Home Blog Page 31

“Devagudi” trailer launched held Grandly, Movie releasing on Jan 30

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మీడియా మిత్రుల సమక్షంలో మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమా టీజర్ ను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేసి సపోర్ట్ అందించారు. ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. సినిమాలోని ఒక్కో సీన్ అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కగా ల్యాగ్ అనిపించదు. ఈ చిత్రానికి కావాల్సినంత బడ్జెట్ పెట్టి నిర్మించాం. “దేవగుడి” సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ నెల 30న మా మూవీని థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సెంటర్స్ లో మా మూవీని రిలీజ్ చేయబోతున్నాం. సాధారణ టికెట్ రేట్స్ తో మా మూవీ మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్ లోనే సినిమాను చూడండి. అన్నారు.

హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ – హీరో కావాలనేది నా కల. ఎన్నో ఆడిషన్స్ చేశాను, కొన్నేళ్లు వేచి చూశాను. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడటం సంతోషంగా ఉంది. మాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కేవలం మా టాలెంట్ ను చూసి బెల్లం రామకృష్ణారెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కొందరు తమను హీరోగా తీసుకుంటే కోట్ల రూపాయలు సినిమాకు బడ్జెట్ ఇస్తామన్నారు. అయినా ఆయన వినలేదు. బెల్లం రామకృష్ణా రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్స్ రాశారు. చిన్న సినిమాలో ఏముంటుంది అనుకోవద్దు. చిన్న చిత్రాలను ఆదరిస్తేనే మాలాంటి కొత్త టాలెంట్ బయటకు వస్తుది. మీరంతా మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ – తెలుగు హీరోయిన్ గా మీ ముందుకు “దేవగుడి” చిత్రంతో వస్తుండటం సంతోషంగా ఉంది. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే ఎంత నెగిటివ్ గా మాట్లాడుతారో తెలుసు. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు అలా మాట్లాడిన వాళ్లే ఈ రోజు మా ఇంటికి రా అని పిలుస్తున్నారు. మా ఊరిలోనూ ఈ సినిమా పబ్లిసిటీ చేశారు. ఒకప్పుడు బాధపడిన నేను ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నా. అందుకు బెల్లం రామకృష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరంతా ఇష్టపడేలా ఉంటుంది. కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా నాతో డైరెక్టర్ చెప్పించారు. అన్నారు.

నటుడు రఘుకుంచె మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను కీలక పాత్రలో నటించాను. సీన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. నా కారుతో పాటు పది పదిహేను సుమోలతో ఛేజింగ్స్ ఉంటాయి. ఇలాంటి భారీ యాక్షన్ సీక్వెన్సులు నా కెరీర్ లో ఎప్పుడూ చేయలేదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. ఈ సినిమాకు మదీన్ ఇచ్చిన సాంగ్స్, బీజీఎం స్పెషల్ అట్రాక్షన్ అవుతాయి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ కే మదీన్ మాట్లాడుతూ – “దేవగుడి” సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత బెల్లం రామకష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆయన సూచనలతో మంచి సాంగ్స్ చేశానని అనుకుంటున్నా. పాటలతో పాటు బీజీఎం మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

డీవోపీ లక్ష్మీకాంత్ కనిక మాట్లాడుతూ – “దేవగుడి” సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. నేచురల్ లొకేషన్స్ లో బ్యూటిఫుల్ విజువల్స్ తో సినిమా తెరకెక్కించాం. టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. అన్నారు.

నటీనటులు – అభినవ శౌర్య, నరసింహ తోషి, అను శ్రీ, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, ఇమ్మానియేల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ – పుష్యమి ఫిలింమేకర్స్
సమర్పణ – బెల్లం సుధ రెడ్డి
దర్శక నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి
సంగీతం: ఎస్ , కె మదీన్
డిఓపి: లక్ష్మీకాంత్ కనిక
ఎడిటర్: వి. నాగిరెడ్డి
పిఆర్ఓ: నాగేశ్వరరావు

‘Raakaasaa’ Glimpse Impresses with Comedy Timing; Sangeeth Shobhan Shines as a Solo Hero

సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతోన్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపుని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రాబోతోన్నారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘రాకాస’ గ్లింప్స్ వదిలి అందరిలోనూ చిత్రం మీద ఆసక్తిని రేకెత్తించారు.

‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ సాగింది. అయితే ఆ తరువాత ఒక్కసారిగా అది కామెడీ, సెటైరికల్ టర్న్ ఇచ్చుకుంది. ఇక ఇందులో సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ మెప్పిస్తాడని, అందరినీ ఆకట్టుకుంటాడని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశారు.

ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కథతోనే మరో ప్రయోగం చేస్తున్నట్టుగా ఈ గ్లింప్స్ చెబుతోంది. ఇక ఇందులో సంగీత్ శోభన్ తనలోని మరో కోణాన్ని చూపించేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలం అని ఈ గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. కామెడీతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్తదనాన్ని చూపించేలా కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌ అమ్మ, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్:  పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, జీ స్టూడియోస్‌,  l నిర్మాత‌లు:  నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌ l క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం:  మాన‌స శ‌ర్మ‌ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌న్యం ర‌మేష్‌ l ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌ l సంగీతం: అనుదీప్ దేవ్‌ l సినిమాటోగ్రాఫ‌ర్‌:  రాజు ఎదురోలు l యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  విజ‌య్‌ l ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ l ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  రామాంజ‌నేయులు l ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్‌ l కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు l పి.ఆర్.ఒ:  ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వుయ్ మీడియా l మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ

‘Chai Wala’ title song launched by City Commissioner VC Sajjanar, Movie Releasing on Feb 6

శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో..

*సిటీ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ* .. ‘మన జీవితంలో చాయ్ అనేది ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. శివ కందుకూరి లాంటి యంగ్ హీరో, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో నటించారు. నీలోఫర్ బాబుగారు అందరికీ స్పూర్తి. ఆయన ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఫిబ్రవరి 6న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ మూవీని చూసి హిట్ చేసి, యంగ్ టీంని ఆశీర్వదించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అని అన్నారు.

*నీలోఫర్ ఫౌండర్ బాబురావు మాట్లాడుతూ* .. ‘నేను చాయ్‌తోనే ఈ స్థాయికి వచ్చాను. ఈ ‘చాయ్ వాలా’ కార్యక్రమానికి నన్ను పిలవడం ఆనందంగా ఉంది. చాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. చాయ్ వాలా అనే పేరు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారు. ఈ చాయ్ వాలా మూవీతో టీం అందరికీ మంచి గుర్తింపు రావాలి. సజ్జనార్ గారి హస్తవాసి చాలా మంచిది. ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

*సత్యనారాయణ మాట్లాడుతూ* .. ‘ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం చాయ్ తాగుతూనే ఉంటాం. నేను బాబురావు గారితో కలిసి పని చేశాను.

*కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ మాట్లాడుతూ* ..  ‘అందరినీ కనెక్ట్ అయ్యే సినిమా తీయాలని ప్రమోద్ చెబుతుండేవాడు. చాయ్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఇక ఇందులో తండ్రీకొడుకుల రిలేషన్‌ను చూపించాడు. ‘చాయ్ వాలా’ టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

*నీలోఫర్ కేఫ్ ఎండీ శశాంక్ మాట్లాడుతూ* .. ‘నేను ఎక్కువగా సినిమాలు చూస్తాను. మా నాన్న బాబురావు గారు అస్సలు సినిమాలు చూడరు. కేవలం ‘చాయ్ వాలా’ అనే టైటిల్ చూసి ఇక్కడకు వచ్చారు. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ను చక్కగా చూపించబోతోన్నారు. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

*రాజ్ కందుకూరి మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుంటుంది. అంతే కాకుండా చాయ్‌కి, షాప్ ఓనర్‌కి కూడా ఓ అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఎమోషన్‌ను ప్రమోద్ అద్భుతంగా రాసుకున్నారు. ఇలాంటి కథను సపోర్ట్ చేసిన నిర్మాత వెంకట్ గారికి హ్యాట్సాఫ్. ఈ కథ విన్న తరువాత ఫాదర్ పాత్రని ఎవరు పోషిస్తారా? అని అనుకున్నాను. కానీ ప్రమోద్ మాత్రం ముందు నుంచీ రాజీవ్ కనకాల గారినే అనుకున్నారు. ఈ చిత్రంలో అందరి పాత్రలు అద్భుతంగా వచ్చాయి. ప్రశాంత్ గారి పాటలు, ఆర్ఆర్ బాగా వచ్చింది. పవన్ ఎడిటింగ్, సురేష్ లిరిక్స్ బాగుంటాయి. ఇందులో కొత్త శివని చూస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ చూసి నేను కూడా ఎమోషనల్ అయ్యాను. ఫిబ్రవరి 6న ఈ మూవీని చూడండి. మనస్పూర్తిగా ఈ సినిమాను చూడండి. నచ్చితే మౌత్ టాక్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

*శివ కందుకూరి మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ గురించి మా టీం చెప్పిన మాటలు అందరూ విన్నారు. మా సినిమాని ఎంత కష్టపడి, ఇష్టపడి చేశామో వారి మాటలే చెబుతాయి. ఈ మూవీలోని ఎమోషన్ అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌లో రాజీవ్ కనకాల గారు ప్రాణం పెట్టేశారు. రాజీవ్ గారి లాంటి అద్భుతమైన నటుడుతో యాక్ట్ చేయడంతో నేను ఎంతో నేర్చుకున్నాను. ‘చాయ్ వాలా’ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం. ఫిబ్రవరి 6న అందరూ థియేటర్‌కు వచ్చి మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

*ప్రమోద్ హర్ష మాట్లాడుతూ* .. ‘నన్ను నమ్మి సపోర్ట్ చేసిన నా నిర్మాత వెంకట్ గారికి థాంక్స్. మా కోసం వచ్చిన సజ్జనార్ గారు, బాబురావు గారు, వర్మ గారు, శశాంక్ గార్లకు థాంక్స్. ‘చాయ్ వాలా’ సినిమాకి ప్రశాంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ గారి సాహిత్యం చక్కగా కుదిరింది. ఈ మూవీకి రాజీవ్ కనకాల ప్రాణం. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన రాజ్ సార్‌కు థాంక్స్. ఈ చిత్రంలో శివ అదరగొట్టేశారు. నేను ఈ మూవీ విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమా నచ్చితే అందరికీ చెప్పి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

*రాజీవ్ కనకాల మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ చిత్రానికి ప్రశాంత్ అద్భుతమైన సంగీతం అందించారు. సురేష్ గారు మంచి పాటల్ని రాసిచ్చారు. సుప్రియ గారు వేసిన సెట్స్ ఎంతో నేచురల్‌గా ఉంటాయి. క్రాంతి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వెంకట్ గారు టీంని ఎంతో సపోర్ట్ చేశారు. నటుడిగా శివ నాకు చాలా ఇష్టం. నాలోని యాక్టింగ్ స్కిల్‌ని బయటకు తీసుకు రావడానికి శివ యాక్టింగ్ కూడా ఓ కారణమైంది. హీరోయిన్ తేజు కూడా చక్కగా నటించారు. కొడుక్కి సపోర్ట్‌గా నిలిచే తీరులో రాజ్ కందుకూరికి హ్యాట్సాఫ్. తప్పొప్పుల్ని చెబుతూ శివని గొప్పగా గైడ్ చేస్తుంటారు. శ్రీనివాస్ గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. ప్రమోద్‌ చాలా మంచి వ్యక్తి. సినిమా కోసం చాలా కష్టపడుతుంటాడు. అద్భుతమైన కథతో గొప్పగా తీశారు. ఈ మూవీతో ప్రమోద్‌కి కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని అన్నారు.

*సహ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ ఫ్యామిలీ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కథలోంచే ఈ టైటిల్ వచ్చింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌తో రానున్న ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫిబ్రవరి 6న అందరూ మా సినిమాను చూడండి’ అని అన్నారు.

*కెమెరామెన్ క్రాంతి వర్ల మాట్లాడుతూ* .. ‘ప్రమోద్‌కి, నాకు ఇది తొలి చిత్రం. చాయ్‌తో డే ఎలా స్టార్ట్ అవుద్దో ఈ చిత్రంతో మా జర్నీ కూడా అలానే స్టార్ట్ అవ్వాలి. నాకు అవకాశం ఇచ్చిన ఈ టీంకు థాంక్స్’ అని అన్నారు.

*ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ* .. ‘ప్రమోద్ చాలా మంచి వ్యక్తి. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయనకెంతో సహనం ఉంటుంది. నిర్మాత వెంకట్ గారు మాకెంతో సపోర్ట్ చేశారు. శివ అద్భుతంగా నటించారు. ఈ మూవీతో ఆయన ఎంతో ఎత్తుకు ఎదుగుతారు’ అని అన్నారు.

*లిరిసిస్ట్ సురేష్ బనిసెట్టి మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ చిత్రంలో అన్ని పాటలు నేనే రాశాను. ఈ మూవీకి మంచి మ్యూజిక్ అవసరం. నాకు అవకాశం ఇచ్చిన ప్రమోద్ గారికి, ప్రశాంత్ గారికి థాంక్స్. చాయ్ అనే పదం లేకుండా, వినకుండా రోజు గడవదు. ఈ మూవీలో అందరూ అద్భుతంగా నటించారు. ఫిబ్రవరి 6న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

*ఎడిటర్ పవన్ నరవ మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఫిబ్రవరి 6న ఈ సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు.

*స్క్రీన్ ప్లే రైటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ* .. ‘ప్రమోద్ చెప్పిన కథ విని వెంటనే మా నాన్న గారికి ఫోన్ చేశాను. ఈ మూవీని చూసిన తరువాత అందరూ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడతారు. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

తారాగణం: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది
రచయిత & దర్శకుడు: ప్రమోద్ హర్ష
నిర్మాత: రాధా వి పాపుడిప్పు
సహ నిర్మాత: వెంకట్ ఆర్ పాపడిప్పు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
కెమెరామెన్: క్రాంతి వర్ల
ఎడిటర్: పవన్ నరవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శశి కె నారాయణ
గీత రచయిత: సురేష్ బనిసెట్టి
పిఆర్ఓ: వంశీ కాకా

“Golla Ramavva” Movie Streaming on ETV Win from January 25

తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన “గొల్ల రామవ్వ” తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని… ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను… సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. యువ ప్రతిభాశాలి అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు… సాహిత్యం సమకూర్చడం విశేషం!!

ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం “మౌనమే నీ భాష” చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వస్తున్న “గొల్ల రామవ్వ” ఈనెల 25 (జనవరి 25) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. “తెలుగు సీతామాలక్ష్మి” తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో పి.వి.నరసింహారావు తనయులు పి.వి.ప్రభాకరరావు, తనయ – బారాస ఎమ్.ఎల్.సి. శ్రీమతి సురభి వాణీదేవి, ప్రముఖ గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, “రజాకార్” దర్శకులు యాటా సత్యనారాయణ, సీనియర్ దర్శకులు ఉదయభాస్కర్ పాల్గొని… చిత్ర దర్శకుడు ముళ్ళపూడి వరా, నిర్మాతలు రామ్ విశ్వాస్ హనూర్కార్, రాఘవేంద్రవర్మలను అభినందించారు. మా నాన్నగారు రాసిన గొప్ప కథల్లో ఒకటైన “గొల్ల రామవ్వ”ను ఎంతో గొప్పగా తెరకెక్కించారని వాణీదేవి ప్రశంసించారు. చిత్రబృందం పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాలుపంచుకుని… ఈ సినిమాకి పనిచేసే అదృష్టం లభించడం పట్ల గర్వం వ్యక్తం చేశారు. ఈనెల 25 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం కానున్న ఈ చిత్రం తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకుంటుందని పేర్కొన్నారు!!

ఈ చిత్రానికి… పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, నటీనటులు : అల్లు గీత, అన్విత్, మణి మంతెన, గానం : వరం, సంగీతం: సాయి మధుకర్, ఛాయాగ్రహణం: గంగమోని శేఖర్, కూర్పు: రాఘవేంద్రవర్మ, రచన: బయ్యవరపు రవి, కార్యనిర్వాహక నిర్మాత – సాహిత్యం: అజహర్ షేక్, నిర్మాతలు: రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి), చిత్రనువాదం – దర్శకత్వం: ముళ్ళపూడి వరా!!

Hero Varun Sandesh “Hello It’s Me” title and first look poster launched held grandly

ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా “హలో ఇట్స్ మీ”. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. షగ్నశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ – నేను షగ్నతో గతంలో ఓ షార్ట్ ఫిలిం చేశాను. అందులో నాది ఆమెకు ఫాదర్ రోల్. అప్పటి నుంచి డాడీ అని పిలుస్తుంటుంది. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా తల్లిదండ్రి రాజశేఖర్ అని పేరు పెడితే, ఈ కళామతల్లి శుభోదయం సుబ్బారావు అనే పేరు పెట్టింది. అన్నారు.

నటుడు డా. భద్రమ్ మాట్లాడుతూ – హలో ఇట్స్ మీ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. వరుణ్ సందేశ్ గారితో నేను గతంలో నింద అనే మూవీలో నటించాను. ఆయన పర్ ఫార్మెన్స్ కు ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో కూడా ఆయన నటనకు పేరొస్తుంది. షగ్న ఈ సినిమాను ఎంతో పట్టుదలగా రూపొందించింది. ఈ నిర్మాతలకు ఎన్నో వ్యాపారాలు ఉన్నా సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో వచ్చారు. అన్నారు.

నటుడు జశ్వంత్ మాట్లాడుతూ – హలో ఇట్స్ మీ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమా చూశాక ఒక అబ్బాయి ఎలాంటి తప్పు చేయకూడదో ఒక అమ్మాయి ఎలాంటి తప్పు చేయకూడదో తెలుసుకుంటారు. ఈ సినిమాతో దర్శకురాలిగా షగ్నకు మంచి పేరొస్తుంది. అన్నారు.

నటి నందిని మాట్లాడుతూ – నటిగా నా ఫస్ట్ మూవీ ఇది. తొలి చిత్రమే నా ఫేవరేట్ హీరో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, హీరోయిన్ షగ్న, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

డీవోపీ బ్రహ్మతేజ మరిపూడి మాట్లాడుతూ – ఈ చిత్రాన్ని షగ్న అన్నీ తానై వన్ మ్యాన్ ఆర్మీలా రూపొందించింది. మనకు ఆ మధ్య విపరీతంగా చలి వాతావరణం వచ్చింది. ఆ టైమ్ లో మేము నైట్ షూటింగ్ చేశాం. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతాయి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన మాట్లాడుతూ – హలో ఇట్స్ మీ వంటి ఒక మంచి మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు సమాజంలో యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్ని ఈ చిత్రంలో ఆకట్టుకునేలా చూపిస్తున్నారు. వరుణ్ సందేశ్ గారు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాక మ్యూజిక్ డైరెక్టర్ గా నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. ఆయనకు కూడా మా పాటలు అన్నీ బాగా నచ్చాయి. అన్నారు.

ప్రొడ్యూసర్ సంజీవ్ మాట్లాడుతూ – ఈ సినిమా అనౌన్స్ చేశాక నాకు నా సర్కిల్ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సక్సెస్ ఫుల్ గా బిజినెస్ లో ఉన్న మీరు ఫిలింమేకింగ్ లోకి ఎందుకు వచ్చారు. ఇక్కడ సక్సెస్ కు గ్యారెంటీ లేదు అని అన్నారు. అలాగే హీరోయిన్ ను డైరెక్టర్ గా పెట్టి సినిమా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. షగ్న కథ చెప్పిన విధానంలో ఆమె ప్యాషన్ కనిపించింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఏదో సాధించాలనే తపన ఉన్న అమ్మాయి షగ్న. స్వతహాగా కష్టపడి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా మారిన తర్వాత కూడా అక్కడితో ఆగకుండా ఇప్పుడు దర్శకురాలిగా మెగాఫోన్ పడుతోంది. ఇలా ప్యాషన్ ఉన్న వారికి సపోర్ట్ చేసేందుకైనా సినిమా నిర్మించాలని అనిపించింది. వరుణ్ సందేశ్ గారు ఒక బ్రదర్ లా మాతో ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సహకారం మర్చిపోలేము. మా టీమ్ అంతా కష్టపడి ప్యాషనేట్ గా మూవీ చేస్తున్నారు. మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు షూటింగ్స్ కు రాలేము, బిజినెస్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను. కానీ ఒక్కరోజు షూటింగ్ కు వెళ్లాక వీళ్లంతా ఇష్టంగా పనిచేస్తున్న తీరు చూసి రోజూ షూటింగ్ కు వెళ్తున్నాం. త్వరలోనే మంచి కంటెంట్ తో మీ ముందుకు సినిమాను రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ – షగ్న హీరోయిన్ గా, దర్శకురాలిగా ఈ మూవీ కోసం చాలా కష్టపడింది. హీరోయిన్ గా తన క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేస్తూనే, సినిమాను డైరెక్ట్ చేయడం అంటే సులువు కాదు. వరుణ్ గారిని మేము ఇష్టపడతాం. ఆయన ప్రాజెక్ట్ లోకి వచ్చాక మా ఎగ్జైట్ మెంట్ రెట్టింపు అయ్యింది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణం. వంశీకాంత్ ఇచ్చిన ఆరు పాటలు చాలా బాగుంటాయి. టీమ్ అంతా కష్టపడి చేసిన ఈ సినిమా మీ అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది. అన్నారు.

నింద దర్శకుడు రాజేశ్ జగన్నాథం (ఆర్జే) మాట్లాడుతూ – ఒక యంగ్ హీరోయిన్ తను నటిస్తూ, దర్శకత్వం చేయడం చాలా అరుదు. షగ్నను మనమంతా అప్రిషియేట్ చేయాలి. సంజీవ్, సందీప్, సంకీర్త్ ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వాళ్లతో నేను ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా చేస్తున్నాను. వరుణ్ వరుసగా థ్రిల్లర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో అతను ఒక మంచి ఫ్యామిలీ, రోమ్ కామ్ జానర్ లో చూస్తాం. అన్నారు.

హీరోయిన్, డైరెక్టర్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ – డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా. మంచి కథా కథనాలతో సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. యూత్ అంతా మా చిత్రానికి కనెక్ట్ అవుతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు హీరోయిన్ దర్శకత్వంలో సినిమా ఎందుకని నెగిటివ్ గా మాట్లాడారు. మా ప్రొడ్యూసర్స్ నాపై నమ్మకం ఉంచి, ఎవరి సందేహాలు వినకుండా సినిమా చేశారు. సినిమాను దర్శకత్వం చేయడంలో ఆడా, మగా తేడా ఏం లేదు. మనం అనుకున్న సీన్ అనుకున్నట్లు రూపొందించామా లేదా అనేది కావాలి. అందుకు టీమ్ అంతా సపోర్ట్ చేయాలి. నాకు అలాంటి మంచి సపోర్టింగ్ టీమ్ దొరికింది. వరుణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు ఈ కథ కొన్ని గంటలు చెప్పాను. సహనంగా విన్నారు. అలాగే ఎక్కువ టైమ్ షూటింగ్ చేసేవారు. ఇంకొద్ది రోజులే షూటింగ్ మిగిలి ఉంది. మా ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, నా డైరెక్షన్ టీమ్, మా ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరో దర్శన్ మదమంచి మాట్లాడుతూ – షగ్న ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ క్యారెక్టర్ లో తప్పకుండా పర్ ఫార్మ్ చేయాలని అనుకున్నాను. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. నాకు ఇలాంటి ఆఫర్ వచ్చేందుకు కొన్నేళ్ల టైమ్ పట్టింది. ప్రతి ఆర్టిస్టుకు తనదైన టైమ్ తప్పకుండా వస్తుంది. ఈ రోజు నేను వేదిక మీద నిలబడ్డా. రేపు మీరూ నిలబడతారు. ఈ సినిమాతో మా అందరినీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – నా రీసెంట్ ప్రాజెక్ట్ నయనం అందరి ఆదరణ పొందుతోంది. ఇటీవల వరుసగా థ్రిల్లర్స్ చేస్తూ వస్తున్నాను. అలాంటి టైమ్ లో హలో ఇట్స్ మీతో ఒక మంచి ఫ్యామిలీ, లవ్ మూవీ చేస్తున్నాను. ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్ గా ఈమూవీలో చూపించింది. ఆమె స్టోరీ నెక్ట్స్ లెవెల్ లో చెప్పింది. అప్పుడే డైరెక్టర్ గా ఆమెను నమ్మాను. షగ్న తప్పకుండా మంచి సినిమా చేస్తుందని బిలీవ్ చేశాను. నా రీసెంట్ ప్రాజెక్ట్ నయనం కూడా లేడీ డైరెక్టర్ స్వాతి చేశారు. నాకు హిట్ ఇచ్చారు. షగ్న కూడా ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను. నా మూవీస్ కొత్తబంగారు లోకం, హ్యాపీడేస్ సాంగ్స్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఆడియెను మిస్ అవుతున్నాను అనుకున్నాను. ఈ చిత్రంలోని పాటలతో ఆ కొరత తీరనుంది. ఈ మూవీ సాంగ్స్ ను కొన్నేళ్ల వరకు వింటూనే ఉంటారు. వంశీకాంత్ అంతమంచి ఆడియో ఇచ్చారు. ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ సందీప్, సంజీవ్, సంకీర్త్ లకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలి. అన్నారు.

నటీనటులు – వరుణ్ సందేశ్, షగ్న శ్రీ వేణున్, దర్శన్ మదమంచి, ఆమని, కల్పలత, డా.భద్రమ్, నందినీ, దీపక్, శుభోదయం సుబ్బారావు, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ – దర్శిత్
కొరియోగ్రాఫర్ – శ్రవణ్ ముప్పిరి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – బ్రహ్మతేజ మరిపూడి
సంగీతం – వంశీకాంత్ రేఖన
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్
స్టోరీ, డైరెక్షన్ – షగ్న శ్రీ వేణున్

“Historic Band Capricio USA Tour 2026” poster unveiled by Singer Sunita

ప్రఖ్యాత ప్లేబ్యాక్ సింగర్ సునీత హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో బ్యాండ్ క్యాప్రిసియో యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇది ఏ తెలుగు బ్యాండ్ ఇప్పటివరకు చేయని విధంగా అత్యంత భారీ యూఎస్ఏ టూర్ ప్రారంభానికి నాంది పలికింది.

ఈ సందర్భంగా బ్యాండ్ క్యాప్రిసియో సభ్యులు ఎక్నాథ్ కిరణ్ మరియు శ్రావణ్ మాట్లాడుతూ, తమ సంగీత ప్రయాణ ప్రారంభ దశలోనే సునీత గారు మొదటిసారిగా తమను యూఎస్ఏకు టూర్‌కు తీసుకెళ్లిన సంగీతకారిణి అని గుర్తుచేశారు. ఇప్పుడు అదే సునీత గారు తమ దాదాపు 30 నగరాల
యూఎస్ఏ టూర్ పోస్టర్‌ను ఆవిష్కరించడం తమకు ఫుల్ సర్కిల్ మూమెంట్‌లా ఉండటమే కాకుండా ‘ఐసింగ్ ఆన్ ద కేక్’ లా అనిపించిందని వారు భావోద్వేగంగా తెలిపారు.

యూఎస్ఏ టూర్ 2026 మొత్తం అమెరికా వ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో జరగనుండగా, ఇది ఏ తెలుగు బ్యాండ్ ఇప్పటివరకు ప్రయత్నించని స్థాయిలో జరుగుతున్న చారిత్రక టూర్‌గా నిలవనుంది. ఈ టూర్‌లో తొలి దశగా RISE టూర్ పేరుతో ఫిబ్రవరి–మార్చి 2026లో ప్రదర్శనలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ:“తమ ప్రారంభ రోజుల్లో చూసిన బ్యాండ్ క్యాప్రిసియో ఈ రోజు 30 నగరాల యూఎస్ఏ టూర్‌కు సిద్ధమవడం నాకు ఎంతో గర్వంగా ఉంది.
ఈ చారిత్రక ప్రయాణానికి ఆరంభం చేయగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టూర్ ఘన విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.”

ఈ టూర్‌ను వెడమ్ ఆర్ట్ ప్రెజెంట్ చేస్తుండగా, ఎలెవెన్ పాయింట్ టూ కో-ప్రెజెంట్ చేస్తోంది. వెడమ్ ఆర్ట్ యూఎస్ఏ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థగా, ఉత్తర అమెరికా మరియు భారత్‌లో భారీ స్థాయి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే యూఎస్ఏలో *మొదటిసారిగా ఇండియన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఫెస్టివల్ ‘గిగ్‌వెడమ్’*ను నిర్వహించిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కుతుంది.

తమ విస్తృతి, ఆశయం మరియు అపూర్వ స్థాయి ప్రణాళికతో, బ్యాండ్ క్యాప్రిసియో యూఎస్ఏ టూర్ 2026 ప్రపంచ వేదికపై తెలుగు లైవ్ మ్యూజిక్‌కు ఒక చారిత్రక అధ్యాయంగా నిలవనుంది.

‘Prema Madhuram’ Title launched held grandly

జే.ఎల్ 14 రీల్ సినిమా ప్రొడక్షన్ మరియు ఎన్ జి ర్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఎస్కే జలీల్, స్వామి దాసు నాగరత్నం నిర్మాతలుగా పరకోటి బాలాజీ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ప్రేమ మధురం (ఇద్దరూ ఒకటయ్యారు). ఈ చిత్రానికి నిర్మాత నిర్మాత డాక్టర్ ఎస్.కె. జలీల్ లిరిక్స్ అందించడం మరొక విశేషం. చంటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ ప్లేయర్ సంధ్య తో పాటు సుష్మ, దాక్షాయిని హీరోయిన్స్ గా నటించారు. జబర్దస్త్ గడ్డం నవీన్, పంచ్ ప్రసాద్, వింజమూరి మధు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బుస్సా బాలరాజు ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.

తెలుగు ఫిలిం చాంబర్ కోశాధికారి ముత్యాల రామదాసు గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజుల్లో ఒక చిన్న సినిమా తీయడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఆసక్తితో సినిమా చేయడానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఖర్చులు అలాగే విడుదల చేసే సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల సినిమాలు చేయడం కష్టమైపోతుంది. అయినప్పటికీ నిర్మాతలు వస్తూనే ఉన్నారు, అది పూర్తిగా కళామతల్లి గొప్పతనం. చిత్ర దర్శకుడికి, నిర్మాతలకు ఆల్ ద బెస్ట్. ఫిలిం ఛాంబర్ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రేమ మధురం అనే టైటిల్ చాలా బాగుంది. అందరూ ఈ చిత్రాన్ని ప్రోత్సహించాలి. అన్ని తరాల వారు చూసే విధంగా సినిమాలు రావాలి” అన్నారు.

తెలుగు ఫిలిం చాంబర్ జాయింట్ సెక్రెటరీ మోహన్ వడ్లపట్ల గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ప్రేమ మధురం చిత్ర బంధం అందరికీ పేరుపేరునా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు పరకోటి బాలాజీ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ప్రేమ మధురం అనే చిత్రం ఫ్యామిలీతో చూడదగిన కామెడీ ఇంకా యాక్షన్ ఉన్న చిత్రం. ప్రస్తుతం ప్రేక్షకులు కామెడీ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలలో నటిస్తున్న చంటి గారు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆయన పాత్ర ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మా చిత్ర బృందానికి అండగా నిలబడిన మోహన్ వడ్లపట్ల గారికి, ముత్యాల రామదాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు పోతున్నాను. ప్రేక్షకులు అంతా మా సినిమాను ఆశీర్వదించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడతారని కోరుకుంటున్నాను. అలాగే నేను గరుడ అనే మరొక చిత్రాన్ని నేను దర్శకత్వం చేయబోతున్నాను” అన్నారు.

గడ్డం నవీన్ మాట్లాడుతూ... “నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా దర్శక నిర్మాతలకు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా షూటింగ్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అటువంటి కంటెంట్ ఉన్న చిత్రం ప్రేమ మధురం. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాతలకు మరొక నాలుగు సినిమాలు చేసేందుకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. చిత్రంలో నటించిన అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు.

నటుడు వింజమూరి మధు మాట్లాడుతూ... “నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ నా నమస్కారం. ఈ సినిమాకు బలమైనటువంటి నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు, సంపాదన వచ్చి సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సమాజంలో ప్రేమ మధురం అనే నానుడి ఎక్కువ ఉంది. ఆ మధురాన్ని ఈ చిత్రంలో మరింత మధురంగా దర్శకులు చూపించడం జరిగింది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ దాక్షాయిని మాట్లాడుతూ… “ఇది నా తొలి చిత్రం. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హీరోయిన్గా నటించడం నా చిన్ననాటి కల. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ ప్లేయర్ సంధ్య మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. హీరోయిన్ గా నటించిన నా కల. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది” అన్నారు.

హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ... “అందరికి నమస్కారం. నేను ఇప్పటికే కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఈ సంవత్సరంలో కూడా కొన్ని విడుదలకు ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో కూడా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం షూటింగ్ కి వెళ్ళాక నా కో ఆర్టిస్టులు అంతా నాతో సహకరించి ఈ సినిమా మంచి విజయం సాధించేందుకు అండగా నిలబడతారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో చంటి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకు ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్ర కథ నాకు చాలా నచ్చింది. చాలా మాస్ గా ఉంటుంది. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. మరొకసారి ఈ వేడుకకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటీనటులు : చంటి, దాక్షాయిని, సుష్మ, సంధ్య, గడ్డం నవీన్, వింజమూరి మధు, పంచ్ ప్రసాద్, గరుడా రవీంద్ర, కోటేశ్వర రావు తదితరులు.

సాంకేతిక బృందం :
రచనా దర్శకుడు : పరకోటి బాలాజీ
నిర్మాతలు : ఎస్కే జలీల్, స్వామి దాసు నాగరత్నం
ప్రొడక్షన్ మేనేజర్ : బుస్సా బాలరాజు

Vijay and Samantha’s film ‘Police’ to be re-released on the 23rd of this month

The Tamil film ‘Theri’, starring star hero Vijay and top heroine Samantha, directed by sensational director Atlee and produced by Kalaipuli S. Thanu under the V Creations banner, was a grand success. It was dubbed into Telugu as ‘Police’ and won the hearts of the audience, becoming a super hit film. This film is now ready to create a buzz on the silver screen once again. The film ‘Police’ will be re-released on the 23rd of this month.

The film is being released on a large scale in the Nizam region by the leading distribution company Asian Films, and in Andhra by Suresh Movies. With the news of the re-release already receiving a huge response on social media, Vijay’s fans and film lovers are eagerly waiting to watch this emotional action entertainer in theaters once again.

Atlee crafted ‘Police’ by blending father-daughter bonding, a police backdrop, emotions, action, and commercial elements in equal measure. Vijay impressed in a dual role, and Samantha’s character greatly appealed to the audience. Amy Jackson also played another female lead. The roles of Prabhu and Radhika Sarathkumar were also crucial to the film. In particular, the climax scenes and emotional moments were the highlights of the film.

The songs composed by G.V. Prakash Kumar for this film were chartbusters at the time. The background music, cinematography, and action sequences played a key role in attracting audiences to the theaters. This film, ‘Police’, further strengthened Vijay’s already strong fan base in Telugu as well.
Now, with its re-release in improved quality using modern technology, trade circles believe that this film will once again prove its mettle at the box office. This is truly sweet news for Vijay and Samantha’s fans.

‘Shuddh Vilas Restaurant’ Malaysia Branch Launched

Malaysia’s Member of Parliament Datuk Seri Dr. M. Saravanan inaugurated the second branch of Shuddh Vilas Restaurant at Cyberjaya, on January 5th. The first branch of Shuddh Vilas is already operating in Malkajgiri, Hyderabad. The management expressed their delight at launching their second branch in Malaysia, aiming to offer the local community the best hygienic and authentic South Indian food. They also revealed plans to expand their branches to several other countries globally.

At this event, Shuddh Vilas founders Shashikanth, Sriram and other partners have participated.

Speaking on the occasion, Founders said , “Our Malkajgiri branch in Hyderabad has been running successfully. Customers there have been giving us excellent feedback about our food quality. With the same enthusiasm, we have now opened our branch in Malaysia. Soon, we will be expanding to Dubai and many other countries as well. Our goal is to provide the best hygienic and high-quality South Indian food. By offering a variety of dishes with uncompromised quality, we aim to ensure complete satisfaction for food lovers as we expand Shuddh Vilas across India and abroad.”

Malaysia’s Member of Parliament Datuk Seri Dr. M. Saravanan said they warmly welcome Shuddh Vilas to Malaysia, noting the rising demand for healthy and hygienic food. He expressed confidence that the brand would establish its prominence by serving the best food to the people of Malaysia.

Filming for RV Film House’s first project ‘Kokkoroko’ has been completed successfully.

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం “కొక్కొరోకో” షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు.

సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో, ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా “కొక్కొరోకో” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా, బలమైన విజువల్స్‌తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026లో విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే
“మనస్విని బాలబొమ్మల” అనే ప్రతిభావంతమైన కళాకారిణి ఈ చిత్రంతో సినీ అరంగేట్రం చేయడం. “కొక్కొరోకో”లో ఆమె గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. మనస్విని థియేటర్‌లో శిక్షణ పొందిన నటి. Little Women నాటకంలో Jo, Much Ado About Nothingలో Beatrice వంటి ప్రధాన పాత్రలు పోషించింది. అంతేకాదు, ఆమె సంప్రదాయ పేర్ని నాట్యం, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం కలిగి ఉంది. Glendale Academyలో భక్తిగీత ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు ముఖ్యమైన స్కూల్ ఈవెంట్స్‌కు యాంకర్‌గా కూడా వ్యవహరించింది. చిత్రబృందం తెలిపిన ప్రకారం, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, ఫ్రెష్ కథనాలతో, విజువల్‌గా మరియు భావోద్వేగాత్మకంగా ప్రత్యేకమైన అనుభూతిని అందించడమే “కొక్కొరోకో” లక్ష్యం.

సాంకేతిక వివరాలు:
నిర్మాతలు: రేఖా వర్మ, కూరపాటి శిరీష
దర్శకత్వం: శ్రీనివాస్ వసంతాల (డెబ్యూ)
కథ – స్క్రీన్ ప్లే: రమేష్ వర్మ
సంగీతం: సంకీర్తన్
ఛాయాగ్రహణం: ఆకాశ్ ఆర్. జోషి
మాటలు: జీవీ సాగర్