Home Blog Page 8

Dr Keerthi MBBS MS Teaser Launched by Senier Actress Kavitha, Movie Releasing on May 8th

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్ తెలుగులో “డాక్టర్ కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్ తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి. ఈ రోజు ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

చిత్ర నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ – కోల్ కత్తా లో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్ గా వుంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అన్నారు

నటి కవిత మాట్లాడుతూ – మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులోకి గోపాలకృష్ణ గారు ఆయన టీమ్ తీసుకొస్తోంది. యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్ లో ఒక డ్యూటీ డాక్టర్ కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు. షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు. ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్ గా ప్రతి ఎలిమెంట్ బాగుంది. ఇలాంటి మూవీస్ ను పెద్ద ప్రొడ్యూసర్స్ పోటీపడి దక్కించుకుంటారు. ఈ పోటీలో గోపాలకృష్ణ గారు ఈ సినిమా దక్కించుకోవడం సంతోషకరం. గోపాలకృష్ణ గారికి, ఆయన శ్రీమతి స్వర్ణకుమారి గారికి మిగతా టీమ్ అందరికీ ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – గోపాలకృష్ణ గారు “డా.కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ అనే ఒక మంచి మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా చూశాను. నేను ఆ మూవీ చూస్తూ కథలో లీనమైపోయాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన మూవీ. ఈ మూవీ చూడగానే పీవీఆర్ వాళ్లు రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారంటే ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితమే. ఈ సినిమా గోపాలకృష్ణ గారికి సూపర్ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.

లీగల్ అడ్వొకేట్ ప్రభాకర్ మాట్లాడుతూ – “డా.కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా గోపాలకృష్ణ గారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటీనటులు – భావన, రెంజి పనికర్, చందునాథ్, డెయిన్ డేవిస్, అను మోహన్, అజ్మల్ అమీర్, అదితి రవి, తదితరులు

టెక్నికల్ టీమ్
డైలాగ్స్: ఏం రాజా శేఖర్ రెడ్డి
ఎడిటింగ్ – అజాస్ పుక్కడన్
సినిమాటోగ్రఫీ – జాక్సన్ జాన్సన్
మ్యూజిక్ – కైలాస్ మీనన్
రచన – నిఖిల్ ఆనంద్
బ్యానర్ – స్వర్ణ క్రియేషన్స్
సమర్పణ – గోపాలకృష్ణ దొండపాటి
నిర్మాతలు – స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి
డైరెక్టర్ – షాజి కైలాస్
పీఆర్ఓ – సతీష్.కె.

First Time Movie Trailer launched by Star actress Payal Rajput

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న “ఫస్ట్ టైం” సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న ముఖ్యఅతిథిగా విచ్చేసిన అగ్ర నటి అందాల తార పాయల్ రాజ్ పుత్ చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.

చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్, విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు హేమంత్ ఇప్పలపల్లి. AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా HI( హ్యూమన్ ఇంటలిజెన్స్) తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈవెంట్ కి అతిథులుగా సీనియర్ నిర్మాత దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి గారు, బిజెపి స్పోక్స్ పర్సన్ ప్రభ గౌడ్ గారు, జి చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ గారూ, హీరో అభినవ్ శౌర్య విచ్చేయగా ముఖ్యఅతిథిగా అందాల తార పాయల్ రాజ్ పుత్ విచ్చేశారు.

దేవగుడి చిత్ర నటుడు ‘అభినవ్ శౌర్య’ మాట్లాడుతూ : అందరికీ నమస్కారం. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిత్ర బంధానికి నా ధన్యవాదాలు. నేను పాయల్ రాజ్పుత్ గారికి వీరాభిమానిని. చిత్ర ట్రైలర్ చాలా బాగుంది, హాలీవుడ్ స్థాయిలో ఉంది. రాజమౌళి గారిని అభిమానించే మీ చిత్రాలు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బిజెపి స్పోక్స్ పర్సన్ ‘ప్రభ గౌడ్ గారు’ మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూసిన వెంటనే నాకు మన సంస్కృతి, మన మూలాలు, మన ధర్మం గుర్తొచ్చాయి. మన మట్టికి సంబంధించిన మూలాలను ఈ సినిమాకి అటాచ్ చేసినట్లు అర్థమవుతుంది. నేటి తరం యువతకు ఒక అర్థమంతమైన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుందని, సినిమా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.

జీ చీఫ్ ఎడిటర్ ‘భరత్ కుమార్ గారు’ మాట్లాడుతూ : అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం_ చిత్ర ట్రైలర్ లాంచ్ కు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్ర కథను ముందుగా విన్నది నేనే. దర్శకుడు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమా చేయడం ఎంత కష్టమో చూసాను. చాలా తక్కువలో గ్రాఫిక్స్ పూర్తి చేశారు. సనాతన ధర్మం గురించి వివరించే చిత్రం ఫస్ట్ టైం. కొత్త వారితో చాలా మంచి సినిమా తీశారు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ ” అన్నారు.

నటి ‘గాయత్రి గుప్తా’ మాట్లాడుతూ : దర్శకులు నన్ను ఆడిషన్ కూడా చేయకుండా తీసుకున్నారు. తొలి దర్శకులు అన్నప్పుడు సాధారణంగా నమ్మకం ఉండదు కాని ఆయన విషన్ వేరు. ఆయనతో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నిలబడే వ్యక్తిని కాబట్టి నాకు ఈ సినిమా మరింత బాగా కనెక్ట్ అయింది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో ‘సౌరబ్ ధింగ్ర’ మాట్లాడుతూ : అందరికి నమస్కారం. ఈ రోజు మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఈ స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్ రాజ్పుత్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తి చేయడానికి హేమంత్ గారు చాలా కష్టపడ్డారు. విఎఫ్ఎక్స్ కోసం చాలా కృషి చేశారు. చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

సీనియర్ దర్శక నిర్మాత’బెల్లం రామక్రిష్ణ రెడ్డి గారు’ మాట్లాడుతూ : ఫస్ట్ టైం చిత్రాన్ని దర్శకత్వం చేసిన ఫస్ట్ టైం డైరెక్టర్ హేమంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. ఈ సినిమా కోసం తన ఆస్తులు కూడా అమ్ముకొని ఈ చిత్రం పూర్తి చేసినట్లు తెలిసింది. సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత ‘హేమంత్ ఇప్పలపల్లి’ గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా నమస్కారం. నేను గురువుగా భావించే వ్యక్తి రాజమౌళి గారు. ఆయన దగ్గర పని చేయనప్పటికీ ఆయన సినిమాలు నాకు ప్రేరణగా నిలిచి నేను ఈ సినిమా తీసేందుకు తోడ్పడ్డాయి. ఆయన మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాము. ఈ సినిమా కోసం సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అనుకుంటున్నాను. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

ముఖ్య అతిథి నటి ‘పాయల్ రాజ్ పుత్’ మాట్లాడుతూ : అందరికి నమస్కారం. కొంతకాలం గ్యాప్ తర్వాత మీ అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని తమిళ పంజాబీ చిత్రాల వల్ల నేను హైదరాబాద్ కు రాలేకపోతున్నాను. తెలుగు మీడియా వారిని మరోసారి ఇలా కలవడం చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర దర్శక నిర్మాత హేమంత్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం సినిమా చాలా మారిపోయింది. గత రోజులతో పోలిస్తే ఇప్పుడు కథలు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఎంతో కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చూస్తే షాకింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి హీరోయిన్ రాలేకపోయారు. వేరే చిత్ర షూటింగ్ వల్ల బిజీగా ఉన్న ఆమె తర్వాత ఈవెంట్స్ లో కచ్చితంగా ఉంటారు. తెలుగు ప్రేక్షకులు టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో ఎప్పుడు ముందుంటారు. అదేవిధంగా ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా శౌరబ్ ను చూస్తున్నాను. అతని డేడికేషన్ నాకు తెలుసు, ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డారు. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా షౌరబ్ ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందం వారికి ఆల్ ద బెస్ట్. మే 22న ఈ చిత్ర విడుదల కోసం నేను ఎదురు చూస్తున్నాను” అన్నారు.

నటీనటులు :
సౌరబ్ ధింగ్ర హీరోగా, అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం :
రచయిత ఎడిటర్ విఎఫ్ఎక్స్ లీడ్ నిర్మాత మరియు దర్శకుడు : హేమంత్ ఇప్పలపల్లి
సంగీతం : శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్ మరియు రామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. రాజశేఖర్
పి ఆర్ ఓ : ఎస్ నాగేశ్వరరావు (ఎస్ ఎన్ ఆర్)
మార్కెటింగ్ పార్టనర్ : పుష్యమి మీడియా
పబ్లిసిటీ డిజైనర్ : వెంకట్ మజ్జి

Popular actress Manjula granddaughter Jovika Vijay Kumar in ‘Agadha’ Movie

The makers of ‘Agadha’ have unveiled a striking new poster introducing young actress Jovika Vijay Kumar, who is making her acting debut with this mystical divine thriller. The poster has instantly caught attention across platforms for its intense visual appeal and mysterious tone.

Set in a dimly lit ancient backdrop, Jovika is seen in a stunning look. Her expressive eyes carry a mix of innocence and hidden strength, hinting at a character that is deeply connected to the spiritual and mystical core of the story. The rain effect adds to the intensity as well.

Interestingly, years ago M. S. Raju introduced Jovika’s mother Vanitha Vijayakumar to cinema with ‘Devi’. Now, he introduces the next generation, marking a rare and emotional cinematic connection across generations. Jovika is the grand daughter of veteran and versatile actress Manjula who was very active in Telugu and Tamil films.

Earlier posters from the film revealed powerful characters that established the mystical tone of ‘Agadha’ . The poster of Mahadevi showcased a divine feminine presence surrounded by spiritual intensity. Another impactful poster introduced Shravan Reddy as Simha, standing in darkness holding a blazing torch, symbolising his journey through fear, mystery, and unknown forces.
Another poster is that of Ulka Gupta who is seen as Mahima and this also grabs the attention with its intense appeal.

Being made on a grand scale under the banner of Sri Adi Varaha Productions, the film is produced by Kasi Visalakshi Balusu and written and directed by M. S. Raju.

With 85 days of shoot, extensive set work, and nearly 45 minutes of VFX, Agadha promises a unique cinematic experience. The film is being made simultaneously in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi and is currently in post production.

Technical Team

Writer and Director: M. S. Raju,
Producer: Kasi Visalakshi Balusu,
Banner: Sri Adi Varaha Productions,

Music Director: Rakesh Venkatapuram,
Cinematography: Nani Chamidishetty,
Editor: Junaid Siddiqui,
Production Designer: Rajeev Nair,
Additional Screenplay: Chaitanya Vegi,
Executive Producer: N V N Subbaraju

Anand Deverakonda & Vaishnavi Chaitanya’s EPIC Movie Teaser launched held grandly

EPIC – First Semester has already caught everyone’s attention with audiences genuinely curious about what’s coming. It promises a heartwarming experience and the first single Sancharame has already created a strong wave. Now, with the teaser finally out, the excitement only gets bigger.
And it delivers nothing short of a beautiful experience with Anand Deverakonda and Vaishnavi Chaitanya at its heart. After Baby, this pair already holds a cult following and here they return with a completely fresh and evolved dynamic.
Directed by debutant Aditya Haasan, known for the 90’s web series, the film marks his entry onto the big screen and it already feels like a winner. Music is composed by Hesham Abdul Wahab, first single of EPIC, Sancharame has struck a chord with audiences trending across platforms and further amplifying the film’s growing anticipation.
With a vibrant London backdrop, this one comes across as a relatable and engaging love story. The film appears to explore contemporary relationships and the evolving dynamics of love, presenting a contrast in personalities. With Anand portraying an introverted character and Vaishnavi bringing alive an extroverted, expressive role.
Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune four Cinemas and presented by Srikara Studios, the film boasts strong technical backing with cinematography by Azeem Mohammad, production design by Avinash Kolla and editing by Navin Nooli.
With the teaser now out and Sancharame already emerging as a musical hit, EPIC – FIRST SEMESTER is gearing up for a grand release with more exciting updates expected soon.
CAST & CREW
Starring: Anand Deverakonda, Vaishnavi Chaitanya
Writer & Director: Aditya Haasan
Music: Hesham Abdul Wahab
Cinematography: Azeem Mohammad
Editing: Navin Nooli
Executive Producer: Phani K Varma
Co-Producers: Venkat Upputuri – VMR
Produced by: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios
Pro: LakshmiVenuGopal 

King Nagarjuna Massive Confidence on LENIN, Promises NEW AKHIL to audiences in theatres On June 26th

Young and dynamic actor Akhil Akkineni’s next film Lenin has already created a strong buzz with its chartbuster songs VaareVaa VaareVaa & Yetta Yetta. The addictive tracks composed by Sensational music director Thaman, grabbed everyone’s attention building positive buzz to the film.
 
Recently, King Nagarjuna watched the first copy of Lenin and was highly impressed with the film’s output and the team. So much so that he shared a tweet today on X, revealing that he watched the film yesterday and loved it. The actor also promised that with this film, audiences will witness a “new Akhil” on the big screens on June 26.

He wrote, “Watched the first cut of our film LENIN last night. I say this with confidence and pride… you are about to witness a new Akhil on June 26, 2026. Mark the date!!! See you in theatres.” This message has delighted Akkineni fans, who are eagerly waiting to celebrate Akhil’s performance, hoping this film will be a big break for the actor.

Lenin stars Bhagyashri Borse as the female lead. Directed by Murali Kishor Abburu, Lenin is shaping up to be a complete cinematic package filled with powerful emotions and engaging storytelling. This much-anticipated project is set to release in theatres on June 26, 2026. The team assures audiences that the film will be presented in its finest form, delivering a memorable big-screen experience.

The film also features music by Thaman S, adding to the overall scale and appeal. Produced by Akkineni Nagarjuna and Suryadevara Naga Vamsi under Manam Enterprises LLP and Sithara Entertainments, and presented by Annapurna Studios, the film promises a memorable big-screen spectacle.

Cast: Akhil Akkineni & Bhagyashri Borse

Written & Direction: Murali Kishor Abburu
Producers: Akkineni Nagarjuna, Suryadevara Naga Vamsi
Banners : Manam Enterprises LLP, Sithara Entertainments
Presents: Annapurna Studios
Music: Thaman S
Editor: Navin Nooli
DOP: Leon Britto
Production Designer: Avinash Kolla

After Strong CinemaCon Response, Rocking Star Yash’s ‘Toxic’ Release Shifted for Larger Global Release

KVN Productions and Monster Mind Creations today announced that the release of Toxic: A Fairy Tale for Grown-Ups has been rescheduled. The film, which was earlier set to release on June 4, 2026, will now arrive in theatres worldwide on a new date to be announced soon.

The decision follows the film’s presentation at CinemaCon, where it received a strong and encouraging response from global distributors and industry stakeholders. The reception opened up opportunities for a significantly wider international release, prompting the team to revisit and realign their release strategy.

With the film now complete, the makers are currently focused on locking global distribution and forging key international partnerships to ensure Toxic reaches audiences across markets at the scale it demands. The film is written by Yash and Geetu Mohandas, and directed by Geetu Mohandas.

*Statement from Yash*

“There are films we make, and then there are films that remind us why we fell in love with cinema. Toxic has been one such journey. Presenting our film at CinemaCon and witnessing the overwhelming global response reaffirmed what we have always believed—that this film deserves to reach its fullest potential worldwide.

Toxic is complete, and we are currently aligning global distribution and partnerships. In light of this, we have decided to recalibrate our release timeline. While we will not be releasing on June 4 as announced earlier, we will be releasing at a later, globally aligned date. Toxic will come to theatres across the world soon.

At a time when Indian cinema is finding its voice and stepping onto the global stage with such promise, each of us has a responsibility to raise the bar. As an actor and producer, I see this moment as an opportunity to do my part—for the Indian film industry and for all of us—by taking the time to ensure our film reaches the world with the impact it is meant to have.

Through every step and every change, your support has stayed with me, and I carry it with deep gratitude. Some stories ask for patience. Some journeys demand it. We promise to give you a film to enjoy and celebrate—a film that will stand as a proud moment for Indian cinema.”

Toxic: A Fairy Tale for Grown-Ups stars Yash alongside Nayanthara, Kiara Advani, Huma Qureshi, Rukmini Vasanth, and Tara Sutaria.

Shot in Kannada and English, the film will also be released in dubbed versions in Hindi, Tamil, Telugu, and Malayalam.

Produced by KVN Productions and Monster Mind Creations, the film will release in theatres worldwide on a new date to be announced soon.

Kara Is a Solid Family Drama with Strong Emotional and Thrilling Elements – CH Satish Kumar

With Kara gearing up for its theatrical release on April 30, 2026, the film is steadily building momentum in the Telugu market. Starring Dhanush and directed by Vignesh Raja, the film is being presented in Telugu by CH Satish Kumar under Vigneswara Entertainments, marking a focused push into the region.

Vigneswara Entertainments has built a steady presence in Telugu distribution over the years, backing films such as Kabali, Singham 3, Arjun Reddy, Khakee and Salaar. With a mix of large-scale commercial releases and content-driven films, the banner now brings Kara to Telugu audiences.

In a recent interaction, CH Satish Kumar spoke about acquiring the film, its content strength, and expectations for the Telugu release.

Q: What’s your background?
Satish: I hail from Visakhapatnam. I started slowly with small film distribution. Over the years I became capable of handling big films too. For Uttarandhra, I distributed Arjun Reddy, Kabali, and Singham 3. I also handled Dharmayogi (Dhanush’s Kodi in Telugu), which did good business and received a good reception. I also distributed Khakee in Telugu. Since then, I’ve wanted to get into production.

Q: Going solo? Or do you have partners?
Satish: Solo.

Q: Since no one is purchasing the movie after seeing it, did you make the choice based on Dhanush’s market?
Satish: No entirely. More than stars, content is driving the market. So based on the content and Dhanush sir’s following, I made the choice.

Q: Kubera is a straight film, while Idli Kottu and Tere Ishq Mein are dubbed ones. Based on their performances in Telugu, don’t you think this film is a bit risky?
Satish: Raayan was a success in Telugu too, while Idli Kottu had great content, somehow they couldn’t take the film to the audience’s doorstep. So, I took proper measures not to repeat it with my film.

Q: The producer mentioned that you chased him for quite some time?
Satish: See, for any good content film, even big producers try to acquire it quite early. But I was more persistent with the producer to bag the film, and he saw that and gave me confidence that he would sell the film to me only.

Q: Where do you stand on the business aspect?
Satish: We’ve already covered 80% of the film.

Q: The trailer shows many things, including a bank robbery. What would you say about the movie?
Satish: Well, I can’t reveal much about the film, but I’d say it’s the story of a man who is caught up in some dire situations and pulls himself up from them. Bank robbery is also a part of it, but this is not a heist film. The film has many strong elements of family, survival, and intense emotions. Every family shall connect to this film.

Q: Were there any major challenges in your journey?
Satish: Until you achieve success, everything is a challenge. I just made sure they never became my setbacks.

Q: Are you distributing alone for all Telugu states?
Satish: No sir, we shall be giving it territory-wise. Dil Raju is handling Nizam, and Alankar Prasad sir after a long time saw something in this film and is handling the distribution for Krishna District. Ceeded was split among four others.

Q: So how many screens?
Satish: There might be a Hindi release too; there is a bit of confusion. If that clears up, I’m expecting more than 600 theatres, while 400+ are confirmed.

Q: Is there any reason why you didn’t change the Tamil title in Telugu?
Satish: The protagonist’s name is Kara Swamy and everyone calls him Kara. Since the name isn’t alien to us, we decided to go ahead with it.

Q: Did you watch the director’s previous film?
Satish: Of course, Por Thozhil is such a seat-edge thriller, and it was the film that gave 100% confidence to acquire it at any cost.

Q: What was your conversation with Dhanush?
Satish: Dhanush sir is very happy and fully confident that this film shall be a blockbuster, setting some records.

Q: Is this a character-driven film?
Satish: No, it’s just for the narrative, but the story involves the surrounding village and other elements too.

Q: Your trailer also showed the fuel crisis, which feels quite relevant today.
Satish: See, the film takes place in a time when a similar crisis happened—to be precise the Gulf War. But that is not the plot, just a plot device. And that shall be a good plus because of the relatability.

Q: How was the audio response?
Satish: We made two songs for Telugu. But the reach was so good. Kannamma was written by Ramajogayya Sastry, who gave the character depth through the lyrics.

Q: Any line-ups?
Satish: I’m in talks for Peddi. It should get finalized in a couple of days.

Q: So what do you have to say about Kara finally?
Satish: Kara is a solid family drama that has many thrilling elements in it. Dhanush sir’s character is so original—any family shall relate and connect to what he does in the film.

Set during the 1991 Gulf War period, with the fuel crisis forming a key backdrop, Kara centres on an ordinary man navigating a series of difficult, life-altering situations. The film blends elements of family drama, survival, and tension, led by Dhanush alongside Mamitha Baiju, with supporting performances from K. S. Ravikumar, Jayaram, Karunas, and M. S. Bhaskar. Directed by Vignesh Raja, with music by G. V. Prakash Kumar, the film is produced by Ishari K. Ganesh under Vels Film International, in association with Think Studios.

Kara releases in Telugu theatres on April 30, 2026.

‘Spirit’– India’s First Film Produced by a Shepherd Woman, Releasing May 8

8th వండర్ సినిమా బ్యానర్ పై రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి నటీనటులుగా సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ఒక గొర్రెలు కాచుకునే భార్య భర్తల అయిన చిన్నబోయిన రైతు నర్సమ్మ వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన చిత్రం స్పిరిట్. వీరికి చదువు రాకపోయినా ఆర్టిస్టులను పెట్టుకుని తన కొడుకుతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు వి.సముద్ర, నటులు నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత రామ్ దాస్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం

నటుడు నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ : మనసులో భయం ఉంటే అది స్పిరిట్ గా ఉంటుంది.. అది లేకపోతే మనల్ని చూసి స్పిరిట్ పారిపోతుంది. కాబట్టి భయపడకుండా ఉండాలి ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటాడు ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం కాబట్టి ఏ స్పిరిట్ ఏమి చేయలేదు.కానీ తెలియక ఏవో భయాలతో వెళ్తుంటాము ఎప్పుడైతే నిర్భయంగా ఉంటామో అప్పుడు ఏదైనా సాధించగలము. దానికి నర్సమ్మ నిదర్శనం.గొర్రెలు కాచుకునే నర్సమ్మ సినిమా నుంచి ఇన్కమ్ వస్తుందా రాదా అని ఆలోచించకుండా తన కొడుకుతో సినిమా చేయాలనే పట్టుదలతో ఈ సినిమా తీసింది. ఆమెకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. స్పిరిట్ అనగానే ప్రభాస్ చేస్తున్న టైటిల్ గుర్తొస్తుంది. అంత మంచి టైటిల్ తో చేస్తున్న నరసమ్మ గారు చేస్తున్న స్పిరిట్ అనే సినిమా ఈ రోజున వాళ్ళలో మొదలైంది కాదు అందరిలాగా కోట్లు పెట్టుకొని వచ్చి ఈ సినిమాకి తీయలేదు.సినిమా తీయాలి అనే కోరికతో వచ్చి తను అమ్మవారిని నమ్ముకుని ఈ సినిమాని తీసింది.అమ్మవారే కాపాడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆవిడ తన కుటుంబంకోసం కష్టపడ్డ ప్రతి రూపాయి తిరిగి రావాలి.ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ప్రజలందరూ ఇది వాళ్ళ సినిమాగా భావించి ఈ సినిమాని గొప్ప ఘనవిజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

నిర్మాత రామ్ దాస్ మాట్లాడుతూ..రైతులైన నర్సమ్మ, వెంకటేశ్వర్లు లు సినిమా తీసి మా దగ్గరకు వచ్చారు. కొడుకు నాతో మా అమ్మ కూలి పని చేసి కోటి రూపాయలతో సినిమా చేశాము అని చెపితే ఆశ్చర్యపోయి వాళ్ల మాటలకు నేను బెండ్ అయ్యాను. నేను చాలామంది గొప్ప వారిని చూశాను కానీ గత 25 ఏళ్లలో ఒక కూలి పని చేసి సినిమా తీసిన వారిలో గత నేను నరసమ్మను మాత్రమే చూశాను అలాంటి డేరింగ్ డాషింగ్ నరసమ్మకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అలాగే తన ఊరిలో ఉన్న థియేటర్లో సినిమాతో పాటు తను పెట్టిన డబ్బులు రిటన్ వచ్చేలా చూస్తామని తెలియజేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులందరూ పెద్ద మనసు చేసుకొని ఆమె పడిన కష్టాన్ని వృధా కానివ్వకుండా ప్రజలందరూ ఆదరించి ఆశీర్వదించి సినిమాను పెద్ద విజయం వైపు నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

చిత్ర నిర్మాతలు చిన్నబోయిన రైతు నర్సమ్మ, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ : ఈరోజు నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను నాకున్న గొర్రెలను అన్ని అమ్ముకొని సినిమా తీశాము.అందరూ నన్ను ఎగతాళి చేసినా కూడా నేను పట్టించుకోలేదు. నా కష్టం చూసిన వారు మాత్రం నాకు ఫుల్ గా సపోర్ట్దు చేశారు. ఇది నా ఒక్కరిది కాదు అందరి సినిమా. మనం అందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

చిత్ర దర్శకుడు సి. హెచ్. రవీంద్రనాథ్ మాట్లాడుతూ. అందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు మాత్రం జన్మతో పాటు మా పెద్దలు జీవితాన్ని కూడా ఇచ్చారు అది నేను జీవితాంతం మర్చిపోలేను ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నందుకు సంతోషంగా ఉంది

నటీ నటులు :
రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి తదితరులు

బ్యానర్ : 8th వండర్ సినిమా
నిర్మాతలు : చిన్నబోయిన రైతు నరసమ్మ వెంకటేశ్వర్లు
డైరెక్టర్ : సిహెచ్ రవీంద్రనాథ్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ ఎస్ వెంకటేష్, సంతోష్ కావాలా
ఎడిటర్ : రాజారావు కలుపు రెడ్డి
పి. ఆర్. ఓ: కడలి రాంబాబు.
డిఓపి : రాజ్ కమల్ పి భరత్
సింగర్స్ : కౌసల్య మాళవిక

Anjali Joins Vishal’s Makutam as Female Lead; Concept Video Sparks Laughter

Actor Vishal is gearing up for his most ambitious next project Makutam, which marks the 99th film under the prestigious Super Good Films banner, produced by RB Choudary. Interestingly, Vishal is also taking on the roles of director and screenplay writer, adding a strong personal creative touch to the film. From the posters and early promotional material released so far, Makutam appears to be a distinctive action entertainer with a fresh narrative approach. Adding to the excitement, it has now been officially confirmed that actress Anjali will star opposite Vishal. The duo, known for their successful collaborations and strong on-screen chemistry, are reuniting once again, raising expectations.

To announce her inclusion, the makers released a quirky and engaging concept video featuring both Vishal and Anjali. The video unfolds like a mock narration session, with Vishal, as the director, approaching Anjali to pitch the story. However, instead of listening quietly, Anjali playfully interrupts him at every turn. When Vishal begins with a typical line like “It’s a beautiful village…,” she humorously cuts him off, saying such details are the production team’s responsibility and urging him to get to the actual story.

As Vishal continues narrating in a rather vague manner, Anjali keeps delivering witty jabs and sarcastic remarks. Eventually, she bluntly questions whether he even has a proper story, leaving Vishal flustered. Unable to handle her sharp counters, he comically walks away, promising to return with a better narration the next day. The video ends on a humorous note, highlighting their natural chemistry and comic timing.

The entertaining concept video has sparked laughter and has quickly gone viral across social media platforms, drawing praise for its creativity and humor.

On the technical front, the music for Makutam is composed by GV Prakash Kumar, while cinematography is handled by Richard M Nathan. NB Srikanth serves as the editor, and Durairaj is in charge of art direction.

Hero Dhanush KARA Telugu Pre-release Event held grandly, Movie Releasing on April 30

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమిత గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘వేల్స్ తరుపున గణేష్ గారు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు. విఘ్నేశ్ గారు తీసిన ‘పోరు తొళిల్’ అంటే నాకు చాలా ఇష్టం. జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ నాకు ఇష్టం. మమిత గారి వర్కింగ్ నాకు ఇష్టం. నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్ గారి లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా, అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి. ధనుష్ గారి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’లో ఇచ్చే ఆ చిన్న స్మైల్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కేఎస్ రవి కుమార్ గారి మేకింగ్, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సతీష్, రాజేష్ గారికి ఈ మూవీతో లాభాలు రావాలి. ఏప్రిల్ 30న ‘కర’ రాబోతోంది. తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించి పెద్ద హిట్ చేయండి’ అని అన్నారు.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ .. ‘ధనుష్ గారిని చూసేందుకే ఈవెంట్‌కు వచ్చాను. కాళీపట్నంలో కర మాస్టర్ అని ఉండేవారు. ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు. ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు. రెహమాన్ గారు ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. ఏప్రిల్ 30న ‘కర’ మంచి విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. ‘‘కర’ టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్న గణేష్ గారికి థాంక్స్. ధనుష్ గారితో చేసిన ‘సార్’తో వల్లే నాకు ఇంతటి ప్రేమ, అభిమానం దక్కాయి. ‘కర’ మీద నాకెంతో నమ్మకం ఉంది. ఇది తెలుగులో అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాను. ‘సార్’ కంటే భారీ హిట్ అవ్వుతుంది. ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలి. మమిత గారు ఎంతో నేచురల్‌గా యాక్ట్ చేస్తారు. కేఎస్ రవి కుమార్ గారితో వర్క్ చేయాలని ఉంది. ధనుష్, జీవీ ప్రకాష్ బాండింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ‘పోరు తొళిల్’ తర్వాత విఘ్నేశ్‌కి తెలుగులో మంచి ప్రేమ లభించింది. ఏప్రిల్ 30న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు.

మమిత బైజు మాట్లాడుతూ .. ‘తెలుగు ప్రేక్షకులు నాపై కురిపిస్తున్న ప్రేమకు థాంక్స్. ‘కర’ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకెంతో నేర్పింది. నాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి థాంక్స్. నాపై నమ్మకంతో నాకు ఈ పాత్రను ఇచ్చిన విఘ్నేశ్ గారికి థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసిన వేల్స్ ప్రొడక్షన్ కంపెనీకి థాంక్స్. మా కోసం వచ్చిన మా డైరెక్టర్ వెంకీ గారికి, మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా ‘కర’ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు విఘ్నేశ్ రాజా మాట్లాడుతూ .. ‘‘పోరుతొళిల్’ సినిమా చూసి తెలుగు ఆడియెన్స్ నన్నెంతో ప్రశంసించారు. అదే స్పిరిట్‌తో ఈ ‘కర’ మూవీని తీశాను. ఇది మీరు పెట్టే డబ్బు, మీ సమయం అన్నింటినీ గౌరవించేలా ఉంటుంది. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. మీడియానే మా చిత్రాన్ని జనాల వద్దకు తీసుకువెళ్లాలి. నాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి, మమితా గారికి, కేఎస్ రవి కుమార్ గారికి థాంక్స్. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా మూవీ చూడండి. కచ్చితంగా మిమ్మల్ని నిరాశపర్చదు’ అని అన్నారు.

నిర్మాత డా. ఐషరి కె. గణేష్ మాట్లాడుతూ .. ‘తెలుగులో ఇదే నా మొదటి ప్రమోషనల్ ఈవెంట్. హైదరాబాద్‌లో నాకు రెండు కాలేజీలున్నాయి. మహావీర్ హాస్పిటల్స్ ద్వారా మేం కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. నిజామాబాద్‌లోనూ మాకు డెంటల్ హాస్పిటల్ ఉంది. సాయి తేజ్ గారు మా చెట్టినాడ్‌లోనే చదివారు. ఈ రోజు ఆయన మా కోసం రావడం ఆనందంగా ఉంది. విఘ్నేశ్ ఆల్రెడీ మాకు మంచి మూవీని ఇచ్చారు. ఇప్పుడు ఈ ‘కర’ కూడా మంచి విజయం సాధిస్తుంది. మాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి థాంక్స్. తెలుగులో రిలీజ్ చేస్తున్న సతీష్ గారు, రాజేష్ గారికి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత కుష్మిత గణేష్ మాట్లాడుతూ .. ‘మా ‘కర’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సతీష్ గారు, రాజేష్ గారికి థాంక్స్. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన విఘ్నేశ్ గారికి, ధనుష్ గారికి, మమిత గారికి థాంక్స్. మా కోసం వచ్చిన సాయి తేజ్ గారికి, బుచ్చిబాబు గారికి, వెంకీ అట్లూరి గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సతీష్ కుమార్ మాట్లాడుతూ .. ‘నాకు ‘కర’ మూవీని తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన గణేష్ గారికి, ధనుష్ గారికి థాంక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రానున్న ఈ మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి థాంక్స్. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్ ఆర్ స్టార్ లాజిస్టిక్ రాజేష్‌కి థాంక్స్’ అని అన్నారు.

కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘‘కర’ మూవీకి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. నాకు తెలుగు ఆడియెన్స్ గురించి ఎంతో బాగా తెలుసు. తమిళంలో నా సినిమాలు ఇక్కడ రీమేక్ అయితే బ్లాక్ బస్టర్స్ చేశారు. మీ ప్రేమ నాకు దొరకడం అదృష్టం. గణేష్ గారి రక్తంలోనే సినిమా పట్ల ప్యాషన్ ఉంది. విఘ్నేశ్ ఎంతో సున్నితమైన వ్యక్తి, అన్ని క్రాఫ్ట్‌ల మీద ఆయనకు పట్టు ఉంది. ఈ మూవీలో నాకెంతో మంచి పాత్రను ఇచ్చారు. ధనుష్ అద్భుతమైన నటుడు. ఏప్రిల్ 30న ‘కర’ సినిమాని చూసి అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.