Home Blog Page 46

‘Pithapuramlo’ Directed by Mahesh chandra  

Mahesh chandra made his directorial mark with his first film “Preyasi Raave.” Following that, he gained good recognition with films like “Ayodhya Ramayya,” “Cheppalani Vundi,” “Joruga Husharuga,” “Okkade,” “Hanumanthu,” “Aalasya Amrutam,” and “Red Alert.” The latest film by Mahesh chandra is “Pithapuramlo,” subtitled “Ala Modalindi”. The film stars notable actors such as ‘Natakireeti’ Dr. Rajendra Prasad, Prudhviraj, Kedar Shankar, Mani Chandana, Jayavahini, Annapurnamma, among others.

Produced under the Mahesh Chandra Productions banner by Dundigalla Balakrishna, Akula Suresh Patel, and FM Murali (Godari Kittayya), this film has completed its shooting phase and is now undergoing post-production activities.

Director Mahesh chandra said, “This is a love story mixed with family emotions. The film presents three couples’ love stories and portrays the shortcomings in the upbringing by three fathers. Audiences can connect with the story in some way. Everyone knows how much Pithapuram has transformed recently. The entire film is set against the backdrop of Pithapuram. We shot for 28 days in surrounding areas of Pithapuram, 15 days in Hyderabad, and 6 days in Goa. There are three songs in the film, which have turned out very well. One song was shot in Goa, another in a set in Hyderabad, and the third at Aditya College in Surampalem. Inspired by ‘Movie Mogul’ D. Ramanaidu garu, who gave me life as a director, I believed in the story and made this film without any wastage. We will announce the release date soon.”

The main cast includes Dr. Rajendra Prasad, Prudhviraj, Kedar Shankar, Manichandana, Jayavahini, Annapurnamma, Dasari Padma, Sunny Akhil, Virat, Sai Praneeth, Srilu, Pratyusha, Rehana, Jr. Pawan Kalyan, J.D.V Prasad, K.A. Paul Ramu, and Jabardasth Seshu.

The story is by Akula Suresh Patel, story development and dialogues by Sriram Edoti, editor B. Satyanarayana, music by G.C. Krish, executive producer Anji Sandral, producers Dundigalla Balakrishna, Akula Suresh Patel, FM Murali (Godari Kittayya), and screenplay and direction by Mahesh Chandra.

Hero Dheekshith Setty interview about ‘The Girlfriend ‘ Movie

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో దీక్షిత్ శెట్టి.

– దసరా మూవీ తర్వాత నాకు వచ్చిన అవకాశమిది. “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నన్ను అప్రోచ్ అయ్యారు. రశ్మిక హీరోయిన్ గా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చేస్తున్నాం. మీరు ఈ మూవీలో బాయ్ ఫ్రెండ్ రోల్ కోసం అనుకుంటున్నామని చెప్పి స్క్రిప్ట్ పంపారు. దసరా మూవీకి చేసిన ఇంటర్వ్యూస్ లో నన్ను చూసి రాహుల్ ఈ క్యారెక్టర్ కు నేను బాగుంటానని ఫిక్స్ చేసుకున్నారు. స్క్రిప్ట్ చదివాక నన్ను ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు అనుకుంటున్నారో అర్థమైంది. నేను వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో స్క్రిప్ట్స్ వింటుంటా. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి స్క్రిప్ట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ సినిమాను తప్పకుండా చేయాలని అనుకున్నా.

– ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉండాలో దర్శకుడు రాహుల్ కు పూర్తి క్లారిటీ ఉంది. విక్రమ్ ఎలా ఉంటాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎలా మాట్లాడుతాడు అనేది రాహుల్ వివరంగా చెప్పేవారు. ఆయనకు ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ క్యారెక్టర్ ను పర్ ఫార్మ్ చేయడం నాకు ఈజీ అయ్యింది. అనేక లేయర్స్ ఉన్న ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. విక్రమ్ క్యారెక్టర్ లో ఏదో నెగిటివ్ ఉంది, ఇతను టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అనే ఇంప్రెషన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అందరిలో కలుగుతోంది. అయితే విక్రమ్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడూ ఫీల్ కావొద్దని రాహుల్ చెప్పేవారు. నేను స్టేజ్, ఫిలిం స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ పాత్రకు ఎలా సన్నద్ధమవ్వాలో అలా అయ్యాను. ఏ సినిమా చేసినా స్క్రిప్ట్ నాకు పర్సనల్ గా నచ్చాలని భావిస్తా.

– ఇప్పటిదాకా మనం ఒక తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే క్యారీ అవుతుంది. మనం ఆ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తాం. అలాంటి సినిమా ఇది. లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ చూడటానికి బాగుంటాయి కానీ వాటిని మన రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకోలేం. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని పాత్రలు, సందర్భాలు మనం మన లైఫ్ లో రిలేట్ చేసుకునేలా ఉంటాయి. రశ్మిక ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి సినిమా కొన్నేళ్ల కిందట తాను చూసి ఉంటే తన జీవితం పట్ల తన దృక్పథం మరోలా ఉండేది అని చెప్పారు. 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్ లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు.

– రశ్మిక పర్ ఫార్మెన్స్ చూశాక “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు మరో నాయిక న్యాయం చేయలేదేమో అనిపించింది. తను అంత బాగా పర్ ఫార్మ్ చేసింది. మీరు మూవీ చూస్తున్నంత సేపు రశ్మిక కనిపించదు, భూమా అనే పాత్రనే కనిపిస్తుంది. మా సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే యానిమల్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. రశ్మికతో కలిసి నటిస్తున్నప్పుడు ఒక స్టార్ తో ఉన్నామనే ఫీల్ కలగలేదు. తను చాలా ఫ్రెండ్లీగా యూనిట్ అందరితో ఉండేది.

– ఈ సినిమా యూత్ కోసమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే మంచి క్యారెక్టర్స్ మా మూవీలో ఉన్నాయి. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సినిమాల్లో ఇలాంటివే చూస్తుంటాం. కానీ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ఎలిమెంట్ మా మూవీలో చూస్తారు. నేను ఆడియెన్ గా ఇలాంటి క్యారెక్టర్ ను లవ్ స్టోరీస్ లో చూడలేదు. రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. సెట్ లో ఎవరినీ హర్ట్ చేయకుండానే తనకు కావాల్సిన వర్క్ తీసుకున్నారు. డైరెక్టర్స్ అంటే ఇలా కూడా ఫ్రెండ్లీగా అందరితో వర్క్ చేయించుకోవచ్చని రాహుల్ ను చూశాక తెలిసింది. స్క్రిప్ట్, క్యారెక్టర్స్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది.

– “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా షూటింగ్ టైమ్ లో అరవింద్ గారు రశెస్ చూసి పిలిచారు. నేను సరిగ్గా నటించడం లేదేమో, ఏమంటారో అని వెళ్లా. ఆయన అప్రిషియేట్ చేసి నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ నుంచి ప్రశంసలు రావడం, మరో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. అరవింద్ గారి ప్రశంసలు కెరీర్ బిగినింగ్ లో ఉన్న నాలాంటి యాక్టర్ కు ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చాయి.

– నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. బాగా నటిస్తే తెలుగు ఆడియెన్స్ ఏ భాషలో నటుడిని అయినా ఆదరిస్తారు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ విద్య, ధీరజ్ మా అందరికీ కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ ఇచ్చిన మ్యూజిక్ “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు హైలైట్ అవుతుంది. ఏం జరుగుతుంది అనే పాట నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా నా కెరీర్ లో చేసిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను.

– నేను కన్నడలో చేసిన బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో షబనా అనే సినిమా చేస్తున్నా. ఇది కాకుండా కేజేక్యూ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. టైటిల్ ఖరారు కాని ఇంకో ప్రాజెక్ట్ లోనూ నటిస్తున్నా. కన్నడలో శివన్నతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా, మలయాళంలో చేస్తున్న ఏంజెల్ నెం.16 రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్ లో ఉంది.

 

‘Sandigdham’ Teaser Launched by  actor-producer Ashok Kumar.

Under the banner of Theertha Creations, producer Sandhya Thiruvidhula has produced the suspense-crime-thriller ‘Sandigdham’, directed by Parda saradhi Kommoju. The film features Nihal, Priya Deshpag, Arjun Dev, Kajal Tiwari, Jeeva Kocherla, Naveenraj, Chittibabu, Anand Bharathi, Rising Raju, Apparao, and Nagi in key roles.

The film’s teaser was launched on Friday by actor-producer Ashok Kumar.

The teaser gives a glimpse into a mysterious village where strange incidents unfold, intertwined with a love story. The visuals and action sequences look natural and intense, supported by an engaging background score perfectly suited for the suspense-thriller genre. The teaser has already created a good buzz for the film.

*At the launch event,*
*Actor-producer Ashok Kumar said:* ‘It has become very difficult for films to succeed these days as production costs have skyrocketed. After COVID, the industry has changed — audiences come to theaters only if a movie gets a good talk. It’s important to promote the film effectively. The teaser of ‘Sandigdham’ is gripping. Small films without huge expectations are often becoming big successes now. I sincerely wish this film, made with dedication by Sandhya and Pardu, becomes a success. May the team get the recognition they deserve. Best wishes to the entire unit.’

*Hero Nihal said:* ‘I really liked the story when Parda saradhi garu narrated it. He’s the reason I came onboard this project. Both Pardu garu and Sandhya garu worked very hard without compromising anywhere. I hope everyone supports ‘Sandigdham’.’

*Actor Arjun Dev said:* ‘Pardu garu and Sandhya garu have put in immense effort for this film. I thank Ashok Kumar garu for gracing the event and request everyone to support ‘Sandigdham’.’

*Director Parda saradhi Kommoju said:* ‘Every artist and technician gave their full support to this project. ‘Sandigdham’ is a very interesting film — a kind of story that hasn’t been seen before. It will engage audiences from start to finish. My wife Sandhya stood by me through this journey and produced the film with great determination to see me as a director. I hope everyone watches and encourages it. I also request the media to support newcomers like us.’

*Actress Priya Deshpag said:* ‘I thank the director and producer for giving me this opportunity. I’m grateful to everyone who supported me throughout this journey. I hope the teaser has impressed everyone, and I wish the film great success.’

*Music director Gautham Raviram said:* ‘I’ve known Pardu garu for many years. With great perseverance, he made this film under his own banner. I wish ‘Sandigdham’ a huge success.’

*Actor Naveenraj said:* ‘I share a long association with Pardu garu. His family worked really hard to make this film, and I wish them the success they deserve. ‘Sandigdham’ should become a big hit.’

*Narasimha Raju said:* ‘Everyone wants to see new talent coming into the industry. My sister Sandhya has produced this film, and my brother-in-law Pardu has directed it. I’m sure ‘Sandigdham’ will achieve great success and bring them both good recognition.”

*Cast:*
Nihal, Priya Deshpag, Arjun Dev, Kajal Tiwari, Jeeva Kocherla, Naveenraj, Chittibabu, Anand Bharathi, Rising Raju, Apparao, Nagi, and others

*Technical Crew:*
Banner: Theertha Creations
Producer: Sandhya Thiruvidhula
Director: Parda saradhi Kommoju
Cinematography: Nandan Krishna
Editing & Motion Graphics: VR1 Studios (Vishwan Raj D.S.)
Music: Gautham Raviram
Lyrics: Chinta Srinivas
PRO: Sai Satish

Producers Dheeraj Mogilineni and Vidya Koppineedi interview about ‘The Girlfriend’ Movie

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి.

*ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ*– లాక్ డౌన్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత థియేటర్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఆ టైమ్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్ గా కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది.

– విద్య గారితో మంచి బాండింగ్ ఉంది. ప్రొడక్షన్ వైజ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్ నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది.

– “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం. దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్ కు ఉపయోగపడుతుందని అనుకోలేదు, ఆ క్యారెక్టర్ కు ఆయన కరెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నాం. అయితే రశ్మిక, దీక్షిత్ ఉండటం వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతుంది.

– తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలూ ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైమ్ సరిపోక కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేయడం లేదు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ఈ నెల 7న హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మరో వారం తర్వాత ఈ నెల 14న తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తాం. ముంబైలో ఒక ఈవెంట్ చేయాలనే ప్లాన్ ఉంది.

– డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన ఫస్ట్ మూవీ చి.ల.సౌ ఆ సినిమా బడ్జెట్ కు బాగా వర్కవుట్ అయ్యింది. నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆయన సెకండ్ మూవీ మన్మథుడు 2 డైనమిక్స్ వేరు. గతంలో రాహుల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి కాకుండా మేము కథ బాగా నచ్చి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాం. రశ్మిక ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు కాబట్టి ఆ కృతజ్ఞతతో రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.

– అనూ ఇమ్మాన్యుయేల్ మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు ఆమె పర్పెక్ట్ గా కుదిరింది. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం. కానీ “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం.

– కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. థియేట్రికల్ గా ఇది బాగుంటుంది అనే స్టోరీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. గీతా ఆర్ట్స్, అరవింద్ గారి నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం.

*విద్య కొప్పినీడి మాట్లాడుతూ*
*————————————*

– “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్ ను తీసుకుంటారు. ఇది కమర్షియల్ ఫార్మేట్ స్టోరీ కాకపోయినా రిస్క్ తీసుకోవాలని నేను ధీరజ్ అనుకున్నాం, మా ఇద్దరికీ కథ బాగా నచ్చింది. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్ కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి.

– ఇద్దరం ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడక్షన్ కు సంబంధించిన ఏ వర్క్ అయినా షేర్ చేసుకునే చేశాం. ప్రతి డెసిషన్ కలెక్టివ్ గా డిస్కస్ చేసి తీసుకున్నాం. స్టోరీస్ సెలెక్షన్ విషయంలోనూ ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం. మా ప్రాజెక్ట్ వెనక అరవింద్ గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

– లవ్ స్టోరీస్ చూడటానికి బాగుంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరీస్ లోనే ఏదైనా కొత్తగా ఉండి స్ట్రాంగ్ ఫీల్ ఉంటే అలాంటి సినిమాలు చేయాలని అనుకుంటాం. వుమెన్ సెంట్రిక్ అని కావాలని సెలెక్ట్ చేసుకున్నది కాదు కథ ఆ తరహాలో ఉంటుంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రియల్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్ పైర్ అయి రాసినా, మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే.

– “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా షూటింగ్ ఎక్కువగా ఒక కాలేజ్ లో చేశాం. వర్కింగ్ డేస్ లో కాలేజ్ లు ఇవ్వరు. అప్పటికి రశ్మిక రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి షూటింగ్ వేరే సిటీస్ లో జరిగేది. దాంతో కొంత డేట్స్ వల్ల డిలే అయ్యింది కానీ మిగతా అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండానే షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ చివరలో ఉండగా కార్మికుల సమ్మె వచ్చింది. సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు.

– సినిమా బిగినింగ్ లోనే హేషమ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాం. ఆయన మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. సినిమా చూసిన ప్రేక్షకులంతా ఈ కథకు రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు వారికి గుర్తొస్తాయి.

– ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాం. అరవింద్ గారు ఇచ్చే సలహా కూడా అదే.

‘School Life’ Trailer launched held grandly

నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ రచన దర్శకత్వంలో బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా నటించగా తనతో జంటగా సావిత్రి, షన్ను నటించారు. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ధర్మ జిజి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా నందమూరి హరి, ఎన్టీఆర్(సూపర్ గుడ్ ఫిలిమ్స్) ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు. షేక్ బాజీ ఈ చిత్రానికి సంగీతం అందించగా క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఈ చిత్రాన్ని ఆర్థికంగా సమకూర్చారు. విడుదల తేదీ దగ్గర అవుతున్న ఈ సమయంలో దర్శకుడు తన తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.

*ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ* … “అందరికీ నమస్కారం. స్కూల్ లైఫ్ అనే సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటికే ఎన్నో వందల సినిమాలలో నేను నటించినప్పటికీ ఈ సినిమాలోని పాత్ర నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. ఒక రైతు పాత్రలో రైతులకు అండగా నిలబడేలా నా పాత్ర ఉండబోతుంది. సినిమా షూటింగ్ సమయంలో నాకు ఒక యాక్సిడెంట్ వల్ల కొన్ని రోజులు షూటింగ్ చేయలేకపోయాను. వేరే ఎవరితో అయినా షూటింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మహేష్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కేవలం ఆ పాత్రను నేను మాత్రమే చేయాలని పట్టుదలతో నా కోసం వెయిట్ చేసి ఆ పాత్రను నాతో నటించేలా చేశారు. ఆ పాత్ర కోసం నేను పులివెందుల వెళ్లి అక్కడ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలను ఎంతగానో అభిమానించారు. ఈ చిత్రంలో ఆమని గారు నాకు భార్యగా నటించారు. ఈ చిత్ర టైటిల్ విషయానికి వస్తే స్కూల్ లైఫ్. అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే జీవితం అది. ఆ వయసులో ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా మహేష్ వాటిని ఎదుర్కొని ఈ చిత్ర షూటింగును సవ్యంగా పూర్తి చేశారు. అందుకే అతను పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ అయ్యారు. తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర టైలర్ లంచ్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం. అలాగే ఈ చిత్రానికి ఇతర కాస్ట్, సాంకేతిక నిపుణులు కూడా ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నవంబర్ 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

_~*దర్శకుడు, హీరో పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ మాట్లాడుతూ*~_ … “అందరికీ నమస్కారం. మా సినిమాను సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాలో కీలకపాత్రలు పోషించి, సినిమాకు ఎంతో సపోర్ట్ చేసిన సుమన్ గారికి, ఆమని గారికి, మురళీధర్ గారు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం నేను ఎన్నో పోగొట్టుకున్నాను. ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వచ్చాను. సినిమాలు బ్రతకాలి. అందుకే నేను ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. భవిష్యత్తులో కొత్త వారి అందరికీ నా బ్యానర్ సపోర్ట్ గా నిలుస్తుంది. సినిమాలలో హీరో కథ, బడ్జెట్ కాదు. క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ సినిమాను పూర్తి చేసాము. ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వారంతా ఒకప్పుడు కొత్త వారే. మా సినిమా టికెట్ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉండబోతుంది.

*హీరోయిన్ షన్ను మాట్లాడుతూ* … “మా చిత్ర టైలర్ లాంచ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాలో అందరూ సపోర్ట్ చేసి నవంబర్ 14వ తేదీన సినిమాలు మొత్తం హిట్టు చేస్తారని మీడియా వారిని అలాగే ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఎంతో కింద నుండి వచ్చి ఈ సినిమాను పూర్తి చేసాము. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, ఈ సినిమాలో నటించిన సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం కోసం పనిచేసిన ఇతర నటీనటులకు, సాంకేత నిపుణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రంలో నాది మూడు నిమిషాల ఒకటే డైలాగ్ ఉంటుంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను” అంటూ ముగించారు.

*హీరోయిన్ సావిత్రి మాట్లాడుతూ* … “అందరికీ నమస్కారం. స్కూల్ లైఫ్ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నవంబర్ 14 తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

*నటీనటులు* : పులివెందుల మహేష్, సావిత్రి, షన్ను, హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు.

*సాంకేతిక నిపుణులు* :
బ్యానర్ : నైనిషా క్రియేషన్స్
నిర్మాత : గంగాభవాని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పులివెందుల మహేష్
సినిమాటోగ్రఫీ : ధర్మా జి జి
సంగీతం : షేక్ బాజీ
ఎడిటింగ్ : నందమూరి హరి, ఎన్టీఆర్(సూపర్ గుడ్ ఫిలిమ్స్)
లిరిక్స్ : రాంబాబు గోసాల

National Crush Rashmika Mandanna’s The Girlfriend third single “Laayi Le” out now;

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ‘కురిసే వాన..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా కపిల్ కపిలన్ పాడారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారు. ‘కురిసే వాన..’ పాట ఎలా ఉందో చూస్తే …’కురిసే వాన తడిపేయాలన్న భూమే ఏదో , సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో, ఓ నీలి మేఘం, పెంచింది వేగం, ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి, కమ్మితే మైకం, లాయి లాయి లాయిలే..’ అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. మెమొరబుల్ లవ్ సాంగ్ గా ‘కురిసే వాన..’ లవర్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ కు గుర్తుండిపోనుంది.

నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

Director Rahul Ravindran interview about ‘The Girl Friend ‘ Movie

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

– నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేసింది. ఇలా టైమ్ ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ చేసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి “ది గర్ల్ ఫ్రెండ్” కథ పంపాను. నేను, రశ్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సిఉండేది. “ది గర్ల్ ఫ్రెండ్” కథను అల్లు అరవింద్ గారు చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రశ్మిక, మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం.

– రశ్మికకు స్క్రిప్ట్ పంపినప్పుడు చదివి చెప్తానంది. రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా చదివి కాల్ చేసింది. ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం, ఇలాంటి కథ ఆడియెన్స్ కు చెప్పాలి, ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను, బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పింది. నేను ఏ కథ రాసినా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్..ఇలా కొంతమందికి పంపిస్తుంటా. అలా “ది గర్ల్ ఫ్రెండ్” కథ కూడా పంపాను. సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారనే వార్తలూ వచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివాక, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటారని సజెషన్ ఇచ్చింది.

– టీజర్, ట్రైలర్ లో ఆడియెన్స్ ను కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్ లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్ లో ఉంటుంది. ఈ డ్రామా సర్ ప్రైజ్ చేస్తుంది. ఒక జంట లైఫ్ లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్ లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్ లో చేశాం.

– రశ్మిక యానిమల్ సినిమా రిలీజై వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. రశ్మికను ఇంత రియలిస్టిక్ గా చూపిస్తున్నాం, అక్కడేమో యానిమల్ ఆడియెన్స్ మీద మరో ఇంప్రెషన్ వేస్తోంది అని అనుకున్నా. రశ్మికకు నా సందేహం తెలిసి, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని సపోర్ట్ చేసింది. మనం వుమెన్ సెంట్రిక్ మూవీస్ అని పిలుస్తుంటాం కానీ ఆ ముద్ర పోయేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం.

– “ది గర్ల్ ఫ్రెండ్” మూవీలోని విక్రమ్ క్యారెక్టర్ కోసం సెర్చ్ చేశాను. ఈ అబ్బాయి కాలేజ్ లో అడుగుపెట్టగానే చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు అనేలా కనిపించాలి అనుకున్నా. దసరా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో దీక్షిత్ ను చూసి ఇతను విక్రమ్ క్యారెక్టర్ కు బాగుంటాడు అనిపించింది. మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్టరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయితే వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సివచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్ కు పర్పెక్ట్ గా సెట్ అయ్యింది.

– హేషమ్ అబ్దుల్ వాహాబ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ తో మూవీలోని ఫీల్ మరింత పెరిగింది. తనతో వర్క్ చేసిన ఎక్సిపీరియన్స్ బాగుంది. నా లైఫ్ లో నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్న ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్ పైర్ అయి కథ రాస్తుంటాను. దర్శకుడిగా నాకొక తరహా, ఒక ముద్ర ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను కొన్ని మూవీస్ చేశాక అందులో నా తరహా విలువలు, నమ్మకాలు చూసి ఆడియెన్స్ కు రాహుల్ డైరెక్షన్ లో ఇలాంటి సెన్సబిలిటీస్ ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతుందేమో.

– నెక్ట్స్ నేను డైరెక్ట్ చేయబోయో రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రశ్మిక నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ గా రశ్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సిఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది.

– నేను అసిట్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయి కదా అని హీరోగా నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్ రైటింగ్ సైడే ఉండేది. ఇప్పుడు కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. అయితే హీరోగా నటించడం అంటే ఒక కమిట్ మెంట్ ఉండాలి. దాదాపు ఏడాది పాటు ఆ సినిమాకే టైమ్ కేటాయించాలి. నేను డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ చేసినప్పుడే హీరోగా వద్దు అనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్ అనేది నా కెరీర్ గా భావిస్తా. 20 రోజుల కాల్షీట్ ఉండే క్యారెక్టర్స్ అయితే ఒప్పుకుంటున్నా. ఆ దర్శకుడి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అనేది కూడా నా మైండ్ లో ఉంటుంది. సుజిత్ నా ఫ్రెండ్, ఓజీలో ఆయన చెప్పగానే నటించాను. హను రాఘవపూడి తన మూవీకి పిలిస్తే తప్పకుండా వెళ్తా. ఆయన ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు. ఇంకా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. హను తన నెక్ట్స్ మూవీలో హీరోగా నటించమని అడిగితే మాత్రం నటిస్తా.

We are going to organize the 3rd edition of Cinematica Expo event on November 1st and 2nd…P.G. Vinda, Managing Director

*సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ ఈవెంట్ నవంబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్విహించబోతున్నాము…*

_పి.జి. విందా, మేనేజింగ్ డైరెక్టర్

సినిమా అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసేది సాంకేతికత, సృజనాత్మకత, మరియు కొత్త ఆవిష్కరణలు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని నవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో జరిగే ఈ “ సినిమాటికా ఎక్స్పో 2025” ద్వారా ప్రపంచ సినిమా దిశగా మన అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను నేను, మరియు ‘సినిక క్రియేటర్స్ కౌన్సిల్’ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్, AI ఫిల్మ్‌మేకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు మరియు నెట్‌వర్కింగ్ సెషన్లు జరగనున్నాయి. ఈ సంవత్సరం మా థీమ్ “From Hollywood to Hyderabad: Building the Global Gateway of Cinema.” ఇది కేవలం నినాదం కాదు, భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టే మా దృక్పథం. 2023లో ఇండియాలో తొలిసారి ఫిల్మ్‌టెక్ ఎక్స్పోగా “సినిమాటికా” గుర్తింపు పొందింది. 2024లో వర్చువల్ ప్రొడక్షన్ మరియు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసి కొత్త దిశలో అడుగేసింది. 2025లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు “హాలీవుడ్ టు హైదరాబాద్” కాన్సెప్ట్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కొత్త మైలురాయిగా ఈ ఎడిషన్ నిలుస్తుంది. సినిమా, టెక్నాలజీ, ఆర్ట్, మరియు కల్చర్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడం మా లక్ష్యం. “Where Filmmaking Meets the Future” ఈ నినాదం కేవలం మాట కాదు, మన దిశను నిర్వచించే దారి. ఇది ఒక ఎక్స్పో కాదు. ఇది మన సినిమా భవిష్యత్తు కోసం మన సమిష్టి కృషి అవసరం. హైదరాబాద్ నుంచి హాలీవుడ్ దాకా, మన సృజనాత్మకతకు గ్లోబల్ వేదికగా నిలిచే ఈ ప్రయాణంలో ప్రతి సినీ ప్రొఫెషనల్, ప్రతి టెక్నీషియన్ భాగస్వామి కావాలి.

*సినీమాటికా ఎక్స్పో 2025* సినిమా భవిష్యత్తుకి వేదిక!

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న పి.జి విందా. 2004లో పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాలుగా ఆయన తెలుగు సినిమా రంగానికి సేవ చేస్తూనే.. ప్రపంచంలో ఎక్కడ నూతన టెక్నాలజీ ఉన్నా.. అక్కడికి వెళ్లి నేర్చుకునే తత్వం ఆయనది. అదే క్రమశిక్షణతో “సినిమాటికా ఎక్స్‌పో” అనే వేదికను స్థాపించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగనే ఈ సంవత్సరం కూడా సినిమాటికా ఎక్స్ పో కార్యక్రమం నవంబర్ 1, 2 న హైటెక్స్ లో, నవొటల్ లో జరుగనుంది. గత సంవత్సరం సినిమాటికా ఎక్స్ పో కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు పి.జి విందా తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధారణ లభించిందని, 100 మందికి పైగా ఇంటర్ నేషనల్ ఎగ్జిబీటర్స్, స్పీకర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిల్మ్ మేకింగ్ గురించి, నూతన కెమెరాల గురించి అలాగే వీఎఫ్ఎక్స్ గురించి తెలుసుకోవచ్చని చెప్పారు.

పి.జి విందా మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ నేర్చుకుంటే సినిమా ప్రపంచంలో అద్భాతాలు చేయొచ్చు అని చెప్పారు. ఓటీటీ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా ఈ వేదిక ద్వారా సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. గత సంవత్సరంలో వేలాది మంది బ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లూయెన్సర్స్ అలాగే ఫిల్మ్ మేకర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ స్కూల్స్ లో మొత్తం కలిపి 40 వేలకు పైగా ఔత్సాహికులు ఈ వేదికపై కనెక్ట్ అయ్యారని చెప్పారు. తెలుగు పరిశ్రమ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. హైదరాబద్ లో మొదలైన ఈవెంట్ ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఈవెంట్ గా మారిందని చెప్పారు. దీనికి తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ కూడా సినిమాటికా ఎక్స్‌పో, ఇంతలా విస్తరించడానికి కారణం అని చెప్పారు.

ఇక ఫిల్మ్ మేకింగ్ అంటే కేవలం కొందరికే కాకుండా ఆసక్తి ఉన్నవారందరికీ అందుబాటులో ఉండాలి. గ్రామాల్లో ఉన్న క్రియేటర్ల కోసం సినిమాటికా ఎక్స్‌పో అద్భుతమైన వేదిక అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు “హాలీవుడ్ నుంచి హైదరాబాద్ వరకు టెక్నాలజీ రూపొందించాలి” అన్నట్టు దానికోసం సినిమాటికా ఎక్స్ పో సపోర్ట్ గా ఉంటుందన్నారు పీజీ విందా. దీనికి అనుబంధంగా సినికా క్రియేటర్స్ కౌన్సిల్ పని చేస్తుందని చెప్పారు. సినిక ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ, ఈ వర్టికల్స్ ఫిల్మ్ మేకింగ్ లో మరియు క్రియేటివ్ ఆర్ట్స్ లో అన్నింటిని, అలాగే అన్ని విభాగాలకు సమాచారం, సదుపాయాలు అందించడానికి సినీకా క్రియేటర్స్ కౌన్సిల్ ముందుంటుందని చెప్పారు. సినిమాటిక ఎక్స్ పో వచ్చే సంవత్సరం ఫిల్మ్ కార్నివాల్ ను నిర్వహించబోతుందని చెప్పారు. అంటే ప్రపంచ సినిమాలను ప్రదర్శిస్తారు. టెక్నికల్ డిపార్ట్ మెంట్, వీఎఫ్ ఎక్స్, ఎడిటర్స్, డైరెక్టర్స్ ప్రసంగాలు ఉంటాయని, వాటి ద్వారా నూతన ఫిల్మ్ మేకర్స్ ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ ఫిల్మ్ కార్నివాల్ ఫెస్ట్ 5 రోజులు నిర్వహిస్తామని, దానికోసం ప్రణాళిక సిద్దం అవుతుందని చెప్పారు.

ఈ సంవత్సరం సినిమాటిక ఎక్స్పో లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో సినిమాటికా ఎక్స్‌పో ఫిల్మ్ మేకింగ్ లో అద్భుతం కాబోతుందని చెప్పారు. అలాగే 2023, 2024 ఎడిషన్ లో ఏఐ గురించి ప్రస్థావించామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా నిపుణులచే AI సెషన్స్ వుంటాయని చెప్పారు. ఏఐ టూల్ వాడుకుంటే ఎన్నో అద్భుతాలను చేయొచ్చు అని కూడా చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంజా శ్రవణ్ మాట్లాడుతూ.. సినిమాటికా ఎక్స్‌పో, సినీకా క్రియేటర్ కౌన్సిల్ మద్దతుతో భవిష్యత్తులో జీసీసీ మోడల్ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్ లాగా పని చేస్తుందన్నారు. దాని ద్యారా భవిష్యత్తులో ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన కెమెరాలు, సాఫ్ట్ వేర్స్ అన్ని హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాయి అన్నారు. అంటే ఫిల్మ్ మేకింగ్ ఒకటే కాదు అన్ని క్రియేటివ్ ఆర్ట్స్ కి మన హైదరాబాద్ సిటీనే హాబ్ గా చేయొచ్చు.

ఇంతకుముందు రెండు సినిమాటిక ఎడిషన్స్ లో ఎంట్రీ ఉచితంగా ఇచ్చాము. 40 వేలకు పైగా సినీ ఔత్సహికులు వచ్చారు. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన సినిమాటిక ఎక్స్పో లో ఎంట్రీ అనేది ఫ్రీ గా ఇవ్వలేక పోతున్నాం. సాధారణ పౌరులను కంట్రోల్ చేయడానికి, కేవలం సినీ ఔష్టహికులను ప్రోత్సాహించడానికి కొద్దిగా ఫీజ్ పెట్టడం జరిగింది. సినీ పరిశ్రమలోని అన్నీ అసోసియేషన్ సభ్యులకి, ఇండస్ట్రీలో పని చేసే వారికి మాత్రం ఎక్స్పో లో ఎంట్రీ పూర్తిగా ఉచితం అని చెప్పారు.

From the Jungle to the Badlands: The Predator’s Evolution Reaches Its Deadliest Hunt Yet

For nearly four decades, the Predator has remained one of science fiction’s most enduring and terrifying icons. From stalking commandos in the steamy jungles of Central America to prowling futuristic cities and alien worlds, the Yautja’s lethal evolution mirrors humanity’s own struggle for dominance.

Now, with Predator: Badlands (releasing in India on 7th November, 2025), the franchise’s most ambitious chapter flips the story once more and for the first time, it’s the Predator who’s fighting to survive.

The Origin of the Hunt: 1987’s Jungle Nightmare
It all began with 1987’s Predator, directed by John McTiernan. Deep in the rainforest, Arnold Schwarzenegger’s Dutch and his team of commandos faced an invisible enemy armed with thermal vision, cloaking technology, and plasma weaponry.

The setting was key — the jungle wasn’t just a backdrop, but a living, breathing adversary. As the soldiers’ strength was stripped away, audiences learned that the alien wasn’t killing out of malice, but for sport.

The Concrete Jungle: Predator 2 (1990)
In 1990, the franchise took its first major risk with Predator 2. The urban sprawl of Los Angeles replaced the rainforest, and the heatwave-scorched city became a new kind of jungle. This time, the Predator stalked gangsters, cops, and criminals alike. The sequel also expanded the mythos, hinting that Yautja hunters had visited Earth for centuries, collecting trophies from human warriors.

The Game Preserve and Beyond: Predators (2010)
Two decades later, Predators (2010) redefined the formula again. A group of elite human fighters awoke on an alien planet — a massive game preserve used by multiple Predator clans. This chapter revealed the existence of rival species, or “Super Predators,” with their own advanced weaponry and rituals. It also explored internal hierarchies and conflicts among the Yautja.

Humans, once helpless prey, began to adapt — and occasionally turn the tables. For the first time, the Predator wasn’t the ultimate hunter anymore.

A Return to Roots: Prey (2022)
In 2022, Prey took audiences back to 1719 North America. Set within the Comanche Nation, it followed Naru (Amber Midthunder), a young warrior who faced off against an early Yautja visitor. The result was one of the most acclaimed entries in the franchise, praised for its Indigenous representation, atmospheric storytelling, and stripped-down survivalist tone. Prey rekindled the spirit of the original while setting the stage for a new era of storytelling.

The Ultimate Evolution: Predator Badlands (2025)
The upcoming Predator: Badlands takes the franchise in a bold, unexpected direction. According to early reports, the story follows a young Predator named Dek who forms an uneasy alliance with Thia, an android warrior played by Elle Fanning.Set on a brutal alien world described as the most dangerous planet in the universe, the film reverses the traditional premise. This time the Predator is being hunted.

Director Dan Trachtenberg, returning after Prey, has hinted that Badlands will explore Yautja culture in depth, revealing their moral codes, internal rivalries, and vulnerabilities.

With no human leads, Badlands invites audiences to experience the story from the Predator’s perspective, turning one of sci-fi’s most feared creatures into an unexpected protagonist.

The Origins of Arun Rayadurgam Theatre

బాలు మహేంద్ర ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో నటన కోర్సు పూర్తి చేసిన తర్వాత, అరుణ్ రాయదుర్గం తన నిజమైన పునాది రంగస్థలంలో కనుగొన్నాడు. ఫ్రీలాన్సర్‌గా పనిచేయాలని నిర్ణయించుకుని, తమిళనాడులోని సజీవమైన థియేటర్ సంస్కృతిలో తాను మునిగిపోయి, ఒక నటుడిగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నాడు.

తన ప్రారంభ దశలోనే అరుణ్ బాగు వంటి ప్రముఖ థియేటర్ వ్యక్తిత్వాలతో అనుబంధమై, తమిళనాడులో ప్రసిద్ధ థియేటర్ పత్రిక వెలికి సంపాదకుడైన వెలి రంగరాజన్ రూపొందించిన ప్రొడక్షన్లలో కూడా నటించాడు. అలాగే ప్రఖ్యాత థియేటర్, సినీ వ్యక్తిత్వం అరుణ్మొళి శివప్రకాశంతో ఆయన చేసిన సహకారం ఒక కీలక మలుపు అయ్యింది. శివప్రకాశమే అరుణ్‌ను బాగుకు పరిచయం చేయగా, వారి అనుబంధం తర్వాత బలమైనదిగా మారింది.

అరుణ్, బాగు దర్శకత్వం వహించిన అనేక నాటకాలలో నటించి, చివరకు “తినை నిలవాసిగల్” అనే థియేటర్ బృందంలో ఒక ముఖ్య భాగస్వామిగా మారాడు. ఈ బృందంతో ఆయన రంగస్థల ప్రదర్శనలు మాత్రమే కాకుండా, వివిధ సామాజిక సమస్యలను ప్రతిబింబించే వీధి నాటకాలలోనూ, భారత్ అంతటా పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యాడు. ఈ విభిన్న అనుభవమే, తనను ఒక వినమ్ర నటుడిగా నిలిపిందని అరుణ్ నమ్ముతాడు — ఎందుకంటే నటన అనేది కేవలం ఆడిటోరియంలకే పరిమితం కాకుండా, ప్రతి ప్రదేశంలో ప్రజల కోసం ఉండాలని ఆయన విశ్వసిస్తాడు.

ఈ ప్రయాణంలో ఒక మరచిపోలేని అంశం నసర్ గారి మద్దతు. ఆయన, చెంగళ్‌పట్టులోని తన ఫామ్ హౌస్‌ను ఈ బృందానికి రిహార్సల్స్ కోసం తెరిచారు. ఆయన చూపిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వంటి వాటివల్ల అరుణ్ వంటి యువ నటులు తమ కళను ధైర్యంగా అన్వేషించే వీలు కలిగింది.

ఈ అన్ని సంవత్సరాలలో, అరుణ్ థియేటర్ ప్రస్థానం కేవలం శిక్షణ మాత్రమే కాదు — అది ఒక జీవన విధానం. షార్ట్ కట్స్ కంటే నిజాయితీని విలువైనదిగా భావించే ఒక సీరియస్ నటుడిగా ఆయనను తీర్చిదిద్దిన క్రమశిక్షణ.