Home Blog Page 1022

నవంబర్ 22న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న‌ లవ్ థ్రిల్లర్ ‘ట్రాప్’

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానర్ లో మహేందర్ ఇప్పలపల్లి, షాలు, కాత్యాయనీ శర్మ హీరో హీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రాప్’. ఈ చిత్రం ద్వారా ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్నారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 22 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా…

దర్శకుడు వీ ఎస్ ఫణింద్ర మాట్లాడుతూ – ” ఈ స్టోరీ చెప్పగానే వెంటనే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న నిర్మాత ఆళ్ల స్వర్ణలత గారికి థాంక్స్. అలాగే మా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాజీ గారికి కృతజ్ఞతలు. ఆయనకు ‘సిందూరం’ సినిమా ఎలా మంచి పేరు తీసుకువచ్చిందో నాకు ఈ చిత్రం అలా మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను. మా సినిమాలో మంచి పాటలు ఇచ్చిన ఈశ్వర్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హర్ష కు ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత ఆళ్ల స్వర్ణలత మాట్లాడుతూ – “మొదట నిర్మాణ రంగంలోకి రావాలంటే చాలా భయం వేసింది. కానీ హీరో, హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎడిటర్ రామారావు గారు, దర్శకుడు ఫణింద్ర సినిమా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. నవంబర్ 22 న మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావలి” అన్నారు.

మహేందర్ ఇప్పలపల్లి, కాత్యాయనీ శర్మ, బ్రహ్మాజీ, షాలు, రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె, శివ,
ఎడిటర్ : రామారావు జె పి,
మ్యూజిక్: ఈశ్వర్ పెరావలి,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్ష ప్రవీణ్,
కొరియోగ్రాఫర్ : జో జో,
ప్రొడ్యూసర్ : ఆళ్ల స్వర్ణలత,
కథ,దర్శకత్వం : వీ ఎస్ ఫణింద్ర.

అమ్మగారు ఆశీస్సులతో వస్తున్న “రణస్థలం” .

సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్,షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం”.ఈ చిత్రం ఆడియోను నిర్మాత అమ్మగారైన శ్రీ మతి కావాలి సంతోషమ్మ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్,హీరోయిన్స్ మేఘన,జరాఖాన్,సంగీతదర్శకుడు రాజకిరణ్,కో డైరెక్టర్ శ్రీరామ్,ఆర్టిస్ట్ కనకదుర్గ అప్పారెడ్డి గూడా గ్రామా పెద్దలు వ్లకే బుచ్చయ్య,చేగూరు రాజు,భవాని శ్రీనివాస్,వ్లకే వెంకటేష్,చెక్కల శ్రీశైలం (షాద్ నగర్) మరియు కేశిరెడ్డి పల్లి గ్రామా పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరో,నిర్మాత అయిన కావాలి రాజ్ మాట్లాడుతూ.ఈ చిత్రం షూటింగ్ టైములో చాల కష్టాలుపడ్డాను మా అమ్మగారు సంతోషమ్మ ఆశీస్సులతో ధైర్యంగా పూర్తిచేయగలిగాను.ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించాం.ఈ చిత్రం చాల అద్భుతంగా వచ్చింది తప్పకుండ విజయం సాధిస్తుంది ఈ నెల 22 విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు.
చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ‘ఈ సినిమా కి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.సంగీత దర్శకుడు రాజకీరణ్ వ్యాక్యతగా వ్యవహరించిన ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయింది.రాజ్, షాలు, సత్యంరాజేశ్, ఛత్రపతి శేఖర్, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను, మేఘన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రాజకీరణ్, కెమెరా:ప్రభాకర్, ఎడిటర్:ఎమ్ ఆర్ వర్మ, లిరిక్స్:ఎం.రామారావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్,వించున్ అంజి, డాన్సు:పాల్ ,విగ్నేష్, ఆర్ట్:సుభాష్ నాని,పి.ఆర్. ఓ:బి.వీరబాబు,నిర్మాత:కావాలి రాజు,కధ, స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ఆది అరవల.

‘రుద్రనాగు’ షూటింగ్‌ ప్రారంభం

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌, భారీ గ్రాఫిక్స్‌తో సర్వేశ్వర మూవీస్‌ పతాకంపై గుద్దేటి బసవప్పమేరు నిర్మాతగా ఎ.రాజేందర్‌ , రమేష్‌ కడూరి (ఆర్‌కె), బి.లక్ష్మి, రంగసాయి టి.వి సహ నిర్మాతలుగా నిర్మిస్తోన్న చిత్రం ‘రుద్రనాగు’. శివ జొన్నల గడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ , శివలీల హీరోయిన్స్‌. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారిపల్లి కొండలరావు, సీనియర్‌ దర్శకుడు వి.సాగర్‌, ప్రసన్న కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల , లయన్ సాయి వెంకట్‌ తదితరులు విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు, ఏపీ ఎఫ్ . డి . సి చైర్మన్ విజయ్‌చందర్‌ క్లాప్‌నివ్వగా సారిపల్లి కొండల రావు కెమెరా స్విచాన్‌ చేశారు. వి.సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో అతిథిగా విచ్చేసిన సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ..‘‘శివ తో నాకు మంచి పరిచయం ఉంది. మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. పలు భాషల్లో సినిమాలు చేస్తూ అగ్రెసివ్‌ హీరోగా ఎదుగుతున్నాడు’’ అన్నారు.
నటుడు, ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ విజయ్‌చందర్‌ మాట్లాడుతూ …“ యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు “ అన్నారు.
దర్శకుడు వి.సాగర్‌ మాట్లాడుతూ…‘‘హీరోగా, దర్శకుడుగా సినిమా లు చేస్తూ శివ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ కావాలన్నారు.
నిర్మాత గుద్దేటి బసవప్పమేరు మాట్లాడుతూ…‘‘శివతో చాలా కాలం నుంచి ప్రయాణం సాగుతుంది. తను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తుండగా మిత్రులతో కలిసి ‘రుద్రనాగు’ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మిస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు-హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ…‘‘కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రారంభంతో పాటు టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌, అలాగే హనుమంతుడి పై రాసిన పాటలోని పల్లవి రిలీజ్‌ చేశాం. ఇక కథ విషయానికొస్తే కేరళలోని అనంత పద్మనాభస్వామి కథ ఆధారంగా తీసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నాం. కాంచీపురం శివాలయం లో ఉన్న నిధి దుష్టు చేతుల్లో పడకుండా రుద్ర, నాగు (కాల నాగు) ఏ విధంగా కాపాడారు అన్నది మా చిత్ర కథాంశం. దీన్ని ఐదు భాషల్లో భారీ బడ్జెట్‌తో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు.

శివ జొన్నలగడ్డ, సుప్రియ, శివలీల , తమటం రామచందర్‌ గౌడ్‌, దండ వెంకటస్వామి , రాయచూర్‌ శంకర్‌ సింగ్‌, రాయచూర్‌ ప్రేమ్‌ కుమార్‌, మాచర్ల రవి గౌడ్‌, తలరి హనుమంతుడు, ఆప్‌కారి బాలస్వామి, గుర్గిరాల రాజశేఖర్‌ , సంపంగి నరసింహా, మయలి శ్రీశైలం, దొడ్ల ఈశ్వర్‌ రెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.శివ, సంగీతం: ఎల్‌.ఎమ్‌ ప్రేమ్‌, పాటలు : రమేష్‌ రుద్రంగి, కొండేకర్‌ బాలాజి, మేరి మంజు, టి.నిరంజన్‌ సంజయ్‌ గాంధీ, నిర్మాత: గుద్దేటి బసవప్ప మేరు, సహ నిర్మాతలు: ఎ.రాజేందర్‌, రమేష్‌ కడూరి (ఆర్‌కె) రంగసాయి టివి, బి. లక్ష్మి, మాటలు -స్క్రీన్‌ ప్లే -దర్శకత్వం: శివ జొన్నలగడ్డ.

ప్రేక్షకులని పూర్తిగా నవ్వించే సినిమాలు తగ్గాయి… జి.నాగేశ్వ‌ర రెడ్డి

జ‌వ్వాజి రామాంజ‌న‌యులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై
యంగ్ హీరో సందీప్ కిష‌న్, హన్సిక జంటగా జి.నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మూవీ `తెనాలి రామ‌కృష్ణ `బిఎ.బిఎల్ `.`కేసులు ఇవ్వండి ప్లీజ్‌` ట్యాగ్ లైన్‌. వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్, ఇందుమూరి శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 15న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఇంటర్వ్యూ…
సినిమా గురించి?
– ఈ మధ్య కాలంలో ప్రేక్షకులని పూర్తిగా నవ్వించే సినిమాలు తగ్గాయి. రకరకాల టెన్షన్స్ వల్ల ప్రతి ఒక్కరం ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నాం. నవ్వడం కూడా చాలా తగ్గించేసాం. అయితే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. గతం లో నరేష్ గారు, రాజేంద్రప్రసాద్ లాంటి వారు పూర్తి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్స్ చేసి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవారు. అయితే ఇప్పుడు నవ్వడం తగ్గడం వల్లే లాఫింగ్ క్లబ్స్ వచ్చాయి అని నేను నమ్ముతాను. అలా లాఫింగ్ క్లబ్స్ కి వెళ్ళి నవ్వాల్సిన పరిస్థితిని కొద్దో గొప్పో తగ్గించే శక్తి సినిమాకు ఉంది. అందులోనే నేను ఫన్ బాగా తీయగలను అని నా నమ్మకం. గతంలో వచ్చిన నా సినిమాలు అది ప్రూవ్ చేశాయి. పూర్తిగా నవ్వుల్నీ టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ మొత్తం వచ్చి హిలేరియస్ గా నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది.
తెనాలి రామకృష్ణ అని టైటిల్ పెట్టడానికి కారణం?
– ఈ సినిమాలో సందీప్ కిషన్ ది తిమ్మిని బమ్మి చేసే లాయర్ క్యారెక్టర్. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో పనిచేసే తెనాలి రామకృష్ణ ది కూడా అలాంటి క్యారెక్టర్. శ్రీ కృష్ణ దేవరాయ ని ఎవరైనా చంపడానికి ట్రై చేస్తే మాత్రం చాలా సీరియస్ గా దానినుండి ఆయన్ను కాపాడతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లో కూడా తాను ప్రేమించే వ్యక్తిని చంపడానికి ట్రై చేస్తే ఎలా కాపాడాడు? అనేది కీల‌కం. దాంతో ఆ టైటిల్ ఫైనలైజ్ చేశాం.
సందీప్ కిషన్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది?
– అసలు కాంప్రమైజ్ ఐతే కేసులు, గొడవలు, కోర్ట్ లు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో, ఒక కేసు విషయంలో నో కాంప్రమైజ్ అన్న స్థితికి చేరుతాడు. అలాంటి రెండు షేడ్స్ కలిగిన హీరో పాత్రని కామిక్ గా తెరకెక్కించడం జరిగింది. గత చిత్రాలకు భిన్నమైన మాస్ కూడా ఇమేజ్ సందీప్ కిషన్ కి ఈ చిత్రంతో వస్తుంది అనుకుంటున్నాను.
హన్సిక క్యారెక్ట‌ర్ ?
– నేనే మహా మేధావిని అనుకొనే ఇన్నోసెంట్ లాయర్ గా హన్సిక పాత్ర ఉంటుంది. ఆమెకు అంతా తెలుసు అనుకుంటుంది కానీ ఏమీ రాని క్యారెక్ట‌ర్‌లో హన్సిక చాలా బాగా చేసింది. అలాగే సందీప్ కిష‌న్, హన్సిక ల కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్ల‌స్ అవుతుంది.
వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?
– ఆమెది ఈ చిత్రంలో కీలకమైన పాత్ర. భారీ ఇమేజ్ ఉన్న ఆమె చేత ప్రాధాన్యం లేని పాత్ర చేయిస్తే సినిమాకి నెగెటివ్ మార్క్స్ పడే అవ‌కాశం ఉంది. అందుకే ఆమెను ప్రాధాన్యం ఉన్న ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకోవడం జరిగింది. ఈ మూవీ చూసిన తరువాత ఆడియ‌న్స్ తో పాటు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
చిత్రీకరణ స‌మ‌యంలో సందీప్ కి గాయం అయింది క‌దా?
– అవును ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బస్సు లో నుండి రౌడీలు అద్దాలు పగులగొట్టుకొని బయటకి రావాలి. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఓ గాజు ముక్క సందీప్ కి గుచ్చుకోవడం జరిగింది. దానితో రెండు నెలలు షూటింగ్ వాయిదాపడింది.
ఈ సినిమాలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు క‌దా! వారి గురించి?
– ఈ మూవీలో కమెడియన్స్ గా నటించిన పోసాని, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య కృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దొంగ సాక్ష్యాలు చెప్పేదిగా సత్య కృష్ణ కుటుంబం, ఏళ్ల నుండి కోర్ట్ చుట్టూ తిరిగే వాడిగా సప్తగిరి, ఒక పెద్ద క్రైమ్ లో సాక్షులుగా వెన్నల కిషోర్ మరియు అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ కనిపిస్తారు. వీరి కామెడీ ట్రాక్ తెనాలి రామకృష్ణ పాత్రకు మించి ఉంటుంది.
ప్రొడ్యూసర్స్ గురించి?
– ప్రొడ్యూసర్స్ నా స్నేహితులు, వారు కథను, నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించడం జరిగింది. వారికి ఇండస్ట్రీ కొత్త అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ ఫుట్ రావడానికి నాకు ఎంతో సహకరించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వారికి నిర్మాతలుగా మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి

ప్రతి ఆర్టిస్టు స్టూడెంట్ లా వెళ్ళాలి..దేవీప్రసాద్

సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తోలుబొమ్మలాట’. దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం లోఓ కీలక పాత్ర చేసిన నటుడు మరియు దర్శకుడు దేవి ప్రసాద్ ఇంటర్వ్యూ.

ఇందులో ఏదీ ఆట ఏది బొమ్మ మూవీ గురించి చెప్పండి?
👉ఇందులో నేను పెద్దాయనకు కొడుకు గా,నాకు ఒక కొడుకు ఉంటాడు ఆయనే హీరో ఇందులో కుటుంబ బంధాల పైన ఉండే విలువ తెలియ చేస్తున్నాం.విశ్వనాథ్ బాగా హ్యాండిల్ చేసాడు. మన షులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తం గా తెరకెక్కింది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన ప్రేమ కథ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.

దర్శకుడు కొత్తవారైనా విశ్వనాథ్ మాగంటి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

👉ఒక నూతన దర్శకుడు లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు, కానీ విశ్వనాధ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నారు. తాను తీసిన సినిమా చూసి నలుగురు మంచి సినిమా చూశాం అని మెచ్చుకుంటే చాలు అనుకొనే తత్త్వం కల కుర్రాడు. దర్శకుడిగా అంత మంది సీనియర్ నటులను చక్కగా హ్యాండిల్ చేశారు.

డైరెక్టర్ గా మీకున్న అనుభవంతో ఈ డైరెక్టర్ కు మీరేమైన సలహాలు ఇచ్చారా ?
👉నేను ఒక స్టూడెంట్ గా వెళ్తాను, యాక్టర్ గా వెళ్ళినపుడు ఒక వైట్ పేపర్ ల వెళ్ళాలి డైరెక్టర్ ఏది చేప్తే అది చేస్తాను. , డైరెక్టర్ మంచి రైటర్ మంచి డైలాగులు రాసుకున్నాడు,సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు.

ఇందులో నెగెటివ్ టచ్ ఏమైనా ఉందా ?
👉ప్రతి మనిషి లో గుడ్,బ్యాడ్ ఉంటాయి,ఎవ్వరు తీవ్రమైన నెగెటివ్ ఉండరు,కానీ కొంచెం నెగెటివ్ ఉంటుంది అదే ఇందులో చూయించాడు.

రాజేంద్ర ప్రసాద్ తో చేసిన అనుభవం ఎలా ఉంది?
👉రాజేంద్ర ప్రసాద్ గారితో చేయాలని ఎప్పటి నుండో నాకు కోరిక ఉండేది. అది ఈచిత్రంతో నెరవేరింది. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ నటులు ఉన్నారు. వారందరితో కలిసి చేసిన ప్రయాణంలో నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను.

తోలు బొమ్మలాట చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
👉ఒక విలేజ్ లో పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. అలాగే మనం, మన సంపాదన, భవిష్యత్తు అని అనే నేటి తరం ఆలోచనా ధోరణి ఉంటుంది. అలాగని స్వార్ధం కూడుకున్న నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాదు. సాధారణంగా అన్ని కుటుంబాలలో కనిపించే సహజమైన స్వభావం కలిగి ఉంటుంది.

నటుడిగానే కంటిన్యూ అవుతారా? లేక దర్శకత్వం కూడా చేస్తారా?
👉ఇప్పటివరకు నేను 23 సినిమాలు చేసాను ,ఇంకా రిలీజ్ కు 14 సినిమాలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి నటుడిగా చేస్తున్నాను. దర్శకత్వంలో ఇదొక యాంగిల్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. అయితే కచ్చితంగా త్వరలోనే నా దర్శకత్వంలో ఒక సినిమా తీస్తాను. ఒక మంచి సినిమా తీసిపెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాను.

నటుడిగా ప్రస్తుతం ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు?
👉శర్వానంద్ శ్రీకారం చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ‘కాదల్’ అని ఒక సినిమా, ‘ఆయుష్మాన్ భవ’, ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ’22 ‘ , ‘మీటూ’ వీటితో పాటు ఇంకా పేరుపెట్టని మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాను.

“రొమాంటిక్” గా గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న ఆకాష్ పూరి..

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా  అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `రొమాంటిక్‌’. ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది.
ర‌మ్య‌కృష్ణ స‌హా ఎంటైర్ యూనిట్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. 30 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
న‌టీన‌టులు:
ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి
స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖి
ఆర్ట్‌: జానీ షేక్‌
పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీశ్‌

సినిమా చరిత్రలో చీమ హీరోగా “చీమ – ప్రేమ మధ్యలో భామ!”

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు
ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వం లో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం చీమ – ప్రేమ మధ్యలో భామ!” . ఇటీవల  SP బాలసుబ్రమణ్యం గారు పాడిన టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “చీమ – ప్రేమ మధ్యలో భామ!” డిసెంబర్ లో విడుదల అవుతుంది. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రం. అలాగని ఇది పూర్తి ఏనిమేషన్ చిత్రం కాదు. మంచి కుటుంబ కథా చిత్రం. అందరూ చూడదగ్గ చిత్రం” అని తెలిపారు.

సినీ దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ “మా చిత్రం యొక్క ట్రైలర్ విడుదలయింది. ఎవరో రాజమౌళి గారి ఈగ ను మా మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) చీమ తో పోల్చారు, అది గొప్ప ప్రశంశ!. రాజమౌళి గారి ఈగ రివెంజ్ స్టోరీ, మాది లవ్ స్టొరీ. నూతన నటులు అమిత్, ఇందు లను ఈ చిత్రం తో పరిచయం చేస్తున్నాము. డిసెంబర్ లో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

నటీ  నటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్, కోరియోగ్రఫీ : చిరంజీవి, సుభాష్, ఆనంద్.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు

నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

కపిలదేవ్ గెటప్ లో రణ్వీర్ సింగ్ హీరోగా “83”

83` చిత్రంలో క‌పిల్ దేవ్ ట్రేడ్ మార్క్ న‌ట‌రాజ్ క్రికెట్ షాట్‌తో ఆక‌ట్టుకుంటున్న ర‌ణ్వీర్‌ సింగ్‌

భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 ఏడాదిని మ‌ర‌చిపోలేం.  క‌పిల్ దేవ్ నాయ‌క‌త్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజ‌యాన్ని సాధించిన  క్రికెట్ విశ్వ‌విజేత‌గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించిన సంవ‌త్స‌ర‌మది. తొలిసారి ప్ర‌పంచ క్రికెట్ క‌ప్పును భార‌తావ‌ని ముద్దాడిన ఏడాది 1983. ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10,2020 న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ర‌ణ్వీర్ సింగ్ క‌పిల్‌దేవ్‌లా మేకోవ‌ర్ అయ్యారు. త‌న శ‌రీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవ‌డానికి ఆయ‌న ప‌డ్డ క‌ష్టం మ‌న‌కు తెర‌పై క‌న‌ప‌డుతుంది. ఫ్యాన్స్ కోసం క‌పిల్‌దేవ్‌లా ఉన్న ర‌ణ్వీర్ సింగ్ లుక్‌ను చిత్రీ యూనిట్ విడుద‌ల చేసింది. అది కూడా ఆయ‌న ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ న‌ట‌రాజ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో ట‌న్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ 175 ప‌రుగుల‌ను సాధించారు. క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ మ్యాచ్ మ‌ర‌పురాని మ్యాచ్‌గా నిలిచిపోయింది. సాంకేతిక కార‌ణాల‌తో ఈ మ్యాచ్ లైవ్‌లో ప్ర‌సారం కాలేదు. రికార్డు కూడా కాలేదు.
ఈ చిత్రంలో క‌పిల్ డేర్ డెవిల్స్‌ సాధించిన విజ‌యాల‌ను అద్భుతంగా చిత్రీక‌రించారు. ముంబైలో రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్‌లా ర‌ణ‌వీర్ సింగ్, సునీల్ గ‌వాస్క‌ర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మ‌ద‌న్‌లాల్‌గా హార్డీ సంధు, మ‌హీంద‌ర్ అమ‌ర్‌నాథ్‌గా ష‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్‌, కృష్ణ‌మాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్‌ క‌త్తార్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారి, ర‌విశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేక‌ర్ శ‌ర్మ‌, య‌శ్‌పాల్ శ‌ర్మ‌గా జ‌తిన్ శ‌ర్నా, రోజ‌ర్ బ‌న్నిగా నిశాంత్ ద‌హియా, సునీల్ వాల్సన్‌గా ఆర్‌.బద్రి, ఫ‌రూక్ ఇంజ‌నీర్‌గా బోమ‌న్ ఇరాని, పి.ఆర్‌.మ‌న్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో దీపికా ప‌దుకొనె అతిథిపాత్ర‌లో న‌టిస్తున్నారు

పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథే ‘విజయ్ సేతుపతి’….దర్శకుడు విజయ్ చందర్.

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన
‘సంగ తమిళ్’ మూవీ ని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా ఈ
నెల 15 న విడుదల చేయనున్నారు. ఈ జనరేషన్ హీరోలలో ‘విజయ్ సేతుపతి’కి
ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ‘సైరా’ తో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన
విజయ్ సేతుపతి మూవీ తమిళ, తెలుగులలో ఒకేసారి రిలీజ్ అవుతున్న మూవీ ‘విజయ్
సేతుపతి’. తెలుగు నేటివిటీ కి సరిపోయే కథా, కథనాలతో అవుట్ అండ్ అవుట్
యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలసి వస్తున్న ‘విజయ్ సేతుపతి’ ప్రీ
రిలీజ్ ఈవెంట్ చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. నాజర్, నివేద పేతురాజ్,
అశుతోష్ రాణా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ  విజయ్ సేతుపతి ని
తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని చిత్రయూనిట్ నమ్మకం. విద్యా
వేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న  రావూరి. వి. శ్రీనివాస్  తన
తోటి విద్యావేత్తలు కంచర్ల శ్రీకాంత్ చౌదరి,  ప్రకాష్ రెడ్డి,
చక్రవర్తి, వెంకట రాజు దంపతుల చేతుల మీదుగా ‘ విజయ్ సేతుపతి’ పాటలను
విడుదల చేయించారు.  తమ సహా విద్యావేత్త నిర్మాతగా సక్సెస్ అవ్వాలని
అతిథులు కోరుకున్నారు. సీనియర్ దర్శకుడు సముద్ర ట్రైలర్ ని లాంచ్ చేయగా ,
డిస్ట్రిబ్యూటర్స్ నారాయణ రెడ్డి, సతీష్ , సజ్జులు టీజర్ ని లాంచ్
చేసారు.

ఈ సందర్భంగా మాటల రచయిత ‘మల్లూరి వెంకట్’ మాట్లాడుతూ:
‘నిర్మాత రావురి వి. శ్రీనివాస్ కి మంచి అభిరుచి ఉంది. ఈ సినిమా టైటిల్
ని ‘విజయ్ సేతుపతి’ గా ఆయనే డిసైడ్ చేసారు. వెన్నెల కంటి, ఆయన తనయుడు
రాకేంద్రమౌళి పాటలకు తెలుగదనం అద్దారు.
ఇందులో మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విజయ్ చందర్ కి నిర్మాత
శ్రీనివాస్ కి థ్యాంక్స్’ అన్నారు.

నగేష్ నారదాసి మాట్లాడుతూ:
‘ అందరి పేరులోని విజయం సినిమా రిజల్ట్స్ లో కనిపించాలి. ప్రేక్షకులకు
బాష తో పనిలేదు సినిమా బాగుంటే తప్పకుండా పెద్ద విజయం అందిస్తారు.
రీసెంట్ గా వచ్చిన ఖైదీ, విజిల్ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో
చూసాం. అదే దారిలో విజయ్ సేతుపతి కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను.
ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ‘విజయ్ సేతుపతి’లో పుష్కలంగా
ఉన్నాయి.’ అన్నారు.

ప్రొడ్యూసర్ రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ:
‘ఎప్పటినుండో సినిమా రంగంలోకి రావాలని అనుకుంటున్నాను. స్ట్రైయిట్ సినిమా
చేయాలని ప్రయత్నిస్తున్న టైం లో మిత్రుడు వెంకట్ ద్వారా ఈ సినిమా గురించి
తెలుసుకున్నాను. విజయా ప్రొడక్షన్ వారిని కలుసుకొని ఈసినిమా తెలుగు
రైట్స్ ని పొందాను.  ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు
ఆనందంగా ఉంది. దర్శకుడు విజయ్, మ్యూజిక్ దర్శకుడు వివేక్ – మెర్విన్ చాలా
బాగా పనిచేసారు. అచ్చ తెలుగు సినిమా లాగానే ‘విజయ్ సేతుపతి’ ఉంటుంది ’
అన్నారు.

దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ:
‘తెలుగు సినిమాలాగా ‘విజయ్ సేతుపతి’ ఉందని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్
కోసం రాసుకున్న కథ. ఎ యమ్ రత్నం గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా
మొదలవుతుందనే వార్తలు వస్తున్నప్పుడు ఎ యమ్ రత్నం గారికి ఈ కథను
చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో
బిజీగా ఉండటం తో ఆ ప్రయత్నం నేరవేరలేదు. తర్వాత విజయా ప్రొడక్షన్ వారికి
ఈ కథను చెప్పడం జరిగింది వారికి కథ నచ్చడంతో విజయ్ సేతుపతి ని సజెస్ట్
చేసారు. విజయ్ సేతుపతి ఈ కథ వినగానే చాలా మాస్ ఎలిమెంట్స్ తో కథ ఉంది అని
మెచ్చుకున్నారు. తమిళంలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఈ కథను ఆయన
బాగా ఎంజయ్ చేసి చేసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటు  ఫ్యామిలీ
ఎమోషన్స్ బలంగా ఉంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం
ఉంది’ అన్నారు.

సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ:
‘విజయ్ సేతుపతి లో ఎనర్జీ లెవల్స్ సూపర్బ్ గా ఉన్నాయి.  విజయ్ సేతుపతి ఈ
సినిమా తో తెలుగు లో స్టార్ డమ్ వస్తుందని నమ్ముతున్నాను. ఏ
దర్శకుడికయినా పవన్ కళ్యాణ్ తో పనిచేయాలని ఉంటుంది. ఈ సినిమా తర్వాత
విజయ్ చందర్ కి పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం వస్తుందని నమ్ముతున్నాను.
చిత్ర యూనిట్ కి అభినందనలు… సినిమా పెద్ద విజయం సాధించాలని
కోరుకుంటున్నాను’ అన్నారు.

నటీ నటులు:
విజయసేతుపతి, రాశీఖన్నా, నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా,రవికిషన్
శుక్లా, తులసి తదితరులు

సాంకేతిక వర్గం :
సంగీతం: వివేక్ – మెర్విన్, సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్, స్టంట్స్:
అనల్ అరసు, కోరియోగ్రాఫీ: రాజుసుందరం, శాండి, దస్త,
ఎడిటింగ్ : ప్రవీణ్ కె. ఎల్. డైలాగ్స్: మల్లూరి వెంకట్, నిర్మాత రావురి.
వి. శ్రీనివాస్,  దర్శకత్వం: విజయ చందర్

స్టార్ హీరో సూర్య మూవీ కొత్త చిత్రం “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్ విడుదల

2డి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ చిత్రం “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురలి హీరోయిన్ గా నటిస్తోంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఈమధ్య వరస ఫెయిల్యూర్లతో మార్కెట్ తగ్గిపోయింది. ముఖ్యంగా సూర్య లాస్ట్ సినిమాలు ‘NGK’.. ‘బందోబస్త్’ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఇప్పుడున్న పరిస్థితిలో మంచి హిట్ పడితే కానీ సూర్య పోగొట్టుకున్న మార్కెట్ మళ్ళీ తిరిగిరాదు. సూర్య ప్రస్తుతం ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ నిర్ణయించారు.

నటీనటులు
సూర్య, అపర్ణ బాలమురలి, కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న

సాంకేతిక నిపుణులు
నిర్మాత : సూర్య శివకుమార్
కో ప్రొడ్యూసర్ : రాజశేఖర్ కర్పూర పాండియన్
కథ, దర్శకురాలు : సుధా కొంగర ప్రసాద్
స్క్రీన్ ప్లే : షాలిని ఉషాదేవి & సుధా కొంగర
సినిమాటోగ్రఫీ : శ్రీనికిత్ బొమిరెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్
ఎడిటర్ : సతీష్ సూర్య
ఆర్ట్ డైరెక్టర్ : జాకీ
కాస్టమ్ డిజైనర్ : పూర్ణిమ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : సెంథిల్ కుమార్