మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’యాక్షన్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా..అన్ని మరుస్తున్నా.. నిన్ను తలుస్తున్నా..’ అంటూ సాగే పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా హిప్‌హాప్ తమిళ అద్భుతంగా స్వరపరిచారు. ఎం.ఎం.మానస ఈ పాటను గానం చేశారు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా విడుదలైన ‘యాక్షన్’ ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. విశాల్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 15 న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.
‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా…’ మాస్ హీరో విశాల్ ‘యాక్షన్’ చిత్రంలోని పాటకు గుడ్ రెస్పాన్స్
అజర్‌బైజాన్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ’90 ఎంఎల్’
‘ఆర్‌ఎక్స్100′ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం ’90 ఎం.ఎల్’. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ ఎక్స్100’ తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి ఇందులో కథానాయిక.
ఈ చిత్రం విశేషాలను
నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ వివరిస్తూ ”టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవలే మూడు పాటలను అజర్ బైజాన్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని చెప్పారు.
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ”అజర్ బైజాన్ రాజధాని బాకులోని బ్యూటీఫుల్ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర ‘8’ రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో హీరోయిన్‌పై ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే’ అనే ఎమోషనల్ గీతాన్ని చిత్రీకరించాం. ‘సింగిల్ సింగిల్’ అనే పాటను ఫుల్ డ్యాన్స్ నెంబర్‌గా హీరో, హీరోయిన్, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. ‘నాతో నువ్వుంటే చాలు’ అనే డ్యూయట్‌ని హీరో – హీరోయిన్, 10 మంది డ్యాన్సర్లపై షూట్ చేశాం. ఈ ‘3’ పాటలకూ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయి” అని తెలిపారు.
నటీనటులు:
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ ,పోసాని కృష్ణ మురళి,
అజయ్ , ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు .
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: జీఎం శేఖర్, పాటలు: చంద్రబోస్, ఫైట్స్: వెంకట్, జాషువా, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ, రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర .
కొత్త లుక్ తో సర్ప్రైజ్ చేసిన శత్రు
‘శత్రు’ తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులలో ఒకరు. “కృష్ణ గాడి వీర ప్రేమ కథ ” తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శత్రు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. “అరవింద సమేత” లో శత్రు పాత్ర కు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ప్రతి సినిమాలో తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న శత్రు కి తెలుగులో అవకాశాలు తో పాటు ఇతర భాషల్లో అవకాశాలు చాలా పెరిగాయి.
ఏ పాత్రకయినా సరిపోయే ఆహార్యం వాచకం అతనికి పెద్ద అసెట్ గా మారాయి. ఇప్పుడు అతను అతని లూక్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి . నటన పట్ల తనకున్న
అంకిత భావం, ఇండస్ట్రీలోని పోటీని తట్టుకునేందుకు తనను తాను కొత్తగా మలుచుకునేందుకు శత్రు ఎంతటి కష్టాన్నైనా ఇష్టం గా మలుచుకోగలడు అని ఈ లుక్స్ తో తెలుస్తుంది.
ఒక రగ్గడ్ లుక్ నుంచి ఆల్ట్రా మోడ్రన్ లుక్ కి ట్రాన్స్ఫ ర్మేషన్ అవ్వడం లో అతను తీసుకున్న జాగ్రత్తలు, పాటించిన ఆహారనియమాలు అతను చేసిన కఠోర శ్రమ శత్రు ని కొత్తగా పరిచయం చేశాయి.ఏ ఆర్టిస్ట్ కైనా ఎప్పటికప్పుడు తనను కొత్తగా ప్రజెంట్ చేసుకోవటం, తన పరిధిని పెంచుకోవటం అనేది కొత్త అవకాశాలను దారి తీస్తుంటుంది. శత్రు చేయబోయే విభిన్న పాత్రలకు ఈ లుక్స్ మొదటి అడుగు అనడంలో సందేహం లేదు.
`నిశ్శబ్దం` టీజర్‌ను విడుదల చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
`నిశ్శబ్దం` టీజర్‌ను విడుదల చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవర్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల , మైకేల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో మాధవన్, అంజలి లుక్స్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుదల చేసింది.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీరజ కోన, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్షన్ – హేమంత్ మధుకర్.
నవంబర్ 7న `వెంకీ మామ` తొలి సాంగ్ విడుదల
విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ హీరోల కలయికలో తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా తొలిసాంగ్‌ను గురువారం(నవంబర్ 7న) విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
నటీనటులు:
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్
నవంబర్ 15 న విడుదల కానున్న విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి రాశీ ఖన్నీ జంటగా విజయా ప్రొడక్షన్ వారి నిర్మాణంలో తమిళంలో నిర్మాణమవుతున్న ‘సంగతమిళ్’ మూవీ ని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో విడుదల చేయనున్నారు. రెండు భాషల్లో నవంబర్ 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ లో సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో
విజయ్ సేతుపతి స్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘సైరా’తో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన
విజయ్ సేతుపతి కి తెలుగులో మంచి ఆదరణ ఉంది. త్వరలోనే ఆ ఆదరణ ‘విజయ్ సేతుపతి’ తో మరింత పెరుగుతుందని చిత్ర యూనిట్ అంటుంది. త్వరలోనే ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. విజయ్ సేతుపతి తో పాటు చిత్రయూనిట్ అందరూ అంటెండ్ అవుతారు.
ఈ సందర్భంగా నిర్మాత రావురి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ:
‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘విజయ్ సేతుపతి ’ తెలుగు ప్రక్షేకుల ఆదరణ పొందుతుంది అని నమ్ముతున్నాను. విజయ్ సేతుపతి సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాశీఖన్నా,నాజర్ , నివేద పేతురాజ్, అశుతోష్ రాణా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన వారే కావడం తో ఈ సినిమా స్ట్రైయిట్ సినిమాగానే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కుతాయి’’ అన్నారు.
నటీ నటులు:
విజయ్ సేతుపతి, రాశీఖన్నా, నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా,రవికిషన్ శుక్లా, తులసి తదితరులు
సాంకేతిక వర్గం :
సంగీతం: వివేక్ – మెర్విన్, సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్, స్టంట్స్: అనల్ అరసు, కోరియోగ్రాఫీ: రాజుసుందరం, శాండి, దస్త,
ఎడిటింగ్ : ప్రవీణ్ కె. ఎల్. డైలాగ్స్: మల్లూరి వెంకట్, నిర్మాత రావురి. వి. శ్రీనివాస్, దర్శకత్వం: విజయ చందర్
లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ `A1 ఎక్స్‌ప్రెస్`
*నేటి నుండి రెగ్యులర్ షూటింగ్
`నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మురళీశర్మ, రఘుబాబు, సందీప్ కిషన్‌లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. అలాగే ఈ జోనర్‌లో సందీప్ కిషన్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
సందీప్ కిషన్, మురళీశర్మ, రఘుబాబు,
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: డెన్నిస్ జీవన్ కనుకొలను
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
కెమెరా: కెవిన్ రాజు
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
ఆర్ట్: అలీ
కాస్ట్యూమ్ డిజైన్: హర్మన్
పి.ఆర్.ఒ: ఎల్.వేణు గోపాల్, వంశీశేఖర్
హీరో సునీల్ చేతుల మీదుగా ‘అప్పుడు- ఇప్పుడు’ సినిమా సాంగ్ విడుదల!!
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ కి, కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతులమీదుగా విడుదలైన మొదటి గీతానికి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుచేతులమీదుగా విడుదలైన రెండవ పాటకి అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రంలోని మూడవ పాటను హీరో సునీల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ – “అప్పుడు – ఇప్పుడు’ టైటిల్ చాలా క్యాచీ గా ఉంది. అలాగే పద్మానావ్ భరద్వాజ్ సంగీతం కొత్తగా ఉంది. తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ – ” తెలుగు సినిమా ప్రేక్షకులని తనదైన హాస్యంతో నవ్వించి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకొని, నటనతో, డాన్స్ లతో హీరోగా హిట్ సినిమాలు అందిస్తున్న హీరో సునీల్ గారి చేతుల మీద మా అప్పుడు ఇప్పుడు సినిమా పాట విడుదలవడం మాకు చాలా ఆనందంగా ఉంది “అన్నారు.
సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి …
దర్శకత్వం: చలపతి పువ్వల,
నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు,
సంగీతం: పద్మానావ్ భరద్వాజ్,
సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి,
ఆర్ట్: ఠాగూర్,
ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,
లిరిక్స్ః చిరావూరి విజయకుమార్,
పి.ఆర్.ఓః సాయి సతీష్.
వి.యన్.ఆదిత్య కొత్త చిత్రం “వాళ్ళిద్దరి మద్య “…
వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిరాజ్ అశ్విన్ ,నేహా కృష్ణ నటీనటులుగా ….మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’, ‘ఆట’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కొత్త చిత్రానికి “వాళ్ళిద్దరి మధ్య” అనే టైటిల్ ఖరారు చేశారు. అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ, ” మంచి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాతతో … మంచి కంటెంట్ ఉన్న కథతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల ఎంపిక కోసం చాలా కసరత్తులు చేశాం . సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా కరెక్టుగా కుదిరాడు . మా చిత్రం కథలో హీరోయిన్ అమెరికా నుండి వస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా అమెరికా నుండే హీరోయిన్ ని పిలిపించాం. అక్కడ చదువుకుంటున్నా కూడా తెలుగు బాగా మాట్లాడగలిగే నేహా కృష్ణ మా కథ నచ్చి ఈ చిత్రంలో చేయడానికి ఒప్పుకుంది. మా చిత్రం ద్వారా ఆమెని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రముఖ కెమేరామ్యాన్ పి.జి. విందా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన ఆర్.ఆర్. కోలంచి ఈ చిత్రం ద్వారా కెమెరామేన్ గా పరిచయం చేస్తున్నాం . ఇద్దరు ప్రతినాయకులలాంటి హీరో హీరోయిన్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. మా పోస్టర్స్ లో కనిపిస్తున్న ‘లోమా’ అంటే ఏంటో , టైటిల్ కి వీళ్ళ కారెక్టర్లకి సంబంధం ఏంటి అనేది త్వరలోనే తెలియజేస్తాం” అని తెలిపారు.
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, ” నిర్మాతగా నాకు ఇదే తొలి సినిమా. కథ వినగానే ఇంప్రెస్ అయిపోయాను . వీఎన్ ఆదిత్య గారు చాలా ఎక్సలెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందీ చిత్రం. నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతున్నాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం . డిసెంబర్ మొదటి వారంలోపు సినిమా మొత్తం సిద్దమై పోతుంది ” అని చెప్పారు .
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ” నా రెండవ చిత్రం వి.ఎన్.ఆదిత్య గారి దర్శకత్వంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దగ్గరినుండి నేను చాలానేర్చుకుంటున్నా . దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఈ చిత్ర యూనిట్ అంతా కొత్తవాళ్ళైనా కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఇష్టంతో చేయడం చూస్తే సంతోషంగా అనిపించింది. వ్యక్తిగతంగా ఎలాంటి ప్రేమ కథ లేని నాకే, ఈ స్టోరీ డైరెక్టర్ గారు చెప్తుంటే అద్భుతంగా అనిపించింది. చూసే మీకు ఇంకా చాలా నచ్చుతుంది అని ఆశిస్తున్నా” అన్నారు .
హీరోయిన్ నేహా చిత్ర విశేషాలు చెబుతూ, ” తెలుగు చిత్ర పరిశ్రమలో నా మొదటి చిత్రం వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థతో, వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను పెరిగింది ఇక్కడే. చిన్నప్పటినుండి తెలుగు చిత్రాల్లోని సహజత్వాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ పెరగడంతో ఆప్పటినుండే నటనపై ఆసక్తి ఉండేది. తెలుగు చిత్రాల్లో ఏదో ఒక రోజు నటించాలి అనుకుంటూ అవకాశం కోసం ఎదురుచూస్తుండగా డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారిని సంప్రదించడం ,ఆయన తన చిత్రానికి హీరోయిన్ గా నన్ను ఎంచుకోవడం జరిగిపోయాయి. 50 రోజుల చిత్రీకరణలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ నచ్చే ప్రేమ కథ, మెచ్చే కథనంతో తెరకెక్కనున్న ఈ చిత్రం మీ అందరికి చాలా బాగా నచ్చుతుందనుకుంటున్నాను” అన్నారు.
రజనీకాంత్ కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు
తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) 2019 వేడుకలో ఆయన్ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ విషయాన్నికేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విట్టర్ ద్వారా శనివారం అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపారు రజనీకాంత్.















