Home Blog Page 1019

“విజయ్ సేతుపతి” సినిమా రివ్యూ

Release date : Nov 15, 2019
Cinemarangam.com Rating : 2.75/5
movie name:Vijay sethupathi
Starring : Vijay Sethupathi,Raashi Khanna, Nivetha Pethuraj,Nassar, Soori
Director : Vijay Chandar
Producers : Ravuri V Srinivas
Music Director : Vivek-Mervin

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన “పేట” చిత్రంతో తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయసేతుపతి తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి పరిచయం అయ్యారు.అలాగే ఇటీవలే మెగాస్టార్ నటించిన “సైరా”తో మరింత సుపరిచితం అయ్యారు.తన నటనతో విలక్షణ నటునిగా గుర్తింపు తెచ్చుకొని ఇటు తెలుగులో కూడా మంచి స్పందనను సొంతం చేసుకొని విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “విజయ్ సేతుపతి” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ చిత్రం ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు  తెలుసుకుందాం…

కథ :
కథలోకి వెళ్లినట్టయితే చరణ్(విజయ్ సేతుపతి)సినిమాల్లో కమెడియన్ గా అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.మరోపక్క రామాపురం అనే ఊరిలో పేరు మోసిన కార్పొరేటర్ (సంజయ్)రవికిషన్ ఓ కాపర్ ఫ్యాక్టరీను తీసుకురావాలని ప్రయత్నించగా ఆ ఊరి ప్రజలు అడ్డు పడతారు.ఇదే ఊరికి చెందిన రైతే విజయ్ సేతుపతి.అయితే ఆ చరణ్ మరియు ఈ విజయ్ సేతుపతిలు ఒక్కరేనా లేక ఇద్దరా??ఎన్నో అనర్ధాలను కలుగ జేసే ఆ ఫ్యాక్టరీను ఆ ఊరిలో రాకుండా ఎవరు ఆపగలిగారు? ఈ కథకు హీరోయిన్ కమలిని(రాశిఖన్నా)కు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి?అన్నవి తెలియాలంటే ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మొదటి ప్లస్ పాయింట్ ఏమిటంటే నిర్మొహమాటంగా విజయ్ సేతుపతి నటన అనే చెప్పాలి.ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండాఫ్ లో కానీ వచ్చే యాక్షన్ సీన్స్ లో విజయ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ప్రదర్శించారు.చరణ్ మరియు విజయ్ సేతుపతి ఇలా రెండు షేడ్స్ లో విజయ్ నటన ప్రేక్షకులను తప్పక మెప్పిస్తుంది. అంతేకాకుండా కొన్ని కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సేతుపతి నటనా చాతుర్యం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అలాగే కొన్ని కామెడీ సీన్స్ లో అయితే విజయ్ టైమింగ్ అదిరింది అనే చెప్పాలి.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కమెడియన్ సూరి మరియు విజయ్ సేతుపతిల మధ్య నడిచే ప్రతీ కామెడీ ట్రాక్ కూడా హిలేరియస్ గా పండింది.ఈ ట్రాక్స్ అన్ని దర్శకుడు చక్కగా రాసుకున్నారు.అలాగే ఫస్టాఫ్ లోని సేతుపతి కుటుంబాన్ని కూడా ఒక విభిన్నమైన కోణంలో చూపిన విధానం కూడా బాగుంటుంది.అలాగే హీరోయిన్ రాశిఖన్నా చిత్రంలో కీలక పాత్ర పోషించింది.నటన పరంగా మరోపక్క గ్లామర్ పరంగా రాశిఖన్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది.
అలాగే సెకండ్ హీరోయిన్ నివేత పెతురాజ్ తన పాత్ర చిన్నదే అయినా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంటారు.అలాగే నెగిటివ్ షేడ్ పాత్రల్లో కార్పొరేట్ బిజినెస్ మాగ్నెట్ గా కనిపించిన రవి కిషన్ మరియు పొలిటిసియన్ గా అషుతోష్ రానా మరియు మరో కీలక పాత్రలో కనిపించిన నాజర్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.అలాగే విజయ్ ను ఎలివేట్ చేసే సీన్స్ లో కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ లో కానీ వివేక్ – మెర్విన్ లు అందించిన నేపథ్య సంగీతం బాగుంది.అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ఫస్టాఫ్ కు మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది.దీనిని దర్శకుడు విజయ్ చందర్ తెరకెక్కించిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :
హీరోగా విజయ్ సేతుపతికి ఇది తెలుగులో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక కొత్తగా అంటే ఈమధ్య కాలంలోనే తీసిన సినిమాగా అనిపించకపోవచ్చు.హీరోయిన్స్ ఇతర క్యాస్టింగ్ అంతా కూడా బాగా తెలిసిన వారు కొత్త వారు అయినా సరే మొదటిసారి చూసినపుడు మాత్రం ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక రీసెంట్ డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి రాకపోవచ్చు.
అలాగే ముందు అంతా మంచి హిలేరియస్ గా మంచి ట్విస్ట్ తో కొనసాగిన ఫస్ట్ హాఫ్ సెకండాఫ్ కు వచ్చేసరికి అంతే స్థాయిలో నిరుత్సాహ పరుస్తుంది.దీనికి కారణం ఈ టైపు స్టోరీ లైన్ తో గతంలో తమిళ్ ”కత్తి” తెలుగులో “ఖైదీ నెం 150”, అలాగే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ తెలుగులో మనకి బాగా తెల్సిన కొన్ని సినిమాలు కలిపి తీసినట్టుగా సెకండాఫ్ అనిపిస్తుంది.ఈ విషయంలో దర్శకుడు విజయ్ చందర్ కొత్తగా ఆలోచించి తెరకెక్కించి ఉంటే బాగుండేది.అంతే కాకుండా ఫస్ట్ మరియు సెకండాఫ్ లలో సాగదీత కూడా కాస్త ఎక్కువగానే ఉంది.
ఇది అలా వెళ్తున్న సినిమా ఫ్లోను దెబ్బ తీసే అంశంగా మారింది.అలాగే మోస్ట్ పవర్ ఫుల్ కార్పొరేట్ విలన్ గా చూపించిన రవి కిషన్ పాత్రకు చివర్లో సింపుల్ ఎండింగ్ ఇవ్వడం అంతగా ఆకట్టుకోదు.ఫస్టాఫ్ లో హీరోయిన్ రాశి ఖన్నా పాత్రను ఎంతైతే కీలంగా మలిచారో సెకండాఫ్ కి వచ్చేసరికి చాలా సేపటి వరకు పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది.అంతే కాకుండా సెకండాఫ్ లో వచ్చే నివేత పెతురాజ్ కు కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించదు.అలాగే రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్,పాటలు మరియు క్లైమాక్స్ కు ఏమంత మెప్పించవు.

సాంకేతిక వర్గం :
మొదటగా దర్శకుడు విజయ్ చందర్ కోసం చెప్పుకున్నట్టయితే విజయ్ ఇది వరకే చూసేసిన తీసిన కాన్సెప్టునే హీరోను ఎలివేట్ చేసే సీన్స్ లాంటి మెళుకువలు జోడించే యత్నం బెడిసికొట్టింది.ఓ మాదిరిగా ఫస్ట్ హాఫ్ ను బాగానే నడిపించిన దర్శకుడు రొటీన్ కథాంశంతో సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా సోల్ ను దెబ్బ తీశారు.కేవలం సేతుపతిని ఎలివేట్ చెయ్యడం కొన్ని కీలక ఫ్యామిలీ మరియు కామెడీ ఎపిసోడ్స్ పైనే దృష్టి పెట్టిన దర్శకుడు సినిమాకు అత్యంత కీలకమైన కథ విషయంలో నిర్లక్ష్యం వహించి రొటీన్ అనిపించారు.అలాగే ఆర్ వేల్ రాజ్ అందించిన సినిమాటోగ్రఫీ ఎక్కడ ఎలా ఉండాలో చాలా సహజంగా బాగుంది.
ఇక సంగీత దర్శకులు వివేక్ మరియు మెర్విన్ లు అందించిన పాటలు పర్వాలేదనిపించినా సేతుపతిని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది.సినిమా ఫస్ట్ మరియు సెకండాఫ్ లలో అక్కడక్కడా కొన్ని సాగదీతగా ఉండే సీన్లను ఎడిటర్ ప్రవీణ్ కత్తిరించి ఉంటే బాగున్ను.అది మినహాయించి మిగతా ఎడిటింగ్ పర్వాలేదు. ఇకపోతే నిర్మాణ సంస్థ హర్షిత మూవీస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.అలాగే తెలుగు వెర్షన్ లో విజయ మూవీస్ వారు మంచి అవుట్ ఫుట్ అందించారు.

తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామా “విజయ్ సేతుపతి” కి తెలుగులో ఊహించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు.హిలేరియస్ కామెడీ ట్రాక్స్ మరియు కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించినా సెకండాఫ్ కు వచ్చేసరికి రొటీన్ కథాంశంతో అక్కడక్కడా సాగదీతతో నిరాశపరిచారు.ఓవరాల్ గా ఈ విజయ్ సేతుపతి మాస్ ఆడియన్స్ కు ఓ మాదిరిగా ఎక్కినా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించుకుంటాడు.

ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 6న `ప్రెష‌ర్ కుక్క‌ర్` గ్రాండ్ రిలీజ్‌

సాయి రోన‌క్‌, ప్రీతి అర్సాని హీరో హీరోయిన్లుగా సుజోయ్‌, సుశీల్ ద‌ర్శ‌క ద్వ‌యం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `ప్రెష‌ర్ కుక్క‌ర్‌`. క‌రంపురి క్రియేష‌న్స్‌, మైక్ మూవీస్ ప‌తాకాల‌పై  సుజోయ్‌, సుశీల్‌, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 6న‌ ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ `అభిషేక్ పిక్చ‌ర్స్‌` అభిషేక్ నామా విడుద‌ల చేస్తున్నారు.
ఇటీవ‌ల ఈ సినిమా క‌థ న‌చ్చ‌డంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమా టీజ‌ర్‌ను క‌ట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని, రాహుల్ రామ‌కృష్ణ‌, రజ‌య్ రోవాన్‌, తనికెళ్ల భ‌ర‌ణి, సీవీఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  సుజోయ్‌, సుశీల్‌
నిర్మాత‌లు:  సుశీల్‌, సుజోయ్‌, అప్పిరెడ్డి
సినిమాటోగ్ర‌పీ:  న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి
సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
బీజీఎం:  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
ఎడిట‌ర్‌:  న‌రేష్ రెడ్డి జొన్న‌
పి.ఆర్‌.ఒ:  వంశీశేఖ‌ర్‌

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా `అప్పుడు-ఇప్పుడు` మూవీ టీజర్ లాంచ్!!

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైన  ఫస్ట్ లుక్ కి,   కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి, ఇటీవల  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా లేటెస్ట్ గా `అప్పుడు-ఇప్పుడు` మూవీ టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నారు.
దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – “మా `అప్పుడు-ఇప్పుడు` చిత్రం టీజర్ ను పూరి జగన్నాథ్ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.  మా యూనిట్ తరుపున ఆయనకు ధన్యవాదాలు. ఈ మూవీ ఒక  ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్  భరద్వాజ్ సంగీతం మా  సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది “ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ “పూరి జగన్నాథ్ గారు మా టీజర్ ను రిలీజ్ చేయడం హ్యాపీ గాఉంది. ఇప్పటికే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు టీజర్ తో ఇటు అభిమానుల్లో అటు  ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు చలపతి పువ్వల, కొత్తవారైనా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం“ అన్నారు.
సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి …
సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి,
ఆర్ట్: ఠాగూర్,
లిరిక్స్ః చిరావూరి విజయకుమార్,
ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,
సంగీతం: పద్మానావ్ భరద్వాజ్,
నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు,
దర్శకత్వం: చలపతి పువ్వల.

రాహు ట్రైలర్ లాంచ్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న రాహు ట్రైలర్ ని దర్శకుడు వీరు పోట్ల లాంచ్ చేశారు.
సిధ్ శ్రీరామ్ పాడిన “ఏమో ఏమో ” పాట  వన్ మిలియన్ వ్యూస్ ని సాధించి  రాహు పై అంచనాలు పెంచింది.  చిత్ర యూనిట్ తో పాటు, మధుర శ్రీధర్ , రచయిత బి వి యస్ రవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులు గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా
దర్శకుడు సుబ్బు వేదుల    మాట్లాడుతూ
” మమ్మల్ని  సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి థాంక్స్ .  రాహు అంటే అందరూ జాతకాలు స్టోరీ అనుకుంటున్నారు. కానీ మా స్టోరీ అది కాదు. హీరోయిన్ కి ఒక డిజార్డర్ ఉంటుంది, అది ఒక రాహు లాంటిది. అలాగే తన జీవితంలో మరో  రాహు బయట ఉంటాడు. ఈ రెండు సమస్యల పై తాను చేసిన పోరాటమే రాహు కథ. హై టెక్నికల్  వాల్యూస్ తో ఈ కథ ను తెరకెక్కించాము. నాకు సహకరించిన నా టీం కి థాంక్స్.” అన్నారు.
డిఒపీ సురేష్ మాట్లాడుతూ  : “ఒక మంచి టీం తో పని చేయడం చాలా ఆనందం గా ఉంది. మధురా  శ్రీధర్ గారు  అందిస్తున్న సపోర్ట్ కి థాంక్స్ ” అన్నారు.

మ్యూజిక్ ప్రవీణ్ లక్కారాజు మాట్లాడుతూ    : “ఏమో ఏమో పాటకు వస్తున్న రెస్పాన్స్ బాగుంది . మధురా శ్రీధర్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సెకండ్ ఆఫ్  బ్యాగ్రౌండ్ స్కోర్ కి చాలా స్కోప్ ఉంది. దర్శకుడు సుబ్బు  చాలా ఫ్రీడమ్ ఇచ్చారు . ” అన్నారు.

చలాకీ చంటి మాట్లాడుతూ  : నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్. నా పాత్రకు చాలా స్కోప్ ఉంది. మంచి టీం తో వర్క్ చేసాను ” అన్నారు.

నిర్మాత ల్లో ఒకరైన
శ్రీ శక్తి బాబ్జి మాట్లాడుతూ  : “దర్శకుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగా వచ్చింది.  రాహు సినిమా మాకు సంతృప్తి నిచ్చింది” అన్నారు.

నిర్మాత ఎ వి ఆర్ స్వామి మాట్లాడుతూ :
” ఒక మంచి టీం తో రాహు సినిమా ని నిర్మించాము.
సినిమా టీజర్, కి  పాట లకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
మా సినిమా కు సపోర్ట్ చేస్తున్న  మధురా శ్రీధర్ గారి కి థాంక్స్ ” అన్నారు.

హీరోయిన్ కృతి   మాట్లాడుతూ : “రాహు మూవీ
నాకు చాలా స్పెషల్, నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు కి చాలా థాంక్స్.  నాకు ఈ పాత్ర కు చాలా  ఛాలెంజ్  గా ఉంది. … టీజర్ బాగా రీచ్ అయి నందుకు చాలా అందంగా ఉంది” అన్నారు.

హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ  : ” దర్శకుడు
సుబ్బు కి చాలా  థాంక్స్.  రాహు టీం లో చాలా ఎనర్జీ ఉంది. ఈ టీం తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందం గా ఉంది. ప్రొడ్యూసర్స్ కి చాలా  థాంక్స్” అన్నారు.

మధురా శ్రీధర్  మాట్లాడుతూ ” ఇప్పుడు థ్రిల్లర్స్ యుగం నడుస్తోంది. సుబ్బు  మంచి స్టోరీ టెల్లర్. ఇప్పుడు సినిమాలు ఒక పాట తో రిజిస్టర్ అవుతున్నాయి.  ఓపెనింగ్స్ తెస్తున్నాయి.  సిధ్ శ్రీరామ్ పాడిన ఏమో ఏమో సాంగ్ రాహు కి మంచి హైప్ ని తెచ్చింది. ఈ కథ నాకు తెలుసు. చాలా కొత్త గా ఉంది.  మధురా ఆడియో ద్వారా  రాహు సినిమా పాటలు విడుదల అవడం  ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను.” అన్నారు.

బి వి యెస్ రవి మాట్లాడుతూ  :
“ఫిల్మ్ మేకర్స్ ,  టెక్నీషియన్స్ థ్రిల్లర్ జనర్ లో సినిమాలు చేయడానికి బాగా ఇష్ట పడతారు. వాళ్లకు కొత్త గా  చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ట్రైలర్, సాంగ్స్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి.  ఆర్టిస్ట్ లు
మూడ్ ని అర్థం చేసుకొని పని చేయాలి.  రెగ్యులర్ స్టోరీస్ చూడకుండా నిర్మాతలు  థ్రిల్లర్ కి ఒప్పుకోవడం గ్రేట్ ” అన్నారు.

దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ : ” రాహు ట్రైలర్ చాలా బాగుంది. ఆడియెన్స్  యాక్సప్ట్  చేస్తారని నమ్ముతున్నాను. కథ నాకు తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  కృతి, అభి బాగా చేశారు అల్ ద బెస్ట్  అన్నారు ”

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.
టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : అమర్ రెడ్డి, సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు, ఈశ్వర్.

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, నిర్మాతలు : ఏ.వి.ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జీ, రాజా దేవరకొండ,

రచన-దర్శకత్వం : సుబ్బు వేదుల.

ఒరేయ్ …బుజ్జిగా` చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌`కుమారి 21 ఎఫ్‌` ఫేమ్ హెబ్బాప‌టేల్‌

`ఏమైంది ఈ వేళ‌`, `అధినేత‌`, `బెంగాల్ టైగ‌ర్‌`, `పంతం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి `ఖైదీ` చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్. ప్ర‌స్తుతం రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై  `గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం` వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్  తెరక్కిస్తున్న చిత్రం. `ఒరేయ్ బుజ్జిగా`. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్ర‌లో `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో  ఈరోజు నుండి నుండి హెబ్బా ప‌టేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర‌ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న `ఒరేయ్ బుజ్జిగా` షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా   కీల‌క‌మైన పాత్ర‌లో `కుమారి 21 ఎఫ్‌` చిత్రంతో యూత్‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. మాళ‌వికా, హెబ్బా ప‌టేల్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు  ఇంపార్టెన్స్ ఉంటుంది.  ఈ సంద‌ర్భంగా క‌థ న‌చ్చి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న హెబ్బాప‌టేల్‌కు థ్యాంక్స్‌. సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్‌కుమార్  తెర‌కెక్కిస్తున్నారు“ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబ్బాప‌టేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

ఇంతకీ ఈ సినిమాలో ఇత‌ను హీరోనా? విలనా?

ప్రపంచ వ్యాప్తంగా ఈ నవంబర్ 15న విడుదల అవుతున్న సినిమా విశాల్ అండ్ తమన్నా నటించిన యాక్ష‌న్”. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా  కాసేప‌టి క్రితం విడుదల అయిన ఈ సినిమా సరికొత్త పోస్టర్ సిని ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ సినిమా టీం విశాల్ ది ఒక లుక్ విడుదల చేశారు. ఆ లుక్ లో విశాల్ ఒక తీవ్రవాది గెటప్ లో ఉండి, చేతికి సంకెళ్లు చుట్టూ జవాన్లు పట్టుకొని విశాల్ ను తీసుకొస్తున్నారు. ఆ లుక్ ని చూసిన నెటిజన్లు ఇంతకి ఈ సినిమాలో విశాల్ హీరోనా, విలనా రెండూ కాకా డబల్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నడా అనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కానీ విశాల్ నటించిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసేద్దామా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో మన ముందుకు రానున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి మరి. విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, తదితరులు నటించిన ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు. శ్రీ కార్తికేయ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్‌ ఆడెపు (వరంగల్ శ్రీను) నిర్మిస్తున్నారు.

విరాహత్ అలీతో సురేష్ కొండేటి, ఇ. జనార్దన్ రెడ్డి భేటీ

ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఎ.పి.యు.డబ్ల్యు.జె.కు అనుబంధంగా సేవలందించిన ఫిలిం క్రిటిక్స్
అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ.) ఇప్పుడు టి.యు.డబ్ల్యు.జె.కు అనుబంధంగా మారుతోంది.
తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఈ అసోసియేషన్ కొత్తగా
ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి
ఇ. జనార్దన్ రెడ్డి,  వ్యవస్థాపక సభ్యులు కె.లక్ష్మణ్ రావులు ఈ మేరకు గురువారం బషీర్ బాగ్
కార్యాలయంలో టీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీని కలుసుకొని
లిఖితపూర్వకంగా తమ నిర్ణయ పత్రాన్ని అందించారు. తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచే
నిర్వర్తించుకునేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ఓ గదిని కూడా కేటాయించాలని, అక్కడ
తమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ బోర్డును పెట్టుకునే వీలును కల్పించాలని కోరారు. ఇక
నుంచి బషీర్ బాగ్ లోని తమ పాత కార్యాలయం నుంచే కార్యకలాపాలను
నిర్వహించాలనుకుంటున్నట్లు ఎఫ్.సి.ఎ. నేతలు ప్రకటించారు. త్వరలో టి.యు.డబ్ల్యు.జె.
సలహాలు, సంప్రదింపులతో తమ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా
నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ ఫిల్మ్ క్రిటిక్స్
అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కార్యవర్గంతో చర్చించాక
దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ
సభ్యులు ఏ.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మాస్‌ హీరో విశాల్‌ కెరీర్ లోనే ‘యాక్షన్’ మూవీ హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది – నిర్మాత, శ్రీ కార్తికేయ సినిమాస్‌ అధినేత శ్రీనివాస్‌ ఆడెపు.

‘హుషారు’, ‘కబాలి’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘రాజుగారిగది3 ‘ వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రస్తుతం ‘యాక్షన్’ మూవీతో నిర్మాతగా మారారు శ్రీనివాస్‌ ఆడెపు. మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’ శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా  నిర్మాత, శ్రీకార్తికేయ సినిమాస్‌  అధినేత  శ్రీనివాస్‌ ఆడెపు ఇంటర్వ్యూ..

మీ గురించి చెప్పండి
–  నేను గత 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేశాను. అది అంత శాటిస్ఫాక్షన్‌ ఇవ్వలేదు. తర్వాత డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ క్రమంలోనే 6-7 సినిమాలకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఆతర్వాత ఎగ్జిబిటర్ గా మారి కొన్ని సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా మారి ‘హుషారు’, ‘కబాలి’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘రాజుగారిగది3 ‘ లాంటి సినిమాలు చేశాను. అన్ని సినిమాలు నాకు మంచి పేరు తీసుకువచ్చాయి. అలాగే ఇప్పుడు యాక్షన్ చిత్రంతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను.

ఈ సినిమాతోనే నిర్మాతగా మారడానికి కారణం ఏంటి?
– యాక్షన్ మూవీ టీజర్ చూడగానే నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించి వెంటనే వెళ్లి ఆ సినిమా రైట్స్ కొనడం జరిగింది. నేను డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా రాణించడంతో వారు ఒప్పుకున్నారు.  నేను ఇదివరకే నా స్నేహితుడితో కలిసి ఒక సినిమా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సినిమా బ్యానేర్ లో రిలీజయ్యే మొదటి సినిమా. అలాగే దాదాపు 600 థియేటర్స్ కి పైగా ఈ సినిమా విడుదలవుతుంది. మా బేనర్ లో ఫస్ట్ మూవీ నే ఇంత లార్జర్  స్కెల్ లో రిలీజవడం చాలా సంతోషంగా ఉంది.

యాక్షన్ మూవీ ఎలా ఉండబోతుంది?
– యాక్షన్ మూవీ ఆడియన్స్ కి, విశాల్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది. సినిమా చాలా గ్రాండియర్ గా ఉండి యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా నేను తీసుకోవడానికి ఈ సినిమా మేకింగ్ కూడా ఒక కారణం. అలాగే కెజిఎఫ్ సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంబు, రవి వర్మ  ఈ సినిమాకు వర్క్ చేశారు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్ ని మనం ఇప్పటికి మరచిపోలేము. ఈ సినిమాతో మరో సారి ఆ ఎలివేషన్స్ కి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం.

డైరెక్టర్ సుందర్.సి గురించి?
–  డైరెక్టర్ సుందర్. సిగారి గురించి చెప్పేంత పెద్ద వాడిని కాదు. ఆయన సినిమాల గురించి మనకు తెలిసిందే
నాకు ఆయన సినిమాల్లో ‘సత్యం శివమ్’ మూవీ చాలా ఇష్టం. అయితే ఈ సినిమా ఆయన అన్ని సినిమాలకు డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాగైనా విశాల్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని కసితో  ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.

డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చారు కదా! మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం?
– నాకు పర్సనల్ గా హ్యూమన్ ఎమోషన్స్ ని క్యారీ చేసే మూవీస్ అంటే ఇష్టం. దర్శకుడిగా తప్పకుండా త్వరలోనే మంచి మూవీ తీస్తాను. ‘రుద్ర వీణ’ సినిమా చూసి నేను ఇండస్ట్రీ కి రావడం జరిగింది.

డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం కష్టమా? నిర్మాతగా ఉండడం కష్టమా?
– నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం రెండు కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో దేని పోరాటం దానిదే.

రానా గారితో రాప్ సాంగ్  చేపించాలనే ఆలోచన ఎవరిది?
– అది నేను విశాల్ అన్న కూర్చొని అనుకోవడం జరిగింది. తెలుగులో ఏదయినా సంథింగ్ స్పెషల్ అనేలా ఉండాలి అనుకోని రాప్ చేపించడం జరిగింది. రానా గారి వాయిస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అందుకే నేను విశాల్ అన్న అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్‌తమిళ కూర్చొని ఈ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.

హీరోయిన్ తమన్నా గురించి?
– తమన్నా ఎంత మంచి పెర్ఫార్మర్ అనేది తెలుసు. అయితే గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ లో ఆమె రోల్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఈ సినిమాలో కూడా చాలా కష్టమైన యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. తప్పకుండా యాక్షన్ సినిమా కూడా ఆమెకి మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను.

ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ” సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం.

లక్కీ ఓం క్రియేషన్స్ సమర్పణలో ఎల్ ఓ ఎల్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై  మున్నా హీరోగా నిర్మిస్తున్న చిత్రం “ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ” .ఈ చిత్రం పాటల రికార్డింగ్ నేడు హైదరాబాద్ లో ప్రారంభమైనది. మొదటి పాటను కీరవాణి తనయుడు కాలబైరావ  పాడిన పాటతో ,పూజాకార్యక్రమాలు ప్రారంభమైనాయి.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ జెల్లా మాట్లాడుతూ “ఫ్రెండ్ షీప్ ను కొత్తకోణం లో చూపే యూత్ ఫుల్ సబ్జెక్ట్  మా చిత్రం.మంచి ఎమోషన్స్ ఉన్న  యాక్షన్ ఎంటర్ టైనర్ మాచిత్రం డిఫనెట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది’ అన్నారు.మొదటి షెడ్యూల్  డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభంవుతుందని నిర్మాత చండ్ర చంద్రశేఖర్ తెలిపారు.గోదావరిఖని,గోవా,సింగపూర్,థాయిలాండ్,లలో షూటింగ్ జరగనుంది అని మరో నిర్మాత  రావి రామ్మోహనరావు తెలిపారు.ఈ చిత్రానికి రచన:D. కృపాకర్, కాస్టూమ్ డిజైనర్:రోజి విలియం,డి.ఓ. పి:రాహుల్ మాచినేని,సంగీతం:శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్:దేవరాజ్,పి.ఆర్. ఓ:బి.వీరబాబు,నిర్మాతలు:చండ్ర చంద్ర శేఖర్,రావి రామ్మోహన్,జెజీ యమ్ లోకేష్ కుమార్,ఎం కె మూర్తి,కధ, స్క్రీన్ ప్లే దర్శకత్వం:లక్ష్మణ్  జెల్లా.

శ్రీదేవి, రేఖ‌ల‌కు ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి చేతుల‌మీదుగా ప్ర‌దానం – అక్కినేని నాగార్జున

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు`. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తికి వారి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌ 2006లో మొదటి ఈ అవార్డును అందుకున్నారు. ఇటీవల 2017లో ‘బాహుబలి’ ఆలిండియా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ఈ అవార్డు వచ్చింది. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌వనున్నారు.  న‌వంబ‌ర్‌17న సాయంత్రం 5 గంట‌ల‌కి  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.  ఈ సందర్భంగా న‌వంబ‌ర్ 14న  హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి చైర్మ‌న్, కళాబంధు, డా. టి. సుబ్బరామిరెడ్డి , అక్కినేని నాగార్జున పాల్గొన్నారు.

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి  చైర్మ‌న్, కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – గ్రేట్ అవార్డ్ అయిన `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్` కార్యక్రమం నవంబర్‌ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరగనుంది. ఎఎన్‌ఆర్ గారు  గ్రేట్‌ పర్సనాలిటీ, తరతారలకు అందరి గుండెల్లో జీవించి ఉండే మహోన్నత వ్యక్తి . న‌టుడిగానే కాకుండా వ్యక్తిత్వంలోగానీ, మానవత్వంలోగానీ ఆయనకు ఆయనే సాటి. అటువంటి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు త‌న‌కి  `దాదాసాహెబ్‌ ఫాల్కే` అవార్డు వచ్చినప్పుడు నన్ను పిలిచి భవిష్యత్తులో ‘ఎఎన్‌ఆర్ నేష‌న‌ల్ ఫిలిం అవార్డు’ స్థాపించి నేను ఉన్నా, లేకున్నా నాతరంవారిచే నేష‌న‌ల్ లెవ‌ల్‌లో సినీ ప‌రిశ్ర‌మ‌లోని గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ అవార్డుని ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. మంచి ఆలోచ‌న అని 2006లో ` ఎఎన్‌ఆర్‌ నేషనల్ అవార్డ్‌` స్థాపించి మొద‌టి సంవ‌త్స‌రం న‌టుడు దేవానంద్ కి అంద‌జేయ‌డం జ‌రిగింది. 2017లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ అవార్డ‌ను అందుకున్నారు. ప్ర‌స్తుతం 2018 సంవత్సరానికిగాను శ్రీదేవి, 2019కిగాను రేఖలకు నవంబర్‌ 17న ఈ అవార్డు ప్రదానం చేయబోతున్నాం. అంద‌రూ గ‌ర్వంచే మ‌హాన‌టి శ్రీదేవికి ఈ అవార్డ్ ఇవ్వాల‌నేది నాగేశ్వ‌ర‌రావు గారి కోరిక కూడా. అదే ర‌కంగా తెలుగు అమ్మాయి అయిన రేఖ కూడా జాతీయ స్థాయిలో ఎంతో పేరు సంపాదించింది. ఆమెకు కూడా ఈ అవార్డ్ ఇవ్వాలని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఈ నెల 17వ తారీకున సాయంత్రం 5 గంట‌ల‌కి  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతుంది.  ఈ సందర్భంగా ఆయన తండ్రిగారి కోరికను మనసులో ఉంచుకొని నెరవేరుస్తున్నందుకు నాగార్జునగారిని మెచ్చుకోవాలి. ఆయ‌న ఈ బాద్య‌త‌లు చేప‌ట్పిన త‌ర్వాత గ్రేట్ ప‌ర్స‌నాలిటీస్‌ అయిన అమితాబ్‌ బచ్చన్ గారికి, రాజమౌళి గారికి ఈ అవార్డును అంద‌జేశారు. అంత బాద్య‌త‌గా త‌న తండ్రి కోరిక‌ను నెర‌వేరుస్తున్నందుకు నాగార్జున గారిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను” అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”సుబ్బరామిరెడ్డిగారు చెప్పినట్లు ఈ అవార్డు మాకు చాలా ప్రెస్టీజియస్‌ అవార్డు. ఇది నాన్నగారి కోరిక. ఆయన పేరు ఉన్నంతవరకు ఈ అవార్డును కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ అవార్డు ఇంత సక్సెస్‌ఫుల్‌ అవ్వడానికి సుబ్బరామిరెడ్డిగారు కూడా ఒక కారణం. సుబ్బరామిరెడ్డిగారిలో ఒక గమ్మత్తైన క్వాలిటీ ఉంది. నాన్నగారికి ఎంత క్లోజ్‌ ఫ్రెండో నేనుకూడా ఆయనకి అంత క్లోజ్‌ ఫ్రెండ్‌ అయ్యాను. నాన్నగారు వెళ్ళిపోయాక మా ఫ్యామిలీకి ఆయన పెద్ద దిక్కు. సుబ్బరామిరెడ్డిగారు ఎప్పుడూ ఈ అవార్డుకి బోర్డు చైర్మ‌న్‌గా ఉండాలనేది నాన్నగారి కోరిక. ఆయన గైడెన్స్‌తోనే ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌గారితో మొదలుపెట్టి అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్థాపించి ఏడేళ్ళు అవుతుంది. అది రోజురోజుకీ పెరిగి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ కూడా వస్తున్నారు. దాదాపు 450 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వారి గ్రాడ్యుయేషన్‌ సెర్మనీ ఈ అవార్డు ఫంక్షన్‌తో కలిపి చేయడం మొదలుపెట్టాం. కొంతమంది స్టూడెంట్స్‌కి అమితాబ్‌ బచ్చన్‌గారి చేతులమీదుగా, రాజమౌళిగారి చేతులమీదుగా గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చాం. ఈ సంవత్సరం రేఖగారి చేతులమీదుగా దాదాపు 70 మందికి అందజేయనున్నాం. శ్రీదేవిగారి తరపున ఈ అవార్డు తీసుకోవడానికి బోనీకపూర్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. అలాగే రేఖగారికి ఫోన్‌ చేయగానే ‘నాన్నగారికి, నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దగ్గర్నుంచి ఫిల్మ్‌ ఇండస్ట్రీ గైడెన్స్‌ తీసుకున్నాను. తప్పకుండా వస్తానుఅని చెప్పారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌వుతారు.  అవార్డులతో పాటు వీరిద్దరికి 5 లక్షల ప్రైజ్‌ మనీ ఇవ్వబడుతుంది ” అన్నారు.