Home Blog Page 21

Power Star Pawan Kalyan’s ‘Ustaad Bhagat Singh’ Pre-Release Event Held grandly

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ వేడుకకు హాజరైన అభిమానులకు, లైవ్ లో వేడుకను వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైనవి. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకు ఆనందం కలగాలని కోరుకుంటాను. సినిమా ఎంత వసూలు చేసింది అని నేను ఎప్పుడూ పట్టించుకోను. సినిమా బాగుండాలని కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా అని చూడను.. భారతీయ సినిమా అనుకుంటాను నేను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంటుంది. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి నా కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్ చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా.. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేశాము. 40-45 రోజుల్లోనే సినిమా పూర్తి చేశాము. రోజుకి ఐదారు గంటల లోపే పని చేశాను. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసాను ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే.. దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది. ఈ చిత్రానికి లిరిక్స్  అందించిన చంద్రబోస్ గారికి, భాస్కరభట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి కృతఙ్ఞతలు. పీఆర్ఓ లక్ష్మి వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ కి, స్టంట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ గార్లకు, రచయితలు రమేష్ రెడ్డి గారికి, దశరథ్ గారికి, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి, సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గారికి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి, నేపథ్య సంగీతం బాధ్యతలు తీసుకున్న తమన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పర్ఫార్మర్. శ్రీలీల గారి కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. రాశి ఖన్నా గారు నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్య పాత్రలు చేసిన పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారికి కృతఙ్ఞతలు. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటినుంచో చెప్పేవారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుందని ఆశిస్తున్నాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. మీలో(అభిమానుల్లో) ఒకడు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుత దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో ఈ సినిమా చేశాడు. నా గుండెల్లో నుంచి ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను.. హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున ఈ సినిమాను మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి అని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తుంది. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు. అభిమానులకు, నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం కూడా ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతఙ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు.” అన్నారు. 
కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా ఈ సినిమా ఎందుకు ఆలస్యమైంది అనేది నేను మీతో పంచుకుంటాను. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు లాంటి కథ అనుకున్నాము. కాలేజ్ సమయంలో ఇగోతో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్.. అదే ఇగోతో కాలేజ్ లో లెక్చరర్స్ గా జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. అందరూ ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశాను అంటున్నారు. ఈ సినిమా ఆలస్యానికి నేనే కారణం, వేగంగా షూటింగ్ పూర్తి కావడానికీ నేనే కారణం. ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. సినిమా కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. కాలరే ఎత్తరా సాంగ్ కోసం మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్ వేశారు. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు. కథ మారినా, నా గురించి బయట కథలుకథలుగా చెప్పుకున్నా.. రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి గారికి కృతఙ్ఞతలు. అలాగే మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవి శ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ సినిమాను ముందుగా ఉగాదికి తీసుకొస్తున్నాము. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు. శ్రీలీల గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. అయితే ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నప్పుడు.. నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చేశాము. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది. ఆయన కటౌట్ ని మన అందరి గుండెల్లో పెట్టుకున్నాము. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మార్చి 19న థియేటర్లలో కలుద్దాం. ఉస్తాద్ ఉగాది జరుపుకుందాం.” అన్నారు. 
కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “హరీష్ శంకర్ గారు నిజాయితీగా పని చేస్తారు. అందుకే అంత ముక్కుసూటిగా ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. హరీష్ శంకర్ గారు సరిగా నిద్ర కూడా పోకుండా ఒక యజ్ఞంలా ఈ సినిమా పూర్తి చేశారు. ఆ యజ్ఞం ఫలించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టి, ఈ సినిమా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మా హీరో పవన్ కళ్యాణ్ గారు.. పవర్ స్టార్, పీపుల్ స్టార్. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు నేను. నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నా అని తెలిసి.. తమిళ, కన్నడ ఇలా సినిమా సెట్ కి వెళ్ళినా పవన్ గారి గురించి అడిగేవారు. ఆయనను చూసి చాలా చాలా నేర్చుకున్నాను. పాజిటివ్ గా ఉండటం, మన జీవితం మనం చూసుకోవడం కాకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం.. ఇలా ఎన్నో నేర్చుకున్నాను. పవన్ గారు సినిమాలు చేయడం అనేది సినిమాకి మంచింది. ఎందరికో ఆయన నిజమైన స్ఫూర్తి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నాను. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం.” అన్నారు.
కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నమస్కారం. నా కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఆయన తక్కువ మాట్లాడతారు. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తో తెరను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. హరీష్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. ఈ సినిమా గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి నిర్మాతలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుంది.” అన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “మేము ఎన్ని పెద్ద సినిమాలు చేసినా.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళ నుంచి మాకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకం. మా కోరిక ఈ మార్చి 19న నెరవేరుతుంది. డిప్యూటీ సీఎం అయినా, ప్రజాసేవలో బిజీగా ఉండి కూడా.. మాకు ఈ సినిమా చేసి పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూరిగా కృతఙ్ఞతలు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము అడగడానికి ఆలోచిస్తుంటే, మీ సినిమా పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నప్పటి నుంచి దీనికి దర్శకుడు హరీష్ శంకర్ కావాలని అనుకున్నాను. గబ్బర్ సింగ్ ని మించేలా ఈ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ఇది పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎంటర్టైనర్ సినిమా. మార్చి 19న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.
నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నమస్కారం. ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి, ఈ సినిమా కోసం హరీష్ శంకర్ గారు ఎంతో కష్టపడ్డారు. అభిమానులు మెచ్చేలా ఈ సినిమాని మలిచారు. మాకు ఇలాంటి గుర్తుండిపోయే సినిమాను చేసిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదనే వెలితి మాకు ఉండేది. ఉస్తాద్ తో పరిపూర్ణంగా ఆ వెలితి తీరిపోయింది. సినిమా అవుట్ పుట్ చూసుకున్నాను. రిజల్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. ప్రజాసేవలో ఉండి కూడా ఈ సినిమాను పూర్తి చేశారు. రాత్రుళ్ళు నిద్రపోకుండా షూటింగ్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆయన కష్టం ముందు మా అందరి కష్టం చాలా చిన్నది అనిపించింది. మేము ఎంతోమందిని చూసి ఉండొచ్చు, కానీ ఆయన చాలా ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ గారు మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇటీవల కొందరికి సాయం చేశారు. ఆయన కొన్నిరోజులు ప్రయాణం చేస్తే, నలుగురి సాయం చేయాలనే ఆలోచన మనంలో ఖచ్చితంగా కలుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ ఫిల్మ్. ప్రారంభం నుంచి చివరి దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.” అన్నారు.
ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక, అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. చిత్రం బృందంతో పాటు, పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం:  ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Hero priyadarsi ‘suyodhana’ Teaser Launch Event held grandly, Movie Releasing on March 27

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ “సుయోధన” సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ – మూవీకి బీజీఎం చేసేప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చూస్తుంటాం. ఆ క్రమంలో సాయికుమార్, ప్రియదర్శి పర్ ఫార్మెన్స్ చూసి మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. “సుయోధన” సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. అన్నారు.

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – ప్రియదర్శి నాకు మంచి మిత్రుడు. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాను. మంచి సినిమాలు చేస్తూ గొప్ప స్థాయికి వచ్చాడు. ఈ సినిమా ఆయనకు మరింత పేరు తెస్తుంది. అలాగే సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీ సినిమా మనందరికీ ఫేవరేట్ మూవీ. సాయికుమార్ గారిలోని డైలాగ్ డెలవరీని, పర్ ఫార్మెన్స్ ను ఈ సినిమాలో ఉపయోగించుకునే అవకాశం మా డైరెక్టర్ మాధవ్ కు దక్కడం సంతోషంగా ఉంది. అన్నారు.

నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ – మా డైరెక్టర్ ఈ కథ చెప్పిన వెంటనే మూవీ చేయాలని నిర్ణయించుకున్నాం. స్క్రిప్ట్ చదివాక మా మనసులోకి వచ్చిన మొదటి యాక్టర్ సాయికుమార్ గారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ గారు అన్నీ తానై ఈ ప్రాజెక్ట్ ను నడిపించారు. ఆయన సూచన మేరకే ప్రియదర్శి గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన చాలా బాగా నటించారు. స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో ఈ సినిమా నిర్మించాం. ఈ సినిమాను తన సొంత చిత్రంగా భావించి డైరెక్టర్ మాధవ్ తెరకెక్కించారు. మూవీ రూపకల్పనలో ఎంతో శ్రమించారు. మా మూవీ కాస్ట్ అండ్ క్రూ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ ద్రిషిక చందర్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో సంహిత అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. సాయికుమార్, ప్రియదర్శి లాంటి మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 27న థియేటర్స్ లో మీట్ అవుదాం. అన్నారు.

డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ – దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. నాకు గతంలో ఎలాంటి ఎక్సిపీరియన్స్ లేదు. అయినా నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు మా ప్రొడ్యూసర్ బోసుబాబు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శి గారిని కలిశాను. ఆయన ఈ మూవీ చేస్తే బాగుంటుందని అనిపించింది. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఓకే చెప్పారు. ప్రియదర్శి మూవీ ఓకే చేయడంతోనే నాకు స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సుయోధన క్యారెక్టర్ ఫస్ట్ నుంచీ సాయికుమార్ గారినే అనుకున్నాను. ఛోటా కె ప్రసాద్ గారు నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. నాలాంటి డెబ్యూ డైరెక్టర్ కు ఛోటా అన్న బెస్ట్ ఎడిటర్. “సుయోధన” మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

యాక్టర్ దేవిప్రసాద్ మాట్లాడుతూ – “సుయోధన” సినిమాను స్క్రీన్ మీద చూడాలని మేమూ వెయిట్ చేస్తున్నాం. ఇందులో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిది. నేను ప్రియదర్శితో ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నా. సాయికుమార్ గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ మంచి పరిచయం ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉంటుంది. అన్నారు.

యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ – ఇందాక దేవిప్రసాద్ చెప్పినట్లు ఈ సినిమాలో నటిస్తున్న మాకే కొత్తగా అనిపించింది. నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ కలిగింది. మీలాగే మేము కూడా థియేటర్ లో ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నాం. మా టీమ్ లో మూవీ చూసి వచ్చిన వాళ్లను అడుగుతున్నాం ఎలా అనిపించింది అని. ఈ మూవీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. నేను ప్రియదర్శితో కలిసి కోర్ట్ సినిమా చేశాను. అది సూపర్ హిట్ అయ్యింది, గద్దర్ అవార్డ్ కూడా పొందింది. ప్రియదర్శి నాకు బిడ్డ లాంటివాడు. ఈ జనరేషన్ లో దర్శి లాంటి మంచి నటులతో కలిసి నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది. నేను ప్రేమ కన్నడలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో జంటగా నటించాం. ఈ సినిమాలో ఆమె ఒక కీ రోల్ చేస్తోంది. సుయోదన సినిమా మంచి విజయం సాధించాలి. ఈ టీమ్ అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – ఛోటా కె ప్రసాద్ అన్న ఈ కథ నా దగ్గరకు పంపారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ బోసుబాబు గారు పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి రాలేదు. కేవలం తన ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఆయన ఒక రైటర్. సాంగ్స్ బాగా రాస్తారు. సినిమా మీద ఆయనకున్న ఇష్టం నన్ను బాగా ఇన్స్ పైర్ చేసింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ కథలో ఉన్న సుయోధన క్యారెక్టర్ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయికుమార్ గారు. 50 ఏళ్లుగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న కుటుంబం వారిది. సాయికుమార్ గారు తన గొప్ప టాలెంట్ ను మాలాంటి ముందు జనరేషన్స్ కు ఇవ్వడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డితో కలిసి పనిచేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ద్రిషిక హైదరాబాద్ అమ్మాయి. ఈ మూవీలో చాలా బాగా నటించింది. ఈ నెల 27న సుయోధన మూవీ చూడండి. మీరు బాగా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.

నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్ , సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు

సాంకేతిక బృందం :
బ్యానర్ : ప్రజ్వల లైన్ క్రియేషన్స్
మ్యూజిక్ : జై క్రిష్
డీఓపీ : కార్తీక్ కొప్పెర
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
నిర్మాత : బోసుబాబు నిడుమోలు
దర్శకత్వం: వై ఎస్ మాధవ్ రెడ్డి
పీఆర్ఓ – సతీష్ కె

Netflix launched ‘iLine Studio’ in Hyderabad, with CM Revanth Reddy as chief guest

భారతదేశంలో ప్రస్తుతం యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగం ఎంతగా అభివృద్ది చెందుతోందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రంగంలో దీర్ఘకాలిక సామర్థ్య పెట్టుబడిని గుర్తించి హైదరాబాద్‌లో తన గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ స్టూడియో అయిన ఐలైన్ స్టూడియోను నెట్ ఫ్లిక్స్ ప్రారంభించింది. ఇక ప్రపంచ స్థాయి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటిని ఇక్కడి నుంచే క్రియేట్ చేయొచ్చు. ఇది అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, తదుపరి తరం ప్రొడక్షన్ టెక్నాలజీని అందిస్తుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లలో భారతదేశాన్ని ఒక ప్రధాన నోడ్‌గా ఈ స్టూడియో నిలబెడుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐలైన్ స్టూడియోస్ CEO జెఫ్ షాపిరో నాయకత్వం వహించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, భారతీయ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.

ఈ కొత్త కార్యాలయం 32000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్‌ల కోసం అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఇవన్నీ బలమైన హైబ్రిడ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సపోర్ట్ చేయబడతాయి. ఉద్యోగుల శ్రేయస్సు, సహకారం, సృజనాత్మకత పెంపొందించడానికి రూపొందించబడిన ఆధునిక కార్యస్థలాన్ని కలిగి ఉంది. లాస్ ఏంజిల్స్, వాంకోవర్, సియోల్, లండన్‌ తరువాత హైదరాబాద్‌లోనే ఐలైన్ స్టూడియోని ప్రారంభించారు. ఐలైన్ స్టూడియోని కలిగి ఉన్న ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది. హై ఎండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్‌, ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేందుకు ఈ స్టూడియో ఉపయోగపడుతుంది.

భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది. డిజిటల్ ప్రొడక్షన్, క్రియేటివ్ టెక్నాలజీలో దూసుకుపోతోంది. ఐలైన్ స్టూడియోస్ ఇండియా కార్యాలయం ప్రారంభం దేశంలోని ప్రపంచ ఉత్పత్తి ప్రమాణాలు, అధునాతన సాధనాలు, ఇంటిగ్రేటెడ్ వర్క్‌ఫ్లోలను అందిస్తుంది. హైదరాబాద్‌లో ప్రొడక్షన్, ఆవిష్కరణ సామర్థ్యాలను ప్రోత్సహించడం ద్వారా ఐలైన్ మౌలిక సదుపాయాలు, టాలెంట్ డెవలప్మెంట్, గ్లోబల్ ఇంటిగ్రేషన్‌లో దీర్ఘకాలిక పెట్టుబడిని చేస్తోంది. ఈ కార్యక్రమంలో..

*తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ* ..‘ఐలైన్, నెట్‌ఫ్లిక్స్‌లను తెలంగాణకు స్వాగతించడం హైదరాబాద్‌కు గర్వకారణం. హైదరాబాద్ నెట్‌ఫ్లిక్స్‌కు సహజ నిలయంగా నిలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్, నెట్ ఫ్లిక్స్ రెండూ కూడా గ్లోబల్‌గా సక్సెస్ అయ్యాయి. ఈ రెండూ కూడా ఎన్నెన్నో కొత్త అవకాశాల్ని, ఉద్యోగాల్ని సృష్టిస్తూ విజయవంతంగా దూసుకుపోతోన్నాయి. అనేక విధాలుగా నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను, ప్రతిభను కలిపే ద్వారాలు. మా నగరం ఎల్లప్పుడూ సృజనాత్మకత, సాంకేతికత, ప్రపంచ ప్రతిభ కలిసే ప్రదేశంగా ఉంది. హైదరాబాద్ భవిష్యత్తుకి తగ్గ కథల్ని చెప్పే, రూపొందించే కంపెనీలకు సహజ నిలయంగా మారింది. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సంబంధిత సృజనాత్మక పర్యావరణ వ్యవస్థలను నిర్మించాలనే మా ఉమ్మడి ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. ఐలైన్ ఉనికి హైదరాబాద్ చలనచిత్రం, సాంకేతికత, AVGC రంగానికి ప్రముఖ కేంద్రంగా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. హైదరాబాద్ నుండి ప్రపంచానికి మన టాలెంట్, మన స్టోరీలు చెప్పడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నందున వారి ప్రయాణానికి నేను ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాను’ అని అన్నారు.

*భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ* ..‘ప్రస్తుతం నేను పెరిగిన, నాకు చాలా ఇష్టమైన సిటీలో ఉన్నాను. జెఫ్ గత సంవత్సరం నన్ను కలిశాడు. దీన్ని ఇంత త్వరగా పూర్తి చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. బాహుబలి పుట్టిన సిటీ ఐలైన్ స్టూడియోస్‌కు సరైన ప్లేస్. మనది గొప్ప కథకుల చరిత్ర కలిగిన దేశం. AVGCలో హైదరాబాద్‌కు భారీ చరిత్ర ఉంది. ప్రధాన హాలీవుడ్ స్టూడియోలకు ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి. గత సంవత్సరం స్థాపించబడిన IICTకి ఇక్కడ క్యాంపస్ కూడా ఉంటుంది. హైదరాబాద్ నుండి పాన్-ఇండియా సినిమాలు నిర్మించబడుతున్నాయ’ని అన్నారు.

*తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ* ..‘ఐలైన్ స్టూడియోస్‌ను హైదరాబాద్‌కు స్వాగతిస్తున్నాం. హైదరాబాద్ సృజనాత్మక శక్తి పెరగాలి, ప్రపంచ స్థాయి కథలు చెప్పడానికి చెప్పడానికి రాజధానిగా మారాలి అనే మా గౌరవనీయ ముఖ్యమంత్రి, ప్రభుత్వ దార్శనికతకు ఇది అనుగుణంగా ఉంటుంది. భారతదేశంలో తమ మార్క్‌ను రూపొందించాలనే నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం భారతదేశంలో అందుబాటులో ఉన్న సృజనాత్మక ప్రతిభపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యార్థులకు ట్యూషన్ చెప్పడానికి అవసరమైన ప్రతిభను నైపుణ్యం కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటుంది. వీఎఫ్ఎక్స్, యానిమేషన్‌లో ప్రతిభను పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం. ఐలైన్ స్టూడియోలతో, మేము ప్రపంచంలోనే అత్యుత్తమ కథ చెప్పే ప్రదేశంగా నంబర్ వన్ అవుతామ’ని అన్నారు.

*నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ* ..‘ఈ రోజు నాకు చాలా నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత, చాలా జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం, 2005–2006 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. టెడ్ సరండోస్ ఆ సమయంలో పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాడు. నేడు, జెఫ్ షాపిరో వంటి వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఈ ప్రదేశం గురించి సృజనాత్మకతకు తదుపరి కేంద్రంగా మాట్లాడటం చూడటం హైదరాబాద్ ఎంత వరకు అభివృద్ధి చెందిందో చూపిస్తుంది. వరల్డ్ స్థాయి క్వాలిటీ ఉన్న చిత్రాలను డిమాండ్ చేస్తున్న ప్రేక్షకులకు ముందుగా థాంక్స్ చెబుతున్నాను. ఆల్రెడీ సినిమా నిర్మాణంలో మన వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐలైన్ స్టూడియోస్ ఇక్కడికి రావడంతో ఇండస్ట్రీకి మరింత మద్దతు ఇచ్చినట్టు అయింది. నేను వీరందరినీ స్వాగతించాలనుకుంటున్నాను. కళాకారుడిగా సినిమాల్లో పని చేయాలనుకునే లేదా కథ చెప్పడంలో భాగం కావాలనుకునే ఎవరికైనా ఇది గొప్ప అవకాశం. ఈ రంగంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణానికి మద్దతు ఇచ్చినందుకు ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వంకు థాంక్స్. మనందరం కలిసి అందమైన, వినోదాత్మక నగరంగా హైదరాబాద్‌ను మారుద్దామ’ని అన్నారు.

*ఐలైన్ స్టూడియోస్ CEO జెఫ్ షాపిరో మాట్లాడుతూ* ..‘భారతదేశం చాలా కాలంగా ప్రపంచ విజువల్ ఎఫెక్ట్స్‌లో నిర్వచించదగిన పాత్ర పోషించింది. కేవలం స్కేల్ పరంగానే కాదు, ఇక్కడ సృజనాత్మక, సాంకేతిక ప్రతిభకు లోటు లేదు. మా స్టూడియోను ఎక్కడ స్థాపించాలో అని మేం ఎదురుచూస్తున్నప్పుడు మాకు వెంటనే హైదరాబాద్ అయితే గొప్పగా ఉంటుందని అనిపించింది. ఇది బలమైన సాంకేతిక, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ సామర్థ్యం, ఆశయాన్ని అర్థం చేసుకునే చలనచిత్ర సంస్కృతిని కలిపిస్తుంది. ఈ నగరంలో భారతదేశం అంతటా ఉన్న ప్రతిభ కళాత్మక నైపుణ్యాన్ని నిష్కళంకమైన సాంకేతిక ఖచ్చితత్వంతో మిళితం చేస్తుంది. దీర్ఘకాలిక సామర్థ్యాన్ని నిర్మించుకోవడానికి, ప్రపంచ కథ చెప్పడానికి అర్థవంతంగా దోహదపడటానికి మనకు అవసరమైన పునాది ఇక్కడి నుంచే ప్రారంభం కావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

“We built ‘Allu Cinemas’ to provide an experience that is even better than multiplexes.” —Producer Allu Aravind

ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా ప్రకటించింది. ఇకపై ల్యాండ్‌మార్క్ వినోద గమ్యస్థానంగా అల్లు సినిమాస్ మారనుంది. హైదరాబాద్‌ను అల్లు సినిమాస్ వరల్డ్ సినిమా మ్యాప్‌లో సరికొత్త స్థాయిలోని నిలబెడుతుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మైలురాయి ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది. ప్రేక్షకులకు ఈ ‘అల్లు సినిమాస్’ అత్యాధునిక సాంకేతికత, లగ్జరీ, సౌకర్యవంతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించారు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ సందర్భంగా

అల్లు అరవింద్ మాట్లాడుతూ .. ‘రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న ఎక్స్‌పీరియెన్స్ ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. అమెరికా, జర్మనీ, ఇండియన్ టీం ఇలా అందరం కలిసి ఓ డెబ్బై సార్లు జూమ్ కాల్స్‌లో కలిసి ఉంటాం. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి మీడియానే జనాల్లోకి తీసుకెళ్లాల’ని అన్నారు.

మరెక్కడా లేని డాల్బీ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్..
648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. హైదరాబాద్‌లో ఇలాంటిది ఇంతకు ముందు లేదన్న సంగతి తెలిసిందే. ఆడిటోరియం డాల్బీ సినిమా డిజైన్ ప్రమాణాల ప్రకారం అమలు చేయబడిన డ్యూయల్ డాల్బీ విజన్ 6P లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం డాల్బీ 3D ద్వారా శక్తిని పొందుతుంది. పిచ్-బ్లాక్ ఆడిటోరియంలు పర్‌ఫెక్ట్ కాంట్రాస్ట్ కోసం రూపొందించబడ్డాయి. ఎక్స్‌ట్రీమ్ బ్రైట్ నెస్, డీపర్ బ్లాక్స్, రిచ్‌లీ వైబ్రెంట్ కలర్స్‌తో ఉత్కంఠభరితమైన విజువల్స్‌ను అందిస్తాయి. 64-ఛానల్ డాల్బీ అట్మాస్ ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్ ఓవర్ హెడ్‌తో సహా అన్ని దిశల నుండి ధ్వనిని ప్రసారం చేయడం ద్వారా ఓ కొత్త లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. పూర్తిగా లీనమయ్యేలా సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. కర్వ్డ్ (వంపుతిరిగిన) స్టేడియం సీటింగ్ పర్ ఫెక్ట్ వ్యూయింగ్ యాంగిల్‌ను అందిస్తుంది. తద్వారా ప్రేక్షకుడు ఎక్కడ ఏ సీటులో కూర్చున్నా కూడా అత్యుత్తమమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతాడు. ఇది కేవలం స్క్రీన్‌గా మాత్రమే కాకుండా ప్రెసిషన్ ఇంజనీరింగ్‌గా నిలుస్తుంది.

రాజీపడని నాణ్యతతో నిర్మించిన నాలుగు ప్రీమియం స్క్రీన్లు ఇవే..
ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా కాకుండా మిగిలిన మూడు ఆడిటోరియంలలో బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ ఉన్నాయి. డాల్బీ-బ్రాండెడ్ ప్రీమియం స్పీకర్లు, స్టేడియం సీటింగ్ ఉన్నాయి. నాలుగు స్క్రీన్‌లలో రిక్లైనర్లు, లాంజర్‌లు అమర్చబడి ఉన్నాయి. చివరి వరుస రిక్లైనర్‌లతో స్క్రీన్‌లు 2, 3, 4 అంతటా 717 అదనపు సీట్లు, తదుపరి తరం 3D సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతీ స్క్రీన్‌లో ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభవం కలిగేలా సాంకేతికతను సెటప్ చేశారు.

ఓ మైలు రాయిగా అల్లు స్టూడియోస్‌
కోకాపేటలోని ఏడు ఎకరాల్లోని అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న ‘అల్లు సినిమాస్’ భారతదేశ వినోద రాజధానికి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, మోకిలాతో పాటుగా రాబోయే నియోపోలిస్ నుండి పట్టణ, శివారు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ, కార్పొరేట్‌లు, హై-ఎండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇష్టపడే సినీ ప్రియుల కోసం ఈ ‘అల్లు సినిమాస్’నూ నిర్మించారు. టికెటింగ్, రాయితీలు, వేచి ఉండే ప్రాంతాలు ఇలా అన్నీ కూడా ఎంతో విశాలంగా ఉన్నాయి. విస్తరించిన F&B ఆఫర్ ఇటాలియన్, చైనీస్, భారతీయ వంటకాలను కూడా అందిస్తుంది. మల్టీ కన్సిషన్ కౌంటర్లు, కియోస్క్‌ల ద్వారా వైడ్ సెక్షన్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌ను అందిస్తారు.

Assembly Speaker Gaddam Prasad Kumar launched the song ‘Idisellipoyaava..’ from “Maa Ramudu Andarivadu”

యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “మా రాముడు అందరివాడు”. ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. యద్దనపూడి మైకేల్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. శ్రీరామ్ సరసన స్వాతి హీరోయిన్ గా కనిపించనుంది. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో “మా రాముడు అందరివాడు” సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ చేశారు. ఈ పాటకు డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ సాహిత్యాన్ని అందించి, నల్లగొండ గద్దర్ గా ప్రసిద్ధమైన నర్సారెడ్డి గారితో కలిసి పాడారు. ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, నిర్మాత, నటుడు అనుముల లక్ష్మణరావు, డైరెక్టర్, సాంగ్ రైటర్ యద్ధనపూడి మైఖేల్, సింగర్ నల్లగొండ గద్దర్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

“మా రాముడు అందరివాడు” సినిమాలో తండ్రిని కోల్పోయిన కొడుకు అలాగే గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఊరి ప్రజలు కలిసి విషాధంతో పాడుకునే ఒక అద్భుతమైన పాట ‘ఇడిసెల్లిపోయావా..’. ఈ పాట చాలా బాగుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్రశంసించారు. ‘ఇడిసెల్లిపోయావా..’ పాటను, పాట పోస్టర్స్ ను ఆయన లాంఛ్ చేసి, సాంగ్ విన్నారు. “మా రాముడు అందరివాడు” మూవీ మంచి విజయం సాధిస్తుందని ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ – ఈ రోజు “మా రాముడు అందరివాడు” సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ పాటను డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ మంచి సాహిత్యంతో రాశారు. నల్లగొండ గద్దర్ నర్సారెడ్డి అన్న బ్రహ్మాండంగా పాడారు. ఇది చాలా మంచి సినిమా. సమాజానికి దిక్సూచిగా నిలిచే సందేశంతో మిమ్మల్ని అలరించే వినోదంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించాలి. అలాగే ఇలాంటి కొత్త టాలెంట్ ను మీరంతా ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. అన్నారు.

తమ సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ చేసి, తమ మూవీకి సపోర్ట్ చేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి హీరో శ్రీరామ్, నిర్మాత అనుముల లక్ష్మణరావు, డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే “మా రాముడు అందరివాడు” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని వారు తెలియజేశారు.

Bothsa hospitalized after defending YCP’s sin _ TDP MLA and Sangam Dairy Chairman Dhulipala

కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం

•బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే

•వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం వైసిపి పేటెంట్ హక్కులు, ఫేక్ బ్రతుకులు మీవి మావి కావు

•రాజధాని అంశంలో ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పా, ఈరోజు అదే చెప్తున్నా

• 33 రోజులు నన్ను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారు అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదు

• కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు

•వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్‌, సాక్షి ఛానల్‌కి 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చారు

•వైసిపి ప్రభుత్వ హయంలో భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్లతో 3 లక్షల టన్నులకు పైగా సిమెంట్‌ను కనిపించారు

•వైసిపి పెట్టిన 22 కేసులు ఇప్పటికీ నా మీదున్నాయి, ప్రభుత్వం నాకు సహకరిస్తే ఆ తప్పుడు కేసులు ఎత్తేయాలి కదా??

•వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎందుకు వచ్చిందో మీతో చేతులు కలిపి నా మీద కుట్ర చేసి కేసులు పెట్టించిన మాజీ చైర్మన్‌ను అడగండి. నేను బాధ్యత చేపట్టాక వైష్ణవి డెయిరీని నిలివేసాను

•ఫేక్ బతుకులకు పేటెంట్ హక్కులు వైసిపివి, ఫాల్త్ గాళ్ళు వైసీపీ వాళ్ళు.

•తిరుపతి లడ్డు కల్తీ అయిందనేది నిజం, వెజిటబుల్ , జంతువుల కొవ్వు ఉందని NDDB చెప్పింది

• వైసిపి వాళ్ళు ఇప్పటికైనా స్వామి దగ్గరకు వెళ్ళి తప్పు ఒప్పుకోవాలి

•కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకి 12.5 కోట్లు, చెన్నైకి 7.5 కోట్లు వచ్చాయని సిట్ చెప్పింది

• బహిరంగ మార్కెట్ లో బటర్ ధర 360 రూ.లు ఉంటే 316 రూ కి నెయ్యి ఎలా సరఫరా చేశారు?

• పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన మహా ఘనులు వైసీపీ నాయకులు

•సంగం డెయిరీ 2020, 2021లో కూడా టీటీడీ నెయ్యి టెండర్ వేసింది.

•ఆ దేవ దేవుడి దగ్గర సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుండి సంగం డెయిరీ ఎదురు చూసింది స్వామి ఇప్పుడు అవకాశం ఇచ్చారు

•చంద్రబాబు గారు చెపితే టెండర్ ఇవ్వలేదు.నిబంధనలు, సాంకేతిక శాస్త్రీయ పరీక్షలు అనంతరం టెండర్‌లో పాల్గొని సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తుంది

•హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదు.

• సంగం డెయిరీ గుంటూరు రైతులది, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలది

• వైసిపి చేసిన పాపాన్ని మోసి సమర్ధించే పాపం బొత్సా గారు దాన్ని ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు

• కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేస్తే మట్టిలో కలిపోవడం ఖాయం

•పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసిన వైసిపి ఆ తప్పు నుండి బయట పడేందుకు ఇతరుల మీద బురద జల్లుతుంది

• వైసిపి నాయకులకు సవాల్ విసురుతున్నా అమూల్ తరువాత దక్షిణ భారత దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీ

Varalaxmi Sarathkumar – Naveen Chandra’s Love Song from ‘Police Complaint’ Launched

The upcoming action thriller Police Complaint stars talented South Indian actress Varalaxmi Sarathkumar and versatile actor Naveen Chandra in lead roles. Produced by Balakrishna Maharana under the MSK Pramida Sri Films banner, the film is directed by Sanjeev Megoti.

A beautiful melodious love song titled “Prema O Prema”, picturized on Varalaxmi Sarathkumar and Naveen Chandra, has been officially launched by senior journalist Prabhu. The song has been released through Anwika audios.

The music for “Prema O Prema” is composed by Sudhakar Mario. Director Sanjeev Megoti expressed confidence that the song will strongly connect with youth audiences, trend widely, and earn a place among super hit love songs. He described the film as a horror thriller blended with an out-and-out action entertainer.

The movie is designed as a complete action thriller with elements of action, comedy, and romance. Apart from Varalaxmi Sarathkumar and Naveen Chandra, the film also features Krishna Sai, Ragini Dwivedi, Aditya Om, Ravi Shankar, Srinivasa Reddy, Saptagiri, Sharath Lohithaswa, Gemini Suresh, Dil Ramesh, and several others. Nearly 52 senior artists have acted in this action-packed entertainer.

The cinematography is handled by S.N. Harish, while the action sequences choreographed by Dragon Prakash and Ravi Teja are expected to be major highlights. The roles played by Varalaxmi Sarathkumar, Naveen Chandra, and Ragini Dwivedi are said to be completely different from their previous films.

The film has recently completed its censor formalities and is gearing up for release soon. The makers are confident that Police Complaint will entertain audiences with its unique blend of thrills, romance, action, and horror elements.

Technical Team:

Makeup: Vijay–Shekhar
Costume Design: Nallapu Satish
Production Designer: Kondapaneni Muralidhar
Art Director: K.V. Ramana
Editor: Anugoju Renuka Babu
Choreography: Paidi Raju, Sun Rays, Meher Baba
Fights: Dragon Prakash – Ravi Teja

Music: Arohana Sudhindra – Sanjeev Megoti – Sudhakar Mario
Background Score: Sanjeev Megoti

Sound Designing & Audiography: Dontham Praveen Reddy

Executive Producer: Satish
Production Executive: Biji Vemula Rajashekar Reddy
Production Managers: Ramesh – Kolla Gangadharam

Chief Associate Directors: Peram Ayanash Reddy (Ashok), Pawan Kumar Godavarthi
Associate Directors: Krishna Murthy, N. Ram Kumar, Maddila Cheruvu Deepak
Assistant Directors: Naveen Kapil, Kanche Veeresh, Swathi Mangapuram, K. Maheshwar, Kandela Ganesh, Yashwanth Kumar, PVS Neeraj

DOP:- S. N. Hareesh
Operative Cameraman: Senthil Kumar
Assistant: Himagiri
VFX: Magic Loom Vijay
PRO: Ashok Dayyala

‘Suvarna Textiles’ Moviec Teaser Released held grandly

శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్ర దారులుగా ప్రశాంత్ నామిని రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సువర్ణ టెక్స్టైల్స్ ” ఈ చిత్రం టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా… హీరో శివకుమార్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ లో చేస్తున్నా… కచ్చితంగా 2 వేల కోట్లు కలెక్ట్ చేస్తాడు.. చూసారుగా తారక్ గారు ఎలా సన్నబడి ఎడారి లో కళ్లజోడు పెట్టుకొని నడుస్తుంటే తారక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాడు.. ఈ సినిమా విషయానికి వస్తే.. హైటెక్ సిటీ వీధుల్లో నైటీ వేసుకుని పరిగెత్తించాడు. మంచి జీల్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ నామిని. ఎంతో ప్యాషన్ తో సినిమా తీశాడు. కచ్చితంగా నచ్చుతుంది. యూత్ కు బాగా నచ్చుతుంది. టీజర్ చూసారుగా ఎవరిని డిజప్పాయింట్ అయితే చేయదు అన్నారు.

దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ… టీజర్ చాలా బాగుంది. టీజర్ ఎలా ఉందో సినిమా కూడా అలానే తీస్తే మాత్రం అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుంది. ఈ సినిమాతో ప్రశాంత్నామిని ఓ మంచి దర్శకుడు అవుతాడు అన్నారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ… ప్రశాంత్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఫస్ట్ ఈ కథని నాకే చెప్పాడు. అయితే నాకే ఈ జోనర్ చేయాలంటే ధైర్యం చాలలేదు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ నామిని అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ నామిని మాట్లాడుతూ... ఇదొక కొత్త జానర్. కొంత అడల్ట్ కంటెంట్ ఉన్నా… ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా ఇది అని ముగించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల, నటుడు లోబో తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నామిని
నిర్మాత: అనీల్ ఈరుగుదిండ్ల
సినిమాటోగ్రఫీ: చందు ఎ.జె
సంగీతం: భరత్ M
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ఆర్ట్: విజయ్ కుమార్ గాజుల
లిరిక్స్: రాంబాబు గోసల
PRO: దుద్ది శ్రీను

Director Sudheer Sriram interview about ‘Saampradayini Suppini Suddapoosani’ Movie

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి

మీ నేపథ్యం ఏమిటి?
మా నేపథ్యం కడప. నాన్న పోస్ట్‌మాస్టర్‌. నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. సినిమా సెలబ్రిటిలా నాకు ఓ గుర్తింపు రావాలని కోరిక ఉండేది. హ్యపీడేస్‌ సినిమా చూసి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. 2015 నుంచి సినీ పరిశ్రమలోకి ఉన్నాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. అడవిశేష్‌ నటించిన ఎవరు సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ చిత్ర దర్శకుడు రామ్‌జీ నాకు గురువు, ఆయన నాకు గాడ్‌ఫాదర్‌ లాంటి వాడు. ఆయన వల్లే నేను ఈ రోజు దర్శకుడి మీ ముందుకు వచ్చాను.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రానికి శివాజీ గారిని హీరో ఎంచుకోవడానికి రీజన్‌?
90స్‌ సినిమాలో శివాజీ గారిని చూడగానే మా నాన్న గుర్తొచ్చారు. సినిమా కథలు చెప్పే సమయంలో ఆయనకు ఎందుకు కథ చెప్పకూడదు? అనిపించి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కథతో శివాజీ గారిని అప్రోచ్‌ అయ్యాను. కథ వినగానే ఆయన ఈ కథను నేనే ప్రొడ్యూస్‌ చేస్తాను అన్నారు. ఆ మాట వినగానే ఎంతో హ్యపీగా అనిపించింది. ఈ కథను శివాజీ గారు ఈటీవీ వాళ్లకు కూడా చెప్పమన్నారు. నితిన్‌ గారు, సాయికృష్ణ గారు కథ వినగానే వాళ్లు కూడా ఓకే చేశారు. ఫైనల్‌గా బాపినీడు గారు కూడా ఓకే చేశారు అప్పటి నుంచి ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. శివాజీ వల్ల ఈ సినిమా స్పీడ్‌గా పూర్తిచేశాను.

ఈ సినిమా ఎలాంటి కథాంశంతో ఉంటుంది?
ఈ కథ క్రైమ్‌ కామెడీ. దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించే సినిమా తరహాలో ఉంటుంది. కో..కో.కోకిల, డాక్టర్‌ సినిమాలా డార్క్‌ కామెడీ ఉంటూ థ్రిల్లింగ్‌ నేపథ్యం ఉంటుంది. ఈ రోజు విడుదల చేసిన ట్రయిలర్‌ చూస్తే అందరికి అర్థమవుతుంది. సెటిల్‌గా ఉంటే డార్క్‌ కామెడీ నాకు ఇష్టం. నా శైలికి దగ్గరగా ఉండే జోనర్‌ ఇది. డెఫినెట్‌గా ఫ్యామిలీ మొత్తం థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలిసిన సినిమా. ఫన్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది. సినిమా చూసిన తరువాత ఒక మంచి ఎంటర్‌టైనర్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

మొదట్లో ఈసినిమాను ఓటీటీలో డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ అన్నారు? ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు ? ఎందుకని?
ముందుగా థియేటర్‌ కోసమే అనుకున్నాం. ఈటీవీ వాళ్లు కూడా అదే అనుకున్నారు.లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయ్‌ థియేటర్‌లో విడుదలైన తరువాత ఈటీవీ విన్‌ వాళ్లకు ఎక్కడో ఈటీవీ విన్‌ వర్జినల్‌ మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ కలిగింది. సో.. వాళ్లు ఇది మంచి సినిమా, ఈటీవీ విన్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్‌ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ సినిమా అనిల్‌రావిపూడి సజేషన్‌తో థియేటర్‌కు తీసుకొస్తున్నాం. నా ఫస్ట్‌ సినిమాలో నా పేరును థియేటర్‌లో స్క్రీన్‌ మీద చూసుకునే ఎమోషన్‌ మిస్‌ అవుతుందేమోనని అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా థియేటర్లో విడుదల కావడం హ్యపీగా ఉంది.

ఈ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయి?
ఈ కథలో అన్ని పాత్రలకు ఫర్‌ఫెక్ట్‌ ఆర్టిస్టులు కుదిరారు. ప్రతి క్యారెక్టర్‌లో కొత్త కోణం ఉంటుంది. సెట్‌లో అందరూ ఈ సినిమా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నవ్వుకునేవారు. ఈ సినిమా ప్రారంభం కాగానే మొదటి 20 నిమిషాల తరువాత మరో కోణంలోకి వెళుతుంది.

శివాజీ గారి పాత్ర 90స్‌ కిడ్స్‌లోని పాత్రకు పోలీక ఉంటుందా?
90స్‌ పాత్రకు, ఈ సినిమాలో పాత్రకు ఏం సంబంధం ఉండదు.ఈ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే పాత్ర. నాకు ఆన్‌స్క్రీన్‌లో శివాజీ నా శ్రీరామ్‌ ఫర్‌ఫెక్ట్‌గా కుదిరాడు. ఈ సినిమా టైటిల్‌ కూడా శివాజీ గారు సజెస్ట్‌ చేశారు. శివాజీ గారు అన్‌బోర్డ్‌ అవ్వడం వల్ల సినిమా వాల్యూ పెరిగింది.

ఈ సినిమా మేకింగ్‌ శివాజీ గారి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత వరకు ఉంది?
శివాజీ గారు ఇన్‌వాల్వ్‌మెంట్‌ కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన స్టయిల్‌లో డైలాగులు చెప్పేవాడు. ఆయన ప్రాపర్‌గా పాటల్లో ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. పాయ సాంగ్‌ శివాజీ గారి సజేషన్‌తో చేశాం. ఆయన సలహాలు కూడా ఎంతో వాల్యూబుల్‌గా ఉండేది. షూట్‌ ప్రారంభానికి చెప్పిన కథనే మీరు తెరపై చూడబోతున్నారు. స్క్రీప్ట్‌ ఏ రోజు మారలేదు. మొదటి రోజు చెప్పిన కథతోనే సినిమా తీశాను.

ఈ సినిమా ప్రేక్షకులకు థియేటర్స్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతుంది?
ఈ సినిమా ను డెఫనింట్‌గా థియేటర్‌లో ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. అనిల్‌ రావిపూడి గారితో పాటు కొంత మంది సినిమా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఫస్టాఫ్‌ హిలేరియస్‌గా ఎంజాయ్‌ చేశార, సెకండాఫ్‌లో సస్పెన్స్‌ చూసి ఎంతో థ్రిల్ల్‌గా ఫీలయ్యారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించారు. ఈ సినిమా థియేటర్‌ అయినా ఓటీటీ అయినా అందరికి నచ్చుతుంది. ఫైనల్‌గా థియేటర్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది.

పర్సనల్‌గా మీకు ఎలాంటి సినిమాలకు దర్వకత్వం చేయాలని ఉంది?
పర్సనల్‌గా ఓ జోనర్‌ అని కాదు. నా నుంచి తదుపరి నాలుగు కథలు నాలుగు డిఫరంట్‌గా ఉంటాయి. ఫాంటసీ, సైన్స్‌ పిక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథలు ఉన్నాయి. మైథలాజికల్‌ కథ కూడా ఉంది. ఒకే జోనర్‌కు పరిమితం కావడం నాకు ఇష్టం లేదు.

మీ సినిమాలో కామెడీ మాత్రమే ఉంటుందా? కథ, లాజికల్‌లు ఉంటాయా?
ఈ సినిమా చూసిన తరువాత కథ లేదు. లాజిక్‌లు లేవు అని ఎవరు అనరు. ఎవరూ కూడా ఈ సన్నివేశం అనవసరంగా పెట్టాం అనే ఫీలింగ్‌ కూడా రాదు. మీరు సినిమాలో చూసే ప్రతి సీన్‌కు, ప్రతి పాత్రకు ఓ లాజికల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్ వరకు పర్‌ఫ్టెక్ట్‌గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా రాసుకున్న కథ ఇది.

ఫైనల్‌గా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా గురించి ఏం చెబుతారు?
ఆడియన్స్‌ డెఫినెంట్‌ గా హిలేరియస్‌గా ఫస్టాఫ్‌ ఎంజాయ్‌ చేస్తారు. రెండో భాగం క్రైమ్‌లోకి వెళ్లి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. థియేటర్‌లో ఎంజాయ్‌ చేయగలిగే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి.

‘Ravam’ movie first look released by Director VV.Vinayak

తారక్ ఫిలిం హౌస్ బ్యానర్ పై హీరో ప్రశాంత్ రాదారపు హీరోయిన్ అనుశ్రీ నటించిన చిత్రం రవం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మర్చి 6న ఆహాలో విడుదల కాబోతోంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ విడుదల చేశారు,

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘’మంచి కన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవం సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని‘’అన్నారు

డైరెక్టర్ శ్రీరామ్ మన్నార్ ఈ చిత్రాన్ని చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకేక్కించారు, ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

రవం చిత్రానికి నిర్మాత మరియు సంగీతం పడాల తారక రామారావు అందించారు, మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు, సాంకేతిక పరంగా సినిమా బాగుంది, ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కరాటే కళ్యాణి.