Home Blog Page 65

‘Balu Gadi LoveStory’ Pre release event held grandly, Movie Releasing on Aug 8

ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘బాలుగాడి లవ్ స్టోరీ’. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాలుగాడి లవ్ స్టోరీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ‘సిల్వర్ స్క్రీన్’ గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు జర్నలిస్ట్ ప్రభు, కిషోర్ దాస్, వినోద్ చౌదరి, శబరి నిర్మాత మహేంద్రనాధ్ హీరోయిన్ మేఘన, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మానిక్ , డైరెక్టర్ తల్లాడ సాయి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ…బాలుగాడి లవ్ స్టోరీ టైటిల్ బాగుంది, సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి, కొత్త నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ వెల్ కం చెబుతోంది, ఈ సినిమాతో ఈ చిత్ర నిర్మాత ఆకుల మంజుల పెద్ద విజయం సాధిస్తుంది అలాగే నూతన దర్శకులు ఎల్.శ్రీనివాస్ తేజ్ ఈ మూవీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, కంటెంట్ బాగున్న సినిమాలు ఎప్పడూ సక్సెస్ అవుతాయి, అదే తరహాలో బాలుగాడి లవ్ స్టొరీ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత ఆకుల మంజుల మాట్లాడుతూ…మా అబ్బాయి ఆకుల అఖిల్ ఫస్ట్ టైమ్ హీరో అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను ఇలా మా అందరికి బాలుగాడి లవ్ స్టొరీ ఫస్ట్ ఫిలిం, ఈ సినిమా విజయం సాధించి మా అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ…బాలుగాడి లవ్ స్టొరీ సినిమా నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ గారు. ఘన శ్యామ్ గారు ఈ సినిమా కోసం సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు, హీరో హీరోయిన్ అఖిల్, దర్శిక మీనన్ చాలా చక్కగా నటించారు, ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలుగాడి లవ్ స్టొరీ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ….బాలుగాడి లవ్ స్టొరీ సినిమాను నిర్మాతలకు చెప్పిన వెంటనే నచ్చి వెంటనే ఓకే చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన స్పూర్తి తోనే సినిమాను డైరెక్ట్ చేశాను, ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ నటీనటులు చాలా అనుభవం కిలిగిన వారిలాగా బాగా చేశారు. ఈ సినిమాతో ఆకుల అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, అతనికి మీ అందరి ఆదరణ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ….మేము అందరూ వెయిట్ చేస్తున్న బాలుగాడి లవ్ స్టొరీ సినిమా ఆగస్ట్ 8న థియేటర్స్ లో రాబోతోంది, ప్రేక్షకులు మా సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది, డైరెక్టర్ ఎల్.శ్రీనివాస్ తేజ్ గారు సినిమాను రియల్ ఇంసిడెన్స్ తో బాగా తీశారు, మా అందరికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ దర్శిక మీనన్ మాట్లాడుతూ...నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు ఆకుల భాస్కర్ గారికి ఆకుల మంజుల గారికి దర్శకులు ఎల్.శ్రీనివాస్ తేజ్ గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది సినిమా కూడా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీ ఆకుల భాస్కర్, బ్యానర్ భామ క్రియేషన్స్, రైటర్, డైరెక్టర్ యల్. శ్రీనివాస్ తేజ్, నిర్మాత ఆకుల మంజుల, డి.ఓ.పి రవి కుమార్ నీర్ల, మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్, ఎడిటర్ యాదగిరి కంజారాల లుగా వ్యవహరిస్తున్నారు.

Hero ‘SATYADEV’ Interview about film “KINGDOM” Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన సత్యదేవ్, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘కింగ్‌డమ్’ లాంటి భారీ సినిమాలో శివ అనే పవర్ ఫుల్ రోల్ చేశారు.. స్పందన ఎలా ఉంది?
ఇప్పటిదాకా ఈ సినిమాకి వచ్చినన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడూ రాలేదు. మొదటి షో నుంచి అందరూ ఫోన్లు చేసి అభినందిస్తూనే ఉన్నారు. గౌతమ్ నాకు కింగ్‌డమ్ కథ చెప్పగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా వెంటనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. అంత నచ్చింది నాకు ఈ కథ. నా నమ్మకం నిజమై, ఇప్పుడు సినిమాకి ఇంతటి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాకి నాకు పేరొచ్చింది కానీ, అది జనాల్లోకి వెళ్ళడానికి సమయం తీసుకుంది. భారీతనం, విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి అంశాలు తోడై.. ‘కింగ్‌డమ్’ సినిమా తక్కువ సమయంలోనే ఎక్కువమందికి చేరువైంది. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను.

శివ పాత్ర మీ దగ్గరకు ఎలా వచ్చింది?
శివ పాత్ర కోసం మొదట గౌతమ్ నా పేరే రాసుకున్నారట. కానీ, ఏవో కారణాల వల్ల నన్ను సంప్రదించలేదు. మధ్యలో వేరే నటులతో కూడా చేద్దామనుకున్నారు. సరిగ్గా షూటింగ్ కి వెళ్ళడానికి కొద్దిరోజుల ముందు గౌతమ్ నన్ను కలిసి ఈ కథ చెప్పారు. కథ నాకు విపరీతంగా నచ్చి, వెంటనే సినిమా చేస్తున్నాని చెప్పాను. అప్పుడు గౌతమ్ ‘శివ పాత్ర కోసం నేను మొదట ఎవరి పేరు రాసుకున్నానో.. వాళ్ళతోనే చేస్తుండటం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ‘మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది’ అంటారు కదా.. అలాగే ఏ పాత్ర ఎవరు చేయాలనేది కూడా రాసి పెట్టి ఉంటుందేమో అనిపించింది.

ఈ సినిమాలో మీ యాక్షన్ సీన్స్ కి అద్భుతమైన స్పందన రావడం ఎలా అనిపించింది?
ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతాము. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్ కి అంత మంచి స్పందన వస్తోంది.

ఈ చిత్రంలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సీన్ ఏంటి?
విజయ్ నా తమ్ముడు అని తెలిసిన తర్వాత జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తమ్ముడంటే మనసులో ఎంతో ప్రేమ ఉన్నా.. పైకి మాత్రం అది పూర్తిగా చూపించకూడదు. ఎందుకంటే తమ్ముడు ‘నాతో ఉండిపోతాను’ అంటాడనే భయం నాలో ఉంటుంది. అసలు గౌతమ్ నా పాత్రను రాసిన తీరే అద్భుతంగా ఉంది. ఓ వైపు తమ్ముడు, మరోవైపు దివి ప్రజలు, ఇంకో వైపు ఒక నిజం తెలుసు కానీ ఎవరికీ చెప్పలేడు. ఇలా ఆ పాత్ర చుట్టూ ఎంతో ఎమోషన్ ఉంది. అందుకే డ్రామా అంతలా పండింది. సినిమాలో ఫిజికల్ గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మాత్రం ప్రీ క్లయిమాక్స్ ఎపిసోడ్. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక.. ఆ కష్టమంతా మరిచిపోయాను.

సినిమాలో ఉన్న హైలైట్స్ లో బోట్ సీక్వెన్స్ కూడా ఒకటి.. దాని గురించి చెబుతారా?
ఆ సీక్వెన్స్ కోసం కూడా చాలా కష్టపడ్డాము. నిజానికి నాకు బోట్ డ్రైవ్ చేయడం రాదు. కానీ, నన్ను నమ్మి విజయ్ బోట్ లో కూర్చోవాలి. ఆ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా దానిని నడపాలి. కుడి వైపుకి తిప్పితే ఎడమ వైపుకి వెళ్తుంది.. ఎడమ వైపుకి తిప్పితే కుడి వైపుకి వెళ్తుంది. మొదట చాలా భయం వేసింది. ఆ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడ్డాము. ఓసారి చెట్ల కొమ్మల్లోకి వెళ్ళిపోయాము, మరోసారి చెట్టు మీద పడబోయింది. దాంతో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బోట్ నడిపాను.

మురుగన్ పాత్ర పోషించిన వెంకటేష్ గురించి?
ఈ సినిమాలో విజయ్ కి, నాకు ఎంతో పేరు వచ్చిందో వెంకటేష్ కి కూడా అంత పేరు వచ్చింది. అద్భుతంగా నటించాడు. షూటింగ్ సమయంలోనే బాగా నటిస్తున్నాడని మేమందరం అనుకున్నాం. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే మాట చెప్తున్నారు. ఒక కొత్త నటుడికి ఇంత పేరు రావడం మామూలు విషయం కాదు.

విజయ్ దేవరకొండ గారి గురించి?
విజయ్ తో నాకు అంతకముందు పరిచయం లేదు. కలిసిన తర్వాత తెలిసింది విజయ్ చాలా మంచి వ్యక్తి అని. తక్కువ సమయంలోనే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విజయ్ ని నేను నిజంగానే ఒక బ్రదర్ లా ఫీల్ అయ్యాను. విజయ్ అంత మంచి వ్యక్తి కావడం, నాతో అంత మంచిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. అలాగే, విజయ్ గొప్ప నటుడు. సన్నివేశాన్ని కానీ, సంభాషణలను కానీ అతను అర్థం చేసుకొని నటించే తీరు నన్ను ఆశ్చర్యపరిచింది.

నిర్మాత నాగవంశీ గారి గురించి?
నాగవంశీ గారు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక కథను నమ్మి సినిమా చేద్దాం అనుకున్నారంటే.. ఎక్కడా వెనకడుగు వేయరు, ఏ విషయంలోనూ రాజీపడరు. పరిశ్రమలో వంశీ గారు తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకున్నారు కాబట్టే.. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంత పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. వంశీ గారంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది.

శివ పాత్రకు ఇంత పేరు రావడానికి కారణం?
మనం బాగా నటించినంత మాత్రాన మనకి బాగా పేరు రావాలని లేదు. ఆ పాత్రను రాసిన తీరు బాగుంటే.. అప్పుడు మన నటనకు ఎక్కువ పేరు వస్తుంది. శివ పాత్రను గౌతమ్ అద్భుతంగా మలిచారు. ఆ పాత్రలో ఎన్నో లేయర్లు ఉన్నాయి. ప్రేక్షకులు ఆ పాత్రలో ఉన్న ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి.. ట్రావెల్ అవుతున్నారు. గౌతమ్ యొక్క అంత అందమైన రచన వల్లే.. నా పాత్రకు ఇంత పేరు వచ్చింది.

ఈ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
ఒక్కరిని కాదు. చాలామంది ప్రశంసించారు. ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి నన్ను అభినందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

తదుపరి ప్రాజెక్ట్ లు?
అరేబియన్ కడలి అనే సిరీస్ చేశాను. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘ఆరంభం’ ఫేమ్ అజయ్‌ నాగ్‌ తోనూ ఓ చిత్రం చేస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Santosham South Indian Film Awards & OTT Awards 2025 Curtain Raiser Event held grandly

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా, రామసత్యనారాయణ స్పాన్సర్స్ సూర్య సెమ్ డైరెక్టర్స్ అనిల్ మరియు డా. సురేష్ బాబు, వి. వి. కె. హోసింగ్ ఇండియా ప్రై వెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ తదితరుల ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ విజయ వారహి మూవీస్ సంస్థ ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్ గా వ్యవహస్తున్నారు. అలాగే మ్యూజిక్ పాట్నర్ గా ఆదిత్య న్యూజిక్ వ్యవహరిసున్నారు.
ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఫంక్షన్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ – సురేష్ కొండేటితో నాకు సుదీర్ఘ కాల స్నేహం ఉంది. ఆయన మా ఇంటిని అద్దెకు తీసుకుని తన ఫ్యామిలీతో ఒక ఫ్లోర్ లో ఉంటూ మరో ఫ్లోర్ లో సంతోషం మేగజైన్ ఆఫీస్ పెట్టుకున్నారు. ఇప్పటికి 24 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా ఫిలిం మేగజైన్ నడుపుతున్నారు. ఆయన అందరికీ మిత్రులు. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ లో ఏదైనా ఈవెంట్ ఘనంగా చేయాలంటే సురేష్ చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. 24 ఏళ్లుగా సంతోషం ఈవెంట్ చేస్తున్నాం, ఆయనకు ఏం మిగులుతుందో ఏంటో తెలియదు. కష్టపడతాడు. నవ్వుతూ పలకరిస్తాడు. ఆయన సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఏడిద రాజా మాట్లాడుతూ – సురేష్ కొండేటి అందరికీ మిత్రులు. ఇందాక ఇతర అతిథులు చెప్పినట్లు అందరితో బాగుంటారు. ఆయన ఏ ఈవెంట్ చేసిన వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఆయన సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఈవెంట్ ఎంతబాగా చేయబోతున్నాడు అనేది నాకూ చూడాలని ఉంది. సురేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ – ఒక సినిమా ఈవెంట్ చేయాలంటే ప్రభుత్వాలకే పదేళ్ల టైమ్ పట్టింది. అలాంటిది ఒక్కడు, సామాన్యుడు సురేష్ కొండేటి 24 ఏళ్లుగా దిగ్విజయంగా సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ చేస్తుండటం మామూలు విషయం కాదు. ఆయనకు సినిమా పరిశ్రమలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మీడియా మిత్రులు మరింతగా అతనికి అండగా నిలబడాల్సింది. నేను ఆ టైమ్ లో సురేష్ కు ఏదో ఒకటి చేయాలని ఎఫ్ఎన్ సీసీ కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ గా నియమించాను. కానీ ఏ రోజు సురేష్ బాధపడటం నేను చూడలేదు. నవ్వుతూనే ఉన్నాడు. ఈ 24వ అవార్డ్స్ ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

సీనియర్ నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ – 24 ఏళ్లుగా అవార్డ్స్ ఈవెంట్ చేస్తున్న ఏకైక మేగజైన్ సంతోషం. సౌత్ ఇండియాలో ఫిలింఫేర్ తప్ప మరో మేగజైన్ ఏదీ కూడా ఇంత సుదీర్ఘ కాలం అవార్డ్స్ ఫంక్షన్స్ చేయలేదు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెట్టిన అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా సక్సెస్ కాలేదు. కానీ సురేష్ ఒక్కడు ఎంతో కష్టపడి 24వ సారి ఈవెంట్ చేస్తున్నాడు. తెలంగాణలో పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. ఏపీలో త్వరలో ఫిలిం అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. సూర్య చంద్రులకు గ్రహణం పట్టినంత మాత్రాన వారికేం కాదు. అలాగే ఏవో కష్టాలు వచ్చినందుకు సురేష్ కు కూడా ఏం కాదు. నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, సురేష్ యూట్యూబ్ లో ఇస్తున్న ఫిలిం న్యూస్ డైలీ చూస్తాను. అవి చూస్తే నాకు ఇండస్ట్రీలోని ప్రతి అప్డేట్ తెలుస్తుంది. ఈసారి ఈవెంట్ కు స్పాన్సర్స్ ను ఇస్తున్న మా విజయ్ కుమార్ గారికి మిగతా వారందరికీ థ్యాంక్స్. అలాగే మేమంతా సురేష్ తో ఉన్నాం. ఈ సారి ఈవెంట్ ఘనంగా చేయడానికి సపోర్ట్ చేస్తాం. అన్నారు.

వి. వి. కె. హోసింగ్ ఇండియా ప్రై వెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ మాట్లాడుతూ – సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025కు స్పాన్సరింగ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. నేను గతంలో చాలా ఫంక్షన్ చేసాను ఎక్కువ సంతృప్తిని ఈ సంతోషం ఫిలిం అవార్డ్స్ కు స్పాన్సర్ గా ఉండటం వల్లే కలుగుతోంది. సంతోషం అవార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఏదో సాధించామనే గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. ఎంతోమందిని ఈ అవార్డ్ తో ప్రోత్సహిస్తున్నారు సురేష్ కొండేటి. ఈ నెల 16న జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగే సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గతంలో ఎప్పుడూ జరగనంత ఘనంగా జరగాలని, అందుకు మనమంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

సూర్య సెమ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ – ఒక పనిని ఇన్నేళ్లుగా పట్టుదలగా చేయడం సాధారణ విషయం కాదు. సురేష్ కొండేటి గారు 24 ఏళ్లుగా అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించడం గొప్ప విషయం. ఆయనకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఈసారి ఈవెంట్ కూడా ఘనంగా జరపాలని విష్ చేస్తున్నా. అన్నారు.

సూర్య సెమ్ డైరెక్టర్ డా.సురేష్ బాబు మాట్లాడుతూ – మేము చదువుకునే రోజుల్లో హాస్టల్స్ నుంచి బయటకు వెళ్లి దొంగతనంగా సంతోషం ఫిలిం మేగజైన్స్ కొని చదివేవాళ్లం. ఇప్పుడు సంతోషం అవార్డ్స్ ఈవెంట్ కు స్పాన్సర్స్ గా వ్యవహరించడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం మాకు కల్పించిన సురేష్ గారికి థ్యాంక్స్. అన్నారు.

సంతోషం మేగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ – ఈ రోజు మా సంతోషం అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. 35 ఏళ్లుగా నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. 85 కు పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, 16 సినిమాలు నిర్మించా, అలాగే 600 సినిమాలకు పీఆర్ఓగా పనిచేశా. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ సినిమాలు పీఆర్ఓగా చేశాను. నాకు చిరంజీవి గారు, నాగార్జున గారు రెండు కళ్లలాంటి వారు. 2002లో ఫస్ట్ సంతోషం ఈవెంట్ లో నాగార్జున గారు ఫిలింఫేర్ అవార్డ్స్ లా సంతోషం అవార్డ్స్ పేరు తెచ్చుకోవాలి అన్నారు. ఆయన మాట మీద నేను కనీసం 25 ఏళ్లు ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది 24వ సంవత్సరం. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయగలుగుతున్నా. 2007లో దుబాయ్ షార్జా క్రికెట్ స్టేడియంలో 40 వేల మంది మధ్య సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా చేశాం. ఇక్కడి నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా 120 మందిని ఎమిరేట్స్ ఫ్లైట్ లో షార్జా తీసుకెళ్లి ఫంక్షన్ చేశాం. అలాంటిది మొన్న గోవాలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని కొందరు కావాలని ఇష్యూ చేశారు. నేను ఎవరినీ శత్రువుగా భావించను. నా ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లు శత్రువులు అనుకుంటా. నా మేగజైన్ లో ఇన్నేళ్లలో ఒక్కరి గురించి కూడా తప్పుగా రాయలేదు. నాకు తెలిసి నేను చిత్ర పరిశ్రమలో ఎలాంటి తప్పు చేయలేదు. అవార్డ్స్ ఫంక్షన్ అంటే ముళ్ల కిరీటం లాంటిది. అవార్డ్ ఫంక్షన్స్ వద్దు అని అక్కినేని నాగేశ్వరరావు గారి లాంటి లెజెండ్స్ నాకు సలహా ఇచ్చేవారు. కానీ పట్టుదలగా చేస్తూ వచ్చాను. గోవా ఈవెంట్ కు సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి పెద్ద సంఖ్యలో గెస్ట్ లను తీసుకెళ్లాను. అక్కడ రూమ్స్ విషయంలో చిన్న పొరపాటు జరిగింది అంతే. దీని గురించి ఇప్పటిదాకా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏదైనా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ అవుతుందనే ఊరుకున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్న టైమ్ లో కేఎస్ రామారావు గారు పిలిచి ఎఫ్ఎన్ సీసీ అడిషనల్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా నన్ను నియమించి ప్రొచహించారు. ఆయనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే గోవా ఈవెంట్ కు వచ్చిన మురళీ మోహన్ గారు అన్నీ చూశారు. ఆయన నాకు ఎప్పుడూ అండగా నిలబడుతుంటారు. ఆ మధ్య తిరుపతి దర్శనానికి వెళ్లినప్పుడు అనిల్ గారు వారి పాట్నర్ తో కలిసి నెక్ట్స్ ఈవెంట్ కోసం పది లక్షల రూపాయల అక్కౌంట్ లో వేశారు. ఆ వెంకటేశ్వరుడే నాకు సపోర్ట్ గా ఉండి ఈవెంట్ చేయమంటున్నాడు అనే ఫీలింగ్ కలిగింది. నా స్పాన్సర్స్ అందిరకీ కృతజ్ఞతలు చెబుతున్నా. మీ అందరి సపోర్ట్ తో ఈసారి ఈవెంట్ కూడా ఘనంగా చేయబోతున్నాం” అన్నారు.

CM Revanth Reddy Calls for Anti-Drug Campaign, Hero Krishnasai Fights Against Drugs

Students are falling prey to drugs. Instead of books, narcotic substances are now being found in their school bags. Even before completing their degrees, many are becoming addicted to drugs, throwing their future into darkness. At an age where they should be building careers, they are drowning in the abyss of addiction. In extreme cases, addicted youth are even turning violent against their own parents when questioned, forming drug-selling gangs, and engaging in heinous crimes like murder and rape under the influence of drugs.

To counter this growing menace, actor Krishnasai has taken up the responsibility of spreading awareness through short films. Responding to Telangana Chief Minister Revanth Reddy’s call to raise awareness on drug abuse among youth, Krishnasai has produced several promotional videos under the banner of Krishnasai Charitable Trust. One such awareness video, carrying the powerful message “O Yuvatha, Nee Gamya Etu Vipu?” (“O Youth, Where Are You Headed?”), received widespread appreciation.

At a press conference held at the Telugu Film Chamber, actor Krishnasai shared:
“Responding to CM Revanth Reddy’s appeal, we have created a powerful awareness song against drug abuse. The song has received acclaim from Governors, police departments, and across social media. Just like the mandatory anti-smoking disclaimers before movies helped reduce tobacco consumption, cinema can play a key role in creating public awareness. That’s why we’ve incorporated the song into our upcoming film ‘Danger’, which we believe will inspire youth to choose the right path. Media support is crucial for social awareness campaigns like this, and I thank everyone for their cooperation,” he said.

Recently, actor Krishnasai acted in the anti-drug awareness video, which earned praise from several dignitaries including former Governors Tamilisai Soundararajan and Haryana Governor Bandaru Dattatreya, Union Cabinet Minister Kishan Reddy, Telangana DGP Jithender, Hyderabad Police Commissioner CV Anand (IPS), Intelligence IG Sumathi, Additional DGP GHP Raju, Narcotics Bureau Chief Additional DGP Sandeep Shandilya, and many other IAS and IPS officials.

Song Link :https://youtu.be/cSHmwuD1dFo?si=zE-rgSg0nWLPYs43

Credits:
Production: Krishnasai Charitable Trust,,,
Music: Shambhu Prasad,
Director & Lyricist: P.S.Narayana,
Cast: Krishnasai, Meka ,Poojitha, Ramakrishna, Ramesh Guttula, Nitish, Venkateshwara Rao, and others
Singer: Ramana Seelam
Editor: Ramu
Co-Director: Krishnashyam
Cameraman: Vijay Kumar
*PRO : Dayyala Ashok

Hero Vijay-deverakonda interview about “Kingdom” Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కింగ్‌డమ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఏమనిపిస్తుంది?
చాలా చాలా సంతోషంగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది.

ఇంతటి విజయం దక్కడంపై మీ స్పందన ఏంటి?
కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్‌డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గురించి?
గౌతమ్ కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.

రెండవ భాగం ఎలా ఉండబోతుంది?
ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.

ఈ సినిమాలో ఆయుధాలతో ఓటింగ్ వేసే సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఆ సీన్స్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
గౌతమ్ కథ చెప్పినప్పుడు ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి చెప్పాడు కానీ, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఆ తర్వాత ఇలా గన్ లు, కత్తుల వంటి ఆయుధాలతో ఓటింగ్ ఉంటుంది చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. ఆ కొత్తదనమే ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణమైంది అనిపిస్తుంది.

కింగ్‌డమ్ కోసం మీరు ఎలాంటి హోం వర్క్ చేశారు?
ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.

ఈ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి ‘మనం హిట్ కొట్టినం’ అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.

ఈ చిత్రంలో మీరు షిప్ ను లాగే సీన్ జెర్సీ మూమెంట్ లాంటిదని చెప్పవచ్చు. ఆ షూటింగ్ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి?
మే నెలలో మండుటెండలో ఆ సీన్ షూట్ చేశాము. చిత్రీకరణ సమయంలో ఓ మంచి సన్నివేశం చేస్తున్నామన్న సంతృప్తితో చేశాము తప్ప.. జెర్సీ మూమెంట్ అనే ఆలోచనతో చేయలేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ సీన్ గురించి గొప్పగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఉంది.

సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు వచ్చాయి?
సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

సుకుమార్ గారితో మీ సినిమా ఎప్పుడు?
అర్జున్ రెడ్డి సమయం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్ లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది.

కింగ్‌డమ్ విజయం మీ తదుపరి సినిమాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది?
ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతోనే చేస్తాను. తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. రాహుల్, రవి ఇద్దరూ ఎంతో ప్రతిభగల దర్శకులు. ఇద్దరూ అద్భుతమైన కథలను సిద్ధం చేశారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

‘Bakasura Restaurant’ is a perfect entertainer that everyone should watch with their families: Actor Praveen

వినోదంతో పాటు ఎమోషన్‌ను మేళవించి.. ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్‌టైన్‌ చేయడమే ధ్యేయంగా రూపొందిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’ ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్‌. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకకు హీరో సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా

సుధీర్‌ బాబు మాట్లాడుతూ ” ప్రవీణ్‌ నాకు వన్‌ఆఫ్‌ ఫేవరేట్‌ యాక్టర్‌. నన్ను ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతాను. ఏ సినిమా అయినా ఎలా సక్సెస్‌ చేయాలో తపన పడుతుంటాడు. ప్రవీణ్‌ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. అందరి మంచి కోరుకుంటాడు. అందరికి మర్యాద ఇచ్చే వ్యక్తి. ఈ సినిమా ప్రవీణ్‌కు మంచి బ్రేక్‌ తీసుకరావాలని అనుకుంటున్నాను. ఈ సినిమాను వినోదమే ధ్యేయంగా నిర్మించిన నిర్మాతకు అభినందనలు. ఈ సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు తీసుకరావాలని కోరుకుంటున్నాను. నవ్వు ఎప్పుడూ పోస్ట్‌పోన్‌ చేయకూడదు. థియేటర్‌ అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఈ సినిమాను ఎంజాయ్‌ చేయాలి అన్నారు.

నిర్మాత జనార్థన్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాకు కథే హీరో.. మంచి కథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు… నటుడు ప్రవీణ్‌, వైవా హర్ష.. ఇలా అందరం కలిసి బకాసుర రెస్టారెంట్‌లో మంచి డిష్‌ను ప్రిపేర్‌ చేశాం. అందరికి మా డిష్‌. అంటే మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా సినిమాను దిల్‌ రాజు బ్యానర్‌ ఎస్‌వీ ద్వారా విడుదల చేస్తున్నాం ” అన్నారు.

దర్శకుడు ఎస్‌ జే శివ మాట్లాడుతూ ” విరూపాక్షకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ సినిమా వల్లే నేను దర్శకుడినయ్యాను. ఆ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. నా గురించి మా అన్నయ్య నిర్మాతగా మారాడు. ఈ కథకు మంచి సంగీతం కుదిరింది. వికాస బడిస భవిష్యత్‌లో పెద్దసంగీత దర్శకుడవుతాడు. ప్రవీణ్‌ మా కథను ఒప్పుకోవడం ఈ సినిమా రూపొందడానికి ప్రధాన కారణం. కథకు తగిన విధంగా టాలెంటెడ్‌ నటీనటులను ఎంపిక చేసుకున్నాను. ఈ చిత్రంలో వైవా హర్ష, ఫణిల పాత్రలు కూడా ఎంతో బాగుంటాయి. ట్రైలర్‌కు మించిన విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్‌ఫ్రైజ్‌లు ఉంటాయి.అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. అందరిని కడుపుబ్బ నవ్వించే ఫ్యామిలీ అండ్‌ హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్ని అలరిస్తుంది’ అన్నారు.

ప్రవీణ్‌ మాట్లాడుతూ ” మా జీవితాలకు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిన ప్రేమకథా చిత్రమ్‌ హీరో అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి కథలో నన్ను ప్రధాన వస్తువుగా సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వికాస బడిస సంగీతం టాక్‌ఆఫ్‌ ది టౌన్‌, టెక్నిషియన్స్‌ అందరూ ది బెస్ట్‌ ఇచ్చారు. శివ కథ చెప్పినప్పుడే గ్యారంటీగా బాగా తీయగలడు అనే నమ్మకం కలిగింది. బకాసుర రెస్టారెంట్‌ ఇంటిల్లాపాఇది చూడాల్సిన ఎంటర్‌టైనర్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫిల్మ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం రాజేష్‌, షైనింగ్‌ ఫణి, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌ పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, డిఓపీ బాల సరస్వతి, సంగీత దర్శకుడు వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి తదితరులు పాల్గొన్నారు.

ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ

With the honor of the National Awards, we’ll take on good films with even greater responsibility”: Baby team

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో “బేబి” సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో “బేబి” మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ – “బేబి” సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఈ సినిమా చిత్రీకరణ టైమ్ లో సాయి రాజేశ్ గారు నాతో చెప్పారు “బేబి” సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చే స్కోప్ చాలా ఉంది. అంత బాగా మనం వర్క్ చేయాలి అనేవారు. నిన్న నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయగానే ఆయన చెప్పిన మాటలే గుర్తొచ్చాయి. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అన్నారు.

లిరిక్ రైటర్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ – “బేబి” సినిమాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. నా పాటకు కూడా ఏదైనా అవార్డ్ వస్తే బాగుండేది అనిపించింది. అలాంటిది నేషనల్ అవార్డ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఐదు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ రాశాను. సాయి రాజేశ్ గారికి అన్ని అవార్డ్స్ వచ్చాయి. ఆస్కార్ అవార్డ్ కూడా ఆయన గెల్చుకుంటారని కోరుకుంటున్నా. అన్నారు.

సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ మాట్లాడుతూ – ఈ సినిమాకు ముందు నేను ఆశించినట్లుగా కెరీర్ ఉండేది కాదు. నా పాటలు వేరే సింగర్స్ తో రీప్లేస్ అయ్యేవి. అనుకున్నది ఏదీ సరిగ్గా కలిసొచ్చేది కాదు. “బేబి” సినిమాలో ప్రేమిస్తున్నా పాట పాడే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇది డూ ఆర్ డై అనేలా తీసుకున్నా. ఈ రోజు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ పొందడం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సాయి రాజేశ్ గారికి, నిర్మాత ఎస్ కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారికి థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – “బేబి” సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఏదైనా గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని సాయి రాజేశ్ గారు ప్రూవ్ చేశారు. సినిమా రిలీజై రెండేళ్లు దాటినా ఇంకా బేబి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అంతా సాయి రాజేశ్ గారి క్రియేషన్ వల్లే. అలాగే ఎస్ కేఎన్ గారు ఈ ప్రాజెక్ట్ ను ఎంతో నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ప్రేమిస్తున్నా పాట వింటూనే మేమంతా ఒక మూడ్ లో ఉండి సినిమా షూటింగ్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 100 అడుగుల పెయింటింగ్ వేయించారు. “బేబి” సినిమాలాగే ఈ పాట కూడా మా మనసుల్లో ఉండిపోయింది. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తే ఒకప్పుడు మన తెలుగు సినిమాకుకు పురస్కారాలు కనిపించేవి కావు. ఈ ఏడాది దాదాపు పది నేషనల్ అవార్డ్స్ టాలీవుడ్ కు దక్కాయి. ఇది తెలుగు సినిమా గర్వించాల్సిన సందర్భం. నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న తెలుగు మూవీస్, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అందిరకీ కంగ్రాంట్స్ చెబుతున్నాం. ఒక చెట్టు పెంచితే అది పండ్లు ఇవ్వడమే కాదు ఎండిపోయాక కూడా ఇళ్లు కట్టుకునేందుకు కలప ఇస్తుంది. అలా ఒక మంచి మూవీ చేస్తే అది మనకు డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తుంది. బేబి సినిమా మాకు డబ్బుతో పాటు ఫిలింఫేర్, సైమా, గామా వంటి ఎన్నో పురస్కారాలు తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ దక్కడం మరింత హ్యాపీగా ఉంది. నా మిత్రుడు సాయి రాజేశ్ బేబి సినిమాను ఎంతో నమ్మాడు. కొన్నేళ్లు కథపై కసరత్తు చేశాడు. అందుకే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. సాయి రాజేశ్ కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి సినిమాకు నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ప్రేమిస్తున్నా పాటను రోహిత్ చాలా బాగా పాడాడు. ఈ పాట లిరికల్ సాంగ్ ను మూడు రోజులు చిత్రీకరించాం. మనం మూవీలో ఫుల్ సాంగ్ చేసే టైమ్ అది. రశ్మిక మందన్న ఈ పాటను రిలీజ్ చేశారు. అక్కడి నుంచి బేబి సినిమా ఆడియెన్స్ తో కనెక్ట్ కావడం ప్రారంభమైంది. వంద ప్రీమియర్స్ వేశామంటే అందుకు మీడియా సపోర్ట్ కారణం. నేషనల్ అవార్డ్ మాపై మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత పెంచింది. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – బేబి సినిమాకు టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే రెండేళ్లయినా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. నా సినిమా పోస్టర్ మీద నేషనల్ అవార్డ్ విన్నర్ అనే పేరు చూడటం కల నెరవేరిన ఫీలింగ్ కలిగిస్తోంది. డైరెక్టర్ సాయి రాజేశ్ గారు కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి మూవీకి నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న డైరెక్టర్ గా గౌరవం పొందారు. ఆయన నెక్ట్స్ చేయబోయే ప్రతి సినిమాకు ఈ మూవీ చేస్తున్నది నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఇది గొప్ప గౌరవం. బేబి సినిమాను ఎంతగానో నమ్మారు నిర్మాత ఎస్ కేఎన్. ఈ మూవీని ప్రమోషన్ చేసిన విధానం ఎన్నో సినిమాలకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అయ్యింది. మేము స్టార్స్ కాకున్నా బేబి సినిమా ప్రమోషన్ కు ఏ కాలేజ్ కు వెళ్లినా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చేది. బేబి మూవీని అద్భుతంగా మార్కెటింగ్ చేశారు. బేబి ప్రీమియర్స్ తర్వాత ఇది కల్ట్ బ్లాక్ బస్టర్ అని ఎస్ కేఎన్ అన్న మైక్ విసిరేశారు. ఆయన అన్నట్లే ఈ సినిమా మా అందరికీ పేరు తీసుకొచ్చింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు దేశంలోనే పెద్ద అవార్డ్ నేషనల్ అవార్డ్ గెల్చుకోవడం ఆనందంగా ఉంది. బేబి సినిమా ఫస్ట్ క్లైమాక్స్ షూటింగ్ చేశాం. మాకు ఆ క్యారెక్టర్స్ ప్లే చేసే ఇన్సిపిరేషన్ ప్రేమిస్తున్నా పాటతో కలిగింది. ఈ పాట విన్న తర్వాత మేమంతా కథ మూడ్ లోకి వెళ్లిపోయి నటించాం. రోహిత్ టాలెంటెడ్ సింగర్. అతనికి సరైన గుర్తింపు దక్కింది. మా సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా రూపొందించారు. ఈరోజు విరాజ్, విజయ్ బుల్గానిన్ ను మిస్ అవుతున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – ఈ రోజు బేబి సినిమా ఈవెంట్ లో మా టీమ్ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను కెరీర్ లో ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినా బేబి మూవీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ చిత్రంలో నేను భాగమయ్యేందుకు కారణమైన ఎస్ కేఎన్, సాయి రాజేశ్ గారికి థ్యాంక్స్. సాయి రాజేశ్ కు ఇది రెండో నేషనల్ అవార్డ్, మరిన్ని నేషనల్ అవార్డ్స్ ఆయన గెల్చుకోవాలని కోరుకుంటున్నా. ప్రేమిస్తున్నా సాంగ్ బేబి సినిమాలో చాలా మందికి ఇష్టమైన పాట. ఈ పాటకు నేషనల్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాం. అన్నారు

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – బేబి సినిమా టీమ్ అంతా ఈ రోజు ఇక్కడ మీట్ అవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేప్పడు ఒక మూడ్ లో ఉండిపోయేవాడిని. నేనే ఆనంద్ అయితే, విరాజ్ అయితే ఎలా ఉంటానో ఆ మూడ్ లో ఉండి స్క్రిప్ట్ రాశాను. రెండేళ్లు ఈ కథ నా మైండ్ లో ఉండిపోయింది. ప్రతి సీన్ ను బెటర్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేశాను. స్క్రీన్ ప్లేకు నేషనల్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా సాంగ్ కు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఆనందపడ్డాను. ఈ పాట లాస్ట్ లో కంపోజ్ చేద్దామని మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ తో చెప్పాను. ఈ పాట విషాధకరమై మూడ్ లో ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ లో వాళ్లు హ్యాపీగా ఉన్న మూవ్ మెంట్స్ ఉంటాయి. విజయ్ బుల్గానిన్ ఫస్ట్ ఈ సాంగ్ చేద్దామని మొదలుపెట్టాడు. సురేష్ బనిశెట్టి ప్రేమిస్తున్నా పాటలో మన కథలాంటి మరో కథ చరితలో ఉండదంటనే అని రాశాడు. ఈ లైన్ చదవగానే చాలా ఇన్స్ పైర్ అయ్యాను. రోహిత్ పాడిన పాట వినగానే ఈ సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ప్రేమిస్తున్నా పాట ఇచ్చిన స్ఫూర్తితో బేబి సినిమాను మరింత హార్ట్ టచింగ్ గా రూపొందించాను. ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ లో ఆనంద్ ఎంతో ఫీల్ అయి నటించారు. ఆ షాట్స్ సినిమాలో ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ హీరోనే. అంత ప్రాణం పెట్టి పనిచేశారు. ధీరజ్ నాకూ, ఎస్ కేఎన్ కు మధ్య వారధిలా ఉంటారు. వైష్ణవి హీరోయిన్ గా మరిన్ని మంచి మూవీస్ చేయాలి. ఆనంద్ కొత్త సినిమా లుక్ చాలా బాగుంది. బేబి సినిమాకు వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ మా ఎడిటర్ విప్లవ్ గారికి కూడా చెందాలి. నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్ కేఎన్ నమ్మాడు. థ్యాంక్ యూ. మాకు ఎంతో సపోర్ట్ అందిస్తున్న మీడియాకు థ్యాంక్స్. అన్నారు

Sony LIV originals “Mayasabha” Trailer Launched Event held grandly, Streaming From Aug 7th

వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా గారి కోసం ఇలా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దేవా కట్టా మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన మా డియర్ బ్రదర్ తేజ్‌కు థాంక్స్. ‘మయసభ’ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ధనీష్‌ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌‌లా నిలిచారు. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.

సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ .. ‘మా ‘మయసభ’ ఈవెంట్‌కు వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. కరోనా కంటే కాస్త ముందుగా మా ఓటీటీ సంస్థను ప్రారంభించాం. మన ఇండియన్ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలని అనుకున్నాం. అందులో భాగంగా హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాం. ఇక బ‌ృందాతో కలిసి మేం మొదటగా సిరీస్ చేశాం. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’ అనే అద్భుతమైన సిరీస్‌ను నిర్మించాం. శక్తి మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. 2022లో ఈ కథను దేవా కట్టా గారు మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందని నమ్ముతున్నాం. ఈ సిరీస్ ఆగస్ట్ 7న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ మాట్లాడుతూ .. ‘దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా తెరకెక్కించారు. కథను ఎంత అందంగా నెరేట్ చేశారో.. అంతే అద్భుతంగా తీశారు. ఎంతో గొప్ప నటీనటులు అందరూ ఆ ప్రాజెక్ట్‌లో నటించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దేవా కట్టా గారు మూడు, నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. దేవా గారు ఈ సిరీస్ కోసం వందకు 150 శాతం కష్టపడ్డారు. ఈ సిరీస్‌ను సోనీ లివ్‌కు చేసి పెట్టిన దేవా కట్టా గారికి థాంక్స్’ అని అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. ‘మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం దేవా కట్టా గారు పని చేస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌ని సపోర్ట్ చేస్తున్న సోనీ లివ్‌ టీంకు థాంక్స్. దేవా గారు కన్న కలను ‘మయసభ’ టీం నిజం చేసింది. శక్తి ఇచ్చిన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యా దత్త గారు ఇలా ప్రతీ ఒక్కరూ అందరూ గొప్పగా నటించారు. చైతన్య రావ్ అద్భుతమైన నటుడు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌‌‌లోకి రాబోతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’‌లా ‘మయసభ’ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

చైతన్య రావ్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన తేజ్‌కు థాంక్స్. దేవా కట్టా గారు చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు కిరణ్ అన్న ఎంతో సహకరించారు. శక్తి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత హర్ష గారు చాలా మంచి వ్యక్తి. దివ్యా మేడం, నాజర్ సర్, సాయి కుమార్ వంటి యాక్టర్లతో పని చేయడం అదృష్టం. ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆది నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నా ప్రయాణంలోని ప్రతీ మైల్ స్టోన్‌లో నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని అన్నారు.

నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ .. ‘‘మయసభ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను దేవా గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.

నిర్మాత విజయ్ కృష్ణ లింగమనేని మాట్లాడుతూ .. ‘‘మయసభ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. దేవా గారు ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆది, చైతన్య రావు, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. శక్తి కాంత్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

చరితా వర్మ మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఆది, చైతన్య గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నటి దివ్యా దత్తా మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. తెలుగులో ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. ‘మయసభ’ సెట్‌‌లో సరదాగా అందరం కలిసి నటించాం. ఈ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

శ్రీకాంత్ భరత్ మాట్లాడుతూ .. ‘దేవా కట్టా గారితో రిపబ్లిక్‌ మూవీని చేశాను. ప్రతీ షాట్‌ను ఆయన చెక్కుతూనే ఉంటారు. దేవా గారు చాలా గొప్ప దర్శకుడు. ఆది, చైతన్య, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించేశారు. ‘మయసభ’ అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.

రవీంద్ర విజయ్ మాట్లాడుతూ .. ‘సోనీ లివ్‌తో కలిసి నేను చేస్తున్న నాలుగో సిరీస్ ఇది. దేవా గారితో పని చేయడం గొప్ప విషయం. ప్రతీ నటుడికి స్కోప్ ఇస్తుంటారు. స్క్రీన్ మీద మా అందరితో మ్యాజిక్ చేయించారు. ‘మయసభ’ గొప్పగా ఉండబోతోంది’ అని అన్నారు.

కెమెరామెన్ సురేష్ రగుతు మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన తేజ్ అన్నకు థాంక్స్. నాకు ఈ ప్రాజెక్టులో అవకాశం ఇచ్చిన కిరణ్, దేవా సర్‌లకు థాంక్స్. ఈ సిరీస్ అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్ మాట్లాడుతూ .. ‘‘మయసభ’ ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. నాకు ఈ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన దేవా గారికి థాంక్స్. బృందా తరువాత సోనీ లివ్‌లో ఇది నాకు రెండో ప్రాజెక్ట్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా గారికి, సోనీ లివ్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 7న బ్లాస్ అయ్యేలా ‘మయసభ’ రాబోతోంది’ అని అన్నారు.

Sivam Media’s ‘Hreem’ New Movie Pooja Ceremony held Grandly

పవన్‌ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్‌ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్‌ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్‌ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ఆడిటర్‌గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినిజోష్‌ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్‌ కనకాల కెమెరా స్విఛాన్‌ చేశారు.

చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ–‘‘ నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – ‘హ్రీం’ చిత్ర నిర్మాతలు శివమల్లాల , సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మించ తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. తమ్ముడు శివ నాకు ఎంతో ఆప్తుడు. హీరో, హీరోయిన్‌ పవన్, చమిందా, దర్శకుడు రాజేశ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ– ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. ‘హ్రీం’ చిత్ర హీరోయిన్‌ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్‌ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్‌ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్‌ తాతా, దర్శకుడు రాజేశ్‌ నాకు ముందునుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్‌ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ‘హ్రీం’ చిత్ర నిర్మాత శివ మల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

సినిమా ప్రారంభోత్సవంలో దర్శక–రచయిత జనార్థనమహర్షి, నిర్మాత కె.బాబురెడ్డి, తమిళ నిర్మాత జి.సతీష్‌ కుమార్, ‘ట్రెండింగ్‌లవ్‌’ దర్శకుడు హరీష్‌ నాగరాజ్, ‘బహిష్కరణ’ చిత్ర దర్శకుడు ముకేష్‌ ప్రజాపతి , ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, వనిత , శ్రీవాణి త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.

కథ–కథనం–దర్శకత్వం – రావూరి రాజేష్‌
నిర్మాత– శివ మల్లాల
కెమెరా– అరవింద్, సంగీతం– మార్కస్‌.యం
ఎడిటర్‌– ప్రణీత్‌ కుమార్, కళ– సుధీర్‌ మాచర్ల ‘క’ ఫేమ్‌
వీ.ఎఫ్‌.ఎక్స్‌ డైరెక్టర్‌– రాజ్‌ పవన్‌ కొమ్మోజు
సౌండ్‌ డిజైనర్‌– సాయి మనీంధర్, డి.ఐ– ఎస్‌.జె కార్తీక్‌ డి.ఎఫ్‌.టెక్‌
పి.ఆర్‌.వో– మూర్తి మల్లాల

Sithara Entertainments ,Vijay Deverakonda’s ‘Kingdom’ Pre Release Event held grandly,Movie Releasing on July 31

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 26) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అనిరుధ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మరో రెండు రోజుల్లో జులై 31న మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నాం. మనసులో కొంచెం భయం ఉంది, అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్‌డమ్’ అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం సంతోషంగా ఉన్నాము. ఈరోజు నేను అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్‌డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు గౌతమ్. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు. ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాము. నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్‌డమ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇది ఎడిటర్ నవీన్ నూలి ‘కింగ్‌డమ్’. నాలో ఒక ఫైర్ ఉంటుంది. మా వాళ్లకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాకు ఇంత ఫైర్ ఉన్న టీమ్ దొరికింది. అలాగే ఇది నాగవంశీ ‘కింగ్‌డమ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్ పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు. భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్తుంది. నా సోదరులు సత్యదేవ్, వెంకటేష్ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్ ని ఎంపిక చేశాడు గౌతమ్. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేష్ అద్భుతంగా నటించాడు. భవిష్యత్ లో బిగ్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌ కొల్లా, సినిమాటోగ్రాఫర్స్ జోమోన్, గిరీష్.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రెండు రోజుల్లో ‘కింగ్‌డమ్’ మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాల పరంగా నా మెంటర్ నాగవంశీ గారు. నా సాంగ్ హిట్ అయితే ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతారు. ‘కింగ్‌డమ్’ లాంటి గొప్ప సినిమాలో నన్ను భాగం చేసిన నాగవంశీ గారికి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్ కి నా కృతఙ్ఞతలు. సోదరుడు గౌతమ్ దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ చిత్రానికి ఎందరో అభిమానులు ఉన్నారు. ‘కింగ్‌డమ్’ అంతకుమించిన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ ఎడిటర్స్ లో నవీన్ నూలి ఒకరు. విజయ్ చాలా మంచి మనిషి. ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. నేను ఈ చిత్రం కోసం పని చేస్తున్న సమయంలో.. ‘మనకి నిద్ర అనేది ముఖ్యం, తగిన నిద్ర పోతూ విశ్రాంతి తీసుకుంటున్నావని ఆశిస్తున్నాను’ అని విజయ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అంత గొప్పది విజయ్ మనసు. నేను ‘కింగ్‌డమ్’ చిత్రం చూశాను. ఈ సినిమా విజయ్ కెరీర్ తో పాటు, నా కెరీర్ లో, గౌతమ్ కెరీర్ లో, నాగవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ‘కింగ్‌డమ్’ ద్వారా మేము తెలుగు ప్రేక్షకుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నా పాటలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మీ వాడిగా భావించి నాపై ప్రేమ కురిపిస్తున్నారు. మీ ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.” అన్నారు.

కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “జులై 31న విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ కోసం మీతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గౌతమ్ గారు ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. ఇందులో పవర్ ఫుల్ పర్ఫామెన్స్ లు చూడబోతున్నారు. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప సినిమాలో విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. గౌతమ్ గారు ఎంతో ప్రతిభగల దర్శకుడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. కింగ్‌డమ్ సినిమాకి అనిరుధ్ గారు హార్ట్ బీట్. సత్యదేవ్ గారు అద్భుతంగా నటించారు. జులై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

ప్రముఖ నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ లో భాగమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. విజయ్ ను నేను చాలా దగ్గర నుంచి చూశాను. చాలా అరుదైన వ్యక్తి. మంచి మనిషి, ఇతరుల గురించి కేర్ తీసుకుంటాడు. విజయ్ ఈ సినిమాతో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామాన్యుడిలా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘కింగ్‌డమ్’ను స్థాపించుకున్న విజయ్ అంటే నాకు అపార గౌరవం. విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవరకొండ కాదు బంగారుకొండ. అనిరుధ్ ఏది పట్టుకుంటే అది బంగారం. అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. నాగవంశీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో.. అలాంటి సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి, గట్స్ ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. విజయ్ తో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను నాగవంశీ గారు తీసుకున్నారు. ప్రతి నటుడు గౌతమ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా అభిప్రాయం. మనలో ఇంత నటన దాగుందా అని మనమే ఆశ్చర్యపోయేలా.. మన నుంచి నటనను రాబడతాడు. భవిష్యత్ లోనూ గౌతమ్ తో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ తో సహా అందరూ అద్భుతంగా నటించారు.” అన్నారు.

నటుడు వెంకటేష్ మాట్లాడుతూ, “మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన నేను.. ఇప్పుడు ‘కింగ్‌డమ్’లో భాగమయ్యాను. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఇప్పటిదాకా నేను పని చేసిన బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితారలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సత్యదేవ్ గారు గొప్ప నటుడు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. తెలుగులో నేను విజయ్ దేవరకొండ గారితో ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్ గారు ఈ సినిమాలో నా నటనను మెచ్చుకోవడం గర్వంగా అనిపించింది.” అన్నారు.

సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో నటులు రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, కళా దర్శకుడు అవినాష్‌ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, గీత రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొని ‘కింగ్‌డమ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్