Home Blog Page 983

Ramgopal varma’s Beautiful Movie interview Press Meet

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా `అగస్త్య మంజు` దర్శక‌త్వంలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మాతలుగా….సహ నిర్మాతలుగా నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్ముస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `బ్యూటిఫుల్` (ట్రి బ్యూట్ టు రంగీలా) అనేది ఉప శీర్షిక. .ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా శనివారం హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ :- నేను రొమాంటిక్ ప్రేమకథా చిత్రం తీసి యుగాలై పోయింది. క్రిందటి జన్మలో రంగీల సినిమా తీసాను. ఇది ఆ సినిమాకు సీక్వల్ గా ఉండవచ్చు. సాధారణంగా మగవాళ్ళు ఎదిగితే ఆడవాళ్లు వెనుక ఉంటారు.ఈ సినిమాలో అందుకు బిన్నంగా హీరోయిన్ ఎదుగుతుంటే హీరో వెనుక ఉంటాడు,అయితే హీరోయిన్ ఎదుగుదలను హీరో తట్టుకోగలడా లేదా? అన్నది ఈ చిత్రం కాన్సెప్ట్..నా మదిలో మెదిలిన ఈ పాయింట్ ను అగస్త్య మంజు కు చెపితే దీనిని అద్భుతమైన ప్రేమకథా చిత్రం గా మలిచాడు.. ఇందులో విలన్స్ ఉండరు.సినిమా అంతా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.సంగీత భరితంగా ఉంటూనే రొమాన్స్ పరంగా కూడా ఆకట్టుకుంటూ కన్నీళ్లు తెప్పించే సన్నివేశాల తో మిలితమై ఉంటుంది..హీరోయిన్ నైనా ఈ పాత్ర కోసమేపుట్టిందా…అనిపించే విదంగా ఉంటుందని అన్నారు.

హీరోయిన్ నైనా గంగూలీ మాట్లాడుతూ :-ఇందులో నేను ఛాలెంజింగ్ రోల్ చేసాను,హీరో కు నాకు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది, నా ఇంట్రడక్షన్ సాంగ్ లో 11 కాస్ట్యూమ్స్ చేయడం ఒక ఎత్తయితే,ఆ పాటను వర్మ గారు షూట్ చేశారు. దానిని నేను జీవితంలో మరచిపోలేను,తెలుగు లో జోహార్ మూవీ చేస్తున్నాను, ఇంకా తెలుగు లో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు..

హీరో సూరి మాట్లాడుతూ :-ఈ కంటెంట్ కు ఎవరైనా కనెక్ట్ కావాల్సిన సినిమా,వర్మ గారు ఈ సినిమా చూసి ఏడ్చేశారు,కానీ ఆయన అది అబద్దం అంటున్నారు. ఆయన ఎమోషనల్ అయింది వాస్తవం. తెలుగు లో నేను చేసిన మొదటి సినిమా ఇది అని అన్నారు.

Ullalla Ullalla Movie Hero Nataraj interview

సరికొత్త కథ, కథనాలతో సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ ని హీరోగా, నూరిన్, అంకితలను హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న ఈ చిత్రం జనవరి 1 న విడుదలకి సిద్ధంగా ఉండగా, హీరో నటరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ…

ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

దర్శకుడు, నిర్మాత వాళ్ళ కథకి ఒక కొత్త వ్యక్తి హీరో అయితే బాగుండని అనుకున్నారు, అలా నాన్నగారి ద్వారా నా గురించి తెలిసి ఆడిషన్ తీసుకున్నారు. మొదట్లో యూనిట్ సభ్యులకి కొత్త హీరో ఇంత మంది అనుభవమున్న నటుల మధ్య చేయగలరా అనుకున్నారు. సెట్ లో కొన్ని రోజులు నా నటన చూసాక అందరికి నమ్మకం వచ్చింది.

మీరు నటన నేర్చుకున్నారా?

నేను 15 ఏళ్ళ నుండి యూట్యూబ్ లోను మరియు థియేటర్స్ చేస్తూ ఉన్నాను. మొదటి సినిమా మరాఠి సూపర్ హిట్ సైరత్ కన్నడ రీమేక్ అయిన “మనసు మల్లిగె” రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేసాను. 800 మందిని ఆడిషన్ చేసాక 801 వ వాడిగా వెళ్లిన నన్ను ఎంచుకున్నారు అనుకున్నట్టుగా ఆ చిత్రం అక్కడ అద్భుతమైన విజయం సాధించింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?దర్శకుడు అవ్వాలి అన్న పిచ్చి ఆశ, డబ్బులున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలతో పాటు ప్రేమ కథ, సైకాలజికల్ కథనాల మధ్య తిరిగే ఒక గందరగోళ క్యారెక్టర్ నాది.

‘ఊల్లాల ఊల్లాల’ టైటిల్ ఎలా డిసైడ్ చేశారు ?
దర్శకుడు, నిర్మాత చిత్ర కథనాల గురించి మాట్లాడుకుంటూ టైటిల్ ఏం పెడుదాం అని చర్చింకుంటుండగా, నిర్మాత ఎ.గురురాజ్ గారికి చాలా ఇష్టమైన పాట ‘ఊల్లాల ఊల్లాల’ గుర్తొచ్చి అదే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

తెలుగులో ఇది మీ మొదటి సినిమా ఎలా అనిపిస్తుంది?

చాలా సంతోషంగానూ అదే సమయంలో భయంగాను ఉంది. నాన్నగారి పేరు నిలబెట్టగలనా, అందరూ నన్ను హీరోగా రిసీవ్ చేస్కుంటారా అన్న ఆలోచనలతో భయంగాను ఉంది. జనవరి 1 సినిమా విడుదల కోసం వేచి చూస్తున్న.

మీ నాన్నగారి దర్శకత్వంలో పని చేయటం మీకెలా అనిపించింది, సెట్ లో నాన్నగారితో మీ రిలేషన్ ఎలా ఉండేది?

సెట్ లోకి వచ్చాక నాన్నగారు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, అదే నాకు నేర్పించారు. కావాల్సిన చోటల్లా ఒక దర్శకుడిగా, ఒక తండ్రిగా చాలా సలహాలిచ్చారు. ఆయనకీ నాకు ఈ చిత్రం ఒక కొత్త అనుభవం, దర్శకుడిగా నాన్నకి, నటుడిగా నాకు ఇది మొదటి చిత్రమవ్వడంto ఈ చిత్రంపై మాకు చాలా అంచనాలు, ఆశలు ఉన్నాయి.

మీ నాన్నగారి డైలాగ్ డెలివేరిలో ఒక స్టైల్ ఉంటుంది, మీరు కూడా అలా ఏమైనా ఫాలో అయ్యారా?

కచ్చితంగా నా స్టైల్ సెపరేట్ ఉంటుంది అది మీకు జనవరి 1 న తెరపై కనిపిస్తుంది.

మీ తరువాతి ప్రాజెక్ట్స్ ?
అమ్మ దీవెన అనే సినిమా చేస్తున్న షూటింగ్ చాలా మేరకు ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కేవలం హీరోగానేనా, కొత్త రోల్ అయినా చేస్తారా?

నేను నటుడిగానే నిలబడాలనుకుంటున్న, కొత్త కథ రోల్ ఏది వచ్చినా, నచ్చితే కచ్చితంగా చేస్తా.

కన్నడలో ఇంకో చిత్రం ఏమైనా చేస్తున్నారా?

ప్రస్తుతానికి కన్నడలో ఏ చిత్రానికి ఒప్పుకోలేదు.

మీ నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన క్యారెక్టర్?
ఆయన చిత్రాలు అన్ని నాకు నచ్చినవే, ముఖ్యంగా అంటే మాత్రం పోలీస్ స్టోరీ లో సత్య, సీతారామ రోజులో విలన్ క్యారెక్టర్ నా ఫెవరెట్.

హీరో అవ్వడానికి మీరు తీసుకున్న ట్రైనింగ్ ఏంటి?
చాలా బరువు తగ్గాను, నటనలో, ఫైట్స్ లో, డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాను, నన్ను నేను రెడీ చేసుకున్నాకే సినిమాల్లోకి వచ్చాను.

Nandamuri Kalyan Ram’s Entha Manchivadavura “Jaataro Jaatara” song launch

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా  ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలో రెండో సాంగ్ `జాత‌రో జాత‌ర‌..`ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ రెడ్ ఎఫ్‌.ఎంలో విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. 
“జాత‌రో జాత‌రో నేనొస్తే జాత‌రో ప‌రువాల మోత మోగ‌నీరో
పూత‌రో పూత‌రో బంగారు పూత‌రో నా మేని మెరుపు చూసుకోరో
ఊరోళ్ల కుర్రోళ్ల ఊర‌క చెప్పున‌మ్మో అస‌లైన పండ‌గేదో
నిప్పులోన ప‌డ్డాకే నిగ్గు తేలున‌మ్మో సిసలైన పుత్త‌డేదో….“
అంటూ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, న‌టాషా దోషి మ‌ధ్య సాగే మాస్ బీట్ సాంగ్‌ను శుక్ర‌వారం రెడ్ ఎఫ్.ఎంలొ విడుద‌ల చేశారు. ఈ ప ఇప్ప‌టికే విడుద‌ల చేసిన `అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు ..` అనే మెలోడీ సాంగ్‌కు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చాయి.  ఇప్పుడు విడుద‌ల చేసిన మాస్ బీట్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. శ్రీమ‌ణి సాహిత్యాన్ని అందించిన ఈ పాట‌ను బిగ్‌బాస్3 విన్న‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌, సాహితి చాగంటి ఆల‌పించారు.
ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుల చేస్తున్నారు.
న‌టీన‌టులు:
 నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌:త‌మ్మిరాజు
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Rajinikanth’s ‘Darbar’ Pre-Release function on January 3

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. జనవరి 3న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. రజనీకాంత్ సహా చిత్రబృందం అంతా ఈ వేడుకకు హాజరు కానున్నారు.

ఆల్రెడీ రిలీజైన ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టోస్తోంది. ముఖ్యంగా పోలీస్‌ ఆఫీసర్‌గా రజనీకాంత్‌ స్టైల్, గ్రేస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆయనను దర్శకుడు మురుగదాస్ చాలా స్టయిలిష్ గా చూపించారని అభిమానులు సంబరపడుతున్నారు. ట్రైలర్‌లో ‘సార్‌! వాళ్ళకు చెప్పండి… పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు. స్ట్రైయిట్‌గా రావొద్దని’, ‘ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్‌ అమ్మా! ఇది ఎలా ఉంది?’, ‘అయామ్‌ ఎ బ్యాడ్‌ కాప్‌’ అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగులకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్‌లో రజనీకాంత్ మేనరిజమ్స్, యాక్టింగ్, స్టైల్,  మురుగదాస్ టేకింగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ:  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

King Nagarjuna, Ahishor Solomon ‘Wild Dog’ First Look Unveiled

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.6గా  అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. డిఫ‌రెంట్‌గా ఉన్న నాగార్జున్ లుక్ రీసెంట్‌గా జ‌రిగిన దిశ హంత‌కుల‌ ఎన్‌కౌంట‌ర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారని ఫ‌స్ట్ లుక్‌లోని న్యూస్ పేప‌ర్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది.
జాతీయ ప‌త్రిక‌లో రాసిన వార్త‌ల సారాంశం ఆధారంగా అస‌లు సినిమా ప్ర‌ధాన క‌థాంశం ఏంటో అర్థ‌మ‌వుతుంది. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన వైల్డ్‌డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున న‌టిస్తున్నారు.
మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి ,
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మోన్‌
నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌లు:  ఎన్‌.ఎమ్‌.పాషా, జ‌గ‌న్ మోహ‌న్ వంచ‌
సినిమాటోగ్ర‌ఫీ:  షానియ‌ల్ డియో
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  డేవిడ్ ఇస్మాలోనె
డైలాగ్స్‌:  కిర‌ణ్ కుమార్
ఎడిట‌ర్‌: శ‌్ర‌వ‌ణ్ కేతికానేని
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌: స‌తీష్‌, ప్ర‌శాంత్‌
ఆర్‌:  ముర‌ళి ఎస్‌.వి
వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌.టి
కాస్ట్యూమ్స్‌:  అశ్వంత్ బైరి
స్టంట్ కో ఆర్టినేట‌ర్‌:  జాషువా
పి.ఆర్‌.ఒ:  వంశీ-శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్ భాను

Ksheera Sagara Madhanam Gautham Shetti First look Launch

దేవతలు-రాక్షసులు సాగరాన్ని మధించినప్పుడు అమృతంతోపాటు హాలాహలమూ వచ్చింది. మన మనసులు మధించినప్పుడు కూడా మంచి ఆలోచనల్తోపాటుపాటు, చెడు ఆలోచనలు కూడా ఉద్భవిస్తాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, మానస్ నాగులపల్లి హీరోలుగా నటిస్తున్నారు. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న గౌతమ్ శెట్టి ఫస్ట్ లుక్ చిత్ర బృందం విడుదల చేసింది.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ కోవలో సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు ‘అనిల్ పంగులూరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్నిపంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందించనున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న
ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Saftwere Sudheer Producer k.Shekar raju and Directer Rajashekar reddy Pulicharla interview

‘జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం:1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్‌ 28న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు మాట్లాడుతూ…

అంచెలంచెలుగా ఎదిగాను!!
మాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి హైదరాబాద్‌లో ఓ మామూలు వ్యక్తిగా అడుగుపెట్టాను. 2500 నెలసరి జీతానికి ఓ గ్లాస్‌ స్మార్ట్‌లో కుదిరి రోజు సైకిల్‌మీద వెళ్తూ 2005 నుండి 2008 వరకు అక్కడే పని చేశాను. ఆ పనిలోని మెళకువలు నేర్చుకుని 2008లో గీతం కాలేజీకి సంబంధించిన విండోస్‌ గ్లాసింగ్‌ కాంట్రాక్ట్‌ ప్రారంభించాను. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ శేఖర గ్లాస్‌ వర్క్స్‌ను స్థాపించి ప్రస్తుతం మూడు చోట్ల దాదాపు 90 మంది స్టాఫ్‌తో కంపెనీ రన్‌ చేస్తున్నాను. భీమవరం అంటేనే కళాకారులకు పుట్టినిల్లు అంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండానే నా దృష్టి సినిమాలపై మళ్లింది.
అలా ప్రారంభమైంది!!
ఈ క్రమంలో రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల చెప్పిన కథ నచ్చి ‘శేఖర్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌’ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించాను. కథ ప్రకారం హీరోగా సుడిగాలి సుధీర్‌ అయితే బాగుంటుందని సుడిగాలి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రాన్ని నిర్మించాను. ధన్య బాలకృష్ణ కథానాయికగా నటించింది. మేం అనుకున్నట్లుగానే సుధీర్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోగా సుధీర్‌కు డెఫినెట్‌గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. హైదరాబాద్‌తో పాటు మలేషియాలోని రిచ్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపాం. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి అయ్యిందంటే అందుకు కారణం మా చిత్ర యూనిట్‌ సహకారం. ఈ మధ్యే సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్‌ ఎండింగ్‌లో ఆడియన్స్‌ నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. ఇందులో ఒక ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేశాను. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వ శాఖలో ఎంతో కాలం పని చేశారు. ఆ అనుభవంతో ఒక మంచి కథ రాశారు. కథ ఎంత బాగా రాసుకున్నారో అంత బాగా తెరకెక్కించారు. ఈ సినిమాతో తనకు దర్శకుడిగా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఈ నెల 28న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
అంతర్లీనంగా మంచి సందేశం ఉంది!!
సాఫ్ట్‌ వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉంటుంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. రైతులకు, సాప్ట్‌వేర్‌ సుధీర్‌కు ఉన్న లింక్‌ ఏంటీ? అనేది వెండితెరపై చూడాలి.
ఈ సినిమాలో గద్దర్‌గారి పాత్ర ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటూ ఆసక్తికరంగా ఉంటుంది. శివప్రసాద్‌గారు ముఖ్య పాత్రలో నటించారు. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌, రామ్‌ ప్రసాద్‌, గౌతం రాజు, భీమ్స్‌ ఇలా ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించారు. వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో మాకు పూర్తి సహకారం అందించిన బి.ఎ రాజు గారికి ప్రత్యేక దన్యవాదాలు“అన్నారు.కామెడీతో పాటు ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ ఆద్యంతం అలరించే చిత్రం “సాఫ్ట్ వేర్ సుధీర్”

చిత్ర దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ…
దర్శకత్వ శాఖలో అనుభవం ఉంది!!

నేను రైటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. నేను కూడా అందరిలాగే 10 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్స్‌ పట్టుకొని అన్నీ ఆఫీస్‌లకి తిరిగాను. ఫైనల్‌గా మా గురువుగారు సంపత్‌ నందిగారు ఆయన దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్‌ రైటర్‌, కో డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే పోసానిగారి దగ్గర కొన్ని మూవీస్‌కి వర్క్‌ చేశాను. కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గా వర్క్‌ చేశాను. రైటర్‌గా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రానికి పని చేశాను. అలా దర్శకత్వం చేయాలని మా నిర్మాత శేఖర్‌ రాజుగారికి ఈ కథ చెప్పాను. ఆయన సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌!!
ఈ సినిమా సుధీర్‌ ఫ్యాన్స్‌నీ, కామన్‌ ఆడియన్స్‌ని పక్కాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. ఒక కామన్‌ ఆడియన్‌ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటారో అది ఈ సినిమాలో ఉంటుంది. కరెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ మీద చేసిన పాయింట్‌. డెఫినెట్‌గా అందర్నీ ఆలోచింపజేస్తుంది. రెగ్యులర్‌ సినిమాల్లా కాకుండా కమర్షియల్‌లోనే మంచి పాయింట్‌ని టచ్‌ చేస్తూ సినిమా చేశాం. సుడిగాలి సుధీర్‌ నుండి ఏదైతే కామెడీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారో, దాంతో పాటు సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లింగ్‌ అంశాలు ఇందులో ఉంటాయి. ఆడియన్స్‌లో ఆయన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ అని టైటిల్‌ పెట్టాం.
గద్దర్‌ పాత్ర గుర్తుండిపోతుంది!!
ఈ సినిమాలో ఒక పాట పాడి నటించి సినిమా చూసి ఆడియన్‌ బయటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్‌ చేసిన గద్దర్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటీవల మనకు దూరమైన డా. ఎన్‌. శివప్రసాద్‌గారు ఈ సినిమాలో కథ నచ్చి మంచి క్యారెక్టర్‌ చేశారు. నాజర్‌, పోసాని కృష్ణమురళి, ఇంద్రజ, పృధ్వీ, షాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 28న సినిమా గ్రాండ్‌గా విడుదలవుంది. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను“అన్నారు.

Nagashourya’s ‘Ashwatthama’ Teaser launch

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`.ఈ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా టీజర్‌ని డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. ఉద‌యం 11గంటల 7 నిమిషాలకు హీరోయిన్ సమంత ట్విట్టర్‌లో ఈ టీజ‌ర్‌ను విడుల చేశారు. ఈ టీజ‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు. 

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – “యంగ్ టీమ్ అందరితో కలిసి చేసిన పవర్ ప్యాక్డ్ ఫిలిం ఇది. డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్‌ను రమణ తేజ ఫెంటాస్టిక్గా ప్రెజెంట్ చేశాడు. టీజర్తో పటు మూవీ కూడా అందరికీ నచ్చుతుంది“ అన్నారు. 

ఎడిటర్ గ్యారీ మాట్లాడుతూ – “శౌర్య కథని నమ్మి ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాడు. ప్రతిదీ చాలా కేర్ తీసుకొని చేశాడు. డైరెక్టర్ తేజ కొత్త డైరెక్టర్‌లా కాకుండా అనుభ‌వ‌మున్న డైరెక్ట‌ర్‌లా వర్క్ చేశాడు. అలాగే నిర్మాత ఉష, శంకర్ ప్రసాద్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది“ అన్నారు. 

కెమెరామెన్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ – “శౌర్య కొత్త ఆలోచ‌న‌తో ఈ కథని రాశారు. ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమా చేశాం. నిర్మాతలు ఫుల్ సపోర్ట్ చేశారు. టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. తేజ అమేజింగ్ గా ఈ ఫిలిం తెరకెక్కించాడు. మూవీ చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా మా అందరికీ మంచిపేరు తెస్తుందని ఆశిస్తున్నాను“ అన్నారు. 

యతీష్ మాట్లాడుతూ – “టీజర్ చూస్తుంటే  ప్రతి ఫ్రేమ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది. సినిమా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కలిగిస్తుంది. ప్రతి షాట్ లో టీమ్  వర్క్ కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేసిన ఈ సినిమా రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నాం“ అన్నారు. 

బి.వి.యస్. రవి మాట్లాడుతూ ``హీరో కథ రాసుకోవడం ఒక విశిష్టత . టీజర్ చాలా గొప్పగా వుంది. మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. శ్రీ చరణ్ మ్యూజిక్ చాలా బాగుంది. శౌర్య డెడికేషన్‌తో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాడు. 24 గంటలు ఈ సినిమా కోసమే కష్టపడి  పట్టుదలతో పెద్ద హిట్ కొట్టాలనే కసితో శౌర్య చేశాడు. తప్పకుండా హిట్ కొడతాడు అనే నమ్మకం వుంది“  అన్నారు. 

చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – “నన్ను నమ్మి ఇంత భారీ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థాంక్స్. కంటెంట్ సినిమాలో కీల‌కంగా ఉంటుంది. శౌర్య ఐడియా చాలా బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. నాగశౌర్య విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారు. అంత అద్భుతంగా నటించారు. ప్ర‌తి స‌న్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలాంటి బిగ్ కమర్షియల్ మూవీ నాలాంటి కొత్త డైరెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. మనోజ్ బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. శ్రీ చరణ్ మ్యూజిక్ అమేజింగ్. ఎడిటర్ గ్యారీ సెట్ కి వచ్చి ఆన్లైన్ ఎడిటింగ్ చేశాడు. సినిమా అందరికి నచ్చుతుంది..  అన్నారు.

చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ – “మా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 3 చిత్రం అశ్వథ్థామ‌`.  కంటెంట్ ని నమ్మి ఈ సినిమా తీశాం. టీమ్ అంత కష్టపడి వర్క్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుందని నమ్మకం వుంది“ అన్నారు. 

నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – “ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా టీమ్ అందరూ హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. జనవరి 31న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.  తప్పకుండా మంచి విజయం సాదిస్తుంది.. అన్నారు. 

హీరో నాగ శౌర్య మాట్లాడుతూ – ““చలో` టీజర్ ఇక్కడే రిలీజ్ చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. `నర్తనశాల` టీజర్ కూడా ఇదే ప్లేస్ లో రిలీజ్ చేశాం. డిజాస్టర్ అయింది..మరి ఇప్పుడు `అశ్వథ్థామ` టీజర్ రిలీజ్ చేస్తున్నాం. బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. ఢిల్లీ, ముంబై లలో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ చిత్రం కథను రాసుకున్నాను. `చలో`కి కథ రాశాను. కానీ పేరు వేసుకోలేదు. నాకు బేసిగ్గా కథలు రాయడం, చెప్పడం ఇష్టం. అమ్మాయిలకు ర‌క్ష‌ణ లేదు అందరూ బాగుండాలి అని ఈ సినిమా తీశాం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. దాని నుండి బయటికి వచ్చి రఫ్ గా వుండే క్యారెక్టర్ చేశాను. నాకు అలాగే ఉండటం ఇష్టం. మనోజ్ రెడ్డి నన్ను కొత్తగా చూపించాడు. నేను ఏదైతే కథ అనుకున్నానో దానిని చ‌క్క‌గా తెరకెక్కించాడు..తేజ. ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ పిల్లర్ గ్యారీ. సెట్లో వుండి వర్క్ చేశాడు. తేజ, గ్యారీ, మనోజ్, నేను మేము నలుగురం 6నెలలు ట్రావెల్ చేసి ఈ కథపై వర్క్ చేశాం. అలా చేయడం వాళ్ళ వర్కింగ్ డేస్ చాలా తగ్గాయి. ఎలాంటి టెన్ష‌న్ లేకుండా అనుకున్న టైంలోనే సినిమా పూర్తి చేశాం. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ చేస్తున్నాను. నా తల్లితండ్రులు గ‌ర్వంగా త‌లెత్తుకునేలా ఈ సినిమా చేశాను. ప్రేక్షకులకి తప్పకుండా సినిమా నచ్చుతుంది. మెహ్రీన్ చాలా అందంగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. అలాగే ఒక కొత్త విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నేను ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎగ్జ‌యిట్ అవుతూ రాసిన విలన్ పాత్రలో జిషు నటించాడు. మంచి కథ రాశాను.. నచ్చింది.. సినిమా చేశాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను“ అన్నారు.

న‌టీన‌టులు:  
నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
క‌థ‌:  నాగ‌శౌర్య‌
ద‌ర్శ‌క‌త్వం:  ర‌మ‌ణ‌తేజ‌
సినిమాటోగ్ర‌ఫీ:  మ‌నోజ్ రెడ్డి
సంగీతం:  శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  బుజ్జి
డిజిట‌ల్‌:  ఎంఎన్ఎస్ గౌత‌మ్‌
డైలాగ్స్‌:  ప‌రుశురాం శ్రీనివాస్‌
యాక్ష‌న్‌: అన్బ‌రివు
కొరియోగ్రాఫ‌ర్‌:  విశ్వ ర‌ఘు

Hot Sensation Gehana Vasisth in Arabic Song

VICTORY MOVIZ an entertainment  company has produced an exciting Arabic song Ya Habibi featuring the sensational hot Gehana Vasisth. The song has been shot on a lavish set up and has all the credential”s  to be a Super hit.
It has been directed by Hirday.S.Mishra and music by  Sunil Jha who has done an amazing job. Song has beautiful sung by Anita Adhikary..
This song can qualify to be the best song of 2019.The audio is very nice and the video is  a visual treat and Gehana Vasisth  has done an amazing job.  The charm and grace of actress Gehana vasisth is an added asset.

‘Ullalla Ullalla’ Heroine Ankitha Interview

సరికొత్త కథ, కథనాలతో సీనియర్ నటుడు సత్యప్రకాష్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న కేజ్రీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఊల్లాల ఊల్లాల’. ‘లవర్స్ డే ‘ చిత్ర నిర్మాతగా అందరికి తెలిసిన ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో సత్య ప్రకాష తనయుడు నటరాజ్ ని హీరోగా, లవర్స్ డే ఫేమ్ నూరిన్ ని హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తుండగా మిస్ బెంగుళూరు గా అందరికీ తెలిసిన అంకిత ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. అదే సమయంలో సింగర్లుగా అందరికీ తెలిసిన మంగ్లీ మరియు రోల్ రైడ లని నటులుగా పరిచయం చేస్తూ ఊల్లాల ఊల్లాల జనవరి 1 న విడుదలకి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా హీరోయిన్ అంకిత ఈ చిత్ర కథ, తన పాత్ర మరియు రాబోయే తన చిత్రాల గురించి విలేకర్లతో మాట్లాడింది.
మీరు మిస్ బెంగుళూరు 2016 అయ్యాక కన్నడలో ఎన్ని చిత్రాలు చేశారు?
కన్నడ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి కానీ కన్నడ పరిశ్రమలో కర్ణాటక అమ్మాయిలకు మాత్రమే ఎక్కువ అవకాశాలిస్తారు, నేను కూడా ఎప్పటినుండో ఇక్కడే చేయాలని అనుకోవడం ఈ లోపలే నాకు తెలుగు పరిశ్రమ నుండి అవకాశం రావడం వెంటనే చేసేయడం జరిగిపోయింది.ఇది మీ రెండవ చిత్రమా? దీని తరువాత ఇంకేవైనా చిత్రాలు చేస్తున్నారా?
అవును ఇది తెలుగులో నా రెండవ చిత్రం, దీని తరువాత ‘నా బంగారు తల్లి’ దర్శకుడు రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో తెలుగు-ఒడియా ద్విభాషా చిత్రం చేస్తున్నాను, అది వచ్చే సంవత్సరంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో మీ రోల్ ఎలా ఉంటుంది?
కొత్త నటులు డైరక్టర్లని ఎక్కువగా అడగడానికి తెలుసుకోవడానికి స్కోప్ ఉండదని మీకు తెలిసిందే. దర్శకుడు సత్య ప్రకాష్ గారు నాకు ఈ చిత్ర కథలో నా పాత్ర మేరకు కొన్ని సన్నివేశాలు చెప్పారు, అందులో నా రోల్ కి ఉన్న ప్రాముఖ్యతని చూసి, దేవుడి పై భారం వేసి ఒప్పుకున్నాను. నాకు పూర్తి కథ ఇప్పటివరకు తెలీదు, చిత్రం కూడా చూడలేదు, నాకు తెలిసినంతవరకూ చాలా రిచ్ గా సస్పెన్స్ తో నిండిన వైవిధ్యమైన పాత్ర నాది.నటరాజ్ తో రొమాంటిక్ సీన్స్ లో చేయడం ఎలా అనిపించింది?
మిగితా సీన్ల లాగే రొమాంటిక్ సీన్లలో నటించడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను హీరోయిన్ కావాలని అనుకున్నపుడు ఇలాంటి సీన్లలో నటించాల్సి వస్తుందని తెలిసే నిర్ణయించుకున్నాను. అప్పట్లో మాధురి దీక్షిత్ నుండి ఇప్పటి కంగనా రనౌత్ వంటి పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ తమ కెరీర్ లో ఇలాంటివి చేసుంటారు. అంత మంది చిత్ర బృందం మధ్య రొమాన్స్ ని నటనకి మాత్రమే పరిమితం చేసి బాగా నటించాలని మాత్రమే అనుకుని చేస్తుంటాం కాబట్టి అందులో మాకెలాంటి సమస్య ఉండదు.

సీనియర్ నటుడు, దర్శకుడు సత్యప్రకాష్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
ఆయన చాలా మంచి వారు నన్ను అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు. ఒక డైరక్టర్ లాగా కాకుండా కూతురిలా చూసుకునేవారు, నువ్వు ఒక పెద్ద స్టార్ అవుతావు అని చెపుతూ నన్ను అలానే ట్రీట్ చేసేవారు.

తెలుగు పరిశ్రమలో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది?
వీలైతే తెలుగు పరిశ్రమలో మరో 20 ఏళ్ళవరకైనా కొనసాగాలనుంది ఎందుకంటే ఇక్కడ భాషా, ప్రాంతం అని తేడా చూపించకుండా కేవలం ప్రతిభని చూసి గుర్తింపు, అవకాశాలు, మర్యాద ఇస్తారు. నేను బెంగళూర్ అమ్మాయిని అని తెలిసినా భాష రాకపోయినా నా ప్రతిభని చూపించడానికి ఒక అవకాశమిచ్చారు. అలాగే సత్య ప్రకాష్ గారు ఎక్కడికి వెళ్లినా మీ అమ్మని వెంట తీసుకెళ్ళు, ఇక ముందు చిత్రాల్లో అయినా సరే తనని నీతోనే ఉండనివ్వు అని చాలా ఆత్మీయతతో జాగ్రత్తలు చెప్పి సలహాలు ఇచ్ఛేవారు అంత మంచి మనుషులున్నారు కాబట్టే ఈ పరిశ్రమలో కొనసాగాలనుంది.

ఈ చిత్రంలో మీరు ఎన్ని పాటల్లో కనిపిస్తారు?
ఒక్క పాటలో పూర్తిగా కనిపిస్తాను డాన్స్ చేస్తాను, మిగితా రెండు పాటల్లో అక్కడక్కడా కనిపిస్తుంటాను.

2020 జనవరి మొదటి రోజునే మీ ఊల్లాల ఊల్లాల చిత్రం విడుదలవ్వడం ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది కానీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో, నా నటనకి ఎన్ని మార్కులు వేస్తారో లాంటి వేరు వేరు ఆలోచనలు కూడా ఉన్నాయి.

వచ్చే సంవత్సరంలో మీరేవైనా చిత్రాలు సంతకం చేశారా?
ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ గారు నాకు రెండు చిత్రాలు ఆఫర్ చేశారు అవి వచ్చే సంవత్సరంలో తెరకెక్కవచ్చు.

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో నటించడానికి పిలుపొచ్చినపుడు ఎలా అనిపించింది?
అంత పెద్ద దర్శకుడు ఆయన చిత్రాల్లో అవకాశం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది, ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నాను.