Suman completed 100th movie as a hero with ‘’Veerashastha ayyappa kataksham”
Naga Chaitanya World from NC19 is Released
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో
తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి మొన్న హీరో చైతు లుక్ విడుదలైంది.
ఆ పోస్టర్ లో సూపర్ కూల్ లుక్ అద్భుతమైన స్పందన లభించింది. సూపర్ ఎనర్జీ
తో ఉన్న యువ సామ్రాట్ ని చూసి అక్కినేని అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు
నాగచైతన్య ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ వీడియో విడుదల చేసాడు డైరెక్టర్
శేఖర్ కమ్ముల . ఈ వీడియో లో చైతు చాలా సహాజంగా కనిపించాడు. ఆడుతూ పాడుతూ
తన పనులు తాను చేసుకుంటున్న చైతు కొత్త గా ఉన్నాడు. ఈ వీడియో రెస్పాన్స్
తో చిత్ర యూనిట్, చైతన్య అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్
కంప్లీట్ చేసుకున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ సెకండ్ షెడ్యూల్ త్వరలో
మొదలవుతుంది.2020 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి
బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను
నిర్మిస్తున్నారు.
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్
కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సహా నిర్మాత : విజయ్ భాస్కర్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల
OMG Daddy’ from ‘Ala Vaikunthapurramlo’ out now
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.
ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రం లోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్ ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. గాయకుడు ‘రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.
‘ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్ గా చార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలుస్తోంది.మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్ ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ.: లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
superstar mahesh babu’s ”Sari leru nikevvaru” movie teaser going viral on ‘Socialmedia’
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. నవంబర్ 23 యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ నవంబర్ 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు.
మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో మహేష్‌బాబు వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు, మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీకోసం పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ సైనికుల కర్తవ్యం గురించి చెప్పే మాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి.
ఆ తర్వాత కొంతమంది రౌడీలను ఉద్దేశించి ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాల్రా. మిమ్మల్నెలా చంపుకుంటాన్రా. మీకోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ. మీరేమో కత్తులు, గొడ్డళ్లేసుకొని ఆడాళ్ళ మీద.. బాధ్యత ఉండక్కర్లా.. అంటూ చెప్పే డైలాగ్ కొత్తగా అనిపిస్తుంది.
ఆ తర్వాత ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో ‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..’ అంటూ లౌడ్‌గా చెప్పే డైలాగ్ మహేష్ క్యారెక్టర్‌లోని ఎమోషన్‌ని తెలియజేస్తుంది. లేడీ అమితాబ్ విజయశాంతి హీరో క్యారెక్టర్ గురించి చెప్తూ ‘గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ హీరో ఔనత్యాన్ని తెలియజేస్తుంది. టీజర్ ఎండింగ్‌లో ఇరిటేషన్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్ ‘ప్రతి స్రంకాంతికి అల్లుళ్లొస్తారు… ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అంటూ చెప్పే డైలాగ్ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి ఈ టీజర్‌లో అన్నిరకాల ఎలిమెంట్స్ ఉండేలా ఎంతో కేర్ తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. నవంబర్ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.
ss rajamouli congratulated y.srinivas reddy
“నేను కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పటి నుండి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసు. తను మంచి కమెడియన్. తొలిసారి `భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు` సినిమాతో దర్శక నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలుపుతున్నాను“ అంటూ ట్వీట్ చేశారు ఎస్.ఎస్.రాజమౌళి.
ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. `జయమ్ము నిశ్చయమ్మురా` రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను అందించారు.
”Annapurnamma gari mavadu” audio launch
దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ—లోగడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పలు చిత్రాలను రూపొందించాను. పల్లెటూరి ప్రేమలను…వాతావరణాన్ని ప్రతింబించే చిత్రాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అలాంటి కథను ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచాం. నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మాస్టర్ రవితేజ మనవడి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. బడ్జెట్ ఎక్కువైనా నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి ఎక్కడా రాజీపడకుండా సినిమా బాగా రావాలని ఎంతో సహకరించారు. సీనియర్ నటి జమునగారు అక్కినేని అనసూయమ్మ పాత్రలో ఆకట్టుకుంటారు అని అన్నారు.
నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి మాట్లాడుతూ–డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతోనే దీనిని తీశాం. అందరి సహకారంతో మేము అనుకున్నట్లుగా చిత్రం చాలాబాగా వచ్చింది అని అన్నారు. ఈ వేడుకలో నటుడు బెనర్జీ, గాయని పసల బేబి, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్, నటుడు గోవిందరాజుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.
”Degree college” trailer launch
అవార్డు చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ”డిగ్రీ కాలేజ్”, తన పంధాకు బిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్య రావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అతిధిగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ట్రైలర్ ని విడుదల చేసి…చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందచేశారు.
అనంతరం దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ:– ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసాం. ఆ అబ్బాయి, అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో ఆ అంశాలనే ఇందులో చూపించాం. ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం మొదటి ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి. అదే సమయంలో ట్రైలర్ ని చూసిన కొంతమంది ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ సెన్సార్ నిబంధనల ప్రకారంగా ఇస్తారు. చాలా రోజులు సెన్సార్ లోనే ఈ చిత్రం ఉండిపోయింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సెన్సార్ పరంగా సమస్య ఎదురు కావడంతో రీవైసింగ్ కమిటీకి ఈ చిత్రాన్ని పంపడం జరిగింది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే కట్ చేసారు. ఇలాంటి కథను యధాతదంగా చూపించడానికి దైర్యం కావాలి అంటూ అందరూ ప్రశంసించారు. గతంలో నేను తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి రివార్డులు వస్తాయి. డిసెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాము అన్నారు.
హీరో వరుణ్ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు యువతను చెడిపేస్తున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. రొమాన్స్ అంశాలను సబ్జెక్టు లో భాగంగానే పెట్టడం జరిగింది అని అన్నారు. కో ప్రొడ్యూసర్ ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తప్పకుండా ఆదరించే సినిమా అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో కో ప్రొడ్యూసర్ బత్తుల కొండయ్య, నటుడు రవి రెడ్డి, మల్లేష్, బడ్దల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Rupam S20+ Movie release date
సాయి లోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సాయి తులసి సమర్పణలో చక్రవర్తి , బంగారాజు , అక్షర ,సంతోషిణి హీరో హీరోయిన్లుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సి.రామాంజనేయ నిర్మిస్తున్న అందమైన అమ్మాయిల ప్రేమ కథ చిత్రం “రూపం యస్ 20 ప్లస్” ఈ నవంబర్ 28 న ప్రేక్షకులముందుకు వస్తుంది.
దర్శకుడు వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… అందమైన అమ్మాయిలను చూస్తే ప్రతి మగాడికి ప్రేమ కలుగుతుంది, ఎలాగైనా ట్రాప్ లో పడేయాలని చూస్తారు, ఒప్పుకోకపోతే బలవంతంగానైనా కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, ఇలాగే మా చిత్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని ఎలా పాడు చేసారు, ఆమె వాళ్లనుండి ఏ విధంగా తప్పించుకుంది, మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది అన్నది ఒక జంట కథగా , ఒక పోలీస్ ఆఫిసర్ అందమైన అమ్మాయి ప్రేమలోపడి పెళ్లిచేసుకొన్నాడు, మాఫియా వలలో చిక్కుకొన్న తన భార్యను ఎలా కాపాడుకొన్నాడన్నది రెండో జంట కథ, ఈ రెండు జంటల కథను అనేక మలుపులు తిప్పుతూ అద్భుతమైన స్కీన్ ప్లై తో రూపొందిన్చాన్నారు . నిర్మాత సి.రామాంజనేయ మాట్లాడుతూ… ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు , నాలుగు పాటలు ఉన్నాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్ది నవంబర్ 28 న విడుదల చేస్తున్నామన్నారు.
ఇంకా ఈ చిత్రంలో ఉమామహేశ్వరి , రజనీకాంత్ , అజయ్ , రజని , సరోజని నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సాగర్ , ఆనంద్ , సంగీతం : మెలోడీ శ్రీనివాస్ , ఆర్ ఆర్ అర్మాన్ , పాటలు : వెల్లంకి విజయలక్ష్మి , ఫైట్స్ : లంక సాంభశివరావు ,ఎడిటింగ్ : వెంకటేశ్వర్లు , కథ , మాటలు , నిర్మాత : సి.రామాంజనేయ , స్కీన్ ప్లై , దర్శకత్వం : వెల్లంకి దుర్గాప్రసాద్
‘M3″movie firstlook,motion poster
Dhanush new movie “Thoota”
హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా నవంబర్ 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.
నటీనటులు: ధనుష్, మేఘా ఆకాశ్
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాతలు: జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి
సంగీతం: ధర్భుక శివ
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కాథిర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్
పిఆర్ఓ: వంశీ శేఖర్















