Home Blog Page 984

‘Mathu Vadalaraa’ Director Rithesh Rana Interview

మత్తువదలరా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాడు దర్శకుడు రితేష్‌రానా.పరిమిత వ్యయంతో , నవ్యమైన కథ, కథనాలతో మత్తువదలరాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నాడు. మైత్రీమూమీమేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు  శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో సంభాషిచారు. ఆ విశేషాలివి..

తొలిసినిమా అవకాశం ఎలా వచ్చింది?
ఓ కామన్‌ఫ్రెండ్ రిఫరెన్స్‌తో మైత్రీమూవీ మేకర్స్ చెర్రిగారిని కలవడం జరిగింది. మూడేళ్ల క్రితం ఆయనకు ఈ కథ చెప్పాను. కొత్తవాళ్లమైనా మా ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా బాధ్యతల్ని అప్పజెప్పారు. వారు ఆశించిన విధంగా సినిమాకు న్యాయం చేశామని భావిస్తున్నా.

సినిమా మీరు అనుకున్న విజయాన్ని సాధించిందా?
అన్ని కేంద్రాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మా టీమ్ అందరికతో కలిసి హైదరాబాద్ థియేటర్స్‌లో సినిమా చూశాం.కథలోని సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం వల్ల అందరికి సినిమా చూసే అవకాశం లభించడం లేదు. మరికొన్ని థియేటర్లు పెరిగితే సినిమా అందరికి చేరువవుతుందని అనుకుంటున్నా.

మూడేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేస్తున్నారు. సెట్స్‌మీదక వెళ్లే సరికి స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు జరిగాయా?
కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలుత అనుకున్న స్క్రిప్ట్‌నే తెరకెక్కించాం. మైత్రీమూవీమేకర్స్ మా టీమ్‌ను పూర్తిగా విశ్వసించారు. దాంతో మేము కోరుకున్న విధంగా సినిమాను తెరపైకి తీసుకొచ్చాం. హూ డన్ ఇట్ అనే జోనర్‌లో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నాం. క్రైమ్ చేసిన వ్యక్తిని అన్వేషిస్తూ చేసే ఉత్కంఠభరిత ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం.

తొలి చిత్రానికే మైత్రీమూవీ మేకర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అవకాశం దక్కించుకోవడం ఎలా అనిపించింది?
అంతటి పేరున్న సంస్థ కాబట్టే ఈరోజు సినిమా ప్రేక్షకులకు చేరువైంది. లేదంటే విడుదల కోసమే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. పెద్ద సంస్థలో అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని మేము నిరూపించుకోవాలనే తపనతో పనిచేశాం. ప్రతి విషయంలో నిజాయితీగా శ్రమించాం కాబట్టే సినిమాకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి.

దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తనయులతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
మా కథకు శ్రీసింహా బాగా కుదిరాడు. తన బ్యాక్‌గ్రౌండ్‌ను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా సినిమా కోసం కష్టపడ్డాడు. మేము కూడా అతన్ని ఓ  న్యూకామర్‌లాగానే ట్రీట్ చేశాం. ఆడిషన్స్ చేసిన తర్వానే అతన్ని ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. అతని కుటుంబ సభ్యులెవరూ కూడా సినిమా విషయంలో జోక్యం చేసుకోలేదు. కాలభైరవ కథానుణంగా మంచి నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు.

టీవీ సీరియల్ ఎపిసోడ్‌లో మంచి వినోదం పండిందని ప్రశంసలు లభిస్తున్నాయి?
అవును. ఓ తమిళ ధారావాహిక స్ఫూర్తితో ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశాను. ఆ సీరియల్ ప్రహససం థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నది.

ఇండస్ట్రీ వారు సినిమా గురించి ఏమంటున్నారు?
రాజమౌళిగారు మూడుసార్లు సినిమా చూశారు. ఆయన ట్విట్టర్ ద్వారా మా టీమ్‌ను అభినందించారు. తొలిప్రయత్నంలోనే మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు.
ఓ మిస్టరీ థ్రిల్లర్‌ను కొత్త పంథాలో ఆవిష్కరించాలనుకున్నాం. ఈ స్టోరీకి పాటలు, ఫైట్స్ అవసరం లేదనిపించింది. పాటలు కథను ముందుకు నడిపించేవిగా ఉండాలి. ఉత్కంభరితమైన కథనం, అనూహ్య మలుపులతో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేస్తున్నది.

Rajinikanth’s “Darbar” Dumm Dumm Song Released

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌ ‘. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ ‘దుమ్ము ధూళి’ విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాయగా… ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. సినిమాలో మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ ‘డుమ్ డుమ్’ను కృష్ణకాంత్ రాశారు. ఈరోజు ఆ పాటను విడుదల చేశారు. విడుదలైన కొన్ని క్షణాల లో ఈ పాట వైరల్ అయింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా గేయ రచయిత కృష్ణకాంత్ (కేకే) మాట్లాడుతూ “సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో పాట రాసే అవకాశం నాకు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. నాకు ఇంకా ఇది ఒక కలలా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ గారు సంగీతం అందించిన సూర్య ‘గ్యాంగ్’, నాని ‘జెర్సీ’ సినిమాలలో అన్ని పాటలు రాశాను. అనిరుధ్ గారు నన్ను గుర్తుపెట్టుకుని… ఈ సినిమాలో ఒక పాట రాయమని ఇచ్చారు. చిన్నప్పటి నుండి రజనీకాంత్ గారిని చూస్తూ పెరిగిన నాకు… ఆయన సినిమాలో పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.  సినిమాలో ఒక యువ జంటకు పెళ్ళయ్యే సందర్భంలో ఈ ‘డుమ్ డుమ్’ పాట వస్తుంది.

పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉంటారు? అని చిన్న పిలాసఫీతో సాగే గీతం ఇది. రజినీకాంత్ గారి పాటల్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది. తమిళంలో ఈ పాటను వివేక్ గారు రాశారు. ఆ పాటను నాకు పంపించారు. తెలుగులో ఈ పాటను మీరు రాయలని చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు మురుగదాస్ గారు తీసిన ‘గజినీ’, ‘కత్తి’, ‘తుపాకీ’ సినిమాలు నాకు చాలా ఇష్టం. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. రజనీకాంత్ గారు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న తమిళ్ సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎనర్జిటిక్ మ్యారేజ్ సాంగ్ ను నకాష్ అజీజ్  పాడారు. రజనీ గారి ఎనర్జీకి ఆ వాయిస్ బాగా సూట్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిరుధ్ రవిచంద్రన్, రజనీకాంత్, మురుగదాస్, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి థాంక్స్. పాటను హిట్ చేసినట్టు జనవరి 9న విడుదల అవుతున్న సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి
పి.ఆర్‌.ఓ:  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు
స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్,
పాటలు: అనంత శ్రీరామ్, కృష్ణకాంత్ (కేకే),
సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌,
మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్,
ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్,
నిర్మాత: ఎ.సుభాస్కరన్,
ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

Jagapathi Babu In ‘Ashok Galla’, Sriram Adithya Film

ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్‌ సభ్యుడు జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అమర్‌రాజా  మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య ఇతర  పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు రోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్‌ శుక్రవారం  నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జిబ్రాన్‌ సంగీతం .. రిచర్డ్‌ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చంద్ర శేఖర్‌ రావిపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు:
అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌, జగపతిబాబు, నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య తదితరులు

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
నిర్మాత: పద్మావతి గల్లా
బ్యానర్‌: అమర్‌ రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఎగ్జికూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి
మ్యూజిక్‌: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌
ఆర్ట్‌:ఎ.రామాంజనేయులు
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
డైలాగ్స్‌: కల్యాణ్‌ శంకర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌
కాస్ట్యూమ్స్‌:అక్షయ్‌ త్యాగి, రాజేష్‌
పి.ఆర్‌.ఒ: బి.ఎ.రాజు, వంశీ-శేఖర్‌

‘Life Style’ Pre Release Event

కలకొండ ఫిలింస్ పతాకంపై నెహ్రు, విజయ్,రోజా,నిఖిల్,సంతోషి నటీనటులుగా సి.ఎల్.సతీష్ మార్క్ దర్శకత్వంలో కలకొండ నరసింహ,టాలీవుడ్ యాక్టింగ్ స్టూడియో లు నిర్మిస్తున్న “లైఫ్ స్టైల్” చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన మందాడి జగన్నాథం ట్రైలర్ విడులచేశారు.గోరేటి వెంకన్న పాటలు విడుదల చేయగా,సినీ ప్రముఖులు చేతుల మీదుగా చిత్ర యూనిట్ ఆడియో ను విడుదల చేశారు.

అనంతరం మందాడి జగన్నాథం మాట్లాడుతూ:- నాకు ఇష్టమైన వ్యక్తుల్లో నిర్మాత నరసింహ ఒకరు. చాలా కష్ట జీవి,సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి.అటువంటిది నిర్మాత కష్టమైనా ఇష్టపడి ఇంత మంచి సినిమా తీస్తాడనుకోలేదు. సినిమాపై నాకు అవగాహన ఉందిగాని, సినిమా ఫంక్షన్ లకు రావడం చాలా తక్కువ.అటువంటిది నిర్మాతపై ఉన్న ఇష్టంతో ఈ ఫంక్షన్ కు వచ్చాను.అందరూ నాది లక్కీ హాండ్ అంటారు.ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.

గోరేటి వెంకన్న మాట్లాడుతూ:-ట్రైలర్,పాటలు బాగున్నాయి. ప్రేక్షకులకు పాటల్లో మసాలా బాగా వడ్డించారు.ఇది సినిమాలో ఒక ఎంజాయ్ మెంట్ మాత్రమే,ఎవరికి నష్టం జరగదు.హీరోయిన్ నడుము చూసి కొంతమంది టికెట్స్ కొంటారు.యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.జగన్నాథం గారిది మంచి లక్కీ హాండ్ ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అయిన ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి మరిన్ని సినిమాలు తీయాలని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కలకొండ నర్సింహ మాట్లాడుతూ...*
కొన్ని సంవత్సరాల క్రితం 2g నెట్ వర్క్ ఉండేది. అప్పుడు మనుషులు చాలా పద్దతిగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం 4g నెట్ వర్క్ అప్డేట్ అయ్యిందిమ్ మనుషులు కూడా 4g నెట్ కోసం 4g మొబైల్ ఇష్టంగా తీసుకొని 4g కి, 4g మొబైల్ కి అంకితం అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరుకు 4g కి అలవాటుపడి చదువులు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లుతండ్రులను, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు.

దర్శకుడు సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ...*4g నెట్ ను అలవాటు పడి యువత బ్యాడ్ హ్యాబిట్స్ కు అలవాటు పడుతున్నారు. 4g మొబైల్ కు 4g నెట్వర్క్ ఎంత అవసరమో మనం కూడా మన ఫ్యామిలి కి అంతే అవసరం. ఈ విషయాలు సినిమాలో చెప్పడం జరిగింది. అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది. తప్పకుండా అందరికి మా లైఫ్ స్టైల్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను, ప్రస్తుత సమస్యలు, నిజజీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉండబోతున్న ఈ లైఫ్ స్టైల్ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

నటీనటులు:
నెహ్రు విజయ్,రోజా,నిఖిల్,సంతోషి.

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: కలకొండ నర్సింహ
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సి.ఎల్.సతీష్ మార్క్
సంగీతం: భాను ప్రసాద్.జె
సహా నిర్మాత: టాలివుడ్ యాక్టింగ్ స్టూడియో
లిరిక్స్: సతీష్ బండోజి,కెమెరామెన్: జేను
డైలాగ్స్: ఆవుసలి ఆంజనేయులు,ఎడిటర్: లోకేష్

Hero SriRam Nimmala interview for ‘Utthara’ Movie

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన
సినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలకు సిద్దం అయిన ఈ సినిమా యూత్ ని
ఆకట్టుకునే అంశాలతో ముస్తాబయ్యింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ నిమ్మల
మీడియా తో ముచ్చటించారు.

ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ:
‘‘సినిమాల్లోకి రావాలనే నా ప్రయత్నాలకు ‘ఉత్తర’ తో బ్రేక్ పడింది. ఎటువంటి సినిమా నేపథ్యం లేదు,కానీ సినిమాల్లోకి రావాలనే ఇష్టంతో ప్రయత్నాలు చేసాను ఉత్తర లో సెలెక్ట్ అవ్వడం,  న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్ తో పరిచయం అవడం నా అదృష్టం. ఈ కథలో కొత్త దనం కంటే మన కథ అని ఫీల్ అయ్యే అంశాలు ఎక్కువుగా ఉంటాయి. అందరూ రిలేట్ అయ్యే సన్నివేశాలు, పాత్రలు ఉత్తర ను కనెక్ట్ చేస్తాయి. మా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న దర్శకుడు మేం షూట్ చేసిన నిజామాబాద్ , దుండిగల్ ప్రాంతాలలోని సహాజత్వం తెరమీదకు తెచ్చారు. పాడు బడిన గోడలు, పల్లెల్లో ఇరుగ్గా కనిపంచే సందుగొందులలో కథ ను చాలా సహాజంగా నడిపారు. ఊళ్లో ఖాళీగా తిరిగే అబ్బాయి జీవితంలో కి వచ్చిన స్వాతి అనే అమ్మాయి అతని జీవితాన్ని ఎలా మార్చింది..? అలాగే కూతరు ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత ఒక్కామాట అనకుండా, చేయెత్తకుండా కూతరు తీసుకున్న నిర్ణయం లోని తప్పు ఒప్పులను తెలిసేలా చేస్తాడు ఆమె తండ్రి ఆ పాత్ర ను చాలా హుందాగా తీర్చి దిద్దారు దర్శకుడు. దీనితో పాటు అజయ్ ఘోష్ మాత్ర కూడా చాలా కనెక్టింగ్ గా ఉంటుంది. హీరోగా అనేకంటే ఎక్కువమంది అందరూ రిలేట్ అయ్యే కుర్రాడి పాత్రగా ఉంటుంది. ఇక హీరోయిన్ కారుణ్య నాకంటే బాగా ఎక్స్ పీరియన్స్డడ్ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, ఆమెతో డాన్స్ విషయంలో కాస్త టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ యాక్టింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాను. ఆమె పాత్ర చాలా ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుంది. కాస్త అందం ఉండే అమ్మాయిలకుండే పోగరు , ఆ యాట్యిట్యూడ్ తో హీరోను ముప్పుతిప్పలు పెడుతుంది అవన్నీ స్ర్కీన్ మీద చాలా ఫన్ ని క్రియేట్ చేస్తాయి. లంకె బిందెలు కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈజీ మనీ కోసం ట్రై చేసే యూత్ లంకె బిందెలు కోసం చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. సురేష్ బొబ్బిలి ఇచ్చిన పాటలు మా సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. జనవరి 3 న విడుదల అవుతున్న ‘ఉత్తర’ తప్పకుండా అందరినీ అలరిస్తుందని  ’’ అన్నారు.

రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్
బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తర
జనవరి 3 విడుదలకు సిద్దం అయ్యింది. ఈ మవీ  ట్రైలర్ కి మంచి రెస్సాన్
వస్తుంది. ఒక స్వచ్చమైన ప్రేమకథను, రియలిస్టిక్ అప్రోచ్ తెరమీదకు తెచ్చిన
ఈమూవీ తప్పకుండా అన్ని వర్గాల వారినీ అలరిస్తుందని అంటుంద చిత్ర యూనిట్.

సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.

నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్,
అభయ్ తదితరులు.

‘Palasa1978’ Movie released by Geetha Arts and UV Creations

మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ వరుసలో గీతా ఆర్ట్స్, యువి ప్రొడక్షన్స్ ”పలాస 1978” చిత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లా పలాస లో జరిగిన యదార్థ సంఘటనలు, కొన్ని యదార్థ పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన ”పలాస 1978” చిత్రాన్ని GA2-UV సంస్థ ద్వారా విడుదల చేస్తున్నామని సంస్థ తరపున బన్నీ వాసు తెలిపారు.

పలాస చిత్రం అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీ లకు బాగా నచ్చింది. కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని, మంచి సినిమాలను అందరికీ చేరవెయ్యాలని అల్లు అరవింద్ భావించడంతో జనవరి చివరి వారంలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

రక్షిత్, నక్షత్ర జటగా నటించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, విన్సెంట్ ఫొటోగ్రఫీ, రఘు కుంచె సంగీతం అందించారు. ఇప్పటికే సుకుమార్, మారుతి, పూరీ జగన్నాథ్ వంటి ప్రముఖ డైరక్టర్లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం, గీతా ఆర్ట్స్, యువి వంటి పెద్ద సంస్థలు రిలీజ్ చేస్తుండటం, పలాస 1978 సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

Software Sudheer Pre-Release Event

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి, ట్రైలర్ , పాటలకి  మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 28న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా  ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, స్టార్‌ యాంకర్ సుమ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, యాంక‌ర్‌ ప్రదీప్, రవి తో పాటు జబర్దస్త్ , ఢీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ అదిరిపోయే స్టెప్పులతో పాటు పాట పాడి ఫ్యాన్స్ ని అలరించారు.

ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ మాట్లాడుతూ – “శేఖర్ రాజు గారు సైకిల్ మీద హైదరాబాద్ కి వచ్చి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఇప్పుడు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమా ద్వారా తాను నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎంతోమందికి మంచి దారి చూపించాడు. ఈ సినిమా టైటిల్ సాఫ్ట్ గా ఉండొచ్చు కానీ మూవీ చాలా హార్డ్ గా ఉంటుంది. దర్శకుడు రాజశేఖర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే రైతుల గురించి మంచి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చారు. సుధీర్ డాన్సులతో పాటు ఫైట్స్ ఇరగదీసాడు. డిసెంబర్ 28 న ప్రతి ఒక్కరూ సినిమా చూడండి” అన్నారు.
ముఖ్య అతిధి నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “నాకు సుధీర్ లో సుడిగాలి తెలుసు కానీ ఇప్పుడు సుడిగాలిని ఎదురుగా చూస్తుంటే ఒక ప్రభంజనంలా ఉంది. సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ అన్నింటికి మించి తనకున్న ఫాలోయింగ్ ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. డిసెంబర్ 28 సినిమా కోసం మీతో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ – “నేను ఇప్పటివరకు పెద్ద పెద్ద హీరోల‌ ఈవెంట్ లకి వెళ్ళాను వాటితో ఈక్వల్ గా ఉంది ఈ ఫంక్షన్. డెఫినెట్ గా సుధీర్ మంచి హీరో అవుతారు. ఫారెన్ లో కూడా సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – “నేను రాజశేఖర్ రెడ్డి ఒకే రూమ్ లో ఉండేవాల్లం. మా ఇద్దరిది అన్నదమ్ముల బంధం. ఇప్పుడు సుధీర్ హీరోగా వస్తోన్న `సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ద్వారా దర్శకుడిగా పరిచయం అవడం చాలా  సంతోషంగా ఉంది. ఈ సినిమాకి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ – “బొంబాయి పోతావా రాజా’ తో భీమ్స్ గారు నాకు మంచి అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ‘కోయం బత్తూరు పీసు, ఇంత అందమే, ఐడెంటిటీ కార్డు` అనే మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలు మంచి పేరు తెస్తాయని నమ్మకం ఉంది” అన్నారు.
ముఖ్య అతిధి యాంకర్ సుమ మాట్లాడుతూ – “ఈ షోకి హోస్ట్ గా వద్దామనుకున్నా కానీ గెస్ట్ గావచ్చాను.కథా కథనాలు బాగుండి దానికి మంచి కాస్టింగ్ తోడయితే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ – “యాక్టింగ్ లో కానీ డాన్సులతో కానీ ప్రతి రోజు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్న సుధీర్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా.  `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ‘అన్నారు
చిత్ర నిర్మాత కె శేఖర్‌  రాజు మాట్లాడుతూ – ”మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌లో ఫస్ట్‌ మూవీ. సుధీర్‌ని మా బేనర్‌లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ధన్యవాదాలు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. మూవీ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – “ఈ సినిమాలో కథ కన్నా కొందరి జీవితాలు కనిపిస్తాయి. ఫస్ట్ కాపీ చూశాను. తప్పకుండా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ వచ్చింది. డా.శివ ప్రసాద్ గారి గురించి  మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు ఆయన మనమధ్య లేరు. ఆయనకు ఫోన్ చేసి మంచి రోల్ ఉంది సర్ మీరు తప్పకుండా చేయాలి అంటే ఆరోగ్యం బాగోలేకపోయినా వచ్చి నటించారు. రేపు చనిపోతారన‌గా ఈరోజు నటించడానికి కూడా సిద్ధమయ్యారు. నటన అంటే ఆయనకు అంత ఫ్యాషన్, మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. నా మొదటి సినిమాకే గొప్ప ప్రొడ్యూసర్‌ దొరికినందుకు హ్యాపీగా ఉంది. భీమ్స్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కావాలని పెర్ఫామెన్స్‌కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఆయనలోని అన్ని ఎనర్జీలను ఈ సినిమాలో వాడడం జరిగింది. ధన్య బాలకృష్ణ చాలాబాగా నటించారు. అలాగే మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ కథ నచ్చి ఒక పాట పాడి అందులో నటించడం జరిగింది.  అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు ఒక రోల్‌ చేయడం జరిగింది. డిసెంబర్ 28న అందరూ సినిమా చూసి  తప్పకుండా సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”నా ఫస్ట్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్‌, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌, అని చెప్పారు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. సినిమాకి ఇది కావాలి అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వచ్చిన మా నిర్మాత శేఖర్ రాజు గారికి స్పెషల్ థాంక్స్. ఆయన కూడా ఈ సినిమాలో  మంచి క్యారెక్ట‌ర్ చేశారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ. అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్‌ చేశాం. ఎలా ఉన్నాయో మీరే స్క్రీన్‌ మీద చూసి చెప్పాలి.  మీ మీడియా సపోర్ట్‌ మాకు ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరూ చూడండి” అన్నారు

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటిస్తున్నారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

‘Ranga’ is a real life leader

అది ‘అల వైకుంఠపురం’ కాదు… విజయవాడ మహానగరం. పైగా అది రాజకీయాల రాజధాని. అక్కడంతా ‘సరిలేరు నాకెవ్వరూ’ అనుకునేవారే. అలాంటి రాజధాని కంట్లో ‘రంగా’ అనే నలుసు పడింది. నలిపేయడానికి అది సాధ్యమయ్యేది కాదు. కన్ను వాచిపోవడం తప్ప అదెక్కడికీ పోదు. పక్కలో బల్లెంలా తయారయ్యే సరికి శత్రువులూ ఎక్కువయ్యారు. రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు భయపడే రకం కాదు రంగా. అక్కడి రాజకీయానికి బలుపు ఎక్కువయ్యింది… మలుపులూ ఎక్కువయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయం, మరో పక్క తెలుగు దేశంలో ప్రత్యర్థి ‘దేవినేని’ చాణక్యం. ఆ పద్మ వ్యూహ్యంలో అభిమన్యుడే అయ్యాడు రంగా. ఆరోజే డిసెంబర్ 26. అక్కడి రౌడీయిజంలో రంగా అనే నిజం లేకుండా పోయింది. అసలు రంగా ఎవరు? ఈ దేవినేని ఎవరు? ఈ ఇద్దరూ ప్రత్యర్థులా? మిత్రులా? వీరి మధ్య ఏం జరిగింది. అది తెలుసుకోవాలంటే ‘దేవినేని’ చూడాల్సిందే.. ఇందులో దేవినేనిగా నందమూరి తారకరత్న, రంగా గా సురేష్ కొండేటి నటిస్తున్నారు.
శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రామూరాథోడ్, జి.ఎస్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను అమలాపురంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో సినిమా మొత్తం పూర్తవుతుంది.

చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ఈ డిసెంబర్ 26 రంగా వర్ధంతి. మా సినిమా చిత్రీకరణ కూడా ఈరోజే మొదలైంది. రేపటితో పూర్తవుతుంది. ముఖ్యంగా రంగా పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. సురేష్ కొండేటిని ఈ సినిమా నుండి రంగా సురేష్ అంటారేమో.. అని వివరించారు.
నిర్మాతల్లో ఒకరైన రామూరాథోడ్ మాట్లాడుతూ.. మేము అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించాము అన్నారు.
మరో నిర్మాత జి.ఎస్.ఆర్.చౌదరి మాట్లాడుతూ.. ఇటీవలే రాక్ క్యాజిల్, అల్యూమీనియం ఫ్యాక్టరీల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తయిందన్నారు. ఈపాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారు.

Directer Mahaa New Movie ‘Uma Maheswara Ugra Roopasya’

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు వెంట‌నే మ‌రో సినిమానో నిర్మించ‌కుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో “ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. జి.ఒ.డి వెబ్ సిరీస్ స‌క్సెస్, బ్రోచెవారెవ‌రురా సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టుడు స‌త్య‌దేవ్ కంచ‌ర‌న ఇందులో హీరోగా న‌టిస్తున్నారు.
వేదం వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాన్ని నిర్మించిన ఈ అగ్ర నిర్మాత‌లు ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ – “వెంక‌టేశ్ మ‌హ మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు. మల‌యాళంలో విజ‌య‌వంతమైన `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్` చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా త‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశాం“ అన్నారు.
 వెంక‌టేశ్ మ‌హ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
న‌టీన‌టులు:
స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:-
ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌టేశ్ మ‌హ‌
నిర్మాత‌లు:  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌)
సంగీతం:  బిజ్‌బ‌ల్‌
కెమెరా:  అప్పు ప్ర‌భాక‌ర్‌

Producer GuruRaj Interview about ‘Ullala Ullala’ movie

థ్రిల్లింగ్ కథనాల్లో సస్పెన్స్ సన్నివేశాలు ‘ఊల్లాల ఊల్లాల’ లో పుష్కలంగా ఉన్నాయి – నిర్మాత ఎ.గురురాజ్ సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై నటరాజ్ ని హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’.కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకి జనవరి 1 న వస్తున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత ఎ.గురురాజ్ విలేకర్లతో చెబుతూ..

మీరు నిర్మాతగానే మాకు తెలుసు ఇప్పుడు ఈ చిత్రంలో నటుడిగా చేశారు, దీని వెనక కారణం ?

నటుడిగా చేయడానికే నేను 90’s లో పరిశ్రమకి వచ్చాను కానీ కళామతల్లి మీద ప్రేమతో నిర్మాతగా మారాను. అయితే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చిన్న చిన్న వేషాలు మాత్రమే వేసాను. కానీ ‘ఊల్లాల ఊల్లాల’ లో మాత్రం కథని నడిపించే పాత్రని నేను కచ్చితంగా వేయాల్సి వచ్చింది. అనుకున్నట్టుగానే నా పాత్ర బాగా రావడమే కాక చిత్రానికి బాగా పనికొచ్చింది.

మీ సినిమా పోస్టర్ ఏంటి గుర్రం అమ్మాయి ఇవన్ని చిత్రంలో నిజంగా ఉన్నాయా లేదా మీరు ఆలా క్రియేట్ చేసారా?

అది సస్పెన్స్ గా తీసుకెళ్తున్నాం, ఆ పోస్టర్ చూస్తేనే సినిమా ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో అర్ధం అవుతుంది. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి ఆ పోస్టర్ చూసాక పెరిగిన అంచనాలన్నీ థియేటర్ లో తెరమీద దొరుకుతాయి.

దర్శకుడు సత్య ప్రకాష్ గారితో మీకు అనుభందం ఎలాంటిది, ఈ సినిమాని ఎలా ఒక షేప్ కి తీసుకొచ్చారు?

సత్య ప్రకాష్ గారు నాకు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ఇతర నటులలాగే సినిమాల్లోనే పరిచయం. సినిమా లో ఎంత క్రూరమైన విలన్ లా కనిపిస్తాడోఆయన బయట అంట పెద్ద భక్తుడు. ఒకరోజు అనుకోకుండా ఒక పాయింట్ చెప్తా వింటావా అని అన్నారు. అలా అప్పుడు చెప్పిన లైన్ ని తీసుకొని స్టోరీ గా డెవలప్ చేసి కొత్త కంటెంట్ తో ఎంటర్టైనింగ్ గా చూపించాం, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేయడం ఖాయం.

కంటెంట్ నమ్ముకునే సినిమాలు చేసాం అన్నారు అది ప్రూవ్ అవుతూ వచ్చిందనుకుంటున్నారా ?

కొన్ని చిత్రాల ఫలితం అనుకున్నట్టుగా రావు. పెద్ద హీరోలని పెట్టి తీసినా కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవు, ప్రేక్షకులు చూడరు. అలాగే మంచి సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కథ విన్నప్పటికి తీసి విడుదలయ్యే సమయానికి కథనాల్లో చాలా మార్పులొచ్చేస్తాయి, కానీ ఈసారి అలా జరగకుండా సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని దగ్గరుండి గమనిస్తూ జాగ్రత్తలు వహిస్తూ పూర్తిగా ఇంవోల్వ్ అయ్యి అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసాం.

ఊల్లాల ఊల్లాల’ స్టోరీ మీరే ఇచ్చారంట కదా?

అవును, సత్యప్రకాష్ గారిచ్చిన లైన్ ని తీసుకుని పూర్తిగా ఇంవోల్వ్ అయ్యి స్టోరీ ని మేమే రాసాం.

ఇందాక చాల లొకేషన్స్ చెప్పారుమరి అనుకున్న బడ్జెట్ లో తీసారా?

కొన్ని కొన్ని చోట్ల బడ్జెట్ తేడాలు వచ్చినా, క్వాలిటీ బాగా వచ్చినందుకు సంతృప్తిగా ఉంది. అనుకున్న సమయం కంటే కొంత ఎక్కువ సమయం పట్టినా, చిత్రం అద్భుతంగా పూర్తయినందుకు సంతోషంగా ఉంది.

సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి A సర్టిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి?

కథలో భాగంగా ఉన్న గ్లామర్ కానీ రొమాన్స్ కానీ ఇతర అంశాలకి గాను సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి A సర్టిఫికేషన్ ఇచ్చారు.

మీరు చాల పేద కుటుంబం నుంచి వచ్చారు నిర్మాతగా లైఫ్ లో ఎదురుకున్న చేదు అనుభవాలు ఏంటి?

మొదట్లో ఉన్న పరిశ్రమకి ఇప్పటికి చాలా మార్పులు, అభివృద్ధులు జరిగాయి అందువల్ల అవకాశాలు కూడా పెరిగాయి. ఎప్పటినుండో పరిశ్రమలో ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అనుకున్నవి జరగలేదు, కష్టాలు ఎదురయ్యాయి కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

రామ్ గోపాల్ వర్మ తో సినిమా చేస్తున్నారా?

ఆయన గురించి నేను బయట నెగటివ్ గా విన్నదానికి ఆయన నిజంగా ఉన్నదానికి చాలా తేడా ఉంది, చాలా డిగ్నిటీ తో వ్యవహరిస్తారు, చాలా మంచి మనిషి, మాటకి విలువిస్తారు. అలాగే నేను పిలవగానే మొదట్లో తనకి చిత్రానికి సంబంధం లేదు కాబట్టి రాను అన్నారు కానీ మీరొస్తే మా చిత్రానికి ప్లస్ అవుతుంది అనగానే ఈవెంట్ కి వచ్చారు, అన్ని కుదిరితే ఆయనతో ఒక ప్రాజెక్టు చేయడం మాకు చాలా సంతోషం.

మీరు రియల్ఎస్టేట్ లో ఉన్నారు స్టూడియో ఆలోచన ఏమైనా ఉందా?

ప్రస్తుతానికి లేదు, మాకు సుఖీభవ పేరుతొ వేరు వేరు సంస్థలు స్థాపించాలనే ఆలోచన లో ఉన్నాము, అన్నీ కుదిరితే ఆ వైపు కూడా ఆలోచిస్తాము.