Home Blog Page 1024

పాట చిత్రీక‌ర‌ణ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ `రూల‌ర్‌`

సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `రూల‌ర్‌`. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వీటికి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో కొత్త లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. ప‌ర్టికుల‌ర్‌గా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. `రూల‌ర్‌` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు.
అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి.`జైసింహా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు

‘భీష్మ’ తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘కథానాయకుడు నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియో కి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్త్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి.వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.
‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల

పట్నఘఢ్’ విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న దర్శకుడు, ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘నా బంగారు తల్లి’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సృజనశీలి రాజేష్ టచ్ రివర్ కు సుప్రీం కోర్ట్ లో విజయం దక్కింది. పగ, ప్రతీకారం నేపథ్యంలో నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘పట్నఘఢ్’ విడుదలపై స్టే విధించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ సినిమా కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. సినిమాపై పిటిషనర్ కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే 30 రోజుల్లోపు సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది. “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ‘పట్నఘఢ్’ చిత్రానికి వ్యతిరేకంగా గా దాఖలైన పిటిషన్ ను సమర్ధించలేం. అందుకని, కొట్టి వేస్తున్నాం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‌

ఒరిస్సాలోని పట్నఘఢ్ పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాజేష్ టచ్ రివర్ రూపొందించిన చిత్రం ‘పట్నఘఢ్’. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఓ నేరస్తుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ… థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ. 5 కోట్ల నిర్మాణ వ్యయంతో తెలుగు, ఒరియా భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. ఒరియా చలన చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రమిది. ఇప్పటివరకు ఐదు కోట్లతో ఒరియాలో ఎవరు సినిమా తీయలేదు.

“పెళ్లి అయిన ఐదో రోజు నవ దంపతులకు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది.‌ అందులో ఏముందో అని తెరిచి చూడగా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు తో పాటు అతడి గ్రాండ్ మదర్ ఆ బ్లాస్ట్ లో మరణిస్తుంది. ఈ ఘటనతో పట్నఘఢ్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ ఘటనకు కారణమైన హంతకుల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది సినిమా కథ” అని రాజేష్ టచ్ రివర్ తెలిపారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో ‘పంజా’, ‘ఘాజి’ తదితర చిత్రాల్లో నటించిన అతుల్ కులకర్ణి ఈ చిత్రంతో ఒరియా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.‌ ఇంకా ఈ చిత్రంలో యష్ పాల్ శర్మ, ఒరియా నటుడు మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, ఒరియా నటి చిన్మయి మిశ్రా, అను చౌదరి, మలయాళ నటుడు సంజు శివరాం, పుష్ప పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.

హిందీ సినిమా ‘102 నాట్ అవుట్’ ఫేమ్ జార్జి జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా కోసం ఒక జానపద గీతాన్ని స్వరపరిచారు. ఒక ఒరియా చిత్రానికి ఆయన సంగీతం అందించడం ఇదే తొలిసారి. ‌

ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్: అజిత్ అబ్రహం, ఆడియోగ్రఫీ: రజత్ కుమల్, మేకప్: ఎన్.జి. రోషన్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, డైలాగ్స్: రవి కె. పున్నం, సినిమాటోగ్రఫీ: జె.డి. రామ్ తులసి, పి. ఆర్. ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, కో ప్రొడ్యూసర్: మనోజ్ మిశ్రా, సునీత కృష్ణన్, అతుల్ కులకర్ణి, ప్రొడ్యూసర్: శ్రీధర్ మర్త, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాజేష్ టచ్ రివర్.

గీతా ఫిలిం డిస్టిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న జ్యోతిక జాక్‌పాట్ విడుదల !!!

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతిక‌కు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వ‌ర‌కు ఆమె ఇక్క‌డ చాలా సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న‌ జ్యోతిక ఇప్పుడు మ‌ళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో జ్యోతిక‌, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొనున్నాయి. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేస్తోంది.

న‌టీన‌టులు:
జ్యోతిక‌, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: క‌ళ్యాణ్
నిర్మాత‌: సూర్య శివ‌కుమార్
స‌హ నిర్మాత‌: రాజశేఖ‌ర్ కరూప‌సుంద‌ర పాండియ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
ఎడిట‌ర్: విజ‌య్ వేలుకుట్టి
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో ”హేజా”

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవ‌ల‌ విడుదలై మంచి రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా..

దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ – “ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన నేను ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా `హేజా ‘ .. ఒక మ్యూజికల్ హారర్ గా అధ్బుతమైన కథాంశంతో రాబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ హైలెట్ గా నిలవనుంది. టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీమిక్సింగ్ తో రూపొందుతోంది. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నాం” అన్నారు.

కో – ప్రొడ్యూసర్ వి.య‌న్ వోలెటి మాట్లాడుతూ – “ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు డిఫరెంట్ గా ఈ సినిమాను దర్శకుడు మున్నా కాశి తెరకెక్కిస్తున్నారు. ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. అలాగే టెక్నికల్ గా కూడా బాగా రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అటు ప్రేక్షకులు ఇటు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో నటి ముమైత్ ఖాన్ క్యారెక్టర్ గత చిత్రాలకు సంబంధం లేకుండా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది” అన్నారు.
నటీనటులు : మున్నా కాశి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ముమైత్ ఖాన్, నూతన నాయుడు, ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, భూష‌న్‌, ప్రీతం నిగమ్ తదితరులు…
సాంకేతిక నిపుణులు :
కథ, మాటలు,స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం – మున్నా కాశి
ప్రొడ్యూసర్: – కెవిఎస్ఎన్ మూర్తి
స‌హ‌నిర్మాత:- వి.య‌న్ వోలెటి
బ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
ఎడిటర్ : గ్యారీ బి హెచ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్

తేరి మెహర్భానియా` ఇన్స్పిరేషన్ తో వస్తోన్న ‘నమస్తే నేస్తమా’ – పాపులర్‌ ఫిలింమేకర్‌ కె.సి.బొకాడియా.

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్‌ సాధించిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ న‌టుడు  శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు. రెండు కుక్క‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు.
ఫైట్‌ మాస్టర్‌ బి.జె.శ్రీధర్‌ మాట్లాడుతూ – ”ఎంతో మంది లెజెండరీ ఫైట్‌ మాస్టర్స్‌తో వర్క్‌ చేసిన బొకాడియా గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేయడం కొత్త విషయం. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా బాగా వచ్చాయి. అన్నివర్గాల వారికి ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

చిత్ర సమర్పకులు గౌతమ్‌ చంద్‌ రాథోర్‌ మాట్లాడుతూ – ”చాలా పెద్ద సినిమా..మా టీమ్‌ అందరం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. 64 సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ ప్లే రైటర్‌గా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న బొకాడియా గారు తెలుగులో తీస్తున్న మొదటి సినిమా. ‘తేరి మెహర్భానియా’ సినిమాకి పార్ట్‌-2 . ఆ చిత్రంలాగే ‘నమస్తే నేస్తమా’ చిత్రం కూడా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాము” అన్నారు.

హీరోయిన్‌ హీరోయిన్‌ ఈషానియ మహేశ్వరి మాట్లాడుతూ – ”నమస్తే నేస్తమా’ ఒక బ్యూటిఫుల్‌ ప్రాజెక్ట్‌. ఇది ఒక డాగ్‌ సెంట్రిక్‌ మూవీ అయినప్పటికీ ఈ సినిమాలో డ్రామా, ఎమోషన్‌, రొమాన్స్‌ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. బొకాడియా గారు వెరీ టాలెంటెడ్‌ ఫిలిం మేకర్‌. ఎంతో మంది స్టార్‌ హీరోలను, హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేసిన బొకాడియా గారి సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం” అన్నారు.

పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి. బొకాడియా మాట్లాడుతూ – ”మాది రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం, మా నాన్న గారు ఒక్కసినిమా కూడా చూడలేదు. అలాంటి ఒక ఫ్యామిలీ నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్‌ కుమార్‌తో ‘రివాజ్‌’ సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆతరువాత 1985లో ‘ప్యార్‌ జుక్తా నహి’ విడుదలైన అన్ని భాషలలో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద ‘బి.ఎం.బి’ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి నిర్మించిన ‘తేరి మెహర్భానియా’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా కూడా దాదాపు అన్ని భాషలలో రీమేక్‌ అయింది. ఈ తరువాత మా ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ తరువాత నా డైరెక్షన్‌లో అమితాబ్‌ హీరోగా ‘ఆజ్‌ కాఅర్జున్‌’ సినిమా వచ్చి గొప్ప విజయం సాధించింది. తరువాత అమితాబ్‌ గారితో చాలా సినిమాలకు వర్క్‌ చేయడం జరిగింది. ఏ డైరెక్టర్‌ దగ్గర వర్క్‌ చేయడకుండానే మద్రాస్‌ డైరెక్టర్‌ మణివన్నన్‌ గారి దగ్గర అరగంట ట్రైనింగ్‌ తీసుకొని దర్శకత్వం వహించాను. ఆ తరువాత లతామంగేష్కర్‌ గారు నాకు చాలా సపోర్ట్‌ చేసి నా నిర్మాణంలో, దర్శకత్వంలో చాలా పాటలు పాడడం జరిగింది. నేను రజినీకాంత్‌ గారితో 5 సినిమాలకు వర్క్‌ చేయడం జరిగింది. అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగన్‌, సన్నీదేవన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్ అలా 100కు పైగా పెద్దపెద్ద స్టార్స్‌తో వర్క్‌ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రాని హీరోయిన్‌గా పరిచయం చేసింది నేనే. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. మీరు లేకుంటే నేను లేను. ‘నమస్తే నేస్తమా’ నా ఫస్ట్‌ తెలుగు మూవీ. అలాగే నాకు చాలా ఇష్టమైన మూవీ. ‘తేరి మెహర్భానియా’ ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్‌ అవుతుంది అనుకుంటున్నాను. రెండు డాగ్స్‌తో ఈ సినిమా తీయడం జరిగింది. మీ అందరికీ సుపరిచితుడు అయిన శ్రీరామ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అలాగే బ్రహ్మనందం, నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, తదితరులు నటించారు. ఈ సినిమా విజయంనాకు తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాకు ఎంతో సహకరిస్తున్న బి.ఎ.రాజు గారికి ధన్యవాదాలు” అన్నారు.

నటుడు తాగుబోతు రమేష్‌ మాట్లాడుతూ – ‘ఈ సినిమాలో బ్రహ్మనందం గారు పోలీస్‌ డాగ్‌ ట్రైనర్‌ ఆయనకి అసిస్టెంట్‌గా నటించాను. చాలా మంచి క్యారెక్టర్‌. బొకాడియా గారు ఎంతో మంది స్టార్స్‌తో వర్క్‌ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్‌ షూటింగ్‌లో తెలుస్తుండేది. ప్రతి సీన్‌ పర్ఫెక్ట్‌గా వచ్చేలా ప్లాన్‌ చేసే వారు. ఆయన దర్శకత్వంలో వర్క్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

“వెంకీమామ‌” టైటిల్ సాంగ్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్‌

విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను తొలిసాంగ్‌గా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సాంగ్ మామ‌, అల్లుడు మ‌ధ్య ఉండే అంద‌మైన అనుబంధాన్ని తెలియ‌చేస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. సింపుల్‌, అర్థ‌మ‌య్యేలా ఈ పాట సాహిత్యాన్ని రామ‌జోగ‌య్య‌శాస్త్రి అందించారు. రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్:  సురేష్ ప్రొడక్ష‌న్స్‌,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
పి.ఆర్‌.ఒ:  వ‌ంశీ శేఖ‌ర్‌

“ఎంతమంచి వాడవురా” అంటూ పలకరించబోతున్న.కళ్యాణ్ రామ్.

శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో 118 చిత్రంతో డిఫరెంట్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ హీరోగా ,మెహ్రీన్,నటశాదోషి హీరోయిన్స్ గా శతమానం భవతి చిత్రం తో ట్రేడ్ మార్క్ సంపాదించిన సతీష్ విగ్నేష్ దర్శకత్వం లో ఉమేష్ గుప్త,సుభాష్ గుప్త లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎంతమంచి వాడవురా”…గోపిసుందర్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు..
అయితే చిత్ర బృందం ఇటీవలే హీరోయిన్ నటశా దోషి-కళ్యాణ్ రామ్ మధ్య సాంగ్ ని,గోదావరి-రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫైటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది..
సంక్రాంతి బరిలో మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”,రజినీకాంత్ “దర్బార్”,అల్లుఅర్జున్ “అల వైకుంటపురములో”చిత్రాల నిర్మాతలు సంక్రాంతి కి విడుదల చేస్తామని ప్రకటించారు.కానీ “ఎంతమంచి వాడవురా”చిత్ర యూనిట్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రేక్షకులలో ఈ చిత్రం సక్రాంతి కి వస్తుందా,రాదా అన్న అనుమానాలు మొదలయ్యాయి,వారి అనుమానాలకు కళ్యాణ్ రామ్ స్వయంగా స్పందిస్తూ మా చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్బంగా జనవరి 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు..

కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న “తాగితే తందానా” డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది- ఫస్ట్ లుక్ లాంచ్ లో హిట్ చిత్రాల దర్శకుడు మారుతి

ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf)పతాకంపై శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వి.మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ చిత్రం “తాగితే తందానా”. సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ చిత్రం ఒక పాట, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, బ్యానర్ లోగో లాంచ్ కార్యక్రమం నవంబర్ 7న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది.
రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf) బ్యానర్ లోగోని దామోదరప్రసాద్ లాంచ్ చేయగా, సినిమా మొదటి లుక్ ని మారుతి ఆవిష్కరించారు.. 
హిట్ చిత్రాల దర్శకుడు మారుతి మాట్లాడుతూ..  రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf) బ్యానర్ చాలా ఇన్నోవేటివ్ గా వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఎగ్జైటింగ్ గా అనిపించింధి. ఈ నిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు  కొత్త కాన్సెప్టులతో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఆదిత్, మధు, సప్తగిరి ముగ్గురు కలిసి ఆడియెన్స్ ని ఎంటర్ టైం చేయడానికి వస్తున్నారు. వాళ్ళ లుక్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.  సప్తగిరి హీరోగా చేస్తూనే ఈ సినిమాలో కమేడియన్ గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడం వెరీ హ్యాపి. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకి రైట్ టర్న్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
ప్రముఖ నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ.. కొత్త వాళ్ళు సరైన ప్లానింగ్ తో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకున్న టైములో సినిమా కంప్లీట్ చేశారు. వాళ్ళు ఇక్కడే సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. వారికీ నా అభినందనలు. ఫస్ట్ లుక్ చాలా ఫన్నీగా వుంది సినిమా కూడా అలాగే ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్న.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు..
హీరో ఆదిత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను. తెలిసో తెలియకో నాకు అన్నీ మంచి టైటిల్స్ కుదిరాయి. అలాగే ఈ సినిమాకి కూడా ఇంట్రెస్టింగ్ ఫన్నీ టైటిల్ సెట్ అయింది. దర్శకుడు శ్రీనాథ్ తో వర్క్ చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్న. ఈ సినిమా తర్వాత శ్రీనాథ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే సినిమా ఫీల్డ్ కి కొత్త అయినా నిర్మాతలు ఆరునెలల్లో ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్ తో కంప్లీట్ చేశారు. జెన్యూన్ సినిమా లవర్స్ వాళ్ళు. ఇలాంటి నిర్మాతలను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వారికీ ఈ సినిమా మంచి హిట్ అయి మరిన్ని చిత్రాలు ఇంకా ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ.. ఒక పక్క హీరోగా చేస్తున్నాను. కమీడియన్ గా మంచి పత్రాలు వస్తే చేద్దాం అనుకుంటున్నా తరుణంలో శ్రీనాథ్ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కళ్ళు మూసుకొని ఈ సినిమా చేసేశాను. ఫుల్ లెంగ్త్ కామిడీ రోల్ ప్లే చేశాను. కొత్త కాన్సెప్ట్ తో శ్రీనాథ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అలాగే నిర్మాతలు కొత్తవాళ్ళైనా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ టీమ్ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆదిత్, మధు నేను కలిసి చేసిన ఈ సినిమా కచ్చితంగా  ప్రేక్షకులను అలరిస్తుంది. నిర్మాతలు మంచి  లాభాలతో సేఫ్ గా బయటపడతారని ఆశిస్తున్నాను.. అన్నారు.
మధునందన్ మాట్లాడుతూ.. తాగితే తందానా ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్ట్రెంగ్ గా వుంది. తాగి తందనాలు ఆడితే ఎంత మజాగా ఉంటుందో ఈ సినిమా కూడా అంతే ఉంటుంది. ఇప్పటివరకు రాని సరికొత్త కాన్సెప్ట్ ఇది. శ్రీనాథ్ చాలా టాలెంట్ వున్న డైరెక్టర్. అందరు ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు రావాలని.. అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. ముందుగా మా టీమ్ అందరికీ కంగ్రాట్స్. బెస్ట్ ప్రోడక్ట్ తో అసోసియేట్ అయ్యాం. బేసిగ్గా నేను రైటర్ ని. కొత్త డైరెక్టర్ నైనా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు కూడా మంచి సపోర్ట్ చేశారు. మా కథకి యాప్ట్ టైటిల్ ఇది. తాగి తందానాలు ఆడితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఒక ముగ్గురు కుర్రాళ్లు తాగి ఆ మత్తులో ఒక సమస్యలో ఇరుకుంటారు.. దానినుండి ఎలా బయటపడ్డారనేది కాన్సెప్ట్. చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకపాట, ప్యాచ్ వర్క్ మినహా సినిమా అంతా పూర్తిఅయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ అనిల్ మాట్లాడుతూ.. . సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంటర్ అవుతున్నాం. మొదట ఇక్కడికి రావాలంటే చాలా బయపడ్డాం. కానీ మాకు ప్రతి ఒక్కరు సహకరించారు. ముఖ్యంగా మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సపోర్ట్ మర్చిపోలేనిది. తాగిన మత్తులో చేసిన తప్పులకు తూటాల నడుమున తందానాలు ఆడిన ముగ్గురు కథ ఇది.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ఫిలిం. దర్శకుడు శ్రీనాథ్ సూపర్బ్ గా తెరకెక్కించాడు. అతని కేరియర్ లో బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది అన్నారు..
నిర్మాతల్లో ఒకరైన వినోద్ జంగపల్లి మాట్లాడుతూ.. పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైములో సినిమా పూర్తిచేశాం. దానికి మా నటీ,నటులు సాంకేతిక నిపుణులు కారణం. ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముగ్గురు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి సపోర్ట్ అందించారు.. వారికి  మా ధన్యవాదాలు. మా ఫ్రెండ్ శ్రీనాథ్ కి బెంచ్ మార్కులా ఈ చిత్రం నిలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం అన్నారు..
ఆదిత్, సప్తగిరి, సిమ్రాన్ గుప్తా, మధునందన్, సుప్రియ, బాహుబలి ప్రభాకర్, సత్యం రాజేష్, రవి వర్మ, ప్రభాస్ శ్రీను, సమీర్, డివి నాయుడు, మాణిక్ రెడ్డి, శ్రీ సుధా, విష్ణు హాలివుడ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఫై.బాల్ రెడ్డి, ఎడిటర్: బి.నాగిరెడ్డి, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, ఆర్ట్: తిరుమల ఎం.తిరుపతి, కొరియోగ్రఫీ: యశ్వంత్, లిరిక్స్: వారికుప్పల యాదగిరి, గోశాల రాంబాబు, రామాంజనేయులు, కో-డైరెక్టర్: చిన్న, పి .ఆర్.ఓ: వంశీ-శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: గంగాధర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: అనిల్ పాలెపు, నిర్మాతలు: వి.మహేష్, వినోద్ జంగపల్లి, రచన-దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని. 

డిసెంబరులో లో మొదటి వారం లొ ” “కలియుగ”

 

శ్రీ బాలాజీ సిల్వర్ స్క్రీన్ పతాకంపై స్వాతి దీక్షిత్’ సై సూర్య, శశి. విశ్వ.రాజా. ప్రభాస్ శ్రీను. తాగుబోతు రమేశ్ ప్రదాన పాత్రల లో తెరకెక్కిన చిత్రం ” కలియుగ ” ఈ చిత్రానికి తిరుపతి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు పూర్తి చేసుకుని U/A” సెన్సార్ సర్టిఫికెట్ అందుకుని విడుదల కు సిద్దమైనది. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునె కధనం తో రూపొందుతున్న ” కలియుగ ” చిత్రాన్ని ప్రస్తుతం సమాజంలో ఉన్న వాస్తవాలకి దగ్గరగా ఉండేలా … అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేవిధంగా తెరకెక్కించాం..ఈ చిత్రంలో సూర్య నటన హైలెట్ గా ఉంటుంది. టెక్నికల్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. ముందుగా ఈ చిత్ర ప్రమోషన్ సాంగ్ ను గురువారం ప్రముఖ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ… కలియుగ చిత్ర ప్రమోషన్ సాంగ్ రిలీజ్ చేయటానికి కారణం సూర్య.. మాకు సూర్య ఎప్పటినుండో తెలుసు రాజశేఖర్ గారికి తమ్ముడి గా నటించాడు .సినిమా తీసి రిలీజ్ చేయటం మాలాంటి వాళ్ళకి చాలా కస్టం. అయినా సరే సూర్య సినిమా తీసి డిసెంబరు మొదటి వారంలొ రిలీజ్ చేస్తున్నాడు. ట్రైలర్స్ లొ వల్గారిటి ఎక్కువ చూపించి ప్రేక్షకుల ను ధియేటర్లకు రప్పించి క్యాస్ చేసుకునే ఈ సమయంలో … ఆడవారి పై జరుగుతున్న అన్యాయాల పై ప్రతీకారం తీర్చుకునె కథ తో ముందుకు రావటం చాలా గొప్ప విషయం. ఆడవారి భద్రత కొసం కేంద్ర పరిధి లో రాష్ట్ర పరిధి లో ఎన్ని చట్టాలని తెచినా జరిగే అన్యాయాలు జరుగుతూనె ఉన్నాయి. సూర్య సినిమా రూపంలో ఆడవాళ్ల సమస్య ని మనముందుకు తీసుకొస్తునందుకు సుర్యని అభినంధి స్తున్నాను . ఈ సినిమా ను అందరూ ఆదరించి మంచి విజయం సాధించాలని .. సూర్య కి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అన్నారు డిసెంబరు మొదటి వారంలో “కలియుగ ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు. ధన్ రాజ్. కారుమంచు రఘు. గౌతం రాజు. ప్రవీణ్. సమీర్.సిగ్ధ. తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: సత్య V ప్రభాకర్.
సంగీతం: కమల్.D
ఎడిటింగ్: నందమూరి హరి
పైట్స్ : నందు
సహ నిర్మాత: దుర్గా మల్లేశ్వరరావు
నిర్మాత: Ch. సుబ్రమణ్యం
కథ. దర్శకత్వం: తిరుపతి