి ఏం కావాలి అనే విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఎక్క‌డా మేకింగ్ ప‌రంగా నాణ్యత తగ్గకుండా వేగంగా ఈ సినిమాని తీశారు.  ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, నాగినీడు, ఝాన్సీ తదితర అనుభవమున్న నటులున్నారు. ఇంత మంది నటులున్నా ఎలాంటి సమస్యలు, అసౌకర్యం ఎదురుకాకుండా సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయ‌న చాలా ఫ్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్. ఆయన బేనర్ లో మరో సారి తప్పకుండా నటిస్తాను.

వెబ్ సిరీస్ లో ఏమైనా నటిస్తున్నారా?
– వెబ్ సిరీస్ లో చేయడానికి నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటించాను. భవిష్యత్తులో కూడా వెబ్ సిరీస్ లలో తప్పకుండా నటిస్తాను.

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ ని ఎలా తీసుకుంటారు?
– సోషల్ మీడియాలో కామెంట్స్ అనేవి సర్వ సాధారణం. మనకు తెలిసినవారు కామెంట్ చేసినప్పుడు, లేదా మనకు తెలిసిన వారిపై రూమర్స్ క్రియేట్ చేసినప్పుడు నేను స్పందిస్తాను. అంతే కానీ ప్రతి ఒక్కరి కామెంట్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేమిటో నా పేరెంట్స్ కి తెలుసు అందుకే ఎటువంటి రూమర్స్ ని సీరియస్ గా తీసుకోను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– ప్రస్తుతం తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Sayyad Hussain Trilingual movie on pune Gangster Bala shahed chowdary (shivaji)

‘పైసా పొట్టి ప్రాబ్లెమ్, దావత్ ఏ షాదీ, సలాం జిందగీ’ చిత్రాలతో రైటర్ కమ్ డైరెక్టర్ గా తిరుగులేని పేరు సంపాదించుకున్నారు యువ ప్రతిభాశాలి సయ్యద్ హుస్సేన్. డెక్కన్ వుడ్ లో బ్లాక్ బస్టర్స్ గా డిక్లేర్ అయిన ఈ మూడు చిత్రాలు ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ‘రాజశ్రీ ప్రొడక్షన్స్’ ద్వారా విడుదలై బాలీవుడ్ వర్గాల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించాయి. అంతే కాదు బాలీవుడ్ లో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు అవకాశాలను సైతం తెచ్చిపెట్టాయి. వాటిలో ఒక చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ కు వెళ్లనుంది. 
     పూణెకి చెందిన ప్రముఖ గ్యాంగ్ స్టర్ బాలా సాహెబ్ చౌదరి అలియాస్ శివాజీ కల్పిత బయోపిక్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ యువ కథానాయకుడు రణదీప్ హుడా టైటిల్ రోల్ పోషించే అవకాశముంది. హిందీతోపాటు మరాఠీ మరియు తెలుగు భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో తెరకెక్కనుంది. అమెరికా సిటిజెన్ అయిన ఊరూసా రహీమ్ ఈ త్రిభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సయ్యద్ హుస్సేన్ దర్శకత్వం వహించిన సలామ్ జిందగీ చిత్రాన్ని ఉరూసా రహీమ్ నిర్మించడంతోపాటు ఆ చిత్రానికి కో డైరెక్టర్ గానూ వ్యవహరించారు. పలు ప్రముఖ ప్రోడక్ట్స్ కి యాడ్ ఫిలిమ్స్ రూపొందించి.. ఆ రంగంలోనూ తన సత్తా చాటుకున్న సయ్యద్ హుస్సేన్ ‘నౌబార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారు. ఉరూసా రహీమ్ ఈ సంస్థకు కో ఫౌండర్. ఈ ఏడాది చికాగోలో ‘నౌబార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’  నిర్వహించేందుకు సయ్యద్ హుస్సేన్, ఉరూసా రహీమ్ సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నారు. 
     పూణే గ్యాంగ్ స్టర్ బాలా సాహెబ్ చౌదరి అలియాస్ శివాజీ బయోపిక్ గురించి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ముంబైలో బాల్ థాకరే ఎంత పాపులరో.. పూణేలో బాలా సాహిద్ చౌదరి అలియాస్ శివాజీ అంత పాపులర్. కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ గా పేరు పడ్డ సాహెబ్ చౌదరి జీవితం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన తనయుడు ఐ.పీ.ఎస్ ఆఫీసర్ కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. ఈ చిత్రాన్ని హిందీ, మరాఠీ భాషలతోపాటు తెలుగులోనూ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంతోపాటు మరో బాలీవుడ్ చిత్రానికి కూడా సైన్ చేశాను. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే తెలుగులోనూ ఒక మంచి సినిమా చేయాలని నా కోరిక.. అన్నారు!!
 

Devi Sri Prasad in full Swing

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు నుండి విడుదలైన పాటలన్నీ శ్రోతల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇటీవలే రొమాంటిక్ మెలోడీ గా విడుదలైన మూడో పాట ‘హీ ఈజ్ సో క్యూట్’ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ అభిమానులు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకి ఫిదా అయ్యారు. ఈ చిత్ర ప్రారంభ సమయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించేలా సంగీతాన్ని అందిస్తానని చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ సరిలేరు నీకెవ్వరు కోసం ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బెస్ట్ ట్యున్స్ ను కంపోజ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఇక రాబోయే సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్న ఫోర్త్ సింగిల్ గురించి దేవి ఇంటరెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు.

సరిలేరు నీకెవ్వరు మ్యూజికల్ ఫెస్టివల్ మొదలయినప్పటి నుండి ప్రతి సోమవారం ఒక సూపర్ హిట్ సాంగ్ తో MaSSMB మండేస్, సూపర్ హిట్ మండేస్ గా మారిపోయి ప్రేక్షకులు, అభిమానులు ప్రతి సోమవారం రాబోయే కొత్త పాట కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఈ పాటలకి సంబంధించి కొన్ని వేల టిక్ టాక్ వీడియోలు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ నాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని రివీల్ చేశారు. ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి ఫీస్ట్ గా జనవరి 11, 2020 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది.

Wife,i movie Release date

‘ఏడు చేపల కథ’ లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా ‘వైఫ్ఐ’ . ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పావులర్ అయ్యింది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు, నూతన దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ సార్ధక్ మూవీస్ సొంతం చేసుకుంది. నిర్మాత ప్రశాంత్ గౌడ్ వైఫ్ ఐ చిత్రాన్ని సార్ధక్ మూవీస్ ద్వారా విడుదల చేయబోతున్నారు. వైఫ్ ఐ అంటే కేవలం భార్య భర్తలే కాదు, ఈ జనరేషన్‌ ప్రతీ అమ్మాయి, అబ్బాయి చూడదగ్గ సినిమాగా ఈ ‘వైఫ్‌ ఐ’ ని తీర్చిదిద్దారు దర్శకులు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్.

Hero tanish MAHAPRASTHANAM movie shooting started

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మహాప్రస్థానం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై హీరో తనీష్ క్లాప్ నిచ్చారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. మహాప్రస్థానం సినిమాలో ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తుండగా…వరుడు ఫేం భానుశ్రీ మెహ్రా కీలక పాత్రను పోషిస్తోంది. కబీర్ దుహాన్ సింగ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ షాట్ చిత్రీకరణ అనంతరం

హీరో తనీష్ మాట్లాడుతూ..నేను సినిమా సెట్ లో అడుగుపెట్టి ఏడాదిన్నర కావొస్తోంది. కథలు వింటున్నాను, ఏదీ నచ్చడం లేదు, అప్పుడు జాని గారు మహాప్రస్థానం కథతో వచ్చారు. ఆయన చెప్పిన కథ నన్ను బాగా ఇన్ స్పైర్ చేసింది. అంత బాగుందీ కథ. చాలా రోజులుగా ఏదీ సరిగా కుదరనిది, జాని గారు కథ చెప్పిన మూడు రోజుల్లో సినిమా ఓకే అనుకున్నాం, నెల రోజుల్లో సెట్స్ మీదకు వచ్చాం. ఏదైనా జరగాలని ఉంటే ఇలాగే వేగంగా జరుగుతుందేమో. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. నా మోకాలికి ఈ మధ్యే శస్త్ర చికిత్స జరిగింది. ఇదేమో యాక్షన్ సినిమా, దర్శకుడు జాని గారు మనం చేయగలమా అని సందేహించారు. సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు, అలా కథే మాలో ధైర్యం నింపింది. ముందడుగు వేసేలా చేసింది. మా పూర్తి శక్తి సామర్థ్యాలు ఈ సినిమాలో పెట్టి మంచి చిత్రాన్ని తీసుకొస్తాం. అన్నారు.
దర్శకులు జాని మాట్లాడుతూ…నేను గతంలో అంతకుమించి అనే చిత్రాన్ని రూపొందించాను. ఇది నా రెండో చిత్రం. మహాప్రస్థానం శ్రీశ్రీ గారు రాసిన గొప్ప పుస్తకం. మా చిత్రానికి ఆ పేరు పెట్టాలంటే చాలా ఆలోచించాము. టైటిల్ కు న్యాయం చేయగలమనే నమ్మకం వచ్చాకే పెట్టుకున్నాం. ఇదొక ఎమోషనల్ ఫ్రీక్, మామూలు సినిమాలా ఉండదు. అందరు అదే చెబుతారు. ఈ కథలో ఆ శక్తి ఉంది. ఇది బాగా వస్తుందని నమ్ముతున్నాం. ఇవాళ్టి నుంచి మహాప్రస్థానం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించాం. జనవరి మొదటి వారం వరకు ఆపకుండా షూటింగ్ చేయబోతున్నాం. అన్నారు.
     నటుడు కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ..నాకు కథ బాగా నచ్చింది. నేను తెలుగులో ఈ మధ్య నటించలేదు. మంచి కథ కోసం వేచి చూస్తున్నాను. ఈ కథ చెప్పగానే అద్భుతంగా అనిపించింది. హీరో తన ప్రేమ కోసం చేసే పోరాటం ఉద్వేగంగా సాగుతుంది. నాకు మరో మంచి సి నిమా అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

శుభాంగీ పంత్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – బాల్ రెడ్డి, కథా కథనం దర్శకత్వం – జాని

Superstar Rajinikanth thunders ‘I am a bad cop’about Darbar movie

చేతిలో గన్‌ ఉందని రజనీకాంత్‌కి గురి పెడితే?
బుల్లెట్‌ కంటే స్పీడుగా ఆయన చేతిలో కత్తి వేటుకు విలన్‌ రక్తం చిందుతుంది!
ఆయన కొట్టడం మొదలుపెడితే?
ఆ ఫైట్‌లోనూ ఓ స్టైల్‌ ఉంటుంది! ఓ గ్రేస్‌ ఉంటుంది! ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే మేనియా ఉంటుంది!
ఆయన డ్యాన్స్‌ చేస్తే?
థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేయాల్సిందే. చప్పట్ల
మోత మోగాల్సిందే! థియేటర్లలోనే కాదు… రజనీకాంత్‌ కొత్త సినిమా ట్రైలర్‌ యుట్యూమ్‌లో విడుదలైనా సందడి సందడిగా ఉంటుంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా, సునీల్‌శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా విడుదల కానుంది.

‘సార్‌! వాళ్ళకు చెప్పండి… పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు. స్ట్రైయిట్‌గా రావొద్దని’
‘ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్‌ అమ్మా! ఇది ఎలా ఉంది?’
‘అయామ్‌ ఎ బ్యాడ్‌ కాప్‌’ అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

రజనీకాంత్‌ని ఉద్దేశిస్తూ… ‘వాడు పోలీసాఫీసరా సార్‌? హంతకుడు!’ అని చెప్పే డైలాగ్‌ సినిమాలో యాక్షన్‌ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయనేది, విలన్లను రజనీకాంత్‌ ఏ రేంజ్‌లో ఆట ఆడించారనేది చెప్పకనే చెప్పింది. ఈ ట్రైలర్‌ చాలా స్టయిలిష్‌గా ఉందని విడుదలైన కొన్ని సెకన్లలో సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ:  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.