Home Blog Page 1021

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి ముహూర్తం కుదిరింది. న‌వంబ‌ర్ 14న ఈ సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. `డాన్‌శీను`, `బ‌లుపు` చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప‌వ‌ర్‌పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ న‌టిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో ఇన్‌టెన్స్ బ్యాగ్రౌండ్‌లో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో క‌న‌ప‌డుతున్నారు.
ర‌వితేజ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:  ఠాగూర్ మ‌ధు
బ్యాన‌ర్‌:  లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌
సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

అల్ల‌రి నరేశ్ హీరోగా కాన్సెప్ట్ బేస్డ్ మూవీ

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న

హీరో అల్ల‌రి నరేష్ క‌థానాయ‌కుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రారంభం కానుంది. న‌రేష్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు  వైవిధ్య‌మైన పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌రేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రో వైపు త‌న‌దైన మార్క్ కామెడీ మూవీ `బంగారు బుల్లోడు` సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

న‌రేశ్ న‌టించ‌బోయే కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

“కళాకారుడు”. ట్రైలర్ విడుదల

శ్రీస్ విజువల్స్ పతాకం పై శ్రీధర్ మరియు దుర్గ హీరో హీరోయిన్ గా పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు , రవి వర్మ, జబర్దస్త్ జీవన్ ముఖ్య తారాగణం తో కిరణ్ దుస్సా దర్శకత్వం లో శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన చిత్రం “కళాకారుడు”. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను పాత్రికేయుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు.

అనంతరం విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు రఘు రామ్  మాట్లాడుతూ  “కళాకారుడు సినిమా లో నేను పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లో 5 పాటలు ఉన్నాయి, అని చాల చక్కగా కుదిరాయి. నా పాటలకి మంచి మాటలందించిన గేయ రచయితలందరికి నా కృతఙ్ఞతలు. హీరో నిర్మాత అయిన శ్రీధర్ గారికి సినిమా అంటే పిచ్చి. నిర్మాత అయినా కూడా 24 క్రాఫ్ట్స్ పై మంచి అవగహన ఉంది. ఫ్యూచర్ లో ఒక్క మంచి ఫిలిం మేకర్ అవుతాడని నాకు నమ్మకం ఉంది.  చికెన్ ముక్క పాట విడుదలైంది మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే సినిమా విడుదలవుతుంది అందరికి నచ్చుతుంది ” అని కురుకున్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ “ఈ సినిమా నాకు కుటుంబం లాంటిది. దర్శకుడు కిరణ్ నాకు చాలా కాలం గా తెలుసు, తన దగ్గర మంచి కథలు ఉన్నాయి .  ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ హీరో అయినా శ్రీధర్ గారు నాకు మంచి మిత్రుడు గా దొరికారు. అయన కి సినిమాలు అంటే ప్యాషన్ పిచ్చి, మంచి సినిమాలు  నిర్మించాలని తన కోరిక.  సినిమా పాటలు, ట్రైలర్ చూసారు, చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుంది. అతిత్వరలో మీ ముందుకు వస్తున్నాం. శ్రీధర్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి. ఇలాంటి సినిమా ఆదరించండి ప్లీజ్” అని తెలిపారు.

హీరోయిన్ దుర్గ మాట్లాడుతూ “ఈ సినిమా కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మంచి సినిమా లో నాకు హీరోయిన్ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.  ఈ కథ మీ అందరికి నచుతుంది. సినిమా తప్పకుండా చుడండి” అని తెలిపారు.

దర్శకుడు కిరణ్ దుస్సా మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన నా నిర్మాత శ్రీధర్ గారికి కృతజ్ఞతలు.  పాటలు అందరు బాగున్నాయి  అంటున్నారు, సినిమా కూడా మీకు నచ్చుతుంది” అని తెలిపారు.

నిర్మాత శ్రీధర్ శ్రీమంతుల మాట్లాడుతూ “సంగీత దర్శకుడు రఘు రామ్ మంచి సంగీతం అందించారు, పాటలు ఎవరు విన్న చాలా బాగున్నాయి అని అంటున్నారు. ప్రతి టెక్నీషియన్ సొంత సినిమా గా భావించి పని చేసారు. నా సినిమా లో నటించిన పోసాని కృష్ణ మురళి గారికి, తోటపల్లి మధు గారికి, రవి వర్మ గారికి అందరికి నా ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది, మీఅందరికి నచ్చుతుంది . సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే సినిమా ని విడుదల చేస్తాం”అని తెలిపారు.

బ్యానర్ : శ్రీస్ విజువల్స్
నిర్మాత : శ్రీధర్ శ్రీమంతుల
నటి నటులు : శ్రీధర్, దుర్గ, పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు, రవి వర్మ, బాషా, జబర్దస్త్ జీవన్ తదితరులు
సంగీతం : రఘు రామ్
కెమెరా మాన్ : రవి చేపూర్
కళ దర్శకుడు : నానాజీ
కథ, స్క్రీన్ ప్లే : శ్రీధర్
మాటలు, దర్శకత్వం : కిరణ్ దుస్సా

శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై కొత్త చిత్రం ప్రారంభం

గౌతమ్ వ్యాస్  ,మిస్  తెలంగాణ దీపికా వధాని లను  హీరో హీరోయిన్లుగా పరిచయం  చేస్తూ శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై  స్రవంతి మురళీ మోహన్ తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెం 1  చిత్రం హైద్రాబాద్ లో ప్రారంభమైంది . కె. రమేష్  బాబు  నిర్మిస్తున్న ఈ  చిత్రంలో శ్రీమంతుడు ,ఖైదీ  చిత్రాల  ఫేం హరీష్  ఉత్తమన్ కీలక పాత్ర పోషిస్తుండగా..  అర్ధనారీ చిత్రం  హీరో  అర్జున్  విలన్ గా  నటిస్తున్నారు . పూజ కార్యక్రమాల అనంతరం ..

చిత్ర దర్శకుడు స్రవంతి మురళీ మోహన్  మాట్లాడుతూ:  గౌతమ్ వ్యాస్  ,మిస్  తెలంగాణ దీపికా వధాని లను  హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న  ఈ  చిత్రాన్ని లవ్  అండ్  యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో రూపొందిస్తున్నామని తెలిపారు . సినిమా  ఫస్ట్  షెడ్యూల్  హైద్రాబాద్  లో ,సెకండ్ షెడ్యూల్ గోవాలో  ,థర్డ్ షెడ్యూల్  కేరళలో  చేయనున్నట్లు  తెలిపారు . నలభై రోజుల్లో  సినిమా పూర్తి చేస్తామని అన్నారు .

చిత్ర నిర్మాత కె .రమేష్ బాబు మాట్లాడుతూ : దర్శకులు  స్రవంతి మురళీ మోహన్ చెప్పిన  కథ బాగా నచ్చింది . ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ గా నిర్మిస్తామని తెలిపారు

సాంకేతిక వర్గం  : హీరో హీరోయిన్లు  : గౌతమ్ వ్యాస్  ,మిస్  తెలంగాణ దీపికా వధాని, కెమెరా  : జి ఎస్ .రాజ్  (మురళి ) ,మ్యూజిక్  :శివ నందిగామ , పి .ఆర్ .ఓ : శ్రీధర్  , చీఫ్ అసోసియేట్ :అనిల్ పురేటి  , నిర్మాత  : కె . రమేష్ బాబు , కథ ,స్క్రీన్ ప్లే – గౌతమ్ vyas దర్శకత్వం : స్రవంతి మురళీ మోహన్

తెలుగుదనం ఉట్టి పడే ‘క్షీర సాగర మథనం’

‘అనిల్ పంగులూరి’ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ను ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఆవిష్కరించారు. దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచికి అద్దం పడుతూ.. తెలుగుదనం ఉట్టి పడే ‘క్షీర సాగర మథనం’ అనే పేరును ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు మానస్ నాగులపల్లి, ప్రదీప్, కథానాయిక చరిష్మా, చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి, ప్రముఖ మహిళా నిర్మాత పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు. ‘క్షీరసాగర మథనం’ అనే ఆహ్లాదకరమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం.. టైటిల్ కి తగ్గట్లు ఘన విజయం సాధించాలని సందీప్ కిషన్ ఆకాక్షించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

డిసెంబ‌ర్ 27న వస్తున్న `ఎర్ర‌చీర`.. నేడు శివ శివ శంభో శంక‌ర గీతావిష్క‌ర‌ణ‌

సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `ఎర్రచీర`. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంక‌ర అనే పాట కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా నేడు రిలీజైంది. ఈ పాట‌కు ప్ర‌మోద్ సంగీతం అందించ‌గా .. బాల‌వ‌ర్ధ‌న్ సాహిత్యం అందించారు. జె. శ్రీ‌నివాస్ ఆల‌పించారు.

దర్శక నిర్మాత మాట్లాడుతూ “కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్‌ థ్రిల్లింగ్‌ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్‌ స్వరాలు ప్రధాన బలం. రాజ‌మండ్రి రైలెక్కి చెక్కేస్తారు లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా శివ శివ శంక‌ర అనే పాటను విడుద‌ల చేశాం. దీనికి స్పంద‌న బావుంది. డిసెంబ‌ర్ 27న సినిమాని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్‌ చేస్తున్నా“ అని తెలిపారు. ఈ చిత్రంలో ఐదు పాట‌లు వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయ‌ని సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్ తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: ప‌్ర‌మోద్, కెమెరా: చ‌ందు, ఎడిటింగ్: డి.వెంక‌ట్ ప్ర‌భు, ఫైట్స్: న‌ందు, స‌మ‌ర్ప‌ణ‌: బేబి ఢ‌మరి, బ్యాన‌ర్: సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్, ద‌ర్శ‌క‌నిర్మాత‌: సి.హెచ్ సుమ‌న్ బాబు.

ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్… హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా

ఒక వైపు గ్లామర్‌ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు ‘బాహుబలి’, ‘సైరా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ‘హుషారు’,’ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘రాజుగారిగది3’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవంబర్‌15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంటర్వ్యూ.

ప్రతి సంవత్సరం డిఫరెంట్‌ రోల్స్‌, డిఫరెంట్‌ స్క్రిప్ట్‌లు మీ ముందుకు వస్తున్నప్పుడు మీరెలా ఫీల్‌ అవుతుంటారు?
– నా కెరీర్‌లో డిఫరెంట్‌ జోనర్స్‌లోడిఫరెంట్‌ రోల్స్‌ చేసే అవకాశం దక్కినందుకు నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని సార్లు నేను ఎక్స్పెక్ట్‌ చేయకుండానే మంచి క్యారెక్టర్స్‌ వస్తుంటాయి దానికి నేను లక్కీగా ఫీల్‌ అవుతాను. ఒక యాక్టర్‌గా ఎప్పుడూ కొత్త తరహా పాత్రలు చేయాలనే కోరుకుంటాను. అలాంటి విభిన్న తరహా పాత్రలకు నన్ను సెలెక్ట్‌ చేస్తుంన్నందుకు డైరెక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి ధన్యవాదాలు.
కెరీర్ పరంగా మీకు ఈ ఇయర్ ఎలా ఉంది?
– ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే ‘ఎఫ్ 2 ‘తో మంచి విజయం లభించింది. అలాగే గొప్ప చారిత్రాత్మక చిత్రం ఆయన “సైరా”లో విప్లవమాత్మకంగా ఉండే లక్ష్మీ క్యారెక్టర్ నటిగా నాకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఇప్పుడు ‘యాక్షన్’ మూవీకి కూడా గ్యారెంటీగా నాకు మంచి పేరు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
– ఈ సినిమాలో విశాల్‌ గారు, నేను కమాండోస్‌గా కనిపిస్తాము. మాములుగా మీరు హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ చూస్తే అందులో హీరోయిన్స్‌ ‘షీరో’గా ఉంటారు. అంటే గ్లామరస్‌గా కనిపిస్తూనే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ కూడా అలానే ఉంటుంది. అలాగే మా డైరెక్టర్‌ సుందర్‌ సర్‌ థాట్‌ ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత విమెన్‌ కోసం కూడా యాక్షన్‌ సీన్స్‌ రాయాలి అని. దానికి తగ్గట్లుగానే నా క్యారెక్టర్‌ని చాలా స్ట్రాంగ్‌గా డిజైన్‌ చేశారు.
షూటింగ్‌ చేస్తున్నపుడు సెట్లో ఎలా ఉండేది?
– మాములుగా ప్రతి సినిమా షూటింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్‌ పేపర్‌ ఉంటుంది. ఈ రోజు ఈ సీన్‌, ఈ డైలాగ్‌ అని చెప్తారు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి సెట్లోకి రాగానే ఈరోజు ఈ ఫైట్‌ సీక్వెన్స్‌, ఇక్కడినుండి దూకాలి, రన్నింగ్‌ చేస్తూ చేజ్‌ చేయాలి అని అనే వారు. డైలాగ్స్‌ చాలా తక్కువ ఉండేవి. కొత్తగా అనిపించేది. కానీ ‘యాక్షన్‌’ అని టైటిల్‌ పెట్టినప్పుడు ఆ మాత్రం యాక్షన్‌ చేయాలి కదా(నవ్వుతూ).
మీ క్యారెక్టర్‌ గురించి చెప్పగానే ఎలా ఫీల్‌ అయ్యారు?
– సుందర్‌ సి. సర్‌ నాకు ఫోన్‌ చేసి ఈ క్యారెక్టర్‌ నువ్వే చెయ్యాలి అన్నారు. నేను ఎప్పటినుండో ఆయన డైరెక్షన్‌లో వర్క్‌ చేయాలి అనుకుంటున్నాను. నాకు స్క్రిప్ట్‌ చాలా బాగా నచ్చింది. అందులోనూ రెగ్యులర్‌గా కాకుండా నాకు కొత్తగా ఉంది. ఈ క్యారెక్టర్‌ నాకు ఫ్యూచర్‌లో కూడా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేయగలను అనే కాన్ఫిడెన్స్‌ని ఇచ్చింది. ఈ జోనర్‌లో నేను మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా.
ట్రైలర్‌ చూస్తుంటే విజువల్స్‌ చాలా గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయి కదా! ఏఏ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు?
– ఈ సినిమా కోసం అజర్‌ భైజాన్‌, టర్కీ, రిషికేష్‌ ఇలా చాలా ప్రదేశాలు ట్రావెల్‌ చేశాం. అక్కడ యాక్షన్‌ సీన్లు తీయడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. సెక్యూరిటీ, పర్మిషన్స్‌ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అయితే అందరు పూర్తిగా సహకరించడంతో మా పని తొందరగా అయిపొయింది.
యాక్షన్‌ సీక్వెన్సులు చేయడం కష్టంగా అనిపించిందా?
– ఈ సినిమాలో ‘యాక్షన్‌’ ఎపిసోడ్స్‌ అన్నీ రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూసుకున్నాం. అలాగే కాస్ట్యూమ్స్‌ కూడా చాలా హెవీగా ఉంటాయి. వాటితో యాక్షన్‌ సీన్లు చేయడం కొంచెం కష్టమే. అయినా మా టీమ్‌ అందరం చాలా కష్టపడి సినిమా చేశాం. దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనే అనుకుంటున్నాము.
హిప్‌హాప్‌తమిళ మ్యూజిక్‌ గురించి?
– హిప్‌హాప్‌తమిళ పేరు అందరికీ తెలుసు. ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అయితే హిప్‌హాప్‌తమిళ మ్యూజిక్‌తో పాటు అద్భుతమైన ఆర్‌.ఆర్‌ ఇస్తారని ఈ సినిమాతో ప్రూవ్‌ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు ఆర్‌.ఆర్‌ అనేది కీలకం. కొన్ని సీన్లలో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. మా యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఆయన్ను అప్రిషియేట్‌ చేశారు. రేపు సినిమా విడుదలయ్యాక ఆడియన్స్‌ కూడా తప్పకుండా మెచ్చుకుంటారు.
మిగతా ఆర్టిస్టుల గురించి?
– ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి, ఛాయా సింగ్‌ ఇలా చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. వారు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్టర్‌ సుందర్‌.సి మేకింగ్‌ గురించి?
– సుందర్‌. సి గారు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌ డైరెక్టర్‌. దాదాపు అన్ని జోనర్‌లో సినిమాలు తీసి ప్రూవ్‌ చేసుకున్నారు. అయితే ‘యాక్షన్‌’ సినిమా ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. స్క్రీన్‌ ప్లే కూడా రేసీగా ఉంటుంది. లొకేషన్స్‌ గ్రాండియర్‌గాఉంటాయి. ఆయనతో వర్క్‌ చేయడం ఒక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆయన ప్లానింగ్‌ చాలా పక్కాగాఉంటుంది. అలాగే ఆయన టీమ్‌ కూడా చాలా సపోర్ట్‌ చేశారు.
విశాల్‌తో సెకండ్‌ మూవీ కదా ఎలా అన్పించింది?
– ఏ యాక్షన్‌ అయినా సరే ఎమోషన్‌ కరెక్టుగా కనెక్ట్‌ అయితేనే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారు. విశాల్‌ గారి ఎమోషన్‌కి కనెక్ట్‌ అవుతారు కనుకనే ఆయన యాక్షన్‌ను అంతలా ఇష్టపడతారు. విశాల్‌ గారు సెట్‌లో ఒక డేర్‌డెవిల్‌లా పెర్ఫామ్‌ చేస్తారు. మామూలుగానే విశాల్‌ యాక్షన్‌కి చాలా మంది ఫ్యాన్స్‌ ఉంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా యాక్షన్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఫ్యాన్స్‌కి పండుగలా ఉంటుంది. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌ మూవీ అవుతుంది.
శ్రీకార్తికేయ సినిమాస్‌ అధినేత శ్రీనివాస్ ఆడెపు గురించి?
– మా ప్రొడ్యూసర్‌ గారు వెరీ ఫ్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. శ్రీకార్తికేయ సినిమాస్‌ బేనర్‌పై ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నారు. పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు మిల్కీ బ్యూటీ తమన్నా.

బుల్లితెర నటీ,నటులు అన్వర్, సమీరా ల పెళ్లి వేడుక..

ప్రముఖ క్యారెక్టర్‌ నటి సన తెలుగు, తమిళంలో దాదాపు 600 సినిమాలకు పైగా నటించిన సంగతి తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా టీవీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. మంగళవారం సన, ఆమె భర్త సయ్యద్‌ సదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి సయ్యద్‌ అన్వర్‌ వివాహం సమీరా షెరీఫ్‌తో ఈ రోజు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మా అబ్బాయి పలు తమిళ సీరియల్స్‌లో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా ఫేమస్‌. అలాగే మా కోడలు సమీరా షరీఫ్‌ కూడా తెలుగు, తమిళ టీవీ రంగాల్లో బుల్లితెరపై సంచలనం సృష్టించిన అనేక సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇన్‌స్టాలో ‘అన్విరా’ హ్యాండిల్‌తో పోస్టులు పెడుతుంటారు. ఈ పోస్ట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్‌. సోమవారం రాత్రి వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా జరిగింది. ఎంతో గ్రాండ్‌గా భారీ ఎత్తున చేసుకోవచ్చు. కానీ వారిద్దరికీ ఏ హడావిడి లేకుండా చేసుకోవటమే ఇష్టం. కారణం ఇద్దరూ కలిసి కొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చులకు సహాయపడాలనుకుంటున్నారు. వారిద్దరి నిఖా జరిగిందని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేం ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేశాం’’ అన్నారు.

ఆటపాటల నడుమ వేడుకగా నటి అర్చన సంగీత్

తెలుగు అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్‌తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు. వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

నిహారిక కొణిదెల మరియు యూట్యూబ్ హెడ్ సిద్ధార్థ చేతులమీదుగా వోల్గా వీడియోస్ కి డైమండ్ బటన్ అవార్డ్

అనాది కాలం నుంచి అలరిస్తూ వస్తూ.. వీడియో క్యాసెట్ల సంస్థల్లోనే అప్పటికీ ఇప్పటికీ నెంబర్ స్థానం లో నిలుస్తూ వస్తున్న సంస్థ వోల్గా వీడియోస్. నేటి యూట్యూబ్ కాలంలో కూడా మీడియా విలువలను కాపాడుతూ.. నిష్ణాతులైన సిబ్బందితో నిరంతరం పురోగతిని సాధిస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న ఓల్గా వీడియోస్ సంస్థ కు ప్రముఖ యూట్యూబ్ సంస్థ అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించింది. వివరాల్లోకి వెళితే.. గూగుల్ సంస్థ వారి విజయోత్సవ వేడుకలో భాగంగా.. యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యే ప్రసారల్లో అత్యున్నత నాణ్యత విలువలతో కూడిన వీడియోస్ ను ప్రసరింప చేస్తుండడంతో పాటు కోటి కి పైగా అత్యధిక సబ్ స్క్రైబర్స్ ను కలిగి బిలియన్ల వ్యువర్స్ ను పొందుతున్న యూట్యూబ్ వీడియోస్ లకు గానూ యూట్యూబ్ టీమ్ ఇంచార్జ్ సిద్దార్థ్ సమక్షంలో వోల్గా వీడియోస్ సంస్థ అధినేతలైన రవినాథ్ మరియు ప్రసాద్ లను సగర్వంగా సత్కరించి “యూట్యూబ్ డైమెండ్ బటన్” అవార్డును అందచేసింది.. ఈ అవార్డు ప్రధాననోత్సవ కార్యక్రమంలో… మెగా నటి నీహారిక కొణిదెల, ఆదిత్య ఆడియో సంస్థ అధినేత గుప్తా లు పాల్గొని వోల్గా వీడియోస్ వారికి తమ అభినందనలను, శుభాకాంక్షలను తెలియచేసారు