Home Blog Page 47

‘Napoleon Returns’ Title & Glimpse Launch Event held grandly

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌కు వశిష్ట, సాయి రాజేష్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ వంటి వారు గెస్టులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

వశిష్ట మాట్లాడుతూ .. ‘నేను రవన్న కోసమే వచ్చాను. నీడ పోయిందని ‘నెపోలియన్’ తీశాడు. జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ‘నెపోలియన్ రిటర్న్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘నేను ఇక్కడకు ఆనంద్ రవి కోసం వచ్చాను. నేను, వశిష్ట, ఆనంద్ రవి మంచి స్నేహితులం. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ చాలా బాగుంది. ఈ మూవీతో ఆనంద్ రవికి పెద్ద విజయం దక్కాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

అనిల్ విశ్వంత్ మాట్లాడుతూ .. ‘ఆనంద్ రవి గారి మొదటి సినిమాకి నేను పని చేశాను. ఆయన నాకు గురువు వంటి వారు. ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన తీసుకునే హుక్ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ మూవీ కథ కూడా నాకు తెలుసు. స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. గుప్తా గారి వల్లే ‘పొలిమేర’ కాన్సెప్ట్ పుట్టింది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన సాయి రాజేష్, వశిష్ట, అనిల్ గార్లకు థాంక్స్. ఆనంద్ గారు ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నర పాటుగా ప్రీ ప్రొడక్షన్ కోసమే పని చేశారు. మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన వశిష్ట, సాయి రాజేష్, అనిల్ గార్లకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు గుప్తా గారెంతో సహకరించారు. ‘పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాలు తీశాను. నేను అందరికీ తెలుసు. కానీ సరైన సక్సెస్, గుర్తింపు రాలేదు. కానీ ‘నెపోలియన్ రిటర్న్స్’తో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు. మున్ముందు ఈ మూవీ గురించి మరింతగా తెలియజేస్తాను’ అని అన్నారు.

దివి మాట్లాడుతూ ..‘‘నెపోలియన్’ తరువాత ఆనంద్ రవి గారిని కలిశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఆనంద్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ మూవీ గురించి మున్ముందు అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.

తారాగణం : ఆనంద్ రవి, దివి, ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవివర్మ, నరసింహ, బెజయవాడ బాబీ అక్క, మీసాల లక్ష్మణ్, రమణ భార్గవ్, కేదార్ శంకర్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: ఆనంద్ రవి
నిర్మాత: భోగేంద్ర గుప్తా
సహ నిర్మాత: జై గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: R&M డిజైన్
సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
లైన్ ప్రొడ్యూసర్: పోలాకి సురేష్
స్టైలిస్ట్: ముదస్సర్ మొహమ్మద్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
PRO : నాయుడు – ఫణి (బియాండ్ మీడియా)

Rashmika Mandanna, who became the Indian cinema queen with 25 films in 4 languages over 9 years journey in Indian film industry

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రశ్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రశ్మిక.

వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంటుంది రశ్మిక మందన్న. ఈ అందాలతార తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. రశ్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో రశ్మిక పర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోందనే ప్రెడిక్షన్స్ ట్రైలర్ సక్సెస్ తో ఏర్పడుతున్నాయి.

‘Naa Pranamantha’ song launched by director Krishna Chaitanya from ‘Dev Paaru’ Movie

డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా దేవ్ పారు సినిమా నుంచి నా ప్రాణమంత సాంగ్ లాంచ్

ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం నుంచి ఈ రోజు నా ప్రాణమంత అనే పాట విడుదల అయింది. సింగర్ కాలభైరవ పాడిన ఈ పాట డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా ఈ విడుదల అయింది. ఈ పాట ఆదిత్యమ్యూజిక్ లో శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. కాలభైరవతో కలిసి పనిచేశాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దేవ్ పారు మూవీ ఒక ఫ్రెష్, ఎమోషనల్ లవ్ స్టోరీ అని యూత్‌ను ఆకట్టుకుంటుందని చెప్పారు. సినిమాకు అందరూ రిలేట్ అవుతారని చెప్పారు. పాట కూడా చాలా బాగుంది. ఆడియెన్స్ సపోర్ట్ తో సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పారు.

దర్శకుడు అంజి మాట్లాడుతూ, ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని, అఖిల్ రాజు దర్శకుడిగా గొప్ప భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. అందరూ కొత్తవారే అయినప్పటికీ హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారని, వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంజి గారు తెలిపారు. కెమెరామెన్ అశ్విన్ తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన క్వాలిటీని అందించారని, మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన సంగీతాన్ని, ధ్రువ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారని ప్రశంసించారు. ప్రొడ్యూసర్ అలీ గారి పాషన్ గురించి తెలుసని ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటారని, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమాను నిర్మించారని కొనియాడారు.

ప్రొడ్యూసర్ అలీఖాన్ మాట్లాడుతూ.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే తపన ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. డైరెక్టర్ అఖిల్‌తో మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రొడ్యూసర్ తెలిపారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ కాలభైరవ ఒక పాటను పాడడం విశేషం. ఆయన పాట, లిరిక్స్, మ్యూజిక్ అన్నీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. సినిమాలోని లవ్ స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలగలిపి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయని అన్నారు.

హీరో మిహాస్ రోమి మాట్లాడుతూ, జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వరకు తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా, తన పాషన్‌తో ఈ స్థాయికి చేరానని ఎమోషనల్‌గా తెలిపారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు మంచి పేరు వస్తుందని చెప్పారు. మా టీమ్ పాషన్, ప్రొడ్యూసర్ అలీ, డైరెక్టర్ అఖిల్, డీఓపీ అశ్విన్ సపోర్ట్‌తో ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కమెడియన్ ధీరజ్ బండి తనదైన హాస్యంతో ఈవెంట్‌ను సందడి చేశారు. వెన్నెల కిశోర్, సత్య వంటి వారి నుంచి స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. ఈ సినిమా నాకు వెన్నెల, స్వామి రారా లాంటి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా అని అన్నారు. ‘దేవ్ పారు సినిమా ఒక ట్రూ స్టోరీ ఆధారంగా రూపొందిన లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన తర్వాత, ఇది తమ కథలా అనిపిస్తుంది. లవర్స్ ఈ సినిమాతో రిలేట్ అవుతారు అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఈ చిత్రం యూత్‌ను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని చెప్పారు.

దర్శకుడు అఖిల్ రాజు తన సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రధాన ప్రేరణ అని ఎమోషనల్‌గా తెలిపారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను. మా ఇంట్లో ట్రంక్‌లో ఆయన ఫోటోలు అతికించి ఉండేవి. ఆయన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి రావాలని, డైరెక్టర్‌గా స్థిరపడాలని కలలు కన్నాను. ఆయనే నాకు దేవుడు లాంటివారు. ఈ స్టేజ్‌పై నిలబడటానికి ఆయనే కారణం, అని అఖిల్ తెలిపారు.
అఖిల్ మాట్లాడుతూ, మా డాడీ ఎప్పుడూ నన్ను ముందుకు నడిపించేవారు. ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. లేకపోతే ఈ ఈవెంట్‌లో ముందు కూర్చొని నన్ను సపోర్ట్ చేసేవారు. ఐ మిస్ యూ డాడ్ అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్, తమన్ గారి దగ్గర ప్రోగ్రామర్‌గా పనిచేసిన అనుభవంతో, ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన ఎమోషనల్ ట్రాక్. అందరూ విని, స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాం, అని అఖిల్ తెలిపారు.

ఆదిత్య మ్యూజిక్ టీమ్, నిరంజన్, మాధవ్ గార్ల సపోర్ట్‌కు కూడా థాంక్స్ చెప్పారు.హీరోయిన్ యష్ణ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. సినిమాలో టీనేజర్, మెచ్యూర్డ్ అమ్మాయిగా రెండు షేడ్స్‌లో అద్భుతంగా నటించిందని చెప్పారు. హీరో మిహాస్ వైల్డ్, పొసెసివ్ క్యారెక్టర్ కావాలని రాసాను. మిహాస్ ఆ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు.అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందని ప్రశంసించారు. ప్రొడ్యూసర్ అలీ నాకు బాబాయ్ లాంటివారు. నేను ఏ ఐడియా చెప్పినా నో అని ఎప్పుడూ అనలేదు. స్టోరీ వినకముందే నా కాన్ఫిడెన్స్ చూసి అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్యం కాదు అని కృతజ్ఞతలు తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియా మాట్లాడుతూ.. 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాను. అఖిల్ కథ, టీమ్ పాషన్ నన్ను ఆకర్షించాయి. మేమంతా 24 క్రాఫ్ట్స్‌లా ఒక ఫ్యామిలీగా పనిచేశాం. ప్రొడ్యూసర్ అలీ సపోర్ట్ అద్భుతం. మిహాస్‌లో ఉదయ్ కిరణ్‌లా లవబుల్ క్వాలిటీ కనిపిస్తుందని అన్నారు.

చిత్రం: దేవ్ పారు
నటీనటులు : మిన్హాజ్ రూమి, యష్నా ముత్తులూరి, తనుజా మధురపంతుల, ధీరజ్ బండి, మానస చావా, విశిష్ట సక్సేనా, అశోక్ వర్ధన్, కిరీటి దామరాజు
నిర్మాత: లోడీ ఫాహద్ అలీఖాన్
రచయిత, దర్శకత్వం: అఖిల్ రాజ్
మ్యూజిక్: ఓషో వెంకట్
ఎడిటర్: ప్రతీక్ నూటి
డీఓపీ: అశ్విన్ అంబేద్
ఎగ్జ్‌గ్యూటీవ్ ప్రొడ్యూసర్: ప్రియా అండలూరి
ప్రొడక్షన్ మేనజర్: మెహర్ మోనిష్
ఆర్ట్ డైరెక్టర్: సాయి కధిర
కాస్ట్యూమ్ డిజైనర్: పరమేశ్వర్ కృష్ణ
లిరిక్స్: ఆర్ ఆర్ ధృవన్
డీఐ: వి చిట్టకాంగ్
పీఆర్ఓ: హరీష్, దినేష్

Beauty Queen Sony Charishta in a Heroine-Oriented Action Entertainer!

The stunning beauty queen Sony Charishta, known for her unique charm, is all set to mesmerize in a full-fledged heroine-oriented action entertainer. This film, being made in both Telugu and Hindi, will have its complete details revealed soon. A well-trained yoga expert, Sony is currently undergoing special training in combat and stunt techniques to make the action sequences look powerful and realistic.

Today, on the occasion of her birthday, Sony celebrated the day in a simple and graceful manner in the presence of her close friends and well-wishers!!

National crush Rashmika Mandanna ‘The Girlfriend’ Trailer Launch event held grandly

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ కృష్ణన్ వసంత్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీమ్ తో వర్క్ చేయడం ఎంతో ఇన్స్ పైర్ చేసింది. ఒక ఇంటెన్స్, ప్యాషనేట్ కంటెంట్ ను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మీరంతా మా మూవీని సపోర్ట్ చేస్తారని, మా సినిమా గురించి మిగతా వారికి చెబుతారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – నేను స్టూడెంట్ గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. దాన్ని కొన్నేళ్ల క్రితం స్టోరీగా రాసుకున్నా. మీరు ఇప్పుడు ట్రైలర్ లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్ తో ఉంటుంది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. మూవీ రియల్ గా, రూటెడ్ గా, ఇంటెన్స్ గా , ఎమోషనల్ గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ తో కథకు లైఫ్ ఇచ్చారు. ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల పర్ ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మేట్ లవ్ స్టోరీ కాదు. జెన్యూన్ గా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం. ఇలాంటి మూవీస్ కు మీ సపోర్ట్ కావాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ విద్యా కొప్పినీడి మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్, రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా అంటే మీరంతా క్యూట్ లవ్ స్టోరీ ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. కానీ ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా మూవీ ఉంటుంది. ఇలాంటి మంచి కథ తీసుకొచ్చిన రాహుల్ కు థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ ను రశ్మిక తప్ప మరో హీరోయిన్ ఇంత బాగా పర్ ఫార్మ్ చేయలేరు. ఆమె గురించి మరో సందర్భంలో మాట్లాడుతా. తను మమ్మల్ని ఇన్స్ పైర్ చేసేది. దీక్షిత్, రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఈ కథకు లైఫ్ ఇచ్చారు. నవంబర్ 7న మీ అందరినీ థియేటర్స్ లో కలుస్తాను. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మేము ఏ సినిమాను రొటేషన్ కోసం చేయము. కథను నమ్మి ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తాం. కెరీర్ లో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలి అనుకుంటా. వాటిలో “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. ఈ జర్నీలో డైరెక్టర్ రాహుల్ మంచి మిత్రుడు, సోదరుడిలా మారిపోయారు. రశ్మిక గారు ఈ సినిమాను ఒప్పుకోవడమే మా మొదటి విజయం. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలని వెళితే, సినిమా కంప్లీట్ అయ్యాక తీసుకుంటా అన్నారు. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది. రశ్మిక లేకుంటే “ది గర్ల్ ఫ్రెండ్” సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్ లో “ది గర్ల్ ఫ్రెండ్” తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. అల్లు అరవింద్ గారు లేకుంటే నేను లేను. ఆయన మాకు గాడ్ ఫాదర్. అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నేను చూశాను. చివరి 30 నిమిషాల సినిమాను మర్చిపోలేకపోతున్నాను. రశ్మిక మా గీతా ఆర్ట్స్ గీత. ఈ సినిమాలో తను అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా చూశాక దీక్షిత్ ను కూడా మర్చిపోలేము. థియేటర్స్ లో కూర్చున్న అమ్మాయిల్లో 60 పర్సెంట్ ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. ఇది మీరు బాగా కనెక్ట్ అయ్యే కథ. తమ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకు వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ప్రొడ్యూసర్స్ విద్యా, ధీరజ్ ఈ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్లకు అవార్డ్స్ కూడా వస్తాయి. అన్నారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ – దసరా మూవీ తర్వాత మళ్లీ మీ అందరినీ మీట్ అవడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీరంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇంటెన్స్ గా ఫీల్ అయి ఉంటారు. నేను ఈ కథ విన్నప్పుడు ఆ కథ నుంచి బయటకు రాలేకపోయాను. అంత మంచి స్టోరీని రాహుల్ మా దగ్గరకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో విక్రమ్ అనే క్యారెక్టర్ చేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. దసరా సినిమాలో సూరి క్యారెక్టర్ ను మీరు ఎంతగా ఇష్టపడ్డారో ఈ చిత్రంలో విక్రమ్ ను అంతగా ఇష్టపడటంతో పాటు ద్వేషిస్తారు. గర్ల్ ఫ్రెండ్ ను ఎలా మ్యానేజ్ చేయాలో నేర్చుకుంటారు. ఈ రోజు అబ్బాయిలు ఎలా ఉన్నారో నా క్యారెక్టర్ ద్వారా చూసుకోవచ్చు. నవంబర్ 7న థియేటర్స్ కు వచ్చి మా మూవీని సపోర్ట్ చేయండి. చాలా ప్యాషనేట్ గా ఈ చిత్రానికి వర్క్ చేశాం. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో నటిస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, చూస్తున్నప్పుడు మీరూ అలాగే ఆస్వాదిస్తారు. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రొడ్యూసర్ విద్య గారికి హ్యాట్రిక్ హిట్ రావాలని కోరుకుంటున్నా. అలాగే నా మిత్రుడు ధీరజ్ అంబాజీపేట..సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకు మరో హిట్ దక్కుతుందని ఆశిస్తున్నా. యానిమల్, పుష్ప 2, థామా..రశ్మిక కెరీర్ కు లేదు కామా. స్వీట్ నెస్, కూల్ నెస్, హాట్ నెస్ ఉన్న హీరోయిన్ ఆమె. రశ్మిక పబ్లిసిటీ కంటే సింప్లిసిటీనే కోరుకుంటారు. రశ్మికలా డెడికేషన్, కమిట్ మెంట్ ఉన్న హీరోయిన్ ను మరొకరిని నేను చూడలేదు. ఎన్ని గంటలైనా షూటింగ్ చేస్తారు. రశ్మిక గీత గోవిందంలో అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అను ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. గీత గోవిందం లాగే “ది గర్ల్ ఫ్రెండ్” కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మీ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకు వెళ్లండి. ఈ సినిమా చూసి మీరు కొన్ని నేర్చుకుంటారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ లా మనం ఉన్నా లేకపోయినా, మన యూనిక్ నెస్ మనదే. అన్నారు.

హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మా మూవీ ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. నేను చాలా మూవీస్ చేస్తున్నా గానీ “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను. నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్ కు చెప్పాలనే అనిపిస్తుంది. నా మూవీ థియేటర్స్ కు వెళ్లి చూసిన ఆడియెన్స్ ఏదో ఒక మంచి ఫీల్ తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్ లో రైట్ టైమ్ లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ నిజం కావు. దీక్షిత్ లాంటి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఆహాకు వెబ్ సిరీస్ లా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనిపించేది. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఈ కథ గురించి రాహుల్ కు గుర్తుచేసేవాడిని. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంత హెవీ పర్ ఫార్మెన్స్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు రశ్మిక మాత్రమే చేయగలదు అని ఆమెను తీసుకున్నాం. తను నాకు కూతురు లాంటిది. రశ్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి. ఈ సినిమా చూశాకే దీక్షిత్ ఎంత మంచి పర్ ఫార్మర్ అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రశ్మిక, దీక్షిత్ తో ఒక ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొద్దాం. అన్నారు.

నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

Joju George Celebrates Birthday with the First Look of ‘Varavu’

On his birthday, Joju George unveiled the first look poster of Varavu, directed by Shaji Kailas. The film combines the strength of the Malabar region with intense action-thriller elements, featuring Joju George in the lead role. Several stars, including Suresh Gopi, extended birthday wishes and shared the poster on their social media handles.

The poster shows Joju intensely staring through a shattered jeep windshield, signalling that Varavu will be a high-octane experience. Released with the tagline “Game of Survival”, the first look encapsulates the essence of the film. Set against the backdrop of the Malabar region, Varavu revolves around the life struggles of a character named Polly, also known as Polachan. The first look hints at the signature “Joju magic” audiences can expect.

Joining Joju in the action sequences is Malayalam’s action queen, Vani Vishwanath, adding extra strength to the film’s thrilling moments. Shaji Kailas’ direction combined with Joju’s powerful performance promises a unique cinematic experience. This marks the first collaboration between Joju George and Shaji Kailas.

Varavu is produced under the banner of Olga Productions, with Reji Prothasis and Nicey Reji as producers and Jomy Joseph as co-producer.

The film, categorized as an action-survival thriller, features spectacular stunts choreographed by South India’s top stunt masters, including Anup Arivu, Stunt Silva, Kai Kingston, Jacky Johnson, Phoenix Prabhu, and Kanal Kannan.

Joju George is also preparing for upcoming projects, including films with Joshi Sir and Bhadra Sir. Announcements regarding his Tamil film and Bollywood debut are expected later this year.

Another highlight of Varavu is the return of popular Malayalam actress Sukanya. The film also features Murali Gopi, Arjun Ashokan, Babu Raj, Vinci Aloysius, Saniya Iyyappan, Ashwin Kumar, Abhimanyu Shammi Tilakan, Biju Pappan, Bobby Kuryan, Azeez Nedumangad, Sreejith Ravi, Deepak Parambol, Kottayam Ramesh, Balaji Sharma, Chali Pala, and Radhika Radhakrishnan in key roles.

The screenplay is written by A.K. Sajan, known for his successful films Chinthamani Kolacase, Red Chillies, and Drona. Cinematography is handled by S. Saravanan, editing by Shameer Mohammed, art direction by Sabu Ram, makeup by Saji Kattakada, and costume design by Sameer Sanish. The film’s production team includes Chief Associate Director Syamantak Pradeep, Production Managers Shivan Poojappura and Anil Anshad, Production Executive Prathapan Kalliyoor, and Production Controller Vinod Mangalath. PR is managed by Manju Gopinath, with stills by Hari Thirumala and digital marketing by Obscura Entertainment offline publicity Bringforth.

Filming is taking place across Munnar, Marayur, Theni, and Kottayam, and the shoot is expected to be completed in 70 days.

Evergreen Star.. The Rebel Star ‘Prabhas’

For Rebel fans, Diwali isn’t the only celebration this season – it’s also the birthday of Rebel Star Prabhas. Every year on October 23, fans and movie lovers celebrate this day in a grand way. Prabhas’ birthday has now become a nationally recognized occasion at a pan-India level. He has a massive fan base not just across India, but all over the world – from the US and UK to Japan and beyond. The box office numbers his films generate overseas stand as proof of his universal appeal. That’s why every film he takes on is becoming a true pan-world project.

With his stardom, charisma, performance, screen presence, and record-breaking box office success, Prabhas has taken the name of Telugu cinema to international heights. While many actors earn fame for themselves, Prabhas is one of the rare stars who brings recognition to the entire Tollywood industry. His birthday celebrations usually include re-releases of his blockbuster films and exciting updates about his upcoming projects. On October 31, his career milestone film Baahubali: The Epic will be re-released – combining both Baahubali films into a single epic film, generating huge excitement among fans and movie lovers alike.

Prabhas continues to build a line-up of grand pan-world movies that make every Telugu person proud. His upcoming film with director Maruthi, The Raja Saab, is all set for a grand Sankranti release on January 9. In this romantic horror comedy, Prabhas will appear in a vintage look that fans have been missing for a long time. The promotional content is already receiving an overwhelming response, hinting at the records the film is likely to break at the box office.

There are high expectations for his film with director Hanu Raghavapudi, produced by Mythri Movie Makers. And Spirit directed by Sandeep Reddy Vanga, is already generating sky-high anticipation. Other exciting projects in Prabhas’ lineup include Salaar 2 and Kalki 2, both of which are thrilling fans with their potential. This year, in Manchu Vishnu’s Kannappa, Prabhas appeared in the powerful role of Rudra, which turned out to be the major highlight of the film. His divine performance in that role captivated audiences.

A flawless life, humble nature, unmatched generosity, and unforgettable hospitality – these qualities have made Prabhas the beloved “Darling” of millions. His stamina as a star is reflected in box office records, while the nickname “Darling” reflects his greatness as a person. As he continues to deliver back-to-back successes on the Telugu silver screen, let’s wish him many more such birthdays to come.

Happy Birthday to Rebel Star Prabhas.

ఎవర్ గ్రీన్ స్టార్…రెబల్ స్టార్ ప్రభాస్


రెబల్ ఫ్యాన్స్ కు దీపావళితో పాటు వచ్చే పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ నెల 23న ఆయన పుట్టిరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్, మూవీ లవర్స్. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నోటెడ్ అకేషన్ గా మారింది. దేశం నలుమూలలా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్లున్నారు. ఓవర్సీస్ లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా ట్రూ పాన్ వరల్డ్ మూవీ అవుతోంది.

తన స్టార్ డమ్, ఛరిష్మా, పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ వసూళ్లతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలను చూస్తుంటాం…టాలీవుడ్ కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన బర్త్ డేకు తన బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ తో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ సందడి చేస్తుంటాయి. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే మూవీ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అవుతోంది. బాహుబలి రెండు చిత్రాలు కలిసి ఒకే పార్ట్ గా విడుదలకు వస్తుండటం మూవీ లవర్స్, ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.

తెలుగువారు గర్వపడేలా ప్రభాస్ భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ది రాజా సాబ్ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజా సాబ్ మూవీలో ప్రభాస్ ను మనం ఇంతకాలం మిస్ అయిన వింటేజ్ లుక్ లో రొమాంటిక్ హారర్ కామెడీలో చూడబోతున్నాం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయబోయో రికార్డులు కళ్లముందు కదలాడుతున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సందీప్ వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే స్కై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ క్రేజీ లైనప్ లో రానున్న సలార్ 2, కల్కి 2 ఎగ్జైట్ చేస్తున్నాయి. ఈ ఏడాది మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్ ఆ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్ర పాత్రలో ప్రభాస్ చేసిన డివైన్ పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.

మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం…ఇవన్నీ ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మార్చేశాయి. స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టు రెబల్ స్టార్ ప్రభాస్

‘LOVE OTP’ Trailer launched held grandly, Movie Releasing on Nov 14th

శ్రీమతి. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ‘లవ్ ఓటీపీ’కి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ఈవెంట్‌లో..

*రాజీవ్ కనకాల మాట్లాడుతూ* .. ‘‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఈ ప్రయాణంలో నన్ను అనీష్, అతని టీం మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌ను చేశాను. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేసేలా, పగలబడి నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. భావప్రీత బ్యానర్ మీద విజయ్ గారు ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించారు. అనీష్ గారు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జాన్వికకి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆనంద్ గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. నా సినిమాలకు, రోషన్ చిత్రాలకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని ఆనంద్‌కు ఇస్తానని మాటిస్తున్నాను. హర్ష గారి విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ప్రవీణ్ గారు ఈ మూవీని చాలా బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. నాట్య రంగ అద్భుతమైన నటుడు. బాబా భాస్కర్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. అనీష్ ఈ మూవీని ఇష్టపడి, కష్టపడి చేశాడు. రాజమౌళిలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టున్న అనీష్‌కు మంచి పేరు రావాలి. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ* .. ‘హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచీ కలలు కంటుండేవాడిని. అదే విషయాన్ని మా నాన్న గారికి చెప్పాను. ఆయన సాయంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. వైజాగ్ మూర్తి వద్ద యాక్టింగ్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. ‘నెలవంక’ మూవీ ఓపెనింగ్స్‌కి బన్నీ కూడా గెస్టుగా వచ్చారు. అయితే ప్రొడక్షన్‌లోకి వద్దు అని బన్నీ సలహా ఇచ్చినా నేను వినలేదు. ఆ మూవీ తరువాత నేను కన్నడకు వెళ్లిపోయాను. గౌతమ్ తిన్ననూరి కూడా మంచి స్నేహితుడు. ‘మళ్లీ రావా’ కూడా మిస్ అయింది. ఎప్పటి నుంచో మళ్లీ తెలుగులోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాను. మళ్లీ ఇప్పుడు ఇలా ఇన్నేళ్లకు టెక్నీషియన్‌గా, దర్శకుడిగా, హీరోగా ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఇందులో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ రోజు అదే మా ఈవెంట్‌కు గెస్ట్. మేం కంటెంట్‌ను నమ్మి ఈ మూవీని చేశాం. అందుకే పది రోజుల ముందే మీడియాకు ఈ మూవీని చూపించాలని అనుకున్నాం. విజయ్ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాజీవ్ కనకాల గారు ఈ మూవీని భుజానికెత్తుకుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

*నిర్మాత విజయ్ ఎం రెడ్డి మాట్లాడుతూ* .. ‘అనీష్‌తో నాకు పదహారేళ్ల నుంచి బంధం ఉంది. సినిమా చేయాలని హైదరాబాద్‌కు వచ్చాం. ఇప్పుడు నేను నిర్మాతగా అనీష్‌ని హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. అనీష్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. కష్టపడుతూ ఉంటే ఫలితం దాటంతట అదే వస్తుంది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీని షూట్ చేశాం. రాజీవ్ కనకాల గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నవంబర్ 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

*హీరోయిన్ జాన్విక మాట్లాడుతూ* .. ‘తెలుగులో ఇదే నాకు మొదటి చిత్రం. తెలుగు ఆడియెన్స్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్ గారికి, హీరో, దర్శకుడు అనీష్ గారికి థాంక్స్. షూటింగ్ అంతా సరదాగా చేశాం. రాజీవ్ కనకాల గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

*బాబా భాస్కర్ మాట్లాడుతూ* .. ‘‘లవ్ ఓటీపీ’లో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అనీష్ గారికి థాంక్స్. నిర్మాత గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో లవ్, మాస్ సాంగ్స్ ఇలా అన్నీ బాగుంటాయి. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. నవంబర్ 14న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

*నటుడు నాట్య రంగ మాట్లాడుతూ* .. ‘నాకు ‘లవ్ ఓటీటీ’ తెలుగులో మొదటి చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన విజయ్, అనీష్ గారికి థాంక్స్. రాజీవ్ కనకాల వంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో మంచి మ్యూజిక్, విజువల్స్ ఉంటాయి. నవంబర్ 14న మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

*మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ మాట్లాడుతూ* .. ‘‘లవ్ ఓటీపీ’ తెలుగులో వస్తుండటం ఆనందంగా ఉంది. విజయ్ గారు నాకు మంచి మిత్రులు. నేను ఆల్రెడీ ఈ మూవీని చూశాం. అనీష్ ఈ సినిమాని అద్భుతంగా తీశారు. మా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

*లిరిక్ రైటర్ దినేష్ మాట్లాడుతూ* .. ‘అనీష్ గారు నాకు మంచి సిట్యువేషన్స్ ఇచ్చారు. ఇందులో అన్ని పాటలు బాగుంటాయి. సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*కెమెరామెన్ హర్ష మాట్లాడుతూ* .. ‘‘లవ్ ఓటీపీ’ అనేది నాకు మొదటి చిత్రం. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ* .. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్, అనీష్‌కు థాంక్స్. ఈ మూవీలోని అన్ని పాటలు బాగుంటాయి. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటీనటులు : అనిష్ , రాజీవ్ కనకాల , స్వరూపిణి , జాన్విక కలకేరి , ప్రమోదిని , నాట్య రంగ , చేతన్ గంధర్వ , రవి భట్ , తులసి , అన్నపూర్ణ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : భావప్రీత ప్రొడక్షన్స్
నిర్మాత : విజయ్ ఎం రెడ్డి
దర్శకుడు : అనీష్
సంగీత దర్శకుడు : ఆనంద్ రాజవిక్రమ్
కెమెరామెన్ : హర్ష వర్దన్
ఎడిటర్ : శరత్
పీఆర్వో : శివ మల్లాల

Raj Dasireddy, the Telugu Pride Who Made Waves in Hollywood!

Today, while we refer to our Telugu film industry as “Tollywood,” the Hindi industry as “Bollywood,” the Kannada industry as “Sandalwood,” the Malayalam industry as “Mollywood,” and the Tamil film industry as “Kollywood,” it’s clear that the inspiration for these names comes from “Hollywood.” Over the past few years, though the Telugu film industry has gained international recognition, and whenever a film made in India with highest standards, it’s often described “Hollywood level.” Moreover, the most prestigious global award for films, the “Oscars,” is presented by Hollywood, making the Oscars a big deal for filmmakers around the world. This is why the entire country celebrated when the film “RRR” won an Oscar.

The reason for this introduction is to highlight that this year, a Telugu hero made his presence felt into the prestigious 97th Academy Awards ceremony. A rare opportunity who grabbed this none other than Mr. Raj Dasireddy. With his debut film “Bhadram Be Careful Brotheru”, directed by multi-talented director Maruthi, Raj Dasireddy made his mark in the telugu film industry. This talented actor, who stands tall at 6 feet and looks like a hollywood hero, was invited to attend the Oscars – 2025 celebrations, and he also made waves at the Hollywood Walk of Fame and the New York Fashion Week – 2025. Raj is currently undergoing special training for his next action entertainer, and more details about this project will be announced soon!!!!

‘Bison’ will be liked by all Telugu audiences.. Watch it all on October 24th.. Hero Dhruv Vikram

ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్ మీద పా. రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ నిర్మాతలుగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘బైసన్’. ఈ సినిమాకి నివాస్ కె. ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీని తెలుగులో జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ మీద తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 21) నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ .. ‘‘బైసన్’ను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను. అలా నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా మారింది. నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి ‘మీరు విక్రమ్‌లా ఉన్నారు’ అని అన్నారు. అవును.. నేను ఆయన కొడుకుని అని చెప్పాను. మా నాన్న గారి కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి చాలా చెప్పారు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను ఆయన కొడుకుగా నాకు అన్నీ సులభంగానే అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతాను. నాకు తెలుగులో నటించాలని ఉంది. ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ మూవీని చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. నాన్న గారిలానే నేను కూడా చాలా కష్టపడి వంద శాతం ఎఫర్ట్ పెడతాను. నా కొడుకు కూడా ఇలా వస్తే.. ‘మీ నాన్న ధృవ్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మారి సెల్వరాజ్ గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. పీపుల్స్‌ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన పరితపిస్తుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ మూవీని మారి సెల్వరాజ్ గారు తెరకెక్కించారు. ఈ మూవీ కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్స్ గురించి కాకుండా తెలుగులో మా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ మా చిత్రం నచ్చుతుంది. అక్టోబర్ 24న అందరూ చూడండి’ అని అన్నారు.

అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడుతూ .. ‘మారి సెల్వరాజ్ గారి మొదటి చిత్రంలో నేను నటించాల్సింది. కానీ అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆయన తీసిన ‘బైసన్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నాను. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువైంది. మేం అక్టోబర్ 24న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ధృవ్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉందని, ఎంతో కష్టపడ్డాడు అని నేను రిలీజ్‌కు ముందు చెప్పాను. ఇప్పుడు అవే మాటలు ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. ధృవ్‌తో నటించడం నాకు గర్వంగా ఉంది. నివాస్ మాకు అద్భుతమైన పాటలు, మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి థాంక్స్. అక్టోబర్ 24న ‘బైసన్’ తెలుగులో రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘బైసన్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. లింగుస్వామి, నా సోదరుడు చంద్రబోస్ గారి వల్లే తెలుగులోకి ఈ మూవీని తీసుకు వస్తున్నాను. ఇది గొప్ప విజయం సాధిస్తుంది, చాలా మంచి చిత్రం అని లింగుస్వామి గారు మాకు సలహా ఇచ్చారు. ఈ మూవీని నేను చూశాను. తెలుగు ఆడియెన్స్‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది. మాకు ఈ మూవీని ఇచ్చిన నీలం స్టూడియోస్, దీపక్, పా రంజిత్ గార్లకు థాంక్స్. ధృవ్ ఎంత కష్టపడ్డాడు అన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అనుపమ గారి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు తెలుగులో అక్టోబర్ 24న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నీలం స్టూడియోస్ వీపీఆర్ మాట్లాడుతూ .. ‘మా ‘బైసన్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న బాలాజీ గారికి థాంక్స్. బోస్, బాలాజీ గారి పట్టుదల వల్లే తెలుగులో ఇంత గ్రాండ్‌గా ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను తప్పకుండా చూడండి’ అని అన్నారు.

నివాస్ కె. ప్రసన్న మాట్లాడుతూ .. ‘‘బైసన్’ తెలుగు ప్రమోషన్స్‌కి రావడం ఆనందంగా ఉంది. బాలాజీ గారికి కంగ్రాట్స్. ‘బైసన్’ ఆల్రెడీ తమిళ్‌లో పెద్ద హిట్ అయింది. ఈ మూవీ ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుంది. ధృవ్ నాకు మంచి స్నేహితుడు. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ మూవీతో నాకు అనుపమ లాంటి మంచి ఫ్రెండ్ దొరికారు. తెలుగు ఆడియెన్స్, మీడియా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటీనటులు : ధృవ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, అళగం పెరుమాల్, అరువి మధన్, అనురాగ్ అరోరా తదితరులు.

సాంకేతిక బృందం
బ్యానర్ : అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్
తెలుగు రిలీజ్ : జగదంబే ఫిల్మ్స్
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్
దర్శకుడు: మారి సెల్వరాజ్
సహ నిర్మాత: సునీల్ చైనాని, ప్రమోద్ చెరువులత్, ప్రసూన్ గార్గ్, మనీంద్ బేడి
సంగీతం : నివాస్ కె ప్రసన్న
సాహిత్యం : మారి సెల్వరాజ్, అరివు
కెమెరామెన్ : ఎళిల్ అరసు కె
ఆర్ట్ డైరెక్టర్: కుమార్ గంగప్పన్
ఎడిటర్ : శక్తి తిరు
పీఆర్వో : హర్ష