Home Blog Page 7

‘Joker’ Movie first look released held grandly!!!

మీరా ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సందీప్ రామినేని నిర్మాత గా నిర్మిస్తున్న మోదటి చిత్రం ‘జోకర్’ … మెన్ టూ,రణరంగం, కిరాక్ పార్టీ , తెల్లవారితే గురువారం సినిమాల్లో నటించిన మౌర్య సిద్దవరం ప్రధాన పాత్రలో గీత సి శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు…ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ మరియు అనౌన్స్మెంట్ వీడియో కి మంచి స్పందన లభిస్తోంది, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఈ నెలలో జగగనున్నాయి, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం గా ఈ మూవీ తెరాకెక్కబోతోంది. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ పని చెయ్యబోతున్నారు, వాటి వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు. జోకర్ చిత్ర షూటింగ్ మొత్తం తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇప్పుడు ప్రక్షకులు బాగా చూస్తున్నారు అదే తరహాలో జోకర్ సినిమాను డైరెక్టర్ గీతా సి శేఖర్ తియ్యబోతున్నారు. ఫస్ట్ లుక్ విడుదల తరువాత జోకర్ రోల్ కు మౌర్య సిద్దవరం పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

High Stakes Courtroom Thriller System Movie Premiere Streeming on Prime Video from May 22

Prime Video has officially announced May 22 as the worldwide premiere date for its upcoming Prime Original film System, a gripping courtroom thriller that dives deep into the clash between power and justice. Directed by Ashwiny Iyer Tiwari and produced by Harman Baweja, Pammi Baweja, and Smitha Baliga under Baweja Studios, the film promises an intense narrative that questions privilege, truth, and the true meaning of justice. The film will stream globally across 240+ countries and territories.

System features powerful performances from Sonakshi Sinha, Jyotika, and Ashutosh Gowariker in lead roles, supported by a strong ensemble cast including Preeti Agarwal, Adinath Kothare, Aashriya Mishra, Gaurav Pandey, and Sayandeep Gupta. The story follows Neha Rajvansh, a privileged public prosecutor, and Sarika Rawat, a humble stenographer, whose unlikely alliance leads them to uncover buried injustices—challenging the very system they operate in.

Written by Harman Baweja, Arun Sukumar, Ashwiny Iyer Tiwari, Tasneem Lokhandwala, and Akshat Ghildial, the film blends emotional depth with legal drama, delivering a thought-provoking cinematic experience. With themes of ambition, ethics, and truth at its core, System is set to engage audiences with its layered storytelling and compelling performances when it premieres exclusively on Prime Video this May 22.

Nithiin’s Next with Sithara Entertainments Officially Launched with a Pooja Ceremony.

The film is being produced by the prestigious Sithara Entertainments, known for delivering quality and successful films and is directed by talented filmmakers Nari Sirisawada and Somasekhar T. With a strong creative team coming together, the project makes all of us look.

The film stars Nithiin in the lead role alongside Ritika Nayak as the female lead. The project brings together a skilled and dynamic crew including DOP Anith Madadi, Music Director Suresh Bobbili and Production Designer Jonny Shaik each contributing their expertise to craft a visually rich and engaging film.

The film is being produced by the Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and fortune four cinemas and presented by Srikara studios. This combo is known for delivering quality and successful films.

The shoot is scheduled to commence from the second week of May with the team gearing up to begin production in full swing.

Further updates regarding the project will be announced soon.

Cast & Crew:
Starring: Nithiin, Ritika Nayak

Music: Suresh Bobbili
DOP: Anith Madadi
Production Designer: Jonny Shaik
Executive Producer: S Venkatarathnam (Venkat)
Co-Producers: Upputuri Venkat & VMR
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios
Pro: Lakshmivenugopal

Sati Leelavathi is very entertaining.. Everyone will enjoy the comedy – Lavanya Tripathi Konidela

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రానున్న చిత్రం ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

* ‘సతీ లీలావతి’ మూవీని ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇక ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ సాఫీగా చేశాను.

* ప్రతీ రోజూ షూటింగ్ అయిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. చిత్రీకరణలో చిన్న చిన్న గాయాలు అవ్వడం అనేది కామన్ కదా. అయితే ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పాను. అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అని తెలీదు, ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తాను.

* నేను ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటుంది. మంచి మెసెజ్ ఉన్నా కూడా ఏదో బోధిస్తున్నట్టుగా, క్లాస్ పీకుతున్నట్టుగా అనిపించదు.

* ‘సతీ లీలావతి’లో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను.

* నేను ప్రెగ్నెంట్ కదా? అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. నేను ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశాను. కాలితో కొట్టే సీన్ ఒకటి చేశాను. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది.

* రామ్ చరణ్ గారు మాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఏమైనా హెల్ప్ చేయాలా? కావాలా? అని ఆయన అడుగుతుంటారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించింది. రామ్ చరణ్ రిలీజ్ చేయడంతో మాకు మరింత రీచ్ వచ్చింది.

* దేవ్ మోహన్ గారు మంచి వ్యక్తి. ఆయన అద్భుతమైన నటుడు. ఈ మూవీ కోసం డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా ఉంటుంది.

* చిరంజీవి గారు మా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన్ను ప్రమోషన్స్‌కి పిలిస్తే కచ్చితంగా వస్తారు. మేం కూడా ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం.

* ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. నేను నా ఫ్యామిలీకే టైం కేటాయించాలని అనుకుంటున్నాను. నా కొడుకుతోనే నాకు టైం సరిపోతోంది. కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.

* సీనియర్ యాక్టర్ నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు ఇలా అందరూ అద్భుత పాత్రలు పోషించారు. చాలా ఎంటర్టైనింగ్‌గా ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ గారి ‘సతీ లీలావతి’తో పోల్చలేం. కానీ మా సినిమా మాత్రం వినోదాత్మకంగా సాగుతుంది. అదొక క్లాసికల్ చిత్రం. ఆ చిత్రంతో మా సినిమాని పోల్చకూడదు.

* వరుణ్‌తో కలిసి నటించాలని నాకు కూడా ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలి. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు ఆలోచిస్తాం.

* ‘సతీ లీలావతి’ చిత్రం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

My Goal is to be Known as a ‘Beauty with Brains: Jo Sharma on Her Debut Thriller ‘M4M’

The Indian film industry is abuzz with the upcoming suspense thriller “M4M (Motive For Murder).” Starring American-based actress Jo Sharma and directed by Mohan Vadlapatla, the film is set for a grand worldwide release on May 8. Distributed by PVR Inox Pictures, the movie will hit screens in five languages: Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam.

In an exclusive interview, lead actress Jo Sharma shares insights into her journey, the film’s unique concept, and its international acclaim.

Highlights of the Interview:
– Unique Concept: A “world-first” plot involving murders modeled after legendary paintings.
– Global Recognition: Already bagged 15 International Awards before its theatrical release.
– Cannes Pride: Received a standing ovation at the prestigious Cannes Film Festival.
– Audience Challenge: A cash prize of ₹1 Lakh for identifying the villain on release day.

Q: Tell us about yourself and your upcoming film.
Jo Sharma: Hello everyone! I am Jo Sharma, originally from San Francisco, USA. M4M (Motive For Murder) is my debut feature, and it’s a massive project releasing in five languages. Directed by Mohan Vadlapatla garu, I play a character named ‘Radha’—a fierce crime investigative journalist.

Q: Coming from the US, what was your experience working in the Indian film industry?
Jo Sharma: I have a background as a theater artist in America and even run my own theater production company. However, for this film, I trained under Mohan garu for three years. I was also a co-writer for M4M alongside Mohan garu and Rahul Adavala. Being involved in the writing process helped me design Radha’s character with a lot of depth and strength.

Q: The film has already garnered significant international buzz. Could you share details about the awards?
Jo Sharma: It’s been overwhelming! We have won 15 international awards before the release. This includes Best Film at the Los Angeles Film Festival, Best Director in London, and I was honored with Best Actress awards at the New York, Hollywood, and Santa Monica film festivals. The biggest highlight was our global premiere at Cannes, where international audiences gave us a standing ovation. Seeing foreigners connect so deeply with a Telugu-rooted film was a moment of immense pride for us.

Q: What is the USP (Unique Selling Point) of M4M?
Jo Sharma: It’s a seat-of-the-edge murder mystery. The killer in this movie has a very artistic yet dark “signature”—he arranges the bodies to resemble famous masterpieces by legends like Raja Ravi Varma and Picasso. This is a concept that hasn’t been explored globally. To make things more exciting, we’ve announced a ₹1 Lakh prize for anyone who can correctly identify the villain on the first day of release!

Q: Tell us about the production and your roots.
Jo Sharma: The film is a joint venture between Mohan Media Creations and McQueen Group USA. We produced it with high technical standards on a significant budget. Though I live in the US, I was born in Hyderabad and raised in Nagpur and Mumbai. My parents are from Vijayawada and Guntur, so I am fluent in Telugu, Hindi, and Marathi.

Q: Who are your favorite actors in Tollywood?
Jo Sharma: I have immense respect for legends like Chiranjeevi garu, Balakrishna garu, Nagarjuna garu, and Venkatesh garu. I also admire Prabhas garu for changing the image of Tollywood globally with Baahubali. I love the work of Ram Charan, Allu Arjun, and Mahesh Babu, but I am particularly a huge fan of Jr. NTR’s dialogue delivery and acting prowess.

Q: What is your ultimate goal in the industry?
Jo Sharma: I want to be a versatile actor. I love dancing and acting, and I am looking forward to doing roles that blend glamour with high-octane action. Ultimately, my goal is to be recognized as a “Beauty with Brains.” I hope the audience supports M4M and blesses our team on May 8.

A special poster from Lenin has been released on the occasion of Bhagyashri Borse’s birthday

The upcoming film Lenin is being produced under the banners of Manam Enterprises LLP and Sithara Entertainments by Akkineni Nagarjuna and Suryadevara Naga Vamsi. It stars Akhil Akkineni and Bhagyashri Borse in the lead roles, with direction by Murali Kishor Abburu. The movie is set for a grand theatrical release on June 26.

All the posters and songs released so far have generated strong interest among audiences. Recently, a special poster featuring the heroine was unveiled to mark her birthday.

Wishing her a happy birthday, the makers revealed a striking look where Bhagyashri appears in a regal avatar, wearing a crown, sporting a mustache, and dressed in a unique costume. Her appearance in this look has caught everyone’s attention. The background and significance of this look in the film are yet to be revealed. She is playing as Bharathi in the film.

The music for the film is composed by Thaman S, and both the songs and background score are expected to enhance the film’s overall impact. Leon Britto is handling cinematography, while Naveen Nooli is the editor.

The film will release worldwide on June 26th, 2026.

Cast: Akhil Akkineni, Bhagyashri Borse and others

Technical Crew:
Banners: Manam Enterprises LLP, Sithara Entertainments
Producers: Akkineni Nagarjuna, Suryadevara Naga Vamsi
Presented by: Annapurna Studios
Writer & Director: Murali Kishor Abburu
Music: Thaman S
Editor: Navin Nooli
Cinematography: Leon Britto
Production Designer: Avinash Kolla

Ugly Story Trailer Launched by Bheemla Nayak Director Sagar K Chandra – Film Set for May 22 Release

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేలా సూచిస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీం సినిమా ఔట్ పుట్ పై సంతోషం వ్యక్తం చేసింది. సినిమా పట్ల తమ నమ్మకాన్ని తెలియజేసింది.

డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ, “ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. నందు, అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది. మా ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా చూసి, ప్రేక్షకులు థియేటర్లలో మంచి అనుభవం పొందుతారు” అని తెలిపారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరో నందు మాట్లాడుతూ, “ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో నిండిన స్టోరీ ఇది. అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. డైరెక్టర్ ప్రణవ గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు అద్భుతమైన నిర్మాణ విలువలు అందించారు. ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా ఆస్వాదిస్తారు” అని తన ఉత్సాహం చూపించారు.

అవికా గోర్ మాట్లాడుతూ, “ఈ చిత్రం ద్వారా ప్రేమ యొక్క వాస్తవాలను చూపించాలనుకున్నాం. ట్రైలర్ చూశాక చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. డైరెక్టర్ ప్రణవ గారికి, నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారికి రుణపడి ఉంటాను. మే 22న థియేటర్లలో కలుద్దాం” అని అన్నారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. డైరెక్టర్ ప్రణవ పనితనాన్ని.. నందు, అవిక ప్రదర్శనలను ఎంతగానో మెచ్చుకున్నారు. అలాగే ఈ మూవీకి మొదటి నుంచి ఎంతో సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్ గారికి, ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం చాలా కష్ట పడిందని, ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని అన్నారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.

సాగర్ కె చంద్ర మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుందని టీం ని కొనియాడారు. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.

నటీనటులు : నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్
బ్యానర్ : రియా జియా ప్రొడక్షన్స్
ప్రొడ్యుసర్ : సుభాషిని, కొండా ల‌క్ష్మ‌ణ్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్‌
సహ నిర్మాతలు : రాజ్ నాగ్, అశ్విని శ్రీకృష్ణ
కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా
ఎడిటింగ్ : శ్రీకాంత్ పట్నాయక్
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ కోసనం
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : వారే మీడియా , డిజిటల్ దుకాణం

Actor Mohan Babu announced a financial donation of ₹15 lakhs to the Telugu Film Directors Association(TFDA)

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులెంతో మంది హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పలు భాషలకు చెందిన ప్రముఖ దర్శకులెందరినో సత్కరించారు. ఈ కార్యక్రమంలో..

మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకు వచ్చి మోహన్ బాబుగా మార్చారు. హిందీ చిత్ర దర్శకుడు బాల్కి గారికి ఈ అవార్డుని ఇవ్వడం ఆనందంగా ఉంది. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి గారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దర్శకులంతా కలిసి ఇలాంటి ఈవెంట్ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ స్టేజ్ మీదున్న వారంతా గొప్ప దర్శకులే. ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదిత్య గారి బృందంకు హ్యాట్సాఫ్. ఈ కార్యక్రమాలు అవార్డుల్ని ఎంచుకున్న, ఇచ్చిన తీరు అద్భుతంగా ఉంది. మా యూనివర్సిటీలో అక్కయ్య గారి పేరు మీద గోల్డ్ మెడల్స్ ఇస్తుంటాను. దాసరి గారి పేరు మీద ఆడిటోరియంను కట్టాం. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA)కి పదిహేను లక్షలు ఆర్థిక విరాళాన్ని అందిస్తాను. చిత్ర సీమ ఉన్నంత వరకు దాసరి గారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది’ అని అన్నారు.

జయప్రద మాట్లాడుతూ .. ‘గురువు గారు దాసరి గారి పుట్టిన రోజుని ఇలా సెలెబ్రేట్ చేయడం, ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం ఆనందంగా ఉంది. దాసరి గారు మాకు నటనలో అక్షరాభ్యాసం చేయించారు. ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు. జయసుధ, నేను దాసరి గారితో ఎన్నో చిత్రాల్ని చేశాం. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లుగా ఎన్నో చిత్రాల్లో నటించాం. ఆర్. నారాయణమూర్తి ఎప్పుడూ ప్రజా సమస్యలపై గొప్ప చిత్రాల్ని రూపొందించారు. నాకు గురువు, తండ్రి లాంటి వారు కె. విశ్వనాథ్ గారు. ఎన్నో గొప్ప పాత్రల్ని ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన గురువు దాసరి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయనతో పని చేయడం ఎంతో అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

జయసుధ మాట్లాడుతూ .. ‘గురువు దాసరి గారి వల్లే నేను ఈ రోజు ఇలా నిలబడగలిగాను. ఆయన లేని లోటు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. నా సినీ ప్రయాణంలో ఆయనది చెరగని ముద్ర. అన్ని అవార్డులకంటే ఈ అవార్డు చాలా గొప్పది. ఎంతో మంది గొప్ప దర్శకులు చిత్ర సీమలోకి వస్తున్నారు. మున్ముందు నిర్వహించే ఈ క్రియేటర్స్ ఫీస్ట్‌లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

బాల్కి మాట్లాడుతూ .. ‘దాసరి గారి పుట్టిన రోజుని ఇలా సెలెబ్రేట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఆదిత్య గారు పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నాను. ఇప్పుడు ఇండియాకి సెంటర్‌గా టాలీవుడ్ ఉంది. ఇక్కడి ఆడియెన్స్ సినిమాల మీద చూపించే ప్రేమ మరెక్కడా కనిపించదు. ఇక్కడ నాకెంతో మంది ఇష్టమైన దర్శకులున్నారు. మరీ ముఖ్యంగా సింగీతం గారంటే చాలా అభిమానం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శనంగా నిలుస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు హ్యాట్సాఫ్’ అని అన్నారు.

ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ .. ‘ఇక్కడ ఈ స్టేజ్ మీదున్న గొప్ప దర్శకుల్ని చూసి నేను ఎంతో మురిసిపోతోన్నాను. ఎంతో మంది మహానుభావుల మధ్య ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

వల్లభనేని అనిల్ మాట్లాడుతూ .. ‘దాసరి గారి పుట్టిన రోజున ఈ డైరెక్టర్స్ డే నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ఎన్ శంకర్ గారు, వీర శంకర్ గారు, ఆదిత్య గారు ఇలా అందరూ ఈ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దాసరి గారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

వీర శంకర్ మాట్లాడుతూ .. ‘ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమ కూడా ఇలాంటి ఓ రోజుని నిర్వహించుకోదు. దాసరి గారి పుట్టిన రోజున డైరెక్టర్స్ డే చేయాలని ప్రపోజల్ ఇచ్చిన మహనీయులు కళాతపస్వీ కె. విశ్వనాథ్ గారు. ఎన్. శంకర్ గారు ఎన్నికైన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత గొప్పగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న టీంకు ప్రత్యేక అభినందనలు’ అని అన్నారు.

ఎన్ శంకర్ మాట్లాడుతూ .. ‘సినీ ప్రపంచంలో దాసరి గారి లాంటి వారు మళ్లీ పుట్టరు. ఆయన పుట్టిన రోజుని ఇలా సెలెబ్రేట్ చేసుకోవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘‘దర్శకులు సమాజాన్ని ఉత్తేజపరుస్తారు. ఓ ఆర్టిస్టుని దేవుడిగా తయారు చేస్తారు. అలాంటి శక్తి ఉన్న వారే దర్శకులు. మన తెలుగు దర్శకులు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను. ప్రపంచ స్థాయిలో అవార్డులన్నీ తెలుగు వాళ్లు సంపాదించే రోజు ముందుంది’ అని అన్నారు.

పీజీ విందా మాట్లాడుతూ .. ‘ఓ దర్శకుడు రాత్రీపగలూ అన్న తేడా లేకుండా సినిమా కోసం పని చేస్తుంటారు. అలాంటి దర్శకులకు మే 4న డైరెక్టర్స్ డే అని పెట్టి గౌరవించుకోవడం ఆనందంగా ఉంది. ఇది ఇండియాలో నెంబర్ వన్ ఈవెంట్‌గా మారాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కార్తిక్ రాజా మాట్లాడుతూ .. ‘డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్‌కి మమ్మల్ని ఆహ్వానించిన విఎన్ ఆదిత్య గారికి థాంక్స్’ అని అన్నారు.

ఉదయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘తెలుగులో నేను రెండు సినిమాలకు దర్శకత్వం వహించాను. నేను ఈ రోజు ఇలా ఈ స్టేజ్ మీద నిల్చుండటం గర్వంగా ఉంది. భారత సినీ పరిశ్రమలోని దర్శకుల్ని ఇలా గౌరవిస్తుండటం ఆనందంగా ఉంది. దక్షిణ భారత సినీ దర్శకుల సంఘంకి దాసరి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎంతో మందికి అవకాశాల్ని ఇచ్చారు.’ అని అన్నారు. దర్శకులు ఎంతో మంది హీరోల్ని, సీఎంల్ని కూడా తయారు చేస్తారు’ అని అన్నారు.

రామ్ జగదీష్ మాట్లాడుతూ .. ‘ఎంతో మంది గొప్ప దర్శకులు ఈ స్టేజ్ మీదున్నారు. మాట్లాడేందుకు నా అర్హత కూడా సరిపోదు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న టీఎఫ్‌డీఏ‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్ర సీమ నుంచి నేను కూడా ఓ దర్శకుడిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

మైత్రి రవి మాట్లాడుతూ .. ‘డైరెక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బేబీ తరువాత సాయి రాజేష్ గారు ఇలాంటి సంస్థ కోసం ఎక్కువ టైం కేటాయిస్తుండటం సంతోషంగా ఉంది. ఆదిత్య గారు అందరినీ కో ఆర్డినేట్ చేస్తూ ఈవెంట్‌ను గొప్పగా నిర్వహిస్తున్నారు. మీ ఈ అసోసియేషన్ ఎప్పుడూ ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

బాబు మోహన్ మాట్లాడుతూ .. ‘ఎంతో మంది మహామహులైన దర్శకులతో పని చేశాను. కానీ అందరిలోనూ దాసరి గారు ఎంతో గొప్ప వ్యక్తి. దాసరి గారు నన్నెంతో ప్రేమించేవారు. నన్ను బిడ్డలా చూసుకునేవారు. ఆయన పరమపదించడం దురదృష్టకరం. దాసరి గారి పుట్టిన రోజుని ఇలా డైరెక్టర్స్ డే అని నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు’ అని అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ .. ‘సర్వేపల్లి గారి పుట్టిన రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం. అలానే దాసరి గారి పుట్టిన రోజుని డైరెక్టర్స్ డేని సెలెబ్రేట్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా నమస్కారాలు. మా గురువు దాసరి గారు నాకు అన్నం పెట్టి హీరోని చేశారు. ఇప్పుడు హీరోలు, దర్శకులు ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది’ అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘దాసరి గారు మన అందరినీ అనాథల్ని చేసి వెళ్లిపోయారు. కె. విశ్వనాథ్ గారి సలహాతో మే 4న దాసరి గారి పుట్టిన రోజుని డైరెక్టర్స్ డే గా నిర్వహిస్తున్నాం. ఓ డైరెక్టర్ 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం, 250కి పైగా చిత్రాలకు మాటలు రాయడం, ఐదారు వందల పాటలు రాయడం మామూలు విషయం కాదు. 50 చిత్రాలపైకు పైగా నిర్మించారు, ఎన్నో గొప్ప పాత్రల్ని పోషించారు, ‘ఉదయం’ పేపర్‌ను కూడా ప్రారంభించారు. ఆయన మేధస్సు చాలా గొప్పది. ఇన్ని  పనుల మధ్య సేవా కార్యక్రమాలు, కార్మికుల సమస్యల్ని తీర్చేవారు. ఆయన అంతటి గొప్పవారు కాబట్టే ఆయన బర్త్ డేకి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

Joe Sharma – Mohan Vadlapatla Movie ‘M4M’ Pre-release Event held grandly

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం ప్రత్యేకతగా నిలిచింది.

TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ:మోహన్ వడ్లపట్ల తన టీమ్‌తో కలిసి గొప్ప టాలెంట్‌ను తెరపై ప్రదర్శించారని ప్రశంసించారు. జో శర్మకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.

దర్శకుడు, TFDA Vice President వి సముద్ర మాట్లాడుతూ:మే 8న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలని కోరుకున్నారు.

TFDA సెక్రటరీ పెండ్యాల మాట్లాడుతూ:M4M ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని చెప్పారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు.

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ:సినిమా 24 శాఖలను సమన్వయం చేస్తూ రూపొందించారని, టీమ్ ఎంతో కష్టపడి పనిచేసిందని తెలిపారు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు.

హీరోయిన్ Jo Sharma మాట్లాడుతూ:ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు మోహన్ వడ్లపట్లకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రానికి 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమాను చూసి హిట్ చేయాలని కోరారు.

దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ:సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించినట్లు తెలిపారు. M4M యూనివర్సల్ సబ్జెక్ట్ అని, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నామని పేర్కొన్నారు.

నటుడు MRC వడ్లపట్ల మాట్లాడుతూ:మోహన్ వడ్లపట్ల మంచి టీమ్‌తో మంచి సినిమా తీశారని, హీరోయిన్ జో శర్మ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పారు.

మొత్తానికి, ఆసక్తికరమైన కథాంశం, కొత్త కాన్సెప్ట్‌తో M4M చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్
సహకారం: McWin Group USA
న‌టీన‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, త‌దిత‌రులు.
ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం: మోహన్ వడ్లపట్ల
పీఆర్ఓ: ప‌ర్వ‌త‌నేని రాంబాబు, క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌

Thanks to Ram Charan garu for releasing the ‘Sathi Leelavathi’ trailer.. Lavanya Tripathi at the trailer launch event

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ‘మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు మళ్లీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ మూవీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

తాతినేని సత్య మాట్లాడుతూ .. ‘మా ‘సతీ లీలావతి’ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి, నా డైరెక్షన్ టీంలోని వేణు గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారికి థాంక్స్. మే 8న మా చిత్రం రాబోతోంది. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నాగ మోహన్ మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ చిత్రం మే 8న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. లావణ్య మేడంకి, దేవ్ సర్‌కి థాంక్స్. వారిద్దరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే సినిమాను ఇక్కడి వరకు తీసుకు రాగలిగాం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

జీవన్ బొటిమల మాట్లాడుతూ .. ‘లావణ్య త్రిపాఠి గారితో పని చేయడం వల్ల నాకు వెంటనే ‘విశ్వంభర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు వచ్చాయి. ఆమె నాకు లక్కీ హ్యాండ్‌గా మారారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

బినేంద్ర మీనన్ మాట్లాడుతూ .. ‘సత్య గారితో నాకు ఇది రెండో చిత్రం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎంతో సరదాగా సినిమాని షూట్ చేశాం. డిఫరెంట్ లొకేషన్‌లో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాం. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ చిత్రంలో నేను ఒక పాటను రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మే 8న ఈ మూవీ రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ .. ‘‘భీమిలి కబడ్డీ జట్టు’ నుంచి సత్య గారు నాకు అవకాశం ఇస్తూనే వచ్చారు. లావణ్య గారు ప్రెగ్నెన్సీ టైంలోనూ షూటింగ్ చేశారు. అది చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. నాటి ‘సతీ లీలావతి’ అందరికీ ఇష్టం. ఇప్పుడు మేం తీసిన ఈ ‘సతీ లీలావతి’ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మౌత్ టాక్‌తోనే ప్రస్తుతం థియేటర్లకు జనాలు వస్తున్నారు. మే 8న మా దర్శకుడు సత్య మీద నమ్మకంతో రండి. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

రైటర్ ఉదయ్ మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ రాసినప్పుడు ఎంత ఫన్ అనిపించిందో.. టీజర్, ట్రైలర్ చూస్తే అంత కంటే ఎక్కువగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

న‌టీన‌టులు : లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్‌, న‌రేశ్ వి.కె, స‌ప్త‌గిరి, వీటీవీ గ‌ణేశ్‌, మొట్ట రాజేంద్ర‌న్‌, జాఫ‌ర్‌, జోషి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ‌: ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌
బ్యాన‌ర్స్‌: దుర్గాదేవి పిక్చ‌ర్స్
నిర్మాత‌: నాగమోహ‌న్
ద‌ర్శ‌క‌త్వం: తాతినేని స‌త్య‌
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: బినేంద్ర మీన‌న్‌
మాట‌లు: ఉద‌య్ పొట్టిపాడు
ఆర్ట్‌: కోసనం విఠల్
ఎడిట‌ర్‌: స‌తీష్ సూర్య‌
పి.ఆర్.ఒ: మోహ‌న్ తుమ్మ‌ల‌