Home Blog Page 1012

Anil Ravipudi Birthday Celebrations On The Sets Of Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’

‘పటాస్’ తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రం తోనే సూపర్ హిట్ సాధించి ఆ తరువాత వరుసగా ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’ వంటి భారీ హిట్స్ తో దూసుకెళ్తోన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సారి సూపర్ స్టార్ మహేష్ తో సంక్రాంతికి మరో సారి బ్లాక్ బస్టర్ సాధించేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సిద్ధం చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని  దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.  నవంబర్ 22 న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’  టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఒక్క రోజులోనే 18 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించి సంచలనం సృష్టించింది.

నవంబర్ 23 న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ జరుగుతున్న అంగమలై ఫారెస్ట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ మహేష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్ తో పాటూ యూనిట్ సభ్యులందరూ  అనిల్ రావిపూడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ ,” అనిల్ రావిపూడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. తనతో వర్క్ చేయడం అన్ని విధాలుగా ఒక ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. తాను మరింత సంతోషంగా ఉండాలని మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ కి థాంక్స్ చెప్తూ  , ” మీ విషెస్ కి చాలా థాంక్స్ సార్.  మీతో వర్క్ చేయడం నాకు మెమొరబుల్ జర్నీ. మీతో పని చేస్తూ ఎన్నో నేర్చుకున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేను.” అన్నారు. ఈ పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోలేనని, ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కి తమ అంచనాలని మించి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు. ఈ స్థాయి రెస్పాన్స్ రావడానికి ముఖ్య కారణమైన సూపర్ స్టార్ మహేష్ గారికి, నా టీం కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

First Look Poster of Athade Srimannarayana

PFA the first look poster of Rakshit Shetty’s ‘Athade Srimannarayana’. Trailer releasing on November 28th and the film will be releasing on December 27, 2019.

Hero Karthikeyan launches “Vittal wadi” movie Anna vadilesindu Lirical song launch

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ గారు.
రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్  బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం  విట్టల్ వాడి.
ఈ మూవీలో “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ RX 100  ఫేం హీరో కార్తికేయ గారు గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్బంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ…
అన్న వదిలేసిండు సాంగ్ చాలా బావుంది.చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను.
తెలుగు రాపర్ రోల్ రైడా మాట్లాడుతూ…
విట్టల్ వాడి మూవీ లో అన్న వదిలేసిండు సాంగ్ లిరిక్స్ రాసి సాంగ్ పాడటమే కాకుండా యాక్ట్ చేయడం జరిగింది.మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పారు.తనకి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి థాంక్స్ చెప్పారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ…
రోల్ రైడా అన్న కి స్పెషల్ థాంక్స్.రోల్ రైడా పాడిన ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పారు.
ప్రొడ్యూసర్ జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ…
90 ml షూటింగ్ లో బిజీ గా ఉండి కూడా మా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి చాలా థాంక్స్.ఈ సాంగ్ అందరికి నచ్చుతుందని సాంగ్ ని సూపర్ హిట్ చేయాలని అందరిని కోరుకుంటున్నా అని చెప్పారు.
నటీనటులు:
రోహిత్ రెడ్డి,సుధా రావత్,అమిత్,అప్పాజీ అంబరీష్ దర్బా,చమ్మక్ చంద్ర,జయ శ్రీ,రోల్ రైడా,
సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్:సతీష్ అడపా
మ్యూజిక్:రోషన్ కోటి
ఎడిటర్:శ్రీనివాస్ కె.మోపర్తి
ఫైట్స్:శంకర్.యు
పిఆర్ఓ:మధు వి.ఆర్
లిరిక్స్& సింగర్: రోల్ రైడా
లైన్ ప్రొడ్యూసర్:ప్రశాంత్ పేరుపల్లి
నిర్మాత:నరేష్ రెడ్డి.జి
డైరెక్టర్:నాగేందర్.టి

‘Donga’ Is A Perfect Blend Of Action And Emotion – Angry Hero Karthi

ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రాబోతున్నాడు.  వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు.    ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ, ” ‘దొంగ’  నా కెరీర్ లో మరో విభిన్న చిత్రం. వెరైటీ చిత్రాలని ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దొంగ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు. మా వదిన గారు జ్యోతిక ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సత్యరాజ్ గారు మరో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. నా కెరీర్ లో మరో మెమొరబుల్ ఫిలిం.”  అన్నారు

నిర్మాణ సంస్థలు వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ సినిమా గురించి వెల్లడిస్తూ, ”  షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.” అన్నారు

ఖైదీ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కార్తీ కి దొంగ మరో బ్లాక్ బస్టర్ కాబోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

Hero Srikanth launches ‘Appudu-ippudu’ Song Launch !!

హీరో శ్రీకాంత్  చేతుల మీదుగా `అప్పుడు-ఇప్పుడు` సాంగ్ లాంచ్!!
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాట, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం లోని మరో పాటని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..
దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – “ ఇప్పటికే విడుదలైన పాటలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మరో గీతాన్ని హీరో శ్రీకాంత్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా యూనిట్ అందరి తరుపున ఆయనకు ధన్యవాదాలు. ఒక  ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్  భరద్వాజ్ సంగీతం మా  సినిమాకు మంచి అసెట్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది “ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ “పూరి జగన్నాథ్ గారి చేతులమీదుగా విడుదలైన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ట్రేడ్ వర్గాల్లో మా సినిమా మీద బజ్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు హీరో శ్రీకాంత్ గారి చేతులమీదుగా విడుదలైన ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం“ అన్నారు.
సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి …
సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి,
ఆర్ట్: ఠాగూర్,
లిరిక్స్ః చిరావూరి విజయకుమార్,
ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,
సంగీతం: పద్మానావ్ భరద్వాజ్,
నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు,
దర్శకత్వం: చలపతి పువ్వల.

George Reddy connected to Youth… Director Jeevan Reddy

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన
జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత
చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్  సుధాకర్
యెక్కంటి మీడియాతో ముచ్చటించారు..

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ:
‘‘ జార్జిరెడ్డి ని తెరమీద పరిచయం చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను.
విద్యార్ధులనుండి,  ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నేను ఊహించిన
దానికంటే చాలా బాగుంది.  జార్జిరెడ్డి పేరు ఇప్పుడు దేశంలో  వినపడుతుంది.
ఆయన చరిత్ర గురించి ఒకటిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి కథను రెడీ
చేసుకున్నాను. నేను కలిసిన వారందరూ  చెప్పిన కథలు లలో చాలా వ్యత్యాసాలు
చూసాను. కలిసిన  ప్రతి ఒక్కరి దగ్గరా ఒక కథ ఉంది. అందుకే నేను నమ్మిన
కథను చరిత్రలోని  వాస్తవ సంఘటలను ఆదారంగా తీసుకొని జార్జిరెడ్డిని
ప్రజెంట్ చేసాను. ఈ సినిమా  అందరికీ నచ్చుతుందని మేం మొదటి నుండి
అనుకోలేదు. ఎందుకంటే జార్జిరెడ్డి కథే చాలా కాంప్లికేటడ్ దాన్ని సినిమాగా
మలిచేందుకు రాసుకునే ప్రతి అక్షరం విషయంలో నేను చాలా జాగ్రర్త  పడ్డాను.
ఇప్పడు వింటున్న కథలు తెరమీదకు తెస్తే మీముందు ఇక్కడ కూర్చోలేను. సినిమా
కూడా బయటకు రాదు. నాలుగు రెచ్చే గొట్టే సీన్స్ ను తీసి కాంట్రవర్సరీలు
చేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఈ సినిమా మూలంగా ఎలాంటి ఘర్షణనలు రాకూడదని
జాగ్రర్త పడ్డాను.  కానీ జార్జిరెడ్డి వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ  వంటి
లక్షణాలతో కథను ముందుకు తీసుకెళ్లాను. జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం
లేదు అని బలంగా నమ్మాను. నా స్నేహితుడు సందీప్ లో జార్జి రెడ్డిని
చూసాను. ఇప్పుడు అందరికీ జార్జిరెడ్డి  సందీప్ లో  కనపడుతున్నాడు.
సినిమా హాల్స్ లో వినపడుతున్న విజిల్స్ , ప్రేక్షకుల నుండి వస్తున్న
స్పందన నాకు చాలా సంతృప్తి నిస్తుంది.   తెరమీద జార్జిరెడ్డి కథను
నిజాయితీగా చెప్పాను అనే సంతృప్తి నాకు ఉంది. ఆయన జీవితాన్ని ఇప్పటి యూత్
కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసాను. బ్లేడ్
ఫైట్, ఫైర్ వాల్ ఫైట్ యూత్ కి విపరీతంగా నచ్చుతున్నాయి. జార్జిరెడ్డి
గురించి చర్చ యూత్ లో మొదలైంది.  జార్జిరెడ్డి యూత్ కి కనెక్ట్ అయ్యాడు.
అది చాలు నాకు’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్  సుధాకర్ యెక్కంటి మాట్లాడుతూ:
‘‘ 70 వ దశకంలో కాలాన్ని రీ క్రియేట్ చేయడంలో  సక్సెస్ అయ్యామని వస్తున్న
కామెంట్స్ మాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. జార్జిరెడ్డి కథను యూత్ కి
కనెక్ట్ అయ్యే విధంగా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. జార్జిరెడ్డి
వంటి వ్యక్తిని యూత్ కి కనెక్ట్ చేసాం అనే సంతృప్తి మాకు చాలా ఉంది.
ఈసినిమా కమర్షియల్ గా కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి చరిత్రను
తెరకెక్కించడంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.  సినిమాను
ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా పెద్ద థ్యాంక్స్ ’’ అన్నారు.

‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్
మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా
బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటించిన ఈ మూవీలో ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ
ప్రధాన పాత్రలో నటించాడు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’తల్లి
పాత్రలో నటిస్తుండటం

విశేషం. ఇటీవల “నాల్” సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్
అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను
పోషించాడు. ఇతర పాత్రల్లో ముస్కాన్,

మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,మహాతి ఇతర నటీనటులు.

సాంకేతికవర్గానికి విషయానికి వస్తే

సంగీతం -సురేష్ బొబ్బిలి,

ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,

ఆర్ట్- గాంధీ నడికుడికార్,

సినిమాటోగ్రాఫర్: : సుధాకర్ యెక్కంటి.

కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్,

ఫైట్స్ -గణేష్, ఆర్కే,

అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.

స్టిల్స్ -వికాస్ సీగు,

సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్

పి ఆర్ వో: జిఎస్ కె మీడియా

కో డైరెక్టర్ -నరసింహారావు,

అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

కో ప్రొడ్యూసర్: సంజయ్ రెడ్డి

నిర్మాత: అప్పిరెడ్డి

రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి

Kangana Ranaut “Thalaivi” First Look, Teaser out

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం `త‌లైవి`. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైంది.
అర‌వింద‌స్వామి ఇందులో దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంజీ రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు.
శ‌నివారం ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోన్న కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను విడుదల చేశారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
జ‌య‌ల‌లిత ఓల్డ్ గెట‌ప్‌లో కంగ‌నా ర‌నౌత్ ఒదిగిపోయారు. అలాగే టీజ‌ర్‌లో జ‌య‌లలిత‌కు సంబంధించిన రెండు గెట‌ప్‌ల‌ను విడుద‌ల చేశారు. అందులో ఇండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్ లుక్ ఒక‌టి కాగా.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పాత్ర‌కు సంబంధించిన లుక్ మ‌రొక‌టి ఉంది.
విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.

Grand releae plans for ”kamma rajyamlo kadapa redlu”

రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చూపించబోతున్న కంటెంట్ ఎలా వుండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా…విశేషమైన ఆదరణ లభించింది.  పప్పు లాంటి అబ్బాయి పాట వైరల్ గా నిలిచింది. సూపర్బ్ రెస్పాన్స్ తో మంచి  ట్రెండింగ్ లో హల్చల్ చేసింది.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రంలో అనేక ఎలిమెంట్స్ ని డైరెక్టర్ టచ్ చేశాడు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యమండేలా తీర్చిదిద్దారు.  కమర్షియల్ సాగే ఎంటర్టైనర్ చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని త్వరలోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Mosagallu First Look Unveiled On Manchu Vishnu’s Birthday

శ‌నివారం మంచు విష్ణు పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్ క్రాస్ ఓవ‌ర్ మూవీకి `మోస‌గాళ్లు` అనే టైటిల్ ఖ‌రారు చేసి సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో మంచు విష్ణు అర్జున్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఫ‌స్ట్‌ లుక్‌లో మంచు విష్ణు డిఫ‌రెంట్‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. ఐటీ రంగంలో జ‌రిగిన ప్ర‌పంచ అతి పెద్ద స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సినిమా నిర్మిత‌మ‌వుతోంది.
జెఫ్రీ గి చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రుహానీ సింగ్ స‌హా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విరానికా మంచు నిర్మాత‌. థ్రిల్ల‌ర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్‌లో మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.  2020 వేస‌విలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Directer Sampath srinu production no 2 movie grand opening

ఎస్ పి క్రియేషన్స్ సమర్పణలో యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్2గా సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా మహి, సందీప్, శ్యామ్, గణేష్ రెడ్డి,  వెంకట్, సోనాలి,సోనాపటేల్, ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం నవంబర్ 23న హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు శ్రీను.కె కి అందించారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మొదటి సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – “చిన్న సినిమాలకి, కాన్సెప్ట్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. కొత్తవారైనా సరే కాన్సెప్ట్ బాగుంటే ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా అదే కోవలోకి రావాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను” అన్నారు.

ఎ.కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ – “ప్రధమ ప్రయత్నంగా దర్శకుడు కథ రాసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలాగే నటీనటులందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ – “చిన్న సినిమా అయినా సరే క్వాలిటీ, కంటెంట్ చాలా ముఖ్యం. అలాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్”అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “సినిమాలో కంటెంట్ ఉండి టీజర్, ట్రైలర్ తో మెప్పించగలిగితే మంచి బిజినెస్ అవుతున్న రోజులివి. కంటెంట్ ని కథను నమ్ముకొని సినిమా చేస్తే తప్పకుండా మంచి విజయం సాధిస్తారు” అన్నారు.

దర్శకుడు సంపత్ శ్రీను మాట్లాడుతూ – “యస్.యస్.సి క్రియేషన్స్ లో నిర్మాతగా నారెండవ సినిమా అలాగే దర్శకుడిగా నా మొదటి సినిమా కథ మీద నమ్మకంతో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాను” అన్నారు.

సందీప్ రెడ్డి మాట్లాడుతూ – “స్టోరీ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కథ చాలా బాగుంది, అలాగే డిఫరెంట్ గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సంపత్ గారికి థాంక్స్”అన్నారు.

హీరో మహి మాట్లాడుతూ – ” నాకు తన రెండో సినిమాలో కూడా అవకాశం ఇచ్చిన సంపత్ గారికి ధన్యవాదాలు. టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్” అన్నారు.

సోనా పటేల్ మాట్లాడుతూ – : “మంచి కథ, నా రోల్ కీలకంగా ఉండబోతుంది“ అన్నారు

సోనాలి మాట్లాడుతూ – ” ఇది నా సెకండ్ మూవీ మీ అందరి బ్లేసింగ్స్ కావలి” అన్నారు.

శ్యామ్ మాట్లాడుతూ – ” కథ పరంగా చాలా బాగుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

నిర్మాత శ్రీను.కె మాట్లాడుతూ – “నేను సింగల్ గానే ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆర్ కె గారు కథ విని కో – ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చారు. ఆయన ద్వారా కె.లక్ష్మణ్ రావు గారు పరిచయమయ్యారు. కథ, కథలోని కంటెంట్ విని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరికీ కృతజ్ఞతలు. మహేష్ తో ఇది నా రెండవ సినిమా. నా మొదటి సినిమా ‘విన్నర్ స్కిప్’ డిసెంబర్ లో ఆడియో విడుదల చేస్తాం. గోవా, బెంగుళూరు, అమలాపురం, లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 మార్చి లో విడుదల చేస్తాం” అన్నారు.

మహి, సందీప్, శ్యామ్, గణేష్ రెడ్డి,వెంకట్, సోనాలి,సోనాపటేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీ రామ్ కిరణ్, రచన: శ్రీను కడారి, రాజశేఖర్ తంగెళ్ల, సంగీతం: శరన్, ఎడిటింగ్ : ఈశ్వర్ విరాట్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.లక్ష్మణ్ రావు, కో – ప్రొడ్యూసర్: రామకృష్ణ వోలేటి, నిర్మాత: శ్రీను.కె, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ శ్రీను.