Home Blog Page 64

Director Shiva interview about Hunger Comedy Entertainer Movie ‘Bakasura restaurant’

‘బకాసుర రెస్టారెంట్‌’ అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన యమలీల, ఘటోత్కచుడులా ఆడియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే కథ ఇది. ఇలాంటి కొత్త కథలనే జనాలు ఆదరిస్తారనే నమ్మకం వుంది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది కథ. సినిమా మొత్తం కంప్లీట్‌ ప్యాకేజీలా ఉంటుంది. హారర్‌ థ్రిల్లర్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ ఉంటాయి’ అంటున్నారు దర్శకుడు ఎస్‌జే శివ. ఆయన దర్శకత్వంలో కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సందర్బంగా దర్శకుడు ఎస్‌జే శివతో జరిపిన ఇంటర్వ్యూ ఇది.

బకాసుర రెస్టారెంట్‌ ఎలాంటి కథాంశం ?
బకాసుర ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది ఒక హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇప్పటి వరకు తెలుగులో చాలా జోనర్‌లు వచ్చాయి. ఇదొక కొత్త జోనర్‌. మా సినిమాతోనే ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. ఇదొక తిండిబోతు కథ. దానిని నుంచి వచ్చే కామెడీ కాబట్టి హంగర్‌ కామెడీ అంటున్నాం. ఫైనల్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే మా లక్ష్యం.

ఈ సినిమాలో హీరోగా కమెడియన్‌ ప్రవీణ్‌ను తీసుకోవడానికి కారణం ఏమిటి?
మొదట వేరే హీరోలతో డిస్కస్‌ చేశాం. కానీ అందరూ సోలో హీరో కథలైతే చేస్తాం అన్నారు. కానీ ఈ కథ అలాంటిది కాదు. ఆ సమయంలోనే ప్రవీణ్‌ కూడా హీరోగా ఇంట్రడ్యూస్‌ అయ్యే ప్లానింగ్‌లో వున్నాడని తెలిసి ఆయన్నీ కలిశాం.ఐదుగురు బ్యాచిలర్స్‌ మధ్య జరిగే కామెడీ కథ ఇది. ఇక ఈ కథ వినగానే ప్రవీణ్‌ ఈ సినిమాకు కథే హీరో.. తప్పకుండా మనం చేద్దా అన్నాడు.

మీ నేపథ్యం ఏమిటి?
నేను లండన్‌లో ఇంటర్నేషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశాను. విరూపాక్ష చిత్రానికి అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశాను. ఇక గతంలో మా నాన్న గారు కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన కోరిక, ఆయన కల తీర్చడం కోసమే నేను దర్శకుడిగా, మా అన్నయ్య నిర్మాతగా మారాడు.

ఇది బకాసుర రెస్టారెంట్‌లో జరిగే కథనా?
రెస్టారెంట్‌ పెట్టడమే కథ. రెస్టారెంట్‌ పెట్టాలని కలలు కనే ఓ యువకుడి కథ ఇది. ఈ అంశానికి హారర్‌, థ్రిల్లింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ అంశాలు జోడించాం. ఇదొక క్లీన్‌ కామెడీ.. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమిది.

ఇదొక కొత్త జానర్‌.. ఎక్స్‌పెరిమెంట్‌ అనుకోవచ్చా?
నిజమే ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ అనుకోవచ్చు. ఇంతకు ముందు వచ్చిన యమలీల, ఘటోత్కచుడులా ఆడియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే కథ ఇది. ఇలాంటి కొత్త కథలనే జనాలు ఆదరిస్తారనే నమ్మకం వుంది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది కథ. సినిమా మొత్తం కంప్లీట్‌ ప్యాకేజీలా ఉంటుంది. హారర్‌ థ్రిల్లర్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ ఉంటాయి.

ఈ సినిమాను దిల్‌రాజు గారు పంపిణీ చేస్తున్నారని తెలసింది?
అవును. శిరీష్‌ గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా కథ గురించి ఆయన మాతో గంటసేపు డిస్కషన్‌ చేశాడు. ఎస్వీసీ లాంటి గొప్ప సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది

కొత్తకథతో, స్టార్స్‌ లేకుండా ఇంత బడ్జెట్‌ అవసరమా? అనే వారికి మీ సమాధానం?
కథను నమ్మి ఈ సినిమాను చేశాం. పెద్ద హీరోలను పెట్టిన రిటర్న్స్‌ వస్తాయని గ్యారంటిగా చెప్పలేని రోజులివి. పెద్ద హీరోకు ఇవ్వాల్సిన పారితోషికం మేము మేకింగ్‌లో పెట్టాం. క్వాలిటీగా సినిమా తీశాం. కంటెంట్‌ బాగుంటే సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయని ఎన్నో సినిమాలు ప్రూవ్‌ చేశాయి.

ఈ సినిమా కథకు ఎవరూ కనెక్ట్‌ అవుతారు?
ముఖ్యంగా అందరికి తమ బ్యాచ్‌లర్‌ లైఫ్‌ గుర్తొస్తుంది. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ పాత్రలో బకాసురగా కనిపిస్తాడు.

మీ తొలి సినిమా అనుభవం ఎలా ఉంది?
సినిమా తీయడం చాలా టఫ్‌.. ఇక్కడ సినిమా బిజినెస్‌లో ఎవరైనా కథ ఏమిటి? ఎలా ఉండబోతుంది? అని అడగటం లేదు. ప్యాడింగ్‌ ఎవరు? ఎంత పెట్టారు? ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌ కానీ దాని గురించి తప్ప అన్నీ అడుగుతున్నారు.

భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలను తీస్తారు?
నాకు విఠలాచార్య లాంటి సినిమాలు అంటే ఇష్టం. ఆ తరహా కథలతో సినిమాలు తీయాలని వుంది. ప్రస్తుతం నా దగ్గర ఓ ఫ్యాక్షన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథ ఉంది. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు ఆడియన్స్‌ సినిమా చూసి చాలా గ్యాప్‌ వచ్చింది.

మీ తదుపరి చిత్రం కూడా మీ బ్యానర్‌లోనే చేస్తారం?
మా ఎస్‌జే బ్యానర్‌లో కొత్త దర్శకులకు మాత్రమే అవకాశం. సో.. నా తదుపరి చిత్రం ఇందులో ఉండదు. ఈ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేస్తాం.

బకాసుర రెస్టారెంట్‌ పార్ట్‌-2 ఉంటుందా?
లేదు. ఎందుకంటే బకాసుర పాత్ర, ఆ ఎమోషన్‌ ఈ పార్ట్‌లోనే ఎండ్‌ అవుతుంది.

దర్శకుడిగా మీ లక్ష్యం ఏమిటి?
చాలా తక్కువ వర్కింగ్‌డేస్‌లో సినిమాలు చేయడం అంటే ఇష్టం. ఈ విషయంలో పూరీ గారు నాకు ఆదర్శం. ఈ రోజుల్లో నిర్మాత డబ్బు విరాళంగా మారిపోతుందనేది నా ఫీలింగ్‌. అలా కాకుండా ఆ డబ్బును ప్రాపర్‌గా ఖర్చు పెట్టాలి. అప్పుడూ అందరూ బాగుంటారు. మా బకాసుర రెస్లారెంట్‌ ఐదు కోట్ల రూపాయాలతో తీసిన 12 కోట్ల రూపాయాల అవుట్‌పుట్‌ కనిపిస్తుంది.

Suresh Gopi & Anupama Parameswaran’s “J.S.K – Janaki V v/s State of Kerala” Streams On ZEE5 from August 15

India’s largest homegrown OTT platform, ZEE5, continues its successful run in 2025 with yet another superhit premiere. After delivering back-to-back Telugu superhits like Sankranthiki Vasthunnam, Robinhood, and Bhairavam, ZEE5 Telugu is now bringing the critically acclaimed Malayalam legal drama “J.S.K – Janaki V v/s State of Kerala” to its viewers.

Set for its digital premiere on August 15, just ahead of Independence Day, J.S.K will be available for streaming in Malayalam, Telugu, Tamil, Kannada, and Hindi, making it accessible to audiences across the country.

Starring Suresh Gopi and Anupama Parameswaran in lead roles, J.S.K is directed by Pravin Narayanan and produced by J Phanindra Kumar under the Cosmos Entertainments banner.

The gripping courtroom drama tells the story of Janaki Vidhyadharan (Anupama Parameswaran), a sexual assault survivor fighting for justice with the help of renowned lawyer David Abel Donovan (Suresh Gopi). The film explores the blurry lines between truth and justice, posing the haunting question: “What really happened to Janaki, and what does justice truly mean?”

With powerful performances and a thrilling screenplay, J.S.K is all set to strike a chord with viewers. The film features songs composed by Gireesh Narayanan and a stunning background score by Ghibran. Renadive handled the cinematography for the movie.

Catch the exclusive digital premiere of “J.S.K – Janaki V v/s State of Kerala” this August 15, only on ZEE5, and experience a gripping courtroom battle this Independence Day weekend.

Chitralayam Studios Production No.3 New Film Launched held grandly, Produced by Venu Donepudi

A new film was launched under the Chitralayam Studios banner as Production No. 3, with Venu Donepudi as the producer. The film was launched in the presence of eminent personalities from the industry. This film marks the directorial debut of Guni Manchikanti. The main cast includes Tinu Anand, Upendra, George Marian, Akshay, Vishnu, Karthikeya, Aastha, Malavika, and others. The grand launch event took place on Monday.

The event was attended by special guests including Ramesh Prasad Akkineni, Aadi Sheshagiri Rao Ghattamaneni, KS Ramarao, Director P. Mahesh Babu, KL Narayana, Tammareddy Bhardwaj, Paruchuri Gopalakrishna, B. Gopal, Kotagiri Venkateswara Rao, Madhavapeddy Suresh, Jonnavittula Ramalingeswararao, among others.

For the muhurat scene, Ramesh Prasad Akkineni handed over the script, and Aadi Sheshagiri Rao gave the clap. KS Ramarao switched on the camera, and Mahesh Babu directed the first shot. This film introduces Samruddhi, a member of the royal family of Nepal, to the Telugu film industry. The film is scheduled to be shot in exotic locations. The film unit has promised to reveal more exciting updates soon.

Cast:
Tinu Anand, Upendra, George Marian, Akshay, Karthikeya, Abhinav, Harsha, Krishna Kishore, Aastha, Malavika, Samruddhi, Vishnu Oye, KL Damodar Prasad, Aneesh Kurivilla, Kadambari Kiran, and others.

Technical Team:

Banner: Chitralayam Studios,,

Producer: Venu Donepudi,,,
Co Producer: Kondal Jinna,
Director: Guni Manchikanti,
Music: Stephen, Anand,
Art: Saahi Suresh
Editing: Vijay Muktavarapu
Cinematography: Ajay Abraham George
Executive Producer: Vaisakh Nair
Co-Director: Krishna Kishore
Costumes: Priyanka
Choreography: JD Master
Action: Nataraj
PRO: Mohan Tummala

Naresh Agastya & Faria Abdullah’s Dark Comedy Thriller ‘Gurram Paapireddy’ Teaser Launched held Grandly

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ జయకాంత్ మాట్లాడుతూ – ఈ రోజు మా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. తెలుగులో వస్తున్న డిఫెరంట్ డార్క్ కామెడీ చిత్రమిది. సినిమా మొత్తం జాయ్ రైడ్ లా ఉంటుంది. నేను మురళీ ఈ మూవీని స్టార్ట్ చేశాం. బడ్జెట్ కొంచెం ఎక్కువైంది. అప్పుడు వేణు, అమర్ ముందుకొచ్చి మనం ఎంత బడ్జెట్ అయినా చేద్దాం అని సపోర్ట్ చేశారు. సంధ్యక్క లేకపోతే ఈ మూవీ కంప్లీట్ అయ్యేది కాదు. మా సినిమాకు యోగి బాబు గారు సహా మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను మీరంతా సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ – మేము ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. వేణుకు నాకు సినిమా మేకింగ్ మీద ప్యాషన్ ఉండేది. మన డ్రీమ్ ను ఎందుకు ఫుల్ ఫిల్ చేసుకోకూడదు అని ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాం. సినిమా బాగా వచ్చింది. నరేష్ అగస్త్యకు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. కామెడీ మూవీని బ్రహ్మానందం గారు, యోగి బాబు గారు లేకుండా ఊహించలేం. వారిద్దరు మా సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. అలాగే చిట్టిగా మనకు చాలా దగ్గరైన ఫరియా మా మూవీతో మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది. మా డైరెక్టర్ మురళీ మనోహర్ ప్రతిభావంతుడు. సిల్వర్ స్క్రీన్ మీద “గుర్రం పాపిరెడ్డి”తో త్వరలోనే ఒక మ్యాజిక్ చూస్తారు. అన్నారు.

మూవీ ప్రెజెంటర్ డా.సంధ్య గోలీ మాట్లాడుతూ – ఒక కొత్త తరహా పాయింట్ తో “గుర్రం పాపిరెడ్డి” సినిమాను నిర్మించాం. యూనిక్ డార్క్ కామెడీ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ టీమ్ తో ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. బ్రహ్మానందం, యోగిబాబు వంటి లెజెండ్స్ తో వర్క్ చేశాం. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్ గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట యోగిబాబు. ఇలా వీళ్లందరితో కలిసి నటించడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరియా సహా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు వంశీ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా షూటింగ్ చాలా ఫన్ గా సాగింది. మేమంతా ఆ ప్రాసెస్ ను ఎంజాయ్ చేశాం. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు లాంటి పెద్దలతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ అందరినీ థ్రిల్ చేస్తుంది. అన్నారు.

నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా గురించి నెక్ట్స్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ వింటారు. ఈ చిత్రంలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎనర్జిటిక్ గా వర్క్ చేశారు. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

డీవోపీ అర్జున్ రాజా మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం లాంటి లెజెండ్ ను నా కెమెరా ద్వారా చూపించడం గౌరవంగా భావిస్తున్నా. యోగి బాబు గారి మూవీకి గతంలో అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశాను. ఈ చిత్రంలో ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా పెద్ద విజయం సాధించాలి. త్వరలో థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

నటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మురళీ మనోహర్ కు థ్యాంక్స్. ఈ చిత్రంలో యోగి బాబు, బ్రహ్మానందంతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, క్రైమ్..ఇలా అన్ని ఎలిమెంట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ మూవీ అనుకున్నప్పుడు జయకాంత్ ముందుండి, వేణు, అమర్ , సంధ్య గారిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి పనిచేశారు. నరేష్, ఫరియా నుంచి దాదాపు 9 మంది టాప్ ఆర్టిస్టులు ఈ మూవీకి కంప్లీట్ గా సపోర్ట్ చేశారు. వాళ్లందరి సపోర్ట్ వల్లే సినిమా అనుకున్నట్లుగా సరైన టైమ్ లో కంప్లీట్ చేశాం. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ద్వారానే కథ నెరేట్ అవుతుంది. ఆయన ద్వారానే ఈ పాత్రలన్నీ పరిచయం అవుతాయి. “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహా మా టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడమ్ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది. “గుర్రం పాపిరెడ్డి” సక్సెస్ మీట్ లో తప్పకుండా తెలుగులో మాట్లాడుతా. అన్నారు.

నటుడు రాజ్ కుమార్ కాసిరెడ్డి – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ లో మీరు కాస్త ఫన్ చూశారు. మూవీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారు లాంటి పెద్దలు మా గురించి మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్లు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. మేము కూడా మీతో పాటే బిగ్ స్క్రీన్ మీద టీజర్ చూశాం. తన విజన్ లో మమ్మల్ని పార్ట్ చేసిన మా డైరెక్టర్ మురళీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో సౌధామిని అనే పాత్రలో నటించాను. బ్రహ్మానందం, యోగి బాబు వంటి పెద్దలతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నేను ఒప్పుకునేందుకు నరేష్ అగస్త్య ఒక రీజన్. ఇలాంటి మంచి నటుడితో మూవీ చేయాలని అనిపించేది. ఈ సినిమాలో నటించేప్పుడు ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. మా మదర్ ఈ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమాకు వర్క్ చేయడం సూపర్ ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది. ఇందులో ఒక సాంగ్ చేస్తున్నా, ఆ పాట స్పెషల్ గా ఉంటుంది. అన్నారు.

హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో నేను హీరో అంటున్నారు గానీ నేనొక్కడినే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారి లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. అందుకే ఈ కథ వినగానే ఒప్పుకున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకా మాట్లాడుతాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్
డీవోపీ – అర్జున్ రాజా
మ్యూజిక్ – కృష్ణ సౌరభ్
సమర్పణ – డా. సంధ్య గోలీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్)
నిర్మాతలు – వేణు సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం – మురళీ మనోహర్

‘Indian Real Hero’ Sonu Sood Grand Launched by ‘Alphalete’ Health Supplements,Miss India Manasa Varanasi joins his event

With a mission to provide India with the most transparent, lab-tested health supplements that meet American quality standards, the brand ‘Alphalete’ has officially entered the market. The grand launch event, held at the Trident Hotel in the city, was graced by the ‘Indian Real Hero’ Sonu Sood, who unveiled the brand as the chief guest.

Adding to the glamour of the launch ceremony, Miss India Manasa Varanasi joined Sonu Sood as a guest of honor. Alphalete, introduced with the slogan “Authentic – Exclusive – Performance,” made it clear that its primary goal is to provide the public with superior supplements that promote good health.

Speaking on the occasion, Sonu Sood said:
“I am delighted to launch a wonderful brand like Alphlete in Hyderabad. My heartfelt congratulations to the founders, Suresh Shukla and Sravan Ghanta.

Today’s youth are incredibly focused on fitness. However, the menace of adulterated supplements in the market has grown just as rapidly, which is a matter of great concern. Consuming the wrong supplements can cause serious harm instead of providing any health benefits.

At a time like this, Alphlete’s mission to offer high-quality products with complete transparency, lab testing, and American standards is commendable. While supplements play a key role in fitness, choosing the right one is even more important. The attention Alphlete pays to quality demonstrates its responsibility towards its consumers.

I urge fitness enthusiasts and the youth to make informed decisions and choose trustworthy brands. I am confident that Alphlete will live up to that trust. I sincerely wish this brand great success,” he stated.

“Our Goal is to Build Trust in the Indian Market” –

Alphalete’s Founder & CEO, Suresh Shukla, explained, “The Indian supplement market has long suffered from a lack of credibility and transparency. We founded Alphalete to fill this gap. With an MBA from the USA and a personal passion for fitness and bodybuilding, I launched this brand with the aim of providing Indian consumers with 100% authentic, QR-code verified, lab-tested supplements that adhere to US standards.”

“This is Not Just a Business, It’s a Movement”

Alphalete Co-Founder & CFO, Sravan Ghanta, said, “I was inspired by Suresh Shukla’s vision and mission, which is why I joined him on this journey. Our objective is to build a reliable brand that does not compromise on quality and strives for the well-being of the community. Alphlete is not just a business; it’s a movement for public health and empowerment.”

The organizers reiterated that their products are released into the market only after comprehensive lab testing and that they strictly follow American standards for quality.

The event was held in a highly energetic atmosphere and was attended by numerous fitness experts, health influencers, and media representatives. The launch is currently creating a buzz on social media with the hashtag #iamalphalete.

From the Makers of ‘KA’: A New-Age Concept Film ‘Sri Chidambaram’ Title Glimpse Unveiled

కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన ‘క’ చిత్రం ఎంతటి సన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రంగా నిలిచిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ‘క’ చిత్రాన్ని నిర్మించిన మేకర్స్‌ మరో డిఫరెంట్‌ అండ్‌ న్యూ ఏజ్‌ కాన్సెప్ట్‌ ఫిల్మ్‌తో రాబోతున్నారు. శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్‌ రత్నం దర్శకుడు. వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను సోమవారం కథానాయకుడు కార్తీకేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ” యంగ్‌స్టర్స్‌ అంతా కలిసి చేసిన ఫ్రెష్‌ ఫీల్‌ వున్న చిత్రమిది. మెల్లకన్ను ఉన్న యువకుడు ఇన్‌సెక్యూర్‌తో కళ్ళద్డాలు పెట్టుకుని లైఫ్‌ని మేనేజ్‌ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి లవ్‌లో పడితే ఏం జరుగుతుంది అనే ఓ ఫన్‌ డ్రామా చుట్టు జరిగే కథ ఇది. బ్యూటిఫుల్‌ విలేజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిది’ అన్నారు.

వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, కల్పలత గార్లపాటి, తులసి, కిట్టయ్య, గోపీనాథ్‌ (గోపీ హ్యాపీ), శివకుమార్‌ మట్ట, అరుణ్‌కుమార్‌, శంకర్‌, నాయుడు ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

రచన & దర్శకత్వం- వినయ్ రత్నం
నిర్మాత – చింతా వినీషా రెడ్డి,చింతా గోపాలకృష్ణ రెడ్డి
సహ నిర్మాత- చింతా రాజశేఖర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్- అక్షయ్ రామ్ పొడిశెట్టి
ఎడిటర్-అన్వర్ అలీ
సంగీతం-చందు & రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షేక్ రజాక్ ,T.కార్తీక్ రెడ్డి
సింక్ సౌండ్ & డిజైన్ – V స్వప్నిక్ రావ్
ఆర్ట్ డైరెక్టర్ – విష్ణు వర్ధన్ పుల్ల
సౌండ్ మిక్సింగ్ – విష్ణు సుజాతన్
కో-రైటర్ – రామ్ చరణ్ సత్తిరాజు
లైన్ ప్రొడ్యూసర్ – అఖిలేష్ రేలంగి
ప్రొడక్షన్ మేనేజర్ – శ్రావణ్ కుమార్ కుంపట్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – తేజస్విని
కలరిస్ట్ – K విష్ణువర్ధన్
VFX – రిషి మామిడాల
పబ్లిసిటీ డిజైన్స్ – RC DESIGNS
మార్కెటింగ్ – హౌస్ఫుల్
పిఆర్ఓ – ఏలూరు శ్రీను, మాడూరి మధు

Heroine Malavika Mohanan Birthday wishes poster Unveiled from “Raja Saab”

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో చీరకట్టులో ట్రెడిషనల్ గా కనిపించి ఆకట్టుకుంటోంది మాళవిక. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన “రాజా సాబ్” టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీలో మాళవిక నటన, అందం ప్రత్యేక ఆకర్షణ కానుంది.

“రాజా సాబ్” లాంటి క్రేజీ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది మాళవిక మోహనన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “రాజా సాబ్” సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Vijay Deverakonda’s “Kingdom” rules the box office with over ₹82 Cr worldwide gross in just 4 days

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 82 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. వీకెండ్, వీక్ డేస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ తో ఈ సినిమా రన్ అవుతోంది. ఫస్ట్ వీక్ కింగ్డమ్ రికార్డ్ కలెక్షన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఓవర్సీస్ లో కూడా కింగ్డమ్ భారీ వసూళ్లు సాధిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల ఏ తెలుగు చిత్రానికి దక్కని ఆదరణ కింగ్డమ్ కు వస్తోంది. ఈ సినిమా 100 కోట్ల రూపాయల మార్క్ కు చేరువలో ఉంది. ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన కింగ్డమ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Director Gowtam Tinnanuri interview about Vijay Deverakonda’s ‘KINGDOM’ Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కింగ్‌డమ్ విడుదలకు ముందు, విడుదల తరువాత ఎలా ఉన్నారు?
విడుదలకు ముందు చివరి నిమిషం వరకు కూడా తుది మెరుగులు దిద్దడానికి ప్రయత్నిస్తుంటాం. దాని వల్ల నిద్ర కూడా సరిగా ఉండదు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను.

కింగ్‌డమ్ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
ఏ సినిమాకైనా కథ రాసేటప్పుడు మొదట ఒక టైటిల్ అనుకుంటాం. జెర్సీ సినిమాకి కూడా మొదట అనుకున్న టైటిల్ 36. ఆ తర్వాత జెర్సీ టైటిల్ పెట్టాం. అలాగే, కింగ్‌డమ్ కథ రాసే సమయంలో కూడా కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇందులో తెగ నాయకుడి పేరు ‘దేవర నాయక’. దాంతో అదే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ, ఎన్టీఆర్ గారి దేవర రావడంతో.. మరో కొత్త టైటిల్ చూశాం. ‘యుద్ధకాండ’ అనే టైటిల్ ను పరిశీలించాం కానీ, చివరికి ‘కింగ్‌డమ్’ని ఖరారు చేశాం. కింగ్‌డమ్ అయితే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. నా దృష్టిలో కింగ్‌డమ్ అంటే మనకి కావల్సిన వాళ్ళందరూ ఉండే ప్రాంతం లేదా మనం సురక్షితంగా ఉండే ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇల్లు లాంటిది.

హృదయం లోపల పాటను తొలగించడానికి కారణం?
సినిమా విడుదలైన తరువాత.. అది చాలా పాపులర్ సాంగ్ కదా, దానిని ఎందుకు తొలగించారని అందరూ అడుగుతున్నారు. ఓటీటీ వెర్షన్ లోనైనా జోడించమని అడుగుతున్నారు. కథ రాస్తున్నప్పుడు ఆ సాంగ్ అవసరం అనిపించింది. కానీ, ఎడిటింగ్ సమయంలో కథ గమనానికి అడ్డంకిగా సాంగ్ మారింది అనిపించింది. అందుకే నేను, ఎడిటర్ నవీన్ నూలి గారు, నాగవంశీ గారు, విజయ్ గారు అందరం చర్చించుకొని.. హృదయం లోపల పాటను తొలగించాలని నిర్ణయించడం జరిగింది. ఓటీటీ వెర్షన్ లో ఆ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా జోడించే ఆలోచన ఉంది. నాగవంశీ గారితో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటాం.

ఈ కథ రాసుకున్నప్పుడే విజయ్ గారితో చేయాలి అనుకున్నారా?
ఈ కథ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఈ కథకు తగ్గ నటుడు దొరికినప్పుడు చేయాలనే ఉద్దేశంతో.. పూర్తిస్థాయిలో డెవలప్ చేయనప్పటికీ, కథను రాసి పెట్టుకున్నాను. మొదట విజయ్ గారితో చేద్దామనుకున్న కథ వేరు. కానీ, మా ప్రయాణం మొదలైన తరువాత.. విజయ్ గారికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది అని భావించి, ఆయనకు చెప్పడం జరిగింది. విజయ్ గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది.

మళ్ళీరావా, జెర్సీ సినిమాలతో ఎమోషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు. కింగ్‌డమ్ కి యాక్షన్ బాట పట్టడానికి కారణం?
ఏ కథయినా, ఏ సన్నివేశమైనా అందులో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. కింగ్‌డమ్ విషయంలో కూడా అదే సూత్రం ఫాలో అయ్యాను. ఇందులో యాక్షన్ ఉన్నప్పటికీ, దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది కాబట్టే, యాక్షన్ వర్కౌట్ అయింది.

మురుగన్ పాత్రకి కొత్త నటుడు వెంకటేష్ ని తీసుకోవడానికి కారణం?
ఈ సినిమాలో విజయ్ గారు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడ మనకు తెలిసిన నటుడు కంటే కూడా.. కొత్త నటుడైతే చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది అనిపించింది. ఈ క్రమంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేష్ పేరుని సూచించడం జరిగింది. ఆడిషన్ సమయంలో సినిమా పట్ల, నటన పట్ల వెంకటేష్ తపన చూసి.. వెంటనే ఆయనను ఎంపిక చేశాము.

సత్యదేవ్ గారి ఎంపిక గురించి?
శివ పాత్ర కోసం ముందు నుంచీ నేను సత్యదేవ్ గారినే అనుకున్నాము. కానీ, ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దానికితోడు అప్పుడు మా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఎప్పుడైతే మాకు షూటింగ్ విషయంలో స్పష్టత వచ్చిందో.. అప్పుడు సత్యదేవ్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా కథ విని, సినిమా చేయడానికి వెంటనే అంగీకరించారు.

ఈ వ్యవధిలో ‘మ్యాజిక్’ అనే సినిమా కూడా చేశారు కదా?
నాకు, వంశీ గారికి సంగీతం నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కింగ్‌డమ్ షూటింగ్ కి సమయం పడుతుండటంతో.. ఆ గ్యాప్ లో మ్యాజిక్ సినిమాని చేయడం జరిగింది. ఆ సినిమాకి ప్రధాన బలం సంగీత దర్శకుడు అనిరుధ్ గారు, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ గారు.

కింగ్‌డమ్ రెండో భాగం ఎప్పుడు మొదలవుతుంది?
రెండో భాగానికి సంబంధించిన మూల కథ ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా త్వరలో ప్రారంభిస్తాం. అయితే పార్ట్-2 కంటే ముందుగా.. మురుగన్, సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని భావిస్తున్నాము.

దర్శకుడిగా ఈ ఎనిమిదేళ్ల ప్రయాణం ఎలా ఉంది?
ఇంకొన్ని ఎక్కువ సినిమాలు చేసి ఉండాల్సింది అనిపించింది. అయితే కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు. కోవిడ్ కారణంగా రెండేళ్లు పోయాయి. అలాగే ఒక్కోసారి స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. నా తదుపరి సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Yemainade Pilla Lyrical Video Release from Mamatha Productions ‘Brahmanda’ Movie

మొట్టమొదటిసారి ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాండ. సీనియర్ నటీమణి ఆమని (Amani) ప్రధాన పాత్రలో మమత ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా రాంబాబు తొలిసారిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండీ ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు తెలంగాణ నేపథ్యంలో సాగే భావోద్వేగ భరితమైన సినిమా ఇది అని, ఈ సినిమా హీరో బన్నీరాజు తెలిపారు. అంతేకాదు డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది అని స్పష్టం చేశారు. ఈ సినిమా ఆగస్టు 22వ తారీకు విడుదల కాబోతోంది.

బ్రహ్మాండ నుండి లిరికల్ సాంగ్ అవుట్..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా నుండి  ఏమైనాదే పిల్ల’ అంటూ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం యూట్యూబ్లో అత్యంత ఆదరణ పొందుతున్న సాంగ్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. “ఏమైనాదే పిల్ల ఏమైనాదే.. ఏమైనాదే.. నీ మీదకే గాలి మళ్లిందే.. మరి ఏమైనాదే..” అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.ఒకరకంగా చెప్పాలి అంటే యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు.

ట్రెండింగ్ లో నిలిచిన ఏమైనాదే పిల్ల..

అటు లిరికల్ సాంగే కాదు ఇటు విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.అటు నటీనటుల పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ సింగర్ వరికప్పుల యాదగిరి మ్యూజిక్ అందించి ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఫిమేల్ లీడ్ కి శ్రీయా మాధురి తన అద్భుతమైన స్వరాన్ని వినిపించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ పాటకు లిరిక్స్ అందించింది కూడా వరి కప్పుల యాదగిరి కావడం గమనార్హం. కళాధర్ అందించిన కొరియోగ్రఫీ మరింత హైలెట్గా నిలిచింది.

బ్రహ్మాండ సినిమా విశేషాలు..

ఇక బ్రహ్మాండ సినిమా విషయానికి వస్తే.. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం.. ఒగ్గు అంటే శివుని చేతిలోనే ఢమరుకం అని అర్థం వస్తుంది. ఈ పదం కేవలం ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీ పదం అని కూడా చెప్పవచ్చు. ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది అని, యాక్షన్ తో పాటు డివోషనల్ థ్రిల్లింగ్ అంశాలకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు.

బ్రహ్మాండ మూవీ నటీనటులు..

ఇక ఈ సినిమాలో ఆమని, జయరాం, కొమరం బన్నీ రాజ్ , జోగిని శ్యామల, విజయ రంగరాజు, కనిక వాద్య, ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, చత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్, మీసం సురేష్, దేవి శ్రీ, ఐడ్ల మధుసూదన్ రెడ్డి, అనంత కిషోర్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

బ్రహ్మాండ మూవీ టెక్నీషియన్స్..

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్
ఎడిటింగ్ : ఎమ్మార్ వర్మ
సంగీతం : వరికుప్పల యాదగిరి
మాటలు : రమేష్ రాయి జి ఎస్ నారాయణ .
డిజైనర్ : సురేష్ బుజ్జి
మేనేజర్ : శ్రీరామ్
కొరియోగ్రఫీ :కళాధర్ ,రాజు కోనేటి(SDC) ,కిరణ్.
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి
నిర్మాత : దాసరి సురేష్
సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :రాంబాబు