Home Blog Page 1011

Rare Nostalgic Moment unveiled on the sets of V.N. Aditya’s “Valliddari Madhya”

వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరి
మధ్య’ . యువతరం ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో హీరోయిన్ , తదితరులపై  కొన్ని సన్నివేశాలను
చిత్రీకరించారు.  విశేషమేమిటంటే ఈ సినిమా షూటింగు జరుగుతుండగా వి.ఎన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీసమేతంగా ఈ సినిమా సెట్ కు వచ్చారు. అంతేకాదు ఓ సన్నివేశానికి కూడా దర్శకత్వం వహించారు. దీనికి వి.ఎన్. ఆదిత్య క్లాప్ కొట్టడం మరో విశేషం.
‘బృందావనం’,‘భైరవద్వీపం’,‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు వి.ఎన్.ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పుడు ఎలా క్లాప్ కొట్టారో… ఇప్పుడు మళ్లీ
అలా కొట్టడంతో సెట్ లో ఉన్న అంతా ‘క్లాప్స్’కొట్టేశారు. పైగా సింగీతం శ్రీనివాసరావులాంటి దర్శకుడి దర్శకత్వంలో నటించినందుకు నేటి తరం నటులు కూడా ఎంతో
సంబరపడ్డారు. హీరోయిన్, ఆమె తల్లిదండ్రుల మీద ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
దీనిపై వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ ‘వాహిని సంస్థలో నేను కొట్టిన క్లాప్ అనుభూతి మళ్లీ ఇన్నాళ్లకు పునరావృతమైంది. నా గురువు సింగీతం గారు మొట్టమొదటిసారి నా సెట్ కు వచ్చారు. అప్పట్లో నాలుగేళ్లు ఆయన దగ్గరే ఉండి వాళ్లింట్లో భోజనంచేసి పెరిగిన కుర్రాడిని నేను. ‘పీపుల్స్ మీడియా’ అధినేత  విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభోట్ల కూడా  అతిథులుగా మా షూటింగ్ కు వచ్చి మా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నారు. నిర్మాత అర్జున్ గారు పట్టుబట్టలు పెట్టి సింగీతం  దంపతులను సత్కరించారు. హాప్ డే ఆయన మాతోనే గడిపారు’ అని వివరించారు.
 నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ  ”ఈ నెలాఖరుకల్లా షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి . లెజెండరీ డైరెక్టర్ సింగీతం గారు సతీ సమేతంగా మా సెట్ కి రావడం అదృష్టం గా భావిస్తున్నాం . 88 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఎనర్జీ ని చూసి ఆశ్చర్య పోయాం. ఆనాటి జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ముఖ్యంగా ‘మాయాబజార్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి విషయాలు ఎన్నో వివరించారు. ఇప్పటి సినిమాల గురించి , లేటెస్ట్ ఫిలిం మేకింగ్ గురించి, ట్రెండ్స్ గురించి ఆయన చెబుతూ ఉంటే మాకు కాలం తెలియలేదు. ఒక కొత్త కాన్సెప్ట్ తో త్వరలోనే ఒక సినిమా చేస్తానని ఉత్సాహంగా చెబుతుంటే , మేము ఇన్ స్పైర్ అయిపోయాం” అని తెలిపారు. 
 
 
విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్
సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్
వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్”
అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ
,భార్గవ్, రామకృష్ణ
తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం .

సాంకేతిక బృందం :
స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి.పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకేమూర్తి,
ఎడిటర్:ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి , ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్ : సూరపనేని కిషోర్,
నిర్మాత: అర్జున్ దాస్యన్ , కథ – దర్శకత్వం : వి.ఎన్.ఆదిత్య .

Nikhil Arjun Suravaranam Pre-Release Ceremony as Chief Guest of Megastar Chiranjeevi

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 26న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “ఓ క్రేజీ విష‌యం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవిగారిని ఇప్పుడే క‌లుసుకున్నాం. ఆ అనుభూతి చాలా గొప్ప‌గా అనిపించింది. మా `అర్జున్ సుర‌వ‌రం` సినిమాను చూసి ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఆయ‌న ఇంటికి పిలిచి మాట్లాడారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చింది. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా వ‌స్తాన‌ని అన్నారు. మా యూనిట్ అంద‌రికీ ఇది చాలా పెద్ద విష‌యం. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 26న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నాం“ అన్నారు.

న‌కిలీ స‌ర్టిఫికేట్స్ కుంభ‌కోణంలో అర్జున్ సుర‌వ‌రం అనే ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసును ఆ జ‌ర్న‌లిస్ట్ ఎలా చేధించాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
బ్యాన‌ర్‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌
సంగీతం: సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌
ఎడిట‌ర్: న‌వీన్ నూలి

‘Arjun Suravaram’ With Twist And Turns Interving – Heroine Lavanya Tripathi

యంగ్ హీరో నిఖిల్ లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`. ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 29న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ..

ఈ మ‌ద్య కాలంలో తెలుగులో కొంచెం గ్యాప్ ఎక్కువ‌ తీసుకున్నట్టుకున్నారు?
– అవునండీ! కొంచెం గ్యాప్ వచ్చిన మాట‌ నిజమే. నేను మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూడడమే దానికి కారణం. ఈ క్ర‌మంలో కొన్ని స్క్రిప్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రాధాన్యం ఉండి, న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరో ఎదో అనుకుంటారని, అవకాశాలు లేవని సినిమాలు ఒప్పుకోను. నేను నాలానే ఉండటానికి ఇష్టపడతాను.

ఈ మూవీలో నటించడానికి రీజ‌న్ ఏంటి?
– తమిళ రీమేక్ కావడం వలన ఈ మూవీని కూడా ఫస్ట్ నేను వ‌ద్దు అనుకున్నాను. కానీ పూర్తీ కథ విన్న తరువాత నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని తెలిసి ఒప్పుకోవడం జరిగింది. తమిళ స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేసి నా పాత్రకు అదనపు సన్నివేశాలు జోడించారు.

అర్జున్ సురవరం మూవీ ఎలా ఉండ‌బోతుంది?
– నేటి కాలనికి సంబందించిన సోషల్ బర్నింగ్ ఇష్యూ పై ఈ సినిమా తెరకెక్కింది. కొందరు చేసే మోసం వలన బాగా చదువుకొని, తెలివి అర్హత ఉండి ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు. కొందరు ఎటువంటి అర్హతలు లేకపోయినా ఆ ఉద్యోగం చేస్తూ హాయిగా గడుపుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో మూవీ ఆసక్తికరంగా ఉంటుంది.

మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది?
– నేను ఈ చిత్రంలో ఒక జర్నలిస్ట్. హెడ్ స్ట్రాంగ్ కలిగి ఇండిపెండెంట్ లక్షణాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. అలాగే ఈ చిత్రం కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్ట్స్ కూడా చేశాను. ఓ సన్నివేశంలో నేను ఉన్న కారు రన్నింగ్ లో ఉండగా రెండు ప్రక్కల నుండి రెండు కార్లు వచ్చి ఢీ కొట్టేప్రమాదకర సన్నివేశాలలో న‌టించాను.

హీరో నిఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకొవ‌డం…
-నిఖిల్ చాలా ఫ్రెండ్లీ మరియు హార్డ్ వర్కింగ్ నేచర్. ఈ మూవీలో అతని పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది.

రిలీజ్ కొంచెం లేట్ అయ్యింది క‌దా! ఎలా అన్పిస్తోంది?
– అవును అది నిజంగా బాధాకరమైన విషయం. నేను కూడా ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాను. మూవీ ట్రైలర్ విడుదలైయ్యాక చిత్రంపై నమ్మకం వచ్చింది. మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు?
– ట్రావెలింగ్ఈ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ట్రిప్ కి వెళుతుంటాను. ఈ మధ్యనే పుష్కర్ వెళ్ళాను. ఈ మ‌ద్యే కొన్ని డ్యాన్స్ ఫామ్‌లు ట్రై చేస్తున్నా…

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
– నెక్స్ట్ చేయ‌బోయే మూవీలో నేను హాకీ ప్లేయర్ క‌న్పిస్తాను. ఆపాత్రకోసం హాకీ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అలాగే బైక్ రైడింగ్ వంటివి కూడా నేర్చుకుంటున్నాను. ఆ మూవీ డిసెంబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.. ఇంకా రెండు మూడు క‌థ‌లు విన్నాను. త్వ‌ర‌లోనే ఫైన‌లైజ్ చేస్తాను. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించింది హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి.

Eighty Stars 10th Anniversary Party at Megastar’s new home

ఎన‌భైల‌ నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్స‌వ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డ‌మే గాక‌.. ఆయ‌నే హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వ‌హించారు. ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్,  టాలీవుడ్ – కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.
గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి. ప‌దో సారి కావడంతో ఘ‌నంగా మెగాస్టార్  ఈ వేడుక‌ల్ని స్వ‌యంగా నిర్వ‌హించారు.

Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’ Teaser Creates Record With 20 Million Real-time Views

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రేక్షకులు, సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఈ సినిమా టీజర్‌ శుక్రవారం విడుదలైంది.

ఈ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లో వైరల్ అయ్యి రియల్ టైం వ్యూస్, లైక్ ల విషయంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది.  40 గంటల్లోనే 20 మిలియన్  రియ‌ల్‌టైమ్ వ్యూస్ సాధించి  40 గంట‌ల పాటు కంటిన్యూగా యుట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉండ‌డం విశేషం.  ఈ టీజర్‌తో సినిమాపై అటు ప్రేక్ష‌కుల‌లో, ఇటు మ‌హేష్ అభిమానుల‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.  ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో  షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం

Suresh Kondeti congratulates NTR’s founder on completing 70 years of NTR debut movie ”MANA DESAM”

నటరత్న నందమూరి తారక రామారావును వెండితెరకు పరిచయం చేసిన ‘మనదేశం ’ సినిమా విడుదలై ఈరోజుకు 70 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్రనిర్మాణ సారధి, ఆ చిత్ర కథానాయిక కృష్ణవేణిని ‘సంతోషం’ పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి కలిసి ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. 1930-1940వ ధశకంలోని కథానాయికల్లో ఇంకా జీవించి ఉన్నది ఆమె ఒక్కరే. 96 ఏళ్ల వయసులోనూ ఆమె ఆరో్గ్యంగా ఉన్నారు. ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ పతాకంపై మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆమె సమర్పకురాలిగా ఉన్నారు. ఆమె రాజాగారి సతీమణి కూడా. ఈ సినిమా 1949 నవంబరు 24న విడుదలైంది. కృష్ణవేణి పాదాలకు సురేష్ కొండేటి  నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ తాను సినిమా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో వారి ఇంట్లోనే పెరిగానని, ఆమె కుమార్తె ఎన్.ఆర్. అనురాధాదేవి నిర్మించిన కొన్ని చిత్రాలకు కూడా తను సహకారం అందించానన్నారు. వారి కుటుంబంతో తనకు ఉన్న ఆత్మీయానుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. ఆమె పూర్ణాయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తెలుగు సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

Sai Tej, Maruthi, Rasikhanna “Prathiroju Pandage” Song Shooting at the Grand Set in Annapurna Studios

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా,  మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా,  గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్ ను అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్ లో సెట్ వేశారు. థమన్ సంగీతమంచిన ఈ ఎనెర్జిటిక్ సాంగ్ కోసం సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. శ్రీ జో ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాట చిత్రీకరణ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు… ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే కమేసి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు.

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

నటీనటులు:

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను

Panipat’s Latest Track – ‘Mann Mein Shiva’ Celebrates Courage, Unity & Valour

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం(14 జ‌న‌వ‌రి 1761 ) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షెలాత్కర్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, మరియు సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు.  భారీ స్థాయిలో చిత్రీకరించబడి  ఇటీవల విడుదల చేసిన  ‘మర్ద్ మరాఠా’  సాంగ్ కి  దేశ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా  భారీ విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ‘మన్ మే శివ’ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

అర్జున్ కపూర్, కృతి సనన్, ఇతర ముఖ్య నటులు నటించిన ఈ పాట చరిత్రలో ముఖ్యమైన సంఘటనలైన ఎర్ర కోటపై మరాఠా విజయం సాధించడం,  సదాశివ రావు భావ్ నాయకత్వంలో ఎర్ర కోట వద్ద మొదటిసారి మరాఠా జెండాను ఎగురవేసిన సందర్భంగా వస్తుంది. మరాఠా వీరుల ధీరత్వాన్ని, ఐకమత్యాన్ని ప్రతిబింబించే ఈ పాట‌కు అజయ్-అతుల్ సంగీత సారథ్యం వహించ‌గా జావేద్ అక్తర్ ర‌చించారు. ప్రముఖ సింగర్స్  కునాల్ గంజవల్ల, దీపాన్షి న‌గ‌ర్‌ మరియు పద్మనాబ్ గయక్వాడ్ ల త్రయం అద్భుతమైన స్వరంతో ఆలపించారు.

సంజయ్‌దత్‌, అర్జున్‌ కపూర్‌, కృతిసనన్‌, పద్మిని కొల్హాపురి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అజయ్‌-అతుల్‌, కెమెరా : సి.కె.మురళీధరన్‌, ఎడిటింగ్‌ : స్టీవెన్‌ బెర్నార్డ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌, యాక్షన్‌ : అబ్బాస్‌ అలీ మొఘల్‌,  బ్యానర్స్‌ : అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌, ప్రొడ్యూసర్స్‌ : సునీతా గోవారికర్‌, రోహిత్‌ షెలాత్కర్‌. దర్శకత్వం : అశుతోష్‌ గోవారికర్‌.

“Raagala 24 gantallo”sucess meet.. Srinivas Reddy Announces next movie “Wife Devahobhava”

సత్యదేవ్‌, ఈషారెబ్బా, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్‌, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ చిత్రాన్ని ఢ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కించారు.  శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ బానర్‌ పై శ్రీనివాస్ కానూరి ఈ సినిమాని నిర్మించారు.  వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్ ఇటీవ‌ల రిలీజైంది. రోజురోజుకు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో రాగ‌ల 24 గంట‌ల్లో టీమ్ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ వేడుక‌లో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని అద్భుతంగా రీసీవ్ చేసుకున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే న‌మ్మారో అదే జ‌రిగింది. స్టోరీ, ప‌ర్ ఫెర్మాన్స్,  అంజి గారి కెమెరా వ‌ర్క్, ర‌ఘు కుంచె మ్యూజిక్, మంచి క్వాలీటీతో రాజీప‌డ‌కుండా మా నిర్మాత శ్రీనివాస్ గారు ఈ సినిమాని నిర్మించ‌డం… ఇవ‌న్నీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కార‌ణం. ఈషా రెబ్బా అద్భుతంగా న‌టించింది. ఈ సంద‌ర్భంగా ఈషాకు కంగ్రాట్స్ చెబుతున్నాను. న‌న్ను న‌మ్మి నాకు ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూస‌ర్ గార్కి, డైరెక్ట‌ర్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

అనురాగ్, అజ‌య్, గ‌ణేష్, వంశీ…ఇలా ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగా న‌టించారు. అంద‌రూ బాగా న‌టించారు కాబ‌ట్టే వండ‌ర్ ఫుల్ హిట్ వ‌చ్చింది. ఈ సినిమాని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కి చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించిన మా పీఆర్వోస్ వంశీ – శేఖ‌ర్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. రఘు అన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది అని అంద‌రూ మాట్లాడుతుంటుంటే చాలా ఆనందంగా ఉంది. త‌మ్మిరాజు గారు ఎడిటింగ్ సూప‌ర్. సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా అద్భుతంగా ఎడిట్ చేసారు. ఈ సినిమాని చూడ‌ని వాళ్లు త‌ప్ప‌కుండా థియేట‌ర్ లో చూడండి అన్నారు.

న‌టుడు ర‌వివ‌ర్మ మాట్లాడుతూ… థ్రిల్ల‌ర్ సినిమా అన‌గానే ఏ సెంట‌ర్ మూవీ అనుకుంటారు కానీ.. మా సినిమా సి, బి సెంట‌ర్స్ లో కూడా చాలా బాగా ఆడుతుంది. ఈ సినిమాకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి థియేట‌ర్ల‌ను కూడా పెంచుతున్నారు. స్క్రీన్ ప్లే, ట్విస్టులు…ఇలా అన్నీ క‌రెక్ట్ గా కుదిరాయి. మేము మాట్లాడింది నిజ‌మో కాదో సినిమా చూసాకా ప్రేక్ష‌కుల‌కు తెలుస్తుంది. అమెజాన్ లో చూద్దాం అనుకోకండి. థియేట‌ర్ లోనే చూడండి. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ… ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కి ర‌ప్పించాలంటే చాలా క‌ష్టం. అయితే.. మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. థియేట‌ర్ లో కూర్చొని సినిమా చూస్తే… ఆ కిక్కే వేర‌ప్పా. ఈ సినిమాని చూసిన ప్రేక్ష‌కులు సినిమా బాగుంది అని ప‌ది మందికి చెబుతున్నారు. మంచి రివ్యూస్ వ‌చ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్… ఇలా అన్ని డిపార్టెమెంట్స్ గురించి రాసారు. రివ్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అంద‌రూ థియేట‌ర్ లో చూడాల‌ని కోరుతున్నాను అన్నారు.

కెమెరామెన్ అంజి మాట్లాడుతూ… శ్రీనివాస‌రెడ్డి కామెడీ సినిమాలు తీసాడు. సోషియో ఫాంట‌సీ ఢ‌మ‌రుకం తీసాడు. థ్రిల్ల‌ర్ మూవీని ఎలా తీస్తాడు అని చాలా మంది మిత్రులు అడిగారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీని కూడా శ్రీనివాస‌రెడ్డి గారు అద్భుతంగా తీసారు. స‌త్య‌దేవ్ నెగిటివ్ రోల్ లో అద‌ర‌గొట్టేసాడు అని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మ‌ల్లిఖార్జున థియేట‌ర్ లో ఈ సినిమాని చూసాను. ప్రేక్ష‌కులు క్లాప్స్ కొడుతుంటే.. మా క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం వ‌చ్చింద‌ని చాలా హ్యాపీగా అనిపించింది. మా నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మించారు. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

న‌టుడు గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్ మాట్లాడుతూ… టీమ్ వ‌ర్క్ లా ఈ సినిమాకి వ‌ర్క్ చేసాం. ఈ రోజు సినిమా స‌క్స‌స్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఢ‌మ‌రుకం త‌ర్వాత మ‌ళ్లీ శ్రీనివాస‌రెడ్డి గారి సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంది. స‌త్య‌దేవ్, ఈషా అద్భుతంగా న‌టించారు.  ర‌ఘు మ్యూజిక్, అంజి కెమెరా వ‌ర్క్, త‌మ్మిరాజు ఎడిటింగ్.. ఈ సినిమాకి ప్ల‌స్ అని చెప్ప‌చ్చు. ఫ్యామిలీతో అంద‌రూ ఈ సినిమాని చూడండి అన్నారు.

హీరోయిన్ ముస్కాన్ మాట్లాడుతూ… ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో మేఘ‌న క్యారెక్ట‌ర్ చేసాను. కెమెరామ‌న్ అంజిగారు న‌న్ను మ‌రింత అందంగా చూపించినందుకు థ్యాంక్స్. స‌త్య‌దేవ్, ఈషా, ర‌ఘు గారి మ్యూజిక్, ఎడిటింగ్… ఇలా అన్నీ బాగా కుదిరాయి. ప్ర‌తి ఒక్క‌రు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే ఈ స‌క్స‌స్ వ‌చ్చింది అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ కానూరి మాట్లాడుతూ… డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి సినిమా బాగుంది. క‌లెక్ష‌న్స్ బాగున్నాయి అని మెసేజ్ లు రావ‌డంతో చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమాని ఇచ్చిన శ్రీనివాస్ అన్న‌య్య‌కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. కొంత మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా సినిమా బాగుంది అని అభినందించారు. రాఘ‌వేంద్ర‌రావు గారు ఫోన్ చేసి… శ్రీనివాస‌రెడ్డి థ్రిల్ల‌ర్ మూవీని ఎలా తీస్తాడో అనుకున్నాను. చాలా గ్రిప్పింగా తీసాడు బాగుంది అని అభినందించ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. సినిమా బాగుంది అని సి.ఎం ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వ‌చ్చింది. ఇంత మంది ఇలా అభినందిస్తుంటే… నా ఆనందానికి అవ‌ధులు లేవు. ఈషా, స‌త్య వీరిద్ద‌రు తెలుగువాళ్లు. తెలుగు న‌టీన‌టుల‌తో ఈ సినిమా చేయ‌డం.. అది ఈ విధంగా విజ‌యం సాధించ‌డం… ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ… నా క్యారెక్ట‌ర్ బాగుంది.. బాగా చేసావ్ అంటూ అంద‌రూ అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ఎ టు జెడ్ బాగుంది అని అంటున్నారు అంటే దానికి కార‌ణం మా డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి గారు, నిర్మాత శ్రీనివాస్ గారు. వాళ్లిద్ద‌రి డ్రీమ్ ఇది. మా శ్రీనివాస్ గారు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ర‌ఘు గారి మ్యూజిక్, అంజి గారి సినిమాటోగ్ర‌ఫీ బ్యాక్ బోన్ అని చెప్ప‌చ్చు. స‌త్య నెగిటివ్ రోల్ లో యాక్టింగ్ చించేసాడు. ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఫ్యామిలీతో చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ…. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో త‌ర్వాత కొంత నిరాశ‌కులోన‌య్యాం. శ‌నివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్ ఫుల్ అవ్వ‌డం.. అన్ని చోట్లా క‌లెక్ష‌న్స్ బాగుండ‌డంతో చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. ఈ సినిమా చూసిన వాళ్లు బాగుంది చూడండి అని ఓ ప‌ది మందికి చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన వాళ్లు స‌త్య‌, ఈషా న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి మాట్లాడుతున్నారు. స‌త్య సినిమా ఇండ‌స్ట్రీకి ఓ వ‌రం. ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని మంచి పాత్ర‌లు అత‌నికి వ‌స్తాయి. ఈషా అందంతో పాటు అభిన‌యంతో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి ఆక‌ట్టుకుంది. నేను ఏదైతే న‌మ్మి ఈ సినిమా తీసానో అది నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాకి రియ‌ల్ హీరో మా ప్రొడ్యూస‌రే. ద‌మ్మున్న నిర్మాత‌. క్వాలీటీ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ మూవీని నిర్మించారు. 300 స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసాం. పెద్ద సినిమాకి ఎలాగైతే ప‌బ్లిసిటీ చేస్తారో అలా చేసాం. బుధ‌వారం నుంచి స‌క్స‌స్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ టూర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న అన్ని థియేట‌ర్స్ కి వెళ్లి ప్రేక్ష‌కుల‌ను క‌లుస్తాం. ర‌ఘు మ్యూజిక్, అంజి కెమారావ‌ర్క్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. కృష్ణ‌భ‌గ‌వాన్ డైలాగ్స్ సినిమా విజ‌యానికి హెల్ప్ అయ్యాయి. ఓ మంచి సినిమా తీసాన‌నే తృప్తి క‌లిగించింది.

ఇక త‌దుప‌రి చిత్రం గురించి చెప్పాలంటే… ఇదే బ్యాన‌ర్ లో అతి త్వ‌ర‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను. ఆ సినిమా టైటిల్ భార్య‌దేవోభ‌వ‌. ఇందులో ప్ర‌ముఖ హీరో న‌టించనున్నారు. ప‌ది మంది హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన్మెంట్ గా ఉంటుంది. మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య‌దేవోభ‌వ వ‌లే.. భార్య గొప్ప‌త‌నం తెలియ‌చేసేలా భార్య‌దేవోభ‌వ ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను అన్నారు.