
Anukunnadhi Okkati Ayyindhi Okkati’ to Release in February
Sharwanand’s Sreekaram To Release On April 24th
Young hero Sharwanand’s latest flick Sreekaram is in the last leg of shooting which is happening in & around Hyderabad. Recently, the makers of the film unveiled first look poster which got good response. Now, they have announced the film’s release date. Sreekaram will be releasing worldwide on April 24th. Summer indeed is one of the biggest seasons for films release and Sharwanand will be cashing on the long holidays with Sreekaram.
Sharwanand is romancing Gang Leader fame Priyanka Arul Mohan in this family entertainer being directed by Kishore B. The film is produced by Ram Achanta and Gopi Achanta of 14 Reels Plus Banner. This is their 2nd production after the blockbuster Gaddalakonda Ganesh.
Micky J Meyer who is in good form and proved that he can give mass tunes as well with Gaddalakonda Ganesh is providing sound tracks for Sreekaram. Renewed writer Sai Madhav Burra penned dialogues for the film for which cinematography is by J Yuvraj and art by Avinash.Kolla.
Cast: Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Amani, Sr Naresh, Sai Kumar, Murali Sharma, Satya, Sapthagari etc.
Technical Crew:
Producers: Ram Achanta, Gopi Achanta
Director: Kishore.B
Music: Mickey J Mayer
Dop: J.Yuvraj
Dialogues: Sai Madhav burra
Art: Avinash Kolla
Editor: Marthand K Venkatesh
Executive Producer: Harish Katta
Choosi Choodangaane Movie Thanks meet
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధు దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే`.వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్స్. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలై పాజిటీవ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో థాంక్స్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా…
చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేషసింధు ది బెస్ట్ అవుట్ పుట్ అందించారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీబాగా పండింది. హీరోయిన్ గా తెలుగులో వర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక తన పెర్‌ఫామెన్స్‌తో అందరినీఆకట్టుకుంది. మా అబ్బాయి శివకు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూఅంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు’ అన్నారు.
దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ – “ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక కి ఈ సినిమా ద్వారా మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు“ అన్నారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ – “చాలా నేచురల్ గా సినిమాను తీయాలనుకున్నాం అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యూత్ తో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్అవుతుంది. నాకిది డెబ్యూ అయినా బాగా చేశానని అంటుంటే సంతోషం గా ఉంది. నటుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమా కి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ఆశించలేదు. సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్“ అన్నారు.
మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్, రైటర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు
Three Monkeys Movie released on February 7
జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో,.
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ – ‘త్రీ మంకీస్’ ఇప్పటి వరకు నేను భరించాను. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నా జబర్దస్త్ ని మించి ఈ సినిమా ఉంటుంది. కామెడీ తోపాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది. ఈ సినిమాలో సుధీర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గెటప్ శ్రీను అప్ కమింగ్ డైరెక్టర్‌గా, రాంప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తారు. ఇక హీరోయిన్ కారుణ్య సన్నీలియోన్ గా మిమ్మల్ని అలరిస్తుంది. రేపు థియేటర్ లో సినిమా చూసి తప్పకుండా ఎమోషన్ అవుతారు“అన్నారు.
చిత్ర నిర్మాత నగేష్ – “ సినిమా పూర్తయి చాలా రోజులైంది మంచి టైమ్ కోసం వెయిట్ చేశాం ఫిబ్రవరి 7నమంచి టైమ్ గా భావిస్తున్నాం ‘త్రీ మంకీస్’ టైటిల్ కి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ యాప్ట్ అనేలా పెర్‌ఫామ్ చేశారు. నాకు మా బేనర్‌కి మంచి పేరు చిత్రమవుతుంది“ అన్నారు.
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – “శ్రీను, రాంప్రసాద్ ఈ ఇద్దరే నా బలం. మేము ముగ్గురం కలిసి సరదాగా నటించాం.కామెడీతోపాటు సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా విజయవంతం చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం“ అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ – ‘సినిమా విడుదల కోసం నేను మా టీమ్అందరం చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాం ముగ్గురం కలిసి నటించిన తొలి చిత్రమిది, ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది“అన్నారు.
ఆటో రామ్ ప్రసాద్ మాట్లాడుతూ – “జబర్దస్త్ లో మొదటి స్కిట్ చేసినప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో, ఈ సినిమా కోసం అంతే టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాం. అందులో సక్సెస్ అయ్యాం. సినిమా విషయంలో కూడా తప్పకుండా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా“ అన్నారు.
హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ -ఇందులో డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. నేను గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్రని నా కంటే దర్శకుడే ఎక్కువగా నమ్మారు ‘త్రీ మంకీస్’ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది“ అన్నారు
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, కారుణ్య తదితరులు నటిస్తున్న ఆ చిత్రానికి
కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ – శేఖర్.
Director Sukumar launched 2nd song from Palasa 1978 movie
Vishwak Sen ‘Hit’ Movie Teaser Released in Nani production
Inspired by genuine Carecters in Ananda Bhairavi Movie
M.V.V. సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ) సమర్పణలో అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం “ఆనంద భైరవి” నంది అవార్డ్ గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “నిధి మూవీస్, హరివెన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై బి తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి ఇటికేల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, వైజాగ్, హైదరాబాద్ లలో చేసిన షూటింగ్ తో 50% షూటింగ్ పూర్తయింది. తదుపరి హైదరాబాద్, చెన్నయ్ లలో ఏకదాటిగా జరిపే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి…”సమ్మర్” లో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.
దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ, ఇప్పుడు వరకు చేసిన షూటింగ్ అద్భుతంగా వచ్చింది. అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ కెమిస్ట్రీ చూస్తుంటే నా కళ్ళముందు నా సక్సెస్ కనిపిస్తుంది. తదుపరి షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాo మా సినిమాలో కథాంశానికి తగ్గట్టుగా ప్రతి పాత్రను తీర్చిదిద్దాo. సహజత్వంగా కథకు తగ్గట్టుగా ఉండటం కోసం అంజలి, లక్ష్మీరాయ్ ఎంతో కష్టపడి ప్రత్యేక శిక్షణతో ఎంతో స్లిమ్ గా తయారయ్యారు. అలాంటి కష్టపడే కథానాయికలు మా చిత్రానికి దొరకడం చాలా గర్వంగా ఉంది అలాగే ప్రతి పాత్రకు పెద్ద నటీనటులను ఎన్నుకున్నాం. సమాజంలో ఉన్న ఎన్నో యదార్ధ పాత్రలు మా చిత్రంలో కనబడుతాయి. వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరణ జరుపుతున్నాం అని తెలిపారు.
కధానాయిక అంజలి మాట్లాడుతూ, ఆనందిని పాత్రను పోషిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర సహజత్వంగా ఉండటంతో మంచి నటనను ప్రదర్శించే అవకాశం కలిగింది. ఈ మధ్య కాలంలో బాగా నచ్చి చేస్తున్న పాత్ర ఇదని చెప్పుకొచ్చారు.
లక్ష్మీరాయ్ మాట్లాడుతూ, భైరవి పాత్ర పోషిస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ముంబాయ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా అని అన్నారు.
హీరో అధిత్ అరుణ్ మాట్లాడుతూ, ఇందులో రొమాంటిక్ బాయ్ అయినప్పటికీ చాలా సన్నివేశాల్ని ఛాలెంజ్ గా తీసికొని చేశా. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే సీన్స్ ఇందులో ఉన్నాయి. అవి చేసేటప్పుడు నేను నిజంగానే ఏడ్చా అని చెప్పారు.
ఈ చిత్రంలో అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ప్రధాన పాత్రధారులు కాగా అతిధి పాత్రలో ఎం.వి.వి.సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ) నటిస్తుండగా…
ఇతర ముఖ్య పాత్రలలో సాయి కుమార్, రాశి, మురళీ శర్మ, సుమన్, బ్రహ్మాజీ, పృద్వి, డి.ఎస్.రావ్, గిరి, గుండు సుదర్శన్, ధన్ రాజ్, శ్రీ హర్ష, జ్యోతి, మణిచందన, జయవాణి, మధుమణి, వర్మ, సుబ్బరాయశర్మ, చక్రి, స్వప్నవిక తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: మధు విపర్తి, మాటలు: భవాని ప్రసాద్, రామ కృష్ణ, రచన సహకారం : రాజేంద్ర భారత్ వాజ్, పాటలు: ప్రణవ్, కెమెరా:పి.జి.వింద, సంగీతం: మణిశర్మ, ఆర్ట్: నాని, ఎడిటర్: చోట. కె. ప్రసాద్, సమర్పణ: ఎం.వి వి సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ), నిర్మాతలు: బి.తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి ఇటికేల, కథ, కధనం, దర్శకత్వం: కర్రి బాలాజీ.

Life Anubhavinchu Raja Movie Worldwide release on February 7
రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ(జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి కందల నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
రవితేజ మాట్లాడుతూ….
ఫిబ్రవరి 7న విడుదల కానున్న మాస్ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి. సినిమా అంతా ఎంటర్టైనర్ గా ఉంటుంది. మా డైరెక్టర్ సురేష్ గారు సినిమాను బాగా తీశారు, నాకు మా చిత్ర యూనిట్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతోందని భవిస్తున్నాను, మమ్మల్ని ఇప్పుడు వరకు ఆశీర్వదించారు, ఇకముందు కూడా మీ ఆధర అభిమానులు కావాలని కోరారు.
హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ….
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు, అనుభవించు రాజా సినిమాలు మంచి పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. సినిమా చాలా జాలిగా ఉంటుంది. ఫిబ్రవరి 7న విడుదల కానున్న మా సినిమాను మీ అందరూ చూసి హిట్ చెయ్యలని కోరుకుంటున్న అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ…
సినిమాలో సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టైటిల్ కు తగ్గట్లు ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది. రీ రికార్డింగ్ కూడా సినిమాకు బాగా కుదిరింది. మా సినిమా సాంగ్స్ ను హిట్ చేసిన ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు అన్నారు.
షాని పగడాల మాట్లాడుతూ ..
డైరెక్టర్ సురేష్ గారితో నాకు కొంత కాలంగా పరిచయం ఉంది. సినిమా చూశాము చాలా బాగా వచ్చింది. మనిషి జీవితంలో కొన్ని ఆనంద క్షణాలు ఉంటాయి. అలానే ఈ సినిమాలో హీరో కు కూడా కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, అవి డైరెక్టర్c బాగా చూపించారు. అనుభవించు రాజా టైటిల్ సాంగ్ బాగుంది. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నాను అన్నారు.
డైరెక్టర్ సురేష్ తిరుమూరు మాట్లాడుతూ….
ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అందరూ సపోర్ట్ చేస్తే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. నిర్మాత రాజా రెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అనుభవించు రాజా టైటిల్ కు కరెక్ట్ గా సెట్ అయ్యే స్టొరీ ఇది. అందరికి నచ్చే సినిమా అవుతుంది. మా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కష్టపడి పనిచేశారు, రవితేజ, శ్రావణి, శృతి, షాని ఈ సినిమాతో బిజీ ఆర్టిస్ట్స్ అవ్వబోతున్నారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
నటీనటులు:
రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి, షాని పగడాల, పవన్ నాగేంద్ర, సుహాస్
ఈ చిత్రానికి సంగీతం: రామ్, కెమెరామెన్: రజిని, ఎడిటింగ్: సునీల్ మహరాణా, నిర్మాత: రాజారెడ్డి కందల, కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సురేష్ తిరుమూర్.
Ajay Devgns ‘Maidan’ Movie First look launch
Maidaan staring Ajay Devgn is a celebration of biggest sport Football!
It’s a story of CHANGE & SELF BELIEF.Inspired from an incredible TRUE story.
A story of one of the finest Coach that emerged from India , the one who put India on the world map.Today we launch our first look of MAIDAAN with 2 posters.
With MAIDAAN we bring the spirit of life and sport both together. For success in life , like sport, it requires self-belief, hard work, sacrifice, and limitless dedication.
Directed by Amit Ravindernath Sharma of Badhai Ho fame, Maidaan has been shot extensively in Kolkata , Lucknow and Mumbai for over 50 days already and the filming will be completed by April. It also stars National award winning actress Priyamani from South, Gajraj Rao who created magic with Badhai Ho and the well known Bengali actor Rudranil Ghosh.
Produced by Zee Studios, Boney Kapoor, Akash Chawla and Arunava Joy Sengupta, screenplay and dialogues are written by Saiwyn Quadras and Ritesh Shah respectively. The film is set to release on 27th November 2020















