Home Blog Page 1025

డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘పానిపట్‌’

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షీలాత్కర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్‌ ‘పానిపట్‌’ సినిమా నుంచి క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ‘అహ్మద్‌ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్‌ క్యారెక్టర్‌ని చూపించారు.. ఆయన బాడీ లాంగ్వేజ్‌ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది.. విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌గా రూపొందిన ‘పానిపట్‌’ చిత్రం డిసెంబర్‌ 6న విడుదలవుతుంది.
దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. సినిమా అంతకు మించి అంచనాలను మించేలా ఉంటుంది” అన్నారు.
నిర్మాత సునీతా గోవారికర్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ను ఆదరించినట్లే సినిమాను ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
రిలయన్స్‌ ఎంటర్టైన్మెంట్‌ గ్రూప్‌ సీఇఒ షిబాసిష్‌ సర్కార్‌ మాట్లాడుతూ – ”అశుతోష్‌తో అసోసియేట్‌ అవ్వడం హ్యాపీగా ఉంది. ఇది ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటి” అన్నారు.
విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌ వ్యవస్థాపకుడు రోహిత్‌ షెలత్కర్‌ మాట్లాడుతూ – ”మరాఠీ సమాజానికి చెందిన నేను, మరాఠా ఇతిహాసాల కథలను తెరపైకి తీసుకురావాలని ఆకాంక్షించానుఅశుతోష్‌ గోవారికర్‌తో ఈ అనుబంధం – జోధా అక్బర్‌, స్వడేస్‌ మరియు లగాన్‌ వంటి ప్రముఖ చిత్రాల దర్శకుడు ఒక కల నిజమైంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : అజయ్‌-అతుల్‌, కెమెరా : సి.కె.మురళీధరన్‌, ఎడిటింగ్‌ : స్టీవెన్‌ బెర్నార్డ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌, యాక్షన్‌ : అబ్బాస్‌ అలీ మొఘల్‌,  బ్యానర్స్‌ : అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌, ప్రొడ్యూసర్స్‌ : సునీతా గోవారికర్‌, రోహిత్‌ షేలత్కర్‌. దర్శకత్వం : అశుతోష్‌ గోవారికర్‌.

షూటింగ్ పూర్తి చేసుకొంటున్న అమ్మరాజశేకర్ చిత్రం “హై 5

జీవితంలో డబ్బే ప్రధానం కాదు… కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యం అని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హై 5’. రాధ క్యూబ్ బ్యానర్ పై అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ కు సమీపంలోని అలేఖ్య రిసార్ట్స్ లో జరుగుతోంది. హీరోయిన్ మన్నార చోప్రాపై ఇక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.                                                                                                                     ఈ సందర్భంగా గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా విశేషాలను నిర్మాత రాధరాజశేఖర్, ధర్శకుడు అమ్మ రాజశేఖర్ వివరించారు. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇది ఆఖరిరోజు షూటింగ్ అని అమ్మ రాజశేఖర్ చెప్పారు. ఇంతకుముందు గోవా సమీపంలోని చిన్న దీవిలో సెట్ వేసి చిత్రీకరణ జరిపామని, మంచి మ్యూజికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని వివరించారు. గోపీచంద్ తో ‘రణం’ తర్వాత మళ్లీ అంతటి వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తన భార్య నిర్మాతగా తనే సొంతంగా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సినిమాలో మొత్తం 12 పాటలు ఉంటాయి. ఐదుగురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. లండన్, మలేషియా, బోస్టన లకు చెందిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టను దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ ఒక పాట చేస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ తో ఒక పాట అనుకుంటున్నాము. రీరికార్డింగ్ ఒకరు చేస్తారు. పాటలతోనే కథ చెప్పేలా దీన్ని తెరకెక్కిస్తున్నాం. పాత సినిమాల్లో ఈ తరహాలో చిన్నచిన్న పాటలుండేవి. మాటల్ని పాటల్లా మార్చి నేటి తరానికి తగ్గట్టు పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నాం. చిన్న మెసేజ్ తో ఆసాంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’అని వివరించారు.                                                        హీరో్యిన్ మన్నార చోప్రా మాట్లాడుతూ మాంచి మసాలా పాటలతో ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందని చెప్పారు. తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని, ఈ సినిమాతో తన కోరిక నెరవేరిందని చెప్పారు.                 నిర్మాత రాధ రాజశేఖర్ మాట్లాడుతూ జనవరిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.                   నృత్య దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ వద్ద చాలా కాలం సహాయకుడిగా పనిచేసినట్లు చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ సినిమాకు నృత్యరీతుల్ని సమకూరుస్తున్నట్లు వివరించారు. మంచి మసాలా డ్యాన్సులు ఇందులో ఉంటాయన్నారు. ఇందులో ఇంకా జాస్మిన్, ఛాయా, ప్రణాళి, త్రిప్తి, త్రిష, సమీర్, సుధీర్, సెల్వరాజ్, దీక్షిత్, జునైద్, జేవీఆర్, ప్రేమనాథ్, మల్లి, యోగి, జబర్దస్త్ బ్యాచ్, అమ్మరాజశేఖర్ నటిస్తున్నారు. కెమెరా ముజీర్ మాలిక్, ఎడిటింగ్ నందమూరి తారక్, సంగీతం: తమన్, పాప్ సింగర్ డాడి షాక్ (లండన్), పునీత్ రాజా (మలేషియా), జేడీ జాన్ (యు,ఎస్.ఏ), పాటలు: భాషాశ్రీ, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మంగారావు, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న “డిస్కో రాజా” విడుదల

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న  “డిస్కో రాజా” విడుదలకి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువుగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైస్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్  కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ 18తో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారం లో డిస్కోరాజా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ టీం ప్లాన్ చేస్తుంది.
న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

రజినీకాంత్ దర్బార్ తెలుగు మోషన్ పోస్టర్ విడుద‌ల చేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని  ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.  లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే  రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు ట్రెమండ‌స్  రెస్పాన్స్ వ‌స్తోంది.  ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా దర్బార్ మూవి తెలుగు మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ ఈరోజు సాయంత్రం గం.5 ని.30లకు విడుద‌ల చేశారు.  ఆదిత్య అరుణాచలం గా సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ మోషన్ పోస్టర్ అనిరుధ్ పవర్ ప్యాకెడ్ మ్యూజిక్ తో సినిమా మీద అంచనాలను మరింత పెంచింది.  దర్బార్ మోషన్ పోస్టర్ ని తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, తమిళ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, హిందీ లో సల్మాన్ ఖాన్, మలయాళం లో మోహన్ లాల్ విడుదల చేశారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని హ్యాట్రిక్ మూవీలో త‌మిళ న‌టుడు స‌ముద్ర ఖ‌ని

డాన్‌శీను`, `బ‌లుపు` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నుంది. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ర‌వితేజ 66వ చిత్ర‌మిది. ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు.
ద‌ర్శ‌క‌త్వం నుండి న‌ట‌న వైపు అడుగులేసి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రోసారి శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:  ఠాగూర్ మ‌ధు
బ్యాన‌ర్‌:  లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌
సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

న‌వంబ‌ర్ 10న అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్

న‌వంబ‌ర్ 10న అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బావ‌, గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. `భ‌లే మంచి రోజు`, `శ‌మంత‌క మ‌ణి`, `దేవ‌దాస్` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాదు.. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల‌ను ద‌క్కించుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న గ్రాండ్ లెవ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీఅందిస్తున్నారు.

న‌టీన‌టులు:
అశోక్ గ‌ల్లా, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.టి
నిర్మాత‌:  ప‌ద్మావ‌తి గ‌ల్లా
బ్యాన‌ర్‌: అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి
మ్యూజిక్‌:  జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
డైలాగ్స్‌:  క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌
కాస్ట్యూమ్స్‌:  అక్ష‌య్ త్యాగి, రాజేష్‌
పి.ఆర్‌.ఒ:  బి.ఎ.రాజు, వంశీ శేఖర్

కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ – హీరో సుడిగాలి సుధీర్‌

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ  హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్‌ ఎన్‌. శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 10 మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచిందంటే ఈ చిత్రం పట్ల ఆడియన్స్‌లో ఎంతటి అటెన్షన్‌ ఉందో అర్థమవుతోంది. డిసెంబర్‌ మొదటి వారంలో సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో…

దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ”ఈ సినిమా ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్‌ వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండే మూవీ. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సుధీర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. టీజర్‌కి 10 మిలియన్‌ వ్యూస్‌ రావడంతో సినిమా సక్సెస్‌ పట్ల నాకు, మా టీమ్‌కు కాన్ఫిడెన్స్‌ పెరిగింది. మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. మేం వైజాగ్‌లో అంటే.. అలా కాదండీ మలేషియాలో అయితే బాగుంటుంది అని అక్కడ పాట చిత్రీకరించారు. నా మొదటి సినిమాకే అంత గొప్ప ప్రొడ్యూసర్‌ దొరికినందుకు హ్యాపీగా ఉంది. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కావాలని సుధీర్‌ని, పెర్ఫామెన్స్‌కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో ధన్య బాలకృష్ణ ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. సుధీర్‌గారు, ధన్య బాలకృష్ణచాలా బాగా నటించారు. అలాగే మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఒక పాట పాడి అందులో నటించడం జరిగింది. ఇటీవల మనకు దూరం అయిన మాజీ ఎంపి, నటుడు డా. శివప్రసాద్‌గారు ఒక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు ఒక రోల్‌ చేయడం జరిగింది. ఈ చిత్రంతో తప్పకుండా సక్సెస్‌ సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం” అన్నారు.

హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది. సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో  పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను. సుధీర్‌ అభిమానులు కేవలం ఆయన్ని ఫాలో చేయడం కాదు, ఆయన్ను ప్రేమిస్తారని షూటింగ్‌ మొదలు పెట్టిన రోజే తెలుసుకున్నాను. రేపు సినిమా హిట్‌ అయితే దానికి కేవలం ఆయన ఫ్యాన్స్‌ కారణం. రాజశేఖర్‌ రెడ్డి ప్రాపర్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌. ఆయన రైటింగ్‌లో కమర్షియాలిటీ ఉంది. అలాగే సోషల్‌ అవేర్నెస్‌ కూడా ఉంది. ఇంకో రెండుమూడేళ్లలో పెద్ద హీరోలతో తప్పకుండా వర్క్‌ చేస్తాడు. శేఖర్‌ రాజుగారికి తొలి సినిమా అయినా ఆర్టిస్టుల విషయంలో కానీ, టెక్నిషియన్స్‌ యాస్పెక్ట్‌లో కానీ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌లో ఫస్ట్‌ మూవీ. రాజశేఖర్‌ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే సుధీర్‌గారిని మా బేనర్‌లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ధన్యవాదాలు. సినిమా తప్పకుండా సూపర్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”నేను పదేళ్ల క్రిందట హైదరాబాద్‌ వచ్చి ఫిలిం ఛాంబర్‌ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా లేదా? అనుకున్నాను. అలాంటిది ఇవ్వాళ నా ఫస్ట్‌ సినిమా ప్రెస్‌మీట్‌ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్‌, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌, అని చెప్పారు. అంత పెద్ద టెక్నీషియన్స్‌ నా సినిమాకు ఎందుకు వర్క్‌ చేస్తారు అనుకున్నాను. కానీ సెకండ్‌ మీటింగ్‌లో ప్రొడ్యూసర్‌గారితో వచ్చి అడ్వాన్స్‌ ఇచ్చి మార్చి 20 షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది అని చెప్పారు. మార్చి 20 నా లక్కీ డే. ఆరోజు నా రెండు సినిమాలు షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. మొదటి రోజు షూటింగ్‌ కి వెళ్ళగానే అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్‌ వేసి ప్రొడ్యూసర్‌గారు అక్కడే కూర్చొని అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. నా లైఫ్‌లో నేను ఇంకో సినిమా ఇంత పెద్ద టెక్నిషియన్స్‌తో చేస్తానో! లేదో తెలీదు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. మా నాన్న, బి.ఎ. రాజుగారు సన్నిహితులు. ఆయన నా సినిమాకి వర్క్‌ చేయడం చాలా హ్యాపీ. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ధన్య బాలకృష్ణగారితో షూటింగ్‌ ఫన్నీగా జరిగింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్‌ చేశాం. ఎలా ఉన్నాయో మీరే స్క్రీన్‌ మీద చూసి చెప్పాలి. అలాగే నా పేరు మీదే టైటిల్‌ ఉండడం కూడా హ్యాపీ. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు రజినీకాంత్‌గారు, పవన్‌ కల్యాణ్‌గారు. ఈ సినిమాలో వారిద్దర్నీ ఇమిటేట్‌ చేయడం జరిగింది. డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌ రిలీజ్‌ అనుకుంటున్నాం. మీ మీడియా సపోర్ట్‌ మాకు ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి చేతులమీదుగా “ఉల్లాల ఉల్లాల” టీజర్

సుఖీభవ మూవీస్ పతాకంపై నటరాజ్,నూరిన్,అంకిత హీరో,హీరోయిన్లుగా
సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో వాళ్ళబ్బాయి నటరాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్, నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘ఊల్లాల ఊల్లాల’చిత్రం టీజర్ ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిస్టు సత్యప్రకాష్ గారు నేను 10 ఏళ్ల క్రితం కలిసి పని చేసాము. కలిసి పనిచేసింది రెండు మూడు సినిమాలైనా ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా, నవ్వుతూ పలకరిస్తారు. అందుకే నాకు ఆయనంటే అభిమానం. అందుకోసమే ఆయన అడిగిన వెంటనే రావడానికి ఒప్పేసుకున్నా. ఒకవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు అబ్బాయిని పరిచయం చేయడం చాలా గొప్ప విషయం. ఇక్కడి నుండి మొదలై వారి అబ్బాయికి మంచి సినిమాలు రావాలని ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ ఎ.గురురాజ్ గారు ఈ చిత్రం తరువాత పెద్ద పెద్ద చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషన్స్ అండ్ టీం అందరికి ఆల్ ది బెస్ట్, ముఖ్యంగా సంగీత దర్శకుడు జాయ్ కొత్తవాడైనా మంచి సంగీతాన్ని అందించారు, అతనికి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నా’’ అన్నారు.
ప్రొడ్యూసర్ ఎ.గురురాజ్ మాట్లాడుతూ.. ‘‘సైరా నరసింహారెడ్డిలో అద్భుతంగా నటించిన చిరంజీవి గారిని ఘనంగా సత్కరించుకున్నాము. ఇప్పుడు ఆ అద్భుత చిత్రాన్ని తీసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా ‘ఊల్లాల ఊల్లాల’ టీజర్ రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. మా బ్యానర్లో నాలుగవ చిత్రంగా వస్తున్న ‘ఊల్లాల ఊల్లాల’ తో సత్యప్రకాష్ గారిని దర్శకుడిగా పరిచయం చేయడం వారి అబ్బాయి నటరాజ్ ని హీరోగా తెలుగు ప్రజలకి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సత్యప్రకాష్ గారి మీదున్న నమ్మకంతో, నా మీదున్న అభిమానంతో ఈ చిత్రంలో చేయడానికి ఒప్పుకున్న  బాహుబలి ప్రభాకర్ గారు, ముంగిలి గారు, రోల్ రైడ, రఘు బాబు, పృథ్వీ, అదుర్స్ రఘు అందరికి నా ధన్యవాదాలు.  అలాగే   ఈ చిత్రానికి జాయ్ సంగీతం మరియు ఆర్.ఆర్ చాలా బాగా ఇచ్చాడు. ఉర్రుతలూగించేలా ఉండే ఈ పాటలు త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 600 వాహనాలతో చేయాల్సిన ఒక పాట చిత్రీకరణపై మేము సందిగ్ధంలో ఉండగా, శేఖర్ మాస్టర్ గారు సినిమా బాగా రావాలి వస్తే చాలు అంటూ మమ్మల్ని ఒప్పించి దాన్ని అద్భుతంగా చిత్రీకరించడమే కాక, మిగితా పాటలకి కూడా పూర్తి న్యాయం చేశారు. ఈ పాటలలో కాసర్ల శ్యామ్ గారు గురు చరణ్ గారు రాసిన పాటలు అందరికీ చాలా నచ్చుతాయి. అదే విధంగా కన్నడలో బాగా పేరు పేరుపొందిన జె.జె కృష్ణ గారు మా చిత్రానికి ఛాయాగ్రహణం చేశారు. చివరగా, ఈ రోజు మేము విడుదల చేసిన టీజర్ ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ త్వరలో పాటలని మరియు ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘నేనెంతగానో ఇష్టపడే వ్యక్తి , అభిమానించే దర్శకుడు సురేందర్ రెడ్డి గారు మా ఈ టీజర్ లాంచ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘ఊల్లాల ఊల్లాల సూపర్ డూపర్ హిట్’ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవుతుందని నమ్ముతూ, అందుకు మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.                                        సంగీత దర్శకుడు జాయ్ మాట్లాడుతూ – మా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సత్య ప్రకాష్ గారు, ప్రొడ్యూసర్ గురురాజ్ గారి ప్రోత్సాహంతో ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో 4 పాటలకు సంగీతాన్ని అందించాను. అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ.. ‘‘మొదటగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు వారి తీరిక లేనన్ని పనుల్లో కూడా మాకోసం సమయమివ్వడం చాలా ఆనందంగా ఉంది. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న ప్రొడ్యూసర్ గురురాజ్ గారికి అలాగే డైరెక్టర్ గారు- మా నాన్నగారు సత్యప్రకాష్ గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా హీరోయిన్లు మిస్ బెంగుళూరు అంకిత మరియు మిస్ కేరళ నూరిన్ నటనలో ఊహించినదానికి రెండింతలు చేశారు. అలాగే సంగీత దర్శకుడు జాయ్ అందించిన పాటలకి డాన్స్ మాస్టర్ శేఖర్ గారు ఎప్పటిలాగే అదిరిపోయే స్టెప్పులు అందించారు. ముఖ్యంగా మా సినిమాటోగ్రాఫర్ మరియు ఇతర టెక్నీషియన్ లు మా ఈ ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రానికి అద్భుతంగా పనిచేశారు, అందుకు వారందరికీ నా ధన్యవాదాలు’’ అన్నా

విడుదలకు సిద్ధమైన కోనాపురంలో జరిగిన కథ

 

అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోనాపురంలో జరిగిన కథ. ఈ చిత్రాన్ని పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా పతాకంపై మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మిస్తున్నారు. కె బి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కోనాపురంలో జరిగిన కథ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ ఫిలించాంబర్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా పాల్గొన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్ చూస్తుంటే వీళ్లు నిజాయితీగా, కష్టపడి సినిమా చేసినట్లు తెలుస్తోంది. ఈ శుక్రవారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో మంచి కథతో వచ్చిన సినిమానే విజయం సాధిస్తుంది. అలా ఆదరణ పొందే సినిమాల్లో కోనాపురంలో జరిగిన కథ ఉండాలని కోరుకుంటున్నా. నేను సినిమా చేసేందుకు హీరోల కోసం వెతుకుతున్నా. మా బడ్జెట్ కు తగిన హీరోలు దొరకడం లేదు. చిన్న చిత్రాల ద్వారానే కొత్త హీరోలు వచ్చే అవకాశముంది. అన్నారు.

దర్శకుడు కె బి కృష్ణ మాట్లాడుతూ…టైటిల్ లో ఉన్నట్లు ఇది కోనాపురంలో జరిగే కథ కాదు. రెండు ఊర్ల మధ్య గొడవల నేపథ్యంలో మర్డర్ మిస్టరీగా సాగుతుంది. కథలో ఎవరు ఎవర్ని చంపుతున్నారు అనేది ఆసక్తికరంగా, ఉత్కంఠ కలిగించేలా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..చాలా రోజులుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాం. వాస్తవికతతో ఉండే సినిమాలంటే ఇష్టపడతాను. అలాంటి కథతో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాను. అన్నారు.

నిర్మాత పల్లె వినయ్ కుమార్ మాట్లాడుతూ..ఈ సినిమా మా నాలుగేళ్ల కల. గ్రామీణ ప్రాంతంలో కథ జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న రెండు ఊర్లు ఓ అనూహ్య ఘటనతో ఉలిక్కి పడతాయి. ఆ ఘటనలు ఏంటి, ఎవరు చేస్తున్నారు అనేది ఆద్యంతం ఉత్కంఠగా దర్శకుడు తెరకెక్కించారు. యువతరం మెచ్చే వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశాన్ని జోడించాం. అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం – సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఈరుపుల శ్రీకాంత్, సాహిత్యం – పూర్ణాచారి.

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు 50 లక్షలు అందలేదట

గత ఆదివారం అత్యంత ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ సీజన్ 3ముగిసింది. అనూహ్యంగా అనేక మార్లు నామినేట్ కాబడి షో నుండి వెళ్ళిపోతాడనుకున్న రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఫైనల్ కి చేరిన రాహుల్, శ్రీముఖిలలో ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా విన్నర్ గా రాహుల్ ని ఎంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 50లక్షల నగదు బహుమతితో పాటు, బిగ్ బాస్ టైటిల్ మరియు ఇతర బహుమతులను రాహుల్ గెలుపొందారు. ఐతే అసలు విషయం ఏమిటంటే విన్నర్ గా రాహుల్ గెలుచుకున్న ప్రైజ్ మనీ కంటే కూడా కొందరు కంటెస్టెంట్స్ కు హౌస్ లో కొనసాగడం వలన అందిన మొత్తమే ఎక్కువ అని వినికిడి….

ఐతే బిగ్ బాస్ సీజన్ 3 ముగిసి మూడు రోజులైంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 3 పై వార్తలకు చెక్ పెట్టలేదు. సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఇంటర్వ్యూ ల కోసం పోటీ పడుతున్నారు. మెగా స్టార్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ, 50 లక్షల చెక్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ లో ఎంత బిజీ అవుతాడో తెలియదు కానీ.. ప్రస్తుతం టివి షోస్ తో తెగ హైలెట్ అవుతున్నాడు. మరోపక్క శ్రీముఖి ఫ్యాన్స్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అనుకుంటే.. షాకిస్తూ రాహుల్ విన్నర్ అయ్యేసరికి వారు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.

ఇకపోతే తనకి 50 లక్షలు వస్తే గనక ఓ సెలూన్ ఓపెన్ చేసుకుని, తన తల్లితండ్రులకు ఇల్లు కట్టించి వారి రుణం తీర్చుకుంటా అన్న రాహుల్ కి బిగ్ బాస్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మీద రాహుల్ కి 50 లక్షలు ఇచ్చేసినట్టుగా చూపించారు. అబ్బా 50 లక్షలు అందుకున్న రాహులా అంటూ అందరూ మురిసిపోయారు కూడా. అయితే రాహుల్ ఆ 50 లక్షల ప్రైజ్ మని అందుకోలేదనే న్యూస్ రాహుల్ అభిమానులని నిరాశకి గురిచేస్తుంది. ఎందుకంటే. రాహుల్ కి ఇవ్వాల్సిన 50 లక్షల ఒప్పందం ప్రకారం 50 లక్షలు ఇచ్చినప్పటికీ.. అందులో కటింగ్స్(ఇంకమ్ టాక్స్ నిబంధనల ప్రకారం) పోను కేవలం 35 లక్షలు మాత్రమే రాహుల్ చేతికి వచ్చినట్లుగా టాక్. మరి 50 లక్షలు అనుకుంటే ఇలా 35 లక్షలతో రాహుల్ సరిపెట్టుకోవాల్సి రావడం పాపం అనిపిస్తుంది