Home Blog Page 1015

Megastar Chiranjeevi’s ‘Sye Raa’ 50 days celebrations & watch ‘Sye Raa’ movie Amazon prime

భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రం నేటితో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మెగా అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా తప్పక చూడాల్సిన చిత్రం అని మెచ్చుకున్నారు

నరసింహారెడ్డి పాత్రలో చిరు నటనకు తెలుగు జనం నీరాజనాలు పట్టారు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది.మొత్తం 30 సెంటర్లలో సినిమా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన సినీ కేంద్రాల్లో ఈరోజు సాయంత్రం అర్థశతదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు.

కాగా ఈ నెల 21వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో హెచ్‌డీ ప్రింట్‌ తో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది.ఇకపోతే ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టే సన్నాహాల్లో ఉన్నారు.

producer tummalapalli rama satyanarayana grand daughter tanuja marriage

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.. మనవరాలు తనుజా వివాహం.పాలకొల్లు కి చెందిన శ్రీ దాసరి మనోజ్ తో
14 వ తేదీన గణపవరం లో రంగ రంగ వైభవం గా అతిరథమహారధులు సమక్షంలో జరిగింది..
అతిధులు గా మాజీ ముఖ్యమంత్రి ..తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొనిజీటీ రోశయ్య గారు…
భీమవరం ఎంపీ శ్రీ కనుమూరి రఘు రామ కృష్ణం రాజు గారు..
MLA గ్రంధి శ్రీనివాస్ గారు..
MLA శ్రీ వాసు బాబు గారు.
శ్రీ VV వినాయక్ గారు..
ప్రముఖ నటుడు శ్రీ సుమన్ గారు..
రామగోపాల్ వర్మ గారు.
దర్శకుడు శ్రీ సాగర్ గారు.తెలుగు నిర్మాతలు మండలి కార్యదర్శి శ్రీ మోహన్ వడ్లపట్ల గారు.
జడ్జి శ్రీ మాల్యాద్రి గారు.
బన్నీ నిర్మాత MSN రెడ్డి.. మరియు
నగర ప్రముఖులు అనేకమంది విచ్చేసి నూతన వధువు. వరులకు ఆశీస్సులు అందజేశారు.💐

Tollywood Producer Producing Bollywood Movie “KHWAB SARE JHOOTEY”

Tollywood prominent production house.Glitters film academy producing bollywood movies along with ag entertainment. “KHWAB SARE JHOOTEY”directed by glitters film academy chairman deepak baldev thakur.Ace cameraman of tollywood mr jawahar reddy is the cinematographer of this love story which popular model tullika sing debut with this women cetric film.which also has madhu narayanan and others in key role’s.Gfa and ag entertainment will be producing yearly 5 films in various languages.currently stepped into bhojpuri industry aswell and very soo will be stepping into tollywood.
                     “KHWAB SARE JHOOTEY” story of young women who wants to achieve her dreams without realizing the ramifications of her actions.Debut actress tulika singh has lived the character and performed her best which will get her many awards says Deepak baldev thankur.Passionate young producer ajay gautam has plans to encourage new talent and deliver content based film he has supported for “KHWAB SARE JHOOTEY” to the best.”KHWAB SARE JHOOTEY” will have all india release on 14 Feb 2020.Audio will out in December.

TRS MP Contestant, Leader Talasani Sai wishes to George Reddy

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం
జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమా గురించి ఇటు
ఇండస్ట్రీలో అటు జనాల్లో ఆసక్తి నెలకొంది.మరోవైపు ఎబివిపి,పీడియస్ యూ
విద్యార్థి సంఘాల కామెంట్స్ తో హాట్ టాపిక్ అయింది ఈ చిత్రం.ఇండస్ట్రీ
పెద్దలు కూడా ఈ సినిమాకు సహాయపడుతున్నారు.ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు
సినిమా ట్రైలర్ గురించి మాట్లాడగా..రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మూవీ
లోని సాంగ్ ను రిలీజ్ చేసి సహాయపడ్డారు.  విజయ్ దేవరకొండ,నితిన్,సాయి
ధరమ్ తేజ్, నిఖిల్,విశ్వక్ సేన్,పూరీ జగన్నాథ్,రామ్ గోపాల్ వర్మ,సుకుమార్
లు ట్రైలర్ షేర్ చేసి బెస్ట్ విషస్ తెలిపారు. ఇటు రాజకీయ నాయకుల్లో ఈ
సినిమాపై ఆసక్తి నెలకొంది.టీఆర్ ఎస్ లీడర్,సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి
పోటీ చేసిన తలసాని సాయి ఈ సినిమా టీమ్ ను అభినందించారు.సినిమా దర్శకుడు
జీవన్ రెడ్డి, నిర్మాతలు అప్పిరెడ్డి,సంజయ్ రెడ్డి,దామురెడ్డిలకు
,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా లకు విషస్ తెలిపారు.ఈ శుక్రవారం రిలీజ్
కాబోతున్న ఈ మూవీ పెద్ద హిట్ కావాాలని ఆకాంక్షించారు.

Rajamouli “RRR”Movie Update

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పీరియాడిక‌ల్ డ్రామా `RRR`. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా భారీ బడ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. విప్ల‌వ యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ రెండు నిజ‌మైన‌ లెజెండ్రీ పాత్ర‌ల‌కు సంబంధించిన ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామా ఇది. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్ , ఆలియా భ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
రామ్‌చ‌ర‌ణ్ జోడిగా ఆలియా భ‌ట్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. ఎన్టీఆర్ స‌ర‌స‌న బ్రిటీష్ న‌టి ఒలివియా మోరిస్‌ న‌టించ‌నున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే అలిసన్ డూడీ, రే స్టీవెన్ స‌న్ మెయిన్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. `ఎ వ్యూ టు కిల్‌`, `ఇండియానా జోన్స్‌`, `లాస్ట్ క్రూసేడ్‌` వంటి చిత్రాల్లో ఐరిష్ న‌టి అలిస‌న్ డూడీ న‌టించారు. అలాగే `థోర్‌`, `కింగ్ అర్థ‌ర్‌` స‌హా  ప‌లు పాపుల‌ర్ టీవీ షోస్‌లో రే స్టీవెన్ స‌న్ న‌టించారు.
అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2020లో .. 10 భాష‌ల్లో  ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

Bhagya Nagara Veedullo Gammathu Trailer Launched by VARUN TEJ

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం మెగ్రాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు. సినిమా ట్రైల‌ర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. సినిమా ఇంత‌కు మించి ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు వ‌రుణ్‌తేజ్‌.
                    ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.
న‌టీన‌టులు:
శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్, స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం:  వై.శ్రీనివాస‌రెడ్డి
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే: ప‌ర‌మ్ సూర్యాన్షు
మ్యూజిక్‌:  సాకేత్ కొమండూరి
సినిమాటోగ్ర‌ఫీ:  భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌
ఎడిట‌ర్‌:  అవుల వెంక‌టేశ్
ఆర్ట్‌:  ర‌ఘు కుల‌క‌ర్ణి
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  చిత్రం శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ధ‌నుంజ‌య కుమార్‌
ఎగ్జిక్యూష‌న్‌:  నారాయ‌ణ జంప‌
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌

Superstar fans thrilled with the unique teaser concept of “Sarileru Neekevvaru”

సూపర్‌స్టార్‌ మహేష్‌ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ గా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను  22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

ఎకె ఎంటర్టైన్మెంట్స్  అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక అన్‌లాక్ ఫీచర్‌తో  ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను నవంబర్ 19న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే..  ఈ కొత్త కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా టీజర్ డేట్, టైమ్ ను రీవీల్ చేయడానికి ట్విట్టర్ లో అనుసరించిన కొత్త తరహా కాన్సెప్ట్  సూపర్ స్టార్  అభిమానులను థ్రిల్ చేసింది. ఈ తరహా నూతన ప్రయత్నం తో టీజర్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సోషల్ మీడియా సర్కిల్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్ లో మొట్ట మొదటి సారి చేసిన ఈ తరహా ప్రయోగం తో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ తమ ప్రమోషన్స్ నీ ఘనంగా ప్రారంభించింది.

‘సరిలేరు నీకెవ్వరు’  టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటినుండి  ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో  ఉండడంతో  ఇదే జోష్, ఎనర్జీతో  ‘సరిలేరు నీకెవ్వరు’  ప్రమోషనల్ టీమ్ రాబోయే వారాల్లో, చిత్రం విడుదలకు ముందే మరెన్నో వినూత్న ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. అందరు ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నవంబర్ 22న సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Prabhudeva & Nivetha Pethuraj Starring “Krishna Manohar IPS”

పోకిరి చిత్రాన్ని హిందీలో ‘వాంటెడ్’ పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. పోకిరిలో మహేష్ బాబు పోషించిన డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పేరు ‘కృష్ణమనోహర్’ అన్న విషయం తెలిసిందే.  పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభుదేవా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో సైమల్టేనియస్ గా ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ప్రేమికుడుగా, దర్శకుడిగా అలరించిన ప్రభుదేవా.. సంఘవిద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని నిర్మాత ఆర్.సీతారామరాజు చెబుతున్నారు.
ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్!!

Every One Should know “George reddy” Story..producers….Appi reddy,Damodar reddy,Sanjay reddy

సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జిరెడ్డి’’.. విడుదలకు ముందే  అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జిరెడ్డి’’ సినిమా ఈ నెల 22 రిలీజ్ కు రెడీ అయింది. ఈ  సినిమా జర్నీ ని మీడియా సమావేశంలో పంచుకున్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, దామోదర రెడ్డి ,సంజయ్ రెడ్డి.

ఈ సందర్భంగా
అప్పిరెడ్డి మాట్లాడుతూ: ‘మైక్ టివి ద్వారా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం.. ఒకసారి దామోదర్ రెడ్డి, జీవన్ రెడ్డి లు జార్జిరెడ్డి కథ గురించి చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లు కాకుండా జార్జిరెడ్డి కథ లో ప్రత్యేకత నన్ను ఆకర్షించింది. అందుకే మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా ఖర్చు పెట్టాం. ఉస్మానియా సెట్ ను నిర్మించాం.. ఆ టైం ని తెరమీదకు తీసుకొచ్చేందుకు చాలా రీసెర్చ్ చేసాం. ఇప్పుడు మా అంచనాలను మించి జార్జిరెడ్డి వస్తున్న స్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. డైరెక్టర్ జీవన్ రెడ్డి , దామోదర్ రెడ్డి,సినిమాటోగ్రఫర్ సుధాకర్ రెడ్డిలు ఈ సినిమాకోసం చాలా రీసెర్చ్ చేసారు. జార్జ్ రెడ్డి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిినిమా తెరకకెక్కించాం.ఈ కథ తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. జార్జిరెడ్డి అందరి అంచనాలను అందుకుంటాడనే నమ్మకం ఉంది’ అన్నారు.

దామోదర్ రెడ్డి మాట్లాడుతూ: ‘ దళం తర్వాత జీవన్ ఉస్మానియాలో 5 నెలలు ఈ కథ రీసెర్చ్ కోసం గడిపాడు. జార్జిరెడ్డి ప్రెండ్స్ అందరినీ కలిసాడు. అతని గురించి విన్నప్పడు ఒక కమర్షియల్ హీరో కి ఉండే ఎలిమెంట్స్ అన్నీ కనిపించాయి. ఒక మేథావి, ఫైటర్, అన్యాయాలను ఎదుర్కోవడంలో ముందుండే లక్షణం ఇవన్నీ కూడా ఒక హీరో ఇమేజ్ కుండే లక్షణాలే. అందుకే జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం లేదు, ఆ కథలోనే హీరోయిజం ఉంది అనిపించింది. అందుకే ఇమేజ్ ఉన్న హీరోల కోసం ప్రయత్నించలేదు. ఏదైనా ఉద్యమం లో గానీ, ఆర్గనేజేషన్ లోగానీ మంచి చెడులు ఉంటాయి. వాటని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేసాం అంతే కానీ ఎవర్నీ హీరోలను, విలన్లుగా చూపించలేదు. జార్జిరెడ్డితో ఈ తరం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది. ఉస్మానియా సెట్ నుండి జూనియర్ ఆర్టిస్ట్ ల  క్యాస్టూమ్స్ వరకూ ప్రతిదీ డిటైల్డ్ గా వర్క్ చేసాం. ఆ క్వాలిటీ మీకు తెరమీద కనిపిస్తుంది. ఉస్మానియా క్యాంపస్ లో జరిగిన సంఘటలను ఆసక్తిగా ఉంటాయి. ఈ జర్నీలో సినిమాటోగ్రర్ సుధాకర్ యెక్కంటి సహకారం మరువలేనిది.తన బాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నా కానీ..ఈ సిినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు.ఈ సినిమాను తన బేబి గా తీర్చిదిద్దారు. ’ అన్నారు.

సంజయ్ రెడ్డి మాట్లాడతూ:
‘ఈ సినిమా గురించి అప్పిరెడ్డి ని కలసి నప్పుడు తెలిసింది.  ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు చూసాను. జీవన్, దామోదర్,సుధాకర్ ల మాటలలో
సినిమా పై ఒక ప్యాషన్ కనపడింది అందుకే నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయ్యాను. ట్రైలర్ తో జార్జిరెడ్డి ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసాడు.పరిశ్రమ మొత్తం జార్జిరెడ్డిని స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ కొత్త కథలకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడుకనిపిస్తున్న ట్రెండ్ చాలా ఆరోగ్యకరంగా ఉంది. మెగా ఫ్యామిలీ జార్జిరెడ్డి కి పెద్ద సపోర్ట్ గా నిలిచింది. నాగబాబు గారు, చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కి చాలా మోరల్ సపోర్ట్ గా నిలిచారు. సినిమా తప్పకుండా ఒక ప్రత్యేకమైన ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రివ్యూలకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. షోస్ డిమాండ్ ని బట్టి పెరుగుతున్నాయి. జార్జిరెడ్డి సినిమా పై పెరుగుతున్న అంచనాలను తప్పకుండా అందుకుంటాడు. ’ అన్నారు.
‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్
మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్
రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్,
అభయ్,మహాతి ఇతర నటీనటులు.

“RRR” సినిమా లో తారక్ కు విలన్ గా నటించేది.. హాలివుడ్ నటి ఆలిసన్ డూడీ నా ???

ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు సంబంధించి వస్తున్న తాజా అప్‌డేట్స్ ఫ్యాన్స్‌‌లో ఎగ్జైట్‌మెంట్‌ని పెంచేస్తున్నాయి. ఈరోజు సినిమాలో తారక్‌కు జోడీగా నటించేబోయే అమ్మాయిని, విలన్‌ను ప్రకటించబోతున్నారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి 70 శాతం షూటింగ్ అయిపోయినట్లు చిత్ర వర్గాలు నిన్నే ప్రకటించింది. అయితే ఇందులో తారక్‌కు జోడీగా నటించేబోయే పాత్ర గురించి, విలన్‌ పాత్రకు సంబంధించిన వివరాలను ఈరోజు ప్రకటించనున్నట్లు తెలిపింది
ఈ నేపథ్యంలో తారక్ హీరోయిన్, విలన్ వీళ్లేనంటూ ఇద్దరు భామల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తారక్‌కు జోడీగా ఒలీవియా అనే విదేశీ అమ్మాయిని ఎంపిక చేసుకున్నారట. మొదట్లో డైసీ ఎగ్డార్‌జోన్స్ అనే బ్రిటన్ నటిని ఎంపిక చేసుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి రాజమౌళి ఎన్టీఆర్ భార్య పాత్రలో ఎవర్ని తీసుకుంటే బాగుంటుందా అని చాలా ఆలోచించారు. ఇకపోతే ఇందులో ఐర్లాండ్‌కు చెందిన నటి ఆలిసన్ డూడీ అనే 53 ఏళ్ల హాట్ బ్యూటీని విలన్‌గా ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆలిసన్ ‘ఇండియానా జోన్స్’, ‘ది లాస్ట్ క్రుసేడ్’, ‘కింగ్ సోలోమాన్స్ మైన్స్’, ‘డివిజన్ 19’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో న నటించారు.
ఆమైతే సినిమాలో విలన్‌గా సరిపోతారని భావించిన రాజమౌళి తనను పిలిపించి ఆడిషన్ కూడా చేశారట. ఆలిసన్ స్క్రీన్ ప్రెసెన్స్‌ రాజమౌళికి చాలా నచ్చిందట. ఆమెతో పాటు ఐర్లాండ్‌కు చెందిన రేమండ్ స్టీవెన్సన్ అనే మరో నటుడ్ని విలన్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొద్ది సేపు ఆగాల్సిందే. ఈ సస్పెన్స్‌కు ‘ఆర్ ఆర్ ఆర్’ టీం ఈరోజు తెర దించనుంది. ఇకపోతే రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020 జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.