Home Blog Page 61

Sathyaraj’s Most-Awaited Film Tribandhari Barbarik Grand Release on August 29th

Tribandhari Barbarik starring the Pan-India star Sathyaraj is one of the most-awaited films arriving this year. The film, presented by star director Maruthi on Maruthi Team Product and produced by Vijaypal Reddy Adidhala under the Vanara Celluloid banner, is already carrying high expectations. Directed by Mohan Srivatsa, the film also stars Vashishta N. Simha, Satyam Rajesh, Udaya Bhanu, Kranthi Kiran, and Sanchi Roy in key roles. As officially announced by the makers, the film is now set for a massive theatrical release on August 29th.

In filmmaking, timing the release right and securing enough theatres is often more crucial than just making the film itself. A well-timed release with ample screens significantly increases the chances of box office success. Aware of this, the makers chose August 29 as the ideal date to release Tribandhari Barbarik on a large scale.

The songs and teaser released so far have garnered strong positive responses. The trailer, in particular, has significantly raised the buzz around the film, with visuals, background score, and overall presentation drawing appreciation. Director Mohan Srivatsa’s unique execution style and the film’s music scored by Infusion Band have already generated curiosity.

Even though this is producer Vijaypal Reddy’s debut project, there have been no compromises on production quality, as the film has been mounted on a grand scale. Songs released under Aditya Music have struck a chord with listeners, while Kushender Ramesh Reddy’s visuals have surprised many with their quality and innovation.

The film’s central concept, “Barbarik,” has already become a hot topic on social media. With distinctive promotions, the team is actively creating buzz among the public.

Originally scheduled for release on August 22, the date was postponed to August 29 to ensure a better release window and sufficient theatre allocation.

Chief Minister Revanth Reddy Felicitates the Team of National Award-Winning Film “Baby”

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న “బేబి” సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో “బేబి” సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు.

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించిన వారిలో ఉన్నారు.

71 జాతీయ అవార్డ్స్ లో బేబి సినిమా రెండు అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) పురస్కారం దక్కించుకున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంది …

R.Narayana Murthy’s ‘University Paper Leak’ Movie has amazing emotions..Padmashri Brahmanandam

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన 

ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ: యూనివర్శిటీ అంటే ఏమిటి యూనివర్స్ అంటే విశ్వం . అంటే అన్ని గోళాల తోటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి భూమి లాంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని గ్రహాలన్నింటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటిది ఆలయం. అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ ఇపుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి అందులో రీసెర్చ్ చేసి అందులో జరుగుతున్నటివంటి అవనీతిని… అప్పట్లో విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొనివెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మనది. ఈవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా వుంది విద్య వ్యవస్థలు ఎలా మరిపోతున్నాయి అని వాటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ తట్టుకోలేక అంటే బ్రీత్ తీసుకోలేక దీన్ని నా మిత్రులకు నా వాళ్లకు ఎలాగైనా పంచి పెట్టాలి ఎందుకంటే నారాయణ మూర్తి తేనెటీగ లాంటి మనిషి.తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల తేనె పోగుచేసుకొని వచ్చి తలా ఒక చుక్క పంచిపెట్టాలి అనేటటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి. మీకు అందమైన హీరో ఎవరు అని అడిగితే నేను నారాయణ మూర్తి పేరు చెపుతాను. అందం అంటే అది గ్లామర్,6 ఫిట్స్ హైట్ కార్లింగ్ హెయిర్ అలాంటి అందం కాదు. మదర్ థెరిస్సాని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా అని అడిగితే ఎవరి మనస్సులో సేవా భావం వుంటుందో ఎవరి కళ్ళల్లో దయా గుణం వుంటుందో ఆవ్యక్తి, ఆ జీవి అందంగా వుంటుంది అని చెప్పింది. నలభై సంవత్సరాలనుండి నాకు తెలిసిన నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, ప్రజలు అందునా పేదవాళ్లు పేదవాళ్లు…వారు పడుతున్న కష్టాలు వారు పడుతున్న భాధలు… నటుడుగా నటించడం కాకుండా ఒక మెసేజ్ అనేది ప్రపంచానికి ఇవ్వాలి అనేటటువంటి వ్యక్తి నారాయణ మూర్తి. నేను థియేటర్ లో ప్రివ్యూ లు చూసి చాలాకాలం అయ్యింది. ఈ సినిమా ఎందుకు చూడాలి అనుకున్నాను అంటేదర్శకుడు వేరు నిర్మాతవేరు టెక్నీషియన్స్ వేరు. ఆ 24శాఖల పని అంతా అవన్నికూడా ఒక్కడే కాడి మోసి తాను చెప్పాలనుకున్నది అద్భుతంగా సినిమా తీసి చూపించాలనుకుంటాడు ఎందుకు అంటే అది మీకోసం ప్రజలకోసం పేద ప్రజలకోసం . ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో అద్భుతమైన ఎమోషన్ వుంది. తండ్రి కొడుకు, తండ్రి కూతురు.. ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసిన త్యాగం, అలాగే ఆ కొడుకు తండ్రి కోసం చేసిన త్యాగం ఇలాంటి ఎమోషన్స్ అన్నిటినీ ఒకచోటకు తీసుకొచ్చి, ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్ తో ఈ సొసైటీ ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం నారాయణ మూర్తి చేశారు.అవినీతి బంధుప్రీతి అలుముకున్న చీకటి బజారు అలుముకున్న ఈదేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీ శ్రీ. 50 ఏళ్ల కిందట మాట అది. దాన్ని ఈరోజు మాములు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి కష్టపడి సినిమా తీసాడు తనకోసం కాదు మీకోసం. తన ఈ చొక్కా ఈ ప్యాంట్ అదే అతని జీవితం. అది మీకు అంకితం. అతని చివరి శ్వాస వరకు కష్టపడుతూనే వుంటాడు కష్టపడుతూనే వుంటాడు. వుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది వాస్తవానికి దూరంగా ఉన్న సినిమా కాదు. ఇది ఊహించుకున్నటువంటి ఒక సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలరా స్నానంచేసివచ్చి నేత చీర కట్టుకున్న స్రీ లా ఉన్న సినిమా ఇది. ఒక అందమైన స్త్రి లా ఉన్న సినిమా. ఇందులో నిజాలుంటాయి వెతుక్కోండి ఇందులో బూతులు ఉండవు జీవితపు లోతులు వుంటాయి వెతుక్కోండి. బావిలో బ్యాలెట్ వేసి తీసుకోండి. ఇందులో కొన్ని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. డబ్బుకోసం సినిమా తీయకుండా నిజాయితీగా తను అనుకున్న దాని అద్భుతంగా తీసిన యూనివర్సిటీ సినిమా చూడండి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి చూసి అర్థం చేసుకోండి. పిల్లలందరూ ఏసుక్రీస్తు సిలువను మోస్తున్నట్టు తమ పుస్తకాలను బరువు మోస్తున్నారు అంటూ వచ్చే సంభాషణలు అలాగే సమాజపు భారాన్ని తన భుజాన్ని వేసుకొని మోస్తున్న నారాయణ మూర్తి కున్న జిజ్ఞాస కి ఊతం ఇచ్చి ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు. పేపర్ లీకేజ్ మాములు విషయం కాదు. డాక్టర్ వృత్తి రాదు వైద్యం చేస్తాడు. ప్రాజెక్ట్ కట్టడం రాదు ఇంజనీర్ అవుతాడు. ఈ దేశం ఎక్కడకు పోతుంది ఏమైపోతుంది? సమాజానికి తన వంతు సాయం తాను చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ మూర్తి. ఇలాంటి వారు వ్యక్తులు కాదు శక్తులు. గోదావరి భాషలో చెప్పాలి అంటే పులస చేపలాంటి వాళ్ళు. పులస చేప నదికి ఎదురు ఈదుతూ వుంటాది. అలాంటి ప్రత్యేక మనిషి. పేపర్ లీకేజ్ కి ఎంతోమంది బలి అయిపోయినవాళ్ళ గురించి అయిన చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలు నారాయణమూర్తి మరిన్ని తీసి ప్రజల ఆశీర్వాదాలతో చిరస్థాయిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ దేశాన్ని మళ్లీ బడిలో వెయ్యాలి. నారాయణ మూర్తి గారు చేసినటువంటి మంచి పనులు నేను చేయలేదు చేస్తానోకూడా తెలీదు. నిలువెత్తు మంచి మనిషి నారాయణ మూర్తి. ఒక సినిమా హిట్ అయితే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసు రెండు సినిమాల్లో ఆడితే ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసు ఒక దశాబ్ద కాలం సినిమాల్లో నటిస్తే ఎలా ప్రవర్తిస్తామో తెలుసు అలాంటిది నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన్ని ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా నో చెప్పాడు. స్టార్స్ ని పెట్టి ఆయన సినిమాలు తియ్యలేదు. ఆరోజుల్లో నారాయణ మూర్తి గారి సినిమా అంటే జనాలు తండోపతండలుగా వచ్చేవారు ఇప్పుడు కూడా వస్తున్నారు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం నారాయణమూర్తి అంటే ఇష్టం అని అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: తెలుగు చలన చిత్ర పరిసరాల్లో ఒక కస్తూరి శివరావు గారు ఎరా చూసాము రమణారెడ్డి గారు రేలంగి గారి ఎరా చూసాము అల్లు రామలింగయ్య గారి ఎరా చూసాము పద్మనాభం, రాజబాబు గార్ల ఎరా చూసాము ఇపుడు బ్రహ్మానందం గారి ఎరా చూస్తున్నాము. ఆయన మహానటుడు మహా జ్ఞాని. అన్నింటిని మించి మాస్టరు. అందుకే నా పేపర్ లీకేజ్ సినిమా లోగోను ఆయనచే ఆవిష్కరింపచేసుకొని సినిమా రెడీ అయిన తరువాత ఆయనను కలసి ఈ సినిమా చూసి నాలుగు మాటలు చెప్పాలని విజ్ఞప్తి చేశాను. ఇంత బిజీలో కూడా యూనివర్సిటీ సినిమా చూసి నన్ను ఆశీర్వదించి నాపై ప్రేమను చూపిస్తున్న బ్రహ్మానందం గారికి మీ అందరి సమక్షంలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఆగస్టు 22 న రిలీజ్ చేస్తున్నాను మీరు చూడండి ఏమాత్రం బాగున్నా ఆదరించండి మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి అని అన్నారు

నటీనటులు – ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ మరియు నూతన తారాగణం.

పాటలు – గద్దర్ – జలదంకి సుధాకర్, – వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,
ఎడిటింగ్ – మాలిక్
కెమెరా – బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే – మాటలు – సంగీతం – దర్శకత్వం – నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి

Rakshit Atluri, Komalee Prasad’s “Sasivadane” Movie Grand Releasing on October 10

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు ప్రకటించారు.

‘శశివదనే’ చిత్రాన్ని దసరా సీజన్‌లో అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీకి శ్రీ సాయి కుమార్ దారా అందించిన విజువల్స్, శరవణ వాసుదేవన్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఓ అందమైన ప్రేమ కథా చిత్రానికి విజువల్స్, మ్యూజిక్ ఎంత ప్రాముఖ్యం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శశివదనే’ మూవీని మేకర్స్ ఓ దృశ్యకావ్యంగా మలిచారు. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం మేజర్ అస్సెట్ కానుంది.

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటించారు. ఈ మూవీకి ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా గౌరీ నాయుడు, కొరియోగ్రాఫర్‌గా జేడీ మాస్టర్ పని చేశారు. అక్టోబర్ 10న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

నటీనటులు :
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్, సమర్పణ :గౌరీ నాయుడు, నిర్మాతలు :అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకుడు :సాయి మోహన్ ఉబ్బన, సంగీత దర్శకుడు : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం :అనుదీప్ దేవ్, కెమెరామెన్ :శ్రీ సాయి కుమార్ దారా, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్ :గౌరీ నాయుడు, పీఆర్వో : ఫణి – నాయుడు (బియాండ్ మీడియా), మార్కెటింగ్ : విష్ణు తేజ పుట్టా (క్రాస్ క్లిక్ మార్కెటింగ్)

Crunchyroll & Sony Pictures ‘Demon Slayer’ Telugu trailer unveils, Movie Releasing on Sep 12

Crunchyroll, the ultimate home for anime worldwide, unveiled the Tamil and Telugu trailers of the highly anticipated Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle. The first film in the epic trilogy will come exclusively to theaters on September 12, 2025 in India, including in IMAX® and other premium large formats. The film will be available in Japanese with English subtitles, as well as dubbed in English, Hindi, Tamil, and Telugu.

The story begins when Tanjiro Kamado, a boy whose family is killed by a demon, joins the Demon Slayer Corps to turn his younger sister Nezuko back into a human after she is transformed into a demon. The series has captivated audiences worldwide with its tragic tale of humans and demons, riveting sword fights, charming characters, and comical scenes.

The three-part cinematic movie represents the final arc and culmination of the hugely popular award-winning anime shonen series. The film will be distributed by Crunchyroll and Sony Pictures Entertainment worldwide, excluding Japan and select Asian territories.

Credits: Original story by Koyoharu Gotoge (JUMP COMICS / SHUEISHA). Directed by Haruo Sotozaki. Screenplay and produced by ufotable

MMC Picture’s “1990′ Movie Grandly Releasing soon

ఎమ్.ఎమ్.సి బ్యానర్ పై అరుణ్, రాణి వరద్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 1990’s. కర్ణాటకలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కదా చిత్రం. అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రికరించిన ఈ చిత్రం. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.

నందకుమార్ సి.ఎమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు నిర్మాత చంద్ర శేఖర్ B S. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో ఈ మూవీ సాంగ్స్ ట్రైలర్ విడుదల కానున్నాయి.

E C. మహారాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు హాలేస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్ : కృష్ణ, కొరియోగ్రాఫర్: సాధిక్ సర్దార్, నిర్మాత:చంద్ర శేఖర్ B.S. సహనిర్మాత : అరుణ్ కుమార్. పిఆర్ఒ: లక్ష్మీ నివాస్

A Cinematic Journey to the 11th Century: “Shri Krishna Avatar in Mahoba” Unveiled

Two companies, The AbhayCharan Foundation and Sreejee Entertainment, are happy to announce they are working together on a new movie called ‘Shri Krishna Avatar in Mahoba’.

This will be a big movie about history. It is being made with the blessings of His Grace ‘Jitamitra Prabhu Sri’, a senior Guru at ISKCON Delhi. The story is about the holy presence of Lord Shri Krishna in a place called Mahoba a long time ago, in the 11th-12th century.

‘Shri Krishna Avatar in Mahoba’ is a new and exciting movie because it will show a new side of Lord Krishna – as a strong fighter. This movie is for the whole world and will be made in many languages. A team of the best experts will work on it to make it look amazing and have a deep spiritual message. The movie will explore the interesting history and culture of Mahoba.

Anil Vyas, who is managing the project, said, “We are very excited to share this amazing story. For the first time, people will see Lord Krishna as a warrior in a movie that is based on history and will make you feel good. We think people all over the world will like this movie, no matter where they are from or what they believe.”

The movie will be written and directed by the talented Mukund Pandey. He is great at making history stories feel real and exciting. “This is an important story to tell,” said Pandey. “Mahoba has a lot of history and faith, and we want to make a movie that respects that while showing a new and hopeful view of Lord Krishna’s life.”

Shri Krishna Avatar in Mahoba is more than just a movie. It’s a special journey that will take you to a time when belief was very strong. The creators believe it will be a very important movie for India and will show the lasting power of Lord Krishna’s message of love, kindness, and doing the right thing.

More news about the actors and the release date will be shared later.

About The AbhayCharan Foundation: This group works to share the teachings of Srila Prabhupada and the old, wise lessons from the Vedic books with people all over the world.

About Sreejee Entertainment: This company makes good movies for the whole family that make people feel happy and hopeful. They have made many popular movies before that people and critics have liked.

“Every person is a walking story” – Article #1: Aadhi Pinisetty

ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక వి చిత్రమ్ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ఈరమ్తో గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా తన ముద్ర వేశాడు. “నిన్ను కోరి” లో ఆదిని నేను మొట్ట మొదట గమనించాను. ఆయన డిక్షన్, పాత్రకు తాను తెచ్చిన హుందా తనం నన్ను ఆకట్టుకున్నాయి.

మయసభ OTT ఫార్మాట్‌కి మారిన వెంటనే, లీడ్ పాత్రలలో నా మనసుకి తట్టిన మొదటి పేరు ఆది—ఏ సందేహం లేకుండా. స్క్రిప్ట్ పంపి, ఎనిమిది గంటల జూమ్ కాల్‌లో మొత్తం కథ నరేట్ చేసాను. రెండు లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి ఆయనను సిద్ధంగా ఉంచాను. చైతన్య రావును ఫైనల్ చేసిన తర్వాత, తాను MSR పాత్రకు సహజంగా ఉంటాడని భావించి, ఆదిని KKN పాత్ర చేయమని రిక్వెస్ట్ చేశాను.

అక్కడ నుంచి ఆదితో పని చేయడం ఒక ఆనందయాత్ర. KKN కారెక్టర్ ఎన్నో పరిమితులు, లేయర్స్ తో నిండిన ఛాలెంజింగ్ రోల్. నత్తి, ఆర్థిక పరిమితులతో పోరాడుతూ, అపరిమితమైన అపరిమైన లక్ష్యాలతో కూడిన పాత్ర. ప్రతి సమస్యని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎదుర్కునే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది KKN పాత్రను ఒక మరాథాన్‌లా తీసుకున్నాడు—ఆ కాలపు రాజకీయ వాతావరణాన్ని గ్రహించి, తన బాడీ లాంగ్వేజ్‌ను దిద్దుకుంటూ, డైలాగ్‌లతోనే కాదు, మాటల మధ్య నిశ్శబ్దంతో కూడా ఎంతో లైఫ్ తీసుకొచ్చాడు.

స్కూల్ పిల్లాడిలా స్క్రిప్ట్ రీడింగ్స్‌లో పాల్గొనడం, నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అపారమైన డెడికేషన్ తో ఒక రియల్ లైఫ్ లెజెండ్‌తో పోల్చుకునే KKN పాత్రను అప్రోచ్ చేశారు. ఆదిలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వు, అమాయకపు కళ్లు, చైతన్య రావుతో తనకు నిజ జీవితంలో ఉన్న స్నేహం ఈ షోకు గొప్ప ఆస్తిగా మారింది. అతను ఇంప్రూవైజ్ చేసిన చిన్న చిన్న హావభావాలు షోలో అనేక అద్భుతమైన మోమెంట్స్‌ను సృష్టించాయి.

ఎన్నో ఉదాహరణలనుంచి ఈ రెండూ పంచుకుంటున్నాను:

1. మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని చాచి పలకరించే ముందు తన రక్తమయమైన చేతిని చూసే దృశ్యం—ఒక శక్తివంతమైన ట్రైలర్ షాట్‌కి మారింది.

2. నామినేషన్ పేపర్లను తీసుకుంటున్నప్పుడు CBRకు బదులివ్వడంలో, అతని స్టైల్లోనే సమాధానం ముగించే విధంగా డైలాగ్ ఎక్స్టెండ్ చెయ్యడం—ఆ హీరోయిక్ మోమెంట్‌ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది.

ఈ సిరీస్‌కి వచ్చిన విమర్శకుల ప్రశంసలు, దేశవ్యాప్త గుర్తింపు ఆయన కెరీర్ ని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకు వెళుతుందని, వెళ్ళాలని ఆశిస్తున్నాను. తను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అంబీషస్ పొలిటికల్ డ్రామాకి ముఖచిత్రం. ఈ దీర్ఘ ప్రయాణం—మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూపులు, సగం మట్టికట్టిన స్క్రిప్ట్‌లను తిరస్కరించిన క్రమశిక్షణ—ప్రతి అడుగు విలువైనదని నిరూపించాయి.

Bhimavaram Talkies has now set an unprecedented world record in cinema history — launching 15 films

భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్, చీకటి ప్రవీణ్, ఇమ్మడి రమేష్, వంశీ రామరాజు, కె.ధర్మారావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ తదితర దిగ్గజాలు హాజరై రామసత్యనారాయణను అభినందించారు.

కొబ్బరికాయలు కొట్టుకున్న
15 చిత్రాల-దర్శకుల వివరాలు!

1) జస్టిస్ ధర్మ
(యండమూరి వీరేంద్రనాధ్)
2) నాగపంచమి
(ఓం సాయిప్రకాష్)
3) నా పేరు పవన్ కల్యాణ్
(జె.కె.భారవి)
4) టాపర్
(ఉదయ్ భాస్కర్)
5) కె.పి.హెచ్.బి. కాలని
(తల్లాడ సాయికృష్ణ)
6) పోలీస్ సింహం
(సంగకుమార్)
7) అవంతిక- 2
(శ్రీరాజ్ బళ్ళా)
8) యండమూరి కథలు
(రవి బసర)
9) బి.సి. -(బ్లాక్ కమాండో)
(మోహన్ కాంత్)
10) హనీ కిడ్స్
(హర్ష)
11) సావాసం
(ఏకరి సత్యనారాయణ)
12) డార్క్ స్టోరీస్
(కృష్ణ కార్తీక్)
13) మనల్ని ఎవడ్రా ఆపేది
(బి.శ్రీనివాసరావు)
14) ది ఫైనల్ కాల్
(ప్రణయ్ రాజ్ వంగరి)
15) అవతారం
(డా: సతీష్)
ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ఛాన్, గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం.
తెలుగు సినిమాకు ప్రపంచ రికార్డు సాధించేలా ఒకేసారి 15 చిత్రాలు మొదలు పెట్టిన రామసత్యనారాయణను అతిధులంతా అభినందించారు. 2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలకు 2026 ఆగస్టు 15కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామసత్యనారాయణ పేర్కొన్నారు. ఈ 15 చిత్రాలకు KLస్టూడియోను 25% డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంతంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి. ఒకేరోజు మొదలై ప్రపంచ రికార్డ్స్ లో నమోదైన ఈ 15 చిత్రాలకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పి.ఆర్.ఓ. కావడం విశేషం!!

‘Aapadbhandhavudu’, based on Penchal Reddy’s life, will inspire social consciousness”:Director Bheemagani Sudhakar Goud

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు దక్కించుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన రచనా, దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఆపద్భాంధవుడు” శ్రీ పెంచల్ రెడ్డి. డి. లీలావతి నిర్మించారు. ఈ చిత్రంలో పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో

దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ – వ్యాపారం, కుటుంబం, సమాజ సేవ.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సేవా రత్నగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి శ్రీ పెంచల్ రెడ్డి గారు. ఆయన నాకు ఎంతో కాలంగా తెలుసు. దర్శకులుగా మనం సమాజం నుంచి, మన చుట్టూ ఉన్న వాళ్ల దగ్గర నుంచే స్ఫర్తి పొందుతాం. అలా మీ జీవితం ఆధారంగా లఘు చిత్రం రూపొందించాలని ఉంది అని అడిగినప్పుడు ఆయన నాకంటే గొప్పవాళ్లు ఎంతోమంది ఉన్నారు, నాకంటే ఎక్కువగా సేవ చేసిన వాళ్లున్నారు అని తిరస్కరించేవారు. చివరిసారి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఆయన మౌనాన్నే అంగీకారంగా తీసుకుని నేను “ఆపద్భాంధవుడు” చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రంలో ఆయన నటించడం విశేషం. నేనూ ఆయన మిత్రుడిగా నటించాను. ఇది సజీవ పాత్రలతో సాగే ఫిలిం. దీన్ని బయోపిక్ లా, లైవ్ గా, సరికొత్త పద్ధతిలో తెరకెక్కించాం. నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మే నేను గతంలో ఆదిత్య క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి చిల్డ్రన్ ఫిలింస్ చేశాను. ఇప్పుడు మాస్టర్ సంకల్ప్ అనే చిల్ర్డన్ ఫిలిం చేశాం. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నాం. వయసైన పెద్దవాళ్లు కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో గడుపతున్నారు. వయోధికులు తమ సంపాదనను కేవలం వారసులకే కాకుండా కొంత సమాజ సేవకు ఉపయోగిస్తే ఎంతో ఆత్మసంతృప్తి పొందుతారు. అలాంటి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి పెంచల్ రెడ్డి గారు. “ఆపద్భాంధవుడు” చిత్రాన్ని ఎన్నో ఇనిస్టిట్యూషన్స్ లో ప్రదర్శించాం. వాళ్లందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ లఘు చిత్రం ప్రేక్షకుల్లో, సమాజంలో చైతన్యం తీసుకొస్తుంది. పెంచల్ రెడ్డి గారి లాంటి సమాజ సేవకులు ముందుకొచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఆయన పేద విద్యార్థులు, అన్నార్థులు, పేద మహిళలు..ఇలా ఎంతోమందిని ఛారిటీ ద్వారా ఆదుకున్నారు. “ఆపద్భాంధవుడు” వంటి సజీవ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ, ఇండియన్ గవర్నమెంట్స్ అనుమతి ఇచ్చి వాలెంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రదర్శిస్తే ఎంతోమందిలో సేవాభావం కలిగించినవారం అవుతాం. విద్యార్థుల్లో, యువకుల్లో కూడా మనమూ పెంచల్ రెడ్డి గారిలా సేవ చేయాలనే స్పూర్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై ఏవో కమర్షియల్ సినిమా తీయొచ్చు, డబ్బు చేసుకోవచ్చు. కానీ డబ్బు కంటే సమాజానికి ఒక మంచిని చెప్పే సినిమా చేయడం ముఖ్యమని భావించాం అన్నారు.

సేవా రత్న శ్రీ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ – మాది వ్యవసాయ కుటుంబం. నేను చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. జీవీకే కంపెనీ లో చిన్న ఉద్యోగిగా చేరి అంచలంచెలుగా ఎదిగాను. నా సంపాదనలో 50 శాతం విరాళాల రూపంలో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలే నాకు ఎంతో ఆత్మ సంతృప్తి ఇస్తున్నాయి. స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్, సీనియర్ సిటిజన్స్ అందరికి సహాయం చేస్తున్నాను. డైరెక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ గారు నా బయోపిక్ ని సినిమా రూపంలో తీస్తానన్నప్పుడు వద్దన్నాను. కానీ అయన వదలకుండా నన్ను ఒప్పించి సినిమా మొదలుపెట్టారు. నా శ్రీమతి లీలావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. నా జీవిత కథను సజీవ చిత్ర రూపంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకులు భీమగాని సుధాకర్ గౌడ్ గారికి నా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆపద్భాంధవుడు లఘు చిత్రం ప్రేక్షకులకు స్ఫూర్తి కలిగించి, సేవా కార్యక్రమాలు చేయాలనే చైతన్యాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటీనటులు – పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – నందమూరి హరి
మ్యూజిక్ – వందేమాతరం శ్రీనివాస్
పీఆర్ఓ – చందూ రమేష్
బ్యానర్స్ – శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్
నిర్మాత – డి.లీలావతి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – భీమగాని సుధాకర్ గౌడ్