Home Blog Page 1017

మనిషి జీవితమే ఒక “తోలు బొమ్మలాట”:-న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్.

అల్ రౌండర్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న డా. రాజేంద్ర ప్రసాద్ ఎఫ్ 2 డిఫ్రెంట్ కామెడీ,ఓబేబి లో ఎమోషన్స్ తో కూడిన మంచి మంచి పాత్రలు చేస్తూ నటుడిగా దూసుకెళ్తున్నారు న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్ర‌స్తుతం సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి నిర్మాతగా విశ్వ‌నాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `తోలు బొమ్మలాట`. చిత్రంలో విశ్వంత్ కథానాయకుడిగా నటించాడు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లోన‌టించారు. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట‌ర్వ్యూ.

‘తోలు బొమ్మలాట` ఎవరు ఎవరిని ఆడిస్తారు ?
— మాములుగా మ‌నమంద‌రం మనిషి జీవితమే ఓ తోలు బొమ్మలాట అనే ప‌దం వినే ఉంటాం. అయితే దాని అర్ధం ఏంటంటే మ‌న‌మంద‌రం తోలు ఉన్న బొమ్మలం, మనతో ఆ దేవుడు ఆడే ఆటే తోలు బొమ్మలాట.అనుకున్నట్లు జరగనీదే జీవితం. అయితే కొన్ని సందర్భాల్లో మన తల్లి దండ్రులు, గురువు కూడా ఆ ఆట ఆడతారు. ఎందుకు ఆడాల్సి వ‌చ్చింది అనేది ఈ క‌థ‌.

డైరెక్ట‌ర్ విశ్వనాథ్ చిన్నవాడైనా ఈ క‌థ చెప్ప‌గానే మీకేమ‌నిపించింది?
— ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ నన్ను కలిసి మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ ఉందని ఈ కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుందని చెప్ప‌గానే ఏదైనా కామెడీ ఫ్లేవర్ ఉండే కథ అయి ఉంటుందేమో అని ఊహించాను. కాని వృద్దాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనలు, అతనికి సంబందించిన బాధతో కూడిన ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. కుటుంబ బంధాలు అనుబంధాలు గురుంచి చెప్పే మంచి కథ . ఆ క‌థ విన్నాక ఆశ్చర్యమేసింది. నీ వయసెంత, ఈ కథ నువ్వే రాశావా..? నువ్వే తీస్తావా ? అని కూడా అడిగి తెలుసుకున్నాను. నిజంగా ఈ వయసులో అలాంటి కథ రాయడం గొప్ప విషయం.అలాగే చెప్పినట్టే మంచి సినిమా తీయ‌డం అభినంద‌నీయం.

ఈ సినిమాలో మీరు ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు ?
— ఈ సినిమా లో సోడాలరాజు అనే పాత్ర చేసాను, అయితే ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఏ సినిమాలో అయినా నటుడు అనే వాడు కనిపించకుండా పాత్ర కనిపించాలి. అప్పుడే సన్నివేశాలు పండుతాయి అనేది నా న‌మ్మ‌కం. నటుడిగా నేను ఎప్పుడూ అదే ఫాలో అవుతాను. ఈ సినిమాలో సోడాల రాజు గా కనిపించడానికి పెద్ద మనిషి లా కనపడాలి, అందరూ గౌరవించేలా ఉండాలి అందుకు కొంత ప్రిపైర్ అవ్వడం జరిగింది. ఈ సినిమాలో నాకు దొరికిన మరో మంచి పాత్ర. ఊళ్ళో వాళ్ళు సోడాల రాజు దగ్గరికి వెళ్తే టెన్షన్ రిలీఫ్ అవుతుంది అనుకునేలాంటి పాత్ర.

‘తోలు బొమ్మలాట’ సినిమా ఎలా ఉండబోతుంది ?
— ‘తోలు బొమ్మలాట’ ఎమోషన్ తో కూడిన ఎంటర్టైన‌ర్‌. ఒకప్పుడు మనం పాటించిన పద్దతులు ఇప్పుడు వదిలేయడంవ‌ల్ల జ‌రిగే ప‌రిణామాల గురించి ఈ సినిమాలో ఓ చిన్న సందేశం ఇవ్వ‌డం జ‌రిగింది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమాలో వెన్నెలకిషోర్ పాత్ర ఎలా ఉంటుంది ?
— సినిమా కథ ఎమోషనల్ జర్నీ అయిన‌ప్ప‌టికీ కామెడీ కూడా ప్రాదాన్యం ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు నన్ను సలహాలు అడుగుతూ ఎంతో చక్కగా ఆ పాత్రను చేశాడు.

టాలీవుడ్ లో కామెడీ హీరో గా మీ ప్లేస్ ఎవరికి ఇస్తారు, మీ వారసున్ని సినిమాలలోకి తీసుకురాకపోవడానికి కారణం ఏంటి ?
— యన్టీఆర్ గారిని చూసి నేను హీరో అవ్వాలనే ఆసక్తితో నాకు నేనే సినిమాల్లోకి వచ్చాను,,కానీ నా మనవరాలు మహానటి ద్వారా పరిచయమైంది.ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లో కూడా చేస్తోంది.కానీ నా పిల్లలు రాలేదు నా వారసున్ని కూడా నేనే..

తీరికాలేకుండా చేస్తున్నారు కదా మరి మీ త‌దుప‌రి చిత్రాలు ఏంటి ?
— ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాను. `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో మహేష్, నా క్యారెక్ట‌ర్ టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తుంది. ఇక బన్నీ ‘అల వైకుంఠపురములో’ ఎస్‌పి క్యారెక్ట‌ర్ చేస్తున్నాను.ఎర్రచీర లో చేస్తున్నాను.

సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో ‘దర్బార్’ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ – స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.  లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే  రిలీజ్ అయిన `దర్బార్` మోషన్ పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్  రెస్పాన్స్ వ‌స్తోంది. లేటెస్ట్ గా  ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూపర్ స్టార్ రజిని నవంబర్ 14 నుండి డబ్బింగ్ స్టార్ట్ చేసి నేటితో పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ మాట్లాడుతూ, “సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో దర్బార్ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయనతో చేసిన ఈ డబ్బింగ్ సెషన్ నా లైఫ్ లో మెమొరబుల్.” అన్నారు

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌

`క‌ప‌ట‌ధారి`. సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన కింగ్ నాగార్జున‌

హీరో సుమంత్, ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి `క‌ప‌ట‌ధారి` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను, మోష‌న్ పోస్ట‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన `కావ‌లుధారి` చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్ష‌న్‌లో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు.
ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని `కిల్ల‌ర్‌`చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్ట‌ర్‌గా , విదేశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. విజ‌య్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో విజ‌య‌వంత‌మైన క్ష‌ణం చిత్రాన్ని తమిళంలో స‌త్యరాజ్ త‌న‌యుడు శిబిరాజ్‌తో స‌త్య అనే పేరుతో తెర‌కెక్కించి త‌మిళంలోనూ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి. ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతుంది. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌
యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌
మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌
ఆర్ట్‌:  విదేశ్‌
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌
మాట‌లు:  బాషా శ్రీ
స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌
క‌థ‌:  హేమంత్ ఎం.రావు
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

*రాజ్‌ మాదిరాజు ‘సిరా’ పుస్కకావిష్కరణ*

విద్యావ్యవస్థలో లోపాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ… ‘రిషి’, ‘ఆంధ్రాపోరి’ చిత్రాల దర్శకుడు రాజ్‌ మాదిరాజు రాసిన నవల ‘సిరా’. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్కకావిష్కరణ జరిగింది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని యంగ్రీస్టార్‌ రాజశేఖర్‌కు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ అందజేశారు. రాజ్‌ మాదిరాజు తల్లితండ్రులకు యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో

*కృష్ణవంశీ మాట్లాడుతూ* ‘‘నేను ఇంకా ఈ పుస్తకాన్ని చదవలేదు. సో… దాని గురించి ఏం మాట్లాడలేను. కానీ, రాజ్‌ మాదిరాజు ఈ పాయింట్‌ చెప్పాడు. విద్యావ్యవస్థ మీద పుస్తకం రాశానని చెప్పాడు. నాకు నచ్చింది. చేతన్‌ భగత్‌ ‘త్రీ మిస్టేక్స్‌’ తర్వాత విద్యావ్యవస్థ మీద వచ్చిన పుస్తకం ఇదే అనుకుంటున్నా. రాజ్‌ నాకు ఏడాదిన్నరగా తెలుసు. అతడితో స్నేహం ఏర్పడింది. అతడిలో చాలా నాలెజ్డ్‌ ఉంది. ఒక్కోసారి మాట్లాడుతుంటే భయం వేస్తుంది. రాజ్‌ మాదిరాజు ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా. ఆడియో విజువల్‌ మీడియా వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయింది. వ్యక్తిగతంగా, నేనయితే యండమూరిగారి పుస్తకాల తర్వాత వేరేవి చదవాలనిపించడం లేదు. నాకున్న మిరపకాయ లాంటి జ్ఞానం యండమూరి పుస్తకాల వల్లే వచ్చింది. రాజ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు.

*రాజశేఖర్‌ మాట్లాడుతూ* ‘‘విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే… కారణం మనమే. మన వ్యవస్థ, ప్రభుత్వాలు. మనిషి జీవితంలో చదువుకునే సమయం ఒత్తిడితో కూడుకున్నది. ‘హిందీ మీడియం’ సినిమా చూశా. పిల్లల్ని మంచి స్కూల్‌లో జాయిన్‌ చేయడానికి తల్లితండ్రులు ఎంత తపన పడుతున్నారనేది బాగా చూపించారు. స్కూల్‌లో జాయిన్‌ చేయించిన తర్వాత ఎగ్జామ్స్‌ టైమ్‌లో సగం లైఫ్‌ పోతుంది. ఒత్తిడి వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ బుక్‌ ఒక విజిల్‌ బ్లోయర్‌ కావాలనీ, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను ప్రభుత్వాలు తీసుకురావాలనీ, ప్రయివేట్‌ సంస్థలు కాకుండా, ప్రభుత్వమే విద్యా వ్యవస్థను నడపాలనీ బావుంటుందని అనుకుంటున్నా. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన చేయాలని ఏపీ సీయం జగన్‌గారు తీసుకొచ్చిన విధానం నాకు నచ్చింది. మన భాష అంతరించకుండా, తెలుగును కంపల్సరీగా పెట్టుకుని ఇంగ్లిష్‌లో టీచింగ్‌ చేస్తే మంచిది. అప్పుడే ఈ కాంపిటీటివ్‌ ప్రపంచంలో బతకగలుగుతాం. ఈ పుస్తకంలోని కథలో మనసుని హత్తుకునే అంశాలు ఉంటే తప్పకుండా ఈ సినిమాను నేనే చేస్తా. ఈ బుక్‌ పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

*యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ* ‘‘నేను రాజ్‌ మాదిరాజును చూడటం ఇదే తొలిసారి. కుర్రాడు బావున్నాడు. చిన్నప్పుడు నేనూ అలాగే ఉండేవాణ్ణి. ఆయన సినిమా ఫీల్డ్‌ నుండి రచయితగా వచ్చాడు. నేను రచయిత నుండి సినిమా ఫీల్డ్‌కి వెళ్లాను. ఆయన తొలి సినిమా సరిగా ఆడలేదు. దర్శకుడిగా నా తొలి సినిమా సూపర్‌ డూపర్‌ ఫ్లాప్‌. ఆయన తర్వాత సినిమాలు బాగా ఆడాయి. అవార్డులు వచ్చాయి. మనిషి అంచలు అంచలుగా ఎదగడం మంచిదే. ప్రతి ఒక్కరిలో లెఫ్ట్‌ బ్రెయిన్‌, రైట్‌ బ్రెయిన్‌ అని రెండు ఉంటాయి. రైట్‌ బ్రెయిన్‌ బావున్నవాళ్లు మ్యాథమెటిక్స్‌, మేనేజ్‌మెంట్‌ రకరకాల లెక్కలకు సంబంధించిన విషయాల్లో చురుగ్గా ఉంటారు. లెఫ్ట్‌ బ్రెయిన్‌ ఉన్నవాళ్లు మెడిసిన్‌, ఫిలాసఫీ, లిటరేచర్‌, లా… వీటిలో బావుంటారు. తల్లితండ్రులకు తెలియక, సరిగా గుర్తించలేక ఇటు నుండి అటు, అటు నుండి ఇటు చేస్తారు. నేను రైట్‌ బ్రెయిన్‌ పర్సన్‌. మా ఇంట్లో డాక్టర్‌ ఎవరూ లేరని నన్ను బైపీసీ జాయిన్‌ చేశారు. అందుకని, బీకాంలోకి వచ్చాను. పాఠకులను చదివించేలా రాయడం లేకపోవడం వల్ల నవలా సాహిత్యం తగ్గింది. మూడు రకాల నవలలు ఉంటాయి. మొదటి రకం నవల్లో సామాజిక సమస్య ఏమీ ఉండదు. రెండో రకంలో సామాజిక సమస్యను తీసుకుని, పరిష్కారం చూపరు. మూడో రకంలో సమస్యను తీసుకుని పరిష్కారం చూపిస్తారు. రాజ్‌ మాదిరాజు రెండో రకంలో రాశాడో? మూడో రకంలో రాశాడో? నాకు తెలియదు. పాపులర్‌ నవలలు తగ్గుతున్న ఈ టైమ్‌లో, నేను దాదాపు రిటైర్‌ అయ్యాను కాబట్టి రాజ్‌ మాదిరాజును మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా’’ అన్నారు.

*నటుడు, న్యాయవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి సీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ* ‘‘ఈ వేదికపై నేను ఉండటానికి నాకున్న అర్హత ఏంటంటే… రాజ్‌ మాదిరాజు నా స్నేహితుడు కావడం, ఆయన ‘రిషి’ సినిమాలో నేను న్యాయవాదిగా నటించడం! ఈ నవలలో 15, 20 పేజీలు చదివే సరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకో 15 పేజీలు చదివే సరికి కొంచెం బోర్‌ కొట్టింది. 40, 50 పేజీలు చదివే సరికి ‘నవల ఇస్తానని నాకొక థీసిస్‌ పేపర్‌ ఇచ్చాడేమిటి?’ అని సందేహం కలిగింది. అంతగా లీగల్‌ కోణంలో రాశాడు. వేదాల నుండి న్యాయం ఎలా పుట్టిందనేది నాకు జ్ఞానోదయం చేసిన లీగల్‌ నవల ఇది. చాలా అద్భుతంగా ఉంది’’ అని అన్నారు.

*సీనియర్‌ పాత్రికేయులు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ* ‘‘నాగరిక ప్రపంచంలో, సామాన్య కుటుంబాల్లో, విద్యార్థులకు చదువు ఒక తపస్సు. తొలి ఉషస్సు. ఆ చదువుని, చదువు మీద తల్లితండ్రులకున్న ఆకాంక్షలు, ఆశలను ప్రయివేట్‌ కళాశాలు ఎంత చెత్తగా తయారు చేస్తున్నాయి? పిల్లల ప్రాణాలతో ఎంతలా చెలగాటం ఆడుతున్నాయి? అనేది ఈ నవలలో ఇతివృత్తం. ‘సిరా’లో సిద్ధార్థ్‌ అనే యువకుడు చివరగా మరణిస్తాడు. మేడ మీద నుండి దూకేస్తాడు. నేను నవల చదివిన రెండు రోజులకు ఐఐటీలో సిద్ధార్థ్‌ అనే యువకుడు మేడ మీద నుండి దూకి మరణించాడు. వార్త చదువుతున్నానా? నవల చదువుతున్నానా? అనేది అర్థం కాలేదు. మొత్తానికి, సమాజానికి పనికొచ్చె నవల, నిద్రపుచ్చేది కాకుండా… నిద్ర తెరిపించే నవలను మిత్రులు, దర్శకులు రాజ్‌ మాదిరాజు నుంచి రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమాగా రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

*రచయిత లక్ష్మీభూపాల్‌ మాట్లాడుతూ* ‘‘ఎన్నో నవలలు రాసిన అనుభవమున్న రచయితగా రాజ్‌ మాదిరాజు ఈ నవల రాశారు. ఎందరిలో తన నవలలతో స్ఫూర్తి నింపిన యండమూరిగారితో ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ‘సిరా’ చదివిన తర్వాత నేరుగా నేను కోర్టుకు వెళ్లి వాదించవచ్చనేంత ధీమా కలిగింది. అంత బాగా కేసులు, కేసుల్లో విషయాలు, సమస్యల గురించి రాశారు. అద్భుతమైన విషయాన్ని, కఠినమైన వాస్తవాలను, తలచుకుంటే వెక్కి వెక్కి ఏడ్వాలనిపించే విషయాలను చాలా ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా రాజ్‌ మాదిరాజుగారు రాశారు. త్వరలో ఇది సినిమాగా రాబోతుందని తెలిసింది’’ అని అన్నారు.

*రాజ్‌ మాదిరాజు తండ్రి విజయానంద్ మాట్లాడుతూ* ‘‘వృత్తిరిత్యా నేను ఇంజినీర్‌. కానీ, సాహిత్యం అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలని ఆశిస్తున్నా. తన నవలలో నన్ను, నా శ్రీమతిని ప్రస్తావించడం సంతోషం’’ అన్నారు.

*రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ* ‘‘కొన్ని రోజులుగా రాజ్‌ మాదిరాజు మాతో పని చేస్తున్నారు. అతను రాసిన ‘సిరా’ పుస్తకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే… అది సినిమాగా రాబోతుందని విన్నాను. రాజ్‌ మాదిరాజుకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

*రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ* ‘‘రాస్తే యండమూరిలా రాయాలి, తీస్తే కృష్ణవంశీలా తీయాలి. చేస్తే రాజశేఖర్‌లా చేయాలనే తరంలో పెరిగాను. వాళ్లు ముగ్గురూ ఇక్కడ ఉన్నారు. నేనిది పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నా. చాలా డెప్త్‌ ఉన్న కథ ఇది. లీగల్‌ సిస్టమ్‌, ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌, టీనేజర్స్‌ మైండ్‌సెట్‌… ఇందులో మూడు ఉన్నాయి. ఒక వెబ్‌ సిరీస్‌ చూసి, వందలాదిమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తండ్రి తిట్టాడని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి ఘటనలు ఉన్నాయి. ‘సిరా’లో హీరోలు ఇద్దరు. మల్టీస్టారర్‌. అందులో ప్రొఫెసర్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. దాన్ని రాజశేఖర్‌గారిని మైండ్‌లో పెట్టుకుని రాసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఆయన్ను నా కళ్ల ముందు చూస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్లు అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన సినిమా నాకు దొరకడం నా అదృష్టం..జార్జ్ రెడ్డి హీరో సందీప్ మాదవ్

ఈ నెల 22 న రిలీజవుతుంది ‘జార్జిరెడ్డి’ సినిమా. సందీప్ మాధవ్ ఈ సినిమాలో ‘జార్జిరెడ్డి’ గా నటించాడు. 1968 – 70 లో బాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ లో జార్జిరెడ్డి లైఫ్ లోని కొన్ని కీలక అంశాలను తెరకెక్కించారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందీప్ మాధవ్ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

వంగవీటి తరవాత…

‘వంగవీటి…’ సినిమా తరవాత అవకాశాలు వచ్చాయి కానీ ఆ సినిమా తరవాత చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు జీవన్ గారు ఈ కథ చెప్పారు… చాలా ఎగ్జైటెడ్ అయ్యాను…

కొన్ని ప్రిపరేషన్స్…

జార్జిరెడ్డి క్యారెక్టర్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేశాను. ఈ సినిమా చేస్తున్నాం అని ఫిక్సయ్యాక ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్… కొన్ని వీడియోస్ చూశాను. జార్జిరెడ్డి గారితో కలిసి చదువుకున్న వాళ్ళను, ఆయన ఫ్రెండ్స్ ని కొందరిని కలిసి ఆయన గురించి తెలుసుకున్నాను. ఇకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి కంప్లీట్ గా తెలుసుకునేంత ఫూటేజ్ ఏమీ దొరకలేదు. మహా అయితే కొన్ని ఫోటోస్.. ఒక చోట ఆయన స్పీచ్.. దాన్ని బేస్ చేసుకునే ప్రిపేర్ అయ్యాను…

అలా జరిగింది…

‘జ్యోతిలక్ష్మి’ సినిమా తరవాత కమెడియన్ గా అవకాశాలు వస్తాయనుకున్నా.. కానీ అనుకోకుండా వర్మ గారు… ‘నిన్ను చూస్తుంటే వంగవీటి రాధ’ లా ఉన్నావ్… ఓసారి ఈ లుక్స్ కోసం ట్రై చెయి అన్నారు… అలా ప్రిపేర్ అవ్వడం జరిగింది..

ఆయన క్యారెక్టర్ అలాంటిది…

‘జార్జిరెడ్డి’ కంప్లీట్ గా బయోపిక్ అని చెప్పను కానీ, కొన్ని చోట్ల కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేయడం జరిగింది. అవి కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. బేసిగ్గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి.. విజువలైజేషన్ లో హీరోయిజం న్యాచురల్ గానే ఉంటుంది.

అప్పటికీ ఇప్పటికీ అదే డిఫెరెన్స్…

1968 – 70 లో స్టూడెంట్స్ కి… ఇప్పటి స్టూడెంట్స్ కి చాలా డిఫెరెన్స్ ఉంటుంది. అప్పట్లో వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు. ఏం చేసినా వాళ్ళలో సీరియస్ నెస్ ఉండేది. జార్జిరెడ్డి తో పాటు ఆయనతో పాటు ఉండే క్యారెక్టర్స్ లో కూడా ఆ సీరియస్ నెస్ ఉంటుంది.

ప్రయత్నం చేశాం…

1960 – 70 బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆల్మోస్ట్ అప్పటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. మీరు రేపు సినిమాలో చూడబోయే బైక్స్.. సైకిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కొనేశాం… అవన్నీ అప్పట్లో వాడేవే…

నమ్మకం ఉంది కాబట్టే…

ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాం… ట్రైలర్ లో చూసి అది అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేశాం అనుకుంటున్నారు. నిజానికి అది సెట్ వేశాం. 1960 లో యూనివర్సిటీ ఎలా ఉండేదో దాన్ని బట్టి సెట్ వేశారు…

నాకా ఫీలింగ్ కలగలేదు…

ఈ సినిమా వల్ల రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వదులుకున్నాను ఈ సినిమా చేసే ప్రాసెస్ లో… ఈ సినిమా ఉండి ఉండకపోతే వాటిలో ఏవో కొన్ని చేసేసేవాడిని.. కానీ ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు.

పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్నారు…

నిజానికి జార్జిరెడ్డి అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేయాలనుకున్నారట.. అందుకే ఓ సాంగ్ ఆయనికి డెడికేట్ చేశాం…

బుల్లెట్ బైక్ సాంగ్…

బుల్లెట్ బైక్ సాంగ్ కి… ట్రైలర్ కి వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దానికి రీజన్.. ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ ఏంటి..? అనుకోవడమే… ఈ సాంగ్ ని సెపరేట్ గా చూస్తే అలా అనిపిస్తుంది కానీ. సినిమా చూస్తే ఖచ్చితంగా కనెక్టివిటీ ఉందనిపిస్తుంది.

కన్నీరు తెప్పించే ఎలిమెంట్స్…

సినిమా చూశాక ‘ఇంత గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నామా…?’ అనే ఫీలింగ్ అయితే డెఫ్ఫినెట్ గా వస్తుంది. ‘ఇస్రో..’ లాంటి సంస్థలో అవకాశం వచ్చినా వదులుకున్నారాయన… ఇలాంటి హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి

ప్రతిష్టాత్మకమైన ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ నా చేతుల మీదుగా అందించడం గౌరవంగా భావిస్తున్నాను – మెగా స్టార్ చిరంజీవి.

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. న‌వంబ‌ర్‌17న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ అవార్డ్ ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో…

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ” సినిమా మాత్రమే నాకు తల్లి తండ్రి, అదే నాకు అన్నీ ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఇవ్వాలని ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ సృష్టించబడింది. ఇవి ఈ అవార్డ్స్ గురించి నాన్న చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాము. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి  ఈ  ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ ఇచ్చి వారిని సగౌరవంగా సన్మానించుకొని వారి పేరుతో పాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు కార్యక్రమం జరుగుతుంది.  శ్రీదేవిగారికి, రేఖ గారికి ఈ అవార్డ్  ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన ఉన్నప్పుడు ఈ అవార్డ్ ఇవ్వలేక పోయాం. కానీ  తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఈ అవార్డ్ ఉంటుంది. ఈ వేదిక మీద అవార్డ్ తో పాటు నాన్న ఇక్కడే మనమధ్యనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరవేరుతుందని చాలా సంతోషిస్తున్నారు. సుబ్బరామిరెడ్డిగారిలో ఒక గమ్మత్తైన క్వాలిటీ ఉంది. నాన్నగారికి ఎంత క్లోజ్‌ ఫ్రెండో అందరికీ అంతే క్లోజ్ గా ఉంటారు. `పూల రెక్కలు , కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఒక బొమ్మ చేస్తివో ‘ ఇవి శ్రీదేవి మీద సీతారామశాస్రి గారు రాసిన పదాలు. అవి అక్షరాలనిజం. శ్రీదేవి తో నేను నాలుగు సినిమాలు చేశాను. మొదటి సినిమా ‘ఆఖరి పోరాటం’. ఆవిడ సెట్ కి వస్తున్నప్పుడు అప్పటిదాకా గొడవ గొడవగా ఉండే సెట్ సైలెంట్ గా అయిపోయేది.  శ్రీదేవి ‘ది గాడెస్ ఆఫ్ గ్రేస్’.  శ్రీదేవి గారికి దేవుడిచ్చిన అందం అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ దానికన్నా ఎక్కువ అదృష్టం బోని కపూర్ గారు భర్తగా లభించడం. వారిద్దరూ నాకు చాలా కాలంగా తెలుసు. ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా ఆమెను హిందీలో స్టార్ ని చేస్తే బోని కపూర్ గారు తీసిన’ మిస్టర్ ఇండియా’ ఆమెను నేషనల్ సూపర్ స్టార్ గా చేసింది. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ ఎఎన్‌ఆర్‌ గారు, శ్రీదేవి గారు బ్రతికే ఉంటారు. అలాగే రేఖ గారి మొదటి సినిమా ఒక తెలుగు సినిమా’రంగుల రాట్నం’. రేఖ గారు మనసు ఎంత మంచిది అంతే శ్రీదేవి గారు ‘ఆఖరి రాస్తా’ హిందీ సినిమాకి రేఖ గారు డబ్బింగ్ చెప్పారు.  ఆమెకి ఈ అవార్డ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈరోజు మా ముఖ్య అతిధి పద్మభూషణ్ చిరంజీవి గారు, మా అన్నయ్య, నాకు అత్యంత ఆత్మీయులు. చిరంజీవి గారితో నాకున్న అనుబంధం గురించి మాటల్లో చెప్పలేను.  ఈ అవార్డ్ కి పిలవగానే యూఎస్ ట్రిప్ మానుకొని ఇక్కడికి వచ్చారు” అన్నారు.

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి  చైర్మ‌న్, కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ –  ఈ రోజు ఈ అవార్డ్ ఫంక్షన్ ని దేవలోకం నుండి, కళా ప్రపంచం నుండి నా ఆప్త మహా నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారు చూసి సంబరపడుతూ ఉంటారు. అలాగే ‘సైరా నరసింహరెడ్డి’  గా నటించి యావత్ భారత దేశం గర్వించే విధంగా తెలుగు ఖ్యాతి ని చాటిన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకవైపు,  అలాగే గొప్ప నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ గారు మరోవైపు ఉన్నారు. ఈరోజు  నేను ఎక్కడికి పోయినా నాకు అభిమానులు ఉన్నారంటే అది అక్కినేని నాగేశ్వర రావు గారు నా స్నేహితుడు అవ్వడమే కారణం. అటువంటి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు త‌న‌కి  `దాదాసాహెబ్‌ ఫాల్కే` అవార్డు వచ్చినప్పుడు నన్ను పిలిచి భవిష్యత్తులో ‘ఎఎన్‌ఆర్ నేష‌న‌ల్ ఫిలిం అవార్డు’ స్థాపించి నేను ఉన్నా, లేకున్నా నాతరంవారిచే నేష‌న‌ల్ లెవ‌ల్‌లో సినీ ప‌రిశ్ర‌మ‌లోని గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ అవార్డుని ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు.  ఆయన ఆఖరి రోజుల్లో నేను శ్రీదేవి, రేఖ లకు ఈ అవార్డ్ ఇవ్వాలని కోరుకున్నారు.  ఈరోజు అంత బాద్య‌త‌గా త‌న తండ్రి కోరిక‌ను నెర‌వేరుస్తున్నందుకు నాగార్జున గారిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. అలాగే అందం తో పాటు హృదయ సౌందర్యం ఉన్న నటి. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రేఖ గారు 35 సంవత్సరాలుగా అంతే అందంగా ఉన్నారు. వెరీ డిసిప్లేన్డ్ పర్సనాలిటీ. వీరిద్దరికి ఈ అవార్డ్ ఇవ్వడం హ్యాపీ గా ఉంది“ అన్నారు.

బోని కపూర్ మాట్లాడుతూ – ” అందరికి నమస్కారం.  శ్రీ దేవి తరపున ఈ అవార్డ్ అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. ఈ అవార్డ్ ని అందించిన అక్కినేని ఫౌండేషన్, అక్కినేని ఫ్యామిలీ కి అలాగే సుబ్బరామి రెడ్డి గారికి ధన్యవాదాలు “అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “మా అమ్మ గారికి నాగేశ్వర రావు గారు అంటే అంత అభిమానం కాబట్టే నాకు సినిమా అంటే అంత అభిమానం ఏర్పడింది. అందుకే చదువు అయిపోగానే ఇండస్ట్రీ కి రావాలని కోరుకున్నాను, వచ్చాను. ఎన్.టి.ఆర్ గారు ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ పర్సన్స్ ఉన్న టైమ్ లో నేను హీరోగా నిలదొక్కుకోవడం హ్యాపీ గా ఉంది. అలాగే నాగేశ్వర రావు గారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించడం నా అదృష్టం. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి  చెప్పిన ఎన్నో విషయాల వల్లే నేను ఈ రోజు ఈ స్థానానికి రావడానికి దోహద పడింది. ఆరకంగా నాగేశ్వర రావు గారు నాకు గురు తుల్యులు. ఆయన నడిచే నిగంటువు, ఒక ఎన్సైక్లోపీడియా. అలాంటి మహా నటుడితో నాకు సాంగత్యం ఉండడం నా పూర్వజన్మ సుకృతం. నాగేశ్వర రావు గారు చివరి రోజు వరకూ మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా ఉండేవారు. ఎంతో మంది మహామహులకి ఇస్తున్న ఈ ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు ఎదో ఒక రోజుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంత గొప్ప అవార్డ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  నాచేతుల మీదుగా శ్రీదేవి, రేఖ లాంటి లెజెండరీ పెర్సొనాలిటీస్ కి ఈ అవార్డ్ ఇవ్వడం ఎంతో సముచితం. ఇంత గొప్ప అవార్డ్ నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి దన్యవాదాలు. ఆవిడతో నేను మూడు నాలుగు సినిమాలు చేశాను.  శ్రీదేవి గారు షూటింగ్ లో టైమ్ దొరికితే సినిమా గురించే మాట్లాడేవారు.  ఆవిడకి సినిమా గురించి తప్ప మరేమి తెలీదు. ఆవిడ మనమధ్య లేకపోవడం బాధాకరం. అన్ని భారతీయ భాషలలో నటించి లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అవార్డ్ ఇచ్చి ఆవిడను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. అలాగే ఏజ్ లెస్ స్టన్నింగ్  బ్యూటీ రేఖ చేతుల మీదుగా నేను ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాను. అలాగే ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగే 80స్ క్లబ్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఈ ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ ఆవిడకి రావడం ఆమెకు గౌరవం, నా చేతుల మీదుగా ఈ అవార్డ్ ఇవ్వడం నాకు గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ కి నా హృదయ పూర్వక దన్యవాదాలు” అన్నారు.

నటి రేఖ మాట్లాడుతూ – ” నేను ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లో దాదాపు 10 సంవత్సరాలు గడిపాను.  మళ్ళీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నాగేశ్వర రావు గారు నాకు ఇండస్ట్రీ గురించి, నటన గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. అవి నా కెరీర్ కి ఎంతో ఉపయోగపడ్డాయి.  చాలా కాలం తర్వాత మా అమ్మగారి చివరి కోరిక కోసం ఒక తెలుగు సినిమా చేశాను. త్వరలోనే తెలుగు స్పష్టంగా శ్రీదేవి గారి లాగా నేర్చుకొని తెలుగులో సినిమా చేస్తాను” అన్నారు.

అమల అక్కినేని మాట్లాడుతూ – ” ముందుగా ‘ఎఎన్‌ఆర్‌ అవార్డ్’ శ్రీదేవి గారి తరుపున అందుకున్న బోని కపూర్ గారికి, రేఖ గారికి శుభాకాంక్షలు. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్థాపించి ఏడేళ్ళు అవుతుంది. అది రోజురోజుకీ పెరిగి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ కూడా వస్తున్నారు. దాదాపు 450 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వారి గ్రాడ్యుయేషన్‌ సెర్మనీ ఈ అవార్డు ఫంక్షన్‌తో కలిపి చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో 66 మంది అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్టూడెంట్స్ కి ప్రముఖ నిర్మాత బోని కపూర్, రేఖ చేతుల మీదుగా  గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు.

అనంతరం అమల అక్కినేని, డా. అనురాధ రావు (అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా డీన్) గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో..విజయ్ దేవరకొండ, సుమంత్, నాగచైతన్య, అఖిల్, నిహారిక, మంచు లక్ష్మి, అడివి శేష్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, లావణ్య త్రిపాఠి, నిర్మాత పి.వి.పి, సుప్రియ, తదితరులు హాజరయ్యారు.

“ప్లే” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

అభినవ్ సింగ్ రాఘవ్, గజాలా, నైనా శర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ప్లే. మోక్ష్ ఈ చిత్ర  దర్శకుడు. . మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్ కూడా డైరెక్టర్ మోక్ష్ చేయడం విశేషం. పి.ఎల్.రామ్ ప్రసాద్ డీఓపి. రాజ సులోచన ఈ చిత్రానికి నిర్మాత. టి.ఎం.శేఖర్ సహ నిర్మాత. హర హర మహాదేవ్ క్రియేషన్స్ సమర్పణలో… రాయ్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంటెన్సివ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రేసీగా ఉండే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. తర్వాతి సీన్ ఏం జరుగుతుందా…. అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతీ పనికి ఓ ఉద్దేశ్యం ఉంటుందనేది ఈ చిత్రం మెయిన్ పాయింట్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఉండే ప్లే ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటీనటులు కొత్త వారైనప్పటికీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చిత్ర దర్శకుడు అంటున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎడిటింగ్ చాలా కీలకం కానుంది. చిత్ర నిర్మాణంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమిది.

నా ఆబిమాని తీసిన సినిమాలో నేనుండడం నా అదృష్టం…పరారి ఆడియో లాంచ్ లో హీరో సుమన్

శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై ప్రత్యూష సమర్పణలోయోగేశ్వర్‌ (నూతన పరిచయం)అతిథి హీరో, హీరోయిన్‌లుగా సుమన్‌, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రావణ్‌, మకర్‌దేశ్‌ పాండే, జీవా, కల్పలత తదితరులు నటిస్తున్నారు. సాయి శివాజీ దర్శకత్వం లో వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజకీయ నాయకుడి గా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి గా కొనసాగుతున్న జీవివి గిరి ఈ సినిమా తో నిర్మాత గా మారి నిర్మిస్తున్న ఎంటర్ టైనర్ చిత్రం ‘పరారి’. ”రన్‌ ఫర్‌ ఫన్‌” అనేది ఉప శీర్షిక. హీరో సుమన్ ముఖ్య అతిథిగా పరారి ఆడియో లాంచ్ కి హాజరయ్యారు.
రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో పరారి ఆడియో లాంచ్ వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా                    దర్శకుడు రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ :”చిన్న సినిమా అనుకోవడానికి లేకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మి చారు.యోగీశ్వర్ పేరులోనే పవర్ ఉంది. నిర్మాత గిరి గారు పెర్మినెంట్ ప్రొడ్యూసర్ అవుతారు అనిపిస్తుంది అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ :”యోగీశ్వర్ డాన్స్ బాగుంది.సాంగ్స్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. చక్రిని మహిత్ గుర్తు చేసాడు. మహిత్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ మా ట్లాడుతూ : ” మూడు జనరేషన్స్ ఇలా వేదిక మీద చూడటం హ్యాపీ గా ఉంది. ప్రొడ్యూసర్ గిరి తన తనయుడు ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. గిరి గారి నాన్న గారు ఈ వేడుక లో భాగం అవ్వడం ,ఈ మూడు జనరేషన్ లను చూడటం హ్యాపీ గా ఉంది. యోగీశ్వర్ కి చాలా మంచి భవిష్యత్తు ఉంది” అన్నారు.

నటుడు శ్రవణ్ మాట్లాడుతూ : ” గిరి గారు సినిమా తీస్తున్నారు అనగానే మొదట నేను అంత గా ఇష్ట పడలేదు. కానీ యోగీశ్వర్ టాలెంట్ ఏంటో సెట్స్ లో తెలుసింది. నా పాత్ర చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఈ సినిమా ఔట్ పుట్ చూసాక చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కు పడింతలు డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

ముఖ్య అతిథిగా వచ్చిన హీరో సుమన్ గారు మాట్లాడుతూ:గిరి నాకు అభిమని మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబెర్.నా సక్సెస్ లొనే కాదు,ప్రతి సందర్భం లోనూ గిరి నాతో ఉన్నాడు.అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం.నా వందో సినిమా చేయాలని గిరి ట్రయ్ చేసాడు.కానీ కుదరలేదు. గిరి తన కొడుకు యోగీశ్వర్ ని ఇంట్రడ్యూస్ చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు అది నా బాధ్యత అనుకున్నాను. యోగీశ్వర్ డాన్సలు ఫైట్స్ లో,బాగా పేరు రావాలని ప్రయత్నించాము.అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకున్నాము.గరుడ వేగ అంజి,ఫైట్ మాస్టర్ నందులను తీసుకోవడం జరిగింది.ఈ సినిమా ఫ్యామిలీతో కలసి వెళ్లే సినిమాగా ఉండాలని తీర్చిదిద్దాం. మహిత్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు.మాకు సగం విజయం దక్కింది అనుకుంటున్నాం.యోగీశ్వర్ అందరికీ నచ్చుతాడు అందరినీ ఎంటర్ టైన్ చేస్తాడు ” అన్నారు

మహిత్ నారాయణ్ మాట్లాడుతూ :” చక్రి గారు నాకు అన్నయ్యే కాదు గురువు కూడా, ఆయన పేరు ని తీసుకొని నేను నా ప్రయాణం మొదలు పెట్టాను. పరారి తో నాకు ఒక మంచి టీం తో వర్క్ చేసే అవకాశం దక్కింది. నిర్మాత గిరి గారు తో నాకు చాలా సంవత్సరాలు అనుబంధం ఉంది. యోగి ని హీరో ని చేద్దాం అనుకున్నప్పుడు నేను కూడా ఒక బాధ్యత గా తీసుకున్నాను. ఇప్పుడు అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంటే,గిరి గారు నా మీద పెట్టు కున్న నమ్మకం నిలబెట్టుకున్నాను అనిపిస్తుంది ” అన్నారు.

దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ : ఈ కథ వెనుక మూడేళ్ల కష్టం ఉంది. ఈ కథ ను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నా కథ కు బెస్ట్ సపోర్ట్ నిచ్చారు. ఒక పెద్ద టెక్నికల్ టీం తో వర్క్ చేయడం న అదృష్టం. మహిత్ గారి మ్యూజిక్ ఆయన ఇచ్చిన సపోర్ట్ పరారి కి పెద్ద సపోర్ట్ గా నిలిచింది. నిర్మాత గిరి గారు బెస్ట్ ప్రొడ్యూసర్ గా నిలుస్తారు ” అన్నారు.

హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ : ” నేను హీరో గా ట్రయ్ చేయడానికి కారణం హీరో గా మారడానికి మా నాన్న గారే కారణం. హీరో సుమన్ గారి తో స్క్రీన్ షేర్ చేసుకుంటాంనని అనుకోలేదు. అది నా అదృష్టం. మా డిఓపి అంజి గారు, ఫైట్ మాస్టర్ నందు గారు ఇచ్చిన సపోర్ట్ సూపర్బ్. మంచి ఎంటర్టైనర్ ని అందించబోతున్నాం , నేను హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ కోసం చాలా మంది మా వెనకాల నిలబడ్డ అందరికీ థాంక్స్ ” అన్నారు.

నిర్మాత గిరి మాట్లాడుతూ : ” ఈ సినిమా ని ఎక్కడా లెక్కలు వేసుకొని నిర్మించలేదు. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని అందించాం. సుమన్ గారు నా అభిమాన హీరో, కానీ ఈ సినిమా చూసాక నా కొడుకు కు ఫ్యాన్ అయ్యాను. ఏదో చేస్తాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. చాలా సర్ప్రైజ్ అయ్యాను. చక్రి గారి తో నాకు మంచి రిలేషన్ ఉంది. చక్రి కోసమే మహిత్ కి అవకాశం ఇచ్చాను. నా నమ్మకం నిల బెట్టారు. సినిమా విషయంలో చాలా సంతృప్తి గా ఉన్నాము” అన్నారు.

హేమంత్ ఆర్ట్స్ పిచ్చోడు నవంబర్ 22న విడుదల !!!

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ నవంవర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.  హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చిపెట్టె అవకాశాలు ఉన్నాయి.
నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.
కథ – స్క్రీన్ ప్లే – నిర్మాత – దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్.. సంగీతం: బంటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ
ఎడిటర్: సంతోష్ గడ్డం
కెమెరామెన్: గోపి అమితాబ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ

హీరో కార్తికేయ ’90ml’ ‘సింగిలు సింగిలు’ పాట విడుదలకి భారీ స్పందన!!

హీరో కార్తికేయ నటించిన 90ml ‘సింగిలు సింగిలు’ పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ చిత్రంలో నటించిన రోల్ రైడా మరియు దర్శకుడు శేఖర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో ఉర్రూతలూగిపోయింది.
ఇదివరకు విడుదలైన ‘ఇనిపించుకోరు ఇనిపించుకోరు’ ‘చాలు చాలు’ పాటలు ఇప్పటికే జనాల నుండి మంచి ఆదరణ పొందుతుండగా ఇప్పుడు విడుదలయిన ఈ పాట సింగిలు సింగిలు అని సాగుతూ సింగిల్ యువతని విపరీతంగా ఆకట్టుకోనుంది.ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధంగా ఉంది.

 
న‌టీన‌టులు:
కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్ , ఆలీ , ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్‌.
సాంకేతిక నిపుణులు:
రచన-దర్శకత్వం
శేఖర్ రెడ్డి ఎర్ర ,సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా:  జె.యువ‌రాజ్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్:  జీఎం శేఖ‌ర్‌, పాట‌లు:  చంద్ర‌బోస్‌, ఫైట్స్:  వెంక‌ట్‌, జాషువా, కొరియోగ్ర‌ఫీ:  జానీ, కో-డైరెక్టర్
బాస్ గూడూరి(సిద్ధు) , ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.సూర్య‌నారాయ‌ణ‌.