Home Blog Page 18

No industry like Tollywood, no audience like ours anywhere – Sharwanand at ‘Youth’ thanks meet

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ “యూత్”. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా “యూత్” మూవీకి తెలుగు ప్రేక్షకుల ఘన విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను చార్మింగ్ స్టార్ శర్వానంద్ అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు చిన్నా మాట్లాడుతూ – ఈ సినిమాలో కెన్ స్నేహితుడిగా నటించాను. నా రియల్ లైఫ్ లో కూడా కెన్ నాకు మంచి మిత్రుడు కావడం గర్వంగా ఉంది. ఈ సినిమాకు మా టీమ్ ఎంత ప్యాషన్ గా వర్క్ చేసిందో, సందీప్, వినీత్ కూడా అంతే ప్యాషన్ తో తెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్లు కూడా మా గ్యాంగ్ లో చేరారు అనుకుంటున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా హిట్ చేస్తామని తెలుగు ఆడియెన్స్ ప్రూవ్ చేశారు. మీరు ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ తో ఈ సినిమా చూసి ఉంటారు. ఈ సారి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూడండి. అన్నారు.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ – శర్వానంద్ అన్న తనకు మూవీ నచ్చితే గానీ గెస్ట్ గా వచ్చేందుకు ఒప్పుకోరు. ఆయనకు యూత్ మూవీ నచ్చింది. మమ్మల్ని అప్రిషియేట్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అలాగే వశిష్ట గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ధీరజ్ మొగిలినేని అన్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. మేము యూత్ మూవీని తక్కువ టైమ్ లో ప్రమోట్ చేసి రిలీజ్ చేశాం. అయినా ఆడియెన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. ఈవినింగ్ షోస్ నుంచి మూవీ పికప్ అవుతుంది అనుకుంటే మార్నింగ్ షోస్ నుంచే ప్రేక్షకులు బాగా థియేటర్స్ కు వెళ్తున్నారు. స్క్రీన్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. మా మార్కెటింగ్ సంస్థ పేరు హౌస్ ఫుల్. ఈ రోజు మేము ప్రొడ్యూస్ చేసిన సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించడం సంతోషంగా ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నచ్చే మేము ఈ మూవీ తెలుగులోకి తీసుకొచ్చాం. ఈ సినిమాను యూత్ తమ పేరెంట్స్ తో చూడాలి. అప్పుడే మా ప్రయత్నం విజయవంతమైందని అనుకుంటాం. తమ పేరెంట్స్ తో సినిమాకు వెళ్లే యూత్ ఫొటో తీసుకుని పంపిస్తే మొదటి 500 మందికి మేము టికెట్స్ ఇస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్ వినీత్ మాట్లాడుతూ – మా యూత్ మూవీకి శర్వానంద్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన రావడం వల్ల థియేటర్స్ కు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య పెరుగుతుంది. మేము డిజిటల్ మార్కెటింగ్ మొదలుపెట్టాక, ఫుల్ వర్క్స్ లో పడి మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోయేవాళ్లం. యూత్ సినిమా రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మళ్లీ టచ్ లోకి వచ్చారు. మన కాలేజ్ లో ఇలాగే జరిగింది కదా అని చెబుతున్నారు. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ గా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ – శర్వానంద్ గారి బైకర్ ట్రైలర్ మా అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మాపై ఆడియెన్స్ ఇంత లవ్ చూపిస్తారని అనుకోలేదు. థియేటర్స్ విజిట్ కు వెళ్లినప్పుడు ప్రేక్షకులు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం చూస్తుంటే సర్ ప్రైజింగ్ గా ఉంది. ప్రతి ఒక్కరు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ ప్రియాన్షి యాదవ్ మాట్లాడుతూ – మా కెరీర్ లో ఇదొక మర్చిపోలేను రోజు. ఈ సక్సెస్ కోసమే మేము మొదటి రోజు నుంచి ఎదురుచూస్తూ వచ్చాం. తెలుగు ఆడియెన్స్ మా మూవీ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీ ఆదరణ చూస్తుంటే మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తి కలుగుతోంది. అన్నారు.

హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ – శర్వానంద్ గారి బైకర్ మూవీ ట్రైలర్ బాగుంది. ఆ మూవీ రిలీజ్ కు ఇక్కడికి వచ్చి చూస్తాను. సందీప్, వినీత్ మా మూవీ కంటెంట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ముఖ్యమని మరోసారి ప్రూవ్ చేశారు. మాలాంటి కొత్త వాళ్ల సినిమాను కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీ మా దగ్గర సక్సెస్ కావడం సంతోషం, కానీ మరో రాష్ట్రంలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి సక్సెస్ కావడం ఇంకా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నేను ఈ సినిమాలో ప్రభాస్ గారి అభిమానిగా నటించాను. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మా మూవీని సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు ఫ్యామిలీతో కూడా మా మూవీని చూడండి. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – యూత్ సినిమాను థియేటర్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ వీకెండ్ కు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి. మేము ఆంధ్రలో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశాం. హౌస్ ఫుల్ సంస్థతో ఎన్నో చిత్రాలను ప్రమోట్ చేసిన సందీప్, వినీత్ ఈ చిత్రంతో నిర్మాతలకు మంచి ప్రయత్నం చేశారు. కెన్ అండ్ గ్యాంగ్ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ – బైకర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శర్వానంద్ గారు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. యూత్ సినిమా తమిళంలో ఈ నెల 19న రిలీజైంది. అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చినా మేము తెలుగు రిలీజ్ కోసం టెన్షన్ పడ్డాం. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆ టెన్షన్ మొత్తం పోయింది. కెన్ అండ్ గ్యాంగ్ తమ పర్ ఫార్మెన్స్ లతో అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. వీళ్లు మరో సినిమా త్వరగా చేసి ఆ మూవీ కూడా తెలుగు రిలీజ్ మాకే ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ – నేను చెన్నై వెళ్లినప్పుడు అక్కడ యూత్ మూవీ సూపర్ హిట్ అని తెలిసింది. తెలుగులో కూడా ఈ మూవీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. వశిష్ట ఈ ఈవెంట్ కోసం కాల్ చేశారు. మా హౌస్ ఫుల్ సందీప్, వినీత్, సతీష్ ఈ మూవీని తెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నా. నేను చేసిన అనేక మూవీస్ కు వారు ప్రమోషన్స్ చేశారు. ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ లాంటి గొప్ప ఇండస్ట్రీ, మనలాంటి గొప్ప ప్రేక్షకులు ఎక్కడా ఉండరు. మనం అన్ని భాషల మూవీస్ చూస్తాం, ఆదరిస్తాం. ఇతర భాషల హీరోలను తెచ్చుకుని ఇక్కడ మూవీస్ నిర్మిస్తున్నాం. మన ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ఈ సినిమాను ఒక 23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయాను. వాళ్లలో హానెస్టీ కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి మంచి మూవీ ఎలా చేశారో మీ దగ్గర నుంచే తెలుసుకుంటాను. నేను తమిళ మూవీస్ చేసినప్పుడు కూడా అక్కడ థియేటర్స్ లో ఇలాగే ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం చూశాను. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయండి. అన్నారు.

నటీనటులు – కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
స్క్రిప్ట్, డైరెక్షన్ – కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ – పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ – ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ – వికి
ఎడిటర్ – నాష్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ – కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
స్టంట్ – కలై కింగ్సన్
కొరియోగ్రఫీ – శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
సౌండ్ మిక్స్ – అర్వింద్ మీనన్
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పోస్టర్స్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Hero Rushya Datta’s comedy entertainer ‘Don Bosko’ first look Release & Shooting is complete

ఎమర్జింగ్ ప్రొడక్షన్ హౌస్ రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, విదేశాల్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసి త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న సంస్థ రాధాకృష్ణ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బోస్కో’ సినిమాను రూపొందిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి నిర్మాత.

యంగ్ హీరో రుష్య దత్త ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకంది. జైలర్, నా సామి రంగ సినిమాలతో గుర్తింపు పొందిన అందాల నటి మిర్నా మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శ‌నివారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రుష్య ద‌త్త‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ, ఒక చేతిలో కటానా లాంటి కత్తిని పట్టుకుని, మరో చేతితో కాలర్‌ను పైకెత్తుతూ బోల్డ్ పోజ్‌లో కనిపిస్తున్నారు

ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్) కోసం కూడా ఉంటాయి’ అనే క్యాప్షన్ మరింత ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్నా మీనన్ లెక్చరర్ సుమతి పాత్రలో కనిపించనుంది. మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క‌చ్చితంగా ఈ మూవీ మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా మెప్పించ‌నుంద‌నే హ‌మీ క‌లుగుతోంది.

శంక‌ర్ గౌరి రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తోన్న ఈ ఎంట‌ర్‌టైన‌ర్‌కు ఎదురోలు రాజు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌గా శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
రుష్య ద‌త్త‌, మిర్నా మీన‌న్‌, మౌనిక‌, ముర‌ళీ శ‌ర్మ‌, విష్ణు ఓయ్‌, రాజ్ కుమార్ కసిరెడ్డి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌: వెంక‌ట్ ఉప్పుటూరి
బ్యాన‌ర్‌: రాధాకృష్ణ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: పి.శంక‌ర్ గౌరి
మ్యూజిక్‌: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎదురోలు రాజు
ఎడిట‌ర్‌: వంశీ అట్లూరి
పి.ఆర్.ఒ: వ‌ంశీ కాకా

Mega Prince Varun Tej’s ‘Bhari’ Launched Grandly with Andhra Pradesh Deputy CM Pawan Kalyan Garu as Chief Guest

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. ‘నా ‘ముకుంద’ సినిమా తరువాత మళ్లీ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ‘బరి’ చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్‌గా అనిపిస్తుంది. మేం ఇద్దరం కలిసి ఇలా ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది కాదు. కానీ వంశీ తెచ్చిన స్క్రిప్ట్ మా ఇద్దరిని ఇలా కలిపింది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నేను కూడా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘మా నాన్న ఫ్యామిలీ మెంబర్లతో సినిమాలు తీశాడు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలుస్తుంది. మా అన్న వరుణ్‌తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతోన్నాం. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. ఈ మూవీ కచ్చితంగా చూడాలి.. కచ్చితంగా బాగుంటుంది అని ఆడియెన్స్‌కి అనిపించేలా చేయడమే నా లక్ష్యం. ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.

యదు వంశీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నా. వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ గారు మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథను నెరేట్ చేసి వరుణ్ గారు కావాలని అడిగాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక గారు అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వరుణ్ గారికి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. నిన్న రాత్రి నాకు వరుణ్ గారు ఫోన్ చేశారు. ఓ గెస్ట్ రాబోతోన్నారు అని నన్ను సర్ ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఈ రోజు ఆయన ఇలా వచ్చి మాలాంటి యంగ్ టీంని ప్రోత్సహించడం, మా వెనుక వరుణ్ గారు, నిహారిక వంటి వారు నిలబడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ‘బరి’లోని మ్యూజిక్ ఉంటుంది. వంశీ గారికి కూడా మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. ఈ చిత్రంలోనూ మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంది. చాలా అద్బుతమైన మ్యూజిక్ రాబోతోంది’ అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా మాట్లాడుతూ .. ‘‘బరి’ సినిమాలో నేనొక్కడినే సీనియర్ అనుకుంటా. మిగిలిన వారంతా యంగ్ టీం. నిహారిక గారు చాలా మంచి ప్రొడ్యూసర్. వరుణ్ గారితో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. వంశీ గారి స్టోరీ, ఆయన కాన్ఫిడెంట్ అద్భుతంగా ఉంది. వచ్చే సంక్రాంతికి ‘బరి’ పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.

నటీనటులు: వ‌రుణ్ తేజ్

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: య‌దు వంశీ
నిర్మాత‌:  నిహారిక కొణిదెల‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌మేష్ మ‌న్యం
సినిమాటోగ్ర‌ఫీ:  ధ‌నుష్ భాస్క‌ర్‌
మ్యూజిక్‌: అనుదీప్ దేవ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  చిన్నా
ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ
కాస్ట్యూమ్స్‌:  ఐశ్వ‌ర్య రాజీవ్‌
ఆర్ట్‌:  విష్ణు వ‌ర్ధ‌న్ పుల్ల‌
రైట‌ర్స్‌:  వెంక‌ట సుభాష్ చీరాల‌, ఉత్త‌మ్ లెక్క‌ల‌, విక్కీ మా, రంజిత్ మారెడ్డి
కో డైరెక్ట‌ర్‌: ర‌వి శంక‌ర్‌.డి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  బెక్కం ర‌వీంద‌ర్‌
స్టిల్స్‌:  వ‌ర‌హాల మూర్తి
పి.ఆర్‌.ఒ:  బియాండ్ మీడియా(సురేంద్ర కె.నాయుడు, ఫ‌ణి కందుకూరి)

1 Billion Views: ‘Spider-Man’: Brand New Day Becomes First Film Trailer to Hit Milestone!

Building on Spider-Man’s enduring global legacy, Brand New Day is already making history before it even hits theatres. The film’s trailer surpassed 1 billion views within days of its debut, an unprecedented milestone in cinematic history, underscoring the franchise’s unmatched worldwide fanbase and the extraordinary anticipation surrounding this new chapter.

For decades, Spider-Man has stood as one of the most beloved superheroes across generations, continuously evolving in storytelling, scale, and cultural resonance. Spider-Man: Brand New Day promises to honour that legacy while boldly charting new territory — and the world is already watching.

Directed by Destin Daniel Cretton, Tom Holland returns as Spider-Man alongside Zendaya, Jacob Batalon, Sadie Sink, Jon Bernthal, Mark Ruffalo, Michael Mando and Tramell Tillman in pivotal roles.

Produced by Sony Pictures Entertainment India, Spider-Man: Brand New Day swings into theatres on 31st July 2026 in English, Hindi, Tamil, Telugu, Kannada, and Malayalam across all premium formats.

Icon Star alluarjun’s birthday special ‘Race Gurram’ Movie Re-Release in theatres from April 8th

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన రేసుగుర్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ ట్రైలర్‌తో మళ్లీ ఆ పాత మాస్ ఫీల్‌ను ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మానందం తన కామెడీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

క్రౌన్ మూవీస్ ద్వారా ఏప్రిల్ 8, 2026న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చనుంది.

అల్లు అర్జున్ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్, థమన్ అందించిన సంగీతం అన్ని కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రకు అప్పట్లో వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

చిత్రం: రేసుగుర్రం

నటీనటులు: అల్లు అర్జున్, శృతి హాసన్, ‘కిక్’ శ్యామ్, సలోని, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రవి కిషన్, శామ్, తదితరులు…

దర్శకుడు: సురేందర్ రెడ్డి
సంగీత దర్శకుడు: ఎస్. థమన్
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
రీ-రిలీజ్: క్రౌన్ మూవీస్

Appreciation from critics is a bigger award than any trophy we’ve received: Producer Venu Udugula

తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్, ఖ‌మ్మం స‌రిహ‌ద్దు గ్రామాల్లో జ‌రిగిన నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్ రాజ్‌, తేజ‌స్వీ రావు జంట‌గా న‌టించారు. సాయిలు కంపాటి ద‌ర్శ‌కుడు. డా. నాగేశ్వ‌ర‌రావు పూజారి స‌మ‌ర్ప‌ణ‌లో ఈటీవీ విన్ ఒరిజిన‌ల్స్‌, డోలాముఖి స‌బాల్ట‌ర్న్‌ ఫిల్మ్స్‌, మాన్సూన్‌ టేల్స్ బ్యాన‌ర్‌ల‌పై ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌, రాహుల్ మోపిదేవి నిర్మించారు. 2025లో విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారాల్ని సొంతం చేసుకుంది. 2026 తెలంగాణ గ‌ద్ద‌ర్ అవార్డుల్లో ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, స్పెష‌ల్ జ్యూరీ, బెస్ట్ సింగ‌ర్ విభాగాల్లో నాలుగు అవార్డులు ద‌క్కాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ చిత్ర బృందంతో గురువారం సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌లో మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ గౌర‌వ అధ్య‌క్షులు జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు మాట్లాడుతూ.. సినిమా తీసిన‌న వాళ్లు మ‌గాళ్లు కాదు..సినిమాని రిలీజ్ చేసిన వాళ్లు మ‌గాళ్లు అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నెల‌కొంది. ఒక‌ప్పుడు సినిమా నిర్మాణం అనేది చాలా ఆరోగ్య‌క‌రంగా ఉండేది. సినిమా డిస్ట్రిబ్యూష‌న్, ఎగ్జిబిష‌న్ వ్య‌వ‌స్థ అనేది ప‌క్కాగా ఉండేది. కానీ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అనేది చాలా క‌ష్టంగా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలు రిలీజ్‌కు నోచుకోవ‌డం కానీ థియేట‌ర్ల‌ని ద‌క్కించుకోవ‌డం కానీ వారం రోజుల పాటు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డ‌టం కానీ చాలా గ‌గ‌న‌మైన ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాని తీసి అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విష‌యం. క‌థాంశం ప‌రంగా, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్‌ ప‌రంగా చూసుకున్న‌ట్ట‌యితే ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క‌రూ చాలా గొప్ప‌గా న‌టించారు. పాత్ర‌ల్లో ఒదిగిపోయి అత్యంత స‌హ‌జ‌త్వంతో న‌టించారు. తండ్రి ఆవేద‌న‌ని, ప్రేమికుల భ‌వోద్వేగాలిని చాలా స‌హ‌జ‌సిద్ధంగా తెర‌పై ఆవిష్క‌రించారు. అందుకే ఈ సినిమాకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మంగా భావించే గ‌ద్ద‌ర్ అవార్డుల్ని అందించ‌డం జ‌రిగింది. ఈ చిత్ర బృందం చేసిన తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రోత్స‌హిస్తూ ప్ర‌భుత్వం అవార్డుల్ని, రివార్డుల్ని అందించిన నేప‌థ్యంలో ఈ చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు, నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. నాకు మొద‌టి నుంచి కూడా ర‌చ‌యిత‌ల‌తో, క‌వుల‌తో, జ‌ర్న‌లిస్టుల‌తో చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉంది. దానికి కార‌ణం ఏంటంటే జ‌ర్న‌లిజం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ప‌దిహేడేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఓ ప‌క్ష‌ప‌త్రిక‌లో కాల‌మిస్ట్‌గా ఆర్టిక‌ల్స్ రాస్తూ ఉండేవాడిని. నేను డైరెక్ట‌ర్‌ని అయి ఉండ‌క‌పోతే జ‌ర్న‌లిస్ట్‌గా ఉండేవాడిని. ఎందుకంటే క్రిటిక్ అనిపించుకోవ‌డం అంటే నాకు చాలా ఇష్టం. కాల‌మిస్టుగా ప‌ని చేసిన‌ప్పుడు చాలా పుస్త‌కాల‌పై రివ్యూలు రాశాను. క్రిటిక్స్ సినిమాల‌ని ఇలా అభినందిస్తార‌ని నాకు తెలియ‌దు. ప్ర‌భు అన్న ఫోన్ చేసి ఇలా అభినంద‌న స‌భ ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మాకు ల‌భించిన అవార్డులు, ప్ర‌శంస‌ల‌కంటే క్రిటిక్స్ అభినందించ‌డం పెద్ద అవార్డుగా భావిస్తున్నాం. విమ‌ర్శ‌కులు ఎప్పుడూ కూడా ద‌ర్శ‌కుల దృక్కోణం నుంచి ఆలోచిస్తూ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అప్పుడే క‌థ యొక్క కోషం చ‌దివే వారికి అర్థ‌మ‌వుతుంది. ఇంత లోతుగా ద‌ర్శ‌కుడిని ప‌రిశీలిస్తున్న వారిలో విమ‌ర్శ‌కులు మొద‌టి స్థానంలో ఉంటారు. అలాంటి విమ‌ర్శ‌కులే ఈ రోజు మ‌మ్మ‌ల్ని పిలిచి అభినందించ‌డం మాకు చాలా సంతోషంగా ఉంది. మ‌రింత బాధ్య‌త‌తో మ‌రిన్ని మంచి సినిమాల‌ని నిర్మిస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను అన్నారు.

చిత్ర సమ‌ర్ప‌కులు నాగేశ్వ‌ర‌రావు పూజారి మాట్లాడుతూ.. మంచి మ‌న‌సుతో మంచి చిత్రానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ వారు అభినందించ‌డం చాలా మంచి విష‌యం. సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రు వారి వారి పాత్ర‌ల‌ని అద్భుతంగా నిర్వ‌ర్తించి మంచి చిత్రాన్ని అందించారు కాబ‌ట్టే నాలుగు గ‌ద్ద‌ర్ అవార్డులు వ‌చ్చాయి. మంచి చిత్రాన్నిఅందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ.. ప్ర‌తీ ఆర్ట్ ఫామ్‌కు విమ‌ర్శ అన్న‌ది లేక‌పోతే అది సామాజిక స్పృహ కోల్పోతుంది. ఆ స్పృహ‌ని ప్ర‌తిబింబించాల‌న్నా..అది న‌డ‌వాల‌న్నా..ఒక ఆర్ట్‌కి విలువ ఏర్ప‌డాల‌న్నా..అది విమ‌ర్శ‌కుల ద్వారానే సాధ్య‌మ‌వుతుంది. మాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇందులో న‌టించిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఈ మూవీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ ఆనందాన్ని మీలాంటి వారితో పంచుకోవ‌డం ఎంతో ఆనందించ‌ద‌గ్గ విష‌యం అన్నారు.

ద‌ర్శ‌కుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా నేను చూసిన జీవితాలు..అంటే ఇలాంటి క‌థ‌లు కూడా చెప్పొచ్చు అనిపించి రాసుకోవ‌డం మొద‌లు పెట్టిన‌. అంలాటిది ఇక్క‌డి దాకా వ‌స్తుంద‌ని నాకు తెలియ‌దు. సినిమా ఆడి ప్రొడ్యూస‌ర్‌కు డ‌బ్బులు వ‌స్తే చాలు అనుకున్నా. అవార్డ్స్ అన్న‌ది నాకు బోన‌స్‌. ఆడుతుందా లేదా అనుకున్నా. థ్యాక్స్ టు సినిమా. సినిమా అన్నీ ఇచ్చింది. సినిమా ఏదైనా చేయ‌గ‌ల‌దు. మీలాంటి మేము ఎంత బాగా తీసినా దాన్ని ప్రోత్స‌హించి పొగిడే వారు లేక‌పోతే వ్య‌ర్థ‌మే. మీలాంటి వాళ్లు మ‌మ్మ‌ల్ని ప్ర‌శంసిస్తే మ‌స్త్ అనిపిస్తుంది..మ‌జా వ‌స్తుంది. మ‌ళ్లీ మంచి సినిమాలు తీయాల‌ని మాకు ఎనర్జీనిచ్చిన మీకు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మొద‌లు పెట్ట‌డానికి కార‌ణం ముఖ్య వ్య‌క్తి వేణు ఊడుగుల అన్న‌. వేణు అన్న లేక‌పోతే నేను లేను. ఎందుకంటే వేణు అన్న నాకు మంచి అవ‌కాశం ఇచ్చాడు. ఆయ‌న స‌హ‌కారాన్ని మ‌ర్చిపోలేను. అలాగే ఈటీవీ విన్ నితిన్‌, సాయిగారు, బాపినీడు గారూ, నిర్మాత రాహుల్ చాలా స‌హ‌క‌రించారు. ఫాద‌ర్ క్యారెక్ట్ అనుకున్న‌ప్పుడు నాకు శివాజీ రాజా గారే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాను. నేను ఆయ‌న‌ని ముద్దుగా డాడీ అని పిలుస్తా. ఆయ‌న లేక‌పోతే ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌కు మ‌రొక‌రిని ఊహించుకోలేను అన్నారు.

న‌టుడు శివాజీ రాజా మాట్లాడుతూ..`ద‌ర్శ‌కుడిగా ముందు నుంచే ఈ సినిమాపై మంచి క్లారిటీ వుంది. త‌ను పేప‌ర్ మీదే సినిమా ఏంట‌న్న‌ది చూసేశాడు. సాయి కంపాటి చాలా పెద్ద ద‌ర్శ‌కుడు అవుతాడు. వేణు, సాయి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. గురుశిష్య‌లు అనుకోవ‌చ్చు..స్నేహితులు అనుకోవ‌చ్చు. అలాంటి ఇద్ద‌రు ల‌బించ‌డం ఇండ‌స్ట్రీ అదృష్టం. సినిమా హిట్ కాగానే నా క‌డుపు నిండిపోయింది. నా సినిమా హిట్ అయింది. గ‌ద్ద‌ర్ అవార్డులు రావ‌డంతో నా గుండె నిండిపోయింది` అన్నారు.

చైతూ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ.. నాకు వింత వింత‌గా కొత్త కొత్త‌గా అంతా అయోమ‌యంగా ఉంది. ఈ సినిమా స‌క్సెస్‌కు 70 శాతం కార‌ణం మీడియానే. ఎందుకంటే మీడియాకు న‌చ్చితేనే జ‌నాల‌కు న‌చ్చుతుంది. న‌టీన‌టులు పెర్ఫార్మెన్స్‌, మ్యూజిక్ గురించి బాగుంద‌ని అభినందించిన మీడియాకు థ్యాంక్స్‌. తొమ్మిది రోజుల్లో క్లైమాక్స్ తీశారు. ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ సాంగ్ లేదా.. కామెడీ సీన్ తీస్తారు కానీ డైరెక్ట‌ర్ రాము తీసిన ఫ‌స్ట్ సీన్ క్లైమాక్స్‌. అన్ని చాలా క‌ష్ట‌పెట్టిన వ్య‌క్తిని నేనే అన్నారు.

అనితా చౌద‌రి మాట్లాడుతూ.. ఈ ఘ‌న‌త అంతా రాజు వెడ్స్ రాంబాయి ప్రొడ్యూస‌ర్స్‌కి, న‌టీన‌టులు, టెక్నిక‌ల్ టీమ్‌కు ద‌క్కుతుంది. స్క్రిన్ మీది క‌నిపించిన వాళ్ల క‌న్నా స్క్రిన్ వెన‌క ప‌ని చేసిన వారి హార్డ్ వ‌ర్డ్ వంద రెట్లు ఎక్కువ పెట్టిన సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుంది? అనే డౌట్ ఉండేది. డైరెక్ట‌ర్ దీని గురించి ఆలోచిస్తూ క‌ళ్లు తిరిగిప‌డిపోయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఛ‌త్ర‌ప‌తి సినిమా చేశాక అలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌లేద‌నే భావ‌న ఉండేది. అది ఈ సినిమాతో తీరింది అన్నారు.

ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు బ‌త్తుల జేవీ ప్ర‌సాద్‌ మాట్లాడుతూ.. శివాజీ రాజా అన్న ఈ సినిమాలో ఏడిపించాడు. ఈ సినిమా తెలంగాణ సినిమా అంటున్నారు. ఇది తెలంగాణ సినిమా కాదు. ఇది అన్ని ప్రాంతాల్లో ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితాలివి. ఆ జీవితాల‌ను యాజిటీజ్‌గా చూపించారు. నేను స్వ‌త‌హాగా క‌థ‌కుడిని. నా మొద‌టి పుస్త‌కం స‌గిలేటి క‌థ‌లు. ఈ ప‌గిలేటి క‌థల్లో నేనోక‌థ రాశాను. మానంసం తిని చ‌చ్చిపోత‌నా? అనే క‌థ‌లోని సిమిలారిటీ ఇందులోని ఓ స‌న్నివేశంలో క‌నిపించింది. నేను రాయ‌ల‌సీమ వాడిని. నేను యుక్త‌వ‌య‌సులో ఏం చూశానో అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క ప‌ల్లెటూరి వ్య‌క్తి సొంతం చేసుకునే క‌థ ఇది. ప్రాంతాల‌కు, భాష‌ల‌కు, యాస‌ల‌కు అతీతంగా రూపొందిన అద్భుత‌మైన సినిమా ఇది. ఇందులో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రినీ అభినందిస్తున్నాను అన్నారు.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మ‌నం చూస్తున్న‌ప్పుడే క‌చ్చితంగా అవార్డు వస్తుంద‌ని ఊహిస్తాం. సినిమా చూస్తున్న‌ప్పుడే ఆ ప‌ల్స్ మ‌న‌కి తెలిసిపోతుంది. కొన్ని అవార్డు ద‌క్కించుకున్న‌వి క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడటం త‌క్కువ‌. కానీ ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ సాధించింది. ఈ సినిమాకు గ‌ద్ద‌ర్ ఈవార్డ్స్ వ‌చ్చిన సంద‌ర్భంగా కాక‌పోయినా ఫిల్మ్ క్రిటిక్స్ సార‌థ్యంలో అభినంద‌న స‌భ ఏర్పాటు చేయాల‌నుకున్నాం. ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేష‌న్ అభినందించిందంటే ఐఎస్ఐ స్టాంప్‌లా అప్ప‌ట్లో భావించే వారు. అప్ప‌ట్లో గుడిపూడి శ్రీ‌హ‌రి లాంటి పెద్ద పెద్ద వాళ్లు ఉండేవారు. వాళ్లు చేసిన క్యార్య‌క్ర‌మాలు చాలా చూసీ ఇప్పుడు ప్ర‌భుగారి ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రిగింది. మూడేళ్ల క్రితం బ‌ల‌గం సినిమాని ఈ అసోసియేష‌న్ ప్ర‌త్యేకంగా అభినందించ‌డం జ‌రిగింది. మూడేళ్ల త‌రువాత మ‌ళ్లీ రాజు వెడ్స్ రాంబాయి సినిమాని అభినందిస్తున్నాం. ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేష‌న్ ఎప్పుడూ మంచి చిత్రాల‌ని ప్రోత్స‌హిస్తూనే ఉంటుంది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫ‌ర్ వాజిద్ బేగ్‌, ఎడిట‌ర్ న‌రేష్ అడుప‌, అనితా చౌద‌రి, క‌విత శ్రీ‌రంగం, విక్ర‌మాదిత్య త‌దిత‌రులు పాల్గోన్నారు.

ప్ర‌శ్న – జ‌వాబు

ఈ క‌థ ద‌ర్శ‌కుడు చెప్పిన‌ప్పుడు మీకు న‌మ్మ‌కం క‌ల‌గ‌టానికి అందులో దోహ‌దం చేసిన అంశాలు ఏమిటీ?

వేణు ఊడుగుల‌- మొద‌ట నేను ప్రొడ‌క్ష‌న్ చేయాల‌ని అనుకోలేదు. భ‌విష్య‌త్తులో ప్రొడ్యూస్ చేయాల‌నే ఆలోచ‌న ఉండే కానీ ఇప్పుడే ప్రొడ్యూస‌ర్ కావాల‌నే ఆలోచ‌న నాకు లేదు. అదే టైమ్‌లో సాయిలు కంపాటి నా ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేయ‌డం కోసం వ‌స్తుండే వాడు. సురేష్ బొబ్బిలి అత‌న్ని నా ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. అత‌ను మాట్లాడుతుంటే, అత‌ను మాట్లాడే విధానంలో నాకు నిజాయితీ క‌నిపించింది. అత‌ను మాట్లాడ‌ట‌మే హృద‌యంతో మాట్లాడుతున్న‌ట్టుగా అనిపించింది. వీడెవ‌డో మ‌న‌లాడే ఉన్నాడే అనిపించింది. అప్పుడు అత‌న్ని ర‌మ్మ‌ని చెప్పాను. అప్పుడు త‌ను ఒక సంఘ‌ట‌న జ‌రిగింది అని చెప్పాడు. బాగుందే రానీ ఫ‌స్ట్ సినిమా రిస్క్ ఏమో ఒక‌సారి ఆలోచించు. నేనైతే నీకు క‌చ్చితంగా స‌హ‌యం చేస్తా. సినిమా మెటీరియ‌లైజ్ కావ‌డానికి నేను స‌హ‌యం చేస్తా. అయితే ఫ‌స్ట్ సినిమా రిస్క్ అవుత‌దేమో ఆలోచించు అన్నాను. తేద‌న్నా మీరు క‌థ విన్నండి.విన్న త‌రువాత చెప్పండి అన్నాడు. నెక్స్ట్ డే క‌థ చెప్పిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ని క‌థ‌గా విన్న‌ప్పుడు నాకు బాగా న‌చ్చింది. బాగా ఎట్రాక్ట్ అయిన‌. దీన్ని ప్రొడ్యూస్ చేస్తా అని మాటిచ్చిన. ఎందుకంటే డైరెక్ట‌ర్స్ రెండు ర‌కాలు. ఒక‌రు మైండ్‌తో చేస్తే మ‌రొక‌రు హార్ట్‌తో చేస్తారు. హార్ట్ ఇంట‌లిజెంట్స్ ఉంటారు. హార్ట్ ఇంటలిజెన్స్‌తో జ‌నాల్ని ఆక‌ట్టుకోగ‌లుగుతారు. హృద‌యాన్ని ట‌చ్ చేయ‌గ‌ల‌రు. రాము క‌థ‌ని రాసిన విధానంలో హార్ట్ ఇంట‌లిజెన్స్ న‌న్ను ఎట్రాక్ట్ చేసింది. వెంట‌నే నేను అప్పుడు ఈటీవీ విన్ వారికి నేను ఈ క‌థ‌ని పిక్ చేశాను. చెప్ప‌గానే వాళ్లు ఒప్పుకోవ‌డం కూడా అదృష్టం. వారు అంగీక‌రించ‌క‌పోతే నేను ఇంత త్వ‌ర‌గా ప్రొడ్యూస‌ర్‌ని అయ్యేవాడిని కాదు.వాళ్ల‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను.

చైత‌న్య గారు మిమ్మ‌ల్ని బ‌య‌ట చూసి స్క్రీన్‌పై చూస్తే షాకింగ్‌గా ఉంది. యాక్టింగ్‌లో ఏమైన ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్నారా?

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌- అలాంటిది ఏమీ లేదు. నాకు యాక్టింగ్ రాదు కాబ‌ట్టే నేచుర‌ల్‌గా న‌టించ‌గ‌లిగానేమో.

వేణు ఊడుగుల గారు నిర్మాత‌గా ఇలాగే కొన‌సాగుతారా? ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతూనే నిర్మాణం కూడా కంటిన్యూ చేస్తారా?

ఇంత‌కు ముందు పెట్టుబ‌డి క‌థ‌ల‌ని నిర్ణ‌యించేది. కానీ ఇప్పుడు క‌థ‌లే పెట్టుబ‌డిని నిర్ణ‌యించే సానుకూల‌మైన‌టువంటి వాతావ‌ర‌ణంలో ఇండ‌స్ట్రీ వుంది కాబ‌ట్టి ప్రొడ‌క్ష‌న్‌ని కొన‌సాగిస్తాను. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. అయితే డైరెక్ష‌న్ కే నా తొలి ప్రాధాన్య‌త‌.

చాలా మంది ద‌ర్శ‌కులు నిర్మాత‌లుగా బాధ్య‌త‌లు చేప‌ట్టాలంటే చాలా రిస్క్‌గా భావిస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా ఆ ఒక్క‌టి త‌ప్ప ఏదైనా చేస్తాను అంటున్నారు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లోకి రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు. అలాగే చాలా మంది ప్రొడ్యూస‌ర్లు డైరెక్ష‌న్ నా వ‌ల్ల కాదు అంటూ దూరంగా ఉంటున్నారు. మీ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణంలో మిమ్మ‌ల్ని ఏది డామినేట్ చేసింది? ఏది ఇష్టంగా అనిపించింది?

వేణు ఊడుగుల‌- డైరెక్ష‌న్ అనేది నా మెయిన్ ఎక్స్‌ప్రెష‌న్‌. నేను చెప్పాల‌నుకున్న క‌థ‌ల్ని నా డైరెక్ష‌న్‌లో చెప్పాల‌నుకుంటాను. నిర్మాణం అనేది డైరెక్ష‌న్ నుంచి నిర్మాణం వైపు షిఫ్ట్ అవ్వ‌డం కాదు. అదొక నా కెరీర్‌ ఎక్స్‌టెన్ష‌న్. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ల్లో రాహుల్ మోపిదేవి, నాగేశ్వ‌ర‌రావు పూజారి లాంటి వ్య‌క్తుల స‌పోర్ట్ నాకు ఉంది కాబ‌ట్టి కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

పూజారి నాగేశ్వ‌ర‌రావు గారు మీ ప్రొఫెష‌న్‌లో ఎంతో బిజీగా ఉన్న మీరు నిర్మాణ రంగం వైపు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటీ?

నాగేశ్వ‌ర‌రావు పూజారి – మంచి క‌థ. దీన్ని జ‌నాల‌కు చెప్పాల‌ని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందుకంటే సినిమాల‌తో స‌మాజంతో మార్పు తీసుకురావాల‌న్న‌దే నా ఉద్దేశ్యం. నేను నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడితే ఎవ‌రికీ అర్థం కాదు. నేను చెప్పే సందేశం చాలా మందికి రీచ్ కాదు. స‌మాజంలో మార్పు తేవ‌డానికి క‌ల అన్న‌ది ప్ర‌ధాన కార‌ణం కాబ‌ట్టి మంచి క‌థ‌ల‌ని జ‌నాల‌కు అందించాల‌నే ఉద్దేశ్యంతోనే నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించ‌డం జ‌రిగింది.

శివాజీరాజాగారూ ఎన్నో పాత్ర‌లు ఆల్ రెడీ మీరు చేసి ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్లు చేశారు. ఈ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ఈ మూవీ గెట‌ప్ చూపించిన‌ప్పుడు నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఈ క్యారెక్ట‌ర్ చేసిన‌ప్పుడు మిమ్మ‌ల్ని మ‌రో మెట్టు ఎక్కిస్తుంద‌నే భావ‌న మీకు క‌లిగే ఉంటుంది. ఈ సినిమా విష‌యంలో మీకు ల‌భించిన మ‌ర్చిపోలేని మెమొర‌బుల్ ఇన్సిడెంట్స్ గురించి ఏమైనా చెబుతారా?

శివాజీ రాజా – ఈ సినిమానే ఓ మెమొర‌బుల్ ఇన్సిడెంట్‌. ఇన్ని సినిమాలు చేసినా కూడా తెలంగాణ‌లో మారుమూల గ్రామాల‌కు వెళ్లి చేయ‌డం అనేది చాలా త‌క్కువ‌. నాకు క‌ష్టం అనిపించింది. డైరెక్ట‌ర్ రాము చిన్న చిన్న వాటిని కూడా ప‌ట్టుకోవ‌డం క‌ష్టం అనిపించింది. పైకి అలా ఉంటాడు కానీ ఒక్క సారి షాట్ రెడీ అన‌గానే ప్ర‌తి చిన్న విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తాడు. అత‌నితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొన్ని సీన్‌ల‌లో డ‌బ్బింగ్‌లో స‌రి చేసుకున్నాను.

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌.. హీరోగా మీ సోద‌రుడు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ ఎంత పేరు తెచ్చుకున్నారో ఈ ఒక్క క్యారెక్ట‌ర్‌తో మీరు అంత పేరు తెచ్చుకున్నారు. న‌న్ను ఈ ఒక్క క్యారెక్ట‌ర్‌తో మింగేశావ‌ని అన్నారా?

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌- ఈ స్థాయికి రావ‌డానికి నేను ఎనిమిదేళ్లు క‌ష్ట‌ప‌డ్డాను. నువ్వు వ‌చ్చిన మూడేళ్ల‌కే ఇంత పేరొచ్చింది. అవార్డు కూడా ఇచ్చారు.

అవార్డులు వ‌స్తాయ‌ని ఊమించారా?

చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌- లేదండీ అస్స‌లు ఊహించ‌లేదు. అవార్డులు ప్ర‌క‌టించిన రోజు వ‌రుసగా ఫోన్‌లు వ‌స్తున్నాయి. వేణు ఊడుగుల అన్న ఏమో ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఏమైంది అంటే ఒక‌సారి న్యూస్‌లో ఏమొస్తుందో చూసుకో అన్నాడు. న్యూస్ చూసి షాక్ అయ్యాను.

నాగేశ్వ‌ర‌రావు పూజారి గారు మీరు బిజీయెస్ట్ లాయ‌ర్. అలాంటి మీరు ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్‌లోకి రావాల‌నే మీ ఆలోచ‌నకు స్ఫూర్తి ఏమీటి?

మ‌నిషికీ సినిమాకు అవినాభావ సంబంధం ఏందంటే ఊపిరి. సినిమా అనేది ఊపిరి. ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా కూడా జ‌సినిమా అనేది జ‌నాల‌ని ప్ర‌భావితం చేస్తుంది కాబ‌ట్టి ఆ జ‌నాల‌లో మార్పుని చూడ‌టానికి సినిమా ద్వారా ఆ మార్పుని తీసుకురావాల‌నే ఉద్దేశ్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను.

తొలి సినిమాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించారు కాదా.. మీ ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతోంది? ప‌్రొడ్యూస‌ర్‌గా కొన‌సాగుతారా?

నాగేశ్వ‌ర‌రావు పూజారి- ఖ‌చ్చితంగా. ఫ‌స్ట్ నేను మా వేణు ఊడుగుల అన్న‌కు అభినంద‌న‌లు చెప్పాలి. ఎందుకంటే తొలి సినిమాతోనే థియేట‌ర్లో పేరు ప‌డిబ్లాక్ బ‌స్ట‌ర్ అయి గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వ‌చ్చాయి కాబ‌ట్టి చాలా సంతోషంగా ఉన్నాను. దీని త‌రువాత మా ప్రొడ‌క్ష‌న్‌లో కంటిన్యూగా మా వేణు అన్న స‌హ‌కారంతో సినిమాలు చేస్తాం. ప్ర‌స్తుతం మూడు నాలుగు సినిమాలు ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి.

రాహుల్ మోపిదేవి…మీరు యంగ్ ప్రొడ్యూస‌ర్‌. మీ పేరు చెప్ప‌గానే పెద్దాయ‌న అనుకున్నాం. మీరు చూస్తే చాలా యంగ్ గా ఉన్నారు. మీ మొద‌టి సినిమాకే ఇలాంటి అప్లాజ్ రావ‌డంఎలా అనిపించింది? గ‌తంలో ఏదైనా అనుభ‌వం ఉందా?

గ‌తంలో ఒక‌టి రెండు సినిమాలు చేసిన అనుభ‌వం ఉంది. అయితే ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా మాత్రం ఇదే ఫ‌స్ట్ మూవీ. చాలా నేర్చుకున్నాను.

Director Manasa Sharma Interview about ‘Rakasa’ Movie

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక కొణిదెల త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

మీ నేపథ్యం గురించి చెప్పండి?
మానస శర్మ : మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన ‘రాకాస’ చాలా కొత్తగా ఉండబోతుంది.

‘రాకాస’లో ప్రధాన అంశం ఏంటి?
మానస శర్మ : ‘రాకాస’ని ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. ఇప్పటికే అందరూ మా టీజర్‌ని చూసి ఉంటారు. త్వరలోనే ట్రైలర్ రానుంది. అప్పుడు మా సినిమా గురించి ఇంకా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. కామెడీని ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ మూవీని తీశాం.

సంగీత్ శోభన్ ఈ కథలోకి ఎలా వచ్చారు?
మానస శర్మ : ‘రాకాస’ కథని ముందుగా నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత్ వచ్చారు. సంగీత్ అద్భుతమైన నటుడు. మంచి వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం.

‘రాకాస’ చిత్రీకరణలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
మానస శర్మ : వెబ్ సిరీస్‌కి, సినిమాకి ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ ఒకేలా ఉంటుంది.. రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు. ఈ సినిమా అవుట్ పుట్ నిహారిక గారికి నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. ఈ కథని పదిహేను నిమిషాలు నెరేట్ చేసిన తరువాత నిహారిక గారికి చాలా కాన్పిడెంట్ వచ్చేసి ఓకే చెప్పారు.

నయన్ సారిక గురించి చెప్పండి?
మానస శర్మ : నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పని చేసి ఉన్నాను. ఆమె టాలెంట్, యాక్టింగ్ చూసే ఈ చిత్రంలోకి తీసుకున్నాం. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు.

బడ్జెట్ పెరిగిందని అంటున్నారు? దాని గురించి చెప్పండి?
మానస శర్మ : ముందు నుంచీ మేం బడ్జెట్‌లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం.

‘రాకాస’లో కొత్తగా ఏం ఉండబోతోంది?
మానస శర్మ : ‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.

వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా ఆలస్యం కాలేదా?
మానస శర్మ : ‘రాకాస’ సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది.

అనుదీప్ గారి మ్యూజిక్ గురించి చెప్పండి?
మానస శర్మ : నిహారిక గారు అనుదీప్ గారిని సజెస్ట్ చేశారు. అనుదీప్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే టీజర్‌కు ఆయన ఇచ్చిన ఆర్ఆర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రధాన బలం.

నిర్మాత నిహారిక గారి గురించి చెప్పండి?
మానస శర్మ : నిహారిక గారితో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక గారు మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు.

ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
మానస శర్మ : ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా,ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. ‘రాకాస’ తరువాత వాటి గురించి చెబుతాను.

HRITHIK ROSHAN & RYAN GOSLING CONNECT ACROSS CONTINENTS FOR AN EXCLUSIVE PROJECT ‘HAIL MARY’ CONVERSATION

In a landmark moment for the first time, Indian superstar Hrithik Roshan and Hollywood actor Ryan Gosling have come together for an exclusive virtual conversation — a meeting of two icons united by their shared passion for space, science, and the power of storytelling.

The conversation builds on the extraordinary global momentum sparked by Hrithik Roshan’s association with Project Hail Mary , following a collaboration video that captivated audiences worldwide. This newly unveiled exchange stands as one of the most exciting cross-cultural collaborations of the decade. Bringing together two of the world’s most influential stars, the conversation offers fans a rare and candid glimpse into their creative worlds.

At the heart of their discussion was the film itself, with both stars reflecting on what makes Project Hail Mary a singular cinematic experience, and what it means to bring this story to Indian audiences. The conversation took a nostalgic turn as the duo drew compelling parallels between the film and Hrithik’s beloved Koi… Mil Gaya — exploring how science fiction, at its best, transcends borders through emotional truth and universal wonder.

Watch the full video here – (Link)
1. Instagram: https://www.instagram.com/reel/DWQjT8YD4aH/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
2. Facebook: https://www.facebook.com/reel/1613873766558593/
3. YouTube: https://youtu.be/9sPVHAOMT54
Beyond the film, the exchange was marked by mutual admiration, with both stars acknowledging each other’s work and hinting at the possibility of future collaborations—leaving fans with much to look forward to.

Directed by the acclaimed filmmaking duo Phil Lord and Christopher Miller, Project Hail Mary follows Ryland Grace, played by Ryan Gosling, a lone astronaut who wakes up aboard a mysterious spacecraft with no memory of who he is or the mission that brought him there.

The film also features a stellar supporting cast, including Sandra Hüller, Lionel Boyce, Ken Leung, and Milana Vayntrub.

Presented by Amazon MGM Studios and distributed by Sony Pictures Releasing International, Project Hail Mary releases in Indian cinemas on 26 March 2026, in English, Hindi, Tamil, and Telugu, across IMAX®️ and other premium large formats

Hero Krishna Bharath’s ‘Barbarikudu'(Son of Ghatotkacha) New Movie opening held grandly

పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్ లపై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మాతలుగా శివఝాన్సీరేగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బర్బరీకుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బర్బరీకుడు చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోని ఒక యోధుడి కథతో ఈ చిత్రం తెరక్కబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్త శిష్యుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అలాగే పాటల రచయితగా పనిచేసిన శివఝాన్సిరేగాల ఈ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు భారతీయ అతిపెద్ద ఇతిహాసం మహాభారతంలోని ఒక యోధుడి కథను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయంలో దర్శకుడు తో పాటు నిర్మాతల అభిరుచిని కూడా అభినందించాల్సిందే. సినిమా అంటే అభిమానం, ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి కథలను నిర్మించరు. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు టి. మల్లేశ్వవరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ లు ఆదిలోనే విజయం సాధించారు. తాము రూపొందిస్తున్న బర్బరీకుడు చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి బర్బరీకుడు చరిత్ర గురించి తక్కువగా తెలుసని.. ఈ చిత్రంతో ఆయన ఎంతటి గొప్పయోధుడో అందరికీ తెలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేసిన రామ్ లక్ష్మణ్ ల శిష్యుడు, స్టంట్ మాస్టర్ బద్రి మాస్టర్ అల్లుడు అయినా కృష్ణ భారత ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అయనతో పాటు అద్భుతమైన వాయిస్ తో ఒప్పించి, తెరపై విలనుగా మెప్పించిన రవిశంకర్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఆయనతోపాటు సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి తదితరులు నటిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు మంచి సినిమాటోగ్రఫీను అందించిన శ్యామ్ కే నాయుడు ఈ చిత్రానికి డిఓపిగా పనిచేస్తున్నారు. అలాగే ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ జి.ఎం సతీష్, వీరితోపాటు ఇటీవల సూపర్ హిట్ పాటలను ఇచ్చిన భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తామని మేకర్స్ తెలిపారు.

నటీనటులు: కృష్ణ భారత, రవిశంకర్, సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి తదితరులు

దర్శకత్వం: శివఝాన్సిరేగాల
బ్యానర్: పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్
నిర్మాత: టి. మల్లేశ్వవరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : అనిల్ రెడ్డి
సంగీత దర్శకుడు: జీఎమ్ సతీష్
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
లిరిసిస్ట్ : మద్దెల నారాయణ, శివఝాన్సిరేగాల
స్టంట్స్ : రామ్-లక్ష్మణ్
కొరియోగ్రాఫర్: భాను మాస్టర్
పీఆర్ఓ: హరీష్

Youth will be a big success in Telugu just like in Tamil – Hero Sree Vishnu at the pre-release event

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ “యూత్”. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న “యూత్” మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో “యూత్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరోయిన్ మీనాక్షి దినేష్ మాట్లాడుతూ – “యూత్” మూవీ తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. కథను నమ్మి, కష్టపడి మేమంతా ఈ సినిమాకు వర్క్ చేశాం. ఈ చిత్రం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది, ఇన్స్ పైర్ చేస్తుంది. మీ లైఫ్ లోని కూల్ మూవ్ మెంట్స్, మీ లవ్, స్ట్రగుల్స్, ఫ్రెండ్షిప్ అన్నీ ఈ సినిమాతో రిలేట్ చేసుకుంటారు. “యూత్” మీ మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది. అన్నారు.

హీరోయిన్ ప్రియాన్షి యాదవ్ మాట్లాడుతూ – మీ అందరి సమక్షంలో మా మూవీ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. తమిళంలో మా సినిమాకు దక్కిన విజయమే తెలుగులోనూ ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా ప్రతి ఆడియెన్ ను ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

హీరోయిన్ అనిష్మ అనిల్ కుమార్ మాట్లాడుతూ – నేను కేరళ నుంచి వచ్చాను. మా దగ్గర తెలుగు మూవీస్ ను బాగా ఇష్టపడతారు. కేరళలో అల్లు అర్జున్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ నెల 26న యూత్ మూవీ రిలీజ్ అవుతోంది. థియేటర్స్ లో చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ – “యూత్” సినిమాలో నేను ఒక పాట పాడాను. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ లో నేనూ పార్ట్ కావడం సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ ఈవెంట్ చూస్తుంటే ప్రీ రిలీజ్ లా కాదు యూత్ ఫెస్ట్ లా ఎనర్జిటిక్ గా ఉంది. అన్నారు.

డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ – మనం చూసిన ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల వెనక వినీత్, సందీప్ ఉన్నారు, వారి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి. యూత్ సినిమాతో వీళ్లకు ప్రొడ్యూసర్స్ గా మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమాలో ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మనందరికీ నచ్చే ఒక మంచి ఎమోషన్ ఉంది. అన్నారు.

లిరిక్ రైటర్ సనరే మాట్లాడుతూ – యూత్ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ఈ సినిమాకు యూత్ అనే టైటిల్ పెట్టడంతోనే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా లైఫ్ లో యువత ముందుకు అడుగేయడం ఆపకూడదు. ఇలాంటి మంచి విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. అన్నారు.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ – టాలీవుడ్ లో ఎంతోమంది మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ వేదిక మీద నిలబడ్డాం. యూత్ సినిమా ఆల్రెడీ తమిళంలో పెద్ద సక్సెస్ సాధించింది. 4 రోజుల్లో 30 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది. బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. తెలుగులో కూడా అలాంటి సక్సెస్ దక్కుతుందనే ఆశిస్తున్నాం. దీన్ని ఒక తెలుగు స్ట్రైట్ సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. వినీత్ ఈ వర్క్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఇంజినీరింగ్ టు సినిమా అని ఈ2సీ బ్యానర్ పేరు ఎప్పుడు పెట్టుకున్నామో గానీ మాకు పరీక్షలు రాసినట్లే ఉంది. మంచి మార్కులతో ఈ నెల 26న పాస్ అవుతామని నమ్ముతున్నాం. యూత్, లవర్స్ మాత్రమే కాదు పేరెంట్స్ తో కూడా కలిసి చూడాల్సిన చిత్రమిది. అన్నారు.

ప్రొడ్యూసర్ వినీత్ మాట్లాడుతూ – యూత్ సినిమాను ఒక్కరే చూస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో థియేటర్స్ కు వెళ్తే మరింత ఎంజాయ్ చేస్తారు. అందుకే మేము ప్రమోషన్స్ లో మీ గ్యాంగ్ తో సినిమాకు వెళ్లండని చెబుతున్నాం. గ్యాంగ్ అంటే ఏజ్ లిమిట్ ఏదీ లేదు. ఎవరైనా కలిసి వెళ్లొచ్చు. తమిళంలో అలాగే గ్యాంగ్స్ గ్యాంగ్స్ గా వెళ్లి సినిమాను చూస్తున్నారు. ఈ నెల 26న తెలుగులోనూ అలాగే థియేటర్స్ కు వెళ్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ – ఉగాదికి తమిళంలో రిలీజైన యూత్ సినిమా మంచి విజయం సాధించింది. శ్రీరామనవమికి తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆ సక్సెస్ ను రిపీట్ చేయబోతోంది. ఫ్రెండ్స్ తో పాటు పేరెంట్స్, ఫ్యామిలీతో కూడా మా మూవీని చూడండి. అన్నారు.

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ – యూత్ మూవీకి కెన్ అండ్ గ్యాంగ్ అని క్రెడిట్ ఇవ్వడం బాగుంది. తమిళంలో ఈ మూవీ హిట్ అయ్యింది. ఏ భాషలో మంచి కంటెంట్ ఉన్నా మన తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సందీప్, వినీత్ ఒక హిట్ మూవీని తీసుకుని బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ – సందీప్, వినీత్ ఈ సినిమా తీసుకున్నారని తెలిసి, అన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటన్నారని కనుక్కున్నా. వాళ్లకు సాయి రాజేశ్, శ్రీ విష్ణు, వశిష్ట ..ఇలా అందరూ సపోర్ట్ గా నిలిచారు. చాలా కష్టపడి ఈ సినిమాను పర్పెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు సందీప్, వినీత్. కెన్ అండ్ గ్యాంగ్ అని పెట్టుకోవడంలో ఒక టీమ్ స్పిరిట్ ఉంది. అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – మా బేబి మూవీని ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లడంలో సందీప్, వినీత్ కీలక పాత్ర పోషించారు. రాత్రీ పగలు మాతో కూర్చుని డిస్కషన్స్ చేస్తుండేవారు. వాళ్లు ఫస్ట్ టైమ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే నాకు ఫస్ట్ భయమేసింది. కానీ తమిళంలో వస్తున్న హిట్ టాక్, కలెక్షన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఈ సినిమాను హిట్ చేస్తారు. ఇందాక వశిష్ట అన్నట్లు కనెక్ట్ అయితే ఇది మరో లిటిల్ హార్ట్స్ అవుతుంది. ధనుష్, ప్రదీప్ రంగనాథన్ ను ఆదరించినట్లే కెన్ ను కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

యాక్టర్ సూరజ్ వెంజరముడు మాట్లాడుతూ – యూత్ సినిమా యూత్ కు బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత నచ్చుతుంది. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్, డ్యాన్స్, కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. తెలుగు ఆడియెన్స్ ప్రతి సినిమాను పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు సెలబ్రేట్ చేసుకునేందుకు మరో కొత్త మూవీ యూత్ మీ ముందుకు వస్తోంది. అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ – యూత్ సినిమాను తమిళంలో హిట్ చేశారు. తమిళం కంటే తెలుగులో ప్రేక్షకులు మరింత పెద్ద హిట్ చేయాలి. మా సందీప్, వినీత్ కు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మీరు మీ ఫ్రెండ్స్, లవర్ తో పాటు ఫ్యామిలీ తో ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరో, డైరెక్టర్ కెన్ మాట్లాడుతూ – నేను సార్ మూవీలో ఒక చిన్న రోల్ చేశాను. హీరోగా, దర్శకుడిగా యూత్ నా ఫస్ట్ మూవీ. కొత్త వాళ్లం కదా ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ తమిళంలో మంచి విజయాన్ని అందించారు. తెలుగు ఆడియెన్స్ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారని సార్ మూవీ టైమ్ లో చూశాను. వాళ్లకు భాషతో పనిలేదు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తప్పకుండా ఆదరిస్తారు. ఇటీవల కార్తీ, సూర్య గారిని కలిశాను. తెలుగులో మూవీ రిలీజ్ చేస్తున్నామని వారితో చెబితే, తమిళంలో ఎలాంటి సక్సెస్ వచ్చిందో, తెలుగులోనూ సేమ్ సక్సెస్ అందుకుంటావని చెప్పారు. తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంత లవ్ చేస్తారో సూర్య, కార్తీ గారు చెప్పారు. రఘువరన్ బీటెక్ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రతి ఆడియెన్ మా మూవీని కూడా ఎంజాయ్ చేస్తారు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ లా మా టీమ్ ను కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ – సందీప్, వినీత్ యూత్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. డబ్బింగ్, సాంగ్స్ పాడించడం, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఎన్నో సినిమాల ఎఫర్ట్స్ ఈ ఒక్క చిత్రానికే పెట్టారు. వీళ్లిద్దరికీ సినిమా అంటే పిచ్చి. ప్రతి వారం వీళ్లు ప్రమోట్ చేసే చిత్రాలు రిలీజ్ కు వస్తుంటాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గా మన ముందుకు వస్తున్నారు. ఇకపై మనకు వీళ్లు రెగ్యులర్ గా కనిపించాలి. తమిళంలో లాగే తెలుగులోనూ యూత్ హిట్ కావాలి. సందీప్, వినీత్ కు మంచి సక్సెస్ అందించాలని కోరుకుంటున్నా. ఈ నెల 26న యూత్ సినిమాను థియేటర్స్ లో చూడండి. కెన్ అండ్ గ్యాంగ్ చేసిన సూపర్బ్ పర్ ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – నా సింగిల్ మూవీ సినిమాకు తమిళ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చేస్తున్న టైమ్ లో కెన్ ను చూశాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఇప్పుడు హీరోగా మారి యూత్ తో మన ముందుకు వస్తున్నాడు. తమిళంలో యూత్ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. తెలుగులో కూడా మీకు అలాంటి సక్సెస్ రావాలి. సందీప్, వినీత్ వల్లే నేను నా మూవీస్ కు డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేసుకోగలిగాను. ఇంజినీరింగ్ నుంచి సినిమాకు వచ్చిన యూత్ వీళ్లిద్దరు. ఈ సినిమాకు చాలా క్వాలిటీగా తెలుగు డబ్బింగ్ కోసం స్క్రిప్ట్ చేయించుకున్నారు, అలాగే డబ్బింగ్, సాంగ్స్ క్వాలిటీగా చేసుకున్నారు. నెల రోజుల్లోపే ప్రమోషన్స్ సహా అన్ని వర్క్స్ పూర్తి చేసి సినిమాను రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడండి. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఈ నెల 26న యూత్ మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
స్క్రిప్ట్, డైరెక్షన్ – కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ – పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ – ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ – వికి
ఎడిటర్ – నాష్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ – కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
స్టంట్ – కలై కింగ్సన్
కొరియోగ్రఫీ – శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
సౌండ్ మిక్స్ – అర్వింద్ మీనన్
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పోస్టర్స్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)