Home Blog Page 1018

సెన్సార్ పూర్తి చేసుకున్న “తోలుబొమ్మలాట” ఈ నెల 22 న విడుదల

సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో   విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, హీరోహీరోయిన్లుగా వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా నూతన దర్శకుడు విశ్వ నాథ్ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “తోలుబొమ్మలాట”’ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 22 న విడుదల కానున్న సందర్బంగా నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి మాట్లాడుతూ ”ఒక కుటుంబంలోని మూడు తరాల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వంటి భావోద్వేగాల కలబోత ఈ చిత్రం. ఒక కుర్రాడు ఇంత లోతైన, ఉద్వేగభరితమైన భావాలున్న కుటుంబ కథని ఎలా ఎదుర్కొని, పరిష్కరించాడు అని రేపు తెరపై చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్‌ ఫీలవుతారు. ఏ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కచ్చితంగా అందరి హృదయాల్లో స్థానం సంపాదిస్తుందని మా నమ్మకం. ఇటీవల విడుదలయిన ట్రైలర్ కి మరియు పాటలకి మంచి స్పందన లభించింది . ఓవర్సీస్ విడుదల హక్కులను గోల్డెన్ ఈగిల్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.సి వారు పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు ” అని చెప్పారు.
నటీనటులు:
డా. రాజేంద్రప్రసాద్‌ , విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌
సంగీత, కల్పన, శిరీష సౌగంద్‌, ధన్‌రాజ్‌, పూజా రామచంద్రన్‌, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, ‘తాగుబోతు’ రమేష్‌, ‘బస్టాప్‌’ కోటేశ్వరరావు, అల్లు రమేష్‌ తదితరులు.
సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: మోహన్‌.కె.తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ నూకవల్లి

“బీచ్ రోడ్ చేతన్”సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇస్తున్నాము – చేతన్

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ ఫిలిం “బీచ్ రోడ్ చేతన్”. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను నవంబర్ 16న విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

చిత్ర విలన్ నిర్మల్ భాను మాట్లాడుతూ…
అందరికి కల ఉంటుంది, వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన పర్సన్స్ కావాలి. చేతన్ నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు. నేను ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నటించిన అందరూ బాగా చేశారు, అందరూ కలసి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా తీసాము. చేతన్ అన్ని పాత్రలు బాగా డిజైన్ చేసాడు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మీ అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్న అన్నారు.

కో డైరెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన చేతన్ కు థాంక్స్. ఈ సినిమా హైదరాబాద్ , వైజాగ్ లో చిత్రీకరణ జరిగింది. 150 మంది కొత్త ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటించారు. అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ మూవీలో నటించిన అందరూ నటీనటులు బాగా చేశారు. 22న వస్తోన్న మా సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్న అన్నారు.

ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ…
నవంబర్ 22న మా బీచ్ రోడ్ చేతన్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 200 థియేటర్స్ లో మా సినిమా విడుదల కాబోతోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుండి మా సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తుందని భావిస్తున్నాను. ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నాము, టీజర్ అందరికి నచ్చింది, ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.  22న రాబోతున్న మా సినిమా మీకు నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

టెక్నీషియన్స్:
మాటలు; చేతన్ మద్దినేని, పాటలు: బి. రాజారత్నం, ఎడిటర్: యం.ఆర్. వర్మ, డిఒపి: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె.బెనయ్య, ఫైట్స్: రియల్ సతీష్, నిర్మాత-దర్శకత్వం; చేతన్ మద్దినేని.

“జార్జ్ రెడ్డి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించిన పోలీసులు

  1. విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో పతాకాలపై జీవన్ రెడ్డి దర్శకత్వంలో వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) హీరో గా రూపొందిన ‘జార్జ్ రెడ్డి’ చిత్రం ఈ నెల 22న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈరోజు 17వ తేదీన హైదరాబాద్ నగరంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ వేడుక జరపనున్నట్లు ఇన్ని రోజులు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై యువతలో ఆసక్తి మొదలైంది.కానీ పవన్ వేడుకకు హాజరైతే యువత, స్టూడెంట్ యూనియన్స్ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతులు నిరాకరించినట్టు నిన్న రాత్రి నుండి వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ నడుస్తోంది. అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో సినిమాకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది.
    కానీ చిత్ర యూనిట్ కానీ పవన్ వ్యక్తిగత సిబ్బంది కానీ ఈ విషయమై ఇంకా స్పందించలేదు..

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ `సూప‌ర్‌మ‌చ్చి`లో క‌న్న‌డ బ్యూటీ ర‌చితారామ్‌

.క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `సూప‌ర్‌మ‌చ్చి`. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
క‌ల్యాణ్‌దేవ్‌, ర‌చితా రామ్‌, నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  పులి వాసు
నిర్మాత‌:  రిజ్వాన్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌నోజ్ మావెళ్ల‌
మ్యూజిక్‌:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్
కెమెరా:  శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఆర్ట్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి
పాట‌లు:  కెకె

ఆమని పుట్టినరోజు సందర్భంగా ‘అమ్మ‌దీవెన’ ఫస్ట్ లుక్ విడుదల

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కెతున్న చిత్రం ‘అమ్మ‌దీవెన‌’. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆమ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 16న శ‌నివారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీ‌దేవి, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా

ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో…

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఒక మంచి శుభ సంద‌ర్భంలో పోస్ట‌ర్‌ని విడుద‌ల చెయ్య‌డం చాలా సంతోషంగా ఉంది. నా మిత్రులు చిన్న మారయ్య గుర‌వ‌య్య ప్రొడ్యూసర్స్ గా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వ‌స్తుంది. ఎటువంటి దీవెన అయినా త‌క్కువ‌వ్వొచ్చు కాని ‘అమ్మ‌దీవెన’ ఎక్క‌డా తక్కువ‌కాదు. ఈ చిత్రంలో అమ్మ పాత్ర‌లో న‌టిస్తున్న ఆమ‌నిగారికి అభినంద‌న‌లు తెలియజేస్తున్నా” అన్నారు.

ప్రముఖ నిర్మాత డి.ఎస్‌రావు మాట్లాడుతూ… తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్న. ఆమని గారు ఈ చిత్రంలో న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా పేరు వింటుంటే మాతృదేవోభ‌వ‌ సినిమా గుర్తుకువ‌స్తుంది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయి ప్రొడ్యూస‌ర్లు ఇంకా మ‌రెన్నో చిత్రాలు తియ్యాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

శ్రీ‌దేవి బొంతు మాట్లాడుతూ… ఈ రోజు నిజంగా అమ్మ‌దీవెన లాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూస‌ర్లు డైరెక్ట‌ర్ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా చాలా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవ్వాలని కోరుకుంటున్నా. అమ్మ‌గారి పేరు మీద ప్రొడ్యూస‌ర్లు ఈ సినిమా తీశారు. పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను. సిసింద్రీ నాకు ఫేవరేట్ సినిమా. ఆ సినిమాలో ఆమని గారు చాలా బాగా న‌టించారు. త‌ల్లి దీవెన‌లు ఉంటే మ‌నం ఎల్ల‌వేళ‌లా పై చేయి సాధిస్తాము” అన్నారు.

నటి ఆమ‌ని మాట్లాడుతూ… నేను ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఒక త‌ల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించాము. ఒక తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్ల‌ల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ప‌డుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూస‌ర్లు వాళ్ళ అమ్మ మీద ప్రేమ‌ని సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. శివ‌ గారుఈ సినిమా చెప్పిన‌ప్పుడు అన్ని సీన్స్ చాలా బావుంటాయి. కొన్ని స‌న్నివేశాలు చాలా నాచ‌ర‌ల్‌గా తీశారు. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలోనే డీ గ్లామ‌ర్ పాత్రలో న‌టించాను. మంచి కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. మాటలు, స్లాంగ్ అన్నీ బాగా కుదిరాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోయిన్ ప‌ల్ల‌వి చాలా బాగా న‌టించారు. పోసానిగారి పాత్ర ఈ సినిమాలోచాలా యాప్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పుట్టిన‌రోజు నాడు పోస్ట‌ర్ రిలీజ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

ద‌ర్శ‌కుడు శివ ఏటూరి మాట్లాడుతూ… నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది చాలా మంచి మూవీ ఈ నెల ఆఖ‌రు లోపు ఆడియో విడుద‌ల కాబోతుంది త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం” అన్నారు.

ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, యశ్వంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
దర్శకత్వం: శివ ఏటూరి,
నిర్మాతలు : ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య,
మాటలు : శ్రీను. బి,
సంగీతం : ఎస్.వి.హెచ్,
డి ఓ పి : సిద్ధం మనోహర్,
ఎడిటర్ : జె.సి,
డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి,
ఫైట్స్ : నందు,
పి.ఆర్ఓ. : సాయి సతీష్.

‘దొంగ’ చిత్రంతో కార్తీకి మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది- కింగ్‌ నాగార్జున

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దొంగ’. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. కాగా, ఈ చిత్రం టీజర్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేశారు. కింగ్‌ నాగార్జున, కార్తీ కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు కార్తీ లేటెస్ట్‌ మూవీ ‘దొంగ’ టీజర్‌ను రిలీజ్‌ చేసిన కింగ్‌ నాగార్జున ‘మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది’ అంటూ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. తమిళ్‌ టీజర్‌ను హీరో మోహన్‌లాల్‌, హీరో సూర్య విడుదల చేశారు.
ఈ సినిమాలో కార్తీ క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని టీజర్‌ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. రకరకాల పేర్లతో చలామణి అయ్యే దొంగగా పోలీసుల దృష్టిలో కనిపిస్తాడు కార్తీ. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్సులు ఉంటూనే అక్క, తమ్ముడు మధ్య కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌ కూడా కనిపిస్తాయి. ఈ టీజర్‌ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. దానికి తగ్గట్టుగానే గోవింద్‌ వసంత బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ఖైదీ’ తర్వాత యాంగ్రీ హీరో కార్తీ చేసిన ‘దొంగ’ ఫస్ట్‌లుక్‌తోనూ, టీజర్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సూర్య రిలీజ్‌ చేయగా, టీజర్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేసి బెస్ట్‌ విషెస్‌ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

“లైఫ్ అనుభ‌వించురాజా ” మూవీ ట్రైలర్ లాంచ్‌

రాజారెడ్డి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఎఫ్ అండ్ ఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ తిరుమూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం లైఫ్ అనుభ‌వించు రాజా. రాజారెడ్డి కందాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూత‌న న‌టీన‌టులు జూనియ‌ర్ ర‌వితేజ‌, శృతిశెట్టి, శ్రావ‌ణినిక్కి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని శుక్ర‌వారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ముఖ్య అతిధిగా విచ్చేసిన‌ ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల అయింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో…

రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… ప్ర‌తి ఒక‌ళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఎంజాయ్ చెయ్యాల‌నుకుంటారు. ఎప్పుడూ నిర్మాత అనేవాడు బ్యాక్‌బోన్ ఆఫ్ ద ఫిల్మ్. ముందుగా నేను హోల్ హార్టెడ్ ఐ ఎప్రిషియేట్ ఈ చిత్ర నిర్మాత అయిన రాజారెడ్డిగారు. చిన్న సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేసే టైం. ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. ర‌వితేజ చాలా బాగా చేశాడు. నేను త‌ను చేసిన కొన్ని సీన్స్ చూశాను. హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. మ్యూజిక్‌, కెమెరా, లిరిక్స్ ఈ చిత్రానికి బాగా కుదిరాయి. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్ మాట్లాడుతూః నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ టు ద డైరెక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్ అని అన్నారు.

హీరోయిన్ శ్రావణి నిక్కి మాట్లాడుతూఃముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చాలా బాగా వ‌చ్చింది అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి మమ్మ‌ల్ని ఆద‌రించండి.

హీరోయిన్ శృతిశెట్టి మాట్లాడుతూః నాకు ఈ సినిమాలో న‌టించినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. నేను ఈ స్టేజ్ మీద ఉండ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం షానీకి నా ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. ఈ సినిమాని అంద‌రూ చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించ‌గ‌ల‌రు.

హీరో ర‌వితేజ మాట్లాడుతూఃఈ మూవీలో ఛాన్స్ నాకు ఆడిష‌న్ ద్వారా వ‌చ్చింది. నాకు సురేష్‌గారు ఒక‌రోజు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ట్రైల‌ర్ మీ అంద‌రికి న‌చ్చింది అనుకుంటున్నాను సినిమా కూడా మీ అంద‌రికి న‌చ్చుతుంది. మీరంద‌రూ చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాలి అని అన్నారు.

షానీమాట్లాడుతూః ప్ర‌తి మ‌నిషి లైఫ్‌లో స్వీట్ మూమెంట్ సినిమా ఇది. చాలా క‌ష్ట‌మైన టైంలో హిమాల‌యాల‌కి వెళ్ళి షూట్ చేశాం. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు సురేష్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ ఈవెంట్ కోసం వ‌చ్చిన రాజ్‌కందుకూరిగారికి చాలా థ్యాంక్స్‌. న‌న్ను ఎంతో బ్యూటీగా చూపించిన కెమెరామెన్‌కి థ్యాంక్స్‌. ఆడిష‌న్స్ చేసి అంద‌రూ కొత్త వాళ్ళ‌ని సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్ట‌ర్ ఒక తెలుగ‌మ్మాయి, ఒక బాంబే అమ్మాయిని తీసుకున్నారు.

ద‌ర్శ‌కుడు తిరుమూరు మాట్లాడుతూః నేను ఒక క‌థ ప‌ట్టుకుని చాలా ఆఫీసులు తిరిగాను. కానీ అవ‌కాశాలు రాలేదు. ఒక రోజు క‌థ విని మా మేన‌బావ ప్రొడ్యూస్ చేశారు. ఆడియ‌న్స్‌కి బోర్ కొట్ట‌కుండా రెండు గంట‌లు ఎంట‌ర్‌టెయిన్ చెయ్యాల‌ని ఇది గ్యారెంటీగా మంచి సినిమా అవుతుంది. రాజారెడ్డి మా మేన‌బావ ఆయ‌న ఇంప్ర‌స్ అయి ముందుకు వ‌చ్చి ఈ సినిమాని తీశారు. ఒక్క‌రోజు కూడా షూటింగ్ స్పాట్‌కి రాలేదు. న‌న్ను ఎంతో బాగా ఎంక‌రేజ్ చేశారు. డ‌బ్బులు విష‌యంలో కూడా ఎక్క‌డా వెన‌కాడ‌కుండా తీశారు అన్నారు.

న‌టీన‌టులుః ర‌వితేజ‌, శ్రావ‌ణినిక్కి, శృతిశెట్టి, షాని, ప‌వ‌న్ నాగేంద్ర‌, ర‌త్నాక‌ర్‌, అనీలా త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః ర‌జ‌నీ, మేక‌ప్ఃసుమ‌న్‌, మ్యూజిక్ఃరామ్‌, ఎడిటింగ్‌, సునీల్‌మ‌హ‌రాజ్‌, నిర్మాతఃరాజారెడ్డి కందుల‌, ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వంఃసురేష్ తిరుమూర్‌

నా మాటే విన‌వా పోస్ట‌ర్ లాంచ్‌

శ్రీ‌శివాని ఆర్ట్స్& పి.ఎస్‌.మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై లింగ‌స్వామి వేముగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌శంక‌ర్‌గౌడ్ నిర్మిస్తున్నచిత్రం నా మాటే విన‌వా. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌత‌మ్‌రాజు త‌న‌యుడు కృష్ణ, కిర‌ణ్‌చ‌త్వాని జంట‌గా న‌టిస్తున్నారు. సాయికుమార్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, కోటేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఛైర్మ‌న్ మోహ‌న్ వ‌డ్ల‌పాటి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఫిల్మి ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ చైర్మ‌న్ వ‌డ్ల‌పాటి మాట్లాడుతూ… న‌న్ను అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూస‌ర్స్ త‌ర‌పున ప్ర‌తి చిన్న సినిమాకి మా త‌ర‌పు స‌హాయ స‌హ‌కారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాకి కూడా మా స‌హ‌కారాలు త‌ప్ప‌కుండా అందిస్తాము. ఈ మూవీ యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

డైరెక్ట‌ర్ లింగ‌స్వామి మాట్లాడుతూ… నాది తొమ్మిద‌వ సినిమా నేనుగ‌తంలో కూడా అన్నీ మంచి చిత్రాలు చేశాను. 6 నంది అవార్డుల‌ను కూడా అందుకున్నాను. ప్రొడ్యూస‌ర్ నాకు మంచి మిత్రుడు. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇది. హీరో కృష్ణ యూత్ ఎన‌ర్జిటిక్ హీరో. కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్‌లో మంచి ఫైట‌ర్ అన్న పేరు వ‌చ్చింది. ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మ‌ర్ అని పేరు వ‌స్తుంది. ప్రొడ్యూస‌ర్స్ ఖ‌ర్చుకి ఎక్క‌డా వెన‌కాడ‌లేదు. రెండు పాట‌లు మ‌లేషియాలో తీశాం. కోటేశ్వ‌ర్‌రావు, తిరుప‌తి దొరై ఈ చిత్రంలో మంచి పాత్ర‌లు పోషించారు. ఐదు పాట‌లు ఏలేంద్ర‌గారు అందించారు. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ మ‌నోహ‌ర్‌గారు చాలా రిచ్‌గా తీశారు. స‌హ‌క‌రించిన జ‌గ‌దీశ్వ‌రావుగారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా సెన్సార్‌కి అప్లై చేశాం సెన్సార్ అవ్వ‌గానే విడుద‌ల తేదీని ఖ‌రారు చేస్తాము. బీటెక్ స్టూడెంట్స్ నిశ్చితార్ధం త‌రువాత ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణించే క‌థాంశంతో చివ‌రికి మంచి ఫ్రెండ్స్ అయి పెళ్లి వ‌ర‌కు ఎలా వ‌చ్చారు అనేది చిత్ర క‌థ‌. క్లైమాక్స్‌లో సాయికుమార్ గారి పాత్ర చాలా కీల‌కం. మా ఎంటైర్ యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ… ఫ‌స్ట్ కాపీ చూశాక చాలా ఆనందంగా ఫీల‌య్యాం. ఈ విష‌యం ప్రెస్‌తో పంచుకోవ‌డానికి ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశాం. ఈ సినిమాలో పాట‌లు చాలా బాగా కుదిరాయి ఏలేంద్ర‌గారు చాలా థ్యాంక్స్ అన్నారు. వ‌రంగ‌ల్ మీద తీసిన మాస్ సాంగ్ చాలా బావుంది. థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ . రెండు పాట‌లు అర‌కులో, రెండు మ‌లేషియాలో చిత్రీక‌రించాం. న‌న్ను యాక్ష‌న్ నుంచి ల‌వ‌ర్ బాయ్‌గా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ యేలేంద్ర మ‌హావీర మాట్లాడుతూ…మా ప్రొడ్యూస‌ర్లు న‌న్ను చాలా బాగా చూసుకున్నారు. బ్యాక్‌గ్రైండ్ స్కోర్ గురించి సాయికుమార్‌గారు కూడా న‌న్ను బాగా అప్రిషియేట్ చేశారు. హీరో కూడా చాలా బాగా చేశారు. ఈ చిత్రంలో ఐదు పాట‌లున్నాయి. ప్ర‌తి పాట ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌రుండి సిట్యువేష‌న్‌కి త‌గ్గ‌ట్లు రాయించుకున్నారు.

ప్రొడ్యూస‌ర్ శంక‌ర్‌గౌడ్ మాట్లాడుతూవ‌… నాకు ఈ క‌థ న‌చ్చి సినిమా చేశాను. ఇది ల‌వ్ క‌మ్ ఫ్యామిలీ స్టోరీ మీరంద‌రూ తప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, తిరుప‌తిదొరై, లిరిసిస్ట్ ఘ‌న‌యాది త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌వికిర‌ణ్‌, శ్రీ‌నివాస్‌చౌద‌రి, అనంత్‌, శ్రీ‌రామ్‌, తిరుప‌తి సిద్దిపేట‌, వ‌రంగ‌ల్‌భాషా, వి. జ‌గ‌దీశ్వ‌ర‌రావు, హేమ‌, వీణాసుంద‌ర్‌, జ‌య‌వాణి, జ‌బ‌ర్ద‌స్థ్ రాఘ‌వ‌, జ‌బ‌ర్ద‌స్త్ వెంకీ, జ‌బ‌ర్ద‌స్థ్ చిరంజీవులు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః యేలేంద‌ర్ మ‌హావీర్‌, డిఓపి మ‌నోహ‌ర్‌, ఎడిటింగ్ః సంజీవ‌రెడ్డి, పాట‌లుఃఘ‌న‌యాది, ఫైట్స్ఃథ్రిల్ల‌ర్ మంజు, ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్ఃదూలం ర‌మేష్‌, నిర్మాణ సార‌ధ్యంః ప‌ల్లెశంక‌ర్‌గౌడ‌ర్‌, స‌హ‌నిర్మాతఃపి. వీరేంద‌ర్‌రెడ్డి, నిర్మాత‌లుఃపి. విన‌య్‌కుమార్‌, శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌క‌త్వంఃలింగుస్వామి వేముగంటి.

ఎవరు చూపించని యూనిక్ పాయింట్ ని ‘తోలుబొమ్మలాట’లో చూపించడానికి ప్రయత్నించాం! – హీరో విశ్వంత్

కేరింత – మనమంతా – జెర్సీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించిన యువ నటుడు విశ్వంత్ ఇప్పుడు అదే తరహాలో మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి నిర్మాతగా విశ్వ‌నాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన తోలు బొమ్మలాట చిత్రంలో విశ్వంత్ కథానాయకుడిగా నటించాడు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్,  వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరో విశ్వంత్ మీడియా తో  ముచ్చటించారు . 

తోలు బొమ్మలాట ఎలా మొదలైంది?

జెర్సీ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్ నాకు కథ చెప్పాలని చాలా మొహమాటంగా అడిగాడు. విశ్వనాథ్ నాకు కేరింత సమయం నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇక జెర్సీ సినిమా చేయడానికి ఒప్పుకోగానే ఆఫీస్ లో కలిసి గత మూడు నెలలుగా ఒక కథ చెప్పాలని అనుకుంటాను అని చాలా కూల్ గా కథ చెప్పాడు. కథ చాలా బాగా నచ్చింది చేసేద్దాం అన్నాను. చాలా మందిని హీరోలుగా అనుకున్నప్పటికి ఫైనల్ గా నన్ను ఫిక్స్ చేశారు. అయితే జెర్సీ సినిమా ఇంకా అప్పటికి పూర్తవ్వలేదు. అప్పుడే తోలుబొమ్మలాట డేట్స్ సెట్ చేసుకున్నారు. రెండు క్లాష్ అవుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి తో ముందే ‘మళ్ళీ రావా’ సినిమా చేయాల్సింది. అది అనుకోకుండా మిస్ అయ్యాను. ఇక జెర్సీ ఏ మాత్రం మిస్ అవ్వకూడదని రెండు మ్యానేజ్ చేయాలని అనుకున్నాం. కొన్ని రోజులు అలా చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

డేట్స్ క్లాష్ అవుతున్నప్పుడు ఒక సినిమా వదులుకోవా లని అనిపించిందా..?

నేను మొదట ఈ సినిమా కథ కూడా చాలా లైట్ గా విన్నాను. నాకు కొంచెం మొహమాటం. డైలాగ్స్ ట్రాక్ కూడా వినలేదు. నేను ఒక కథ ఒకే చేయడానికి ఒకటికి మూడు సార్లు చదివిగాని ఒకే చేయను. ఎందుకంటే ఎదో ఒకటి చేయాలని ఆలోచించను. సినిమాలకోసం చదువు, అమెరికా అన్ని వదిలేసుకున్నా. మంచి సంపాదన వద్దనుకొని మంచి సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు మంచి అవకాశాలను మిస్ చేసుకోకూడదు అనుకున్నా. డైరెక్టర్ కి ముందే చెప్పాను.. ఒకే వేళ డేట్స్ కుదరకపోతే వదిలేస్తాను అని చెప్పాను. ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ వదిలేసే వరకు వచ్చింది. కానీ ఫైనల్ గా మంచి సినిమా చేశాం.

ఈ సినిమాలో మీరు హీరోనా? పాత్రలు ఎలా ఉంటాయి?

ఈ సినిమాలో నాది ఒక క్యారెక్టర్. కథలో ఎవరు హీరో, హీరోయిన్ గా కనిపించరు. ఇలాంటి కథలో అలా కనిపించారు అంటే సినిమా ఫెయిల్ అయినట్లే. ప్రతి ఒక్కరిది ఒక స్పెషల్ క్యారెక్టర్. ఒక తాత ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. అలాగే మనవడి పాత్ర కూడా అంతే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాలో పాత్రలు కథకు తగ్గట్టు ఉండాలి. అదొక్కటి నేను నమ్ముతాను. హీరో హోరోయిన్ కంటే సినిమా కథ గొప్పది. క్యారెక్టర్లు లిమిటేషన్ లోనే ఉండాలి. అది దాటి వెళ్ళిపోతే సినిమా ప్లాప్ అయినట్లే. అలాంటి ఆలోచనతో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఇంటికెళ్లిపోవచ్చు.


ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీ టాలెంట్ కి లీడ్ కి అవకాశం లేకుండా పక్కకు పెద్ద హీరో ఉంటున్నాడు. అది ఇబ్బందిగా అనిపించిందా?

అలా ఏమి అనుకోలేదు. పర్సనల్ గా ఫీల్ అవ్వలేదు. జెర్సీ అనే సినిమా గౌతమ్ అనే పాత్రది. అది కంప్లీట్ గా నాని అన్న సినిమా. అందులో నేను ఒక పార్ట్. ముందే కథ విని ఒప్పుకున్నా. అలాంటి ఫీల్ ఉంటే కథ వినగానే ఒప్పుకొము కదా. మనమంతా ఒప్పుకున్నప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో కూడా చాలా మంది ఇప్పటికి గుర్తుపడతారు.  పెద్ద ప్రాజెక్ట్ అని చేయలేదు. పాత్ర చేసినప్పుడు విలువలు అవసరం. ఎక్కడా కూడా మీటర్స్ పెట్టుకోకూడదు. కథ బావుంటే చాలు.


తోలు బొమ్మలాట ఎలా ఉండబోతోంది?

ఫ్యామిలీ డ్రామాలో చాలా రకాల సినిమాలు వచ్చాయి. ఒక ఫ్యామిలిలో అందరూ ఒకే చోట కలవడానికి వస్తారు. ఎవరు చూపించని యూనిక్ పాయింట్ ని ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాం.కొన్ని రోజులు జరిగే జర్నీలో మనుషులు ఏ విధంగా మారిపోతారు? అనే కాన్సెప్ట్ నుంచి చిన్న చిన్న పాయింట్స్ ని సినిమాలో హైలెట్ గా చూపించాం. “గొప్పదిరా మనిషి పుట్టుక” అనే సాంగ్ రిలీజ్ చేశాం. అప్పుడే సినిమా భావం అందరికి అర్థమై ఉంటుంది. ఎప్పటికైనా అందరూ వెళ్లిపోవాల్సిందే.. మధ్యలో జరిగే నాటకమే జీవితం అనే లైన్ లో సినిమా నడుస్తుంది. సినిమాలో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఒక బావ మరదలి మధ్య ప్రేమ.. వారిద్దరికీ పెళ్లి చేయాలనే కోరుకునే తాత.. ఇలా సాగుతున్న క్రమంలో సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుంది.

రాజేంద్రప్రసాద్ గారితో నటించడం ఎలా ఉంది?

సీనియర్స్ తో ఉన్నప్పుడు కొంచెం మొహమాటం భయం ఉంటుంది. కానీ వారి నుంచి అలాంటి ఫీల్ ని రానివ్వలేదు. చాలా సరదాగా ఉంటారు. ఆయన వచ్చి ముందే పలకరించడంతో చాలా ఫ్రీ అయిపోతాం. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఆయనతో కామెడీ చేయడం చాలా కష్టం. టైమింగ్ పట్టుకోవడం కష్టమే. సీన్ సరిగ్గా చేయకపోతే నాకు చివాట్లు ఏమి పడలేవు గాని. హీరోయిన్ హర్షిత గట్టిగా తినేసింది. నాకు ఆయనతో నటించడం ఇబ్బందిగా ఏమి అనిపించలేదు.

తోలు బొమ్మలాట ఎవరు ఆడిస్తారు?

వెన్నెల కిషోర్ – రాజేంద్రప్రసాద్ ..ఆ తరువాత మేము.. ఇలా ప్రతి ఒక్కరు సందర్భాన్ని బట్టి ఆడిస్తారు. ఒకరినొకరు ప్రేరణ పొందే అంశాలు చాలా ఉంటాయి. సినిమాలో డైలాగ్స్ కావాల్సిన స్పెన్ లో అద్భుతంగా వచ్చాయి. మిగతా టైమ్ లో నార్మల్ గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు ఉంటాయి.
మ్యూజిక్ కూడా సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది. ఒక సీన్ లో నేను ఎంత ఎడిపిస్తున్నా.. ఆడియెన్స్ ఆ ఫీల్ కలగాలి అంటే మ్యూజిక్ పనితనం కనిపించాలి. 13 నిమిషాల క్లయిమ్యాక్స్ లో అది హై లెవెల్లో కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ అద్భుతంగా ఇచ్చాడు. సినిమా ప్రివ్యూ చూసి కొంతమంది సన్నిహితులు  ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు విశ్వనాథ్ కి మొదటి సినిమా అయినప్పటికీ చాలా చక్కగా డీల్ చేశాడు. సీనియర్ డైరెక్టర్స్ తో చాలా బాగా వర్క్ చేయించుకున్నాడు. ఎమోషనల్ అనేది యూనివర్సల్ పాయింట్ అందుకే ఈ కథ ఎంచుకున్నాడు. తోలు బొమ్మలాట లో మన బంధువులు ఉన్నట్లు ఒక ఫీల్ కలుగుతుంది.

నిర్మాత గురించి చెప్పాలంటే..

దుర్గా ప్రసాద్ గారు యూఎస్ లో ఉంటారు. ఆయాన్ డాక్టర్. సినిమా చేసుకొమ్మని డబ్బులు ఇచ్చారు. సినిమా చేస్తున్నంత సేపు కనపడలేదు. ఫస్ట్ కాపీ చూశాక అందరికంటే ఎక్కువగా ఆయనకు సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. సినిమా చాలా బావుందని చెప్పి.. క్లయిమ్యాక్స్ చూసినప్పుడు చిన్నపిల్లాడిలా ఎమోషన్ అయ్యారు. ఓ విదంగా మా అందరికి ఆయనే మంచి బూస్ట్ ఇచ్చారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి..

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ లో ఒక సినిమా వస్తుంది. డిసెంబర్ ఎండ్ కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. అదొక బ్యూటీఫుల్ థ్రిల్లర్ కాన్సెప్ట్. ఆ సినిమాలో సోలో హీరోగానే కనిపిస్తున్నా. పోస్టర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఆ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూస్తారు. ‘కాదల్’ అనే మరో సినిమా చేస్తున్నా. ఆ తరువాత
కాకినాడ కుర్రోడు అనే డిఫరెంట్ సినిమాతో వస్తాను. నెక్స్ట్ నా నుంచి మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. ఇక తోలుబొమ్మలాట ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నా..

తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ చిత్రాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు – సందీప్ కిషన్

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “తెనాలి రామకృష్ణ”. ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జీ.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…

అందరికి నమస్కారం. మా సినిమాను చూడ్డానికి థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్న అందరికి థాంక్స్. నవ్వించడానికి మేము సినిమా తీశాము ఆడియన్స్ అదే చేస్తున్నారు. సినిమాలో కామెడీ ఉంది, మ్యూజిక్ బాగుంది, ట్విస్ట్ లు బాగున్నాయని అంటున్నారు మాకు అదే చాలు. రెస్పాన్స్ బాగుంది. నా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కు ధన్యవాదాలు, సినిమాకు వచ్చే రెస్పాన్స్ తో మా యూనిట్ సభ్యులు అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్…

సినిమాకు మార్నింగ్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్, తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ చిత్రంలో నటించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ కు అభినందనలు తెలువుతున్నాను అన్నారు.

ఎడిటర్ చోటా కె ప్రసాద్ మాట్లాడుతూ..

మార్నింగ్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. చాలా మంది కాల్స్ చేసి చెబుతున్నారు. మేము హిట్ కొట్టామని గర్వాంగా చెబుతున్నాను, మా సినిమాను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..

మేము ఈ సినిమా నవ్వించానికి తీసామని ముందు నుండే చెబుతూ వస్తున్నాను. రివ్యూస్ ను స్వాగతిస్తున్నాను. నాకు  వచ్చే కాల్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఆడియన్స్ ను నవ్విస్తుందని. బోర్ కొట్టకుండా సినిమా ఉందని అంటున్నారు. ప్రతి షోకు జనాలు పెరుగుతున్నారు, ఆ విషయం మమ్మల్ని సంతోష పెట్టింది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ప్రేత్యేక ధన్యవాదాలు, ఆడియన్స్ ఈ సినిమాలో చాలా ఎపిసోడ్స్ లో నవ్వుతున్నారని తెలిపారు.

నిర్మాత సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ…

సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి థియేటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మా సినిమాను ఇంతటి సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.