Home Blog Page 1020

ఇలాంటి చిత్రం లో నటించడం నా అదృష్టం…”తోలుబొమ్మలాట” హీరోయిన్ హర్షిత చౌదరి..

సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో విశ్వాన్థ్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విశ్వ నాథ్ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం తోలుబొమ్మలాట… ఈ మూవీతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయమవుతున్న హర్షిత చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

నేను మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ ని, హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రా ఫ్యామిలీ మాది. మా ఫాదర్ రియలెస్టేట్ బిజినెస్.. నేను నటించిన మానేపల్లి,చెన్నై సిల్క్,లాంటి కొన్నియాడ్స్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అవి చూసిన కొందరు నా పోర్ట్పోలియో డైరెక్టర్ కి చూపించడంతో ఆడిషన్స్ ద్వారా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలా మొదటి సారి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

అంత స్ట్రాంగ్ గా నా పాత్ర ఉండదు. ఇన్నోసెంట్ మరియు కామ్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమ్మాయిగా కనిపిస్తాను. ఫామిలీ తో మంచి బాండ్ ఉంటుంది నా రోల్ అందరికి కనెక్ట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఉన్న ప్రతి అమ్మాయి నేచర్ ని ప్రతిబింబిచేలా నా పాత్ర ఉంటుంది.

ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?
నేను పాత్రలు ఎంచుకొనే పొజిషన్ కి ఇంకా రాలేదు. వచ్చిన పాత్రలు ఏవి పడితే అవి చెయ్యను నా లిమిట్స్ లో ఉన్నాయా?, పాత్ర చేయగలనా… లేదా? అని చూసి ఎంపిక చేసుకుంటాను.

సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ తో చేయడం మీకు ఎలా అనిపించింది ?

ఫస్ట్ భయపడ్డాను,నెర్వెస్ నెస్ వస్తుంది వారు యాక్టింగ్ లో ప్రోఫెషన్స్ వారి రేంజ్ లో యాక్ట్ చెయ్యడం కష్టం,వారి దగ్గర చాలా నేర్చుకున్నాను.

సినిమాలలోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు ?

చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరి పేరు చెప్పలేను. అప్పట్లో సావిత్రిగారు మరియు భానుమతి గారి నటనంటే చాలా ఇష్టం. అలాగే సౌందర్య గారు కూడా నాకు స్ఫూర్తి ఇచ్చారు.

ఇలాంటి రోల్ దొరకడం పై మీ అభిప్రాయం ?

ఇప్పుడు అంతా లవ్ స్టోరీస్ చేస్తున్నారు,టాప్ హీరోయిన్స్ నిత్యామీనన్ లాంటి వారు ఇలాంటి మూవీస్ సంవత్సరానికి ఒకటి చేసిన రోజులున్నాయి అలాంటిది ఫస్ట్ మూవీ లొనే ఇలాంటి రోల్ దొరకడం చాలా హ్యాపీ.

ఈ మూవీతో మీరు నేర్చుకున్న విషయాలేమిటి?

పాజిటివ్ గా ఉండటం అలాగే సహనంగా ఉండటం నేర్చుకున్నాను. విమర్శలు వచ్చినా వాటిని పాజిటివ్ యాంగిల్ లో ఆలోచిండం అలవడింది. అలాగే సీనియర్ నటుల నుండి యాక్టింగ్ సంబంధించి విలువైన విషయాలు నేర్చుకున్నాను.

దర్శకుడు విశ్వనాధ్ మాగంటి గురించి చెప్పండి ?

ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. మొదటి చిత్రానికే ఇలాంటి ఫ్యామిలీ కథను ఎంచుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను, కోపాలను, ద్వేషాలను ఆయన చక్కగా తెరకెక్కించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉండేలా ఆయన తెరకెక్కించిన తీరు బాగా నచ్చింది.

గ్రాండ్‌గా ప్రారంభ‌మైన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శృతిహాసన్‌, ల‌ మూవీ `క్రాక్‌`

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి `క్రాక్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గురువారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మాత‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, సురేంద‌ర్ రెడ్డి, రాఘ‌వేంద్ర‌రావు, అల్లు అర‌వింద్‌, సుధాక‌ర్ రెడ్డి, న‌వీన్ ఎర్నేని, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, దాము, బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌, రామ్ తాళ్లూరి త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు స‌న్నివేశాకి అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్‌రాజు, సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.
`డాన్‌శీను`, `బ‌లుపు` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్‌. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ర‌వితేజ క్యారెక్ట‌ర్‌లోని ప‌వ‌ర్‌ను సూచించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సినిమా క్యారెక్ట‌ర్ ప‌రంగా ర‌వితేజ గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో ఉన్న డిఫ‌రెంట్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు.
ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ – “మా `క్రాక్‌` మూవీ ఓపెనింగ్‌కి వ‌చ్చిన అతిథులంద‌రికీ థ్యాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ‌ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్స్ క‌థ‌. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `మెర్స‌ల్‌`, `బిగిల్‌` వంటి చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:  బి.మ‌ధు
బ్యాన‌ర్‌:  స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌
సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె.విష్ణు
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
కో ప్రొడ్యూస‌ర్‌:  అమ్మిరాజు కానుమిల్లి
ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి
ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు:  రామ‌జోగ‌య్య‌శాస్త్రి
మేక‌ప్‌:  శ్రీనివాస‌రాజు
కాస్ట్యూమ్స్‌: శ‌్వేత‌, నీర‌జ కోన‌
స్టిల్స్‌:  సాయి
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన్‌:  వ‌ర్కింగ్ టైటిల్ శివ‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కోట‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌
కో డైరెక్ట‌ర్స్‌:  గులాబి శ్రీను, నిమ్మ‌గడ్డ శ్రీకాంత్‌
చీఫ్ కో డైరెక్ట‌ర్‌:  పీవీవీ సోమ‌రాజు

నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

రాజశేఖర్ మాట్లాడుతూ “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు  నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని అన్నారు.

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన చిత్రమిది. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

వీరి నాయుడు మాట్లాడుతూ ‘‘సినిమా మార్కెట్‌లో నన్ను ‘పూర్వి’ రాజు అంటారు. విశాఖలో పూర్వి పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ స్థాపించి, పాతిక సంవత్సరాల నుండి విజయవంతమైన చిత్రాలు చాలా విడుదల చేశాను. మా అబ్బాయి శ్రీనివాస్‌, అతడి మిత్రుడు బాలు, ఇద్దరి స్నేహితులు కలిసి ఈ సినిమా చేశారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్‌ భరత్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌ లుక్‌ ట్రెండీగా, కమర్షియల్‌గా ఉంది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్స్‌ రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘సుధాకర్‌రెడ్డిగారికి చాలా చాలా థ్యాంక్స్‌. వీరి నాయుడుగారు మాకు ఎంతో అండగా ఉన్నారు. వాళ్లబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి, ఈ సినిమా చేశాం. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాందాస్‌ పాల్గొన్నారు.

నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: బొంతల నాగేశ్వర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, రఘురామ్‌ ఎరుకొండ, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బడిజ, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

1300 మంది డాన్సర్స్ తో ‘మర్ద్ మరాఠా’ సాంగ్ ని విడుదల చేసిన ‘పానిపట్‌’ చిత్ర యూనిట్.

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం(14 జ‌న‌వ‌రి 1761 ) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షెలాత్కర్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, మరియు సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్‌ ట్రైలర్‌ కి దేశ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా  భారీ విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ‘మర్ద్ మరాఠా’ సాంగ్ ని ముంబాయి లోని సిద్ది వినాయక మందిరంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘మర్ద్ మరాఠా’  సాంగ్ భారీ స్థాయిలో చిత్రీకరించబడింది, బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద గణేష్ విగ్రహం, పేష్‌వై వాతావరణం నేపథ్యంలో పూణేకు చెందిన లెజిమ్ నృత్యకారులు, అథెంటిక్ బుల్ డాన్సర్లతో సహా 1300  మందితో ఈ పాటను విజువల్ గా చాలా గ్రాండియర్ గా చిత్రీకరించారు.  ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌  రాజు ఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను 13 రోజులలో కర్జాత్‌లోని శనివార్ వాడా లోని  రీగల్ లైఫ్-సైజ్ సెట్‌లో చిత్రీకరించారు, ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ నిర్మించారు. హిందీ-మరాఠీ ఫీల్ ఉన్న పాట ఇది.  ఈ పాట‌లో అర్జున్ కపూర్, కృతి సనోన్, మోహ్నీష్ బహల్, పద్మిని కొల్హాపురే న‌టించారు.  అజయ్-అతుల్ ఈ గీతాన్ని స్వరపరిచారు. ఈ సందర్భంగా…

మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అజయ్-అతుల్ మాట్లాడుతూ – సాంప్రదాయ ట్యూన్ లోనే ఈ  హై-ఎనర్జీ ట్రాక్‌ను కంపోజ్ చేయడం జ‌రిగింది. ఈ పాట మరాఠా పాలన యొక్క గొప్పతనాన్ని తెలియ‌జేస్తుంది.  వయస్సు, సంగీతంలో అభిరుచితో సంబంధం లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులు ఆనందించే పాటను సృష్టించాలని  , ‘మర్ద్‌ మరాఠా’ ను అందరికీ నచ్చే విధంగా కంపోజ్ చేశాం ` అన్నారు.

దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ  – “ ‘మర్ద్‌ మరాఠా  హై ఎన‌ర్జీ సాంగ్‌.  ఇది మరాఠా పాలన యొక్క సుసంపన్నతను తెలియ‌జేస్తుంది. అలాగే  పేష్వాసులు, మరాఠా సర్దార్లతో పాటు హిందు-ముస్లిం, ఆర్మీ రెజిమెంట్లకు ఇది ఒక‌ ట్రిబ్యూట్ లా  ఉంటుంది.   సాంప్రదాయ ట్యూన్ ని  జోడించి  మ్యూజిక్ డైరెక్ట‌ర్స్అజయ్-అతుల్ అద్భుతంగా చేశారు.  ఈ పాటలో  రాజు ఖాన్ కొరియోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. ఈ  చిత్రంలో నాకు ఇష్టమైన ట్రాక్ ఇది“ అన్నారు..

ఒక పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న “ప్రతిరోజు పండుగే”

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ పాటను అందమైన లొకేషన్ లో చిత్రీకరించనున్నారు.

ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ మంచి సందర్భంలో వస్తుంది. అలాంటి టైటిల్ సాంగ్ ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన కొద్ది గంటల్లోనే అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటను థమన్ స్వరపరచగా… కె కె సాహిత్యం అందించగా… శ్రీ కృష్ణ అద్భుతమైన గాత్రంతో మెస్మరైజ్ చేశారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు… ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే కమేసి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు.  ప్ర‌ముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి సమర్పణలో,  నిర్మాత‌ బ‌న్నీవాస్ సార‌ధ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది.  సాయితేజ్, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ప్ర‌తిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్ప‌డ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

నటీనటులు:

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను

న‌వంబ‌ర్ 29న నిఖిల్ `అర్జున్ సుర‌వ‌రం`

  • యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 29న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు.
    నిఖిల్ జంట‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

    న‌టీన‌టులు:
    నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

    సాంకేతిక వ‌ర్గం:
    ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  టి.సంతోష్‌
    స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు
    బ్యాన‌ర్‌:  మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
    నిర్మాత‌:  రాజ్‌కుమార్ అకెళ్ల‌
    సంగీతం:  సామ్ సి.ఎస్‌
    సినిమాటోగ్ర‌ఫీ:  సూర్య‌
    ఎడిట‌ర్:  న‌వీన్ నూలి
    పి.ఆర్‌.ఒ:  వంశీశేఖ‌ర్‌

2020లో ఐదు తెలుగు సినిమాలు నిర్మాణం… ఎస్‌.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి..

ఎస్‌.వి.ఆర్ మీడియా బ్యాన‌ర్‌పై త‌మిళంలో విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించిన నిర్మాత శోభారాణి. ఇప్పుడు నిర్మాణ సంస్థ ఎస్‌.వి.ఆర్‌.మీడియా కొత్త టర్న్ తీసుకుంది. ఈ సంస్థ ఇప్పుడు తెలుగులో స్ట్ర‌యిట్ సినిమాల‌ను నిర్మించ‌నుంది. 2020లో ఐదు సినిమాల‌ను ఎస్‌.వి.ఆర్ మీడియాలో నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు శోభారాణి. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త వారితో ఈ సినిమాల‌ను నిర్మించ‌డానికి ఎస్‌.వి.ఆర్ మీడియా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త న‌టీన‌టులు, టెక్నీషియన్స్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా..
ఎస్‌.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ – “ఇప్ప‌టి వ‌ర‌కు మేం అనువాద సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ద‌గ్గ‌రయ్యాం. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల‌ను నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 2020లో ఐదు సినిమాల‌ను నిర్మించ‌బోతున్నాం.  యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌బోతున్నాం. ఇప్ప‌టికే ఐదు సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్ట్స్ సిద్ధ‌మ‌య్యాయి. అందుకోసం ఆస‌క్తిగ‌త న‌టీన‌టులు(హీరో, హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్‌), సాంకేతిక నిపుణులకు ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఆస‌క్తిగ‌ల‌వారు  starmaking2020@gmail.com or to the WhatsApp no.s 90009109799133673367ల‌కు వారి ప్రొఫైల్స్‌ను పంపాల్సిందిగా కోరుతున్నాం. ఆస‌క్తి, నైపుణ్యం గ‌ల న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఇదొక మంచి ప‌రిణామంగా భావిస్తున్నాం“ అన్నారు.

నెగెటివ్ రోల్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా… హీరోయిన్ హన్సిక మోత్వాని..

ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో యంగ్ హీరో  సందీప్ కిషన్, హన్సిక జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో   అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్  లు నిర్మిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక.‌
దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందం, అభినయంతో మొదటి సినిమాతోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది హన్సిక మోత్వాని. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశం సాధించింది.. ఈ నెల 15న ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. గ్రాండ్ గా విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ హన్సిక మోత్వాని ఇంటర్వ్యూ..

ఈ మూవీ ఒప్పుకోవడానికి గల కారణాలేమిటి?
– గతంలో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘దేనికైనా రెడీ’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా నటిగా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆప్పటినుండీ నాగేశ్వర రెడ్డి గారితో మంచి పరిచయం ఉంది. అయితే ఈ మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జ‌యిటింగ్‌ గా అనిపించింది. పెర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో వెంటనే ఒప్పుకున్నాను.

హీరో సందీప్ కిషన్ తో వర్క్ ఎక్స్పీరియన్స్?
– సందీప్ కిషన్ గారు టాలెంటెడ్ యాక్టర్, నైస్ కో స్టార్. ఈ సినిమాలో మా ఇద్దరివి లాయ‌ర్ క్యారెక్టర్స్. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటాయి. ఇద్దరికీ వినోదం అంటే చాలా ఇష్టం కాబట్టి బాగా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశాం.

వరలక్ష్మీ మరో పాత్ర చేస్తున్నారని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
– వరలక్ష్మీ గారు చాలా మంచి నటి, అలాగే ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకం ఐనప్పటికీ నా పాత్ర ప్రాధాన్యం వేరు. మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారు ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. దానివల్ల ఒకరినిఒకరు డామినేట్ చేశాం అనే ఆలోచనే రాదు.

ఈ మధ్య కాలంలో తెలుగులో తక్కువ చిత్రాలు చేస్తున్నారు?
– దురదృష్టవశాత్తు ఎందుకో ఒక తెలుగు సినిమా తర్వాత మరొకటి చేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. నేను తమిళ సినిమాలలో బిజీ అవడం కూడా ఒక కారణం. కానీ తెలుగులో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అస్సలు వదులుకోనూ తప్పకుండా చేస్తాను. నాకు భాషా భేధాలు అంటూ ఏమీ లేవు. మంచి చిత్రం అనుకుంటే ఏభాషలోనైనా చేయడానికి సిద్దమే.

ఇప్పటి వరకూ మీ కెరీర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది?
– ఇప్పటికే అన్ని భాషలలో 50కి పైగా చిత్రాలు చేశాను. అన్ని భాష‌ల‌లో స్టార్ హీరోలతో నటించే అవకాశం ద‌క్కింది.
నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అలాగే ఇప్పటివరకూ నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ నేను చేసిన సినిమాలు, క్యారెక్టర్స్ పట్ల నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.

భవిష్యత్తులో నెగెటివ్ రోల్స్ చేసే అవకాశం ఉందా?
– కచ్చితంగా ఉంది. పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ కాకున్నా కొన్ని చిత్రాలలో ఆల్రెడీ ఆ తరహా పాత్రలను చేశాను. నాకు తెలిసి కామెడీ, విలన్ పాత్రలు చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తే నటించడానికి నేను ఎప్పుడూ రెడీనే.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాలు చేస్తున్నాను. అలాగే దర్శకుడు అశోక్ తెరకెక్కించనున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. ఆ వెబ్ సిరీస్ లో నా క్యారెక్టర్ చాలా ఎగ్జ‌యిటింగ్ గా ఉంటుంది. ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ హన్సిక మోత్వాని.

నేను చేస్తున్న పూర్తి స్థాయి కామెడీ ఫిల్మ్‌ ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’… హీరో సందీప్‌ కిషన్


ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ‘వెంకటాద్రి  ఎక్స్‌ప్రెస్‌’, ‘నేను వీడని నీడను నేనే’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో నటుడిగా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో  సందీప్ కిషన్, హన్సిక జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో   అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్   లు నిర్మిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక.‌  ఈ నెల 15న గ్రాండ్ గా విడుదల కానున్న సందర్భంగా హీరో సందీప్‌ కిషన్ ఇంట‌ర్వ్యూ..

కొంత విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి కామెడీ ఫిల్మ్‌ చేస్తున్నట్టున్నారు?
– వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత నేను పూర్తి స్థాయి కామెడీ ఫిల్మ్‌ చేయలేదు. కొంత విరామం తర్వాత ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రంలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండే పాత్ర చేశాను. నాకు వినోదం అంటే చాలా ఇష్టం కాబట్టి బాగా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశా. రేపు థియోట‌ర్‌లో ఆడియన్స్‌ రెండు గంటల ఎనిమిది నిమిషాలు పడి పడి నవ్వుతారు. ’’

మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో కెరీర్‌లో తొలిసారి లాయర్‌ పాత్ర చేశా. కర్నూల్‌ టౌన్‌లో ఈ కథ సాగుతుంది. కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పట్టుకుని కోర్టు బయట రాజీ చేయిస్తుంటా. అలాంటిది ఓ పెద్ద కేసుతో అనుకోని ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించానన్నది చాలా ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర చాలా సరదాగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. సింపుల్, స్వీట్‌ స్టోరీ ఇది. ఆడియన్స్‌కి థ్రిల్‌ కలిగించే అంశాలు ఉంటాయి.

డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి మేకింగ్ గురించి?
– నాగేశ్వర రెడ్డిగారు అంటేనే వినోదం. రాజసింహ ఇచ్చిన కథకు నాగేశ్వరరెడ్డి లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం అదృష్టం. ఆయన టైప్‌ కామెడీతో ప్రేక్షకుల్ని పడిపడి నవ్వేలా చేస్తుందీ సినిమా. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ, కామెడీ కోసం కథ ఉండకూడదు. మా సినిమా కథలో కామెడీ ఉండే కోవలోకి వస్తుంది.

ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు?
– ప్రేక్షకులు నన్ను ఓ జానర్‌లో ఆదరించినప్పుడు వెంటనే మరో జానర్‌కి వెళ్లడంతో కొన్ని పరాజయాలు వచ్చాయి. అందుకే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నా. మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఇంట్లో అయినా ఉంటాను కానీ, ఫ్లాప్‌ అయ్యే సినిమాలు మాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నా.

వెబ్ సిరీసులు కంటిన్యూ చేస్తారా?
– హిందీలో ‘ది ఫ్యామిలీ మేన్‌’ అనే వెబ్‌ సిరీస్‌ తొలి భాగంలో మేజర్‌ విక్రమ్‌ పాత్రలో నటించా. చాలా మంచి స్పందన వచ్చింది. రెండో భాగంలో నేను ఉండను.. మూడో భాగంలో ఉంటా. తెలుగులోనూ గతంలో కంటే ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు బాగా వస్తుండటం చాలా సంతోషంగా ఉంది.

హీరోగా, ప్రొడ్యూసర్ గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– ఓ సినిమా చేస్తున్నప్పుడే మూడు నాలుగు కథలు లాక్‌ చేసి పెట్టుకోవాలనుకోను. ఓ సినిమా విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నా దృష్టంతా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాపైనే ఉంది. తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. అందులో హాకీ ప్లేయర్ గా కనిపిస్తాను. సాధారణంగా నేను సినిమాకు ముందు హోమ్ వర్క్ చేయను కానీ ఈ సినిమా కోసం హాకీ నిపుణుడి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోబోతున్నా..

– నా బేనర్ లో నిర్మించిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం విజయం నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే నా ప్రొడక్షన్‌లో రాహుల్‌ రామకృష్ణ–ప్రియదర్శిలతో ఓ సినిమా నిర్మిస్తున్నా. ‘ది ఫ్యామిలీ మేన్‌’ తర్వాత బాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌లకు, సినిమాలకు అవకాశాలొచ్చాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి తెలుగు చిత్రాలపైనే. తమిళంలో నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అవి విడుదలయ్యాకే వేరే తమిళ సినిమాల గురించి ఆలోచిస్తా.