Home Blog Page 22

Book launch of “Telangana Cine Prasthanam” written by Dr. Ponnam Ravichandra

డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన “తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ ఈ రోజు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ క ల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కె.వి. విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా, దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఆత్మీయ అతిథిగా, ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు అల్లాణి శ్రీధర్, సినీ పుస్తక రచయిత ఎస్ వీ రామారావు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. “తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తకాన్ని ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో

పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ – మాది కరీంనగర్ జిల్లా. చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం, సినిమాల మీద ఆసక్తి ఉండేది. మా సొంత బుక్ స్టాల్ కోసం అనేక సినిమా పత్రికలు తీసుకునేవాళ్లం. ఆ పత్రికల్లో సినిమా వార్తలు చదువుతూ, వాటి పేపర్ కటింగ్స్ భద్రపరిచాను. అప్పుడే పైడి జయరాజ్ గురించి తెలుసుకున్నాను. నేను సేకరించిన సినీ సమాచారంతో 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానం పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో నంది పురస్కారం దక్కింది. ఇప్పుడు తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉంది. నాకు సినిమా జర్నలిజంలో గురువులా భావించే మామిడి హరికృష్ణకు ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నా. తెలంగాణ ప్రాంత సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ పైడి జయరాజ్ , ఆయనకు ముందు నుంచే చాలామంది తెలంగాణ ప్రాంత నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభ చాటారు. ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో కనీసం పది మంది తెలంగాణ వారు ఉండటం విశేషం. అన్నారు.

ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కేవీ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక రచనతో పొన్నం రవిచంద్ర గారు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. అలాగే ఆ సినిమాలను తిరిగి మన ప్రేక్షకులు చూసేలా కూడా ఆయన ప్రయత్నం చేయాలని కోరుతున్నా. తెలంగాణలో ఎన్నో కళలు ఉన్నాయి. ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు. వారి ప్రతిభ ప్రపంచానికి తెలిసేలా చేస్తే చాలా బాగుంటుంది. మన తెలుగు సాంస్కృతిక చరిత్రకు చిహ్నంగా మారిన రవీంద్ర భారతిలో కనీస సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.

ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – పొన్నం రవిచంద్ర గారు తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక రచనతో ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఈ పుస్తకాన్ని మామిడి హరికృష్ణ గారికి అంకితమివ్వడం ఎంతైనా సముచితం. సినిమా పరిశ్రమకు తెలంగాణ, ఏపీ అనే బేధం లేదు. ప్రతిభావంతులు ఎక్కడున్నా సినీ పరిశ్రమ ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుంది. అన్నారు.

ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – తెలంగాణ సినిమా గురించి ఎంతో సమాచారాన్ని పొన్నం రవిచంద్ర గారు ఈ పుస్తకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఆయన నాకు ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం గౌరవంగా భావిస్తున్నా. పొన్నం కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అన్నారు.

తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకంలోని సమాచారం ఎంతో విలువైనదని, చాలా విషయాలు తెలుసుకునేలా చేసిందని దర్శకుడు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్, ఇతర అతిథులు ప్రశంసించారు.

‘VVS Creations’ banner Title logo launched by prominent film personalities

VVS క్రియేషన్ బ్యానర్‌లో శ్రీరంగం సతీష్‌ కుమార్ సమర్పణలో సంయుక్తంగా నేడు ఫిల్మ్ ఛాంబర్‌ నందు ప్రముఖ దర్శక నిర్మాతల సారధ్యంలో టైటిల్ లోగోను ఆవిష్కరించడం జరిగింది. గతంలో తెలుగు, తమిళం, కన్నడ, చిత్రాలకు, దర్శక నిర్మాతగా చేసి, ఇప్పుడు వివిఎస్ క్రియేషన్స్ లో దర్శకుడు నానిరాజ్ చెప్పినటువంటి కథాంశం నచ్చి, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుమ్మలప్రసన్న కుమార్ (తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి), ప్రతాని రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు & తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు) ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నానిరాజ్ గత 9 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా, కొన్ని మూవీస్ కి ఘోస్ట్ రైటర్ గా, షార్ట్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో ఒక మంచి కామెడీ యూత్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ తీసుకోని, నానిరాజ్ కథాంశం కొత్తగా రూపొందిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే, సంగీతం మీద అవగాహనతో ఈ చిత్రానికీ సంగీత దర్శకుడిగా కూడా చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్స్ మార్చి మొదటి వారం నుండి ఏప్రిల్,మే, జూన్ సమయానికి షెడ్యూల్ పూర్తి చేయడనికి సన్నహాలలో ఉంది.

ఈ చిత్రానికి మంచి ప్రతిభ, నటన ఉన్న హీరో, హీరోయిన్లుని పరిచయం చేస్తున్నారు. అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ఘోష్, ,LB శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దాష్ అప్పారావు, షేకింగ్ శేషు,రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, G నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. సురేష్ ఆత్రేయ డిఓపిగా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీను ఎడిటర్ గా, రాక్ నాని, మున్నా కొరియోగ్రాఫర్ గా అలాగే దేవరాజ్ ఫైట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర ఇతర విశేషాలు చిత్ర బృందం వెల్లడించనున్నారు.

నటీనటులు : అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ఘోష్, ,LB శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దాష్ అప్పారావు, షేకింగ్ శేషు,రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, G నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం, రచన & దర్శకత్వం : నానిరాజ్
సహ నిర్మాతలు : మహాధన్, తురన్యు త్రిలోచన్
నిర్మాత: నాగరాజు గొల్లపల్లి
సమర్పకులు : శ్రీరంగం సతీష్‌కుమార్
DOP : సురేష్ ఆత్రేయ
ఎడిటర్ : శ్రీను
కొరియోగ్రఫీ : రాక్ నాని, మున్నా
ఫైట్స్ : దేవరాజ్
మేకప్ : వినోద్
ఆర్ట్ డైరెక్టర్ : విజయ్ కృష్ణ
కాస్ట్యూమ్స్ : తిరుమల
స్టిల్స్ : రాజా, పోస్టర్
డిజైన్స్ : కోడి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బాలరాజు
కో-డైరెక్టర్ : C.V రావు
అసోసియేట్ డైరెక్టర్లు : సాయి కుమార్, వంశీ
విఎఫ్ఎక్స్ : జెమిని

‘Hey bhalwanth’ has achieved break-even: Filmmaker reveals at Thank You Meet for Break-Even Done event

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘హే బల్‌వంత్‌’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకపోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తొలిసారిగా, వినూత్నంగా థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా

నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ”మా బ్యానర్‌లో వచ్చిన తొలి సక్సెస్‌ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతృప్తి చెందారు. ఓ మంచి సినిమా తీశానని అభినందించారు. కొన్ని థియేటర్స్‌కి వెళ్లి నేను ఆడియన్స్ మధ్యలో సినిమా చూశాను. సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు ఇది ఎంతో సంతృప్తి నిచ్చింది. ఓ మంచి సినిమా తీశాననే భావన కలిగింది. తప్పకుండా సినిమా చూడని వాళ్లు అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు గోపీ అచ్చెర మాట్లాడుతూ ” ఈ మూవీ చూసిన అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూఎస్‌లో ఆడియన్స్‌ కు కూడా ఈ సినిమా నచ్చింది. ఈ సక్సెస్‌కు కారణమైన అందరికి నా కృతజ్క్షతలు’ అన్నారు.

హీరోయిన్‌ శివానీ నాగారం మాట్లాడుతూ ‘‘ ఈసినిమాకు విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్క్షతలు. మా కంటెంట్‌ను ఎంకరైజ్‌ చేసి లవ్‌ చేసిన అందరికి థ్యాంక్స్‌. అందరికి నచ్చే కంటెంట్‌ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అంటున్నారు. సినిమా కోసం టీమ్‌ అంతా కష్టపడ్డారు’ అన్నారు.

సుహాస్‌ మాట్లాడుతూ ” అంబాజీ పేట సినిమా తరువాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్‌ నెంబర్లు కూడా కనబడకపోవడంతో భయమేసింది. ఈసినిమా వసూళ్లు చూసిన ధైర్యం వచ్చింది. ఓవరసీస్‌లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. చాలా రోజుల తరువాత నా సినిమా ఓటీటీ కూడా మంచి ఫ్యాన్సీ రేటు వచ్చింది. ఇందుకు కారణమైన నిర్మాత నరేంద్ర రెడ్డి, వంశీ నందిపాటిలకు థ్యాంక్స్‌’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ” చాలా హ్యపీగా ఉంది. ఈ సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ కావడం నాకు ఎంతో హ్యపీనెస్‌ ఇచ్చే విషయం. చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని దైర్యంగా చెబుతారు.అలాంటి కోవలోకి మా హే బల్‌వంత్‌ నిలిచినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత నిలబడితే ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్‌ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్‌ఫుల్‌ సినిమాగా నిలుస్తుంది. ఆ విషయంలో ఈ సినిమా విజయం సాధించింది. త్వరలోనే దర్శకుడు గోపీతో మరోసినిమా చేస్తున్నాం. ఈ సినిమాను దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్‌ ఇతర హక్కులు, థియేటర్స్‌ కలెక్షన్స్‌ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్‌ జోన్‌లోకి వెళతాం అన్నారు.

నంది అవార్డు అందుకోవాలనేది నాకల : నిర్మాత వంశీ నందిపాటి
”ఈవెంట్‌లో చిన్నగా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్‌ కాదు. తప్పుగా వెళ్లింది.ఎవరో 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అన్నారు. నాకు దేవుడి మీద , అవార్డ్స్‌ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడి అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్‌ మీద కూడా గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్‌ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్‌ గురించి నేను తప్పుగా మాట్లాడను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉండే ఐయామ్‌ రియల్లీ సారీ’ అన్నారు.

ఈ సమావేశంలో స్రవంతి చొక్కారపు, లావణ్యరెడ్డి, మహి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Film Critics Association Executive Committee members met renowned Producer Chadalavada Srinivasa Rao in a warm and cordial gathering

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక అయిన పాలకమండలి మరియు ఈసీ మెంబెర్స్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ను కలిశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పునర్ వైభవానికి దారులు పరిచిన చదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయతా కృతజ్ఞతలు తెలియ చేశారు

ఈ ఆత్మీయ సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ” కొంతకాలంగా సబ్దంగా ఉన్న అసోసియేషన్ కు శ్రీనివాసరావు గారి ప్రకటన తిరిగి జీవం పోసింది. కొందరి జేబులో కోటిరూపాయల ఉన్నా మనసులో దరిద్రం వుంటుంది. శ్రీనివాసరావు గారి జేబులో కోట్లు ఉన్నాయి మనసులో లక్ష్మిదేవి ఉంది. పదిమంది కి ఉపయోగపడే ఔదార్యం ఉంది. కుబేరుడు ఇంతమంది కుచేలుల్లను అనుగ్రహించారు. ఫిల్మ్ జర్నలిస్టులు గా దశాబ్దాల అనుబంధం ఉంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లలో ఓ ఆరోగ్యకర వాతావరణం నెలకొని ఉంది.మనం గాసిప్స్ ను ప్రోత్సహించం. కాంట్రవర్సీ లు ప్రచురించం .పరిశ్రమ లో జరిగే అవకతవకలును
చెత్త సినిమాలను ఉపేక్షించం. చదలవాడ తిరుపతిరావు గారి కుటుంబం ఫిల్మ్ క్రిటిక్స్ ను కుటుంబ సభ్యులు లా చూస్తారు. మన పట్ల వారు చూపిస్తున్న ఆప్యాయత,ఆదరణ పలకరింపులో మాటలకు అందని తియ్యదనం ఉంది..చదలవాడ శ్రీనివాసరావు గారివలనే మనం అందరం సంఘటితం కాగలిగాం. మన అందరి కళ్ళలో వెలుగుకు కారణం అయ్యారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు.

అధ్యక్షుడు బత్తుల జెవి ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ప్రతిరోజు శ్రీనివాసరావు గార్కి పాదాభివందనం చెయ్యటం నాదినచర్యలో భాగం.నేను సినిమా పరిశ్రమకు ,పాత్రికేయ వృత్తికి కొంతకాలం దూరంగా ఉన్నాను. శ్రీనివాసరావు గారిని కలిస్తే హైదరాబాద్ వచ్చేయి.ఇక్కడ ఉండిపో అన్నారు.నాకు కావాలంటే ఆయన సకల సదుపాయాలు కల్పిస్తారు.కానీ నాకు ప్రకృతిలో జీవించటం ఇష్టం అందుకే ఒక చిన్న కుటీరం కట్టించి ఇచ్చారు. వారు మన సినీ పాత్రికేయులు తన కన్నకొడుకులు లా చూస్తారు. ఎవరు వచ్చినా ఇదంతా ప్రసాద్ దే అని చెపుతారు . వారి అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు.

ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ.. శ్రీనివాసరావు గారి ఔదార్యం వర్ణించటానికి మాటలు చాలవు. ఆయన చేస్తున్న గొప్ప పని చరిత్రలో నిలిచిపోతుంది డబ్బులు ఉన్న ప్రతిమనిషి దాన గుణం ఉండదు. దాన గుణం ఉన్నవారివద్ద డబ్బులు ఉండవు.రెండు ఒకరి వద్దే ఉండటం చాలా అరుదు.అలా అరుదైన మంచి మనిషి శ్రీనివాసరావు గార్కి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు అంతా ఋణ పడి వుంటారు అన్నారు.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ సభ్యులు మోహన్ గొటేటి మాట్లాడుతూ..
శ్రీనివాసరావు బ్రదర్స్ దృష్టిలో సినిమా పాత్రికేయులుకు గొప్ప ఆదరణ ఉంది. ఓరోజు నేను స్వీట్స్ కోసం బేగం పేట్ లోని పుల్లారెడ్డి స్వీట్స్ కు వెళ్ళాను.అక్కడకు ఇద్దరు అన్నతమ్ములు వచ్చారు.నన్ను చూసి మోహన్ ఏంటి ఇక్కడ అని ప్రశ్నించారు. స్వీట్స్ కోసం వచ్చాను సర్ అనేసరికి తిరుపతి రావు గారు పుల్లారెడ్డి మనకు బాగా తెలుసు ఉండు అని లోపలకు వెళ్ళి నాలుగు అయిదు కేజీల స్వీట్స్ తెచ్చి చేతుల్లో పెట్టేశారు. మా ఇంటి గృహ ప్రవేశానికి కూడా వచ్చి ఆశీర్వదించారు. వారి మంచితనానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అన్నారు

మరో సీనియర్ సభ్యులు బాలి రెడ్డి మాట్లాడుతూ… దైవం మానుష రూపేణా అని అంటారు. ఈ వాక్యానికి నడిచే నిర్వచనం శ్రీనివాసరావు గారు.వీరు చేస్తున్న బృహత్కార్యం తెలుగు సినిమా పరిశ్రమ కే కాదు దక్షిణాది సినిమా పరిశ్రమ లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక చరిత్ర గా నిలిచిపోతుంది.తెలుగు పరిశ్రమ లో ఎంతో అభిమానం ఆదరణ ఉన్న NTR ,ANR స్థాయికి ఈ ఒక్క కార్యంతోశ్రీనివాసరావు గారు చేరారు.వారు చేస్తున్న మంచి పని మనం ఊరు వాడ దండోరా వెయ్యాలి అన్నారు

ఉపాధ్యక్షులు E జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాసరావు గారు చేస్తున్న సత్కార్యానికి ఫిలిం క్రిటిక్స్ కుటుంబం జీవితాంతం ఋణ పడి ఉంటుంది వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు అన్నారు

ఈ కార్యక్రమానికి కారణం అయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ మిత్రులు,పుత్రులు సినీ పాత్రికేయులు.నాకు బంధువులు ఆత్మ బంధువులు సినిమా పాత్రికేయులు.నాకు సినిమాలు అంటే గొప్ప అభిమానం . సినిమా పాత్రికేయులు శిల్పి వంటివారు.రాతిని శిల్పంలా చెక్కుతారు. ఆ శిల్పాన్ని చూసి అందరూ మొక్కుతారు. అలానే సాధారణ వ్యక్తిలుగా సినిమా పరిశ్రమకు వచ్చే హీరోలను, దర్శకులను,నిర్మాతలను ప్రజల గుండెలలో స్థిరమైన స్థానం కల్పించేవి మీ రాతలే! అందువల్లే మీరు అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఒక సైంటిస్ట్ , ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నవారు సమాజానికి ఎలా ఉపయోగపడతారో అలానే సినిమా పాత్రికేయులు వలన కూడా సమాజానికి ఎంతో ఉపయోగం .సినిమా మీద ప్రేమతో 80 వ దశకంలో మేము తీసిన మొదటి సినిమా లైలా ఆ సినిమా నిర్మాణం కోసం తెనాలి నుండి చెన్నై వెళ్లినప్పుడు నన్ను మొదట రిసీవ్ చేసుకుంది కొండపనేని ఉమామహేశ్వరరావు, మిక్కిలినేని జగదీష్ బాబు ఆ రోజు నుండి వాళ్ళే నాకు ఆత్మీయులు బంధువులు. ఆ రోజుల్లో ఓ టాప్ హీరో సినిమా ఆడియో రైట్స్ లియో ఆనంద్ లక్ష రూపాయలు కు కొనుగోలు చేశారు . నా సినిమా లైలా కు ఆత్రేయగారు నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు. MS విశ్వనాథ్ మ్యూజిక్. లియో ఆనంద్ మా సినిమా పాటలు విని 99 వేలు ఆడియో రైట్స్ కు ఆఫర్ చేశారు .ఉమా , జగదీష్ బాబు ఇద్దరు లియో ఆనంద్ ను మా ఆఫీస్ కు పిలిపించి మీరు టాప్ హీరో సినిమా కు లక్ష రూపాయలు ఇచ్చారు .అంతకంటే ఈ సినిమా పాటలు బాగున్నాయి కాబట్టి లక్ష వెయ్యి రూపాయలు ఇవ్వండి అని ఇప్పించారు. నాగేశ్వరరావు గారి తో శోభన్ బాబు తో సినిమాలు తీశాను. ప్రతి సినిమా నిర్మాణం లోను స్వంత అన్నదమ్ములు లా సినిమా పాత్రికేయులు మా మీద అభిమానం చూపించారు. ఏ రోజు నేను వారిని ఇలా రాయండి అని అడగ లేదు.వారి స్వంత సినిమా లా భావించి నేను తీసిన ప్రతి సినిమా ను వారే ప్రచారం చేశారు.. మీరంతా నా స్వంత బిడ్డల లా భావిస్తాను.నేను ఊరుకు దూరంగా ఈ స్థలం కొన్నప్పుడు ఇందులో నా కుటుంబానికి చెందిన పాత్రికేయ మిత్రులకు కూడా భాగం ఇవ్వాలి అనుకున్నా కానీ అనాడు ఈ స్థలం ఊరికి దూరంగా ఉండటంతో మార్కెట్ ధర ప్రకారం డబ్బులు ఇవ్వమని అడిగారు.ఇచ్చాను. మీకు ఇల్లు కట్టి ఇవ్వలేక పోయాను అయ్యో వీళ్ళు ఉపయోగించుకోలేదు…. ఉపయోగించుకోలేదు అని నా మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది. అలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను రకరకాల పని వత్తిడిలో పడిపోయాను .ప్రతిరోజూ రీటా ప్రసాద్ ఉదయాన్నే కనిపించగానే మనవారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకునే వాన్ని.ఒక రోజు మీ అందరితో కలిసి భోజనం చెయ్యాలని ఉంది అందరూ వస్తారా? అని అడిగితే వస్తారు అని మిమ్మలను పిలిచాడు ఆ సమావేశానికి అన్నయ్య కూడా వచ్చారు.నేను ఇచ్చింది ఏమి లేదు. మీరు నామీద చూపించే అభిమానం తో దేవుడు నా నోటి నుండి మీకు టవర్స్ కట్టి ఇస్తాను అనే మాట అనిపించాడు. అది వందకోట్లు విలువైనది అయినా మూడు వందల కోట్లు విలువైనది అయినా ఒక్క సారి మాట ఇస్తే చెప్పింది చేస్తాను.నేను ఒక్కసారి మాట అన్నాక అటు సూర్యుడు ఇటు పొడిచినా మాట తప్పను. నేను అన్నదానికంటే 10 / శాతం ఎక్కువే ఖర్చు పెట్టీ కట్టించి ఇస్తాను.ఏడు తరాల నుండి మాది ఉమ్మడి కుటుంబం.మేము మాట ఇచ్చాం అంటే కుటుంబ సభ్యులు అందరం అన్నయ్య కానీ పిల్లలు కానీ అందరం కట్టుబడి వుంటాం. నేను సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించాను దేవుడు నాకు ఇంత ఇస్తాడు అని భావించలేదు.ఇచ్చాడు అందులో కొంత మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇస్తున్నాను. సినిమా కార్మికులు కూడా మీలా నా కుటుంబ సభ్యులు చిత్రపురి కాలనీ స్థలం వేలం దశకు వస్తే ప్రసన్న కుమార్,దర్శకుడు అజయ్ కుమార్ అనిల్ ను నావద్దకు తెచ్చారు. ఆ సమయంలో నేను అంత స్థితిమంతుడను కూడా కాదు.అయినా సరే మంచి పని వారికి మాట ఇచ్చాను.భగవంతుడు కూడా నాకు శక్తి ఇచ్చాడు. 4500 కుటుంబాలలో వెలుగు నింపటం కోసం మాట ప్రకారం బ్యాంక్ వారికి డబ్బులు కట్టాను. ఇలా మంచిచేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ రోజు చిత్రపురి కాలనీ ఎకరం 20 కోట్లు ఈ రోజు 200 కోట్లు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులు ఎవరు నేను చేసే మంచిపనులు ను చూసి ఆనందిస్తారు.కొన్ని మంచి కార్యాలను డబ్బులతో కోలవలేం అలానే అనుబంధం కూడా డబ్బులకు అతీతమైనది. మీ అందరూ నా స్వంత బిడ్డల లాంటివాళ్ళు మీకు చేస్తాను అన్నదానికంటే ఎక్కువ చేస్తాను అన్నారు.

మరో సీనియర్ సినిమా పాత్రికేయుడు గిరిధర్ మాట్లాడుతూ చదలవాడ శ్రీనివాసరావు ఇంతకాలం నాకు మాత్రమే దేవుడు.. ఈ మంచి పనితో మన అందరికి దేవుడు అయ్యారు అన్నారు

Everyone Will Enjoy ‘Sampradayini Suppini Suddapoosani’ Releasing in Theatres on March 6: Hero Shivaji

ప్రముఖ నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్‌ కామెడీ ఫ్యామిలీ థిల్లర్‌ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇంతకు ముందు శివాజీ గారితో పలు హిట్‌ చిత్రాల్లో నటించి హిట్‌ జోడిగా ఖ్యాతి పొందిన శివాజీ, లయలు ఈ సినిమాలో మరోసారి జోడిగా కనిపిస్తున్నారు. శివాజీ, ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్‌, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా

హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ ” సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో రిలీజ్‌ కానుంది. లక్కీ కాంబినేషన్‌ ఈటీవీ విన్‌, బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఆధ్వర్యంలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను మొదటగా థియేటర్‌ కోసమే ప్రారంభించాం. . ఈసినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా తీశాం. ఈటీవీ వాళ్లకు ఏది చెప్పమో అదే తీశాం. సినిమాకు ఉండే థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌లో మాజా వేరు. థియేటర్‌లో చూస్తేనే కిక్కు. ఇంత మంచి కంటెంట్‌ ఈటీవీ వర్జినల్‌లో ఫ్రెష్‌ కంటెంట్‌ వాళ్ల ఓటీటీకి కావాలనుకున్నారు. కానీ ఈ సినిమాను థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనుకున్నాం. అందుకే థియేటర్‌లో విడుదల చేస్తున్నాం. బన్నీవాస్‌ సినిమా చూసి మెచ్చుకున్నారు. వంశీ గారికి కూడా నచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్‌గా నవ్వుకున్నారు. ఫైనల్‌గా ఇది థియేటర్‌లోకి రావాలని డిసైడ్‌ చేశాం. ఈ సినిమానే తనకు కావాలిసింది చేసుకుంది. థియేటర్‌కు వస్తుంది. ఓ మంచి సినిమా, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలను. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. ఇది అందరి ప్రేమను పొందుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా థియేటర్‌లో రావడానికి కారణమైన దర్శకుడు అనిల్‌ రావిపూడికి నా కృతజ్ఞతలు ‘ అన్నారు.

ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయికృష్ణ మాట్లాడుతూ ” ఈ సినిమాలో శివాజీ, లయ గారు చాలా గ్యాప్‌ తరువాత కలిసి నటించడం హ్యపీగా ఉంది. ఈసినిమా క్రైమ్‌ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. తప్పకుండా సినిమా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

కథానాయిక లయ మాట్లాడుతూ ” ఓటీటీలో వస్తుంది ఈ సినిమా అనగానే ఒక హ్యపీనెస్‌తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి ఉండేది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్‌ అనే అలవాటు.. ఈ సినిమా థియేటర్‌లో చూడలేకపోతానేమో అని బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఈసినిమా థియేటర్‌లో రిలీజ్‌ కావడం ఆనందంగా ఉంది. దీనికి కారణమైన అందరికి నా కృతజ్ఞతలు. నాకు ఈసినిమా ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే హ్యపీ టెన్షన్‌ ఉంది. సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని అంశాలు సినిమావిజయానికి ప్లస్‌ అయ్యే విధంగా ఉంటుంది. నాకు కూడా సినిమాను చూడాలని ఉంది. ప్రేక్షకుల లాగానే నేను కూడా ఎదుచుచూస్తున్నాను. ఈ సినిమాతో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు మంచి శ్రీకారం అని నమ్ముతున్నాను. ఈ సినిమాను అందరూ థియేటరలోనే చూడాలి. థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌లో ఎమోషన్‌ ఉంటుంది’ అన్నారు.

బన్నీవాస్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా విడుదల చేయడానికి కారణం దర్శకుడు అనిల్‌ రావిపూడి గారు. ఈ సినిమాను చూసిన ఆయన ఇది పక్కా థియేట్రికల్‌ సినిమా, థియేటర్‌లో రిలీజ్‌ చేయమని చెప్పారు. శివాజీ గారు కూడా ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా చూశాను. శివాజీ గారు నటన మిమ్ములను ఆకట్టుకుంది. 90స్‌ సినిమా తరువాత ఆయన ఇంకో స్థాయికి వెళ్లాడు.ఈ సినిమాలో లయ బాగా నటించిరు. ఆమె పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఈ ఇద్దరి కాంబో మరోసారి సక్సెస్‌ఫుల్‌ కాబోతుంది. ఈసినిమాలో క్రైమ్ థ్రిల్లర్‌ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంటుంది. ఈటీవీ కాంబినేషన్‌లో మేము మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వారితో మా ప్రయాణం ఇలాగే కొనసాగాలి అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ” శివాజీ, లయది హిట్‌ కాంబినేషన్‌ మరోసారి ఈ జంట ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ జంట అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఇలాగే ఉన్నారు. లయ నా అభిమాన నటి. నా అభిమాన నటి సినిమాతో అసోసియేట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా థ్రిల్లర్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌. ఈ టీవీ ట్రేడ్‌ మార్క్‌ సినిమా ఇది. ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా ఓటీటీ సినిమా అనుకున్నప్పుడు ఓ మిరాకిల్‌లా అనిల్‌ రావిపూడి ఈ సినిమాను చూడటం. ఆయన సలహాతో ఈ సినిమా థియేటర్‌లోకి తీసుకరావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈటీవీ సాయి గారు, శివాజీ గారు ఒప్పుకోవడం నిజంగా మిరాకిల్‌గా అనిపించింది. ఈ సినిమా ఏది కావాలో అది చేసుకుంది. మంచి కంటెంట్‌ థియేటర్స్‌ను వెతుక్కుంది. త్వరలోనే ఓ కొత్త ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం

అలీ మాట్లాడుతూ ” సాంప్రదాయబద్దంగా సుత్తి లేకుండా పూస గుచ్చినట్లు ఈ సినిమాను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. మార్చి 6న అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. అనిల్‌ రావిపూడి ఈ సినిమాను థియేటరలో రిలీజ్‌ చేయమనడం, వంశీ, బన్నీవాస్‌లు విడుదల చేయడం ఆనందంగా ఉంది. హిట్‌ పెయిర్‌ శివాజీ, లయల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అన్నారు.

నటీనటులు : శివాజీ, లయ , అలీ ధనరాజ్ , ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు , కరణ్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
నిర్మాత : శివాజీ సొంటినేని
రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్
ఎడిటర్ : బాలు మనోజ్.డి
కెమెరామెన్ : రిత్విక్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి
కో డైరెక్టర్ : గుడివాక శివ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బాలాజీ శ్రీను కరెడ్ల

‘Band Melam’ teaser launch event held grandly,Movie releasing on March 13

కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి తమన్, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

శివాజీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ మంచి లవ్ స్టోరితో తెరకెక్కింది. ఇందులో కూడా నన్ను ఓ పాత్ర చేయమని అడిగారు. కానీ రొటీన్ అవుతుందని వద్దని చెప్పాను. శ్రీదేవీ చాలా మంచి నటి. రోషన్ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్. భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తాడు. ‘బ్యాండ్ మేళం’తో వీరంతా మరోస్థాయికి వెళ్లబోతోన్నారు. ‘కోర్ట్’ మార్చి 13న ప్రీమియర్ వేసి హిట్టు కొట్టాం. ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ మార్చి 13న రాబోతోంది. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తమన్ మాట్లాడుతూ .. ‘కోన గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది. కోన గారి చేతికి గోల్డ్ ఉండటం కాదు.. ఆయన హ్యాండే.. గోల్డెన్ హ్యాండ్. ‘బ్యాండ్ మేళం’ కోసం నేను ఈ రోజు ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. హర్ష్ రోషన్, శ్రీదేవీలను చూస్తుంటే నాకు ‘నువ్వే కావాలి’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. నాకు విజయ్ బుల్గానిన్ పాటలంటే చాలా ఇష్టం. మార్చి 13న ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘గుండెలోంచి వచ్చే ప్రేమ కథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’తో తెలిసింది. ఈ ‘నిన్ను కోరి’ వల్లే ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ నిర్మించాను. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ ఓ మెమరబుల్ ఫిల్మ్‌గా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. నాకు సతీష్ ఈ కథను చెప్పినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఈ కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ కట్టి పడేస్తుంది. ఏజ్, యాక్టింగ్ సత్తా ఉండటం వల్లే రోషన్, శ్రీదేవీలను తీసుకున్నాం. సాయి కుమార్ ఈ కథను విని షాక్ అయ్యారు. విజయ్ బుల్గానిన్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సక్సెస్ చేసి ఇంకా కొత్త వారిని పరిచయం చేసే శక్తిని, సక్సెస్‌ను అందిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ టీజర్ నచ్చింది. డైరెక్టర్ ఈ రోజు కాకుండా సినిమా రిలీజ్ రోజు, సక్సెస్ రోజు మాట్లాడతారని అనిపిస్తోంది. హర్ష్ రోషన్, శ్రీదేవీ ఆడియెన్స్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. కోన అన్నతో నాకు ఇరవై ఏళ్ల బంధం ఉంది. ఆయన సినిమాలు సక్సెస్ అవుతూ ఉండాలి. ఇలానే కొత్త వారిని ఇండస్ట్రీలోకి తీసుకు వస్తూ ఉండాలి. విజయ్ బుల్గానిన్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ .. ‘కోన గారు నాకు గాడ్ ఫాదర్. కోన గారి వల్ల ఎంతో మంది దర్శకులు, రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘బ్యాండ్ మేళం’తోనూ కొత్త వారిని పరిచయం చేస్తున్నారు. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంకా ఇలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. హర్ష్ రోషన్ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయికి చేరుకుంటాడు. శ్రీదేవి అద్భుతమైన నటి. టీజర్‌ను చూస్తే గ్యాంగ్‌తో సినిమాకి వెళ్లాలని అనిపించింది. ఈ మూవీతో సతీష్‌కి హిట్ రావాలి. విజయ్ బుల్గానిన్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ‘బ్యాండ్ మేళం’ మూవీకి మార్చి 13న విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

వేణు ఊడుగుల మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ టీజర్ నాకు చాలా నచ్చింది. కమర్షియల్ లెక్కలతో డబ్బుల కోసం తీసిన సినిమా కాదని నాకు అర్థమైంది. ప్రేమతో, ప్రాణం పెట్టి, తెలంగాణ మట్టి వాసనతో జీవితాన్ని చూపించే చిత్రమిది. ఈ కథ నేను ఆల్రెడీ విన్నాను. కథలోని ఇంటెన్స్, ఫిలాసఫికల్ బేస్‌ను టీజర్‌లో చక్కగా చూపించారు. ఇలాంటి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న కోన గారికి థాంక్స్. ఇది తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా’ అని అన్నారు.

హర్ష్ రోషన్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ. ప్రతీ ఎమోషన్‌ను పీక్‌లో చూపించే పాత్ర నాది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా కోసం వచ్చిన శివాజీ గారికి, తమన్ గారికి థాంక్స్. మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

శ్రీదేవి మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’తో మా అందరినీ ఎంతలా ఆదరించారో ‘బ్యాండ్ మేళం’ని కూడా అంతలానే ఆదరిస్తారని, ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నాను. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా చిత్రం మార్చి 13న రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

సతీష్ జవ్వాజీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ టీజర్ లాంచ్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ‘కోర్ట్’ తరువాత మళ్లీ ఇలాంటి మంచి కథతో రాబోతోండటం ఆనందంగా ఉంది. నాని అన్న గర్వ పడేలా నేను చిత్రాల్ని చేస్తుంటాను. మా మూవీ మార్చి 13న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తారాగణం: హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ :మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి
సంగీతం: విజయ్ బుల్గానిన్
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
DOP: సతీష్ ముత్యాల
గీతరచయిత: చద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్: నంధన గాయత్రి
PRO: వంశీ కాకా

Realistic violent love story “Cockroach” Movie grand theatrical release on March 6th

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం “కాక్రోచ్”. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “కాక్రోచ్” సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ – సునీల్ కుమార్ రెడ్డి గారితో మా కాంబినేషన్ లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. సహజమైన లొకేషన్స్ లో రిస్కీ షూటింగ్ కానీ చేశాము. సెన్సార్ వారు మా మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు స్క్రిప్ట్ చెప్పినదానికంటే ఇంకా బాగా సినిమాను తెరకెక్కించారు. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుంది. అన్నారు.

డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – నేను జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాను. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని కూడా రూపొందించాను. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నాను. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ మరియు గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. వేల కోట్ల రూపాయల మోసాలు చేసేవారిని వదిలేసే ఈ వ్యవస్థ, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారి మీద ప్రతాపం చూపిస్తుంటుంది. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. అడ్డు రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్ కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించాను. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని పరిచయం చేసే చిత్రమిది. ఇలాంటి రియలెస్టిక్ సినిమాలు కూడా చూసి ఆదరించే ప్రేక్షకులు ఉంటారని నమ్ముతున్నాం. ఈ మూవీని డార్క్ గా, ఓపెన్ గా, బోల్డ్ గా రూపొందించాం. నేను చూసిన సమాజాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశాను. కేవలం వినోదం కోసం సినిమా చూసే వారికి మా మూవీ నచ్చకపోవచ్చు. కానీ మన సమాజంలో ఉన్న చేదు నిజాన్ని చూడాలనుకునేవారికి మా మూవీ తప్పకుండా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. చిన్న పిల్లలు , సున్నిత మనస్కులు ఈ చిత్రానికి దూరంగా ఉండమని మనవి చేస్తున్నాను . అన్నారు.

నటీనటులు – అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ, మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ, తదితరులు

టెక్నికల్ టీమ్
సౌండ్ డిజైన్ – నాగరాజు
ఫైట్స్ – ప్రేమ్ సన్
లిరిక్స్ – ప్రతాప్, బాలవర్ధన్ , రఘు
ఎడిటర్ – రాఘవేందర్ రెడ్డి.పి.
యాక్షన్ ఎడిటర్: పవన్,
డీవోపీ – సంతోష్ శక్తి
మ్యూజిక్ – ప్రదీప్ చంద్ర
పీఆర్ఓ – సతీష్. కె
కలరిస్ట్: నిహిత్ వర్మ. డిజైనర్: వాసు ప్రేమ్.
నిర్మాతలు – బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ
రచన, దర్శకత్వం – పి.సునీల్ కుమార్ రెడ్డి

Film Critics Association Elects New executive committee, Honorary President Prabhu & President Battula Prasad

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరుల సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.
గౌరవాధ్యక్షులు గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్,ప్రభు ,అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఈ జనార్దన్ రెడ్డి, మరో ఉపాధ్య క్షులుగా యం డి అబ్దుల్, ప్రధాన కార్యదర్శి గా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి పర్వీన్ , భాగవతులమురళి కోశాధికారిగా,చదలవాడ భరద్వాజ, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు.ఈ సి మెంబర్స్ గా గిరిధర్ ,నరసింహ,సాయిరమేష్, RDS ప్రకాష్,అప్పాజీ, నవీన్,గోరంట్ల రవి, కుమార్, జిల్లా సురేష్ , ,శ్యామ్, చందు రమేష్, టి కేశవాచారి తదితరులను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ గౌరవాధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ.. 1969 లో ఏర్పాటు అయిన ఈ అసోసియేషన్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉంది.ఇంత చరిత్ర కలిగిన అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటికలను నిజం చేయటానికి ముందుకువచ్చి న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు గారికి అసోసియేషన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం. క్రిటిక్స్ ను అణగదొక్కాలి అని కొందరు చేసిన ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొన్నాం.. స్వర్గస్తులైన నా శ్రీమతి A దుర్గామాధవి జ్ఞాపకార్ధం 50 వేల రూపాయలు క్రిటిక్స్ కు విరాళంగా ఇస్తున్నాను అని ప్రకటించారు.

అధ్యక్షులు బత్తులప్రసాద్ మాట్లాడుతూ.. నేను మహానగర్ ఈవినింగ్ ఎడిషన్ లో 500 జీతంతో సినిమా జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించాను.ఆ సమయంలో ప్రముఖ సినిమా పి ఆర్ ఓ గిరిధర్ గారు అసిస్టెంట్ పి ఆర్ ఓ గా మరో 500 వేతనం నాకు ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిధర్ గారు నన్ను ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గార్కి పరిచయం చేశారు. ఈ రోజు నేను చదలవాడ శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యుడు గా మారాను. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల అందరిని చదలవాడ శ్రీనివాసరావు గారు తమ ఇంటి పెద్దకొడుకులు గా భావిస్తున్నారు. నేను ప్రతిరోజూ వారికి పాదాభివందనం చేసి నా దిన చర్య ప్రారంభిస్తాను వారి అభిమానం మాటలకు అందదు.మన మీద ప్రేమతో శ్రీనివాసరావు గారు అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజంచేసేందుకు ముందుకు వచ్చారు. వారికి అసోసియేషన్ అధ్యక్షులుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజుల్లో 300 కోట్ల ఆస్తిని సభ్యులకు ఇచ్చేందుకు ముందుకు రావటం శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు నిదర్శనం వారికి మరోసారి హృదయ పూర్వక కృతజ్ఞతలు . గతంలో సెక్రెటరీ గా పనిచేశాను.ఇప్పుడు అధ్యక్షులుగా అవకాశం కల్పించిన సభ్యులు అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

ప్రథాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ.. నేను కృష్ణా పత్రికలో పని చేస్తున్న సమయం నుండి ఈ క్రిటిక్స్ అసోసియేషన్ అంటే అభిమానం. ఈ అసోసియేషన్ సీనియర్స్ రాసిన ఎన్నో వ్యాసాల కటింగ్స్ అభిమానంతో దాచుకున్నాను.వార్తలో ఉద్యోగం వచ్చాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నేను ఈ అసోసియేషన్ నెంబర్ అయ్యాను.గతంలో ఈ అసోసియేషన్ కు నేను రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశాను.ఇప్పుడు కార్యదర్శి గా ఎన్నుకున్నారు. గతంలో కరోనా సమయంలో అసోసియేషన్ తరుపున ఫండ్ రైజ్ చేసి సభ్యులకు ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు కూడా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కు కృషి చేస్తాను.ఈ అసోసియేషన్ సభ్యులకు స్వంత నిధులతో స్వంత ఇల్లు కల్పించేందుకు ముందుకు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గార్కి కృతజ్ఞతలు అన్నారు.

సీనియర్ సభ్యులు బాలి రెడ్డిగారు మాట్లాడుతూ.. ఎంతో పేదవారు అయిన అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేసేందుకు ముందుకు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా ఈ రోజు అసోసియేషన్ కళ కళ లాడటానికి చదలవాడ శ్రీనివాసరావు గారి చొరవే కారణం అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు లక్ష్మణరావు , మామిడి గిరిధర్, సాయి రమేష్,భాగవతుల మురళి, పూర్వ కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు. ఎండి అబ్దుల్ వందన సమర్పణ తో సమావేశం ముగిసింది.

Mahesh vitta ‘Uthutha Herolu’ releasing in theaters on February 25

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్ విట్టా తొలిసారిగా నిర్మాణంలోకి అడుగుపెట్టారు, రాయలసీమ నేపథ్యంలో సాగే కథనాన్ని ఎంచుకున్నారు.

మహేష్ విట్ట ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత మరియు హీరోగా రాబోతున్నాడు. ఈ రాయలసీమ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి.

“ఉత్తుత్త హీరోలు” రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో హాస్యం మరియు ఉత్కంఠభరితమైన అంశాలను మిళితం చేస్తూ ఆకర్షణీయమైన కథనాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు, అలాగే “రాయలసీమ నుండి వచ్చిన మొదటి కల్ట్ ఫిల్మ్” మరియు చిత్ర షూటింగ్ మొత్తం కడప జిల్లాలో చేసినట్లు, కడప జిల్లా నుండి ఎంచుకున్న 75 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నట్లు మహేష్ విట్ట తెలిపారు. ప్రామాణికమైన రాయలసీమ భాష మరియు యాసలతో, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించడానికి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మహేష్ విట్టాతోపాటు ప్రవీణా సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వనం, హర శ్రీనివాస్, భరత్ బెహరా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్ కె జోసెఫ్ సంగీతం సమకూర్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జీవన్ బాబు (జెబి). ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌

actress Anupama Parameswaran birthday poster from the complete entertainer “Crazy Kalyanam” has unveiled

“Crazy Kalyanam” stars Naresh VK, Anupama Parameswaran, Tarun Bhascker, and Raju Weds Rambai fame Akhil Uddemari in lead roles. The film is being produced as Production No. 2 under the Arrow Cinemas banner by passionate producer Boosam Jagan Mohan Reddy. It is directed by Badrappa Gajula.

On the occasion of the birthday of the beautiful and talented actress Anupama Parameswaran, the makers of “Crazy Kalyanam” released a special poster extending their wishes to her. In the poster, Anupama is seen joyfully dancing as a bride, and the still is captivating. She will be entertaining the audience in the role of Keerthi in this film. The movie revolves around an interesting story set against the backdrop of a wedding and promises complete entertainment. “Crazy Kalyanam” has been shot in several rural areas of Telangana. The music for the film is composed by Suresh Bobbili.

Cast
Naresh VK, Anupama Parameswaran, Tarun Bhascker, Akhil Uddemari, and others

Technical Team
Costume Designer – J. Gayathri Devi
Art Director – Sai Kadir
Production Designer – Sripal Macharla
Executive Producer – Akhil Sai Srimurthy
Choreographer – Eshwar Penti
Action – Dragon Prakash
Lyrics – Gorati Venkanna, Chaitanya Prasad, Kasarla Shyam
Editor – Shravan Katikaneni
DOP – Shyam Dupati
Music – Suresh Bobbili
Screenplay – Srinivasa Ravindra (MSR)
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producer – Boosam Jagan Mohan Reddy
Story, Screenplay, Dialogues, Direction – Badrappa Gajula