Home Blog Page 33

Rebel Star Prabhas’ Prestigious Film ‘The Raja Saab’ Grand Pre-Release Event held grandly

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడుతూ – ఈ “రాజా సాబ్” ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ గారిని మిస్ అవుతున్నాం. “రాజా సాబ్” సెకండ్ ట్రైలర్ కు మీరంతా హ్యూజ్ రెస్పాన్స్ అందించారు. ఈ ట్రైలర్ లో చూపించినట్లు రొమాన్స్, యాక్షన్, హారర్ ఎలిమెంట్స్ తో మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. మీరంతా సినిమా చూస్తూ ఒక ఫాంటసీ వరల్డ్ లోకి వెళ్లిపోతారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి మూవ్ మెంట్ ఎంజాయ్ చేశాం. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మారుతి గారికి, విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్. నా కోస్టార్స్ మాళవిక, నిధి అగర్వాల్ తో పాటు రాజా సాబ్ టీమ్ లోని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ – “రాజా సాబ్” షూటింగ్ కోసం వేసిన ఈ సెట్ మాకు మరో ఇల్లులా మారింది. చాలా రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేశాం. నా కెరీర్ లో “రాజా సాబ్” ఒక స్పెషల్ మూవీ. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇంత సరదాగా మరే మూవీ సెట్ లోనూ మేము గడపలేదు. ఈ సినిమా చేశాక నేనూ డార్లింగ్ ఫ్యాన్ అయిపోయా. ఈ రోజు ప్రభాస్ గారిని ఈవెంట్ లో మిస్ అవుతున్నాం. సినిమా బ్యూటిఫుల్ గా వచ్చింది. మీరంతా “రాజా సాబ్” చూసి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అన్నారు.

ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ – రాజా సాబ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా సినిమాను ఈ నెల 9న మీరు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతోమంది కొత్త వారికి అవకాశం కల్పించింది. దాదాపు 50 చిత్రాలకు చేరువవుతోంది. ఈ సంస్థలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. రాజా సాబ్ సినిమా విశ్వప్రసాద్ గారికి, నా సోదరి కృతికి పెద్ద హిట్ ఇవ్వాలి. నా స్నేహితుడు మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మిగతా దర్శకులు ప్రభాస్ గారిని చూసిన తీరు వేరు, మారుతి ప్రెజెంట్ చేసిన విధానం వేరు. బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ప్రీమియర్స్ పడిన తర్వాత ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, మారుతి టేకింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ గురించే మీరంతా మాట్లాడుతారు. ప్రభాస్ గారు మన సినిమాను పాన్ ఇండియాకు తీసుకెళ్లారు. విశ్వప్రసాద్ గారు మిరాయ్ సినిమా బాగా రన్ అవుతున్నా, ఓజీ, ఇతర సినిమాల కోసం థియేటర్స్ ఇచ్చారు. అలాంటి వారి సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని కోరుతున్నా. రాజా సాబ్ తో పాటు చిరంజీవి, వెంకటేష్ గారి మన శంకరవరప్రసాద్ సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాలన్నీ హిట్ కావాలి. ప్రతి సారీ కోళ్ల మీద పందెం వేస్తారు. ఈ సారి డైనోసార్ మీద పందెం వేయండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ – రాజా సాబ్ కు పాన్ ఇండియా మాట చిన్నది. ఇది పాన్ వరల్డ్ ఫిలిం. ఈ సినిమా కోసం మారుతి చాలా కష్టపడ్డారు. ఇలాంటి భారీ చిత్రం ప్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. విశ్వప్రసాద్ గారు తన ప్యాషన్ ఎంటో చూపించారు. ఈ సినిమాలోని స్ట్రాంగ్ కంటెంట్ వల్లే మంచి బీజీఎం చేయగలిగాను. ఇది రెగ్యులర్ మూవీస్ కు చేసే బీజీఎం కాదు. రాజా సాబ్ కోసం మారుతి గారు కొత్త ప్రపంచం సృష్టించారు. ఆ వరల్డ్ కు తగినట్లే బీజీఎం చేశాను. రెబల్ సాబ్, సహన సహస ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు నాచె నాచె ఇంకా పెద్ద సక్సెస్ అయ్యింది. ప్రభాస్ అన్న డ్యాన్సులు ఎంత బాగా చేశాడో నాచె నాచెలో చూశాం. డ్యాన్సులే కాదు ప్రభాస్ గారి ఓవరాల్ పర్ ఫార్మెన్స్ రాజా సాబ్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి ఒక బ్యాంగర్ మూవీని మారుతి అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు హిట్ కావాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – రాజా సాబ్ ఈవెంట్ కోసం అన్ని భాషల నుంచి వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. మూడేళ్ల క్రితం రాజా సాబ్ జర్నీ మొదలైంది. మొదట హారర్ కామెడీ చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత మరింత స్కేల్ పెంచి హారర్ ఫాంటసీగా మార్చాం. భారీ సెట్స్ నిర్మించాం. ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమాలో ఇంత హ్యూజ్ హారర్ ఫాంటసీ మూవీ రాలేదు. ఒక ప్రెస్టీజియస్ మూవీగా రాజా సాబ్ ను ప్రొడ్యూస్ చేయడంలో మేము సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఈ మూవీ కథలో బాగా కుదిరాయి. టెక్నికల్ గా మేకింగ్ గ్రాండియర్ కు తగిన అన్ని ఎలిమెంట్స్ మూవీలో బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అవన్నీ మీరు మూవీలో చూసి ఎంజాయ్ చేస్తారు. తెలుగు స్టేట్స్ లో అద్భుతమైన బజ్ రాజా సాబ్ కు ఉంది. నార్త్ లో కూడా బెస్ట్ రీచింగ్, బజ్, అప్పీల్ కనిపిస్తోంది. కర్ణాటకలో చాలా బాగుంది. తమిళనాట మాకే కాదు ఏ మూవీకి కూడా భారీ రిసెప్షన్ ఉండదు. తమిళనాట 150 నుంచి 200 స్క్రీన్స్ ప్రస్తుతం లభించాయి. నార్త్ ఇండియాలో 4500 స్క్రీన్స్ లో రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. ఏపీలో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చారు, తెలంగాణలో రేపటికి అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సంక్రాంతికి 11 సినిమాలు వస్తున్నాయి. అన్నింటికీ థియేటర్స్ కావాలి కాబట్టి పోటీ ఉంది. 8వ తేదీ నుంచి అన్ని ఏరియాల్లో రాజా సాబ్ కు మంచి థియేటర్స్ ఉంటాయి. ప్రభాస్ గారు బాహుబలి ముందు ఎలా కనిపించారో అలా రాజా సాబ్ లో ఆయన్ని చూడబోతున్నారు. సినిమా చివరి 40 నిమిషాలు ఒక గ్లోబల్ మూవీ ఇంపాక్ట్ ఇస్తుంది. మరో 5 నిమిషాల ఫాంటసీ ఎలిమెంట్ ను పండుగ టైమ్ లో యాడ్ చేయబోతున్నాం. రాజా సాబ్ కు మొదటి రోజు గ్లోబల్ గా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ఈ రాజా సాబ్ భవంతి సెట్ దాదాపు ఏడాదిన్నర మాకు మరో ఇళ్లుగా మారింది. హారర్ ఫాంటసీ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాం. సినిమా చూశాను. తమన్ తన మ్యూజిక్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. హీరో క్యారెక్టర్ తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ మూవీలో చూస్తారు. ప్రభాస్ గారిని ఎలా చూడాలని మీరంతా అనుకున్నారో అలా ఈ సినిమాలో కనిపిస్తారు. రేపు ప్రీమియర్స్ పడుతున్నాయి. మీరు ఎంత ఎనర్జీతో సంతోషంతో థియేటర్ లోపలికి వెళ్తారో, అంతకంటే రెట్టింపు ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని బయటకు వస్తారు. సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు నన్ను నమ్మారు, ఆయనకు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాను. నేను యానిమేషన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. రాజా సాబ్ ఒక డిస్నీ మూవీలా ఉంటుంది. నాచె నాచె సాంగ్ ప్రభాస్ గారికి నాకు ఫేవరేట్ సాంగ్. కథలోని ఆ సిచ్యువేషన్ కు ఈ పాట బాగుంటుందని ముందే అనుకున్నాం. మూడేళ్లు మా దగ్గర ఉన్న సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసింది. ఇక మీరు మీ రెస్పాన్స్ ఇవ్వాలి. అన్నారు.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
ప్రొడ్యూసర్స్ – టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

‘Andhela Ravamidhi’ Streaming on Amazon Prime Video from January 8

Indian classical dance and cinematic storytelling converge in Andhela Ravamidhi, premiering on Amazon Prime Video on January 8. Produced by Natyamargam Productions in association with East West, the film is directed by Indrani Davuluri and co-directed by Sai Ram Palley. The film features a powerful solo-led narrative, offering audiences a deeply immersive and distinctive cinematic experience.

Set against a backdrop of rich tradition and artistic heritage, Andhela Ravamidhi explores the soul of classical dance and its profound connection to emotion, devotion, and expressive storytelling. The film captures how dance transcends physical movement to become a language of inner strength, spiritual depth, and emotional resonance.

At its core, Andhela Ravamidhi is a woman-centric narrative that celebrates empowerment through discipline, resilience, and self-expression, honoring feminine presence and leadership within tradition.

The film boasts a strong ensemble cast featuring Tanikella Bharani, Adi Lokesh, Aditya, Menon, and Jayalalitha, adding depth and gravitas to the narrative.

Music for the film is composed by Karthik Kodakandla, with music distribution and partnership by Aditya Music, enhancing the emotional and cultural layers of the storytelling.

Andhela Ravamidhi has received international recognition on the global festival circuit, earning multiple awards for its storytelling, direction, and artistic excellence, further establishing it as a significant contribution to culturally rooted, women-led cinema.

With its OTT release, Andhela Ravamidhi is poised to reach a wider global audience, bringing award-winning storytelling and the timeless beauty of Indian classical art to screens worldwide.

Do not miss Andhela Ravamidhi, streaming exclusively on Amazon Prime Video from January 8.

Honoring A Legend – Remembering BA Raju on His 66th Birth Anniversary

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత శత్రువు. దాదాపు 40 ఏళ్ల పాటు జర్నలిస్ట్‌గా, పీఆర్వో (PRO)గా, పబ్లిషర్‌గా మరియు నిర్మాతగా ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఈ పోటీ ప్రపంచంలో కూడా ఆయన అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, ‘అజాతశత్రువు’గా పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలు, దర్శకుల నుండి కొత్తవారి వరకు అందరినీ సమాన గౌరవంతో, ప్రేమతో చూసేవారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లకు మార్గనిర్దేశం చేసి వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడ్డారు.

బి.ఎ. రాజు గారి వృత్తిపరమైన ప్రస్థానం అద్భుతమైనది. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలకు పబ్లిసిటీ బాధ్యతలు చూస్తూ కెరీర్ ప్రారంభించి, ఏకంగా 1500 సినిమాలకు పైగా పీఆర్వోగా పనిచేసి ఆయా చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జర్నలిజంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. పలు దినపత్రికల్లో పనిచేసిన అనంతరం, 1994లో తన సతీమణి బి. జయ గారితో కలిసి ‘సూపర్ హిట్’ (Super Hit) వీక్లీని స్థాపించారు. 27 ఏళ్ల పాటు ఒక్క వారం కూడా ఆపకుండా, తుదిశ్వాస వరకు ఆ పత్రికను నడిపించడం ఆయన అంకితభావానికి నిదర్శనం.

2001లో ‘సూపర్ హిట్ ఫ్రెండ్స్’ (Superhit Friends), ‘ఆర్.జె సినిమాస్’ (RJ Cinemas) బ్యానర్‌పై చిత్ర నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన ఇండస్ట్రీకి ఒక ‘నాలెడ్జ్ బ్యాంక్’ లాంటివారు. కంప్యూటర్ అవసరం లేకుండానే ఏ డైరెక్టర్ ఏ హీరోతో ఎన్ని సినిమాలు చేశారు, సినిమా విడుదల తేదీలు, ఎన్ని రోజులు ఆడింది, కలెక్షన్లు ఎంత అనే విషయాలు ఆయన వేళ్ళ చివర ఉండేవి.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన తోటి జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, మానసిక ధైర్యం కావాలన్నా ముందుండేవారు. పరిశ్రమలో అందరితో సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఆయనకు ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం ఉండేది.

బి.ఎ. రాజు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వేసిన బాటలో పయనం సాగుతూనే ఉంది. ఆయన స్థాపించిన ‘IndustryHit.com’ వెబ్ పోర్టల్ మరియు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా సినీ అప్‌డేట్స్ నిరంతరం అందుతూనే ఉన్నాయి. ఆయన కుమారుడు శివ కుమార్ బి, సూపర్ హిట్ ఫ్రెండ్స్, ఆర్.జె సినిమాస్ బ్యానర్‌ లను పునరుద్ధరించి, త్వరలోనే ప్రముఖ స్టార్లతో సినిమాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. 24 గంటలూ సినిమాల గురించే ఆలోచించే రాజు గారి లోటు తీరనిది. ఈ రోజు ఆయన 66వ జయంతి సందర్భంగా ఆ పవిత్ర ఆత్మకు మనసారా నివాళులర్పిద్దాం.

“I never imagined ‘Zindagi Into Shades’ would receive this level of response!!” — Filmmaker Dolly Tomer

Filmmaker Dollye Tomar brings heartfelt storytelling to the screen with Omsheel Productions’ documentary “Ziindaagi in Two Shades.” For Dollye, filmmaking is life itself …a journey of emotions, truth and human connection.

The film follows the inspiring story of “Iftekhar Sharif”, the first Overseas Citizen of India, showing how he beautifully balances two countries and two cultures. Hyderabad was chosen for the premiere because the journey begins here.. it is his birthplace, his emotional ground, and a city deeply connected to his success.

Dollye’s inspiration came when she witnessed Iftekhar in Chicago helping Indians who had lived abroad without documents for years, ensuring their safe return home …a gesture that touched her deeply and sparked this documentary.

Directed with sensitivity by Rajneeshh Dubey, the film gains emotional depth through strong editing by Devu Namdev and a soulful background score shaped by Dollye herself. Supported by producers Khurram Syed and Kalpana Rajput, the documentary is receiving appreciation and interest from film festivals and international audiences, proving its emotions truly universal.

Rukmini Vasanth unveiled as the Mellisa from Yash’s Toxic: A Fairytale for Grown-Ups

 

Yash’s Toxic: A Fairytale for Grown-Ups continues to establish itself as an evolving extravaganza that grows darker, deeper, and more daring. The saga of its intrigue takes an exciting turn as the big ticket action drama unveils Rukmini Vasanth as the graceful, commanding and unflinching Mellisa.

This film marks her striking collaboration with Yash under the distinctive cinematic gaze of Geetu Mohandas. Known for her intelligence-driven performances and emotional depth, Rukmini’s introduction signals a performance that finds space within Geetu’s layered, atmospheric storytelling, and Yash’s ambition to make an Indian film that matches global standards in scale and offers a universal resonance in its storytelling.

Following the unveiling of the arresting first looks of Kiara Advani as Nadia, Huma Qureshi as Elizabeth, Nayanthara as Ganga, and Tara Sutaria as Rebecca, Toxic: A Fairytale for Grown-Ups deepens its immersive realm with the introduction of Rukmini Vasanth as Mellisa. Set against the backdrop of a vibrant, hazy party in the late 1960s, Mellisa moves with an air of absolute self-assurance. Her expression is focused—a sharp, determined gaze that pierces through the surrounding festive chaos. While the world around her is fluid and drifting, she is focused, navigating the room with a stride that commands the floor.

With each reveal, the film sharpens its edge, expanding its emotional terrain and cinematic scale, cementing Toxic one of the most anticipated Indian films of 2026.

Geetu Mohandas says, “What I admire most about Rukmini is her intelligence as an actor. She doesn’t just perform , she processes. She asks questions, not out of doubt but out of curiosity. It pushes me to think deeper and sometimes even my own choices as a director. Watching her work reminds me that intelligence on screen often lies in what is left unsaid. Between shots, I often see her quietly writing in her journal , capturing thoughts, small anecdotes from the set. Those moments say a lot about her process. She is constantly building her own inner world. I find her approach incredibly thoughtful, and at times I honestly wish I could steal those pages and read through them, just to understand the mind behind such a layered performance.”

Written by Yash and Geetu Mohandas and directed by Geetu Mohandas, Toxic: A Fairytale for Grown-Ups has been filmed simultaneously in Kannada and English, with dubbed versions planned in Hindi, Telugu, Tamil, Malayalam, and several other languages—underscoring its global ambition. The film boasts a formidable technical team, including National Award winner Rajeev Ravi as cinematographer, Ravi Basrur on music, Ujwal Kulkarni on editing, and TP Abid as production designer. High-octane action is choreographed by Hollywood action director JJ Perry (John Wick) alongside National Award-winning duo Anbariv and Kecha Khamphakdee. Produced by Venkat K. Narayana and Yash under KVN Productions and Monster Mind Creations, Toxic is slated for a grand theatrical release on the long festive weekend of 19th March 2026, coinciding with Eid, Ugadi, and Gudi Padwa.

‘Rim Jim’ movie based on real-life incidents, set against a gangster backdrop

Set against the backdrop of real-life incidents that occurred in Andhra Pradesh during the 1990s, the gangster-themed film Rim Jim is being directed by Hema Sunder and produced by G. Sachetan Reddy, Dr. Manasa, and Srinivasa Rao.

Made under the banners of AV Cinemas, C Visuals, Rim Jim carries the tagline “Asleedam” and is presented as a story of friendship and love, woven into a gritty, realistic gangster narrative. The film is currently busy with post-production work, and the makers are expected to announce the release date soon.

Speaking on the occasion, director Hema Sunder said that the film has shaped up extremely well and assured that it will appeal to audiences across sections with its engaging storytelling and emotional depth.

A major highlight of the film is Rahul Sipligunj, who plays a key role and has also sung two songs, which are expected to be major attractions of the movie.

Ajay Ved appears in the lead role, while Vrajana plays the female lead. Supporting roles are portrayed by Bittiri Satti and Raj Thirandas, among others.

With a realistic tone and a strong emotional core, Rim Jim promises an intense cinematic experience and is set to hit screens soon.

Film Details
Banners : AV Cinemas, C Visuals

Cast: Ajay Ved, Vrajana, Rahul Sipligunj, Bittiri Satti, Raj Thirandas, Others

Producers: G. Sachetan Reddy, Dr.Manasa, Srinivasa Rao
Story, Screenplay & Direction: Hema Sunder
Songs: Rahul Sipligunj
Music: Kokkilagadda Ephraim
Cinematography: Vasu Pendam
Editing: Penumatsa Rohith
PRO: Ashok Dayyala

‘Rayudi Gari Taluka’ Movie Title Poster officially released by senior actor Suman

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు సుమన్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని అభినందిస్తూ, చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి మాట్లాడుతూ,“మా సినిమా టైటిల్ పోస్టర్‌ను సుమన్ గారు విడుదల చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓ విభిన్నమైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ ఎంతో సహజంగా, చక్కగా నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు.

నటీ నటులు :
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా, సుమన్, కిట్టయ్య, ఆర్.కె. నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత తదితరులు

సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు : ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు
కథ, స్క్రీన్‌ప్లే :శ్రీనివాస్ ఉలిశెట్టి 
సంగీతం : నగేశ్ గౌరీష్   
సినిమాటోగ్రాఫర్‌ : గౌతమ్ వాయిలాడ
 ఎడిటర్‌ : ఎంజే సూర్య

Makkal Selvan Vijay Sethupathi Releases the Teaser of the First-Ever Goat Fight Movie “Jockey”

The teaser of the new Tamil film “Jockey”, produced by PK7 Studios, has been released. The film is set in a rural backdrop of Madurai. The teaser was unveiled at the 13th edition of Veedhi Thiruvizha event held in Chennai.

After the 2021 film “Muddy”, PK7 Studios once again joins hands with director Dr. Praghbal for this project. The film is produced by Prema Krishnadas, C. Devadas, and Jaya Devadas.

The movie features Yuvan Krishna, Ridan Krishnas, and Ammu Abhirami in lead roles. Shakthi Balaji has composed the music for the film.

Set against the Madurai rural landscape, “Jockey” revolves around the traditional goat-fighting sport practiced in villages. To portray these sequences authentically, the film crew spent nearly three years in the region, taking great care to ensure the native culture and realism were not lost during filming.

The actors underwent training with real goats to perform their roles naturally.

Through “Jockey,” the makers aim to present rural life, the emotions of the people, and a traditional sport in a realistic and heartfelt manner. With the teaser launch, the journey of the film has officially begun. The film unit has announced that more details will be revealed soon.

“Sidhu Gaadi Love Story” First Look Poster Launched by Director VN Aditya

మహాన్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సిద్ధు గాడి లవ్ స్టోరీ”. ఈ సినిమాను బాలబ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ.సి. నిర్మిస్తున్నారు. రమేష్.సి. దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల చారి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై “సిద్ధు గాడి లవ్ స్టోరీ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – డైరెక్టర్ కావాలనే తన కొడుకు రమేష్ కలను “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమాతో సావిత్రమ్మ గారు నిజం చేశారు. రమేష్ ను యూఎస్ లో కలిశాను. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. అక్కడ తన ప్రొఫెషనల్ కెరీర్ కంటిన్యూ చేస్తూ ఇండియా వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేశారు. సిద్ధు సిద్ధార్థ్ రాయ్ లవ్ స్టోరీని ఖుషి సినిమాలో చూసి హిట్ చేశాం. ఇప్పుడీ “సిద్ధు గాడి లవ్ స్టోరీ” ని కూడా అలాగే ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నా. మహాన్, శృతి, మోహన సిద్ధి ముగ్గురూ కొన్ని మూవీస్ చేశారు. ఈ సినిమా వీళ్లకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న సాంబశివరావు నాకు మంచి మిత్రుడు. “సిద్ధు గాడి లవ్ స్టోరీ” పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మహాన్ మాట్లాడుతూ – మా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమాలో మంచి పాటలు, ఫైట్స్ ఉంటాయి. ఇందులో ప్రేమ కథతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ లో శృతి క్లాస్ ఆడియెన్స్ కు నచ్చితే, మోహన సిద్ధి మాస్ ఆడియెన్స్ కు నచ్చుతుంది. నా క్యారెక్టర్ ను మాత్రం ప్రేక్షకులంతా ఇష్టపడతారు. అన్నారు.

హీరోయిన్ మోహన సిద్ధి మాట్లాడుతూ – తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం తక్కువ. నాకు “సిద్ధు గాడి లవ్ స్టోరీ” చిత్రంలో అవకాశం కల్పించిన డైరెక్టర్ రమేష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు సోలో సాంగ్ ఉంటుంది. ఆ పాట నేచర్ గురించి రూపొందించారు. హీరోయిన్ గా నాకు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు

హీరోయిన్ శృతి మాట్లాడుతూ – మా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేయడానికి అతిథిగా వచ్చిన వీఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా మా సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అధిరవ్ కృష్ణ మాట్లాడుతూ – “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమాలో సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి. మా మూవీ ఆల్బమ్ మంచి హిట్ అవుతుందని, అలాగే సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటీనటులు – మహాన్, శృతి, మోహన సిద్ధి, సుమన్, స్నేహ, ఆనంద్ భారతి, సర్కార్, అలీష, చిత్ర శ్రీను, చిట్టి బాబు, వైజాగ్ అప్పారావు, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ -లక్కీ ఈకరి
డీవోపీ – దోసడ యాదగిరి
మ్యూజిక్ – అధిరవ్ కృష్ణ
డైలాగ్స్ – మెండెం శ్రీధర్
లిరిక్స్ – మధు, స్వామి
కొరియోగ్రఫీ – రజని, సాగర్, రమేష్.సి
యాక్షన్ – తుఫాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.సాంబశివరావు కో ప్రొడ్యూసర్ – వేణుగోపాల చారి
ప్రొడ్యూసర్ – సావిత్రమ్మ.సి.
రచన, దర్శకత్వం – రమేష్. సి.
పీఆర్ఓ – ఆర్ కె చౌదరి

‘Nuvvu Naaku Nachav’ was a collective miracle. It brought money and respect – Trivikram Srinivas

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ రిలీజ్ సందర్భంగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన గొప్ప జ్ఞాపకాలను, ఆ అద్భుతమైన ప్రయాణాన్ని తలచుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
త్రివిక్రమ్: నాకు కూడా.

స్రవంతి రవికిషోర్: ఈ ఫిల్మ్‌ షూటింగ్ సెట్స్‌కి నువ్వు ఎక్కువగా వచ్చేవాడివి కదా?
త్రివిక్రమ్ : ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’ ఒకేసారి రాశాను. అందుకే ఆ సెట్స్‌కి ఎక్కువగా వెళ్ళాలేదు. ‘నువ్వే కావాలి’లో షుక్రియా పాట షూటింగ్, క్లైమాక్స్ చిత్రీకరణ టైంకి వచ్చాను. ‘నువ్వు నాకు నచ్చావ్’ కి మాత్రం ఎక్కువ శాతం షూటింగులకు వచ్చాను. న్యూజిలాండ్ కూడా వెళ్లాం కదా . డబ్బింగ్ టైంలో కూడా ఉన్నాను.

స్రవంతి రవి కిషోర్ : నెక్ట్స్ ‘నువ్వే నువ్వే’ సినిమాని నువ్వే డైరెక్ట్ చేయాలి కదా?
త్రివిక్రమ్ : అవును.. అందుకే నువ్వు నాకు నచ్చావ్ కి నేను అన్నింట్లో ఉన్నాను.

స్రవంతి రవి కిషోర్ : అప్పట్లో స్క్రిప్ట్ వెర్షన్ రాసి, డైలాగ్ వెర్షన్ దర్శకుడు, నిర్మాతలకు వినిపించేవారు. రాసింది చదవడం మాత్రమే కాదు.. నువ్వు చూసింది మేం చూసేవాళ్లం.
త్రివిక్రమ్ : నేను రాసే రూం కాకుండా పక్కన ఇంకో రూం ఉండేది. అందరం అందులోనే కూర్చుండేవాళ్లం.

స్రవంతి రవి కిషోర్ : ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్‌ని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం. నువ్వు డిక్షన్‌తో సహా డైలాగ్స్ చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ అని ఫిక్స్ అయిపోయాం. సినిమాలోని సీన్లలో ఆయన్ను కాకుండా ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం
త్రివిక్రమ్ : అవును. ఆ 22 సీన్లు.. నాకు గుర్తుంది. నానక్ రాం గూడలో ఇంటి సెట్ వేశారు. ఫస్ట్ రోజు ప్రకాష్ రాజ్ సెట్‌కి వచ్చారు. ఆ 22 సీన్లను నెరేట్ చేస్తుంటే.. ఆయనకు అప్పుడు తెలుగు రాదు. కన్నడలోనే మొత్తం సీన్లు, డైలాగ్స్ రాసుకున్నారు.
సుహాసిని గారు వస్తుంటే.. మీరు ఆ డైలాగ్ చెప్పారు (నవ్వుతూ). మంచి వాడా? చెడ్డ వాడా? అని అంటే.. మీరేమో మణిరత్నం అని అన్నారు (పగలబడి నవ్వుతూ). నేను రాసిందేమో ‘మంచివాడా? చెడ్డవాడా? మొగుడంతే’ అని ఉంటుంది. కానీ దానికి మీరు మాత్రం ‘మంచి వాడా? చెడ్డ వాడా? మణిరత్నం’ అన్నారు (నవ్వుతూ). నాకు గట్టిగా నవ్వు వస్తే.. బయటకు వెళ్లి నవ్వేశాను.

స్రవంతి రవి కిషోర్ : ఇదొక అద్భుతమైన ప్రయాణం. శాస్త్రి గారి గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే
త్రివిక్రమ్ : నాకు బాగా గుర్తుంది ఏంటంటే.. నాకు మీరు మద్రాస్ నుంచి ఫోన్ చేశారు.. ‘ఓ నవ్వు చాలు’ అనే పాట గురించి చెప్పారు. పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా? ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా…

స్రవంతి రవి కిషోర్ : ఆయన అన్నింటికీ అలానే రాస్తారు. ఈ పాటను ఊటీలో షూట్ చేయాలి. అప్పుడే న్యూజిల్యాండ్ నుంచి వచ్చాం. వర్క్ అంతా నాన్ స్టాప్‌గా చేస్తున్నాం. అవతల కోటి స్టూడియోకి శంకర్ మహదేవన్ వచ్చి ఉన్నారు. నేనేమో ఇటు ఒత్తిడి చేయలేను. మనకు కావాల్సింది పాట కాదు.. మంచి పాట. ఏం చేయాలి? ఈ పాట ఆపేయాల్సి వస్తుందా? అని రకరకాలుగా అనుకున్నాను. అరేయ్.. ఆగురా.. పాట వచ్చింది అని కార్లో బయల్దేరాం. కారులోనే పల్లవి రాసుకుంటూ వచ్చాం. అందుకే ఆయన ఫైల్స్ లో పల్లవి అంతా కనిపించదు..
త్రివిక్రమ్ : ఆ..ఆ.. అవును.. ఆ కురులు చీకట్లో చిక్కుకుని అని ఉంది.. దాన్ని తరువాత కంప్లీట్ చేశారు.. ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా అని..

స్రవంతి రవి కిషోర్ : బెస్ట్ పార్ట్ ఏంటంటే?.. ఆయన రాసే ప్రతీ లైన్‌ను మనం ఫాలో అయ్యేవాళ్లం. ఏదో ఒక లైన్‌ను తీసుకుని వచ్చి పాట ఇదీ అనే వారు కాదు..
త్రివిక్రమ్ : ఒక్క లైన్ రాసినా ఎగ్జైట్ అయ్యేవాళ్లం.. ఒక్క రోజుకి ఒక్క లైన్ (నవ్వుతూ)..

స్రవంతి రవికిషోర్ : తను చాలా రకరకాలుగా రాసి అక్కడ పెట్టేవాళ్లు.. ఇటివ్వు అని.. వాలు జడ బాగుంది కదా? దీనితో ఎందుకు రాదు?..
గాలిపటం గగనానిదా? బాగుంది కదా? పాట అయిపోయింది కదా?.. అనేవాళ్లం. ముందు చరణం కంప్లీట్ చేశారు.. ఆ తరువాత పల్లవి పూర్తి చేశారు.
త్రివిక్రమ్ : చాలా నోస్టాల్జిక్‌గా ఉంది…ఇలా వెనక్కి వెళ్తుంటే.

స్రవంతి రవికిషోర్ : ఈ పేపర్స్ యోగేశ్వర్ శర్మ తీసుకుని వచ్చి ఇస్తే.. శాస్త్రి గారు చేత్తో పట్టుకున్న కాగితాలు కదా? అని ఎంతో ఎమోషనల్ అయ్యాను.. చాలా తొందరపడ్డాడు..
త్రివిక్రమ్ : పాటలు లేటుగా ఇచ్చారు కానీ.. మనిషి ఎర్లీగా ఎళ్లిపోయారు.

స్రవంతి రవికిషోర్ : ఈ చిత్రం ఇంత బాగా రావడానికి వెంకటేష్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆర్టిస్టుగా ఎంతో అద్భుతంగా చేశారు.
త్రివిక్రమ్ : మొత్తం డైలాగ్ వెర్షన్ అయిన తరువాత రెండు మూడుసార్లు రీడింగ్ తీసుకున్నారు. అంతలా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అంతలా లోపలకు ఇంజెక్ట్ చేసుకుని చేశారు.

స్రవంతి రవికిషోర్ : నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆఖరి రోజున ట్రైన్ ట్రావెల్ సీన్ చేశాం. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు బయల్దేరి తిరిగి రావాలి
త్రివిక్రమ్ : అంటే ఫస్ట్ సీన్‌ను లాస్ట్ తీశారా?
స్రవంతి రవికిషోర్ : హా.. అవును.. ఈ రోజే ఆఖరి రోజు కదా? గుమ్మడి కాయ కొట్టేస్తున్నాం. అప్పుడే అయిపోయిందా? కిషోర్.. అని అన్నారు. మేం 85 రోజుల్లో షూట్ చేశాం. మొత్తం మూడు గంటల 14 నిమిషాల నిడివి వచ్చింది.
త్రివిక్రమ్ : ఫైనల్‌గా మూడు గంటలకు తీసుకు వచ్చారా? (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : మూడు గంటల తొమ్మిది నిమిషాలతో రిలీజ్ చేశాం.
త్రివిక్రమ్ : అంటే యూట్యూబ్‌లో కూడా అంతే ఉందా?
స్రవంతి రవికిషోర్ : మూడు గంటల నాలుగు నిమిషాలు ఉంటుంది. సెన్సార్‌, అవన్నీ ఉన్నాయని అనుకుంటా.

స్రవంతి రవికిషోర్ : సినిమా రిలీజ్ అయినప్పుడు సుహాసిని సీన్లు ఎంత కాంట్రవర్సీ అయ్యాయ్.
త్రివిక్రమ్ : మీరొక్కరే భయపడలేదు. నేను అయితే ఆ సీన్లను కట్ చేసేద్దామని అన్నాను. ఏం కాదు ఏం కాదు.. ఈ వారం రోజులు వదిలేయ్ చెప్తాను అన్నారు (నవ్వుతూ). అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా.. రాత్రి పదకొండు, పదకొండున్నరకు ఫోన్లు చేసి ప్రతీ డైలాగ్ గురించి ఫోన్ చేసి బాగుందని ఫీల్ అయి చెప్పేవారు.
స్రవంతి రవికిషోర్ : నువ్వు కూడా మంచి డైలాగ్ రాస్తే అలానే చెప్పేవాడివి. గుండెలో మాట కళ్లలో చూడాలి.. అమ్మ ఆవకాయ్ అంజలి.. ఇలా మంచి డైలాగ్స్ అన్నీ కూడా ఫోన్ చేసి చెప్పేవాడివి.

స్రవంతి రవికిషోర్ : అప్పుడే ఈ సినిమా వచ్చి పాతికేళ్లు అయింది..
త్రివిక్రమ్ : ఇరవై నాలుగా? ఇరవై ఐదా?
స్రవంతి రవికిషోర్ : ఇది 25వ సంవత్సరం. మొన్న సెప్టెంబర్ 6కి సిల్వర్ జూబ్లీ అయింది.

స్రవంతి రవికిషోర్ : ఈ సినిమా చాలా మందికి స్ట్రెస్ బస్టర్ సర్..
త్రివిక్రమ్ : రామానాయుడు స్టూడియోలో నాయుడు గారి ఫ్యామిలీకి ఈ మూవీని ప్రివ్యూ వేశాం. వెంకటేష్ గారి సతీమణి ఈ మూవీ గురించి మాట్లాడారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో.. ఈ మూవీ గురించి రానున్న తరాలు మాట్లాడుకుంటాయి అని అన్నారు. ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ రీ విజిట్ చేస్తారని అన్నారు. కానీ నేను అప్పుడు నమ్మలేదు. అంత దూరం నేను చూడలేదు.. మనమే రాసి ఉన్నాం కదా..
స్రవంతి రవికిషోర్ : మనం కూడా మంచి సినిమా తీశామని అనుకుంటాం. కానీ ఎంత మందికి రీచ్ అవుతుంది? ఎంత మందికి స్ట్రెస్ బస్టర్ అనేది..
త్రివిక్రమ్ : అది మనకు తెలీదు కదా. కానీ ఆమె చెప్పిందే ఇప్పుడు అందరూ చెబుతుంటారు. నేను ఆ మాటల్ని చాలాసార్లు తలుచుకుంటాను.
స్రవంతి రవికిషోర్ : ఈ మూవీ నిర్మాత అని చెబితే.. ఇప్పటికీ గౌరవంగా చూస్తారు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మనవడికి 9 ఏళ్లు ఉంటాయి. ఆ చిన్న పిల్లాడు కూడా ఈ మూవీని పదే పదే చూస్తుంటాడట. ఇలా జనాల్ని ఎంటర్‌టెయిన్ చేశానని అనుకుంటే నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది.

స్రవంతి రవికిషోర్ : ఒక్కసారి చెప్పలేవా అనే పాటకు శాస్త్రి గారిని ఎంత ఇబ్బంది పెట్టాం..
త్రివిక్రమ్ : దారుణం కదా.. పది రోజుల తరువాత ఫస్ట్ రాసిన వర్షెన్‌ను వినిపిస్తే చాలా బాగుందని అన్నాం. తెగ తిట్టాడు మనిద్దరినీ (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : నీ మొహం మండ.. మొదటి రోజే రాశా కదా?..
త్రివిక్రమ్ : నన్నైతే మామూలుగా తిట్టలేదు.. నువ్వూ, నీ చాదస్తం.. నువ్వు, కిషోర్ కలిసి నా దుంపతెంపారు..
స్రవంతి రవికిషోర్ : మీ ముగ్గురు అసలు ఇక్కడకు రండి.. మీకేం కావాలి.. (నవ్వుతూ)
త్రివిక్రమ్ : మీకు అసలు క్లారిటీ ఉందా? అని అన్నారు (నవ్వుతూ)

స్రవంతి రవికిషోర్ : ఫస్ట్ రాసిన పల్లవిలోనే కథ అంతా ఉంటుంది..
త్రివిక్రమ్ : ఫస్ట్ నాలుగు లైన్లోనే అంతా ఉంటుంది.. చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని.. మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత.. ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ..ఈ నాలుగు లైన్లే సినిమాలో వాడాం.
స్రవంతి రవికిషోర్ : అన్యాయం కదా (నవ్వుతూ)
త్రివిక్రమ్ : పది రోజుల తరువాత మళ్లీ అక్కడికే వచ్చాం.

స్రవంతి రవికిషోర్ : బెస్ట్ పార్ట్ ఏంటంటే?.. ఎవ్వరినీ ఉద్దేశించి అని కాదు కానీ.. ఆయన సినిమా కథని, సారాంశాన్ని, నాలుగైదు సీన్లని ఒకే పాటలో రాసేస్తారు.
త్రివిక్రమ్ : పాట అక్కర్లేదు అని చెప్పే పాటల రచయిత ఆయన ఒక్కరే సార్..
స్రవంతి రవికిషోర్ : యస్..
త్రివిక్రమ్ : పాట రాస్తే డబ్బులు వస్తాయ్ కదా.. కానీ ఆయన అలా కాదు.. ఇక్కడ పాట పడదు అని చెప్పేస్తారు (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : అవును.. నాకు పాట రాసేందుకు నాలుగు రోజులు కేటాయించి.. షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.. ఆ తరువాత పాటకు ఇక్కడ స్పేస్ గానీ అవసరం గానీ లేదు అని అన్నారు.
త్రివిక్రమ్ : ఆయన ఈ వృత్తిని చాలా సీరియస్‌గా కాదు.. డివైన్‌ క్రోషన్‌గా తీసుకున్నారు..
స్రవంతి రవికిషోర్ : ఒక్క విషయం శ్రీను.. ఆయన మన కోసం పాట రాయరు.. ఆయన తృప్తి చెందితేనే కానీ పాట ఇవ్వరు..
త్రివిక్రమ్ : పట్టుకెళ్లడం కుదరదు.. ఆ ఇంటి నుంచి పేపర్ రాదు (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : రాస్తా రాస్తా.. పాడుతూ.. నా వైపు చూసి నాకు తెలుసులే అని పేపర్ తిప్పేసేవారు.. మేం ఇద్దరం కలిసి దాదాపు 400 రాత్రులు గడిపి ఉంటాను.. నాకు ఆయన 89 పాటలు రాశారు.. ప్రతీ రాత్రి ఆయనతోనే ఉండేవాడ్ని. నాకు ఆయనతో అంత సమయం గడిపే అవకాశం రావడం నా అదృష్టం..
త్రివిక్రమ్ : అవును.. చాలా చాలా సమయం గడపగలిగారు..

స్రవంతి రవికిషోర్ : ఓ చిన్న ఉదాహరణ ‘గౌరి’ అనే సినిమాకు నాకు ఆయన పాట రాశారు.. ఆ పాట మా అందరికీ ఓకే. కానీ వాయిస్ మిక్సింగ్‌లో ఎవరే అనే పదం వద్ద కోటి ఇబ్బంది పడ్డారు. నేను అడ్జస్ట్ చేసుకుంటానులే శాస్త్రి గారు అని కోటి గారు అన్నారు. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. నేను రాసుకొస్తాను అని వెళ్లి మూడు రాత్రులు కష్టపడ్డారు. ఎవరే అనే పదంతో ఎండ్ చేయాలని ఆ పాటను మళ్లీ రాశారు. మహానుభావుడు.. ఆ పాట అద్భుతంగా ఉంటుంది.

త్రివిక్రమ్ : ‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు’ అనే పాటను చాలా రోజులు రాశారు. ఆ ఒక్క పాటే ఆయన్న చాలా రోజులు రాశారు. మిగతావన్నీ చాలా ఫాస్ట్‌గా రాశారు.
స్రవంతి రవికిషోర్ : మరి సినిమా అంతా ఆ పాటలోనే చెప్పాలి కదా. మిగతా ట్యూన్స్ అన్నీ అయిపోయాయి. క్లైమాక్స్‌ను మనం రకరకాలుగా మార్చాం.
త్రివిక్రమ్ : అవును.. 35 రోజులు కొట్టుకుని.. చివరకు మీరే విజయం సాధించారు కదా (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : వేమూరి సత్యనారాయణ, పేకేటి రంగా గారు చాలా గొప్ప వ్యక్తులు. యూత్ సినిమా చేస్తున్నావ్ కరెక్టే.. కానీ పెద్ద వాళ్లు కూడా ఈ మూవీని చూడాలి కదా? అని వారు అన్నారు. నువ్వు నాకు పాయింట్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. అయితే ఈ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ కూడా కావాలి కదా అని అనుకున్నాను.
త్రివిక్రమ్ : మీరు చెప్పినప్పుడు నేను ఎందుకు కన్విన్స్ అయ్యానంటే .. నేను మీకు ముందు చెప్పిన పాయింట్ అదే కదా? అది నచ్చే కదా సినిమాను స్టార్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ పాయింట్‌నే మార్చితే ఎలా? మిగతా సీన్లన్నీ మార్చినప్పుడు మేం వ్యతిరేకించలేదు.. ఈ ఒక్కటి అలానే పెట్టాలని ఎందుకు అంటున్నాం.. అది నాకు స్ట్రయిక్ అయింది.. అప్పుడు విజయ భాస్కర్ గారితో చర్చించాను.. మనం ఎంత టఫ్‌గా మాట్లాడిన సరే.. ఆయన వాదనలో నిజం ఉంది.. అని అన్నారు.. అందుకే నెక్ట్స్ డే వచ్చి మార్చి రాశాం మళ్లీ.

స్రవంతి రవికిషోర్ : ‘కళ్లలోకి కళ్లు పెట్టి’ అనే పాటను ముందుగా బాలుగారు పాడారు మీకు గుర్తుందా?
త్రివిక్రమ్ : నాకు గుర్తు లేదు సర్
స్రవంతి రవికిషోర్ : భాస్కర్ గారు అది బాగుందని అన్నారు. ఫీమేల్ వాయిస్ అయితే బాగుంటుందని నేను అన్నాను.
త్రివిక్రమ్ : చిత్ర గారిదే బాగుంటుంది.. నేను ఆమె పాడిన పాటే విన్నాను.
స్రవంతి రవికిషోర్ : చెన్నై నుంచి క్యాసెట్ వచ్చింది. ఆ పాట తరుణ్ విని ఏడ్చేశాడు.

స్రవంతి రవికిషోర్ : చిత్ర గారు పాడుతూ.. ఇది స్రవంతి పాట కదా? క్లైమాక్స్ పాట కదా? అని అనేవారు.. దిల్ రాజు కూడా మన క్లైమాక్స్ పాటల గురించి మాట్లాడేవారు.
త్రివిక్రమ్ : మీ పాటలు చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ‘సంతోషం’ క్లైమాక్స్ పాట కూడా బాగుంటుంది. ఎంతో మందికి దారి చూపించింది.
స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే నువ్వే’ కావాలి సినిమాలోని క్లైమాక్స్ పాట కూడా బాగుంటుంది.. ఆ పాటకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు..
త్రివిక్రమ్ : అవును… స్రవంతి అంటే పాటలే కదా..

స్రవంతి రవికిషోర్ : నేనేదో ప్యాషన్‌తో సినిమాలోకి రాలేదు. కానీ ‘లేడీస్ టైలర్’తో నాకు సీతారామశాస్త్రి గారు, తనికెళ్ల భరణి గారు, అనుమోలు హరి, ఇళయరాజా గారు, వంశీ, వేమూరి సత్యనారాయణ వంటి గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. దీన్ని విడిచి పెట్టి ఎలా వెళ్తాను? అలా నాకు సినిమాల మీద ప్రేమ, ఇష్టం ఏర్పడింది. ‘నువ్వే కావాలి’తో ఉన్న అప్పులు తీర్చుకున్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్’తో ఇల్లు కొనుక్కున్నాను. అప్పటి డబ్బులు దాచుకుంటే వందల కోట్లు అయ్యేది. కానీ ఇంకో సినిమాని తీసేందుకు డబ్బులుంటే చాలని అనుకున్నాను. కాబట్టి నాకు నో రిగ్రేట్స్.
త్రివిక్రమ్ : ఒక్కోసారి ఎలా జరుగుతుందో మనకే తెలీదు. ఈ కథని రాసేందుకు చాలా కష్టపడ్డాం. మీరేమో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. చేతిలో కథ లేదు. వెంకటేష్ గారు కూడా ఎప్పుడూ కథ ఎక్కడి వరకు వచ్చింది అని అడగలేదు. అలా అడిగితే ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాను అని ఆయనకు తెలుసు (నవ్వుతూ). అలా ఓ నెల రోజుల పాటు విజయ భాస్కర్ గారు , నేను చాలా శ్రమించాం. స్రవంతి ఆఫీసులో వెళ్లి కూర్చుండేవాళ్లం. ఓ సారి నాకు ఓ కలలా కథ వచ్చింది. హీరోయిన్ ఉండే వీధిలోకి హీరో, అతని తండ్రి వస్తాడు. హీరోకి తల్లి ఉండదు. ఓసారి హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్‌కి ఎంగేజ్మెంట్ జరిగిపోతోంది. అదే వారిద్దరి తొలి పరిచయం. మామూలుగా అయితే హీరో, హీరోయిన్ మధ్యలో ఎవరో వచ్చి ప్రీ క్లైమాక్స్‌లో ఎంగేజ్మ్ంట్ చేసుకుంటారు. అదే ఇందులో కొత్తగా ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్‌తో ప్రేమ అని అనుకున్నాం. అది కూడా సమాజ కట్టుబాట్లు, హద్దుల్లోనే ఉండాలని అనుకున్నాం. అలా ఐడియా వచ్చింది. ఆ ఐడియా వచ్చిన 15 రోజులకే కథ మొత్తం సెట్ అయింది. పాయింట్ అనుకున్నప్పుడు ఉన్న కథకి, చివరకు వచ్చిన కథకు ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. కాలనీ ఒకటి అని లేదు.. వాళ్ల ఫాదర్, వీళ్ల ఫాదర్ ఫ్రెండ్స్ అయ్యారు..
స్రవంతి రవికిషోర్ : ఎంగేజ్మెంట్ అనే పాయింట్ మాత్రమే ఉంది..
త్రివిక్రమ్ : అదొక్కటే ఉంది.. మిగతావన్నీ మారిపోయాయి
స్రవంతి రవికిషోర్ : నిజంగానే ఇది కత్తి మీద సాము. ఎక్కడా కూడా హద్దులు దాటలేదు.
త్రివిక్రమ్ : అసలు కథ ఇంత ఫాస్ట్‌గా అవుతుందా? అని అనుకున్నాను. కానీ, వెంటవెంటనే అయిపోయింది..

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత నువ్వు భీమవరం వెళ్లిపోయావు.. ఆ హడావిడిలోనే నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించాం. ‘నువ్వే కావాలి’ వంద రోజుల ఫంక్షన్‌కి మేం ఇక్కడ లేం. నేను, విజయ భాస్కర్ కలిసి ఫిబ్రవరిలో ఆల్రెడీ పియానో సాంగ్ రికార్డింగ్ చేసినట్టున్నాం..

త్రివిక్రమ్ : ఆశా షైనీ కారెక్టర్ రావడానికి ఓ కారణం ఉంది. వెంకటేష్ గారికి కథ మొత్తం చెప్పిన తరువాత.. కథ అంతా బాగుంది.. నాకేం మార్పులు లేవు.. కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను. సినిమా అంతా ఒకే ప్లేస్‌లో జరుగుతోంది.. ఈ కథను ఏమైనా కాస్త బయటకు తీసుకెళ్లొచ్చా? అలా అని కథలోని ఎస్సెన్స్ మారకూడదు.. ఏమైనా చేయగలవా? అని అన్నారు. అప్పుడు ఊటికి వెళ్తే ఎలా ఉంటుంది? అని అనుకున్నాను. ఊటికి అంటే.. ముందే ఆ అమ్మాయిని పరిచయం చేయాలి. అలా ఊరికే పరిచయం చేయడం ఎందుకు? ఓ పాట ఉంటే బాగుంటుంది కదా? అని అనుకున్నాం. అలా ఆ కారెక్టర్‌తో ఫస్ట్ హాఫ్‌లో ‘ప్రియతమా’ అనే పాట, సెకండాఫ్‌లో ‘ఓ నవ్వు చాలు’ అనే పాట వచ్చింది. విజయ భాస్కర్ గారికి ఆరు పాటలు ఉండాల్సిందే (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : అందులో ఓ పాట భువనచంద్ర గారు రాయాల్సిందే (నవ్వుతూ)
త్రివిక్రమ్ : వాళ్లిద్దరిదీ ఆర్మీ కనెక్షన్ కదా (నవ్వుతూ) శాస్త్రి గారు కూడా ఇది భువనచంద్ర పాటే కదా? అని అన్నారు (నవ్వుతూ).. ప్రియతమా అనే పాటను భువనచంద్ర గారు రాశారు కదా

స్రవంతి రవికిషోర్ : కోటి గారు మంచి సంగీతం ఇచ్చారు. సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. నేను, భాస్కర్ కలిసి రామానాయుడులో ఆర్ఆర్ పనులు చూసుకున్నాం. ఏదో తేడా కొడుతోందని భయపడ్డాను.
త్రివిక్రమ్ : ఆ రోజు నేను కూడా వచ్చాను.. అర్దరాత్రి వరకు కూర్చున్నాను.
స్రవంతి రవికిషోర్ : ఆ రాత్రి ఏం తేలకపోయే సరికి సినిమా కోసం కొన్న ప్రకాష్ రాజ్ కారుని తీసుకుని విజయవాడ హైవే ఎక్కేశా.. ఆర్ఎఫ్‌సికి వెళ్లిన తరువాత గుర్తుకు వచ్చి మళ్లీ రిటర్న్ అయ్యా.
త్రివిక్రమ్ : ఆ తర్వాత రోజు నేను కూడా వచ్చాను.. ప్రతీ సీన్‌ను మళ్లీ చూసాం .. ఆయన పక్కన ఎవరో అసిస్టెంట్ కూడా ఉండేవాడు..
స్రవంతి రవికిషోర్ : మన జీబూ..
త్రివిక్రమ్ : హా.. జీబూ.. ఆయన కన్సోల్ వదిలి బయటకు వెళ్లేవారు.. కోటి గారు చాలా కష్టపడ్డారు..
స్రవంతి రవికిషోర్ : కోటి ప్రాణం పెట్టి చేశారు..
త్రివిక్రమ్ : కోటి గారు ఎంత పెద్ద వారో నాకు అప్పుడు తెలిసేది కాదు.. ‘నువ్వే కావాలి’ అప్పుడు నేను చాలా యంగ్. నా ఒపీనియన్‌ను చెప్పినా ఫీల్ అయ్యేవారు కాదు. ఏదో చిన్న పిల్లాడు అని అనుకునేవాడు.
స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే నువ్వే’ టైంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి..
త్రివిక్రమ్ : ఇలాంటి విచిత్రకరమైన వంటకం నేనెప్పుడూ తినలేదని అన్నారు.. హారతి సంఘటన గుర్తుందా? ఫైర్ అలారమ్ వచ్చింది.. పోలీసులు కూడా వచ్చారు..
స్రవంతి రవికిషోర్ : తరుణ్ సాంబ్రాణి పుల్ల అంటించాడు స్విట్జర్లాండ్ హోటల్ లో ./ చాలా డబ్బులు కట్టాం..
త్రివిక్రమ్ : నాకు గుర్తుంది (నవ్వుతూ) చాలా కాస్ట్ లీ భక్తి అని అన్నారు.. పొద్దున్నే స్నానం చేసి టవల్ కట్టుకుని పూజ చేశాడు..
స్రవంతి రవికిషోర్ : నేను చాలా భక్తితో పూజ చేశాను అని మళ్లీ చెప్పాడు (నవ్వుతూ)

త్రివిక్రమ్ : ‘ప్రియతమా’ పాటకి ముందు ఆశా షైనికి, వెంకటేష్ గారికి ఓ మెలో డ్రామా సీన్ ఉంటుంది. అది రామానాయుడు స్టూడియోలో పై ఫ్లోర్‌లో చేశారు. అక్కడ వెంకటేష్ గారిది, ఆశా గారి క్యాస్టూమ్స్ అదిరిపోతుంది.

స్రవంతి రవికిషోర్ : కెమెరా వర్క్ అంటే న్యూజిలాండ్ సాంగ్స్.
త్రివిక్రమ్ : ‘ఉన్న మాట చెప్పలేవు’ అనే పాటని అద్భుతంగా తీశారు
స్రవంతి రవికిషోర్ : హా.. అవును..
త్రివిక్రమ్ : మనం న్యూజిలాండ్‌లో బస్సులో వెళ్తుంటే.. వెంకటేష్ గారు ఇక్కడే ఆపేద్దాం షూటింగ్ చేద్దాం అనే వారు. ఆ తరువాత న్యూజిలాండ్‌లో చాలా పాటలు తీశాను. కానీ నాకు ఈ పాట చాలా స్పెషల్.

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ స్క్రిప్ట్ చెప్పినప్పుడు పెళ్లి టైంలో ఇంటికి కలర్స్ వేసే సీన్ ఒకటి చెప్పావు . అక్కడి నుంచే ‘ఆకాశం దిగి వచ్చి’ అనే పాట పుట్టింది. ఆ పాటని శాస్త్రి గారు 8 రోజులు రాశారు.
త్రివిక్రమ్ : ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని పాటలన్నీ రాసినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. ‘ఓ నవ్వు చాలు’ పాటకి మాత్రం లేను. ఆయనతో అలా రాత్రి పూట కూడా కూర్చుండేవాడిని. విజయ భాస్కర్ మాత్రం రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు నిల్చుని పడుకునేవారు. భాస్కర్ నీ కళ్లేంటి? అలా ఎర్రగా అయ్యాయ్.. వెళ్లి పడుకో అని శాస్త్రి గారు అనేవారు (నవ్వుతూ)

స్రవంతి రవికిషోర్ : ‘ఎలా చెప్పను’ సినిమాలోని ‘మంచు తాకిన’ అనే పాటను పన్నెండు రాత్రులు రాశారు. ఆ టైంలో ఎన్నో సిగరెట్ ప్యాకెట్లు కాల్చేశారు
త్రివిక్రమ్ : అది ఆయన భావ తీవ్రత.. శరీరం జ్వలించిపోయిందేమో.. ఆయన చివరి రోజుల్లో స్మోకింగ్ మానేశారు. నిద్ర కూడా చాలా తక్కువగా పోయేవారు.. నేను రాత్రి రెండింటికి అలా నిద్రపోయేవాడ్ని. మీరు మాత్రం అలా నవల చదువుకుంటూ ఉండేవారు.. అవన్నీ మర్చిపోలేని రాత్రులు.

స్రవంతి రవికిషోర్ : మాకు ఎప్పుడూ మూడ్ బాగా లేకపోయినా సినిమాని చూస్తాం.. ఇది మాకు స్ట్రెస్ బస్టర్ సార్ అని అంతా అంటుంటారు..
త్రివిక్రమ్ : ఆ క్రెడిట్ అంతా వెంకటేష్ గారికే. కథ చెప్పిన వెంటనే మీతో ఆయన వచ్చి మనం చేసేస్తున్నాం కిషోర్ అని అన్నారు. క్యారెక్టర్ బేస్‌డ్ సినిమా అని, రెండు మూడుసార్లు డైలాగ్ వర్షెన్ చెప్పించుకున్నారు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఆయన కాబట్టి ముందుకు వచ్చి అలా చేసినట్టుగా అనిపిస్తుంది.
స్రవంతి రవికిషోర్ : వెంకటేష్ గారికి కథపై మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది..
త్రివిక్రమ్ : సినిమాలో ట్విస్టులు ఉండవు.. కమర్షియల్ అంశాలుండవు.. చాలా ఫ్లాట్‌గా ఉంటుంది.. కానీ కథ చెప్పినప్పుడే ఆయన సినిమాని చూసేశారు.

స్రవంతి రవికిషోర్ : వెంకటేష్ గారు సెట్‌లో వేరే సీన్ జరుగుతుంటే.. అలా మేకప్ రూంలో ఉండేవారు. నా షాట్ ఎప్పుడు? నేను ఎప్పుడు రావాలని అడిగేవారు కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవారు.

త్రివిక్రమ్ : నేను మొదటిసారిగా ఈ మూవీ కోసం బ్రహ్మానందం గారికి ఎక్కువ ట్రాక్ రాశాను. చివర్లో ట్విస్ట్ కూడా వస్తుంది.
స్రవంతి రవికిషోర్ : నేను తీసిన ఫోటో వల్ల పెళ్లి కొడుకు మారాడా? (నవ్వుతూ)
త్రివిక్రమ్ : విజయ భాస్కర్ గారికి చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. నేను పేపర్ మీద రాసినప్పుడు అది చాలా ఫ్లాట్‌గా ఉండొచ్చు. కానీ ఆయన దాన్ని పసిగట్టేవారు.
స్రవంతి రవికిషోర్ : స్క్రిప్ట్ ఇచ్చిన తరువాత 25 రోజులు రిహార్సల్స్ చేసుకునేవారు.. రాయడం కాదు..
త్రివిక్రమ్ : మీటర్ సెట్ చేసుకోవడానికి.. ఆయన లేకపోతే ఆ హ్యూమర్ అంతగా వచ్చేది కాదు.. ఆయనకి ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ వల్లే అంత బాగా వచ్చింది. ఇది ఆయనది.. అది నాది అని అందుకే ఇందులో తూకం వేసి చెప్పలేం. అల్లసాని పెద్దన చెప్పినట్టుగా మనం చెప్పేదాన్ని అర్థం చేసుకుని శభాష్ అనే శ్రోత ఉండాలి. ఇలా ఈ టీం ఇంత బాగా కలిసి వచ్చింది కాబట్టే సినిమా అంత గొప్పగా వచ్చింది.

స్రవంతి రవికిషోర్ : ఆర్తి అగర్వాల్, సుహాసిని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. వెనకాల నుంచి వెంకటేష్ వినే సీన్‌ను మీరు తీసేద్దామని అనేవారు గుర్తుందా?
త్రివిక్రమ్ : మామూలుగా అయితే నిర్మాతలు అలా తీసేయమని అంటారు.. దర్శక, రచయితలు ఉంచమంటూ పోరాడతారు. కానీ ఇందులో రివర్స్. నేను తీసేద్దామని అంటే.. మీరేమో పెడదామని అంటారు. సినిమా రిలీజ్ చేసిన మొదటి రోజు సంతాప సభలో ఉన్నట్టుగా అనిపించింది. ఆ రోజు సినిమా చూసి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా నేను తప్పు చేశా.. నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుండేది అని అన్నా.. నేనేం మాట్లాడుతున్నానో మా అమ్మకి అర్థం కాలేదు. ఆ టైంలోనే మీరు ఫోన్ చేసి హైదరాబాద్‌కి రమ్మన్నారు.
స్రవంతి రవికిషోర్ : శాంతి థియేటర్‌కు తీసుకెళ్లాను..
త్రివిక్రమ్ : అప్పుడు అక్కడ పది మందే ఉన్నారు.. అప్పుడు నేను ఇంకా బెంబేలెత్తిపోయాను. ఆ పది టికెట్లు అమ్ముడు పోయాక హౌస్ ఫుల్ బోర్డు పడింది. అప్పుడు నేను కొంచెం కుదుటపడ్డాను. ధైర్యంగా అనిపించింది. డోర్ వద్ద నిల్చుని ఆడియెన్స్ రియాక్షన్ చూడమని అన్నారు. సినిమా బాగానే ఉందని అనుకుని ఆ రోజు రాత్రి కాస్త నిద్రపోయాను.

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ రిలీజ్ అప్పుడు అమెరికా నుంచి మా మామయ్య ఫోన్ చేశారు. రెండు వారాలే అని అన్నారు. సినిమా బాగా లేదని నాతో చెప్పలేరు.. (నవ్వుతూ)
త్రివిక్రమ్ : కానీ అది ఆడుతూనే ఉంది.. వన్ ఇయర్ ఆడింది.. నేను భీమవరంలో సినిమా చూశాను. గేట్ కీపర్ అయితే ఈ మూవీ కష్టం సార్ అని అన్నాడు. అలా షాక్‌లో నేను నడుచుకుంటూ వెళ్లాను. అక్కడే 300 రోజులు ఆడింది. మళ్లీ అదే గేట్ కీపర్ ‘నేను మీకు ముందే చెప్పాను కదా సర్’ అని అన్నాడు.
స్రవంతి రవికిషోర్ : ఏంటి.. కష్టం సార్ అని అన్నవాడేనా?
త్రివిక్రమ్ : హా అవును.. కానీ నాకు గుర్తుంటుంది కదా.. విన్నది నేను.. (నవ్వుతూ).. కొన్ని సినిమాలు డబ్బులు తీసుకొస్తాయి.. కొన్ని సినిమాలు పేరుని తీసుకొస్తాయి.. గౌరవం మాత్రం కొన్ని సినిమాలే తీసుకొస్తాయి..
స్రవంతి రవికిషోర్ : ఇందాక నేను చెప్పింది అదే.. ఇవ్వాల్టికి కూడా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిర్మాతని అంటే ఆ లుక్ వేరేగా ఉంటుంది.
త్రివిక్రమ్ : అలాంటి ఓ రెస్పెక్ట్‌ని తెచ్చిన సినిమానే ఇది
స్రవంతి రవికిషోర్ : కిరణ్‌కి కూడా అదే గౌరవం.. అది మీ డాడీ తీసిన సినిమానా?
త్రివిక్రమ్ : ‘రెడీ’ చూసి పెళ్లికి రెడీ అయినట్టు (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : ‘పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలా? తీసుకెళ్లిన తరువాత పెళ్లి చేసుకోవాలా ?’ మన అబ్బు రాసిన డైలాగ్ బాగుంటుంది..
త్రివిక్రమ్ : తను కాదు ఆ సినిమాకి డైలాగ్ రైటర్..

స్రవంతి రవికిషోర్ : ఇప్పటిలా అప్పుడు ఆస్ట్రేలియా, యూకే అని ఇతర దేశాల్లో రిలీజ్ చేయలేదు. ఈ రీ రీలీజ్‌ను అక్కడ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం
త్రివిక్రమ్ : ఇది అందరి జీవితంలో భాగమైన సినిమా. ఫ్యామిలీ అందరూ కలిసి ఓటీటీ, టీవీల్లో చూశారు. ఇప్పుడు ఓ కమ్యూనల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం అందరూ కలిసి థియేటర్లో చూస్తారు.

స్రవంతి రవికిషోర్ : రివ్యూ వచ్చాక చూద్దాంలే అనే అవసరం లేని సినిమా కదా ఇది? (నవ్వుతూ)
త్రివిక్రమ్ : ఎలాంటి ఒత్తిడి లేకుండా వెళ్లే సినిమా కూడా ఓ మంచి ఎక్స్‌పీరియెన్సే.. శుక్రవారం వచ్చే మొదటి ఫోన్ కాల్‌కి ఓ భయం ఉంటుంది.. అలాంటి ఓ భయం అక్కర్లేని ఓ ఎక్స్‌పీరియెన్స్‌ని ఈ చిత్రం మనకు ఇచ్చింది. థాంక్స్ సర్.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్

స్రవంతి రవికిషోర్ : థాంక్యూ

త్రివిక్రమ్ : చాలా గొప్ప పరిచయాల్ని, దీర్ఘ కాలికంగా నిలిచే సంబంధాల్ని ఇచ్చిందీ చిత్రం.

స్రవంతి రవికిషోర్ : మీ పెళ్లి కూడా ఈ సినిమా వల్లే.. అది మర్చిపోతే ఎలా
త్రివిక్రమ్ : ఈ కథ మనం టీవీల్లో చెబుదాం.. అది మీకు తెలుసు కాబట్టి.. ఆ కుట్ర గురించి.. (పగలబడి నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : సంబంధ హాస్యం.. (నవ్వుతూ)
త్రివిక్రమ్ : ఆ కుట్ర కోణం గురించి మనకు, శాస్త్రి గారికే తెలుసు కాబట్టి.. మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు.. లవ్యూ సర్.. థాంక్యూ (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : థాంక్యూ (నవ్వుతూ)