- శ్రీ కార్తికేయ సినిమాస్ పతాకంపై మాస్ హీరో విశాల్,తమన్నా, ఐశ్వర్య లేక్ష్మి, ఆకాంక్ష నటీనటులుగా సుందర్.సి.దర్శకత్వంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ మూవీ “యాక్షన్” సినిమాను నవంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా ఈ చిత్రం యొక్క ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ – ”ఇప్పటివరకూ నేను చేసిన అన్ని సినిమాలని మీరు ఆదరించారు. ఈసినిమాను అలాగే ఆదరిస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే నాకు తెలిసినంతవరకు బెస్ట్ కమర్షియల్ మూవీస్, బెస్ట్ యాక్షన్ మూవీస్ తెలుగులోనే వచ్చాయి. మన ఆడియన్స్ మాస్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే మీ అందరికీ తెలుసు విశాల్ నెక్స్ట్ లెవెల్ మాస్ అని. ఇది నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతి షాట్‌కి నాకు సపోర్ట్ చేసిన విశాల్ గారికి థాంక్స్ అన్నారు.
హీరో ప్రిన్స్ మాట్లాడుతూ – ‘యాక్షన్’ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్ నేేను విశాల్‌అన్న ‘డిటెక్టివ్’ సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక్క సాంగ్ కూడా లేదు. అయినా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలాగే ‘యాక్షన్’ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు నా నెక్స్ట్ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. డిసెంబర్‌లో నెక్స్ట్ షెడ్యూల్ చేయబోతున్నాం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా(ఆది)మాట్లాడుతూ – ”యాక్షన్ మూవీకి సాంగ్స్ స్కోర్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాలుగు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. అలాగే ఈ సినిమాలో ఒక ర్యాప్ సాంగ్ ఉంది. దాన్ని రోల్ రైడా పాడారు. నేను తెలుగులో రెండే మూవీస్ చేసిన మీ అందరి అభిమానానికి థాంక్స్. త్వరలో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తాను. ఈ సినిమాలో రానా దగ్గుపాటి గారు ఫస్ట్ టైమ్ ఒక ర్యాప్ సాంగ్ పాడారు. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. విశాల్ అన్న నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మరో సారి ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది” అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య లేక్ష్మి మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నాక్యారెక్టర్‌కి సంబందించిన ఎక్కువభాగం హైదరాబాద్‌లోనే షూట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఎక్కువ ఫ్యామిలీ సీక్వెన్స్‌లు కూడా ఇక్కడే షూట్ చేశాం. మళ్ళీ ప్రమోషన్స్‌కి ఇక్కడికే రావడం హ్యాపీగాఉంది అన్నారు.
హీరోయిన్ ఆకాంక్ష మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నాది నెగటివ్ క్యారెక్టర్. విశాల్ గారితో కలిసి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుందర్‌సర్‌కి థాంక్స్ అన్నారు
ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ఆడెపు మాట్లాడుతూ – ” నేను 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను. అది అంత శాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. తర్వాత డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ క్రమంలోనే 6-7 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌కి వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’, ‘రాజుగారి గది 3 ‘ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇప్పుడు ‘యాక్షన్’మూవీతో ప్రొడ్యూసర్‌గా మారినందుకు చాలా హ్యాపీగాఉంది. అలాగే ప్రిన్స్ హీరోగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. విశాల్ అన్న చాలా దూరం ట్రావెల్ చేసి నాకోసం ఇక్కడికి వచ్చారు. ఈసందర్భంగా విశాల్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే తమన్నా గారు రావడం కూడా హ్యాపీ. అలాగే ఆకాంక్ష, ఐశ్వర్య ఫస్ట్ టైమ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ ”అన్నారు.
హీరో విశాల్ మాట్లాడుతూ – ”యాక్షన్’ నా కెరీర్ లో 27వ సినిమా. 27సినిమాల్లో ఎన్ని దెబ్బలు తగలాలో ఈ సినిమాలో అన్ని దెబ్బలు తగిలాయి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ‘యాక్షన్’ తప్ప మరే టైటిల్ అనిపించలేదు. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థిల్లర్. సుందర్.సి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు సినిమా చూస్తున్నపుడు ఇది 150 కోట్ల బడ్జెట్ మూవీలా కనిపిస్తుంది. కానీ 60 కోట్ల బడ్జెట్. 88 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. అందుకు డైరెక్టర్ సుందర్.సి గారే కారణం. ఆయన ఎప్పుడూ నిర్మాతలు బాగుండాలని సినిమా తీస్తారు. చాలా మంది హీరోలు మూడు రాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు. కానీ కొంత మందికే అది వస్తుంది. అలా మీ అభిమానంతోనే ఇంతవరకు రాగలిగాను. నాకు గుడి అంటే థియేటర్, దేవుళ్ళు మీరే. ఈ సినిమా నాకెరీర్‌లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని సుందర్ గారు తీశారు. దానికి తగ్గట్టుగానే ‘యాక్షన్’ మూవీ ఒక విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. నేను లక్ష్మికళ థియేటర్‌లో నేల టికెట్ కొనుక్కొని సినిమా చూస్తాను. అది మీకు తెలీదు. అలా చూస్తున్నప్పుడు ఏ సీన్‌కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఏ సీన్ ఇంకా బాగాఉండాలని కోరుకుంటున్నారో నాకు తెలిసేది. అలా కొంత హోమ్ వర్క్ చేసి ఈ సినిమా తీశాం. ట్రైలర్‌లో మీరు చూసిన ఆ బైక్ సీన్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అది నా మీదకు వచ్చింది. అయితే ఆ దేవుడి దయ, నాన్న గారి జీన్స్ ఫిటినెస్ నన్ను కాపాడాయి. ‘నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు ఇది నీ సినిమా అనే గుర్తింపును నువ్వు ఎంజాయ్ చేయాలి ఇది నా కల. ఇది తండ్రిగా, నటుడిగా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్’ అని నాన్నగారు చెప్తుండేవారు. అలాగే తమన్నా గారితో నా సెకండ్ మూవీ. అలాగే ఐశ్వర్య, ఆకాంక్ష ఇద్దరూచాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్ రానా ఒక ర్యాప్ చేశారు. త్వరలోనే మీరు వింటారు. ఈ సినిమా నవంబర్ 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. శ్రీనుకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా తమ్ముళ్లు చాలా మంది ఉన్నారు తెలుగు సినిమాల్లో.. వారితో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. శ్రీను మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్. సినిమా తీయాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు దానికి తగ్గ ఫ్యాషన్ ఉండాలి. అలా ఉంటేనే మనం ఖర్చుపెట్టే డబ్బు కరెక్ట్‌గా అందుతుంది. మంచి సినిమా దొరుకుతుంది. లాంటి ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీను. తెలుగులో అభిమన్యుడు కంటే ఎక్కువ షేర్ సాధిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను. అంత బాగా వచ్చింది. అలాగే శ్రీను నా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయ్యాడు. అలాగే తెలుగు మీడియా గురించి మేము చెన్నెలో చాలా గర్వంగా మాట్లాడుకుంటాము. ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మీడియా తమవంతు సాయం చేస్తుంది. అలాంటి తెలుగు మీడియాకు నా కృతజ్ఞతలు. ఇక్కడ మేము చెప్పిన ప్రతి విషయం రేపు నవంబర్ 15న స్క్రీన్ మీద డబుల్‌గా కనిపిస్తుంది” అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా, ఐశ్వర్య లేక్ష్మి, ఆకాంక్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌తమిళ, సినిమాటోగ్రఫీ:డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.
విశాల్ “యాక్షన్”విడుదల తేది ఖరారు
హేమంత్ ఆర్ట్స్ పిచ్చోడు మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన !!!
హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.
నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.
బ్యానర్: హేమంత్ ఆర్ట్స్
కథ – స్క్రీన్ ప్లే – నిర్మాత – దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్
సంగీతం: బంటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ
ఎడిటర్: సంతోష్ గడ్డం
కెమెరామెన్: గోపి అమితాబ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ
డిసెంబర్ 5న విడుదల కానున్న ’90 ఎంఎల్’
జయలలిత బయోపిక్ `తలైవి` ప్రారంభం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను `తలైవి` పేరుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి చెన్నైలో ప్రారంభమైంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎంజీఆర్ లేకుండా జయలలిత బయోపిక్‌ను ఊహించలేం. అలాంటి లెజెండ్రీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు.
ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్‌ను జయలలితగా చూపిస్తున్నారు.
అశోక్ గల్లా హీరోగా తొలి చిత్రం ప్రారంభం
ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తొలి చిత్రం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, ఆది శేషగిరిరావు, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, నన్నపనేని రాజకుమారి, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, సుశాంత్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లోగోను ఆవిష్కరించారు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు అందించారు. ఈ సందర్భంగా…
హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ..
ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అశోక్ గల్లాకు ఆల్ ది బెస్ట్. గల్లా జయదేవ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా ట్రీట్ చేస్తుంటారు. ఆయన నిర్మాతగా అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతిగారికి, అశోక్‌కి, హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఆల్ ది బె వెరీ బెస్ట్ తెలువుతున్నాను అన్నారు.
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..
అశోక్ గల్లాకి ఆల్ ది వెరీ బెస్ట్, మంచి కథ, కథనాలతో ఇండస్ట్రీలోకి పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. నిర్మాతగా పద్మగారు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలువుతున్నాను అన్నారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ…
హీరో అశోక్ గల్లాకు ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినా సరే గ్రౌండ్ లెవల్లో వర్క్ చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాల్లోకి రాకముందు తాను ఎంతో హోమ్ వర్క్ చేసాడు, కచ్చితంగా తను సక్సెస్ సాధిస్తాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు” అన్నారు.
నటుడు వి.కె.నరేష్ మాట్లాడుతూ..
ముందుగా హీరో అశోక్ గల్లాకు అభినందనలు. తనకు అభిమానులు, ఇండస్ట్రీ సహా అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. కథ విన్నాను. రాకింగ్ సబ్జెక్ట్. యూత్ సహా అందరికీ నచ్చే ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్ ఇది. తెలుగులో ఇప్పటి వరకు రాని న్యూ జోనర్ మూవీ. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాడు, తనకు తన యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ..
మా మనవడు అశోక్ హీరోగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. మానాన్నగారి ఆశీర్వాదం అశోక్‌కి ఉంటుంది. తను ఇండస్ట్రీలోకి రావాలని చాలా బలంగా అనుకుని హార్డ్ వర్క్ చేసి ఎంట్రీ ఇస్తున్నాడు. తను మంచి హీరోగా పేరు తెచ్చుకుని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..
అశోక్‌కి కంగ్రాట్స్. ఫ్యూచర్‌లో మంచి యాక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. మంచి విలువలు, కమిట్ మెంట్ ఉన్న కుటుంబం నీకు అండగా ఉంది. అందరి పేరు నువ్వు నిలబడతానని కోరుకుంటున్నాను. కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మక్కగారి లెగసీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. జయన్నకి థ్యాంక్స్ అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ..
అశోక్‌కి అభినందనలు. శ్రీరామ్ ఆదిత్యకి, నిధి అగర్వాల్‌కి ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు. కుటుంబం నుండి ఇద్దరు సూపర్‌స్టార్స్ ఉన్నారు. ఆ లెగసీని అశోక్ కంటిన్యూ చేస్తాడని భావిస్తున్నాను అన్నారు.
డా.రమాదేవి మాట్లాడుతూ..
`సాధారణంగా ఇండస్ట్రీలోకి డబ్బులు సంపాదించాలని వస్తుంటారు. కానీ డబ్బులున్నా కూడా కళపై మక్కువతో అశోక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తనకి చిన్నప్పటి నుండి సినిమాలంటే ఎంతో ఇష్టం. కార్టూన్స్ చూడకుండా అల్లూరి సీతారామరాజు సినిమా చూసేవాడు. నటనపై ప్యాషన్‌తో వస్తున్న అశోక్‌ని అందరూ ఆశీర్వదించాలి“ అన్నారు.
పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ..
రాజ్‌గోపాల్ నాయుడుగారి మునివడు అశోక్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నందుకు తనకు అభినందనలు. గొప్ప రాజకీయ నాయకుడిగా చిత్తూరుజిల్లాకు ఎంతో సేవ చేశారు. తర్వాత మా అరుణక్క, రామచంద్రనాయుడుగారు ఓ ఇండస్ట్రీని స్థాపించి వేల మందికి జీవనోపాధిని కల్పించారు. అలాగే కృష్ణగారి మనవడు. మహేష్‌బాబుగారి మేనల్లుడు.. నా స్నేహితుడు జయదేవ్ తనయుడైన అశోక్ తాతగారిలా, తండ్రిగారిలా, కృష్ణగారిలా, మహేష్‌బాబుగారిలా గొప్పగా పేరు తెచ్చుకుంటాడని కోరుకుంటున్నాను అన్నారు.
యాక్టింగ్ గురు సత్యానంద్ మాట్లాడుతూ..
అశోక్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన వారిలో నేను ఒకడిని. అశోక్ ఓ సాధారణ స్టూడెంట్‌లా కష్టపడ్డారు. ఎంతో మంది నటులకు నేను శిక్షణ ఇచ్చారు. అశోక్ మంచి నటుడు అవుతాడు, తనలో కష్టపడే తత్వం ఉంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడాని భవిస్తూ చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు తెలిపారు.
పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా మాట్లాడుతూ..
అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను చాలా రోజుల క్రితమే రిజిష్టర్ చేశాం. కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలని మేం భావిస్తున్నాం. అలాగే నా భార్య పద్మావతి సూపర్‌స్టార్ కృష్ణగారి ఫ్యామిలీకి చెందినవారనే సంగతి తెలిసిందే. ఆయన హీరోగానే కాదు.. డైరెక్టర్‌గా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తన మార్కును క్రియేట్ చేశారు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తున్నాం. శ్రీరామ్ ఆదిత్యగారు డైరెక్ట్ చేసిన గత రెండు చిత్రాలు చూశాను. చాలా బావున్నాయి. నచ్చాయి. ఇది కూడా తప్పకుండా అందరినీ మెప్పించేలా ఉంటుంది. అశోక్‌కి చిన్నప్పటినుండే సినిమాలంటే ఇష్టం. మా మావయ్య కృష్ణగారి సినిమాల్లో చిన్నప్పుడు యాక్ట్ చేశాడు అశోక్. కృష్ణగారే తన ఫస్ట్ నిర్మాత, దర్శకుడు. అలాగే నాని సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌తో యాక్ట్ చేశాడు. అశోక్ 7వ తరగతి నుండి ఇంటర్ వరకు సింగపూర్‌లో చదివాడు. ఆ సమయంలో తను డ్రామా అనే సబ్జెక్ట్‌ను ఎంచుకుని నేర్చుకున్నాడు. డిగ్రీని కూడా టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లోనే చేశాడు. తర్వాత రెండు, మూడు ఏళ్లు హార్డ్ వర్క్ చేసి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అన్నారు.
నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ..
అమర్‌రాజా గ్రూప్ చాలా పెద్ద సంస్థ. మేం మొదలు పెట్టిన అన్ని సంస్థలు గొప్పగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను మొదలు పెట్టాం. ఈ వెంచర్ కూడా మిగతా వాటిలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. అశోక్ చిన్నప్పటి నుండి హీరో కావాలని ఎంతో కష్టపడ్డాడు. యంగ్ కంటెంట్. శ్రీరామ్ ఆదిత్యగారు డైరెక్టర్‌గా కుదరడం హ్యాపీ. నిధి హీరోయిన్‌గా నటించడం హ్యాపీగా ఉంది. మంచి టీమ్ కుదిరింది. తను పెద్ద యాక్టర్ కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అన్నారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ..
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం లక్కీ భావిస్తున్నాను. కొత్త కథ, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది, ఇది అందరికి నచ్చే సినిమా అవుతుంది, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..
హీరో అశోక్ గల్లాతో నేను ట్రావెల్ అవుతూ వస్తున్నాను. మంచి ఎనర్జిటిక్ ఉన్న ఆర్టిస్ అవుతాడు, ఈ కథకు తాను కరెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. ఆడియన్స్ కు అశోక్ గల్లా తన నటనతో సర్ప్రైజ్ ఇస్తాడు. నిర్మాత పద్మాగారిని కలిశాను. ఆవిడ డ్రీమే ఈ సినిమా. ఈ సినిమా స్టార్ట్ కావాలని ఆవిడ చాలా బలంగా కోరుకున్నారు. యంగ్ టీం, యంగ్ సబ్జెక్ట్‌తో వస్తున్నాం, అందరిని ఎంటర్టైన్ చెయ్యబోతున్నాం అన్నారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ..
శ్రీరామ్ ఆదిత్యపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. తను నాకు మంచి సినిమా ఇస్తాడని పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. రేపటి నుండి షూటింగ్ ప్రారంభం కానుంది, నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు.
“క్లైమాక్స్” చిత్రంలో తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లో శ్రీరెడ్డి
తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` ప్రీ రిలీజ్ ఫంక్షన్
యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ `బీఏబీఎల్`. `కేసులు ఇవ్వండి ప్లీజ్` ట్యాగ్ లైన్. జవ్వాజి రామాంజనయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం కర్నూలులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, హీరో సందీప్‌కిషన్, డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు, సప్తగిరి, గౌతంరాజు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీజీ వెంకటేశ్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ – “తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్రాన్ని మన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మాతలు, దర్శకుడు కలిసి రూపొందించారు. నన్ను ఈ సినిమా మేకింగ్ విషయంలో సంప్రదిస్తే నా వంతుగా చేదోడు వాదోడుగా నిలిచాను. సందీప్ చక్కగా నటించాడు. తనకు, దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారికి, నిర్మాతలకు అభినందనలు“ అన్నారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ – “కర్నూలులో `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` సినిమాను షూటింగ్ చేశారు. ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ఈసినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇకపై తెలుగు సినిమాలను ఇక్కడ కూడా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ – “`తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నలుగురు నిర్మాతలు మన కర్నూలు జిల్లావారు కావడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ – “దర్శక నిర్మాతలు పాతికేళ్లుగా నాకు తెలుసు. మన ప్రాంతవాసులైన దర్శక నిర్మాతలు చేసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను కూడా ఇక్కడే నిర్వహించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – “సందీప్ కెరీర్‌లోనే ఈసినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. కర్నూలు ప్రజలు నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. సందీప్ ఈ కథను వినమని పంపాడు. నచ్చంది, సినిమా స్టార్ట్ చేశాం. రాజసింహ, విక్రమ్ రాజ్, నివాస్, ప్రసాద్ సహకారంతో సినిమాను డెవలప్ చేశాం. సాయికార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సాయిశ్రీరాం సినిమాను అద్భుతంగా చూపించారు. మా యూనిట్ ఎంతగానో కష్టపడింది. మంచి సినిమాను తీశాం. ప్రేక్షకులు, దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – “మా యూనిట్‌లో తెనాలి రామకృష్ణుడు ఎవరంటే మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిగారే. నా కెరీర్‌లో ఈ టైమ్‌లో నాగేశ్వరరెడ్డిలాంటి డైరెక్టర్ నాకు దొరకడం నా అదృష్టం. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌తోనే మా సినిమాను బాగా తీయగలిగాం. నవంబర్ 15న ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ సహా అందరం అండర్ డాగ్స్‌లా ఈ సినిమాను చేశాం. అందరూ సినిమాను నవంబర్ 15న చూస్తే కర్నూలు, తెనాలి ప్రజలు మాత్రం నవంబర్ 14నే సినిమా చూస్తారు. ఈ షోను ఫ్రీగా నేను అందరికీ కోసం ముందుగానే వేస్తున్నాను“ అన్నారు.
నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు మాట్లాడుతూ – “సినిమాను కర్నూలులో 18 రోజుల పాటు షూట్ చేశాం. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది సినిమా కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నవంబర్ 15న సినిమాను విడుదల చేస్తున్నాం“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ – “దర్శక నిర్మాతలకు ముందుగా థ్యాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
రివ్యూ:-”తిప్పరామీసం”
Title:- Thippara meesam
Actors:-: sree vishnu,nikki tamboli, senior actor rohini, benarji,
Music:-suresh bobboli
Dop:-sid
Director :L.Vijaya krishna
Producer:-Rizwan.
Editers:-Dharmendra kakarla
మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి.
విశ్లేషణ:-తల్లీకొడుకుల బంధం బేసిక్ హ్యూమన్ రిలేషన్. అలాంటి కనీస మానవీయ బంధాన్ని కోర్టుకీడ్చిన కొడుకు.. చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ దాదాపు ఫస్టాఫ్ అంతా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోగా.. మోనిక (నిక్కీ తంబోలీ)తో మణి లవ్, తనకు అప్పు ఇచ్చిన బూకీ జోసెఫ్‌తో మణి గొడవ, మణిని అతను ఏడురోజులపాటు బంధించడం ఈ సీన్లన్నీ బిట్లుబిట్లుగా వచ్చిపోయినట్టు అనిపిస్తాయి. డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ అలవాటు వంటి సీన్లు చూపించినా మణి పాత్రలో పెద్దగా నెగిటివ్ షెడ్స్ ఉన్నట్టు అనిపించదు. అతని కోణంలో ప్రేక్షకుడికి అతనిపై జాలి కలుగుతుంది. పైగా చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్ డల్‌గా డీల్ చేసినట్టు అనిపిస్తుంది.
మదర్ సెంటిమెంట్‌తో తీసిన సినిమాలు చాలావరకు సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్ అయ్యే అవకాశముంది. సెకండాఫ్‌లోనూ వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. శ్రీవిష్ణుకు మాస్ ఇమేజ్ కోసం ఈ సినిమాల్లో అక్కడక్కడ పెద్ద ఫైట్లే పెట్టారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్.. మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు అనే అంశాలు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, అప్పటికే సినిమాతో ప్రేక్షకుడు కొంతవరకు డిస్ కనెక్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మరోసారి శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా ఉన్నా చాలా సీన్లలో, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్ నిక్కీ తంబోలీ పాత్ర కొద్దిసేపు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండపోయినా.. నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్ ‘తిప్పరా మీసం’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు.
బలాలు:-మదర్ సెంటిమెంట్
శ్రీవిష్ణు నటన
బలహీనతలు:-స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం
సాగదీత
ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే అంశాలు అంతగా లేకపోవడం…
యూత్ ని ఆకర్శిస్తున్న 90 ఎంయల్ లేటెస్ట్ సాంగ్..
ఈ ఏడాది హిప్పీ, గుణ 369 వంటి చిత్రాలలో అలరించిన యంగ్ హీరో కార్తికేయ త్వరలో 90ఎం ఎల్ చిత్రంతో రానున్నాడు. ఎప్పుడూ లిక్కర్ తాగే పర్ఫెక్ట్ లవర్ గా కార్తికేయ కనిపిస్తున్నారు. ఇటీవల విడువులైన ఈ మూవీ టీజర్ అలాగే, ఓ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా నిన్న 90ఎంఎల్ చిత్రం నుండి మరో పాట విడుదలైంది. ‘నాతో నువ్వుంటే చాలు… అనే ఈ పాటను నిన్న విడుదల చేయగా యూత్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అనూప్ రూబెన్స్ అందించిన స్వరాలకు చంద్ర బోస్ సాహిత్యం అందించగా అద్నాన్ సమీ పాడారు.గతంలో అనూప్ రూబెన్స్, అద్నాన్ సమీ కాంబినేషన్లో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ విడుదల కానుంది.
అల్లుఅర్జున్, పూజ హెగ్డే లపై పారిస్‌లోని సుందరమైన ప్రదేశాలలో ‘సామజవరగమన’ చిత్రీకరణ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘అల వైకుంఠపురంలో‘. ప్రసిద్ధ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), లు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన “సామజవరగమన” పాట తెలుగునాట ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. సామాజిక మాధ్యమాలలో కొంగొత్త రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియా గా నిలిచింది. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం,సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం, ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.
ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ ‘అల్లుఅర్జున్, పూజ హెగ్డే’ లపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి ,శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.















