Home Blog Page 63

Bollywood Actress Wamika Gabbi launched Project Miss South India UK in Hyderabad

హోటల్ తాజ్ డెక్కన్‌లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా ప్రాజెక్ట్ మిస్ సౌత్ ఇండియా UK ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును బాలీవుడ్ నటి వామికా గబ్బి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మీడియా, సామాజిక వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.

జూలై 2025 నుండి జూలై 2026 వరకు సంవత్సర కాలపరిమితితో నిర్వహించబోయే ఈ ప్రాజెక్ట్, UKలో నివసిస్తున్న 18–28 ఏళ్ల వయస్సు గల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మూలాలున్న యువతులను ప్రోత్సహించేందుకు ఒక గొప్ప వేదికగా మారనుంది. వారిలోని సాంస్కృతిక వారసత్వం, ప్రతిభ, నాయకత్వ లక్షణాలను వెలికితీయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం.

ప్రారంభ వేడుకలో వామికా గబ్బి మాట్లాడుతూ, “మిస్ సౌత్ ఇండియా UK కేవలం అందాల పోటీ కాదు; ఇది మన సంస్కృతిని, మహిళల గౌరవాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించేది. ఈ యాత్రలో భాగంగా ఉండటం గర్వంగా ఉంది,” అన్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో Miss Telugu UK, Miss Tamil UK, Miss Kannada UK, Miss Malayalam UK వంటి ప్రాంతీయ టైటిల్స్‌ ఉండనున్నాయి. తుదిపోటీ UKలో నిర్వహించబడుతుంది, అందులో సంప్రదాయ వస్త్రధారణ, ప్రతిభా ప్రదర్శనలు, ప్రశ్నోత్తరాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన అద్భుత కార్యక్రమం జరుగుతుంది.

విజేతలకు లక్షల రూపాయల నగదు బహుమతులు, కిరీటాలు, మోడలింగ్ అవకాశాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లభించనున్నాయి. ఈ ఫైనల్‌ను ప్రత్యక్ష ప్రసారంగా మరియు ఆన్‌లైన్‌లో 3.5 లక్షల మంది వీక్షించే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలలో కోట్ల్ని మించే వ్యూస్ లక్ష్యంగా తీసుకుంటున్నారు.

ఈ కార్యక్రమానికి మనీష్ మల్హోత్రా, సబ్యసాచీ, నీరూస్ లాంటి టాప్ డిజైనర్లు, తనిష్క్, లక్ష్మే, VLCC, జీ టీవీ, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు భాగస్వాములవుతారు. UKలోని దక్షిణ భారతీయ సంఘాలు, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లతో కూడిన భాగస్వామ్యాలు కూడా ఉండనున్నాయి.

ఇప్పటి నుండి నమోదు మరియు ప్రచార కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. భారత్ మరియు UKలో పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ప్రాజెక్ట్ మిస్ సౌత్ ఇండియా UK కేవలం అందాల పోటీ కాదని, అది మన సాంస్కృతిక గర్వాన్ని ఆవిష్కరించే ఉద్యమమని, సమాజం కోసం కట్టుబడి ఉన్న కొత్త తరపు మహిళలను స్ఫూర్తి పరచేదిగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Harshika Productions Hero Shiva Kandukuri’s ‘ChaiWaala’ First Look Poster unveiled

Shiva Kandukuri, the young and promising actor, has been displaying a lot of variety of late. The actor has been creating a solid impact on audiences with his script choices. His upcoming film is titled Chai Waala. The film is proudly produced by Radha Vijayalakshmi and Venkat R. Papudippu under the Harshika Productions banner.

Today, the makers unveiled the film’s first look, featuring Shiva Kandukuri and Rajeev Kanakala on a scooty going for a ride. The backdrop of Hyderabad and the smiles on the actors’ faces promise an entertainer that will connect with everyone.

Unveiling the first look, the makers wrote, “The story brewed with love, legacy, and the perfect cup of chai. Get ready to embark on a flavorful journey filled with emotions, tradition, and dreams. Teaser very soon.” The film is written and directed by Pramod Harsha.

Prashanth R. Vihari is scoring the music, while Kranthi Varla is handling the cinematography. Pavan Narva is editing the film. Chai Waala promises to connect with everyone through a heartwarming and entertaining story.

Silver Screen Shots films Mythological Thriller ‘Aranya Dhara’ trailer launched by director Raghav Omkar Sasidhar

బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’. ఈ చిత్రాన్ని ‘సిల్వర్ స్క్రీన్ షాట్స్’ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం నిర్మించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ అనే పాట రిలీజ్ అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకులు, సింగర్ అయినటువంటి రఘు కుంచె ఆ పాటను లాంచ్ చేయగా దానికి విశేషాదరణ లభించింది. తాజాగా ట్రైలర్ ను ‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ ‘అరణ్య ధార’ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. శివ, బాలు ఓ కొత్త పాయింట్ తీసుకుని ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. కచ్చితంగా ఈ యంగ్ టాలెంట్ ను ప్రేక్షకులు ప్రోత్సహిస్తారు అని భావిస్తూ.. టీం అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని తెలిపారు

‘అరణ్య ధార’ ట్రైలర్ 1: 52 నిమిషాల నిడివి కలిగి ఉంది. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో ట్రైలర్ ను కట్ చేసినట్టు. హీరోయిన్ మిస్ అవ్వడంతో.. పోలీస్ అయినటువంటి ఆమె తండ్రి హీరోని అరెస్ట్ చేసి విచారించడం. ఆ తర్వాత ఊహించని విధంగా అతను కూడా మిస్ అవ్వడం.ఆ తర్వాత హీరో వెళ్లి అడవిలో పడటం.. వంటి అంశాలతో ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉంది.

నటీనటులు :
బాలు నాయుడు,ఆశ సుదర్శన్, రేవతి నాధ, వెంకట్ పసుపులేటి, నాయకంటి స్వేతాంజలి, ప్రసాద్ పూసల,సంజయ్ సముద్రాల, జంజుర్ నిఖిల్,శివ పచ్చ తదితరులు

సాంకేతిక నిపుణులు :
కథ – స్క్రీన్ ప్లే – మాటలు : శివ పచ్చ
దర్శకత్వం : శివ పచ్చ, బాలు నాయుడు
నిర్మాత : బాలు నాయుడు
నిర్మాణ సంస్థ : సిల్వర్ స్క్రీన్ షాట్స్
సంగీతం : రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ : చైతన్య దామెర్ల
పీఆర్ఓ : ఫణి కుమార్ పులపర్తి

‘Pelli lo Pelli’ Title & first look Poster launched held grandly, Movie Releasing Soon

గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – “పెళ్లిలో పెళ్లి”లో సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త..అంటే సుఖాన్ని అందించేవాడు అని అర్థం. దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. షోలాపూర్ లో సినిమా చేస్తున్నామని చెప్పాడు. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉంటారు. నన్ను ఈ టీమ్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. పెద్దలను గౌరవించడం అనే గొప్ప గుణం వీళ్లందరిలో కనిపించింది. గణేష్ కోలి లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ వస్తే మరిన్ని మంచి చిత్రాలు యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారు. ఆయన “పెళ్లిలో పెళ్లి” సినిమాతో హిట్ అందుకుని బాలీవుడ్ లో సినిమాలు చేసేంతగా ఎదగాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం ప్రతిభావంతుడు. హైదరాబాద్ లో సినిమా చేయడం సులువే కానీ షోలాపూర్ కు 24 క్రాఫ్టుల వాళ్లను తీసుకెళ్లి చాలా స్పీడ్ గా సినిమా రూపొందించాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాట్లాడుతూ – “పెళ్లిలో పెళ్లి” సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు మంచి కథ కథనాలతో పాటు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరాయి. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి థ్యాంక్స్. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. నెక్ట్స్ రాబోయే ఈవెంట్స్ లో ఈ చిత్రం గురించి మరింతగా మాట్లాడుతా. అన్నారు.

హీరోయిన్ సంస్కృతి గోరే మాట్లాడుతూ – “పెళ్లిలో పెళ్లి” సినిమా మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా పట్ల మేమంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మీ అందరినీ ఆకట్టుకునేలా “పెళ్లిలో పెళ్లి” సినిమా ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి దివిజ మాట్లాడుతూ – “పెళ్లిలో పెళ్లి” సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారు లేకుంటే ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యేది కాదు. ఈ టీమ్ తో కలిసి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. “పెళ్లిలో పెళ్లి” అనే మంచి మూవీతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం. అన్నారు.

హీరో శివ సాయిరిషి మాట్లాడుతూ – మా మూవీ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. భరణి గారికి, ఆకాష్ జగన్నాథ్ అన్నకు థ్యాంక్స్. నన్ను ఈ వేదిక మీద చూసి మా అమ్మ సంతోషిస్తోంది. ఈ సినిమా చేసేందుకు నాకు మా ప్రొడ్యూసర్ గణేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో సపోర్ట్ చేశారు. షోలాపూర్ నాకు మరో ఇల్లులా మారింది. ఈ టీమ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ఎంఎల్ రాజా గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. మా మూవీ గురించి నెక్ట్స్ ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతా, త్వరలోనే రిలీజ్ కు వస్తున్న మా “పెళ్లిలో పెళ్లి” సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతూ – మేము మహారాష్ట్రలో ఉంటాం కానీ తెలుగు సినిమాలు చూస్తుంటాం. తెలుగు భాషను అభిమానిస్తాం. తెలుగులో తెరకెక్కే కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టపడతాం. సినిమా మేకింగ్ మీద అభిరుచితో “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నా. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతూ – మా ఈవెంట్ కు పిలవగానే వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్స్. ఆయనను ఇన్వైట్ చేసేప్పుడు నేను దేవుడిలా భావించే పూరి జగన్నాథ్ గారిని కలిశాను. షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది. మాలాంటి కొత్త వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది మీరే. అన్నారు.

యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ – ఇది పోస్టర్ లాంఛ్ లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమా టీమ్ చూస్తుంటే అంతా యంగ్ స్టర్స్ ఉన్నారు. ఇలాంటి యంగ్ టీమ్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి నా అభినందనలు. ఈ సినిమాలో కీ రోల్ చేసి ఈ టీమ్ కు సపోర్ట్ గా ఉన్న భరణి గారికి కూడా థ్యాంక్స్. “పెళ్లిలో పెళ్లి” సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ పుల్ గా ఇంప్రెస్ చేస్తోంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటీనటులు – హీరో: శివ సాయి, హీరోయిన్స్: సంస్కృతి గోర్, దివిజ మరియు విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి, తదితరులు

టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ – వేణుగోపాల్ ప్రశాంత్
ప్రొడక్షన్ మేనేజర్ – కె.దత్తాత్రేయ్
డీవోపీ – శుభం గుండ్ల
మ్యూజిక్ – ఎంఎల్ రాజా
పీఆర్ఓ – సతీష్. కె
డిజిటల్: నరేష్, ఉదిత్ సాయి, శివ
బ్యానర్స్ – సుఖకర్త ఫిలింస్, గౌరీ ఫిలింస్
కో ప్రొడ్యూసర్ – రూపాలీ కొల్లి
నిర్మాత – గణేష్ కొల్లి
రచన, దర్శకత్వం – శ్రీకాంత్ సంబరం

“We are proud to be part of the history being created by Ramasatyanarayana!”: Director Relangi Narasimha Rao

ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రపంచ రికార్డు సాధించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న భీమవరం టాకీస్ అధినేత – శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ వెనుక తాము ఉంటామని తెలిపారు… ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రఖ్యాత రచయిత జె.కె.భారవి. ఈనెల (ఆగస్టు) 15న హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఒకేసారి ప్రారంభమై ప్రపంచ రికార్డు” నెలకొల్పనున్న 15 సినిమాలకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా సంఘీభావం తెలిపారు.

ఈ 15 చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ ప్రకటించగా… ఈ 15 చిత్రాల్లో యండమూరి సినిమా మినహా… మిగతా సినిమాలకు తాను స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించి తగిన సలహాలు, సూచనలు ఇస్తానని జె.కె.భారవి పేర్కొన్నారు. రామసత్యనారాయణను చూసి తాను గర్వపడుతుంటానని రేలంగి తెలిపారు. ఈ 15 చిత్రాలకు స్టూడియో పార్టనర్ గా ఉండే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్. కెరీర్ బిగినింగ్ లొనే 12 నెలల్లో 13 సినిమాలు తీసి, విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసిన తనకు…ఒకేసారి 15 సినిమాలు స్టార్ట్ చేసి, ఏడాదిలోపు పూర్తి చేసి విడుదల చేయడం ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఈ 15 సినిమాల్లో… యండమూరి వీరేంద్రనాధ్ వంటి మహా రచయిత చిత్రంతోపాటు… జె.కె.భారవి వంటి మహాజ్ఞాని చిత్రం… ప్రఖ్యాత దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చిత్రం ఉండడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి చెప్పారు. ఈ 15 చిత్రాల్లో కేవలం రెండుమూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నా… తాను పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో…15 చిత్రాల దర్శకుల్లో పన్నెండు మంది హాజరై… రామసత్యనారాయణ గారు ఇస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాణం పెట్టి పనిచేస్తామని ప్రతిన పూనారు.ఈ 15 చిత్రాలకు “పి.ఆర్.ఓ” అయిన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అప్పాజీ కూడా పాల్గొన్నారు!!

‘Bun Butter Jam’ Trailer Released held grandly, Telugu Releasing On August 22

The recent Tamil blockbuster “Bun Butter Jam”, a romantic comedy featuring Raju Jeyamohan, Aadya Prasad, and Bhavya Trikha in lead roles, is all set to entertain Telugu audiences with its grand release on August 22. The teaser, unveiled earlier by popular director Meher Ramesh, garnered a unanimously positive response from the audience.

Ahead of its theatrical release, the makers unveiled the film’s theatrical trailer today, offering a fun-filled glimpse into the romantic and comedic chaos that awaits. The trailer promises a delightful entertainer packed with comedy, emotions, and a quirky generational clash, making Bun Butter Jam a must-watch for audiences of all ages.

The film’s plot revolves around two orthodox mothers eager to get their children married. However, their mission goes hilariously off-track as their Gen Z kids find themselves tangled in friendships, emotional confusion, and modern-day love dilemmas. The story offers a highly relatable and heartwarming experience for both the youth and family audiences of the current generation.

The trailer is loaded with laugh-out-loud moments, romantic sparks, action-packed sequences, and emotional beats, positioning Bun Butter Jam as a wholesome entertainer with universal appeal, from Gen Z to the Boomer generation.

The film stars Saranya Ponvannan, Devadarshini, Michael Thangathurai, and VJ Pappu in key supporting roles. Written and directed by Raghav Midarth, the film is produced by Suresh Subramanian under the Rain of Arrows Entertainment banner. CH Satish Kumar of Sree Vigneshwara Entertainments is bringing the film to theatres across Andhra Pradesh and Telangana.

Nivas K Prasanna composed the music for the film, and the cinematography was handled by Babu Kumar. John Abraham handled editing, Sri Sasi Kumar is the Art Director, Satish K led the Production Design, and M.J. Bharathi served as the Production Executive.

‘Bad girls’ Title Motion Poster launched held grandly

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్‌మీట్‌లో దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని రివీల్ చేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..‘‘మున్నా చాలా సరదాగా ఉంటాడు. చాలా కొద్ది మంది దర్శకులే కొత్తవాళ్లని పెట్టుకుని సినిమా చేస్తారు. నా మిత్రుడు మున్నా కష్టానికి తగిన ఫలితం రావాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. చంద్రబోస్ గారి పేరు ఉంటే చాలు. మొయిన్ 15 ఏళ్ల క్రితమే హీరో అవుతా అని చెప్పాడు. డైరెక్టర్ పవన్‌కి అప్పగించి నటుడిని చేశా. అక్కడి నుంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాడు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్

శివ నిర్వాణ మాట్లాడుతూ..‘‘బ్యాడ్ గాళ్స్ మూవీ మంచి సక్సెస్ సాధించాలి. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి చేయడం నిజంగా సాహసమే. ఇంత యంగ్ టాలెంట్‌తో కాన్సెప్ట్ ఫిల్మ్‌ను తీస్తున్న మున్నా ముక్కుసూటి మనిషి. ఈ సినిమా అతడికి మంచి విజయాన్ని అందిస్తుంది. నిర్మాతలందరికీ మంచి డబ్బులు రావాలి. ఈ సినిమాకు రెండు మెయిన్ పిల్లర్స్ అనూప్, చంద్రబోస్ గారు. నీలి నీలి ఆకాశం ఎంతగానో వైరల్ అయింది. ఒక పాటతోనే మున్నా అందరికీ తెలిశాడు. అలాంటి పాట ఈ సినిమాలో కూడా ఒకటి ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి.’’

కమెడియన్ భద్రం మాట్లాడుతూ..‘‘డైరెక్టర్ మున్నానే ఈ సినిమాకు హీరో. మేమిద్దరం గూగుల్ ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అని విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బ్యాడ్ అయినా గుడ్ అయినా సందర్భాన్ని బట్టి మారుంది. ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..‘‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత నేను మున్నాగారితో కలిసి వర్క్ చేస్తున్నా. ఈ సినిమా కూడా అద్భుతమైన చిత్రం అవుతుంది. నీలినీలి ఆకాశం బ్యానర్‌లో మున్నాతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్.’’ అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో పాటలు, కథ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బ్యాడ్ గాళ్స్ అంటున్నా కానీ వాళ్లు చాలాబాగా యాక్ట్ చేశారు. ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం.’’ అని అన్నారు.

డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ..‘‘బాహుబలిలో బిడ్డను కాపాడే చేయిలా నాకు చేయందించింది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం చంద్రబోస్ గారు, అనూప్ గారే. చంద్రబోస్ గారు రాలేకపోయారు. నేను మిస్ అయ్యా. ఆ పాట పేరుతోనే నేను బ్యానర్ పెట్టుకున్నా. నేను ఎప్పుడు సినిమాలు చేసినా వీళ్లిద్దరితోనే చేస్తా. మా కాంబినేషన్‌లో మళ్లీ అలాంటి పాట రాబోతోంది. 10 రోజుల్లో సాంగ్ రిలీజ్ చేస్తాం. అదొక మంచి ప్రీవెడ్డింగ్ సాంగ్ అవుతుంది. నాలైఫ్‌లో అనూప్ ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. నేను ఒకరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డుపై లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి బండి ఆపి చార్మినర్ దగ్గరకు వెళ్లి చాయ్ తాగుదామా అని అడిగింది. తను పెళ్లి తర్వాత ఫ్రీడం ఉండదని అలా లాస్ట్ రోజు ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పింది. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. ఈ కథను ఐదారుగురు పెద్ద నిర్మాతలకు చెప్పాను. కొత్త అమ్మాయిలతో మార్కెట్ అవుతుందా అని అడిగారు. అందుకే నేను, నా క్లాస్‌మేట్స్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీశాం. బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో పెంచుతాం. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి. స్కూల్లో అమ్మాయిలను తమను తాము కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ ఒక సబ్జెక్ట్‌లా పెట్టాలి. మా మూవీ టీమ్ నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు, కేంద్రప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ బ్యానర్ పెట్టడానికి కారణం డైరెక్టర్ మారుతి గారు. వాళ్ల స్ఫూర్తితోనే బ్యానర్ పెట్టాం. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. నీలినీలి ఆకాశంలాంటి సాంగ్ ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబుకు ఈ కథ చెబితే ఇది చిన్న సినిమా కాదు చాలా మంచి సినిమా అవుతుందని ప్రోత్సహించాడు. సుకుమార్ గారికి టైటిల్ చెబితే అదిరిపోయిందన్నారు. ఈ నలుగురు అమ్మాయిలను లైఫ్‌లో మర్చిపోలేను. రేణూ దేశాయ్ గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. నెక్ట్స్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటారు. అందరికీ థ్యాంక్యూ.’’ అని అన్నారు.

ఎడిటర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమాలో కామెడీ ఎంతగా ఉంటుందో ఎమోషన్ కూడా అంతగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అని అన్నారు.

నటుడు మొయిన్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్యూ. ఈ సినిమాకు లాస్ట్ కాస్ట్ అయింది నేనే. మా హీరోయిన్స్‌కి తెలుగు రాకపోయినా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచులో మైనస్ డిగ్రీస్‌లో చాలా కష్టపడ్డారు. మా బ్యాడ్‌గాళ్స్ త్వరలో విడుదల అవుతుంది’’ అని అన్నారు.

నటుడు సూర్య మాట్లాడుతూ..‘‘నేను హీరో అవ్వాలనే ఆలోచన లేదు. మంచి నటుడు అవ్వాలనేది నా కోరిక. నన్ను ఒక రీల్‌లో చూసి ఈ సినిమాకు సెలెక్ట్ చేసిన డైరెక్టర్ మున్నాకు థ్యాంక్స్. టీమ్ అందరికీ థ్యాంక్స్. నలుగురు అమ్మాయిల్లో ఒక్కొక్కరిలో ఒక్కో హిడెన్ టాలెంట్ ఉంది.’’ అని అన్నారు.

తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్

సాంకేతిక బృందం:
దర్శకుడు: మున్నా ధులిపూడి
బ్యానర్స్: నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్
నిర్మాతలు: శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
సినిమాటోగ్రాఫర్: గణేష్
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
పీఆర్వో: తేజస్వి సజ్జ

Actor Praveen interview about SJ Movies Harror Thriller Movie ‘Bakāsura Restaurant’

వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్‌. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హారర్‌ థ్రిల్లర్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ రకాల అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 8న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా నటుడు ప్రవీణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది..

‘బకాసుర రెస్టారెంట్‌ ఎలాంటి కథ?
ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్‌ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్‌ ఎలా ఫుల్‌ఫిల్‌ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

మీ పాత్ర చుట్టే కథ నడవడం, మీరు హీరోగా నటించడం వల్ల ఎమైనా ప్రెజర్‌గా ఫీలవుతున్నారా?
నిజం చెప్పాలంటే ఇది కొంచెం బరువే. పర్‌ఫార్మెన్స్‌ వైజ్‌ నాది రెగ్యులర్‌ పాత్ర కాదు. కథలో హారర్‌, థ్రిల్లర్‌, మైథాలజీ ఇలా అన్నీ మిక్స్‌ అయ్యాయి. ఐదు పాత్రలున్న కథను నడిపించే పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది. అయితే సినిమాను దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. అయితే సినిమాను మంచి ప్రమోషన్‌తో బయటికి తీసుకరావాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో నాకు సినీ పరిశ్రమలోని అందరూ సహకరిస్తున్నారు.

అంటే ఈ సినిమాలో మీ పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందా?
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. నా పాత్రలో ఎమోషన్‌ను పండించడమే నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఓ పెయిన్‌ఫుల్‌ ఎమోషన్‌తోనే ఈ కథ ఎండ్‌ అవుతుంది.

తిండిబోతు దెయ్యం మిమ్ములను ఇబ్బంది పెడుతుందా?
ఇదొక కాన్సెప్ట్‌ కథ. ఆ తిండిబోతు దెయ్యం పెట్టే ఇబ్బంది చాలా ఎంటర్‌టైనింగ్‌గా.. ఎమోషన్‌ల్‌గా ఉంటుంది.

బడ్జెట్‌ విషయంలో మీరు ఏమైనా సలహాలు ఇచ్చారా?
అనుకున్న బడ్జెట్‌ కంటే కొంచెం ఎక్కువైనా అవుట్‌పుట్‌ చాలా సంతృప్తిగా ఉంది. సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది.

కమెడియన్‌గా హీరోగా మారితే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయోనని అంటుంటారు?
అలాంటిదేమీ లేదు. అసలు నేను హీరోగా ఫీలయితే అలాంటి ఫీలింగ్‌ అందరిలో వస్తుంది. నేను ఓ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తున్నాననే భావనలో మాత్రమే ఉన్నాను .ప్రస్తుతం నేను విశ్వంభర, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, మాస్‌ జాతర, లెనిన్‌, ఆకాశంలో ఓ తార చిత్రాలతో బిజీగా ఉన్నాను. నాకు దర్శకుడి ఎలాంటి పాత్రను ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

దిల్‌ రాజు గారు ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారని తెలిసింది?
శిరీష్‌ గారు సినిమా చూసి మంచి కథను ఎంచుకున్నారు అన్నారు. సినిమా ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఎస్వీసీ ద్వారా విడుదల చేస్తున్నాం.

ఈ సినిమాలో ఉండే స్పెషాలిటీ ఏమిటి?
ముఖ్యంగా పతాక సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. మన జీవితంలోకి వచ్చిన మంచి స్నేహితుడు అనివార్యా కారణాల వల్ల వెళ్లిపోవాల్సి వస్తే మనలో ఓ పెయిన్‌ ఉంటుంది. ఈ కైండ్‌ ఆఫ్‌ ఎమోషన్‌ ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇది అందరి హృదయాలకు హత్తుకుంటుంది.

సినిమాలో లీడ్‌ రోల్‌ చేయడం ప్లెజర్‌గా ఫీలవుతున్నారా? లేక ప్రెజర్‌గా ఉందా?
వర్క్‌లో ఉన్న ప్రెజర్‌ని ప్లెజర్‌గా మార్చుకోవడమే నాకు తెలిసింది. ఏ సినిమాకైనా కష్టం ఉంటుంది.

భవిష్యత్‌లో మళ్లీ ఎలాంటి సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తారు?
అన్ని పాత్రలు చేస్తాను. కానీ లీడ్‌ రోల్‌ మాత్రం ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయాలని వుంది. ఎందుకంటే కమెడియన్‌గా ఇమేజ్‌ ఉన్న మేము. లీడ్‌ రోల్‌ చేస్తే మోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ఆ తరహాలోనే సినిమాలు చేస్తాను.

ఈ సినిమాను చూసి థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్‌కు కలిగే ఫీలింగ్‌ ఏమిటి?
థియేటర్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంజాయ్‌ చేసి… పతాక సన్నివేశాలు చూసిన తరువాత ఓ మంచి ఎమోషన్‌తో.. కాసేపు అదే ఫీల్‌లో థియేటర్‌ నుంచి బయటికొస్తాడు.

“Sattamum Needhiyum”web series Success Celebretions held grandly in Hyderabad

india’s premier home-grown digital entertainment platform, ZEE5, continues to carry its legacy as the top destination for quality original content. With a strong line-up of blockbuster films and web series across languages, ZEE5 has added yet another jewel to its crown with the blockbuster success of its latest Tamil original series, Sattamum Needhiyum.

Premiered on ZEE5 on July 18, Sattamum Needhiyum struck a powerful chord with viewers, thanks to its engaging courtroom drama, intense emotional arcs, and socially relevant themes. The show received an overwhelming response from audiences and quickly topped streaming charts on ZEE5, becoming a favourite among viewers.

Riding on the acclaim and success of the Tamil version, ZEE5 made the series available in Telugu and Hindi from August 1, allowing more viewers across the country to experience this impactful story. Upon release, the series received an equally enthusiastic response from Telugu and Hindi audiences.

To celebrate the pan-India success, the team hosted a success meet in Hyderabad today, in the presence of the show’s cast and crew. Prominent businessman AGR attended the event as the chief guest.

Directed by debutant Balaji Selvaraj and produced by Prabhakaran and Sasikala Prabhakaran under the 18 Creators banner, Sattamum Needhiyum marks the return of popular Tamil actor Saravanan to a lead role after 15 years. The series also features Namritha, Aroul D Shankar, Shanmugham, Thiruselvam, Vijayashree, and Iniya Ram in pivotal roles.

Speaking at the event, producer Sasikala Prabhakaran said, “I am new as a producer and I thank my husband Prabhakaran for making this possible. I am grateful to everyone who supported the launch of Sattamum Needhiyum in Telugu. Without my team’s support, making this project wouldn’t have been possible. We shot this project in just 13 days, and that wouldn’t have been possible without our director. Saravanan sir is the backbone of the project who carried it on his shoulders. We want to work with him again and again. Prabhakaran’s passion and dedication for this project is amazing. More than anyone else, I know how much this project meant to him.”

Director Balaji Selvaraj said, “I thank everyone who was a part of this project. I enjoyed working with the entire cast and crew. Hope you enjoy the show.”

Tamil and Malayalam ZEE5’s Business Head and Senior Vice President – Marketing South, Lloyd Xavier, shared, “Sattamum Needhiyum was our first project this financial year in Tamil. In less than 10 days, we achieved 100 million streaming minutes. This is what happens when producers get into the skin of the game. The producers were great in both production and marketing. After its success in Tamil, we launched it in Telugu and Hindi. We want everyone here to support our project.”

The show’s lead actor Saravanan said, “I know a bit of Telugu, thanks to my classmates from the Telugu states when I was studying at the Madras Film Institute. Just like how it became a big hit in Tamil, it became a big hit in Telugu as well. Thanks to everyone who loved it.”

Producer Prabhakaran said, “Thanks to ZEE for supporting this project. Thanks to everyone who liked the project and encouraged it.”

Tune into ZEE5 right away and enjoy the intriguing courtroom drama Sattamum Needhiyum, streaming exclusively in Tamil, Hindi, and Telugu.

‘Tribanadhari Barbarik’ will be released on August 22nd to celebrate the birthday of Megastar Chiranjeevi: Sathyaraj

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. రమేష్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. కెమెరా యాంగిల్‌తోనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. అలా దర్శకుడు, కెమెరామెన్ కలిసి అద్భుతం చేశారు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ పాత్రల్ని కాకుండా ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఉదయ భాను మాట్లాడుతూ .. ‘నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ గారు నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ గారు నెరేట్ చేసినప్పుడు ఆ కథ, ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది. విజయ్ పాల్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే ఇంకెంతో మందిని పైకి తీసుకు వస్తారు. వశిష్ట చాలా మంచి వ్యక్తి. క్రాంతి ఎనర్జీ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. సాంచీ, మేఘన అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. రమేష్ గారు మా అందరినీ చక్కగా చూపించారు. సత్య రాజ్ గారితో పని చేయడం మా అదృష్టం. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి మేమంతా ఎంతో నేర్చుకున్నాం. ఈ చిత్రం అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ నాకెంతో ప్రత్యేకం. మోహన్ గారు చెప్పిన కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. ఇది చిన్న సినిమా అని మోహన్ నాకు ఓ కథ చెప్పారు. కానీ సెట్ మీదకు వచ్చిన తరువాత ఇది చిన్న సినిమా కాదని నాకు అర్థమైంది. ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన మోహన్ గారికి థాంక్స్. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నన్ను ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. ఇందులో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఉదయ భాను గారి ఆరా నెక్ట్స్ లెవెల్. క్రాంతి, సాంచీ, మేఘన, కార్తికేయ అందరూ అద్బుతంగా నటించారు. ఈశ్వర్ కొరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామెన్ రమేష్ గారు పని రాక్షసులు. నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదెల మాట్లాడుతూ .. ‘మా ‘బార్బరిక్’ చిత్రం ఆగస్ట్ 22న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. మా మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘కెమెరా అనే అస్త్రం ఉన్న మీడియానే మా చిత్రాన్ని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లాలి. అందుకే మాకు మీడియానే ‘బార్బరిక్’. ‘నీ వల్లే నీ వల్లే’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే మొదటి బాణం. ‘అనగా అనగా’ అనే పాట రెండో బాణం. ‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ మూడో బాణాన్ని వదిలాం. విజయ్‌ పాల్ రెడ్డి గారు క్లారిటీతో డబ్బులు పెట్టారు. కమిట్మెంట్‌తో నేను ఈ మూవీని చేశాను. క్లారిటీ, కమిట్మెంట్, కంటెంట్ ఉన్న చిత్రమిది. మా బాస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

క్రాంతి కిరణ్ మాట్లాడుతూ .. ‘‘బార్బరిక్’ చిత్రంలో నేను దేవ్ అనే ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతోంది. ఇదే మాకు పర్ఫెక్ట్ డేట్ అని అనిపించింది. ఇప్పటికే ఈ మూవీని చూశాను. మంచి కథ, మంచి కంటెంట్, ఎమోషన్ అన్నీ కూడా మా చిత్రంలో ఉన్నాయి. ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది’ అని అన్నారు.

సాంచీ రాయ్ మాట్లాడుతూ .. ‘మా బార్బరిక్ చిత్రం ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘మా ‘బార్బరిక్’ చిత్రంలో నేను ప్రదీప్ అనే ఓ ఇంపార్టెంట్ పాత్రలో పోషించాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 22న మా మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ మేఘన మాట్లాడుతూ .. ‘నేను నటించిన ‘బార్బరిక్’ చిత్రం మన బాస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ .. ‘నేను బాహుబలికి పని చేశాను. ఆ టైంలో సత్య రాజ్ గారితో పరిచయం ఏర్పడింది. నేను పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలు చేశాను. ఆ తరువాత మోహన్ నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పారు. బార్బరిక్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఇది చాలా కొత్త పాయింట్. ఇలాంటి ఓ సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ పాల్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 22న రాబోతోన్న చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ .. ‘మా టీజర్‌ను అందరూ ఆదరించారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ప్రకటించాం. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అని ఆ డేట్ అందరికీ గుర్తుంటుందని ఆగస్ట్ 22న విడుదల చేయబోతోన్నాం. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. కంటెంట్ ఉన్న సినిమాల్ని చూడాలని అనుకుంటే మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ .. ‘నేను ఈ చిత్రంలో అన్ని పాటల్ని కంపోజ్ చేశాను. గతంలో ఉదయభాను గారు హోస్ట్ చేసిన షోలో కంటెస్టెంట్‌గా చేశాను. ఇప్పుడు ఆమెకు ఓ పాటను కంపోజ్ చేశాను. వశిష్ట గారిని రొమాంటిక్ యాంగిల్ చూపించిన క్రెడిట్ నాకే దక్కింది. సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి, విజయ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 22న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.