Home Blog Page 66

Pan India Movie “Aakasamlo Oka Tara,” Glimpse Unveiled on Dulquer Salmaan’s birthday

దుల్కర్ సల్మాన్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బహుభాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్. ఎన్నో వైవిధ్యమైన, సరికొత్త పాత్రలతో ఆయన మెప్పిస్తున్నారు. ఈ విలక్షణత కారణంగానే ఆయన చేస్తున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటివే అందుకు ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బ్యానర్స్ మద్ధతుతో రూపొందుతోన్న ఈ సినిమా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మేకర్స్ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటూ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

ఈ గ్లింప్స్‌‌ను గమనిస్తే మన సాధారణ జీవితంలో కనిపించే క్షణాలను అందంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా కనిపిస్తూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చారు. చివర్లో ఓ స్కూల్ గర్ల్ పరుగెత్తే సీన్ ఎంత సాదాసీదాగా ఉన్నా అది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ గ్లింప్స్‌కి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ఈ గ్లింప్స్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

గ్లింప్స్‌‌లో దుల్కర్ సల్మాన్ ప్రెజన్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంది. డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకోవటంలో దుల్కర్ తన ప్రత్యేకతను మరోసారి చూపించారనే విషయం గ్లింప్స్‌తో స్పష్టమైంది. ఆయన నటనకు పవన్ సాధినేని క్రియేటివ్ విజన్ తోడై ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ఓ మెమొరబుల్ మూవీగా మన ముందుకు రానుంది. సినిమాలోని గొప్ప భావోద్వేగాలుంటాయనే విషయం గ్లింప్స్ చూస్తుంటే స్పష్టమవుతుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ మరింత ప్లస్ అవుతున్నాయి.

ఇంత చక్కటి నటీనటులు, టెక్నికల్ టీమ్ కాంబోతో ‘ఆకాశంలో ఓ తార’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో  ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకుంటోంది.

నటీనటులు – దుల్కర్ సల్మాన్ తదితరులు

సాంకేతిక వర్గం –

దర్శకత్వం – పవన్ సాధినేని
రచన – గంగరాజు గుణ్ణం
సంగీతం – జి.వి.ప్రకాష్
సినిమాటోగ్రఫీ –  సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్ – శ్వేత సాబు సిరిల్
నిర్మాతలు – సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం
బ్యానర్ – లైట్ బాక్స్ మీడియా
సమర్పణ – గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా

Hrithik-NTR’s viral ‘India First’ oath in War 2 trailer penned by Aditya Chopra & Shridhar Raghavan!

వార్ 2 ట్రైల‌ర్‌లో పాన్ ఇండియ‌న్ స్టార్స్  హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ఫెరోషియ‌స్ లుక్‌లో అద‌ర‌గొట్టారు.  నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీప‌డుతూ హృతిక్‌, ఎన్టీఆర్‌ మ‌ధ్య సాగే యాక్ష‌న్ సీక్వెన్స్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి.  టాప్ నాచ్ విజువ‌ల్స్‌, బీజీఎమ్‌తో పాటు ఐ ఫీస్ట్‌గా సాగుతూ ఆడియెన్స్‌కు  గూస్ బంప్స్‌ను క‌లిగించింది.  ట్రైల‌ర్‌…ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని రెట్టింపు చేసింది. ఇద్ద‌రు మెగాస్టార్స్  విశ్వ‌రూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ పిల్మ్స్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమాకు శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ క‌థ‌ను అందిస్తున్నారు.

వార్ 2 ట్రైల‌ర్‌లో దేశ ర‌క్ష‌ణే త‌మ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం అంటూ హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ చేసిన ప్ర‌మాణం ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ ఛాలెంజ్‌తోనే సినిమాలో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్స్ ఎంత ఇంటెన్స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయ‌న్న‌ది మేక‌ర్స్ చూపించారు.  ట్రైల‌ర్‌లో సినిమా క‌థేమిటి, అస‌లు ఏజెంట్ ఎవ‌రు అన్న‌ది రివీల్  చేయ‌కుండా ఆడియెన్స్‌లో స‌స్పెన్స్ క్రియేట్ చేశారు మేక‌ర్స్‌.  ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కుడ‌ద‌నే ఐడియా ప్రొడ్యూస‌ర్‌దేన‌ని రైట‌ర్ శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ అన్నారు.

శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ మాట్లాడుతూ...మాతృభూమి ర‌క్ష‌ణ కోసం డేంజ‌ర‌స్ కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్‌లోకి ఇద్ద‌రు ఏజెంట్స్ అడుగుపెడ‌తారు. దేశం  కోసం అవ‌స‌ర‌మైతే ప్రాణ త్యాగానికి వెనుకాడ‌ని వారి ధైర్య‌సాహ‌సాల‌ను, పోరాటాన్ని చాటిచెబుతూ స్పై యూనివ‌ర్స్ ప్ర‌మాణం ఉంటుంది. ఈ ప్ర‌మాణం సినిమా క‌థ‌ను, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఆడియెన్స్‌కు థియేట‌ర్ల‌లో హై ఫీల్ ఇస్తుంది. దేశం కోసం పోరాడే ఇద్ద‌రు ఏజెంట్లు ఒక‌రితో మ‌రొక‌రు ఎందుకు త‌ల‌ప‌డాల్సివ‌చ్చింది అన్న‌ది సినిమాలో క్యూరియాసిటీని క‌లిగిస్తుంది.  అస‌లు ఈ ఇద్ద‌రిలో నిజ‌మైన ఏజెంట్ ఎవ‌రు?  వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న లింక్ ఏమిట‌న్న‌ది   థ్రిల్లింగ్‌ను పంచుతుంది అని శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ చెప్పారు.
వార్ 2 మూవీ తెలుగు హిందీ, భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 14న రిలీజ్ కాబోతుంది.  ఈ స్పై యాక్ష‌న్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్స్ అయిన‌ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేలా వార్ 2 ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ పేర్కొన్నారు.

Hero Satyadev’s “Arabia Kadali” Movie premiere on August 8 in Amazon Prime Video

Prime Video, India’s most loved entertainment destination, today announced August 8 as the premiere date for its upcoming Telugu Original Series, Arabia Kadali, an intense and emotionally charged survival drama. Created by Krish Jagarlamudi and Chintakindi Srinivas Rao, the series is produced under the banner of First Frame Entertainments Pvt Ltd by Y. Rajeev Reddy and Sai Babu Jagarlamudi. Directed by V. V. Surya Kumar, this binge-worthy drama stars Satya Dev and Anandhi in lead roles alongside a stellar ensemble cast including Nassar, Raghu Babu, Dalip Tahil, Poonam Bajwa, Prabhavathi, Harsh Roshan, Pratyusha Sadhu, Kota Jayaram, Vamsi Krishna, Bharath Bhatia, Chandra Pratap Thakur, Danish Bhatt, Ravi Varma, Amith Tiwari, Nihar Pandya, and Alok Jain. Arabia Kadali premieres exclusively on Prime Video in India and over 240 countries and territories worldwide on August 8.

Arabia Kadali is a fictional series that tells a heartrending and emotionally charged story of a group of fishermen from rival villages who accidentally drift into international waters and find themselves imprisoned in a foreign land. At the heart of the series are two intertwined journeys—Badiri’s and his fellow fishermen’s harrowing ordeal through treacherous seas and captivity, and Ganga’s courageous rise as a woman who dares to challenge the system. Along the way, they form unexpected friendships, forge new relationships, and confront formidable foes. The series is a gripping tale of resilience, of brotherhood born in adversity, and of an unrelenting fight for freedom and justice against all odds. In a world divided by borders, Arabia Kadali reminds us that humanity is innate.

“Arabia Kadali is a gripping Telugu drama that celebrates the tale of resilience and courage of ordinary men caught in extraordinary circumstances.” said Nikhil Madhok, director and head of originals, Prime Video, India. “The series brings to life a myriad of human emotions – mistrust, unity, pride, and the instinct to survive, in a way that will deeply resonate with viewers. With compelling performances by Satya Dev and Anandhi, alongside a highly talented ensemble cast, driven by the stellar creative team behind it, Arabia Kadali is a strong addition to our growing slate of Telugu Originals. We are looking forward to bringing this impactful story to our customers on August 8.”

“Arabia Kadali is much more than just another series for us. It’s a deeply moving story of grit and determination,” said producer Y. Rajeev Reddy. “What sets it apart is the seamless blend of authentic storytelling, standout performances by Satyadev and Anandhi, and visually striking cinematography that captures both grand scale and emotional nuance. Along with Prime Video, we’ve brought this vision to life at the scale it deserves. We believe Arabia Kadali, with its emotional depth and deeply humane narrative, will strike a chord with audiences in India and around the world when it premieres on August 8, exclusively on Prime Video.”

46 international awards Winning Movie ‘ArjunChakravarthy’ teaser launch event held grandly

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి 9నెలలు మోస్తుంది. నేను కూడా ఈ సినిమాని మీకు చూపించడానికి తొమ్మిదేళ్లుగా మోశాను. నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలాగా నాటుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి భావించను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రాజెక్టుకు కావలసిన ప్రతిదీ అద్భుతంగా సమకూర్చారు. ఆయన సపోర్ట్ లేకుండా ఈ సినిమా నేను చేసే వాడినే కాదు. ఈ ఆరేళ్ల జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ లో సపోర్ట్ చేశారు. ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎలాంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా అది చేసి చూపించారు. మైనస్ డిగ్రీల్లో షూట్ చేసాం. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మేము అనుకున్నది తీయడానికి ఎంతకైనా సాహసించారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సినిమా టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ హను గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇది నా ప్రామిస్’అన్నారు.

హీరో విజయరామరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీజర్ ని లాంచ్ చేసిన హను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన వర్క్ చేశారు. మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమాతో తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అజయ్ గారు, దయ గారు, అజయ్ ఘోస్ గారు వీళ్లంతా కూడా మా సినిమాకి ప్లస్ అయ్యారు. మా నిర్మాత శ్రీని గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా రూపొందించారు. నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్ తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేయడం జరిగింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఇవంతా మా డైరెక్టర్ గారు మా నిర్మాత సపోర్ట్ తోనే సాధ్యమైయింది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పర్ఫామెన్స్ చేశానంటే అది మా డైరెక్టర్ గారి వల్లే. ఆయన అద్భుతంగా మలుచుకున్నారు. చాలా డెడికేటెడ్ డెడికేషన్ తో ఈ సినిమా తీశారు. నిరంతరం సినిమా కోసమే తపించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. చాలా మంచి సినిమాది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను అందరికీ థాంక్యు’అన్నారు

ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కథ చెప్పినప్పుడు గానీ తీస్తున్నప్పుడు గానీ ఎక్కడ కూడా డ్రాప్ అయినట్లు అనిపించలేదు. అందుకే ప్రొడక్షన్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరిగింది. విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన హార్డ్ వర్క్ టీజర్ లో మీరందరూ చూశారు. చాలా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, కథ ఉన్న సినిమా ఇది. అజయ్ గారు కోచ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే హీరోయిన్ సిజ్జా రోజ్ గారు చాలా నేచురల్ గా ఈ క్యారెక్టర్ ని చేశారు. అందరూ కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయిగానే భావిస్తారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’అన్నారు.

హీరోయిన్ సిజ్జా రోజ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇది ఒక ఐదేళ్ల జర్నీ. చాలా ప్యాషన్ తో పనిచేసాం. చాలా హార్డ్ వర్క్ చేశాం. మా నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. మా డైరెక్టర్ గారు తన విజన్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’అన్నారు.

యాక్టర్ దుర్గేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా తీశారు. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఈ సినిమాను తప్పకుండా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను

మ్యూజిక్ డైరెక్టర్ విగ్నేష్ భాస్కరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం ఈ సినిమా. అందరూ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక మంచి ఎమోషనల్ జర్నీ ఇది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు .బిగ్ స్క్రీన్ లో ఈ సినిమాని మీరందరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. అందరికీ థాంక్యు.

డిఓపి జగదీష్ మాట్లాడుతూ.. అర్జున్ చక్రవర్తి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంత మంచి సినిమాలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీమ్ అందరికీ థాంక్యు. విజయ్ చాలా డెడికేషన్ తో ఈ సినిమాని చేశారు. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు .ఈ సినిమాకి ఎన్నో అవార్డులో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్యు’అన్నారు.

నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్
సిబ్బంది వివరాలు:
రచన & దర్శకత్వం: విక్రాంత్ రుద్ర
నిర్మాత: శ్రీని గుబ్బల
సహ నిర్మాత: ఈడే కృష్ణ చైతన్య
సంగీతం: విఘ్నేష్ బాస్కరన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి
ఎడిటర్: ప్రదీప్ నందన్
ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్
ఆడియోగ్రఫీ: అరవింద్ మీనన్
సాహిత్యం: కృష్ణకాంత్
డైలాగ్స్ రైటర్: రవీంద్ర పుల్లె
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
సౌండ్ డిజైన్: విఘ్నేష్ బాస్కరన్, నిర్మల్ శ్రీనివాసన్
కలర్స్: విష్ణు వర్ధన్ (శ్రీ సారథి స్టూడియో)
పబ్లిసిటీ డిజైన్: స్కేల్ & టిల్ట్ స్టూడియోస్
VFX: Madhousevfx
PRO: తేజస్వి సజ్జా
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Mythology, Suspense, Crime thriller ‘Yamudu’ Movie Audio launch held grandly

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రాన్ని జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. తాజాగా యముడు ఆడియోలాంచ్ ఈవెంట్‌ను సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మొదటి పాటను ప్రియాంక, మల్లిక లాంచ్ చేశారు. రెండో పాటను బెక్కెం వేణుగోపాల్ గారు రిలీజ్ చేశారు. మూడో పాటను కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక గారు, యముడు నాలుగో పాటను మల్లిక గారు రిలీజ్ చేశారు. అనంతరం..

*బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ* .. ‘ప్రతీ ఏడాది వందల చిత్రాలు వస్తుంటాయి. అందులో కొంత మందికి మాత్రమే సక్సెస్ వస్తుంది. చిన్న చిత్రాలు ఈ మధ్య వండర్లు క్రియేట్ చేస్తున్నాయి. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జగదీష్ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి ‘యముడు’ సినిమాను తీశారు. మొదటి చిత్రాన్నే ఇంత ప్రయోగాత్మాకంగా తీయడం గొప్ప విషయం. భవానీ ఇచ్చిన సంగీతం బాగుంది. ఈ మూవీతో చాలా మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పరిచయం కాబోతోన్నారు. శ్రావణి శెట్టికి సరైన బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*జగదీష్ ఆమంచి మాట్లాడుతూ* .. ‘మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి.. సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఈ రోజు ‘యముడు’ సినిమాతో ఇక్కడి వరకు వచ్చాను. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్‌లతోనే ఈ చిత్రాన్ని తీశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

*శ్రీ మల్లిక మాట్లాడుతూ* .. ‘మా ‘యముడు’ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. చాలా డిఫరెంట్ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.

*శ్రావణి శెట్టి మాట్లాడుతూ* .. ‘‘యముడు’ లాంటి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మన జీవితంలో జరిగే ఘటనల్నే, చేసే తప్పుల్నే ఇందులో చూపించబోతోన్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది. శివ మంచి స్క్రీన్ ప్లేని రాశారు. జగదీష్ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆయన ముందుకు వెళ్తూనే ఉంటారు. నాకు సహకరించిన ‘యముడు’ టీంకు థాంక్స్’ అని అన్నారు.

*ఆకాష్ మాట్లాడుతూ* .. ‘జగదీష్ గారు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. నా ఈ ప్రయాణంలో శివ ఎప్పుడూ అండగా నిలిచారు. భవానీ రాకేష్ అందించిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. నన్ను సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

*భవానీ రాకేష్ మాట్లాడుతూ* .. ‘మా ‘యముడు’ సినిమాకు అవకాశం ఇచ్చిన జగదీష్ గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో శివ నాతో మూడేళ్లుగా ప్రయాణిస్తూనే ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. ఈ మూవీలోని పాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి’ అని అన్నారు.

*స్క్రీన్ ప్లే రైటర్ శివ మాట్లాడుతూ* .. ‘‘యముడు’ సినిమా అద్భుతంగా వచ్చింది. టెక్నికల్‌గా ఈ చిత్రం మెప్పిస్తుంది. నా స్నేహితుడు భవానీ శంకర్ మంచి పాటల్ని ఇచ్చారు. జగదీష్ గారు ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారు. ఎంతో కష్టపడి పని చేసిన టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు.

*కెమెరామెన్ విష్ణు మాట్లాడుతూ* .. ‘జగదీష్ గారికి అన్ని క్రాఫ్ట్‌ల మీద గ్రిప్ ఉంది. ‘యముడు’ సినిమా అద్భుతంగా వచ్చింది. భవానీ రాకేష్ మంచి పాటల్ని ఇచ్చారు. శివ స్క్రీన్ ప్లే బాగుంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నటీనటులు : జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : జగన్నాధ పిక్చర్స్
కథ, దర్శకుడు, నిర్మాత : జగదీష్ ఆమంచి
రైటర్ : హరి అల్లసాని, జగదీష్ ఆమంచి
స్క్రీన్ ప్లే : శివ కుండ్రపు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రజిని ఆమంచి
ఎడిటర్ : కెసిబి హరి
డిఓపి : విష్ణు రెడ్డి వంగా
సంగీతం : భవాని రాకేష్
పీఆర్వో : సాయి సతీష్

Vijay Deverakonda’s ‘Kingdom’ Trailer launched held grandly in Tirupati

తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.
 విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.
‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “గత సంవత్సర కాలంగా ‘కింగ్‌డమ్’ గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.
 కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “నేను చేసింది ఒక్క సినిమానే అయినా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. దర్శకుడు గౌతమ్ గారు ‘కింగ్‌డమ్’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండ గారికి తన వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టాన్ని త్వరలో ప్రేక్షకులు స్క్రీన్ పై చూడబోతున్నారు. అనిరుధ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీ గారు ఒకే సమయంలో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా.. ప్రతి సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. జూలై 31న విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ మీ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ ‘కింగ్‌డమ్’ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. నేను, గౌతమ్ 2018లో జెర్సీ సినిమా చేసి జాతీయ అవార్డు అందుకున్నాం. ఆ తర్వాత గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఇది. రెండున్నరేళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాని చూపించబోతున్నాము. మీరు ట్రైలర్ లో చూసింది శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ గారి అభిమానులు గత నాలుగైదు సంవత్సరాలలో ఏం మిస్ అయ్యారో.. ఆ ఇంటెన్సిటీ ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ గారి కళ్ళలో ఏ ఇంటెన్సిటీ చూశారో.. అది ఇందులో ఉంటుంది. విజయ్ గారి కోసం నేను, గౌతమ్ 100 శాతం ఎఫర్ట్ పెట్టి.. మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. జూలై 31 విడుదలవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.”
 ‘కింగ్‌డమ్’ కథ చాలా బలంగా, అద్భుతంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది. కేవలం యాక్షన్ తో నిండి ఉండటమే కాకుండా.. పాత్రల మధ్య బంధాన్ని చూపించే బలమైన భావోద్వేగాలను కలిగి ఉంది. సూరిగా విజయ్, శివగా సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఆ పాత్రల మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తున్నాయి. ఇవి లోతైన మరియు అర్థవంతమైన అనుభూతిని ఇస్తున్నాయి. మొత్తానికి బలమైన భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన కథను ‘కింగ్‌డమ్’లో చూడబోతున్నామని ట్రైలర్ తో అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రజెన్స్ తో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా భావోద్వేగాలను పండించడంలో ఆయన దిట్ట. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ ట్రైలర్ వెండితెరపై విజయ్ అందించే గొప్ప విందును ప్రతిబింబిస్తుంది.
 ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. బలమైన నాటకీయతను, భావోద్వేగ క్షణాలతో మిళితం చేస్తూ కథను చెప్పడం గౌతమ్ శైలి. ‘కింగ్‌డమ్‌’లోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ లు తమ కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా, అర్థవంతంగా చూపించారు. ఎడిటర్ నవీన్ నూలి తన పనితీరుతో ట్రైలర్‌ను మరింత శక్తివంతంగా మరియు ఆకర్షణీయంగా మలిచారు. 
ఇప్పటికే ‘హృదయం లోపల’, ‘అన్నా అంటేనే’ గీతాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ట్రైలర్ లో అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ట్రైలర్ తో ‘కింగ్‌డమ్’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోన్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. 
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
 సంగీతం: అనిరుధ్ రవిచందర్
 ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC కూర్పు: నవీన్ నూలి నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సమర్పణ: శ్రీకరా స్టూడియోస్ 
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్ 

Pawan Kalyan’s Vedic character in ‘Hari Hara Veera Mallu’ is a blend of mythology and history

Power Star Pawan Kalyan’s lates film Hari Hara Veera Mallu turns out to be a blockbuster. The central story of the historical of how Mughals destroyed Hindu temples during their reign is getting wide appreciation.

The film’s director Jyothi Krisna says at a time when Vedic texts were destroyed, Veera Mallu (Pawan Kalyan), stood against all odds and fought against the Mughals. “He transformed himself into a Vedic Scholar. He deciphered all the Vedic books as his knowledge so that it cannot further be destroyed. Since Veera Mallu is raised in a temple, and was imparted all the Vedic knowledge during his formative years, he eventually becomes a force to reckon with.”
 
Jyothi Krisna also explains how Veera Mallu draws from his knowledge to create a harmonious living environment from the five elements in Vastu Shastra — Earth (Prithvi), Water (Jal), Fire (Agni), Air (Vayu), and Space (Akasha) — that are rooted in Vedic principles.

“His expertise and ability to foresee things are second to none. For instance, he saves Gulfam Khan (Kabir Duhan Singh) from a landslide at the hills. He facilitates the Varuna Yagam (deity associated with the sky) to end drought in a village with rainfall. Veera Mallu’s belief of connecting to the animals (Wolf) through love, compassion and consciousness (Ahimsa) is a cornerstone and emerges from Vedic thought.”

Lord Rama in his epic journey from Ayodhya to Lanka, navigated through various places. So the story of Ramayana is interwoven with these places. It traces his path through places like Chitrakuta, Panchavati (Bhadrachalam), Krauncha Aranya forest, Matanga Ashram, and Rishyamuka before reaching Lanka. Rama’s good deeds at these places during his journey were hailed and termed as ‘landmark moments.’

Similarly, Veera Mallu’s epic mission from Golkonda to Delhi Sultanate – south to north – is a significant journey interwoven with good deeds through Vedic principles. “We blended history and mythology to narrate how Veera Mallu is the protector of Sanatana Dharma. The situations he encountered and the good deeds he had done during the course of his journey can draw parallels to that of Lord Rama’s warrior-like journey.

And when Veera Mallu meets Aurangzeb, it’s a catastrophe. The stage will be set for an ultimate showdown where nature erupts in the form of a whirlwind. “That’s why the climax is like a cliffhanger…nicely sets up the drama for what’s to ensue.”

Meanwhile, to further elevate the audiences’ cinematic experience, Hari Hara Veera Mallu got a Vfx upgrade. The film is further poised for a solid weekend as bookings remain strong across regions.

ZEE5’s “Mothevari Love Story” Trailer Launched by Director Tharun Bhascker,streaming from August 8

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని గతంలో రిలీజ్ చేసిన టీజర్‌ను చూస్తేనే అందరికీ అర్థమై ఉంటుంది. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో, దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఆదివారం నాడు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ చాలా బాగుంది. మై విలేజ్ షో టీం అందరికీ స్పూర్తి. ఇక్కడి వాళ్ల గురించి అమెరికాలో మాట్లాడుకునేవారు. ‘పెళ్లి చూపులు’ చేసే టైంలోనూ ఏదో చరిత్ర సృష్టించాలని అనుకోలేదు. సింక్ సౌండ్‌తో ఆ మూవీని చేశాం. ఆ టైంలో మధుర శ్రీధర్ గారు మాకు అండగా నిలిచారు. భాష, యాస అందరినీ కలిపేసుకుని పోయేలా ఉండాలి. సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు. మై విలేజ్ షో టీం డెడికేషన్, సంకల్పం అన్నింటి కంటే గొప్పది. అనిల్ ఇంకా ఎంతో ఎత్తుకి ఎదుగుతారని నమ్మకంగా చెబుతున్నాను. ఈ ఈవెంట్‌కు నన్ను పిలిచి ప్రమోషన్స్‌లో భాగం చేసిన అందరికీ థాంక్స్. ఈ సిరీస్ అద్భుతంగా ఉండబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

అనిల్ గీలా మాట్లాడుతూ .. ‘ఇలాంటి ఓ స్టేజ్‌కు రావాలని చాలా ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాం. ‘మై విలేజ్ టీం’కి పని చేసే వారంతా కూడా ఒక్కో పనిలో బిజీగా ఉండేవాళ్లం. అందరం కలిసి చేసిన ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. శ్రీకాంత్ అన్న మా ప్రయాణానికి టర్నింగ్ పాయింట్. మా ఊర్లోనే చిన్న చిన్నగా పని చేస్తూ అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు సాధించాం. క్యాస్టింగ్ కాల్ ఎక్కడ కనిపించినా నేను సంప్రదిస్తుండేవాడిని. అలా విజయ్ అన్న ద్వారా తెరపైకి వచ్చాను. తరుణ్ అన్న మా అందరికీ స్పూర్తి. శ్రీధర్ అన్న, జీ5 టీం ఫోన్ చేసిన వెంటనే వెళ్లి ఈ కథను చెప్పాం. ఇప్పుడు ఈ రోజు ఇలా స్టేజ్ మీద ఉంటే.. మేం ఏదో సాధించామనే ఫీలింగ్ కలుగుతోంది. జీ5 టీం, శ్రీధర్ అన్న మా అందరినీ నమ్మి ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. మమ్మల్ని అంతగా నమ్మిన శ్రీధర్ అన్నకి థాంక్స్. చరణ్ అన్న అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ఆగస్ట్ 8న జీ5లో ఈ సిరీస్ వస్తోంది. అందరినీ ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. కుటుంబ సమేతంగా మూడు గంటల పాటు ఏడు ఎపిసోడ్స్‌ చూసేలా ఉంటుంది’ అని అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ .. ‘తెలంగాణలో ఇలాంటి కొత్త కథలు రావడానికి తరుణ్ భాస్కర్ స్పూర్తి. మా కార్యక్రమానికి వచ్చిన ఆయనకు థాంక్స్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథగా ‘మోతెవరి లవ్ స్టోరీ’ రాబోతోంది. ఈ సిరీస్ తరువాత మరెన్నో గొప్ప ప్రేమ కథలు వస్తాయి. ఇది చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ అలరిస్తుంది. అందరికీ ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నా’ అని అన్నారు.

నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘మేం మొదట్లో పెద్ద చిత్రాలకు స్పూఫ్ చేస్తుండేవాళ్లం. అలా ‘పెళ్లి చూపులు’కి స్పూఫ్ చేసి ప్రైవేట్‌లోనే పెట్టుకున్నాం. మై విలేజ్ షో నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాం. ఇది మాకు ఆరంభమే. మున్ముందు మరింత చేయబోతోన్నాం. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జీ5కి థాంక్స్’ అని అన్నారు.

జీ5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ మాట్లాడుతూ .. ‘జీ5 తెలుగు జర్నీలో గ్రామీణ వాతావరణం, మన మూలాల్లోంచి కథల్ని తీసుకు రావాలని అనుకున్నాం. అలాంటి టైంలో మై విలేజ్ షో టీం గుర్తుకు వచ్చింది. అనిల్‌తో జరిగిన ఫస్ట్ మీటింగ్‌లోనే ఈ కథ సెట్ అయింది. ఓ పుస్తకం చదివినట్టుగా ఈ కథ ఉంటుంది. శివ ఈ సిరీస్‌ను చాలా కొత్త మేకింగ్‌‌తో రూపొందించారు. చరణ్ ఆర్ఆర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. మా జీ5 ప్రయాణంలో ఇక అనిల్ ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటారు. శ్రీధర్ గారు మాకు ఈ సిరీస్‌ వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆగస్ట్ 8న జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శకుడు శివ కృష్ణ బుర్రా మాట్లాడుతూ .. ‘‘మై విలేజ్ షో’ ద్వారా మాకు వచ్చిన ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలోనే అందరినీ ఆకట్టుకునేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ రూపొందించాం. అందరినీ నవ్వించేలా, మెప్పించేలా ఉంటుంది. మాకోసం వచ్చిన తరుణ్ భాస్కర్ అన్నకి థాంక్స్. చరణ్ అన్న పాటలు, మాటలు ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉంటాయి. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నకి, జీ5 టీంకు థాంక్స్. అనిల్, వర్షిణి, సదన్న ఇలా అందరూ అద్భుతంగా నటించారు. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన మా టీం, ఆర్టిస్టులందరికీ థాంక్స్’ అని అన్నారు.

వర్షిణి మాట్లాడుతూ .. ‘నాకు తరుణ్ భాస్కర్ గారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ గారికి, జీ5 టీంకి, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ కథ విన్నప్పుడే అద్భుతంగా ఉండబోతోందని అర్థమైంది. ‘పెళ్లి చూపులు’ చూసిన తరువాత మన సినిమా వచ్చిందన్న సంతోషం కలిగింది. ‘దొరసాని’ చూసిన తరువాత మధుర శ్రీధర్ గారితో పని చేయాలన్న కోరిక ఇప్పుడు నెరవేరింది. అనిల్, వర్షిణి అద్భుతంగా నటించారు. మై విలేజ్ షో టీంతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘మా టీం అందరికీ ‘మోతెవరి లవ్ స్టోరీ’ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సిరీస్ అద్భుతంగా వచ్చింది. నేను ఆల్రెడీ ఈ సిరీస్ చూశాను. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. ‘పెళ్లి చూపులు’, ‘దొరసాని’ కొత్త ఒరవడిని సృష్టించాయి. అనిల్‌లో నాకు రవితేజ, రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. సదన్న అద్భుతంగా నవ్విస్తారు. శివ ఈ సిరీస్‌ను అద్భుతంగా రూపొందించారు. ఆగస్ట్ 8న ఈ సిరీస్ జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Sai Kumar: A Half-Century of Cinematic Brilliance

విలక్షణ నటుడు సాయి కుమార్ పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగ్​లు మన కళ్ల ముందు మెదులుతాయి. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాదితోనే ఆయనకు నటుడిగా 50 ఏళ్లు నిండాయి. ఈ 50ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన సాయి కుమార్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇలాంటి అద్వితీయ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించింది. నటుడిగా 50వ ఏటలోకి అడుగు పెట్టిన సాయి కుమార్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో నటించి మెప్పించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఏడాది సాయి కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ‘కోర్ట్’ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించింది.

కొత్త తరం ఆర్టిస్టులు వస్తున్నా, గట్టి పోటీ ఏర్పడినా.. నటుడిగా 50 ఏళ్లు గడిచినా కూడా సాయి కుమార్ ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ.. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, అల్లరి నరేష్ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాధి రాజా’, కోన వెంకట్ గారితో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డి గారితో మరో చిత్రం అంటూ ఇలా ఫుల్ బిజీగా ఉన్నారు.

సాయి కుమార్ కేవలం తెలుగు ప్రాజెక్టులతోనే కాకుండా కన్నడ, తమిళ చిత్రాలతోనూ సందడి చేస్తున్నారు. కన్నడలో ‘చౌకీదార్’, ‘సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర’, శివ రాజ్ కుమార్ గారితో ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో ‘డీజిల్’, విక్రమ్ ప్రభుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే దేవా కట్టా ‘మయసభ’, క్రిష్ తెరకెక్కిస్తున్న ‘కన్యా శుల్కం’ అంటూ అలరించబోతోన్నారు.

సాయి కుమార్ తన తనయుడు ఆదితో ‘ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇక సాయి కుమార్ నట వారసత్వాన్ని కూడా ఆది ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఆది త్వరలోనే ‘శంబాల’ అంటూ అందరినీ మెప్పించబోతోన్నారు. సాయి కుమార్ ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని అభిమానులు, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Varun Sandesh’s ‘One Way Ticket’ Grandly Launched with Pooja Ceremony

డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో, విభిన్నమైన కంటెంట్‌తో వరుణ్ సందేశ్ నిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆదివారం (జూలై 27) నాడు ఘనంగా జరిగాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు వచ్చిన ముఖ్య అతిథులు ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి టీ ఎస్ రావు అతిథిగా విచ్చేశారు. అనంతరం..

త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ .. ‘మా వరుణ్ సందేశ్‌ చిత్ర ప్రారంభోత్సవానికి రావడం నాకు ఆనందంగా ఉంటుంది. వరుణ్ సందేశ్ వైభోగం ఒకప్పుడు నేను చాలా చూశాను. మా డార్లింగ్ వరుణ్ సందేశ్‌కు ఓ హిట్ అవ్వాలన్నదే నా కల. ఈ ‘టికెట్’ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. ‘‘వన్ వే టికెట్’ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేను ఇందులో కొత్త పాత్రను పోషించబోతోన్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా సినిమాకు కార్తీక్ మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నాం. కుష్బూ, మనోజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన త్రినాధరావు నక్కిన, సి. కళ్యాణ్, హర్షిత్ రెడ్డి, నిందా డైరెక్టర్ జగన్నాథ్ గారికి, టీ ఎస్ రావు గారికి థాంక్స్. అందరి ఆశీస్సులు మా సినిమాకు, టీంకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై ఇది మా రెండో చిత్రం. ఈ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ థాంక్స్. వరుణ్ సందేశ్ హీరోగా ఈ మూవీని పళని స్వామి తెరకెక్కిస్తున్నారు. అందరూ మా చిత్రానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ఏ. పళని స్వామి మాట్లాడుతూ .. ‘‘వన్ వే టికెట్’ క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోంది. చాలా మంచి స్క్రిప్ట్ కుదిరింది. వరుణ్ సందేశ్ హీరోగా శ్రీనివాసరావు గారు నిర్మిస్తున్నారు. మా మూవీ పూజా కార్యక్రమాలకు వచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

కుష్బూ చౌదరి మాట్లాడుతూ .. ‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. వరుణ్ సందేశ్ గారితో పని చేయనుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ .. ‘ఈ మూవీ కథ చాలా అద్భుతంగా ఉండబోతోంది. తమిళ దర్శకుడు పళని ఈ మూవీని చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో రూపొందించబోతోన్నారు. 13 ఏళ్ల తరువాత మళ్లీ వరుణ్ సందేశ్‌తో కలిసి పని చేస్తున్నాను. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ .. ‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ థాంక్స్. ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రతీ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, పళని గారికి థాంక్స్’ అని అన్నారు.

నటుడు సుధాకర్ మాట్లాడుతూ .. ‘‘వన్ వే టికెట్’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. వరుణ్ సందేశ్ హీరోగా ఈ మూవీని శ్రీనివాసరావు నిర్మిస్తుండగా.. ఏ. పళని స్వామి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

ఈ చిత్రంలో మనోజ్ నందం, సుధాకర్ ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా శ్రీనివాస్ బెజుగమ్, సంగీత దర్శకుడిగా కార్తిక్ పని చేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

నటీనటులు : వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి, మనోజ్ నందం, సుధాకర్, రామ్ తిరుపతి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్
నిర్మాత: జొరిగే శ్రీనివాసరావు
దర్శకుడు: ఏ. పళని స్వామి
కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగమ్
సంగీత దర్శకుడు : సాయి కార్తీక్
పీఆర్వో : సాయి సతీష్