Home Blog Page 1014

“Shiva 143“ trailer launched by vv Vinayak

శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్)ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్  గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ…
రామ సత్యనారాయణ..నాకు చిరకాల మిత్రుడు..చిన్న సినిమాల నిర్మాణంలో అందెవేసిన చెయ్యి.. చిన్న సినిమా ఎలా తీయలో తీసిన సినిమాను ప్రేక్షకులలోకి ఎలా తీసుకువెళ్లలో బాగా తెలిసిన వాడు…దర్శకుడు సాగర్ శైలేష్ హీరో గా దర్శకుడు గా.కొరియోగ్రాఫర్ గా బాగా చేసాడు ట్రైలర్ బాగుందీ..DS రావు విలన్ పాత్రలో బాగా సూటు అయ్యాడు. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుక గా వస్తుంది అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ…
నేను ఏ పని చేసినా డైరెక్టర్ వినాయక్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన గతంలో మా రహస్యం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పడు శివ143 సినిమా ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదల అవ్వడం విశేషం. డైరెక్టర్, హీరో శైలేష్ ఈ సినిమాను అందంగా తెరకెక్కించారు.గతంలో మా భీమవరం టాకీస్ బ్యానర్ లో వచ్చిన రహస్యం తరహాలోనే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శైలేష్ హీరోగా, దర్శకుడుగా నేను నిర్మించిన రహస్యం సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ శైలేష్ నేను కలసి శివ143 సినిమాను తీశాము అన్నారు.
హీరో , డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ…
రామసత్యనారాయణ గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నన్ను నమ్మి ఈ ప్రాజెస్ట్ ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు. మా చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ వినాయక్ గారు (సీనయ్య) విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సగం విజయం పొందినట్టే
ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సంక్రాంతి కానుకగా మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరికి నచ్చే విధంగా మా సినిమా ఉండబోతోందని తెలిపారు.
నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,
నిర్మాత: రామసత్యనారాయణ మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్
పీఆర్ఓ: మధు వి.ఆర్
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్

Nagachaitanya Super cool look in new movie

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో
తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదలైంది. ఈ పోస్టర్
లో సూపర్ కూల్ లుక్ లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు.చైతు బర్త్
డే సందర్భంగా నవంబర్  23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్ ని
పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.సహజత్వం నింపుకొన్న
ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీద కు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథ
ను మరింత హృద్యంగా మలుచుతున్నాడు. నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్
తీసుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలో కి ఆయన బర్త్ డే సందర్భంగా
మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు
కొత్త  ఎక్స్ పీరియన్స్ గా ఉండ బోతుంది ఆ వీడియో.

ఏమిగోస్  క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి
బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను
నిర్మిస్తున్నారు.

నాగచైతన్య సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్
కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నికల్ టీమ్ :
ఆర్ట్ : రాజీవ్ నాయర్
కెమెరా : విజయ్ సి కుమార్
మ్యూజిక్ : పవన్
సహా నిర్మాత: విజయ్ భాస్కర్
పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం : శేఖర్ కమ్ముల.

Ravi Teja, Shruti Haasan, “Krack”Regular Shoot In RFC

`డాన్‌శీను`, `బ‌లుపు` వంటి రెండు సెన్సేష‌న‌ల్ హిట్‌ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `క్రాక్‌`. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌, ర‌వితేజ మాస్ లుక్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు.
ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.
కోలీవుడ్ యాక్ట‌ర్స్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి `మెర్స‌ల్‌`, `బిగిల్‌` వంటి సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:  బి.మ‌ధు
బ్యాన‌ర్‌:  స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌
సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె.విష్ణు
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
కో ప్రొడ్యూస‌ర్‌:  అమ్మిరాజు కానుమిల్లి
ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి
ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు:  రామ‌జోగ‌య్య‌శాస్త్రి
మేక‌ప్‌:  శ్రీనివాస‌రాజు
కాస్ట్యూమ్స్‌: శ‌్వేత‌, నీర‌జ కోన‌
స్టిల్స్‌:  సాయి
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన్‌:  వ‌ర్కింగ్ టైటిల్ శివ‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కోట‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌
కో డైరెక్ట‌ర్స్‌:  గులాబి శ్రీను, నిమ్మ‌గడ్డ శ్రీకాంత్‌
చీఫ్ కో డైరెక్ట‌ర్‌:  పీవీవీ సోమ‌రాజు

“Raa gala 24 gantallo” pre release event

  • దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మీడియా సోదరులకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన పేరుపేరునా నమస్కారాలు. నిర్మాత గారి మాటల్లోనే చూడొచ్చు.. ఆయన ఓ దమ్మున్న ప్రొడ్యూసర్. సినిమా అనేది ఎంతపెడితే ఎంత వస్తుంది.. అని లెక్కలు వేసుకుని.. బడ్జెట్ ఎలా కంట్రోల్ చేయాలి.. ఇలానే తీయాలి ఇంతలోనే తీయాలి అనుకుంటారు. అది వ్యాపారం కాబట్టి అందులో తప్పులేదు. కానీ మా నిర్మాత కానూరి శ్రీనివాస్ అన్న ప్యాషన్‌తో వచ్చాడు. మంచి సినిమా చేయాలి అని వచ్చాడు. అద్భుతమైన సినిమా చేసాం.. ఆయన మాటల్లోనే కాన్ఫిడెన్స్ లెవల్స్ తెలుస్తుంది. నవంబర్ 22న మీకు తెలుస్తుంది. నా గత సినిమాల మాదిరే మరో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందుతానని నమ్ముతున్నాను. మా నిర్మాత లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు. ఇలాంటి సినిమా చేస్తున్నపుడు వెనక నుంచి చెడుచేసే పర్సన్స్ కూడా ఉంటారు. అన్నయ్య విజయం వెనక మాత్రం వదిన ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత బంధు మిత్రలుతో పాటు తల్లిదండ్రులు కూడా మా కానూరి శ్రీనివాస్ గొప్ప సినిమా చేసాడని చెప్పుకుంటారు. ఎక్కడైనా సక్సెస్ అనేది ఇంపార్టెంట్.. 360 డిగ్రీస్‌లో ఎవరూ కనిపించరు. కానీ నేనున్న ఈ స్థితిలో.. ఢమరుకం తర్వాత నేనున్న స్థితిలో నేను పడుతున్న స్ట్రగుల్స్ అన్ని చూసి మాటిచ్చి.. మాట కోసం ఈ చిత్రం తీసారు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చి.. పక్కనుండి నడిపిస్తున్నారు. ప్రతీ విషయంలో నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను బతికున్నంత వరకు ఆయన్ని మాత్రం నేను వదలను. మళ్లీ నాకు ఓ మార్గాన్ని చూపించారు. చాలా థ్యాంక్స్ అన్నా. సినిమా గురించి చెప్పాలంటే మేం చేసినటువంటి రాగల 24 గంటల్లో సినిమా కచ్చితంగా నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుంది. తమ సినిమా గురించి ఎవరికి వాళ్లు అలాగే చెప్పుకున్నా కూడా నిజంగానే మంచి సినిమా చేసాం. ఈ సినిమాకు మంచి ఆర్టిస్టులు దొరికారు.. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. సత్యదేవ్ నిజంగా గొప్పనటుడు.. హీరోయిన్ కోసం చాలా మందిని అనుకుంటున్న తరుణంలో అ.. సినిమా చూసాను. ఈ సినిమాలో అమాయకంగా ఉంటుంది.. పర్ఫార్మెన్స్ చేయాలి.. అలాంటి కారెక్టర్‌కు ఇషా రెబ్బా అయితే పర్ఫెక్ట్ అనిపించి పెట్టుకున్నాను. చాలా మంది తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలనుకుని తీసుకున్నాను. ఇషా రెబ్బా కూడా చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమా తర్వాత నయనతార, అనుష్క లాంటి అందమైన తెలుగు హీరోయిన్ వచ్చింది అనుకుంటారు.. శ్రీరామ్ గారు కూడా అద్భుతంగా నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసాడు. మిగిలిన వాళ్లు కూడా అంతా బాగా చేసారు అని తెలిపారు.హీరోయిన్ ఇషా రెబ్బా మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ తెలుగుమ్మాయికి హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు రావడం చాలా అదృష్టం కావాలి. అనుష్క, నయనతార లాంటి వాళ్ల డేట్స్ దొరిక్క నా దగ్గరికి వచ్చారని చెప్పారు.. నన్ను ఈ పాత్రలో తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిజంగానే తెలుగమ్మాయిలకు ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. మీ లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఇంకా మేం ఉన్నాం ఇండస్ట్రీలో. శ్రీనివాస్ రెడ్డి గారూ కామెడీ సినిమాలు చేసారు కదా.. సస్పెన్స్ ఎలా చేసారని చాలా మంది నన్ను అడిగారు. కానీ ఆయన అలాంటి ఒకే జోనర్ దర్శకుడు కాదు. ఢమరుకం చేసారాయన.. మాకు కూడా కథ చెప్పినపుడు కానీ సెట్లో కానీ ఎక్కడా కామెడీ చేసినట్లు అనిపించలేదు. పైగా ఆయన ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ షూట్ చేసినా.. రాత్రి 2 గంటలకు షూట్ చేసినా కూడా ప్రశాంతంగా కనిపించారు. సినిమాలో అంతా బాగా నటించారు. సత్యదేవ్ కూడా అద్భుతంగా నటించాడు. కాంపిటీటివ్‌గా అనిపించాడు.. ఈయన తెలుగు ఇండస్ట్రీలో విక్కీ కౌశల్.. మంచి ఆఫర్ వస్తే రేంజ్ మారిపోతుంది. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. సంగీతం రఘుకుంచె గారు చాలా బాగా చేసారు. ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది.. ఇలాంటి చిత్ర యూనిట్‌తో పని చేయడం అద్భుతంగా అనిపించింది అని తెలిపారు.హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. నేను సాధారణంగా లాస్ట్‌లో మాట్లాడుకుంటాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడటానికి పాయింట్స్ తీసుకోవచ్చని. కానీ ఇప్పుడు మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడొద్దని ఫిక్సైపోయాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేం ఉండదు. రాగల 24 గంటల్లో సినిమా గురించి చెప్పాలంటే.. కథ విన్న తర్వాత భయపడ్డాను. రాహుల్ అనే పాత్ర చేయడానికి భయపడ్డాను.. 100 పర్సెంట్ ఇవ్వగలనా లేదా అని భయపడ్డాను. ఈ కారెక్టర్ తీసుకోడానికి ప్రధాన కారణం రాసిన విధానం. వీళ్లంతా నన్నంతా బాగా పొగిడేసరికి హ్యాపీ అనిపించింది కానీ ఒక్క విషయం చెప్పాలి.. స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ అన్నారు కానీ కథ కూడా అద్భుతంగా ఉంది. కారెక్టరైజేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. నాది, ఇషా, శ్రీరామ్, రవి అంతా అద్భుతమైన కారెక్టర్స్ ఉన్నాయి. ఓ ఏడాది కష్టపడి స్క్రిప్ట్ రైటర్స్ అంతా కష్టపడి రాసినపుడు మేం ఈజీగా విని కథ సెలెక్ట్ చేసుకుంటాం. నిర్మాత కానూరి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. సినిమాటోగ్రఫర్ అంజి ఆయనకు కుడికన్ను.. థ్రిల్లర్ సినిమాలకు డిఓపి ముఖ్యం. రవన్న నాకు ఓ విషయం చెప్పాడు.. ఫస్ట్ సీన్ నుంచి థ్రిల్లర్స్ అనేది ఎంగేజ్ చేయాలి. ఇంత మంచి కథ రాసి స్క్రీన్ ప్లే రాసినందుకు థ్యాంక్స్. వాసన్న నీ మంచితనం ఇండియన్ గవర్నమెంట్ చూస్తే అవార్డు ఇస్తారు. అంత జెన్యూన్ పర్సన్‌ను నేనెప్పుడు కలవలేదు. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ ఆయన.. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.. ఇక దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా కూల్. వీళ్లిద్దరి గురించి సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది.. అలాగే అద్భుతమైన కథ కూడా ఉంది అని తెలిపారు.

    నిర్మాత కానూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్యదేవ్ చాలా అద్భుతమైన నటుడు. ఈయన చాలా సినిమాలు చేసాడు. కానీ సరైన సినిమా పడలేదు. బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమా ప్రీమియర్ చూసి అప్పుడే చెక్ ఇచ్చాం.. మీ డేట్స్ ఎప్పుడిచ్చినా సినిమా చేస్తామని చెప్పాం. ఇక హీరోయిన్ వేట మాత్రం చాలా వరకు సాగింది. అనుష్క, కాజల్, రెజీనా లాంటి చాలా మంది నటీమణులు కథ విన్న తర్వాత డేట్స్ కుదరక చివరికి ఇషా రెబ్బా గారు వచ్చారు. తెలుగందంతో పని చేసామని గర్వంగా చెబుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె గారూ అద్భుతంగా సంగీతం అందించారు. నా సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటాను.. నేనో మంచి సినిమా తీసాను.. అందరూ చూడండి.. శుక్ర, శనివారాలు తలా ఒక్కరు 100 టికెట్స్ కొని సాయం చేయండి. నవంబర్ 22న రెండు సినిమాలే ఉన్నాయనుకుని ప్లాన్ చేసాను. కానీ 10 సినిమాలు వస్తున్నాయి. అయినా కూడా రేటింగ్స్ విషయంలో కూడా నా సినిమా ముందే ఉంటుంది.. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారూ చాలా అద్భుతంగా చేసారు. ఆయన గురించి నాకు తెలుసు.. మంచి పనితనం ఉన్న మనిషి. రాగల 24 గంటల్లో కచ్చితంగా 2019లో ఓ అద్భుతమైన సినిమాగా పేరు తెచ్చుకుంటుంది.. అని తెలిపారు.

Vijay sethupathi “Pizza 2” Release date

విజయ్ సేతుపతి, గాయత్రి హీరోహీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పురియత్ పుధీర్’. తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ‘పిజ్జా-2’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి నటించించిన ‘పిజ్జా’ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు తెలుగులో ‘పిజ్జా 2’ గా టైటిల్ ఖరారు చేశారు. డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై  ఉదయ్ హర్ష వడ్డేల్ల,  డి.వి.వెంక‌టేష్, సంయుక్తంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపొందించబడింది. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Nabha Natesh’s Crazy Tribal Photoshoot gleams Glamour.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన నభా నటేష్ ఎప్పుడూ తన లేటెస్ట్ లుక్స్
తో  ఆకట్టు కుంటుంది. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ
ఇస్మార్ట్ గాళ్ డిస్కోరాజా లో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది.
ఇక డిసెంబర్ మొదటి వారం లో సాయి ధరమ్ తేజ్ కు జంట గా  నటిస్తున్న   “సోలో
బ్రతుకు సో బెటర్ ”  షూటింగ్ కు హాజరవుతుంది.

నభా ఫోటో షూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంటాయి. డిఫరెంట్
లుక్స్ తో యూత్ ని ఇంప్రెస్ చేస్తున్న నభా టాలీవుడ్ లో ప్రత్యే కమైన
ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రతి సారి తనను తాను కొత్త గా ప్రజెంట్
చేసుకొనే నభా ఈ సారి ట్రైబల్  థీమ్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది. ఈ హాట్
లుక్స్ తో నభా మరోసారి యూత్ ని లాక్ చేసింది

“SUSAIDE CLUB” movie review

MOVIE NAME:-”SUSAID CLUB”
BANNER:-3i films
STARRING : Shiva ramachandravarapu,Praveen yandamuri,Chandana,Sandeep reddy,Venkata krishna,Saketh
DIRECTOR : Srinivas bogadapati
PRODUCERS:-3i films & Praveen Prabhu       venkatesam
MUSIC DIRECTER : Kunni gudipati
EDITOR:-de selva.

క‌థః

ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల‌నుకునే ఆరుగురు వ్య‌క్తుల‌ క‌థ‌తో ఈ ఫిలిం రూపొందింది. ఓ వ్య‌క్తి మిగిలిన ఐదుగురు వ్య‌క్తుల‌ను ఎందుకు చావాల‌నుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో క‌థ ర‌న్ అవుతుంది. అయితే. ఒక్కొక్క‌రు త‌మ క‌థ‌ల్ని వినిపిస్తుంటారు. అందులో హీరోయిన్ ప్రియ భ‌ర్త‌గా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామ‌నీ, త‌ర‌వాత‌ వేరే హీరోతో ఎఫైర్‌తో న‌న్ను వ‌దిలేసింద‌ని వెల్ల‌డిస్తాడు. అత‌ను ఎందుకు అలా చేశాడ‌నే క్ర‌మంలో అత‌ని మోటివేటివ్ చేస్తూ ఐదుగురులో ఓ అమ్మాయి త‌నకు తెలిసిన జ్ఞానంతో చెపుతుంది. అది ఎలా ఏమిటి? అనేది క‌థ‌. అసలు సూసైడ్ క్ల‌బ్ ఎందుకు పెట్టాల్సివ‌చ్చింద‌నేది ఆస‌క్తిక‌రంగా వుంటుంది. ముందుగా ఇందులో న‌టించిన ఐదుగురు చావాల‌నుకుంటారు అనే క‌థాంశంతో తీసుకెళ్తూ చివ‌ర‌గా చ‌నిపోవ‌డానికి అక్క‌డ‌కు వ‌చ్చింది ఒక్క‌రే అన్న ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

విశ్లేష‌ణః

నిడివి 45 నిముషాల‌పాటు సాగుతోంది. ఇది హిందీ, తెలుగు భాష‌ల‌లో నిర్మించారు. ఇందులో న‌టించిన వారంతా త‌మ పాత్ర‌ల‌కు న‌యం చేశారు. చాలా సింపుల్ క‌థాంశంతో వున్న ఈ పాత్ర‌ల‌కు ఎవ‌రికి వారు బాగానే న‌టించారు. అస‌లు ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు చేసుకోవాల‌నే వారికి ఈ ఫిలిం ఓ క్లారిటీ వుంటుంది. ఒకే లొకేష‌న్‌లో ఒకే టైంలో ఆరుగురు వ్య‌క్తుల‌తో క‌థ‌ను ఆస‌క్తిగా న‌డిపించాడు. అయితే ఇది కేవ‌లం ఓ ఎవేర్‌నెస్ కోసం తీసిందే.. ఆమెజాన్‌లో ఈ చిత్రంలో చూడ‌వ‌ల‌సింది. ద‌ర్శ‌కుడు త‌న‌కు తెలిసిన అనుభ‌వంతో ఈ చిత్రాన్ని తీశానడ‌నే చెప్పాలి. అలాగే ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రూ చాలా న్యాచ‌ర‌ల్‌గా మేక‌ప్ లేకుండా చేశారు.

న‌టీన‌టులుః

శివ‌రాంచంద్ర‌వ‌ర‌పు, ప్ర‌వీణ్ ఎండ‌మూరి, చంద‌నా, సందీప్‌రెడ్డి, వెంక‌ట‌కృష్ణ‌, సాకేత్‌సింఘ్ త‌దిత‌రులు న‌టించారు. వెంక‌ట‌కృష్ణ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఐదు నిముషాల అన్న డైలాగ్‌తో థాయేట‌ర్ మొత్తం చాలా హైప్‌ని క్రియేట్ చేసింది. చంద‌న కూడా సినిమా మొత్తంలో ఒకే ఒక్క లేడీ అయినా త‌న పాత్ర వ‌ర‌కు చాలా బాగా న‌టించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా కుదిరాయి. శ్రీ‌నివాస్ బొగ‌డ‌పాటి క‌థ‌ను ఎంత అద్భుతంగా రాశారో తీయ‌డం కూడా అంతే జాగ్ర‌త్త‌గా చాలా బాగా తీశారు. కెమెరా ఫొటోగ్ర‌ఫీ చాలా బావున్నాయి.

“Susaid club” Movie trail show

3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. సినిమా కు సంబందించిన అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో ట్రయిల్ షో ను నిర్వహించారు చిత్ర బృందం. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… నేను రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్ ను ఇంప్లిమెంట్ చేసి సినిమాటిక్ గా చేసిన చిత్రమే ‘సూసైడ్ క్లబ్’. కంప్లీట్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. శివ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఇక వెంకట్ ప్లే చేసిన రోల్ అయితే యూనిక్ గా ఉంటుంది. మా చిత్ర యూనిట్ లో ఉన్న 80 మందిలో చందన ఒక్కటే అమ్మాయి. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీసాడు అని చెప్పాలి. ఎడిటర్ శర్వా ఎడిటింగ్ స్కిల్స్ సూపర్ అనిపిస్తాయి. త్వరలో మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

హీరో శివ మాట్లాడుతూ… తెలుగు, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కించడం జరిగింది. అందులోకూడా ఓన్ గా డబ్బింగ్ చెప్పడం జరిగింది. డే అండ్ నైట్ షూట్ చేసాడు డైరెక్టర్. పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. ఒకసారి స్టోరీ వినగానే చేద్దాం అని చెప్పేశాను. అంత నచ్చింది నాకు ఈ చిత్రం. కొత్త వారి కొత్త ప్రయోగం చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. వెంకట్ మాట్లాడుతూ… నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా… టీమ్ అందరూ కష్టపడి చేసిన చిత్రం ఇది అన్నారు.

శివ రామాచద్రవరపు, ప్రవీణ్ యండమూరి, చందన, సందీప్ రెడ్డి, వెంకట కృష్ణ, సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం, మ్యూజిక్: కున్ని గుడిపాటి, ఎడిటర్: డే సెల్వ, ఆర్ట్: శాన్ నవార్, విజువల్స్: పవన్ కుమార్ తడక, కుమార్ నిర్మల సృజన్, సౌండ్: రాఘవ చరణ్.

“Miss match” Movie Trailer launched by directer Surender reddy

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బేన‌ర్‌పై ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్), ఐశ్వర్య రాజేష్(కౌస‌ల్య కృష్ణ‌మూర్తి ఫేమ్‌) హీరోహీరోయిన్లుగా `డాక్ట‌ర్ స‌లీమ్` వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మాత‌లుగా రూపోందుతోన్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుద‌ల‌కాబోతుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ ఫిలిం చాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రై `మిస్ మ్యాచ్` ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

క‌థ రచయిత భూపతి రాజా మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. రెండు కుటుంబాల మధ్య జరిగే కథను దర్శకుడు నిర్మల్ బాగా చూపించారు కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది“అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గిఫ్ట‌న్ మాట్లాడుతూ – నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి నా ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో అన్ని పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి నచ్చుతాయి అనుకుంటున్నాను“అన్నారు.

చిత్ర ద‌ర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ – ప్ర‌స్తుతం ట్రెండింగ్ డైరెక్ట‌ర్ అయిన సురేంద‌ర్‌గారు మా చిత్రం ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగులో నా మొద‌టి చిత్రం. హీరో ఉద‌య్‌గారు చాలా బాగా చేశారు. ఐశ్వ‌ర్య‌, ఉద‌య్‌ల కెమెస్ట్రీ బాగా కుదిరింది. డైలాగ్‌రైట‌ర్స్ బాగా రాశారు. మొద‌టిసారి మంచి స‌బ్జెక్ట్ ఇచ్చిన భూప‌తిరాజ్‌సార్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.ఇదొక చిన్న సినిమా మీఅంద‌రి స‌హ‌కారంఉండాల‌ని కోరుకుంటున్నా“అన్నారు.

ప్రొడ్యూస‌ర్ శ్రీ‌రామ‌రాజు మాట్లాడుతూ – మా చిత్రం డిసెంబ‌ర్ 6న విడుద‌ల కాబోతుంది. `సైరా నరసింహ రెడ్డి` లాంటి అద్భుత‌మైన‌ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మా ట్రైల‌ర్ రిలీజ్ చేసినందుకు నా ధ‌న్య‌వాదాలు. దర్శకుడు నిర్మల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భూపతి రాజా గారు మంచి కథ ఇచ్చారు. ఈ చిత్ర టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశారు. ఉదయ్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు “ అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…మా చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సురేందర్ రెడ్డి గారికి థాంక్స్, మంచి కథ, కథనాలు ఉన్న సినిమ ‘మిస్ మ్యాచ్’. నిర్మల్ కుమార్ గారు సినిమాను అందంగా తెరకెక్కించారు. తొలిప్రేమ చిత్రంలోని `ఈ మనసే`.. సాంగ్ ని ఈ సినినిమాలో రీమిక్స్ చేశాం, అందరికి నచ్చుతుంది. డిసెంబర్ 6న మీ ముందుకు వస్తున్న మా సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం అన్నారు.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ టైటిల్ బాగుంది. హీరో ఉదయ్ బాగా చేశాడు. కథ అందించిన భూపతి గారికి, డైరెక్టర్ నిర్మల్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. డైరెక్టర్ నిర్మల్ తమిళ్ లో చేసిన చదరంగ వెట్టై పెద్ద హిట్, అదే విధంగా తాను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ‘మిస్ మ్యాచ్’ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను, ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గుడ్ లక్. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది“ అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘మిస్ మ్యాచ్’ ట్రైలర్ విడుదల, డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు..

hero vijay antoni New movie “Jwala“ firstlook.

‘బిచ్చగాడు’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ పొందారు విజయ్‌ ఆంటోనీ. కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ మంచి ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్, అక్షరా హాసన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెడీ అవుతున్న క్రేజీ సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాను తెలుగులో ‘జ్వాల’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ఈ రోజు హీరో విజయ్‌ ఆంటోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాము. చిత్రీకరణ తుది దశలో ఉన్న ‘జ్వాల’ విశేషాల గురించి చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘ జ్వాల’ తొలి షెడ్యూల్‌ను చెన్నై, కోల్‌కత్తా వంటి లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఆ తర్వాతి షెడ్యూల్‌ను మాస్కో, రష్యా వంటి దేశాల్లో కనువిందైన లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్‌ చేస్తున్నాం. కజకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న తొలి ఇండియన్‌ సినిమా మాదే అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. విజువల్‌ ఫీస్ట్‌గా మా సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు యాక్షన్‌ మూవీ లవర్స్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సినిమా అవుట్‌పుట్‌ చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. దర్శకుడు నవీన్‌ అద్భుతమైన విజన్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్, ఆడియో, చిత్ర రిలీజ్‌ వివరాలు తెలియజేస్తాం’’ అని తెలిపింది. రైమా సేన్, ప్రకాశ్‌ రాజ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నటరాజన్‌ శంకరన్, కెమెరా: కేఏ బట్చా, సమర్పణ– అమ్మ క్రియేషన్స్‌ టి.శివ, నిర్మాతలు–జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.