Home Blog Page 16

Film Nagar Cultural Center (FNCC) & Pullela Gopichand Badminton League schedule announcement held grandly

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో ఈ రోజు ఎఫ్ఎన్ సిసిలో సందడిగా జరిగింది. ఈ నెల 4, 5 తేదీలలో ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే నాలుగైదు వారాలు వీకెండ్స్ లో శని, ఆదివారాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 10 మెన్ అండ్ వుమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ లీగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో

ఎఫ్ఎన్ సిసి ప్రెసిడెంట్ కె.ఎస్. రామారావు మాట్లాడుతూ – తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, ఎఫ్ఎన్ సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం గార్ల చొరవతో ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభిస్తున్నాం. ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రారంభమయ్యే ఈ లీగ్ పోటీలు వచ్చే నాలుగైదు వారాలు వీకెండ్స్ లో నిర్వహిస్తాం. క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్ లాంటి ఇతర క్రీడలను ప్రోత్సహించాలి, యువతను అన్ని స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నాం. మా ఎఫ్ఎన్ సిసి నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ..ఇలా టీమ్స్ ఉంటాయి. ఇక నుంచి ఎఫ్ఎన్ సిసిలో ఏటా టెన్నిస్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ వంటి పోటీలు నిర్వహించబోతున్నాం. అన్నారు.

ఎఫ్ఎన్ సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ – ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈరోజు గోపీచంద్ గారు కూడా రావాల్సింది. రేపు జరిగే కార్యక్రమానికి వస్తామని చెప్పారు. మా ఎఫ్ఎన్ సిసిలో టోర్నమెంట్ పెట్టి నాలుగైదేళ్లవుతోంది. అందుకే మా సభ్యుల సూచన మేరకు మొదట క్లబ్ టోర్నమెంట్, ఆ తర్వాత ఇంటర్ క్లబ్ టోర్నమెంట్ ఆ తర్వాత నేషనల్స్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ముందుకొచ్చిన మా ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు సపోర్ట్ చేస్తున్న చాముండేశ్వరీనాథ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ మాట్లాడుతూ – సోర్ట్స్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎఫ్ఎన్ సిసి కార్యవర్గం ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఇక్కడే టెన్నిస్ నేషనల్స్, బ్యాడ్మింటన్ నేషనల్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాం. ఇప్పుడు పుల్లెల గోపీచంద్, ఎఫ్ఎన్ సీసీ లీగ్ ప్రారంభిస్తున్నాం. నేషనల్ వైడ్ టాప్ 10 మెన్ అండ్ వుమెన్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ లో పాల్గొంటారు. మేనేజ్ మెంట్ తరుపున ప్రెసిడెంట్, సెక్రటరీ టీమ్స్ ఉంటాయి. పురుషోత్తం గారితో పాటు ఎవరైనా టీమ్స్ పాల్గొంటే 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి. అవి ఈ టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ ఇచ్చేందుకు ఉపయోగిస్తాం. అన్నారు.

ఫిలింనగర్ సొసైటీ సెక్రటరీ, ఎఫ్ఎన్ సిసి కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ – ఎఫ్ఎన్ సిసి అనేది ఒక క్లబ్ మాత్రమే కాదు ఇక్కడ ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ చేస్తామని మా ప్రెసిడెంట్ కేఎస్ రామారావు గారు నిరూపించారు. ఏ క్లబ్ కు లేనంత మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మన దగ్గర ఉంది. చాముండేశ్వరీనాథ్ గారు వచ్చాక మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూపురేఖలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లో పేరున్న ఎంతోమందిని ఆయన మన దగ్గరకు తీసకొచ్చారు. ఈ టోర్నమెంట్ కూడా బాగా జరగాలి. అన్నారు.

ఎఫ్ఎన్ సిసి సెక్రటరీ తుమ్మల రంగారావు మాట్లాడుతూ – గత రెండు మూడు నెలలుగా ఈ టోర్నమెంట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. చాముండేశ్వరీనాథ్ గారి చొరవతో, మా ప్రెసిడెంట్ ఇతర కార్యవర్గ సపోర్ట్ తో ఎఫ్ఎన్ సిసి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. మా ప్రెసిడెంట్ ఏ కార్యక్రమం చేపట్టినా మా పూర్తి సహకారం అందిస్తాం. అన్నారు.

ఎఫ్ఎన్ సిసి మెంబర్ సోమరాజు మాట్లాడుతూ – దేశంలో ఎన్నో క్లబ్స్ ఉంటాయి. కానీ ఎఫ్ఎన్ సిసిలో మాత్రమే ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుపుతున్నారు. మా చాముండేశ్వరీనాథ్ గారు ఇక్కడికి వచ్చాక సానియా మిర్జా, లియాండర్ పేస్, పుల్లెల గోపీచంద్ వంటి ఎంతమంది స్టార్స్ ను తీసుకొచ్చారు. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సిసి వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఎన్ రెడ్డి, ట్రెజరర్ శైలజ జూజాల, ఎఫ్ఎన్ సిసి కమిటీ మెంబర్స్ వేణు, ఏడిద రాజా, కమిటీ మెంబర్ మరియు స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు.

‘ichchata Love Ammabadunu Konabadunu’ Movie Review (Bold & thrilling entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : ట్యాగ్ ఎంటర్టైన్మెంట్
సినిమా పేరు : ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 03.04.2026
నిర్మాత : అంజనేయులు పిట్ల
రైటర్ & డైరెక్టర్ : అంజనీదాస్
నటీనటులు : సుధాకర్ మస్కూరి, శివరాజ్ శంకర్,క్రితి ఆర్ బట్, నీవిక్ష నాయుడు, ప్రసూన వీరన్
సంగీతం : కళ్యాణ్ కేస్, ఈ. చరణ్, నవీన్ జె
సినిమాటోగ్రఫీ : రాజేష్ కుర్రా

ఏప్రిల్ 3, 2026న విడుదలైన ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం, నేటి తరం ప్రేమను ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేసింది. అంజనీదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధాకర్ మాస్కూరి, శివరాజ్ శంకర్, కృతి ఆర్ భట్, నివిక్ష నాయుడు ముఖ్య పాత్రల్లో నటించారు. రిలీజ్‌కు ముందు నుంచే తన బోల్డ్ కాన్సెప్ట్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

కథ విషయానికి వస్తే:
ఇది ఒక చైన్ స్నాచర్ విక్కీ జీవితం చుట్టూ తిరుగుతూ, ప్రేమను వ్యాపారంగా చూసే మనుషుల మధ్య ఇరుక్కున్న ఒక ఫిలిం మేకర్ ఆలోచనలతో కలిసిపోతుంది. ప్రేమను డబ్బుతో కొనే యుగంలో మనం జీవిస్తున్నామా? లేక అది ఇంకా భావోద్వేగాలకు సంబంధించినదేనా? అనే ప్రశ్నలను సినిమా ముందుకు తీసుకొస్తుంది. ఒక క్రిమినల్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి, మరోవైపు ప్రేమను కేవలం ఒక ప్రాజెక్ట్‌లా చూస్తున్న వ్యక్తి—ఈ ఇద్దరి ప్రయాణాలు ఎలా ఒకదానికొకటి ముడిపడతాయి అన్నదే కథలో ప్రధాన ఆసక్తికర అంశం. సమాజంలో జరుగుతున్న మార్పులను ప్రతిబింబిస్తూ, ఈ కథ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.

నటన పరంగా చూస్తే:
కొత్తవాళ్లు అయినప్పటికీ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సుధాకర్ మాస్కూరి విక్కీ పాత్రలో ఒక రఫ్‌నెస్, ఎమోషనల్ డెప్త్ రెండింటినీ బాగా చూపించారు. శివరాజ్ శంకర్ తన పాత్రలో ఒక నేచురల్ హీరోయిజం చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు. కృతి ఆర్ భట్ మరియు నివిక్ష నాయుడు తమ పాత్రల్లో ఫ్రెష్‌నెస్ తీసుకువచ్చారు. అనుభవం తక్కువగా ఉన్నా, కాన్ఫిడెన్స్‌తో నటించడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

దర్శకత్వం గురించి మాట్లాడితే:
అంజనీదాస్ ఈ కథను చాలా రియలిస్టిక్‌గా, కొంత బోల్డ్‌గా కూడా తెరకెక్కించారు. డైలాగ్స్ నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రతి సీన్‌లోనూ ఒక నేచురల్ ఫ్లో కనిపిస్తుంది. కొన్నిచోట్ల సెన్సార్ పరిమితులను దాటి వెళ్లే సన్నివేశాలు ఉన్నా, అవి కథలో భాగంగా సహజంగా అనిపిస్తాయి. కొత్త తరహా కథలను ప్రయత్నించడంలో దర్శకుడి ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది.

సాంకేతికంగా:
సాంకేతికంగా సినిమా సరైన స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్‌ కొత్తగా ఉన్నాయి.. మ్యూజిక్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు బలం ఇచ్చింది. ఎడిటింగ్ వేగంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన సన్నివేశాలను వివరంగా చూపించాలని దర్శకుడు సమయం తీసుకున్నాడు అక్కడ కొద్దిగా నెమ్మదిగా అనిపించే భాగాలు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా పెద్ద స్థాయిలో లేకపోయినా, కథ కథనం ఆ లోపాలను కనిపించనివ్వదు.

హైలైట్స్:

యూనిక్ & బోల్డ్ కాన్సెప్ట్
యూత్ రిలేటబుల్ కంటెంట్
ఫస్ట్ హాఫ్‌లో ఎనర్జీ, చైన్ స్నాచింగ్ సీన్స్
డైలాగ్స్ & రియలిస్టిక్ టేకింగ్
సమాజంపై ప్రశ్నించే థీమ్

మైనస్ పాయింట్స్:

ప్రొడక్షన్ వాల్యూస్ మరింత మెరుగ్గా ఉండాల్సింది
కొన్ని బోల్డ్ సీన్స్ అన్ని ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవచ్చు

మొత్తంగా చూస్తే:

“ఇచట లవ్ అమ్మబడును కొనబడును” ఒక సాధారణ ప్రేమ కథ మాత్రం కాదు, దాని లోపల సమాజంపై, సంబంధాలపై ఒక గట్టి వ్యాఖ్యానం ఉంటుంది. ప్రేమను ఒక కోణంలో చూసే ప్రేక్షకుడిని, మరో కోణంలో ఆలోచింపజేసే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్‌లు, బోల్డ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది. దర్శకుడికి మంచి సహకారం ఇచ్చే నిర్మాత ఉంటే భవిష్యత్తులో ఇతడి నుంచి గొప్ప చిత్రాలు వస్తాయని భావిస్తున్నాము.

       Cinemarangam Review Rating..3/5

Pallichattambi is a beautiful emotional film that the whole family can watch together: Tovino Thomas & Kayadu Lohar

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. “పళ్లి చట్టంబి” సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్

హీరో టొవినో థామస్ మాట్లాడుతూ…– దర్శకుడు డిజో నాకు చాలాకాలంగా తెలుసు. మేమిద్దరం ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటూ ఉండేవాళ్లం. కొన్ని మూవీస్ కు డిస్కషన్స్ చేసుకున్నాం. అయితే అప్పటికి నాకు ఉన్న సినిమాల కారణంగా వెంటనే ఆయనతో సినిమా చేయలేకపోయాను. డిజో, నేను కలుస్తూనే ఉండేవాళ్లం. డిజో పళ్లిచట్టంబి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నేను కమిట్ మూవీస్ ఫినిష్ చేశాను. డిజో కూడా జనగణమన సినిమాతో పాటు మరో మూవీ రూపొందించాడు. ఆ తర్వాత ఈ సినిమా వర్క్స్ ప్రారంభించాం. కొద్ది రోజుల తర్వాత ప్రొడ్యూసర్ మారారు. మేము వేరే ప్రొడ్యూసర్స్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాం.

– ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్ ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను. అప్పటిదాకా డైటింగ్ చేసే నేను ఈ చిత్రం కోసం డైటింగ్ పక్కనపెట్టాను. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారాను. డిజోతో వర్క్ చేయడంలో ఎలాంటి ప్రెజర్ ఉండదు. సెట్ లో కూల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు కోపం వస్తుందా అనేది కూడా తెలియదు.

– షూటింగ్ గ్యాప్ లో వెకేషన్స్ కు వెళ్తుంటా. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మా ఫ్యామిలీతో వెకేషన్స్ లో సమయం గడపడం నాకు ఇష్టం. హెక్టిక్ షెడ్యూల్స్ పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కొంత విరామం తీసుకుంటేనే ఇండస్ట్రీ ఎలా ఉంది గమనించగలుగుతాం. నేను ఇండస్ట్రీలో ఉన్నా, ఇండస్ట్రీ బయటివారిలా అన్నీ గమనించాలని అనుకుంటా. తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్ కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాను. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారు. నేను తెలుగులో సినిమా చేయకున్నా తెలుగు ప్రేక్షకులు నా మలయాళ మూవీస్ చూసి ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది.

– నిర్మాతలు నౌఫల్, బ్రిజేష్ తో గతంలో వర్క్ చేశాను. వాళ్లు నా మూవీస్ ను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దర్శకుడు డిజో ఈ సినిమా కోసం ఏది అడిగినా అది కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. తెలుగు నుంచి ప్రొడ్యూసర్స్ చైతన్య, చాణక్య, చరణ్ వచ్చి మా మూవీ చేయడం హ్యాపీగా అనిపించింది. జేక్స్ బిజోయ్ తన మ్యూజిక్ తో మా మూవీలోని ఇంటెన్సిటీని, ఎఫెక్ట్ ను మరింతగా పెంచారు. ఆయనతో గతంలోనూ నేను వర్క్ చేశాను. జేక్స్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్.

– పళ్లిచట్టంబి సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్ గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. అంతేకానీ ఆ పరిస్థితుల నేపథ్యాన్ని మా అభిప్రాయ కోణంలో చూపించలేదు. మీరు ఒక్కసారి సినిమా చూస్తే మూవీ సోల్ అర్థమవుతుంది. మా మూవీలో మానవత్వం ముఖ్యమనే పాయింట్ ను చూపిస్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయంలో కూడా మనమంతా ఒక్కటే. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది.

– పళ్లిచట్టంబిలో మతాల గురించిన ప్రస్తావన, ఏ మతాన్ని తక్కువ చేయడం కానీ చూపించలేదు. కథానుసారం చర్చి నేపథ్యంగా సన్నివేశాలుంటాయి. ఆ ప్లేస్ లో మరో ఆలయాన్ని పెట్టుకున్నా, కథలో మార్పేమీ ఉండదు. సోషియో పొలిటికల్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. సినిమాను ఆస్వాదించేందుకు భాష అవసరం లేదు. మనం ప్రపంచభాషల్లోని అనేక సినిమాలను ఓటీటీ ద్వారా చూసి ఎంజాయ్ చేస్తున్నాం. నేను తెలుగు తెలియకున్నా చిన్నప్పుడు ఎన్నో తెలుగు మూవీస్ ను చూసి ఎంజాయ్ చేశాను. పళ్లిచట్టంబి సినిమాకు సీక్వెల్ అనుకోవడం లేదు.

హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ..– డ్రాగన్ మూవీ కంటే ఓకే అయిన చిత్రమిది. నేను నటించిన మలయాళ మూవీ పాథోన్‌పథం నూట్టండు చూసి దర్శకుడు డిజో ఈ మూవీ కోసం అప్రోచ్ అయ్యారు. ఈ కథ విన్నాక నా కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని అనిపించింది. ఇప్పటిదాకా నేను ఏ మూవీలో నటించని తరహా పాత్ర ఈ సినిమాలో చేశాను. ఈ చిత్రంలో రెబెకా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర ఇంటెలెక్చువల్, రూటెట్ గా ఉంటుంది. గ్లామర్ అనే కోణంలో ప్రేక్షకులు నా పాత్రను చూడరు. మూవీలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కోసం నేను బాగా కష్టపడాలి అనుకున్నా. ఈ సినిమా నన్ను నాయికగా మరింత మంచి పొజిషన్ కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. నేను బయటకు మోడరన్ అమ్మాయిలా కనిపిస్తా కానీ రూరల్ అమ్మాయి మనస్తత్వమే నాలో ఉంటుంది. డైరెక్టర్ డిజో సపోర్ట్ తో రెబెకా పాత్రను సంతృప్తికరంగా పోషించగలిగాను.

– నేను నాకు తెలియని భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఆ మూవీ కోసం తప్పకుండా వర్క్ షాప్స్ చేస్తాను. భాష తెలిసిన వారి సహాయం తీసుకుంటాను. కనీసం ఐదు నుంచి పది రోజులు వర్క్ షాప్స్ చేసి, స్క్రిప్ట్ అర్థం చేసుకుని సెట్స్ లోకి వెళ్తాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి వర్క్ షాప్స్ చేశాను. స్క్రిప్ట్ విన్న తర్వాత నేను కొంత రీసెర్చ్ చేశాను, కొన్ని బుక్స్ చదివాను. అయితే డిజో గారు స్క్రిప్ట్ పరిధిలోనే ఆలోచించి, నటించమని చెప్పారు. మనం ఎక్కువ రీసెర్చ్ చేసినా కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే డిజో చెప్పినట్లు స్క్రిప్ట్ లో ఉన్నది పర్ ఫార్మ్ చేశాం.

– రెండు రకాల లుక్స్ లో నేను కనిపిస్తాను. నేను ఈ మూవీలో ఎలా కనిపించాలి అనే విషయంలో దర్శకుడు డిజో పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఎప్పుడైనా బాగా ప్రిపేర్ అయిన డైలాగ్స్ మార్చినప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉండేది. నేను ఎవరితో కలిసి నటించినా ధైర్యంగా నటిస్తా కానీ టొవినోతో కలిసి నటించినప్పుడు ఎందుకో భయమేసింది. పర్ ఫార్మెన్స్ లో ఆయన నాకంటే ముందుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. టొవినోను చూసి ఇన్స్ పైర్ అయి నటించాను.

– పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ కలిసి చూడొచ్చు. మా మూవీకి ఎలాంటి కేటగిరీ రెస్ట్రిక్షన్ లేదు. ఒకసారి మీరు సినిమా చూస్తే ఈ స్క్రిప్ట్ తెరకెక్కించడంలో ఉద్దేశం తెలుస్తుంది. ప్రత్యేకంగా ఏ అజెండా ఈ సినిమా వెనక లేదు.

Pattuko Baba Song launched by Top Director Koratala Siva from ‘Pithapuramlo‘ Movie

సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీరామ్ తపస్వి రాసిన ‘పట్టుకో బాబా’ పాటను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించి, టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు

ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ… “చంద్ర మహేష్ గారు అప్పట్లో తీసిన బ్లాక్ బస్టర్ ‘ప్రేయసి రావే’ కి నేను రైటింగ్ అసిస్టెంట్ గా పని చేశాను. ఆ తర్వాత ఆయన తీసిన మరికొన్ని చిత్రాలకు కూడా నేను పని చేశాను. అందుకే ఈ పాటను ఆవిష్కరిస్తున్నందుకు చాలా ఆనంద పడుతున్నాను. ఇవాల్టి యువతరం ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, తల్లితండ్రులతో వాళ్ళకున్న కమ్యూనికేషన్ గ్యాప్ ని చర్చిస్తూ రిలేషన్ షిప్స్, అండర్స్టాండింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. దర్శకుడు చంద్ర మహేష్ గారి సెన్సిబిలిటీస్ గురించి నాకు తెలుసు. ఒక ఫీల్ ని ఎంత ఇంపాక్ట్ గా చెబుతారో ‘ప్రేయసి రావే’ టైంలోనే చూశాను. ఆ సినిమా క్లైమాక్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఆ రోజులు నాకిప్పటికీ గుర్తున్నాయి. ‘ప్రేయసి రావే’ లాగా అదే ఫీల్ తో ‘పిఠాపురంలో’ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. చంద్ర మహేష్ గారికి పెద్ద విజయం దక్కాలని నా ఆకాంక్ష” అని చెప్పారు.

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని ఏరియాల పంపిణీదారులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీ తో సహా సిద్దమయింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్ , ట్రైలర్ రిలీజ్ చేసిన ‘ ప్రేయసి రావే ‘ టీమ్ శ్రీకాంత్ , శివాజీరాజా, పృథ్వీ, ఎంఎం శ్రీలేఖ, సెకండ్ సాంగ్ రిలీజ్ చేసిన కొరటాల శివ లకు మహేష్ చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర .

‘Pallichattambi’ Pre-Release event held grandly.Movie Releasing on April 10

Malayalam star hero Tovino Thomas is starring in the big-budget film “Pallichattambi.” The movie is being produced by Noufal, Brijeesh, and Chanukya, Chaitanya, Charan under the banners of World Wide Films and C Cube Bros Entertainments. Directed by Dijo Jose Antony, the film features Kayadu Lohar as the heroine. The movie has created huge pan-India expectations and is set for a grand theatrical release on April 10 in five languages: Hindi, Tamil, Telugu, Malayalam, and Kannada. A grand release press meet was held today in Hyderabad.

Lyricist Rambabu Gosala said, “I wrote the songs for the Telugu version of ‘Palli Chattambi.’ This is my third film with Tovino Thomas. Earlier, I wrote songs for his films ‘Mayanadhi’ and ‘Vyuham.’ Tovino Thomas is famous across India. Kayadu’s first film was ‘Alluri,’ for which I wrote all the songs. Jakes Bejoy is a very talented music director. After ‘Thudarum’ and ‘Kotha Lokah,’ I am now writing lyrics for this film as well. I hope this movie becomes a big success.”

Actor Shatru said, “This is my first Malayalam film. I was surprised when the director narrated the story, it felt very interesting. I’m playing a key role in this movie, and I dubbed for my character myself. It was a happy experience acting alongside Tovino.”

Associate Producer Meghashyam said, “I thank Eluru Sreenu, Bunny Vas, Maruthi, TG Vishwaprasad, Vivek, and all the elders who supported me and helped me stand on this stage. ‘Pallichattambi’ is an emotional action entertainer. Director Dijo Jose Antony has made it very engaging. Our entire team worked very hard, and the output is excellent. This is my second film with Tovino and Kayadu. Bunny Vasu garu is supporting our Telugu release. I request the audience to watch and support our film in theatres.”

Distributor Vetri said, “‘Pallichattambi’ is a film that audiences must watch. Director Dijo has made it brilliantly. Jakes’ music will be a major highlight. Thanks to Bunny Vasu garu for supporting the Telugu release.”

producer ChanPakya said, “Our film will appeal to all sections of the audience. Director Dijo has made it in a way that everyone will like. We hope to celebrate the success of this film very soon.”

Producer Chaitanya said, “We’re happy to see so many guests attend our event. This is our first attempt as producers. We hope the audience watches and supports our film in theatres.”

Producer Charan said, “We’re happy to have gone from Nellore to Kerala and made such a big Malayalam film. Tovino became like a family member to us. His performance will surprise everyone. Kayadu Lohar has done a memorable role in her career. Shatru played an important role. Thanks to Bunny Vas anna for supporting the Telugu release. Director Maruthi is a good friend, though he couldn’t attend today. He guided us a lot during the making of this film. Meghashyam also gave us great support, helping us complete the film without tension. We believe this film will bring great success to our banner.”

Producer and Distributor Bunny Vas said, “Maruthi garu introduced this producers’ team to me. After speaking with them, I realized they were making a prestigious film. They took me to Kochi and showed me the film. It was surprising to see Telugu producers go to Kerala and make such a huge film. Technically, the film is of very high quality and grand scale. For Telugu audiences, it will feel like a fresh commercial film. Usually, we think of Malayalam movies as concept-oriented, but ‘Palli Chattambi’ is a large-scale commercial entertainer. It will be a big success in Telugu as well. Meghashyam, who worked with us years ago, is now an associate producer on this film, it makes me very happy. We released Tovino’s ‘2018’ in Telugu, and it was a big success. His performance and action sequences in this film are impressive – I was reminded of Mohanlal. Kayadu will gain many more fans after this film. I really liked the director’s execution and editing. If you want to watch a new kind of commercial film, watch ‘Pallichattambi’ in theatres.”

Director Dijo Jose Antony said, “This is my fourth film as a director. Telugu audiences appreciated my previous film ‘Jana Gana Mana’ with Prithviraj Sukumaran. Director Rajamouli garu also responded positively to that film. ‘Pallichattambi’ will also appeal to you. It has a simple story that connects with everyone. The main theme is that all humans are one. I made the film with the concept ‘Love, Live, Love.’ ‘Pallichattambi’ is actually a term and represents a character in the story, so we retained the same title in all languages. The film is set in 1950s Kerala. Even though times and politics change, human struggles remain the same. We wanted to bring that authenticity to the screen, so we made it as a period film.”

Actress Kayadu Lohar said, “‘Pallichattambi’ is a special film for me. I played the character Rebecca, which is very close to my heart. Audiences will love not just her beauty but also her personality. It is like a dream role for me. I thank director Dijo for giving me such a wonderful character. Our team went through a long journey for this film. It will definitely be a success, and we will celebrate together. Tovino is a great co-star and very inspiring to work with. Without ‘Pallichattambi,’ there is no Rebecca. It’s a beautiful film. Please watch it in theatres on the 10th. You will walk out with a strong emotional feeling that will stay with you.”

Hero Tovino Thomas said, “Director Dijo and I have been planning to do this project for a few years, and it finally happened. The film is set in the 1950s. We did a lot of research to recreate that era authentically. We have presented a 1950s story in a way that appeals to 2026 audiences. Such a film is only possible with a passionate team. Dijo and I are already discussing more projects together. He became a good friend during the shoot. Producers Charan, Chaitanya, and Chanakya worked as a team to turn their dream into reality. Without producers like Noufal and Brijesh, a dream project like ‘Pallichattambi’ wouldn’t have been completed, they are the backbone of this film. Shatru, who played an important role, also became a good friend. Kayadu prepared a lot for her role, and I could see her passion for acting. Acting in multiple languages at once is not easy, but she is impressing audiences across languages. I’m happy to work with such a co-star. From April 10, ‘Palli Chattambi’ will become everyone’s movie.”

Cast: Tovino Thomas, Kayadu Lohar, Vijayaraghavan, Shatru, Sudheer Karamana, Babu Raj, Vinod Kedamangalam, Prashanth Alexander, and others.

Technical Team:
Costumes – Manjusha Radhakrishnan
Makeup – Rashid Ahmed
Production Design – Dileep Nath
Editing – Sreejith Sarang
Cinematography – Tijo Tomy
Music – Jakes Bejoy
Script – S. Suresh Babu
Associate Producers – Meghashyam, Tanjeer
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producers – Noufal, Brijeesh, Chanukya Chaitanya Charan
Director – Dijo Jose Antony

Rakasa Pre Release Event Held Grandly Movie Releasing On April 3rd

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘జీ స్టూడియోతో, దివ్య గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నాను. ఆ తరువాత మానస గారిని చూశాను. ఆమె తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తుంటుంది. మానస ఇంకా ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదు వంశీ గారి వంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ చేస్తున్నప్పుడు 11, 15 మంది కొత్త వాళ్లతో చేయడం ఎందుకు అన్నారు?.. ‘రాకాస’ టైంలో ఇలాంటివి ఎందుకు ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నారు.. ‘బరి’ చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు? అని అంటున్నారు.. ఇలా అనే వాళ్లు అంటూనే ఉంటారు.. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటాను. నేను నా ప్రతీ సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాను. నాకు కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ సమానమే. నా మీద నమ్మకం పెట్టుకుని, నాకు ఫ్రీడం ఇచ్చిన నా తల్లిదండ్రులకు థాంక్స్. రమేష్ గారు మొదటి నుంచి మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అనుదీప్ గారికి అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉంది. రాజు గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. విజయ్ మాస్టర్ గారిని సెట్లో చూస్తే మా నాన్న గారిని చూసినట్టే అనిపిస్తుంది. అన్వర్ అలీ గారు కేవలం ఎడిటర్‌గా కాకుండా అన్ని బాధ్యతల్ని చూసుకుంటారు. నాన్న గారి వల్ల నాకెంతో మంది పరిచయమయ్యారు. అందులో గెటప్ శ్రీను ఒకరు. ఆయన నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నయన్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి. సంగీత్ షైనింగ్ స్టార్. ‘రాకాస’ చిత్ర విజయంలో సంగీత్‌కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘గత ఏప్రిల్‌లో నేను, మానస గారు, నిహారిక గారు కలిసి ఓ ఫోటో దిగి ఇన్ స్టాలో షేర్ చేశాను. ఏప్రిల్ 3న మా సినిమా రాబోతోంది. ఓ మంచి సినిమాతో ఆడియెన్స్ ముందుకు రావాలనే గత ఏడాది ఫిక్స్ అయ్యాం. సినిమా రిలీజ్ తరువాత రాజు గారి విజువల్స్, అనుదీప్ గారి మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మహేష్ గారి వల్లే నాకు ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వచ్చింది. దర్శకుడిగా మహేష్ ‘ఇట్లు అర్జున’తో బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నారు. చలికాలంలో రాత్రిపూట ఎక్కువగా షూటింగ్ చేశాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కి థాంక్స్. నయన్‌కి మంచి టాలెంట్ ఉంది. ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. గెటప్ శ్రీను గారు చాలా మంచి వ్యక్తి. నిహారిక గారు చాలా సున్నితమైన వ్యక్తి. ఆమెకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ నుంచి మానస గారితో నాకు మంచి బంధం ఉంది. జనాలు సినిమాని చూసి వదిలేయకూడదు, ఇంటికి తీసుకెళ్లాలి, గుర్తు పెట్టుకోవాలి, వాళ్లు పెట్టే డబ్బులకి సరిపడేలా న్యాయం చేయాలని మానస గారు తపన పడుతుంటారు. ఆడియెన్స్‌ని ఆమె ఎంతగానో రెస్పెక్ట్ చేస్తుంటారు. మేం ఓ మంచి సినిమాని తీశామని నమ్ముతున్నాం. ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ అనిపించేలా మా చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 3న ‘రాకాస’ రాబోతోంది. అందరూ చూడండి. తప్పకుండా నిరాశ పర్చదు. మంచి సినిమా తీయడానికి మేం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మా యూవీ క్రియేషన్స్, శర్వా అన్న ‘బైకర్’ కూడా ఏప్రిల్ 3న రాబోతోంది. రెండు సినిమాల్ని ఆడియెన్స్ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నయన్ సారిక మాట్లాడుతూ .. ‘నిహారిక గారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇది నాకు మూడో ప్రాజెక్ట్. ‘హలో వరల్డ్’తో నా సినీ ప్రయాణం మొదలైంది. నిహారిక గారితో పని చేస్తే లక్ కలిసి వస్తుంది. ‘రాకాస’తో మళ్లీ ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. మా అందరినీ బాగా చూసుకున్న రమేష్ గారికి థాంక్స్. మానస శర్మ గారికి సినిమా పట్ల చాలా ఫోకస్, క్లారిటీ ఉంది. సెట్‌లో గెటప్ శ్రీను గారు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. సంగీత్‌తో ఉన్న ర్యాప్‌తో ఇంకా ఏ కో యాక్టర్‌తో నాకు లేదు. ‘రాకాస’ని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ 3న మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ .. ‘నిహారిక గారు మా లక్కీ ఛార్మ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో సిరీస్‌ను డైరెక్ట్ చేస్తే.. ఆ వెంటనే సినిమా డైరెక్షన్ ఛాన్స్ కూడా వస్తుంది. నా ‘బెంచ్ లైఫ్’ తరువాత నాకు ‘రాకాస’ అవకాశం వచ్చింది. నిహారిక గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రాజు గారికి పని పట్ల ఎంతో ఉత్సాహం ఉంటుంది. అనుదీప్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నా రైటింగ్‌లో భాగస్వామి అయిన మహేష్ గారికి థాంక్స్. అన్వర్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. నయన్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన గెటప్ శ్రీను గారు, బ్రహ్మాజీ గారు, తనికెళ్ల భరణి గారికి థాంక్స్. సంగీత్ శోభన్ నా బలం. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

యదు వంశీ మాట్లాడుతూ .. ‘నిహారిక గారు నా మీదే ‘కమిటీ కుర్రోళ్లు’ కోసం 9 కోట్లు పెట్టారు. ‘రాకాస’ బడ్జెట్ విని షాక్ అయ్యాను. నిహారిక గారికి నిహారిక గారే ధైర్యం. నిహారిక గారు అమ్మాయిలందరికీ ఇన్‌స్పిరేషన్. కొత్త వారికి, టాలెంట్ ఉన్న వారికి నిహారిక గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. నిహారిక గారి వల్లే ‘రాకాస’ ఈ స్థాయికి వచ్చింది. అనుదీప్ మరింత పెద్ద స్థాయికి వెళ్తాడు. అన్వర్ అహర్నిశలు సినిమా కోసం కష్టపడుతుంటారు. ఈ చిత్రానికి విజయ్ మాస్టర్ అతి పెద్ద బలం. రాజు విజువల్స్ గురించి రమేష్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. సంగీత్‌కి సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. నయన్ గారు స్క్రీన్ పై అందంగా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 3న రాబోతోన్న ఈ చిత్రం అందరినీ నవ్వించబోతోంది’ అని అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ .. ‘‘రాకాస’ ఏప్రిల్ 3న రాబోతోంది. ఫ్యామిలీ అంతా కలిసి మా మూవీని చూడండి. ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ వర్మ వర్త్ అని అనుకుంటారు. అవకాశం ఇస్తేనే టాలెంట్ బయటకు వస్తుంది. అలాంటి అవకాశాలు ఇస్తూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. మానస గారు చాలా క్లారిటీ, సెన్సిబిలిటీస్ ఉన్న దర్శకురాలు. అనుదీప్ దేవ్ గారు అద్భుతమైన సంగీత దర్శకుడు. నయన్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’తో సంగీత్‌తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన టాలెంట్ చూసి నేను షాక్ అయ్యాను. ప్రతీ ఎమోషన్‌తో, ప్రతీ జానర్‌తో అందరినీ ఆకట్టుకోగల సత్తా ఉన్న నటుడు. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ మ్యూజిక్ విషయంలో నాకు సపోర్ట్ చేసిన నా టీం మెంబర్లకు థాంక్స్. ఆర్టిస్టులందరూ అద్భుతంగా నటించారు. ఎక్కడా కూడా కామెడీ కోసం నేను సపరేట్‌గా మ్యూజిక్ చేయలేదు. అంత ఆర్గానిక్‌గా కామెడీ వర్కౌట్ అయింది. మమ్మల్ని పరుగులు పెట్టించి, మాతో పని చేయించిన రమేష్ గారికి థాంక్స్. మానస గారితో పని చేయడం ఆనందంగా ఉంది. సంగీత్ చాలా మంచి యాక్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థాంక్స్. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

జీ స్టూడియోస్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య విజయ్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ మా అందరికీ చాలా ప్రత్యేకం. నేను జీ స్టూడియోకి వచ్చిన తరువాత ఎంచుకున్న మొదటి చిత్రమిదే. ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని మానస, నిహారికలు ఈ సినిమాని తీశారు. నిహారిక ఈ సినిమాని తన భుజానికి ఎత్తుకుని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. ‘రాకాస’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాని మేమే నైజాంలో రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’ని కూడా మైత్రికే ఇచ్చారు. ఈ చిత్రాన్ని మేం నైజాంలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. ప్రమోషన్స్ అద్భుతంగా చేస్తున్నారు. మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని ఆశిస్తున్నాను. ‘రాకాస’ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత నిహారిక గారికి థాంక్స్. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది’ అని అన్నారు.

డీఓపీ రాజు ఎదురోలు మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కోసం ఎక్కువగా మేం రాత్రి పూటే షూటింగ్స్ చేశాం. నిహారిక గారితో ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. రమేష్ గారు నాకెప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. ఇలాంటి జానర్‌లో కథ రాసిన మానస గారికి హ్యాట్సాఫ్. సంగీత్, నయన్, గెటప్ శ్రీను అందరూ అద్భుతంగా నటించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయులు మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. నిహారిక గారు నాకు హెడ్ మిస్‌లా, రమేష్ గారు డీన్‌లా అనిపిస్తుంటారు. ‘రాకాస’కి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’లో అద్భుతమైన సెట్ వర్క్ ఉంటుంది. కోట సెట్‌ని తెరపై చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ‘రాకాస’ అందరినీ కట్టి పడేసేలా ఉంటుంది’ అని అన్నారు.

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో ఇది నాకు తొలి చిత్రం. వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. వీఎఫ్ఎక్స్ దాదాపు మూడున్నర నెలలు పట్టింది. ‘రాకాస’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ ప్రమోషన్స్ ప్రతీ చోటా కనిపిస్తున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ని నిహారిక గారు అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. మానస గారు ‘రాకాస’ని అద్భుతంగా తెరకెక్కించారు. ‘రాకాస’ టీం ఎంతో క్రమశిక్షణతో పని చేసింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మహేష్ ఉప్పాల మాట్లాడుతూ .. ‘నిహారిక గారి వల్లే నేను, మానస ఈ స్థాయికి వచ్చాం. మానసతో కలిసి ఈ రచనలో భాగమవ్వడం ఆనందంగా ఉంది. ‘రాకాస’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మాకు సపోర్ట్ చేసిన ‘రాకాస’ టీంకు థాంక్స్’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి మాట్లాడుతూ .. ‘‘రాకాస’లోని జాతర సాంగ్ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ఆ పాట కోసం నిహారిక గారు చాలా ఖర్చు పెట్టారు. ‘రాకాస’ కోసం పని చేయడం ఆనందంగా ఉంది. ఈ ‘రాకాస’తో నిహారిక గారు బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిక్ రైటర్ రఘు రాం మాట్లాడుతూ .. ‘‘రాకాస’లో నేను ‘రపప్పా’, ‘స్నేక్ డ్యాన్స్’ పాటలు రాశాం. అనుదీప్‌తో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

‘Chennai Love Story’ will be one of the greatest love stories in Indian cinema : Hero Kiran Abbavaram at ‘Gurthundha..’song launch event

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి గుర్తుందా సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ సంతోష్ నాయుడు మాట్లాడుతూ – మణిశర్మ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ చేస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ టీమ్ లో నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఈ మూవీకి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ – గుర్తుందా పాట మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు నేను వర్క్ చేస్తున్నాను. మణిశర్మ గారితో కలిసి వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్ కేఎన్, సాయి రాజేశ్..ఇలా నా సొంత టీమ్ తో మళ్లీ కలిసి వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

నటుడు మహేందర్ మాట్లాడుతూ – నా లైఫ్ లో విన్న ఎక్కువ మ్యూజిక్ మణిశర్మ గారిదే. ఈ పాట పోస్టర్ లో కనిపిస్తున్న స్టిల్ కోసం మూడు గంటలు హీరో హీరోయిన్స్ కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ చలిలో బీచ్ లో అలా కూర్చుని ఉన్నారు. వారు ఈ మూవీ కోసం ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేశారో దీంతో అర్థం చేసుకోవచ్చు. అన్నారు.

డీవోపీ విశ్వాస్ డేనియల్ మాట్లాడుతూ – నేను కిరణ్ అబ్బవరం గారితో చేస్తున్న ఐదో చిత్రమిది. అమేజింగ్ స్టోరీతో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. గుర్తుందా సాంగ్ ఎంత బాగుందో మూవీ మొత్తం అదే ఫీల్ తో ఉంటుంది. మా అందరికీ ఇదొక కొత్త తరహా మూవీ. ఇకపై మా సినిమా నుంచి రాబోయే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – మేము చెప్పింది గొప్ప అనే అహాన్ని మరచి ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం పనిచేశారు. ఎవరు ఏం చేసినా, ఏం చెప్పినా సినిమా కోసమే అనుకున్నారు. అందుకే ఈ మూవీ ప్రతి విషయంలో గెలుస్తుంది అని చెప్పగలను. ఈ సాంగ్ కోసం నేను పల్లవి రాశాక మణిశర్మ గారు సంగీతాన్ని అందించారు, చరణం మణిశర్మ గారు కంపోజ్ చేశాక నేను లిరిక్స్ రాశాను. ఎలాంటి ఈగో లేకుండా మేమంతా వర్క్ చేశాం. మేమంతా ఇంతమంచి వాతావరణంలో కలిసి పనిచేసిన ఈ సినిమా తప్పకుండా మీ అందరి మనసులను గెలుచుకుంటుంది. మంచి వసూళ్లు సాధిస్తుంది. అన్నారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – బేబి సినిమా తర్వాత “చెన్నై లవ్ స్టోరీ”తో మరోసారి తమతో కలిసి వర్క్ చేసే అవకాశం కల్పించిన సాయి రాజేశ్, ఎస్ కేఎన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. బేబి సినిమా కంటే పది రెట్ల పెద్ద విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి. మొదటి పాట ఇది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఒక్కోటి 100 మిలియన్ వ్యూస్ దాటేస్తాయి. ఈ కథ విన్నప్పుడే హీరో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ చేస్తున్నామని ఓకే చెప్పారు. క సినిమా తర్వాత ఆయన ఒప్పుకున్న చిత్రమిది. ఏడాదికాలంగా ఈ సినిమా కోసం మూవీ టీమ్ ఎంతో శ్రమిస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకీ మాట్లాడుతూ – బేబి మూవీ తర్వాత మళ్లీ ఈ చిత్రంతో నా ఫేవరేట్ టీమ్ తో వర్క్ చేస్తున్నా. నేను రీసెంట్ గా చిరంజీవి గారి మీసాల పిల్ల పాటకు కొరియోగ్రాఫ్ చేశాను. మాంటేజ్ సాంగ్ కూడా నేను చేయగలను అని ఎంకరేజ్ చేసి ఈ టీమ్ నాకు అవకాశం ఇచ్చారు. నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ గా గుర్తుందా నిలిచిపోతుంది. ఎస్ కేఎన్ ఉంటే అది కల్ట్ మూవీనే అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా రవి నంబూరి మంచి పేరు తెచ్చుకుంటారు. కిరణ్ గారితో గతంలో మంచి సాంగ్స్ చేశాను. ఈ పాట వాటన్నింటికంటే పెద్ద హిట్ అవుతుంది. మణిశర్మ గారు ఎప్పుడూ మనల్ని తన మ్యూజిక్ తో అలరిస్తూ ఉండాలి. అన్నారు.

దర్శక నిర్మాత సాయి రాజేశ్ మాట్లాడుతూ – బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను. కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. నేను బేబి మూవీని ఎంతో ప్రేమించి ఐదు గంటలు తీశాను. 3 గంటలకు ఎలా కుదించాలి అని ఆలోచిస్తున్న టైమ్ లో రవి వచ్చి హెల్ప్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ నాతో ఉన్నాడు. కృతజ్ఞతగా రవిని ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమా చేసి నాకే మంచి చేశాడు రవి. అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో తర్వాత మీరంతా చూస్తారు. ఈ సినిమా కొంత భాగం నేను చూశాను. సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. రవి అంత బాగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోకు సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర హీరోయిన్ ది. ఒక తమిళ సినిమా చూసి ఆమెను ఈ చిత్రానికి సెలెక్ట్ చేశాం. గతేడాది తమిళ సినిమాకు ఫిలింఫేర్ తీసుకున్న శ్రీ గౌరి ప్రియ..ఈసారి తెలుగు సినిమాకు తీసుకుంటుంది. అంత బాగా తను పర్ ఫార్మ్ చేసింది. అనంత శ్రీరామ్ తో వర్క్ చేస్తే లిరిక్స్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద పూర్తిగా ఆధారపడతా. బేబికి ఎంతో మంచి సాంగ్స్ రాశారు. ఆయన పాట రాస్తే ఒకట్రెండు పదాలు మాత్రమే మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక వాక్యం కూడా పూర్తిగా ఛేంజ్ చేయలేదు. ధీరజ్ మంచి ఫ్రెండ్. ఆయన ఈ మూవీని మరింత గ్రాండ్ గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు. నేను పూర్తిగా నమ్మి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకుంటున్నా అంటే కారణం ఎస్ కేఎన్. నా లైఫ్ లో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ముఖ్యమైంది ఎస్ కేఎన్ తో జర్నీ. ఈ కథను పూర్తిగా నమ్మి మాతో ట్రావెల్ అయ్యే హీరో కావాలి. క తర్వాత కిరణ్ గారు ఒప్పుకున్న సినిమా ఇది. కథ చెప్పిన వెంటనే మీరు ఎలా చెబితే అలా ఈ మూవీ చేద్దామని సపోర్ట్ చేశారు. ఇప్పటిదాకా అలాగే మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా చేస్తున్న టైమ్ లో ఆయనపై మరింత ఇష్టం పెరిగింది. ఈ సినిమాలో కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతాను. ఈ సినిమా ఆయనకు ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. మణిశర్మ గారి బీజీఎం వినేందుకే రిపీటెడ్ గా ఎన్నో సినిమాలు చూశాను. ఆయన ఈ సినిమాకు తనదైన శైలీలో సంగీతాన్ని అందించారు. రెండో ట్యూన్ ఏ రోజూ మేము అడగలేదు. ఫస్ట్ ట్యూన్ నే అంత బాగా ఇచ్చేవారు. నేను ప్రొడ్యూసర్ గా ఆయనతో మూవీ చేయడం కంటే ఇంకే కోరుకోను. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాట్లాడుతూ – సాయి రాజేశ్ తో నాకు పరిచయం లేదు. ఆయన ఈ మూవీ కోసం వచ్చినప్పుడు బేబి డైరెక్టర్ అని తెలిసింది. నాతో ఏం పని ఉంటుందని అనుకున్నా. ఆయన కలిసి చెన్నై లవ్ స్టోరీ మూవీకి మ్యూజిక్ చేయాలని అడిగారు. మూవీ కోసం డిస్కషన్స్ చేస్తూ బ్రహ్మాండమైన ట్యూన్స్ కుదిరాయి. పాటలు విని మీరు చెప్పాలి. కిరణ్ తో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – నేను ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నానంటే అందుకు కారణం ఎస్ కేన్, సాయి రాజేశ్. ఏదో చిన్న సినిమా చేసుకుందాం అనుకున్నాను. నేను ఎమోషనల్ మూవీ చేయగలనా అనుకున్న నాతో ఇలాంటి మంచి మూవీ చేయిస్తూ నా ప్రతిభను వెలికితీస్తున్నారు. సాయి రాజేశ్ గారిలోని మ్యూజిక్ టేస్ట్ నేర్చుకునేందుకే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తా అనుకున్నాను. ఈ సినిమా కోసం వంద రోజులు షూటింగ్ చేస్తున్నాం. ఒక కొత్త దర్శకుడిని నిర్మాతలు ఇంతగా నమ్మడం నేను ఇప్పటిదాకా చూడలేదు. ఏ రోజు కూడా ఏం తీస్తున్నావు అని అడగలేదు. నేనే కంటెంట్ చూడమని వారిని పిలిచి అడుగుతుంటా. కిరణ్ అన్న ఎంతో సపోర్ట్ చేస్తూ నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ గా మారిపోయారు. శ్రీ గౌరి ప్రియ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతోంది. మణిశర్మ గారు మ్యూజిక్ చేసిన ఎన్నో మూవీస్ థియేటర్స్ లో ఎంజాయ్ చేశా. ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అనంత శ్రీరామ్ తన పాటల్లో కథను ప్రేక్షకులకు తెలియజేస్తారు. అన్నారు.

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి చెన్నై లవ్ స్టోరీ మూవీ మీద చాలా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో కిరణ్ గారితో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఈ చిత్రం తర్వాత మరింత గొప్ప ఇమేజ్ తెచ్చుకుంటారు. చెన్నై లవ్ స్టోరీ మూవీలో ఇంత బరువైన, ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. మణిశర్మ గారి సంగీతంలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – నిర్మాతగా నేను సినిమాలు చేసేందుకు ఎప్పుడూ తొందరపడలేదు. నా మనసుకు నచ్చిన కథ దొరికినప్పుడే సినిమాలు నిర్మించా. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిందీలో బేబి రీమేక్ స్టార్ట్ చేశాం. కొన్ని అవాంతరాలు వచ్చాయి. తెలుగులో సినిమా చేయాలి అనుకుంటున్న టైమ్ లో సాయి రాజేశ్ గారు ఈ కథ చెప్పారు. ఈ కథ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. బేబి లాంటి బిగ్ సక్సెస్ తర్వాత ఏ దర్శకుడైనా మరో పెద్ద ప్రొడక్షన్ లోకి వెళ్లాలని అనుకుంటారు. కానీ నా చిన్ననాటి మిత్రుడు, నేను బెంజ్ కారు కొనుక్కునేలా చేసిన దర్శకుడు సాయి రాజేశ్ నాతోనే సినిమా చేస్తున్నారు. నా దర్శకులు మారుతి, సాయి రాజేశ్, రాహుల్ సంకృత్యన్, రవి నంబూరి..ఇలాంటి వారి వల్లే నేను ఈ వేదిక మీద నిలబడ్డాను. రవి నాకు సోదరుడు. బేబి మూవీకి ఆయన చేసిన సపోర్ట్ కు కృతజ్ఞతగా సాయి రాజేశ్ రవికి ఈ మూవీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. తన కథల్ని మరో దర్శకుడికి ఇవ్వాలంటే సాయి రాజేశ్ చాలా ఆలోచిస్తారు. రవి ప్రతిభపై నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. రవికి రైటింగ్ మీద ఉన్న ప్రతిభ, సినిమాను రూపొందించడంలో ఉన్న కామన్ సెన్స్ మా అందరికీ నచ్చాయి. క మూవీ తర్వాత కిరణ్ గారు ఈ కథ విని వెంటనే చేస్తానని ముందుకొచ్చారు. మంచి కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే తపన ఉన్న హీరో కిరణ్ గారు. ఈ కథను నిర్మించాలంటే మీకు ధైర్యం ఉండాలి, నటించాలంటే నాకు ధైర్యం ఉండాలి అంటూ శ్రీ గౌరి ప్రియ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. మేము మణిగాడ్ అని పిలుచుకునే మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో నిర్మాతలుగా మా పేర్లు ఉండటం నిజంగా అదృష్టం. అనంత శ్రీరామ్ గారు ఎంతో డెప్త్ ఉన్న పాటలు రాశారు. ఒక హానెస్టీ మూవీ చేసినప్పుడే టీమ్ అందరిలో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అందరికీ అలాంటి ఎగ్జైట్ మెంట్ ఇస్తుంది. ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం. ఈ విషయం చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ప్రోత్సహించారు. బేబి సినిమా టైమ్ లో నాకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి నా సోదరుడు ధీరజ్. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మా టీఎఫ్ జేఏ అసోసియేషన్ ఇటీవల మా సభ్యుడు ఒకరికి 11 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. టీఎఫ్ జేఏ పెద్దలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా థియేటర్స్ కు వెళ్లి మీరు పెట్టే డబ్బులకు రెట్టింపు మనసును హత్తుకునే మూవీ అవుతుంది. మా సినిమాను జూన్ 26 అనుకున్నాం కానీ ఆ తేదీన రామ్ చరణ్ గారి పెద్ది సినిమా వస్తోంది. మా సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాం. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎడిటర్ సంతోష్ ఒక్కో సీన్ కట్ చేసి చూపిస్తూ, మంచి సజెషన్స్ ఇస్తున్నాడు. అలాగే విశ్వాస్ డీవోపీగా నాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. మనవాళ్లు మనతో సినిమా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మీద మరింత నమ్మకం కలుగుతుంటుంది. విజయ్ పొలాకీ మాస్టర్ నాతో మంచి కూల్ స్టెప్స్ చేయించాడు. అనంత శ్రీరామ్ గారు అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ గా రాశారు. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నివి పాత్రలో శ్రీ గౌరి చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. ఆమె నటన ఎంత బాగుందో త్వరలో స్క్రీన్స్ మీద చూస్తారు. రవి నంబూరితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన రాసిన డైలాగ్స్ నటుడిగా నన్ను మరింత ఎగ్జైట్ చేశాయి. రచయితగా రవి ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు. దర్శకుడిగా రవితో నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. ఎస్ కేఎన్ గారికి మూవీ అంటే చాలా ప్యాషన్. ఎప్పుడూ హిట్ సినిమా చేయాలనే మాట్లాడుతుంటారు తప్ప బడ్జెట్ ఎంత ఏంటి అని ఆలోచించరు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల ఖర్చు చేసి సెట్ వేశారు. ఆయనకు మూవీ పట్ల ఉన్న ప్యాషన్ హీరోగా నన్ను చాలా ఎగ్జైట్, ఇన్స్ పైర్ చేసింది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సాయి రాజేశ్ గారు కథ చెప్పినప్పుడే ఈ సినిమా బలంగా ఉండబోతోంది అని అర్థమైంది. రాజా వారు రాణి గారు తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్ గా ఉండే క్యారెక్టర్ చేస్తున్నా. సాయి రాజేశ్ గారు ఉంటే మనం పూర్తి నమ్మకంతో ఉండొచ్చు అని అర్థమైంది. ఈ రోజు మా మూవీ ప్రమోషన్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్, సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మ గారు ఏడు పాటలు కంపోజ్ చేశారు. ఏడు పాటల్ని మీరు థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయినరోజు థియేటర్స్ లో మ్యూజిక్ కన్సర్ట్ అయినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా చెన్నై లవ్ స్టోరీ మూవీ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

Carmeni Selvam Creates a New Wave in the Music Industry: Music Director Ramanujan

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే తమ సంస్థ ద్వారా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ‘అరెరె’ పాట ఎమోషనల్‌గా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాల గురించి ఇలా వివరించారు.

‘‘ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికీ కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో ‘Musicloud Studio & Technology’ని ప్రారంభించాను. మొదట్లో కార్పొరేట్ ప్రాజెక్టులను స్వీకరిస్తూ, నెమ్మదిగా నా పనితీరును మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీడియా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ప్రారంభించాను. మేము సౌండ్ డిజైన్, వాయిస్‌ఓవర్లు మరియు డబ్బింగ్ వంటి అన్ని సేవలను అందించాము. ప్రస్తుతం ‘కార్మేని సెల్వం’ ప్రాజెక్టును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా.. (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం. ఇటువంటి సేవను వినియోగించుకోవడం ద్వారా, చిత్ర నిర్మాతలకు మ్యూజిక్ క్లౌడ్ స్టూడియోకు మధ్య ఒక రెవెన్యూ మోడల్ రూపొందించబడింది. ఈ ఆదాయ నమూనా కింద, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేము సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాము. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. నేను గతంలో దర్శకుడు రామ్‌తో కలిసి అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కురైయొండ్రుమ్ ఇల్లై’ చిత్రానికి పనిచేశా. ఇప్పుడు ‘కార్మేని సెల్వం’ లాంటి గొప్ప ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ రామ్ చక్రి గారితో పరిచయం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. “కార్మేని సెల్వం” సినిమా కోసం 4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, OST ట్రాక్స్ కంపోజ్ చేశాను. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. మా Music Cloud టీమ్‌లో 4-5 మంది కలిసి పనిచేస్తున్నాం. సంగీతం ఎప్పుడూ ఒక వ్యక్తి పని కాదు అది టీమ్ వర్క్. ‘అరెరె’ పాటకు తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఇందులో వైలిన్, ఫ్లూట్ బదులు సరంగి ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. అది భావోద్వేగాన్ని మరింత బలంగా చూపించింది. సముద్రఖని గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు.

ఎమోషనల్, ఫ్యామిలీ సినిమాలకు మ్యూజిక్ చేయడం చాలా కష్టం. ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు గారు చాలా సపోర్టివ్, సింపుల్ వ్యక్తి. ఆయన అందరి పనిని గమనిస్తూ ప్రోత్సహిస్తారు.
కనీసం 10 మంచి, అర్థవంతమైన సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని నా కోరిక. నేను ఎవరితోనూ పోల్చుకోను. మంచి కథలు, మంచి సినిమాల్లో భాగం కావడం నా లక్ష్యం. తెలుగులో “హ్యాపీ డేస్”, “ఆనంద్”, “గోదావరి” లాంటి ఫీల్-గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. చివరగా, “కార్మేని సెల్వం” ఒక హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలని కోరుకుంటున్నాను”.

విడుదల తేది: ఏప్రిల్ 3, 2026

నటీనటులు:
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు.

సాంకేతిక బృందం:
బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
కథ – దర్శకత్వం: రామ్ చక్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
మ్యూజిక్: MAAS (Music as a Service), Musicloud Studio & Technology
డీఓపీ: యువరాజ్ దక్షన్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
ఆడియోగ్రఫీ: రాఘవ్ రమేష్
సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ – హరి ప్రసాద్ MA
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్
మార్కెటింగ్: నాని కాంచనపల్లి – జయరాజ్ గేదెల
పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్)

Wanted to Die at That Moment: Actress Hema in Film Critics Association Meet the Press

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సోమవారంనాడు జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నటి హేమకు క్లీన్ చీట్ వచ్చింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నటి హేమ మాట్లాడుతూ…. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా మానసికంగా కలచివేశాయని చెప్పారు. “ఆ సమయంలో నేను చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

డ్రగ్స్ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించారు. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. “నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం” అని ఆమె పేర్కొన్నారు. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపారు. భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు మాట్లాడుతూ… మీడియా విషయంలో నటి హేమ ఆవేదనతో ఉన్నారు. తన మనసులోని మాటను పంచుకునేందుకు ఈరోజు ఫిలిం చేసిన మీట్ ది ప్రెస్ కు ఆహ్వానించాము. ఆమె అభిప్రాయాలను మీడియా ముఖంగా పంచుకునే వేదిక ఇది. హేమ చెబుతున్నట్టు, ఆమెనే కాదు, మేము జర్నలిస్టులం కూడా వివక్ష ఎదుర్కొన్నాం.” అని ఆయన అన్నారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ… చిత్ర పరిశ్రమతో మీడియా ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాల వల్ల కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. హేమ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకుంది. కాబట్టి ఈ విషయాన్ని గతంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఎవరైతే ఆమెపై బురద చల్లారో. తిరిగి ఆమెకు కోర్టులో ఊరట లభించినప్పుడు మీడియావారు ఎవ్వరూ కూడా ఆమెపై సానుకూలంగా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను చెప్పుకునేందుకు వచ్చారు.” అని అన్నారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ... నటి హేమ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అనేక పదవులు నిర్వహించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగితే వారికి ఎప్పుడూ కూడా ఆమె తన సపోర్టును ఇచ్చారు. ఎంతో ధైర్యంతో ప్రతీ విషయంలోనూ ముందుకు దూసుకుపోతారు. కొన్ని సందర్భాల్లో ఆమె ధైర్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. అంతటి ధైర్యం గల హేమగారు కూడా కొన్ని సందర్భాల్లో కుమిలిపోవలసి వచ్చింది. కొన్ని తప్పుడు వార్తల వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చి సంతోషంగా ఉన్నారు. అని అన్నారు. ఆ విషయాన్ని మన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వేదికగా తన ఆనందాన్ని.. ఆవేదనను పంచుకోవడానికి వచ్చారని అన్నారు.

ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలువురు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా హేమ తనపై వచ్చిన వివాదాలపై వివరణ ఇవ్వడంతో పాటు, తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.

Talented actor Legend Saravanan’s ‘Leader’ action trailer Release, Movie releasing on April 3

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “లీడర్”. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. “లీడర్” సినిమా ఏప్రిల్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికీ రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఈ సినిమా నుంచి యాక్షన్ ట్రైలర్ విడుదల చేశారు.

“లీడర్” మూవీ యాక్షన్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ట్రైన్ లో జరిగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ యాక్షన్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘ఈ ప్రపంచంలో ఏ సహాయం దేవుడు నేరుగా చేయడు, మనుషుల మూలంగానే అన్ని మంచి పనులు జరుగుతాయి, మనం వాళ్లనే నమ్మాలి…’ అనే డైలాగ్ కథానాయకుడి ఆలోచనను, దృక్ఫథాన్ని తెలియజేస్తుంది. ట్రైన్ లో, పోర్ట్ ఏరియాలో, ఫారెస్ట్ లో జరిగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలోని గ్రాండియర్ మేకింగ్ ను చూపిస్తున్నాయి. మెయిన్ క్యారెక్టర్స్, ఆ పాత్రల రియాక్షన్స్ ను గ్లింప్స్ లా చూపించారు. భారీ యాక్షన్ సీక్వెన్సులను ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేశారు హీరో లెజెండ్ శరవణన్. ట్రైలర్ చివరలో వచ్చిన తండ్రీ, కూతురు ఎమోషనల్ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంది. భారీ యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో “లీడర్” సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్ లో అలరించనున్నట్లు ఈ యాక్షన్ ట్రైలర్ తో తెలుస్తోంది.

నటీనటులు – పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య, అరంతంగి నిశా, ఐయాల్, జయమిశ్రా, పత్మాన్, యోగిరామ్, ఓక్ సుందర్, మహానది శంకర్, మరియమ్ జార్జ్, ఆదిత్య కతియార్, వేల్ అరుణాచలం, నిరంజన్, శోభన్ బాబు, అశోక్ పాండియన్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దీప్తి ఆర్.జి, పూర్తి ప్రవీణ్
ఆర్ట్ డైరెక్షన్ – జి.దురైరాజ్
స్టంట్స్ – మహేశ్ మాథ్యూ
ఎడిటింగ్ – ప్రదీప్ ఇ.రాఘవ్
సినిమాటోగ్రఫీ – ఎస్. వెంకటేష్
మ్యూజిక్ – జిబ్రాన్ వైభోద
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
స్టోరీ, డైరెక్షన్ – ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్