Home Blog Page 963

Late Kaloji Narayanarao Biopic Shooting begins

“ప్రజాకవి-కాళోజీ” సినిమాను “జైనీ క్రియేషన్స్” బ్యానర్ పై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నంది అవార్డు గ్రహీత డాక్టర్ ప్రభాకర్ జైనీ వహించారు. పాటలు కళారత్న బిక్కి కృష్ణ. సంగీతం యస్. యస్. ఆత్రేయ; కెమెరా సత్యజిత్ రే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన రవి కుమార్ నీర్ల. కాళోజీ పాత్రను అచ్చుగుద్దినట్టు కాళోజీ గారి పోలికలున్న శ్రీ మూలవిరాట్ పోషిస్తున్నారు. అనేక మంది ప్రముఖ సినిమా టీవీ కళాకారులు మిగిలిన తారాగణం. కాళోజీ గారి పై కళారత్న బిక్కీ కృష్ణ గారు రాసిన ‘అతడు అతడే’ అనే పాటపై శరత్ సుంకరి బృందం వారు ప్రదర్శించిన నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అతని జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని “”ప్రజాకవి-కాళోజీ”” గారి బయోపిక్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ముహుర్తపు షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు మరియు తెలంగాణా ప్రభుత్వ సలహాదారు శ్రీ కేవీ రమణా చారి గారి చేతుల మీదుగా షూటింగు ప్రారంభించబడింది.
ఈ షూటింగులో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు. పీవీ నర్సింహారావు గారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. ఆ కార్యక్రమంలో కాళోజీ కొడుకు రవి, కోడలు వాణి కూడా పాల్గొనడం విశేషం.

టెక్నీషియన్స్:
బ్యానర్: జైనీ క్రియేషన్స్
పాటలు: కళారత్న బిక్కి కృష్ణ
కెమెరా: రవి కుమార్ నీర్ల
పి.ఆర్. ఓ.: కడలి రాంబాబు
సంగీతం: యస్. యస్. ఆత్రేయ
గాయనీగాయకులు: వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, మాళవిక, భూదేవి
నిర్మాత : విజయలక్ష్మీ జైనీ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ ప్రభాకర్ జైనీ

నటీనటులు:
మూలవిరాట్ (కాళోజీ) విజయలక్ష్మీ జైనీ,(కాళోజీ భార్య పాత్ర) పీవీ మనోహర్ రావు (పీవీ నర్సింగ్ రావు గారి తమ్ముడు), తుమ్మూరి రామ్మోహన్ రావు, చెల్లి స్వప్న, సాదినేని శ్రీజ, సిద్ధూరెడ్డి,

Ichata Vahanamulu NilupaRadu Movie Launched

యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా ఎస్.దర్శన్ దర్శకత్వంలోఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 30న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యోగేశ్వరి క్లాప్ నివ్వగా వెంకటరత్నం కెమెరా స్విచాన్ చేశారు. నాగసుశీల మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

హీరో సుశాంత్ మాట్లాడుతూ – ” ఈ ఏడాది ఆరంభంలోనే అలవైకుంఠపురములో..చిత్రంతో మంచి బ్యాంగ్ దక్కింది. ఈ మూవీ ఒక మంచి థ్రిల్లర్. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే మంచి టీమ్ కుదిరింది. యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు. చి.ల.సౌ తరువాత ఈ సినిమా చేయాల్సింది.  మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ దొరకడం సంతోషంగా ఉంది. నేను మీనాక్షిని బాంబే లో కలిశాను. ఇద్దరం కలిసి యాక్టింగ్ వర్క్ షాప్స్ చేశాం. చాలా టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కర్. ఇంతమంచి అవకాశం ఇచ్చిన రవి శాస్రి, హరీష్ గారికి దన్యవాదాలు. నా ప్రతి సినిమా కొత్తదనం తో చేద్దాం అనుకుంటున్నా డెఫినెట్ గా ఈ సినిమాలో ఆ కొత్తద‌నం ఉంది” అన్నారు.

నిర్మాత రవిశంకర్ శాస్త్రి మాట్లాడుతూ – “చాలా రోజులనుండి ఒక మంచి సినిమా తీయాలని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో హరీష్ ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకువచ్చాడు. అలాగే దర్శన్ స్క్రిప్ట్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. 2020 దశాబ్దం ప్రారంభం అయింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ స్క్రిప్ట్ ని ఎంచుకున్నాం. హీరోగా సుశాంత్ పర్ఫెక్ట్ ఛాయిస్. అలాగే మీనాక్షి ముల్టీటాలెంటెడ్. తనపాత్రకి యాప్ట్ అని అనుకుంటున్నాం. అలాగే దర్శన్ టెక్నికల్ గా బ్రిలియంట్. ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత హరీష్ కోయలగుండ్ల మాట్లాడుతూ – ” నటుడిగా ఈ పరిశ్రమకి వచ్చి నిర్మాతగా మారతానని కలలో కూడా ఊహించలేదు. అలాగే భానుమతి గారి మనవడు రవిశంకర్ శాస్త్రి గారితో కలిసి ఈ సినిమా నిర్మించడం ఒక పెద్ద అచీవ్ మెంట్.  ఈ అవకాశం ఇచ్చిన సుశాంత్ గారికి, రవిశంకర్ శాస్త్రి గారికి నా హృదయపూర్వక దన్యవాదాలు.

హీరోయిన్  మీనాక్షి చౌదరి మాట్లాడుతూ  – ” హీరోయిన్ గా నా ఫస్ట్ మూవీ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకి థాంక్స్. ఈ చిత్రం ద్వారా దర్శన్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. సుశాంత్ గారితో కలిసి నటించడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను” అన్నారు.

సుశాంత్,మీనాక్షి చౌదరి, వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, రవివర్మ, హరీష్ కోయలగుండ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

దర్శకత్వం: ఎస్.దర్శన్,
నిర్మాతలు: రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల,
సినిమాటోగ్రాఫర్: ఎం. సుకుమార్,
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు,
ఎడిటర్: గ్యారీ బి హెచ్,
ఆర్ట్: వి. వి,
మాటలు : సురేష్, భాస్కర్,
పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్.

Regular shoot of Tuck Jagadish begins from February

Tuck Jagadish has been launched today with formal Pooja ceremony. Star director Koratala Shiva has handed over the film’s script to the makers to start the proceedings. Successful producers Dil Raju sounded the clap board and Naveen Yerneni switched on the camera for the muhurtham shot.

Ritu Varma who earlier romanced with Nani in Yevade Subrahmanyam and Aishwarya Rajesh of Kousalya Krishnamurthy fame are playing female lead roles. Music sensation S Thaman scores music while Prasad Murella handles the cinematography.

Regular shoot of Tuck Jagadish begins from February in outdoor locations.

Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Jagapathi Babu, Murali Sarma, Nassar, Rao Ramesh, Naresh, CVL Narashimha Rao, Maala Pravathi, Rohini, Devadharshini, Bindhu Chandhramouli, Praveen, Kishore Polimera, Pammi Sai and others.

Crew:
Written& Directed by: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi
Banner: Shine Screens
Music Director: S Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
Art: Sahi Suresh
Fights: Venkat
Executive Producer: S.Venkatarathnam (Venkat)
Co-Director: Laxman Musuluri
PRO: Vamshi-Shekar
Publicity Designer: Siva Kiran (Working Title)
Costume Designer: Neeraja Kona

Aswathama Team Seeks Megastar Chiranjeevi Blessings

Usha Mulpuri is the latest film to be directed by young director Ramana Teja under the banner of Ira Creations. The film is a good action thriller and Mehreen is playing the heroine opposite Shaurya. The film, which has recently earned a U / A certificate from the censor board, is set to hit the audience on the 31st of this month.

The hero of the film is young actor Nagasurya and his mother Usha, who both met the megastar today. Megastar congratulated them on their success, saying that the Ashwadhama movie trailer is great and that the film is also a good success. Every time I see you, there is a great sense of something unknown to me, and the best wishes for our movie success are not just saying a word of thanks to you, sir, but you are a true megastar. Shaurya and Chiranjeevi posted on social media, thanking him for making such good films from our company.

Director SS Rajamouli with NTR, Ram Charan and Ajay Devgn on sets in RRR

Directed by SS Rajamouli is the latest ambitious film Rajaram. The film is being produced by DVV Danayya on the banner of DVV Entertainments with the highest technical cost and NTR and Ram Charan are playing the role of Komaram Bhim and Alluri Sitaramaraju. Recently, Bollywood actor Ajay Devgn has joined the cast of ‘RRR’ movie Shoot starring Olivia Morris opposite NTR and Alia Bhatt starring Ram Charan.

Now, RRR Movie Unit has posted a photo of director Rajamouli landing with NTR, Ram Charan and Ajay Devgn from the RRR Movie Shoot Sets. Our movie sets are shining with these three iconic stars. The photos that the RRR team posted on their social media accounts are now going viral in many media outlets.

Abhishek Pictures bags the rights of ‘Johar’

The film ‘Johar’ is a political satire which revolves around five characters being directed by Teja Marni.Starring Esther Anil of ‘Drishyam’ fame, the film is gearing up for summer release.Noted producer Abhishek Nama has acquired the rights of the movie for the two Telugu states both theatrical and non-theatrical rights. In the recent times Abhishek Nama through Abhishek Pictures has presented and released many successful films like ‘Rakshasudu’ and ‘iSmart Shankar’The noted producer is also preferring rich content small films like ‘Pressure Cooker’ and apart from this, Abhishek Nama has Andhra rights of Vijay Deverakonda’s ‘World Famous Lover.’

Coming ‘Johar’ it also has senior actress Eshwari Rao and Chaitanya Krishna in supporting roles.Priyadarshan is composing music while Jagadeesh Cheekati is handling the cinematography.‘Johar’ is produced by Bhanu Sandeep Marni under Dharma Surya Pictures bannaer.The makers will announce rest of the details along with release date.

Cast: Esther Anil, Naina Ganguly, Eshwari Rao, Sudhakar’s subhalekalu, Chaitanya Krishna, Ankith Koyya, Rohini
Crew:
Presented by Abhishek Nama of Abhishek Pictures
Banner: Abhishek Pictures, Dharma Surya Pictures
Producer: Bhanu Sandeep Marni
Director: Teja Marni
Executive Producer: Anil Bikinna, Kalyan M, Raghavendra Chowdary
Cinematography: Jagadeesh Cheekati
Music: Priyadarshan
Editor: Siddharth thatholu
Art: Gandhi
Lyrics: Chaitanya prasad
Publicity Design: Anil-Bhanu

Jaanu Trailer launch

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…
హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”నా పదిహేడేళ్ల కెరీర్‌లో తొలి రీమేక్‌ ‘జాను’. తమిళ చిత్రం ’96’కు ఇది రీమేక్‌. ఎప్పుడైనా రీమేక్‌ చేయాలంటే ఏముంటుందిలే అనుకునేవాడిని. అలా అంతకు ముందు రెండు సినిమాలు రీమేక్‌ చేద్దామనుకుని మిస్‌ అయ్యాను. ’96’ సినిమాను తమిళంలో రిలీజ్‌ కంటే ఓ నెల ముందే చూశాను. ప్రివ్యూ థియేటర్‌ నుండి బయటకు రాగానే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాకు శర్వానంద్‌, సమంత ఫైనల్‌ కాకముందు చాలా చాలా అనుకున్నాను. ఆ సమయంలో చాలా కామెంట్స్‌ వినిపించాయి. వీళ్లకేమైనా పిచ్చా? అదొక క్లాసిక్‌ మూవీ. దిల్‌రాజుకేమైనా మెంటలా? ఎందుకు రీమేక్‌ చేస్తున్నాడు? అని చాలా కామెంట్స్‌ వచ్చాయి. నాకు అర్థం కాలేదు. ఒక ఆడియన్‌గా నేను సినిమా చూశాను. తమిళం నాకు పూర్తిగా రాదు. అయినా కూడా పాత్రలతో నేను ట్రావెల్‌ అయ్యి.. సినిమాకు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యాను. నేను ఏదైనా ఆరోజు నమ్మానో..ఈరోజు కూడా అదే నమ్ముతున్నాను. సామ్‌ సినిమా చూసి ఓరిజినల్‌ డైరెక్టర్‌ అయితేనే సినిమా చేస్తానని అంది. చివరకు నేను ఓరిజినల్‌ డైరెక్టర్‌నే తెచ్చాను. సమంత నన్ను కలిసినప్పుడు నాపై నమ్మకంతో సినిమా చేయమని చెప్పాను. తను ఓకే అంది. రెండు రోజుల తర్వాత తనే ఫోన్‌ చేసి నాకు థ్యాంక్స్‌ చెప్పడమే కాదు.. మేజిక్‌ను ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పింది. శర్వానంద్‌ కూడా సినిమా చూసి బ్యూటీఫుల్‌ మూవీ చేస్తానని నాకు ఫోన్‌ చేశాడు. అలా శర్వా, సామ్‌ ఈ సినిమాలోకి వచ్చారు. తమిళ సినిమాను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌, టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు వర్క్‌ చేశారు. ఫిబ్రవరి 7న తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఏదైతే ఫీలింగ్‌తో ఉన్నానో.. రేపు సినిమా చూసి ప్రేక్షకులు అదే ఫీలింగ్‌ నిజమని నమ్ముతారు. అమ్మాయిలైతే శర్వాతో ప్రేమలో పడితే.. అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి సోల్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ. అహా! అలాంటి లవర్‌ మనకుంటే బాగుండు అనే ఈర్ష్యతోనే లవ్‌లో పడతాం” అన్నారు.
అక్కినేని సమంత మాట్లాడుతూ – ” ఈ సినిమా క ఓసం దిల్‌రాజుగారు మా మేనేజర్‌కి ఫోన్‌ చేసి నన్ను కలవాలని అనగానే నేను భయపడ్డాను. ఎందుకంటే ఓ క్లాసిక్‌ సినిమాను రీమేక్‌ చేయాలి. విజయ్‌సేతుపతి, త్రిష అద్భుతంగా పెర్ఫామ్‌ చేశారు. దాంతో నేను నిజంగానే భయపడ్డాను. ఒకవేళ దిల్‌రాజుగారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను. కాబట్టి దాదాపు వద్దనే చెబుతూ వచ్చాను. చివరికి ఆయన్ని కలిసి ఒక నిమషంలోనే నేను సినిమా చేస్తానని చెప్పాను. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తొలిరోజు షూటింగ్‌ పూర్తి కాగానే దిల్‌రాజుగారికి ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెప్పాను. శర్వానంద్‌కి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్‌. ప్రతిరోజూ ప్రతి సీన్‌ వందశాతం పెర్ఫామెన్స్‌ ఇవ్వాలి. మేజిక్‌ జరగాలి. అలాంటిది చాలా కష్టం. దాన్ని కూడా క్రాస్‌ చేశానంటే ఏకైక కారణం శర్వానంద్‌ మాత్రమే. రేపు నాకేదైనా క్రెడిట్‌ దక్కినా మా ఇద్దరికీ దక్కుతుంది. ప్రతిసీన్‌ను ఇద్దరం డిస్కస్‌ చేసుకుని చేశాం. ఇద్దరం వందశాతం ఎఫర్ట్‌ పెట్టాం. మేం మేజిక్‌ క్రియేట్‌ చేశామని అర్థమవుతుంది. ఆ మేజిక్‌ను మీరు ఫిబ్రవరి 7న వెండితెరపై చూస్తారు” అన్నారు.
హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ – ”దిల్‌రాజుగారు ఫోన్‌ చేసి సినిమా చూడమంటే చూశాను. ‘అన్నా ఇది క్లాసిక్‌ చేద్దామా?’ అన్నాను. దానికి దిల్‌రాజు ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జ్‌మెంట్‌పై బాగా నమ్మకం ఉంది. శతమానం భవతి అప్పుడు కూడా నన్ను నమ్ము అన్నారు. నేను నమ్మాను. నాకు పెద్ద హిట్‌ ఇచ్చారు. ఈసారి ఆయన ఆ సినిమాను కూడా దాటిస్తారని అనుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. సమంతగారు లేకుంటే నేను అంతగా చేయలేపోయేవాడినేమో. ప్రతిరోజూ సన్నివేశాల్లోని మేజిక్‌ను ఎంజాయ్‌ చేసేవాళ్లం. అది అన్ని సినిమాలకు కుదరదు. రేపు నాకేదైనా పేరొస్తే ఆ క్రెడిట్‌ సమంతకే దక్కుతుంది. ఈ మేజిక్‌ ప్రతి సీన్‌లో ప్రతి మూమెంట్‌లో కనపడుతుంది. చాలా మందికి లవ్‌ ఫెయిల్యూర్‌ అనేది జరుగుతుంటుంది. అయితే అందరికీ ఫస్ట్‌ లవ్‌ అనేది గుర్తుండిపోతుంది. నాకు తెలిసి ఈ మధ్య నాలుగైదేళ్లలో అంతకంటే ఎక్కువగా.. అంటే పదేళ్లపైగానే ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనే చెప్పాలి. చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చి తప్పకుండా ఏదో మేజిక్‌ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ సహా ఎంటైర్‌ టీమ్‌కు థ్యాంక్స్‌. ఫిబ్రవరి 7 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌, శ‌ర‌ణ్య‌, గౌరి, సాయికిర‌ణ్‌, హాసిని త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర  క్రియేష‌న్స్‌
సంగీతం:  గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
మాట‌లు:  మిర్చి కిర‌ణ్‌
పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి

Director Laxmikanth chenna’s movie ‘Commitment’ title launch

ల‌క్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో ఫూట్ లూస్ ఎంటర్టైన్మెంట్, ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్ ప‌తాకాల‌పై బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `కమిట్‌మెంట్‌`. తేజస్విని మడివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్‌ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్,రమ్య పసుపులేటి, సిమర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. నాలుగు క‌థ‌ల‌తో న‌డిచే అంతాల‌జీ ఈ సినిమా. స‌మాజంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ద్వారకేష్ మాట్లాడుతూ – “మా నిర్మాతలకి మొదటి సినిమా అయిన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో లక్ష్మీకాంత్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు”అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ సురేష్ పోలాకి మాట్లాడుతూ – “నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని. ఒక రూపాయితో ఇంకో రూపాయి ఎలా సంపాదించాలని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిని అయ్యాను. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను ‘అన్నారు.

దర్శకుడు లక్ష్మి కాంత్ మాట్లాడుతూ – ” ద్వారకేష్, సురేష్ గార్ల ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను గతంలో ‘పరిచయం’ అనే సినిమా తీయడం జరిగింది. దానికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కించాను. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంది. నాలుగు విభిన్నమైన కథలు ఈ సినిమాలో కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. అందరూ పూర్తిగా ఎంటర్టైన్ అయ్యే సబ్జెక్ట్. మీరు డబ్బులు పెట్టి టికెట్ కొన్నందుకు తప్పకుండా న్యాయం చేస్తుంది’ అన్నారు.

నిర్మాత బ‌ల్దేవ్‌ సింగ్ మాట్లాడుతూ – “ఈ చిత్రం పోస్టర్ ని చూసి ఒక అంచనాకి రావొద్దు. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
నిర్మాత అనిల్ మాట్లాడుతూ – “2013లో నేను లక్ష్మికాంత్ ని మొదటి సారి కలిశాను. ఆయన కమిట్ మెంట్ నచ్చి ఈ సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది” అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోలు అమిత్ తివారి, తనిష్క్‌ రాజన్, సూర్య శ్రీనివాస్, శ్రీనాద్.. హీరోయిన్స్ అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సిమర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తేజస్విని మడివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్‌ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్, రమ్య పసుపులేటి, సిమర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి..
ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మీకాంత్ చెన్న,
నిర్మాత‌లు: బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్: ద్వారకేష్,
లైన్ ప్రొడ్యూసర్: సురేష్ పోలాకి,
సినిమాటోగ్రఫీ: సజీష్‌ రాజేంద్రన్, నరేష్ రానా,
మ్యూజిక్: నరేష్ కుమరన్‌,
ఆర్ట్‌: సుప్రియ బట్టే పట్టి ,
ఎడిటర్: ప్రవీణ్ పూడి,
కాన్సెప్ట్: ఈశ్వర్ రెడ్డి ,

Hero Sivakandukuri interview about Choosi Choodangane

ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్గా శేష సింధుని ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యంచేస్తూ రాజ్ కందుకూరి నిర్మిస్తోన్న చిత్రం ‘చూసీ చూడంగానే`జనవరి 31న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరో శివ కందుకూరి ఇంట‌ర్వ్యూ.

హీరో అవ్వాలని ఎప్పడు అనుకున్నారు?
– ఎప్పటినుండో యాక్టర్ అవ్వాలనే ఇంట్రస్ట్ అయితే ఉంది. కానీ, నేను యాక్టింగ్ కి సూట్ అవుతానా అనే చిన్న డౌట్ ఉండేది. యూఎస్ లో చదువుకుంటున్నప్పుడు లాస్ట్ టు ఇయర్స్ లో థియేటర్ ఆర్ట్స్ లో శిక్ష‌న తీసుకున్నాను. అక్కడ నేను యాక్ట్ చేస్తోన్నప్పుడు నా యాక్టింగ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన చూశాక యాక్టింగ్ పై ఇంకా ఫ్యాషన్ పెరిగింది. అప్పుడే డిసైడ్ అయ్యాను యాక్టర్ గా ట్రై చెయ్యాలి.

ఫస్ట్ టైం మీ నాన్నగారితో యాక్టర్ అవుతానని చెప్పినప్పుడు ఆయన రియాక్ష‌న్ ఏంటి?
– నాన్నగారు ఇండస్ట్రీ గురించి.. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ అని, అలాగే మనకు టాలెంట్ ఉన్న కొన్నిసార్లు మన సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కారణంగా కూడా ఫెయిల్ అవ్వొచ్చు. ఏ పని చేసినా… ఏ స్క్రిప్ట్ ఒప్పుకున్న అందులో పూర్తి నిజాయితీ ఉండేలా చూసుకోమన్నారు. ఈ సినిమాకి మేం అదే చేశాము.

న‌టుడిగా మీకు ఇన్స్‌పిరేష‌న్‌ ఎవరు?
– నాకు మెగాస్టార్ చిరంజీవిగారు అంటే ఇష్టం. ఆయనే నాకు ఇన్స్‌పిరేష‌న్‌. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా సినిమా పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమచాలా గ్రేట్. ఆయన స్థాయి కాకపోయినా సినిమా బాగుంటే అది చిన్న సినిమా అయినా, ఆయన ఎంకరేజ్ చేస్తారు.

నిర్మాత కొడుకు అని మిమ్మల్ని ఈ సినిమాలో హీరోగా తీసుకోలేదని మీ నాన్నగారు చెప్పారు ?
– అవునండి. మా డాడీ ఇప్పటికే మంచి సినిమాలు చేశారు. ఆయన తల్చుకుంటే పెద్ద డైరెక్టర్ ద్వారా కూడా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యొచ్చు. కానీ ఆయన ఓన్లీ కథే హీరో, స్క్రిప్ట్ ఒక్కటే మెయిన్ అని నమ్మే వ్యక్తి. ఆయనకు ఈ స్క్రిప్ట్ నచ్చింది, నా కోసం ఆయన ఈ సినిమా చెయ్యలేదు. అయితే డైరెక్టర్ నేను ఈ సినిమాలో బాగా సూట్ అవుతానని నమ్మడం వల్ల నన్ను ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. ఇక సినిమా చూశాక నాన్న‌గారు `ఒక డెబ్యూ యాక్ట‌ర్ చేసేదానిక‌న్నా ఎక్కువ‌గా చేశావు.. ఇలానే క‌ష్ట‌ప‌డు మంచి భ‌విష్య‌త్ ఉంటుంది` అన్నారు

మీరు దాదాపు 12 రోజులు పాటు ఆడిషన్స్ చేశారట ?
– మా డైరెక్టర్ శేష్ సింధూ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ లో ఉన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. దాదాపు 12 రోజులు పాటు ఆడిషన్ తీసుకున్నారు. ప్రతి సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూ రిహార్సల్స్ చేశాము.ప్ర‌తి ప‌ది రోజుల‌కొక‌సారి ర‌షెస్ చెక్ చేసుకునే వాళ్లం. అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్ళే వాళ్లం

‘చూసీ చూడంగానే’ సినిమా గురించి ?
– ఏ లవ్ స్టోరీ తీసుకున్నా.. లైన్ వైజ్ గా ఒకేలా ఉంటాయి. అయితే ఈ సినిమాలో కొత్తదనం తీసుకురావడం కోసం పాత్రలతో పాటు వాటి నేపథ్యాన్ని కూడా కొత్తగా రాసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే కామన్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ నే ఈ సినిమాలో ప్రధానాంశాలు. అవి కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతాయ‌ని న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాలో నేను వెడ్డింగ్ ఫోటో గ్రాఫ‌ర్ గా క‌నిపిస్తాను. వ‌ర్ష బొల్ల‌మ్మ ఒక డ్ర‌మ్మ‌ర్ గా క‌నిపిస్తోంది. మా ఇద్ద‌రి మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి.

మీ తదుపరి సినిమాలు?
– ప్రస్తుతం మరో సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే కొత్త డైరెక్టర్ సృజనగారితో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాను. ప్ర‌స్తుతానికి ఈ సినిమా విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.

Hero Nagasourya interview about Aswathama

ఐరా క్రియేషన్స్‌ పతాకంపై యంగ్‌ హీరో నాగశౌర్య,మెహరీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ‘. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 31న విడుదలవుతుంది.ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంద‌ర్భంగా యంగ్ హీరో నాగశౌర్య ఇంట‌ర్వ్యూ వివ‌రాలు..

ఫస్ట్ టైం `అశ్వ‌థ్థామ‌` లాంటి ఎమోషనల్ సినిమాతో రాబోతున్నారు క‌దా! ఎలా ఫీల్ అవుతున్నారు ?
– అవునండి. నా కెరీర్ లో ఇంత సీరియస్ అండ్ ఇంటెన్స్‌తో కూడిన ఎమోషనల్ ఫిల్మ్ చేయలేదు. సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాత్యాలకు సంబంధించిన సినిమా కాబట్టి అంత ఇంటెన్స్‌, ఎమోషనల్ ఉండాలి. అప్పుడే అంద‌రూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి సినిమాకు క‌నెక్ట్ అవుతారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అవుట్ ఫుట్ పట్ల మేము చాల సంతృప్తిగా ఉన్నాము. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ నచ్చుతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాతో చాలా నేర్చుకున్నా అని చెప్పారు క‌దా?
– నేను అంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం.. నేను ఈ సినిమా రాస్తున్న టైం నుండి ఇప్పటివరకూ పర్సన్స్ దగ్గర నుండి సినిమా బడ్జెట్ వరకూ చాలా విష‌యాలు మారాయి. కొంతమంది వెళ్లిపోయారు, ఇంకొంత మంది వచ్చి కలిశారు. చాలా విషయాల మీద పూర్తిగా అని చెప్ప‌ను కాని..కొంత‌ అవగాహన అయితే వచ్చింది. అందుకే ఈ సినిమా రిజ‌ల్ట్ తేల‌క‌ముందే సినిమా పేరునుట్యాటూ గా వేయించుకోవ‌డం జ‌రిగింది.

మీరే ఈ కథ రాశారు క‌దా! మిగ‌తా పాత్ర‌ల‌ను ఎలా బ్యాలెన్స్ చేశారు?
– ఎవ‌రు రాసిన స‌రే సినిమాలోఒకే క్యారెక్ట‌ర్ హైలెట్ గా ఉంటే అది విజ‌యం సాధించ‌దు. ముఖ్యంగా ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. అందుకే ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఈ సినిమాకి అంద‌రూ కొత్త టెక్నీషియన్స్ ని తీసుకున్నారు. రిస్క్ అనిపించిందా ?
– అలా ఏం లేదండీ! ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు సాయి కొర్రపాటిగారు అవసరాల శ్రీనివాస్ గారే నాకు ఛాన్స్ ఇచ్చారు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ లు రావాలి. టాలెంట్ ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకపోతే అన్యాయం చేసినవాడ్ని అవుతాను. అందుకే మా డైరెక్టర్, మా కెమెరామెన్ దగ్గర నుండి ఈ సినిమాకి పని చేసిన అందరూ కొత్తవాళ్లే.

మీ స్నేహితుడి లైఫ్‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్స్‌డెంట్ ఆధారంగా ఈ సినిమా క‌థ రాశారు క‌దా, అంత‌లా మిమ్మ‌ల్ని ప్ర‌భావితం చేసిన అంశం ఏంటి?
– అది ఇప్పుడే చెప్తే సినిమా చూస్తున్న‌ప్పుడు ఆ ఫీల్ ఉండ‌దు. కాక‌పోతే ఆ ఇన్స్‌డెంట్ న‌న్ను నిజంగా క‌దిలించింది. నిజంగా జ‌రిగింది అంటే కూడా మీరెవ్వ‌రూ న‌మ్మ‌రు. నేను వాళ్ళ ద‌గ్గ‌ర‌నుంది ప‌ర్మీష‌న్ తీసుకునే ఇలా కూడా జ‌రుగుతుంది అని మీకు చూపించ‌బోతున్నాను. అలాంటివి ప్ర‌తి రోజు ఒక కేస్ క‌నిపిస్తుంది. అందుకే కొంత మంది అమ్మాయిల‌కైనా ఇలా కూడా జ‌ర‌గొచ్చు కొంచెం జాగ్ర‌త్త తీసుకోండి అని కొంచెం క‌మ‌ర్షియ‌ల్ వేలో చెప్ప‌డం జ‌రిగింది. నాకు చెల్లులు లేదు కానీ ప్రతి సంవత్సరం నాకు రాఖీ కట్టే ప్రియ అనే అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అనుకొని
ఈ కథ రాశాను.

ఈ సినిమాని మీరే డైరెక్ట్ చెయ్యాలనిపించలేదా ?
– ఏమో అండీ డైరెక్షన్ చేద్దామనే ఆలోచన నాకు ఇప్పటివరకూ రాలేదు. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేదు. షూట్ కి వెళ్లకముందే ప్రతి షాట్ గురించి ఎలా తీయాలి, ఏలెన్స్ వాడాలి అనేది మా టీమ్ అంద‌రం క‌లిసి డిస్కస్ చేశాం. డైరెక్షన్ కి సంబంధించి అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతా ర‌మ‌ణ‌తేజ చూసుకున్నాడు. అంద‌రం క‌లిసి ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశాం అని భావిస్తున్నాము.

సాహో తర్వాత ఏం చెప్పి గిబ్రాన్ ని ఒప్పించారు?
– గిబ్రాన్ గారు చాలా మంచి వ్యక్తి. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అని గిబ్రాన్ గారి దగ్గరకు వెళ్లి కథ చెప్పడం జరిగింది. ఆయన ఒకటే శౌర్య కథ విన్నాను బాగా నచ్చింది కానీ సినిమా చూసి బ్యాక్ గ్రౌండ్ కొట్టాల లేదా అన్నది డిసైడ్ చేస్తాను అని చెప్పారు. సినిమా చూసి ‘వుయ్ హ్యావ్ ఏ విన్నర్ ఇన్ అవర్ హ్యాండ్’ అన్నారు. అంత ఎగ్జైట్ అయ్యి అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఆర్.ఆర్ ఇచ్చారు. గిబ్రాన్ గారు ఈ సినిమాకి మంచి అసెట్.

ట్రైలర్ చూస్తున్నప్పుడు కొంచెం ‘రాక్షసన్’ ఫీల్ వస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు కూడా వస్తుందా?
– తప్పకుండా వస్తుంది అయితే ‘రాక్షసన్’ మాత్రమే కాదు ‘ఖాకి’, ‘ఖైదీ’ లాంటి సినిమా చూస్తున్న ఫీల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలు కూడా ఒక జెన్యూన్ అటెంప్ట్స్ అందుకే అంత పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా ఒక్క విలన్ పాత్ర ఫిక్షనల్ తప్ప మిగతాదంతా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న జెన్యూన్ కథే.

మీకు మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. మీ జోనర్ సినిమాల్ని కాకుండా ఎందుకు కొత్త జోనర్ సినిమాల్ని ఎందుకు ట్రై చేస్తున్నారు ?
– ఇప్పటికే చాల లవ్ స్టోరీస్ చేసి చేసి బోర్ కొట్టేసింది. అదే పాత ప్రేమకథలు చేయయాలనిపించట్లేదు. దానికి అంటే కూడా నా కెరీర్‌లో నేను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించాలనుకుంటున్నాను. నటుడిగా నేను ఎదగాలని చేసిన ప్రయత్నం ఇది. `అశ్వ‌థ్థామ‌`తో నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను. ఒక డిఫ‌రెంట్ శౌర్య‌ని చూస్తారు. ఇప్ప‌టినుండి నాకు వ‌చ్చే క‌థ‌లు కూడా మార‌తాయ‌ని అనుకుంటున్నాను.

టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
– మహా భారతంలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించిన వ్యక్తి `అశ్వ‌థ్థామ‌`. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలాంటిదే కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ‘గోపాల గోపాల’ సినిమాలో `అశ్వ‌థ్థామ‌` గురించి చెప్పే డైలాగ్, ఈ `అశ్వ‌థ్థామ‌` కి ఇన్స్ పిరేషన్. అందుకే శరత్ మరార్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ డైలాగ్ వాయిస్ ఓవ‌ర్ సినిమా స్టార్టింగ్‌లో పెట్టడం జరిగింది.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ ?
– అవసరాల శ్రీ‌నివాస్ గారితో చేస్తున్న సినిమా ఇప్పటికే 3 షెడ్యూల్స్ అయిపోయాయి. అలాగే నందిని రెడ్డి గారు నా కోసం ఒక కొత్త‌ర‌కం ప్రేమ‌క‌థ రాస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వేరే హీరో సినిమా ఉంటుంది. దానికోసం ఓ లవ్ స్టోరీ నేనే రెడీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయితే వేరే హీరోని అప్రోచ్ అవుతా. ప్రస్తుతానికి అయితే `అశ్వ‌థ్థామ‌` రిలీజ్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.