Home Blog Page 19

‘Turum Khan lu’ Movie is creating a stir in Aha OTT.. Once you start, you will keep laughing.

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెలంగాణ యాస, భాష నేపథ్యంలో విలేజ్ నేటివీటితో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తురుమ్ ఖాన్ లు. ఈ సినిమా గురించి తెలిసిన ప్రేక్షకులు ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా తురుమ్ ఖాన్ లు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కామెడీ బిట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలతో ఆధ్యాంతం అలరించేలా సాగే ఈ చిత్రం ఇన్నాళ్లు ఎక్కడ ఉందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు అంటే… ఈ చిత్రం వారి హృదయాలకు ఎంతలా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటికైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

కథ విషయానికి వస్తే..
తుపాకుల గూడెం అనే గ్రామంలో శంకర్‌ (నిమ్మల శ్రీరామ్‌)యూత్‌ లీడర్‌. కరోనా సమయంలో మరదలు లలిత(ఐశ్వర్య ఉల్లింగాల)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఊర్లో లాక్‌డౌన్‌ విధించడంతో పెళ్లి ఆగిపోతుంది. అయితే తన పెళ్లి ఆగడానికి కారణం విరాజ్‌ బ్రహ్మా(దేవరాజ్‌ పాలమూర్‌). దీంతో బ్రహ్మాపై పగ పెంచుకుంటాడు శంకర్‌. మరోవైపు బ్రహ్మకు అన్ని ఉన్నా.. ఇంకా పెళ్లి కాదు. ఇక లాక్‌డౌన్‌లో ఊరికి వచ్చిన బ్రహ్మా.. భారతి(పులి సీతా) తో ఎఫైర్‌ పెట్టుకోవాలనుకుంటాడు. మరోవైపు శంకర్‌ స్నేహితుడు విష్ణు(అవినాష్‌ చౌదరి) మనస్పర్థాల కారణంగా దూరం అయిన తన ప్రేయసి పద్మను కలిసేందుకు ప్రయత్నిస్తుంటాడు. విష్ణు-పద్మలు విడిపోవాడానికి కారణం ఏంటి? శంకర్‌ పెళ్లిని బ్రహ్మా ఎలా, ఎందుకు ఆపాడు? బ్రహ్మాం, భారతీల ఎఫైర్‌ ఎక్కడకు దారి తీసింది? శంకర్‌, విష్ణు కలిసి బ్రహ్మాను ఏం చేశారు? చివరకు ఈ ముగ్గురి ప్రేమ కథలకు ఎలాంటి ముగింపు పడింది అనేదే తురుమ్ ఖాన్ లు.

సినిమా ఓట్ లైనే ఇంత కామెడీగా ఉందంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. థియేటర్ లలో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎక్కువమందికి రీచ్ కాలేదు. యాక్టర్స్ కొంత వారే కావడంతో రీచ్ తగ్గిందేమో కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న తీరు ఇండస్ట్రీనే ఆశ్చర్యపరుస్తుంది. సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఎన్‌ శివ కల్యాణ్‌ కు మంచి మార్కులే పడుతున్నాయి. పల్లెల్లో ఉండే ఒరిజినల్ కామెడీని అందరికీ కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు దర్శకుడు. అలాగే అందరూ టెక్నిషన్స్, యాక్టర్లు కూడా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా దేవరాజ్ పాలమూర్ చేసే కామెడీ బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన డైలాగ్ మాడ్యూలేషన్ విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది.

మొత్తం తురుమ్ ఖాన్ సినిమా విషయంలో నిర్మాతకే ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారు. అందరి కొంతవారితో ఇలాంటి సినిమా నిర్మించిన నిర్మాత ఎండీ అసిఫ్‌ జానీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మంచి సినిమా కచ్చితంగా నిలబడుతుందనే నమ్మకంతో ఎండీ అసిఫ్‌ జానీ ఇన్నాళ్లు సరైన ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూశారు. ఇప్పుడు ఆహా వేదికగా స్ట్రీమింగ్ కావడం, సినిమాకు మిలియన్ల వ్యూస్ తో పాటు, సూపర్ హిట్ టాక్ రావడంతో నిర్మాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని, పరిశ్రమలో కొత్తవారిని ప్రోత్సహించాలనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు. తురుమ్ ఖాన్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలో మరో అద్భతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

చిత్రం: తురుమ్‌ ఖాన్‌లు
నటీనటులు:నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
నిర్మాత: ఎండీ అసిఫ్‌ జానీ
బ్యానర్ : స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సహా-నిర్మాత : కే. కళ్యాణ్ రావు
రచన-దర్శకత్వం: ఎన్‌ శివ కల్యాణ్‌
సంగీతం: వినోద్‌ యాజమాన్య, అఖిలేష్‌ గోగు రియాన్‌
సినిమాటోగ్రఫీ: అంబటి చరణ్‌
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ప్రొడక్షన్ డిజైనర్: రజనీకాంత్
పీఆర్ఓ: హరీష్

Star heroine Samantha released the song “Idi Prema” song from Harshith Reddy’s film “Deewana.”

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. “దీవాన” సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అనంతరం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

కొరియోగ్రాఫర్ కృష్ణ మాట్లాడుతూ – నేను చాలా రియాల్టీ షోస్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేశాను. ఈ చిత్రంలో కొరియోగ్రఫీ చేసే అవకాశం మా డైరెక్టర్ శ్రీకాంత్ కల్పించారు. కొత్త టాలెంట్ కు అవకాశం ఇస్తున్న ఈ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో పాటలన్నీ ఛాట్ బస్టర్స్ అవుతాయి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ – నేను రెహమాన్ గారి మ్యూజిక్ స్కూల్ లో చదివాను. ఇది నా ఫస్ట్ మూవీ. ఈ సినిమాకు దీవానా దీవానీ అంటే మా ప్రొడ్యూసర్స్. చాలా ఫ్రీడమ్ ఇచ్చి పాటలకు ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. మా డైరెక్టర్ నాతో సాంగ్స్ మాత్రమే కాదు లిరిక్స్ కూడా రాయించుకున్నారు. యాక్టర్స్ తో డైలాగ్స్ రాయించారు. అందరితో అన్ని వర్క్స్ వర్సటైల్ గా చేయించుకున్నారు. సినిమా అంటే అందరం పనిచేయాలి అంటుంటాడు మా డైరెక్టర్. దీవాన మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ – నందినీరెడ్డి నేను ప్రొడ్యూసర్ కావాలని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే అల్లు అరవింద్ గారు, విద్య అక్కకు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు నాకు ఎంతో సపోర్ట్ అందించారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ శ్రీకాంత్ ఫస్ట్ ప్రొడ్యూసర్ వాసుదేవ్ కు కథ చెప్పాడు. ఆ ఎగ్జైట్ మెంట్ ను మా అందరికీ ఇచ్చారు. శ్రీకాంత్ ఎంతో ప్రతిభావంతంగా మూవీని రూపొందించాడు. హర్షిత్, స్మేహ తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. ఈశ్వర్ చంద్ మ్యూజిక్ మా మూవీకి ఆకర్షణగా నిలుస్తుంది. మా ఫస్ట్ సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – మేము కొద్దికాలంగా సినిమా ప్రొడక్షన్ లోకి రావాలనుకుంటున్నా, ధైర్యం చాలక ఆగిపోయాం. కానీ డైరెక్టర్ శ్రీకాంత్ ఈ కథ చెప్పినప్పుడు ఎందుకో చాలా ధైర్యంగా అనిపించింది. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో మూవీకి ఏం కావాలో అవన్నీ సమకూరేవి. సినిమానే తనకు కావాల్సినవన్నీ తీసుకుంటోంది అనుకునేవాళ్లం. దీవాన ఈ కథ విన్నప్పుడు ఇది ప్రతి తెలుగు అబ్బాయి ఎమోషన్, మీ, నా ఎమోషన్ అనిపించింది. అలాగే ప్రతి తెలుగు అబ్బాయి పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్స్ లో దీవాన చిత్రంతో మొము మీ అందరికీ ఒక బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నాం. అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ – దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగా చూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. మా దైవం అరవింద్ గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. మీ ఫేవరేట్ మూవీ ఏదంటే మీకు వసంతకోకిల, తొలి ప్రేమ, 7జి బృందావన్ కాలనీ వంటి మూవీస్ వెంటనే గుర్తొస్తాయి. ఇప్పుడున్న యూత్ ఫ్యూచర్ లో దీవాన మూవీని గుర్తుతెచ్చుకుంటారు. అలాంటి బ్యూటిఫుల్ మూవీ ఇది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని మన లైఫ్ లా చూపించాలి. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ – ఫస్ట్ ఫిలిం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. చెప్పాలంటే ఇది మీ తొలి ప్రేమ. ఫస్ట్ లవ్ కు ఫస్ట్ సినిమాకు పెద్ద తేడా ఉండదు. మీ ప్రేమంతా ఈ సినిమాలో కనిపించింది. ఈ టీజర్ ఎన్నోసార్లు చూశాను, కానీ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మళ్లీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇది జెన్యూన్ రియాక్షన్. నేను రాజా వారు రాణిగారు చూసినప్పుడు రవికిరణ్ తో పరిచయం కూడా లేదు. కానీ నేను ఆ సినిమా గురించి సోషల్ మీడియా పోస్ట్స్ చేశాను. ఆ మూవీ నాకు బాగా నచ్చింది. దర్శకుడిలో సిన్సియారిటీ చూశా. అలాగే వెంకీ తొలి ప్రేమ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది. సినిమా పట్ల ప్రేమ ప్రతి ఫ్రేమ్ లోనూ చూశా. ఆ ప్యాషన్ ఉండబట్టే వాళ్లు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. రేపు మీరు కూడా కొత్త దర్శకులకు ఇన్సిపిరేషన్ కావాలి. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ లో హానెస్టీ చూశాను. హర్షిత్, స్మేహా ఇద్దరూ టాలెంటెడ్ యాక్టర్స్. ఈ మూవీ పై నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది.

హీరోయిన్ స్మేహ మణిమేగలై మాట్లాడుతూ – దీవాన మీ మనసుల్ని తాకే ప్రేమ కథ. ఈ చిత్రంలో నేను అమ్ము అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇలాంటి సందర్భం కోసం కలగన్నాను. ఈ వేదిక మీద నిల్చుని మాట్లాడటం నమ్మలేకపోతున్నా. దీవాన మూవీని థియేటర్స్ లో చూడండి. మీరంతా మా మూవీని లవ్ చేస్తారు.

హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ – మన లైఫ్ లో ఇదొక్కటి సక్సెస్ అయితే మన జీవితం మారిపోతుంది, జనాలు మనల్ని చూసే విధానం మారిపోతుంది అనిపిస్తుంటుంది కదా. నా జీవితంలో అలాంటి సందర్భం ఈ సినిమా. దీవానతో నా లైఫ్ మారుతుందని నమ్ముతున్నాను. దీవాన మూవీ కథ విన్న ఎగ్జైట్ మెంట్ ఇంకా నాలో ఏమాత్రం తగ్గలేదు. ఈ కథ విన్న తర్వాత వారం రోజుల దాకా అదే ఆలోచనలో ఉండిపోయాను. నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది. అన్నారు.

డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ – దీవాన మూవీ కంటెంట్ చాలా బాగుంది. ఇది ప్రేమ సాంగ్ వినగానే ఆకట్టుకుంది. హర్షిత్, స్మేహ బాగా పర్ ఫార్మ్ చేశారు. హర్షిత్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. ఇటీవల సూర్య సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్ లోకి చిరుతపులి వచ్చింది. అది యూనిట్ లో నేను తప్ప ఎవరూ చూడలేదు. కానీ నేను ఎవరికీ చెప్పకుండా షూటింగ్ చేశాను. అది రీసెంట్ గా నా లైఫ్ లో దీవాన మూవ్ మెంట్ గా చెప్పుకోవచ్చు. అన్నారు.

డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ – సినిమాల పరిస్థితి బాగా లేదు. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు అని అంటుంటారు. అది నేను పరిశ్రమలోకి వచ్చినప్పుడు చెప్పారు, ఇప్పుడు చెబుతున్నారు. కానీ కొత్త ఫిలింమేకర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. దీవాన సాంగ్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఇదొక సెలబ్రేషన్ లా అనిపిస్తోంది. ఇదే సెలబ్రేషన్ థియేటర్స్ లోనూ జరగాలి. గతంలో మనం సినిమాలను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఆ సెలబ్రేషన్స్ ను ఈ సినిమా మరోసారి థియేటర్స్ లోకి తీసుకురావాలి. వీళ్లంతా మరో కొత్త టీమ్ కు హోప్ ఇవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై

టెక్నికల్ టీమ్
—————-
కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి

‘Band Melam’ pre-release event held grandly, Movie Releasing on March 26

‘కోర్ట్’తో బ్లాక్ బస్టర్ పెయిర్‌గా నిలిచిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, సెన్సేషనల్ డైరెక్టర్స్ వివి వినాయక్, బాబీ, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ఆస్కార్ గ్రహీత చంద్రబోస్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌‌లో..

*కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ ఈవెంట్‌కి పెద్దలందరూ ఎన్నో ఆశీస్సులు ఇచ్చారు. అవన్నీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ‘స్వాగ్’ మూవీలో రోషన్ నా కొడుకుగా చేశాడు. టాలెంట్ ఉన్న రోషన్ పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పా. ఈ మూడేళ్లలోనే ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘కోర్ట్’లో శ్రీదేవీ చక్కగా నటించారు. ఈ కాకినాడ అమ్మాయికి మరిన్ని మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. డైరెక్టర్ సతీష్‌కి ఆల్ ది బెస్ట్. ‘బ్యాండ్ మేళం’ క్లైమాక్స్ గురించి అందరూ చెబుతున్నారు. ఈ మూవీని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోన గారికి సినిమా అంటే ప్రాణం, పిచ్చి. ఆయనకు సినిమాలే ప్రాణం. ఆయనలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఆయన ఇంకా ఇలాంటి మంచి చిత్రాల్ని తీస్తూ, ఎంతో మంది కొత్త ఆర్టిస్టుల్ని, దర్శకుల్ని పరిచయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ* .. ‘కోన వెంకట్ గారి సినిమా అంటే అది మా సినిమానే. ఆయనకు కథల పట్ల మంచి అభిరుచి ఉంటుంది. కోన గారు ఈ మూవీ కోసం విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. అన్ని ఊర్లలో ఆయనే కనిపిస్తున్నారు. నేను కోన గారితో కలిసి ‘అదుర్స్’కి పని చేశాను. నేను, కోన గారు ఎప్పుడూ సింక్‌లో ఉంటాం. టీజర్ చూసిన తరువాత రోషన్ చాలా పెద్ద హీరో అవుతాడని నాకు అనిపించింది. సురేష్ బాబు ఓ మూవీని చూసి అద్భుతంగా విశ్లేషిస్తుంటారు. ఈ సినిమాని చూసి సురేష్ బాబు గారు కూడా రోషన్‌ను మెచ్చుకున్నారు. శ్రీదేవీ జర్నీ ఎంతో మందికి స్పూర్తి. మార్చి 26న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. కోన గారి కాంపౌండ్‌లో పడటం సతీష్ అదృష్టం. విజయ్ ఎప్పుడూ మంచి ఆల్బమ్స్, మ్యూజిక్ ఇస్తారు. మొదటి సారిగా కోన గారు తన కూతుర్ల పేరు మీదుగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ* .. ‘కోన గారు నాకు ఈ మూవీని చూపించారు. సతీష్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. రోషన్, శ్రీదేవీ చక్కగా నటించారు. ఫ్రెండ్స్ గ్రూపులోని వారు చాలా నవ్వించారు. ‘బ్యాండ్ మేళం’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

*స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘కోన వెంకట్ గారు ఎవ్వరూ ఏ సాయం అడిగినా వెంటనే చేసేస్తారు. అలాంటి మంచి మనిషి ఆధ్వర్యంలో తీసిన ‘బ్యాండ్ మేళం’ బాగానే వచ్చి ఉంటుందని భావిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మార్చి 26 నుంచి అందరి గుండెల్లో ‘బ్యాండ్ మేళం’ సౌండ్ మోగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’లో రోషన్ చేసిన చాలా సీన్స్ నాకు నచ్చాయి. ఈ మూవీ మంచి విజయం సాధించాలి. శ్రీదేవీకి మంచి పేరు రావాలి. దర్శకుడు సతీష్‌కు పెద్ద సక్సెస్ రావాలి. కోన వెంకట్ గారు ఎవ్వరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా అందరికీ సాయం చేస్తుంటారు. కోన గారు మొదటి సారిగా ‘సాంబ’ సినిమాకి ఫుల్ లెంగ్త్ డైలాగ్స్ రాశారు. ఆయనతో ఉంటే టైం అన్నదే తెలీదు. నాకు ‘అదుర్స్’ లాంటి మంచి కథను ఇచ్చిన కోన గారికి ఎప్పుడూ విజయాలే దక్కాలి. ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ* .. ‘కోన వెంకట్ గారు ఎంతో మంది దర్శకుల్ని, ఆర్టిస్టుల్ని ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు. కోన వెంకట్ గారు తనకున్న ప్రాపర్టీలను అమ్మి ‘బ్యాండ్ మేళం’ని తీశారు. ఆయనకు సినిమాలంటే అంత పిచ్చి, ప్యాషన్, ప్రాణం. హర్ష్ రోషన్ చాలా కష్టపడుతున్నాడు. రోషన్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. ‘బ్యాండ్ మేళం’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*నిర్మాత, రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ కోసం వచ్చిన వినాయక్, బాబీ ఇలా ప్రతీ ఒక్కరూ నేను సంపాదించుకున్న ప్రాపర్టీనే. ‘బ్యాండ్ మేళం’తో నేను సతీష్ జవ్వాజిని సంపాదించుకున్నాను. హరీష్, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, సతీష్ జవ్వాజి కథలు చెప్పినప్పుడు వారిలోని ప్యాషన్ చూసి అవకాశం ఇచ్చాను. సతీష్ గారు చెప్పిన కథ విన్న తరువాత రోషన్, శ్రీదేవీ అయితేనే పర్ ఫెక్ట్‌గా ఉంటారని అనుకున్నాను. ‘కోర్ట్’తో ఆ ఇద్దరూ తమ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘బ్యాండ్ మేళం’ నా కోసం చూడండి. నచ్చకపోతే ఇంకో సారి నేను రాసిన సినిమాని చూడకండి. ఇక ఫ్యూచర్‌లో రోషన్, శ్రీదేవిలను వెతుక్కుంటూ కథలు వస్తుంటాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, శివ ముప్పరాజు, నా కజిన్ రాజశేఖర్ ఇలా అందరూ సినిమాకి పిల్లర్‌లుగా నిలిచారు. నా కూతుర్లైన కావ్య, శ్రావ్యలకి సినిమాల పట్ల ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నిర్మాతగా నా పేరు కాకుండా వాళ్ల పేర్లు పెట్టాను. హిస్టరీ ఛేంజ్ అవుతుందని వాళ్ల పేర్లు పెట్టాను. ఈ మూవీ క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది. ప్రేక్షకులకు ఈ చిత్రం జీవితాంతం గుర్తుంటుంది’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ లాంటి మంచి సినిమాని నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. రీ రీకార్డింగ్ బాగా వచ్చింది. ఫన్‌తో పాటుగా మంచి ఎమోషన్ ఉంటుంది. రోషన్, శ్రీదేవీ చక్కగా నటించారు. అందరూ తప్పకుండా మా సినిమాని చూడండి’ అని అన్నారు.

*డైరెక్టర్ సతీష్ జవ్వాజి మాట్లాడుతూ* .. ‘నేను అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో ఏడ్చాను. కానీ మా ‘బ్యాండ్ మేళం’ ప్రీమియర్ చూసిన తరువాత అందరూ ఏడ్చారు. బెక్కెం వేణుగోపాల్ గారి వల్లే నేను కోన గారి వద్దకు వెళ్లాను. అలా ఈ మూవీ మొదలైంది. చంద్రబోస్ గారు రాసిన పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. కాసర్ల శ్యామ్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ బుల్గానిన్ ఆర్ఆర్ విని అందరూ ఏడ్చేశారు. క్లైమాక్స్ చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. ఆ టైంలో నేను కచ్చితంగా ఆడియెన్స్‌కి గుర్తుకు వస్తాను. ఈ మూవీని చూసిన వెంటనే సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించారు. శ్రీరామ నవమి రోజు మా సినిమా వస్తుంది. అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

*హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ లాంటి మంచి సినిమాను మాకు ఇచ్చిన కోన వెంకట్ గారికి థాంక్స్. ‘కోర్ట్’ టైంలో నాని అన్న ఉన్నాడనే ధైర్యం ఉండేది. ‘బ్యాండ్ మేళం’ కథకి కోన వెంకట్ గారు ఉండటంతో ధైర్యం వచ్చింది. మా ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 26న మా ‘బ్యాండ్ మేళం’ రాబోతోంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ యాదగిరి మీ అందరినీ నవ్విస్తాడు,ఏడ్పిస్తాడు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

*హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ* .. ‘‘కోర్ట్’కి ముందు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. కానీ జగదీష్ గారు నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. ఆ టైంలో నాని గారు, దీప్తి అక్క మాకు అండగా నిలిచారు. ‘కోర్ట్’ తరువాత ఏం చేయాలా? అని అనుకుంటున్న టైంలో బెక్కెం వేణుగోపాల్ గారు కాల్ చేశారు. కోన వెంకట్ గారు నాకు ఈ కథను వినిపించారు. సతీష్ గారు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. ఈ మూవీలోని పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. యాదగిరి, రాజమ్మ పాత్రలు అందరికీ నచ్చుతాయి. మార్చి 26న మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

*నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ* .. ‘నా పేరు శ్రావ్య. కోన వెంకట్ గారి కూతురిని. ‘బ్యాండ్ మేళం’ మూవీ చాలా బాగా వచ్చింది. అందరితో కలిసి మార్చి 26న ‘బ్యాండ్ మేళం’ వీక్షించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*‘కోర్ట్’ నిర్మాత దీప్తి మాట్లాడుతూ* .. ‘‘కోర్ట్’తో రోషన్, శ్రీదేవీ, విజయ్ బుల్గానిన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ‘బ్యాండ్ మేళం’ కూడా మా సినిమానే అన్నట్టుగా ఉంది. ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. విజయ్ తన మ్యూజిక్‌తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తాడు. కోన గారి సినిమా అంటే అది కచ్చితంగా హిట్టే. ‘బ్యాండ్ మేళం’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

*‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ కూడా నా సినిమానే అన్నట్టుగా ఉంది. మా చందు (రోషన్), జాబిలి (శ్రీదేవి) మళ్లీ ‘బ్యాండ్ మేళం’తో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ ఇద్దరూ అద్భుతమైన యాక్టర్స్. ఈ ఇద్దరితో ఇలాంటి మంచి సినిమాని తీసిన కోన వెంకట్ గారికి థాంక్స్. ‘బ్యాండ్ మేళం’ మార్చి 26న మోత మోగిపోవాలి’ అని అన్నారు.

Superstar Hrithik Roshan for ‘Project Hail Mary’ – Released on March 26

In one of the most exciting collaborations of Global Cinema, Indian Superstar Hrithik Roshan has collaborated with the team of Project Hail Mary to introduce the film to the Indian audience.

The video showcases an endearing crossover between India’s OG sci-fi duo Hrithik and Jaadu from Koi… Mil Gaya along with the alien Rocky from Project Hail Mary .

The video features the alien Rocky learning the iconic hookstep of ‘Ek Pal Ka Jeena’ from Hrithik Roshan. This budding intergalactic friendship receives a strong reaction from Hrithik’s OG alien friend ‘Jaadu’ from Koi…Mil Gaya .

The Bollywood x Hollywood crossover aims to capitalise on the popularity and nostalgia for Hrithik & Jaadu’s much-loved onscreen friendship to promote the Hollywood film Project Hail Mary to the Indian masses.

Project Hail Mary is based on the bestselling novel by Andy Weir (author of The Martian ). Roshan, earlier in December 2025, publicly declared his love for the book on social media, making this collaboration a seamless blend of Star power & genuine appreciation for content, along with a cinematic crossover of two human-alien friendship films – Hrithik’s Koi…Mil Gaya and Ryan Gosling’s Project Hail Mary .

Speaking about the association, Shony Panjikaran, General Manager and Head, Sony Pictures Releasing International, India says, “ Project Hail Mary is the kind of ambitious, big-screen storytelling that audiences in India truly embrace. We’re thrilled to have Hrithik Roshan champion the film in India. His passion for the story and his powerful connection with audiences make him the perfect ambassador to help bring this extraordinary adventure to moviegoers across the country.”

Directed by the acclaimed filmmaking duo Phil Lord and Christopher Miller, Project Hail Mary follows Ryland Grace, played by Ryan Gosling, a lone astronaut who wakes up aboard a mysterious spacecraft with no memory of who he is or the mission that brought him there.

The film also features a stellar supporting cast, including Sandra Hüller, Lionel Boyce, Ken Leung, and Milana Vayntrub.

Presented by Amazon MGM Studios and distributed by Sony Pictures Releasing International, Project Hail Mary will release in Indian cinemas on 26 March 2026, in English, Hindi, Tamil, and Telugu, across IMAX® and other premium large formats

”Thimmarajupalli TV” Promises an Engaging Village-Based Suspense Drama – Grand Reveal Event Held Grandly

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు తేజ విహాన్ మాట్లాడుతూ – ఇలా కొత్త వాళ్లతో మూవీ చేసి వాళ్లను ప్రోత్సహించాలనేది కిరణ్ అన్న కల. ఆయన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా రిలీజ్ ముందే కొత్త వాళ్లతో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారు. కిరణ్ అన్న ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ కాని టైమ్ అది. కొత్త వాళ్లతో సినిమా చేసే గుండె ధైర్యం ఆయనలో ఉంది. ఇండస్ట్రీలో కిరణ్ అన్న సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశారు. తను నిలబడి తనతో పాటు మరికొంతమందిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాలో టీవీ కుమార్ గా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నా. అన్నారు.

నటుడు అనిల్ మాట్లాడుతూ – “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంలో వరదరాజులు అనే క్యారెక్టర్ చేశాను. ఇది నెగిటివ్ గా ఉండే పాత్ర. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ కు, కిరణ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటి రాధశ్రీ మాట్లాడుతూ – మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఏప్రిల్ 17న మీ ముందుకు వస్తోంది. తప్పకుండా చూడండి. ఈ చిత్రంలో రోజా అనే పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.

నటి స్వాతి కరిమిరెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను ఎల్లమ్మ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మా మూవీలో వర్క్ చేసిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే. మా మూవీ థియేటర్స్ లో చూసి మా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు లతీష్ మాట్లాడుతూ – “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ టీమ్ లోని వారికి ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నా. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ సినిమాలో నేను సిద్ధయ్య పాత్రలో నటించాను. కిరణ్ అన్నకు మా టీమ్ అంతా రుణపడి ఉంటాం. అన్నారు.

గీత రచయిత సనరే మాట్లాడుతూ – ఈ చిత్రంలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. కిరణ్ అన్న నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మన చుట్టూ నెగిటివిటీ ఉన్నా, మనల్ని నిరుత్సాహపరిచేలా వాళ్లు ఉన్నా సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతోంది. కిరణ్ అన్న, మునిరాజా వంటి వాళ్లు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఈ వేదిక మీద ఉన్నాను. ఈ మూవీలో పాటలు అన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. కిరణ్ అన్న ఈ చిత్రంతో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – ఇప్పటిదాకా మేము ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాతో తిరిగి ఇస్తున్నాం. కిరణ్ అన్న మేము చాలాసార్లు గర్వపడేలా చేశారు. ఇది అన్నిటికంటే ఎక్కువ గర్వపడే సందర్భం. డైరెక్టర్ మునిరాజు చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. అతనికి అలాంటి ప్యాషనేట్ టీమ్ దొరికింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీరంతా మూవీ గురించి మాట్లాడకుంటారు. సినిమా చూస్తూ ఒక పాతికేళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతికి లోనవుతారు. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేఎల్ మదన్ మాట్లాడుతూ – కిరణ్ అన్నతో చాలాకాలంగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ, క సినిమాలకు వర్క్ చేశాను. మరోసారి ఈ చిత్రంతో ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ టీమ్ అంతా షూటింగ్ కోసం ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ కు వెళ్లి వచ్చాక కాలేజ్ కు వెళ్లి తిరిగొచ్చినట్లు అనిపించేది. అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ – మా మూవీకి వర్క్ చేసినవాళ్లంతా బాగా టాలెంట్ ఉన్నవాళ్లు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. ఈ సినిమా క్వాలిటీ, ఔట్ పుట్ చూశాక గర్వంగా అనిపించింది. అన్నారు.

డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ – కిరణ్ అన్న మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా విజువల్స్ క్వాలిటీగా వచ్చేందుకు కావాల్సినవన్నీ సమకూర్చారు. మూవీలోని కాస్ట్ అండ్ క్రూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఏప్రిల్ 17న థియేటర్స్ లో మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన మాట్లాడుతూ – మా డైరెక్టర్ మునిరాజు ఇచ్చిన క్రియేటివ్ ఫ్రీడమ్ వల్లే ఈ చిత్రంలోని పాటలు ఇంత బాగా వచ్చాయి. సనరే మంచి సాహిత్యాన్ని అందించారు. కిరణ్ అన్న తనకు తానుగా ఎదిగి, ఇప్పుడు తనలా స్ట్రగుల్ పడుతున్న మరో 50, 60 మందికి అండగా నిలబడ్డారు, అవకాశం కల్పించారు. ఇలా చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచించగలరు. కిరణ్ అన్నకు రుణపడి ఉంటాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే టైమ్ లో వందా నూటయాభై సార్లు ఈ సినిమా చూశాను. ఎప్పుడు చూసినా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. రేపు థియేటర్స్ లో మీకూ ఇదే ఫీల్ కలుగుతుంది. అన్నారు.

నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ – నేను థియేటర్ ఆర్టిస్ట్ ను. చాలా ఆడిషన్స్ ఇస్తుంటా. ఈ సినిమాకు ఆడిషన్ చేసినప్పుడు కూడా అవకాశం వస్తుందా అనిపించేది. కానీ ఆడిషన్ టైమ్ లోనే నా క్యారెక్టర్ కు ఎలా నటించాలో డైరెక్టర్ మునిరాజు గారు క్లారిటీగా చెప్పేవారు. ఇప్పటికి కూడా ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. కిరణ్ అన్న బాగుంటే మాలాంటి ఎంతోమంది కొత్త వాళ్లు బాగుంటారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా చూస్తుంటే మీకు ఇంటి భోజనం చేస్తున్న ఫీల్ కలుగుతుంది. అన్నారు.

హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ – ఈ సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ కు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఒక గిఫ్ట్ లాగ దొరికారు. మా అందరికీ ఈ సినిమా ఒక బహుమతి. తెరపై కనిపించాలనే మా అందరి కలను నెరవేర్చిన చిత్రమిది. నేను థియేటర్ ఆర్టిస్టును. మేము చేసిన ఒక నాటకం చూసి డైరెక్టర్ మునిరాజు గారు ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు. ఆయన ఎంతో క్లారిటీగా మూవీని తెరకెక్కించారు. కిరణ్ గారు మా లాంటి యంగ్ టాలెంట్ అందరికీ అవకాశం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఆయన బాగుంటే మా లాంటి వాళ్లంతా బాగుంటారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు రహస్య గారు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. మా అందరి బాగోగులు చూసుకున్నారు. రహస్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – నాపై నమ్మకం ఉంచి “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. ఆయన గురించి ఏం చెప్పాలి, ఒక అన్న గురించి, తండ్రి గురించి మనం బయటకు చెప్పుకోం, మనసులోనే దాచుకుంటాం. కిరణ్ అన్న నాకు అలాంటి వారు. రితికేష్ గోరక్ అన్న, రహస్య గారు, కిరణ్ అన్న…ఈ ముగ్గురి వల్లే ఈ ప్రాజెక్ట్ రూపొందింది. మనం ఎంతమంచి కథ రాసినా, అది పర్ ఫార్మ్ చేసే ఆర్టిస్టులు కావాలి. ఒక నాటకం చూసి ఈ కాస్టింగ్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్లంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఈ మూవీ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఎంటర్ టైన్ మెంట్, సస్పెన్స్ తో పాటు ఎమోషన్ కు గురవుతారు. “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రపంచం మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ – ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతుంటే మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని మా ఫ్రెండ్స్ అడిగేవారు. ఏప్రిల్ 17న మీ అందరి ముందుకు వస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు ఆ తిమ్మరాజుపల్లిలోనే ఉంటారు. ఎంటర్ టైన్ అవుతారు. ఈ చిత్రంలో సతీష్ అనే క్యారెక్టర్ చేశాను. కిరణ్ అన్న చేసిన సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. లాక్ డౌన్ టైమ్ లో ఒకరోజు కిరణ్ అన్న ఏం కావాలనుకుంటున్నావ్ అని నన్ను అడిగారు. హీరో కావాలనేది నా డ్రీమ్ అని చెప్పాను. సరే టైమ్ వచ్చినప్పుడు చేద్దువు అన్నారు. ఆయన అప్పుడు ఇచ్చిన మాట నా జీవితంలో మర్చిపోలేను. ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక ఆడిషన్ ఇవ్వు అని చెప్పారు. వెళ్లి మునిరాజు గారికి ఆడిషన్ ఇచ్చాను. ఆయన హీరో క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేశారు. ఈ మూవ్ మెంట్ నా జీవితాంతం సెలబ్రేట్ చేసుకుంటాను. అన్నారు.

చిత్ర నిర్మాత, హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మునిరాజు మా మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవాడు. అతను చేసిన ఎడిటింగ్ చూస్తుంటే ఆకట్టుకునేలా ఉండేది. ఇండస్ట్రీలో నీ గోల్ ఏంటి అని అడిగాను. డైరెక్టర్ కావాలని ఉందని చెప్పాడు. ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నాను. అప్పటికి డబ్బులు లేవు, సినిమా చేస్తానో లేదో తెలియదు. మనం సెటిలైనరోజు వీలైనంత కొత్త వాళ్లకు సపోర్ట్ చేద్దామనే హోప్ ఉండేది. నా చిన్నప్పుడు మా ఊరిలో ఒకే టీవీ ఉండేది. ఊరి వాళ్లంతా ఆ ఇంటికి వెళ్లి టీవీ చూసేవారు. అలాంటి సంఘటన ముని వాళ్ల ఊరిలో ఒకటి జరిగింది. శివరాత్రి పండక్కి మూడు రోజులు టీవీ అద్దెకు తీసుకొచ్చి ఊరి వాళ్లంతా కలిసి సినిమాలు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నారట. ఈ కథంతా 95 సంవత్సరంలో జరుగుతుంది. ఈ కథ చెప్పినప్పుడే ముని క్లియర్ గా చెప్పాడు. సార్ నేను ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్ మూవీ చేయాలనుకోవడం లేదు. మా ఊరిలో నేను చూసిన మనుషులు ఇన్నోసెన్స్, వాళ్ల మధ్య జరిగే డ్రామా, టీవీకి అప్పట్లో ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా సినిమా చేస్తానని చెప్పాడు. ఇది ఫ్యూర్ గా హానెస్ట్ గా మేమంతా చేసిన ప్రయత్నం. చిన్న బడ్జెట్ లో చిన్న స్టోరీ లైన్ తో మేము చేసిన చిత్రమిది. ఏప్రిల్ 17న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సమ్మర్ హాలీడేస్ లో మీరు మా మూవీ చూస్తూ ఆ ఊరు ప్రజల క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవుతారు, వారి ఇన్నోసెన్స్ ఫీల్ అవుతారు. టీవీ ఇంపార్టెన్స్ ఇంత ఉండేదా అని అనుకుంటారు. 90 కిడ్స్ కు అయితే వారి గతమంతా గుర్తుకు వస్తుంది. ఊరిలో జరిగే సస్పెన్స్ డ్రామా చిత్రమిది. ఇంత హానెస్ట్ గా, ఇంత టెక్నికల్ క్వాలిటీగా ఎలా తీశారా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్ కు వెళ్లండి. ఈ సినిమాలోని నటీనటుల పర్ ఫార్మెన్స్ లు చూడటానికైనా థియేటర్స్ కు వెళ్లండి. ప్రతి ఆర్టిస్ట్ మెస్మరైజ్ చేస్తారు. సినిమా చూస్తూ వీళ్లలా నేను పర్ ఫార్మ్ చేయగలనా అని షాక్ కు గురయ్యాను. మా టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఫీలవుతున్నాను. మా టీమ్ అంతా తమ కంఫర్ట్స్ మర్చిపోయి ఊరిలోనే ఉండి మూవీ కంప్లీట్ చేశారు. వంశీకాంత్ మ్యూజిక్, అక్షయ్ సినిమాటోగ్రఫీ, సుధీర్ ఆర్ట్ వర్క్..ఇలా ప్రతి ఒక్కరి వర్క్ ఎంతో ఇంప్రెస్ చేసింది. మునిరాజు సినిమా కంప్లీట్ అయ్యేవరకు పట్టుదలగా వర్క్ చేశాడు. పండక్కి కూడా ఊరికి వెళ్లలేదు. ఈ మూవీతో మునికి మంచి పేరు రావాలి. తేజ నాతో పాటు ఈ మూవీ కో ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీకి ఎవరైనా హీరోను పెడితే బిజినెస్ అవుద్దని మా వాళ్లు అంటే, మా మూవీస్ కు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసిన సాయి తేజ్ తోనే చేద్దామని చెప్పాను. ప్రదీప్ కొట్టె చాలా షార్ట్ ఫిలింస్ లో హీరోగా చేశాడు. ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ లో ఉన్నా మీరు భయాన్ని వదిలే ప్రయత్నించండి తప్పకుండా సక్సెస్ అవుతారు. మా సంస్థలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాం. ఆ సినిమాలతో హీరోలుగా, నటీనటులుగా కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాం. చిన్న స్థాయిలో ఉన్న వారికి నాకు వీలైనంత అవకాశం కల్పించాలని అనుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
————-
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు

‘Diamond-Dacoit’ Movie Audio & Songs launched by VN Aditya (President of Film Directors Association)

తెలుగు తెరపై స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ ద‌ర్శ‌క‌త్వంలో, పార్ధ గోపాల్ – మేఘ‌న జంట‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న పోటీకి తెర లేపింది. ఈ చిత్రంలోని “మరదలివే” పాటకు హుక్ స్టెప్ ఛాలెంజ్ ను ప్రకటించింది. ఆసక్తిగల వారు వారు ఆ పాటకు తమ హుక్ స్టెప్‌తో రీల్స్ రూపొందించి, ఆ రీల్స్ లింక్‌ను 8074801661 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చు.

అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి:
మొదటి బహుమతి – ₹1,00,000
రెండవ బహుమతి – ₹50,000
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించదానికి ఈ ఛాలెంజ్ ను ప్రకటించామని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. “సినిమా పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి రోహిత్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాట‌లు, ట్రైల‌ర్ చూసి ఆ రిచ్ నెస్‌కు ప‌డిపోయాను. ద‌ర్శ‌కుడు కొత్త అయిన‌ప్ప‌టికీ బాగా చేశాడు. పార్ధ గోపాల్ త‌న‌పై తాను బ‌డ్జెట్ పెట్టుకునే స్థితి నుంచి త‌న‌పై పెద్ద ప్రొడ్యూస‌ర్లు పెట్టుబ‌డి పెట్టేంత స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత, హీరో పార్ధ గోపాల్ మాట్లాడుతూ.. “ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. మా సినిమా ఆడియోను వి.ఎన్. ఆదిత్య గారి చేతుల మీదుగా విడుదల చేయించడం ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమాకు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అయిన‌ ద‌ర్శ‌కుడికి కృత‌జ్ఞ‌త‌లు. దర్శకుడు సూర్య జి. యాదవ్ గత మూడున్నరేళ్లుగా ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన పాటలకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. ‘డైమండ్ డెకాయిట్’ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అని తెలిపారు.

దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ.. “మా వేడుక ముఖ్య అతిథి వి.ఎన్. ఆదిత్య గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాలోని పూర్తి లిరీక్ సాంగ్‌ను కూడా విడుద‌ల చేశాం. 5 పాట‌లు, మ్యూజిక్ నిజంగా అద్భుతంగా వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ మా సినిమాకు అదృష్టం. పెద్ద సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బీజీఏం కూడా బాగా ఇచ్చారు. కెమెరా, న‌టీన‌టులు, మిగ‌తా చిత్ర‌బృందం బాగా చేయ‌డం వ‌ల్లే సినిమా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌క‌త్వం నిర్వ‌హ‌ణ‌లో మా హీరో, నిర్మాత పార్ధ గోపాల్ గారు పూర్తి స‌పోర్టు ఇచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం చేస్తున్నారు . సినిమా ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ డ్రామా మేళవింపుతో ఉంటుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం” అన్నారు.

హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం ఎంతో కష్టపడి పనిచేశాం. ముఖ్యంగా దర్శకుడు సూర్య జి. యాదవ్ గారు, హీరో- నిర్మాత పార్ధ గోపాల్ గారి సహకారం ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ.. “ఇటీవల చిన్న చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘డైమండ్ డెకాయిట్’ కూడా అదే కోవకు చెందిన చిత్రం. లవ్ సాంగ్, టైటిల్ సాంగ్ సహా అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. పాట‌లు, ట్రైల‌ర్‌కు మంచి స్పందన రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

న‌టీన‌టులు:
పార్ధ గోపాల్ (హీరో ), మేఘన (హీరోయిన్ )

నిర్మాత‌: పార్ధ గోపాల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్య జి. యాదవ్
మ్యూజిక్ డైరెక్టర్: పెద్దపల్లి రోహిత్
ఎడిట‌ర్: శ్రీనివాస్
DOP: ఆచంట శివ
మార్కెటింగ్ అడ్వైజర్ : తాడి గోవింద్
పీఆర్ఓ: అశోక్ ద‌య్యాల‌

The lyrical song “Sakhiye” from “Youth,” sung by Sinjith Yerramilli, has been released

The Tamil film “Youth,” starring Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, and Meenakshi Dinesh in lead roles, is being brought to Telugu audiences under the same title by Housefull Vineeth and Sandeep on the E2C banner. The film is directed by Ken Karunaas and his team. It is scheduled for a grand theatrical release in Telugu on the 26th of this month. The promotional campaign is being carried out with the slogan “Come with your gang, note – no age limit.”

The trailer released earlier has received a huge response. Today, the lyrical song “Sakhiye” from the movie has been unveiled. The song “Sakhiye,” beautifully composed by G. V. Prakash Kumar, features lyrics by Kittu Vissapragada. It is sung impressively by Sinjith Yerramalli and Sindhuja Tanuku. The song is a melodious romantic track portraying a young couple in love, with lines that express longing, affection, and unspoken emotions, creating a soothing and heartfelt vibe.

Cast:
Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, Meenakshi Dinesh, and others.

Technical Team:
Script & Direction: Ken Karunaas and team
Banner: Paravatha Entertainments
Producers: Karupaiya C. Ram, Sulochana Kumar
Telugu Release: E2C Talkies (Housefull Vineeth, Sandeep)
Music: G. V. Prakash Kumar
Cinematography: Vicky
Editor: Nash
Art Director: Ramu Thangaraj
Costume Designer: Kavya Sriram
Creative Producer: Vijay MP
Stunts: Kalai Kingson
Choreography: Shobi Paulraj
Sound Design: Sync Cinema
Sound Mix: Aravind Menon
Marketing: Housefull Digital
Posters: Kabilan Chelliah
PRO: GSK Media (Suresh – Sreenivas)

Megastar Chiranjeevi releases the trailer of ‘Band Melam’.. Movie grand release on March 26th

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన‌ చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య‌, శ్రావ్య నిర్మాత‌లు. మార్చి 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ల‌వ్‌స్టోరీగా దీన్ని రూపొందించారు. హీరో హీరోయిన్ మ‌ధ్య ఉండే ప్రేమ‌, గిల్లిక‌జ్జాలను హ‌త్తుకునేలా రూపొందించారు. హీరో హ‌ర్ష్ రోష‌న్ త‌న మ‌ర‌ద‌లైన హీరోయిన్ ప్రేమ‌ను గెల‌వ‌టానికి ఏం చేశాడు? త‌న‌కు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగ‌మించాడు? అనే అంశాల‌తో బ్యాండ్ మేళం సినిమా రూపొందిన‌ట్లు తెలుస్తోంది.

బ్యాండ్ మేళం సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, తాజాగా ట్రైల‌ర్‌తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. శివరాజు ప్రణవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. సాయికుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సతీష్ ముత్యాల సినిమాటోగ్ర‌ఫీ అందించారు. శివ ముప్ప‌రాజు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. మార్చి 26న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు.

సాంకేతిక వ‌ర్గం:

కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ :మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి
సంగీతం: విజయ్ బుల్గానిన్
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
గీతరచయిత: చద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్: నంధన గాయత్రి
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

Wishing “Pithapuramlo Ala Modalaindi” to be a big hit like ‘’Preyasirave” –Hero Srikanth

డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కంటెంట్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఇక తాజాగా శుక్రవారం నాడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా

*హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ* .. ‘‘ప్రేయసి రావే’ కంటే ముందు నేను చేసిన కొన్ని చిత్రాలు సరిగ్గా ఆడలేదు. చంద్ర మహేష్ గారు నాతో తీసిన ‘ప్రేయసి రావే’ అద్భుతమైన విజయం సాధించింది. అందులో పృథ్వీ , శివాజీ రాజా అద్భుతంగా నటించారు. శ్రీలేఖ ఆ సినిమాకు ఇచ్చిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో చంద్ర మహేష్ కొత్త వాడే అయినా గొప్పగా సినిమాని తీశాడు. ఈ ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా కథ గురించి కూడా నాకు మహేష్ చెప్పాడు. మూడు డిఫరెంట్ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశాడని అర్థం అవుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను . మంచి కంటెంట్, కాన్సెప్ట్ దొరికితే చంద్ర మహేష్, నేను కలిసి సినిమా చేస్తామ”ని అన్నారు.

*శివాజీ రాజా మాట్లాడుతూ* .. ‘‘ప్రేయసి రావే’ గురించి ఇప్పుడు మాట్లాడుతుండటం ఆనందంగా ఉంది. ఆ మూవీలో శ్రీకాంత్, నా కాంబోకి మంచి పేరు వచ్చింది. శ్రీలేఖ గారి సంగీతం ఆ సినిమాకి ఎంతో కలిసి వచ్చింది. ఆ తరువాత ఆమె చాలా బిజీ అయ్యారు. చంద్ర మహేష్ ఆ టైంలోనే అద్భుతమైన సినిమాల్ని తీశారు. పిఠాపురం అంటేనే ఇప్పుడు ఓ వైబ్ ఉంది. అదే వైబ్ సినిమాలో కూడా ఉంటుంది” అని అన్నారు.

*నటుడు పృథ్వీ మాట్లాడుతూ* ..‘‘ప్రేయసి రావే’లో నాకు అవకాశం ఇచ్చిన చంద్ర మహేష్ గారికి థాంక్స్. ఆ చిత్రంతో నాకు అవార్డు వచ్చింది. ఆ మూవీ తరువాత నేను మరింత బిజీ అయ్యాను. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీతో చంద్ర మహేష్‌కి బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మెసెజ్‌తో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా అందించబోతున్నారు. ఈ సినిమాని అందరూ కచ్చితంగా చూడండి’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. శ్రీలేఖ మాట్లాడుతూ* ..‘మా ‘ప్రేయసిరావే’ చిత్రాన్ని తల్చుకుంటే ఎన్నో మెమోరీస్ అలా గుర్తుకు వస్తుంటాయి. మళ్లీ లాంగ్ గ్యాప్ తరువాత చంద్ర మహేష్ గారు ‘పిఠాపురంలో అలా మొదలైంది’తో కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారు. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ* .. ‘‘ప్రేయసి రావే’ నాకు ఈ లైఫ్‌ ఇచ్చింది. ఆ టీంతో మా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ ట్రైలర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, పృథ్వీ గారు, శ్రీలేఖ గారికి థాంక్స్. ‘ప్రేయసి రావే 2’ కథ కూడా రెడీ చేశాను. ‘ప్రేయసి రావే’ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో.. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ టైంలోనూ అదే ఫీలింగ్ వచ్చింది. ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. శ్రీరామ్ గొప్ప డైలాగ్స్ రాశారు. ముగ్గురు నిర్మాతలు నాకెంతో సహకరించారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

*హీరో విరాట్ మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీతో నేనెంతో నేర్చుకున్నాను. మహేష్ గారి లాంటి గ్రేట్ దర్శకుడితో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. నా మూడో సినిమా ప్రమోషన్స్‌లోనూ శ్రీకాంత్ గారు పార్ట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీరాజ్ లాంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. నా ఈ ప్రయాణంలో మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ప్రత్యూష మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్ గారికి థాంక్స్. ఆయన నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు. మేం కష్టపడి ఓ మంచి మూవీని తీశాం. మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

*గీత మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ నటించడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా టీంకి థాంక్స్’ అని అన్నారు.

*శ్రీలు మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్ గారికి థాంక్స్. ఆయన వల్లే నేను తెరకు పరిచయం కాబోతోన్నాను. ముగ్గురు అమ్మాయిల కథతో మేం రాబోతోన్నాం. ఈ మూవీని కచ్చితంగా పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూడాలి. ఇలాంటి చిత్రాలకు మీడియా కచ్చితంగా సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.

*ప్రేమ్ మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్ గారికి థాంక్స్. ఇదే నాకు తొలి చిత్రం. మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*నిర్మాత దుండిగళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

*నిర్మాత మురళీ కృష్ణ మాట్లాడుతూ* .. ‘గోదారి కిట్టయ్యకి అన్ని క్రాఫ్టులు నేనే అయి పని చేశాను. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీని మహేష్ గారు అద్భుతంగా తీశారు. మహేష్ గారి టేకింగ్ చూసి నేనే అడిగి మరీ ఈ మూవీ నిర్మాణంలోకి వచ్చాను. మహేష్ గారికి నేను జీవితాంతం రుణ పడి ఉంటాను’ అని అన్నారు.

*డైలాగ్ రైటర్ శ్రీరామ్ మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో అలా మొదలైంది’ కథకి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను మార్చాను. ‘ప్రేయసి రావే’లాంటి గొప్ప చిత్రాన్ని చేసిన మహేష్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

*నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ* .. ‘మా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. 2007 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. శ్రీకాంత్ గారితో ‘క్షత్రియ’ చేశాను. నేను సర్పంచ్‌గా చేసిన కాలంలో రకరకాల సమస్యల్ని చూశాను. వాటి నుంచి కథను రెడీ చేయించాను. ఆ కథను మహేష్ చంద్ర గారి వద్దకు తీసుకు వచ్చాను. శ్రీరామ్ గారు మూడు, నాలుగు వర్షెన్స్ రాశారు. ఈ మధ్యే సెన్సార్ పూర్తయింది. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూసే చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’ అని అన్నారు.

*నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ* .. ‘మహేష్ చంద్ర గారు అద్భుతమైన సబ్జెక్ట్ కోసం, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథను రెడీ చేసుకున్నారు. మంచి కథతో ‘పిఠాపురంలో అలా మొదలైంది’ రాబోతోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు కనువిప్పులా ఈ సినిమా ఉంటుంది. మూడు డిఫరెంట్ కథలు ఇందులో ఉంటాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*దాసరి పద్మ మాట్లాడుతూ* .. ‘మా పాప కోసం‘పిఠాపురంలో అలా మొదలైంది’ గురించి దర్శకుడి వద్దకు వెళ్లాం. అప్పుడే డైరెక్టర్ గారు నాకు కూడా ఓ కారెక్టర్ ఇచ్చారు. మూవీ అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

*రాంకీ మాట్లాడుతూ* .. ‘‘పిఠాపురంలో..అలా మొదలైంది’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అలానే మా ఈ పిఠాపురం సినిమా గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలి’ అని కోరుకుంటున్నాను.

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. 
ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర .

‘ ప్రేయసి రావే ‘ కి సీక్వెల్ చేస్తా: దర్శకుడు మహేష్ చంద్ర
——————————————-
తన జీవితాన్ని మలుపు తిప్పిన ‘ ప్రేయసి రావే ‘ చిత్రానికి త్వరలో సీక్వెల్ చేయబితున్నానని దర్శకుడు మహేష్ చంద్ర వెల్లడించారు. “ కథ సిద్ధమైతోంది. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను. శ్రీకాంత్ కి కూడా ఈ విషయం చెప్పాను. ఆయన కూడా చాలా ఆనంద పడ్డారు. శ్రీకాంత్, రాశి, పృథ్వి, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ- మేమంతా కలిసి మళ్లీ పని చేస్తాం “ అని తెలిపారు మహేష్ చంద్ర.

‘Studios 81 Cinemas’ grand opens in Guntur Main Center

4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్ లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 సినిమాస్ నూతన థియేటర్లో ప్రారంభించింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా స్టూడియో 81 సినిమాస్ థియేటర్లను సిద్ధం చేసిందన్నారు. మొత్తం ఐదు స్క్రీన్ లలో 849 సీట్ల కెపాసిటీతో అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి వచ్చాయని కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభర్తంగా ఉండాలని ఆకాంక్షించారు.

అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్క మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసే వారికి పాప్కాన్ అనుభవానిస్తుందన్నారు. థియేటర్ లోపల విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలో సులభమైన టికెటింగ్ వ్యవస్థ, అతిథుల కోసం ఉచిత వైఫై లాంటి సౌకర్యాలతో అద్భుతంగా రూపొందించబడిందన్నారు. సాంకేతికత సౌకర్యం మరియు ఆహ్లాదకరమైన ఆహార పానీయాల అనుభవం పై దృష్టి సారించడంలో స్టూడియో 81 సినిమాస్ సినిమా రంగంలో ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రతి సినిమా అనుభవాన్ని ఒక సంపూర్ణ వినోదపరిత అనుభవంగా మారుస్తుందని సందేహం లేదన్నారు.