Home Blog Page 1016

I feel lucky to be playing the first female-centric film ….heroin Esha Rebba.

‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ‘బందిపోటు’,’అమీతుమీ’.’అ!’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయింది ఈషా రెబ్బ. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో నటించి ఒక పక్క అందంతో మరో పక్క అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని దక్కించుకుంది ప్రస్తుతం సత్యదేవ్, ఈషారెబ్బహీరో హీరోయిన్లుగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై శ్రీనివాస్‌ కానూరు నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రాగల 24 గంటల్లో..?.నవంబర్‌ 22న సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సందర్భంగా హీరోయిన్ఈషారెబ్బ ఇంటర్వ్యూ.

ఫస్ట్ టైమ్ విమేన్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు కదా! ఎలా అనిపించింది?
– మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమా అవకాశాలు రావడం చాలా అరుదు. నాకు ఈ అవకాశం రావడం తో మానసిక ఆందోళనకు గురయ్యాను.నేను నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ మూవీ కావడంతో అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రంలో అందరి టెన్షన్స్ తనే తీసుకునే విద్య అనే పాత్రలో కనిపిస్తాను.జనరల్ గా నేను ఏ కథ విన్నా ముందే విజువలైజ్ చేసుకుంటాను.. కంప్లీట్ కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. దాంతో సినిమా మొత్తం నా భుజాలపై మోయాల్సి వచ్చింది. అలాగే నా పాత్రలో స్ట్రగుల్, ఫైట్, కోపం లాంటి చాలా ఎమోషన్స్ ఉంటాయి.

సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఎలా ఉండాలని కోరుకుంటారు?
– సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది గెస్ చేయలేకుండా ఉండాలి.ఈసినిమా 24 గంటల్లో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్. నాకు ఈ కథలో అలాంటి ఎలిమెంట్స్ చాలా కనిపించాయి. ఎందుకంటే నేను స్టోరీ వింటున్నపుడే నేను క్లైమాక్స్ గెస్ చేయడానికి ట్రై చేశా.. కానీ అలా కాకుండా కథ చాలా డిఫెరెంట్ గా క్లోజవుతుంది. నాకు వినగానే సర్ ప్రైజింగ్ అనిపించింది. రేపు థియేటర్స్ లో ఆడియెన్స్ కి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది.

ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిగా ఉండటం?
– తెలుగు అమ్మాయిని కాబట్టి మన సంప్రదాయాలకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. అవకాశాలు రావు అని నేను అనుకోవడం లేదు. తెలుగు అమ్మాయిలు కూడా అన్ని రకాల పాత్రలలో అద్భుతంగా నటించగలరు అని నిరూపించాలని, నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం పరిశ్రమలో చాలా మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు .నాకిప్పటివరకు గ్లామరస్ హీరోయిన్ అనిపించుకునే అవకాశం దొరకలేదు. కానీ ఈ సినిమాలో నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను. బేసిగ్గా నేనెప్పుడూ హాటే.గ్లామరస్ పాత్రలకు సిద్ధమే..

ఈమధ్య మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ ఫోస్ట్ చేస్తున్నారు ?
– నాలో ఆ హాట్‌నెస్‌ ఉంది కాబట్టే పోస్ట్ చేస్తున్నాను. అయినా దానిలో తప్పేం ఉంది. నిజానికి మన ఫిల్మ్ మేకర్స్‌ నన్ను ఒకేరకమైన పాత్రల్లో చూపిస్తున్నారు. నేను కూడా గ్లామర్ పాత్రలకు సూట్ అవుతానని చెప్పడానికే సోషల్ మీడియాలో అలా కొన్ని ఫోటోస్ పోస్ట్ చేశాను.

శ్రీనివాస్ రెడ్డి తొలిసారి ఈ జోనర్లో సినిమా తీస్తున్నారు కదా! మేకింగ్ ఎలా అనిపించింది?
– డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి థ్రిల్లర్ చేయడం ఫస్ట్ టైమ్. అయినా అద్భుతంగా తెరకెక్కించారు, ఆయన ప్రతి సీన్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. పర్టికులర్ గా క్యారెక్టర్స్ విషయంలో ఏ క్యారెక్టర్ ఎలా చేయాలన్నది ముందే ఖచ్చితంగా ఫిక్సయ్యారు. ఈ జానర్ లో అనుభవం ఉన్న దర్శకుడి లాగానే చేశారు.

ఏ విదంగా సినిమాను సెలెక్ట్ చేసుకుంటారు?
– ముందు ఖచ్చితంగా కథకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఆ తరవాత డైరెక్టర్ టాలెంట్ ఏంటి అనేది చూస్తాను. కొత్తవాళ్ళైనా సమస్య లేదు కానీ, ఖచ్చితంగా ఆ సినిమాని ఎలా ప్రెజెంట్ చేయాలి క్లారిటీ అయితే కచ్చితంగా ఉండాలి.

డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమా తర్వాత మిమ్మల్ని నయనతార తో పోల్చారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
– శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను నయనతారతో పోల్చినందుకు ఆయనకు థాంక్స్. రేపు రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ఎం చెప్పబోతున్నారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నా.
నిర్మాతల గురించి?
– కానురి శ్రీనివాస్. ప్యాసనేట్ ప్రొడ్యూసర్ సినిమా అంటే ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చారు,వారికి మంచి. సక్సెస్ రావాలి.‘రాగల 24 గంటల్లో.’ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం… ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని.. అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

తెలుగు లస్ట్ స్టోరీస్, వెబ్ సిరీస్ లలో నటించడం ఎలా ఉంది?
– నెటీఫ్లిక్స్ కోసం తెలుగు లస్ట్ స్టోరీస్ లో నటించాను. హిందీలో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ బాగా హిట్ అయింది. అక్కడ ప్రేక్షుకులకు బాగా కనెక్ట్ అయిన సిరీస్ అది. ఇప్పటికే దర్శకుడు సంకల్ప్ రెడ్డి రెండు ఎపిసోడ్స్ ను తెరకెక్కించారు. ఆ ఎపిసోడ్స్ లో నాతో పాటు సత్య దేవ్, అవసరాల శ్రీనివాస్ కూడా నటించారు. నా పాత్ర కొత్తగా ఉంటుంది. మార్చిలో మా వెబ్ సిరీస్ ను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే మీకే తెలుస్తోంది.

మీ తదుపరి చిత్రాలు ఏంటి?
– తమిళంలో జీవీ ప్రకాష్ తో ఓ సినిమా చేశాను. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలో నటించబోతున్నాను. ఒక తెలుగు సినిమాకు చర్చలు జరుగుతున్నాయి..

‘రాగల 24 గంటల్లో’ కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది – హీరోయిన్ఈషారెబ్బ

నవంబర్‌ 22న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రిలీజ్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను 22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

“అర్జున్ సురవరం“ మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది, – హీరో నిఖిల్

హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అర్జున్ సురవరం’. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డిన ఈ చిత్రం చివరికి నవంబర్ 29 న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..

అర్జున్ సురవరం చిత్రం మేము ఎంతో శ్రమించి చేశాము. అన్యాయం ఎదిరించే ఒక రిపోటర్ పాత్రలో నేను నటించాను. చిత్ర నిర్మాణం సమయంలో నిర్మాతలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ సంతోష్ అద్భుతంగా ఈ సినిమా తీశాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో బాగా నటించింది, తన రోల్ అందరికి గుర్తుండిపోతుంది. సినిమాను థియేటర్ లొనే చూడండి, థియేటర్ లో చూస్తేనే ఈ సినిమా ఫీల్ తెలుస్తుంది, అందుచేతనే ట్రైలర్ కూడా థియేటర్ లొనే ప్లే చేశాము. నవంవర్ 29న వస్తున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి అన్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ…

అర్జున్ సురవరం ట్రైలర్ ఇలా థియేటర్ లో ఆడియన్స్ మధ్య విడుదలవ్వడం థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది,మీ అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉండబోతోంది, ట్రైలర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ సినిమాను థియేటర్ కు వచ్చి చూడండి, నా పై మీ ప్రేమ ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్న అన్నారు.

డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ…

నిఖిల్ తో వర్క్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. సినిమా చిత్రీకరణ సందర్భంలో సహకరించిన అందరికి స్పెషల్ థాంక్స్. నిర్మాత ఠాగూర్ మధు గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మంచి మెసేజ్ తో పాటు కమర్సియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. నాకు, నిఖిల్ కు మా చిత్ర యూనిట్ సభ్యులకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను. నవంబర్ 29న విడుదల కాబోతున్న మా అర్జున్ సురవరం సినిమాను మీ అందరూ చూసి హిట్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
బ్యాన‌ర్‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌
సంగీతం: సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
పి.ఆర్‌.ఒ: వంశీశేఖ‌ర్‌

సుకుమార్ చేతుల మీదుగా ది మోస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ “రాజావారు రాణిగారు” ట్రైలర్ విడుదల

  • కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. సందీప్ కిషన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి టీమ్ ని విష్ చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు. ఈ సందర్భంగాసుకుమార్ మాట్లాడుతూ… ఈ టీజర్ చూడగానే కాల్ చేశాను. కుర్రాడి వయసు 25 ఇయర్స్ కూడా ఉండవు. ఫస్ట్ టైం డైరెక్టర్ కి మ్యూజిక్ మీద విజువల్స్ మీద కమాండ్ ఉండడం చాలా గొప్పగా అనిపించింది. అందరూ కుర్రాళ్ళు బాగా కష్టపడ్డారు. ఎవ్వరికీ ఎక్సపీరియెన్స్ లేదు. ఆర్య టీమ్ లో ఉన్న అందరూ దాదాపుగా డైరెక్టర్స్ అయ్యారు. కథ చెప్పడంలో ఎంత క్లారిటీగా ఉన్నారో ట్రైలర్ కూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న. డైరెక్టర్ కి మంచి భవిష్యత్ ఉంది. పెద్ద డైరెక్టర్ అవుతాడు. మ్యూజిక్ చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ నిర్మాతలకు అల్ ఠె బెస్ట్. కిట్ట య్య నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. టోటల్ టీం కి ఆల్ ద బెస్ట్

    చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్లకు పల్లెటూరు ఎలా వుంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టిన్లు ఆవిష్కరించే చిత్రమిది. సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సుకుమార్ గారికి చాలా స్హాల థాంక్స్.  అని అన్నారు

    హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ… మా సినిమాను సుకుమార్ గారు సపోర్ట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ప్రివ్యూ కు అద్భుతమైన స్పందన వచ్చింది. హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
    దర్శకుడు రవి ఎంటర్టైన్మెంట్ ని ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు. అని అన్నారు.

దర్శకుడు… రవి కిరణ్ కోల
మ్యూజిక్ .. జయ్ క్రిష్
ప్రొడ్యూసర్స్.. మనోవికాస్.డి , మీడియా 9 మనోజ్

‘‘జార్జ్ రెడ్డి ’’ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నా – మెగాస్టార్ చిరంజీవి

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
జార్జిరెడ్డి అనే పేరుతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సినిమాలో కీలకంగా వచ్చే ‘అడుగడగుడు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు’అనే పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియొట్ చదువుకుంటున్నప్పుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు మీ సినిమా జార్జిరెడ్డి ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే మీ సినిమా ద్వారా మరోసారి వింటున్నాను. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు అక్కడి నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ఈ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. జార్జిరెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు.. ఏ రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి.. తప్పును ప్రశ్నించడం కోసం విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎదుర్కొన్నాడు అనేది ఈ పాటతో తెలుస్తుంది.అలాగే సినిమాను కూడా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు రావాలి. జార్జిరెడ్డి బాటలో ఈ యూనివర్శిటీ నుంచి చాలామంది వచ్చారు. జార్జిరెడ్డి వంటి అగ్రెసివ్ వ్యక్తుల కథలు ఇంకా రావాలి. ఈ సినిమా మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను.. ఇంత మంచి సినిమా తీసిన యంగ్ టీమ్ దర్శకుడు జీవన్ రెడ్డి, డివోపి సుధాకర్ రెడ్డి, ,నిర్మాతలు సంజయ్ రెడ్డి, అప్పిరెడ్డి,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’అన్నారు.

ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా కోసం పరిశ్రమ మొత్తంగా ఆసక్తిగా చూస్తోంది. .
‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్
మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటించిన ఈ మూవీలో ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ఇతర పాత్రల్లో ముస్కాన్,మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,మహాతి ఇతర నటీనటులు.

సాంకేతికవర్గానికి విషయానికి వస్తే
సంగీతం -సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,
ఆర్ట్- గాంధీ నడికుడికార్,
కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్,
ఫైట్స్ -గణేష్, ఆర్కే,
అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.
స్టిల్స్ -వికాస్ సీగు,
సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్
పి ఆర్ వో: జిఎస్ కె మీడియా
కో డైరెక్టర్ -నరసింహారావు,
అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.
కో ప్రొడ్యూసర్: సంజయ్ రెడ్డి
నిర్మాత: అప్పిరెడ్డి
రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.

హేమంత్ ఆర్ట్స్ పిచ్చోడు ఆడియోను విడుదల చేసిన వరుణ్ సందేశ్, వితిక !!!

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ నవంవర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియోను వరుణ్ సందేశ్, వితిక విడుదల చేశారు.

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.  హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చిపెట్టె అవకాశాలు ఉన్నాయని వరుణ్ సందేశ్ తెలిపాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని, ఈ మూవీలో నటించిన నటీనటులందరికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.
బ్యానర్: హేమంత్ ఆర్ట్స్
కథ – స్క్రీన్ ప్లే – నిర్మాత – దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్
సంగీతం: బంటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ
ఎడిటర్: సంతోష్ గడ్డం
కెమెరామెన్: గోపి అమితాబ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ

జాక్‌పాట్ ఆడియో, ట్రైల‌ర్ లాంచ్‌

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతిక‌కు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వ‌ర‌కు ఆమె ఇక్క‌డ చాలా సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న‌ జ్యోతిక ఇప్పుడు మ‌ళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో జ్యోతిక‌, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొనున్నాయి. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేస్తోంది. ఈ రోజు మీడియా స‌మావేశంలో ఆడియో ట్రైల‌ర్‌ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో విడుద‌ల చేసి మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడారు…

ప్రొడ్యూస‌ర్ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ… జాక్‌పాట్  నాకు చాలా స్పెష‌ల్  చిత్రం. ఈ చిత్రం ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల‌ని తీశాం. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క‌థ న్యారేట్ చేసిన‌ప్పుడు నాకు చాలా బాగా న‌చ్చింది. అందుకే వెంట‌నే ప్రొడ్యూస్ చేశాను, జ్యోతిక చాలా బాగా చేసింది. క‌ళ్యాణ్ ఇంత మంచి స‌బ్జెక్ట్‌ను నా ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చినందుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. రాజ్ ఆనంద్ ఈ చిత్రంలో డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించారు. జ్యోతిక‌, రేవ‌తి ఇద్ద‌రు చాలా బాగా చేశారు. బ‌న్నీవాసు నా స్నుహితుడు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న గీతాఆర్ట్స్ బ‌న్నీవాసుకి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇది ఒక మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో  మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

భార‌తిబాబు మాట్లాడుతూ… వ‌ర్మ‌గారు నాకు ఈ చిత్రానికి డైలాగులు రాసే అవ‌కాశాన్ని క‌ల్పించారు. 20రోజుల్లో ప‌ని మొత్తం పూర్తిచేశాను. ఈ మ‌ధ్య కాలంలో ఇంత మంచి చిత్రం రాలేదు. త‌మిళ్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. రేవ‌తిగారి ఫైట్స్ చాలా బావుంటాయి. క‌ళ్యాణ్ గారు, రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి చేశాను. నాకు ఈ చిత్రంలో ప‌నిచేసేందుకు ఇంత‌ మంచి అవ‌కాశం ఇచ్చిన రాజ‌శేఖ‌ర్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ఆనంద్‌రాజా మాట్లాడుతూ… గ‌త కొన్ని రోజులుగా నేను పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా త‌మిళ్‌లో కూడా అప్పుడ‌ప్పుడు చిత్రాలు చేస్తున్నా. ఇప్పుడు ఈ అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది.  సూర్య 2డి ఎంట‌ర్‌టైన్మెంట్స్ త‌న సొంత బ్యాన‌ర్‌లో జ్యోతిక‌గారు చాలా బాగా చేశారు. ఆవిడ ఇద్ద‌రు పిల్ల‌లున్నా కూడా ఎక్క‌డా ఆ విధంగా క‌నిపించ‌లేదు.నాతో క‌లిసి న‌టించిన నా తోటి న‌టీన‌టులంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ మ‌ధ్య కాలంలో త‌మిళ్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ తెలుగులో డ‌బ్ అవుతున్నాయి. త‌మిళ్‌లోనే కాకుండా ఇక్క‌డ కూడా మంచి హిట్లు వ‌స్తున్నాయి. గ‌తంలో నేను కోడిరామ‌కృష్ణ ఇంకా కొంద‌రు ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేశాను. అలాగే గీతా ఆర్ట్స్‌లో కూడా ప‌ని చేశాను. ఈ మూవీ చాలా మంచి హిట్ అవుతుంది. నా త‌ర‌పున క‌ళ్యాణ్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ మాట్లాడుతూ… ఈ చిత్రం త‌మిళ్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇక్క‌డ కూడా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. ఇందులో న‌టిచిన న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. మాకు మీ స‌పోర్ట్ ఎంతో అవ‌స‌రం మీరంద‌రూ త‌ప్ప‌కుండా సినిమా చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్న బ‌న్నీవాసుగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

న‌టీన‌టులు:
జ్యోతిక‌, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: క‌ళ్యాణ్
నిర్మాత‌: సూర్య శివ‌కుమార్
స‌హ నిర్మాత‌: రాజశేఖ‌ర్ కరూప‌సుంద‌ర పాండియ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
ఎడిట‌ర్: విజ‌య్ వేలుకుట్టి
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను

`సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం..

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేసి మే 1, 2020లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. మ్యూజిక్ సెన్సేస‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు
నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ సి.దిలీప్‌

పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

‘తొలుబొమ్మలాట’ సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేను ఉండిపోతాను – ‘తోలు బొమ్మలాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డా.రాజేంద్రప్రసాద్

డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మించారు . విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సోమవారం రాత్రి హైదరాబాద్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. వేడుకలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, హర్షిత, నారాయణరావు, జానకి, కల్పన, దేవి ప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, సురేష్ బొబ్బిలి, చైతన్య ప్రసాద్, సతీష్, అజయ్ మోహన్ , రమేష్, నవీన్ , ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ ,మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీ ని డా . రాజేంద్రప్రసాద్  ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా..
నటకీరిటి డా . రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ.. ఆ నలుగురు ,మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ ఇలా మంచి మంచి సినిమాల తరువాత నేను చేసిన మరో మంచి చిత్రం తోలుబొమ్మలాట. ఎవరికైనా సరే ఏమైనా జరగాలి అంటే.. ఒక అవకాశం వచ్చి తీరాలి అంతే. ఇలాంటి కథలకు హీరో ఎవరు అనే దాని మీద చర్చలు  అనవసరం. హీరో ఎవరో సినిమా చూశాక ఆడియెన్స్ చెబుతారు. నందమూరి తారకరామారావు గారి లాంటి పెద్ద వాళ్ళందరూ కూడా కథానాయకులు. కథకి ఎవరైతే నాయకుడు అవుతారో  వారే హీరో. తొలుబొమ్మలాట సినిమాలో  విశ్వంత్ హీరో. మంచి సినిమాకు దేవుడున్నాడు. మంచి సినిమాకు మనసుంది. అన్నిటికీ మించి ప్రేక్షకులు ఉన్నారు . మీడియా మిత్రులు ఉన్నారు చాలు. ఇంత అద్భుతమైన సినిమాను డిజైన్ చేసుకున్న విశ్వనాథ్ మా అందరిని సెలెక్ట్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అతనికి కథ ప్రకారం ఏం కావాలో అదే తెరపై చూపించాడు. ఆ నలుగురు నిర్మాత తరువాత అంతటి మంచి గుర్తింపు ఈ చిత్ర నిర్మాత దుర్గా ప్రసాద్ గారికి దక్కుతుంది. చాలా డేరింగ్ తో మంచి సినిమాను నిర్మించారు. ఆ నలుగురు 100 డేస్ ఈవెంట్ లో డి.రామానాయుడు గారు ఒక మాట అన్నారు. వంద సినిమాలు చేసినా నాకు దక్కని ఇంత గొప్ప పేరు నీకు ఈ ఒక్క సినిమతో వచ్చింది అన్నారు. ఇక ఆ రేంజ్ లో ఇప్పుడు దుర్గ ప్రసాద్ గారికి ఆ పేరు దక్కుతుందని భావిస్తున్నా. ఈ సినిమా సక్సెస్ కి తెలుగు ప్రేక్షకులు కారణమవుతారని భావిస్తున్నా. తొలుబొమ్మలాట సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేనుఉండిపోతాను ” అనిఅన్నారు. 
విశ్వంత్ మాట్లాడుతూ..ఈ కాలంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఈ సినిమాలో కథే హీరో. స్టోరీ బేసిడ్ సినిమా. కథలో లీనమై అవసరం ఉన్నంత వరకు అందరూ జాగ్రత్తగా వారి పాత్రల్లో నటించారు. దర్శకుడు విశ్వనాద్ నాకు చాలాకాలం నుంచి మంచి స్నేహితుడు. మొహమాటంగా అతను నాకు కథ చెప్పాడు. సినిమా కథ విన్న తరువాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కమర్షియల్ గా లెక్కలు ఎలా మారినా ఎమోషన్ యూనివర్సల్ పాయింట్ అని దర్శకుడు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఇది ప్రతి ఒక్కరి కథ. సినిమా చూసిన తరువాతమీరే  చెబుతారు. ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నది మా  నిర్మాత దుర్గా ప్రసాద్ గారు. సినిమా చూడగానే అద్భుతంగా ఉందని ఆయనే మొదటి క్రెడిట్ ఇచ్చారు. ఇక రాజేంద్రప్రసాద్ లాంటి గొప్ప యాక్టర్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వారందరికీ తోలుబొమ్మలాట గుర్తింపు తేవాలని ఆశిస్తున్నా” అని అన్నారు.
హీరోయిన్ హర్షితా చౌదరి మాట్లాడుతూ.. “కథలో రాజేంద్ర ప్రసాద్ ఒక హీరో అయితే, కథ కూడా మరో హీరో అని చెప్పాలి. సినిమా కథ గురించి ప్రతి ఒక్కరు అద్భుతంగా చెబుతున్నారు. అందుకు కారణం నిర్మాత, దర్శకుడు. వారికి ఇది మొదటి సినిమా. నాతో పాటు వారికి కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇస్తుందని అనుకుంటున్నా. ఇలాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వడమనేది నా అదృష్టం. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.     
డైరెక్టర్ విశ్వనాధ్ మాగంటి మాట్లాడుతూ.. “ఈ నెల 22సినిమా మీ ముందుకు రాబోతోంది. ఒక కథ అన్నిటినీ వెతుక్కొని తీసుకొస్తుందని దేవి ప్రసాద్ గారు అన్నారు. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాను తీసాం. ఇటీవల కాలంలో ఫ్యామిలీ అంతా కూర్చోని చూసే సినిమాలు అంతగా రాలేవని విన్నాను. నేను నా ఫ్యామిలీతో కూర్చొని సినిమా చేయాలని అనుకున్నా. ఆ ఆలోచనతోనే మంచి కథను రాసుకున్నా. నా చిన్నప్పటి నుంచి నా ఫెవేరేట్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు. ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. షూటింగ్ లో మరచిపోలేని క్షణాలు ఎన్నో ఉన్నాయి. సినిమాలో నటించిన నటీనటులు అలాగే టెక్నీషియన్స్ కి నా కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని పేర్కొన్నారు .
నిర్మాత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. “ముందుగా 42 సంవత్సరాల కెరీర్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలువుతున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆయనకు నేను అభిమానిని . లైఫ్ లాంగ్ ఇలానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నా. డైరెక్టర్ విశ్వనాథ్ కొన్నేళ్ల క్రితం నాకు తొలుబొమ్మలాట కథ వినిపించినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. అందరికి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. 
ఈ సందర్భంగా  రాజేంద్రప్రసాద్ ని స్వర్ణ కంకణంతో సత్కరించారు నిర్మాత దుర్గా  ప్రసాద్ మాగంటి.  హర్షిత, నారాయణరావు, జానకి, కల్పన, దేవి ప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, సురేష్ బొబ్బిలి, చైతన్య ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. 

మనల్ని మనం ప్రశ్నించుకునే చిత్రం “ప్రతిరోజు పండగే” – హీరో సాయితేజ్

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా… మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా… గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా… GA2UV పిక్చర్స్ బ్యానర్లో రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఓ బావ…. అనే పాటను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ పాటకు కెకె సాహిత్యం అందించగా, యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా….

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ….  “మాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. చాలా థాంక్స్. ఓ బావ సాంగ్ కి హీరో ఈ చిన్నపాపే. యశ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ అదరగొట్టాడు. హాఫ్ డే లో షూట్ చేశారు. తమన్ మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు.  చాలా మంచి సాంగ్స్ 5 ఇచ్చాడు. తమన్ కు ఇన్స్పిరేషన్ ఇచ్చింది మారుతి అన్న. నాకు 15 మినిట్స్ లైన్ చెప్పాడు. ఆ తర్వాత వన్ వీక్ లో ఫుల్ నరేషన్ ఇచ్చారు. సత్యరాజ్, రావ్ రమేష్, రాశి ఖన్నా కి పెర్ ఫార్మ్ చేసేందుకు స్కోప్ ఉన్న పాత్రలు. కరెంట్ ట్రెండ్ లో ఉండే టిక్ టాక్ సెలెబ్రిటీగా రాశిని చూపించారు. బెల్లం శ్రీదేవి తర్వాత ఏంజిలా అనే క్యారెక్టర్ బాగా   గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నాకు ఎటువంటి డిజీజెస్, మతిమరుపులాంటివి లేవు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది.. ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మనందరం మనల్ని ప్రశ్నించుకునే చిత్రం. డిసెంబర్ 20న వస్తున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు”.  అని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ…. “ఏదన్నా మంచి సినిమా చేయాలనే దాంట్లో రకరకాల కథలు అనుకొని ఫ్యామిలీ సబ్జెక్ట్ గా ప్రతీరోజు పండగేను తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ పెట్టగానే. రకరకాలుగా కథను ఊహించుకుంటున్నారు. తాత మనవడు కథ అనుకుంటున్నారు. ఇద్దరినీ కలిపే కథ అనీ, ఫ్యామిలీని కలిపే కథ అని అనుకుంటున్నారు. అలాంటి కథ కాదు ఇది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. పుట్టినప్పుడు సెలెబ్రేషన్ చేస్తాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా సంతోషంతో బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనేది ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాం. కొడుకు ఎదిగిన తర్వాత తండ్రిని మర్చిపోతున్నాడు. తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఎంటర్ టైన్ చేస్తూ హార్డ్ టచింగ్ గా చెప్పాం. సత్య రాజ్ గారు చేసిన యాక్టింగ్ కి మాకే కళ్లలో నీళ్లొచ్చాయి. మా నిర్మాతలు బన్నీ వాసు, వంశీ, విక్కీ, మూలస్థంభం అరవింద్ గారు బాగా సపోర్ట్ చేశారు.  నచ్చి ప్రేమించిచేసిన సినిమా. భలే భలే మగాడివోయ్స్ స్క్రిప్ట్ చిరంజీవి గారికి చెప్పాను. మళ్లీ ఇప్పుడు ప్రతీ రోజు పండగే కథ మూడు గంటలు విన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతో షూటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రం అవుతుంది. సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది”. అని అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…  “ఈ సినిమాకు నేను నమ్మింది మారుతి ని మాత్రమే. కథ ఒక్కసారి మాత్రే విన్నాను. మారుతి టైమింగ్ మీద నాకు నమ్మకం ఉంది. ఆ టైమింగ్ ను తేజు బాగా పండించగలడు. మారుతిని నమ్మి చేసిన సినిమా ఇది. భలే భలే మగాడివోయ్ చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. రాశి గారి సినిమాలు ఇంతముందు చూశాను కానీ… ఇంత బబ్లీగా ఇంత బాగా చేస్తుందని అనుకోలేదు.
తేజుతో పిల్లా నువ్వు లేని జీవితం చేసాను. ఇప్పుడు ఈ సినిమాతో మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందనుకుంటున్నాను”. అని అన్నారు.

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ…. “నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. నేను టిక్ టాక్ లో లేను. ఈ సినిమా కోసం ఫస్ట్ టైం టిక్ టాక్ వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చేయడం చాలా డిఫికల్డ్. మారుతి గారు నేను చేయగలనని నమ్మారు. నాకోసం చాలా మంచి పాత్ర రాశారు. అందరూ ఆ పాత్రను ఇష్టపడతారు.  ఓ బావ… నా ఫేవరేట్ సాంగ్. తమన్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ పాట లిరిక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు”. అని అన్నారు.

లిరిసిస్ట్ కెకె మాట్లాడుతూ… “టైటిల్ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఓ బావ… అనే సంగీత్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం లిరిక్ రాసిన తర్వాత తమన్ ట్యూన్ చేశారు. ఇది తాత మనవడు కథ కాదు. మాయమైన మనిషిలోని కథ ఇది. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమా కాదు. ఈ జెనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మారుతి గారు క్లైమాక్స్ చెబుతున్నప్పుడు కళ్లు చెమర్చాయి. ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా. బన్నీ వాసు గారు టాక్సీవాలాలో మాటే వినదుగా సాంగ్ రాసే అవకాశం ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఇందులో రెండు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. చాలా థాంక్స్. అని అన్నారు”.

కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ మాట్లాడుతూ…. “మారుతి గారికి చాలా థాంక్స్. తమన్ సర్ మ్యూజిక్ లో ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశాను. ఈ సినిమా చేసినప్పుడు చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది”. అని అన్నారు.

నటుడు మహేష్ మాట్లాడుతూ….  “ప్రేమ కథా చిత్రంలో వంద మందిలో ఒకడిగా ఉన్నాను. మారుతి గారు ఇందులో సత్యరాజ్ గారి పక్కన నటించే మంచి అవకాశం ఇచ్చారు. గీతా ఆర్ట్స్ కి యువి క్రియేషన్స్ కి చాలా చాలా థాంక్స్”. అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ జయకుమార్  మాట్లాడుతూ… “తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా. ఎమోషన్స్, కామెడీతో కూడుకున్న చిత్రం ఇది. సినిమా ఆద్యంతం అలరిస్తుంది”. అని అన్నారు.

నటీనటులు:

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను–