Home Blog Page 32

Blockbuster filmmaker Gunasekhar’s ‘Euphoria’ Trailer Launched held grandly,Movie Releasing on Feb 6th

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ‌, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజ‌ర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్ప‌టికే సినిమా నుంచి విడుద‌లైన టీజర్, గ్లింప్స్‌, ఫ్లై హై పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో చాలా రా అండ్ ఇంటెన్స్‌గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా, డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసుకుంటున్నారనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. “ఆమె చేసిన నేరం ఏంటి?” అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది.

పోలీస్ కమిషనర్ జయదేవ్ నాయర్‌గా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కేసును ఛేదించే క్రమంలో ఆయన ‘పోక్సో’ చట్టాన్ని ఎలా ప్రయోగించారు? ఆధారాలను ఎలా సేకరించారు? అనే అంశాలను గుణశేఖర్ ఎంతో సహజంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీలిమా గుణశేఖర్ నిర్మాణంలో, కాల భైరవ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. కేవలం డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలనే కాకుండా, బాధ్యతాయుతమైన పేరెంటింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమా చెప్పబోతోంది. వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌తో రాబోతున్న యుఫోరియాలో గుణ శేఖ‌ర్ అస‌లేం చూపించ‌బోతున్నారో చూడ‌టానికి అంద‌రూ ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన‌ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు అడ్డాల పృధ్వీరాజ్ మాట్లాడుతూ..‘‘గుణశేఖర్ గారు యుఫోరియా కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. యంగ్ ఐడియాలజీతో చాలా టెర్రిఫిక్‌గా రాశారు. ఆయన స్టేచర్‌కు మాలాంటి కొత్తవాళ్లతో సినిమా తీయాల్సిన అవసరం లేదు. థ్యాంక్యూ సోమచ్ సర్.’’ అని తెలిపారు.

నటుడు విఘ్నేష్ గవిరెడ్డి మాట్లాడుతూ..‘‘మ్యూజిక్ చాలా బాగుంది. నేను కాలభైరవ ఫ్యాన్. నా సినిమా ఆయన సంగీతం ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇండస్ట్రీలోకి రావడం నాకు ఒక ఫాంటసీ. నేను యాక్టింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడే ఛాన్స్‌లు వస్తాయా రావా అని ఉండేది. కానీ గుణశేఖర్ గారి డైరెక్షన్‌లో నాకు ఛాన్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిర్మాతలు నీలిమా, రాగిణి గారికి చాలా థ్యాంక్స్. ‘ధురంధర్’ బ్యూటీ సారా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. భూమిక గారితో పని చేయడం నా అదృష్టం. ఇది టెంప్లేట్ లేని సినిమా. చాలా హానెస్ట్‌గా తీశాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.’’ అని చెప్పారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ..‘‘ట్రైలర్ చూశాక చాలా ఎమోషన్‌గా అనిపించింది. ఇంత ఇంపాక్ట్ ఉన్న సినిమాను తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది.’’ అని చెప్పారు.

హీరోయిన్ సారా అర్జున్ మాట్లాడుతూ..‘‘చాలా రోజుల తర్వాత తెలుగు ఆడియన్స్ ముందు నిలబడడం స్పెషల్‌గా ఉంది. గుణశేఖర్ గారితో పని చేయడం గౌరవంగా ఉంది. అద్భుతమైన సినిమా కోసం వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుంది.’’ అని తెలిపారు.

సీనియర్ నటి భూమిక మాట్లాడుతూ..‘‘యుఫోరియా నాకు చాలా స్పెషల్ జర్నీ. 23 ఏళ్ల తర్వాత గుణశేఖర్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఫ్యామిలీ ఈ సినిమా కోసం 24 గంటలూ కష్టపడి పని చేశారు. ఇది నా కెరీర్‌‌లోనే స్పెషల్ సినిమా అవుతుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు నా కుమారుడు గుర్తొచ్చాడు. పిల్లలను ఎలా పెంచాలి అనేది అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.’’ అని చెప్పారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ గుణశేఖర్ మాట్లాడుతూ..‘‘మా అమ్మాయి నీలిమా ఎప్పుడూ ఇంత ఎమోషన్ అవదు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసి ఎమోషన్ అయిందంటే.. ఈ కథ అంతగా ఇంపాక్ట్ చేసింది. మా కుటుంబం మొత్తం ఈ స్టోరీకి కనెక్ట్ అయింది. అలాగే మీ అందరికీ ఈ సినిమా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరూ కొత్తవాళ్లతో చేయాలని 6 నెలలు ఆడిషన్స్ చేశాం. రియల్ ఫ్రెష్ ఫేసెస్‌తో చేశాం. టాలెంట్ చూసే అందరినీ సెలెక్ట్ చేశాం. ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్‌కు సులభంగా కనెక్ట్ అవుతారు. కథలో ఎడాలసెన్స్ అనేది చాలా కీలకం. అందుకోసమే టీనేజర్స్‌ను తీసుకున్నాం. అందుకే పొన్నియన్ సెల్వన్‌లో చేసిన సారా అర్జున్‌ను తీసుకున్నాం. ఆమె ఉంటేనే ఈ సినిమా చేద్దామని నీలిమ అంది. కథ చెప్పగానే సారా తండ్రి రాజ్ అర్జున్ షాక్ అయ్యారు. ఇంత మంచి కథను కచ్చితంగా జనాలకు చెప్పాలి అని అన్నారు. తల్లి పాత్రకు భూమిక అనుకోగానే నేను వద్దనన్నాను. ఆమెను తల్లి పాత్రలో చూడడం నాకు నచ్చదు. కానీ యంగ్ మదర్ కావాలని నీలిమ చెప్పడంతో ఆమెకు కథ చెప్పాము. ఒక్కడు సినిమాతో ఎంతమంచి గుర్తింపు వచ్చిందో దానికి రెట్టింపు పేరు ఈ సినిమాతో వస్తుందని చెప్పాను. ఆమె పూర్తి స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పింది. కేవలం గ్లామర్ పాత్రలే చేస్తామని చెప్పే హీరోయిన్స్‌కు భూమిక కనువిప్పు కలిగించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు డైరెక్టర్ గానే మంచి గుర్తింపు ఉంది. ఆయన పాత్ర చాలా నేచురల్‌గా ఉంటుంది. ఆయనకు కథ చెప్పగానే ఓకే అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవను అనుకున్నప్పుడు స్క్రిప్ట్ పంపిస్తే.. కీరవాణి గారి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే కలుద్దామన్నారు. ఇది చాలా అత్యవసరంగా తీయాల్సిన సినిమా అని చెప్పారు. కాల భైరవను పిలిచి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేయమని చెప్పారు. అందుకే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. పీఎస్ వినోద్, రత్నవేల్ దగ్గర పని చేసిన ప్రవీణ్‌ను సినిమాటోగ్రఫర్‌గా పరిచయం చేస్తున్నాం. అందరూ కథ వినే ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగం కావాలనుకున్నారు. 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది. అందుకే నెక్ట్స్ మంత్ ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్ కోసం మా యుఫోరియా సినిమాను తీసుకొస్తున్నాం. ఇది అందరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం.’’ అని చెప్పారు.

నటీనటులు : భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు

సాంకేతిక వ‌ర్గం :

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: గుణశేఖర్
సమర్పణ: రాగిణి గుణ
నిర్మాత: నీలిమ గుణ, యుక్తా గుణ‌
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె పోతన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి
పీఆర్వో : వంశీ కాకా

Rajtarun, Sandeep Madhav’s ‘RAM BHAJARANG’ Movie Glimpse Released held grandly

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బయ్యర్ల పై నిర్మాతలు స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, 2026లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ చిత్ర గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది, ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కెమెరామేన్ అజయన్ విన్‌సెంట్ మాట్లాడుతూ…రామ్ భజరంగ్ సినిమా చాలా బాగుంటుంది, షూటింగ్ చేసే సమయంలోనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, త్వరలో ఈ మూవీ థియేటర్స్ లో రానుందని తెలిపారు.

వెంకట్ మాట్లాడుతూ…ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో నటించాను, నెగిటీవ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర మీ అందరికి నచ్చుతుంది, డైరెక్టర్ సుధీర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు, చాలా వైడ్ అండ్ వైలెంట్ రోల్ నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు ఈ మూవీలో, నా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, నిర్మాతలు స్వాతి సుధీర్ అలాగే రవి బాల గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

హీరొయిన్ మానస రాధాకృష్ణ మాట్లాడుతూ…ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది, నాకు ఈ రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ సుధీర్ గారికి ధన్యవాదాలు, సందీప్ మాధవ్, రాజ్ తరుణ్ తో నటించడం మర్చిపోలేనిదని అన్నారు.

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ...రామ్ భజరంగ్ సినిమా గ్లిమ్స్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, ఎక్కడా రాజీ పడకుండా డైరెక్టర్ సుధర్ రాజు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు, నిర్మాత స్వాతి గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ…ఈ సినిమా కోసం నేను చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాను, నా లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది, గ్లిమ్స్ చాలా బాగుందని అందరూ అంటున్నారు, డైరెక్టర్ సుధీర్ గారు రాసుకున్న స్క్రిప్ట్ చలా బాగుంది, త్వరలో రాబోతున్న రామ్ భజరంగ్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ సుధీర్ రాజు మాట్లాడుతూ…ఒక మంచి మాస్ సినిమా చెయ్యాలని ఈ రామ్ భజరంగ్ సినిమా కథ రాసుకున్నాను, మణిశర్మ గారి సంగీతం, అజయన్ విన్‌సెంట్ గారి కెమెరా వర్క్ ఈ సినిమాకు హైలెట్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఇద్దరూ హీరోలు పోటీ పడి నటించారు, త్వరలో మా సినిమా టీజర్ ట్రైలర్ విడుదల కాబోతున్నాయి అన్నారు.

నిర్మాత స్వాతి సుధీర్ మాట్లాడుతూ…రాజ్ తరుణ్ చేస్తున్న 25వ సినిమా రామ్ భజరంగ్. అతనితో మరిన్ని సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నాను. సందీప్ మాధవ్ కు ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ రామ్ భజరంగ్ సినిమా కోసం బాగా కష్టపడి వర్క్ చేశారు, మా సినిమాకు అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

నిర్మాత రవి బాల మాట్లాడుతూ…ఈ సినిమాతో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తారు, డైరెక్టర్ సుధర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు, వెంకట్ గారి పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటారు, సిమ్రత్ కౌర్, సాత్నా టైటస్, మానస రాధాకృష్ణ అందరూ బాగా చేశారు, కేరళ లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఈ సినిమాను షూట్ చేశాము, స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్ని ఈ సినిమాకు చాలా బాగా కుదిరాయి, మీ అందరి బ్లెస్సింగ్స్ తో మా రామ్ భజరంగ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Cubes Entertainments’s ‘KATTALAN’ Teaser Launch turns into a grand celebration; fans erupt with excitement

The first teaser of Kattalan, a grand-scale Malayalam action thriller produced by Shereef Muhammed under the banner of Cubes Entertainments, has been released. The teaser was launched at a lavish event held at Vanitha-Vinitha Theatre, Kochi ,Kerala, attended by fans, media, and invited guests. The first screening received an overwhelming response from fans. Packed with adrenaline-pumping action sequences, the teaser promises edge-of-the-seat thrills. It hints that the film’s standout feature will be astonishing combat scenes never before seen in Malayalam cinema.

The teaser showcases lead actor Antony Varghese in intense face-offs with an elephant in the forest, executed with unbelievable realism. The disclaimer clarifies that these scenes were shot using a real elephant, without VFX. The role is expected to be one of the most powerful mass characters of Antony Varghese’s career. Kattalan is slated for a worldwide theatrical release on May 14, positioned as one of the biggest releases in Malayalam cinema history. The film is directed by newcomer Paul George

The action sequences were choreographed in Thailand under the leadership of internationally acclaimed stunt coordinator Kecha Khamphakdee and his team, known for their work on the Ong-Bak series. The elephant ‘’Pong,” made famous through the Ong-Bak films, is also part of Kattalan. The elephant fight sequences seen in the teaser are truly breathtaking. Music composed by B. Ajaneesh Loknath, who rose to prominence with blockbuster South Indian films like Kantara and Maharaja, is another major highlight. With visuals, action, and music on par with international cinema, the film promises to be a full-fledged mass action thriller.

The film has already secured one of the biggest overseas deals in Malayalam cinema history and is reported to have broken several pre-release records even before completing shooting. In association with Phars Films, Kattalan is gearing up for what is touted as the largest overseas release ever for a Malayalam film. This is another production by Cubes Entertainments following the pan-Indian blockbuster Marco. Earlier, the film’s first-look poster featuring Antony Varghese’s stylish mass avatar went viral on social media.

Designed as a pan-Indian project, the film is mounted on a mega canvas. Dushara Vijayan plays the female lead. The cast includes Telugu star Sunil (Pushpa, Jailer), Kabir Duhan Singh (Marco), Pushpa-fame Telugu actor Raj Tirandasu, Bollywood actor Parth Tiwari (Kill), and from Malayalam cinema Jagadish, Siddique, vlogger-singer Hanansha, rapper Baby Jean, and Hipster, among others, in key roles.
The screenplay is written by Joby Varghese, Paul George, and Jero Jakab, with dialogues by Unni RThe film will release in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi

Director Maruthi interview about Sankranthi biggest blockbuster Movie ‘The Raja Saab’

టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు డైరెక్టర్ మారుతి.

– “రాజా సాబ్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద ఇంత హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సంక్రాంతి హాలీడేస్ లో మరింతగా మా మూవీకి ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. సైకలాజికల్ ఎలిమెంట్స్ తో కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నాం. ప్రభాస్ గారు కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం. కొంత టైమ్ పడుతుంది ఆడియెన్స్ కు చేరడానికి అని చెప్పారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పారు.

– సంక్రాంతి మూడ్ లో ఉంటారు కాబట్టి ప్రేక్షకులు అలాంటి ఒక లైటర్ వేన్ సినిమా ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. ఈ కథలో బొమన్ ఇరానీ పాత్ర ఎంటరైనప్పటి నుంచి సైకలాజికల్ గా టర్న్ అవుతుంది. ఆ సీన్స్ వెనక మేము అనుకున్న కాన్సెప్ట్ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చు. హారర్ మూవీస్ లో దెయ్యాన్ని చంపడం ఈజీ. ఎలాగైనా చంపొచ్చు. కానీ ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ మూవీ చేశాం. సినిమా రిలీజైన సెకండ్ డే ప్రెస్ మీట్ లో నేను మా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది క్లియర్ గా చెప్పా. ఈ సోషల్ మీడియా ట్రెండ్ లో ఎందుకు దాచడం.

– ఇప్పుడు రాజా సాబ్ మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుందంటూ వాళ్లే మెసేజ్ లు పంపుతున్నారు. మీరు ఫస్ట్ టైమ్ మూవీ చూసినప్పుడు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ వెతుక్కుంటారు. కానీ సెకండ్ టైమ్ మూవీ చూస్తే ఎంత డెప్త్ గా ఆలోచించే ఈ సీన్ చేశారు అనేది అర్థమవుతుంది. రాజా సాబ్ లాంటి సినిమా చేయడం సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్ లోకి వెళ్లాడు అనేది విజువల్ గా చూపించడం కష్టం. అతని సబ్ కాన్షియస్ మైండ్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. ఈ మూవీలోని ఓల్డ్ గెటప్ లో రివర్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. కొన్ని సీన్స్ కోసం ప్రభాస్ గారు 15 డేస్ ఎలా చేద్దామని ఆలోచించారు. నువ్వు ఇంత గ్రేట్ సీన్ రాశావు డార్లింగ్, నేనూ నా వందశాతం ఎఫర్ట్స్ పెట్టాలి కదా అని ఆయన అనేవారు. జోకర్ సీన్ లో ఆయన చిన్న స్మైల్ ఇస్తారు. ఆ స్మైల్ తో గ్రేట్ పర్ ఫార్మ్ చేశారు అనిపించింది.

– ప్రభాస్ గారి అభిమానులు నాకు సోదరులు. వారే ఫోన్స్ , మెసేజ్ లు చేస్తూ అభినందిస్తున్నారు. ప్రభాస్ గారిని కలర్ ఫుల్ గా సాంగ్స్, డ్యాన్స్ లతో చూపించారని, కొత్తగా ప్రెజెంట్ చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది నాకు పర్సనల్ గా విష్ చేశారు. నాగ్ అశ్విన్ గారు, సందీప్ వంగా గారు రాజా సాబ్ కు సపోర్ట్ చేశారు.

– ఈ మొత్తం ప్రాసెస్ లో నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అందుకే సినిమా రిలీజైన రెండో రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడాను. నాకు అనుకున్న టైమ్ కు సినిమా రిలీజ్ చేయాలి అనే వర్క్స్ లోనే టెన్షన్ పడుతూ ఉండిపోయా. అందుకే నేను రిలీజ్ కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అలసిపోయినట్లు కనిపించాను. ఏ సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ రాలేదో చెప్పండి. ప్రతి సినిమాకు వస్తుంటాయి. నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు. సినిమా బాగుంది కదా అని అంటున్నారు. ప్రీమియర్ షోస్ కు అనుమతి, బుకింగ్స్ ఇలాంటివి నా పరిధిలోకి రావు. నేను సినిమాను ఇన్ టైమ్ రిలీజ్ కు రెడీ చేసే పనిలోనే ముగినిపోయాను.

– రాజా సాబ్ సినిమాకు ఇంత భారీ కలెక్షన్స్ వస్తున్నాయంటే ప్రభాస్ గారిని కొత్త జానర్ లో యాక్సెప్ట్ చేసినట్లే కదా. బీ, సీ సెంటర్స్ లో కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ను లో ఎక్స్ పెక్టేషన్స్ లో ఉంచాలనే ఇంట్రో సీన్ నుంచి ప్రయత్నించాం. క్లైమాక్స్ లో కూడా వందమందిని పెట్టి ఫైట్ చేయించొచ్చు. అలా చేస్తే మళ్లీ రొటీన్ అని అంటారు. నేను ఒక పెద్ద స్టార్ తో కూడా సినిమా బాగా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాను. సీజీ వర్క్స్ విషయంలో కొన్ని నేర్చుకున్నాను. ప్రతిరోజు పండగే సినిమాను 40 రోజుల్లో రాసిన నేను…ఈ చిత్రంలో కొన్ని సీన్స్ కోసం రెండు నెలల టైమ్ తీసుకున్నా. అలా రాజా సాబ్ సినిమా నాకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.

– ప్రస్తుతం రాజా సాబ్ సినిమానే నా ఆలోచనల్లో ఉంది. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే నా లైఫ్ సర్కిల్ ఫుల్ అయినట్లు భావిస్తా. ఆయన అభిమానిని నేను. ప్రేక్షకులు మా మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ప్రశాంతంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నా. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి.

Heroine Nidhhi Agerwal interview about Sankranti Block Buster Movie ‘The Raja Saab’

This Sankranthi season, The Raja Saab, starring Prabhas, has emerged as one of the biggest blockbusters, receiving overwhelming love from audiences. Family viewers and children are enjoying the film immensely. Prabhas’ one-man show, combined with director Maruthi’s unique take on the horror-fantasy genre, has created a completely new cinematic world. The uncompromising production values delivered by People Media Factory have mesmerized audiences. Sharing her happiness over the film’s success, heroine Nidhhi Agerwal spoke at length in a recent interview.

Nidhhi said she is extremely happy with the response The Raja Saab is receiving. “All of us worked on this film for nearly three years, and it feels satisfying that audiences are appreciating our efforts. Though the film received slightly mixed talk initially, people are now truly enjoying it, and the movie is holding strong at the box office with impressive numbers. I played a character named Bessie, a nun, and it was important for me to appear divine and convincing. I put in a lot of preparation for this role, especially regarding costumes and overall look, and we had many discussions to get it right.”

– “Before The Raja Saab, I acted as a princess in Hari Hara Veera Mallu. In this film, I appear as an angel, and I really enjoyed playing this role. I listened to the entire story, not just my character portions, and from the narration itself, I knew the film would connect well with audiences. Director Maruthi garu presented the idea of a divine force confronting an evil power that uses tantric practices and psychological games in a very unique way, which impressed me greatly.”

– “I shared screen space with many comedians like Saptagiri, Prabhas Sreenu, and VTV Ganesh, and the sets were always filled with laughter. At one point, I was simultaneously shooting for Hari Hara Veera Mallu and The Raja Saab, which meant constant travel and hardly any sleep. During that tough phase, the Raja Saab team supported me a lot and took great care of me. That’s why Prabhas garu mentioned during the pre-release event that everyone on set loves Nidhhi Agerwal. Acting is my passion, so despite the challenges, it never felt burdensome.”

– “Working with him was an absolute pleasure. He never behaves like a pan-India superstar and is very friendly with everyone on set. His humility and kindness made me believe even more that good things happen to good people. His performance in the hospital scene was outstanding. We used to have many fun conversations about cinema and life while on set.”

– “Maruthi garu worked with great clarity. He always knew exactly which scenes needed to be shot each day. Managing scenes with five or six artists at once is not easy, but he handled everything smoothly, valuing everyone’s time. Working with him was very comfortable, and he maintained a fun atmosphere on set.”

– “Producing a film like The Raja Saab on such a massive budget requires immense passion, and Vishwa Prasad garu truly has that. He never compromised on visual effects, grand sets, or production quality. That commitment is why the film looks so rich and high-quality on screen. I was aware from the beginning that the film had three heroines, and being a part of such a big project alongside Prabhas garu makes me very happy. Acting in VFX-heavy scenes was initially challenging, as we had to imagine elements that weren’t physically present, but it gradually became easier.”

– “People often talk about strange incidents happening during horror film shoots, but we didn’t experience anything like that. However, I am personally scared of ghosts and horror content. I usually sleep with the lights on and listen to the Hanuman Chalisa on loop at night.”

– “I proudly say that I belong to Telugu cinema. Recently, when I visited Mumbai, many people spoke about how Telugu films are being made on such a large scale with high quality. I wished that every film released during Sankranthi would do well. We are all in the same boat if one fails, it affects everyone.”

– “When I worked with Pawan Kalyan garu in Hari Hara Veera Mallu, I understood why he is called the Power Star his courage is inspiring. From working with Prabhas garu, I learned how to stay humble despite immense success. I’ve learned so much from this journey.”

– “Currently, I’m working on three Telugu films and two Hindi projects. Since I’m busy with Telugu cinema, I’ve bought a house in Hyderabad and am shifting here. From childhood, my dream was to become a heroine, and today I’m living that dream. I don’t ask for anything more, just meaningful and purposeful roles as an actress.”

‘Kotha Malupu’ First Look Out! Akash & Bhairavi Ardhya as Lead Pair

Marking the festive occasion of Sankranti, the makers of ‘Kotha Malupu’ unveiled the film’s first look, presenting it as a special treat for audiences.The film features Akash, son of renowned playback singer Sunitha, in the lead role, with Bhairavi Ardhya playing the female lead. Kotha Malupu is being produced under the Tadhastu Creations banner. The movie is directed by Shiva Varaprasad Keshanakurthi and produced by Tati Balakrishna.Senior actors Raghu Babu, Prudhvi, Prabhavathi, Mahender, DD Srinivas, and Kittayya will be seen in key supporting roles.

Speaking about the film, director Shiva Varaprasad Keshanakurthi said,
“We have blended romantic love, suspense, and comedy in this film. The pairing of Akash and Bhairavi Ardhya has worked out very well. They will be seen as a brother-in-law and sister-in-law (bava–maradala). As a Sankranti gift, we released the first look, and the film will be ready for release soon.”

Producer Tati Balakrishna added,“This movie is set entirely in a village backdrop. The rural atmosphere and the story will offer a fresh experience to the audience. Post-production work is currently underway, and we will announce the release date soon.”

With its strong rural backdrop and an engaging mix of romance, suspense, and comedy, the first look of Kotha Malupu has received a positive response from viewers. The film, which has already created curiosity, is expected to hit screens soon.

Film Details:

Cast: Akash, Bhairavi Ardhya, Raghu Babu, Prudhvi, Prabhavathi, Mahender, DD Srinivas, Kittayya, and others

Banner: Tadhastu Creations,
Director: Shiva Varaprasad Keshanakurthi,
Producer: Tati Balakrishna
Co-Producer: Tati Bhaskar
Music: Yashwanth
PRO: Kadali Rambabu, Dayyala Ashok

Prabhas Nimmala’s “Miracle” First Look Released held grandly On the occasion of Sankranti

As a special Sankranti gift, the first look of the action entertainer “Miracle”, directed by Prabhas Nimmala, is all set to be released on January 16. Produced jointly by Ramesh Eggidi – Srikanth Mogadasu – Chander Goud under the banner Saida Family Entertainment, “Miracle” is being made on a prestigious scale.

The film is directed by Prabhas Nimmala, who earlier impressed audiences with “Satya Gang” and “Fighter Shiva”. Randheer Bhisu plays the lead role in the film, with Hebbah Patel as the female lead and Akanksha as another heroine. Senior heros Sriram and Suresh will be seen in key roles. The film also features an ensemble

cast including Naresh Naidu, Janardhan, Yogi Khatri, Vijay Surya, Imtiyaz, Sai Baba, Dil Ramesh, Jhansi, Suryanarayana, Sridhar, Srikanth, Shiva, Aamani, Haimavathi, Navya (Ammu), Bejawada Mastan, Dheeraj Appaji, and others in important roles.

Technical Crew:
PRO: Dheeraj–Appaji
Cinematography: Surender Reddy, Editing: Vishwanath
Music: Prabhas
Lyrics: Rambabu Goshala
Action (Fights): Srinu
With a strong cast and experienced technical team, “Miracle” promises to be an engaging action-packed entertainer.

On producer K. Achireddy’s birthday, director S.V. Krishna Reddy introduced Pidugu Vishwanath as the hero of his 43rd film Vedavyas.

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో  ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త,  పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు  “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ – అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారి సినిమాలో నేను నటించడం ఇదే తొలిసారి. అయితే వారి ఫస్ట్ డబ్బింగ్ మూవీ సూర్య ది గ్రేట్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. అప్పటినుంచి వారితో మంచి అనుబంధం ఉంది. అయితే చాలాసార్లు వారి మూవీస్ కు డబ్బింగ్ చెప్పాను గానీ ఎందుకో నటించడం కుదరలేదు. ఈ చిత్రంతో నాకు ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. “వేదవ్యాస్” సినిమాలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. మన నాగరికతను మనం మర్చిపోకూడదు అనే మంచి అంశంతో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి గారు రూపొందిస్తున్నారు. ప్రేమకావాలి సినిమాతో అచ్చిరెడ్డి గారు మా ఆదిని పరిచయం చేశారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో ఈ రోజు విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం చూస్తుంటే అంతే సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు గారి కొడుకు పిడుగు విశ్వనాథ్ హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

పిడుగు సుబ్బారావు మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారి గొప్ప కాంబినేషన్ మూవీతో మా అబ్బాయి విశ్వనాథ్ హీరోగా పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇంతకంటే హ్యాపీగా ఫీలైన సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – నేను ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు పీఆర్ఓ గా పనిచేశాను. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారితో నాకు ఎంతో స్నేహం, అనుబంధం ఉన్నాయి. అయితే వారి చిత్రాలకు నేను పీఆర్ఓ గా వర్క్ చేయలేదు. ఒకరోజు అచ్చిరెడ్డి గారు ఆఫీస్ కు పిలిచి ఈ మూవీకి పీఆర్ఓ గా వర్క్ చేయాలని చెప్పారు. ఆయన నాకు ఈ అవకాశం ఇవ్వడం వెనక గొప్ప మనసు ఉంది అదేంటంటే ఇటీవల నా జీవితంలో ఒక విషాధం జరిగింది. ఆ ఆలోచనల నుంచి నన్ను మల్లించాలి, నన్ను ఏదో వ్యాపకంలో ఉంచి బిజీ చేయాలనే ఆలోచనతో అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు “వేదవ్యాస్” సినిమాకు పీఆర్ఓగా పెట్టుకున్నారు. వారి మంచి మనసుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంది. ఈ కథ కృష్ణారెడ్డి గారు నాకు చెప్పారు. ఒక గొప్ప చిత్రాన్ని ఆయన మన ముందుకు తీసుకురాబోతున్నారు. అన్నారు.

హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ –  “వేదవ్యాస్” సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. వారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈ మూవీలో బాగా నటించేందుకు, బాగా కనిపించేందుకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందిరికీ థ్యాంక్స్. నాకు గతంలో ఏడీగా వర్క్ చేసే అవకాశం కల్పించారు నీరజ కోన, త్రికోటి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ – మా ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతో పట్టుదలగా తయారుచేసుకున్న స్క్రిప్ట్ ఇది. దాదాపు ఐదారేళ్లుగా ఈ మూవీ మీద ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం ప్రతీ విషయం కొత్తగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ  ని సెలెక్ట్ చేసుకున్నారు. కొరియా అమ్మాయిని మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడిగితే కొరియా అమ్మాయిని కాదు ఆ క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేస్తారు అని కృష్ణారెడ్డి చెప్పారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్ ను సెలెక్ట్ చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్ ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక కృష్ణారెడ్డి గారి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది. ఈ సినిమాలో సాయికుమార్ గారు వేద నారాయణ అనే ఒక ప్రధానమైన పాత్రలో నటించారు. సాయి గారికి ఈ చిత్రంతో ఎన్నో ప్రశంసలు దక్కుతాయి. ఆయనతో మాకు మా మొదటి సినిమా నుంచి అనుబంధం ఉంది. పొలిటీషియన్, విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మాకు మంచి మిత్రులు. జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలనే ధ్యేయంతో కృష్ణారెడ్డి గారు రెడీ చేసిన స్క్రిప్ట్ ప్రతాపరెడ్డి గారికి బాగా నచ్చి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. “వేదవ్యాస్” చిత్రంలో హీరోగా విశ్వనాథ్ ఎంత బాగా నటించాడు అనేది మూవీలో చూస్తారు. అన్నారు.

డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మంచి ఫైట్స్ చేశారు. నేను షూటింగ్ చేశా కాబట్టి ఈ విషయం చెబుతున్నా. విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే మా మూవీలో కీలకంగా ఉండే వేద నారాయణ అనే పాత్రలో సాయికుమార్ గారు నటించారు. ఆయన సహజంగానే బాగా నటిస్తారు. మా చిత్రంలో సాయికుమార్ గారి నటన దర్శకుడిగా నాకెంతో సంతృప్తిని కలిగించింది. “వేదవ్యాస్” సినిమాలో కొరియన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాం. ఆమె తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే మంగోలియా విలన్ బాగా నటించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనం చాటేలా రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మేము ఇక్కడ చెప్పేది చాలా తక్కువ. మిగతా అంతా మూవీలో చూస్తారు. అన్నారు.

నటీనటులు – పిడుగు విశ్వనాథ్, జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్, తదితరులు

టెక్నికల్ టీమ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ – ఆకుల సునీల్
మేకప్ – రాఘవ రాపర్తి
కాస్ట్యూమ్స్ – గుబ్బల నరసింహారావు, చందాన రామకృష్ణ
స్టిల్స్ – మనీషా ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలె
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఉదయభాస్కర్
లిరిక్ రైటర్స్ – భువనచంద్ర, డా.వెనిగళ్ల రాంబాబు
డ్యాన్స్ మాస్టర్ – సుచిత్ర చంద్రబోస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
డీవోపీ – శరత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మేడపాటి శ్రీనివాస్ రెడ్డి ,పీఆర్ఓ – ప్రభు
సమర్పణ – కె. అచ్చిరెడ్డి
నిర్మాత – కొమ్మూరి వి ప్రతాప్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం – ఎస్వీ కృష్ణారెడ్డి

‘The Raja Saab’ King-Size Blockbuster Celebrations held grandly

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” నిన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు. “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ హ్యూజ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు మూవీ టీమ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడుతూ – “రాజా సాబ్” సినిమాను ప్రేక్షకులు, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాకు ప్రతి ఒక్కరి నుంచి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్ల కష్టపడ్డాం. టీమ్ మొత్తం చాలా ఎఫర్ట్స్ పెట్టింది. మా ప్రయత్నానికి రిజల్ట్ గా ప్రేక్షకులు మంచి సక్సెస్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మా మూవీని అప్రిషియేట్ చేస్తూ చాలా మెసేజ్ లు వస్తున్నాయి. ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ – “రాజా సాబ్” సినిమా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది. ప్రేక్షకులు మా సినిమాను ఇష్టపడుతున్నారు. ఈ సంక్రాంతికి పర్పెక్ట్ ఫ్యామిలీ మూవీ ఇది. పిల్లలతో కలిసి మీరు ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ప్రేక్షకులు “రాజా సాబ్” కనెక్ట్ అయ్యింది. మొసలి ఎపిసోడ్, క్లైమాక్స్..ఇలా చాలా ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో డార్లింగ్ డార్లింగ్ అని అంతా అంటున్నారు. “రాజా సాబ్” సక్సెస్ తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. అన్నారు.

హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ – “రాజా సాబ్” అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో నేను చేసిన భైరవి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను చేసిన యాక్షన్ సీక్వెన్స్ ను థియేటర్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి గారికి థ్యాంక్స్. ఒక పెద్ద విజన్ తో విశ్వప్రసాద్ గారు “రాజా సాబ్” సినిమాను నిర్మించారు. ప్రభాస్ గారి సరసన నటించాలనేది నా డ్రీమ్. అది “రాజా సాబ్” తో నిజమైంది. ఫ్యూచర్ లో మళ్లీ ప్రభాస్ గారితో కలిసి నటించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “రాజా సాబ్” సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాం. తొలి రోజు 100 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ కలెక్ట్ చేస్తుందని ఆశించాం. మా అంచనాలు మించి 112 కోట్ల రూపాయలు వసూళ్లు తొలి రోజు “రాజా సాబ్”కు దక్కాయి. గ్లోబల్ గా కలెక్షన్స్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఈ నెంబర్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. కిడ్స్, ఫ్యామిలీస్ మా మూవీకి వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ గారు ఓల్డ్ గెటప్ లో చేసిన 4 నిమిషాల సీన్స్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమాలో చూపించలేకపోయాం. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్స్ కు పంపించాం. ఇక రాజాసాబ్ ప్రతి షోలో ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్ చూస్తారు. హారర్ ఫాంటసీ జానర్ లో ఈ సినిమాను నిర్మించాం. కొందరు ఇంటలెక్చువల్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. హారర్ ఫాంటసీని డీప్ గా వెళ్లి కొందరు విశ్లేషణలు చేశారు. అవన్నీ వదిలేస్తే సినిమా బాగా రన్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగి సంక్రాంతికి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – మిడ్ రేంజ్ డైరెక్టర్ అయిన నాకు ప్రభాస్ గారితో సినిమా చేశాననే క్రెడిట్ దక్కడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ప్రభాస్ గారికి జన్మంతా రుణపడి ఉంటాను. 9 నెలలకో సినిమా చేసే నేను మూడేళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించాను. ప్రభాస్ గారిని మీరు ఎలా చూడాలనకుంటున్నారో అలా తెరకెక్కించాను. సినిమా చూసిన వాళ్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఒక కమర్షియల్ హీరోతో ఇలాంటి మైండ్ గేమ్ సినిమా రాలేదని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ 40 నిమిషాల ఎపిసోడ్ కు వరల్డ్ వైడ్ అందరు ప్రశంసిస్తున్నారు. కొత్త పాయింట్ తో వచ్చిన సినిమా ఒక్క రోజుకే అందరికీ నచ్చి పెద్ద హిట్ కాదు. కొత్త పాయింట్ ఎప్పుడైనా ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. మేము చెప్పాలనుకున్న కొత్త పాయింట్ పై ఇంటలెక్చువల్స్ ఒకలా మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్లు తిడుతున్నారు. రకరకాల రెస్పాన్స్ లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అప్పుడే ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయొద్దు. ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ గారిని ట్రైలర్ లోనే పరిచయం చేశాం. ఆయన స్వాగ్, గెటప్, మేనరిజమ్ చూపించాం, థియేటర్స్ లోకి వచ్చేసరికి ఆ ప్రభాస్ గారి సీన్స్ ఏవి అని ప్రేక్షకులు వెతుక్కున్నారు. ఆ క్రమంలో మేము చూపించే కథకు వారు కనెక్ట్ కాలేకపోయారు. చాలా మంది ప్రభాస్ గారి అభిమానులు నాతో మాట్లాడారు. సినిమా బాగా చేశావన్నా అని అన్నారు. ఓల్డ్ గెటప్ సీన్స్ వస్తే బాగుంటుందన్నా అన్నారు. వారి సూచన మేరకు ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్ ను యాడ్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి ఆ సీన్స్ రాజా సాబ్ మూవీలో చూస్తారు. రూఫ్ మీద ఫైట్ ఇప్పటిదాకా రాలేదు. 8 నిమిషాల ఆ ఫైట్ లో ప్రభాస్ గారి స్వాగ్, స్టైల్ ను ఇవాళ్టి నుంచి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైతే కొందరు లెంగ్త్, ల్యాగ్ అని ఫీలయ్యారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి రియల్ రాజా సాబ్ గా నేను ఫీలయిన ప్రభాస్ గారిని స్క్రీన్స్ మీద చూపించబోతున్నాం. దీంతో ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారని నమ్ముతున్నాను. సంక్రాంతికి వస్తున్న అన్ని మూవీస్ ఆదరణ పొందాలి. రాజా సాబ్ సినిమా చూసి నా డైరెక్టర్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించాడు. నేను హ్యాపీగా ఉన్నాను. నార్మల్ రేట్స్ కే రాజా సాబ్ సినిమాను మీరు థియేటర్స్ లో చూడొచ్చు. అన్నారు.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
ప్రొడ్యూసర్స్ – టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

‘The Raja Saab’ Movie Review

Cinemarangam.Com
Banner: Peoples Media factory
Movie Name : “RAJASAAB”
Release Date :January 9th 2026
Review Rating : 3/5
Producers: TG Vishwa Prasad, Krithi Prasad
Writer & Director: Maruthi
Cast: Prabhas, Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar, Sanjay Dutt, Boman Irani, and others.
Editor: Kotagiri Venkateswara Rao
Cinematography: Karthik Palani
Music: Thaman
Action Directors: Ram Lakshman, King Solomon
Production Designer: Rajeevan
Creative Producer: SKN
PRO: GSK Media (Suresh – Sreenivas), Vamsi Kaka

A Light-Hearted Turn for Prabhas with Emotion and Mystery at Its Core
Prabhas steps into unfamiliar yet refreshing territory with The Raja Saab, moving away from towering action-driven roles to embrace a more relaxed, humour-driven character. Directed by Maruthi, the film aims to blend family emotions, comedy, and a supernatural backdrop, presenting a star-led entertainer with a softer core. Backed by producers TG Vishwa Prasad and Krithi Prasad, the film is mounted on a lavish scale, with a strong supporting cast that includes Sanjay Dutt, Boman Irani, Malavika Mohanan, Nidhhi Agerwal, Riddhi Kumar, and Zarina Wahab.
With music by Thaman S, cinematography by Karthik Palani, and editing by Kotagiri Venkateswara Rao, The Raja Saab arrives with expectations of a wholesome Telugu family entertainer layered with intrigue.

*STORY*

The story revolves around Gangamma, an elderly woman battling Alzheimer’s, whose fading memory holds on to one powerful belief that her husband Kanakaraju, once a feared exorcist, is still alive. Her grandson Raju, deeply attached to her and unable to see her in emotional pain, decides to search for his grandfather.

Raju’s journey takes him to Hyderabad, where reality takes a disturbing turn. He discovers that Kanakaraju passed away long ago and has returned in an unsettling form. As Raju digs deeper, uncomfortable truths about his grandfather’s past emerge shaped by ambition, greed, and moral compromises. What follows is a clash between past and present, forcing Raju to confront a legacy he never expected to inherit.

*Performances*

Prabhas appears at ease in a full-fledged comic role after a long break. His performance relies more on timing and casual charm than hero-driven theatrics, and while not every moment clicks, his effort to break away from routine is evident. Satya provides solid support, elevating several sequences with his natural humour.
Zarina Wahab delivers one of the film’s most impactful performances, bringing grace and emotional weight to her role. Sanjay Dutt commands the screen with a strong presence, effectively portraying menace and authority. Boman Irani makes good use of his limited screen time. The female leads Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar play relatively smaller roles, while supporting actors like Samuthirakani, Rangasthalam Mahesh, and Sapthagiri leave a mark in brief appearances.

*Technical Aspects*

Thaman S’s background score is energetic and designed to amplify commercial moments. While it occasionally dominates scenes, it maintains momentum. Karthik Palani’s cinematography complements the film’s tonal shifts, especially during the darker supernatural portions. Editing by Kotagiri Venkateswara Rao keeps the narrative moving without major lag. The visual effects are serviceable and blend reasonably well into the fantasy elements. Overall, the production values reflect the film’s ambitious scale.

*Verdict*

The Raja Saab is an attempt to mix humour, emotion, and fantasy within a family-friendly framework. While the storytelling treads familiar ground at times, the film benefits from Prabhas’s relaxed screen presence, strong supporting performances, and an emotional core rooted in family bonds. It may not reinvent the genre, but it offers enough engaging moments to appeal to audiences looking for a star-driven Telugu entertainer with heart.

Cinemarangam.com Review Rating 3/5