Home Blog Page 62

₹300 Crore Scam at Chitrapuri: Film Workers Protest at FDC

చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు ₹300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ, వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, వాటిని బయటి వ్యక్తులకు అమ్ముకోవడానికి కమిటీ ప్లాన్ చేసింది. ఇందుకు HMDA, CMO కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు,” అని వారు ఆరోపించారు.

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు

సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై ఇప్పటికే 15 FIRలు, 10 ఛార్జ్‌షీట్‌లు నమోదయ్యాయని, రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన అక్రమాలు ఆపడం లేదని నిరసనకారులు తెలిపారు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెం. 18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయిందని వారు మండిపడ్డారు.

ప్రభుత్వం, అధికారులపై తీవ్ర ఆరోపణలు

గత ప్రభుత్వం అవినీతిపరులను కాపాడి మూల్యం చెల్లించుకుందని, మరి ఈ ప్రభుత్వం ఎందుకు వారిని రక్షిస్తోందని వారు ప్రశ్నించారు. “కొందరు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఈ అవినీతిలో కూరుకుపోయారు. అందుకే ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకోవాలి. అధికారులు కోట్ల రూపాయల ఫ్రాడ్‌లో భాగస్వామిగా ఉంటూ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని ఆరోపించారు.

ప్రధాన డిమాండ్లు
* 20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు న్యాయం చేయాలి.
* కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి.
* వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కమిటీని రద్దు చేసి, వెంటనే అడ్-హాక్ కమిటీని నియమించాలి.
* కొత్తగా కట్టబోయే ట్విన్ టవర్స్‌లో కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి, అర్హులైన సినీ కార్మికులకే కేటాయించాలి.
* కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఈ ధర్నా కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు సంకూరి రవీందర్, తెలంగాణ పోరాట మేధావి నాయకులు భద్ర, నవోదయం పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్, ఆప్ పార్టీ నాయకురాలు హేమ సుదర్శన్, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కృష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

People’s Media chief Vishwa Prasad should immediately retract his remarks about the Cine Art Directors Association

పై విషయం గురించి యావత్ సినీ పరిశ్రమకు, ప్రజలకు మరియు డిజిటల్ మీడియా/ప్రింట్ మీడియా వారికి తెలియజేయునది ఏమనగా.. సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించే /నిరించే కళాదరక్షులు చాలా కీలకం అన్నవిషయం తెలిసినదే. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపములో చూపించే మేధాసంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం.. అంతటి విలువైన /ప్రాముఖ్యత కలిగిన విభాగముపై ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానలులో “ఆర్ట్ మాఫియా” అంటూ వ్యాఖలు చేసిన సదరు పీపుల్స్ మీడియా నిర్మాత్ర గారి మాటలను కళాదర్శకత్వ / ఆర్ట్ డైరెక్టర్స్ విభాగం ముఖఖంఠంతో ఖండిస్తున్నాము.

సినిమా ప్రారంభానికి ముందు, కథ తరువాత అందుకు సంబందించిన ప్రొడక్షన్ డిజైనర్ / ఆర్ట్ డైరెక్టరు గారు డిజైన్స్ చేసిన తరువాత సినిమాటోగ్రాఫరుతో దర్శకుల సూచనలను తాను అనుకుంటున్నసినిమా ఉహ రూపములో ఉన్నటువంటి అంశం, చర్చల అనంతరమే బడ్జెట్ మరియు సెట్ నిరాణం వంటి అంశాలు నిరాత దృష్టికి వెళతాయి.. సెట్స్ నిర్మాణ సమయములో డైరెక్టర్ కథాపరంగా చేర్పులు, మార్పులు గాని, ఇంకాస్త మంచి ఆలోచనలు వచ్చినప్పుడు సెట్స్లో మార్పులు చేయవలసి వచినప్పుడు నిర్మాత అనుమతి తో ఆ ఖర్చులు పెరుగుతాయి / తగ్గుతాయి. ఈ విషయం సినిమా తీసే ఏ నిర్మాతకైనా అవగాహనా / ఆలోచన ఉంటుంది. వారు

ఇటీవల కాలములో పలు సినిమాలు నిర్మిస్తూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కలించారు, కల్పిస్తున్నారు, దానికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

కానీ ఈ విధంగా మీడియాలో మా గురించి తప్పు మాట్లాడే సదరు నిరాత గారు, తన సినిమాకు జరిగిన సదరు అంశముపై ఫిలింఛాంబరు దృష్టికి తీసుకెళ్లవచు/ అక్కడ ప్రాక్టికల్ గా ఎం జరిగిందో, ఆ సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ /ఆర్ట్ డైరెక్టర్ పై కనీసం తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ద్వారా అయిన సదరు వల్లి వివరణ తీసుకోవచ్చు అలాచేయకుండా తనకు తాను గా మీడియా ముందు కళాదర్శకత్వ విభాగముపై అభాండాలు వేయడం ఒక దురభిప్రాయంగా భావిస్తున్నాను.

మద్రాసు నుండి ఎన్నో ఇబందులకు గురై మన తెలుగు గడ్డ మీద ఒక అంకితభావముతో, నిబద్ధతతో కుటుంబాలకు కూడా దూరమై సినిమాలకు పనిచేస్తున్నఎంతో మంది మన తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభులను మాఫియా తో పోలడ్డం సరైన పద్దతి కాదని తెలియజేస్తున్నాము. సెట్ నిర్మాణములో గతములోలేనటువంటి కాంట్రాక్ట్స్ వ్యవస్థను ప్రోత్సహించడంవల్ల, వారి అవగాహనలోపాలవల్ల నష్టాలు జరుగుతున్నాయని సదరు నిర్మాత తెలుసుకోవాలి.

సినీ పరిశ్రమ ఏర్పడిన తొలినాటి నుండి నేటి సినిమాల వరకు ఎంతో మంది ఆర్ట్ విభాగములో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి కలిగిన నిష్ణాతులైన ఆర్ట్ డైరెక్టర్స్ వునార్లు. ఆర్ట్ అన్నది professional గా చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నక్రాఫ్ట్. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషనులో మారుతున్న ప్రస్తుత టెక్నా లజీస్ ని అనుసరించి మెంబర్కి skills విషయంలోను మరియు సినిమాల ప్రాక్టికల్ experience తో పాటు తగు సూచనలు మరియు నియమాల ద్వారా మెంబర్షిప్ ఇవ్వ డం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా, గమనించగలరు.

Hyderabad City Police Commissioner C.V. Anand released Lyrical song Adugu Aduguna from ‘MissTerious’

Today, the lyrical song “Adugu Aduguna” from MissTerious, produced by Ashley Creations, was released by Hyderabad City Police Commissioner C. V. Anand.
This song has been picturized on a dedicated and hard-working police officer.

After watching the song, Commissioner C. V. Anand praised singer Lyrical song Adugu Aduguna appreciating his performance and stating that the song was beautifully filmed. He also congratulated ML Raja, who composed the music, for writing and composing the song in a way that wonderfully highlights the commitment of the police force.

He further applauded director Mahi Komatireddy for attempting to present a suspense thriller in a fresh way, and producer Jay Vallamdas, who despite being settled in the USA, has endured many challenges and expenses to bring this film to life.

The event was attended by Hero Rohit Sahni, Gautham, director Mahi Komatireddy, producer Jay Vallamdas, Executive Producer Ram Uppu (Bunny Ram), and others.

Producer Jay Vallamdas and director Mahi Komatireddy expressed heartfelt thanks to Commissioner C. V. Anand for taking time out of his busy schedule to release the lyrical song of their film. They announced that the lyrical video is now available on Ashley Music’s YouTube channel starting today, and requested everyone to watch and support them.

I really liked the Movie Narayana Murthy’s ‘University Paper Leak’ It is a must-watch movie for everyone… Star director Trivikram Srinivas

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతుఅందరికీ వినపడాలి. అది మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. దానితో ఏకీభవించొచ్చు ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం వుంది. అది మనం వినాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏమీ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి రావడం వలన రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. అందుకని విభిన్నమైన గొంతుకలు విభిన్నమైన అభిప్రాయాలు…వీటిల్లోనే బ్యూటీ వుంది. అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం ఆర్ నారాయణ మూర్తి గారు సొంతం. అది ఆయన తాలూకు శైలి. అది ప్రత్యేకం. ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఎలా వుంది అని చెప్పాలి అంటే కార్డు పడిన వెంటనే రెండున్నర గంటలపాటు సినిమా చూడాలా అని భయపడ్డాను. ఎందుకంటే కరోనా తరువాత అందరూ కూడా ఏ సినిమా అయిన ఇరవై నిమిషాలు ముప్ఫై నిమిషాలు చూడలేకపోవడం అనే ఒక ఆసహనం లో వుంది ప్రపంచం. అలాంటి సినిమా రెండు గంటలు చూస్తే అలా పరిగెత్తుకెళిపోయింది. పేపర్ లీక్ లు యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజులు నుంచి విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలా? తెలుగులో జరగాలా? విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్స్ కోసం వెయిట్ చేయడం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంటే మిగతా వాళ్ల తాలూకు స్టూడెంట్స్ నిస్పృహఇందులో ఏది కూడా మనల్ని ఇమిడేట్ గా ఉత్తేజ పరిచే అంశాలు కాదు. ఆలోచింప అంశాలు లేకపోతే నిరాశ పరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని బలంగా పట్టుగా నడిపించారు. నేను అనుకోవడం నారాయణ మూర్తి గారి సిన్సియారిటీ అనుకుంటున్నా. కేవలం మీ సిన్సియారిటీ మూలంగానే దాన్ని మేము దాన్ని మాట అనలేకపోతున్నాము. నారాయణమూర్తి గారిని అందరం ఎందుకు గౌరవిస్తారు అంటే వారి అభిప్రాయం నచ్చో నచ్చకో ఈ రెండు కాదు. ఆయన చెప్పే తీరు. మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లడంలో మీకున్న నిబద్ధత మీకున్న సిన్సియారిటీ దాన్ని మాత్రం ఎవ్వరు ప్రశ్నించలేరు. అది మాత్రం నారాయణ మూర్తి గారి సొంతం. అలాంటి వాటి కోసమే నేను ఇపుడు వచ్చి మీ పక్కన నుంచున్నాను. కేవలం మీ నిబద్ధత నచ్చే దానికి గౌరవం ఇచ్చే. ఇంతలా రాజీ పడకుండా బతకడం అందరి వల్ల కాదు. నావల్లకూడా కాదు. నేను చాలా సార్లు రాజీ పడ్డాను. నారాయణమూర్తి గారిలా రాజీ పడకుండా బతకడం అందరి వల్ల కాదు. ఆ విషయంలో నాకు కొంత జలసి కూడా వుంది. అలా బ్రతకడం అంత తేలిక కాదు. అందుకనే ఆయన పక్కన నిలబడి .. నా అమూల్యమైన సమయం అన్నారు కానీ తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నాకు సినిమా చూపించారు. ఏర్ సినిమా గురించి మాట్లాడమని అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ సినిమా ఆగస్టు 22 న రిలీజ్ అవుతోంది. దీన్ని థియేటర్స్ లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణ మూర్తి గారు మరిన్ని సినిమాలు తీయాలి. ఎందుకంటే ఈయన అర్ధరాత్రి స్వాతంత్ర్యం నాకు తెలుసు. ఒరేయ్ రిక్షా నాకు తెలుసు. చాలా సూపర్ హిట్స్ కొట్టారు నారాయణమూర్తి గారు సూపర్ స్టార్ ఆయన శైలి లో. ఇపుడుకూడా చెపుతున్నా ఆ స్టార్ ప్రెజెన్స్ అయితే వుంది. మీకు తెలిసో లేదో ఒక సినిమాలో క్యారెక్టర్ కి మిమ్మల్ని అనుకున్నాము. కానీ నాకు మీరు ఆ క్యారెక్టర్ చేయరు అని చెప్పారు. చెప్పిన వాళ్ళు ….. మీరు రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆర్ నారాయణమూర్తి ని కొనలేరు అన్నారు. ఇలాంటి విషయాలు మీరు చెపితేనే జనాలు ఎందుకు వింటారు అంటే నారాయణ మూర్తి డబ్బులు కోసమో సక్సెస్ కోసమో చెప్పరు. నిజంగా ప్రజలకు తెలియ చేయాలని చెపుతారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు. దాన్ని గౌరవిస్తారు. నేను కూడా రెండు గంటలపాటు ఎందుకు గౌరవించి చూసి ఇక్కడకొచ్చి మాట్లాడుతున్నాను అంటే దానికోసమే. ఈ సినిమా ఆడాలి. నెక్స్ట్ సినిమా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రీడక్షన్ వాల్యూస్ తో తీయడానికి అవకాశం కలిగేలా ఈ సినిమా మీకివ్వాలి అని అలాంటి సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో గద్దర్ గారి పాట నాకు బాగా నచ్చింది. ఆ పాట గద్దర్ గారు రాశారు అని చెప్పిన తరువాత ఇంకా ఆనందం వేసింది. నాకు ఇష్టమైన రచయిత ఆయన. తాత తాత ముత్తాతలు సాంగ్. నాకు నచ్చింది ఈ సినిమా మీకు కూడా నచ్చుతుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం వీరి వర్తమానన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా వుంది. ఇదొక విష సంస్కృతి అనాలా అసలు మనం దేని వెనకాల ఒరిగెడుతున్నాము. చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల లేదా జ్ఞానం వెనకాల…. జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి పరిగెత్తాలా? ఆ ప్రశ్న అయితే వచ్చింది. జ్ఞానం మనకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇంత నొప్పి ఎందుకొస్తుంది ఇంత బాధ ఎందుకొస్తుంది. మనల్ని కన్నా వాళ్ళకి ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తుంది. నేను కూడా ఇంజనీరింగ్ లో ప్రవేట్ కాలేజ్ లో ర్యాంక్ వచ్చింది. మేము నలుగురు పిల్లలం. మా నాన్న చదివించలేను అన్నారు. ఆయన తేలికగా చెప్పారో లేక నేను తేలికగా తీసుకున్నానో పట్టించుకోకుండా నేను బియాస్సీ చదివేశాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అప్పుడున్నంత తేలికగా సమాజం లేదు మనుషులు కూడా అంత తేలికగా సుఖంగా లేరు ఎందుకంత బరువుగా వున్నారు. అంటే మనం పిల్లలమీద అంతా ఒత్తిడి పెట్టేస్తున్నాం. ఈ సినిమాలో పెట్టారు అన్నం తినే టైమ్ లో పుస్తకం చదివితే బెటర్ కదా అని మదర్ చెప్పడం ముద్ద నేను కలిపి పెడతాను నువ్వు చదువుకో అంటుంది. అంతా ఒత్తిడి పిల్లల మీద ఎందుకు పెట్టేస్తున్నారు? పిల్లల భవిష్యత్ గురించి పెద్ద వాళ్ళ వర్తమానాన్ని ఎందుకు తాకట్టు పెట్టేస్తున్నారు? ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడండి అని అన్నారు.

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: నేను అడిగిన వెంటనే ఒప్పుకొని ఇక్కడకు వచ్చి నేను తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా చూసిన ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కి ధన్యవాదములు. సినిమా నచ్చింది అని చెప్పారు సంతోషం. విద్యను ప్రవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.అని చాటి చెప్పేదే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం. ఆగస్టు 22 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము అని అన్నారు.

నటీనటులు – ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ మరియు నూతన తారాగణం.

పాటలు – గద్దర్ – జలదంకి సుధాకర్, – వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,
ఎడిటింగ్ – మాలిక్
కెమెరా – బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే – మాటలు – సంగీతం – దర్శకత్వం – నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి

Minister Balineni Srinivas Reddy said that more ideal films like Annapurna Thalli Buvvamma should be made at Movie shoot wrap-up even

సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్‌ మట్టా, రోహిల్‌, ఆదిల్‌, రూపేష్‌, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’. గోరి బ్రదర్స్‌ మీడియా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ మార్క్‌ పతాకాలపై సిరాజ్‌ ఖాదరన్‌ గోరి నిర్మిస్తున్నరు. సురేష్‌ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్‌ ప్రభు, సాయి విజయేందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీమ్‌ అందరికీ షీల్డ్‌లు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘అన్నపూర్ణమ్మ అయిన డొక్కా సీతమ్మ గారి గురించి ఇంతకు ముందు ఎవరికీ పెద్దగా తెలీదు. పవన్‌ కల్యాన్‌ వల్ల ఆమె పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏ సమయంలో అయిన ఆమె వండి వార్చి వడ్డించేదని చెబుతుంటారు. అలాంటి వ్యకి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రాలో మధ్యాహ్నం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం. పవన్‌కల్యాణ్‌గారి స్ఫూర్తితో నేను కూడా ఒంగోలులో డొక్కా సీతమగారి పేరున అన్నదానం మొదలుపెడతారు. ఈ సినిమా విషయానికొస్తే.. ఇలాంటి మంచి వ్యక్తి కథలు జనాలకు తెలియాలి. పవన్‌కల్యాణ్‌ స్ఫూర్తితో చక్కని సందేశంతో తీసిన ఈ సినిమా విజయవంతం కావాలి. ఇలాంటి ఆదర్శవంతమైన చిత్రాలు నేటి సమాజానికి అవసరం’’ అని అన్నారు.

డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక మాట్లాడుతూ ‘నా తొలి చిత్రమది. నటిగా లాంచ్‌ అవ్వడానికి ఇంతకన్నా మంచి టీమ్‌ దొరకదు. అద్భుతమైన పాత్ర ఇచ్చారు. న్యాయం చేశాననే అనుకుంటున్నా’’ అన్నారు. 

వి. సముద్ర మాట్లాడుతూ ‘‘డొక్కా సీతమ్మగారి జీవిత కథ ఈ సినిమా. ఇలాంటి సినిమాలు తీయడం కొందరు నిర్మాతలకే దక్కుతుంది. ఈ నిర్మాతలకు జీవిత కాలం చెప్పుకునే సినిమా అవుతుంది. ఇందులొ సీతమ్మగారి భర్తగా నటించడం అదృష్టం. నేను ఎంతోమంది స్టార్‌లను డైరెక్ట్‌ చేశాను. కానీ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు సురేశ్‌ బాగా తీశాడు’’ అని అన్నారు.

దర్శకుడు సురేశ్‌ లంకలపల్లి మాట్లాడుతూ ‘‘మంచి టీమ్‌ కుదిరింది. నా టీమ్‌ బాగా చేసిందని చేను చెప్పను. తెరపై వాళ్ల పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులే చెబుతారు. మంచి సినిమా తీశానని, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెప్పగలను” అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సినిమా పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశాం. త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.

నటీనటులు సాంకేతిక నిపుణులు:
సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్‌ మట్టా, రోహిల్‌, ఆదిల్‌, రూపేష్‌, వైష్ణవి,‌ తదితరులు.
నిర్మాతలు సిరాజ్‌, ఖాదర్‌ గోరి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.నాగేశ్వరి
సంగీతం: సాకేత్‌ వేగి
కెమెరా: ఆర్య సాయి కృష్ణ,
డైలాగ్స్‌: రాంప్రసాద్‌
పి.ఆర్‌.ఓ: విఆర్‌ మధు
 స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సురేష్‌ లంకలపల్లి
డిజిటల్‌ మీడియా: డిజిటల్‌ దుకాణం

Raising Producers Raise Concerns Over Burden of Federation Rules and Film Workers’ Demands

టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో

నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ – చిన్న నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మా లాంటి నిర్మాతలకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఇబ్బందిపెడుతోంది. మా సినిమా దీపాళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఇప్పుడు సమ్మె వల్ల షూటింగ్ ఆపేయాల్సివచ్చింది. లెక్క చూస్తే 150 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ సెట్ లో 50 మంది కూడా ఉండరు. వాళ్లకు ఇస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది. ఓటీటీ, డ‌బ్బింగ్ సినిమాల‌కు డ‌బ్బులు ఏవీ టైంకు రావ‌ట్లేదు. కానీ, మేం మాత్రం ఏ రోజుకి ఆ రోజు డ‌బ్బులివ్వాలంటే అయ్యే ప‌నేనా?. అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఒక చిన్న సీన్ చేయాలనుకుని జెనరేటర్ పెట్టాలన్నా యూనియన్ పర్మిషన్ కావాలి. హీరో, ఫ్రెండ్ సీన్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్లకు వడ్డించే ప్రొడక్షన్..ఇలా 80 మందిని పెట్టుకోవాలి. చిన్న నిర్మాతకు ఇంతమందిని పెట్టుకోవడా పెనుభారంగా మారింది. వాస్తవానికి అక్కడ పనిచేసేది ఆరుగురు మాత్రమే. మిగతా వాళ్లకు పేమెంట్స్ ఇవ్వాలి. ఇంత మందిని మా నెత్తిన రుద్దడం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. అన్నారు.

నిర్మాత ప్రైమ్ షో చైతన్య మాట్లాడుతూ – సినీ నిర్మాతల పరిస్థితి దయనీయంగా ఉంది. మన దగ్గరే కాదు దేశ విదేశాల్లోనూ ఫిలింమేకింగ్ ఇబ్బందుల్లో ఉంది. సినిమానే కాదు ఐటీ, రియల్ ఎస్టేట్ సహా ప్రతి ఇండస్ట్రీ స్లంప్ లో ఉంది. రేపు బాగుంటుందనే అందరూ పనిచేస్తున్నారు. మేము చెప్పిన వాళ్లనే పెట్టుకోండి, ఇంతమందిని ఖచ్చితంగా షూటింగ్ కు తీసుకోవాలి అనడం కరెక్ట్ కాదు. నిర్మాతలు ఎంప్లాయ్ మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఏ నిర్మాత కూడా సంతోషంగా లేడు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ – చిత్ర నిర్మాణం భారంగా మారుతోంది. రెండు కోట్ల రూపాయల్లో చేయాల్సిన సినిమాకు నాలుగైదు రెట్ల ఖర్చు అవుతోంది. మా దగ్గరకు రిలీజ్ చేయమని వచ్చే సినిమాలు చూస్తే 2 కోట్లలో చేయాల్సినవి అనిపిస్తాయి కానీ వాళ్లు నాలుగైదు రెట్లు ఎక్కువ అయ్యింది అని చెబుతారు. థియేటర్స్ నుంచి అంత డబ్బులు రావడం లేదు. ఇంత ప్రొడక్షన్ ఖర్చు ఎందుకు అవుతోంది. సినీ కార్మిక సంఘాలు ఒకసారి నిర్మాత స్థానంలోకి వచ్చి ఆలోచిస్తే మా బాధలు తెలుస్తాయి. అన్నారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మేమంతా ఇండస్ట్రీకి ప్యాషన్ తో వచ్చాం. సినిమాలు చేస్తున్నాం. యూనియన్స్ పేరుతో మాకు భారాన్ని పెంచవద్దని కోరుతున్నాం. ఈ యూనియన్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిబంధనలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్చాలి. తక్కువ మంది తో సరిపోయే షూటింగ్ లో 100, 150 మందిని పెట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఒక సెట్ కోసమో, ఇంకో క్వాలిటీ కోసమే మేము పెట్టాల్సిన ఖర్చు ఇలా వృథా అవుతోంది. ఈ బంద్ ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అన్నారు.

నిర్మాత రాకేశ్ వర్రె మాట్లాడుతూ – నేను గతంలో ఒక సినిమాను లోకల్ టాలెంట్, యూనియన్ కార్మికులను కలిపి చేస్తే కోటిన్నర అయ్యింది. ఇప్పుడు మొత్తం యూనియన్ కార్మికులతో చేస్తే 8 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. చిన్న సినిమాకు అసలు బిజినెస్ లేదు. అలాంటి టైమ్ లో నాకు 8 కోట్ల బిజినెస్ ఎలా అవుతుంది. నష్టం నాకు వస్తుంది. ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే ఆదుకునేందుకు ఎవరూ రారు. అన్నారు.

ప్రొడ్యూసర్ చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ – మేము కొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నాం. యూనియన్స్ రూల్స్ వల్ల మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా ఉంది. నిర్మాతలు, యూనియన్స్ అని సెపరేట్ కాకుండా అందరూ కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయని భావిస్తున్నా. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే. మాకు పదవులు లేవు, మాట్లాడేందుకు పెదవులు తప్ప. ఇది గ్రూపిజం కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాదు. చిన్న నిర్మాతలుగా మా బాధలు చెప్పుకునేందుకు పెట్టిన ప్రెస్ మీట్. గుడ్డు పెట్టేవాడికే తెలుస్తుంది బాధ. మీకు 30శాతం కాదు 50శాతం పెంచుతాం. కానీ థియేట్రికల్ గా రెవెన్యూ పరంగా, మేము పెట్టిన ఖర్చు పరంగా, ఏ రూపంలో అయినా మాకు పెట్టుబడి తిరిగొస్తుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా. అన్నీ పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయని పెద్ద నిర్మాతలు కొందరు అంటున్నారు. మీ పరిస్థితి వేరు, చిన్న నిర్మాతల పరిస్థితి వేరు. చిన్న సినిమాలకు 25 పర్సెంట్ తగ్గించండి వేతనాలు అని ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంటే దాన్ని వాళ్లు పాటిస్తున్నారా లేదు. ఏ సినిమాకైనా అదే కష్టం అంటూ పెద్ద సినిమాలతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారు. ఫైనాన్స్ కట్టుకోవాలి, చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయాలి వంటి ఎన్నో టెన్షన్స్ మాలో ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పెట్టి, ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తుంటాం. ప్రొడ్యూసర్స్ మేము అని సంతృప్తి పడతాం. వందల కోట్లు తీసుకునే హీరోలు ఒకరిద్దరే. మా హీరో కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి ఎంతో సపోర్ట్ చేశారు. పరిస్థితి అర్థం చేసుకుని ముందు మంచి సినిమా చేద్దామని ముందుకొచ్చారు. అలాంటి హీరోలు ఎంతమంది ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీకు 30శాతం కావాలని ఎలా అడగాలని అనిపిస్తోంది. టికెట్ రేట్సు పెంచుకునేంది వేళ్ల మీద లెక్కపెట్టేన్ని సినిమాలకే. మేము రైజింగ్ ప్రొడ్యూసర్స్ కాదు బర్నింగ్ ప్రొడ్యూసర్స్. మాది మేకపోతు గాంభీర్యమే. చాలా మంది నిర్మాతలకు ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సినిమాతో డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఇచ్చే నిర్మాత ఎవరైనా ఉన్నారా. డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎవరి వైపు ఉన్నారో స్పష్టత ఇవ్వాలి. కావాలంటే మేము సినిమాలు తీయడం ఆపేస్తాం. షూటింగ్ కు ఇంతమందిని తీసుకోవాలి, ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది. అసలు బిజినెస్ లేదని మేము బాధపడుతుంటే 30 పర్సెంట్ పెంచాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. కొందరు నిర్మాతలు తమ కేసులు, జెండాలు, అజెండాల మేరకు కార్మికులు అందరికీ ఒకేలా వేతనాలు పెంచాలని అంటున్నారు. సినీ కార్మికుల ముసుగులో తమ స్వలాభం కోసం చూస్తున్నారు. ప్రతి క్రాఫ్ట్ వాళ్లు మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోండి. మీరు డిమాండ్స్ మాత్రమే చేసి హక్కులు మర్చిపోతే ఎలా. మీరు మారకుంటే మా బడ్జెట్ లో వచ్చేవాళ్లతో సినిమాలు నిర్మించుకుంటాం. సినిమాకు మాకు కంఫర్ట్ కాదు ప్యాషన్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మాలాంటి చిన్న నిర్మాతలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ బాగుండాలి అని అనుకోవాలి గానీ మేము మాత్రమే బాగుండాలని యూనియన్స్ వాళ్లు ఆలోచించడం సరికాదు. ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అనడం లేదు. పరిస్థితి అర్థం చేసుకుని సినిమాలు చేస్తున్నారు. యూనియన్స్ కూడా ఇది మన ఇండస్ట్రీ మన ప్రొడ్యూసర్స్ అనే భావనతో పనిచేయాలి. అన్నారు.

Dr. Murali Mohan’s ‘Supreme Warriors’ New Movie Pooja Ceremony held grandly

The film ‘Supreme Warriors’, featuring veteran actor Dr. Murali Mohan in the lead role, was officially launched with a grand pooja ceremony. This marks the second production under the Aadi Akshara Entertainments banner. The project is being produced by Pedapudi Baburao and directed by Hari Chandan.

The ceremonial launch took place on Monday, August 11, at Rama Naidu Studios. Special guests at the event included Davala Satyam, Bellamkonda Suresh, director Veera Shankar, Sangareddy MLA Chinta Prabhakar, Producers Shiva Raj Patil, Markapuram Shiva Kumar, and Srinivas Reddy. For the muhurat shot, MLA Chinta Prabhakar switched on the camera, while Davala Satyam and Dr. Murali Mohan directed the first shot in an honorary gesture.

*While speaking at the event, Dr. Murali Mohan said:* “‘Supreme Warriors’, the second production from Aadi Akshara Entertainments, was officially launched today at Rama Naidu Studios. I was immediately impressed by the story narrated by director Hari Chandan, and I’m excited to be part of this film. Producer Pedapudi Baburao, who is also playing a role in the film, is going to win hearts both as a producer and actor. Despite being an NRI, his passion for cinema brought him into this industry. I wish him success in many more projects. I truly hope ‘Supreme Warriors’ turns out to be a great success.”

*Veteran director-producer Davala Satyam commented:* “Baburao deserves a big hit with this film. I hope he continues producing films here without having to return to the US. I really liked the story that director Hari Chandan narrated. He waited until the entire script was ready before starting production, and his dedication is admirable. With strong ideas and hard work, success is inevitable. I wish ‘Supreme Warriors’ becomes a major success.”

*Producer and lead actor Pedapudi Baburao stated:* “I thank Davala Satyam, Bellamkonda Suresh, and Veera Shankar for gracing our film launch. We’ve been working on this story for the past two and a half years. ‘Supreme Warriors’ is being made as a sci-fi action thriller. We’re casting well-known actors from both the South and North Indian industries. I play one of the lead roles, and Dr. Murali Mohan portrays another key character. The scenes between us will be particularly impactful. Dr. Murali Mohan gave me my first break as an actor in ‘Athadu’, and I’m honored to share the screen with him again. Our film will be both surprising and captivating. We will soon announce the full cast lineup.”

*Director Hari Chandan said:* “The concept for this story began during the COVID era. I started writing it after the attack on Taiwan. The narrative revolves around eight characters, and Dr. Murali Mohan will be seen in a role unlike any he’s played before. Producer Baburao also plays a significant character. We are in talks with other well-known actors for the remaining roles and will announce them shortly. This sci-fi action thriller will highlight strong emotional threads, especially those connected to military and army families. We have personally interacted with nearly 800 army families during our research. We’ve been working on this script for over two and a half years, and we’re confident ‘Supreme Warriors’ will resonate with audiences.”

Cast: Dr. Murali Mohan, Pedapudi Baburao, Mahima Chaudhary, Kalpana, Aditya Om, Prithviraj, Davala Satyam, Virendra Chauhan, Rajpal Yadav, Mohan Sharma, among others.

Technical Crew:
Banner: Aadi Akshara Entertainments
Producer: Pedapudi Baburao
Director: Hari Chandan
PRO: Sai Satish

Sai Durgha Tej’s Won the Most Desirable Glamour & Style Awards South 2025(Male)

యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమంలో శనివారం (ఆగస్ట్ 9) హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగింది. మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు కలిసి సందడి చేశారు. ఈ క్రమంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ డిజైరబుల్ (మేల్) అవార్డును గెలుచుకున్నారు.

ఈ అవార్డును సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుని తల్లి విజయ దుర్గ, తండ్రి డాక్టర్ శివ ప్రసాద్ చేతుల మీదుగా తీసుకోవాలని సాయి దుర్గ తేజ్ కోరుకున్నారు. ఇక వేదికపైనే ఈ అవార్డుని, గౌరవాన్ని సాయి దుర్గ తేజ్ తన తల్లికి అంకితం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తనను తల్లి కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేసుకున్నారు. ‘నేను అంతా కోల్పోయానని అనుకున్నప్పుడు, నా తల్లి నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. ఆమె నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు’ అని అన్నారు.

‘కంఫర్టబుల్‌గా ఉండే దుస్తుల్ని ధరించండి. ప్రశాంతంగా, సంతోషంగా, ఉండండి’ అని ఆయన అన్నారు. తన స్టైల్ ఐకాన్‌లను పేర్కొంటూ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌లను ఎంచుకున్నారు. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ తన ఆల్ టైం ఫేవరేట్ స్టైల్, లుక్స్ అని సాయి దుర్గ తేజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.. నాని, అడివి శేష్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, మాళవిక మోహనన్, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, నాగ వంశీ, ప్రగ్యా జైస్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మి, భాగ్యశ్రీ బోర్సే, అదితి రావు హైదరి, సిద్ధార్థ్, చిన్మయి శ్రీపాద, దేవి శ్రీ ప్రసాద్ వంటి అనేక మంది ప్రముఖ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటి గట్టు (SYG) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 చివరిలో విడుదల కానుంది.

‘Bhalare Sitram’ Movie Review (Humor & emotional entertainer)

Cinemarangam.Com
Banner: Sri Lakshmi Creations
Release: SKML Motion Picture
Movie Name :”Bhalare Sitram”
Review Rating : 3/5
Release Date : 8th Aug 2025
Producers: Srinivasa Rao Savaram, Subba Rao
Director: Tumma Lakshma Reddy
Cast : Shiva, Krishna, Divya Dicholkar, Mounika and others.
Music: Sami Kattupalli
DOP: Satish
Editing : Srinivasa Rao

Sometimes, unexpected relationships and unforeseen events can completely change our lives. Bhalare Sitram, produced by Srinivasa Rao Savaram and Subba Rao under the Sri Lakshmi Creations banner, is directed by Tumma Lakshma Reddy. Featuring Shiva, Krishna, Divya Dicholkar, and Mounika in lead roles, the film blends humor and emotions in a story revolving around the conflict between two newly married couples. Let’s see how this film, now in theatres, fares.

STORY
Shiva (Shiva Rajput) – Sita are one couple. Pandu (Panddu Chelimi) – Divya (Divya Dicholkar) are another. Both couples, living in different places, are enjoying their newly married lives until an old connection between them unexpectedly comes to light. How is one man’s wife connected to another? After this truth is revealed, misunderstandings and conflicts arise between the couples. Where does this problem lead? That’s for the audience to find out in theatres.

Performances
Shiva – Impresses with his cool look and natural acting. Divya Dicholkar – Performs well, especially in emotional sequences. Panddu Chelimi – Brings entertainment with his comic timing and natural dialogue delivery. Krishna– Shines in a mute role with expressive body language and emotions. Kosuri Mounika– Naturally portrays her role with the required seriousness.

Technical Department
Director Lakshma Reddy Tumma– Presents a simple storyline with lighthearted twists, making it appealing to family audiences. Music (Sami Kattupalli) – Songs are average, but the background score elevates emotional moments.
Cinematography (Satish) – Captures the lives and emotions of the two couples effectively.
Editing (Srinivasa Rao) – Crisp first half, decent second half.

Analysis
Director Lakshma Reddy Tumma has successfully portrayed how married life faces similar challenges, whether it’s in villages among the less educated or in cities among the highly educated. He effectively brings to screen the kind of conflicts today’s couples encounter. The drama and twists between the two couples keep the audience engaged and even bring occasional laughs. Natural performances, humor, and emotional moments hold the film together.

Bhalare Sitram is a simple yet engaging family drama. The conflict between two new couples, the secrets from their past, and the resulting emotional journey make it worth watching. It’s a relatable film for today’s youth and family audiences.

Cinemarangam.Com  Review Rating: 3/5

TR Dream Productions Emotional Thriller ‘C Mantham’ Movie Title & Glims Unveiled

టీ అర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘C-మంతం’ నుంచి గ్లింప్స్‌ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

క్లాసిక్ థ్రిల్, ఎమోషనల్ డెప్త్ కలగలిసినట్లుగా కనిపించే ఈ గ్లింప్స్‌లో విజువల్స్, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రేగ్నెంట్ మహిళ చేతులు వెనక్కి కట్టిన దృశ్యం, రక్తపు మడుగులు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే చర్యలు.

దర్శకుడు సుధాకర్ పాణి ఈ సినిమాను కొత్తగా చూపించడానికి ప్రయత్నించినట్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్ టాటా నిర్మాతగా, గాయత్రీ సౌమ్య గుడిసెవా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ గ్లింప్స్‌కు బలాన్ని చేకూర్చింది.

చిత్ర బృందం ప్రకారం, మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు కూడా తెలిపారు.

*మూవీ:* C-మంతం

*మూవీ కాన్సెప్ట్:* సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

*తారాగణం:*

హీరో : వజ్రయోగి
హీరోయిన్ : శ్రేయ భర్తీ & తదితరులు

*టెక్నికల్ టీం:*

డైరెక్టర్ : సుధాకర్ పాణి
బ్యానర్ : టీ అర్ డ్రీమ్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: ప్రశాంత్ టాటా
సహ నిర్మాత: గాయత్రీ సౌమ్య గుడిసెవా
డీ ఓ పీ : శ్రీనివాస్ విన్నకోట
ఎడిటర్: అమర్ రెడ్డి
మ్యూజిక్: ఎస్. సుహాస్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వీరవల్లి శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : వీరవల్లి మురళి కృష్ణ
ఫైట్ మాస్టర్స్: రామ కృష్ణ, వెంకట్
కొరియోగ్రాఫర్ : దుర్గేష్
మేనేజర్ : కరణ్ జోహార్
పోస్టర్ డిజైన్: గీతికా & సౌమిక్
పోస్ట్ ప్రొడక్షన్: రోషినిస్టూడియోస్
పీ అర్ ఓ : హరీష్ – దినేష్